మహిళామణులలో ఆనందోత్సాహాలు నింపిన 'తానా లేడీస్ నైట్' | TANA Foundation hosted TANA Ladies Night 2022 Program in Michigan | Sakshi
Sakshi News home page

మహిళామణులలో ఆనందోత్సాహాలు నింపిన 'తానా లేడీస్ నైట్'

Published Sat, Oct 22 2022 11:03 PM | Last Updated on Sat, Oct 22 2022 11:03 PM

TANA Foundation hosted TANA Ladies Night 2022 Program in Michigan - Sakshi

మహిళా మణుల ఆనందోత్సాహాల నడుమ తానా లేడీస్ నైట్ ఘనంగా జరిగింది. అక్టోబర్ 21 శుక్రవారం రాత్రి అమెరికాలోని మిషిగన్‌లో ఈ మహిళా ఉత్సవం జరిగింది. మహిళలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 80 వేల డాలర్లు విరాళాలు అందించారు. ఆటపాటలతో, విందు వినోదాలతో, ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం మహిళలలో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమం తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీ సురేష్ పుట్టగుంట, మను గొంది సారధ్యంలో జరిగింది.

నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అంటారు. మహిళలను గౌరవించడం అందరి కర్తవ్యం. వారి శక్తి అసాధారణమైనది. మహిళా మణులు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. మహిళల్లో చైతన్యం కలిగించడానికి వారికి వినోదంతో పాటు వికాసం కలిగించటానికి తానా ఫౌండేషన్ ఈ లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తానా చేస్తున్న చారిటీ కార్యక్రమాలలో మహిళలు పాల్గొని సహాయం అందించాలని ఆయన అన్నారు.

తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చైర్మన్ హనుమయ్య బండ్ల మాట్లాడుతూ.. తానా మొదటి నుంచి మహిళా సేవలకు పెద్దపీట వేయడం జరిగింది. మహిళా సాధికారత దిశగా  తానా తాన వంతు కృషి చేస్తుందని అన్నారు. సురేష్ పుట్టగుంట గారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన 80,000 డాలర్లు విరాళాలు తానా అన్నపూర్ణ ప్రాజెక్టు (ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్య ఉచిత అన్నదాన కార్యక్రమం) ఒక సంవత్సరం కాలం పాటు కొనసాగించేందుకు ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. తానా ఉమెన్ కో ఆర్డినేటర్  ఉమా కటికి మాట్లాడుతూ.. సహనానికి- సాహసానికి, ఓర్పుకి- నేర్పుకి ప్రతిబింబాలు స్త్రీలు. ఇటీవల కాలంలో వారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని పోవడం అభినందనీయమన్నారు.

మను గొంది మాట్లాడుతూ.. మా ఆహ్వానం మన్నించి ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పని చేసిన వారికి ధన్యవాదాలు అన్నారు. తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కార్యక్రమం సమన్వయ కర్తగా వ్యవహరించారు. నమస్తే ఫ్లేవేర్ రెస్టారెంట్ వారు చక్కని విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి ప్రత్యేక అతిథులుగా యాంకర్ ఉదయభాను, సినీ గాయని మంగ్లీ హాజరై అలరించారు.  

ఈ కార్యక్రమం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారి ప్రోత్సాహంతో జరిగింది. తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ గోగినేని, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లక్ష్మీ దేవినేని తదితరుల  పర్యవేక్షించారు. చివరగా, రాణి అల్లూరి వందన సమర్పణ చేస్తూ.. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్లకు, స్పా న్సర్‌లకు, డోనర్లకు, ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement