
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడకు చెందిన బి. నాగదుర్గా కుసుమసాయికి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కింది. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా), ఇతర తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్‌లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలో భాగంగా మిస్ తెలుగు యూనివర్సల్ పోటీల్లో కుసుమసాయికి ఈ అరుదైన గౌరవం దక్కింది. విశ్వసుందరి పోటీలకు 600 పైగా ఎంట్రీలు రాగా ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు కుసుమసాయిని ఎంపిక చేశారని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు చెప్పారు. కుసుమసాయి బీకాం చదువుతోందని, ఆమెకు నాట్యం, నాటక రంగాల్లోనూ ప్రవేశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment