womans
-
మహిళా వ్యాపారవేత్తలు ఎక్కువ ఉన్న రాష్ట్రం అదే
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు, నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడుగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఎస్‌వీఈపీ) అనే కార్యక్రమం ప్రారంభించింది.స్వయం సహాయక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీలు) ఔత్సాహికులైన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఈ ఎస్‌వీఈపీ కార్యక్రమం ప్రారంభించింది. ఔత్సాహికులైన మహిళలు దేశవ్యాప్తంగా 3,13,464 చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని.. వాటి ద్వారా వారు ఎదగడమే కాకుండా, మరికొంతమందికి ఉపాధి చూపుతున్నారు.కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకారం.. అత్యధిక ఎంటర్‌ప్రైజెస్‌తో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 3,45,69 మంది వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్ (28,904 మంది), మధ్యప్రదేశ్ (28,318 మంది), ఆంధ్రప్రదేశ్ (27,651 మంది), ఝార్ఖండ్ (25,991 మంది), బీహార్ (24,892 మంది), ఛత్తీస్‌గఢ్ (21,016 మంది) రాష్ట్రాలు ఉన్నాయి. -
యువతి ఆత్మహత్య.. ఆమెను రక్షించబోయి స్నేహితురాలి దుర్మరణం
పెనుకొండ: ఓ యువతి ఆత్మహత్యచేసుకుంటుంటే.. ఆమెను కాపాడుకునే క్రమంలో మరో యువతి దుర్మరణం పాలైంది. మృతులిద్దరూ ఒడిశాకు చెందిన యువతులు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సంధ్యారాణి మహారాజ్(24), సుల్లుబుల్లు బెహరా(28)లు స్నేహితులు. బతుకు తెరువు కోసం ఇద్దరూ బెంగళూరులోని ఓ గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. 3 రోజుల కిందట సంధ్యారాణి తండ్రి కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న సంధ్యారాణి సొంతూరికి పయనమైంది. ఆమెకు తోడుగా సుల్లుబుల్లు బెహరా కూడా బయలుదేరింది. ఆదివారం బెంగళూరు నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వీరు బయలుదేరారు. తానూ నాన్న దగ్గరికే వెళతానంటూ స్నేహితురాలితో సంధ్యారాణి చెప్పింది. పెనుకొండ రైల్వేస్టేషన్‌కు రైలు చేరగానే సంధ్యారాణి రైలు దిగేసింది. బెహరా కూడా రైలు దిగి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించింది. ఈ లోపు సంధ్యారాణి ప్లాట్ఫారం దాటి ముందుకు వెళుతుండడంతో వెనుకనే బెహరా అనుసరించింది. అటుగా వచి్చన గూడ్స్ రైలును గమనించగానే సంధ్యారాణి పట్టాల మీదికి దూకేసింది. ఆమెను పట్టుకునే క్రమంలో బెహరా సైతం అడుగు ముందుకేయడంతో.. రైలు ఇంజన్ ఢీకొట్టి బెహరా ఎగిరి పట్టాలు పక్కనే పడి ప్రాణాలు విడిచింది. రైలు కిందపడిన సంధ్యారాణి శరీరం ఛిద్రమై ప్రాణాలు కోల్పోయింది. -
నైజీరియన్ యువతులతో వ్యభిచారం...
తిరువొత్తియూరు: కోయంబేడు మార్కెట్ ఎదురుగా ఉన్న మంగమాల్ నగర్ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని స్థానిక పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ అరుల్ మణిమారన్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. నైజీరియాకు చెందిన యువతులు ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వ్యభిచారం నిర్వహిస్తున్న నైజీరియాకు చెందిన 9 మంది యువతులను పోలీసులు రక్షించారు. అద్దె ఇంట్లో ఉంటూ సెల్ ఫోన్ యాప్ ద్వారా కస్టమర్లను సంప్రదించి ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు సమాచారం. రక్షించబడిన 9 మంది నైజీరియన్ మహిళలను మైలాపూర్‌లోని ప్రభుత్వ ఆశ్రమానికి అప్పగించారు. వీరితో సంబంధం ఉన్న ముఠాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
పేలిన హెయిర్ డ్రయ్యర్.. తెగిపడిన మహిళ వేళ్లు
బాగల్కోట్: ఫోన్లు, రిఫ్రజిరేటర్లు, వాషింగ్ మెషీన్లతో పాటు ఇప్పుడు హెయిర్ డ్రయ్యర్లు కూడా పేలుతున్నాయి. కర్నాటకలోని బాగల్కోట్ జిల్లాలో హెయిర్ డ్రయర్ పేలిన ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ఈ ఘటనలో బాధితురాలు తన వేళ్లను కోల్పోయింది.స్థానికులు వెంటనే బాధితురాలిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ 2017లో జమ్ముకశ్మీర్‌లో మరణించిన మాజీ సైనికుడు పాపన్న యర్నాల్ భార్య బసవరాజేశ్వరి యర్నల్ (37)గా పోలీసులు గుర్తించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పేలుడు సంభవించిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. హెయిర్ డ్రయ్యర్ లాంటి ఉపకరణాలను ఉపయోగించడానికి, రెండు వాట్ల విద్యుత్ కనెక్షన్ అవసరం. అయితే ఆ మహిళ హెయిర్ డ్రయ్యర్కోసం వినియోగించిన స్విచ్‌కు అంత సామర్థ్యం లేదు. ఈ కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు బసవరాజేశ్వరి పక్కింట్లో ఉంటున్న శశికళ హెయిర్ డ్రయ్యర్‌ను ఆన్లైన్లో బుక్ చేశారు. అయితే ఆమె ఇంటిలో లేకపోవడంతో కొరియర్ బాయ్ ఆ హెయిర్ డ్రయ్యర్‌ను బసవరాజేశ్వరికి అప్పగించాడు. ఈ విషయాన్ని ఆమె శశికళకు తెలిపింది. ఆమె చెప్పిన మీదట ఆ హెయిర్ డ్రయ్యర్ ప్లగ్‌ను సాకెట్లో పెట్టిగానే పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం విన్న చుట్టుపక్కలవారు బసవరాజేశ్వరి ఇంటికి వచ్చి చూడగా, ఆమె అరచేతులు, వేళ్లు తెగిపడి ఉన్నాయి. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హెయిర్ డ్రయ్యర్ల తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
50 కోట్లకు చేరిన ఉచిత బస్సు ప్రయాణ మహిళల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య 50 కోట్లకు చేరింది. గృహిణులు సహా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు తదితర రంగాల్లో పని చేసే చిరుద్యోగినులు, ఐటీ కారిడార్లలో పని చేసే హౌస్‌కీపింగ్ సిబ్బంది వంటి వివిధ కేటగిరీలకు చెందిన మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకుంటున్నారు. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆరీ్టసీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీని రెట్టింపు చేశారు. ఉచిత ప్రయాణ సదుపాయం వల్ల మహిళా ప్రయాణికులకు ఇప్పటివరకు రూ.1,152 కోట్లు ఆదా అయింది. అదే సమయంలో ‘జీరో’ టికెట్ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో ఆరీ్టసీకి ఆదాయం పెరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ‘మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో 45 శాతం మహిళలు, 55 శాతం పురుషులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు. ఈ పథకం అమల్లోకి వచి్చనప్పటి నుంచి 70 శాతానికి పైగా మహిళలు, 30 శాతం పురుషులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఆక్యుపెన్సీ అదరహో.. ప్రస్తుతం గ్రేటర్‌లోని 25 డిపోల పరిధిలో సుమారు 2,500 బస్సులు ప్రతి రోజు 7.67 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. రోజుకు 21.50 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 14.70 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. 6.80 లక్షల మంది మాత్రమే మగవారు ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 65 నుంచి 70 శాతం వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా 105 శాతానికి పెరిగింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలే ఎక్కువగా ప్రయాణం చేస్తుండగా మగవారు మెట్రోడీలక్స్, ఏసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. మెట్రో పాస్‌లపై రాకపోకలు సాగించిన విద్యారి్థనులు సైతం ఉచిత పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో 1.30 లక్షల బస్సు పాస్‌ల సంఖ్య 60 వేలకు తగ్గినట్లు అధికారులు చెప్పారు. అలాగే మహిళలు, ఎన్జీఓల పాస్‌లు కూడా సుమారు లక్ష వరకు తగ్గాయి. మెట్రోపై ప్రభావం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో గ్రేటర్లో ఆటోలు, సెవెన్ సీటర్ ఆటోలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. నిర్మాణ రంగానికి చెందిన కూలీలు, చిరుద్యోగులు, శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేవారు ఆటోలను ఎక్కువగా వినియోగించేవారు. ప్రస్తుతం ఆ ప్రయాణికులంతా ఆర్టీసీ వైపు మళ్లారు. అలాగే మెట్రో ల్లోనూ ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రతిరోజూ 4.8 లక్షల మంది వరకు మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్పి ప్రవేశపెట్టిన తర్వాత కనీసం 10 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించినట్లు మెట్రో అధికారుల అంచనా. మొత్తంగా ఇతర రవాణా సదుపాయాల నుంచి సుమారు 6 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల వైపు మళ్లారు. చిరుద్యోగులకు భరోసా... వస్త్ర దుకాణాలు షాపింగ్‌మాళ్లు, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు, ఐటీ సంస్థలు తదితర ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు ఆర్థికంగా ఈ పథకం భరోసా ఇచ్చింది. ప్రతినెలా సుమారు రూ.3500 వరకు చార్జీల రూపంలో చెల్లించే మహిళలు ఇప్పుడు ఆ డబ్బులను ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ‘ఇంటి కిరాయిలు, కూరగాయల ధరలు, నిత్యావసరవ వస్తువుల ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారం తగ్గడం కొద్దిగా ఊరటే కదా’ అని అశోక్‌నగర్‌కు చెందిన సునీత అనే ప్రయాణికురాలు అభిప్రాయపడ్డారు. -
చెల్లెమ్మా.. టీ స్టాల్ ఎలా నడుస్తోంది?
ఖమ్మం: మహిళలు ఆసక్తి ఉన్న రంగంలో ఆర్థికంగా రాణించేలా ఇందిరా మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట బస్టాప్ వద్ద ఇందిరా మహిళాశక్తి సహకారంతో ఏర్పాటుచేసిన ‘స్త్రీ టీ స్టాల్’ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలితో మాట్లాడిన ఆయన ‘చెల్లెమ్మా చాయ్ సెంటర్ ఎలా నడుస్తోంది, వ్యాపారం అనుకూలంగా ఉందా’ అని ఆరా తీయడంతో పాటు టీ చేయించుకుని తాగారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, వ్యాపార అభివృద్ధికి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందా అని తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కుటుంబాల ఆర్థికాభివృది్ధకి అండగా నిలుస్తుందని, స్వయం సహాయక గ్రూపుల సభ్యులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. -
మార్చి వరకు ‘ఒకటే’ గ్యాస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలులో మెలిక!
హామీల పేరుతో ప్రజలను వంచించడంలో కూటమి సర్కారు నేతల నైజం మరోసారి బయటపడింది. వారిని నమ్మి ఓట్లేసిన మహిళల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేశారు. దీపావళి సందర్భంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఏటా మూడు ఉచిత సిలిండర్ల వాగ్దానాన్ని తుంగలో తొక్కేసింది. ఈ ఏడాది అక్టోబర్ 29 నుంచి వచ్చే మార్చి 31 వరకు తొలి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంటూ మిగిలిన రెండు ఉచిత సిలిండర్లకు ఎగనామం పెట్టింది. తద్వారా ఈ ఆరి్థక సంవత్సరంలో ఒక్క సిలిండర్‌తోనే పండగ చేసుకోమని చెబుతోంది. – సాక్షి, అమరావతిఒక్క సిలిండర్‌తో ఐదు పండుగలా! వచ్చే మార్చి వరకు విభిన్న వర్గాల పండుగల సీజన్ కనిపిస్తోంది. దీపావళి తర్వాత నవంబర్‌లో కార్తీకమాసం, డిసెంబర్లో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి, మార్చిలో ఉగాదితో పాటు రంజాన్ ఉన్నాయి. ఈ క్రమంలో ఉదారంగా పథకాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం ఒక్క సిలిండర్‌తోనే ఐదు నెలల పాటు సరిపుచ్చుతోంది. రాష్ట్రంలోసగటున ఒక్కో కుటుంబం ఏడాదికి ఐదారు సిలిండర్లు వినియోగిస్తోంది. కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క సిలిండర్ ఇచ్చి ఐదు నెలలు గడిపేయాలని చెబుతుండటం గమనార్హం.క్షీణించిన కొనుగోలు శక్తి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా పేదల సంక్షేమాన్ని పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా సాకులు చెబుతోంది. మరోవైపు బయట మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నాయి. ప్రజల జీవన విధానం అతలాకుతలమైంది. సర్వం కోల్పోయి రోడ్డుపై నిలబడ్డారు. చేసేందుకు పనులు దొరక్క.. చేతిలో చిల్లిగవ్వ లేక ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. దీన్ని పసిగట్టిన కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకాన్ని తెరపైకి తెచి్చంది. అయితే తొలి ఏడాది మూడు సిలిండర్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం వచ్చే మార్చి దాకా కేవలం ఒక్క సిలిండర్‌ను మాత్రమే ఇస్తామని ప్రకటించింది. తద్వారా మహిళలను మోసం చేస్తోంది.అసలు మెలిక ఇదా? ఉచిత గ్యాస్ సిలిండర్ పేరుతో ప్రజలు ముందుగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న గ్యాస్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆ తర్వాత 48 గంటల్లో రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో (డీబీటీ) జమ చేస్తామని చెబుతోంది. రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ షెడ్యూల్ ప్రకారం సిలిండర్ డబ్బులు ఖాతాల్లో వేస్తే లబ్ధిదారులు తమకు కావాల్సిన సమయంలో గ్యాస్ బుక్ చేసుకుంటారు. ఇలా చేస్తే ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత గ్యాస్ కింద నగదు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఏడాదికి మూడు బ్లాక్ పీరియడ్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ –జూలై, ఆగస్టు – నవంబర్, డిసెంబర్ – మార్చి బ్లాక్ పీరియడ్స్‌లో మాత్రమే గ్యాస్ బుక్ చేసుకునేలా పథకాన్ని రూపొందించింది. దీనివల్ల ఆ సమయంలో ఖాళీ సిలిండర్ లేకపోతే లబ్ధిదారుడు సిలిండర్ రాయితీని నష్టపోవాల్సి వస్తోంది. పొంతన లేని లెక్కలు.. అర్హులందరికీ ఇస్తారా? రాష్ట్రంలో 1.48 కోట్లకుపైగా రైస్ కార్డుదారులుంటే ప్రభుత్వం మాత్రం 1.47 కోట్లుగానే చెబుతోంది. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉంటే పథకానికి అర్హులుగా ప్రకటించింది. ప్రభుత్వం రూ.894 ఉన్న గ్యాస్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు చెబుతోంది. ఈ లెక్కన ఓ కుటుంబానికి ఏడాదికి రూ.2,682 విలువైన మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి. తద్వారా మొత్తం కార్డుదారులకు ఏడాదికి దాదాపు రూ.4,000 కోట్లు వెచి్చంచాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఏడాదికి రూ.2,684.75 కోట్లు బడ్జెట్ మాత్రమే చూపిస్తుండటం పథకం అమలుపై సందేహాలు రేకెత్తిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికీ ఉచిత గ్యాస్ అని హామీ ఇచి్చన చంద్రబాబు.. తీరా తెల్లరేషన్ కార్డు నిబంధన పెట్టడంతో లక్షలాది మంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. రేపు శ్రీకాకుళంలో ‘ఉచిత గ్యాస్’ ప్రారంభం⇒ హాజరుకానున్న సీఎం చంద్రబాబు ⇒ తొలి సిలిండర్ ఖర్చు రూ.894 కోట్లు విడుదలసాక్షి, అమరావతి: దీపం–2 పథకంలో భాగంగా మూడు సిలిండర్లను ఉచితంగా అందించేందుకు వీలుగా తొలి సిలిండర్‌కు అయ్యే ఖర్చు రూ.894 కోట్లను సీఎం చంద్రబాబు బుధవారం పెట్రోలియం సంస్థలకు అందజేశారు. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించేందుకు రూ.2,684 కోట్ల ఖర్చుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇక 1వ తేదీన శ్రీకాకుళంలో దీపం–2 పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.కాగా, ఈనెల 29 నుంచే ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు ముందుగా డబ్బు చెల్లించి బుక్ చేసుకోవాలని సూచించింది. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమవుతుందని ప్రకటించింది. కేంద్రం ఇచ్చే రూ.25 రాయితీ పోను మిగిలిన రూ.876లను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన ‘ఎక్స్’ ఖాతాలో తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దీపం 2.0’తో దీపావళి కాంతులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. -
సమిధలవుతున్న సమరాంగనలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల ను నిర్మూలించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ అమల్లో.. ఈ ఏడాది ఆరంభం నుంచి కేంద్రప్రభుత్వం వేగం పెంచింది. దీంతో బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్లు నిత్యకృత్యంగా మారాయి. అయితే, ఈ ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టులు ఎ క్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతోనే దళాల్లోకి.. ఆది నుంచీ విప్లవ పోరాటాలు మహిళలకు ప్రాధాన్యమిస్తూనే వచ్చాయి. సాధారణ మహిళల సమస్యలకు తోడు.. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులపై మార్క్సిస్టు పార్టీలు గళం విప్పాయి, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే విధానాన్ని నాటి నక్సలైట్లు, నేటి మావోయిస్టులు అనుసరించారు. అయితే మార్క్సిస్టు విధానం చెప్పే సామాజిక మార్పులపై ఆకర్షితులైన మహిళలు ఆరంభంలో చేతన నాట్యమంచ్ (సీఎన్ఎం), దండకారణ్య క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘాల్లోనే ఎక్కువగా ఉండేవారు. కానీ 2006లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్ సర్కారు నెలకొల్పిన సల్వాజుడుం, అందులోని కొందరు స్పెషల్ పోలీస్ అధికారులు (ఎస్పీవోలు) అడవుల్లోని ఆదివాసీ గూడేలపై దాడి చేసి గ్రామాలను తగులబెట్టడం, అక్కడ కనిపించిన మహిళలపై అకృత్యాలకు పాల్పడటం వంటివి చేశారు. దీంతో ప్రభుత్వ బలగాలపై ఆదివాసీ మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా ఆదివాసీ స్త్రీలలో దళాల్లోకి చేరాలన్న ఆసక్తి పెరగడంతో.. మావోయిస్టు సాయుధ దళాల్లో మహిళల సంఖ్య ఎక్కువైంది. 40 శాతం మహిళలు ఇరవై ఏళ్ల చరిత్ర కలిగి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల్లో ప్రస్తుతం 40 శాతం మేర మహిళలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ ప్రారంభించడానికి ముందు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వివిధ సందర్భాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 2,500 మంది సాయుధ మావోయిస్టులు ఉండగా.. ఇందులో మహిళల సంఖ్య సుమారు వెయ్యికి పైగానే ఉన్నట్టు సమాచారం. ఇందులో దక్షిణ బస్తర్ డివిజన్ ప్రాంతంలో 300కు పైగా, పశ్చిమ బస్తర్‌లో 150 మందికి పైగా, ఉత్తర బస్తర్ డివిజన్లో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులున్నట్టు సమాచారం. ఇక మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా పరిగణించే మాడ్ డివిజన్లో 350 మంది వరకు మహిళా మావోయిస్టులున్నట్టు పోలీసుల వర్గాల అంచనా. మిగిలిన మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, ఏవోబీల్లో తక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. మృతుల్లో పెరుగుతున్న మహిళలు సాధారణంగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సందర్భాల్లో.. సాయుధులైన పురుష మావోయిస్టులే ఎక్కువగా చనిపోతుంటారు. కానీ ఈ ఏడాది జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా మావోయిస్టులు భారీగా చనిపోతుండటం మానవతావాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈనెల 4న జరిగిన తుల్తులీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్ 16న కాంకేర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోతే.. అందులో 15 మంది మహిళలున్నారు. వీటితో పాటు సెప్టెంబర్ 3న బీజాపూర్/దంతెవాడల్లో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది చనిపోతే.. వారిలో ఆరుగురు మహిళలున్నారు. సెప్టెంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు నేలకొరిగిపోతే.. వారిలో ఇద్దరు మహిళలున్నారు. వెనుకబాటులో ఆదివాసీలే అధికం సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యం తదితర అనేక అంశాల్లో దేశంలో ఆదివాసీలే ఎక్కువగా వెనుకబాటుకు గురయ్యారు. అందులో ఆదివాసీ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దుర్భర పరిస్థితుల మధ్య విప్లవ బాట పట్టి దళాల్లో చేరిన మహిళలపై పారా మిలిటరీ బలగాలతో దాడులు చేయించడం, నలువైపులా చుట్టుముట్టి ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రజాస్వామికవాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ మహిళలు చనిపోతుండడాన్ని దేశ అంతర్గత భద్రత సమస్యగా కాకుండా.. సామాజిక వెనుకబాటు సమస్యగా ప్రభుత్వం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ స్త్రీలపై కర్కశంగా ఉక్కుపాదం మోపడం సరికాదంటున్నారు. ఎన్కౌంటర్లలో ఆదివాసీ స్త్రీల మరణాలు ఎక్కువగా ఉంటున్న నేప«థ్యాన.. ఆయుధం పట్టిన ఆదివాసీ మహిళల భద్రత, ప్రాణ రక్షణ, వారి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చ మొదలైంది. -
ఆర్టీసీ బస్సులో సీటు కోసం సిగపట్లు!
మహబూబాబాద్: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండడంతో బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మొదట ఓ మహిళ సీటు కోసం రుమాలు వేసింది. ఆమెకంటే ముందు ఎక్కిన మరో మహిళ ఆ సీటులో కూర్చుంది. బస్సు నర్సంపేట రూట్లో వెళ్తుండగానే ఆ తరువాత ఎక్కిన మొదటి మహిళ నా సీటులో ఎలా కూర్చుంటావంటూ ప్రశ్నించింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ తరువాత మరో మహిళ వచ్చి మా సీట్లో కూర్చున్నావంటూ అడిగింది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగి కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు వారిని ఆపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇవి చదవండి: ఇండ్లు.. రేషన్‌కార్డులకే ఎక్కువ! -
కోడళ్లకు అక్కడ 'నో రేషన్‌కార్డు'..
కరీంనగర్: రేషన్‌కార్డుల జారీ ఎటూతేలకపోవడం కోడళ్లకు శాపంగా మారింది. ఇంటిపేరు మారినా రేషన్‌కార్డులో పేరు చేరకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వేలమంది నిరీక్షిస్తుండగా అధికార యంత్రాంగం సమాధానమివ్వలేని పరిస్థితి. గత అయిదేళ్లుగా దరఖాస్తులు కుప్ప ల్లా పేరుకుపోతుండగా కార్డుల జారీ ప్రశ్నార్థకం. ఇక పేర్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుండగా కొత్తకార్డుల జారీలో మాత్రం అలసత్వమే. కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని యంత్రాంగం చెబుతుండగా నిరీక్షణ ఇంకెన్నాళ్లన్న అసహనం వ్యక్తమవుతోంది. ‘నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన కత్తురోజు రమేశ్‌కు ఏడాది క్రితం వివాహమైంది. హుజూరాబాద్ నుంచి అఖిలను పెళ్లి చేసుకోగా ఆమెపేరును తల్లిగారింట తొలగించారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇది ఒక అఖిల పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్న కోడళ్లది.' దరఖాస్తు చేసి ఏళ్లు.. మంజూరుకు ఎన్నేళ్లు కొత్తకార్డుకు దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తుండగా స్పష్టమైన ప్రకటన లేదని వాపోతున్నారు. తనకు అయిదేళ్ల క్రితం వివాహమైందని, పిల్లలు పుట్టారని అయినా కార్డు మంజూరు కాలేదని చొప్పదండికి చెందిన రాజు వివరించారు. జిల్లాలో 512 రేషన్‌దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా 2.70లక్షల కార్డుదారులున్నారు. పెళ్లికాగానే తమ పేరును తొలగించాలని కొందరు యువతులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వారి పేరు మీద ఉన్న యూనిట్‌ను అధికారులు తొలగిస్తున్నారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చే ఆప్షన్ లేకపోవడంతో కొందరు తొలగింపునకు ఒప్పుకోవడం లేదు. సదరు కార్డులు అలాగే కొనసాగుతుండగా పలు గ్రామాల్లో పేర్లు తొలగించాలని తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేసి తొలగిస్తున్నారు. ఈ మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా అత్తింటి కార్డులో ఒక్కపేరు చేర్చలేదని తెలుస్తోంది. ఒక్కో కార్డుకు రూ.25 వసూలు రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రేషన్‌కార్డులు పంపిణీ చేయలేదు. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొత్త కార్డులు ముద్రించగా జిల్లాల విభజనతో సదరు కార్డులను మూలనపడేశారు. దీంతో డీలర్లే కార్డులు ముద్రించి లబ్ధిదారుల పేర్లు రాసిస్తున్నారు. ఒక్కోకార్డుకు రూ.25వరకు వసూలు చేస్తున్నారు. కొత్తకార్డులు, పేర్లు చేర్పించేందుకు మీసేవ కేంద్రాల్లో వేలల్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అధికారులు విచారణచేసి అర్హులకు అనుమతిచ్చి కమిషనరేట్ లాగిన్‌కు పంపించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడక మూడేళ్ల నుంచి ముందుకు సాగడం లేదు. అయితే కొత్తకార్డుల జారీపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవని, కోడళ్లు తమ పేరును అత్తారింటి కార్డులో చేర్చేందుకు మీసేవలో నమోదు చేసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఇవి చదవండి: ఇకపై ఈ ప్రాంతాలకు 'ఆర్ ఆర్ ఆర్' (RRR) -
ఆ మూడు రాష్ట్రాల్లో సీఎం లేదా డిప్యూటీ సీఎంలుగా మహిళలు?
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి సహకారమందించిన మహిళలకు బీజేపీ మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోందని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలతో జరిగిన సమావేశంలో ఈ మూడు రాష్ట్రాల్లో మహిళలకు సీఎం లేదా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించారు. మూడు రాష్ట్రాల్లోనూ కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కరు చొప్పున డిప్యూటీ సీఎం పదవులు మహిళలకు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు మరింతగా రాజకీయ సాధికారత కల్పించేందుకు పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. మూడు రాష్ట్రాల్లోనూ డిప్యూటీ సీఎంలుగా మహిళలను నియమించడం ఖాయమని పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ జనాభా పరంగా పెద్ద రాష్ట్రం కావడం, పలువురు సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో గెలుపొందిన కారణంగా ఇక్కడ ఇద్దరు మహిళలను డిప్యూటీ సీఎంలుగా నియమించే అవకాశం ఉందంటున్నారు. ఇంతేకాకుండా ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్పీకర్లుగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో ఓబీసీ, ఛత్తీస్‌గఢ్‌లో ఎస్టీ, రాజస్థాన్‌లో రాజకుటుంబానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి దక్కడం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్ స్పీకర్‌గా నరేంద్ర సింగ్ తోమర్‌ను, రాజస్థాన్‌లో కిరోరీ లాల్ మీనాను స్పీకర్‌గా ఎంపిక చేయాలనే అంశంపై చర్చ సాగుతోంది. ఇది కూడా చదవండి: సీఎం ఎంపికపై మల్లగుల్లాలు.. ఢిల్లీకి వసుంధర రాజే! -
బుల్లెట్ ఎక్కాలే తల్వార్ తిప్పాలే
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక మహిళ గాల్లో తల్వార్ ఊపుతూ బుల్లెట్‌పై వీరవిహారం చేసింది. మరో మహిళ టాప్‌లెస్ జీప్‌ను ఒంటి చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేతితో తల్వార్‌ను గాలిలో ఝుళిపించింది. ఒక మహిళ స్కూటీ డ్రైవ్ చేస్తుంటే మరొక మహిళ వెనుక సీటులో నిల్చొని గాల్లో తల్వార్‌తో విన్యాసాలు చేసింది. ఆ రాత్రి దుర్గామాత మండపం సమీపంలో మహిళలు చేసిన రకరకాల స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు ‘ఆహా ఓహో’ అని అబ్బురపడితే మరికొందరు ‘ఇలాంటి సాహసాలు తగవు’ అని ఖండించారు. -
మహిళల ఉచిత ప్రయాణంలో మార్పులు...
కర్ణాటక: ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణాల పథకంలో స్వల్ప మార్పు చేస్తామని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. సోమవారం విధానసౌధలో మాట్లాడుతూ... 15 రోజులు పాటు చూసి ఆ తరువాత అవసరమైన మార్పులు చేస్తామన్నారు. ఈనెల 11న 5 లక్షల 70 వేల మంది బస్సుల్లో ప్రయాణించారు. ఇప్పటికే మూడు కోట్ల మంది మహిళలు ప్రయాణాలు చేశారు. అయితే ఒకేసారి ఇంతమంది వెళ్లరాదని కోరారు. పుణ్యక్షేత్రాలకు అంటూ పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, దీని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వారంలో రూ. 70 కోట్ల విలువ చేసే ఉచిత ప్రయాణాలపై స్పందించిన ఆయన ప్రారంభంలో కాబట్టి రద్దీ ఉంటుందని, రోజు వెళ్లరని అన్నారు. ప్రైవేట్ బస్సులకు నష్టం జరుగుతున్న విషయంపై మాట్లాడిన ఆయన, ప్రైవేట్ బస్సువారు కూడా ట్యాక్స్ చెల్లిస్తున్నారు. వారి జీవితము గడవాలి. ప్రస్తుతం ఉత్సాహంలో మహిళలు ప్రయాణం చేస్తు న్నారు. ముందు రోజుల్లో మహిళల సంఖ్య తగ్గుతుందోమో చూడాలని అన్నారు. -
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... అయితే, కొన్ని షరతులు
బనశంకరి: కాంగ్రెస్ సర్కారు ఐదు హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (శక్తి యోజన)కు సర్కారు ఆమోదం తెలిపింది. నాలుగు రవాణా సంస్థలైన కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ, వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ, కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణాసంస్థల బస్సుల్లో (ఏసీ, స్లీపర్ బస్సులు కాకుండా) ప్రయాణానికి సోమవారం అనుమతించింది. విద్యార్థినులు, హిజ్రాలకు కూడా వర్తిస్తుంది. ఈ నెల 11 నుంచి ఉచిత ప్రయాణం అమలులోకి వస్తుంది. శక్తి యోజన పథకంలో కొన్ని షరతులు ► రాష్ట్రంలో ప్రయాణానికి మాత్రమే శక్తి యోజన పథకం వర్తిస్తుంది ► విలాసవంతమైన లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు ► అన్ని బస్సుల్లో సగం సీట్లు పురుషులకు కేటాయించారు. అంటే సగం సీట్లలోనే మహిళలు ప్రయాణించాలి. సీట్లు అందుబాటులో లేకపోతే మరో బస్సును వెతుక్కోవాలి ► శక్తి స్మార్ట్స్ కార్డులను మహిళలకు ప్రభుత్వం జారీచేస్తుంది. మహిళలు సేవా సింధు కేంద్రాల్లో దరఖాస్తులు ఇచ్చి కార్డులను పొందవచ్చు. 3 నెలల్లో కార్డుల జారీని పూర్తి చేయాలి. ప్రయాణ సమయంలో ఆ కార్డులను చూపాలి. -
మహిళామణులలో ఆనందోత్సాహాలు నింపిన 'తానా లేడీస్ నైట్'
మహిళా మణుల ఆనందోత్సాహాల నడుమ తానా లేడీస్ నైట్ ఘనంగా జరిగింది. అక్టోబర్ 21 శుక్రవారం రాత్రి అమెరికాలోని మిషిగన్‌లో ఈ మహిళా ఉత్సవం జరిగింది. మహిళలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 80 వేల డాలర్లు విరాళాలు అందించారు. ఆటపాటలతో, విందు వినోదాలతో, ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం మహిళలలో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమం తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీ సురేష్ పుట్టగుంట, మను గొంది సారధ్యంలో జరిగింది. నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అంటారు. మహిళలను గౌరవించడం అందరి కర్తవ్యం. వారి శక్తి అసాధారణమైనది. మహిళా మణులు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. మహిళల్లో చైతన్యం కలిగించడానికి వారికి వినోదంతో పాటు వికాసం కలిగించటానికి తానా ఫౌండేషన్ ఈ లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తానా చేస్తున్న చారిటీ కార్యక్రమాలలో మహిళలు పాల్గొని సహాయం అందించాలని ఆయన అన్నారు. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చైర్మన్ హనుమయ్య బండ్ల మాట్లాడుతూ.. తానా మొదటి నుంచి మహిళా సేవలకు పెద్దపీట వేయడం జరిగింది. మహిళా సాధికారత దిశగా తానా తాన వంతు కృషి చేస్తుందని అన్నారు. సురేష్ పుట్టగుంట గారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన 80,000 డాలర్లు విరాళాలు తానా అన్నపూర్ణ ప్రాజెక్టు (ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్య ఉచిత అన్నదాన కార్యక్రమం) ఒక సంవత్సరం కాలం పాటు కొనసాగించేందుకు ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. తానా ఉమెన్ కో ఆర్డినేటర్ ఉమా కటికి మాట్లాడుతూ.. సహనానికి- సాహసానికి, ఓర్పుకి- నేర్పుకి ప్రతిబింబాలు స్త్రీలు. ఇటీవల కాలంలో వారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని పోవడం అభినందనీయమన్నారు. మను గొంది మాట్లాడుతూ.. మా ఆహ్వానం మన్నించి ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పని చేసిన వారికి ధన్యవాదాలు అన్నారు. తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కార్యక్రమం సమన్వయ కర్తగా వ్యవహరించారు. నమస్తే ఫ్లేవేర్ రెస్టారెంట్ వారు చక్కని విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి ప్రత్యేక అతిథులుగా యాంకర్ ఉదయభాను, సినీ గాయని మంగ్లీ హాజరై అలరించారు. ఈ కార్యక్రమం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారి ప్రోత్సాహంతో జరిగింది. తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ గోగినేని, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లక్ష్మీ దేవినేని తదితరుల పర్యవేక్షించారు. చివరగా, రాణి అల్లూరి వందన సమర్పణ చేస్తూ.. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్లకు, స్పా న్సర్లకు, డోనర్లకు, ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. -
కోవర్టులు కంట్రోల్లో ఉండకపోతే ఇక నేను ఊరుకోను: దివ్యవాణి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై దివ్యవాణి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని అన్నారు. ఈ మేరకు దివ్యవాణి మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. టీడీ జనార్దన్ కోవర్టులు కంట్రోల్లో ఉండకపోతే ఇక నేను ఊరుకోను. అనిత, గ్రీష్మ నాపై మాట్లాడేముందు ఆలోచించుకోండి. అనవసరంగా మాట్లాడటం తగదు. పట్టాభి విమర్శలు చేసే ముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో. వల్లభనేని వంశీ గతంలో ఎందుకు బాధ పడ్డారో నాకు ఇప్పుడు తెలుస్తోంది. టీడీపీలో కొందరు మహిళలను ట్రోల్ చెయ్యడమే పనిగా ఉన్నారని' దివ్యవాణి మండిపడ్డారు. చదవండి: (కిడాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రిన్‌లను అభినందించిన సీఎం జగన్) -
Work From Home: అమ్మాయిలూ.. అవకాశాలివిగో!
మహమ్మారి పుణ్యమాని మహిళలను కొత్త అవకాశాలు ఊరిస్తున్నాయి. పెట్టుబడి లేకుండా ఇంటి పట్టున ఉంటూనే సంపాదించే మార్గాలూ పుట్టుకొచ్చాయి. విదేశీ గడ్డపైనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు.. అదే విదేశీ సంస్థకు ఇంటి నుంచే పని చేసే పరిస్థితులొచ్చాయి. కావాల్సిందల్లా నైపుణ్యం పెంచుకుని, అవకాశాన్ని అందిపుచ్చువడమే. మార్కెట్‌కు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకున్న మహిళల కోసం కంపెనీలు క్యూ కడు తున్నాయి. అడిగినంత వేతనం.. ఇచ్చేందుకూ దిగ్గజ సంస్థలు వెనుకాడడం లేదు. వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నిపుణుల అభిప్రాయాలతో సాక్షి బిజినెస్ బ్యూరో ప్రత్యేక కథనం.. వ్యాపారం ఆకర్షణీయం.. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసే రోజులు పోయాయి. మహిళలకు వ్యాపారం అనుకూల, ఆకర్షణీయ కెరీర్‌గా మారిపోయింది. వ్యాపారంలో వైఫల్యాలనూ అంగీకరిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో చిన్నగా ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎదగొచ్చు అని నిరూపిస్తున్నారు. డబ్బులు సంపాదించడమేగాక వందలాది మందికి ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తున్నారు. బిజినెస్‌లోకి రావాలంటే డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. అంకిత భావం, సరైన మార్గదర్శి ఉండాలి. వ్యాపారం పేరుతో గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా అవసరం మేరకే లోన్ తీసుకుంటున్నారు. దీంతో బ్యాంకులూ రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. –దీప్తి రావుల, సీఈవో, వీ–హబ్ ప్రత్యేక నైపుణ్యంతో.. కోవిడ్ రాకతో ఆటోమేషన్, డిజిటల్ పరివర్తన దిశగా కంపెనీలు సాగుతున్నాయి. ఇదే మహిళలకు కొత్త అవకాశాలను అందిస్తోంది. విదేశాలకు వెళ్లకుండానే ఎంఎన్సీల్లో జాబ్ సంపాదించి ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యం ఉన్న మహిళల కోసం కంపెనీలు ప్రపంచం నలుమూలలా వెతుకుతున్నాయి. ఐటీతోపాటు ఫార్మా, బయాలాజిక్స్లోనూ ఇదే పరిస్థితి. అన్ని రంగాల్లోనూ కంపెనీలు సామర్థ్యం పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒక రోల్లో కొరత ఉందంటే చాలు అభ్యర్థులకు కాసులు కురిపిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో రూ.5 లక్షల వేతనం ఉంటే.. కొత్త సంస్థ రూ.50 లక్షలు చెల్లించేందుకూ వెనుకాడడం లేదు. అమ్మాయిలకు స్థిరత్వం, నిబద్ధత ఉంటుందన్న భావన కంపెనీల్లో పెరిగింది. వీరికి అత్యంత కీలక విభాగాలనూ అప్పగిస్తున్నారు. – జయశ్రీ పవని, హెడ్, స్ట్రాటజిక్ రిక్రూట్మెంట్, స్ట్రయిక్ ఇట్–రైట్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ పెట్టుబడి లేకుండానే.. టెక్నాలజీని ఊతంగా చేసుకుని ఉపాధికి కొత్త మార్గాలను వెతుక్కుని మహిళలు సక్సెస్ అవుతున్నారు. పెట్టుబడి లేకుండానే ఇంటి నుంచే సంపాదిస్తున్నారు. వ్యాపారం చేయాలన్న తపన పల్లెల్లోని మహిళలకూ విస్తరించింది. సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటే అంతలా ఆదాయం గడిస్తున్నారు. రాష్ట్రాలే కాదు విదేశీ గడ్డపైనా వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్స్, యూట్యూబ్ బ్లాగ్స్, ట్యూషన్స్, డ్యాన్స్, మ్యూజిక్, న్యాయ సలహాలు, క్రాఫ్టŠస్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మోటివేషనల్ క్లాసెస్ వంటివి ఉపాధిగా ఎంచుకుంటున్నారు. బ్యూటీ, ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా, ఫిట్నెస్ శిక్షకులుగా కెరీర్ మలుచుకుంటున్నారు. ఇంటి వంటకాలను స్విగ్గీ, జొమాటో ద్వారా విక్రయిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదనపై దృష్టిపెడుతున్నారు. – లత చౌదరి బొట్ల, ఫౌండర్, నారీసేన. ఉద్యోగం మానేసినా.. అప్లికేషన్, ప్రాజెక్ట్ రూపకల్పన, అమలుకు ఐటీ కంపెనీలు విభిన్న సాంకేతికలను (టెక్ స్టాక్) ఉపయోగిస్తాయి. అభ్యర్థిలో టెక్నికల్ స్కిల్స్ ఏ మేరకు ఉన్నాయన్నదే ప్రధానం. కమ్యూనికేషన్ స్కిల్స్ అదనపు అర్హత మాత్రమే. కొత్త కోర్సులను నేర్చుకుని నూతన వర్షన్స్‌కు తగ్గట్టుగా అభ్యర్థులు అప్‌గ్రేడ్ అవ్వాలి. ఇలాంటి ఉద్యోగులకు ఒక్కొక్కరి చేతుల్లో మూడుకుపైగా ఆఫర్ లెటర్లు ఉంటున్నాయి. ఎక్కడ అధిక వేతనం ఆఫర్ చేస్తే అక్కడే చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులు చేజారకుండా ప్రమోషన్‌తో వేతనం పెంచుతున్నాయి. మధ్యలో ఉద్యోగం మానేసినా నైపుణ్యం ఉన్న అభ్యర్థులను మళ్లీ చేర్చుకుంటున్నాయి. – రేచల్ స్టెల్లా రాజ్, టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ -
నీ కుక్కను సరిగ్గా ట్రైన్ చేసుకో.. నా కుక్కనే అంటావా!
బెర్లిన్: సాధారణంగా కొందరు శునకాలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటిని ఎవరు ఏమన్నా.. ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తాజాగా, ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. జర్మనీలోని తురింజియా పట్టణంలో 27 ఏళ్ల మహిళ, 51 ఏళ్ల మరో మహిళ తమ పెంపుడు కుక్కలను తీసుకుని స్థానికంగా ఉన్న పార్కులో వాకింగ్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఒక శునకం.. మరో శునకాన్ని చూస్తు అరుస్తూ దాడికి తెగబడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 51 ఏళ్ల మహిళ.. మరో మహిళపై వాగ్వాదానికి దిగింది. శునకాన్ని సరిగ్గా ట్రైన్ చేసుకోవాలని చెప్పింది. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ పెరిగి.. ఒకరిపై మరొకరు దాడిచేసుకోవడం వరకు వెళ్లింది. ఒకరిని మరోకరు కొరుక్కుంటూ గాయపర్చుకున్నారు. పాపం.. మహిళలిద్దరు కొట్టుకోవడాన్ని వారి శునకాలు చూస్తూ ఉండిపోయాయి. ఆ ప్రదేశంలో ఉన్న స్థానికులు వారి గొడవను ఆపటానికి సాహసించలేదు. ఈ సంఘటన తర్వాత ఇరువురు స్థానిక పోలీసుస్టేషన్ వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ కన్నా.. శునకాలే నయం..’, ‘వామ్మో.. ఇలా కరుచుకున్నారేంటీ..’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్టు
సాక్షి, మల్లాపూర్ (హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాచారం సావర్కర్‌నగర్ అపార్టుమెంట్‌లోని ఓ ఇంట్లో మగ్దూం అలీఖాన్ (44), మల్లికార్జున్ (55) ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ, నాచారం పోలీసులు సోమవారం ఇంటిపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఓ విటుడిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! ఏసీ ఓల్టేజీ కన్వర్టర్‌లో బంగారం స్మగ్లింగ్ శంషాబాద్: అక్రమంగా తరలించిన బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎఫ్‌జెడ్–439 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న ఏసీ వోల్టేజీ కన్వర్టర్‌ను పరిశీలించగా అందులో 316 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.15.71 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లిళ్ల జవాన్ బాగోతం.. ఇద్దరు భార్యలు ఫిర్యాదు చేయడంతో..
సాక్షి, హుబ్లీ (కర్ణాటక): దేశ రక్షణకు పాటుపడాల్సిన ఓ జవాన్ అమాయక యువతులను మోసం చేయడం పనిగా పెట్టుకున్నాడు. హుబ్లీ చెందిన ఈ సైనికుడు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇతని వంచనపై మొదటి, రెండవ భార్యలు హుబ్లీ పోలీసులను ఆశ్రయించారు. హుబ్లీ తాలూకా నెలవడి గ్రామవాసి గురుసిద్దప్ప సిరోళ పంజాబ్‌లో బీఎస్ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు 2015లో ఇతనికి గదగ్ జిల్లాకు చెందిన రేఖ అనే యువతితో పెళ్లి చేశారు. వీరికి ఓ కుమారుడు పుట్టాడు. ఈ ఘనుడు తరచూ భార్యను వేధిస్తుండడంతో విసిగిన ఆమె బిడ్డతో పుట్టింటికి చేరుకుంది. ఇదే అవకాశంగా గురుసిద్దప్ప పెళ్లి సంబంధాల వెబ్సైట్లో మంజుళ అనే ఆమెను పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుని మరోచోట కాపురం పెట్టాడు. ఆ తర్వాత సుధా అనే యువతిని వలలో వేసుకుని ఆమెకూ మూడుముళ్లు వేశాడు. ఇతని లీలలు తెలియడంతో మొదటి, రెండవ భార్యలు న్యాయం చేయాలని విద్యానగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమలాగ ఎవరూ మోసపోరాదని తెలిపారు. -
Afghanistan: అఫ్గాన్‌లో మహిళలు చదువుకోవచ్చు..కానీ
సాక్షి, కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని విశ్వవిద్యాలయాల్లో మహిళలు పోస్టు గ్రాడ్యుయేట్ వరకు చదువు కొనసాగించవచ్చునని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. అయితే, తరగతి గదుల్లో పురుషులకు, మహిళలకు వేరుగా ఏర్పాట్లుండాలనీ, విద్యార్థినులకు ఇస్లామ్ సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరని స్పష్టం చేసింది. తాలిబన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం అనుసరించిన విధానాలనే మళ్లీ తాము అమలు చేయాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బాలబాలికలు కలిసి చదువు కొనసాగించేందు(కో ఎడ్యుకేషన్)కు అనుమతించబోమన్నారు. బాలికలు హిజాబ్ ధరించడం తప్పనిసరని తెలిపారు. వ్సటీల్లో బోధించే సబ్జెక్టులపై సమీక్ష చేపడతామన్నారు. చదవండి: అఫ్గాన్: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు -
కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం
మార్కాపురం: ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన ఐదు రోజుల శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు 10 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు. మార్కాపురం సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఆమె కేసు వివరాలను తెలిపారు. గుంటూరు జిల్లా్లకి చెందిన ఏ. శ్రీరాములుకు ప్రకాశం జిల్లాకి చెందిన కోమలితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కోమలి మార్కాపురం జిల్లా వైద్యశాలలో ఈ నెల 24న పాపకు జన్మనిచ్చింది. పాపకు కామెర్లు రావటంతో చికిత్స చేయిస్తుండగా 28న గుర్తు తెలియని మహిళ వైద్యశాల నుంచి శిశువును కిడ్నాప్ చేసింది. శిశువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్ఐ కోటయ్య తన సిబ్బందితో కలిసి కంభం రోడ్డులో ఉన్న ఓ చిన్నపిల్లల వైద్యశాలకు వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ ఓ మహిళ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించారు. తన పేరు దూదేకుల రేహానా అని, కంభం అర్బన్ కాలనీలో నివాసం ఉంటున్నానని తానే శిశువును దొంగిలించినట్లు మహిళ తెలిపింది. తనకు దూరపు బంధువులైన కంభంలో నివాసం ఉండే హలీమా బేగం, రహమతున్నీసా బేగంలకు శిశువును విక్రయించేందుకు రూ.50 వేలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. నిందితులైన రెహనా, హలీమా బేగం, రహంతున్నిసా బేగంలను అరెస్టు చేసి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. -
హైవేపై కిలేడీ గ్యాంగ్.. సామాజిక సేవ పేరుతో..
సాక్షి, ఖిలా వరంగల్: ఏడుగురు సభ్యులతో కూడిన ఓ మహిళా ముఠా హైవేలపై తిష్ట వేసి వాహనదారులను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. జీన్స్ పాయింట్, టీషర్ట్ ధరించి ఉన్నారని వాహనం ఆపితే అంతే సంగతులు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవ పేరుతో వాహనాలను నిలిపి చందాలు వసూళ్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మంగళవారం మధ్యాహ్నం వరంగల్– ఖమ్మం జాతీయ రహదారిపై బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద జరగగా బుధవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరంతా రాజస్తాన్‌కు చెందిన మహిళలుగా అనుమానిస్తుండగా, మూఠాగా ఏర్పడి వచ్చి వెళ్లే వాహనదారులను చందాల పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారు. వీరిని గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గట్టిగా నిలదీయడంతోపాటు సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా ఆటోలో పరారయ్యారు. ఏడుగురు జీన్స్ పాయింట్, టీషర్ట్స్ ధరించి ఉన్నారని, సడన్‌గా వాహనం ఆపి సామాజిక సేవ పేరుతో డబ్బులు అడిగారని పలువురు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి మామునూరు పోలీసులు చేరుకుని వివరాలను సేకరించి గాలిస్తున్నట్లు తెలిసింది. -
37% మహిళల వద్ద బంగారం లేదు
ముంబై: వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. మన దేశంలోని 37 శాతం మంది ఇంత వరకు బంగారం ఆభరణాలను కొనుగోలు చేయలేదట. ప్రపంచ స్వర్ణ మండలి సంస్థ (డబ్ల్యూజీసీ) ఒక సర్వే చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించింది. కాకపోతే భవిష్యత్తులో బంగారం ఆభరణాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టు వారు చెప్పారు. ‘‘37 శాతం మంది మహిళలు కొనుగోలు సామర్థ్యంతో ఉన్నారు. బంగారం ఆభరణాల పరిశ్రమకు వారు కొత్త వినియోగదారులు కానున్నారు. వీరిలో 44 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 30 శాతం మంది పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు’’ అని డబ్ల్యూజీసీ భారత ఆభరణాల పరిశ్రమపై విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మన దేశ మహిళలకు బంగారం ఆభరణాలు మొదటి ప్రాధాన్యమన్న విషయం తెలిసిందే. బంగారం మన్నిౖMðనదే కాకుండా, చక్కని పెట్టుబడి సాధనమని, కుటుంబ వారసత్వ సంపదంటూ.. మహిళలకు ఇది చక్కని ఎంపిక అని ఈ సర్వే పేర్కొంది. అయితే, నేటి యువ మహిళల అవసరాలను పసిడి తీర్చలేకపోతుందని తెలిపింది. ఇక 18–24 ఏళ్ల వయసున్న భారతీయ మహిళలలో 33 శాతం మం ది గడిచిన ఏడాది కాలంలో బంగారం ఆభరణాలను కొనుగోలు చేసినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. -
4వ తేదీ నుంచి జన్‌ధన్ ఖాతాల్లో నగదు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ మహిళా ఖాతాదారులకు రెండో విడత ఆర్థిక సాయం రూ. 500 ఈనెల 4వ తేదీ నుంచి విడుదల చేయనుంది. నిర్దేశించిన తేదీల్లో నగదు వారి ఖాతాల్లో జమ కానున్నట్లు ఎస్ఎల్బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి) శనివారం ప్రకటించింది. ఖాతా నంబరు చివరి అంకె ఆధారంగా షెడ్యూల్ ఇచ్చామని, లబ్ధిదారులు ఆయా తేదీ ల్లో సంబంధిత బ్యాంకులు, ఏటీఎం, బ్యాంకు మిత్ర, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చే రూ.1,500 ఆర్థిక సాయం కూడా వారి ఖాతాల్లో ఈనెల 2వ తేదీ నుంచి జమ కానున్నాయి. ఈ నిధులను కూడా నిర్దేశించిన షెడ్యూల్ ఆధారంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ నగదు ఉపసంహరణ చేసుకోవాలని ఎస్ఎల్బీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 12వ తేదీ తర్వాత సీరియల్ నంబర్‌తో సంబంధం లేకుండా అందరూ విత్‌డ్రా చేసుకోవచ్చని, జన్‌ధన్ అకౌంట్ లేదా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఒకసారి జమ అయిన నిధులను ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకోదని స్పష్టం చేసింది. చదవండి: వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు -
డీసీసీబీ: అతివకేదీ సహకారం..?
సాక్షి, అచ్చంపేట: ఆకాశంలో సగం.. అంతటా మేం.. అంటూ అన్నిరంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్నిరకాల ఎన్నికల్లో కాస్తో.. కూస్తో ప్రాధాన్యం లభిస్తోంది. కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో మాత్రం అతివలకు ప్రాతినిథ్యం లేకుండా పోతోంది. సంఘాల్లో డైరెక్టర్ల పదవులు మహిళలకు కేటాయిస్తున్నా.. కీలకమైన సొసైటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు మాత్రం అందని ద్రాక్షగానే మారాయి. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 87 సంఘాల్లో ఇద్దరు మాత్రమే పీఏసీఎస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఇక్కడప్రాధాన్యం కరువు ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పంచాయతీలు, ప్రాదేశిక ఎన్నికల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులతోపాటు ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవుల్లో సైతం సగం కేటాయించింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కూడా రొటేషన్ పద్ధతిలో మహిళలకు, ఇతర వర్గాలకు అవకాశాలు కలి్పంచింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం మారుతున్న విధానాలకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకువచ్చి ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇక్కడ మాత్రం 1964లో ఏర్పాటైన సహకార చట్టం ఆధారంగానే రిజర్వేషన్లు, ఇతర మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ప్రతి సంఘంలో 13 వార్డులుండగా ఇందులో రెండు మాత్రమే మహిళలకు రిజర్వు చేశారు. అంటే 15 శాతానికి మాత్రమే పరిమితమైంది. ఉన్న ఒకస్థానం తొలగించారు డీసీసీబీలో ‘ఎ’ కేటగిరి సంఘాల నుంచి 16 మంది, ‘బి’ కేటగిరి సంఘాల నుంచి నలుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. గతంలో మొత్తం 21 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా ఈసారి ఒక డైరెక్టర్‌ను తగ్గించారు. గత ఎన్నికల్లో ఎస్సీ (మహిళ)కు ఒక డైరెక్టర్ స్థానం రిజర్వు చేయగా.. ఈసారి దాన్ని తొలగించారు. సభ్యత్వంలోనూ చిన్నచూపే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది మహిళలకు పట్టా భూములున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలోనైతే ఏకంగా మహిళలే ధాన్యం కొనుగోలు చేసి తమ సత్తా చాటుతున్నారు. వ్యవసాయంలోనూ కీలకంగా ఉన్న వీరిని కనీసం సభ్యత్వం విషయంలో పట్టించుకోవడం లేదు. సాధారణ ఓటర్ల విషయానికి వస్తే పలుచోట్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండి ఎన్నికల్లో గెలుపోటములు వారి చేతిలోనే ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఆయా సంఘాల్లో కనీసం పదిశాతం కూడా దాటడం లేదు. దీంతో వీరి ప్రభావం కనిపించడం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 67,149 మంది పురుఘలు, 24,272 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన సంఘాల చైర్మన్లు ఎన్నుకోలేదు. మేకగూడ పీఏసీఎస్ నుంచి కంకటి మంజులారెడ్డి, ధరూర్ నుంచి కుర్వ మహదేవమ్మ ఇద్దరు మాత్రమే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కొంత వరకు నయంగా ఉండేది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో నలుగురు మహిళా చైర్మన్లు ఎన్నికయ్యారు. స్థానం కల్పించలే.. వార్డు సభ్యులంతా కలిసి సహకార సంఘం చైర్మన్‌ని ఎన్నుకుంటారు. చైర్మన్ స్థానాలకు ఎలాంటి రిజర్వేషన్ లేకపోవడం.. మహిళలు పోను మిగిలిన 11 మంది దాదాపు పురుషులే ఉండటంతో చైర్మన్‌గా ఆమెకు అవకాశం రావడం లేదు. జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్)లలో సొసైటీ చైర్మన్లు సభ్యులు కావడంతో ఇందులో ఒక్క మహిళకు అవకాశం దక్కడం లేదు. ఇందులో కూడా డైరెక్టర్లకు రిజర్వేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ మహిళలకు స్థానం కల్పించలేదు. సభ్యులో ఒకరు చైర్మన్, వైస్ చైర్మన్‌గా ఎన్నుకోనుండటంతో ఇక్కడ కూడా వీరికి ప్రాధాన్యం ఉండటం లేదు. -
అత్యాచార సంస్కృతి అంతం ఎలా?
బాధితులపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేస్తున్న ఘటనలకు కారణం వ్యక్తులు తమ స్వీయ నియంత్రణను కోల్పోవడం ఎంతమాత్రం కాదు. అమ్మాయిలను అవమానించడం అంతకంటే కాదు. నిజానికి ఇవి మన సమాజంలోని పలు దొంతరలను సాంస్కృతికంగా హింసిస్తున్నదానికి వ్యక్తీకరణలు మాత్రమే. కుటుంబం పాఠశాల, మత సంస్థలు, మార్కెట్ స్థలాలు అన్నీ కలిసి స్త్రీ, పురుషులు సమానులు అనే భావాన్ని పాటిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి సాంస్కృతిక విధానాలను పాటించాలి.. స్త్రీల ఆత్మాభిమానాన్ని, శ్రమగౌరవాన్ని పెంచేటటువంటి సిలబస్‌ను రూపొందించాలి. మహిళల శ్రమ, వారి సృజనాత్మకతే జాతి పురోగమనానికి, అభివృద్ధికి కీలకం అని మన పిల్లలకు పాఠశాలల్లో బోధించనట్లయితే, భవిష్యత్తులో కూడా అత్యాచారాలు, వేధింపుల వంటి ఉపద్రవాలు మనల్ని పీడిస్తూనే ఉంటాయి. వ్యక్తులు తమ సంతృప్తిని తీర్చుకోవడానికి లేక అణచివేతను ఆయుధంగా ప్రయోగించడానికి ఉపయోగపడుతున్న అత్యాచారాల సంస్కృతి ప్రజల నైతిక ప్రమాణాలను చంపేస్తోంది. నవంబర్ 27న హైదరాబాద్, శంషాబాద్ సమీపంలో దిశపై జరిగిన పాశవిక సామూహిక అత్యాచారం ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను మళ్లీ తలపింపజేసింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయను పాశవికంగా హత్యచేయగా, హైదరాబాద్‌లో దిశపై సామూహిక అత్యాచారం జరిపిన తర్వాత ఆమెను దాదాపు సజీవంగానే తగులబెట్టి చంపేశారు. ఈ రెండు ఘటనలపై యావద్దేశం తీవ్రంగా నిరసించింది. కానీ దేశం లోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దిశ కేసులో మాత్రమే రేపిస్టులను కాల్చిచంపారు. నిర్భయ హంతకులు మాత్రం తమపై మరణశిక్ష అమలు కోసం వేచి ఉంటున్నారు. అయితే ఇలాంటి సామూహిక అత్యాచార ఘటనలు ఎన్నో జరుగుతున్నా మీడియా దృష్టికి అవి రావడం లేదు. ప్రతిరోజూ దేశంలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచార వార్తలు ప్రజల సున్నితత్వాన్ని చంపేస్తున్నాయి. అత్యాచారం అనేది మరొక చెడువార్త.. దాన్ని వదిలేయండి అని భావిస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. టీచర్లు తమ సొంత విద్యార్థులను పాఠశాలల్లోనే అత్యాచారం చేస్తున్నారు. మత బోధకులు తమ అనుయాయులనే అత్యాచారం చేస్తున్నారు. మన విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భయాం దోళనలను ప్రేరేపించే సంస్థలుగా మారిపోతున్నాయి. బాధితులపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలకు కారణం వ్యక్తులు తమ స్వీయ నియంత్రణను కోల్పోవడం ఎంతమాత్రం కాదు. తన దృష్టిలో పడిన అమ్మాయిలను అవమానించడం అంతకంటే కాదు. నిజానికి ఇవి మన సమాజంలోని పలు దొంతరలను సాంస్కృతికంగా హింసిస్తున్నదానికి వ్యక్తీకరణలుగానే చూడాలి. దీనికి మూలాలు ప్రస్తుత కుటుంబం, స్కూలు, మత వ్యవస్థలు, పౌర సమాజంలో దాగి ఉన్నాయి. ఎందుకంటే సామూహిక అత్యాచారాలు చేసేవారు విభిన్న కుటుంబాలు, కులాలనుంచి వస్తున్నారు. ఇలాంటి అనాగరికమైన అత్యాచారాలకు మన యూనివర్సిటీలు కూడా మినహాయింపు కాదు. ప్రత్యేకించి భారతదేశంలో ఇది ఒక సామాజిక, భావజాలపరమైన ట్రెండ్‌గా మారిపోయింది. నగరం నుంచి గ్రామం దాకా, కుటుంబం నుంచి పాఠశాల, కాలేజీ, ఆలయం, మసీదు, చర్చి వరకు మనం స్త్రీ, పురుష సంబంధాలపై పునరాలోచించుకోవలసి ఉంది. ఏ మతాన్నీ, ఏ పాఠశాలను, ఏ కుటుంబాన్నీ వదలకుండా భారీస్థాయిలో సాంస్కృతిక ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. అత్యాచార విముక్త భారత్ కోసం జరిగే సాంస్కృతిక ప్రచారంలో స్త్రీ, పురుషులిరువురు పూర్తిస్థాయిలో పాల్గొనాల్సి ఉంటుంది. కుల వ్యవస్థ, అమానవీకరించిన పితృస్వామిక సంబంధాలు అనేవి ప్రపంచంలోనే ఏ సమాజంలోనూ చోటు చేసుకోనంత హింసకు భారతీయ స్త్రీ, పురుష సంబంధాలను గురి చేశాయి. ఈ సమస్యను విడి విడి ఉదంతాలుగా కాకుండా సర్వసమగ్ర దృష్టితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ కుటుంబ వ్యవస్థ నుంచి పట్టణాలు, నగరాల్లోని మన కుటుంబాల వరకు పరిశీలిస్తే ఇళ్లలో మనం వాడే భాషలో భయంకరమైన బూతులు దొర్లుతుంటాయి. వీటిలో చాలావరకు మహిళలను కేంద్రంగా చేసుకున్నవే. ఇంట్లో తండ్రీ, తల్లి, తాతా అవ్వలు సాధారణంగా ఆమోదించే జాతీయాలతో బూతు భాషను వాడుతున్నందున అది బాల్యం నుంచే మనలో ఇంకిపోయి ఉంటుంది. తరం నుంచి తరానికి ఇది పయనిస్తూనే ఉంటుంది. మన సమాజంలో ఆడదానిపై మగవాడు చలాయించే అధికారం, ఆజమాయిషీని బట్టే ఘనత వహించిన పురుషత్వం అనేదాన్ని నిర్వచిస్తుంటారు. నిత్యజీవితంలో మహిళను తనతో సమానంగా భావించి వ్యవహరించే పురుషుడిని ఈ సమాజం అసమర్థుడు అంటుంది. దీనికి మించిన పాశవిక సాంస్కృతిక భావం మరొకటి ఉండదు. కానీ అన్ని చోట్లా ఇది ఉని కిలో ఉంటోంది. దీంతో మనం తప్పక పోరాడాలి. మన పుస్తకాలు మొత్తంగా ఉత్పత్తి, ప్రకృతి, సైన్స్, స్త్రీపురుషుల మధ్య సహకార సంబంధాలు వంటివాటి కంటే శృంగారం, సెక్స్ పైనే ఎక్కువగా కేంద్రీకరిస్తుంటాయి. ఇక పాఠశాలలు, కాలేజీలు మహిళా వ్యతిరేక సాంస్కృతిక భావనలను పెంచిపోషిస్తూ, ఇంటినుంచి పాఠశాలకు బూతు భాషను విస్తృతపరుస్తూ ఉంటాయి. మన పోలీసు స్టేషన్లు భయంకరమైన బూతుభాషను వాడటంలో పేరుమోశాయి. మన సినిమాలు పూర్తిగా హింస, సెక్స్‌తో నిండివుండి రేపిజానికి మారుపేరుగా ఉంటున్నాయి. వికృతమైన సెక్సు, హింసాత్మక ఘటనలు లేని సినిమా ఒక్కరోజు కూడా థియేటర్లో ఆడలేదు. అటు ప్రేక్షకులు, ఇటు నిర్మాత, హీరోల మనస్తత్వం హింసాత్మక సెక్స్‌ని లేక వీరోచితమైన భౌతిక హింసను ప్రదర్శిస్తూంటుంది. భారతదేశంలో లేక మరెక్కడైనా సరే.. మానవ ప్రాణులను అత్యాచారం చేస్తున్న సంస్కృతి, జంతువుల్లోని ఆడామగ మధ్య లైంగిక కార్యకలాపం సందర్భంగా కనబర్చే ప్రవర్తనకు ఏమాత్రం పోలలేదు. ఆడజంతువు మద్దతు లేకుండా జంతువులు, పక్షులు బలాత్కారంగా సెక్సులో పాల్గొనలేవు. జంతువుల్లోకూడా గమనించలేనంత ఘోరమైన పీడన స్వభావంతో పురుష అణచివేత కొనసాగుతున్నందున దీన్ని అడ్డుకోవడానికి మరింత ఎక్కువగా జంతు ప్రవర్తనా శాస్త్రాలను భారతీయులు నేర్చుకోవలసి ఉంది. కానీ భారతీయ తరహా రేప్ సంస్కృతిని ఇతర సమాజాలతో అసలు పోల్చి చూడలేం. ఎందుకంటే యుద్ధ సమయాల్లో తప్పితే.. సామూహిక హత్యలు, వధలు ఆ సమాజాల్లో తక్కువ. సాధారణ పరిస్థితుల్లో ఏ మగాడైనా సరే ఆడదాని శరీరాన్ని తాకాలంటే ఆమె అనుమతి తీసుకోవడం ముందు షరతుగా ఉంటుంది. కానీ భారతదేశంలో దీన్ని చాలావరకు పరిగణించరు. ఇది మన కుటుంబ, విద్యా వ్యవస్థకు పెద్ద సవాలు. మన సమాజం, జాతిలోని ఈ బలహీనతను మనం అంగీకరించాలి, ఆ తర్వాతే నాగరిక ప్రవర్తనకు మారాలి. ఈ సమస్యకు మరింత పోలీసింగ్, ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పులు మాత్రమే పరిష్కారం కాదు. రేపిస్టులను ఎన్కౌంటర్ చేస్తే ఇది పోయేది కాదు. మన సంస్కృతిలోనే స్త్రీ వ్యతిరేక బూతు ప్రయోగాల సమస్య ఉన్నందున, ఇళ్లలో, బహిరంగ స్థలాల్లో స్త్రీ, పురుషుల సమాన హక్కులను పెంచి పోషించే సంస్కృతిగురించి మనం తప్పక ఆలోచించాలి. దీనికోసం ఇళ్లలో, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తిలో లేక స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో కనీసం మాటల్లో కూడా మహిళలను తిట్టని ‘జీరో టాలరెన్స్’ సంస్కృతికి పట్టం కట్టాలి. ప్రతి ఇంటిలో వాడుతున్న భాష తీరును ఇరుగుపొరుగులు పరిశీలిస్తుండాలి. ఇంట్లో కానీ, బయట కానీ ఎవరైనా బూతు భాషను వాడారంటే అలాంటి వారిని ఖండించి, అవమానపర్చాలి. సామాజిక పరంగా అవమానాలకు గురికావడం, మహిళల దృఢవైఖరి కారణంగా ఇప్పుడు గ్రామాల్లో కూడా ఆడవారిని లేక భార్యను కొట్టడం నుంచి మనం బయటపడుతున్నాం. అలాగని కుటుం బంలో, ఇంట్లో, బయట ఏ మహిళనూ మనదేశంలో ఎవరూ కొట్టలేదని దీని అర్థం కాదు. గతంతో పోలిస్తే మహిళలను చితకబాదడం తగ్గుముఖం పడుతోంది. అదేవిధంగా మహిళలను బూతులాడటం, రేప్ చేయడం, చంపడం వంటివి కూడా ఒక క్రమంలో తగ్గిపోతాయి. సమాజంలోని ప్రతి చోటా మహిళలను అమితంగా గౌరవించడాన్ని నేర్పినట్లయితే కొంతకాలానికి మహిళలను వేధించడం, హింసిం చడం పూర్తిగా తగ్గిపోతుంది కూడా. చివరగా, కుటుంబం పాఠశాల, మత సంస్థలు, మార్కెట్ స్థలాలు అన్నీ కలిసి స్త్రీ, పురుషులు సమానులు అనే భావాన్ని పాటిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి సాంస్కృతిక విధానాలను పాటించాలి. ఏ ఇతర సంస్థల కంటే పాఠశాలకు ఈ అంశంలో మరింత అధిక పాత్ర ఉంది. స్త్రీల గౌరవాన్ని, శ్రమగౌరవాన్ని పెంచేటటువంటి సిలబస్‌ను రూపొందించాలి. మహిళల శ్రమ, వారి సృజనాత్మకతే జాతి పురోగమనానికి, అభివృద్ధికి కీలకం అని మన పిల్లలకు పాఠశాలల్లో బోధించనట్లయితే, భవిష్యత్తులో కూడా అత్యాచారాలు, వేధింపుల వంటి ఉపద్రవాలు మనల్ని పీడిస్తూనే ఉంటాయి. అందుకే స్త్రీ, పురుషుల సమానత్వం కోసం ఒక సాంస్కృతిక విప్లవాన్నే ప్రారంభిద్దాం రండి. దీనికోసం ఇంట్లో, స్కూల్లో, కాలేజీలో, ఆలయంలో, మసీదులో, చర్చిలో, ఆఫీసుల్లో, షాపుల్లో ప్రతిచోటా ఈ అంశంపై చర్చను ప్రారంభిద్దాం. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
కాపు నేస్తంతో కాంతులు
సాక్షి, విశాఖపట్నం: సంక్షేమం... అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాలకూ ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయిన కుటుంబాలకు నేనున్నానంటూ ప్రభుత్వం చేయూత అందిస్తోంది. తాజాగా కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు.. కాపు సామాజిక వర్గానికి కొత్త ఊపిరి పోసింది. వైఎస్సార్ కాపునేస్తం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. సుస్థిర అభివృద్ధి దిశగా.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పథకాలను ప్రవేశపెడుతూ సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి కేబినెట్లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు చూరగొంటోంది. తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజల మోముల్లో సరికొత్త ఆనందాన్ని నింపుతున్నాయి. ఇందులో భాగంగా ఆమోదించిన పథకం వైఎస్సార్ కాపునేస్తం. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, ఉప కులాల మహిళల జీవన ప్రమాణాల్ని పెంచేలా.. వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చేలా కాపునేస్తం పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉపాధి అవకాశాలు మెరుగు.. కాపునేస్తం పథకం ద్వారా ఆయా సామాజిక వర్గాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం చేయూత ఇవ్వనుంది. వారి ఉపాధి అవకాశాల్ని మెరుగు పరిచేందుకు ఈ పథకం ఉపయుక్తమవుతుంది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున చొప్పున ఐదేళ్ల పాటు రూ.75 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. నిబంధనలివీ.. ►గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదా యం నెలకు రూ.10 వేలు ఉండాలి. ►పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.12 వేలు ఉన్న వారు అర్హులు ►కారు ఉన్నవారు అనర్హులు ►ట్యాక్సీ, మినీ వ్యాన్ వంటి వాటి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి మినహాయింపు ఇచ్చారు. ►కుటుంబంలో వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు తీసుకుంటున్న వారు ఉన్నా కాపునేస్తం వర్తిస్తుంది. ►2020 నుంచి 2024 వరకూ ఐదేళ్ల పాటు కాపునేస్తం ద్వారా సాయం అందుతుంది. జగనన్న మేలు మరువలేం మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వరాలు ఇచ్చా రు. ప్రధానంగా మహిళలకు ఆయన చేస్తున్న మేలు ఎన్నటికీ మరువలేం. ఏ ప్రభుత్వం కూడా కాపులను పట్టించుకోలేదు. జగన్ మాత్రమే అన్ని కులాలకు న్యాయం చేస్తున్నారు. కాపు నేస్తంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆసరా కల్పిస్తున్నారు. – సుంకర రాము, గొట్టివాడ, కోటవురట్ల మండలం అడక్కుండానే సాయం.. కాపునేస్తం పథకంతో మా కుటుంబాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ వెళుతున్నారు. అడక్కుండానే వరాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి మోసం చేసింది. మహిళలను నమ్మించి నిలువునా ముంచేసింది. జగన్ మాత్రమే మా బాగోగులు పట్టించుకుంటున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం. – బత్తిన చిలకమ్మ, గొట్టివాడ, కోటవురట్ల మండలం 2054 మంది గుర్తింపు.. కాపు నేస్తం పథకానికి జిల్లాలో ఇప్పటి వరకు 2054 మందిని గుర్తించాం.ప్రస్తుతం వైఎస్సార్ నవశకం సర్వే జరుగుతోంది. ఇది పూర్తయితే అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పథకానికి 45 సంవత్సరాలు దాటిన కాపు మహిళలు అర్హులుగా చెబుతున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలు నవశకం సర్వేలో సహకారం అందించాలి. – పెంటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బీసీ కార్పొరేషన్, విశాఖపట్నం -
డ్వాక్రా మహిళలకు శుభవార్త
హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డ్వాక్రా మహిళల రుణాల మాఫీ కోసం కసరత్తు మొదలైంది. ఇప్పటికే రుణాల వివరాలు అప్లోడ్ చేయడంలో సిబ్బంది తలమునకలవుతోంది. రుణమాఫీపై సంఘాల సభ్యులకు వెలుగు ఉద్యోగులు అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్లలో మాఫీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమచేసేలా చర్యలు చేపడుతున్నారు. సాక్షి, వేపాడ (శృంగవరపుకోట): మహిళా సంఘాల సభ్యులకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ అసరా పేరుతో మహిళా సంఘాల రుణాల మాఫీ అమలుకు చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ అధికా రుల ఆదేశాలతో మండల స్థాయిలో వెలుగు సిబ్బంది అర్హులైన సంఘాలు, సభ్యుల పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించి అప్లోడ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లోని 35,922 మహిళా సంఘాల్లో 3,95,142 మంది సభ్యులను వైఎస్సార్ ఆసరా పథకానికి అర్హులుగా గుర్తించారు. దీనిద్వారా సుమారు రూ. 897 కోట్లు మహిళా సంఘ సభ్యులకు లబ్ధి చేకూరనుంది. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగానే... వైఎస్సార్ ఆసరా పథకంలో మహిళాసంఘాల సభ్యులకు 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఎంత బకాయి ఉన్నారో దానిని మాఫీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు అర్హులను గుర్తించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించటంతో క్షేత్ర స్థాయిలో అధికారులు ఆ వివరాలు సేకరిస్తున్నారు. రుణ వివరాలను సెర్ప్ యాప్‌లో వెలుగు సిబ్బంది అప్లోడ్ చేస్తున్నారు. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగు విడతల్లో సభ్యుల ఖాతాలకు జమచేయనున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది... గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మహిళలను మోసం చేసింది. గత ఎన్నికల్లో రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ప్రచారం చేసి గద్దెనెక్కాక ఆ హామీని విస్మరించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుండటంతో మహిళల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 85శాతం అప్లోడ్ పూర్తి చేసాం... జిల్లాలో వైఎస్సార్ ఆసరా పథకంలో అర్హులైన సం ఘాల సభ్యులకు సంబం ధించి ఖాతానంబర్, ఆధార్‌తో 85 శాతం అప్లోడ్ చేశాం. పలు మండలాల్లో సభ్యుల ఆధార్ అనుసంధానం, సాధికార సర్వే సాంకేతిక లోపంలో మిగిలివున్నాయి. వాటిని 10 రోజుల్లో అప్లోడ్ చేయాలని సూచించాం. జిల్లాలో 35,922 సంఘాలు ఆసరా పథకంలో అర్హత పొందాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నేరుగా సభ్యుల ఖాతాలో జమచేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. – జి.శాంతి, డీఆర్డీఏ పీడీ. విజయనగరం ఆనందంగా వుంది.. జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలు దిశగా గణాంకాలు వేయటంతో మా సంఘానికి సుమారు రూ. 5 లక్షలు రుణమాఫీ కానుంది. మా సంఘ సభ్యులంతా ఇప్పటికే ఆధార్, బ్యాంకు ఖాతానంబర్లు అప్లోడ్ చేయించుకున్నాం. – బొట్ట పార్వతి, చిన్నమ్మలు మహిళాసంఘం, వేపాడ మహిళలకు ఆసరా వర్తిస్తోంది... గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హా మీ సీఎమ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిలబెట్టుకునేం దుకు సన్నాహాలు చేయటం సంతోషంగా ఉంది. – బోజంకి మాధవి, శ్రీవేంకటేశ్వర మహిళాసంఘం, వేపాడ రూ. 4.50లక్షలు రుణమాఫీ అవుతోంది... సీఎం జగన్మోహన్రెడ్డి హామీ అమలు చేయటంవల్ల మా సంఘానికి రూ. 4.50లక్షలు రుణమాఫీ వర్తిస్తోంది. మా సంఘంలో 15 మంది సభ్యులకు లబ్ధి కలగనుంది. మహిళలకు మరింత ఆసరా కల్పించిన జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు – ద్వారపూడి మంగ, శ్రీసాయి సంఘం, బొద్దాం -
ఢిల్లీ మహిళలకు శుభవార్త
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీ శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దానిలోభాగంగా రాజధానిలో బస్సు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘ఢిల్లీలో డిటీసీ, క్లస్టర్ బస్సులు, ఢిల్లీ మెట్రోలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. వారి ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తుంది’ అని సోమవారం ఢిల్లీలో కేజ్రీవాల్ చెప్పారు. 2, 3 నెలల్లో దీన్ని అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 8 వందల కోట్ల భారం పడుతుందన్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో రోజూ పాతిక లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఉచిత ప్రతిపాదన వల్ల ప్రయాణికుల సంఖ్య మరో లక్ష పెరిగే అవకాశం ఉందన్నారు. నగరంలో 1.50 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు ఆమోదించామని తెలిపారు.ఈ డిసెంబరు నాటికి 70వేల కెమెరాలు అమర్చుతామన్నారు. కాగా, ఉచిత ప్రయాణ ప్రతిపాదనపై వ్యాఖ్యానించడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిరాకరించింది. -
ప్రమాదము.. ప్రేమ
మనుషులు ప్రేమలో పడ్తారు. పడడం ప్రమాదమేగా?జరిగింది అదికాదు.. ఒక ఉన్మాదం ప్రమాదమైంది ప్రేమలో పడినవాళ్లు మాత్రం..పడిలేచారు.. లేచి నడిచారు!! ‘‘మీరు మహిళల తరపున నిలబడ్తారని... వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తారని మీ దగ్గరకు వచ్చాను’’‘‘చెప్పండి.. మీకేం హెల్ప్ కావాలి?’’‘‘నాకు విడాకులు కావాలి’’‘‘అయితే అన్ని విషయాలు నిజాయితీగా చెప్పాలి’’‘‘తప్పకుండా’’ఈ సంభాషణ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘‘ఫైర్‌బ్రాండ్’’ అనే మరాఠీ సినిమాలోనిది. ముంబైలో సక్సెస్ఫుల్ లాయర్.. మహిళా పక్షపాతి. న్యాయం తరపున నిలబడుతుంది. .గృహ హింసకు బలవుతున్న వివాహితులకు తగిన భరణంతో విడాకులు ఇప్పిస్తుంటుంది పెద్ద పెద్ద వ్యాపారస్తులతో మారు మాట్లాడకుండా.. తమ భార్యలకు ఆస్తిలో వాటా ఇచ్చేలా వాదిస్తుంది. ఆమె తమ కేస్ తీసుకుందంటే చాలు జీవితకాలపు భరోసాతో ఉంటారు స్త్రీలు. అందుకే ఒక బాధితురాలు ఆమెను అలా రిక్వెస్ట్ చేస్తుంది. ఎక్స్‌పార్టీగా పురుషులు తమ ఆటలు ఇక చెల్లవనే నిర్థారణకు వచ్చేస్తారు. తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేసైనా సరే గెలుస్తామనే ఆశను తుడిచేసుకుంటారు ప్రతివాది లాయర్లు. అందుకే ఆమె ఫైర్‌బ్రాండ్. అలాంటి ధీశాలి వ్యక్తిగతమైన సమస్యతో సతమతమవుతూ ఉంటుంది. భర్తతో శారీరక చనువును పెంచుకోలేకపోతుంది. ఎందుకలా? ఆ లాయర్ పేరు సుందర్ రా. ప్రొఫెషనల్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇబ్బంది అంతా మ్యారీడ్ లైఫ్‌తోనే. అలాగని భర్త.. మాధవ్ పాట్కర్ చెడ్డవాడు ఏమీ కాదు. భార్యను అర్థం చేసుకుంటాడు. గౌరవిస్తాడు. ఆర్కిటెక్ట్‌గా తన వృత్తికెంత విలువిస్తాడో అడ్వకేట్‌గా ఆమె వృత్తికీ అంతే విలువిస్తాడు. అయినా ఆమె అతనికి దగ్గరకాలేపోతుంది. తీవ్రమైన మానసిక సంఘర్షణతో బాధపడ్తుంటుంది. దానిపేరు.. పీటీఎస్డి (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్). స్కూల్లో చదువుకునే రోజుల్లో లైంగిక దాడికి గురవుతుంది సునంద. అది కలిగించిన భయమే పీటీఎస్డి రూపంలో ఇప్పటికీ వెంటాడుతూంటుంది. ‘‘అది ఒక యాక్సిడెంట్ మాత్రమే. ప్రేమ వేరు.. లవ్ వేరు’’ అంటూ ఈ విషయంలో ఆమెను మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తూంటాడు భర్త ఓ స్నేహితుడిలా. అయినా సాధ్యం కాదు సునందకు. సైకియాట్రి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూంటుంది. రాత్రి నిద్ర పోవాలంటే భయం ఆమెకు. రోజూ ఆ పీడకలే. భార్య వ్యథను చూస్తూ నిస్సహాయంగా ఉంటాడు మాధవ్. ఇదిలా ఉండగా.. ఓ రోజు.. దివ్య వస్తుంది సునంద ఆఫీస్‌కు. ఉపోద్ఘాతంలో ప్రస్తావించుకున్న క్లయింట్. యవ్వనంలో ఆమె ఫేమస్ మోడల్. ఆనంద్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు ఓ పాప. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఆనంద్‌ది. ఆడవాళ్లతో కూడా స్నేహంగా ఉంటాడు. ఆ తీరును అనుమానిస్తూంటుంది దివ్య. ‘‘నీకు వేరే అఫైర్లున్నాయ’ంటూ రోజూ తగవు పెట్టుకుంటుంది. వాళ్ల పోట్లాటతో కూతురు వణికిపోతూంటుంది. దాంతో పాప అబ్నార్మల్ చైల్డ్ అయిపోతుంది. ఆ బిడ్డ పట్లా అసహనమే దివ్యకు. చివరకు ఆస్తిలో సగం వాటాతో విడాకులు కావాలని భీష్మించుకుంటుంది. పాప కస్టడీనీ డిమాండ్ చేస్తుంది. ఒప్పుకోడు ఆనంద్. ‘‘చీటికిమాటికి మనం ఇలా పోట్లాడుకుంటూంటే పాప హెల్త్ మరింత పాడవుతుంది. నాకే అఫైరూ లేదు.. నన్ను నమ్ము ప్లీజ్’ అంటూ మొరపెట్టుకుంటాడు ఆనంద్. కన్విన్స్ కాదు దివ్య. పాపకేమో తండ్రంటేనే ఇష్టం. తల్లి పట్ల మొండిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సునంద గురించి తెలుసుకుని ఆమెను కలుస్తుంది దివ్య. ఈ కథ మొదట్లో చెప్పుకున్నట్లు విడాకులు ఇప్పించమని అడుగుతుంది. అబద్ధం తనవైపు బలమైన సాక్ష్యాన్ని సృష్టించుకోడానికి తనే గాజుముక్కతో గాయం చేసుకుని హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ భర్త మీద నేరారోపణ చేస్తుంది దివ్య. ఆనంద్‌ను అరెస్ట్ చేస్తారు పోలీసులు. తన ఇన్ఫ్లుయెన్స్, స్నేహితుడి సహాయంతో ఎలాగోలా బయటకొస్తాడు. ఓ లాయర్ని మాట్లాడుకుంటాడు. ఆ వ్యవహారమంతా ఎక్కడ పాప మీద దుష్ప్రభావం చూపుతుందోనని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుందామని ప్రతిపాదిస్తాడు భార్యతో. సరే అంటుంది దివ్య. ఆనంద్ తన లాయర్‌తో కలిసి సునంద ఆఫీస్‌కు వస్తాడు. దివ్యా ఉంటుంది. చెప్తారు.. తామిద్దరూ మ్యూచువల్ కన్సెంట్కి వెళ్దామనుకుంటున్నామని. ఓకే అంటుంది సునంద. మళ్లీ అక్కడ ఆస్తి విషయంలో పోట్లాటకు దిగుతుంది దివ్య. అప్పుడే తెలుస్తుంది సునందకు.. ఆనంద్ తనను గాయపరిచాడంటూ దివ్య అబద్ధమాడిందని. ఆమె మీద నమ్మకం పోతుంది సునందకు. ఈ కేస్ నుంచి తప్పుకుంటానని.. ఇంకో లాయర్‌ను మాట్లాడుకోమనీ దివ్యతో చెప్తుంది. ఇంకోసారి అలా జరగదని బతిమాలుకొని సునందను ఒప్పిస్తుంది దివ్య. కోర్టులో.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి.. ఆ ప్రాభవాన్నంతా కోల్పోయి ఆనంద్ నీడలో మామూలు భార్యగా బతుకుతున్నాననే భావన దివ్య సంయమనం కోల్పోయేలా చేస్తుంది. ఆ విషయాన్నే ఆనంద్ తరపు లాయర్ కోర్టులో చెప్పి.. బిడ్డ కస్టడీని ఆనంద్‌కు ఇప్పించాల్సిందిగా కోరుతాడు. ఆ మాటతో ఆవేశపడిపోయి.. ఒక్కసారిగా భర్తమీద అరిచేస్తుంది దివ్య.. క్రమశిక్షణనుల్లంఘించి. దాంతో ఆమె మానసిక ప్రవర్తనను బేరీజు వేసుకున్న జడ్జి బిడ్డ కస్టడీని ఆనంద్‌కే అప్పగిస్తాడు. ఆ కోపాన్నంతా సునందమీద వెళ్లగక్కుతుంది దివ్య. ఆమెలోని తల్లి మనసును అర్థం చేసుకున్నా దివ్య ప్రవర్తనను సహించదు సునంద. అంతకుముందు.. తన సాహచర్యం, సైకియాట్రి ట్రీట్మెంట్.. ఏదీ ఫలితం చూపించకపోయేసరికి హర్ట్ అవుతాడు మా«ధవ్. కొన్నాళ్లు సొంతూరికి వెళ్దామనుకుంటాడు. తన ఎడబాటు వల్లయినా సునందలో మార్పు వస్తుందేమోనని. అనుకున్నట్టుగానే సునందకు చెప్పకుండా ఊరుకెళ్లిపోతాడు. భార్య ఫోన్ చేసి అడిగితే.. పని మీద ఊరొచ్చినట్టు చెప్తాడు. ఆ రాత్రి.. దివ్య వాళ్లకు విడాకులు మంజూరైన రోజు రాత్రి దివ్య భర్త ఆనంద్.. సునంద వాళ్లింటికి వస్తాడు. కూర్చోని ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటారు. కోర్టులో తన భార్య బిహేవియర్ పట్ల సారీ చెప్తాడు ఆనంద్. అనీజీగా కదులుతుంది సునంద. ఏమైంది అంటాడు ఆనంద్. మెడ, వెన్ను నొప్పి అని చెప్తుంది. ‘‘మీకు అభ్యంతరం లేకపోతే మస్సాజ్ చేయనా? నేను ట్రైన్డ్’’ అంటాడు. ‘‘పర్లేదు.. అదే సర్దుకుంటుంది’’ అంటుంది. కాని ఇబ్బంది పడ్తూంటుంది. ‘‘నేను మస్సాజ్ చేస్తాను ఆగండి’’ అంటూ చనువు తీసుకొని మస్సాజ్ చేస్తుంటాడు. ఆ స్పర్శ ఆమెలో స్త్రీత్వాన్ని తట్టి లేపుతుంది. మానసికంగా ఉపశమనాన్నిస్తుంటుంది. శారీరకంగా సాన్నిహిత్యాన్ని కోరుతుంటూంది. తెల్లవారి.. ఎప్పటిలా కాకుండా చాలా హుషారుగా ఉంటుంది సునంద. భర్తకు ఫోన్ చేస్తుంది త్వరగా రమ్మని. ఆ మాటలోని ఉత్సాహాన్ని, ఆత్రాన్ని గ్రహిస్తాడు భర్త. మాధవ్ ఆశించిన మార్పు సునందలో. బయలుదేరి వస్తాడు. భార్య చొరవను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ రాత్రి చెప్తుంది భర్తతో.. ‘‘నా చిన్నప్పటి భయంకరమైన కల.. నిన్న సమాధి అయిపోయింది’’ అంటూ. ‘‘వెరీగుడ్..’’ అంటాడు భర్త ఆనందంగా. ‘‘దీనికి కారణం ఓ వ్యక్తి. నిన్న కలిశాను శారీరకంగా. అప్పుడు తెలిసింది నాకు.. పీడకు, సంతోషానికి మధ్య తేడా’’అని ఆగుతుంది. భర్త మొహంలో రంగులు మారుతుంటాయి.‘‘మాధవ్.. ఏంటలా ఉన్నావ్?’’ అంటుంది కంగారుగా. ‘‘ఏంటో.. నాకు కన్ఫ్యూజన్గా ఉంది’’ అంటాడు భర్త. ‘‘అదేంటీ.. నువ్వే చెప్పావ్‌గా చాలాసార్లు.. యాక్సిడెంట్ వేరు.. లవ్ వేరు అని. నీ మీదున్న నా ప్రేమను ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలిసింది..’’ అంటుంది భర్తను హత్తుకుంటూ. ఆమె స్థితిని అర్థం చేసుకునేక్రమంలో భాగంగా భార్య తలను ముద్దు పెట్టుకుంటాడు. సమకాలీన పరిస్థితుల జీవనశైలి.. ప్రమాదాలు.. ప్రేమలు.. ఘర్షణలు.. దుఃఖాలు.. ఆనందాలు అన్నీ రీలై రియల్లైఫ్లా చూపిస్తుంది ఫైర్‌బ్రాండ్. దర్శకురాలు అరుణ రాజె. నిర్మాత.. ప్రియాంక చోప్రా. సునంద రాగా ఉషా జాధవ్ నటించారు. – సరస్వతి రమ -
ఆ ‘నలుగురు’ మహిళా మంత్రులు
మహిళామణులు అసెంబ్లీలో అడుగుపెట్టడమేగాక ఆయా శాఖలకు మంత్రులుగా పనిచేసి రాష్ట్ర రాజకీయ యవనికపై తమదైన ముద్రవేశారు. పురుషులకు ధీటుగా కీలక పదవులు చేపట్టి ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనుల్లో తమ సత్తా చాటారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ఏడుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా .. ఇందులో నలుగురికి మంత్రులుగా పనిచేసే అవకాశం లభించడం విశేషం. గనుల శాఖ నుంచి మొదలుకుని హోం తదితర అత్యున్నత శాఖలకు బాధ్యత వహించి భేష్ అనిపించారు. కాంగ్రెస్, టీడీపీలు మాత్రమే మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొండ్రు పుష్పలీలను లక్కీ మినిస్టర్‌గా రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఈమెకు అమాత్య యోగం దక్కడమే ఇందుకు కారణం. ఆయా పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు మూడునాలుగు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టినా మంత్రి పదవులు వరించలేదు. ఇందుకు భిన్నం పుష్పలీల. 1999 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుం చి టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఈమె.. కాంగ్రెస్ అభ్యర్థి ఏ గంగారం కృష్ణపై విజయం సాధించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈమె మహిళా, సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొం దిన పుష్పలీల.. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడారు. మంత్రిగా సుమిత్రాదేవి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి విజయఢంకా మోగించిన దళిత నాయకురాలు, స్వాతంత్య్ర సమరయోధురాలు సుమిత్రాదేవి మంత్రిగా పనిచేశారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించారు. ఈ ఘనత మరే మహిళా నాయకురాలు సాధించలేదు. 1957, 62 ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి గెలుపొందగా.. ఆ తర్వాతి మూడుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మేడ్చల్ నుంచి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం నుంచి బరిలోకి దిగిన ఆమె.. జనతా పార్టీ అభ్యర్థి కేఆర్ కృష్ణస్వామిని ఓటమి రుచిచూపించి మంత్రి పదవిని దక్కించుకున్నారు. సబితారెడ్డికి పెద్దపీట.. చేవెళ్ల చెల్లెమ్మగా పేరుగాంచిన పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 2004లో తొలిసారిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఈమెకు చోటుదక్కింది. చేవెళ్ల సెగ్మెంట్ నుంచి బరిలో కి దిగిన ఆమెకు వైఎస్సార్ మంచి ప్రాధాన్యత ఇచ్చా రు. ఆ తర్వాత 2009లో చేవెళ్ల నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో.. మహేశ్వరం నుంచి పోటీచేసి.. మాజీ మేయర్, టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఈ దఫా వైఎస్సార్ తన క్యాబినెట్లో రాష్ట్ర హోం, జైళ్లు, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. వైఎస్సార్ మరణం తర్వాత రో శయ్య హయాంలోనూ సబితా హోంమంత్రిగా కొనసాగారు. ఈమె భర్త పట్లోళ్ల ఇంద్రారెడ్డి 2000లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో రాజకీయ ప్రవే శం చేసిన ఈమె.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1963 మే నెలలో తాండూరులో జన్మించిన సబితా.. 41 ఏళ్ల వయసులో తొలిసారిగా మంత్రి అయ్యారు. ఉమా వెంకట్రాంరెడ్డికి కీలక బాధ్యతలు మేడ్చల్ అసెంబ్లీ నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన ఉమా వెంకట్రాంరెడ్డి పలు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీపీ రెడ్డిపై గెలిచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు ఈమె. ఆ తర్వాత మరోసారి 1989లో విజయం సాధించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. ఆయన మంత్రివర్గంలో మొదటగా మంత్రి పదవి వరించలేదు. 1990 డిసెంబర్ 3న చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కింది. గృహనిర్మాణం, సూక్ష్మ నీటిపారుదల, గనుల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 1990 వరకు పనిచేశారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్లోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991 ఆగస్టు 5 నుంచి 1992 వరకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా సేవలందించారు. -
స్త్రీలోక సంచారం
♦ ‘చాకలి ఐలమ్మ’గా గుర్తింపు పొందిన తెలంగాణ వీర వనిత చిట్యాల ఐలమ్మ (1919–1985) విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం త్వరలో హైదరాబాద్‌లో ప్రతిష్ఠించబోతోంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్ణాపురం గ్రామంలో జన్మించిన ఐలమ్మ.. పెత్తందారీ భూస్వామ్య వ్యవస్థ అకృత్యాలకు, నిజాం ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా పట్టి పోరాడారు. ♦ ఏటా జరుగుతున్న విధంగానే వక్ఫ్ బోర్డుల నేతృత్వంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, మదరసాలు, కార్యనిర్వాహక సంస్థలలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎగుర వేయడంతో పాటు.. ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాన్ని కూడా తప్పనిసరిగా పలికించాలని ఉత్తరప్రదేశ్ షియా బోర్డు చీఫ్ వసీమ్ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ‘భారతదేశం నా జన్మభూమి’ అని చెప్పుకుంటున్నవారు, మన స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపించిన ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాన్ని ఉచ్చరించబోమని చెప్పడంలో అర్థం లేదని రజ్వీ అన్నారు. ♦ భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సంక్షేమ పథకాలే తనకు ఎన్నికల ప్రచారాన్ని చేసి పెడతాయని అంటూ తనదైన శైలిలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘‘జార్ఖండ్‌లోని ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఒక నిరుపేద మహిళ. కట్టెల పొయ్యి మీద అవస్థ పడుతూ ఇంట్లోవాళ్లందరికీ వంట చేసి పెట్టేది. ఉజ్వల స్కీమ్ కింద ఆమెకు గ్యాస్ స్టవ్ వచ్చింది. ఇప్పుడు ఆమె ముఖం పొగతో మసిబారడం లేదు. అనారోగ్యంతో ఆమె బాధ పడటం లేదు. వంట త్వరగా అయిపోతోంది. సమయం చాలా కలిసి వస్తోంది. ఆ సమయాన్ని వేరే డబ్బులొచ్చే పనికి, పిల్లల సంరక్షణకు ఆ ఇల్లాలు ఉపయోగించుకుంటోంది’’ అని చెబుతూ, ఇంతకు మించి నా ప్రభుత్వానికి ప్రచారం ఉంటుందా? అని మోదీ అన్నారు. ♦ 11 ఏళ్ల థాయ్‌లాండ్ బాల వధువుకు 41 ఏళ్ల మలేసియా వరుడి మూడవ భార్యగా జరిగిన పెళ్లిపై థాయ్‌లాండ్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వెల్లువెత్తిన తీవ్ర ఆగ్రహావేశాలు తిరిగి ఆ చిన్నారిని స్వదేశం తెప్పించేందుకు తోడ్పడ్డాయి. మత న్యాయస్థానాల అనుమతితో 16 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకోడానికి మలేసియాలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని పెళ్లి చేసుకున్న ఆ వ్యాపారి చెర నుంచి బాలికను రక్షించిన థాయ్ అధికారులు ప్రస్తుతం ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ♦ ‘వరల్డ్ మీటింగ్ ఆఫ్ ఫ్యామిలీస్’ (డబ్లు్య.ఎం.ఎఫ్) ఈవెంట్లో భాగంగా ఐర్లండ్‌లోని దుబ్లిన్‌లో ఈ నెల 25న ‘మహిళా నాయకత్వం–అంతర్జాతీయ ప్రభావం’ అనే అంశంపై సదస్సు జరుగుతోంది. డబ్లు్య.ఎం.ఎఫ్ ఈవెంట్లో మొదటిసారి జరుగుతున్న ఈ సదస్సు ఆ రోజు ఉదయం 8 గం.లకు మొదలై 11 గం.లకు ముగుస్తుందని, అదే రోజు ఉదయం 10.30 గం.లకు దుబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగే పోప్ ఫ్రాన్సిస్ ఈ మహిళా సదస్సుకు ఆఖరు నిముషంలోనైనా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు వెల్లడిం చారు. ♦ అందాల నటి శ్రీదేవి తొలి జయంతి నేడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో సంభవించిన ఆమె ఆకస్మిక మరణం దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. శ్రీదేవి బతికి ఉంటే ఆమెకిది 55 వ పుట్టిన రోజు అయివుండేది. ఇటీవల విడుదలైన పెద్ద కూతురు జాహ్నవి తొలి సినిమా ‘ధడక్’ సక్సెస్‌ను చూసి ఆమె ఆనందించి ఉండేవారు. -
మద్యంపై వైఎస్ జగన్ పకటనను స్వాగతిస్తున్న మహిళలు
-
స్త్రీలోక సంచారం
♦ దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్ మేఘనా షాన్‌బాగ్ దేశంలోనే ఆరవ మహిళా ఫైటర్ పైలట్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. నియామకం తర్వాత చిక్‌మగళూర్‌కు చెందిన ఈ 24 ఏళ్ల డేర్ డెవిల్ దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్ అవుతారు ♦ బీజింగ్‌లో రాత్రి పది గంటల తర్వాత క్యాబ్ డ్రైవర్లు మహిళా ప్రయాణికులను దారి మధ్యలో ఎక్కించుకోడానికి లేదని చైనా ప్రభుత్వం నిబంధన విధించింది. ఇప్పటికే సరిపడినంత మంది మహిళా క్యాబ్ డ్రైవర్లు ఉన్నందున ఈ నిబంధన కారణంగా మహిళలు ఇబ్బంది పడకపోవచ్చుని భావిస్తున్నారు ♦ 58 ఏళ్ల నాసా మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ పదవీ విరమణ చేశారు. ఆమె తన కెరీర్ మొత్తంలో 665 రోజులు అంతరిక్షంలో గడిపి.. స్త్రీ, పురుష వ్యోమగాములందరికంటే ఎక్కువ రోజులు స్పేస్‌లో ఉన్న ఆస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందారు ♦ భార్యను చంపి, ఇన్సూరెన్స్ డబ్బుతో అప్పులన్నీ తీర్చేసి, తన ప్రియురాలితో కొత్త జీవితం ప్రారంభించాలని కుట్ర పన్ని భార్య పారాచ్యూట్లోని గ్యాస్వాల్వును రెండుసార్లు పాడు చేసిన ఓ బ్రిటిష్ మాజీ సైనికుడికి కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భర్త కుయుక్తి గురించి తెలియని విక్టోరియా సిలియర్స్ 2015లో భూమికి నాలుగు వేల అడుగుల ఎత్తులోంచి ప్యారాచూట్ పనిచేయక పొలాల్లో పడిపోయి అదృష్టవశాత్తూ బతికి బట్టకట్టి, భర్తే తన చావుకు పథకం వేశాడని తెలిసి నిర్ఘాంతపోయి, తీవ్ర మనస్తాపంతో ఆయనపై కేసు పెట్టారు ♦ అనాథాశ్రమాలు బాలలకు స్వర్గధామాలేమీ కాదని, ప్రపంచవ్యాప్తంగా బాలలు అనేకచోట్ల ఆశ్రమహింసకు గురవుతున్నారని హ్యారీపోటర్ రచయిత్రి జె.కె.రోలింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనాథ పిల్లలకు ప్రేమానురాగాలను పంచే ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించవలసి ఉందని ఆమె అన్నారు ♦ మహిళలు ఒక్కరుగా కాక, కుటుంబ సభ్యులతో కలిసి వెళితే స్టేడియంలలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభ్యంతరమేమీ లేదని ఇరాన్ సడలింపు ఇవ్వబోతున్నదని ఆ దేశం మహిళలు ఆశిస్తున్న తరుణంలో అలాంటిదేమీ లేదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది! అయితే మాల్స్‌లో, కాఫీ హౌస్‌లలో ఏర్పాటు చేసే పెద్ద పెద్ద టీవీలలో అందరితో పాటు మహిళలూ ఫుట్‌బాల్ ఆటల్ని వీక్షించేందుకు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా అనుమతించ వచ్చని ఆశిస్తున్నారు ♦ శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఎన్నికల్లో తొలి ఆమెరికన్–ఆఫ్రికన్ మహిళా మేయర్‌గా 43 ఏళ్ల లండన్ బ్రీడ్ ఎన్నికయ్యారు. సామాజిక కార్యకర్త అయిన బ్రీడ్.. నగరంలో గృహ వసతి కొరతను తగ్గిస్తానని అంటున్నారు ♦ గత ఎనిమిదేళ్లుగా నాంపల్లి కోర్టులో 1500 వరకట్న కేసులు పెండింగులో ఉన్నాయి! విచారణ పూర్తయిన వాటిల్లో కూడా కేవలం పది శాతం కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష పడిందన్న తాజా వార్త న్యాయపోరాటం చేస్తున్న బాధితులకు నిస్పృహ కలిగించే విషయమే -
స్త్రీలోక సంచారం
♦ రష్యన్ ‘సొప్రానో’ ఐదా గారిఫులినా పాటతో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. గొంతులో అత్యధిక గమకాలను పలికించగల ప్రతిభ ఉన్న మహిళను, బాలికను ‘సొప్రానో’ అంటారు ♦ తెలంగాణ ‘ఐసెట్’లో (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) నాల్గవ ర్యాంకుతో ఎస్.లక్ష్మీ స్రవంతి బాలికల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. మేథ్స్ని సాల్వ్ చేయడం ఇష్టం అంటున్న స్రవంతి ఉస్మానియా యూనివర్సిటీలో చేరాలనుకుంటోంది ♦ మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ‘రోజుకొక కొత్త నైపుణ్యాన్ని సాధించగలరా?’ అని ట్విట్టర్లో తన పరిధిలోని పోలీసు అధికారులందరికీ సవాల్ విసిరారు. చందన 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ♦ భారత ప్రభుత్వం తొలిసారిగా ఒక మహిళను హజ్ యాత్రకు కోఆర్డినేటర్‌గా నియమించింది! ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసులో పనిచేస్తున్న మొయినా బెనజీర్.. ఒంటరిగా హజ్‌కు బయల్దేరుతున్న 1300 మంది మహిళలకు సమన్వయకర్తగా ఉంటారు ♦ ముంబైలోని ప్రభాదేవి ఏరియాలో ఉన్న అతి విలాసవంతమైన 33 అంతస్తుల ‘బ్యూమాండె’ అపార్ట్మెంట్ ‘బి’వింగ్ పెంట్‌హౌస్ డ్యూప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఫ్లాట్ ఆ అపార్ట్మెంట్లోనే ఉండడంతో ఆమె సురక్షితంగానే ఉన్నారా అనే విషయమై అభిమానులు ఆందోళన చెందారు ♦ తల్లి కడుపులో ఉన్న శిశువులకు మొజార్ట్ సంగీతం వినసొంపుగా ఉంటుందనీ, అడెల్ సంగీతం కలవరం కలిగించే ప్రమాదం ఉందని లండన్‌లో జరిగిన ఒక సర్వే వెల్లడించింది. మోజార్ట్ 18వ శతాబ్దం నాటి ఆస్ట్రియా సంగీతకారుడు కాగా, అడెల్ 1988లో పుట్టిన ముప్పై ఏళ్ల ఇంగ్లండ్ గాయని ♦ లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు కావడంతో లాస్ ఏంజెలిస్‌లో ప్రసిద్ధ ఫ్యాషన్ కంపెనీ ‘గెస్’ సహసంస్థాపకుడు పాల్ మార్సియానో తన పదవి నుంచి వైదొలిగారు. ఎనిమిదేళ్ల క్రితం ఫొటోషూట్‌కి పిలిచి, పాల్ తన వక్షోజాలను తాకాడని కేట్ అప్టన్ అనే మోడల్ తొలిసారిగా బహిర్గతం చెయ్యడంతో మిగతా బాధితులు కూడా బయటికొచ్చారు ♦ పిల్లల్ని ఎక్కువ సమయం తండ్రితో గడపనివ్వాలని హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీకి కోర్టు సూచించింది. ఏంజెలీనా, బ్రాడ్‌పిట్ దంపతులు విడిపోయాక, పిల్లల సంరక్షణ బాధ్యతపై కోర్టును ఆశ్రయించినప్పుడు న్యాయమూర్తి ఈ విధమైన సూచనను చేశారు ♦ యు.ఎస్.లోని నంబర్ వన్ ఆటోమొబైల్స్ కంపెనీ ‘జనరల్ మోటార్స్’ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా దివ్యా సూర్యదేవర సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆమె కంపెనీ కార్పోరేట్ ఫైనాన్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. -
స్త్రీల రచనలకూ విలువ లేదా?
ఏఎన్ డెవర్స్ యువ రచయిత్రి. పబ్లిషర్ కూడా. ఉండడం యు.ఎస్.లో. త్వరలో ఆమె ‘ది సెకండ్ షెల్ఫ్’ అని ఒక ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. సైట్లోకి వెళ్లి చూస్తే ‘కమింగ్ సూన్’ అని కనిపిస్తుంది. అరుదైన పుస్తకాల తొలి ప్రతులను, చేతిరాతలను సేకరించి భద్రపరచడం, వాటిని పునర్ముద్రించడం, ఆ రచనలకు పాఠకాదరణ కల్పించడం డెవర్స్ ఉద్యమ లక్ష్యం. అయితే అవన్నీ కూడా మహిళలు రాసినవి, మహిళలపై రాసినవి మాత్రమే అయి ఉంటాయి! ఎందుకని డెవర్స్ ఈ విధమైన వివక్షాపూరిత లక్ష్యాన్ని ఎంచుకున్నారు? పుస్తకం పుస్తకమే కదా! రచయిత రాస్తే ఏముంది? రచయిత్రి రాస్తే ఏముంది? ఈ ప్రశ్న అడగడానికి ముందు డెవర్స్‌ను ‘ది సెకండ్ షెల్ఫ్’ ప్రాజెక్టుకు ప్రేరేపించిన ఒక సందర్భం గురించి తెలుసుకోవాలి. ఇటీవల డెవర్స్ న్యూయార్క్ నగరంలో జరుగుతున్న ఒక పుస్తక ప్రదర్శనకు వెళ్లారు. అక్కడ కొత్తవి, పాతవీ పుస్తకాలున్నాయి. పాతవి అంటే ఫస్ట్ ఎడిషన్ పుస్తకాలు. వాటిల్లో ఒక సీనియర్ రచయిత్రి రాసిన పుస్తకం ధర కేవలం 25 డాలర్లు, అన్ని పేజీలతోనే ఉన్న ఒక సీనియర్ రచయిత రాసిన ఫస్ట్ ఎడిషన్ పుస్తకం ధర వందల డాలర్లు ఉండడం డెవర్స్ గమనించారు. రచనలకు విలువ కట్టడంలో కూడా స్త్రీపురుష అసమానత, అనాసక్తత ఉండడం డెవర్స్‌కు ఆవేదన కలిగించి, ఆమెలో ఆలోచన రేకెత్తించింది. ఈ వివక్షను రూపుమాపడానికి స్త్రీల రచనలకు, స్త్రీలపై వచ్చిన రచనలకు ఒక పబ్లిషర్‌గా కూడా డెవర్స్ ప్రాముఖ్యం ఇవ్వాలనుకున్నారు. అలా ఆవిర్భవించబోతున్నదే ‘ది సెకండ్ షెల్ఫ్’ ప్రాజెక్ట్. కొత్తగా వస్తున్న పుస్తకాల్లో కూడా పుస్తకం వెల నిర్ణయించే విషయంలో లైంగిక వివక్ష ఉంటోందని ఈ మధ్య వచ్చిన ఒక సర్వే కూడా డెవర్స్‌ను ఈ ఆలోచనకు పురికొల్పింది. ‘దీన్ని నేనొక బిజినెస్‌గా తీసుకోవడం లేదు. బాధ్యత అనుకుని చేస్తున్నాను’’ అంటున్నారు డెవర్స్. -
ఈ వేధింపులు.. ఇంకెన్నాళ్లు?
సాక్షి, గుంటూరు: టీడీపీలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నామంటూ ఆ పార్టీ నేతలు ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధులు, టీడీపీ మహిళా నేతలపై జరుగుతున్న వేధింపుల పర్వం పరిశీలిస్తే అందులో నిజం ఏ కోశానా లేదని అర్థమవుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సొంత పార్టీలోనే మహిళ ప్రజాప్రతినిధుల పట్ల ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు తీవ్ర చులకన భావంతో వ్యవహరిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు తమ చెప్పుచేతల్లో ఉండాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. తమ మాట వినని వారిపై వేధింపులకు దిగుతున్నారు. వారిని ఏ కార్యక్రమాలకూ ఆహ్వానించవద్దని, ఏ పని చెప్పినా చేయవద్దంటూ నేరుగా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ప్రత్తిపాడు, బాపట్ల, మాచర్ల, తాడికొండ, మంగళగిరి, సత్తెనపల్లి వంటి నియోజకవర్గాల్లో మహిళా ప్రజాప్రతినిధులు తీవ్ర వివక్షతకు గురవుతున్నారు. చివరకు మండల, జిల్లా స్థాయి మహిళా ప్రజాప్రతినిధులు సైతం సొంత పార్టీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మంగళగిరిలో దళిత తేజం పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమంలోనే దళిత మహిళా నేతపై అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నేత దాడికి దిగటం కలకలం రేపిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నేతలపై జరిగిన వేధింపుల పర్వాన్ని పరిశీలిస్తే... మంగళగిరిలో ఇటీవల టీడీపీ దళిత మహిళా నేత వనరాణిపై ఆ పార్టీ నేత పోలవరపు హరిబాబు దాడిచేసి కొట్టిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దళిత తేజం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలోనే దళిత మహిళా నేతపై దాడికి దిగటం సర్వత్రా కలకలం రేపింది. ఈ ఘటనను కప్పిపుచ్చుకునేందుకు పార్టీ అధిష్టానం హరిబాబును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి చేతులు దులుపుకొంది. విశేషమేమంటే.. హరిబాబుకు పార్టీ నుంచి సస్పెండ్ కావడం కొత్తేమీ కాదు. గతంలో సైతం ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నగదు వసూలు చేసిన కేసులో ముద్దాయిగా ఉండటంతో అప్పట్లో టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం.. విషయం సమసిపోయాక మళ్లీ చేర్చుకోవడం పరిపాటిగా మారింది.lజిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, జిల్లా ప్రథమ పౌరురాలిగా ఉన్న షేక్ జానీమూన్కి సైతం సొంత పార్టీ నేతల వేధింపులు తప్పలేదు. ఆమె సొంత మండలమైన కాకుమానులోనే కనీసం గౌరవం ఇవ్వకుండా అధికారులు సైతం ఆమె మాట వినకుండా అప్పటి మంత్రి రావెల కిషోర్‌బాబు వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. ఆమె ఇంటిపై దాడులకు సైతం తెగబడడంతో తట్టుకోలేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తనకు మంత్రి రావెలతో ప్రాణహాని ఉందని చెప్పి ఆమె భోరున విలపించిన విషయం తెలిసిందే. ∙గుంటూరు రూరల్ ఎంపీపీ లక్ష్మీకుమారి సైతం ఎమ్మెల్యే రావెల వేధింపులకు తట్టుకోలేక కనీస గౌరవం ఇవ్వటం లేదంటూ నిరాహారదీక్షకు దిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ పార్టీ జిల్లా నేతలు వారితో చర్చలు జరిపి వివాదం సద్దుమణిగేలా చూశారు. అయితే ఇప్పటికీ ఆమెకు ఎవరూ సహకరించని పరిస్థితి నెలకొంది. మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గోపవరపు శ్రీదేవిని సైతం పదవిలో ఉండగానే తీవ్ర వేధింపులకు గురిచేయడం, ఆమెను పదవి నుంచి దిగిపోవాలంటూ తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. వారి ఒత్తిళ్లు తట్టుకోలేక శ్రీదేవి భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతిచెందారు. అయినా తీరుమార్చుకోని టీడీపీ నేతలు ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించారు. ఈ సంఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీదేవి ఆత్మహత్య చేసుకుని మృతిచెందారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు టీడీపీ నేతల దుష్ట రాజకీయాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారాడు. బాపట్ల ఎంపీపీ మానం విజేత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒత్తిడి, బెదిరింపులు తట్టుకోలేక తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురయ్యారు. పదవి నుంచి దిగిపోవాలంటూ నియోజకవర్గ బాధ్యుడు ఆమెపై ఒత్తిడి తేవడం వల్లే ఆమె ప్రాణాల మీదకు వచ్చిందని భర్త, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం అమినాబాద్ సర్పంచ్ బి.గోవిందుభాయి తనకు తెలియకుండా గ్రామ జన్మభూమి కమిటీని మార్చారంటూ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించగా, ఆయన దూషణలకు దిగారంటూ విలేకరుల సమక్షంలో వాపోయిన విషయం తెలిసిందే. జిల్లాలో అధికార పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే.. ఇతర పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
వి'కక్ష'
స్త్రీ పురుషుల శారీరక, భౌతిక ప్రత్యేకతల రీత్యా స్త్రీలు ఇంటిపనికీ, పురుషులు బయటిపనికీ పరిమితమయ్యారు. కాలక్రమేణా స్త్రీలు చేసే ఇంటిశ్రమకు గుర్తింపే లేని పరిస్థితి ఏర్పడింది. శ్రమ విభజన.. పనిలో సైతం స్త్రీ పురుష అంతరాలు కొనసాగిస్తోంది. దీంతో గృహసంబంధిత పనులు స్త్రీలే చేయాలనే భావం, ఉద్యోగం పురుష లక్షణంగా పాతుకుపోయింది. పురుషులు బయటకెళ్లి సంపాదించేవారు కనుక వారికి సమాజం అధిక ప్రాధాన్యమిస్తోంది. స్త్రీలు పిల్లల పెంపకం, వంట, ఇంటిపనులకే పరిమితం. ఆమె చేస్తున్నది అనుత్పాదక పని కనుక ఆమెను ద్వితీయ శ్రేణి పౌరురాలిగా సమాజం నెట్టివేసింది. ఉత్పాదక రంగంలో ఉన్న పురుషుల శ్రమని లెక్కించొచ్చు. కానీ స్త్రీలు చేసే పనికి కొలమానం లేకుండా నిర్లక్ష్యానికి గురయ్యింది. ఈ ఆర్థికపరమైన విభజన భావనే స్త్రీ పురుష అసమానతలకు పునాది అని సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం. పెట్టుబడిదారీ సమాజం రెండు రకాలైన శ్రామికులను తయారు చేసింది. తక్కువ వేతనంతో ఎక్కువగా (పనిగంటలు) శ్రమించే వారు ఒకరకం అయితే అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితిలో ఉండి ఎక్కువ వేతనాలు పొందుతూ తక్కువ పనిగంటలు శ్రమించేవారు రెండవ రకం. (ఉదాహరణకు కన్స్ట్రక్షన్ పనిలోఉండేవారు) మొదటి రకం శ్రామికులు స్త్రీలైతే, రెండవ రకం వారు పురుషులు. ఈ విభజన పనిలో లింగ వివక్షకు ప్రత్యక్ష ఉదాహరణ. స్త్రీలపై సమాజంలో కొనసాగుతోన్న వివక్షలన్నిటికీ ఇదే మూలం. గర్భంలో వివక్ష ఆరోగ్యం, ఆహారం విషయంలో, స్త్రీల పట్ల శ్రద్ధ వహించకపోవడం వల్ల అనారోగ్యం కారణంగా ఎందరో స్త్రీలు (మిస్సింగ్ వుమన్) కనపడకుండా పోతున్నారు. ఉండాల్సిన సెక్స్ నిష్పత్తికీ, మనుగడలో ఉన్న సెక్స్ నిష్పత్తికీ మధ్యనున్న తేడానే మిస్సింగ్ వుమన్గానూ, స్త్రీలపట్ల కొనసా గుతున్న వివక్షకి కొలమానంగానూ భావిస్తున్నారు. ♦ 2001లో - 3.91కోట్లు భారత దేశంలో మిస్సింగ్ వుమన్ సంఖ్య ♦భారతదేశంలో బాలబాలికల శాతం (0–6 యేళ్లు) ప్రతి 1000 మంది బాలురకి 1991లో - 945 ,2001లో - 927 , 2011లో - 914 ♦ 7000మంది మన దేశంలో పుట్టకముందే ప్రతి రోజూ చనిపోతున్న ఆడపిల్లలు (యునెటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) రిపోర్టు ప్రకారం) ఆహారంలో వివక్ష అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో స్త్రీల ఆహారం విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ వివక్ష కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ దేశాల్లో ‘సన్ ప్రిఫరెన్స్’ అత్యధికంగా ఉంది. పురుషులకు ఈ రెండు విషయాల్లోనూ ప్రథమ ప్రాధాన్యతనిస్తున్న పరిస్థితి ఉంది. పురుషులకన్నా స్త్రీలు తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నట్టు అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. పురుషులకన్నా స్త్రీలు 29 శాతం తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నారు. సాధారణంగా మన భారతీయ మహిళలు తీసుకుంటున్న ఆహారం 1,400 కిలో క్యాలరీలు మాత్రమే. నిజానికి ప్రతిరోజూ ఒక స్త్రీకి తక్కువలో తక్కువ అవసరమైనది 1,600 కిలో క్యాలరీలు. కానీ ప్రతి స్త్రీ అవసరమైన దానికన్నా 200 కిలో క్యాలరీలు తక్కువగా తీసుకుంటోంది. 1600 - నిజానికి ప్రతిరోజూ ఒక స్త్రీ కి తక్కువలో తక్కువ అవసరమైన కిలో క్యాలరీలు. 1400 - మన భారతీయ మహిళలు తీసుకుంటున్న ఆహారం కిలో క్యాలరీలు శ్రమలో వివక్ష ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం ఆహార ఉత్పత్తిని స్త్రీలే సృష్టిస్తున్నారు. భారతీయ స్త్రీ సగటున ప్రతిరోజూ నాలుగు గంటలపాటు లేదా తన జీవితకాలంలో 16 శాతం వంటింటిలోనే గడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం శ్రామికుల్లో 40 శాతం మంది స్త్రీలే. ప్రత్యేకించి వ్యవసాయరంగంలో పనిచేస్తోన్న శ్రామికుల్లో 43 శాతం మంది మహిళలే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉపాధి రంగంలో స్త్రీల సంఖ్య పెరగడానికి ఫెర్టిలిటీ శాతం తగ్గడం ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు.1980–2008 సంవత్సరాల మధ్య ఉత్పాదక శ్రమ భాగస్వామ్యంలో స్త్రీ పురుష వివక్ష 32 శాతం నుంచి 26 శాతానికి తగ్గినట్టు వరల్డ్ డెవలప్మెంట్ 2012 రిపోర్టు తేల్చి చెప్పింది. ప్రతిఫలంలో వివక్ష బయటకెళ్ళి పనిచేసేవారిలో స్త్రీలకంటే పురుషులే అధికం. అయితే ప్రధానంగా పేద కుటుంబాల్లో స్త్రీలు ఉత్పాదక శ్రమలోనూ, ఇటు గృహ సంబంధమైన అనుత్పాదక శ్రమలోనూ భాగం అవుతారు. ఇలాంటి శ్రామిక కుటుంబాల్లో గృహశ్రమభారం స్త్రీలపై అదనంగా ఉంటుంది. పురుషులు ఎక్కడా ఈ శ్రమలో భాగం కారు. దీనివల్ల పురుషులకంటే స్త్రీలు అధిక గంటలు శ్రమిస్తారు. ఇటువంటి అసమాన శ్రమవిభజన ద్వారా స్త్రీలపై పడే అదనపు శ్రమ భారాన్ని ‘అక్యుములేషన్ ఆఫ్ లేబర్’ అని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, అంతర్జాతీయ మానవహక్కుల నాయకులు ఆమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. ఆదాయంలో వివక్ష కేవలం అసంఘటిత రంగంలోనే కాకుండా సంఘటిత రంగంలో సైతం వేతనాల్లో స్త్రీలు వివక్షకు గురవుతున్నారు. అది అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కింది విధంగా ఉంది. స్త్రీపురుషుల సంపాదనలో వ్యత్యాసం అభివృద్ధి చెందిన 19 దేశాల్లో మహిళలు - 0.77% , పురుషులు - 0.23% అభివృద్ధిచెందుతోన్న 42 దేశాల్లో మహిళలు - 0.73% , పురుషులు - 0.27% స్త్రీపురుష వేతన వ్యత్యాసం అభివృద్ధి చెందిన దేశాల్లో 23 శాతం, అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో 27 శాతం గా ఉన్న విషయాన్ని పై వివరణ తెలియజేస్తోంది. అక్షరాస్యతలో వివక్ష భారత దేశంలో బాలబాలికల అక్షరాస్యతా శాతం 2001లో 75.26, 53.67 శాతం నుంచి 2011కి వచ్చేసరికి 82.14, 65.46కి పెరిగింది. అయితే మహిళల అక్షరాస్యతాశాతం దాదాపు 54 శాతంగా ఉంది. దీన్ని బట్టి కేవలం జనాభాలో సగం మంది మహిళలు మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు. విద్యకి తక్కువ ప్రాధాన్యతనిస్తున్న కారణంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో భారత దేశం 126 వ స్థానం నుంచి దిగజారి 134 స్థానానికి చేరింది. ప్రాథమిక స్థాయిలో 2009లో బాలబాలికల ఎన్రోల్మెంట్ రేటు బాలురలో 115 గానూ, బాలికల్లో 111 గానూ ఉంది. ఇదే చైనాలో అయితే బాలురలో 111 గానూ, బాలికల్లో 115గానూ ఉంది. చైనా తరువాత బాలికల్లో డ్రాపౌట్ రేట్ భారతదేశంలోనే అధికంగా ఉంది. డ్రాపౌట్ రేటు అధికంగా ఉండడానికి అనేక కారణాలున్నా ప్రధానమైనది తల్లిదండ్రుల నిరక్షరాస్యతే. వివాహాల్లో వివక్ష భారతదేశ సగటు వివాహ వయస్సు 13 నుంచి 14 మాత్రమే. చట్టప్రకారం ఇది 18 ఏళ్ళైనా, దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరిది బాల్య వివాహమే. నేపాల్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరిది బాల్య వివాహమే.మనకన్నా నేపాల్ కొంత మెరుగు. అక్కడ కనీస వివాహ వయస్సు 15 ఏళ్ళు. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో యాభై శాతం మంది పదహారేళ్ళలోపే బాల్యవివాహాల బారిన పడుతున్నారు.బాల్య వివాహాలు ఆడుకునే వయస్సులోనే తల్లిగా మారుస్తున్న పరిస్థితి ఎదురవుతోంది. బాల్య వివాహాల్లో అధికమంది బాలికలు 15 ఏళ్ళలోపే బిడ్డకి తల్లులవుతున్నారు. పుట్టిన పిల్లల సంరక్షణ బాధ్యత కూడా అమ్మాయిలపై పడుతోంది. అది వారి ఆరోగ్యంపైన ప్రభావం చూపుతోంది. ఈ బాల్య వివాహాలే మాతా శిశు మరణాలకు కూడా కారణం అవుతున్నాయి. వివక్షే స్త్రీలపై హింసకు కారణం స్త్రీల పట్ల వివక్ష అంతిమంగా స్త్రీలపై హింసకు దారితీస్తుంది. ఈ హింస ఆడపిల్ల పుట్టుకతోనే ఆరంభం అవుతుంది. ఇదే హింస స్త్రీల జీవితమంతా వెంటాడుతుంది. సంపాదనలోనూ, ఆస్తిలోనూ, కుటుంబంలో ఆహారం, ఆరోగ్యం విషయంలోనూ తారతమ్యాలకు ఇదే వివక్ష కారణమౌతుంది. అది అంతిమంగా హింసకు దారితీస్తుంది. ఇలాంటి అన్ని రకాలైన వివక్షకు పేద, ధనిక దేశాల్లో తేడా ఏంలేదు. దేశాల, సమాజాల, వ్యక్తుల ఆర్థిక స్థితిపై ఈ వివక్ష ఆధారపడి లేదు. అలా వరకట్నం హింసకు ఒక పనిముట్టుగా తయారయ్యింది. గృహహింసలో వరకట్న మరణాలు చాలా తీవ్రంగా పరిణమిస్తున్నాయి. లైంగిక హింస తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి. అమ్మాయిల అక్రమ రవాణాకూ, స్త్రీలైంగిక దోపిడీకి పేదరికం ఒక కారణంగా మారుతోంది. ♦ స్త్రీలపై హింసకు అంతర్జాతీయంగా అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా పురుషాధిపత్య భావజాలం, పురుషస్వామ్యం, అసమాన ఆధిపత్యం దీనికి కారణంగా భావించాలి. అయితే స్త్రీల అవిద్య, అరకొరా చదువులు దీనికి మరి కొంత కారణం అవుతున్నాయి. ♦ ఆర్థిక స్వాతంత్య్రం, కుటుంబేతర ఆర్జిత ఉపాధి అవకాశాలూ, ఆర్థిక అసమానతలూ, ఆస్తిహక్కు, విద్యావకాశాలూ స్త్రీలు స్వతంత్రతకు ఒక మార్గం వేస్తాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతలో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ స్త్రీల సాధికారతను సుసాధ్యం చేస్తాయి. పురుషస్వామ్యాన్నీ, పురుషాధిపత్యాన్నీ, స్త్రీలపై హింసనీ దూరంచే యడంలో ఇవే కీలక భూమిక పోషిస్తాయి. -
మగాళ్లు మారాలి
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ‘‘స్త్రీలు ప్రపంచ పనిగంటల్లో 60 శాతం పనిచేస్తారు. ప్రపంచ ఆదాయంలో పదిశాతం మాత్రమే పొందుతారు. ప్రపంచ సంపదలోనైతే ఒకేఒక శాతం మీద మాత్రమే స్త్రీలకు యాజమాన్యం ఉంటుంది.’’ ఇది 1980, 90 దశాబ్దాల లెక్కల ప్రకారం. ఇప్పుడు పరిస్థితి మరింత క్షీణించింది. స్త్రీలు ఎంతో శ్రమ చేసి, తక్కువ పొందటం ఒకరకమైన వివక్ష అయితే, స్త్రీలు చేసే పనులు విలువలేనివిగా, దాని వల్ల స్త్రీలు విలువలేనివారుగా పరిగణించడం మరొకరకం వివక్ష. వివక్ష వేరు వేరు కాలాలలో, వేరువేరు ప్రాంతాల్లో వేరుగా ఉంటుంది. కానీ సారాంశంలో మాత్రం స్త్రీలు తక్కువ స్థాయి వారు, వారు పురుషుల కంట్రోలులో ఉండాలి అనే ప్రాథమిక సూత్రంపై వివక్ష ఆధారపడి ఉంటుంది. మన అమ్మమ్మల కాలంలో పద్ధతులిప్పుడు లేవు. అలాగే దళిత స్త్రీలపై, గిరిజన స్త్రీలపై ఉండే వివక్షకూ అగ్రవర్ణ స్త్రీలపై అమలయ్యే వివక్షకూ ఎంతో తేడా ఉంటుంది. ఈ వివక్షలో అతి ప్రధానమైన, ప్రాథమికమైన నియంత్రణలు లైంగికత్వం మీద, సంతానోత్పత్తి మీద, శ్రమ మీదా అమలు జరుగుతాయి. ఈ నియంత్రణలను కచ్చితంగా అమలు చేయాలంటే స్త్రీల కదలికలను నియంత్రించాలి. ఒకప్పుడు స్త్రీలను ఇల్లుదాటి బైటికి రానివ్వకపోతే, ఇప్పుడు రాత్రి పొద్దుపోయాక రావొద్దంటున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే సంచరించాలనే ఆంక్షలు పెడుతున్నారు. ఈ వివక్షను కొనసాగించడానికి అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో ఉపయోగించే సాధనం హింస. లైంగిక అత్యాచారం, లైంగిక అవమానాలు, గృహహింస, çపనిచేసే చోట లైంగిక వేధింపులు– వీటన్నింటితో స్త్రీలలో భయాన్నీ, అభద్రతా భావాన్నీ కల్పించి వివక్ష విశ్వరూపంతో వర్ధిల్లుతోంది. ఈ వివక్షలన్నింటినీ స్త్రీలు సవాలు చేస్తున్నారు. చట్టాలలో మార్పులకోసం కృషి చేస్తున్నారు. స్త్రీలలో ఇలా చైతన్యం పెరగటం అనేది కచ్చితంగా మార్పే. కానీ ఇప్పుడు చైతన్యం పెరగవలసింది పురుషులలో. స్త్రీలు అన్ని రంగాలలోకీ వస్తున్నారు. కానీ పురుషులు ఇంటి పనులకు ఇంకా దూరంగానే ఉంటున్నారు. ఇంటి పనికి సమాజం విలువ కట్టడం లేదు. శ్రమగా గుర్తించటం లేదు. పిల్లల పెంపకంలోకి పురుషులు రావటం లేదు. సమానత్వం లేనిదే తమ కుటుంబ సభ్యులైన స్త్రీల ప్రేమను వారెన్నటికీ పొందలేరనే ఎరుక వారికి కలగటం లేదు. స్త్రీలను సమానులుగా భావించటం వల్ల తామేదో కోల్పోతామనే తెలివితక్కువ ఆలోచన నుండి బయటపడి, తాము ఎంతో పొందుతామనీ, సమాజం అభివృద్ధి చెందుతుందనీ పురుషులు గ్రహించేలా స్త్రీలు తమ పోరాటాలను నడిపి, వివక్షను నిర్మూలించాలి. - ఓల్గా, రచయిత్రి -
సౌవార్తిక ఉద్యమంలో బలమైన పాత్ర 'ఆమె'దే!
సమాజం అనుసరించే ద్వంద్వ ప్రమాణాలకు బలై స్త్రీ ద్వితీయశ్రేణికి చెందిన జీవిగా, కేవలం వినోద సాధనంగా, పిల్లల్ని పుట్టించే యంత్రంగా పరిగణింపబడుతున్న సమాజంలోకి యేసు అరుదెంచి స్త్రీలను గౌరవించే విషయంలో ఒక విప్లవాన్నే తెచ్చాడు. నాటి స్త్రీలు బయటి ఆవరణాన్ని దాటి ఆలయం లోపలికి ప్రవేశించకూడదు. సమాజ మందిరంలో పురుషులతో సమానంగా కూర్చోకూడదు. పవిత్ర గ్రంథమైన ‘తోరా’ను స్త్రీలు తాకకూడదు. పురుషుడు భార్యతోనైనా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడకూడదు. స్త్రీని ఇన్ని కట్టుబాట్లకు బానిసగా మార్చిన నాటి సమాజంలో యేసుక్రీస్తు వారికి అత్యంత గౌరవప్రదమైన స్థానాన్నిచ్చాడు. దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన వ్యక్తిత్వాన్నిచ్చి సృష్టించాలనుకున్నప్పుడు అతన్ని పురుషునిగా, స్త్రీగా చేశాడు. అంటే తనను రెండుగా విభజించి ఆ రెండు భాగాలుగా స్త్రీ పురుషులను దేవుడు సృష్టించాడు. కాని కాలక్రమంలో సమాజం దైవాభీష్టానికి వ్యతిరేకంగా పురుషాధిక్య సమాజంగా మారందని యేసు తన బోధలు, కార్యాల ద్వారా హెచ్చరించాడు. అధమజాతికి చెందిన ఒక సమరయ స్త్రీకి యాకోబు బావి వద్ద యేసు అనేక గంటలపాటు ప్రవచనం చెప్పి ఆధ్యాత్మిక లోతులు వివరించాడు (యోహాను 4:7–26). పాపం చేస్తూ, దొరికిన స్త్రీని ‘అమ్మా’ అని అనునయంగా సంబోధించి మరణ శిక్ష నుండి తప్పించి క్షమించాడు. (యోహాను 8:10–11). రక్తస్రావమనే ఎంతో ఇబ్బందికరమైన వ్యాధితో బాధపడుతున్న స్త్రీని బాగు చేసి ఆమెకు శాంతిని ప్రసాదించాడు. పద్ధెనిమిదేళ్లపాటు నడుము వంగిపోయి వ్యధననుభవిస్తున్న స్త్రీని బాగు చేసిన ఆమెను ‘అబ్రాహాము కుమార్తె’గా ప్రకటించాడు (లూకా 18:16). తనను అత్తరుతో అభిషేకించిన ఒక పాపాత్మురాలైన స్త్రీని అంతా ఈసడించుకుంటే ఆయన మాత్రం ఆమెను పొగిడాడు. మరియ ఆయన పాదాల దగ్గరే కూర్చొని రోజంతా ఆయన మాటలు వింటూంటే ఆమె ఎన్నుకున్నది అత్యుత్తమమైన మార్గమన్నాడు. సిలువను మోస్తూ కూడా యెరూషలేము కుమార్తెలను ఓదార్చాడు. సిలువలో వేలాడుతూ తన తల్లి బాధ్యతల్ని శిష్యునికప్పగించాడు. తాను పునరుత్థానుడియ్యానని అందరికీ చెప్పమంటూ మగ్దలేనె మరియను ఆదేశించి ఆమెను తొలి సువార్తికురాలిని చేశాడు. విశ్వంలో, ఆకాశంలో స్త్రీది సమాన భాగమని, ఆమెది సగభాగమని ఆచరణలో ప్రకటించిన మహా విప్లవకారుడు యేసుక్రీస్తు. స్త్రీని గౌరవించి ప్రోత్సహించడమే సమాజ పురోగతికి గీటురాయి అని ఆయన బోధలు చెబుతాయి. ఆదిమకాలం నుండి ఇప్పటిదాకా సౌవార్తిక ఉద్యమంలో, చర్చి చరిత్రలో స్త్రీది చాలా ప్రధానమైన పాత్ర. ఒక బలమైన సమాజానికి పునాది బలమైన కుటుంబమైతే, బలమైన కుటుంబ నిర్మాణంలో ముఖ్యపాత్ర తల్లిగా, భార్యగా స్త్రీదే!! స్త్రీకి సమాన హోదానిచ్చి గౌరవించనివాడు అనాగరికుడు, క్రైస్తవ స్ఫూర్తికి విరుద్ధమైన వాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మహిళలూ... పదండి ముందుకు!
ఇపుడు మహిళలు అన్ని రంగాల్లోకీ విస్తరించారని వేరే చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే ఇప్పటికీ ఆస్తుల విషయంలో మగవారిదే పైచేయిగా ఉంటోంది. ఎందుకంటే వారే ఎక్కువగా సంపాదిస్తారు కనక సొంతింటి వంటివి వారి పేరిటే ఉండటం... స్వయం ఉపాధిలోనూ వారే ముందుండటం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చటానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకులు కాస్త తెలివైన పథకాలనే అమలు చేస్తున్నాయి. ఎలాగంటే గృహ రుణాల్లో మహిళల పేరిటైతే కాస్తంత వడ్డీ తగ్గిస్తున్నాయి. అలాగే స్వయం ఉపాధి విషయంలో కూడా!!. దీని వల్ల ఇల్లు కొనేవారు రుణం తీసుకోవటానికి తమ ఇంట్లోని మహిళలను కనీసం సహ భాగస్వామిగా నైనా చేసే వీలుంటుంది. సొంతిల్లు కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారా...? సొంతంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని ఉందా...? మీరు మహిళామణులా? అయితే బ్యాంకులు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాయి. రుణానికి దరఖాస్తు చేసుకోవడం ఆలస్యం వేగంగా ప్రాసెస్ చేస్తున్నాయి. ఆడవారి కోసం ప్రత్యేక రుణ పథకాలు, వడ్డీ రేట్లలో రాయితీలను ఆఫర్ చేస్తున్నాయి. వేతన జీవులు ప్రభుత్వరంగంలోని అగ్రగామి బ్యాంకు ఎస్బీఐ మహిళల కోసం గృహరుణాల జారీకిగాను ప్రత్యేకంగా ఓ పథకాన్ని నిర్వహిస్తోంది. దీనిపేరు హర్‌ఘర్. వేతనం ఆర్జించేవారు, స్వయం ఉపాధిలో ఉన్న మహిళలకూ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వేతనం ఆర్జించే వారు అయి ఉండి రూ.30 లక్షల వరకు గృహ రుణం తీసుకోదలిస్తే 0.05% తక్కువగా 8.3% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. సాధారణంగా ఇతర కస్టమర్లకు ఇది 8.35 శాతంగా ఉంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాల వ్యవధిపై రూ.30 లక్షల రుణం తీసుకుంటే 0.05% తక్కువ వడ్డీ రేటు కారణంగా మొత్తం మీద రూ.23,000 ఆదా అవుతుంది. 20 ఏళ్ల కాలంలో రుణంపై వడ్డీ రూపేణా రూ.31.57 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు అయితే రూ.31.8 లక్షలు వడ్డీ అవుతుంది. రూ.30 లక్షలకు పైన రూ.75 లక్షల వరకు ఉండే రుణాలపై వడ్డీ రేట్లు మహిళలకు 8.30–8.35%గా ఉన్నాయి. ఇతరులకు అయితే ఇంతే మొత్తం రుణాలపై వడ్డీ రేట్లు 0.10 శాతం ఎక్కువ. మహిళలకు ఈ స్వల్ప రాయితీ కారణంగా ఆదా అయ్యే మొత్తం 20 ఏళ్ల కాలంలో రూ.50,000 వరకు ఉంటుంది. రూ.75 లక్షలకు పైన రుణాల్లో ఉద్యోగులైన మహిళలకు 8.4–8.45%గా ఉండగా, ఇతరులకు 8.5% అమలవుతోంది. రూ.కోటి రూపాయల రుణంపై 20 ఏళ్ల కాలంలో వడ్డీపై తగ్గింపు రూపంలో మహిళలకు రూ.75,000 వరకు మిగులుతుంది. స్వయం ఉపాధిలో ఉంటే... ఉద్యోగం చేస్తున్న మహిళలతో పోలిస్తే తమకాళ్లపై తాము నిలబడిన స్వయం ఉపాధి మహిళల నుంచి బ్యాంకులు కొంచెం ఎక్కువ వడ్డీ రేటు రాబడుతున్నాయి. అయితే, స్వయం ఉపాధిలో ఉన్న ఇతర కస్టమర్లతో పోల్చుకుంటే మహిళలకు వడ్డీ రేటు రూ.30 లక్షల వరకు రుణంపై 0.05 శాతం మేర తక్కువకే ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. వడ్డీరేటు 8.4 శాతంగా ఉంది. రూ.30లక్షలకు పైన రూ.75 లక్షల వరకు రుణాలపైనా వడ్డీ రేటు 0.05 శాతం తక్కువే ఉంది. రూ.75లక్షలకు పైన రుణం కావాలంటే స్వయం ఉపాధి మహిళలకు ఎస్బీఐ 0.05 శాతం తక్కువగా 8.55 శాతం వరకు వడ్డీ రేటును అమలు చేస్తోంది. వడ్డీ రేట్లు రెండేళ్ల వరకు స్థిరంగా ఉండేలా ఆప్షన్ కూడా ఇస్తోంది. దీంతో రెండేళ్ల పాటు ఒకే వడ్డీ రేటు కొనసాగుతుంది. ఇతర ఆఫర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు మహిళా కస్టమర్లకు రూ.30 లక్షల వరకు రుణాన్ని 8.35 శాతం వడ్డీ రేటుపై ఆఫర్ చేస్తోంది. ఇతరుల కంటే వడ్డీ రేటులో 0.05 శాతం తక్కువ. రూ.30–75లక్షల వరకు రుణాలను 8.4 శాతం వడ్డీ రేటుపై అందిస్తోంది. ఇతరులకు 8.45 శాతం వడ్డీ రేటు అమలు చేస్తోంది. అదే రూ.75 లక్షలకు పైబడిన రుణాలకు వడ్డీ రేటు 8.45 శాతం. ఇతరులతో పోలిస్తే వడ్డీ రేటు 0.05 శాతం తక్కువ. కొన్ని బ్యాంకులు కేవలం వడ్డీ రేట్ల రాయితీలతోనే సరిపుచ్చడం లేదు. ప్రాసెసింగ్ ఫీజులోనూ తగ్గింపునిస్తున్నాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ ఫీజులో మహిళా కస్టమర్లకు 50 శాతం తగ్గింపునిస్తోంది. ఇతరులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.5,000 కాగా, మహిళల్లో ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి రూ.2,500 మాత్రమే తీసుకుంటోంది. ఈ చార్జీలపై జీఎస్టీ అదనం. ఒక్కరిగా, లేదా మరొకరితో కలసి ఉమ్మడిగా దరఖాస్తు చేసినప్పుడు, సంబంధిత ప్రాపర్టీ తమ పేరిట లేదా మరొకరితో కలసి ఉమ్మడిగా హక్కులు కలిగి ఉంటేనే రుణానికి అర్హులు. వ్యాపారం కోసం... సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే బ్యాంకులు వాణిజ్య రుణాలకు సంబంధించి అందిస్తున్న ప్రత్యేక పథకాలను పరిశీలించొచ్చు. సెంట్రల్ బ్యాంకు ‘సెంట్ కల్యాణి’, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ‘ఉద్యోగిని’ పథకం, దేనా బ్యాంకు అందించే ‘దేనా శక్తి’, పీఎన్బీ ‘మహిళా ఉద్యమ్నిధి’ తదితర పథకాలు ఇందుకు సంబంధించినవే. సెంట్ కల్యాణి పథకం కింద సెంట్రల్ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తోంది. అలాగే, రూ.కోటి వరకు ఎటువంటి తనఖా లేకుండానే మంజూరు చేస్తోంది. పీఎన్బీ మహిళా ఉద్యమ్ పథకం కింద పదేళ్ల కాలంలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది. దేనా బ్యాంకు 0.25శాతం తక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తోంది. -
ఆమెకు అనారోగ్యం...
రక్తం పంచిచ్చే అమ్మ.. రక్తం పంచుకుని పుట్టే చెల్లెమ్మ.. అదే రక్తం కరువై అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇంటిల్లిపాదికి ఆనందాన్ని పంచే ఆడపిల్ల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. చిన్నారులనూ రక్తహీనత ముప్పుతిప్పలు పెడుతోంది. ఇదీ మన దేశ సగటు మహిళ పరిస్థితి. తాజాగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఇలాంటి చేదు నిజాలెన్నో బయటపడ్డాయి. సాక్షి, హైదరాబాద్: పురుషులతో పోల్చితే మహిళలే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. చిన్నప్పటి నుంచే మహిళల్లో ఈ సమస్య ఉంటోందని వెల్లడించింది. ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళల్లో రక్తహీనత సమస్య ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాలను తేల్చింది. మన రాష్ట్రంలో 56 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఎక్కువ మంది రక్తహీనత బాధితులున్నారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి 100 మంది మహిళల్లో 58 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. పట్టణ/నగర ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్న వారు 55 శాతం మంది ఉన్నారు. సంప్రదాయ పద్ధతులే కారణం..! మన దేశంలోని సంప్రదాయ పద్ధతులే మహిళల్లో రక్తహీనతకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రక్తహీనత సమస్య మహిళల ఆరోగ్యంపై జీవిత కాలం ప్రతికూల ప్రభావం చూపుతోంది. వయసుకు తగ్గ పొడవు, బరువు పెరగట్లేదు. దీంతో వయసుకు తగ్గట్లు శరీరంలో మార్పులు రావట్లేదు. రక్తహీనత సమస్య ఓసారి వచ్చాక అధిగమించడం కష్టంగా పరిణమిస్తోంది. పౌష్టికాహారం తీసుకోకపోవడంతోనే ఎక్కువగా ఈ సమస్య వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తీసుకునే ఆహారానికి, చేసే పనికి చాలా తేడా ఉంటోంది. సరిపడా ఆహారం తీసుకోకపోవడంతో పాటు విరామం లేకుండా పని చేయడం వల్లే ఎక్కువ మంది మహిళలను రక్తహీనత వెంటాడుతోంది. చర్యలు అంతంత మాత్రమే.. మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య అంశాల్లో రక్తహీనత అతిపెద్ద సమస్య. దీని పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ప్రభావం చూపుతున్నాయి. రక్తహీనత సమస్య నివారణకు మన రాష్ట్రంలో ఏటా రూ.20 కోట్ల విలువైన ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఇవి ఎటూ సరిపోవట్లేదనే అభిప్రాయం ఉంది. గర్భిణులకు మాత్రమే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మాత్రలను పంపిణీ చేస్తోంది. గర్భం దాల్చిన 6 నెలల వరకు, ప్రసవం తర్వాత 6 నెలల వరకు కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఈ మందులు అందట్లేదు. వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఏడాది పాటు ఈ మందులు తీసుకునే మహిళలు 30 శాతానికి మించట్లేదు. దీంతో రక్తహీనత సమస్య బాధితులు ఎక్కువగా ఉంటోంది. బాలికల్లోనూ.. భవిష్యత్ తరం ఆరోగ్య పరిస్థితీ ఇలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో అయితే రక్తహీనత సమస్య ఆందోళనకరంగా ఉంది. ప్రతి 100 మంది చిన్నారుల్లో 60 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భం దాల్చని మహిళలతో పోల్చితే ప్రసవం జరిగిన మహిళల్లో రక్తహీనత కాస్త ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. -
చెల్లి గుండెలో ఎన్ని వ్యధలో...
ఆడపిల్లకి ఎన్నో కష్టాలు. కన్నతల్లికి ఎన్నో శోకాలు. బంగారుతల్లికి ఎన్నో వ్యథలు. ఇది చాలక ఎన్ని శారీరక బాధలో!అన్ని బాధల్లో ఎన్ని వివక్షలో! ఇవి తెలుసుకుంటే చెల్లి జాగ్రత్త పడుతుందని.. గుండెకోతను తప్పించుకుంటుందని.. ఈ వివరాలను అందిస్తున్నాం.మహిళలలో గుండెవ్యాధులు... వాటికి కారణాలూ...తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తే..ఆమె తన వ్యథలను జయిస్తుందని..శారీరక బాధలను ఎదుర్కొంటుందని మా నమ్మకం... మా విశ్వాసం. గుండెపోటు చికిత్సలో విదేశాల్లోనూ మహిళల పట్ల వివక్ష... గుండెపోటు వచ్చినప్పుడు పురుషులకు ఇచ్చే చికిత్సే మహిళలకు అందడం లేదన్న ఆందోళనకరమైన విషయం ఈమధ్యే వెల్లడయ్యింది. ఒక స్వీడిష్ అధ్యయనంలో ఈ అంశం తేటతెల్లమైంది. దాదాపు పదేళ్ల వ్యవధిలో స్వీడన్‌లోని 1,80,368 మంది గుండెపోటుకు గురైన రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపిన విషయాలు సంచలనంగా మారాయి. మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చి కోలుకున్న తర్వాత, మళ్లీ అదే రెండోసారి వచ్చినప్పుడు మృతిచెందే మహిళల సంఖ్య... పురుషులతో పోల్చి చూస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువని ఆ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ విషయమై బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ వ్యాఖ్యానిస్తూ... ‘నిజానికి సామాజికంగా చూస్తే గుండెజబ్బులు అనగానే అదేదో పురుషులకే వచ్చేవనే అభిప్రాయం ఉంది. కానీ మహిళల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్‌తో పోలిస్తే గుండెపోటుతో మృతిచెందే మహిళలే ఎక్కువ’’ అంటూ తన ఆందోళనను వ్యక్తం చేసింది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్. పరిశోధకులు ఈ అధ్యయనాలకు అవసరమైన సమాచారం (డేటా)ను ‘యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్’తో పాటు ‘ద కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్’కు చెందిన ఆన్లైన్ కార్డియాక్ రిజిస్ట్రీ నుంచి స్వీకరించారు. ఆ డేటా ఆధారంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించిన సత్యాలు చాలా దిగ్భ్రాంతిని కలిగించేలా ఉన్నాయి. గుండెపోటుకు గురైన పురుషులకు ఎలాంటి చికిత్స దొరుకుతుందో... చాలా మంది మహిళలకు అదే చికిత్స లభ్యం కావడం లేదు. ఇదే అధ్యయనంలో కో–ఆథర్‌గా వ్యవహరించిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన ప్రొఫెసర్ క్రిస్‌గేల్ ఇందుకు కారణాలు చెబుతున్నారు. ఆయన చెబుతున్న అంశాలివి... ‘‘బయటనుంచి చూస్తే సాధారణ ప్రజానీకంతో పాటు ఆరోగ్యరంగంలో సేవలందిస్తున్న చాలామంది ప్రొఫెషనల్స్‌లో చాలామంది... గుండెపోటు వచ్చిన రోగులందరినీ ఒకేలా పరిగణిస్తారు. గుండెపోటు వచ్చిన వ్యక్తి అనగానే మధ్యవయస్కుడైన ఒక పురుషుడు స్థూలకాయాన్ని కలిగి ఉండి, డయాబెటిస్తో బాధపడుతుంటాడనీ, అతడికి పొగతాగే అలవాటుంటుందని అనుకుంటారు. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్రా అలాగే ఉండలనేమీ లేదు. జనాభాపరంగా చూస్తే గుండెపోటు విస్తృతి మరింత ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో అది మరింత ఎక్కువ’’ అని ప్రొఫెసర్ క్రిస్‌గేల్ పేర్కొన్నారు. జెండర్ పరమైన తేడా ఎందుకంటే... గుండెపోటు వచ్చిన వారికి అందించే చికిత్సలో భాగంగా చేసే బైపాస్ సర్జరీ లేదా స్టెంట్స్ అమర్చడం వంటి వైద్యసేవలు పురుషులతో పోలిస్తే మహిళలకు 34 శాతం తక్కువగా లభిస్తున్నాయి. అంతేకాదు... పురుషులకు ప్రిస్క్రయిబ్ చేసే స్టాటిన్స్ (మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు రెండోసారి మళ్లీ రాకుండా నివారించేందుకు గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లోని పూడికను తొలగించే మందులు) కూడా మహిళలకు 24 శాతం తక్కువగా రాస్తున్నారు. గుండెపోటుకు చికిత్స అందించే మూడు ముఖ్యమైన చికిత్సలూ స్త్రీ, పురుషులకు సమానంగా అందించాలంటూ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ మహిళలకు అవి అందకపోవడమే జరుగుతోంది. ఒకవేళ మహిళలకు కూడా పురుషులకు ఇచ్చే చికిత్సే దొరికితే గుండెపోటుతో మృతిచెందే స్త్రీ, పురుషుల సంఖ్యలో ఇప్పుడు గణనీయంగా ఉన్న తేడా చాలావరకు తగ్గుతుందని ఈ అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. మరికొన్ని అంశాలు... ఈ అధ్యయనంలో భాగంగా చూసినప్పుడు ఏడాదిలో ఇంగ్లాండ్‌లో దాదాపుగా 1,24,000 మంది పురుషులు గుండెపోటుతో హాస్పిటల్లో చేరితే... మహిళల్లో ఆ సంఖ్య దాదాపు 70,000 గా ఉంది. ఈ గణాంకాలను మరీ నిశితంగా పరిశీలించినప్పుడు తెలిసిన సత్యం మరింత విభ్రాంతికి గురిచేసింది. ప్రొఫెసర్ గేల్ చెబుతున్న వివరాల ప్రకారం ‘‘గుండెపోటుతో హాస్పిటల్లో చేరే దాదాపు 50 శాతం మహిళలకు పురుషుల్లాంటి వ్యాధినిర్ధారణ పరీక్షలు జరగడం లేదు లేదా వారి విషయంలో తప్పుడు నిర్ధారణ (మిస్ డయాగ్నోజ్) జరుగుతోంది. ఇక అది వారికి అందించే మొత్తం చికిత్సను తప్పుదారి పట్టిస్తోంది. అంటే మొదట మనమో అంశాన్ని మిస్ చేశామంటే... అది ఆ మొత్తం చికిత్స ప్రక్రియను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా మహిళల్లో మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది’’ అని ఆయన వివరించారు. అంతేకాదు... ఈ అధ్యయనంలో లభ్యమైన విషయాల్లో మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... కేవలం ఒక్క గుండెపోటు మాత్రమే కాదు... డయాబెటిస్, హైబీపీ లాంటి ఇతర రుగ్మతల విషయంలోనూ మహిళలే ఎక్కువగా వాటి బారిన పడుతున్నారు. ఇక బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన ప్రొఫెసర్ జెరేమీ పియర్సన్ మాట్లాడుతూ ‘‘ఈ అధ్యయన ఫలితాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనం వెంటనే ఆయా అంశాలపై దృష్టిసారించాలని చెబుతున్నాయి. మనం అత్యవసరంగా ఈ అంశంపై దృష్టిసారించి, అందరిలోనూ అవగాహన పెంపొందేలా పూనుకోవాలంటూ సూచిస్తున్నాయి. కేవలం ఒక చిన్న జాగ్రత్త అంటే... పురుషులకు అందించే చికిత్సే మహిళలకూ అందించడం అన్న చర్య ద్వారా పరిస్థితులను తేలిగ్గానే మార్చేందుకు అవకాశం ఉంది. అప్పుడు తమ ప్రియమైన వారిని కోల్పోయే పరిస్థితి రాకుండా చేసి, మనమెన్నో కుటుంబాలను ఆదుకోవచ్చు’’ అంటున్నారు జెరేమీ. భారతదేశంలో ఇలా... గుండెపోటు విషయంలో పురుషులకూ, మహిళలకు తేడా ఉందంటే మీరు నమ్ముతారా? మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్ల రుతుక్రమం కొనసాగినంతకాలం మహిళలకు ఒక సహజ రక్షణ ఉంటుంది. కానీ ఒకవేళ చికిత్స విషయానికి వస్తే... సామాజికంగా మహిళలకు అందాల్సిన చికిత్స విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతోంది. ఇదేదో వివక్ష ఎక్కువగా ఉండే మనలాంటి సంప్రదాయ దేశాల్లో మాత్రమే కాదు... బాగా అభివృద్ధి చెందాయని చెప్పుకునే యూరోపియన్ దేశాల్లోనూ ఇదే తేడా కొనసాగుతోంది. స్వీడన్, ఇంగ్లాండ్‌లో జరిగిన అధ్యయనాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అధ్యయనం కొనసాగిన ఆ దేశాల్లోనూ, ఇక మనదేశంలోని మహిళా రోగుల స్థితిగతులను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. పనిలో పనిగా కొన్ని నివారణ చర్యలూ, మరికొన్ని జాగ్రత్తలు కూడా. గుండెజబ్బు విషయంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు... అవి ఎందుకు? భారతీయ స్త్రీ, పురుషుల్లో గుండెజబ్బుల విషయంలో కనిపించే తేడాలేమిటి? అవి ఎందుకు అనే అంశాన్ని పరిశీలిద్దాం. మహిళల్లో గుండెజబ్బుల అంశానికి వస్తే కనిపించే వ్యత్యాసాలు, అసమానతలకు కారణాలను ఐదు అంశాల్లో వివరించవచ్చు... అవి ... మొదటిగా స్త్రీల విషయంలో మెనొపాజ్ వరకు ఈస్టొజ్రెన్ వల్ల గుండె జబ్బుల నుంచి కొంత రక్షణ ఉంటుంది. అందుకనే మగవాళ్ళలో సుమారు యాభైయ్ యేళ్ళలో ఎక్కువ అయ్యే గుండె జబ్బు ఆడవాళ్ళలో అరవయ్ యేళ్ళకు ఎక్కువవుతుంది. ఒక వయసు వరకూ మహిళల్లో గుండెజబ్బుల నుంచి స్వాభావిక రక్షణ లభిస్తుంది. దీనికి కారణం ప్రతి నెలా రుతుక్రమం సమయంలో విడుదల అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్. దీని వల్ల మహిళల గుండెకూ, రక్తనాళాలకూ రక్షణ ఉంటుంది. కాబట్టి రుతుక్రమం ఆగిన వారితో పోలిస్తే... రుతుక్రమం అయ్యే మహిళలకు (మెనోపాజ్ దశకు చేరని వారిలో) గుండెజబ్బులు వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ డయాబెటిస్ వచ్చినా లేదా పొగతాగే అలవాటు ఉన్నా మహిళలకు లభించే ఈ సహజ రక్షణ తొలగిపోతుంది. యాభై ఏళ్లలోపు వయసువారిలో మహిళలో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కవ. కానీ యాభై–అరవైలలో ఈ అవకాశాలు ఇద్దరిలోనూ సమానం. అయితే అరవై ఏళ్లు దాటాక గుండెజబ్బులు మహిళల్లోనే ఎక్కువ. ఒకవేళ గర్భాశయాన్ని, అండాశయాన్ని తొలగిస్తే... వీళ్లకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి. మహిళల్లో గుండెపోటు లక్షణాలు గుండెజబ్బుల విషయంలో అందరికీ తెలిసిన లక్షణం ఛాతీలో నొప్పి మాత్రమే. గుండెపోటు వచ్చినప్పుడు గుండెపై ఒత్తినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చి అది మెడ లేదా భుజం లేదా మెడవైపునకు పాకుతున్నట్లుగా వెళ్తుంది. చెమటలూ పడతాయి. ఊపిరితీసుకోవడమూ కష్టమవుతుంది. ఈ లక్షణాలన్నీ పురుషుల్లో చాలా సాధారణం. మహిళల్లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే 50 శాతం మంది మహిళల్లో మాత్రం ఇవి పురుషులతో పోలిస్తే కాస్త వేరుగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే... బాగా అలసటగా/నీరసంగా ఉన్నట్లుగా ఉండటం (ఫెటీగ్), ఊపిరి ఆడకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కానట్లుగా ఉండటం, పొట్ట పైభాగంలో ఇబ్బంది, దవడలో నొప్పి, గొంతులో నొప్పి, భుజంలో నొప్పి వంటి సాధారణ లక్షణాలకు భిన్నమైనవి కనిపించవచ్చు. మహిళల్లో గుండెజబ్బులకు రిస్క్ ఫ్యాక్టర్స్ మహిళలో గుండెజబ్బులు క్రమేణా అభివృద్ధి చెందుతూ ఉండటానికి కొన్ని అంశాలు దోహదపడుతుంటాయి. ఆ అంశాలనే రిస్క్‌ఫ్యాక్టర్స్‌గా చెప్పవచ్చు. అవి... వయసు ∙ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండెజబ్బులున్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ∙రక్తపోటు ∙మధుమేహం ∙రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ∙పొగతాగే అలవాటు ∙స్థూలకాయం ∙శారీరక శ్రమ/వ్యాయామం అంతగా లేకపోవడం ∙ఒత్తిడి. ఇక కొలెస్ట్రాల్ విషయానికి వస్తే రుతుక్రమం ఆగిన తర్వాత రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి కొవ్వు పదార్థాల పెరుగుదల, మంచి కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గడం వంటి అంశాలు కూడా గుండెజబ్బుల రిస్క్‌ను మరింత పెంచుతాయి. మహిళల్లో రుతుక్రమం ఆగాక రక్తపోటు పెరగడానికి అవకాశాలు ఎక్కువ. అది గుండెజబ్బులకు దారితీయవచ్చు. అందుకే రుతుక్రమం ఆగిన మహిళలు తరచూ గుండెజబ్బుల విషయంలో పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్త పడాలి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో సహజ రక్షణ కరవే... కొందరు మహిళల్లో రుతుక్రమం ఆగాక కనిపించే లక్షణాలను తగ్గించడానికి బయట నుంచి ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఇస్తుంటారు. దీన్నే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీగా పేర్కొంటారు. అయితే ఇలా బయటి నుంచి ఇచ్చే ఈస్ట్రోజెన్ వల్ల సహజంగానే మహిళల దేహంలో ఉత్పత్తి కావడం వల్ల అంతకుముందు దొరికే సహజ రక్షణ దొరకకపోవడం ఒక విశేషం. నివారణ: ∙మహిళలు వ్యాయామం చేయడం మనదేశంలో చాలా చాలా తక్కువ. రోజూ కనీసం 30 నిమిషాల చొప్పున వారంలో కనీసం 5 రోజుల పాటు నడక, మెల్లగా జాగింగ్ చేయడం వంటి వ్యాయామాలు మహిళల గుండెజబ్బులను సహజంగానే నిరోధిస్తాయి ∙ఆహారంలో ఉప్పు తగ్గించడం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులను నివారించవచ్చు. ∙రక్తపోటు, డయాబెటిస్ కొలెస్ట్రాల్ పాళ్లు పెరగడం వంటివి ఉంటే తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ శ్రీదేవి, సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ రెండవది, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కూడా పురుషులతో పోలిస్తే... మహిళలలో అవి పది శాతం సన్నగా ఉంటాయి. ఈ అంశం కూడా రక్తనాళాల్లో పూడిక త్వరగా చేరేందుకు దోహదపడుతుంది. మూడవది, గుండె జబ్బు వచ్చినపుడు లక్షణాల బట్టి వైద్యులు తర్వాతి పరీక్షలూ, చికిత్సా చేబడుతారు. ఈ లక్షణాలు మహిళలలో విభిన్నంగా ఉండడమే కాకుండా, అందరు మహిళలలో ఒకే రకంగా ఉండవు. అందువలన మహిళలలో గుండె జబ్బు కనుక్కోవడం ఆలస్యం అవుతుంది. నాలుగవది, వైద్యులు కూడా స్త్రీల చికిత్స విషయంలో కొంచెం వెనకడుగు వేస్తున్నారు. ఐదవది, స్త్రీలలో చికిత్సకు సంబంధించిన కాంప్లికేషన్స్ అధికంగా ఉంటాయి. చివరిగా, పితృస్వామ్య సమాజంలో మహిళల యొక్క గుండె జబ్బులపై పెట్టే ఖర్చు మగవారి జబ్బుకి పెట్టే ఖర్చు కన్నా తక్కువగా ఉండటం ఒక సమస్య. దీనిని సమస్య అనడం కంటే సామాజిక వివక్ష అనడమే కరెక్ట్. స్త్రీ, పురుషుల మధ్య గుండె పోటు చికిత్సలో విభేదాలు భారతదేశంలో కూడా ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చేసిన అనేక పరిశోధనల బట్టి ఈ విషయం తేట తెల్లమవుతుంది. డీమాట్ రెజిస్ట్రీ...: డీమాట్ రెజిస్ట్రీ అనే పరిశొధనలో, ప్రఖ్యాత గుండె నిపుణులు శ్రీనాధ రెడ్డి తదితరులు ఈ విషయాన్ని విపులీకరించడానికి ప్రయత్నించారు. ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ చేసే సమయంలో పురుషులకన్నా స్త్రీలలో మందుల ప్రిస్కిప్ష్రన్ అసంపూర్తిగా ఉందని ఈ పరిశొధనలో తేలింది. అసలు పురుషులలో కూడా పాశ్చాత్య దేశలతో పొలిస్తే మందుల మోతాదు కరెక్ట్ గా లేదని అదే పరిశోధనలో బయటపడటం మరొక సంగతి. దక్షిణ భారత దేశంలోనూ ఈ లింగ భేదాలు ఖచ్చితంగా కనిపించాయి. అయితే కేరళలో మాత్రం ఈ వివక్ష కొంచెం తక్కువగా ఉందని అక్కడి పరిశోధకులు అభిప్రాయ పడ్డారు. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్, మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్ జాగ్రత్తలు : ∙మహిళల్లో రుతుక్రమం ఆగాక లక్షణాలు కనిపించకపోయినా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఒకవేళ గుండెజబ్బు లక్షణాలను పసిగడితే గుండెపోటును నివారించే అవకాశముంది ∙రిస్క్ ఫ్యాక్టర్లలో నివారించగలిగే అవకాశం ఉన్నవి అంటే... కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడం వంటి జాగ్రత్తలతో గుండెపోటును నివారించవచ్చు. ప్రతి మూడు నెలలకొకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. -
మహిళ.. మనీ.. మేనేజ్మెంట్!
(సాక్షి, బిజినెస్ విభాగం) : మగవారితో పోలిస్తే దేశంలో ఆర్థిక విషయాల గురించి పట్టించుకునే మహిళలు తక్కువ. ముఖ్యంగా వివాహం తరవాత కుటుంబంలో ఆర్థిక అంశాలు, ప్రణాళికలన్నీ పురుషులే చూస్తుంటారు. తక్కువ శాతం ఇళ్లలోనే మహిళలు ఆ పాత్ర నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి కుటుంబానికి ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు ఏంటన్నదానిపై మహిళలకు మంచి అవగాహనే ఉంటుంది. కాకపోతే ఆర్థిక అంశాలు, పెట్టుబడుల విషయం మనకెందుకులే అని దూరంగా ఉండిపోతారు. ఈ ధోరణే భవిష్యత్తులో వారు ఒంటరిగా, తమ కాళ్లపై తాము జీవించాల్సి వస్తే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కారణాలేవైనప్పటికీ తాము ఒంటరిగా పిల్లలతో కలసి జీవించాల్సి వస్తే తమ అవసరాలకు, లక్ష్యాలకు, ఆర్థిక భద్రతకు ఏం చేయాలన్న అంశాల గురించి తెలియకపోవటం సమస్యలకు దారితీస్తుందంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్లు. తమకెందుకులేనన్న ధోరణి తప్పు! ‘‘ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కొనే మహిళల్లో అధిక శాతం భారీ నగదు నిర్వహణ తెలియని వారే ఉంటారు. నగదు నిర్వహణ వ్యవహారం తమ ఉద్యోగం కాదులేనన్న ధోరణి చాలా మంది మహిళల్లో, కుటుంబాల్లో ఉండటమే దీనికి కారణం. కనీసం సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు తెలియని వివాహిత మహిళలు కూడా చాలా మందే ఉంటారు. ఈ విధమైన సందర్భాలు ఎదురైనప్పుడు వారు అచేతనంగా కొన్నాళ్ల పాటు ఏమీ చేయకుండా అలానే ఉండిపోతారు. లేదంటే ఆ నిధుల్ని తప్పుగా ఇన్వెస్ట్ చేస్తారు. పైపెచ్చు ఇలాంటి సందర్భాల్లో వారు విశ్వసనీయత లేని సన్నిహితులు, స్నేహితులపై ఆధారపడతారే గానీ ఫైనాన్షియల్ ప్లానర్ల సాయం తీసుకునేందుకు ముందుకు రారు. ఫైనాన్షియల్ ప్లానర్ల గురించి తెలియకపోవడం కూడా ఓ కారణం’’ అని హమ్‌ఫౌజి ఇనీషియేటివ్స్ సీఈవో సంజీవ్ గోవిల చెప్పారు. సమాన బాధ్యత ఉండాలి... ఒంటరి మహిళలు ముఖ్యమైన అన్ని ఆర్థిక లక్ష్యాల పట్ల సమాన బాధ్యత వహించాలని ఉమంత్ర సహ వ్యవస్థాపకురాలు మ్రిణ్ అగర్వాల్ సూచించారు. ఎక్కువగా పిల్లల విద్యకే ప్రాధాన్యమిస్తుంటారని, అదే సమయంలో తమ రిటైర్మెంట్ అవసరాల గురించి నిర్లక్ష్యం వహించడం లేదా పూర్తిగా మర్చిపోతారని ఆమె చెప్పారు. వ్యక్తిగత బీమా రక్షణకు టర్మ్ ప్లాన్, కుటుంబం కోసం ఆరోగ్య బీమా అన్నవి ఒంటరి మహిళలకు అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యాలని ఆమె సూచించారు. పలు సమస్యలుంటాయి... భర్తకు దూరమైన ప్రతి మహిళకు సాధారణంగా పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. జీవనం ఎలా, తన భర్త ఏవిధంగా సంపాదించేవారు, తను ఏ విధంగా ఇన్వెస్ట్ చేసేవారు అనేవి ఎక్కువగా ఎదురయ్యేవని జైపూర్‌కు చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ వినితా బరయా తెలియజేశారు. ‘‘ఒకవేళ తన భర్త మరణంతో బీమా పరిహారం అందితే గనుక దాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు పెట్టుబడులు, ఆర్థిక అంశాల గురించి నేర్చుకోవాలి. ఆదాయం, ఖర్చులు, పొదుపు, మదుపు, బాధ్యతల గురించి స్పష్టత వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాలి’’ అని సూచించారు. పెట్టుబడులు ప్రారంభించాలి ► ఒంటరి మహిళలు భర్తకు దూరమైనప్పుడు తమ నిధుల నిర్వహణను బంధువులకు ఇవ్వకూడదు. ► ఆర్థికాంశాల గురించి పెట్టుబడుల గురించి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఉన్న నిధుల్ని బ్యాంకులో ఎఫ్డీ చేయడమే బెటర్. ► ఆ తర్వాత పెట్టుబడులు, రాబడుల గురించి కనీస అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి. ► ఆర్థిక ప్రణాళిక గురించి తెలుసుకోవాలి. అవసరం అనుకుంటే ఫైనాన్షియల్ ప్లానర్లను ఆశ్రయించాలి. ► ఒకసారి ఆర్థికాంశాలు, పెట్టుబడుల గురించి అవగాహన వచ్చాక క్రమంగా దాన్ని ఆచరణలో పెట్టాలి. బ్యాంకు ఎఫ్డీలో నుంచి కొంత మొత్తంతో పెట్టుబడులు ప్రారంభించాలి. మరింత అవగాహన, విషయ పరిజ్ఞానం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ప్రణాళికను అమల్లో పెట్టాలి. ఫైనాన్షియల్ ప్లానర్ ఎంపికలో.. ► సంబంధిత వృత్తిలో కొన్నేళ్లయినా అనుభవం కలిగి ఉండాలి. ► ఫీజులు, చార్జీల గురించి ముందే విచారించాలి. కమిషన్‌పై సలహాలిస్తారా లేక వార్షిక ఫీజు తీసుకుంటారా? లేక ప్రతీసారి నిర్ణీత ఫీజు తీసుకుని సూచనలిస్తారా అన్నది తెలుసుకోవాలి. ► కేవలం ఏం చేయాలన్నది సూచిస్తారా లేక మన తరఫున వారే లావాదేవీలు నిర్వహిస్తారా? ► ఆర్థిక అంశాల గురించి సంపూర్ణంగా తెలియజేస్తారా... లేదా అన్నది కనుక్కోవాలి. – మ్రిణ్ అగర్వాల్, ఉమంత్ర సహ వ్యవస్థాపకురాలు దీర్ఘకాలం పాటు పెట్టుబడులకు కావాల్సినవి... ► పొదుపు, మదుపులకు క్రమశిక్షణ తప్పనిసరి. ► ఆర్థిక లక్ష్యాల పట్ల స్పష్టత అవసరం. ఉదాహరణకు పిల్ల ఉన్నత విద్య, పదవీ విరమణ అనంతరం అవసరాలు ఈ విధమైన లక్ష్యాలకు సంబంధించి చేయాల్సిన పెట్టుబడుల్లో స్పష్టత ఉండాలి. ► మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నేళ్ల సమయం ఉందన్నది కీలకం. ► పెట్టుబడుల్లో మార్కెట్ స్వల్పకాల ఆటుపోట్లను పట్టించుకోవద్దు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. ► మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిప్పై విశ్వాసం ఉంచాలి. దీనివల్ల కొనుగోలు వ్యయాలు సగటుగా మారి, ప్రతికూల రిస్క్‌లు పరిమితం అవుతాయి. – వినితా బరాయా, వెల్త్ మేనేజర్ వ్యవధిని బట్టి పెట్టుబడి.. ► పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. మీరు భరించే రిస్క్‌కు అనువైన సాధనంలో ఆర్థిక లక్ష్యాలకు అవసరమైన మేర ఇన్వెస్ట్ చేయాలి. ► వచ్చే రెండు, మూడేళ్ల కాల అవసరాల కోసం అయితే సురక్షితమైన డెట్ సాధనాల్లో పెట్టాలి. ► చాలా ఏళ్ల తర్వాతే అవసరం అనుకుంటే ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ► కేవలం సురక్షిత సాధనాలనే ఆశ్రయిస్తే భవిష్యత్తు అవసరాలకు గండిపడినట్టే. ► బంగారం అయినా, రియల్ ఎస్టేట్ అయినా మీకు అవసరం అయితేనే కొనుగోలు చేయాలి. ► బీమా అన్నది పెట్టుబడి సాధనం కాదు. జరగరానిది జరిగితే రక్షణ కల్పించేది. – సంజీవ్గోవిల, హమ్‌ఫౌజి ఇనీషియేటివ్స్ సీఈవో -
అమ్మాయిలకు జాగ్రత్తలు అవసరం
నిడమర్రు: నూతన సంవత్సర ఆరంభ వేడుకలకు అందరూ సిద్ధమవుతున్నారు. తెలుగు వారికి ఉగాది నుంచే కొత్త ఏడాది ప్రారంభమంటూ ప్రభుత్వం కూడా ప్రచారం చేసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసినా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జనం వెనుకడుగు వేయడం లేదు. ప్రధానంగా యువత, విద్యార్థులు ఎంతో ప్రత్యేకంగా చేయాలని ఉత్సాహపడుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటారు. మద్యం తాగి వాహనాలను నడుపుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు. అర్ధరాత్రి నుంచీ.. యువత, విద్యార్థులు నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోవాలని రెండు, మూడు రోజుల నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. మందు, విందు, వాహనం తదితర అంశాలకు సంబంధించి నగదు, ఇతరత్రా సామగ్రి సమకూర్చుకుంటున్నారు. తమకు అనువైన ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నారు. మద్యం తాగి రాత్రి 12 గంటలు దాటిన వెంటనే ద్వి చక్ర వాహనాలపై రోడ్డు ఎక్కుతారు. మితిమీరిన వేగంతో రోడ్లపై దూసుకుపోతారు. ఒక్కో వాహనంపై ముగ్గురు లేదా నలుగురు ప్రయాణిస్తూ ర్యాలీలు చేస్తారు. ఎంత ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవాలని ప్రణాళిక వేసుకుంటారో.. ప్రమాదాల నివారణలోనూ అంతే అప్రమత్తంగా ఉండాలని మరవొద్దు. తల్లిదండ్రులకూ బాధ్యత డిసెంబర్ 31వస్తుందంటే ముందుగానే పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. లేదా కుంటుంబ సభ్యుల మధ్యలో వేడుకలు జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలి. వీలైనంత వరకూ ద్విచక్రవాహనాను ఇవ్వకుండా ఉండాలి. టీనేజీ యువతపై ఓ కంట కనిపెట్టాలి. రాత్రి 12లోపు పిల్లలు ఇంటికి చేరుకునేలా హెచ్చరించాల్సిన బాధ్యత తల్లిండ్రులదే. అమ్మాయిలకు జాగ్రత్తలు అవసరం అమ్మాయిలు, ఉద్యోగినులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వేడుకల కోసం వెళ్లేటపుడు ఎక్కడకు వెళుతున్నామో ఎప్పటికి వస్తామో కుటుంబ సభ్యులకు చెప్పండి. ఏ వాహనంలో ఎవరితో వెళుతున్నారో ముందుగా తెలపండి. ఆటో, క్యాబ్ వంటి ప్రైవేటు వాహనాల్లో ఎక్కాక సామాజిక మాధ్యమాల్లో మునిగిపోవద్దు, డ్రైవర్‌ను, పరిసరాలను గమనిస్తూ ఉండాలి. పోలీసుల హెచ్చరికలు ♦ జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాష్ జిల్లాలోని నూతన సంవత్సర వేడుకల్లో ఎటుంవటి విషాదాలకు తావు లేకుండా పలు నిబంధనలు జారీ చేశారు. ♦ నూతన సంవత్సర వేడుకల్లో లౌడ్ స్పీకర్లు కోసం పోలీసుల ముందస్తు అనుమతి పొందాలి. ♦ వేడుకలు రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే జరుపుకోవాలి, లేకపోతే చట్ట ప్రకారం తీసుకునే చర్యలకు గురవుతారు. ♦ ’న్యూస్ పేపర్లు, మేగజైన్లు, హోర్డింగ్స్లలో అశ్లీలత కల్గిన పోస్టర్లు గానీ, ప్రకటనలు గాని చేయరాదు. ♦ వేడుకల్లో అశ్లీల నృత్యాలు, అశ్లీల సినిమాలు, అశ్లీల సంజ్ఞనలు అనుమతించబడవు. ♦ మద్యం అమ్మేందుకు అబ్బారీశాఖ లైసెన్సు లేనిదే అమ్మకాలు నిషిద్ధం ♦ నూతన సంవత్సర వేడుక కార్యక్రమాల వద్ద సరైన లైటింగ్, కూర్చునే సదుపాయం కల్పించాలి. ♦ ప్రజలకు ప్రమాదం కలిగించే ఎటువంటి కార్యక్రమైన, విన్యాసమైన నిషిద్ధం, ప్రేలుడు పదార్థాలు, ఫైర్ ఆరŠమ్స్ ఉపయోగించుట పూర్తిగా నిషేధం ♦ పబ్లిక్ తిరిగే ప్రదేశాల్లో మద్యం సేవించడం, పేకాడటం చెయ్యరాదు. ♦ మ్యూజిక్ సిస్టమ్స్ రాత్రి 10 గంటల తరువాత వాడరాదు (సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం) ♦ మద్యం సేవించి, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ♦ నిందితుల వాహనాన్ని సీజ్ చేసి రికార్డులు స్వాధీనం చేసుకుంటామన్నారు. రూ.2 వేలు జరిమానా, 6 నెలలు వరకూ జైలు శిక్ష లేదా రెండూ విధించబడునన్నారు. తాగిన వాహనం నడిపిన వారి లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ♦ ప్రభుత్వ అనుమతి పొందిన వైన్ షాపులు, బార్లు, క్లబ్బులు, ఇతర హోటల్స్ నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా తెరిచే ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటారు. వేడుకల పేరుతో మహిళలను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడును -
జీఎస్టీ ప్యానెల్లో మహిళలేరి?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు అనేది దేశీయ పన్ను సంస్కరణలల్లో అత్యంత కీలక మలుపుగా పదేపదే చెబుతున్న కేంద్ర ప్రభుత్వం... 31 మంది పాలసీ సభ్యుల్లో కనీసం ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదని ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్ వ్యాఖ్యానించారు. జీఎస్టీ పాలసీ ఎంపిక, వస్తువుల జాబితా, రేట్ల ఖరారు వంటి కీలకాంశాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ‘‘అందుకే! మహిళలు వాడే శానిటరీ న్యాప్కిన్స్కు 12% జీఎస్టీ శ్లాబును నిర్ణయించి.. పురుషుల షేవింగ్ కిట్స్‌కు మినహాయింపు ఇచ్చారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. యూఎస్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) ఆధ్వర్యంలో ‘ది ఫౌండేషన్ ఆఫ్ ఇన్నోవేషన్స్’ అనే అంశంపై సోమవారమిక్కడ చర్చాగోష్టి జరిగింది. ఇందులో కలారీ క్యాపిటల్ ఎండీ వాణి కోలా, ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్, ఐబీఎం ఇండియా చైర్పర్సన్ వనితా నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నివృతి రాయ్ మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో రాత్రి 8 తర్వాత మహిళలు ఉద్యోగం చేయలేని పరిస్థితి దాపురించింది. స్త్రీకి రక్షణ, భద్రత కరువయ్యాయి. ఎవరి గురించో ఎందుకు!! నన్నే తీసుకోండి. రాత్రి ఆఫీసులో మీటింగ్ లేదా వర్క్ ఉంటే... నాతో పాటు మా ఆయన కూడా ఉదయం మూడు నాలుగింటి వరకూ ఆఫీసు లాబీలో ఎదురు చూస్తుంటారు’’ అని వివరించారు. మహిళలకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వాలు నడుం బిగించాలని సూచించారు. జీడీపీ వృద్ధిలో మహిళ ప్రాధాన్యత అత్యంత దయనీయంగా ఉందంటూ... ఆవిష్కరణ, ఎంట్రప్రెన్యూర్షిప్, పాలసీ.. ఈ మూడే జాతి స్థితిగతుల్ని మారుస్తాయన్నారు. ప్రస్తుతం దేశీ ఐటీ రంగంలో మహిళా ఉద్యోగుల వాటా 30% వరకూ ఉందని.. అన్ని రంగాల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని సూచించారు. విద్యా రంగంలో మహిళల పాత్ర నిల్.. దేశీయ విద్యా రంగంలో మహిళలకు చోటు లేదని ఐబీఎం ఇండియా చైర్పర్సన్ వనితా నారాయణన్ వ్యాఖ్యానించారు. దేశంలోని ఏ ఒక్క ఇంజనీరింగ్ కళాశాల బోర్డులోనూ మహిళా డైరెక్టర్లు లేరన్నారు. అందుకే మహిళలకు విద్యలో ప్రాధాన్యం తగ్గుతోందని.. ఈ రంగంలోనూ మహిళలకు చోటు కల్పించాలని సూచించారు. కలారీ క్యాపిటల్ ఎండీ వాణి కోలా మాట్లాడుతూ.. ఎంచుకున్న రంగంలో లక్ష్యం నిర్దేశించుకొని చేరుకునే దిశగా ఆలోచనలు చేయాలని.. మధ్యలో ఎదురొచ్చే సవాళ్లు, సమస్యలను పట్టించుకోకూడదని పిలుపునిచ్చారు. ‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి.. సిలికాన్ వ్యాలీకి వెళ్లాను. 2006లో తిరిగి ఇండియాకి వచ్చా. 2012లో 150 మిలియన్ డాలర్ల నిధులతో కలారీ క్యాపిటల్‌ను ప్రారంభించా. సాంకేతికత, ఆవిష్కరణకు పెద్ద పీట వేసే స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెడుతుంటాం. ఇప్పటివరకు స్నాప్‌డీల్, మింత్ర, అర్బన్ ల్యాడర్, జివామీ వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టాం’’ అని తెలిపారు. కార్యక్రమంలో గర్ల్ రైజింగ్ ప్రొడ్యూసర్ అమితా వ్యాస్, యూఎస్ఐబీసీ ప్రెసిడెంట్ నిషా బిస్వాల్ పాల్గొన్నారు. -
నవభారత నిర్మాణంలో స్త్రీలే కీలకం
సాక్షి, హైదరాబాద్ : నవభారత నిర్మాణంలో మహిళలదే కీలకపాత్ర అని, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో భారత మహిళలు దూసుకెళ్లా లని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ తాజ్ దక్కన్ లో జరిగిన భారత వాణిజ్య పరిశ్రమల సమా ఖ్య(ఫిక్కీ) సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబనా తపన సమాజ ప్రగతికి సోపానమవుతుందని చెప్పా రు. దేశం ఓ ప్రధాన ఆర్థికశక్తిగా మారుతున్న దశలో గాంధీ, అంబేడ్కర్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పంచాయతీల నుంచి చట్టసభల వరకు స్త్రీల ప్రాతినిథ్యం పెరగాలని, అన్ని రంగాల్లో మహిళల అభ్యున్నతికి కృషి జరగాల ని, చట్టాల ద్వారా మాత్రమే మార్పు సాధ్యం కాదని, ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా ఆడపిల్లలపై అత్యాచారాలు ఆగకపోవడానికి ఆ ఆలోచనా విధానంలో మార్పు రాకపోవడమే కారణమన్నారు. భారత సంస్కృతి స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నది ఒట్టిమాట అని, పురాణాల్లో, ఇతిహాసాల్లో స్త్రీల ప్రాధాన్యత మనకు స్పష్టమవుతుందన్నారు. ప్రధాని ప్రవేశపెట్టిన ‘బేటీ బచావో, బేటీ పడావో’కార్యక్రమం బాలబాలికల నిష్పత్తిలో అంతరాన్ని తగ్గించి, లింగ వివక్షకు స్వస్తి పలుకుతుందన్నారు. అంత్యోదయం మన సంస్కృతి అని, అంతిమ పంక్తిలో ఉన్న వారి అభివృద్ధికి మనందరం పునరంకితం కావాలని సూచించారు. మాతృభాషను కాపాడుకోవాలి.. విదేశీయులు తమ భాషలను కాపాడుకుంటుంటే భారతీయులు మాత్రం మాతృభాష తెలుగును వదిలి ఆంగ్ల భాషకు ప్రాధాన్యత ఇస్తున్నారని, మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వెంకయ్య చెప్పారు. రాష్ట్రంలో తెలుగుని తప్పనిసరిగా అభ్యసించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని, ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. వర్సిటీల్లో అఫ్జల్ గురు ఆశయాలను కొనసాగిస్తామని కొందరు ముందుకొస్తున్నారని, పార్లమెంట్‌పై దాడికి కుట్రపన్నడం అతని ఆశయమైనప్పుడు అతడిని సమర్థించడం మూర్ఖత్వం కాకమరేమౌతుందని ఆయన ప్రశ్నించారు. భారతమాతకి జై కొట్టడాన్ని తప్పుపడుతుండటం సరికాదని, భారతమాత అంటే భారతీయులందరికీ మేలు జరగడమేనన్నారు. సత్తా చాటుకుంటున్న మహిళలు కార్యక్రమానికి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ కామిని సరఫ్ స్వాగతం పలికారు. మహిళలు యుద్ధవిమానాలకు పైలట్లుగా ఉండటం దగ్గర నుంచి, రాజకీయ, పారిశ్రామిక క్రీడా రంగాలన్నింటా సత్తా చాటుకుంటున్నారని ఆమె అన్నారు. మోదీ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న తరుణంలో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో భారత్ 108వ స్థానంలో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో నవభారత నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలంటే మహిళల సాధికారతలోనూ, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లోనూ మెరుగ్గా ఉండాలన్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడిని, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీని కామిని సరఫ్ సన్మానించారు. ఢిల్లీ ఖాళీ చేయాలని నా భార్యకు అప్పుడే చెప్పా అనంతరం జరిగిన చర్చా గోష్టిలో వెంకయ్యనాయుడు తన భార్యతో అన్నమాటలను గుర్తుచేసుకున్నారు. మోదీ ప్రధాని అవబోతున్నప్పుడే తన భార్యను ఢిల్లీ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పానన్నారు. సమాజసేవ కోసం ఢిల్లీ నుంచి మనం వెళ్లాల్సి ఉంటుందని తన భార్య ఉషకి చెప్పానని తెలిపారు. మీడియాలో తన రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల వ్యాఖ్యానాలొచ్చినా తాను ఉషాపతిగా ఉండటానికే ఇష్టపడతానన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాను కానీ ప్రజల నుంచి దూరం కాలేదని వెంకయ్య అన్నారు. -
‘నారీ’ శక్తి వీరిదే!!
న్యూయార్క్: ఔను! స్త్రీలు శక్తివంతులే. ఆ రంగం ఈ రంగం అంటూ లేకుండా అన్ని చోట్లా వారి హవా కనిపిస్తోందిపుడు. వ్యాపార విభాగంలోనూ పవర్ఫుల్ మహిళలు అవతరిస్తున్నారు. ఫార్చ్యూన్ తాజా గా అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన చందా కొచర్, శిఖా శర్మలకు స్థానం దక్కింది. ఇద్దరూ బ్యాంకింగ్ రంగానికి చెందిన వారే కావడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ఐదో స్థానాన్ని దక్కించుకోగా, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో శిఖా శర్మ 21వ స్థానంలో నిలిచారు. బాన్కో శాంటాన్డర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బొటిన్ అగ్రస్థానంలో నిలవగా... జీఎస్కే సీఈవో ఎమ్మా వాల్మ్స్లే రెండో స్థానంలో, ఎంజీ సీఈవో ఇసబెల్లా కొచర్ మూడో స్థానంలో నిలిచారు. ‘ఎనిమిదేళ్లుగా భారత్‌లోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐకి చందా కొచర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈమె సారథ్యంలో బ్యాంక్ మంచి వృద్ధి బాటలో పయనిస్తోంది’ అని ఫార్చ్యూన్ పేర్కొంది. ‘భారత్‌లోని మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా శిఖా శర్మ రెండోమారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె డిజిటల్ సర్వీసులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు’ అని తెలిపింది. మరొక జాబితాలో ఇంద్రా నూయి ఫార్చ్యూన్.. అమెరికాలోని అత్యంత శక్తివంతమైన మహిళల పేరిట మరో జాబితాను ప్రకటించింది. దీన్లో పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జనరల్ మోటార్స్ చైర్మన్, సీఈవో మేరి బర్రా టాప్‌లో ఉన్నారు. లాక్‌హీడ్ మార్టిన్ చైర్మన్, ప్రెసిడెంట్, సీఈవో మారిల్లిన్ హేవ్సన్ మూడో స్థానంలో నిలిచారు.a -
ఉప ముఖ్యమంత్రిని అడ్డుకున్న మహిళలు
కరప(కాకినాడ): నాయకులు వస్తున్నారు, పోతున్నారే కానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను మహిళలు నిలదీశారు. మండల పర్యటనలో భాగంగా గురువారం గొర్రిపూడి, పాతర్లగడ్డ, జి.భావారం, కరప గ్రామాల్లో చిన రాజప్ప పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. కరపలో మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించి రైతులకు రాయితీపై వచ్చిన ఆయిల్ ఇంజన్లు, టార్పాలిన్లు, పవర్ టిల్లర్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన కారు ఎక్కబోతుంటే మహిళలు చుట్టుముట్టి రోడ్డు లేక నడవలేకపోతున్నామని, ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. మంచినీటి కుళాయి లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, ఎంతో దూరం వెళ్లి బిందెలతో తెచ్చుకోలేకపోతున్నా.. మా బాధలు మీకు పట్టవా అని కొత్తపేట సామిల్లు సమీపంలోని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కల్పించుకుని సద్దిచెప్తున్నా మంత్రి సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు. సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, ఇతర నాయకులు ఒక్కొక్క పని చేసుకొస్తున్నామని చెప్పారు. మీ వీధి రోడ్డు, కుళాయి వేయిస్తామని హామీ ఇచ్చారు. ఇలా గొడవ చెయ్యడం మంచి పద్ధతి కాదని సద్దిచెప్పడంతో మహిళలు వెనుతిరిగారు. -
నగదు రహిత లావాదేవీలపై రైతుల ఆగ్రహం
-
మహిళా భక్తుల భద్రతకు పెద్దపీట
సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జన ఉత్సవాల్లో మహిళా భక్తులతో అనుచితంగా వ్యవహరించే వారిపై సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల షీ– టీ మ్స్ నిఘా వేయనున్నాయి. ఈవ్‌టీజింగ్ చేస్తూ పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నాయి. నగర శివారు ప్రాంతాలైన సరూర్‌నగర్ ట్యాంక్, సఫిల్‌గూడ చెరువు, కాప్రా చెరువుతో పాటు చర్లపల్లి చెరువుల వద్ద జరిగే నిమజ్జనోత్సవంలో పెద్ద సంఖ్యలో బాలికలు, యువతులు, మహిళలు పాల్గొంటారు. ఇక్కడికి ఏటికేడు గణపతి విగ్రహాలతో వచ్చే మహిళాభక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈసారి షీ బృందాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. దాదాపు 100 మంది సిబ్బంది బృందాలుగా విడిపోయి ఆకతాయిలపై కన్నేసి ఉంచనున్నాయి. ఎక్కడా ఎవరైనా అమ్మాయిలను వేధిస్తున్నట్టు సమాచారం వచ్చినా, వీరి కంటపడినా అరెస్టు చేస్తారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలోని నిమజ్జన యాత్ర మార్గాల్లో గస్తీ నిర్వహిస్తారు. బాధితులు 100కు కాల్ చేస్తే వెంటనే ఘటనాస్థలిలో వీరు వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు. ‘మఫ్టీ’తో నిఘా... నిమజ్జనోత్సవంలో దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. మహిళలు ఒంటి నిండా నగలు ధరించి నిమజ్జన యాత్రలో పాల్గొంటారు. ఇదే అదునుగా భావించి జనాల మధ్యలోనే దొంగలు తమ పనికానిచ్చే అవకాశముంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పె ట్టుకొని దొంగలను కట్టడి చేసేందుకు ఈసారి దాదాపు 12కు పైగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీరి లో కొందరు పోలీసు డ్రెస్సులోనే విధులు నిర్వహిస్తుం డగా, మరికొందరు మఫ్టీలో నిఘా వేయనున్నారు. సీసీలతో పర్యవేక్షణ... కమిషనరేట్లలోని ముఖ్యకూడళ్ల నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జరిగే వినాయక శోభాయాత్రను బలగాల పహారాతో పాటు నిఘా నేత్రాలతో నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గణేశ్ శోభా యాత్ర ను అధికారులు వీక్షిస్తూ ఎప్పటికప్పుడూ స్థానిక పోలీ సు సిబ్బందికి మార్గనిర్దేశనం చేస్తారు. నిమజ్జన యాత్ర ల్లో లక్షలాది మంది భక్తులతో పాటు వేలాది వినాయకులు తరలివస్తాయి. పోలీసులు జంక్షన్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలతో ఆయా ప్రాంతాల్లో గణేశుడి నిమజ్జన ర్యాలీల పర్యవేక్షణ కోసం పోలీసులు ఉపయోగిస్తున్నారు. సీసీ కెమెరా మౌంట్ వెహికల్లను, అశ్విక దళాలను ఇప్పటికే భద్రత కోసం వినియోగిస్తున్నారు. -
దానితోనే యువతుల్లో సంతానలేమి..
సాక్షి, సిటీబ్యూరో: మారిన జీవనశైలి, ఆహరపు అలవాట్లు, ఆలస్యపు వివాహాల వల్ల మహిళల సంతాన సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నోవా ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ సరోజ కొప్పాల చెప్పారు. మద్యం, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల అండాశయ నిల్వలు పడిపోవడంతో పాటు, ఎగ్స్కౌంట్ తగ్గడానికి కారణం అవుతున్నట్లు తెలిపారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జీవనశైలిలో మార్పు వల్ల రజస్వల మొదలు గర్భం ధరించడం, నెలసరి రుతుక్రమం వరకు ఇలా అన్ని సమస్యాత్మకంగా మారుతున్నాయన్నారు. తల్లి కావాలని ఆశపడే వారికి ఇదో పెద్దశాపంగా మారిందన్నారు. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి తమ వద్ద చక్కని పరిష్కార మార్గం ఉందని చెప్పారు. జీవకణ దానం ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నారు. -
మహిళలతో నయీం ప్రయాణాలు
-
మహిళలకు ప్రత్యేక శిక్షణ
విజయనగరం: అందంగా కని పించాలనుకునే మహిళలకు నిజంగా ఇది శుభవార్తే. బ్యూటీపార్లర్లకు వెళ్లే తీరుబాటు లేని మహిళలు..ఇంట్లోనే ఉంటూ తమను తామే స్వయంగా అందంగా కనిపిం చేలా తయారు చేసుకునేందుకు మహిళలకు మేకప్, హెయి ర్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ అందుబాటులోకి వచ్చేసింది. ఈ నెల 25వ తేదీనుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సాక్షి,మైత్రి మహిళ ఆధ్వర్యంలో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. విజ యనగరంలోని పద్మావతి నగర్, రోడ్‌నంబర్ 3, పివిఆర్ కాలనీ,ఫ్లాట్ నంబర్ 75 గైజోస్ బ్యూటీ క్లినిక్ ట్రైనింగ్ సెంటర్లో ఈ శిక్షణ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఇస్తారు. ఈ శిక్షణకు హాజరవ్వాలనుకునే మహిళలు రూ.1000 ఫీజు చెల్లించి 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తమ పేర్లు రిజిస్రేషన్ చేయించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నంబర్9666283534, 9290918744లలో సంప్రదించ వచ్చు. -
పేకాడుతున్న ఏడుగురు మహిళల అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వివిధ జిల్లాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో 30 మందికి పైగా పేకాట ఆడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉండడం విశేషం. కర్నూలు: కర్నూలు జిల్లాలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓబుళాచారి రోడ్డులో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు. పాండురంగస్వామి గుడి సమీపంలో పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.15,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం: ఏడుగురు మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం ఉదయం దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉండడం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. పట్టుబడిన వారి నుంచి నగదు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అన్నా-చెల్లెళ్ల బంధానికి ప్రతీక రక్షాబంధన్
-
మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు!
‘‘సినిమా ప్రపంచంలో పురుషాధిక్యత ఉంటుంది అంటారు. ఆ మాటకొస్తే... ఒక్క సినిమా ప్రపంచం ఏం ఖర్మ.. అన్ని రంగాల్లోనూ పురుషులదే పై చేయి’’ అని శ్రుతీ హాసన్ అంటున్నారు. ఇటీవల ఓ సందర్భంలో పురుషాధిక్యత గురించి ప్రత్యేకంగా మాట్లాడారామె. ఆడవాళ్లు అణిగి మణిగి పడి ఉండాలని మగవాళ్లు కోరుకుంటారనీ, అంత మాత్రాన తగ్గాల్సిన అవసరంలేదనీ శ్రుతీ హాసన్ చెబుతూ -‘‘సినిమా నటి, పాత్రికేయురాలు, అధ్యాపకురాలు, గృహిణి.. ఎవరైనా కానివ్వండి మన దేశంలో అస్సలు రక్షణ లేదు. మీరు ఇంట్లో ఉండండి, వృత్తి రీత్యా హోటల్లోనో లేక గెస్ట్ హౌస్‌లోనో బస చేయండి.. రక్షణ ఉంటుందని మాత్రం గ్యారంటీ లేదు. అందుకే మహిళలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వయసులో ఉన్నవాళ్లే కాదు... చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికీ ఇండియా అంత సురక్షితం కాదు’’ అని ముక్కుసూటిగా చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచిస్తున్న శ్రుతి తాను కూడా అలానే ఉంటారు. అందుకే, ఎవరో ఆగంతకుడు తన ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు వెంటనే స్పందించి, అతన్ని బయటికి నెట్టివేయగలిగారామె. -
అసెంబ్లీలో అతివలు
ఆకాశంలో సగం అని చెప్పుకుంటున్నా... చట్టసభల్లో అతివల స్థానం చాలా స్వల్పంగా ఉంటోంది. 1952 నుంచి ఈ 62 ఏళ్లలో జిల్లా నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన అతివలు కేవలం 12 మందే కావడం గమనార్హం. వారిలో ఎక్కువ మంది తండ్రి, లేదా భర్త నుంచి రాజకీయ వారసత్వంగా వచ్చినవారే. అయితే వారసత్వంగా వచ్చినా తమదైన శైలిలో రాణించి నియోజకవర్గానికి, జిల్లాకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినవారూ ఉన్నారు. ఏ వారసత్వం లేకపోయినా స్వీయప్రతిభతో రాణించి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించిన వారూ ఉన్నారు. జిల్లాలో పురుషుల కన్నా మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు మరిన్ని స్థానాల్లో టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. - సాక్షి ఎలక్షన్ డెస్క్, గుంటూరు జిల్లాలో గతంలో 19 నియోజకవర్గాలు ఉండేవి. 2008లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రెండు స్థానాలు తగ్గి ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. 1952లో జరిగిన తొలి ఎన్నికలలో ఒకే ఒక మహిళ విజయం సాధించి మద్రాసు-ఆంధ్ర సంయుక్త రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన తమ్మా కోటమ్మారెడ్డి గుంటూరు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ ఇక్కడ స్ధిరపడ్డారు. ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1955. 1962 ఎన్నికలలో జిల్లా నుంచి ఒక్క మహిళ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. 1967 ఎన్నికలలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తెనాలి నుంచి ఆలపాటి వెంకట్రామయ్య కుమార్తె దొడ్డపనేని ఇందిర గెలుపొందారు. అనంతరం 1972, 1978 ఎన్నికలలో కూడా వరుసగా మూడు సార్లు విజయం సాధించి తిరుగులేని మహిళా నేతగా జిల్లాలో తనదైన ముద్ర వేశారు. 1967 ఎన్నికలలోనే గుంటూరు-1 నుంచి శనక్కాయల అంకమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972 ఎన్నికలలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి షేక్ ఫాతిమున్నీసా బేగం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1983 ఎన్నికలలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్నపనేని రాజకుమారి విజయం సాధించారు. 1985 ఎన్నికలలో కూచినపూడి నుంచి ఈపూరి సీతారావమ్మ తన భర్త ఈపూరి సుబ్బారావు వారసురాలిగా టీడీపీ టిక్కెట్‌పై పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లోనూ వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.1989 ఎన్నికలలో చిలకలూరిపేట నుంచి డాక్టర్ కందిమళ్ళ జయమ్మ తన తండ్రి కందిమళ్ళ అప్పారావు వారసత్వాన్ని అందిపుచ్చుకుని టీడీపీ టిక్కెట్‌పై పోటీచేసి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో వినుకొండ నుంచి నన్నపనేని రాజకుమారి గెలుపొందారు. 1994 ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి సీపీఎం తరఫున పుతుంబాక భారతి తన భర్త పుతుంబాక వెంకటపతి వారసురాలిగా రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలుపొందారు.1999 ఎన్నికలలో గుంటూరు-2 నుంచి శనక్కాయల అరుణ, తెనాలి నుంచి డాక్టర్ గోగినేని ఉమ, మాచర్ల నుంచి జూలకంటి దుర్గాంబ ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత, మంగళగిరి నుంచి కాండ్రు కమల ఎన్నికయ్యారు. రెండుసార్లు ముగ్గురేసి... జిల్లా నుంచి 1989 ఎన్నికల్లోనూ, 1999 ఎన్నికల్లోనూ ముగ్గురేసి చొప్పున మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1989లో నన్నపనేని రాజకుమారి వినుకొండ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసి గెలుపొందగా, తెలుగుదేశం పార్టీ తరఫున చిలకలూరిపేట నుంచి డాక్టర్ కందిమళ్ళ జయమ్మ, కూచినపూడి నుంచి ఈపూరి సీతారావమ్మ విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురూ తెలుగుదేశం పార్టీ వారే కావడం గమనార్హం. గుంటూరు-2 నుంచి శనక్కాయల అరుణ, తెనాలి నుంచి డాక్టర్ గోగినేని ఉమ, మాచర్ల నుంచి జూలకంటి దుర్గాంబ వీరిలో ఉన్నారు. 1967,1972,1994, 2009 ఎన్నికల్లో ఇద్దరు చొప్పున మహిళలు గెలుపొందారు. 1952,1978,1983,1985లో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు. కాగా 1955,1962,2004 ఎన్నికల్లో జిల్లా నుంచి మహిళా శాసనసభ్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. పార్లమెంటుకు... పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి తెనాలి నుంచి సినీనటి తాడిపర్తి శారద 1994లో ఎంపీగా గెలుపొందారు. బాపట్ల నుంచి 2004లో దగ్గుబాటి పురందేశ్వరి, 2009లో పనబాక లక్ష్మి గెలుపొంది కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. ఈసారి ముగ్గురికి టిక్కెట్లిచ్చిన వైఎస్సార్సీపీ... జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో మహిళలకు 30 శాతం చొప్పున కనీసం ఐదు సీట్లు కేటాయించవలసి ఉంది. అయితే మిగతా పార్టీల కంటే ఎక్కువగా 2009లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు మహిళలకు టిక్కెట్లిచ్చారు. వారిలో ఇద్దరు గెలుపొందారు. తండ్రి బాటలోనే ఈసారి ఎన్నికలలో వైఎస్ జగన్మోహనరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ముగ్గురు మహిళలకు టిక్కెట్లిచ్చారు. ప్రత్తిపాడులో మేకతోటి సుచరిత, తాడికొండలో హెచ్.క్రిస్టినా, వినుకొండలో డాక్టర్ నన్నపనేని సుధ పార్టీ అభ్యర్థులుగా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాండ్రు కమలకు మళ్లీ టిక్కెట్ ఇవ్వగా ఆమె పోటీకి విముఖత చూపారు. తెలుగుదేశం పార్టీ ఒక్క మహిళకు కూడా టిక్కెట్ ఇవ్వకపోవడం గమనార్హం. -
ఊరంతా సంక్రాంతి
కైకలూరు మండలంలోని గోనెపాడులో సంక్రాంతి సండిని పరిశీలించేందుకు ‘న్యూస్‌లైన్’ ఆదివారం సందర్శిం చిది. గ్రామం సంక్రాంతి కళ సంతరించుకుంది. బంధువులతో ప్రతి ఇంటా సందడి నెలకొంది. ఏ ఇంట చూసినా ఘుమఘుమలాడే పిండివంటలు తయారవుతూ కనిపించాయి. సరదాల కోడిపందాలు జరుగుతున్నాయి. పతంగులతో చిన్నారుల పరుగులు, పట్టుపరికిణీలతో పల్లెపడుచుల హొయలు, రంగు రంగుల రంగవల్లులు కనువిందుచేశాయి. సూర్యోదయానికి ముందుగానే యువతులు, మహిళలు వాకిళ్లను ఊడ్చి కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తూ కనిపించారు. ముగ్గులకు రంగులు అద్ది, గొబ్బెమ్మలతో అలంకరించారు. హరిదాసు కీర్తనలు ఆలపిస్తూ ఇంటింటినీ సందర్శించాడు. గంగిరెద్దులోళ్లు డోలూ సన్నాయి వాయిద్యాలతో డూడూబసవన్నలను ఆడించారు. గ్రామంలోని చెరువులో పది మంది యువకులు కోడిపుంజులకు స్నానాలు చేయించారు. బద్దకంపోయి చలాకీగా పందేల్లో పాల్గొనాలంటే ఈ స్నానాలు తప్పవని వారు చెప్పారు. ‘సూరమ్మ.. పిన్నీ మీ అల్లుడు పండక్కి వస్తున్నాడా...’ అంటూ ఒకరు, కోడలా... మనవడు ఉదయమే బస్సు దిగాడంటగా ఏడీ ఇంక బయటకు రాలేదు..’ అంటూ మరొకరు.... ‘ఒరేయ్ అబ్బాయ్ కోడి పందేనికి వెళ్దామా’ అంటూ మరొకరు పలుకరించుకుంటూ కనిపిం చారు. ఉదయం ఆరు గంటల నుంచే అరుగులపైకి చేరిన గ్రామస్తులు లోకాభిరామాయణాన్ని చర్చించుకున్నారు. యువతులు పట్టు పరికిణీల్లో తమ వీధుల్లో ఇళ్ల ముందువేసిన ముగ్గులను పరిశీలించి వాటికి మార్కులు వేశారు. అనంతరం ఒప్పులగుప్పు, తొక్కుడుబిళ్ల వంటి ఆటలాడారు. చిన్న పిల్లలు రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ వీధుల్లో అటూ ఇటూ పరుగులు తీశారు. ఇంటి పనులు పూర్తిచేసుకుని ఏడు గంటల నుంచి మహిళలు బృందాలుగా పిండివంటల తయారీకి సిద్ధమయ్యారు. రోటిపై కుందుచేర్చి రోకళ్లతో కొందరు బియ్యాన్ని పిండి కొట్టగా, మరి కొందరు ఆ పిండిని జల్లించారు. పిండి కొట్టడం పూర్తయ్యాక అరిసెలు, మిఠాయి, చెక్కలు, తదితర వంటలు వండే పనిలో నిమగ్నమయ్యారు. బంధువుల రాకతో సంతోషం ఏడాదిలో పెద్ద పండగ ఇది. బంధువులందరూ ఒక్కచోటకు చేరితే ఆ సంతోషమే వేరు. ఈ కలయికలే ప్రేమలు పెంచుతాయి. మా మనవడు మద్రాసులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వాడి రాకకోసం ఎదురుచూస్తున్నాం. కాలం మారే కొద్ది సంప్రదాయలు కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడటం మన బాధ్యత. - బొల్లా లక్ష్మీనృసింహమూర్తి, గోనెపాడు చుట్టాలతో ఊరంతా కళకళ సంక్రాంతి పండగ వచ్చిదంటే ఊరంతా చుట్టాలతో కళకళలాడుతుంది. కొత్త దంపతులు, పొరుగూరిలో ఉద్యోగాలు చేస్తున్నవారు కచ్చితంగా ఊరొస్తారు. ఈ సంతోషం ఎప్పుడూ ఇలానే ఉండాలి. మా అబ్బాయి విశాఖపట్నంలో ఉంటున్నాడు. పండక్కి ఊరొస్తున్నాడు. వాడికి అరెసెలంటే ఎంతో ఇష్టం. వాడికి ఇష్టమైన పిండి వంటలు చేసిపెడతా. - నంగెడ్డ సూరమ్మ, గోనెపాడు సరదాల సంక్రాంతి సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంటినిండా చుట్టాలు, చిన్నపిల్లలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చిన్నారులకు భోగిపళ్లు పోసి పండుగను సరదాగా జరుపుకుంటాం. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తాం. - వత్తుమిల్లి అశ్వని, జుఝవరం, పామర్రు మండలం కొట్టిన పిండితోనే అరిసెలు మేము స్వయంగా రోకళ్లతోకొట్టిన పిండివంటలు చేస్తాం. మిల్లు పట్టించుకోం. మా చుట్టు పక్కల వాళ్లం అందరం కలసి రోటిలో పిండి కొట్టుకుని అరిసెలు, ఇతర వంటకాలు చేసుకుంటాం. ఏళ్ల తరబడి ఇలాగే వండుకుంటున్నాం. సంక్రాంతి, దీపావళి పండుగలకు ఒకరి పనులకు మరొకరం సాయపడుతూ సందడిగా పనులు చేసేస్తాం. - మద్ది సామ్రాజ్యం, మర్రిపాలెం, నాగాయలంక మండలం సంక్రాంతంటే ఆనందం సంక్రాంతి అంటే మాకు ఎక్కడలేని ఆనందం. గృహాలకు శుభం చేకూరుస్తుందని ధనుర్మాసంలో పోటీపడి వాకిళ్లలో పేడకళ్లాపు చల్లి ముగ్గులు వేస్తాం. కాలం మారినా సంక్రాంతిని వదిలేది లేదు. పిండివంటలు వండుతాం, భోగిపళ్లు పోస్తాం. చెరకు గడలు, తేగలను సంక్రాంతి పండుగలో భాగస్వామ్యం చేస్తాం. ఈ కాలంలో అవి మహారుచిగా ఉంటాయి. - కొట్ర రమాదేవి, రేమాలవారిపాలెం,నాగాయలంక మండలం -
ఆగని అకృత్యాలు
ఏటీ అగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్ :అర్ధరాత్రి వేళ మహిళలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్య్రం వచ్చినట్టు..ఇవి మహాత్ముని మాటలు...అయితే పగలే మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మృగాళ్ల వెకిలిచేష్టలు ,వేధింపులకు భయపడి మహిళలు తనువులు చాలిస్తున్న సందర్భాలు అనేకం. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలు సైతం వారిని కాపాడలేకపోతున్నాయి. మహిళలపై జరిగే అత్యాచారాలు దాడులను నిరోధించేందుకు ఈ ఏడాది మార్చి నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అయినప్పటి కీ మృగాళ్ల తీరు మారలేదు. జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మానవమృగాలు విషం కక్కుతూనే ఉన్నాయి. వికృతంగా అకృత్యాలకు పాల్పడుతూనే వున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 8న జిల్లాలో తొలి నిర్భయ కేసు తెనాలిలో నమోదైంది. తన కుమార్తె మౌనికతో కలసి వెళుతున్న బేతాళ కాంత సునీల అనే మహిళను అటకాయించిన మృగాళ్లు మౌనిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డువచ్చిన సునీలను లారీ కిందకు నెట్టి వేయటంతో మృతి చెందింది. వీరందరిపై తెనాలి వన్‌టౌన్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అక్టోబర్‌లో గుంటూరు వల్లూరివారితోటకు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమించాలని వెంటపడి వేధిం చాడు. ఇదేమిటని అడిగిన యువతి తండ్రిపై దాడిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అనూష కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో ముగ్గురు యువకులపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. చిన్నారిపై తండ్రి అసభ్యకర ప్రవర్తన సత్తెనపల్లి పట్టణం నాగన్నకుంటలో ఉండే కూరగాయల చిరువ్యాపారి దామర్ల లక్ష్మయ్య తన మూడేళ్ల కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భర్త చేష్టలను అసహ్యించుకున్న భార్య పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. = గడచిన పదినెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా మహిళలపై అత్యాచారం, అత్యాచార యత్నం, వేధింపుల కేసులు మొత్తం 363 నమోదయ్యాయి. = వీటిలో 36 కేసులు నిర్భయ చట్టం కింద నమోదయ్యాయి. తెనాలిలో 8, బాపట్లలో 4, నరసరావుపేటలో 9, సత్తెనపల్లిలో3, గుంటూరు ఈస్ట్, వెస్ట్ సబ్ డివిజన్లలో 6 చొప్పున నమోదయ్యాయి. గత మూడేళ్ల కాలంలో జరిగిన నేరాలను పరిశీలిస్తే.. = 2010లో 50 అత్యాచారం కేసులు, 305 అత్యాచారయత్నం,వేధింపుల కేసులు నమోదయ్యాయి. = 2011లో 69 అత్యాచారం, 230 అత్యాచారం, వేధింపుల కేసులు నమోదయ్యాయి. = 2012లో 47 అత్యాచారం, 257 అత్యాచారయత్నం, వేధింపుల కేసులు నమోదయ్యాయి. = ఈఏడాది అక్టోబర్ చివరి నాటికి 58 అత్యాచారం, 305 అత్యాచారయత్నం, వేధింపుల కేసులు నమోదు. = 185 కేసుల్లో నేటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఎంతటి వారినైనా ఉపేక్షించం రూరల్ ఎస్పీ జె. సత్యనారాయణ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, దాడులకు, నేరాలకు పాల్పడినా ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని రూరల్ జిల్లా ఎస్పీ జె. సత్యనారాయణ హెచ్చరించారు. వీలైనంత వరకు మహిళలు ఒంటరిగా వెళ్లకుండా తోడు వుండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళ వెళ్లాల్సి వస్తే కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాలన్నారు. ఒక వేళ స్నేహితులతో వెళ్లాల్సి వస్తే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్నారు. పోలీసుల సహాయం అవసరమైతే డయల్ 100 ను ఆశ్రయిస్తే నిమిషాల వ్యవధిలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారన్నారు. -
నిఘా లేక దగా...
=విజయవాడలో మహిళలకు కరువవుతున్న రక్షణ =మెట్రోనగరాల తరహాలో మోసాలు =నెలరోజుల్లో మూడు సంఘటనలు = భయభ్రాంతులకు గురవుతున్న నారీలోకం విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి మహిళలను నమ్మకంగా విజయవాడ తీసుకొచ్చి అఘాయిత్యాలకు పాల్పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రధానంగా నగరంలో పోలీస్ నిఘా కొరవడడంతో ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. గత నెల ఐదో తేదీ రాత్రి రైల్వే స్టేషన్లో 29 ఏళ్ల వివాహితపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం విదితమే. తప్పిపోయిన తన బిడ్డను వెతుక్కుంటూ పిడుగురాళ్లలో హైదరాబాద్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి అదే రోజు విజయవాడ స్టేషన్లో దిగింది. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఆమె రాజమండ్రి వెళ్లేందుకు ప్యాసింజర్ రైల్లో కూర్చోగా, ముగ్గురు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం నెల్లూరుకు చెందిన మహిళను ఆమె భర్తే గవర్నర్‌పేట లాడ్జిలో హత్య చేశాడు. పిల్లలు పుట్టలేదని భార్య సుజాతపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీనికి విజయవాడను సురక్షిత ప్రదేశంగా ఆ భర్త ఎంచుకున్నాడు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఇంట్లో అలిగి విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి వచ్చింది. అక్కడి షాపుల్లో వర్కర్లు ఆమెను చేరదీసి మాయమాటలతో లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడ్డారు. చేసిన తప్పునకు లెంపలేసుకుని తన ఇంటికి వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్న ఆ బాలిక వన్‌టౌన్ పోలీసులకు చిక్కింది. వారు ఆ బాలికను మందలించి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు విచారణ జరపగా ఒకరి తరువాత మరొకరు.. ముగ్గురు నిందితులయ్యారు. ఏకంగా ఆ బాలికను వారు నెల రోజులపాటు వన్‌టౌన్‌లోని ఓ ఇంట్లో ఉంచి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ బాలిక వివరించింది. మరిన్ని మహిళా స్టేషన్లు కావాలి.. నగరం మొత్తం మీద మహిళా పోలీస్ స్టేషన్ ఒకే ఒక్కటి ఉంది. బస్టాండ్, రైల్వేస్టేషన్, దుర్గగుడి, మేరీమాత ఆలయం తదితర ప్రాంతాల్లో పలువురు మహిళలు తరచు మోసగాళ్ల వలలో పడుతుం టారు. దూరప్రాంతాల నుంచి నగరానికి వచ్చి ఈ తరహా మోసాలకు గురైనవారిలో కొందరు గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోతుంటే, ఇంకొందరు కృష్ణానదిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ తరహా కేసుల్లో బాధితులకు సరైన న్యాయం జరగాలంటే మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. దీంతోపాటు మహిళా పోలీసులను కూడా అదనంగా నియమించి ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏదీ మార్పు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం అమలు చేస్తున్న మార్పు కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మాతా, శిశుమరణాలను నివారించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా తీసుకుంటున్న పలు రకాల కార్యక్రమాల వలన మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషణ స్థాయిలలో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ మాతృమరణాల రేటు లక్షకు 134, శిశుమరణాల రేటు 46గానే ఉంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా అనుబంధ పోషకాహారం, ఆరోగ్య, పోషక విద్యా కార్యక్రమాలు 35 ఏళ్లుగా చేపడుతున్నప్పటికీ ఇంకా 19.4 శాతం పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. మరో 37 శాతం మంది మూడేళ్లలోపు వయసు పిల్లలు ఉండవలసిన బరువు కంటే తక్కువగా ఉండటంతో పాటు 56 శాతం మంది గర్భిణీలు రక్తహీనతకు గురవుతున్నారు. మాతృ, శిశుమరణాలు ఎక్కువగా ఉండటానికి పోషకాహర లోపమే ప్రధాన కారణం. ఇందుకోసం మార్పు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మార్పు’లో భాగంగా ప్రధానంగా 20 లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి నెల అధికారులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాలుగు మార్లు సమావేశాలను నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ప్రతినెల తొలి మంగళవారం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో, రెండో మంగళవారం క్లస్టర్ పరిధిలో, మూడవ మంగళవారం జిల్లా స్థాయిలో, 4వ మంగళవారం గ్రామ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 14 క్టస్లర్లు ఉండగా వీటిలో జరిగే సమావేశాలకు క్లస్టర్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, ఆయా పీహెచ్‌సీల డాక్లర్లు, మెడికల్ సూపరింటెండెంట్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీఓ, సెర్ప్ ఏపీఎం, మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఏరియా కోఆర్డినేటర్లు హాజరు కావాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి డీఎంహెచ్ఓ కన్వీనర్‌గా, ఐసీడీఎస్ పీడీ కో కన్వీనర్‌గా, మెంబర్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లాలోని ఆయా క్లస్టర్లకు సంబంధించిన కన్వర్జెన్సీ ఆఫీసర్లు, ఆర్ఓఎంపీఓ, జెడ్పీ సీఈఓ, ఎస్ఈ పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ తదితరులు పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సమావేశాలకు సగం మంది అధికారులు కూడా హాజరు కావడం లేదని సమాచారం. సీడీపీఓలు అసలు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ కార్యక్రమం ఆచరణలో సక్రమంగా అమలు కావడం లేదు. ఈమె పేరు సరస్వతి. నెలలు నిండిన ఈమెకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి పోషకాహారం అందలేదు. పోషకాహారం ఎక్కడికెళ్లి తెచ్చుకోవాలో తెలీదని అమాయకంగా చెబుతోంది. ఈమె పేరు బత్తల నాగేశ్వరి. ఈమెకు ప్రస్తుతం మూడో సంతానం. బాలింతగా ఉన్న ఈమెకు ఎలాంటి పోషకాహారం అందడం లేదు.