Cultural Fest
-
విశ్వ సుందరిగా బెజవాడ యువతి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడకు చెందిన బి. నాగదుర్గా కుసుమసాయికి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కింది. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా), ఇతర తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలో భాగంగా మిస్ తెలుగు యూనివర్సల్ పోటీల్లో కుసుమసాయికి ఈ అరుదైన గౌరవం దక్కింది. విశ్వసుందరి పోటీలకు 600 పైగా ఎంట్రీలు రాగా ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు కుసుమసాయిని ఎంపిక చేశారని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు చెప్పారు. కుసుమసాయి బీకాం చదువుతోందని, ఆమెకు నాట్యం, నాటక రంగాల్లోనూ ప్రవేశం ఉందని తెలిపారు. -
సాంస్కృతిక వేడుకకు సిద్ధం
రాయదుర్గం: బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7న రవీంద్రభారతిలో ప్రారంభమైన ఈ వేడుకలు దసరా పర్వదినమైన మంగళవారం గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని ఓపెన్ గ్రౌండ్లో ముగియనున్నాయి. ఇందుకోసం ఆదివారం ఆ ప్రాంగణంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే వేడుకల్లో భారతదేశంతో పాటు రష్యా, మలేసియా, ఇండోనేషియా, ఉక్రెయిన్, ఆర్మేనియా, అజర్బైజాన్, తజకిస్థాన్, బైలోరష్యా దేశాల్లోని బ్రహ్మకుమారీస్ శాఖల కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రజల్లో ప్రాంత, కుల,మత, భాషా బేధాలు లేకుండా అంతా సోదర భావనతో మెలగాలనే సందేశాన్ని ప్రచారం చేస్తూ ఈ కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. -
వేడుక వేళ..
నేడు గోల్కొండ కోటపై జెండా పండుగ కనువిందు చేసేలా ఏర్పాట్లు మెరిసిపోతున్న కోట గోల్కొండ: పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి వేళ విద్యుత్ దీపాలతో కోట ధగధగ మెరిసిపోతుంది. పరిసరాలను చూడముచ్చటగా అలంకరించారు. ఈ ఏర్పాట్లను చూసి పర్యాటకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. గురువారం నుంచి పోలీసు, ఇంటలిజెన్స్ అధికారులు గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం వరకు జెండా వే దిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించే వేదిక చుట్టూ సెక్యూరిటీ అధికారులు మెటల్ డిటెక్టర్‌తో అణువణువు గాలించారు. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదిరిన కల్చరల్ ఫెస్ట్ డెమో.. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక శాఖ వారు రిహార్సల్స్ నిర్వహించారు. రాణిమహల్ టైస్, ఆయుధగారం వెనుక భాగంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా కళాకారులు అద్భుతంగా ప్రదర్శనలిచ్చారు. కొమ్ము, డప్పు, బూర, డోలు తదితర సంగీత వాయిద్యాల మాధుర్యాలు ఓ పక్కన మరోవైపు లంబాడి నృత్యాలతో కోట పరిసరాలు హోరెత్తాయి. పటిష్ట బందోబస్తు... వేడుక ల నిర్వహణ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన గోల్కొండలో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కోటలోని వివిధ భవనాలు, శిథిలాలు ఉండడంతో ఏర్పాట్లు కష్టతరమైనా ఆయా శాఖల అధికారుల స మన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం ఆయన ప్రొటోకాల్ డిప్యూటీ సెక్రెటరీ అరవిందర్‌సింగ్, ఇతర అధికారులతో కలిసి కోటలోకి ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు వచ్చే మార్గాలు, వేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు.