The end
-
భవిష్యత్తులోకి తీసుకెళ్తా
వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు గతంలో ప్రకటించారు అక్షయ్ కుమార్. అమేజాన్ ప్రైమ్ తెరకెక్కించనున్న ఓ యాక్షన్ సిరీస్ ద్వారా వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారాయన. ‘ది ఎండ్’ పేరుతో తెరకెక్కే ఈ సిరీస్ కథాంశం ప్రత్యేకంగా ఉండబోతోందట. భవిష్యత్తు నేపథ్యంలో జరిగే కథ ఇదని, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఈ సిరీస్‌ను నాలుగైదు దేశాల్లో చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయట. వచ్చే ఏడాది చివర్లో ఈ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సిరీస్ కోసం అక్షయ్ కూడా భారీ పారితోషికం తీసుకున్నారని టాక్. -
ముగిసిన పవిత్రోత్సవం
అహోబిలం (ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాద వరదస్వామి ఆలయంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. తెల్లవారుజామునే నిత్యపూజ, హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమాలను అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠకోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్, ప్రధానార్చకులు శ్రీమాన్ శఠకోప వేణుగోపాలన్, మఠం ప్రతినిథి సంపత్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పండితులు నిర్వహించారు. పవిత్రోత్సవ విశిష్టత ఇదీ: ఏడాది పొడువునా ఆలయంలో నిర్వహించే నిత్యకైంకర్యాలు, వార, మాస, వార్షిక మహోత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలసీ తెలియక చేసిన తప్పుల వలన ఏర్పడిన దోష నివారణకు ప్రతి ఏడాది నియమనిష్టలతో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. -
సాంస్కృతిక వేడుకకు సిద్ధం
రాయదుర్గం: బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7న రవీంద్రభారతిలో ప్రారంభమైన ఈ వేడుకలు దసరా పర్వదినమైన మంగళవారం గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని ఓపెన్ గ్రౌండ్లో ముగియనున్నాయి. ఇందుకోసం ఆదివారం ఆ ప్రాంగణంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే వేడుకల్లో భారతదేశంతో పాటు రష్యా, మలేసియా, ఇండోనేషియా, ఉక్రెయిన్, ఆర్మేనియా, అజర్బైజాన్, తజకిస్థాన్, బైలోరష్యా దేశాల్లోని బ్రహ్మకుమారీస్ శాఖల కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రజల్లో ప్రాంత, కుల,మత, భాషా బేధాలు లేకుండా అంతా సోదర భావనతో మెలగాలనే సందేశాన్ని ప్రచారం చేస్తూ ఈ కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. -
ముగిసిన ‘మహబూబాబాద్’ వివాదం
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సమస్య పరిష్కార బాధ్యతలు ఆర్డీఓకు అప్పగించిన కలెక్టర్ హన్మకొండ అర్బన్ : మహబూబాబాద్ ఎ మ్మెల్యే శంకర్‌నాయక్, తహసీల్దార్ విజయ్‌కుమార్ నడుమ ఏర్పడిన వివాదానికి ఇరువర్గాలు తెరదించాయి. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తహసీల్దార్‌ను దూషించారని ఆరోపిస్తూ జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు సోమవారం నిరసన బాట పట్టారు. తహసీల్దార్ స్థాయి అధికారిని దూషించిన నేపథ్యంలో సీరియస్‌గా తీసుకున్న ఉద్యోగ సంఘాలు ఆది, సోమవారాల్లో సమావేశమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం మహబూబాబాద్ ఎమ్మె ల్యే శంకర్‌నాయక్ జిల్లా కలెక్టర్ కరుణను కలిసి ఇదే విషయంపై వివరణ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేతో మాట్లాడిన అనంతరం వ్యవహారం సద్దుమణిగేలా చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని మహబూబాద్ ఆర్డీవో భాస్కర్‌రావును కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడనున్న తరుణంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య çసుహృద్బావ వాతావరణం ఉండాలని కలెక్టర్ సూచించారని ఆర్డీఓ ఇరువర్గాలకు నచ్చచెప్పారు. దీంతో తాము సంతృప్తి చెంది నిరసనలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ తహసీల్దార్ల సంఘం జిల్లా అ««దl్యక్షుడు పూల్‌సింగ్, ట్రెసా జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ సంయుక్తంగా తెలిపారు. కాగా, ఈ ఘటనపై ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. -
ముగిసిన అంత్య పుష్కరాలు
చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు గోదావరికి ప్రత్యేక పూజలు మంగపేట : మండల కేంద్రంలోని పుష్కరఘాట్ వద్ద గత నెల 31న ప్రారంభమైన గోదావరి అంత్య పుష్కరాలు గురువారం ముగిశాయి. చివరిరోజు వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జనగామ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, డీసీఎం వాహనాల్లో వందలాదిగా తరలివచ్చి పుష్కర ఘాట్ వద్ద స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా మహిళలు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు, పసుపు కుం కుమ, గాజులను నదిలో వదిలారు. అలాగే కొందరు భక్తులు త మ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. కాగా, తహసీల్దా ర్ తిప్పర్తి శ్రీనివాస్, ఎస్సై ననిగంటి శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్, రెవెన్యూ సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. గోదావరికి ప్రదోశకాల హారతి అంత్య పుష్కరాల ముగింపును పురస్కరించుకుని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ అధ్యక్షుడు కొయ్యడ నర్సింహామూర్తి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గోదావరి మాతకు బ్రాహ్మణులు ప్రదోశకాల హారతి ఇచ్చారు. ఈ సం దర్భంగా స్థానిక శివాలయంలోని ఉమాచంద్రశేఖరస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోని మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ ఉత్సవ విగ్రహాలకు గోదావరి లో పుష్కరస్నానం జరిపించారు. అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ముల్తైదువలతో వస్త్రాలు, గాజులు, పూలు, పసుపు, కుంకుమలను నదిలో వదిలారు. కాగా, వరంగల్ మొదటి అదనపు జడ్జి కేబీ నర్సింహులు పుష్కరస్నానం ఆచరించారు. కార్యక్రమంలో అర్చకులు విస్సావజ్జుల నరేష్శర్మ, ముక్కామల రాజశేఖరశర్మ, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు శేఖర్, రవి, మూర్తి, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ముప్పా మోహన్‌రెడ్డి, తునికి వీరరాఘవాచార్యులు, వెంకటనర్సయ్య పాల్గొన్నారు. పుష్కరస్నానం ఆచరించిన అధికారులు కమలాపురంలోని బిల్ట్ ఇన్‌టేక్‌వెల్ వద్ద ఉన్న గోదావరిలో ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ములుగు ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం వారు స్థానిక శివాలయంలో పూజలు చేశారు. చివరి రోజు భక్తుల సందడి ఏటూరునాగారం : మండలంలోని రామన్నగూడెం పుష్కరఘా ట్ వద్ద 12 రోజులుగా కొనసాగిన అంత్యపుష్కరాలు ము గిశాయి. చివరి రోజు వందలాది మంది భక్తులు ఘాట్ వద్దకు తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించి పూజలు చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుని శివాలయం, గంగాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోదావరిలో దీపాలు వది లి పిల్లాపాపలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. కాగా, సా యంత్రం వేళలో అర్చకులు పుల్లయ్యచారి, నర్సింహచారి గోదావరికి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్, డాక్టర్ అల్లి నవీన్, సర్పంచ్ బొల్లె జ్యోతి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యురాలు దొడ్డ పద్మ, కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అన్ని రకాల సినిమాలూ తీయాలని ఉంది!
‘‘దెయ్యం పట్టిన ఓ స్త్రీ... తన భర్త చేతుల్లోనే హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తీశాను. తక్కువ బడ్జెట్లో సినిమా తీయొచ్చనే కారణం చేతనే... హారర్ నేపథ్యాన్ని ఎంచుకున్నాను. అన్ని రకాల సినిమాలు తీయాలనేది నా లక్ష్యం’’ అని యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ అన్నారు. ఆయనను దర్శకునిగా పరిచయం చేస్తూ కోటేశ్వరరావు మోరుసు నిర్మించిన చిత్రం ‘ది ఎండ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని దర్శకుడు ఆనందం వెలిబుచ్చారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ -‘‘మాది మధ్య తరగతి కుటుంబం. స్కాలర్షిప్పులతో చదువుకున్నాను. చిన్నప్పట్నుంచీ కెమెరా అంటే ఇష్టం. ఆ ఇష్టమే నన్ను సినిమాల వైపు నడిచించింది. నాలుగు లఘు చిత్రాలు తీశాను. అందులో మూడు హారర్ చిత్రాలు. ఒకటి ప్రేమకథ. ఇటీవల మా టీవీ వారు నిర్వహించిన లఘు చిత్రాల కాంటెస్ట్‌లో నా లఘు చిత్రానికి ప్రథమ స్థానం లభించింది. ఆ వెంటనే అవకాశాలు కూడా తలుపు తట్టాయి. కొందరు నిర్మాతలు నన్ను కలిశారు కూడా. కానీ... ముందు ‘ది ఎండ్’ చేశాను. త్వరలో ఓ ప్రేమకథ చేయబోతున్నా’’ అని చెప్పారు. -
ది ఎండ్
-
‘ది ఎండ్’మూవీ పోస్టర్లు
-
'ది ఎండ్' ఆడియో ఆవిష్కరణ
-
కొత్త ప్రయత్నం
సుధీర్‌రెడ్డి, యువచంద్ర, గజల్ ప్రధాన పాత్రధారులుగా రాహుల్ సాంకృత్యియాన్ దర్శకత్వంలో రూపొందిన హారర్ చిత్రం ‘ది ఎండ్’. కోటేశ్వరరావు మోరుసు నిర్మాత. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో రచయిత కోన వెంకట్ విడుదల చేశారు. ఫార్ములా చిత్రాలు రాజ్యమేలుతున్న నేటి తరుణంలో వాటిని బ్రేక్ చేస్తూ ఇలాంటి చిత్రాన్ని తీసిన దర్శక, నిర్మాతలను కోన వెంకట్ అభినందించారు. ప్రస్తుతం చిన్న సినిమాల సీజన్ మొదలైందనీ, ‘ది ఎండ్’ చిత్రం ఈ టీమ్‌కి గొప్ప ఆరంభం కావాలని కోరుకుంటున్నాననీ కోన వెంకట్ ఆశాభావం వెలిబుచ్చారు. కొత్త ప్రయత్నం చేయాలనే తలంపుతో ఈ హారర్ చిత్రాన్ని నిర్మించామనీ, యూ ట్యూబ్‌లోని ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోందనీ, ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తామనీ దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
ది ఎండ్ మూవీ స్టిల్స్
-
‘ది ఎండ్ ’ టైలర్ లాంచ్
-
ముగిసిన ‘కోట’ బోనాలు
గోల్కొండ, న్యూస్‌లైన్: డప్పుల చప్పుళ్లు... సంప్రదాయ నృత్యాలు... పోతరాజుల విన్యాసాలు... శివసతుల పూనకాలు... పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు... వెరసి గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాలు గురువారం ఘనంగా ముగిశాయి. అమ్మవారికి 9వ పూజ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభమై చివరగా ముగిసే గోల్కొండకోట బోనాలకు ఉన్న చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యా.. గురువారం జరిగిన పూజలకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గోల్కొండలోని నగీనాబాగ్తో పాటు ఇతర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడాయి. గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులు వంటలు చేసుకొని నైవేద్యం తీసుకొని తలలపై బోనాలతో కోటపై కొలువుదీరిన అమ్మవార్ల వద్దకు బయలుదేరారు. అమ్మవారి 9వ పూజ భాగంలో వృత్తి పనివారల సంఘం సభ్యులైన కుమ్మరి వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగీనాబ్యారక్స్లో వివిధ రకాల నైవేద్యాలతో పాటు సాకను తయారు చేశారు. అనంతరం వంటలు, నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించడానికి డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో కోటపైకి బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా పోతరాజుల విన్యాసాలు, శివసతుల పూనకాలతో కోటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చివరి పూజ రోజు బీజేపీ సీనియర్ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, లంగర్‌హౌస్ కార్పొరేటర్ ఉదయ్‌కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవర కరుణాకర్, సంఘ సేవకులు ఎస్.రాజు ఉస్తాద్, వృత్తిపనివార్ల సంఘం సలహాదారు కరణ్‌కుమార్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. పూజారులు అనంతచారి, బొమ్మల సాయిబాబాచారి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా గోల్కొండ తహసీల్దార్ చంద్రావతి తన సిబ్బందితో కలిసి కోటపై ఉన్న అమ్మవార్లను దర్శించుకున్నారు.