
దాదాపు రూ.1 కోటి విలువైన తల వెంట్రుకలను దొంగలించిన చోరశిఖామణులు
బెంగళూరు: రాత్రిళ్లు వజ్రాభరణాల దుకాణాలు, ఏటీఎంలను కొల్లగొట్టి దొంగలు కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కొట్టేసే ఘటనలు రోజు ఏదో ఒక రాష్ట్రంలో చూస్తున్నే ఉన్నాం. కానీ ఈసారి కొందరు దొంగలు తమ చోరకళలో వైవిధ్యం ప్రదర్శించారు. బంగారం కొట్టేస్తే దానిని నగదుగా, ఒక వేళ నగదును కొట్టేస్తే నేరుగా వాడుకునే వెసులుబాటు దొంగలకు ఉంది. కానీ చోరీ చేసిన దానిని వెంటనే నగదుగా వాడుకునే అవకాశం లేకపోయినా సరే కొందరు దొంగలు జుట్టుపై కన్నేశారు. జుట్టుపై అంటే వ్యక్తుల తలపై ఉండే జుట్టుపై కాదు.
అప్పటికే మొక్కు రూపంలోనో, మరేదైనా కారణంగానో తలనీలాలను కత్తిరించగా వాటిని సేకరించిన ఓ వ్యాపారి తన గిడ్డంగిలో భద్రపరిచగా దానిని దొంగలు చోరీచేసి ఎత్తుకుపోయారు. కిలోల కొద్దీ జుట్టును చోరశిఖామణులు కొట్టేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. దాదాపు రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి విలువైన జుట్టును కొట్టేసిన వార్త తెలిసి ఆ గోడౌన్ యజమాని లబోదిబోమని ఏడ్వడంతో జుట్టు దోపిడీ వార్త ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చోరీ విషయం తెల్సి పోలీసులు భారతీయ న్యాయసంహిత చట్టాల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టారు.
తెలిసిన వ్యక్తుల పనేనా?
కోటి విలువైన సరుకు ఉందన్న పక్కా సమాచారంతోనే దొంగలు చోరీకి తెగబడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల చైనా నుంచి వచి్చన ఒక వ్యాపారి ఈ జుట్టును సరిచూసుకుని మార్కింగ్ వేసి మరీ వెళ్లారని యజమాని వెంకటస్వామి పోలీసులకు చెప్పారు. ఫిబ్రవరి 28 అర్ధరాత్రి పెద్దకారులో వచ్చిన ఆరుగురు దొంగలు వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో గోడౌన్ షట్టర్‌ను పగలగొట్టి తెరచి 27 సంచులను ఒక్కోటి ఎత్తుకెళ్లడం మొదలెట్టారు. ఇది గమనించిన సమీపంలోని ఓ వ్యక్తి ఆరాతీయగా ‘‘ఈ సరుకుంతా మాదే.
వేరే చోటుకు తరలిస్తున్నాం’’అని దొంగలు తెలుగులో ఏమాత్రం అనుమానంరాని రీతిలో అతనికి చెప్పారని పోలీసులు తెలిపారు. హడావిడిగా కారులోకి ఎక్కించడం, జుట్టు రోడ్డపై చెల్లాచెదురుగా పడటం గమనించిన మరో వ్యక్తి వెంటనే హెల్ప్‌లైన్ 112కు ఫోన్‌చేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు ఉడాయించారు. లక్ష్మీపుర క్రాస్ ప్రాంతంలో కేశాల వ్యాపారులు ఎక్కువ. ఈ సరకు విషయం తెల్సిన వ్యక్తులే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతర్రాష్ట కేశాల వ్యాపారంలో ఉన్న వ్యక్తుల హస్తం ఈ చోరీలో ఉండొచ్చనే అనుమానాలు పోలీసులు వ్యక్తంచేశారు.
850 కేజీల జుట్టు
ఉత్తర బెంగళూరు ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల కె.వెంకటస్వామి అనే వ్యాపా రి తన గోడౌన్‌ను హెబ్బళ్ ప్రాంతం నుంచి లక్ష్మీపుర క్రాస్ అనే ప్రాంతానికి ఫి బ్రవరి 12వ తేదీన మార్చారు. ఇతను కే శాల వ్యాపారం చేస్తుంటారు. కడప, శ్రీ కాకుళం ఇలా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో ఊరూరు తిరిగి జనం దగ్గర జుట్టును కొందరు వ్యక్తులు డబ్బులకు సేకరించిన ఏజెంట్లకు విక్రయిస్తారు. ఆ ఏజెంట్లను జుట్టును వెంకటస్వామి వంటి వ్యాపారులకు విక్రయిస్తారు. అలా తన వద్దకు వ
చి్చన జుట్టును వెంకటస్వామి హైదరాబాద్‌లోని ఒక వ్యాపారికి విక్రయిస్తారు. ఆ వ్యాపారి బర్మాకు ఎగు మతి చేస్తారు. అది ఆ తర్వాత చైనాకు తరలిపోతుంది. అక్కడ అత్యంత నాణ్యమైన విగ్గులను తయారుచేస్తారు. భారతీయుల జుట్టుతో తయారైన విగ్గులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అంతటి విలువైన 850 కేజీల జుట్టును ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసి వెంకటస్వామి తన గోడౌన్‌లో 27 సంచుల్లో భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment