సాంస్కృతిక వేడుకకు సిద్ధం | Prepare a cultural event | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక వేడుకకు సిద్ధం

Published Sun, Oct 9 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

సాంస్కృతిక వేడుకకు సిద్ధం

సాంస్కృతిక వేడుకకు సిద్ధం

రాయదుర్గం: బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ  రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ కల్చరల్‌ ఫెస్ట్‌ ముగింపు వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7న రవీంద్రభారతిలో ప్రారంభమైన ఈ వేడుకలు దసరా పర్వదినమైన మంగళవారం గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని ఓపెన్‌ గ్రౌండ్‌లో ముగియనున్నాయి. ఇందుకోసం ఆదివారం ఆ ప్రాంగణంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే వేడుకల్లో భారతదేశంతో పాటు రష్యా, మలేసియా, ఇండోనేషియా, ఉక్రెయిన్‌, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌, తజకిస్థాన్‌, బైలోరష్యా దేశాల్లోని బ్రహ్మకుమారీస్‌ శాఖల కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రజల్లో ప్రాంత, కుల,మత, భాషా బేధాలు లేకుండా అంతా సోదర భావనతో మెలగాలనే సందేశాన్ని ప్రచారం చేస్తూ ఈ కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement