
మహబూబాబాద్, సాక్షి: నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహిళా కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన 14 మంది, ఫతేపురం గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మిర్చి తోట ఏరడానికి బంగ్లా వైపు ఆటోలో వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సాయంతో మూడు ఆంబులెన్సులలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా.. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment