బాగల్‌కోట్: ఫోన్లు, రిఫ్రజిరేటర్లు, వాషింగ్ మెషీన్లతో పాటు ఇప్పుడు హెయిర్ డ్రయ్యర్లు కూడా పేలుతున్నాయి. కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో హెయిర్ డ్రయర్ పేలిన ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ఈ ఘటనలో బాధితురాలు తన వేళ్లను కోల్పోయింది.
స్థానికులు వెంటనే బాధితురాలిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ 2017లో జమ్ముకశ్మీర్‌లో మరణించిన మాజీ సైనికుడు పాపన్న యర్నాల్ భార్య బసవరాజేశ్వరి యర్నల్ (37)గా పోలీసులు గుర్తించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పేలుడు సంభవించిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. హెయిర్ డ్రయ్యర్ లాంటి ఉపకరణాలను ఉపయోగించడానికి, రెండు వాట్ల విద్యుత్ కనెక్షన్ అవసరం. అయితే ఆ మహిళ హెయిర్ డ్రయ్యర్‌కోసం వినియోగించిన స్విచ్‌కు అంత సామర్థ్యం లేదు. ఈ కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు బసవరాజేశ్వరి పక్కింట్లో ఉంటున్న శశికళ హెయిర్ డ్రయ్యర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేశారు. అయితే ఆమె ఇంటిలో లేకపోవడంతో కొరియర్ బాయ్ ఆ హెయిర్ డ్రయ్యర్‌ను బసవరాజేశ్వరికి అప్పగించాడు. ఈ విషయాన్ని ఆమె శశికళకు తెలిపింది. ఆమె చెప్పిన మీదట ఆ హెయిర్ డ్రయ్యర్ ప్లగ్‌ను సాకెట్‌లో పెట్టిగానే పేలుడు సంభవించింది.
పేలుడు శబ్దం విన్న చుట్టుపక్కలవారు బసవరాజేశ్వరి ఇంటికి వచ్చి చూడగా, ఆమె అరచేతులు, వేళ్లు తెగిపడి ఉన్నాయి. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హెయిర్ డ్రయ్యర్ల తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా?
Comments
Please login to add a commentAdd a comment