TANA
-
తెలుగు, సాహితీ ప్రియులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!
తానా సంస్థ సాహిత్యవిభాగంగా మే, 2020 న ఆవిర్భవించిన “తానా ప్రపంచసాహిత్య వేదిక ‘నెలానెలా తెలుగువెలుగు’ పేరిట విభిన్న సాహిత్యాంశాలతో ప్రతినెల ఆఖరి ఆదివారం (భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 లకు) మేము నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలకు మీరు చూపిస్తున్న ఆదరణకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ విశేష ఆదరాభిమానాలు, సూచనలు, సలహాలతో “తానా ప్రపంచసాహిత్యవేదిక్ఙ నేడు ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మక అగ్రగామి సాహిత్యసంస్థగా రాణిస్తోంది. ఈ ఉన్నతస్థితికి ఎదగడానికి తోడ్పడిన తానా కార్యవర్గసభ్యులకు, కార్యకర్తలకు, సాహితీ ప్రియులకు, ప్రసారమాధ్యమాలకు మా వినమ్రపూర్వక ప్రణామములు. 2020 మే నెలలో ప్రజాకవి వంగపండు ప్రసాదరావు గారి జానపద కార్యక్రమంతో ప్రారంభమైన మా ఈ తానా ప్రపంచసాహిత్యవేదిక అప్పటినుండి ఇప్పటివరకు అంటే డిసెంబర్ 31, 2024 వరకు 75 విభిన్న సాహిత్యాంశాలమీద, 360 గంటల 5 నిమిషాల 43 సెకండ్ల నిడివిగా సాగింది. పాల్గొన్న మొత్తం అతిథులు, సాహితీవేత్తలు, అవధానులు, రచయితలు, రచయిత్రులు, కవులు, కళాకారులు 1,625 మంది. ఈ మొత్తం 75 సాహిత్య కార్యక్రమాల గొలుసుకట్టు యూట్యూబ్ లంకెను ఈ క్రింద పొందుపరుస్తున్నాము. మీకు వీలున్నప్పుడు వీక్షించగలరు. https://www.youtube.com/watch?v=g5J-BD0XdCA&list=PL0GYHgMt2OQzhobYN7BUnlSR9LBS7Xlm8సాహిత్యాభివందనాలతో.. డా. ప్రసాద్ తోటకూర, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు; నిరంజన్ శృంగవరపు, తానా అధ్యక్షులు; చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త. -
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను తొలగించిందన్న వార్త సంచలనంగా మారింది. ఇందులో భారతీయ ఉద్యోగులు, ముఖ్యంగా తెలుగువారు ఉన్నారంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. యాపిల్ మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించి నిధుల దుర్వినియోగం చేసి జీతాల్లో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై కాలిఫోర్నియా కుపెర్టినో హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేసింది. వీరిలో ఆరుగురిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఉద్యోగుల తొలగింపుపై యాపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సంచలనంగా మారింది.యాపిల్ తొలగించిన ఉద్యోగులలో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు కూడా ఉన్నారు. తొలగించిన ఆరుగురి ఉద్యోగులకు బే ఏరియాలోని అధికారులు వారెంట్లు కూడా జారీ చేశారు. ఈ ఆరుగురు ఇండియన్స్‌గా గుర్తించబడనప్పటికీ, గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉండవచ్చని సమాచారం. వీరంతా ఆమెరికాలోని కొన్ని తెలుగు స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఈ దుర్వినియోగం పాల్పడినట్టు తెలుస్తోంది.అక్రమాలు తెరలేచింది ఎలా? ఉద్యోగుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు, లాభేతర సంస్థల సేవాకార్యక్రమాలకు విరాళాలిచ్చేందుకు సంస్థ ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది. అంటే తమ ఉద్యోగులు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తే, దానికి కొంత మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఆ సంస్థకు విరాళంగా ఇస్తుంది యాపిల్. ఇక్కడే ఉద్యోగులు అక్రమాలకు తెరలేపారు. ఆయా సంస్థలతో కుమ్మక్కై స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన సొమ్మును తమ ఖాతాలో వేసుకునేవారు. ఇవీ చదవండి: గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా?పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం అమెరికన్ చైనీస్ ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్ఛేంజ్ (ACICE) , Hop4Kids అనే రెండు లాభాపేక్షలేని సంస్థలకు విరాళాల ఇచ్చినట్టుగా తప్పుగా చూపించారు.ఇలా మూడు సంవత్సరాల వ్యవధిలో ఆరుగురు వ్యక్తులు సుమారు 152వేల డాలర్ల అక్రమాలనకు పాల్పడ్డారని శాంటా క్లారా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం పేర్కొంది. అభియోగాలు మోపబడిన వారిలో సియు కీ (అలెక్స్) క్వాన్, యథీ (హేసన్) యుయెన్, యాట్ సి (సన్నీ) ఎన్జి, వెంటావో (విక్టర్) లి, లిచావో నీ మరియు జెంగ్ చాంగ్ ఉన్నారు.తానాపై ఎఫ్‌బీఐ కన్ను టైమ్స్ఆఫ్ ఇండియా నివేదికలప్రకారం ఈ సంఘటనలతో పాటు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వివిధ కార్పొరేషన్ల నుండి మ్యాచింగ్ గ్రాంట్ల దుర్వినియోగానికి సంబంధించి FBI విచారిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా యూఎస్ జిల్లా కోర్టు గ్రాండ్ జ్యూరీ తానాకు సబ్పోనా జారీ చేసింది. డిసెంబర్ 26న హాజరు కావాల్సిందిగా డిసెంబర్ 12న జారీ చేసింది.దీనిపై తానాకు ఒక నెల పొడిగింపు లభించినట్టు కూడా తెలుస్తోంది. అలాగే 2019 నుండి 2024 వరకు వివిధ స్థానాల్లో ఉన్న తానా ప్రతినిధులందరికీ అందిన విరాళాలు, ఖర్చులు , సమాచారాన్ని డాక్యుమెంటేషన్‌గా ఉంచాలని కోర్టు ఆదేశించింది.మరోవైపు ఈ ఆరోపణలపై అటు యాపిల్ నుంచిగానీ, ఇటు తానా నుంచి గానీ ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. -
సామాజిక చైతన్య సాహిత్యంపై తానా సదస్సు
ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో భాగంగా డిసెంబర్ 29న జరిగిన - 75వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సామాజిక చైతన్య సాహిత్యం – దశ, దిశ” (అభ్యుదయ, దిగంబర, పైగంబర, విప్లవ సాహిత్యాలు) ఘనంగా జరిగింది. విశిష్టఅతిథులుగా – అభ్యుదయ సాహిత్యం: డా. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి- సుప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, అధ్యక్షులు: అరసం, వేల్పుల నారాయణ - ప్రముఖ రచయిత, అధ్యక్షులు: తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ కార్యదర్శి: అఖిలభారత అరసం; దిగంబర సాహిత్యం: (దిగంబర కవులు) నిఖిలేశ్వర్ (శ్రీ కుంభం యాదవరెడ్డి) – దిగంబర కవి, ప్రముఖ కథారచయిత, అనువాద రచయిత, విమర్శకులు; నగ్నముని (మానేపల్లి హృషీ కేశవరావు) – దిగంబర కవి, ప్రముఖ కవి, నాటకరచయిత, నాస్తికులు; పైగంబర సాహిత్యం: (పైగంబర కవులు) కిరణ్ బాబు (రావినూతల సుబ్బారావు) - పైగంబర కవి, రచయిత, సంపాదకులు; వోల్గా (డా. పోపూరి లలితకుమారి) – పైగంబర కవి, ప్రముఖ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమ ప్రతీక, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత; రజాహుస్సేన్ - కవి, రచయిత, పాత్త్రికేయుడు, సాహిత్య విమర్శకుడు; విప్లవ సాహిత్యం: (విప్లవ రచయితల సంఘం - విరసం): అరసవిల్లి కృష్ణ, విప్లవ కవి. అధ్యక్షులు: విరసం. సాహిత్యం కాలంతో పాటు ప్రవహించే ఓ వాహిక.. కాలగతిలో సామాజిక పరిణామాలకు అనుగుణంగా సాహిత్య ఉద్యమాలు రూపుదిద్దుకుంటాయి. వాటి ప్రభావం సామాజిక మార్పులకు దోహదపడుతుందని వక్తలు ఉద్ఘాటించారు. ’తానా ప్రపంచసాహిత్య వేదిక ఆధ్వర్యంలో “సామాజిక చైతన్యం, సాహిత్యం, దశ, దిశ” అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగిన అంతర్జాల సాహిత్య చర్చాకార్యక్రమంలో తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ఉద్యమాలపై సంపూర్ణ చర్చ జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సామాజిక చైతన్యావసరాన్ని వివరించారు. సమాజంలో ఎక్కువమంది నిశ్శబ్దంగా ఉండడంవల్ల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. జనం చైతన్యంతో ప్రతిఘటించినప్పుడే, అరాచకాలు అరికట్టబడతాయని చెప్పారు. జనాన్ని చైతన్యవంతం చేసే బాధ్యత కవులు, రచయితలపై వుందన్నారు. ఈ కార్యక్రమంలో అరసం, విరసం, దిగంబర, పైగంబర కవిత్వోద్యమాలపై కూలంకష చర్చజరిగింది. అరసం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, తెలంగాణ అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ ప్రసంగించారు. అరసం ఆవిర్భావం, వికాసం గురించి డా. రాచపాళెం ప్రసంగించారు. అరసం అందరిదీ కాకున్నా, అత్యధికులకు సంబంధించిందని ఆన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికోసం అరసం ఆవిర్భవించిందన్నారు. వేల్పుల నారాయణ మాట్లాడుతూ అరసం ఆవశ్యకతను, ఆచరణను వివరించారు. దిగంబరకవిత్వ ఆవిర్భావ వికాసాలు, సిద్ధాంతాల గురించి నిఖిలేశ్వర్, నగ్నముని ప్రసంగించారు. దిగంబర కవిత్వం చారిత్రక అవసరంగా ఆవిర్భవించిందని, సాహిత్యంలో ఓ దశాబ్ది నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసిందన్నారు. దిగంబరులు ఆరుగురు ఆరు రుతువుల్లా సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు. దిగంబరుల కవిత్వంలో అభివ్యక్తి, భాష గురించి వచ్చిన విమర్శల్ని ఆయన తిప్పి కొట్టారు. నాటి యువతలో జడత్వాన్ని వదిలించడానికి ఆ మాత్రం ట్రీట్మెంట్ తప్పలేదన్నారు. నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి..లేపకు.. పీక నులిమి గోతిలోకి లాగుతాడు.. ప్రభందాంగనల తొడలు తాడి మొద్దులు తాకితే కాళ్ళు విరగ్గొట్టు.. కుచములు ఎవరూ ఎక్కని పర్వతాగ్రములు తలను ఢీకొని బద్దలు కొట్టు. భావకవుల నపుంసక హావభావాలకు సవాలు; అభ్యుదయ కవీ నల్ల మందు తిని నిద్రపోయావ్”!! అంటూ తన స్వీయ కవిత చదివి వినిపించారు. నిఖిలేశ్వర్.. ఇందులో శృంగార మేంలేదని, నిద్రపోతున్న యువతను తట్టిలేపడానికి ఈ మోతాదులో వ్రాయాల్సి వచ్చిందన్నారు. నిద్రపోతున్న తెలుగు సాహిత్యాన్ని మేల్కొలపటంలో దిగంబర కవిత్వం పాత్ర తక్కువేం కాదని నగ్నముని అన్నారు. దిగంబరకవిగా అరెస్ట్ అయి ప్రభుత్వోద్యోగాన్ని కూడా కోల్పాయనన్నారు. సిద్ధాంత ప్రాతిపదికనే జనచైతన్యం కోసం దిగంబరకవులు. కవిత్వం రాశారన్నారు. అభివ్యక్తిలో, భాషలో విమర్శలకు గురైనా…దిగంబర కవిత్వం నాటి సమాజంలో సంచలనం కలిగించిందన్నారు. పైగంబర కవి ఓల్గా మాట్లాడుతూ.. నాటి సాహిత్య, సామాజిక పరిస్థితులకు మేల్కొల్పుగా పైగంబర కవిత్వం ఆవిర్భవించిందన్నారు. పైగంబర కవులు మానవతకు పెద్దపీటవేశారని చెప్పారు. మరో పైగంబరకవి కిరణ్ బాబు..పైగంబర కవిత్వ ఆవిర్భావ వికాసాలను వివరంగా తెలియజేశారు. “మేము పైగంబరులం మాది ఒక తపస్సు మా కవితా దీపికలు విడదీస్తవి గాఢ తమస్సు ప్రపంచం సమస్యల కీకారణ్యంలా వుంది ఎటుచూసినా ఘోర నిబిడ నిశీథి ఎటుపోయేందుకు దారి చూపదు”.. 1970 నాటి సామాజిక పరిస్థితుల్ని చూసి, తట్టుకోలేక అయిదుగురు కవులు పైగంబరులుగా పేరుపెట్టుకొని కవిత్వం రాశారని కిరణ్ తెలిపారు. దేవిప్రియ, సుగమ్ బాబు, కమలాకర్, ఓల్గా తాను పంచపాండవుల్లా కవిత్వాయుధాలు పట్టి మానవత్వాన్ని తట్టి లేపేందుకు కలంపట్టామని చెప్పారు. విరసం తరపున అరసవిల్లికృష్ణ మాట్లాడారు. విరసం ఆవిర్భావ, వికాసాలను అరసవెల్లి వివరించారు. విరసం చారిత్రక అవసరంగా ఏర్పడిందన్నారు. సాహితీ విమర్శకులు ఎ.రజాహుస్సేన్ మాట్లాడుతూ పైగంబర కవిత్వంపై సాధికార విమర్శ పుస్తకం తేవడం తన అదృష్టమన్నారు. పైగంబర కవులతో, తన సాన్నిహిత్యాన్ని వివరించారు. దేవిప్రియ ఆత్మ కథ రాస్తానని ప్రకటించినా, చివరకు రాయకుండానే దూరమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ శుభాకాంక్షలందజేశారు. అమెరికామ్రేడ్స్ గా పిలువబడే లెనిన్ వేముల, కిరణ్మయి గుంట (వేముల) అనంత్ మల్లవరపు బృందం సందర్భోచితం గా పాటలు గానం చేసి, కవితా పఠనం చేశారు. కార్యక్రమం ఆసక్తికరంగా తెలుగు సాహిత్యంలోని వివిధ ఉద్యమాల ఆవిర్భావం, వికాసం, వాటి ఆనుపానులగురించి చక్కటి చర్చ జరిగింది. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె లో వీక్షించవచ్చును.https://www.youtube.com/live/j00sevVGbzE?si=gXSmem5xRkW3EJuX -
తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం'
డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగ్ఙు పేరిట నిర్వహిస్తున్న 74వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “మన భాష మన యాస “మాండలిక భాషా అస్తిత్వం అనే కార్యక్రమం వైభవంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం పలికి వివిధ ప్రాంతాల మాండలిక భాషలు వాటి సొగసును సోదాహరణంగా వివిరించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే గాక తెలుగునేలనుండి తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలతో పాటు శ్రీలంక, మయన్మార్, మారిషస్ మొదలైన దేశాలకు వలసవెళ్ళిన తెలుగు కుటుంబాలవారు కూడా వివిధ రకాల యాసలతో తెలుగు భాషను సజీవంగా ఉంచడానికి శతాబ్దాలగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాండలిక భాషలోఉన్న సహజ సౌందర్యం నిరాదరణకు, నిర్లక్ష్యానికీ గురికాకుండా అస్తిత్వం నిలుపుకుంటూ మాండలిక భాషలో ఎంతో సాహిత్య సృజన చేయవలసిన అవసరం ఉందన్నారు మన దేశంలోనే ఒక లంబాడీ గిరిజన మహిళ ఒక విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎన్నికకాబడిన తొలి మహిళ ‘వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ’ ఉపకులపతి ఆచార్య డా. సూర్యా ధనంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని “ఇలాంటి ముఖ్యమైన అంశంమీద సమావేశం నిర్వహిస్తున్న తానా ప్రపంచసాహిత్యవేదిక కృషిని అభినందిస్తూ, మాండలిక భాషలతో పాటు, లిపిలేని లంబాడీ భాషల లాంటి భాషలకు లిపిని కల్పించి పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లిపి ద్వారా ఆయా తెగల జీవన విధానం, ఆచార వ్యవహారాలను సజీవంగా చిత్రీకరించవచ్చు అన్నారు.్ఙ విశిష్టఅతిథిగా పాల్గొన్న సుప్రసిద్ధ రచయిత, ఆంధ్రప్రదేశ్ పూర్వ భాషా, సాంస్కృతిక శాఖా నిర్దేశకులు డా. డి. విజయభాస్కర్ ‘ఉత్తరాంధ్ర యాస’ అస్తిత్వంపై శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం ప్రాంతాల ప్రజల యాసల మాధుర్యాన్ని, ఆ సాహిత్య సృజనచేసిన ఆయా ప్రాంత కవుల, రచయితల పాత్రను వివరించారు. లిపిలేని “రెల్ల్ఙి జాతికి చెందిన ప్రముఖ రచయిత మంగళగిరి ప్రసాదరావు పారిశుద్ధ్య కార్మికులుగా రెల్లి కులస్తులు చేస్తున్న సేవ, రెల్లి భాషకు లిపి కల్పిస్తేనే, ఇంకా ఎక్కువ సాహిత్యం వస్తేనే, వారి జీవనవిధానం పైన యితరులకు అవగాహన కలుగుతుంది అన్నారు. విద్యారంగంలో 50కు పైగా డిగ్రీలు సాధించిన అరుదైన విద్యావేత్త, వృత్తిపరంగా మానసిక వైద్యనిపుణులు, రాజమహేంద్రవరంవాసి, ‘అర్థంపర్థం’ అనే శీర్షికతో ఇప్పటికే ఏడువందలకు పైగా ఎపిసోడ్స్ రాసిన తెలుగు భాషాభిమాని డా. కర్రి రామారెడ్డి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. చింతకుంట శివారెడ్డి రాయలసీమ మాండలికంలో నిత్యం వాడుకలోఉండే అనేక పదాలకు అర్థాలు, వాటి విశిష్టతను ఆసక్తికరంగా పంచుకున్నారు. తెలంగాణ ప్రాంత వాసి, ప్రస్తుతం కాశీ హిందూ విశ్వవిద్యాలయం, వారణాశిలో భాషాశాస్త్రంలో సహయాచార్యులుగా ఉన్న డా. గట్ల ప్రవీణ్ తెలంగాణా భాషా మాధుర్యాన్ని, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మాండలిక భాషల వ్యత్యాసాలను సోదాహరణంగా వివరించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల ప్రజల మాండలిక భాషను ఒకే వేదికమీద ఒకేసారి సమీక్షించడం ఒక్క తానా ప్రపంచసాహిత్యవేదికకు మాత్రమే సాధ్యమైంది అన్నారు. ఎంతో సమయం వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును: https://youtube.com/live/pd6wroBTRLg -
NRI: శతవసంతాల సాహితీవేత్తలకు శతకోటి వందనాలు
డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 73వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శతజయంతులు జరుపుకుంటున్న కొంతమంది రచయితలకు నివాళులర్పిస్తూ - “శతవసంతాల సాహితీవేత్తలకు శతకోటి వందనాలు” అనే కార్యక్రమం చాలా ఆసక్తి దాయకంగా జరిగింది. తానాఅధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం అవిరళ కృషి చేసి, అమూల్యమైన జ్ఞానసంపదను మనకోసం వదిలి వెళ్ళిన, ఇటీవలే శతజయంతి సంవత్సరంలో కి అడుగుపెట్టిన, అడుగుపెట్టబోతున్న కొంతమంది సాహితీమూర్తుల జీవితవిశేషాలను స్మరించుకుని, వారికి ఘన నివాళులర్పించడం మన కనీస ధర్మం అని, వారి రచనలను చదవడం ద్వారా అలనాటి కాలమాన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు తేటతెల్లంగా తెలుస్తాయి అన్నారు”. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతమంది కవులను, పండితులను ఒకేసారి ఒకేవేదిక మీద స్మరించుకుని, భావితరాల కోసం వారు వదిలి వెళ్ళిన ఈ గొప్పసంపదను ఒకసారి తడిమి చూసుకోవడం ఒక్క తానా ప్రపంచసాహిత్యవేదికకే చెల్లింది అన్నారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి, స్వయంగా సాహితీవేత్త అయిన ఆచార్య డా. వెలుదండ నిత్యానంద రావు మాట్లాడుతూ ఇదొక అపూర్వ సమ్మేళనం అని, ఈ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సాహితీమూర్తులలో కొంతమందితో తనకు ప్రత్యక్ష సాహిత్యానుబంధం కల్గిఉండడం తన అదృష్టమని, వారి సాహిత్య కృషి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని, వారందరికీ ఘన పుష్పాంజలి, గత 5 సంవత్సరాలగా వివిధ సాహిత్య అంశాలపై ప్రతి నెలా ఆఖరి ఆదివారం క్రమం తప్పకుండా నిభద్దతతో కార్యక్రమాలు చేస్తున్న తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు అన్నారు”. శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సాహితీ మూర్తుల జీవితాలగురించి, వారి సాహిత్యకృషి గురించి ఈ క్రింద పేర్కొన్న విశిష్టఅతిథులు సోదాహరణంగా వివరించారు: శ్రీ గండూరి (జి.) కృష్ణ (1924-2001), ప్రముఖ పాత్రికేయులు, రచయిత గురించి - శ్రీమతి గండూరి (యామిజాల) రాజీవ, జి. కృష్ణ గారి కుమార్తె, ప్రముఖ పాత్రికేయురాలు; శ్రీ కె. ఎల్. నరసింహారావు (1924-2003), ప్రముఖ నాటకరచయిత, నటులు గురించి - శ్రీ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వాధ్యక్షులు; డా. ఆవంత్స సోమసుందర్ (1924-2016), అభ్యుదయవాద కవి, విమర్శకులు, రచయిత గురించి - ఆచార్య డా. యస్వీ సత్యనారాయణ, అభ్యుదయ రచయిత, పూర్వ ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; శ్రీ “శారద” (ఎస్. నటరాజన్) (1925-1955), ప్రముఖ తెలుగు కథారచయిత, నవలారచయిత గురిచి - శ్రీ కొత్తపల్లి రవిబాబు, “ప్రజాసాహితి” మాసపత్రిక ప్రధానసంపాదకులు; ఆచార్య డా. బిరుదురాజు రామరాజు (1925-2010), జానపద గేయసాహిత్యంలో దిట్ట, ప్రముఖరచయిత గురించి డా. సగిలి సుధారాణి, పరిశోధకురాలు-‘తమిళనాట స్త్రీల జానపద కథనాలు”, రచయిత్రి; డా. దాశరథి కృష్ణమాచార్యులు (1925–1987), ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ విముక్తి సాయుధ పోరాటయోధుడు గురించి - డా. పి. విజయకుమార్, సహాచార్యులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం; కళాప్రపూర్ణ ఆరుద్ర (భాగవతుల సదాశివశంకర శాస్త్రి) (1925-1998), అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు గురించి - ఆచార్య డా. మేడిపల్లి రవికుమార్, ప్రముఖ సాహిత్యవిమర్శకులు, పూర్వ తెలుగువిభాగాధిపతి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి; శ్రీ కొడాలి గోపాలరావు (1925-1993), ప్రముఖ శతాథిక నాటకాల రచయిత గురించి - డా. కందిమళ్ళ సాంబశివరావు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ నాటకఅకాడమీ పూర్వ ఉపాధ్యక్షులు; శ్రీ ఆలూరి బైరాగి (1925-1978), ప్రముఖ కవి, కథా రచయిత, మానవతావాది గురించి – శ్రీ బండ్ల మాధవరావు, ప్రముఖ కవి, రచయిత, ‘సాహితీమిత్రులు’; శ్రీమతి బొమ్మరాజు భానుమతి (1926-20005), ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, ఫిల్మ్ స్టూడియో అధినేత్రి గురించి - శ్రీ భరద్వాజ రంగావఝుల, ప్రముఖ పాత్రికేయులు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను స్పృశించి సభను రంజింపజేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును: https://youtube.com/live/gf2INE_lbpk -
తానా ఆధ్వర్యంలో అమెరికాలో రహదారుల దత్తత
-
తానా ఆధ్వర్యంలో అమెరికాలో రహదారుల దత్తత
అమెరికా, పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హ్యారిస్ బర్గ్ నగరంలో మిడ్ అట్లాంటిక్ తానా విభాగం వారు సామాజిక భాద్యత పై అవగాహన కల్పిస్తూ "అడాప్ట్ ఏ హైవే" కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా, అత్యంత రద్దీ గల రహదారిని తానా ఆధ్వర్యంలో దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిడ్-అట్లాంటిక్ తానా బృందం రహదారి పరిసరాలు పరిశుభ్రం చేయడమే కాకుండా పచ్చదనాన్ని పరిరక్షించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. హ్యారిస్ బర్గ్ తానా టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దలు, పలువురు విద్యార్థులు చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అమెరికా సమాజంతో మమేకమై సమాజ సేవ చేయాలనే సంకల్పం కలిగించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ కార్యక్రమం చేపట్టిందని మిడ్ అట్లాంటిక్ తానా రీజినల్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు తెలిపారు. ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన హ్యారిస్ బర్గ్ తానా బృందానికి తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ధన్యవాదాలు తెలిపారు.ఈ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు సమాజానికి ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమం ప్రకృతి పట్ల చక్కటి అవగాహన కలిగించి, ప్రకృతిని, పచ్చదనాన్ని ఎలా సంరక్షించుకోవాలో నేర్చుకున్నామని తెలిపారు. తానా ఆధ్వర్యంలో విద్యార్థులలో సేవా భావం పెంపొందించేలా సమాజానికి మేలు చేసే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ఆకాంక్షించారు. -
TANA: నెల నెలా తెలుగు వెలుగు.. సినీ గీతాల ధ్రువతారలకు అక్షరాంజలి
డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో - ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” సాహిత్య కార్యక్రమం - 70వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శనివారం, ఆదివారం రెండురోజుల ప్రత్యేక కార్యక్రమంగా ఘనంగా జరిగింది.“సినీగీతాల ధ్రువతారలకు అక్షరాంజలి” అనే పేరున నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధప్రతిష్టులైన పాతికమందికి పైగా సినీగీత రచయితలు సృష్టించిన సాహిత్యంపై చాలామంది ప్రముఖులు హాజరై విశ్లేషణ చేశారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ- “ప్రపంచంలోనే మొట్టమొదటి ఆంగ్లశబ్దచిత్రం “ద జాజ్ సింగర్” అని, మొదటి భారతీయ హిందీ శబ్దచిత్రం “ఆలం ఆరా” అని, మొట్టమొదటి తెలుగు శబ్దచిత్రం “భక్త ప్రహ్లాద” అని పేర్కొంటూ ఆయా చిత్రాల విశేషాలు, వాటిలోని పాటల వివరాలను పంచుకున్నారు. డా. తోటకూర ముఖ్యఅతిథిగా పాల్గొన్న వి.ఏ.కె రంగారావు గార్ని సభకు పరిచయం చేస్తూ ... వివిధ తెలుగు, ఆంగ్ల పత్రికలలో సినిమాలపై ఎన్నో వ్యాసాలు రాసిన రచయిత, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 52 వేలకు పైగా ‘78 ఆర్ పి మ్’ రికార్డ్‌లు సేకరించిన వారు, ప్రపంచంలోని వివిధ భాషల్లో లక్షా పాతిక వేల వరకు ట్రాక్స్ కల్గిఉన్న వ్యక్తి, సినీ సంగీత, సాహిత్యాలపై విశేషమైన ప్రతిభ, లోతైన అవగాహన కల్గిన విశ్లేషకుడు, రచయిత, కాలమిస్ట్, నాట్యకారుడు, రికార్డ్ కలక్టర్, జంతు ప్రేమికుడు, ఒక విజ్ఞాన భాండాగారం వి.ఏ.కె అంటూ అభివర్ణించారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ రచయిత, సుప్రసిద్ధ సినీ సంగీత, సాహిత్య విశ్లేషకులు శ్రీ వేంకట ఆనంద కుమార కృష్ణ (వి.ఏ.కె) రంగారావు, చెన్నై నుండి హాజరై సినిమా పాటలు ముఖ్యంగా పాత పాటలు ఇప్పటికీ సజీవంగా ఉంటూ మనం ఎప్పుడు విన్నా మన మనసుకు ఆహ్లాదం కల్గిస్తున్నాయి అంటే అది కేవలం అంత గొప్ప సాహిత్యం సృష్టించిన గీతరచయితల గొప్పదనమే అన్నారు. తన మనసుకు బాగా నచ్చిన చిత్రాలు, పాటలపై సోదాహరణ ప్రసంగం చేసి అందరిని ఆకట్టుకున్నారు. శనివారం విశిష్టఅతిథులుగా పాల్గొన్న - రోచిష్మాన్ (చెన్నై) - “తెలుగు సినిమా పాట విశేషం”పై ప్రసంగించగా; డా. శ్రీదేవి శ్రీకాంత్ (బోట్స్వానా, ఆఫ్రికా) - తొలి సినీగీత రచయిత చందాల కేశవదాసు; ఆవాల శారద (విజయవాడ) - పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి; జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (హైదరాబాద్) - దైతా గోపాలం; డా. వి. వి. రామారావు (హైదరాబాద్) - పింగళి నాగేంద్రరావు; పి.వి శేషారత్నం (విశాఖపట్నం) - వెంపటి సదాశివ బ్రహ్మం; డా. వోలేటి పార్వతీశం (హైదరాబాద్) - మల్లాది రామకృష్ణశాస్త్రి; మద్దుకూరి విజయ చంద్రహాస్ (డాలస్) - కొసరాజు రాఘవయ్య చౌదరి; లెనిన్ బాబు వేముల (డాలస్) - శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ); డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి (విజయవాడ) - ఆచార్య ఆత్రేయ; డా. రెంటాల జయదేవ (హైదరాబాద్) - సముద్రాల (జూనియర్) రామానుజాచార్య; చెన్నూరి సీతారాంబాబు (హైదరాబాద్) - మైలవరపు గోపీకృష్ణ లు సృష్టించిన సాహిత్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ఆదివారం విశిష్టఅతిథులుగా పాల్గొన్న ఎస్. వి రామారావు (హైదరాబాద్) - సముద్రాల (సీనియర్) వేంకట రాఘవాచార్యులు; మహాకవి దాశరథి గారి తనయుడు దాశరథి లక్ష్మణ్ (హైదరాబాద్) - దాశరథి కృష్ణమాచార్య; శారద ఆకునూరి (హ్యుస్టన్) – ఆరుద్ర; గజగౌరి (చెన్నై) - వీటూరి; రాజశ్రీగారి తనయుడు, రాజశ్రీ సుధాకర్ (చెన్నై) – రాజశ్రీ; ఎస్.పి వసంత (చెన్నై) - అనిసెట్టి సుబ్బారావు; తుర్లపాటి నాగభూషణ రావు (హైదరాబాద్) - ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి; జాలాదిగారి కుమార్తె, డా. జాలాది విజయ (విశాఖపట్నం) - డా. జాలాది రాజారావు; వేటూరి గారి తనయులు, వేటూరి రవిప్రకాష్ (హైదరాబాద్) – వేటూరి సుందర రామమూర్తి; కలగా కృష్ణమోహన్ (హైదరాబాద్) - ఇంద్రగంటి శ్రీకాంత శర్మ; వేదవ్యాస రంగభట్టర్ గారి సహోదరులు జె.కె భారవి (హైదరాబాద్) - వేదవ్యాస రంగభట్టర్; సిరివెన్నెల గారి సోదరులు చేంబోలు వెంకట్రామశాస్త్రి (విశాఖపట్నం) - పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి; వెన్నెలకంటి గారి తనయుడు, శశాంక్ వెన్నెలకంటి (హైదరాబాద్) – వెన్నెలకంటి గార్ల సినీ సాహిత్యంపై ఎంతో లోతైన, ఆసక్తిదాయకమైన చేసిన విశ్లేషణ అందరినీ అలరించింది.శనివారం, జూలై 27న జరిగిన పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును.https://youtube.com/live/GT2hkXvKc1Yఆదివారం, జూలై 28న జరిగిన పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును. https://www.youtube.com/live/SxVnbW1FBGAతానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సభలో పాల్గొన్న అందరికీ, విజయవంతంగావడానికి సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సినీ సాహితీ చరిత్రలో ఈ సాహిత్యసభ ఒక చరిత్ర అన్నారు. -
TANA: తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాల పరంపరలో జూన్ 30న జరిగిన 68వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రల్ఙు సదస్సు ఘనంగా జరిగింది. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిథులను సాదరంగా ఆహ్వానించి సదస్సును ప్రారంభిస్తూ “ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు చదవడంద్వారా కేవలం వారు గడిపిన జీవితమేగాక ఆనాటి సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవనవిధానం మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంతేగాక ఆయా ప్రముఖులు తమ జీవితాలలో ఎదుర్కొన్న సమస్యలు, ఆటుపోట్లు, వాటిని అధిగమించిన తీరునుండి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చునని అందువల్ల తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘జీవితచరిత్రలు’ లేదా ‘ఆత్మకథలు’ చాలా ముఖ్యభూమిక వహిస్తాయన్నారు. కృష్ణాజిల్లాలోని ‘ముదునూరు’ అనే గ్రామంలో “జీవితచరిత్రల గ్రంధాలయం్ఙ వ్యవస్థాపకులు డా. నాగులపల్లి భాస్కరరావు ఈ కార్యక్రమంలో విశిష్టఅతిథిగా పాల్గొని ఈ గ్రంధాలయ స్థాపన వెనుకఉన్న ఆశయాన్ని, అమలు జరుగుతున్న తీరుతెన్నులను సోదాహరణంగా వివరించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్నవారిలో సుప్రసిద్ధ రచయిత్రి, విద్యావేత్త ఆచార్య డా. సి. మృణాళిని ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి రచించిన “మా జ్ఞాపకాల్ఙు అనే జీవితచరిత్రను మరియు బీనాదేవి పేరుతో భార్యాభర్తలు కలిసి జంటగా రాసిన అనేక రచనలను “బీనాదేవీయం్ఙ అనే గ్రంథాలలోని అనేక విషయాలను చాల హృద్యంగా ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత డా. జి. వి. పూర్ణచందు తెలుగువారికి తక్కువగా పరిచయమైన తమిళనాట ఆధ్యాత్మికరంగంలో ఎనలేని కృషిచేసిన తెలుగు ప్రముఖులు “అప్పయ్య దీక్షితుల్ఙు మరియు “అల్లూరి వేంకటాద్రిస్వామ్ఙి జీవిత చరిత్రలలోని అనేక విశేషాలను పంచుకున్నారు.ప్రముఖ సాహితీవేత్త, ప్రయోక్త కిరణ్ ప్రభ ఒక రష్యన్ యువతి కేవలం భారతీయ నృత్యకళలపై ఆసక్తితో తన పేరును “రాగిణీదేవ్ఙి గా మార్చుకుని ఎన్నో సాహసాలతో భారతదేశంలో అడుగుపెట్టి, అనేక సంవత్సరాలు కృషిచేసి నాట్యం నేర్చుకున్నదీ, నాట్యశాస్త్రంపై ఎంతో పరిణితితో కూడిన గ్రంథాలు రాసిందీ, తన కుటుంబం మొత్తం ఏ విధంగా నాట్యకళకు జీవితాంతం అంకితం అయిందీ లాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను చాలా ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. అలాగే తాను నమ్మిన సిద్దాంతంకోసం తన తుదిశ్వాస వరకు ఏవిధంగా గిడుగు ఒంటరి పోరాటం చేసినదీ, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు “గిడిగు వేంకట రామమూర్త్ఙి గారి జీవితంలోని అనేక కోణాలను కిరణ్ ప్రభ విశ్లేషించారు. సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి సాహితీ సమావేశాలు విద్యార్థులకోసం ప్రత్యేకంగా నిర్వహించడం చాలా అవసరం అన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. https://www.youtube.com/watch?v=PpLUQ3jT2JU -
తానా ప్రపంచసాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవ వేడుకలు !
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతిఆచార్య డా. కె. పద్మరాజుముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు. తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులునిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాలు ఈ నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖం తోపాటు ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవి. ఆంధ్రప్రదేశ్‌లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం, ఇక తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.ఇక విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న,ప్రముఖ సినీగీత రచయితడా. సుద్దాల అశోక్ తేజ,‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమానిడా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవి శ్రీ గొడిశాల జయరాజు, గద్దర్కుమార్తె డా. వెన్నెల గద్దర్,అరుణోదయ కళాకారిణిబండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్కుమారులుషేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు(డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.(చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు: తానా ఈవెంట్
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వసమావేశం: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు”అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తిదాయకంగా, వినోదాత్మకంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారంఅని, వీటిని పరిరక్షించవలసిన బాధ్యత మనఅందరిదీ అంటూపాల్గొంటున్న అతిథులకు స్వాగతం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – సామెతలు, పొడుపుకథలలో పరిశోధనలుచేసిన, చేస్తున్నసాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అన్నారు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ..“భాషాసౌందర్యం, అనుభవ సారం, నీతి, సూచన, హాస్యంకలగలుపులతో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు ఆయా కాలమాన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటాయని, వీటిని కోల్పోకుండా భావితరాలకు అందించడంలో ప్రభుత్వాలు, విద్యాలయాలు, సంస్థలు చేయ వలసిన కృషి ఎంతైనా ఉందన్నారు” పొడుపుకథలలో పరిశోధనచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పీహెచ్డీ పట్టా అందుకుని, అదే విశ్వ విద్యాలయంలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య డా. కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై “తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానంఉందని, విజ్ఞానం, వినోదం, ఆసక్తి కల్గించే పొడుపు కథలకు సృష్టికర్తలు ప్రజలేనని, చమత్కారం, నిగూఢభావం కల్గిన పొడుపుకథలు పల్లె పట్టుల్లో, మరీముఖ్యంగా జానపద గేయాలలో కూడా ఎక్కువగా ఉంటాయని అనేక ఉదాహరణలతో శ్రావ్యంగా గానంచేసి వినిపించారు.ప్రత్యక అతిథిగా హాజరైన డా. ఊరిమిండి నరసింహారెడ్డి చమత్కార గర్భిత పొడుపు కథలు, ప్రహేళికలు, పలుకుబడులు, పదభందాలుమొదలైనసాహితీ ప్రక్రియలన్నీ మన తెలుగు సిరిసంపదలని, వాటి గొప్పదనాన్ని ఒక విహంగ వీక్షణంగా ప్రతిభా వంతంగా స్పృశించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న పూర్వతెలుగు అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, ఆచార్య డా. సి.ఎచ్ సుశీలమ్మ (గుంటూరు)– ‘కోస్తాంధ్ర ప్రాంత సామెతలపైన’ ; నటుడు, ప్రయోక్త, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు జి.ఎస్ చలం (విజయనగరం) ‘ఉత్తరాంధ్ర ప్రాంత సామెతలపైన’; మైసూరులోని తెలుగు అధ్యయన, పరిశోధనా విభాగంలో సహాయా చార్యులుగా పని చేస్తున్న ఆచార్య డా. బి నాగశేషు (సత్యసాయి జిల్లా) – ‘రాయలసీమ ప్రాంత సామెతలపైన’; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “తెలుగు, కన్నడ ప్రాంత వ్యవసాయ సామెతలు - తులనాత్మక పరిశీలన” అనేఅంశంపై పి.ఎచ్.డి చేస్తున్నబుగడూరు మదనమోహన్ రెడ్డి (హిందూపురం) – ‘వ్యవసాయరంగ సామెతలపై’ ఎన్నో ఉదాహరణలతో చేసిన అసక్తికర ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
Tana: మన ప్రాచీన భారతీయ సాహిత్యం.. ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహణలో – మన ప్రాచీన భారతీయ సాహిత్యం – ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ సదస్సు డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 66 వ సాహిత్య సమావేశం: మన ప్రాచీన భారతీయ సాహిత్యం – ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే కార్యక్రమం ఘనంగా, విజ్ఞానదాయకంగా జరిగింది. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - విజ్ఞానశాస్త్రంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ప్రముఖులు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అంటూ, అతిథులందరినీ ఆహ్వానిస్తూ సభను ప్రారంభించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. “ఎన్నో వేల సంవత్సారల క్రితమే ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, ఆయుర్వేదశాస్త్రం, వృక్షశాస్త్రం, శిల్పశాస్త్రం, శబ్దశాస్త్రం, కాలశాస్త్రం లాంటి అనేక శాస్త్రాలకు పుట్టినిల్లు అఖండ భారతదేశం. ఎంతోమంది వీరులకు, శూరులకు, శాస్త్రవేత్తలకు, పండితులకు నిలయమై, నలంద, తక్షశిలల లాంటి విశ్వవిద్యాలయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి ఒక గొప్ప విజ్ఞానగనిగా విరాజిల్లిన ఘనచరిత్ర కల్గిన భారత మూలాలపై ఇంకా ఎంతో పరిశోధన జరుగవలసి ఉంది అన్నారు”. ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పూర్వ సంచాలకులు, చంద్రయాన్-3 కీలక శాస్త్రవేత్త అయిన డా. జోశ్యుల అచ్యుత కమలాకర్ తన ప్రసంగంలో ఇప్పటివరకు ఇస్రో సాగించిన ప్రయోగాలు, సాధించిన విజయాలు, గత సంవత్సరం ప్రపంచంలోనే మొదటిసారిగా చంద్రుని దక్షిణ ద్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ ఉండడం, చంద్రునిపై నీరు ఉన్నదని మొదటిసారిగా కనుగొన్న దేశం భారతదేశం కావడం, అతి తక్కువ వ్యయంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష పరిశోధనలలో ప్రపంచంలోనే మొదటి 5 దేశాలలో ఒకటిగా భారతదేశం ఉండగల్గడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అన్నారు. 30 నిమిషాలకు పైగా సాగిన తన పవర్ పాయింట్ ప్రజంటేషన్లో ఇస్రో త్వరలో చేపట్టబోయే అనేక ప్రయోగాలతో సహా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుని అందర్నీ ఆకర్షించారు. విశిష్టఅతిథిగా హాజరైన ప్రఖ్యాత రచయిత, సైన్సు ప్రచారానికి విశేష కృషి చేస్తున్న ఆకాశవాణి పూర్వ ఉన్నతోద్యోగి డా. నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ – “మన ప్రాచీన భారతీయ వాంగ్మయ విషయాలను సరిగా అర్థం చేసుకోవడం, వాటిని సరైన అవగాహనతో ప్రపంచంలోని అనేక ఇతర భాషల్లోకి అనువదించ వలసిన ఆవశ్యకత, ముఖ్యంగా విజ్ఞానశాస్త్ర పరివ్యాప్తికి ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేసి యువతరంలో చైతన్యం తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.” ప్రముఖ రచయిత, విశ్రాంత అధ్యాపకులు, అనేక సైన్స్ సదస్సులు, సైన్స్ ప్రసంగాలు చేసిన డా. ప్రతాప్ కౌటిల్య తన ప్రసంగంలో బాల్యంనుంచే విధ్యార్ధులలో సైన్స్ పట్ల ఆసక్తి కల్గేలా కొన్ని చిన్న చిన్న ప్రయోగాలతో అభిరుచి కల్పిస్తే, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు తయారవుతారన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును. -
'తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 64 వ సాహిత్య సమావేశం మన సినారె “విశ్వంభర” సంబురం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అతిథులందరినీ ఆహ్వానించి తన స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. సభాప్రారంభకులుగా హాజరైన తెలంగాణా సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన డా. జుర్రు చెన్నయ్య పద్మభూషణ్ ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి జీవనరేఖలను ఆయన విద్యార్ధి దశ, సాహిత్య ప్రయాణం, నిర్వహించిన పదవులు, సాధించిన విజయాలు, చేసిన రచనలు, అందుకున్న సన్మాన సత్కారాలను సోదాహరణంగా ఒక విహంగ వీక్షణంలా నారాయణ రెడ్డి గారి ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ కవి, పూర్వ రాజ్యసభ సభ్యులు, పూర్వ ఉపకులపతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ సినీగీత రచయిత, పద్మభూషణ్, ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి గారు తన జీవితకాలంలో అలంకరించిన పదవులు, సమవర్ధవంతంగా నిర్వహించిన బాధ్యతలు, సాధించిన విజయాలు ఏ సాహితీవేత్తకు దక్కని గౌరవాలు అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన దీర్ఘ కావ్యం ‘విశ్వంభర’ కు సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రస్తుతం అదే విశ్వంభర కావ్యాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి అత్యున్నత ప్రమాణాలతో శ్రవణరూపంలో ముద్రించడం హర్షదాయకం” అన్నారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “తెలుగు భాషాసాహిత్య వికాసాలకోసం తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ప్రముఖ కవి డా. సినారె రాసిన విశ్వంభర కావ్యాన్ని ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి తన విశిష్టగళంలో ఆడియో రూపంలో ముద్రించడం ముదావహమని, ఇప్పుడు దానిని సాహితీలోకానికి తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం ఆనందదాయకం అన్నారు.” సుప్రసిద్ధ సినీ కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తాను పలుమార్లు జే.కే భారవి రూపొందించిన విశ్వంభర ఆడియో విన్నానని, చాలా శ్రవణానందకరంగా ఉన్నదని, దీన్నే వీడియో రూపంలో తన స్వంత ఖర్చులతో దృశ్యమాలికగా తీసుకువచ్చే ఆసక్తి ఉన్నదని, త్వరలోనే ఈ విషయంలో సినారె కుటుంబసభ్యులను సంప్రదిస్తానన్నారు. సుప్రసిద్ధ కథారచయిత జే.కే భారవి మాట్లాడుతూ.. డా. సినారె విరచిత విశ్వంభర కావ్యాన్ని ఒక పిచ్చి వ్యామోహంతో ఎన్నో సార్లు చదివానని, ఎంతో ఆసక్తితో ఎన్నో వ్యవ ప్రయాసలకోర్చి దీన్ని అత్యున్నత ప్రమాణాలతో నేను రూపొందించిన ఆడియోని ఇప్పుడు తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం చాల సంతోషంగా ఉన్నదని చెప్పారు. అలాగే దీనికి కారకులైన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రముఖ ప్రేరణాత్మక ప్రసంగకర్త ఆకెళ్ళ రాఘవేంద్ర విశ్వంభర కావ్యంలోని అనేక విషయాలను ఉటంకించి, ఆ కావ్య లోతుపాతుల్ని, కావ్య వైభవాన్ని ప్రతిభావంతంగా విశ్లేషించి సినారె సాహిత్య ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. పద్మభూషణ్ డా. సినారె కలం నుండి వెలువడిన “విశ్వంభర” కావ్యం మొత్తాన్ని ప్రముఖ సినీ కథా రచయిత జే.కే భారవి గళంలో మీకోసం ప్రత్యేక కానుకగా ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేసి వినవచ్చు. https://youtube.com/playlist?list=PL0GYHgMt2OQyx6qWv-kWt2bCxAl6GB5XO&si=D4SS-jzDXYhmqFQX -
‘తానా ప్రపంచసాహిత్య వేదిక’
డెట్రాయిట్, అమెరికా: ఉత్తరఅమెరికా తెలుగుసంఘం సాహిత్యవిభాగం – ‘తానా ప్రపంచసాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సమగ్రసాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి విదితమే. ఇప్పడు అదే స్ఫూర్తితో సుప్రసిద్ధ కవి, రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సమగ్ర సాహిత్యాన్ని తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర గారి నేతృత్వంలో ముద్రించి త్వరలో తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు అందజేయనున్నామని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కొసరాజుగారి 37వ వర్దంతి (అక్టోబర్ 27) సందర్భంగా ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఇది తానా సంస్థ ఒక మహాకవికి ఇచ్చే ఘన నివాళిగా నిలుస్తుందని ఆయన అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “దాదాపు నాల్గు దశాబ్దాలుగా సాగిన కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సాహితీ ప్రయాణంలో “ఏరువాక సాగాలోరన్న”; “అయయో చేతిలో డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే”; “భలే ఛాన్సులే భలే ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా”; “సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు కాల్చు సిగరెట్టు”; “రామయతండ్రి, ఓ రామయ తండ్రి, మానోములన్ని పండినాయి రామయ తండ్రీ”; “ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, అలుపూ సొలుపేమున్నది” లాంటి పాటలలో అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టు భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు గారి కలంనుండి రెండువందల చిత్రాలలో వెయ్యికి పైగా పాటలు జాలువారాయి. కేవలం సినిమా పాటలేగాక కొసరాజు గారు “గండికోట యుద్ధము” అనే ద్విపద కావ్యము; “కడగండ్లు” అనే పద్యసంకలనం, “కొసరాజు విసుర్లు”, “కొండవీటి చూపు”, “నవభారతం”, “భానుగీత” లాంటి గ్రంధాలు, యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు లాంటవి ఎన్నో రాశారని అన్నారు”. ఈ సందర్భంగా కొసరాజు గారి కుటుంబసభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను ఇప్పటికే సేకరించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కొసరాజు గారి కుటుంబసభ్యులకు, కొసరాజు గారి సమగ్ర సాహిత్యాన్ని త్వరలో తెలుగు ప్రజలకు అందించే తానా ప్రపంచసాహిత్యవేదిక తలపెట్టిన సాహితీ మహాయజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషించనున్న పేరెన్నికగన్న సాహితీవేత్త, పరిశోధకులు, అనుభవజ్ఞులు అయిన అశోక్ కుమార్ పారా (మనసు ఫౌండేషన్) కు కృతజ్ఞతలు అన్నారు తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర. -
అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!
అంతర్జాతీయ సంబంధాల కేంద్రం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,తిరుపతి వారు తానా పూర్వాధ్యక్షులు డా ప్రసాద్ తోటకూర గారితో విద్యార్థినుల ముఖాముఖి కార్యక్రమాన్ని సావేరి సెమినార్ హాల్ లో 2023 సెప్టెంబర్ 4న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య దేపూరు భారతిగారు విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ తానా సంస్థ ముఖ్య లక్ష్యాన్ని, వారు నిర్వహిస్తున్న కార్యకలాపాలను కొనియాడారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సంగీత, నృత్య విభాగం వాళ్ళు అధునాతన డిప్లొమా కోర్సులను నడుపుతున్నారని తెలియజేశారు. పదుల సంఖ్యల్లో నుంచి వందల సంఖ్యల్లోకి అడ్మిషన్లు పెరిగాయని తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణను డా ప్రసాద్ తోటకూర గారి ముందుంచారు. గౌరవ అతిథి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య నల్లనాగుల రజినీగారు మాట్లాడుతూ అమెరికా నుంచి డా ప్రసాద్ గారు మన విశ్వవిద్యాలయానికి రావడం సంతోషదాయకం అన్నారు. కార్యనిర్వాహకులు అంతర్జాతీయ సంబంధాల కేంద్రం డీన్ ఆచార్య పి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని, కోర్సులు ప్రారంభంకావడానికి నాంది పలికిన వారు పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా తోటకూర ప్రసాద్ గారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన డా ప్రసాద్ తోటకూర గారు మాట్లాడుతూ.. అగ్రరాజ్యం అమెరికాలో ఉండే ఉద్యోగ అవకాశాల్ని, అక్కడి జీవన విధానాన్ని వివరించారు. అమెరికా గురించి చాలామంది విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తెలుగు భాషకు అక్కడున్న స్థాయిని, స్థానాన్ని తానా సంస్థ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. సత్య నాదెండ్ల, సుందర్ పిచాయ్, ఇంద్రనూయి కార్పోరేట్ దిగ్గజాలుగా ఎదిగిన ప్రస్తానాన్ని, పారిశ్రామిక దిగ్గజాలు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటివారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులతో కలిసి తానా ప్రపంచ సాహిత్య వేదిక "సిరివెన్నెల సీతారామశాస్త్రి" గారు సృష్టించిన సాహిత్యం మొత్తాన్ని ఆరు సంపుటాల్లో ముద్రించిన గ్రంథాలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గ్రంథాలయనికి ప్రసాద్ గారు బహూకరించారు. ఈ కార్యక్రమానికి డా. హిమబిందు ఆహ్వానం పలుకగా, డా. యువశ్రీ వందన సమర్పణ చేశారు. డా శిరీష ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అంతర్జాతీయ సంబంధాల కేంద్రం ఆచార్యులు, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థినులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం డా ప్రసాద్ తోటకూర గారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 2016వ సంవత్సరంలో కానుకగా బహూకరించిన మహాత్మా గాంధీ విగ్రహానికి ఆచార్యదేపూరు భారతి గారు, ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా ప్రసాద్ తోటకూర గారు, ఆచార్య పి విజయలక్ష్మి గారు పుష్పాంజలి ఘటించారు. (చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!) -
అట్టహాసంగా ముగిసిన తానా 23వ మహాసభలు
ఉత్తర అమెరికాలోని ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు తానా 23వ మహాసభలు అంగరంగ వైభవంగా జరిగాయి. జులై 7-9వరకు ఆటపాటలు, ప్రముఖుల ప్రసంగాలతో ఈ వేడుకలు అందరినీ అలరించాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతనపాటి వెంకట రమణలతో నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజయ్యారు. వేదిక మొత్తం తెలుగు వారితో సందడి వాతావరణం కనిపించింది. తొలిరోజు.. బాంకెట్ డిన్నర్ వేదికపై 23వ మహాసభల సావనీర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో వెంకయ్యనాయుడికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, చైర్మన్ శ్రీనివాస్ లావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, ఓవర్సీస్ డైరెక్టర్ వంశి కోట తదితరులు చిరుసత్కారం చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురికి తానా ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణను కూడా తానా ప్రతినిధులు సత్కరించారు.ఆయన చేతుల మీదుగా పలువురికి తానా మెరిటోరియస్ అవార్డులను అందజేశారు. నిర్మాణ దిల్‌రాజు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నేత సీతక్క, శ్రీలీల, నిఖిల్ తదితరులను కూడా సత్కరించారు. రెండో రోజు..కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తానా నాయకులంతా పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.ఆ తర్వాత ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఎస్, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ప్రైమ్ హాస్పిటల్స్ వ్యవస్థాకులు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ (టాటా) వ్యస్థాపకులు పైళ్ల మల్లారెడ్డి తదితరులకు తానా నాయకులు సన్మానం చేశారు. అనంతరం ఆధ్యాత్మిక జీవితం గురించి, మనం చేసే పొరపాట్ల గురించి సద్గురు జగ్గీ వాసుదేవ్ అద్భుతంగా వివరించారు. మూడో రోజు స్థానిక సాంస్కృతిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ఆటపాటలు, కళానైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ధీంతానా బృందాన్ని తానా నేతలు సత్కరించారు. అనంతరం వేదమంత్రాల నడుమ సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ రమణకు ఘనసత్కారం చేశారు.సీనియర్ నటులు మాగంటి మురళీ మోహన్‌ను సత్కరించారు. నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అవార్డును అందజేశారు.అనంతరం బాలకృష్ణ దంపతులను తానా నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా తానా సేవలను బాలకృష్ణ కొనియాడారు. ఇదిలా ఉంటే తానా మహాసభల చివరి రోజున అధ్యక్షులు అంజయ్య చౌదరి పదవీ కాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో నూతన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఈ వేదికపైనే ప్రమాణం చేశారు. ఆయన 2023-2025 వరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. -
రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు..: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రైతులకు నిరంతరాయ ఉచిత కరెంట్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అవసరం లేదని.. 3 గంటలు ఇస్తే చాలని వ్యాఖ్యానించారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్.. సోమవారం తానా మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా ప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అనంతరం ఎన్ఆర్ఐలు, పలు మీడియా వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఓ ఎన్ఆర్ఐ రేవంత్‌ను ఆసక్తికర ప్రశ్న వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు నిరాంతరాయంగా అందుతున్న కరెంట్‌ను, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తారా లేక తొలగిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో 95శాతం మంది రైతులు మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులేనని తెలిపారు. ఒక ఎకరాకు సాగు నీరు పారించాలంటే ఒక గంట సరిపోతుందని, అదే మూడు ఎకరాలకు ఫుల్లుగా నీళ్లు పట్టాలంటే మూడు గంటలు చాలని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఒక రైతుకు ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కేవలం విద్యుత్ సంస్థల వద్ద కమీషన్‌కు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ అనే నినాదాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఉచితాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని అన్నారు. చదవండి: ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా? అవసరమైతే సీతక్కే సీఎం.. -
యువతికి కేక్ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..
జులై 7వ తేదీ నుంచి 9వరకు అమెరికా ఫిలడెల్ఫియాలో జరిగిన తానా సభల్లో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్న సంగతి తెలిసిందే. తానా సంబరాల్లో బాలకృష్ణ కుటుంబంతో పాటు ఓ యువతి దిగిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ యువతి ఎవరని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) ఇంతకు తనెవరంటే... తానా సభలో తన అభిమానిని అంటూ ఓ యువతి బాలయ్య దగ్గరకు వచ్చింది. ఈరోజు తన పుట్టినరోజని ఆశీర్వదించమని కోరింది. దీంతో వెంటనే ఆమె కోసం కేక్ తెప్పించి కటింగ్ చేయించారు బాలయ్య. ఆ విధంగా పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఆయన సతీమణి వసుంధరతో పాటు ఆ యువతిని ఆశీర్వదించారు. ఆ అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని బాలయ్య అందించారు. ఇవే ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (ఇదీ చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్) -
US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం?
ఒకప్పుడు అమెరికాకు వచ్చే ప్రవాసాంధ్రులంటే ఎంతో గౌరవం. అక్కడి సమాజం హర్షించేలా హుందాగా ఉండేవారు. తెలివితేటల్లో మిన్నగా ఉంటూ ప్రతిభను చాటేవారు. అమెరికాలోని ఏ నగరానికి వెళ్లినా .. తెలుగు వాళ్లంటే ఓ బ్రాండ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి తరచుగా దిగజారుతోంది. చదువు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెల్లువెత్తుతోన్న ప్రవాసాంధ్రుల్లో.. చాలా మంది కొన్నాళ్ల పాటు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాతే అసలు రంగు బయటపెట్టుకుంటున్నారు. ఎందుకీ జాడ్యం తొలుత వృత్తి నైపుణ్యాలు, ఉద్యోగాలకు పరిమితమయిన ప్రవాసాంధ్రులు.. ఇప్పుడు కంపెనీలు నెలకొల్పారు, విజయవంతంగా నడిపిస్తున్నారు. అదే సమయంలో పేరాశ వీపరీతంగా పెరిగింది. డబ్బు సంపాదనతో ఆగిపోకుండా.. దాన్ని ఎగ్జిబిట్.. అంటే ప్రదర్శనకు తహతహలాడుతున్నారు. అమెరికన్ల తరహాలో హుందాగా వీక్ డేస్ లో కనిపించే ప్రవాసాంధ్రులు.. వీకెండ్ లో పార్టీ కల్చర్ వీపరీతంగా పెంచుకుని.. అక్కడ తమ స్థాయి, దర్పాన్ని ప్రదర్శించేందుకు ఉవ్విళ్లుతున్నారు. కనీసం కేజీ బంగారం శరీరంపై వేసుకుంటే తప్ప కన్వెన్షన్ కు హాజరు కాలేని పరిస్థితి చాలా మంది తెలుగు కుటుంబాల్లో ఉంది. ఆరంభంలో తమ కెరియర్ పై దృష్టి పెట్టిన చాలా మంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వైపు తొంగి చూస్తున్నారు. టిడిపి ఎంట్రీతో మారిన సీన్ అక్కడ బాగా సంపాదించిన వారు హఠాత్తుగా ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేయడం పరిపాటి అయింది. దీన్నే అక్కడ హెలికాప్టర్ క్యాండిడేట్స్ అని సరదాగా చెప్పుకుంటారు. ఇలాంటి అభ్యర్థులంటే తెలుగుదేశం పార్టీకి పండగే. టికెట్ల కోసం ఎంతయినా ఖర్చు పెట్టడం, ఓటుకు కోట్లు గుప్పించడం ఇలాంటి వారి వల్ల చాలా సులభమని చంద్రబాబు నమ్ముతారు. చాలా మంది ప్రవాసాంధ్రులు వ్యాపారాల వైపు మళ్లారు. అయితే వీరేమి గొప్ప వ్యాపారాలు చేయడం లేదు. పేరాశ బాగా పెరిగి రియల్ ఎస్టేట్ బిజినెస్, హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ తో పాటు టెక్సాస్ లాంటి చాలా రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ అంతా మన వాళ్ల చేతిలోనే ఉంది. తనకు అనుకూలమైన కొందరిని విదేశాల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంచడం చంద్రబాబుకు బాగా అబ్బిన కళ. అక్కడి నుంచి రకరకాల ఫేక్ స్టోరీలను వండి తెలుగు రాజకీయాలపై వదలడం బాబు కోటరీకి వెన్నతో పెట్టిన విద్య. పేరులో కులాలను మార్చి.. ప్రత్యర్థులపై దాడి చేయడం బాగా అలవాటుగా మారింది. ఇందులో కొందరు ఎన్నారైలు పావులైపోతున్నారు. డబ్బు కోసం విలువలు మరిచి.. ఇదే సమయంలో మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో ఇండియా నుంచి ప్రముఖ అమ్మాయిలను తెప్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'గంటకు ఇంత అంటూ' అనైతిక కార్యక్రమాలకు దిగి అక్కడి పోలీసులకు దొరికిపోయి మొత్తం తెలుగు ప్రజలకే చెడ్డ పేరు తెస్తున్నారు. షికాగో వేదికగా ఐదారేళ్ల కింద కొందరు పట్టుబడడం వల్ల చాలా మంది తెలుగు వాళ్లు ఇబ్బంది పడ్డారు. అసలు మాది తెలుగు అని చెప్పుకోవడానికి సిగ్గు పడ్డారు. వీసా ఇంటర్వ్యూలకు సినీ తారలు వెళ్తే అనుమానించే పరిస్థితి ఎదురయిందని కొందరు ప్రవాసాంధ్రులు తెలిపారు గ్రూపులు.. వర్గాలు ఇక ఏ ఈవెంట్ జరిగినా.. రెండుగా చీలడం పరిపాటయింది. ఇటీవల టెక్సాస్ లో బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు బాహటంగానే తన్నుకున్న విషయం ప్రవాసాంధ్రుల మదిలోంచి ఇంకా పోలేదు. ఒక్క తెలుగుదేశంలోనే చాలా వర్గాలున్నాయి. అమెరికాకు 40, 50 ఏళ్ల కిందనే రావడంతో టిడిపి ఎన్నారైలలో ప్రాంతీయ అభిమానం బాగా పెరిగిపోయింది కులాల పేరుతో సంఘాలు, సినీ నటుల పేర్లతో అభిమాన సంఘాలు బాగా పెరిగిపోయాయి. ఇక ప్రాంతాల వారీగా ఇది మరింత ముదిరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాస్తా.. జిల్లాల పేరుతో మీటింగ్ లు, భేటీలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఘన చరిత్ర ఉన్న ప్రవాసాంధ్రులు కాస్తా.. ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవడం కాస్తా ఇబ్బందికరమేనని వాపోతున్నారు. చదవండి: తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
తానా సభల్లో తన్నులాట.. బండ్ల గణేష్ సీరియస్ రియాక్షన్
అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం Telugu Association of North america (TANA, తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరిగింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ ఘటనపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ఈ క్రమంలో టీడీపీ లీడర్లపై ఫుల్ సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన బండ్ల గణేష్.. ‘తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా.. సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పట్టా కష్టాన్ని గంగలో కలిపారు నిచుల్లారా 😡 https://t.co/R06P8Gq7bK — BANDLA GANESH. (@ganeshbandla) July 9, 2023 సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ 😡😡 https://t.co/R06P8Gq7bK — BANDLA GANESH. (@ganeshbandla) July 9, 2023 చదవండి: US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం? తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
US : తానా సభల్లో తన్నుకున్న లోకేశ్, జూ.ఎన్టీఆర్ వర్గాలు
పెన్సిల్వేనియా, అమెరికా : అమెరికాలో ‘తానా’(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్ వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పరం చొక్కాలు పట్టుకుని మరీ దాడులకు దిగాయి. టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘర్షణకు ప్రధాన కారణం లోకేష్ నాయకత్వంపై వ్యక్తమైన విమర్శలే కారణమని తెలుస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా కొందరు తెలుగు తమ్ముళ్లు ‘జై ఎన్టీఆర్’అని నినదించడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు వర్గం దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. అ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నంతవరకు టీడీపీకి మనుగడ లేదని, 2024లోనూ మరోసారి పరాజయం ఖాయమని కొందరు ఎన్నారైలు వాదించినట్లు సమాచారం. తనను తాను మూర్ఖుడిగా చెప్పుకునే లోకేష్ కు బదులుగా జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలను అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. దీంతో కలవరం చెందిన చంద్రబాబు వర్గం దాడులకు దిగినట్లు తెలిసింది. అమెరికాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన తానాకు ఈ ఘటన మాయని మచ్చలా మిగిలింది. ఘనంగా ప్రారంభం.. అంతలోనే వివాదం పెన్సిల్వేనియాలో తానా 23వ మహాసభలను ఘనంగా ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రిటైర్డ్ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ వేడుకలను ప్రారంభించారు. తొలిరోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన అనంతరం తానాలోని కొందరు ప్రముఖులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు. కర్రలు విసురుకుంటూ.. సుదీర్ఘ ఘన చరిత్ర ఉన్న తానాకు ఫిలడెల్ఫియాలో జరిగిన అనూహ్య ఘటన ఊహించని ఇబ్బంది తెచ్చింది. తొలి రోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన తర్వాత తానాలోని కొందరు ముఖ్యులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు. మాట మాట పెరిగి గొడవకు దిగారు. కొందరు తానా ముఖ్యులు ఆపడానికి ప్రయత్నించినా పరిస్థితి సద్దుమణగలేదు. చివరికి స్థానిక సెక్యూరిటీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా టీడీపీకి సంబంధించిన అంశాలపై తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాల మధ్య వివాదం రేగడంతో ముష్టి యుద్ధానికి దిగాయి. వివాదం శృతి మించడంతో కొందరు అందుబాటులో ఉన్న కర్రలను విసిరారు. ప్రతిష్టాత్మక తానా సంస్థను రాజకీయ సంస్థగా మార్చిన ఘనత చంద్రబాబుదేననే విమర్శలున్నాయి. నిధుల సేకరణ కోసం తానాను ఆయన కామధేనువులా మార్చుకున్నారు. గొడవకు కారణం లోకేష్ సమర్థతేనా? తానాకు హాజరయిన కొందరు సభ్యుల్లో గొడవ ముదరడానికి ప్రధాన కారణం తెలుగుదేశం రాజకీయాలే అని తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి దిగజారడానికి కారణం చంద్రబాబు, లోకేషేనని.. మళ్లీ 2024 ఎన్నికల్లోనూ పార్టీకి పరాభవం తప్పదని కొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నంత కాలం బాగుపడే అవకాశం లేదని చెప్పుకున్నారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను ప్రమోట్ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటున్నారని, అయితే తనను తాను మూర్ఖుడిగా అభివర్ణించుకుంటోన్న లోకేష్ కు అంత సీన్ లేదని, లోకేష్ బదులు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే గానీ పార్టీ బాగుపడదని కొందరు వాదించినట్టు తెలిసింది. ఇటీవల చంద్రబాబు ఎక్కడికెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, పార్టీ పగ్గాలు జూనియర్ కు ఇస్తేనే.. బాగుంటుందని ఎక్కువ మంది వాదించారు. దీంతో చంద్రబాబు వర్గంలో కలవరం మొదలై, దాడులకు దిగే దుస్థితి వచ్చినట్టు టిడిపి వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం? అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
‘స్వరనిధి స్వర వీణాపాణి’కి ఘన సన్మానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’ విశ్వ విజయోత్సవ సభ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు, సంగీత సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేశారు. ఈ సందర్భంగా తానా కళాశాల చైర్మన్ రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ.. కళాశాల ప్రారంభం నుంచి ఎంతోమంది నృత్య కళాకారులకు, కూచిపూడి నృత్యంలో పట్టభద్రులు అవ్వడానికి సహకారం అందించడంతో పాటు మన్ముందు ఆసక్తి గల విద్యార్థులకు ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. తానా తెలుగు భాషా పరివ్యాప్తి కమిటి చైర్మన్ చినసత్యం వీర్నపు స్వరవీణాపాణితో వున్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. 2018లో ‘సప్తస్వర అష్టావధానం’ నిర్వహించడానికి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో 72 మేళకర్త రాగాల స్వరూపం మొత్తాన్ని ఒక సంక్షిప్త కీర్తనలో పొందుపరచి, 61 గంటలపైగా పాడి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డును సొంతం చేసుకున్న స్వరవీణాపాణి గిన్నీస్ రికార్డు అందుకోవడం తెలుగు జాతికి గర్వకారణం అని ప్రశంసల వర్షం కురిపించారు. వీణాపాణి మాట్లాడుతూ తనకు డాక్టర్ ప్రసాద్ తోటకూరని, తనికెళ్ళ భరణి పరిచయం చేశారని, వారితో అనుబంధం జీవితంలో మరువలేనిది అని అన్నారు. అలాగే వెన్నం ఫౌండేషన్ అధినేత మురళీ వెన్నం, ప్రసాద్ తోటకూరలు ప్రోత్సాహం, ఆదరాభిమానాలు తనను ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డు దక్కించుకునేందుకు దోహదం చేశాయని కొనియాడారు. లోకేష్ నాయుడు, మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, అశోక్ కొల్లా, చినసత్యం వీర్నపు, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డా. భానుమతి ఇవటూరి , లక్ష్మి పాలేటి, శరత్ యర్రం (టాంటెక్స్ అధ్యక్షులు), వెంకట్ ములుకుట్ల, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, వెంకట ప్రమోద్, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, లెనిన్ వేముల,సుందరరావు బీరం, బాపూజీ జంధ్యాలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి దాతలు, మైత్రి రెస్టారెంట్ యాజమాన్యానికి, మీడియా సంస్థలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు మురళీ వెన్నం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. -
తానా: అమ్మభాషా సేవలో అంధమేధావుల సభవిజయవంతం
డాలస్, టెక్సాస్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెలనెలా తెలుగువెలుగ్ఙు కార్యక్రమంలో భాగంగా ఆదివారం, ఫిబ్రవరి 26న నిర్వహించన 45వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “జ్ఞాననేత్రులు తెలుగు దివ్వెలు అమ్మ భాషా సేవలో అంధ మేధావులు అనే సాహిత్య కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర పాల్గొంటున్న అతిథులందరుకూ స్వాగతం పల్కుతూ వీరందరి మధ్య ఉన్న సారూప్యం దృష్టి లోపం కాదు, దూరదృష్టి అన్నారు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదనుకుంటూ తమ జీవితాలను అంధకారబందురం చేసుకుంటున్న అసంతృప్తివాదులకు వీరి జీవితాలు వెలుగు బాటలు అని, తమ శక్తిని తాము తెలుసుకోలేక జీవితంలో ఇంకా ఏమీ చెయ్యలేమనే కృంగిపోతున్న నిరాశావాదులకు ఈ అతిథుల జీవితాలు స్ఫూర్తి పతాకలుఅన్నారు. కేవలం కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యంమే ఆయుధాలుగా చేసుకుని జీవనపోరాటం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నఈ ధీరోదాత్తుల జీవితాలు అందరికీ ఆదర్శమంటూ స్వాగతం పలికారు. ఈ అంతర్జాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వభాషా సాంస్కృతిక శాఖముఖ్య కార్యనిర్వహణాధికారిఆర్. మల్లిఖార్జున రావు మాట్లాడుతూప్రతి నెలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషా సాహిత్య సేవలో నిమగ్నమైన తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు, అంధ మేధావులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. విశిష్ట అతిథులుగా ఆచార్య మన్నవ సత్యనారాయణ, పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (దుగ్గిరాల); ఆచార్య జక్కంపూడి మునిరత్నం నాయుడు,విశ్రాంతతెలుగు ఆచార్యులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి); డా. బొల్లా జ్యోత్స్న ఫణిజ, సహాయఆచార్యులు,ఆంగ్ల భాషావిభాగం, ఢిల్లీ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ); డి.వి మోహన కృష్ణ, శాస్త్రీయసంగీత విద్వాంసులు (హైదరాబాద్),షాకీర్ మొహమ్మద్, అపార జ్ఞాపకశక్తి సంపన్నులు, వ్యక్తి వికాస శిక్షకులు (హైదరాబాద్); సత్యవాడ సోదరీమణులు సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి, రచయిత్రులు, గాయకురాళ్ళు (విశాఖపట్నం); డా.బెంకి రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయుడు (జడ్చర్ల); డా. చిక్కా హరీష్ కుమార్, రచయిత (మహబూబ్ నగర్); డా. చిన్నావుల వేంకట రాజారెడ్డి, ఉపాధ్యాయుడు (కర్నూలు); మోపూరు పెంచల నరసింహం, కవి (నెల్లూరు), పెండ్యాల గాయత్రి, ఉపాధ్యాయిని (సింగరాయకొండ); టింగిరికార్ వెంకటేశ్, వ్యాఖ్యాత, రచయిత (మహబూబ్ నగర్) పాల్గొని తెలుగు భాషపట్ల తమకున్న అపారమైన అభిమానాన్ని, వారు రచించిన కథా, కవితా సంపుటాలు,నవలల గురించి పంచుకుంటూ, వారి జీవితంలో ఎదురైన అవరోధాలను ఎదుర్కుంటున్న తీరు, తెలుగు భాషను పరిరక్షించి, పరివ్యాప్తం చేయడంలో తల్లిదండ్రులుగా, వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరి భాద్యతను గుర్తుచేసి అందరికీ కనువిప్పు కల్గించారు. మనిషి తలుచుకుంటే జీవితంలో సాధించ లేనిది ఏదీ లేదు అనే నానుడికి ఈ విశిష్ట అతిథుల జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులకు, కార్యక్రం విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, ప్రసార మాధ్యమాల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. -
ఫిలడెల్ఫియాలో తానా 23వ మహాసభలు
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ మహాసభలుఈ ఏడాది జులై 7 నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. స్థానిక పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో వీటిని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీవిల్ నగరంలోని కమ్యూనిటీ మ్యూజిక్ స్కూల్ ఆడిటోరియంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి నేతృత్వంలోని తానా మహాసభల సమన్వయ కమిటీల నియమించారు. మహాసభల కార్యదర్శిగా సతీష్ తుమ్మల, కోశాధికారిగా భరత్ మద్దినేని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రవి మందలపు, ఇండియా వ్యవహారాల డైరెక్టర్ గా వంశీ కోట, జాయింట్ సెక్రెటరీగా శ్రీనివాస్ కూకట్లకు భాద్యతలు అప్పగించారు. కార్యక్రమంలో తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యాధర్ గారపాటి, రీజినల్ కోఆర్డినేటర్లు సునీల్ కోగంటి, వంశీ వాసిరెడ్డి పాల్గొన్నారు. -
సైన్స్ పరికరాలు, స్టడీ మెటీరియల్ అందించిన తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సహకారంతో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మైక్రోస్కోప్ పరికరాలు, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. విద్యార్థులకు బోధనా పరికరాలు, కంప్యూటర్లు అందించవల్సిందిగా పొట్లూరి రవిని అభ్యర్థించగా వెంటనే స్పందించి మైక్రోస్కోపులు, స్టడీ మెటీరియల్స్ అందించారు. వీటితో పాటే కంప్యూటర్లని కూడా పది రోజుల్లో అందిస్తామని తెలిపారని పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు గోకారి తెలిపారు. కప్పట్రాళ్ల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తామని, పాఠశాల విద్యార్థులను ఎన్నారై విద్యార్థులతో ఆన్లైన్లో అనుసంధానం చేసి ఆధునిక సాంకేతికవిద్యను బోధించడానికి కృషి చేస్తామని తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వాసుబాబు గోరంట్ల, రామ్ చౌదరిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్, పారిశ్రామికవేత్త అనంత నాయుడు పాల్గొన్నారు.