నర్సింహులపేటలో కొనసాగించాలని బైక్ ర్యాలీ
నర్సింహులపేట : మండలంలోని పెద్దనాగారం గ్రామస్తులు నర్సింహులపేట మండలంలోనే కొనసాగుతామని మంగళవారం హైవేపై ఉప సర్పంచ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తగా ఏర్పడే ఎల్లంపేట మండలంలో చేర్చొద్దని డిమాండ్ చేశారు. అధికారులు, నాయకులు స్పందించి నర్సింహులపేట మండలంలోనే కొనసాగించాలని కోరారు. గ్రామస్తులు వెంకన్న, మల్లయ్య, నర్సయ్య, పుల్లయ్య, నరేందర్ పాల్గొన్నారు.