hair
-
దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు
సాక్షి,విజయవాడ: అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ. కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గ వాసికెక్కిన ఇంద్రకీలాద్రి కూటమి పాలనలో అప్రతిష్ట పాలవుతుంది. అమ్మవారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో.. ఆ గుడిలో లడ్డూ ప్రసాదాన్ని సేవిస్తే అంతే పుణ్యం వస్తుందని నమ్మే భక్తుల నమ్మకం వమ్ము అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా,లడ్డూ ప్రసాదంలో తల వెంట్రుక ప్రత్యక్షమవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ దేవాలయాల్లో ప్రసాదాల్లో నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు కలకలం రేపాయి. ప్రసాదంలో నాణ్యత లోపించడంపై భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. లడ్డూ ఫొటోల్ని మంత్రులు నారాలోకేష్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘తప్పు జరిగింది. మరోసారి లాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని మంత్రి ఆనం రీట్వీట్ చేశారు’.ఇంతకీ ఏం జరిగిందంటే?ఇటీవల ఓ భక్తుడు తన కుటుంబ సభ్యులతో దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. అంనతరం ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. అయితే తాను కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో వెంట్రుక కంట పడింది. లడ్డూలో వెంట్రుక పొరపాటున పడిందేమో అని అనుకున్నారు. సాయంత్రం తన భార్య కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో మరో వెంట్రుక కనపడడంతో భక్తుడు హతాశుడయ్యాడు. వెంటనే వెంట్రుక ఉన్న లడ్డూ ప్రసాదాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. లడ్డూ ప్రసాదంలో వెంట్రుక పడిన విషయాన్ని మంత్రులు నారా లోకేష్,ఆనంకు ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.@naralokesh @Anam_RNReddy Respected sir yesterday we visited sri kanaka durga temple vijayawada the laddu prasadam was unhygienic we found hair in one laddu in the morning(we didn't take any photos of that)again my wife found hair in another Laddu now so pls look in to this sir pic.twitter.com/c6KjqAXLyE— Saran Baba (@SaranBaba1) February 8, 2025 ఆ ట్వీట్‌పై ఆనం రామనారాయణ రెడ్డి ట్వీట్లో దుర్గుగుడిలో తయారు చేసే లడ్డూ నాణ్యతా ప్రమాణాల్ని పాటిస్తే. నేను స్వయంగా లడ్డూ తయారు చేసే ప్రదేశాన్ని సందర్శిస్తానని తెలిపారు. ప్రసాదం పవిత్రంగా ఉంటామని చర్యలు తీసుకుంటాన్నారు. అయితే, ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో పలు దేవాలయాల్లో నాణ్యత లోపించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెజవాడ దుర్గ గుడిలో దర్శనం,అన్నప్రసాదం, ఇప్పుడు లడ్డూ ప్రసాదం తయారీ.. ఇలా వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే హెల్మెట్..!
కేశాలంకరణతోనే ముఖంలో ప్రత్యేక కళ వస్తుంది. తీసుకునే ఆహారంలో పోషక లోపాలు, ఒత్తిడి, జుట్టు విషయంలో సరైన శ్రద్ధ లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో చిన్న వయసులోనే చాలామంది బట్టతల బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ ‘హెయిర్ గ్రోత్ హెల్మెట్‘ చక్కగా ఉపయోగపడుతుంది.ఇది ఎల్ఈడీ రెడ్ లైట్ థెరపీని అందిస్తుంది. దీని నుంచి వచ్చే వైబ్రేషన్స్ తలమీద చర్మానికి, వెంట్రుకల కుదుళ్లకు చక్కటి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఈ లైట్ థెరపీ జుట్టు కుదుళ్లలో శక్తిని పెంచుతుంది. దీనిని వాడటం వల్ల ఎలాంటి నొప్పి, మంట ఉండవు. ఇది డైహైడ్రోటెస్టోస్టిరాన్ స్థాయిని తగ్గించి, తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.ఈ పరికరం జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా, ఉన్న జుట్టు మరింత ఏపుగా పెరిగేందుకు దోహదపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా వాడినట్లయితే, పన్నెండు వారాల్లోనే 128% జుట్టు పెరుగుతుందని ఈ హెల్మెట్ తయారీదారులు చెబుతున్నారు. దీన్ని ప్రతిరోజూ పది నిమిషాలు, తలకు పెట్టుకుని, స్విచాన్ చేసుకుంటే సరిపోతుంది. జుట్టు రాలిపోయిన ప్రదేశంలో తిరిగి వెంట్రుకలను మొలిపించడంలో ఈ హెల్మెట్ సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ పరీక్షల్లో తేలింది. -
కురుల చివరలు చిట్లుతుంటే...
చలికాలం చర్మ ఆరోగ్యాన్నే కాదు శిరోజాల సహజత్వాన్ని కాపాడుకోవాలి. లేదంటే వెంట్రుకలు పొడిబారడం, చిట్లడం, చుండ్రు సమస్య తలెత్తడం వంటివి చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా... అలెవెరాతో కండిషనింగ్షాంపులు, కాలుష్యం, గాలిలో తేమ తగ్గడం.. వంటి వాటి వల్ల ఈ కాలంలో వెంట్రుకలు త్వరగా పొడిబారడం, చిట్లడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. వీటి వల్ల జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది. రసాయనాల గాఢత తక్కువగా ఉండే షాంపూ(Shampooing:)తో తలస్నానం చేసిన తర్వాత అలోవెరా జెల్‌ను జుట్టుకు పట్టించాలి. 15–20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలోవెరా రసం జుట్టుకు కావలసినంత కండిషన్(Conditioning) లభించేలా చేస్తుంది. ఉసిరితో మృదుత్వంఉసిరి, మందారపువ్వులు మరిగించిన కొబ్బరినూనెతో మాడుకు, వెంట్రుక లకు రాసి, మర్దనా చేయాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే వెంట్రుకలు చిట్లడం(Hair Damage) సమస్య తగ్గుతుంది. కురుల మృదుత్వం పెరుగుతుంది. తప్పనిసరిగా చేయాల్సినవి..జుట్టు(Hair)ను వేడి చేసే పరికరాలను ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం. ఒకవేళ హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిట్నర్స్ వంటి హీటింగ్ పరికరాలను ఉపయోగించినా.. చాలా తక్కువ హీట్ తో ఉపయోగించండి. ఒకవేళ కచ్చితంగా వినియోగించాల్సి వస్తే.. మీరు ముందుగా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేని ఉపయోగించవచ్చుతలస్నానం(Head Bath) రోజూ చేసే అలవాటు కొందరిలో కనిపిస్తుంది. కానీ, కనీసం మూడు రోజులకోసారి చేయడం బెటర్. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహజ నూనెలు అనేవి విడుదల అవుతుంటాయి. అందుకే కనీసం మూడు రోజులు మధ్యలో విరామం ఇవ్వడం వల్ల ఆ నూనెలు శిరోజాల రక్షణకు ఉపయోపడతాయి.శిరోజాల్లో తగినంత తేమ ఎప్పుడూ ఉండడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి. మంచి కండిషనర్ ను స్వయంగా మనమే చేసుకోవచ్చు. గుడ్డు సొన, పెరుగు కలిపి కురుల మొదళ్లలో పట్టించాలి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.పొడిబారిన జుట్టు, దెబ్బతిన్న శిరోజాలకు బాదం నూనె చక్కగా పనిచేస్తుంది. ఓ పాత్రలో కొంచెం బాదం నూనె వేసుకుని, దాన్ని 40 సెకండ్ల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత తల వెంట్రుకలకు రాసుకోవాలి. 30 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. చల్లటి నీటితోనే చేయాలి. అలాగే కండిషనర్ కుడా అప్లయ్ చేయాలి.అర కప్పు తేనె, రెండు చెంచాల ఆలివ్ ఆయిల్, రెండు చెంచాల గుడ్డులోని పచ్చసొన మిశ్రమాన్ని తల వెంట్రుకలకు పట్టించి 20 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఆ తర్వాత వేడి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే కెరాటిన్ ప్రొటీన్ బాండ్స్ తిరిగి భర్తీ అవుతాయి.మహిళలు జుట్టుని గట్టిగా చుట్టేసి పెట్టడం చేస్తుంటారు. పెళుసుబారిన జుట్టు చిట్లిపోకుండా నివారించేందుకు జుట్టుని గట్టిగా ముడేయకుండా, ఎటువంటి బ్యాండ్లను పెట్టకుండా ఉండడమే బెటర్.వెంట్రుకల చివర్లో చిట్లకుండా ఉండేందుకు వెడల్పాటి పళ్లున్న దువ్వెనలను వాడాలి. తరచూ హెయిర్ స్టయిల్ చేయించుకోవద్దు. నైలాన్ బ్రిస్టల్స్ ఉన్న దువ్వెనలను వాడాలి. తగినంత నీరు తాగాలి. ఉల్లిగడ్డ రసం జుట్టురాలిపోయే సమస్యను నివారించడంతోపాటు, హెయిర్ ఫాలికుల్స్ కు రక్త సరఫరా జరిగేలా చూస్తుంది.పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలిపోతుంటే అందుకు బీట్ రూట్ రసం చక్కని పరిష్కారంశిరోజాలు తిరిగి జీవం పోసుకోవడానికి, జుట్టు పెరుగుదల మెరుగుపడడానికి గ్రీన్ టీ మంచిగా తోడ్పడుతుంది. శరీరంలో జీవ క్రియలను గ్రీన్ టీ మెరుగు పరుస్తుంది.అరటి పండు గుజ్జుకు, కొంత తేనె, పాలు కలిపి వెంట్రుకలకు మాస్క్ లా వేసుకోవాలి. గంట తర్వాత కడిగేసుకోవాలి. మెంతులను పేస్ట్ లా చేసుకుని దాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత కడిగేయడం వల్ల సిల్క్ గా జుట్టు కనిపిస్తుంది.చివరగా జుట్టు ఆరోగ్యం(Healthy Hair) కోసం తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్, బయోటిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.(చదవండి: ఏం పెట్టారబ్బా ముగ్గు..? చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..!) -
జుట్టుకి గుడ్లు, పెరుగు అప్లై చేయడం మంచిదేనా..?
కురుల ఆరోగ్యం కోసం పెరుగు, మెంతులు, గుడ్లు వంటివి అప్లై చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని నిపుణులు కూడా సిఫార్సు చేస్తుంటారు. అంతెందుకు నీతా అంబానీ, జాన్వీ కపూర్, అలియా భట్ వంటి ప్రముఖులు కూడా తమ అందమైన శిరోజాల సీక్రెట్ ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు కూడా. అయితే సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ ఇలా గుడ్లు, పెరుగు కురులకు అప్లై చేయడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా..? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా జుట్టుకి కండిషనర్‌గా అవి రాయడం వల్ల ఏమవుతుందో కూడా వెల్లడించారు. ఇంతకీ ఠాగూర్ ఏమన్నారంటే..జుట్టుకి పెరుగు, గుడ్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనేది అవాస్తవమని చెప్పారు. ఇది రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండదని తెలిపారు. ఇక్కడ పెరుగులో పుష్కలంగా ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టులోని పీహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మంచి కండిషనర్‌గా ఉంటుంది. అయితే జుట్టు నష్టాన్ని రిపేర్ చేయదని అన్నారు. అలాగే గుడ్డులో విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని అప్లై చేయడం వల్ల శిరోజాలు మృదువుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. అయితే శాశ్వతమైన మార్పును కలిగించదు. ఈ సహజసిద్ధమైన వాటితో తయారైన ఉత్పత్తులు కురులను ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని అన్నారు. మన బడ్జెట్‌కి అనుగుణంగా కురులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పెరుగు, గుడ్లు వంటి వాటిని కండిషనర్లుగా ఉపయోగించొచ్చని చెప్పారు.కానీ జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరిగేందుకు, డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేసేందుకు మాత్రం ఇవి అస్సలు సరిపోవని తేల్చి చెప్పారు హెయిర్‌స్టైలిస్ట్ ఠాగూర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది కూడా. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!) -
తల వెంట్రుకలను లాగేసుకుంటోంది..!
మా అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. బీటెక్ చదువుతోంది. ఈ మధ్య తల వెంట్రుకలను గట్టిగా పట్టి ఒక్కొక్కటీ లాగేసుకుంటోంది. మాట్లాడుతూనో.. చదువుకుంటూనో... ఇలా వెంట్రుకలు లాగేస్తోంది. దీనివల్ల తలలో చాలా భాగం బట్టతలలా మారి చూడటానికి అసహ్యంగా కనిపిస్తోంది. గట్టిగా మందలిస్తే, అప్పుడు మానేస్తుంది కానీ మళ్లీ మామూలే! మాకు విసుగొచ్చి ఒక దెబ్బ వేస్తే ఏడుస్తోంది. తాను కావాలని అలా చేయడం లేదనీ, తనకు తెలియకుండానే అలా లాగేస్తున్నానని చెబుతోంది. కాలేజీకి వెళ్లే అమ్మాయి ఇలా చేస్తుంటే నలుగురూ ఏమనుకుంటారో అని భయంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే తనకసలు పెళ్లవుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.– రాజేశ్వరి, ఆదిలాబాద్మీరు చెప్పిన వివరాలను బట్టి మీ అమ్మాయి ట్రైకోటిల్లో మేనియా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతున్నట్లు అర్థమవుతోంది. అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇది యువతలో వచ్చే ఒక అరుదైన మానసిక రుగ్మత. తలవెంట్రుకలే కాకుండా, కొందరు కనుబొమలు, కంటిరెప్పల వెంట్రుకలను కూడా ఇలాగే లాగేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అయితే ఇలా లాగేసిన వెంట్రుకలను మింగడం కూడా జరుగుతుంది. కొందరు పిల్లల్లో సడన్‌గా వచ్చే కడుపునొప్పికి కారణం ఈ వెంట్రుకలన్నీ కడుపులో అడ్డుపడడమే! ఆందోళన, టెన్షన్‌కు లోనయిన వారిలోనూ, బుద్ధిమాంద్యమున్న వారిలోనూ ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కంపల్సివ్ పుల్లింగ్ అంటే వెంట్రుకలు లాగేయడం అన్నది మళ్లీ మళ్లీ చేయాలనే ఒక మానసిక వైపరీత్యం వల్ల కూడా ఇలా జరుగుతుంది. దీనిని ఎంత అదుపు చేసుకుందామనుకున్నా వారికి సాధ్యం కాదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆధునిక మానసిక వైద్యశాస్త్రంలో అద్భుతమైన ఔషధాలతోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స కూడా ఉంది. చాలామందికి ఇది మానసిక సమస్య అని తెలియక చర్యవ్యాధి డాక్టర్లను సంప్రదిస్తుంటారు. మీరు ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలోని మానసిక వైద్యుని సంప్రదిస్తే మీ అమ్మాయిని ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?) -
‘నేనే ఇలా ఎందుకమ్మా..’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని: హీరోయిన్
ట్రోల్ చేసి మనల్ని వెనక్కు లాగేవాళ్లు ఉన్నట్లే, మోటివేట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళూ ఉంటారు. సోనమ్ కపూర్‌ను అలా ముందుకు నడిపించిన వ్యక్తి కాజోల్. అయితే కాజోల్ కు సోనమ్ ఆ సంగతి నేరుగా ఎప్పుడూ చెప్పలేదు. మనసులోనే ఉన్న కాజోల్ నుంచి ప్రేరణను పొందారు సోనమ్. సినిమాల్లో కాజోల్ పీక్ దశను కూడా దాటేసి ఉన్నప్పుడు సోనమ్ వయసు 16. పదహారు అంటే పుస్తకాల్లో రాసినట్లు స్వీట్ సిక్స్ టీనే కానీ, అందరి విషయంలోనూ స్వీట్ కాక΄ోవచ్చు. ఆ వయసులో సోనమ్ అందమైన, లేత ముఖం మీద వెంట్రుకలు కనిపించేవి. పెద్ద పెద్ద మొటిమలు ఉండేవి. బరువు కూడా పెరిగింది. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉందనీ, ముఖంపై వెంట్రుకలు రావటం, బరువు పెరగటం, మొటిమలు.. ఇవన్నీ పీసీఓఎస్వల్లనేనని ఫ్యామిలీ డాక్టర్ తొలిసారి చెప్పినప్పుడు సోనమ్ కుంగి పోయింది. తల్లిని చుట్టేసుకుని బావురుమంది. అయితే సోనమ్‌కు అంతకన్నా పెద్ద కష్టం వచ్చి పడింది! అందరూ ఆమెను చూసి, ‘అనిల్ కపూర్ కూతురు కదా..’ అనేవాళ్లట.. ‘ఇలా ఉందేమిటి!!’ అనే అర్థంలో! (యువతుల డ్రీమ్ బాయ్ అని అనిల్ కపూర్‌కు పేరు). పాపం నాన్న పేరు పోతోందే నా కారణంగా..’ అని సోనమ్ బాధపడుతుండేది. ‘నేనే ఇలా ఎందుకు ఉన్నానమ్మా..’ అని తల్లిని పట్టుకుని కంటతడి పెట్టుకునేది.ఓరోజు తల్లి ఆమెకు కాజోల్ ఫొటో చూపించి, ‘తను స్టార్ హీరోయిన్ కదా. అయితే ఆ కనుబొమలు చూడు. రెండూ కలిసిపోయి ఉన్నాయి. కొందరికి ఇలానే ‘యూనిబ్రో’ ఉంటుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ తన కనుబొమలు షేప్ చేయించుకోలేదు. అలాగే ఉంచేసుకున్నారు. అందమంటే అది బంగారం, ఆమెలోని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు. తల్లి మాటలు సోనమ్‌లో బాగా నాటుకుపోయాయి. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాజోల్కు మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. తనను ట్రోల్ చేసే వాళ్లను పట్టించుకోవటం మానేసింది. సోనమ్‌కు పదహారు దాటి 17 లోకి రాగానే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అవకాశం వచ్చింది. ఆయన ‘బ్లాక్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు సోనమ్. తర్వాత 2007 లో నటిగా తన తొలి చిత్రం ‘సావరియా’ తో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఒక చిత్రంలో కూడా కనిపించారు. తన పీసీఓఎస్ఎప్పుడు మాయమై΄ోయిందో కూడా సోనమ్‌కి గుర్తులేదు. ట్రోల్స్ కూడా అంతే. వస్తాయి. పోతాయి. ‘అంత పెద్ద స్టార్ అయిండీ కాజోల్ తన యూనిబ్రోని ఒక సమస్యగా తీసుకోకపోవటం అన్నది నాలో అంతర్లీనంగా పని చేసి, స్ఫూర్తిని నింపింది..’ అని తాజాగా బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సోనమ్ కపూర్. ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా? -
పేలిన హెయిర్ డ్రయ్యర్.. తెగిపడిన మహిళ వేళ్లు
బాగల్కోట్: ఫోన్లు, రిఫ్రజిరేటర్లు, వాషింగ్ మెషీన్లతో పాటు ఇప్పుడు హెయిర్ డ్రయ్యర్లు కూడా పేలుతున్నాయి. కర్నాటకలోని బాగల్కోట్ జిల్లాలో హెయిర్ డ్రయర్ పేలిన ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ఈ ఘటనలో బాధితురాలు తన వేళ్లను కోల్పోయింది.స్థానికులు వెంటనే బాధితురాలిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ 2017లో జమ్ముకశ్మీర్‌లో మరణించిన మాజీ సైనికుడు పాపన్న యర్నాల్ భార్య బసవరాజేశ్వరి యర్నల్ (37)గా పోలీసులు గుర్తించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పేలుడు సంభవించిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. హెయిర్ డ్రయ్యర్ లాంటి ఉపకరణాలను ఉపయోగించడానికి, రెండు వాట్ల విద్యుత్ కనెక్షన్ అవసరం. అయితే ఆ మహిళ హెయిర్ డ్రయ్యర్కోసం వినియోగించిన స్విచ్‌కు అంత సామర్థ్యం లేదు. ఈ కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు బసవరాజేశ్వరి పక్కింట్లో ఉంటున్న శశికళ హెయిర్ డ్రయ్యర్‌ను ఆన్లైన్లో బుక్ చేశారు. అయితే ఆమె ఇంటిలో లేకపోవడంతో కొరియర్ బాయ్ ఆ హెయిర్ డ్రయ్యర్‌ను బసవరాజేశ్వరికి అప్పగించాడు. ఈ విషయాన్ని ఆమె శశికళకు తెలిపింది. ఆమె చెప్పిన మీదట ఆ హెయిర్ డ్రయ్యర్ ప్లగ్‌ను సాకెట్లో పెట్టిగానే పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం విన్న చుట్టుపక్కలవారు బసవరాజేశ్వరి ఇంటికి వచ్చి చూడగా, ఆమె అరచేతులు, వేళ్లు తెగిపడి ఉన్నాయి. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హెయిర్ డ్రయ్యర్ల తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!
చాలామంది తమ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎక్కువగా రేజర్‌ను వాడుతుంటారు. దాని వల్ల చర్మం మొద్దుబారడం, వెంట్రుకలు బిరుసెక్కడం, మరింత దట్టంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చిత్రంలోని మెషిన్ ఇలాంటి సమస్యలకు ఇట్టే చెక్ పెడుతుంది.ఈ హైపవర్ హెయిర్ రిమూవల్ డివైస్ ఎల్ఈడీ లైట్ థెరపీని కూడా అందిస్తుంది. ఈ ఎపిలేటర్ మెషిన్ మృదువుగా, నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ అందిస్తుంది. వెంట్రుకలను తొలగించే సమయంలో చల్లదనాన్ని అందిస్తుంది. వెంట్రుకలు తొలగిన తర్వాత దురద పుట్టడం, మంట కలగడం వంటి ఇబ్బందులను రానివ్వదు. ఫ్లాష్, మోడ్, లెవల్స్ వంటి ఆప్షన్స్ అన్నీ డివైస్‌కి ముందువైపు ఉంటాయి. చిత్రంలో చూపిన విధంగా చర్మానికి ఆనించి, వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మెషిన్ సాయంతో వెంట్రుకలు తొలగించుకుంటే గీతలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. కాళ్లు, చేతులు, నడుము, పొట్ట, అండర్ ఆర్మ్స్, బికినీలైన్ ఇలా చర్మంపై పలుభాగాల్లో వెంట్రుకలను సులభంగా తొలగించుకోవచ్చు. దీని వాడకంతో అవాంఛిత రోమాలున్న చర్మం కాలక్రమేణా మృదువుగా మారుతుంది. రోలర్ అటాచ్మెంట్, ఎల్ఈడీ అటాచ్మెంట్, స్పాట్ అటాచ్మెంట్, ఏసీ అడాప్టర్‌తో ఈ మెషిన్ లభిస్తుంది. దాంతో ఇది యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీన్ని సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సీక్రెట్స్ : మేక పెరుగు, నెయ్యి, జ్యూస్‌లు
ఆర్ట్ కలెక్టర్, దాత సోషల్ మీడియా సెన్సేషన్, రియాలిటీ టీవీ స్టార్ షాలిని పాసి 'ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' సిరీస్‌తో మరింత పాపులర్ అయిపోయింది. ఆమె అదిరిపోయే పంచ్ డైలాగులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు 49 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? శిల్పం లాంటి ఆకృతి, మెరిసే చర్మం కోసం, ఆమె ఏమి తింటుంది అనేది చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆహార నియమాలు, సౌందర్య రహస్యాలను బహిర్గతం చేసింది. షాలిని రోజువారీ ఆహారంలో ఎటువంటి ఘనమైన ఆహారం తీసుకోదట. సెలెరీ (ఆకుకూరలు)జ్యూస్, కూరగాయలతో చేసిన జ్యూస్‌లు, నెయ్యి, మేక పెరుగు ఖచ్చితంగా తీసుకుంటానని తాగా వెల్లడించింది. ప్రధానంగాకొంచెం వింతగా అనిపించినా తాను మేక పెరుగును ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. మేక పెరుగుతో ఎముకలు ,దంతాలు బలంగా ఉంటాయని వివరించింది. డైట్ మాత్రమే కాదు, రోజుకు రెండు గంటల వ్యాయామం తప్పకుండా చేస్తుందట.షానిలి డైట్ సీక్రెట్, ఆమె మాటల్లో ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటా.తర్వాత ఉసిరి అల్లం కలిపిన బీట్రూట్ రసం.డైట్లో హెర్బల్ లిక్విడ్లు, కూరగాయలజ్యూస్లు ఎక్కువ భాగం ఉంటాయి. రెండు గిన్నెల మొలకలను నమలడం కష్టం. అదే జ్యూస్ అయితే సులభంగా తాగవచ్చు. సెలెరీ జ్యూస్, రెడ్ జ్యూస్, స్ప్రౌట్ జ్యూస్, మిరియాలతో చేసే క్యాప్సికమ్ జ్యూస్ ఇలా చాలా ఉంటాయి.సాయంత్రం ఆహారంలో ప్రతిదీ సూప్ రూపంలో ఉంటుంది. వడకట్టకుండా, చిక్కగా ఉండే కూరగాయలను జ్యూస్‌లను తాగుతాను. ఇంకా బచ్చలికూర, బ్రోకలీ సూప్, టొమాటో, బెండ, తామర కాండం, బఠానీలు ఇలా ఏదైనా జ్యూస్ రూపంలోనే.సాయంత్రం 6 గంటల వరకు పచ్చి ఆహారం మాత్రమే .. రాత్రి 7 గంటలకు భోజనం. అదీ కూడా 'ఘర్ కా ఖానా (ఇంట్లో వండిన ఆహారం)'ఉండేలా చూసుకుంటా. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే సహజమైన వాటిని మాత్రమే తీసుకుంటాను.డిన్నర్లో అవకాడో, రాగి లేదా జొన్న పిండితో చేసిన దోసలు తింటానుఇక గుడికి వెళ్లని రోజుల్లో ప్రోటీన్ కోసం గుడ్డు, చేపలు లేదా చికెన్ తీసుకుంటా.సాయంత్రం 4 నుండి 6 వరకు నా వర్కౌట్ సమయం. కండరాలకు బలం చేకూర్చే పైలేట్స్ , డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. (ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!) -
ప్రొటీన్ పవర్‌హౌస్ బెండకాయ జిగురుతో మహిమలెన్నో!
బెండకాయతో బెనిఫిట్స్ జుట్టు, చర్మం, మోకాళ్ల నొప్పులు ఇంకా ఎన్నో బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికి రావు అనే సామెతవిన్నవారికి, దాని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలు, జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని రక్షించడంలో కాపాడటంలో ఎలా పనిచేస్తుంది. తెలుసుకుందాం ఈ కథనంలో.బెండకాయ, భేండీ, లేడీ ఫింగర్ పేరు ఏదైనా లాభాలు మాత్రం మెండు. బెండకాయ జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు బెండకాయ తినడం వల్ల మెదడు బాగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే పిల్లలకి బెండకాయ ఎక్కువగా పెడుతూ ఉంటారు. బెండకాయలో పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి బెండకాయతో బోలెడన్ని రెసిపీలు చేసుకోవడం మాత్రమే కాదు, అలాగే మోకాళ్ల నొప్పులుతో బాధపడేవారు, వీర్యకణాలు తక్కువగా ఉండేవారు బెండకాయలను తీసుకోవాలని చెబుతారు. కెరటిన్ కూడా ఎక్కువే. అందుకే ఆరోగ్యకరమైన జుట్టుకు చర్మం సంరక్షణలో కూడా బెండకాయ బాగా పనిచేస్తుంది. బెండకాయ బాగా పనిచేస్తుంది. ప్రకృతి సహజంగా లభించే కెరటిన్‌తో జుట్టు సిల్కీగా, హెల్దీగా ఎదుగుతుంది.బెండకాయలో మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ కే2సీ, ఏ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు, గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది.పురాతన ఈజిప్టులోని స్త్రీలు బ్యూటీకోసం వాడేవారట. ఉపయోగించారు. బెండకాయలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌తో చర్మం మెరిసిపోతుంది. యాంటీ ఏజింగ్ సొల్యూషన్‌లా పనిచేస్తుంది. వీటిల్లోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , రీ-హైడ్రేటింగ్ లక్షణాల మొఖం మీద మొటిమలను విజయవంతంగా నిర్మూలిస్తుంది. బెండకాయ నీరుబెండకాయను ముక్కలుగా కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే, సుగర్వ్యాధి గ్రస్తుల్లో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సల్యూబుల్ ఫైబర్, శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. వీర్యపుష్టికి పనిచేస్తుంది.బెండకాయలో ఉండే అధిక ఫైబర్ శాతం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారించి, మలబద్దకానికి మంచి మందులాగా కూడా పనిచేస్తుంది. బెండకాయలో ఉండే మ్యూసిలేజ్ అనే పదార్ధం గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలకుచెక్ పెబుతుంది. ఓక్రా పౌడర్‌తో ప్యాక్మెరిసే చర్మం కావాలంటే ఫేస్ ప్యాక్‌ను వాడవచ్చు. దీనికి కావాల్సిందల్లా రసాయన ఎరువులు వాడకుండా, సేంద్రీయంగా పండించిన బెండకాయలు. వీడిని ఎండబెట్ట పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌లో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి కనీసం 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. దానిని గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.బెండకాయలు ముక్కలుగా చేసి 10 నిమిషాలు నీటిలో ఉడకబెట్టండి. ఇందులో కొద్దిగా యోగర్ట్, ఆలివ్ నూనె కలిపి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ముఖానికి రాసుకొని ,15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ను ఒక వారం పాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.ప్రొటీన్ల పవర్‌హౌస్ లేడీఫింగర్‌తో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. స్కాల్ప్‌ను తేమగా ఉంచుతుంది. దురదలు, జుట్టు పొడిబారడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఫ్రింజీగా ఉండే గిరిజాల జుట్టును మృదువుగా మారుస్తుంది. ఏం చేయాలంటే! కట్ చేసిన బెండకాయలను కాసేపు నీళ్లలో ఉడికించాలి. దీన్ని చల్లారేదాకా అలాగే ఉంచాలి. తరువాత ఈ వాటర్‌ను ఒక గాజు సీసాలోకి వడ బోసుకోవాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీళ్లను జుట్టంతా పట్టించాలి. 25 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది మంచి కండీషనర్‌గా పనిచేసి ఎలాంటి జిట్ట జుట్టునైనా మృదువుగా మార్చేస్తుంది. -
ఈ డివైజ్‌తో ఒత్తుగా దృఢంగా ఉండే కురులు సొంతం..!
ఆడవారికి కురులతోనే అందం రెట్టింపవుతుంది. పెదవులను, కనురెప్పలను, కనుబొమ్మలను ప్రత్యేకంగా హైలైట్ చేసి మేకప్ వేసుకున్నా, ట్రెడిషనల్ లేదా మోడర్న్ డ్రెస్ వేసుకుని మెరిసిపోవాలన్నా, అందుకు తగ్గ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి జుట్టు ఉండాలి. చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్ హెయిర్ ఆయిల్ అప్లికేటర్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ను చక్కగా అందిస్తుంది.ఇది చూడటానికి చిన్నగా, చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఈ ఆయిల్ అప్లికేటర్ బ్రష్‌లో వైబ్రేషన్ ఫంక్షన్ ఉండటంతో ఇది స్కాల్ప్ మసాజర్‌లా పని చేస్తుంది. దీని లోపల ఉన్న మినీ ట్యాంక్‌లో నూనె పోసుకుని, డివైస్‌తో లభించే సీరమ్ కలుపుకుని, బటన్ ఆన్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పవర్ కనెక్టర్ దగ్గర సేఫ్టీ క్యాప్ ఉండటంతో వాటర్‌ప్రూఫ్‌లా పని చేస్తుంది. అందువల్ల దీన్ని వినియోగించడం, శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. ఈ డివైస్ 5 మి.లీ. సామర్థ్యంతో రూపొందింది. దీనికి యూఎస్బీ కేబుల్‌తో చార్జింగ్ పెట్టుకుంటే, వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. లాప్టాప్, ఫోన్, పవర్ బ్యాంక్‌లతో కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీన్ని పోర్టబుల్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇది హెడ్ మసాజర్ నాన్–స్లిప్ ఉపరితలంతో పట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇది పని చేస్తున్నప్పుడు లోపల లైట్ వెలుగుతూ తలకు గోరువెచ్చని కాపడం కూడా అందిస్తుంది. దీనికి ప్రత్యేకమైన క్యాప్ ఉంటుంది. మసాజ్ చేసుకునే పని లేనప్పుడు దాన్ని డివైస్‌కి బిగించి, ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లొచ్చు. ఇలాంటి మసాజర్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. కంపెనీని బట్టి ఒక హెయిర్ గ్రోత్ సీరమ్ డివైస్‌తో పాటు లభిస్తుంది. ఆ సీరమ్ అయిపోతే మళ్లీ ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ధర 26 డాలర్లు. అంటే 2,176 రూపాయలు మాత్రమే! (చదవండి: ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు..) -
పచ్చి కరివేపాకు నములుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి?
సోషల్ మీడియాలో రెసిపీలు, చిట్కాలకు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతూ ఉంటాయి. కానీ నిజానిజాలు తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉండాలి.ఇటీవలి కాలంలో పచ్చి కరివేపాకు ఆకులను నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని బాగుపడుతుందనే వార్త హల్చల్ చేస్తుంది. దీంట్లోని నిజానిజాలేంటో చూద్దాం రండి.కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకులో విటమిన్లు ఎ, బి, సి , డి వంటి ముఖ్యమైన పోషకాలు, అలాగే కాల్షియం, ఐరన్ ,ఫాస్పరస్ వంటి కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.అందుకే రోజువారీ కూరల్లో ప్రతీ దాంట్లోనూ కరివేపాకును విధిగా వాడుతూ ఉంటాం. దీంతో వంటకాలకు మంచి వాసన రావడం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో అవసరమైన పోషకాలతో పాటు కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి కరివేపాకును నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఆకులు వెంట్రుకలకు పోషణ , జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కానీ దుష్ప్రభావాలు కూడా ఉంటాయినేది గమనించాలి.బరువును నియంత్రిస్తుంది, చుట్టు మెరిసేలా చేస్తుందిచెడు కొలస్ట్రాల్‌కు చెక్ చెప్పాలన్నా కరివేపాకు బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు రోజూ కరివేపాకును అనేక రూపాల్లో తింటూ ఉండాలి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. రోజూ కరివేపాకు తీసుకునే వారికి షుగర్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కంటిచూపు మెరుగుపడుతుంది. కొల్లాజెన్‌ను పెంచడానికి తోడ్పడుతుంది. చుండ్రు, జుట్టు రాలిపోవడంలాంటి సమస్యలను అధిగమించొచ్చు. ఇందులో లభించే కెరోటిన్‌తో జుట్టు నిగనిగలాడుతూ బాగా పెరుగుతుంది. జుట్టు తెల్లగా అవ్వకుండా కాపాడుతుంది. మూత్రంలో మంట, మూత్రం సరిగ్గా రాకపోవడంలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. కిడ్నీల్లో రాళ్లతో బాధపడేవారు కరివేపాకులను ఎక్కువగా తీసుకోవాలి. అజీర్తిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది కరివేపాకు ఆకలిని బాగా పెంచుతుంది. అందుకే జబ్బు పడిన వారికి, జ్వరం వచ్చితగ్గిన వారికి ధనియాలు, కరివేపాకుతో చేసిన కారప్పొడిని తినిపిస్తారు. విరేచనాలు విరేచనాలతో బాధపడేవారు కరివేపాకును బాగా ఎండబెట్టి దాన్ని పొడిగా చేసుకుని కాస్త తేనె కలుపుకుని తాగుతారు.రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులనుతినవచ్చు. అయితే దానిమీద పురుగుమందుల అవశేషాలు లేకుండా జాగ్రత్తపడాలి. శుభ్రంగా కడిగి తింటే చాలా రకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. మరీ అతిగా తీసుకోకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు పచ్చివి తినకుండా ఉంటే మంచిది. ఎలా తినాలి?కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి, అన్ని రకాల కూరల్లో వాడటం ద్వారా దీని ప్రయోజనాలు పొందవచ్చు. -
మహిళా డీఎస్పీపై ఆందోళనకారుల దాడి.. జుట్టు పట్టుకొని లాగి
చెన్నై: విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిపై కొందరు నిరసన కారులు దాడి చేశారు. ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారిణి జుట్టు పట్టుకొని లాగి కొట్టడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకింది. మహిళా అధికారిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులోని విరుద్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. రామనాథపురానికి చెందిన 35 ఏళ్ల ట్రక్ డ్రైవర్ కాళికుమార్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి సమయంలో హతమార్చారు. తిరుచ్చూరి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కాగా నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం హతుడి బంధువులు, కుటుంబీకులు తిరుచ్చూరికి చేరుకుని అందోళనకు దిగారు. అరుప్పుకోట్టై మార్గంలో బైఠాయించి ఆందోళనకు దిగారు. వీరిని బుజ్జగించేందుకు డీఎస్పీ గాయత్రి అక్కడకు వచ్చారు.క్రమంలో నిరసన చేస్తున్న వారిలో కొందరు మహిళలు ఆమెపై దాడి చేశారు. డీఎస్సీ జుట్టు పట్టుకుని లాగి కొట్టడంతో మిగిలిన పోలీ సులు అప్రమత్తమయ్యారు. నిరసన కారులను బలవంతంగా అరెస్టు చేయడానికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య భౌతిక వాగ్వాదం జరిగింది.అయితే తన మీద దాడి చేసినప్పటికీ సంయమనంతో వ్యవహరించిన డీఎస్సీ ఆందోళనకారులను స్వయంగా బుజ్జగించారు. నిందితులను నలుగురిని అరెస్టు చేశామని సూచించడంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. కాగా డీఎస్పీ గాయత్రి సంయమనం, పని తీరును స్థానికులు ప్రశంసించారు.பெண் டிஎஸ்பிக்கு நடந்தது என்ன? அருப்புக்கோட்டையில் அரங்கேறிய திடுக் சம்பவம்!#NakkheeranTV #Aruppukottai #tnpolice pic.twitter.com/iRzV1OcrfW— Nakkheeran (@nakkheeranweb) September 3, 2024 -
బంగారం లాంటి క్యారెట్ : మృదువైన చర్మం, మెరిసే జుట్టు, ఇలా ఎన్నో..!
కూరగాయల్లో శ్రేష్టమైన క్యారెట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. క్యారెట్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. రోగనిరోధక శక్తికినిచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అనేక బ్యూటీ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అందుకే దీన్ని కాస్మొటిక్ వెజ్ అని కూడా అంటారు. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. కాలేయం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు చర్మం,జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. సెప్టెంబరు 1 నుండి 7వ తేదీ జరుపుకునే నేషనల్ నూట్రిషన్ వీక్ సందర్భంగా ఈ విశేషాలు మీకోసం..ఆఫ్ఘనిస్తాన్‌లో మొట్టమొదట పండించిన దుంప కూర క్యారెట్. మనకు తెలిసిన ఆరెంజ్ రంగులో మాత్రమే కాదు, ఊదా, పసుపు, ఎరుపు, తెలుపు లాంటి ఇతర రంగులలో కూడా లభిస్తాయి. ఆరెంజ్ క్యారెట్లు 15-16వ శతాబ్దంలో మధ్య ఐరోపాలో అభివృద్ధి చేయబడ్డాయి.క్యారెట్లలో శక్తి అందించే విటమిన్లు ఏ, ఈ, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలతో పాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. గుండె, మూత్రపిండాలు ,కాలేయ ఆరోగ్యానికి సాయం చేస్తుంది. క్యారెట్ విటమిన్ సి, లుటిన్, జియాక్సంథిన్, విటమిన్ కె, డైటరీ ఫైబర్‌కి మంచి మూలం. క్యారెట్లో పిల్లల ఎదుగుదలకు అవసరమైన బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని పొందడానికి మీరు క్యారెట్‌ను ఫేస్ ప్యాక్‌ల రూపంలో కూడా ఉపయోగించవచ్చు. మధుమేహ రోజులు కూడా వాడవచ్చు. ఇందులో సహజ చక్కెరలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. క్యారెట్లో విటమిన్ సి, కె, మాంగనీస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా తోడ్పాటునందిస్తాయి. క్యారెట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయడటంతోపాటు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి, బీటా కెరోటిన్ లక్షణాలు చర్మంపై మొటిమలు, దద్దుర్లు మొదలైన చర్మ వ్యాధులకు నయం చేయడంలో పనిచేస్తుంది. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.క్యారెట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని పీచు పదార్థం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.వి తక్కువ కేలరీలున్న దీనిని పచ్చిగా తినవచ్చు. స్నాక్స్ లేదా డెజర్ట్ లాగా వాడుకోవచ్చు. అన్ని రకాల కూరల్లో, సలాడ్లలో చేర్చుకుంటే అనేక పోషకాలు అందుతాయి. విడిగా గానీ, బీట్ రూట్, పుదీనా లాంటివాటితో కలిపి గానీ జ్యూస్ చేసుకొని తాగవచ్చు. అంతేకాదు అందంగా కట్ చేసుకుని (గార్నిషింగ్) అలంకరించుకోవచ్చు కూడా -
తెల్లజుట్టు నల్లగా, స్మూత్ అండ్ షైనీగా : సహజమైన బీట్రూట్ మాస్క్
చిన్న వయసులోనే తెల్లగా మెరిసిన జుట్టును నల్లగా మార్చుకోవడం ఒకపెద్ద సవాల్. మార్కెట్లోదొరికే రసాయనాలు కలిపిన హెయిర్డైలను వాడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు జుట్టుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరమనీ, ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల కేన్సర్ ముప్పు పొంచి వుందని వైద్యులు కూడా చెబుతున్న మాట. హానికరమైన రసాయనాలు లేకుండా సహజంగా, ఇంట్లోనే దొరికే వాటితో జుట్టు రంగు మార్చు కోవడం ఎలా? ఈ విషయంలో బీట్ రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.బీట్ రూట్లో పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ, ఏ,ఈ పుష్కలంగా లభిస్తాయి. కెరోటిన్‌తో కూడిన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అలాగే ప్రోటీన్, మెగ్నీషియం , కాల్షియంకూడా అందుతాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం , జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఇందులో రెటినోల్, ఆస్కార్బిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్ లాంటి జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్లు కూడా ఉన్నాయి. కొబ్బరి నూనె బీట్రూట్ రసం హెయిర్ మాస్క్కొబ్బరి నూనెను బీట్రూట్ రసంలో కలిపి జుట్టుకు రాసుకుంటే సహజమైన రంగు సంతరించు కుంటుంది. అంతేకాదు జుట్టును తేమగా ఉంచుతుంది. కురులు మృదువుగా మారతాయి. బీట్రూట్ రసంలో కొబ్బరినూనె కలిపిన పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసిన తర్వాత 2 గంటల పాటు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో జుట్టును కడగాలి. క్రమంగా తప్పకుండా ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారి, నిగనిగలాడుతుంది.క్యారెట్, బీట్రూట్ మాస్క్: ఈ మిక్స్డ్ జ్యూస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచింది. క్యారెట్,బీట్ రూట్ రసాన్ని తీసి, శుభ్రంగా వడకట్టి జుట్టుకు అప్లై చేయాలి. దీని వల్ల జుట్టు మృదువుగా చక్కటి రంగులో మెరిసిపోవడం కాదే, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.బీట్రూట్ రసం బ్లాక్ కాఫీ హెయిర్ మాస్క్ జుట్టు రంగును మార్చడంలో బ్లాక్‌టీ, కాఫీ బాగా పనిచేస్తాయి. ఒక కప్పు బీట్రూట్ రసంలో, ఒకటిన్నర కప్పుల బ్లాక్ టీ లేదా కాఫీ (కాఫీ లేదా టీ పౌడర్‌ను నీటిలో బాగా మరగించి వడబోసుకోవాలి) కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. దీన్ని కుదుళ్లుకు పట్టేలాబాగా పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును కడిగేసుకోవాలి. చిక్కులు రాకుండా, జుట్టు తెగిపోకుండా సున్నితంగా దువ్వుకోవాలి.బీట్రూట్, హెన్నాజుట్టు సంరక్షణలో మరో సహజమైంది హెన్నా.దీనికి బీట్ రూట్ రసంజోడిస్తే ఫలితం బావుంటుంది. బీట్ రూట్ రసం, హెన్నా పౌడర్, కొద్దిగా బ్లాక్‌టీని వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. మంచి ఫలితం రావాలంటే కనీసం రెండు మూడు వారాలకొకసారి పైన చెప్పిన మాస్క్‌లను ప్రయత్నించాలి. అలాగే ఈ మాస్క్ వేసుకున్నపుడు షాంపూని వాడకూడదు. -
రాత్రిపూట తలకు నూనె రాస్తున్నారా..?
జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, పోషకాహార లోపం జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, జుట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రెగ్యులర్‌గా తలకు నూనె రాస్తుంటారు చాలామంది. అయితే ఇలా జుట్టుకు నూనె రాసుకోవడం మంచిదే కానీ దానికి సరైన సమయం ఉంది. కానీ జుట్టుకు నూనె రాసుకునే విధానం సరిగా లేకపోతే అది జుట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి బదులు సమస్యలు ఎదురయ్యేలా చేస్తుంది. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల జరిగే మేలు ఎక్కువే అయినా రాసే సమయం అత్యంత ముఖ్యం అంటున్నారు నిపుణులు. అంతే కాదు హెయిర్ ఆయిల్ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆయిల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ రాత్రిపూట జుట్టుకు నూనెను రాయడం మాత్రం మంచిది కాదనే అంటున్నారు నిపుణులు. ఇలా రాయడం వల్ల జుట్టుతో పాటూ చర్మం కూడా డ్యామేజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే..?రాత్రంతా జుట్టుకు నూనెతో పడుకోవడం వల్ల తల ఉపరితల రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగా వ్యక్తికి సమస్యలు ప్రారంభమవుతాయి. ఒక విధమైన ఇరిటేషన్ వచ్చి గోకడం జరుగుతుంది. దీంతో గోళ్లలోకి మురికి చేరుతుంది. ఈ సమస్యను నివారించడానికి రాత్రిపూట జుట్టుకు నూనెను రాయకూడదు.చుండ్రు సమస్య ఎక్కువవుతుంది..చుండ్రు సమస్యలు ఉంటే, రాత్రిపూట హెయిర్ ఆయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ అప్లై చేయకూడదు. ఇలా చేస్తే ఆయిల్ వల్ల చుండ్రు తోపాటు నెత్తిమీద ఎక్కువ మురికి పేరుకుపోయి చుండ్రు సమస్యను పెంచుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే జుట్టుకు హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి.జుట్టు రాలడంజుట్టు ఇప్పటికే రాలిపోతుంటే, రాత్రిపూట నూనె రాసుకోవడం వంటివి చేయవద్దు. వాస్తవానికి, జుట్టుకు నూనెను 12 గంటలకు మించి ఉంచడం వల్ల నెత్తిమీద మురికి పేరుకుపోతుంది. అందువల్ల హెయిర్ వాష్‌కు అరగంట ముందు నూనె రాసుకుంటే జుట్టు రాలే సమస్య రాకుండా ఉంటుంది.మొటిమలురాత్రిపూట జుట్టుకు నూనె రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా మూసుకుపోవడం వల్ల మొటిమలు వచ్చే అవకావం ఉంది. ఇలాంటి మొటిమలను పోమేడ్ పింపుల్స్ అంటారు. కాబట్టి జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ జిడ్డు ముఖానికి కూడా అంటుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎక్కువ అయిపోతాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట జుట్టుకు నూనె అప్లై చేయడానికి బదులుగా స్నానానికి అరగంట ముందు హెయిర్ ఆయిల్ రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టుకు పోషణ అందడంతో పాటు వెంట్రుకలు బాగా శుభ్రం అవుతాయి.(చదవండి: మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!) -
ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ పనితీరుకి.. ఎవరైనా షాక్ అవాల్సిందే..!
ఐస్ కూలింగ్ టచ్‌తో.. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ పనితీరుకి సౌందర్య ప్రియులంతా ముగ్ధులు అవాల్సిందే. ఈ మెషిన్‌తో అవాంఛిత రోమాలను నొప్పి లేకుండా తొలగించుకోవచ్చు. దీనితో క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ కొనసాగిస్తే.. చర్మం మీది వెంట్రుకలు పలుచపడి.. కొంత కాలానికి మొదలుకంటా తొలగిపోతాయి.3 వారాల నుంచి ఫలితం కనిపిస్తుంటుంది. 5 వారాలకు స్పష్టమైన రిజల్ట్‌ని చూడొచ్చు. అయితే దీని లేజర్ ట్రీట్మెంట్ అందుకునే ముందు.. అవాంఛిత రోమాలున్న చోట షేవ్ చేసుకుని.. క్లాత్‌తో క్లీన్ చేసుకుని.. ఆ తర్వాతే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ సమయంలో ఈ డివైస్.. చల్లదనాన్నిస్తుంది.చేతులు, కాళ్లు, ముఖం, నడుము, పొట్టభాగం, అండర్ ఆర్మ్స్, బికినీ లైన్ ఇలా ప్రతిచోట దీనితో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇన్ టెన్ ్స పల్స్డ్ లైట్ టెక్నాలజీ .. ఆటో ఫ్లాషింగ్ .. 3 మోడ్స్ ఆప్షన్ ్సతో ఈ మెషిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ ని.. మహిళలతో పాటు పురుషులూ వినియోగించుకోవచ్చు. అయితే పచ్చబొట్టు ఉన్న ప్రదేశాల్లో, ట్యాన్ ఎక్కువగా ఉన్న చోట, గాయలున్న భాగాల్లో దీన్ని యూజ్ చేయకపోవడమే మంచిది. అలాగే గర్భిణీలు ఈ ట్రీట్మెంట్కి దూరంగా ఉండాలి.ఇక ఈ పరికరాన్ని ఉపయోగించే సమయంలో.. పవర్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ముందే చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకునే వీలు ఉండదు. తెల్లగా .. కాస్త చామన ఛాయలో ఉన్నవారికి మాత్రమే ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. బ్లాక్, బ్రౌన్ , డార్క్ బ్రౌన్ , లైట్ బ్రౌన్ కలర్స్‌లో ఉన్న వెంట్రుకలను మాత్రమే ఈ మెషిన్ గుర్తించగలదు. వైట్ కలర్, రెడ్ కలర్ వెంట్రుకలను తొలగించలేదు. దీని ధర 239 డాలర్లు. అంటే 19,951 రూపాయలు. -
పచ్చిమిర్చితో అందమా? అస్సలు ఊహించలేరు!
పచ్చి మిరపకాయలేని కూరను ఊహించలేం కదా. పచ్చిమిర్చి అనగానే సహజంగా సుర్రున మండే కారం, కూరల్లో వాటి ప్రాధాన్యత, ఇంకాస్త ముందుకెడితే ఊరబెట్టిన మిరపకాయలు గుర్తొస్తాయి కదా. కానీ మన శరీరానికి కావాల్సిన విటమిన్లు పచ్చి మిర్చిలో పుష్కలంగా ఉంటాయి. జుట్టు అందాన్ని, చర్మమెరుపును సాధించవచ్చు. రోగ నిరోధక వ్యవస్థను పెంచే విటమిన్ సీ, చర్మ సంరక్షణకు తోడ్పడి, కంటి చూపును మెరుగు పరిచే విటమిన్ ‘ఏ’ కూడా వీటి ద్వారా లభ్యమవుతుంది తెలుసా? మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.పచ్చిమిర్చిని శాస్త్రీయంగా క్యాప్సికమ్ ఫ్రూట్సెన్స్ అంటారు. మిర్చిల్లో క్యాప్సైసిన్ అనే పదార్థమే దీని రుచి కారంగా ఉండడానికి కారణం. దీన్ని ఏడాది పొడవునా సాగు చేస్తారు. దాదాపు 400 రకాల పచ్చి మిరప కాయలు వినియోగంలో ఉన్నాయట. వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కో స్థాయిలో ఘాటు కలిగి ఉంటాయి.యాంటీమైక్రోబయల్ లక్షణాలతోపాటు, పచ్చి మిరపకాయలలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, టానిన్లు, స్టెరాయిడ్స్ , క్యాప్సైసిన్ వంటి అనేక మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి మిరపకాయల్లో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయని పరిశోధనలో తేలింది.పచ్చి మిరపకాయల వల్ల కలిగే ప్రయోజనాలుదీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణడయాబెటిస్కు రోగులకు ఉపయోగపడుతుంది.రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుందిబరువు తగ్గడానికి సహాయం చేయడంచలికాలంలో శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుందిపొట్టలో అల్సర్లను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ కారణంగా పచ్చిమిర్చి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. బోలు ఎముకల వ్యాధి నివారణలో సహాయం చేస్తుందిజీర్ణక్రియను మెరుగుపరుస్తుందిఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.వీటిల్లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడితే, విటమిన్ ఈ వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందిశరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలకు పచ్చిమిర్చి దివ్యౌషధం.నోట్: ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కదా అని దేన్నీ అతిగా తినడం మంచిది కాదు. శృతిమించితే ప్రయోజనాలు లభించక పోగా అనారోగ్యాన్ని చేతులారా కొని కొంటామనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. -
ఓ వ్యక్తి గొంతులో అసాధారణ పరిస్థితి..కంగుతిన్న వైద్యులు
పలువురు వింతగొలిపే సమస్యలతో బాధపడుతుంటారు. ఒక్కోసారి అవి వైద్య పరిజ్ఞానానికే అందని విధంగా ఉంటాయి కూడా. అలాంటి వింతైన సమస్యతో బాధపడుతున్నాడు 52 ఏళ్ల వ్యక్తి. అయితే అనుహ్యంగా ఓ దురలవాటుకి దూరంగా ఉండటంతో అతని సమస్యను పరిష్కరించడాని వైద్యులకు మార్గం సుగమమయ్యింది. ఇంతకీ అతను ఎలాంటి అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడంటే..52 ఏళ్ల ఆస్ట్రియన్ అనే వ్యక్తి చాలా అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను కొన్ని రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెరగని దగ్గు, తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్ప్రతిలో చేరాడు. అక్కడ వైద్యులు బ్రోంక్స్కోప్తో జరిపిన వైద్య పరీక్షల్లో..ఆ వ్యక్తి గొంతులోని పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఊహించని రీతిలో అక్కడ జుట్టు పెరగడం చూసి గందరగోళానికి గురయ్యారు. నిజానికి ఆ వ్యక్తికి పదేళ్ల వయసులో ట్రాకియోటోమీ చేయించుకున్నాడు. ట్రాకియోటోమీ అంటే.. మెడ వెలుపలి నుంచి శ్వాసనాళంలోకి (విండ్‌పైప్) ఓపెనింగ్ సృష్టించడం ద్వారా ఊపిరితిత్తులకు గాలి, ఆక్సిజన్ చేరుకోవడంలో సహాయపడే ప్రక్రియ.ట్రాకియోటోమీ ఉన్న వ్యక్తి ఓపెనింగ్‌లో చొప్పించిన ట్రాకియోటోమీ ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటాడు. దీని కారణంగా అతని శ్వాసనాళంలో ఓపెనింగ్ ఉంటుంది. అక్కడ అతని చెవి నుంచి తీసిన చర్మం, మృదులాస్థితో అంటుకట్టుట పద్ధతిలో ఆ ఓపెనింగ్‌ని స్థిరీకరించేలా చేశారు వైద్యులు. సరిగ్గా ఆ ప్రాంతంలో అసాధారణ రీతిలో వెంట్రుకలు పెరగడం మొదలయ్యింది. అవి ఏకంగా ఆరు నుంచి తొమ్మిది వరకు.. సుమారు రెండు అండుళాల మేరు పొడవుగా ఉన్నాయి. అందువల్ల అతని గొంతు బొంగరుపోయి, దగ్గు వంటి సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ వెంట్రుకలను తొలగంచే ప్రక్రియ చేపట్టారు. ఇలా సదురు వ్యక్తి 14 ఏళ్ల పాటు ఆస్పత్రిని సందర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అతడే తనకున్న ధూమపానం దురలవాటుకి దూరంగ ఉంటూ ఉండటంతో అనూహ్యంగా వాటి పెరుగుదల తగ్గింది. వైద్యులు కూడా అతడిలో వచ్చిన సానుకూల మార్పుకి అనుగుణంగా ఎండోస్కోపిక్ ఆర్గాన్ ప్లాస్మా కోగ్యులేషన్ అనే కొత్త విధానానంతో జుట్టు పెరుగుదల శాశ్వతంగా చెక్కుపెట్టారు. ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తుంటే.. మనకున్న దురలవాట్లే మనలను అనారోగ్యం పాలు జేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ . (చదవండి: ఇలాంటి జిమ్ సెంటర్లకి వెళ్లకపోవడమే మేలు...!) -
హెయిర్ పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా?
ఇటీవల మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వెరైటీ బ్యూటీ ప్రొడక్ట్‌లు వస్తున్నాయి. ఎలాంటి సమస్య అయినా చిటికెలో చెక్‌పెట్టేలా కళ్లు చెదిరిపోయే ధరల్లో మనముందుకు వస్తున్నాయి సౌందర్య ఉత్పత్తులు. ముఖ్యంగా యువత వీటిని ఎక్కువ ఉపయోగిస్తుంది. వాటిల్లో ప్రముఖంగా ఉపయోగించేది హెయిర్ పెర్ఫ్యూమ్నే. ఇది మనం జస్ట్ అలా ఎంట్రీ ఇవ్వంగానే అందరి ముక్కులను ఘామాళించేలా మంచి సువాసన వచ్చేస్తుంది. అందరిలో ప్రత్యేకంగా సువాసనభరితంగా అనిపించేలా కనిపించడం కోసం కొందరూ ఈ హెయిర్ ఫెర్ఫ్యూమ్స్ని తెగ వాడేస్తుంటారు. అయితే ఇలా ఉపయోగించటం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీని వల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో సవివరంగా చూద్దామా..!పరిమిళాలు వెదజల్లే ఈ హెయిర్ పెర్ఫ్యూమ్లు మంచి తాజాదనాన్ని ఆహ్లాదమైన అనుభూతిని కలిగించినప్పటికీ అవి మీకు హానిని కలుగజేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిల్లో ఇథైల్ ఆల్కహాల్, భారీ సింథటిక్ సువాసనలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని దీర్ఘకాలం ఉపయోగిస్తే..స్కాల్ప్ డ్యామేజ్ అవ్వడం లేదా పొడిబారినట్లుగా మారుతుంది. ఇవి జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా హెయిర్ పెర్ఫ్యూమ్‌లోని ఆల్కాహాల్లు జుట్టులోని సహజ నూనెలను తొలగించి.. పొడిగా, పెళుసుగా అయిపోతాయి. ఎక్కువగా జుట్టు చివర్లు చిట్లిపోవడం, నిస్తేజంగా అయిపోవడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు మెయింటెయిన్ చేయాలనుకుంటే వీటిని మితంగా లేదా దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఈ హెయిర్ ఫెర్ఫ్యూమ్లు ఓ ట్రెండ్‌గా మారినప్పటికీ.. అవి ఆరోగ్యానికి హానికరమే గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అంతగా అలాంటి సువాసనభరితమైన ఫీల్ కావాలనుకుంటే సహజ పదార్థాలతో కూడా ఇలాంటి అనుభూతిని పొందొచ్చని చెబుతున్నారు. సంరక్షణ పద్ధతులు..తేలికపాటి మెత్తపాటి జుట్టు ఉన్నవాళ్లు పొగమంచులాంటి లైట్ ఫెర్ఫ్యూమ్లు ఒత్తు జుట్టు ఉన్నవారు మంచి గాఢతగలవి వినియోగించొచ్చని చెబతున్నారు నిపుణులు. ఈ పెర్ఫ్యూమ్లను మితంగా వాడితే జుట్టు నష్టాన్ని నివారించి ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారని చెబుతున్నారు. తేలికపాటి స్ప్రేలు సరిపోతాయని, వాటిని నేరుగా తలపై కాకుండా చివర్ల లేదా జుట్టు మధ్యలో స్ప్రే చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు. సహజ ప్రత్యామ్నాయాలు..హెయిర్ ఫెర్ఫ్యూమ్కు సహజమైన ప్రత్యామ్నాయాలు ఏంటంటే..లావెండర్, రోజ్మేరీ లేదా చమోమిలే వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ని నీటిలో కలిపి హెయిర్‌పై స్ప్రేగా ఉపయోగించొచ్చు. ఇవి శిరోజాలకు సహజమైన నూనెలను అందించడమే కాకుండా ఆహ్లాదభరితమైన సువాసనను కూడా ఇస్తాయి. ముఖ్యంగా రోజ్ వాటర్ చక్కటి రిఫ్రెష్‌ని కలిగించే సువాసనను అందిస్తుంది. అలాగే నారింజ లేదా నిమ్మ వంటి సిట్రస్ తొక్కలతో తయారు చేసిన నీటిని కూడా ఉపయోగించొచ్చు. ఇవి జుట్టు స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఎలాంటి ఫెర్ఫ్యూమ్ అయినా ఎక్కువ మోతాదులో స్ప్రే చేయకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు.(చదవండి: వెర్సాస్ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా లుక్ అదుర్స్..!) -
ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా రూ. 300 కోట్ల డైమండ్ నెక్లెస్..
బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. పలు ఫ్యాషన్ వేడుకలకు తన డిజైనర్‌వేర్ డ్రెస్‌లతో మిస్మరైజ్ చేస్తుంది. అలానే రోమ్‌లో జరిగిన బల్గారీ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక తన న్యూ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. సరికొత్త హెయిర్ స్టైల్‌తో ప్రియాంక ప్రేక్షకులను అలరించింది. పైగా ఆ హెయిర్ స్టైల్‌కి తగ్గట్టు నలుపు, తెలపు కాంబినేషన్ గౌను, అందుకు తగ్గట్టు డైమండ్ నెక్లస్‌ని ధరించి అత్యద్భుతంగా కనిపించింది. నెక్కు కోట్లు ఖరీదు చేసే 200 క్యారెట డెమండ్ నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బల్గేరి అటెర్నె బ్రాండ్‌కి చెందిన ఈ నెక్లెస్ అత్యంత లగ్జరియస్ జ్యువెలరీ. ఈ మేరకు ఈ విషయాన్ని బల్గారీ అధికారిక వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే ఫ్యాషన్, పాప్ సంస్కృతిని ఫాలో అయ్యే ఇన్‌స్టాగ్రామర్ డైట్ సబ్యా కూడా ఈ నెక్లెస్ మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ నెక్లెస్ రూపొందిచడానికి దాదాపు 2,800 గంటలు శ్రమతో కూడిన నైపుణ్యం అవసమరమని, ఇది చాలా కఠినమైన వజ్రమని తెలిపారు. దీన్ని 140 క్యారెట్ల ఏడు పియర్ ఆకారపు చుక్కలుగా రూపొందించడానికే ఇంత సమయం తీసుకుంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ బ్రాండ్ చరిత్రలో ఇది అత్యద్భుతమైన నెక్లెస్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వేడుకలో ప్రియాంక ధరించిన కళ్లమిరుమిట్లు గొలిపే డైమండ్ నెక్లెస్ తోపాటు ఆమె కొత్త హెయిర్ స్టైల్ హైలెట్‌గా నిలిచింది. ఈ నెక్లెస్ ధర ఏకంగా రూ. 300 కోట్ల పైనే ఉంటుందని సమాచారం.ఇక కనుబొమ్మలకు మెరిసే గోల్డెన్ ఐ షాడో, కనురెప్పలపై మస్కరా, బెర్రీ-టోన్డ్ లిప్ షేడ్, చెంపలపై గులాబీ రంగు బ్లష్ వంటివి హైలెట్‌గా నిలిచాయి. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) (చదవండి: కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!) -
ఈ డివైజ్‌తో క్షణాల్లో సిల్కీ హెయిర్ సొంతం!
సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్‌ని ఇష్టపడనిదెవరు.. దానికోసం కష్టపడనిదెవరు! ఆ తలకట్టు కోసం పార్లర్లు, హెయిర్ స్పాల చుట్టూ తిరగడం ఆపి ఈ చిత్రంలోని హెయిర్ ట్రీట్మెంట్ అప్లికేటర్‌ను తెచ్చుకోండి. ఇది జుట్టును క్షణాల్లో మృదువుగా మార్చేస్తుంది.ఈ డివైస్.. అరచేతిలో అమరిపోయే చంద్రవంకలా కనిపిస్తుంది. వెనుకవైపు ఉన్న మినీ ట్యాంకర్లో నీళ్లతో పాటు.. సీరమ్ లేదా లోషన్ వంటివి మిక్స్ చేసి బటన్ నొక్కితే ఆవిరి రూపంలో బయటికి వస్తుంది. ఆ ఆవిరిని జుట్టు మొత్తానికి పట్టించుకుంటే చాలు.. సెట్ చేసిన హెయిర్ స్టైల్ సెట్ చేసినట్లుగా.. కదలకుండా ఆకర్షణీయంగా నిలుస్తుంది.అధునాతన మైక్రోటెక్నాలజీతో రూపొందిన ఈ మెషిన్‌తో.. జుట్టుకే కాదు ముఖానికీ ఆవిరి పట్టుకోవచ్చు. ఈ మినీ ట్యాంకర్‌ను డివైస్ నుంచి సులభంగా వేరు చేసుకోవచ్చు. అలాగే ఆ ట్యాంకర్‌కి ప్రత్యేకమైన లాకర్ లాంటి మూత ఉంటుంది. దాన్ని బాటిల్ మూతలా బిగించుకుంటే సరిపోతుంది. ఈ డివైస్ చాలా రంగుల్లో లభిస్తోంది. ఇది అన్ని రకాల జుట్టు స్వభావాలకు అనుకూలమైనది! (చదవండి: -
శిరోజాలు దానం చేయండి
అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం...ఇలా మన సంస్కృతిలో దానగుణానికి విశేష గౌరవం ఉంది.అయితే భువనేశ్వర్‌కు చెందిన హరిప్రియ నాయక్ ప్రచారం చేసేది మాత్రం ‘శిరోజాల దానం’. ‘మీరు దానం చేసే శిరోజాల పేద కేన్సర్ పేషెంట్ల ముఖంలో చిరునవ్వు తీసుకొస్తుంది’ అంటుందామె. సేకరించిన జుట్టుతో విగ్గులు తయారు చేయించి పంచుతున్న హరిప్రియ నాయక్ అనేక ప్రశంసలు పొందుతోంది. కేన్సర్‌తో పోరాడి గెలవ డానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. చాలామంది గెలుస్తారు. అయితే దిగువ మధ్యతరగతి స్త్రీలు, పేద స్త్రీలు ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేన్సర్ చికిత్స సమయంలో కిమోథెరపీ వల్ల జుట్టు రాలిపో తుంది. ఆ సమయంలో శిరోముండనం కూడా చేయించుకోవాల్సి వస్తుంది. స్తోమత కలిగిన వర్గాల స్త్రీలు తిరిగి పూర్తి జుట్టు వచ్చేవరకూ విగ్గులు ధరిస్తారు. కాని పేద వర్గాల స్త్రీలకు ఆ అవకాశం ఉండదు. వారి కోసం, వారి ఆత్మవిశ్వాసం కోసం ఉచితంగా విగ్గులు ఏర్పాటు చేస్తోంది హరిప్రియ నాయక్. ‘శిరోజాల దానం ఇవాళ్టి అవసరం’ అంటుందామె. సామాజిక సేవ ఒడిశ్సాలోని ఖుర్దా జిల్లాకు చెందిన 32 ఏళ్ల హరిప్రియ నాయక్ సామాజిక సేవారంగంలో పని చేస్తోంది. ‘ఒకసారి నేను కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయిన పేదస్త్రీలను చూశాను. వారు ఇంటినుంచి బయటకు రావడానికే సిగ్గుపడుతున్నారు. కేన్సర్‌తో పో రాడే సమయంలో మానసికంగా, శారీరకంగా గట్టిగా ఉండాలి. మానసికంగా కుచించుకుపో తే కష్టం. స్త్రీలు జుట్టును ఇష్టపడతారు. వారికి సరైన విగ్గు ఇవ్వగలిగితే ఆత్మవిశ్వాసం వస్తుందని పనిలోకి దిగాను’ అంటుంది హరిప్రియ నాయక్. ఆమె 2021లో ‘మిషన్ స్మైల్ ఫర్ ది కేన్సర్ ఫైటర్స్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని శిరోజాల సేకరణ కోసం మొదలుపెట్టింది. శిరోజాల దానం కోసం ప్రచారం కొనసాగించింది. 9 మంది సాయం ఒకరికి మేలు ‘సింథటిక్ విగ్గులు త్వరగా పాడవుతాయి. వాటివల్ల చర్మ సంబంధ ఇబ్బందులు వస్తాయి. అదే సహజమైన జుట్టుతో చేసిన విగ్గులు మన్నికగా ఉంటాయి. ఇందుకోసం ఎవరైనా సరే శిరోజాలు ఇవ్వొచ్చు. కాని 12 అంగుళాల కంటే ఎక్కువ పోడవు ఉన్నప్పుడే అవి ఉపయోగపడతాయి. 9 మంది ఇచ్చిన జుట్టుతో ఒక్క విగ్గు తయారవుతుంది. మా ప్రచారం ఒడిస్సాలో మాత్రమే కాదు జార్ఖండ్‌లో కూడా కొనసాగుతోంది. ఒక ఆరేళ్ల పాప మాకు శిరోజాలు ఇవ్వడం ఒక రికార్డు’ అంటుంది హరిప్రియ నాయక్. హెయిర్ డొనేషన్ ఒడిశా ‘హెయిర్ డొనేషన్ ఒడిశా’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది హరిప్రియ నాయక్. వాలెంటీర్లు పని చేసేవారిని ఆహ్వానిస్తుంది. ఇప్పటికి 150 మంది వాలెంటీర్లు ఆమెతోపాటు పని చేస్తున్నారు. శిరోజాలు దానం చేసే వారి నుంచి వాటిని సేకరించి హైదరాబాదులోని ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ కేన్సర్ పేషెంట్స్’ సంస్థకు పంపుతారు. అది ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇస్తుంది. వాటిని కేన్సర్ ఫైటర్స్‌కు అందజేస్తారు.‘నా జుట్టు తగినంత పెరిగిన ప్రతిసారీ నేను దానం చేస్తుంటాను. మీరు కూడా చేయండి. ఇది కూడా పుణ్యకార్యమే’ అంటుంది హరిప్రియ నాయక్. -
జయ బచ్చన్ జుట్టు రహస్యం ఇదే!
రాజకీయనాయకురాలు, బాలీవుడ్ నటి జయబచ్చన్ రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. నటిగానూ అభిమానుల చేత పలు ప్రశంసలు అందుకున్నారు. రాజకీయ నాయకురాలిగా ఆమె ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నారు. ఏడు పదుల వయసుకు చేరువైనా ఆమె జుట్టు అంతగా మెరవలేదని చెప్పొచ్చు. తనతోటి నటులు జుట్టు రాలిపోయి, ముగ్గబుట్టయ్యే పోయినా.. ఆమె మాత్రం నలభై, యాభైల వయసు మాదిరిగా ఉన్న శిరోజాలను మెయింటైయిన్ చేస్తారు. ఆమె తన శిరోజాలు నెరవకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఫాలో అయ్యే చిట్కాను వాట్ ది హెల నవ్య అనే పోడోకాస్ట్ ప్రోగ్రాంలో షేర్ చేసుకున్నారు. ఈ ప్రోగ్రా మూడు తరాలకు చెందిన మహిళల వారి ఆలోచనలను షేర్ చేసుకునే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆమె కూతురు శ్వేతాబచ్చన్, మనవరాలు నవ్వ నందాతో కలసి జయబచ్చన్ తన శిరోజాల సీక్రేట్ని గురించి షేర్ చేసుకున్నారు. తాను జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహజసిద్ధమైన కొబ్బరినూనెని ఉపయోగిస్తానని చెప్పుకొచ్చారు. తమ అమమ్మల కాలం నుంచి ఆకొబ్బరి నూనెతో తయారు చేసే ఆ ఆయిల్నినే వాడతామని అన్నారు. అందువల్లే తన శిరోజాలు ఇంతలా ఆరోగ్యంగా ఉన్నాయని, ఇప్పుడిప్పుడే నెరుస్తుందని చెప్పుకొచ్చారామె. అంతేగాదు ఆ నూనెని ఎలా తయారు చేయాలో కూడా వివరంగా చెప్పారు. ఈ నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె కొద్దిగా కరివేపాకులు మెంతులు ఓ కుండ తయారీ విధానం: ఒక కుండలో కొబ్బరి నూనె, కరివేపాకులు, మెంతులు వేసి సన్నని మంటపై మరగనివ్వాలి. ఆ తర్వాత చల్లారాక వడకట్టి పొడి డబ్బాలో వేసి ఉపయోగించుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్లో ఉపయోగించే కొబ్బరి నూనె జుట్టుని డ్రై అవ్వకుండా తేమగా ఉండేలా చేస్తుంది. పైగా చివర్ల చిట్లిపోకుండా కాపాడుతుంది. అలాగే ఇందులో ఉపయోగిచే కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. డ్యామేజ్ అయ్యిన జుట్టుని రిపేర్ చేయడంలో సమర్థవంతంగా ఉంటుంది. అలాగే ఈ మెంతి గింజల్లో ప్రోటీన్లు, నికోటిన్ యాసిడ్లు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది. జయబచ్చన్ చెప్పిన ఈ హోం మేడ్ హెయిర్ ఆయిల్ మీ జుట్టు సంరక్షణకు తప్పకు తోడ్పడుతుంది. తప్పక ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Mithi Ki Rasoi (@mithi_ki_rasoi) (చదవండి: రక్తంతో జుట్టు రాలు సమస్యకు చెక్!) -
రక్తంతో జుట్టు రాలు సమస్యకు చెక్!
రక్తంతో జుట్టు రాలు సమస్యకు చికిత్స చేస్తారట. దీన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాప్మా థెరపీ అని అంటారు. ఈ కొత్త చికిత్స విధానాన్ని హార్వర్ మెడికల్ వైద్య బృందం అభివృద్ధి చేసింది. దీని వల్ల బట్టతల, ఆడవాళ్ల జుట్టు రాలు సమస్యను తగ్గించొచ్చిన చెబుతున్నారు. ఇక్కడ వైద్యులు బాధితుల సొంత రక్తంతోనే వారి హెయిర్ గ్రోత్‌ని డెవలప్ అయ్యేలా చేస్తారు. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి!. ఎందుకంటే మన రక్తంలోని ప్లాస్మాలో పుష్కలంగా ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి హెయిర్‌ని పెరిగేలా చేయగలవట. అందుకని రోగి నుంచి తీసుకున్న రక్తంలోని ప్లాస్మాని తీసుకుని దానిని తలలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయగానే ఆ ప్రదేశంలోని చర్మం ఆకృతి మెరుగపడి తిరిగి జుట్టు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. చెప్పాలంటే ఈ చికిత్స హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వివిధ చికిత్సల కంటే సురక్షితమైనది, సమర్థవంతమైనది. ఈ చికిత్స విధానం గురించి నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ప్రచురితమయ్యింది. ఈ థెరఫీని జుట్టు రాలు సమస్యలను, బట్టతల సమస్యను నివారిస్తుందని అన్నారు. ఈ చికిత్స విధానంలో ప్లాస్మాలోని ప్లేట్లెట్స్ ఇంజెక్షన్ రూపంలో తలపై ఇవ్వడంతో వెంట్రుకల కుదుళ్ల దగ్గర జుట్టు పెరిగేలా వృద్ధికారకాలను ఉత్ఫన్నం చేస్తాయి. తద్వారా వంశపారంపర్యంగా వచ్చే ఆండ్రోజెనెటిక్ అలోపేసియా లేదా బట్టతల, ఆడవారిలో వచ్చే జుట్టురాలు సమస్యను నివారిస్తుంది. జుట్టు బాగా కురుల్లా ఉండాలనుకునేవారు ఈ థెరపీని సంవత్సరానికి మూడు నుంచి నాలుగుసార్లు చేయించుకోవచ్చట. అలాగే రోగి రక్తాన్ని సేకరించేటప్పుడూ గడ్డకట్టకుండా, ప్లేట్లెట్స్ యాక్టివ్‌గా ఉండేలా ప్రత్యేకమైన ట్యూబలో సేకరిస్తారు. ఆ తర్వాత ఎర్ర రక్త కణాలను వేరు చేసి ప్లేట్లెట్లను మాత్రమే తీసుకునేలా మొత్తం రక్తాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఇలా వేరు చేసిన ప్లేట్లెట్లను సిరంజి ద్వారా నెత్తిపై చర్మానికి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఐదు నుంచి ఏడు రోజుల్లో గ్రోత్ మొదలవుతుంది. ఎవరెవరూ చేయించుకోవచ్చంటే.. ఈ ప్లాస్మా థెరపీ ఆరోగ్యవంతమైన పెద్దలకు చెయ్యొచ్చు. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలకు సిఫార్సు చెయ్యరు. అలాగే రక్తస్రావం, ప్లేట్లెట్ పనిచేయకపోవడం లేదా ప్లేట్లెట్ సమస్య ఉన్నా, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నా ఈ ప్లాస్మా థెరపీని సిఫార్సు చెయ్యరు వైద్యులు. దీన్ని ఇంజెక్ట్ రూపంలో ఇవ్వాలి కాబట్టి ప్రీ హెచ్ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చెక్-అప్ తదితరాలను చెక్ చేసి గానీ రక్తాన్ని సేకరించారు సురక్షితమా..? ఈ చికిత్స చాలా సురక్షితమైనదని వైద్యులు ధీమాగా చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రోగులు సొంత రక్తంతోనే ఈ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ఈ ప్రక్రియ సమయంలో వైద్యులు సరైన స్టెరిలైజేషన్ నిర్వహించకపోతే మాత్రం రోగికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం బాగా ఉంటుంది. తలపైన ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం కాబట్టి ఆ ప్రాంతమంతా కాస్త నొప్పిగా కూడా ఉండొచ్చు, గానీ అది ఒక్కరోజులోనే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీన్ని ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలని సూచించారు. (చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!) -
షేవింగే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది, నెల రోజులు కోమాలో!
ఇన్ గ్రోయిన్ హెయిర్ అమెరికాలో ఒక వ్యక్తిని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ సెప్పిస్ బారిన పడ్డాడు. వైద్యులు కూడా చేతులెత్తేశారు. బతికే అవకాశం చాలా తక్కువని చెప్పారు.చివరికి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. కానీ అనూహ్యంగా.. కోలుకోవడం విశేషంగా నిలిచింది.. వివరాలు ఇలా ఉన్నాయి న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అమెరికాటెక్సాస్ రాష్ట్రానికి చెందిన36 ఏళ్ల స్టీవెన్ స్పైనాల్ గజ్జల వద్ద ఉన్న ఇన్గ్రోన్ హెయిర్‌ను తొలగించుకున్నాడు. దీనికి ఇన్ఫెక్షన్ సెప్సిస్ సోకి చివరికి సెప్సిస్షాక్కు దారి తీసింది. రక్తం గడ్డకట్టడం, డబుల్ న్యుమోనియా, అవయవ వైఫల్యం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS)కి దారితీసింది. ఇన్ఫెక్షన్ అతని గుండెకు కూడా చేరింది. దీంతొ కోమాలోకి వెళ్లి పోయాడు. ఇక కష్టం అని ప్రకటించిన వైద్యులు చివరి ఆశగా వెంటిలేటర్‌పై ఉంచి దాదాపు నెల రోజుల పాటు చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ చికిత్సకు స్పందించిన స్టీవెన్ కొద్దిగా కోలుకున్నాడు. మెదడుకు ఎలాంటి నష్టం జరగకుండా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని సోదరి మిచెల్ పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో సమాచారం ప్రకారం 2022 ఏడాది చివరల్లో అనారోగ్యానికి గురైన స్టీవెన్ 2023 చివరినాటికి కొద్దిగా బలం పుంజు కున్నాడంటూ స్టీవెన్ రికవరీ జర్నీనీ షేర్ చేసింది. ఇందు కోసం 8వేల డాలర్లు ఖర్చు అయినట్టు తెలిపింది. గోఫండ్‌మీ ద్వారా విరాళాలకోసం అభ్యర్థించింది. (ఇన్ గ్రోయిన్ హెయిర్: పురుషులు ఛాతీ, చంకలు, వీపు, గజ్జలు తదితర ప్రదేశాల్లో ముఖ్యంగా వ్యతిరేకదిశలో(ఎదురు) షేవ్ చేసుకున్నా, కట్ అయినా వెంట్రుకల కుదుళ్ల వద్ద ఎరుపు దురద గడ్డలు వస్తాయి. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి. అలాగే వీటిమీద రాంగ్ డైరెక్షన్లో వెంట్రుకలొస్తాయి. దీనికి సాధారణంగా వైద్య చికిత్స అవసరం లేదు. వాటికవే తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ షేవింగ్ జెల్ లేదా క్రీమ్ లాంటివి వాడతారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ప్రమాదం. నిర్లక్ష్యం చేస్తే సెప్సిస్ అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. దీన్నే " సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారు. మహిళలల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంచనా ప్రకారం ప్రతీ ఏడాది 1.7 మిలియన్ల అమెరికన్లు సెప్సిస్ బారిన పడుతున్నారు. ఏటా దాదాపు 270,000 మంది మరణిస్తున్నారు.) -
Rice Water రైస్ వాటర్ మ్యాజిక్ నిజమేనా? లేక జిమ్మిక్కా?
ఆధునిక కాలంలో అందమైన ముఖం, చక్కటి జుట్టు, గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల ఉత్పత్తులను వాడటం అలవాటుగా మారిపోయింది. దీనికి తోడు అనేక గృహచిట్కాలు కూడా తరచూ పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా చర్మ సంరక్షణలో రైస్ వాటర్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని నమ్మకం. ఇంటర్నెట్లో ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న వీడియోలకు కొదవలేదు. మరి నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..! సోషల్ మీడియా ప్రకారం రైస్ వాటర్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలంటే.. బియ్యాన్ని నీటిలో శుభ్రంగా, మూడుసార్లు కడిగి మూడోసారి నీటిని నిల్వ చేసి ఉంచుకోవాలి. ఇలా ఫెర్మెంటెడ్ వాటర్‌తో ముఖాన్ని మృదువుగా కడుక్కోవాలి. అలాగే బియ్యం వాటర్‌తో కడిగిన తరువాత మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. లేదంటే ముఖం డ్రైగా మారే అవకాశం ఉంది. ♦ ఈ బియ్యం నీటిని దాదాపు 2 వారాల పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకొని, సాధారణ ఉష్టోగ్రతకు వచ్చిన తరువాత జుట్టుకు కూడా అప్లయ్ చేసుకొని, తరువాత కెమికల్స్‌లేని షాంపూతో తలంటుకోవాలి. దీని తరువాత కండీషన్ అప్లై చేయాలి. ♦ రైస్ వాటర్ చర్మానికి ఒకటి కాదు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాల కారణంగా చర్మం నూతనంగా ఉంటుంది. ముఖంపై మచ్చలను తొలగించడం, వడదెబ్బ నుండి ఉపశమనం కలిగించడం వంటి ఉపయోగాలను అందిస్తుంది. నిపుణులు ఏమంటున్నారు? జపాన్, చైనా కొరియన్ చర్మ సంరక్షణలో బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తారని చెబుతారు. ఇందులో రైస్ వాటర్ టోనర్, ఫేస్ వాష్, రైస్ ఫ్లోర్ ఫేస్ మాస్క్, క్రీమ్ ప్రధానంగా ఉన్నాయి. అయితే బియ్యం కడిగిన నీటిని ముఖానికి జుట్టుకు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు చర్మవ్యాధి నిపుణులు వరిలో పోషకాలు పుష్కలంగాఉన్నప్పటికీ,చర్మం, జుట్టుకు ఉపయోగపడుతుందనడానికి పరిశోధన, ఆధారాలు లేవని ఆడుబాన్ డెర్మటాలజీ బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ డియర్డ్రే హూపర్ చెప్పారు. అయితే బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి జుట్టుకు ట్రీట్మెంట్గా ఉపయోగించడం కొత్తది కాదు. వేలాది సంవత్సరాలుగా అనేక ఆసియా దేశాలలో నివసిస్తున్న ప్రజలు బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారు. వారి పొడవాటి జుట్టుకి కారణం పులియబెట్టిన బియ్యం నీరే అని చెబుతారు. 1000 సంవత్సరంలో జపనీస్ మహిళలు యు-సు-రు లేదా కడిగిన బియ్యం నీళ్లతో జుట్టును వాష్ చేసుకునేవారట. బియ్యంలో మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, థయామిన్ , నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే బియ్యం నీటిలో ఫినాల్స్ ఉంటాయి. ఇది అలోపేసియా అరేటా చికిత్సలో సహాయపడుతుంది. కానీ కొంతమందిలోమాత్రం పరిస్థితిని మరింత దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు బియ్యం నిల్వ ఉండేందుకు కొన్ని రకాల పౌడర్లు కలుపుతారు. ఇవి చర్మానికి హాని కరం హానికరం. రైస్ వాటర్‌లోని స్టార్చ్‌తో జుట్టు పెళుసుబారుతుంది వెంట్రుకలను బియ్యం నీటిలో కడుక్కోవడం వల్ల చిక్కు జుట్టు సులభంగా విరిగిపోయే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా మెడికల్ స్కూల్లోని డెర్మటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ రోండా ఫరా చెప్పారు. రైస్ వాటర్‌లో ఉంటే స్టార్చ్, తేమను పీల్చేసుకుంటుంది. తద్వారా జుట్టు పెళుసుగా మారుతుందట. అలాగే ప్రాసెస్ చేసిన బియ్యంతో తయారు చేసిన బియ్యం నీరు ఏ మేరకు ఉపయోపడుతుందో తేల్చ లేమన్నారు. సిల్కీ జుట్టు కారణాలు పలు అంశాలపై అధారపడి ఉంటాయని అంతేకాదు ఒక్కో మనిషి జుట్టు రకం భిన్నంగా ఉంటాయని, అందరికీ ఒకే వైద్య చిట్కాలు పనిచేయని కూడా నిపుణులు చెబుతున్నారు. నోట్: ఇంటర్నెట్లో దొరికే సమాచారం అంతా నిజమని నమ్మలేం. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలనుకుంటే, ఒత్తైన జుట్టు కావాలనుకుంటే (ఇది వారి జీన్స్ ఆధారితమైంది కూడా అనేది గమనించాలి) జీవన శైలి మార్పులు అవసరం. ఒత్తిడికి దూరంగా ఉంటూ, చుండ్రుకు చికిత్స చేయడం, హెయిర్ డ్రైయ్యర్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. సురక్షితమైన, సహజమైన రైస్ బ్రాన్ మినరల్ ఎక్స్ట్రాక్ట్ ఉత్పత్తులను వాడుకోవచ్చు. -
ఇంట్లోనే ఈజీగా నేచురల్ హెయిర్ డై చేసుకోండిలా..!
ప్రస్తుత రోజుల్లో తెల్లజుట్టు అనేది కామన్ అయ్యిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అంతేగాదు ఎవరూ పెద్దవాళ్లో, చిన్నవాళ్లో చెప్పడం కూడా కష్టంగా ఉంది. అలా అయిపోయింది మన జీవనశైలి. దీనికి తోడు బయట ఉండే కాలుష్యం కారణంగా మెరిసిపోవడం తోపాటు ఊడిపోతుంది. అందుకోసం బయట మార్కెట్లో కనిపించే హెయిర్ డైల పై ఆధారపడుతుంటాం. అవేమో నానా రకాల సైడ్ ఎఫ్‌క్ట్ ఇచ్చి మరో సమస్య ఎదురవ్వుతుంది. ఆ సమస్యలన్నింటికి చెక్‌పెట్టి ఇంట్లోనే చక్కగా సహజ పద్ధతిలో డై చేసుకుంటే అంతకుమించి హాయి ఇంకొకటి ఉండదు. అయితే ఇదెలా చేయాలి. అందుకు కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయి అని కంగారు పడొద్దు. అవన్నీ మనఇంట్లో దొరికేవే. మన నిత్యం చూసే వాటితోనే సులభంగా చేయ్యొచ్చు. అవేంటో చూద్ధాం. ! ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గానే ఇంట్లోనే డైని చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఉల్లి తొక్క. ఉల్లి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్ల జుట్టుని రానియ్యకుండా చేస్తుంది. ఇందులోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకి మంచిది. ఉల్లితొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక అలోవెరా జెల్‌లోనూ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి, జుట్టు, చర్మానికి చాలా మంచిది. తెల్ల జుట్టుని దూరం చేసి జుట్టు మెరిసేలా, సాఫ్ట్‌గా చేస్తుంది. అంతే కాదు, జుట్టు మూలాలకు సహజ తేమని అందించడంలో అలోవెరా జెల్ ముందుంటుంది. ఎలా చేయాలంటే.. ఈ నేచురల్ డైకి ముఖ్యంగా కావాల్సింది ఉల్లితొక్క. ఫంగస్ లేని ఉల్లి తొక్కుని తీసుకుని ఓ పాన్వేసి బాగా వేయించండి. మొత్తం నల్లగా మారాలి. దీనిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఇందులోని కలబంద జెల్ వేసి బాగా కలపండి. దీనిని జుట్టుకి రాయండి. ఇది మొత్తం నేచురల్ పద్ధతిలో తయారైన హెయిర్ డై. దీనిని వారానికి ఎన్నిసార్లైనా రాయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తలకి మొత్తంగా రాసి గంట తర్వాత క్లీన్ చేయాలి. ఇది జుట్టుని నల్లగా చేయడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకెందుకు ఆలస్యం చేసేయండి మరీ..! (చదవండి: పైనాపిల్ మంచిదని తినేస్తున్నారా? అతిగా తింటే సమస్యలు తప్పవు!) -
బీథోవెన్ డీఎన్ఏలో అంతుచిక్కని రహస్యాలు?
జర్మనీకి చెందిన అలనాటి స్వరకర్త లుడ్విగ్ వాన్ బీథోవెన్ సింఫనీ, పియానో, వయెలెన్ మొదలైన వాటితో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో పేరొందారు. తాజాగా ఆయన జుట్టు నుంచి సేకరించిన డిఎన్ఏపై జరిపిన విశ్లేషణ అతనికి సంబంధించిన పలు రహస్యాలను వెల్లడించింది. బీథోవెన్ దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ 1827లో కన్నుమూశారు. అతను వినికిడి లోపం, కాలేయ వ్యాధి, ఉదర సంబంధిత వ్యాధులు, అతిసారంతో బాధపడ్డాడు. బీథోవెన్ తన చివరి రోజుల్లో తన మూలాల గురించి జనానికి సవివరంగా తెలియజేయమని తన సోదరులను కోరారు. డీఎన్ఏ విశ్లేషణ కోసం.. జర్మనీ, యూకేల నుండి వచ్చిన పరిశోధకుల బృందం బీథోవెన్ జుట్టుకు సంబంధించిన డీఎన్ఏను విశ్లేషించింది. బీథోవెన్ డీఎన్ఏని అతని బంధువులుగా భావిస్తున్నవారి డీఎన్ఏతో సరిపోల్చారు. అలాగే అతని ఇప్పుటి బంధువులు ఎవరో తెలుసుకునేందుకు పలు రికార్డులను కూడా పరిశీలించారు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో మృతి బీథోవెన్ జుట్టు నమూనాలలో ఒకటి బీథోవెన్కి చెందినది కాదని, గుర్తు తెలియని మహిళ నుండి వచ్చినదని పరిశోధకులు కనుగొన్నారు. బీథోవెన్ మరణం బహుశా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించి ఉండవచ్చునని కూడా వారు కనుగొన్నారు. హెపటైటిస్ వ్యాధి అతని కాలేయాన్ని దెబ్బతీసింది. ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపింది. బీథోవెన్ విషప్రయోగం వల్ల మరణించారనే మునుపటి నమ్మకానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది. తండ్రులు వేరా? బీథోవెన్కు చెందిన ‘వై’ క్రోమోజోమ్ అతని తండ్రి తరపు బంధువులతో సరిపోలడం లేదని పరిశోధకులు కనుగొన్నారు. అతని వంశవృక్షంలో తండ్రులు వేరుగా ఉండే అవకాశం ఉందని ఉందని కూడా వారు తెలిపారు. అంటే అతని పూర్వీకులలో ఒకరు వారి వంశానికి చెందిన తండ్రి కాకుండా వేరే వ్యక్తి అయివుంటాడని, అతని ద్వారా బీథోవెన్ జన్మించి ఉండవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు. -
బట్టతలకు విరుగుడు మంత్రం.. ఈ స్మార్ట్ డివైజ్!
బట్టతల మీద జుట్టు మొలిపించుకోవడం కోసం జనాలు నానా తంటాలు పడుతుంటారు. జుట్టు రాలడాన్ని అరి కట్టడానికి రకరకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. మందు మాకులు వాడుతుంటారు. బట్టతలను దాచుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కొందరు విగ్గులు వాడుతుంటారు. బట్టతలపై జుట్టు కోసం ఇకపై ఇన్ని తంటాలు అక్కర్లేదు. హెల్మెట్‌లా కనిపించే ఈ పరికరాన్ని తలకు తొడుక్కుంటే చాలు. ఆరు నెలల్లోనే ఇది ఫలితాలను చూపించడం మొదలుపెడుతుంది. ఆస్ట్రియాకు చెందిన ‘నియోస్టెమ్’ కంపెనీ ఇటీవల ఈ పరికరాన్ని ‘హెయిర్‌లాస్ ప్రివెన్షన్ వెయిరబుల్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రోజూ అరగంట సేపు దీన్ని తలకు తొడుక్కుంటే, ఇది తలపైనున్న మూలకణాలను ఉత్తేజితం చేసి, జుట్టు రాలిపోయిన చోట తిరిగి జట్టు మొలిపిస్తుందని దీని తయారీదారులు చెబుతున్నారు. దీనిని వాడటం వల్ల దుష్ఫలితాలేవీ ఉండబోవని కూడా వారు చెబుతున్నారు. దీని ధర 899 డాలర్లు (రూ.74,734). -
రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
అల్లంతో ఇలా చేస్తే పొడవైన జుట్టు మీ సొంతం!
ఆయుర్వేద పరంగా అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు ఈ అల్లం సులభంగా చెక్‌పెడుతుంది. అలాంటి అల్లం జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుందా? అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా!. అందులోనూ అల్లం ఘాటు ఓ రేంజ్లో ఉంటుంది. దాన్ని జుట్టుకి అప్లై చేస్తే వేడి చేస్తుంది కదా!. మరీ అలాంటి అల్లం ఎలా జట్టు పోషణకు ఉపపయోగపడుతుంది అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే నిపుణులు మాత్రం అల్లం కురులను స్ట్రాంగ్‌గా చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇదేలా శిరోజాలకు పనిచేస్తుంది ఎలా జుట్టుకి అప్లై చేయాలి తదితరాల గురించి తెలుసుకుందాం! అల్లంలో జింక్, మెగ్నీషియం ఉంటాయి. అందువల్ల ఈ అల్లం రసాన్ని జుట్టు అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బలంగా మారుతుంది. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాల వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఎలా తలకు అప్లై చేయాలంటే.. ఇందుకోసం ముందుగా ఆలివ్ నూనె తీసుకుని అందులో అల్లం రసం కలపండి. దీనిని జుట్టుకి అప్లై చేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే జుట్టుని క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే జుట్టు మెరుస్తుంది. పొడి జుట్టుకి అల్లం రసాన్ని అప్లై చేసి గంటపాటు అలానే ఉంచి, ఆ తర్వాత షాంపూ, కండీషనర్‌తో క్లీన్ చేసుకోవాలి. అల్లం రసాన్ని జుట్టుకి వాడడం వల్ల హెల్దీగా ఉండే పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. అంతేగాదు దీని వల్ల జుట్టుకి మరిన్ని లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. పైగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గస్తుంది. కాబట్టి, జుట్టుకి అల్లాన్ని రెగ్యులర్‌గా అప్లై చేయండి. అలాగే తలపై దురద , చిన్న చిన్న పొక్కులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పొక్కులని దూరం చేస్తాయి. గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. (చదవండి: మసాలా దినుసుల ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
బంజారాహిల్స్‌లో సందడి చేసిన హీరో నిఖిల్ సిద్దార్థ్ (ఫొటోలు)
-
జస్ట్ హెయిర్ డ్రైయర్ ఉపయోగించినందుకు.. ఏకంగా రూ. 78 వేలు..!
కొన్నిసార్లు స్టార్ హోటళ్లు, లగ్జరీ హోటళ్లు విలాసవంతంగా ఉంటాయని ఒక్కసారి అయినా స్టే చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ఆ హోటళ్లలో కొంతమంది కస్టమర్లకు ఎదరైన చేదు అనుభవాలు వింటే దెబ్బకు ఆ ఆలోచన కూడా చేయరు. అసలు వాటి వైపుకి వెళ్లే యత్నం కూడా చేయరు. ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలాంటి దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. మళ్లీ హోటల్లో స్టే చేయాలంటేనే భయపడింది. వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియాలోని పెర్త్‌కి చెందిన ఒక మహిళ నోవాటెల్ పెర్త్ లాంగ్లీ హోటల్లో బస చేసింది. ఆమెకి కింగ్స్ పార్క్‌లో మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంగీత కచేరి ఉంది. అందుకోసం ఆ మహిళ ఈ నోవాటెల్‌లో బస చేసింది. అయితే ఆ మహిళ తన ప్రదర్శనకు వెళ్లే ముందు గదిలో స్నానం చేసి డ్రైయర్‌ని ఉపయోగించి జుట్టుని ఆరబెట్టుకుంది. అయితే దుస్తులు మార్చకోక మునుపే ఆమె డోర్ వెలుపలే అగ్నిమాపక సిబ్బంది కాచుకున్నారు. ఆ డ్రైయర్‌ని ఉపయోగించడంతో ఎమర్జెన్సీ అలారం మోగడంతో ఈ హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ఈ తతంగం అంతా చూసి ఆ మహిళ షాకయ్యింది. అయితే సదరు మహిళ కాస్త తమాయించుకుని వాళ్లకి క్షమాపణ చెప్పడమే గాక వారిని కంగారు పెట్టించినందుకు డబ్బులు కూడా కట్టింది. అంతవరకు బాగానే ఉంది. సదరు హోటల్ కూడా ఆమె నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే ఆమెను షాక్‌కి గురి చేసింది. అయితే ఆమె హోటల్ నుంచి వెళ్లేటప్పుడూ ఇదంతా గమనించలేదు. ఆ తర్వాత తన బ్యాంక్ ఎకౌంట్ చెక్ చేయగా కేవలం డ్రైయర్ ఉపయోగించినందుకు ఏకంగా రూ. 78 వేలు బిల్లు వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆమె కంగుతింది. ఏంటీది అని కంగారు పడి వెంటనే సదరు హోటల్‌కి ఫోన్ చేయగా, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగేలా చేశారు అందుకని అంటూ ఏవేవో సమాధానాలు ఇచ్చారు హోటల్ సిబ్బంది. పైగా ఆమె ఫోన్‌కాల్స్‌ని రిసీవ్ చేయకుండా ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు. ఇక లాభం లేదనుకుని మేనేజర్‌కి ఇమెయిల్స్ అదేపనిగా పెట్టడంతో ఎట్టకేలకు సదరు హోటల్ మేనేజర్ ఆమె డబ్బులు వాపసు చేశాడు. ఇలాంటి వింత ఘటనే చైనాలో కూడా జరిగింది. ఓ మహిళ హోటల్లో రెండు రోజులు బస చేసేందుకు రూమ్‌ని బుక్ చేసుకుంది. అయితే జస్ట్ రెండు సార్లు స్నానం చేసిందని అదనంగా రూ. 28,850 వసూలు చేయడంతో విస్తుపోయింది సదరు మహిళ. (చదవండి: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే..మగవాళ్లు డ్రింక్ చేయకూడదట! అధ్యయనంలో షాకింగ్ విషయాలు) -
ఈ డివైజ్ ఉంటే.. ఒత్తయిన ఉంగరాల జుట్టు ఈజీగా మీ సొంతం!
ఒత్తయిన.. ఉంగరాల జుట్టు ఇచ్చే అందం అంతా ఇంతా కాదు. దానికున్న క్రేజే వేరు! కానీ.. మేనేజ్ చేయడమే మహాకష్టం. అయితే చిత్రంలోని డివైస్ కర్లీ హెయిర్ సంరక్షణను మేడ్ ఈజీ చేస్తుంది. ఈ ఆటోమేటిక్ హెయిర్ కర్లర్.. 2 సెకన్ల పాటు పవర్ బటన్‌ను నొక్కిపడితే ఆన్ అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టుతో పాటు.. ఫెళుసుబారిన జుట్టునూ మృదువుగా మార్చుతూ, అందమైన గిరజాలను సృష్టిస్తుంది. 8 నుంచి 11 సెకన్స్‌లో స్లైట్ కర్ల్స్ ఏర్పడతాయి.12 సెకన్లు దాటి 15 సెకన్స్ వరకూ ఉంచితే సాఫ్ట్ కర్ల్స్ ఏర్పడతాయి. 16 నుంచి 18 సెకన్ల వరకూ ఉంచితే.. టైట్ కర్ల్స్ (పూర్తిస్థాయిలో ఉంగరాలు) ఏర్పడతాయి. డివైస్‌కి ఒకవైపు సన్నని కర్లర్ చాంబర్ ఉంటుంది. దానిలో పాయలు పాయలుగా జుట్టును పెడితే.. అవి ఉంగరాలుగా చుట్టుకుని అందంగా మారుతాయి. ఇందులో మూడు వందల డిగ్రీల ఫారిన్ హీట్ నుంచి మూడువందల తొంభై డిగ్రీల ఫారిన్ హీట్ వరకు ఆరు స్థాయిల్లో ఉష్ణోగ్రతను పెంచుకునే వీలుంటుంది. డిస్ప్లేలో బ్యాటరీ ఇండికేటర్, టైమ్ అండ్ టెంపరేచర్ వివరాలతో పాటు.. కర్లర్ ఎటువైపు తిరుగుతున్నాయో కూడా వివరంగా చూసుకోవచ్చు. లెఫ్ట్, రైట్ అనే ఆప్షన్స్‌తో కర్లర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ మెషిన్ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు. దీని ధర సుమారుగా 1,249 రూపాయలు. (చదవండి: కరీనాకపూర్ మేకప్ నేచురల్‌గా ఉండటానికి సీక్రేట్ ఇదే..!) -
ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా? ఆ తప్పు అస్సలు చేయకండి
శీతాకాలంలో చర్మ సమస్యలు సాధారణం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కాలంలో చర్మానికే కాదు.. జుట్టుకూ సమస్యల చిక్కులు తప్పవు. ముఖ్యంగా చలికాలంలో జుట్టు రాలిపోవడం కాస్త ఎక్కువగానే ఉంటుంది. శీతాకాలంలో శిరోజాలను సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... తదితర విషయాలు తెలుసుకుందాం... శీతాకాలంలో ఉండే చల్లగాలుల వల్ల శరీరంలోనే కాదు, శిరోజాల్లో కూడా తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టంతా అట్టకట్టినట్లు పొడిగా తయారవుతుంది. అంతే కాదు, కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలిపోయే సమస్య అధికం అవుతుంది కాబట్టి చలి బారి నుంచి శిరోజాలను కూడా సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. తరచూ తలస్నానం శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా చేయకూడదు. వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసార్లు చేయడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. వేడినీటి స్నానం శీతాకాలంలో స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. వేడి నీటి స్నానం వల్ల చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి కురులు పొడిగా... నిర్జీవంగా మారిపోతాయి. హెయిర్ డ్రయ్యర్స్ శీతాకాలంలో జుట్టుకు ఉపయోగించే డ్రయర్స్, కర్లర్స్స్ట్రెయిటనర్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. టవల్‌తో తుడుచుకుని ఆరబెట్టుకునే విధానానికే పరిమితం కావాలి. కండీషనింగ్ తలస్నానానికి ముందు జుట్టుకు కండీషనర్ తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి. హెయిర్ ఆయిల్ చలికాలంలో శిరోజాలకు తరచు నూనె పెడితే మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి ఉపకరిస్తుంది. అలాగే దువ్వుకోవడానికి సన్న పళ్ల దువ్వెన కాకుండా పళ్లు కాస్త దూరంగా... వెడల్పుగా ఉన్న దువ్వెన వాడటం మంచిది. అట్ట కట్టినట్టు ఉంటే : చలిగాలులకు జుట్టు అట్టకట్టినట్లుగా కాకుండా ఉండాలంటే రోజూ రాత్రిళ్లు విటమిన్ ఇ ఉన్న నూనెను రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు కురులను కవర్ చేసేలా స్కార్ఫ్, టోపీ వంటివి ధరించాలి. కుదరని పక్షంలో బాడీలోషన్ కొద్దిగా తీసుకుని చేతులకు రుద్దుకోవాలి. తర్వాత ఆ చేతులతో జుట్టును మెల్లగా దువ్వుతున్నట్లు సవరించుకోవాలి. ఇలా చేయడం వల్ల పెళుసుదనం పోయి, శిరోజాలు ప్రకాశవంతంగా మారుతాయి. ఈ జాగ్రత్తలతో ఈ కాలంలోనూ కురులు నిగనిగలాడతాయి. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పల్నాడు: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం పట్టణ శివారులోని ఇంజినీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాత్రూమ్లోకి వెళ్లి హెయిర్‌లోషన్ తాగింది. కొంత సేపటికి వాంతులు కావడంతో గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. ఓత్తిడిని తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
చలికాలంలో జుట్టు పొడిబారి డల్‌గా ఉంటుందా?
చలికాలం చుండ్రుతో జుట్టు పొడిబారనట్లుగా అయిపోయి డల్‌గా ఉంటుంది. దీనిక తోడు ఈ కాలంలో హెయిర్ గ్రోత్ కూడా స్పీడ్‌గా ఉండదు. సీజన్ల వారిగా మన జుట్టుని సంరక్షణ పద్ధతులను కూడా అందుకు తగ్గట్టు కాస్త మార్పులు చేసుకుంటూ కొద్దిపాటి రెమిడ్సిని అనుసరిస్తే కుచ్చులాంటి కురులు మీ సొంతం. అందుకోసం ఫాలో అవ్వాల్సిన రెమిడీలు ఏంటంటే.. మూడు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్,ఒక టీ స్పూను తేనె తీసుకుని రెండింటినీ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తుంటే పొడిబారిపోయిన జుట్టు కూడా చాలా అందంగా తయారవుతుంది. మూడు టీ స్పూన్ల ఆముదాన్ని గోరువెచ్చ చేసుకుని, తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. తర్వాత జుట్టంతా చిక్కు లేకుండా దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకుని, వేడి నేటిలో తడిపిన టవల్‌ను తలకు చుట్టి పావుగంటపాటు ఆవిరి పట్టించాలి. తర్వాత నీటితో జుట్టును కడిగేసి, మర్నాడు షాంపూతో తలస్నానం చేయాలి. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెలో టీస్పూను నిమ్మరసం వేసి తలకు మసాజ్ చేసుకోవాలి. కొబ్బరి నూనెలో కొద్దిగా మెంతులు లేదా కరివేపాకు పేస్ట్ లేదా వేపాకుల పేస్ట్ కలిపి గోరువెచ్చగా అయ్యేంతవరకూ వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు పట్టించి మసాజ్ చేసి మర్నాడు షాంపూతో తలస్నానం చేయాలి. కప్పు నీటిలో టీ స్పూను నిమ్మరసం, రెండు టీ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్ (మార్కెట్లో లభిస్తుంది) వేసి కలుపుకోవాలి. షాంపూతో తలస్నానం చేసిన పది నిమిషాల తర్వాత ఈ మిశ్రమంతో తలను తడపాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ కనబడుతుంది. (చదవండి: పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..) -
మాదాపూర్ లో స్నైల్స్ , హెయిర్, బ్యూటీ & నెయిల్స్ రెండవ బ్రాంచ్ ను ప్రారంభించిన జబర్దస్త్ రితు చౌదరి, డైరెక్టర్ సందీప్ రాజ్ (ఫోటోలు)
-
ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?
ఆన్లైన్లో, రెస్టారెంట్‌లోగానీ ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఏదైనా లోపం ఉన్నా, లేదా ఇంకేమైనా వెంట్రుకలు లాంటి అవాంఛిత పదార్థాల్ని, వస్తువులను గుర్తించినా, వెంటనే సంబంధిత డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేయడం, దానికి వాళ్లు సారీ చెప్పడం, లేదా ఫ్రీ మీల్ ఆఫర్ చేయడం ఇదంతా మనకు తెలిసిన కథే. అయితే ఇలాంటి ఫ్రీ మీల్స్ కోసం ఆశపడిన ఒక అమ్మడు అడ్డంగా బుక్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు కస్టమర్లు ఫిర్యాదులు ఆధారంగా వారికి నష్టపరిహారం ఫ్రీ మీల్స్ ఆఫర్ చేస్తాయి. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం కథనం ప్రకారం ఇలా ఉచిత భోజనం కక్కుర్తి పడిన బ్రిటీష్ మహిళ రెస్టారెంట్‌ను మోసం చేయాలని ప్లాన్ చేసింది. ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌బర్న్‌లోని ప్రసిద్ధ తినుబండారం అయిన అబ్జర్వేటరీలో భోజనం చేస్తూ ఆహారంలో జుట్టు వచ్చిందంటూ హడావిడి చేసింది. దీంతో హోటల్ యజమాని మహిళ బీఫ్ రోస్ట్ డిన్నర్‌ను తిరిగి ఆఫర్ చేశారు. అయితే, నిఘా కెమెరాలున్నాయన్న సంగతిని ఆ మహిళ మర్చిపోయింది. కానీ రెస్టారెంట్ యజమాని మాత్రం మర్చిపోలేదు. అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే తమ హోటల్లో ఇలా జరిగిందేమిటబ్బా అని ఆందోళన చెందిన అతను ఆ తరువాత అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. దీంతో అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. వీడియోలో మహిళ జుట్టును తీసి తన భాగస్వామి సగం తిన్న ప్లేట్లో ఉంచడం క్లియర్ కనిపించింది.టామ్ క్రాఫ్ట్ దీనిపై సోషల్ మీడియాలోపోస్ట్ పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. బిజినెస్ బాబులూ బీ అలర్ట్ జాగ్రత్త ఇలాంటి వాళ్లూ కూడా ఉంటారు అంటూ ఫేస్బుక్లో CCTV ఫుటేజీని షేర్ చేశాడు. ఇది చాలా అసహ్యంగా అనిపించిందని, కేవలం 15.88 డాలర్లు(రూ. 1300) కోసం ఇంతకు దిగజారతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు తమకు ఫైవ్ స్టార్ ఫుడ్ హైజీన్ రేటింగ్ ఉందనీ, అన్ని ఆహార భద్రతా మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపాడు. నిజంగా సీసీటీవీ ఫుటేజీని గమనించకపోతే ఆమె ఆరోపణతో తన వ్యాపారం, ప్రతిష్ట గంగలో కలిసిపోయేదిగా అంటూ వాపోయాడు.. -
సాల్మన్ చేపలు తింటున్నారా?,ఇందులోని విటమిన్ బి6 వల్ల జుట్టుకు..
అందం అంటే చర్య సౌందర్యం మాత్రమే కాదు.. జుట్టు సౌందర్యం కూడా. అందుకే అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కాస్త జుట్టు ఊడిపోతున్నా తెగ ఫీల్ అవుతుంటారు. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్. రకరకాల షాంపులు, ఆయుల్స్, పొల్యూషన్ వల్ల చాలామందిలో జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరి వెంట్రుకలు బాగా పెరిగి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీ డైట్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచిది అన్నది ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఖనిజాలను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి తదితర పోషకాల లోపం వల్ల జుట్టు బాగా రాలుతుంది. కాబట్టి ఇవి డైట్లో ఉండేలా చేసుకోవాలి. అందకు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి.పాలకూరలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయ పడతాయి. పాలకూర జుట్టుకు సహజసిద్ధమైన కండిషనింగ్‌ను అందిస్తుంది. పాలకూరలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్ ఆహారంలో ప్రతిరోజూ నట్స్ తీసుకోవలి. బాదంపప్పు, పిస్తాపప్పు, కాజు మొదలైన డ్రైఫ్రూట్స్‌ని ప్రతిరోజూ డైట్లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ సహా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు, చర్మం ఆరోగ్యానికి గొప్పగా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజూ బాదం తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లను బలంగా, సిల్కీగా ఉండేలా చేస్తుంది. గుడ్లు కోడిగుడ్లలో ప్రొటీన్, విటమిన్ బి12, ఐరన్, జింక్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కురుల పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే.. విటమిన్ A,E, బయోటిన్, ఫోలేట్ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఓ గుడ్డు తినాలి. చేపల్లో ఒమెగా 3, ఒమెగా 6 తదితర ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. గుడ్డులోని జింక్, బయోటిన్ ఆరోగ్యవంతమైన జుట్టుకు తోడ్పడుతుంది. చేపలు సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా డెడ్ హెయిర్ సెల్స్‌ను తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సాల్మన్, సార్డినెస్, మాకెరెల్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉండే చేపలు. ఈ చేపల్లో ప్రొటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి6 కూడా అధికంగా లభిస్తాయి. వీటన్నింటిలో సాల్మన్ చేపలు మరీ ఆరోగ్యకరమైనవి. చిలగడదుంప జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతుంటే ఆహారంలో చిలగడదుంపను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ A లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకు చిలగడదుంపను మీ డైట్లో ఉండేలా చూసుకోండి. బెర్రీలు బెర్రీలు ప్రతిరోజూ బెర్రీలను తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఎందుకంటే బెర్రీస్‌లో జుట్టుకు ఉపయోగపడే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ బెర్రీలను డైట్లో చేర్చుకోండి. పెరుగు పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి మెరుపును అందిస్తాయి. పెరుగును తినడమే కాకుండా ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యలను కంట్రోల్లో ఉంచుతుంది. చుండ్రుతో బాధపడుతున్న వాళ్లు వారానికి ఒకసారి పెరుగుతో ప్యాక్ వేసుకుంటే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది. -
తమలపాకులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!
చిన్ని చిట్కాలతో కూరగాయాలను, పళ్లను పాడవకుండా రక్షించుకోవచ్చు. అలాగే ఇంట్లో అందుబాటులో దొరికే వాటితోనే చర్మాన్ని, హెయిర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన చిట్కాలను ఫాలో అవుతూ మన, ఇంటిని, ఆరోగ్యాన్ని ఈజీగా రక్షించుకోవచ్చు. అందుకావల్సింది ఓపిక. దీంతో పాటు ఎలాంటి హానికరం కాని మంచి రెమిడీలు కాస్త అనుభవం గడించిన పెద్దలు లేదా ఆరోగ్య నిపుణుల సాయం ఉంటే చాలు. ఆకుకూరలు తాజగా ఉండాలంటే.. ఆకుకూరలు వాడిపోయినట్టుగా కనిపించినప్పుడు... వాటిని చల్లటినీటిలో వేయాలి. దీనిలో టేబుల్ స్పూను నిమ్మరసం వేసి కలిపి ఐదునిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటినుంచి తీసేయాలి. ఇలా చేస్తే ఆకుకూరలు తిరిగి తాజాగా కనిపిస్తాయి. యాపిల్ ముక్కలు కట్ చేసిన వెంటనే ఆ ముక్కలపైన కాసింత నిమ్మరసం పిండితే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. జుట్టు రాలే సమస్య తగ్గాలంటే.. ఇరవై తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుచేయాలి. ఈ పేస్టులో టీస్పూను నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. (చదవండి: సబ్జాతో ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది!) -
తలకు షాంపూ.. ఇలా ఐతే మంచిది!
ఆధునిక జీవనశైలి, వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారాల వల్ల చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. కొంతమందికి జుట్టు తొందరగా జిడ్డుపట్టే తత్త్వం ఉంటుంది. వీటినుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల మంచి ఫలితాల మాట ఎలా ఉన్నా, కొన్ని రోజుల తర్వాత జుట్టు చెడిపోతుంది. అయితే షాంపూ చేయడానికి ముందు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. తలకు నూనె పట్టించడం షాంపూ చేయడానికి ముందు జుట్టుకు తప్పకుండా నూనెను అప్లై చేయాలి. తలకు నూనెను పట్టించిన రెండు గంటల తర్వాత జుట్టును శుభ్రం చేయడం మంచిది. తల దువ్వుకోవడం షాంపూ చేయడానికి ముందు జుట్టును బాగా దువ్వాలి. దువ్విన తర్వాత షాంపూను అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది. జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. సల్ఫేట్ రహిత షాంపూలు సో బెటర్ ప్రస్తుతం చాలా మంది బాగా గాఢంగా ఉండే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా మైల్డ్‌గా.. సల్ఫేట్ రహితంగా ఉండే షాంపూలను వినియోగించడం మంచిది. తలకు చన్నీరే మంచిది జుట్టు సమస్యలతో బాధపడేవారు తలస్నానం చేసే సమయంలో చల్లని లేదా గోరువెచ్చటి నీటితో మాత్రమే చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టు మొదళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. (చదవండి: అగ్గిపుల్లతో ఇలా చేస్తే..మొక్కలు పూలతో కళకళలాడతాయి!) -
రోజూ తలస్నానం చేస్తున్నారా?
చాలా మంది ఏదైనా చిట్కా చెప్పిన లేదా పెద్దలు ఇది మంచిదన్నా వెంటనే చేసేస్తుంటారు. ఇది అన్నివేళాల మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే ఆ చిట్కా మనకు పనిచేస్తుందో కూడా గమనించాలి. మన శరీరతత్వం, ఆరోగ్య పరిస్థితిని పరిగణలోని తీసుకునే ఆచరించాలి. లేదంటే తగ్గడం అటుంచి లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుంది జాగ్రత్త!. ఇంతకీ జుట్టుకి సంబంధించి చాలా రెమిడీలు వినేఉండుంటారు. అందులో చాలా మంది రోజు తలస్నానం చేస్తే మంచిదని పలువురు చెప్పారు. దీంతో చాలామంది ఆ మాట మీద నమ్మకంతో ఆచరించేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. మీదు పొడిజుట్టు, జిడ్డుగా ఉండే జుట్టు అనేదాని బట్టి ఆ రెమిడీని అనుసరించలి. ఇక్కడ జుట్టు తత్వాన్న అనుసరించే ఏ చిట్కానైనా ఫాలోకండి. చెప్పారు కదా అన్ని చేసేయొద్దు!. ఇంతకీ ఎలాంటి వారు రోజు తలస్నానం చేయడం మంచిది? ఎవరూ చేయకూడదో ? చూద్దాం! పదే జుట్టుజుట్టు కడితే.. పదేపదే జుట్టుని కడగడం వల్ల... జుట్టు పొడిగా మారిపోతుంది.అందువల్ల జుట్టు తత్వాన్ని బట్టి తలస్నానం చేయాలి. భరించలేనంత జిడ్డుకారుతుంటే రోజూ తలస్నానం చేయాలి. పని ప్రదేశంలో బాగా చెమటలు పడుతుంటే రోజూ తలస్నానం చేయాలి. అయితే షాంపుతో కాకుండా సాధారణ నీటితో తలను కడగాలి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తలస్నానం చేస్తే కురులు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి. మాడు నూనె కారుతుంటే తలస్నానం చేయడం మంచిది కాదు. తలలో సహజ సిద్ధ్దంగా విడుదలయ్యే నూనెలు జుట్టుకు చాలా ముఖ్యం. జిడ్డుగా ఉందని పదేపదే తలస్నానం చేస్తే మాడు పొడి బారి చుండ్రు, ఇతర సమస్యలు చుట్టు ముడతాయి. ఎలాంటివారు రోజు తలస్నానం చేయాలంటే.. పనిప్రదేశేల్లో ఎక్కువగా.. దుమ్ము దూళి ఉండేచోట పనిచేయక తప్పని ఉద్యోగులు ఏరోజు కారోజు ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేయాలి అలాగే తలలో ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లు కూడా వైద్యుల సలహాల మేరకు ఆయింట్మెంట్స లేదా ఆయా ఆయిల్స అప్లై చేసి రోజంతా ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయాలి. తద్వారా త్వరగా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడగలుగుతారు చుండ్రు ఎక్కువుగా ఉండి బయటకు వెళ్లిన వెంటనే జుట్టు మాసినట్టుగా అయిపోయేవాళ్లు కూడా ఈ చిట్కా ఫాలో అవ్వాల్సి ఉంటుంది విపరీతంగా తల్లో చెమట పట్టేవాళ్లు కూడా రోజు తలస్నానం చేయడమే మంచిది. కాబట్టి మీ జుట్టు తత్వాన్ని అనుసరించి రెమీడిని ఫాలో అయితే మంచిది. (చదవండి: బౌల్ మసాజ్‌తో మెరిసిపోండి! ఆరోగ్యం, అందం మీ సొంతం!) -
త్రాచును మించిన జడ.. పడగ కూడా..!
లక్నో: కురులంటే ఆడవారికి ఎంతో ఇష్టం. అవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే ఎంతో ప్రత్యేకంగా వాటిని కాపాడుకుంటుంటారు. నిండైన జడ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఒకవైపు.. మరోవైపు కురులకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రధాన్యత ఉంటుంది. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌లో ఓ మహిళ కురులు త్రాచుపాము అంతటి పరిమాణంలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బృందావన్ ధామ్ ఆధ్యాత్మికంగా హిందువులకు ఎంతో ప్రధాన్యత కలిగిన ప్రదేశం. కృష్ణుని జన్మస్థానంగా పేర్కొంటారు. ఇక్కడ ఓ మహిళ జుట్టు చాలా పెద్ద పరిమాణంలో పెరిగింది. దాదాపుగా త్రాచుపాము లాగే కనిపిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆ మహిళ తన జుట్టును ఏ మాత్రం పట్టించుకోకున్నా.. ఇంతటి పరిమాణంలో పెరిగింది. జడలు కట్టి ఉన్న ఈ మహిళ పాదాలకు భక్తులు నమస్కారం చేస్తుంటారు. తమకు తోచినంత సహాయం చేస్తుంటారు. View this post on Instagram A post shared by Meri Yamuna Ji (@meriyamunaji) సోషల్ మీడియోలో ఈ మహిళ తెగ వైరల్ అవుతోంది. ఆమె జుట్టుపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు జుట్టుకు ఎలాంటి పోషణ చేయకున్నా.. ఇంతటి స్థాయిలో పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగుపాము ఆకారంలో జడ ఏర్పడటంతో ప్రణామాలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా వింత కదా..! ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
కేశాలతో రూ. కోట్లు.. హైదరాబాదీ సిస్టర్స్ బిజినెస్ అదుర్స్!
అందాల ప్రపంచంలో జుట్టుకున్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. చాలా మంది భారతీయ మహిళలకు జుట్టు రాలడం, పొట్టి కేశాలు అనేవి తీవ్రవైన సమస్యలు. ఈ నేపథ్యంలో ఇటీవల హెయిర్ ఎక్స్టెన్షన్లకు ఆదరణ బాగా పెరిగింది. ఈ రహస్యాన్ని గ్రహించిన హైదరాబాదీ సిస్టర్స్ బిజినెస్ ప్రారంభించి కోట్లు సంపాదిస్తున్నారు. రిచా గ్రోవర్ భద్రుకా (Richa Grover Badruka), రైనా గ్రోవర్ (Raina Grover).. హైదరాబాద్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు. భారత్‌లో హెయిర్ ఎక్స్టెన్షన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అర్థం చేసుకున్నారు. 2019లో ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీగా తమ బ్రాండ్ ‘1 హెయిర్ స్టాప్’ (1 Hair Stop)ను ప్రారంభించారు. మొదట్లో రోజుకు 2-3 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు ఆర్డర్ల సంఖ్య 130-150కి పెరిగింది. 2022-23లో రూ. 27 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన వీరి బిజినెస్ ఈ ఏడాది రూ. 31 కోట్లు ఆర్జించే దిశగా అడుగులు వేస్తోంది. అదే ప్రేరణ మహిళల జుట్టు సమస్యలకు ఏకైక పరిష్కారాలు మార్కెట్లో లేవని తాము గ్రహించామని, 1 హెయిర్ స్టాప్‌తో నిజమైన పరిష్కారాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రిచా గ్రోవర్ భద్రుకా చెబుతున్నారు. భారత్ గ్లోబల్ హెయిర్ ఎగుమతిలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, భారత మార్కెట్లో అంతరాన్ని గుర్తించడంతో వారి ప్రయాణం ప్రారంభమైంది. భారతీయ మహిళల ప్రత్యేక అవసరాలకు ప్రత్యేకంగా అధిక-నాణ్యత జుట్టు ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని అని ఆమె పేర్కొంటున్నారు. కలిసొచ్చిన తండ్రి వ్యాపారం ఈ సిస్టర్స్ బిజినెస్ ప్రయాణంలో తమ వ్యక్తిగత నేపథ్యం కూడా కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్‌లో పెరిగిన రిచాకు చిన్నప్పటి నుంచి అందం, ఫ్యాషన్‌పై మక్కువ ఎక్కువ. ఆమె తండ్రి ఒకటిన్నర దశాబ్దం పాటు జుట్టు వ్యాపారంలో ఉండటం కూడా ఆమె సంకల్పానికి కలిసొచ్చింది. చదువును పూర్తి చేసిన తర్వాత రిచా కుటుంబ వ్యాపారంలో చేరారు. భారతీయ మార్కెట్‌కు నేరుగా సేవలందించే లక్ష్యంతో 2019లో ‘1 హెయిర్ స్టాప్’ను ప్రారంభించే ముందు ఆమె మొదట్లో హోల్‌సేల్ ఎగుమతులపై దృష్టి సారించారు. స్టార్టప్‌గా ప్రారంభమై.. స్టార్టప్‌గా ప్రారంభమైన ‘1 హెయిర్ స్టాప్’ మంచి వృద్ధిని సాధించింది. నేడు ఆధిపత్య పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది. ప్రారంభంలో రోజుకు కేవలం 1-3 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు రోజుకు 150-160 ఆర్డర్లు వస్తున్నాయి. ప్రారంభ రోజులలో కేవలం రూ. 10,000 మార్కెటింగ్ బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మార్కెటింగ్ కోసం నెలకు రూ. 10-16 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే వారి బిజినెస్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తమ ఉత్పత్తులను బయటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. 1 హెయిర్ స్టాప్ ఆదాయంలో 75 శాతం భారత్ నుంచి వస్తుంటే మిగిలినది అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల నుంచి వస్తోంది. మొత్తం అమ్మకాలు రూ. 61 కోట్లు 1 హెయిర్ స్టాప్ ఇప్పటివరకూ 1.2 లక్షలకు పైగా ఆర్డర్లను అందుకుంది. 2.1 లక్షలకు పైగా ఉత్పత్తులను విక్రయించింది. మొత్తం అమ్మకాలు రూ. 61 కోట్లు దాటాయి. 2022 ఆ సంస్థకు అత్యంత లాభదాయకమైన సంవత్సరం. ఎందుకంటే ఆ సంవత్సరంలో కంపెనీకి 47,000 ఆర్డర్లు రాగా 90,000 ఉత్పత్తులను విక్రయించింది. 2022-23లో రూ. 27 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ట్రెండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు కొత్త తరం అమ్మాయిలు హెయిర్‌స్టైల్‌తో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. క్లీన్ గర్ల్ ఈస్తటిక్, ఫెయిరీ గర్ల్ ట్రెండ్, బార్బీ కోర్ ఈస్తెటిక్ హెయిర్ స్టైల్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటికీ హెయిర్ ఎక్స్టెన్షన్లు అవసరం. దీనికి అగుణంగా 1 హెయిర్ స్టాప్ పోర్ట్‌ఫోలియోలో కలర్‌ఫుల్ స్ట్రీక్స్, మెస్సీ బన్స్, పోనీ టెయిల్స్, ఫ్లైఫిక్స్, లేస్, సిల్క్ టాపర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ని ప్రారంభించడం ద్వారా ఆఫ్‌లైన్ స్పేస్‌లోకి ప్రవేశించాలని 1 హెయిర్ స్టాప్ యోచిస్తోంది. అదనంగా బ్రాండ్ తన హెయిర్‌కేర్ శ్రేణిని విస్తరించడం, సెలూన్ నెట్‌వర్క్‌లతో సహకారాన్ని అన్వేషించడం, సెమీ-పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్లను భారతీయ కస్టమర్లకు పరిచయం చేయడంపై దృష్టి సారించింది. -
మనుషులు ఇలా కూడా ఉంటారా? గ్యాస్ లైటర్ సాయంతో రింగురింగుల జుట్టు..
పార్లర్‌కు వెళ్లడం ఖర్చుతో కూడిన పని. అందుకే అమ్మాయిలు/మహిళలు కొన్నిసార్లు ఇంట్లోనే హెయిర్ స్టైలింగ్, ఫేషియల్, ఫేస్ మసాజ్ లాంటి అందాలను ఇనుమడింపజేసే ప్రక్రియలను చేసుకుంటుంటారు. అయితే తాజాగా ఒక భర్త తన భార్యకు రింగురింగుల జుట్టును తీర్చిదిద్దేందుకు ఒక విచిత్రమైన విధానాన్ని అనుసరించాడు. దీనిని చూసిన చాలామంది తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో @Madan_Chikna హ్యాండిల్లో పోస్ట్ చేశారు. వీడియోకు ఇప్పటివరకూ 6 వేలకు పైగా వ్యూస్, లెక్కకుమించిన లైక్స్ వచ్చాయి. పలువురు యూజర్స్ ఈ వీడియోపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ప్రమాదకరమని కొందరు అంటున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గ్యాస్ స్టవ్‌పై ‘గ్యాస్ లైటర్’లోని మెటల్ భాగాన్ని వేడి చేయడం చూడవచ్చు. తరువాత ఆ వేడిచేసిన లైటర్ సాయంతో భార్య కురులను రోల్ చేయడాన్ని గమనించవచ్చు. కొన్ని సెకెన్ల అనంతరం అతను ఆమె జుట్టును లైటర్ నుంచి వేరు చేసినప్పుడు, ఆ జుట్టు రింగురింగులుగా మారాడాన్ని గమనించవచ్చు. దీనిని చూసిన నెటిజన్లు ఈ విధానం చాలా ప్రమాదకరమని, డబ్బు ఆదా చేయడమనే పేరుతో జుట్టుతో ఆడుకోవడం సరైదని కాదని సూచిస్తున్నారు. సరదాకి కూడా ఇలాంటివి చేయవద్దని సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: భయపడొద్దు.. కుక్కలను కంట్రోల్ చేస్తున్నాం: బ్రిటన్ ప్రధాని Showed this reel to my wife and she said yeh toh kuch bhi nahi hai and gave five similar examples how more precisely we used to do this 😲 pic.twitter.com/2h0PaZW4UA — Godman Chikna (@Madan_Chikna) September 15, 2023 -
జుట్టును కాపాడుకోవడానికి ఈ ప్రొఫెషనల్ డ్రైయర్ ఉండాల్సిందే
నిగారింపుతో ముఖం ఎంతగా మెరిసిపోయినా తల మీద తగినంత జుట్టు లేకపోతే ఆ అందం కళాహీనమే. అందుకే చాలామంది మహిళలు కేశసంరక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. వారానికో హెయిర్ మాస్క్, రోజు విడిచి రోజు హెయిర్ మసాజ్‌లు.. ఇలా తమకు తెలిసిన పద్ధతిలో జుట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చెయ్యడం మంచిదంటారు నిపుణులు. నిజానికి తల స్నానం చేయడంతో పాటు జుట్టును ఆరబెట్టుకోవడమూ కష్టమైన పనే.. బిజీ లైఫ్‌లో! అందుకే ఈ ప్రొఫెషనల్ ఎయిర్ డ్రైయర్ ఇంట్లో ఉండాల్సిందే! చిత్రంలోని ఈ డివైస్.. గిరిజాల జుట్టు.. మందపాటి జుట్టు.. ఇలా అన్ని రకాల జుట్టుకూ ప్రయోజనం కలిగిస్తుంది. ఆన్, ఆఫ్, హై, లో అనే ఆప్షన్స్‌తో దీన్ని వినియోగించడమూ తేలికే! నెగెటివ్ అయానిక్ టెక్నాలజీతో కూడిన ఈ హెయిర్ డ్రైయర్.. భారీ ప్రతికూల అయాన్లను విడుదల చేయడంతో జుట్టులోని తేమను పోగొట్టి.. మృదువుగా మారుస్తుంది. జుట్టును కాపాడుతుంది. ఈ సాధనం చాలా తేలికగా చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇది స్టెయిలింగ్ ఫ్లెక్సిబిలిటీతో పాటు.. కంట్రోల్ కోసం 2 విభిన్న స్పీడ్ మోడ్‌లను అందిస్తుంది. అలాగే ఇందులోని రెండు ప్రత్యేకమైన హెడ్స్‌ని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఆటోలీకేజ్ సంరక్షణ కోసం సేఫ్టీ ప్లగ్‌తో.. ఈ డ్రైయర్ అప్‌గ్రేడ్ అయ్యింది. దాంతో దీన్ని ఉపయోగించినప్పుడు షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ లీకేజీ జరిగితే.. ఓవర్–హీట్ ప్రొటెక్షన్లు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. ధర 35 డాలర్లు. అంటే 2,894 రూపాయలు. -
పొడవు జుట్టుంటే మహిళ మృతదేహమేనా? పోస్టుమార్టంలో ఏం తేలింది?
యూపీలోని బస్తీలో పోలీసుల నిర్లక్ష్యం మరోమారు కనిపించింది. పోలీసులకు లభ్యమైన ఒక మృతదేహానికి పొడవైన జుట్టు ఉంది. దీంతో అది మహిళ మృతదేహంగా భావించి, పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే పోస్టుమార్టం సమయంలో వైద్యులు ఆ మృతదేహాన్ని చూసి హడలిపోయారు. పోలీసుల పేర్కొన్నట్లు అది మహిళ మృతదేహం కాదని, పురుషునిదని వారు గుర్తించారు. వివరాల్లోకి వెళితే మూడు రోజుల క్రితం పోలీసులకు ఒక అనాథ మృతదేహం లభ్యమయ్యింది. అది గోనె సంచీలో కట్టివేసివుంది. ఆ మృతదేహానికి పొడవైన జుట్టు ఉంది. దీంతో వారు అది మహిళ మృతదేహమని నిర్ధారిస్తూ, దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే వైద్యులు ఆ మృతదేహాన్ని పరిశీలించి అది పురుషునిదని గుర్తించారు. పోలీసులు చేసిన తప్పిదాన్ని నిరసిస్తూ, వారు పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. మరోమారు పంచనామా చేసిన అనంతరమే పోస్టుమార్టం నిర్వహిస్తామని వారు తేల్చిచెప్పారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దుబౌలియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోకుల్‌పూర్‌లో రోడ్డు పక్కన పోలీసులకు సంచీలో బంధించిన మృతదేహం లభ్యమయ్యింది. ఆ మృతదేహం అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో విపరీతంగా దుర్ఘందం వెలువడుతోంది. ఆ మృతదేహానికి ఉన్న జుట్టు ఆధారంగా పోలీసులు దానిని మహిళ మృతదేహంగా భావించి, దర్యాప్లు ప్రారంభించారు. కాగా ఇంతవరకూ అది ఎవరి మృతదేహమనేది తెలియరాలేదు. ఇది కూడా చదవండి: కుమారుని బర్త్‌డే కేక్ కట్ చేస్తూ తండ్రి మృతి! -
ఐదేళ్లలో 370 మిలియన్ డాలర్ల కేశాల ఎగుమతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశం నుంచి ఐదేళ్లలో 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ కేశాలు ఎగుమతి అయ్యాయని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2018–19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019–20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020–21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021–22లో 149.07 మిలియన్ డాలర్లు, 2022–23లో అత్యధికంగా 169.23 మిలియన్ డాలర్ల విలువైన కేశాలు ఎగుమతి చేసినట్లు వివరించారు. మానవ కేశాలు, ఉత్పత్తుల అసోసియేషన్, ప్లెక్స్ కౌన్సిల్ సమాచారం మేరకు ప్రపంచంలోనే అత్యధికంగా మానవ కేశాలు లభించేది భారతదేశంలోనే అని తెలిపారు. దేశంలో లభించే కేశాలు నాణ్యమైనవిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినట్లు చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్ మీదుగా మయన్మార్ నుంచి చైనాకు భారతీయ మానవ కేశాల అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాలు లేవని, కస్టమ్స్ వద్ద కేసులేమీ నమోదు కాలేదని తెలిపారు. -
కేశమహిమ
జీవితంలో అప్రధానంగా కనిపించే విషయాలకు కూడా వాటి ప్రాధాన్యం వాటికి ఉంటుంది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ జుట్టు. మన భాషా సాహిత్యాలను కొంచెం తరచి చూస్తే, జుట్టుకు ఉన్న ప్రాశస్త్యం అర్థమవుతుంది. జుట్టు చుట్టూ జరిగే వ్యాపారాలను కాస్త నిశితంగా గమనిస్తే,ఎంతటి వారైనా ‘జుట్టే కదా’ అని కేశపాశాలను వెంట్రుక ముక్కలా తీసి పారేయలేరు. అదీ కేశ మహిమ! అందమైన కేశాలు నిండుగా తలమీద ఉండటం వల్లనే శ్రీమహావిష్ణువుకు కేశవుడనే పేరు వచ్చింది. ఆదిభిక్షువే అయినా, పరమశివుడు కేశసంపదలో తక్కువ వాడేమీ కాదు, ఆయన జటాజూటధారి! ఆయన తన జటాజూటంలో గంగను బంధించాడు కాబట్టి గంగను శిరోజతీర్థం అని అంటారు. తలవెంట్రుకలకు గల పురాణ ప్రశస్తికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే! జుట్టును అల్లుకున్న జాతీయాలు, సామెతలు దాదాపు అన్ని భాషల్లోనూ ఉన్నాయి. ‘ఫలిత కేశాలు ముదిమికి సంకేతాలే గాని, జ్ఞానానికి కాదు’ అని ఇంగ్లిష్ సామెత. ఇది తలపండితులకు చక్కగా వర్తిస్తుంది. ‘తలలు బోడులైన తలపులు బోడులా’ అనే సామెత మనకు ఉండనే ఉంది. ‘అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం’ కూడా మన నుడికారంలో భాగమే! కొందరు బతకనేర్పరులు ఈ విద్యలో బాగా ఆరితేరి ఉంటారు. ‘జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే’ అని నానుడి. ఇటీవల ఏపుగా జుట్టు పెంచుకోవడానికి హైదరాబాద్‌లో ఒక మహిళ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. బ్యూటీపార్లర్ చికిత్సతో ఆమెకు ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. ఇలా ఉంటాయి కేశక్లేశాలు! ‘కాళ్లు్ల వంకరగా ఉన్నప్పుడు నెత్తి మీద వెంట్రుకలు తిన్నగా ఉండి లాభమేంటి?’ అని రష్యన్ సామెత. ‘ప్రతి మనిషి పొద్దున్నే తలదువ్వుకున్నట్లు మనసు దువ్వుకోరెందుకో?’ అని చైనీస్ సామెత. మనుషులకు శిరోజాలంకరణ మీద ఉన్న శ్రద్ధ మనోలంకరణ మీద ఉన్నట్లయితే, ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడిపోయేది! మన పూర్వకవులు మరాళకుంతలలైన నీలవేణుల సౌందర్యాన్ని ఇతోధికంగా వర్ణించారు. ‘ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై...’ పద్యంలో పోతనామాత్యుడు శ్రీమహా విష్ణువు కరవైభవాన్ని వర్ణించడానికి లక్ష్మీదేవి కొప్పునే ఆశ్రయించాల్సి వచ్చింది. ‘అంభోజతాక్షి వేణిన్ హరువు గనిన రోమాతి సౌభాగ్యమెంతే... చమిరి యొనరుపన్ చక్కనౌ తీవెయోనాన్’ అంటూ కొప్పరపు కవులు ఒక అవధానంలో వేణీసౌందర్యాన్ని వర్ణించారు. ‘కలుగక యిచ్చెడు మనుజులు/ తలవెండ్రుకలంత మంది తర్కింపంగా/ కలిగియు నీయని యధములు/ మొల వెండ్రుకలంత మంది మోహన రంగా’ అని ఒక పూర్వకవి సంపన్న లోభుల మీద కసిదీరా తన అక్కసును వెళ్లగక్కాడు. తల మీది వెంట్రుకలకే కాదు, పురుషుల మీసాలకు, గడ్డాలకు కూడా మన భాషా సాహిత్యాల్లో తగిన ప్రశస్తి ఉంది. మీసాలను పౌరుష చిహ్నాలుగా గుర్తిస్తారు. అందుకే ‘మీసము పస మగ మూతికి’ అన్నాడు చౌడప్ప. వైదికులకు మీసాలు పెంచే ఆచారం లేకపోయినా, తిరుపతి వేంకట కవులు మీసాలను పెంచారు. ఈ జంటకవులు మీసాలను పెంచడాన్ని కొందరు ఆక్షేపిస్తే, ‘దోసమ టంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమే/ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా/ రోసము గల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని ఈ/ మీసము దీసి మీ పాద సమీపములన్ తలలుంచి మ్రొక్కమే!’ అని సవాలు విసిరారు. అదీ వారి కవన పౌరుషం! కేశ సంరక్షణ కోసం స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులు నానా తంటాలు పడటం శతాబ్దాల నుంచే ఉంది. తలకట్టు నిండుగా కనిపించడానికి వివిధ సుగంధ తైలాలను వాడేవారు. గాంభీర్యా నికి గురుతైన మీసకట్టు ఏపుగా పెరగడానికి కూడా రకరకాల పద్ధతులు పాటించేవారు. ‘అంబలి తాగేవాడొకడైతే మీసాలెత్తేవాడు ఇంకొకడు’, ‘మింగ మెతుకు లేదు గాని, మీసాలకు సంపెంగ నూనె’ వంటి సామెతలు సమాజంలోని డాంబిక ఆడంబరాలను బయటపెడతాయి. బ్రిటిష్ హయాంలో ఆధునిక పోకడలు మొదలయ్యాక మన దేశంలో అలంకరణల పద్ధతుల్లో చాలా మార్పులే వచ్చాయి. తల వెంట్రుకలను, మీసకట్టును చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో తీర్చిదిద్దుకోవడం మొదలైంది. ఈ మార్పులు మొదలైన కొత్తలో కొంత విచిత్రంగా చూసేవారు. అప్పటికింకా సంప్ర దాయాలను వదులుకోని ఛాందసులు ఈ విచిత్ర కేశాలంకరణలను ఆక్షేపించేవారు. ‘గొంగడి పురుగు కట్టింగు మీసాల వాడు/ గంపశ్రాద్ధపు తలకట్టువాడు’ అని మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి ‘కన్యాశుల్కం’లోని గిరీశం పాత్రను వర్ణిస్తూ ఒక పద్యం రాశారు. తలకు చక్కగా నూనె పట్టించి, నున్నగా దువ్వుకోవడం పెద్దమనుషుల లక్షణంగా ఉండేది. ఆ రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అలా నున్నగా దువ్విన తలకట్టుతో ఉండేవారు. ఆయన తలకట్టు సొగసును– ‘ఈగ వ్రాలిన గాని వేగ జారెడునట్లు మువ్వంపు కురులను దువ్వినాడు/... చెవుల సందున గిర జాలు చిందులాడ మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త/ టంగుటూరి ప్రకాశము రంగు మెరయ ధవళగిరి తీర్థమునకు తరలివచ్చె’ అంటూ చిలకమర్తివారు వర్ణించారు. ఆ రోజులే వేరు. సామాజిక, రాజకీయ జీవితాల్లో సరసత ఉండేది. ఇప్పుడు రాజకీయాలు బొత్తిగా మొరటుదేరిపోయాయి. అయితే, ఇప్పటికీ రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తరచుగా కేశ ప్రస్తావన వస్తూనే ఉంటుంది గాని, వారి ప్రసంగాల్లో కేశాలకు సంబంధించి దొర్లే ముతక పదాలు జనాల చెవులను చిల్లులు పొడుస్తుంటాయి. అయినా, గొంగట్లో భోంచేసేటప్పుడు వెంట్రుకలను ఏరుకోక తప్పదు కదా! -
అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!
ఒకప్పుడు యాభైఏళ్లు దాటిన వారికే తెల్లజుట్టు వచ్చేది కానీ ఇప్పుడు చాలామందికి పాతికేళ్లకంటే ముందే తెల్లజుట్టు వచ్చేస్తోంది. దాంతో ఉన్న వయసు కంటే పెద్దగా కనిపించడం, దానిని కప్పి పుచ్చుకోవడానికి తలకు రకరకాల హెయిర్ డైలు, షాంపూలు వాడటం... వాటిలోని రసాయనాల ప్రభావంతో సైడ్ ఎఫెక్టులు రావడం... వీటన్నింటి బదులు అసలు చిన్న వయసులోనే తెల్లజుట్టు ఎందుకు వస్తుందో చెబుతూ...దానిని నివారించడానికి తగిన సూచనలు, సలహాలతో కూడిన కథనం ఇది. చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి గల అనేక కారణాలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ప్రధానం. డైట్లో పోషకాల కొరత ఉండకూడదు. తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే విటమిన్ బి ఉండే ఆహారాలని పుష్కలంగా తినాలి. డైట్లో ఇవి కచ్చితంగా ఉండేవిధంగా చూసుకోవాలి. జుట్టు తెల్లగా మారుతుందంటే విటమిన్ బి లోపం ఉందని అర్థం చేసుకోండి. అంతేకాదు దీనివల్ల జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజువారీ ఆహారంలో విటమిన్ బి ఉందా లేదా అన్నదానిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హెల్తీ ఫుడ్స్ ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది. తెల్ల జుట్టును సహజంగా నల్లగా సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేయకపోతే అది జుట్టుకు హాని కలిగిస్తుంది. విటమిన్ బి సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు విటమిన్ బి6, విటమిన్ బి12 కూడా ఉండే ఆహారాలని తినాలి. శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా చిన్న వయస్సులోనే జుట్టు నెరుస్తుంది. కాయధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, ఆకుకూరలు, గోధుమలు, పుట్టగొడుగులు, బఠానీ, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో, చేపలు, మాంసం, చిలగడదుంప, సోయాబీన్, బంగాళదుంప, బచ్చలికూర, అరటి, బ్రకోలీ, బీన్స్ ప్రతిరోజు డైట్లో ఉండేలా చూసువడం వల్ల తెల్లజుట్టు సమస్యను వాయిదా వేయచ్చు. గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్‌ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. తలస్నానానికి తక్కువ గాఢత ఉన్న షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా పారదోలే వాటిలో కాఫీ పొడి ఒకటి. ఓ గ్లాసుడు నీళ్లలో ఒకటిన్నర చెంచాల కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. మీ తలకు సరిపడేటన్ని మందార ఆకులు తీసుకుని పేస్ట్ లా చేసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి జుట్టుకి అప్లయ్ చేసి 2 గంటల తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. హెర్బల్ హెన్నాలో బీట్ రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.హెన్నా పౌడర్ ను ఆముదంలో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లారిన తర్వాత దానిని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి. ఆ తర్వాత కుంకుడు కాయ లేదా శీకాయతో తలస్నానం చేయాలి. తెల్లజుట్టు ఉన్న వారు పెనంపై రెండు చెంచాల పసుపును వేసి వేడి చేసి నల్లగా మారేంత వరకు మాడ్చాలి. చల్లారిన తర్వాత దీనికి సరిపోయేంత కొబ్బరినూనె లేదా నువ్వులనూనెలో కలిపి తలకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉంటుంది. తల స్నానానికి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!) -
యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువతి పొట్టలో చుట్టుకుపోయి గొంతు వరకూ వ్యాప్తి చెందిన వెంట్రుకలను ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ సర్జరీ వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల యువతి వెంట్రుకలు చుట్టుకుని మింగుతుండేది. కొంతకాలానికి అవి పొట్టలో చుట్టుకుపోయి క్రమేణా గొంతులోకి వ్యాప్తి చెందాయి. దీంతో ఏమీ తినలేని, తాగలేని పరిస్థితుల్లో తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధితురాలు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తొలుత గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు పరీక్షించి ఎండోస్కోపీ ద్వారా తొలగించాలని ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో ఆమెకు శుక్రవారం సర్జన్లు దుర్గారాణి, చందన ప్రియాంక, గాయత్రి, ప్రవీణ్‌కుమార్‌లతో పాటు, ఎనస్థీషియన్లు ఏవీరావు, కిరణ్ బృందం శస్త్ర చికిత్స నిర్వహించారు. పొట్టలో చుట్టుకుపోయిన వెంట్రుకల చుట్టను తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.అప్పారావు మాట్లాడుతూ గొంతు వరకూ వ్యాప్తి చెందడంతో శస్త్ర చికిత్స క్లిష్టతరంగా మారిందన్నారు. ఈ తరహా కేసులను ట్రైకోబెజార్గా పిలుస్తామని, ఇలాంటి వాటిని చూడటం చాలా అరుదని చెప్పారు. -
దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి..
సాక్షి, హైదరాబాద్: తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఓ మహిళకు బ్యూటీ పార్లర్ షాక్ ఇచ్చింది. పొడవాటి కురుల కోసం ప్రయత్నించి ఉన్న జుట్టును పొగొట్టుకుంది. అందం కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ అబిడ్స్‌లోని బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. జుట్టును అందంగా చేస్తానని చెప్పిన బ్యూటిషియన్.. ముందుగా మహిళ హెయిర్ కొంచెం కట్ చేసింది. బాధిత మహిళ అభ్యంతరం చెబుతున్నా విన్నకుండా ఏదో హెయిర్ ఆయిల్ కూడా పూసారు. ఇంటికెళ్లిన తర్వాత ఆ మహిళ జుట్టు మొత్తం ఊడిపోయింది. జుట్టు ఊడిపోయిన భార్యను చూసి భర్త షాక్ అయ్యాడు. అందగా కనిపించాలనుకున్న తన భార్యకు వెంట్రుకలు ఊడిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆలుమగల మధ్య చిచ్చు పెట్టిన బ్యూటీ పార్లర్‌పై బాధితురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊడిపోయిన జుట్టును పట్టుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి.. బ్యూటీ పార్లర్ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, హెయిర్ కలర్ కోసం అబిడ్స్‌లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్‌కి వచ్చాను. స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని నా హెయిర్ మొత్తం కాలిపోయేలా చేసింది. పార్లర్ నిర్వహకురాలు సొంతంగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడతామన్నారు. అది వాడితే పూర్తిగా నా జుట్టు రాలిపోయింది. వాటర్ పెడితే.. దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు రాలిపోతుంది. క్వీన్ పార్లర్‌ను వెంటనే సీజ్ చేయాలి’’ అని ఆమె పేర్కొంది. -
సెలూన్‌కి వెళ్లే పని లేకుండా..మీ హెయిర్‌ని స్ట్రయిట్ చేసుకోండిలా..!
కర్లీ హెయిర్ అందమే వేరు. ఒక్కోసారి అది పొల్యూషన్ వల్లో మరే ఇతర కారణాల వల్లనో నిర్వీర్యంగా అయిపోతుంది. దువ్వినా దువ్వనట్లుగా చిందరవందరగా ఉంటుంది జుట్టు. వెంట్రుకలు రఫ్‌గా మారిపోయి చిక్కులు పడిపోతూ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అదీగాక కొందరికి స్ట్రయిట్‌గా కుచ్చుకుచ్చులుగా జాలు వారుతున్న జుట్టునే ఇష్టపడుతుంటారు. అందరూ సెలూన్‌కి వెళ్లి డబ్బులు పెట్టి మరి చేయించుకోవడం కుదరదు. ఒకవేళ చేయించినా మెయింటేన్ చేయించడం ఇబ్బంది. మళ్లీ మళ్లీ సెలూన్‌కి వెళ్తూ వారి చెప్పిన సెషన్లలో చేయించుకోవాల్సి కూడా ఉంటుంది. వాటన్నింటికి చెక్ పెట్టి జస్ట్ ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వాటితోనే ప్యాక్‌లు వేసుకుంటే ఈజీగా జుట్టు స్ట్రయిట్ అవ్వడమే గాక జుట్టుకి మంచి గ్రోత్ ఉండి కనీసం జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. నేచురల్‌గా చేసుకునే హోం ప్యాక్‌లు ఏంటంటే.. మనం ఇంట్లో ఉపయోగించే పాలే తీసుకోండి. జస్ల్ ఒక కప్పు పాలు ఓ గుడ్డు తీసుకోండి. మీ జుట్లు బాగా పొడవైతే ఇంకో కప్పు పాగు, మరో గుడ్డు తీసుకోండి. ఇక ఈ రెండిటిని బాగా మిక్స్ అయ్యేలా కలిపిం బ్రెష్‌తో జుట్టుకి ప్యాక్ వేసుకోండి. ఓ అరంగంట తర్వాతా మీకు నచ్చిన షాంపుతో కడిగేయండి. మీరే ఆశ్చర్యపోతారు ఎంత సిల్కిగా జాలు వారుతుంటుందో మీ జుట్టు. కలబంద గుజ్జు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుందని తెలిసిన విషయమే మీరు అరకప్పు కలబందను, అరకప్పు కొబ్బరి నూనెతో మిక్స్ చేసి గంటపాటు అలానే ఉంచి షాంపుతో కడిగేయండి. చిట్లిన జుట్టు సమస్య తగ్గడమే గాక స్ట్రయిట్ అవుతుంది. మరొకటి యాపిల్ సైడర్ వెనిగర్ సహజమైన క్లెన్సర్ అని పిలుస్తారు. జుట్టుకి అప్లై చేస్తే అది మురికిని పోగొట్టడమే కాకుండా జుట్టుని మృదువుగా చేస్తుంది. మూడు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను రెండు కప్పుల నీటిలో కలపండి. ముందుగా మీ జుట్టుని షాంపుతో కడిగేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అప్లే చేసి రెండు మూడు నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేసుకుండి. ఇలా తరుచుగా చేస్తే త్వరితగతిన మీ జుట్టు స్ట్రెయిట్ అవుతుంది. మొక్కజొన్న పిండి, కొబ్బరి పాల మిశ్రమాన్ని జుట్టుకి ప్యాక్‌లా వేసిన స్ట్రయిట్‌గా అవుతుంది. ఇవన్నీ వద్దు అంటే ఈ ప్యాక్‌ని ట్రై చేయండి ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచడమే గాక చక్కగా స్ట్రయిట్ అవ్వుతుంది. అప్పటికప్పుడూ పార్టీల సమయంలో మీ జుట్టు స్ట్రయిట్ అవ్వడానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ముందుగా ఈ ప్యాక్‌కి కావాల్సినవి: బియ్యం ఒక కప్పు కొబ్బరి ముక్కలు పావు కప్పు నీరు కప్పు నానబెట్టిన మెంతులు 3 చెంచాలు అలోవేరా జెల్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఓ చెంచా తయారీ విధానం: ముందుగా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి నానబెట్టండి. ఆ తర్వాత ఆ బియ్యాన్ని కడగకుండా అలానే ఉడికించండి. ఆ తర్వాత మిక్సి జార్లోకో ఉడికించిన బియ్యం, కొబ్బరిముక్కలు, అలోవేరా జెల్ వేసి మిక్సీ పట్టుకోండి. మెత్తటి పేస్ట్‌లా ఉండాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి.. ఓ గంట పాటు ఉంచుకోండి. ఆ తర్వాత జుట్టుని మైల్డ్ షాంపుతో కడిగేయండి. ఆరిన తర్వాత చూస్తే జుట్టు స్ట్రైయిట్‌గా కుచ్చులా ఉంటుంది. ఇలా రెగ్యూలర్‌గా చేస్తే మాత్రం జుట్టు స్ట్రెయిట్ అయ్యి, ధృఢంగా ఉంటుంది. (చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!) -
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. కర్లీ హెయిర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
సినిమాల తోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే హిరోయిన్లో ఒకరు అనుపమ పరేమశ్వరన్. ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో పాటు సైరన్ (తమిళ్) సినిమా తోపాటు ఒక మలయాళ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. తన కర్లీ హెయిర్‌తో కుర్రకారుకి కునుకు లేకుండా చేసే ఈ మలయాళం భామ తన అందమైన శిరోజాల వెనుక దాగి ఉన్న బ్యూటీ సీక్రేట్ని షేర్ చేసుకుంది. ఈ మేరకు అనుమ మాట్లాడుతూ..ఉంగరాల జుట్టును మేనేజ్ చేయడం చాలా కష్టం కదా.. మరి మీరెలా మేనేజ్ చేస్తుంటారు అని చాలామంది అడుగుతుంటారు నన్ను! నిజమే కర్లీ హెయిర్‌ని మేనేజ్ చేయడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడతాను. వీలైనప్పుడల్లా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తలను మసాజ్ చేసుకుంటాను. గ్లోయింగ్ స్కిన్ విషయానికి వస్తే.. రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ముఖానికి అప్లయ్ చేసి.. సున్నితంగా మసాజ్ చేసుకుంటాను. అలా ఒక పదిహేను నిమిషాలు ఉంచేసి.. ముఖం కడుక్కుంటాను.’ – అనుపమ పరమేశ్వరన్ (చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!) -
ఆమెకు 4 అడుగుల 7 అంగుళాల కురులు.. 100 ప్రపోజల్స్, రూ.2.6 కోట్ల ఆఫర్!
మన మధ్యలో కనిపించే కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఒకరికి స్కిన్ టోన్ బాగుంటే, మరొకరు మంచి ఎత్తులో ఉంటారు. ఈ కోవకు చెందినదే ఇంగ్లండ్‌కు చెందిన జాస్మిన్ లార్సన్. ఈమె నిజజీవితంలో డిస్నీప్రిన్సెస్. జనం ఆమె కురులకు ఫిదా అయిపోతుంటారు. ఈ నేపధ్యంలోనే ఆమెకు లెక్కలేనన్ని పెళ్లి ప్రపోజల్స్ వస్తుంటాయి. 22 ఏళ్ల జాస్మిన్ 2017 నుంచి తన కురులను పెంచడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె ఆకర్షణీయమైన కురుల పొడవు 4 అడుగుల 7 అంగుళాలు. ఈ పొడవైన కురులు ఆమె మోకాళ్ల వరకూ ఉంటాయి. తన కురులను చూసి ముచ్చటపడిన 100 మందికిపైగా కుర్రాళ్లు తనకు ఆన్లైన్లో ప్రపోజల్స్ పంపారని జాస్మిన్ ఆనందంతో పొంగిపోతూ చెప్పింది. తన కురులను కట్ చేయించుకుంటే £250,000 (రూ. 2.6 కోట్లు) ఇస్తామంటూ కూడా ఆఫర్లు వచ్చాయని ఆమె తెలిపారు. దీనికి తాను ఒప్పు కోలేదని, తన జట్టు కత్తిరించి, దానిని ఎవరికో పంపాలని అనుకోవడం లేదని, ఈ కురులను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. బ్రిస్టల్‌లో ఉంటున్న జాస్మిన్ సోషల్ మీడియాలో తన కురులకు చెందిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ప్రపంచంలోని చాలామందిని ఇవి ఆకర్షిస్తుంటాయని, ముఖ్యంగా ధనవంతులు తన కురులకు ఆకర్షితులవుతున్నారని జాస్మిన్ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాస్మిన్‌కు 10వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. పలు బ్రాండ్స్ ఆమెతో కొలాబ్రేషన్కు సంప్రదిస్తుంటాయి. కాగా జాస్మిన్ ఒక కంపెనీలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇది కూడా చదవండి:11 రోజుల ప్రేమ.. 10 వేల కి.మీ. ప్రయాణం.. సరిహద్దులు చెరిపేసిన ప్రేమ కథ -
టోల్ గేట్ ఉద్యోగినిపై దాడి.. జుట్టు పట్టి లాగి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. టోల్ పేమెంట్ చేయాలని అడిగినందుకు టోల్ ఫ్లాజా ఉద్యోగినిపై ఓ మహిళ దాడి చేసింది. జుట్టు పట్టుకుని కింద పడేసింది. ఈ ఘటన జాతీయ రహదారి 91పై జరిగింది. సీసీటీవీ ఆధారంగా రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. టోల్ గేట్ వద్ద ఓ కారు వచ్చి ఆగింది. టోల్ ఫ్లాజా సమీప గ్రామస్థులమని చెబుతూ.. పంపించవలసిందిగా కోరారు. ఆ గ్రామస్థులేనడానికి ఏదైనా ఆధారం చూపించమని టోల్ ఫ్లాజా ఉద్యోగిని వారికి అడిగింది. దీంతో కారులో నుంచి బయటకు దిగిన మహిళ.. సదరు ఉద్యోగినితో వాగ్వాదానికి దిగింది. అనంతరం క్యాబిన్లోకి వచ్చి ఉద్యోగిని జుట్టు పట్టుకుని దాడి చేసింది. బాధితురాలిని బూతులు తిడుతూ కింద పడేసింది. సహచర ఉద్యోగులు చొరవ తీసుకుని ఆ మహిళను నిలువరించే ప్రయత్నం చేశారు. Woman's Brazenness Caught On Camera: Toll Plaza Employee Threatened, Hair Pulled https://t.co/hGIn4pSlSO pic.twitter.com/hMjzuID9bX — NDTV (@ndtv) July 17, 2023 ఈ ఘటనపై టోల్ ఫ్లాజా యాజమాన్యం సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ టోల్ ఫ్లాజాకు సమీప గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఐడీ కార్డు అడిగిన నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం ప్రారంభమైనట్లు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్! -
ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్!
ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. వైద్య శాస్త్రంలో కూడా మానవుడు చాలా పురోగతి సాధించాడు. ఈ క్రమంలో గతంలో సాధ్యం కానివాటిని కూడా సాధ్యపడేలా చేస్తున్నారు వైద్యులు. ఇటీవల కొందరు తమ రూపాన్ని మార్చుకోవడానికి తరచుగా ప్లాస్టిక్ సర్జరీని ఎంచుకుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ శస్త్రచికిత్సలు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల, 20 ఏళ్ల మహిళ ముక్కుపై కుక్క కొరికింది. అందుకే ఆమె శస్త్రచికిత్స చేయించుకుంది, అయితే ఆపరేషన్ చేసిన ప్రదేశంలో వెంట్రుకలు పెరగడం ప్రారంభించాయి. అసలు అలా ఎందుకు జరిగిందంటే.. గత సెప్టెంబరులో ట్రినిటీ రౌల్స్ అనే యువతి తన తండ్రిని కలవడానికి వెళ్లగా.. అక్కడ ఒక కుక్క దాడి చేసి ఆమె ముక్కును కొరికింది. ఈ ఘటనలో ట్రినిటి తన ముక్కు కొనను కోల్పోయింది. ముఖం, చెవి, ముక్కు మీద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కుక్క దాడి కారణంగా ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో డాక్టర్లు వెంటనే ఆమె ముఖాన్ని పునర్నిర్మించడానికి అనేక సర్జరీలు చేశారు. కానీ స్కిన్ గ్రాఫ్ట్ అని పిలువబడే ఒక ఆపరేషన్ ఆమె ముఖంలో భారీ మార్పులకు దారితీసింది. ప్రస్తుతం ఇప్పుడేమో ఆమె కోలుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటోంది. ఆపరేషన్‌లో భాగంగా వైద్యులు ఆమె నుదిటిపై ఉన్న ప్రాంతం నుండి చర్మాన్ని తీసి ఆమె ముక్కుపైకి అమర్చారు. ఇది ఆమె ముఖంలో సాధారణ రూపాన్ని పునరుద్ధరించింది, కానీ కొన్ని రోజుల్లో, ఆమె సమస్య మరింత తీవ్రమైంది. దీని వల్ల ఆమె ముక్కుపై వెంట్రుకలు మొలవడం మొదలైంది. ప్రస్తుతం ఈ వెంట్రుకల తొలగింపుకు ట్రినిటీ చికిత్స తీసుకుంటోంది. ఇటీవల ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన బాధను పంచుకుంది ట్రినిటి. నెటిజన్లు కూడా ట్రినిటి ఫోటోని చూసి ఆశ్చర్యపోతున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు. చదవండి: Gurdeep Kaur Chawla: ప్రధాని విదేశానికి వెళ్తే.. ఈమె ఉండాల్సిందే -
తలస్నానానికి ముందు ఇలా చేయండి.. జుట్టు రాలడం తగ్గిపోతుంది
జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే పెరుగు మంచి ఫలితాన్నిస్తుంది. ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. జుట్టును చిక్కులేకుండా దువ్వి పెరుగును ఒక్కొక్క స్పూన్ తల మీద వేస్తూ వేళ్లతో మర్దన చేయాలి. తలంతా ప్రతి వెంట్రుక కుదురుకూ పెరుగు పట్టాలన్నమాట. ఓ అరగంట తర్వాత వేడినీటితో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తుంటే జుట్టు చిట్లిపోకుండా మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. వేళ్లతో తలంతా మర్దన చేసుకోవడం సాధ్యం కాకపోతే జుట్టు కుదుళ్లకు పెరుగును పట్టించిన తర్వాత గుండ్రటి పళ్లున్న దువ్వెనతో పది నిమిషాల సేపు దువ్వితే సరిపోతుంది. జుట్టు రాలుతుంటే బంగాళాదుంప రసం బాగా పని చేస్తుంది. బంగాళాదుంపను తురిమి రసం తీసుకోవాలి. అరకప్పు రసంలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించాలి. జుట్టుకు పైన రాసి సరిపుచ్చకూడదు. కేశాల మొదళ్లకు పట్టేలా రాసి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. రెండు గంటల తర్వాత వేడి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే జుట్టురాలడం తగ్గిపోతుంది. -
శభాష్ స్మృతి
ఒడిశా: కేన్సర్ రోగుల కోసం తన పొడవైన జట్టును దానంచేసి కొరాపుట్‌కు చెందిన యువతి ఔదార్యాన్ని చాటుకుంది. కొరాపుట్ జిల్లా కేంద్రానికి చెందిన స్మృతి సుధా సాహు భువనేశ్వర్‌లో ఉన్నత విద్యను అభ్యనిస్తూ, సివిల్స్ కోసం శిక్షణ పొందుతోంది. ఇటీవల కేన్సర్ పీడిత మహిళల సమస్యలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కేన్సర్ మహిళా రోగులకు కీమోథెరఫీ నిర్వహించిన తర్వాత జట్టు ఊడిపోతుంది. దీంతో వారికి విగ్గు అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి మహిళల కోసం సోప్వ అనే స్వచ్ఛంద సంస్థ మహిళల నుంచి జట్టును విరాళంగా సేకరిస్తుంది. దీంతో వెంటనే కేన్సర్ పేషెంట్లకు కనీస తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో స్మృతి ఆ సంస్థను సంప్రదించింది. సన్నిహితులు, సహచర విద్యార్థుల సమక్షంలో తన జట్టును విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒడిశాలో సుమారు 50 వేల మంది కేన్సర్ బాధితులు ఉన్నారన్నారు. చికిత్స సమయంలో జుట్టు రాలిపోతే మానసికంగా వేదనకు గురవుతారని పేర్కొన్నారు. అలాంటి వారికి జట్టు ఇవ్వడం వలన వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. తన నిర్ణయం తల్లిదండ్రులకు చెబితే సగం జుట్టు కంటే, పూర్తిగా ఇవ్వాలని సూచించి మద్దతు తెలిపారని ఆనందం వ్యక్తం చేసింది. -
శభాష్ సిస్టర్స్
రాజుపాళెం : ఆడపిల్లలు తమ జడలను అపురూపంగా చూసుకుంటారు. ఒక్క వెంట్రుక రాలిపోతున్నా ఎంతో మనోవేదనకు గురవుతారు. క్యాన్సర్ బారిన పడిన వారికి కీమోథెరపీ ఇవ్వడం కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి గుండు ఏర్పడుతుంది. ఇలాంటి వారికి తల వెంట్రుకలు దాదాపుగా తిరిగి రావు. ఒక వైపు క్యాన్సర్ మహమ్మారి సోకిందనే వేదన.. మరోవైపు ఎంతో అపురూపంగా చూసుకున్న తలవెంట్రుకలు పోయి అందవిహీనంగా మారామనే బాధ వారిని తీవ్రంగా కలచి వేస్తుంది. ఇలాంటి వారికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు విగ్గులు తయారు చేసి ఉచితంగా అందిస్తున్నాయి. క్యాన్సర్ పేషెంట్ల కోసం మేము సైతం అంటూ అక్కా చెల్లెళ్లు తమ పొడవాటి జుట్టును దానం చేశారు. పుట్టిన రోజు సందర్భంగా.. రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన అప్సానా, సుహానా అక్కాచెల్లెళ్లు. క్యాన్సర్ పేషెంట్ల కోసం పలువురు యువతులు, బాలికలు జుట్టు దానం చేసిన వీడియోలను వారు ఇటీవల సోషల్ మీడియాలో చూశారు. చూసిందే తడవుగా తాము కూడా తమ వంతుగా క్యాన్సర్ బాధితులకు జుట్టు ఇచ్చి సాయపడేందుకు నిర్ణయించుకున్నారు. సుహానా జన్మదినం సందర్భంగా శుక్రవారం చెల్లెలుతోపాటు అక్క అప్సానా కూడా జుట్టును దానం చేయడం విశేషం. కత్తిరించిన ఇరువురి జడలను ప్రొద్దుటూరులోని స్టార్ ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజ్‌కు అందజేశారు. చిన్నారుల్లో కలిగిన మంచి ఆలోచనను ఆయన అభినందించారు. కురులను క్యాన్సర్ పేషెంట్ల కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థకు పంపనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వీరి మాదిరే జుట్టును దానం చేసి క్యాన్సర్ పేషెంట్లకు సాయపడాలని ఆయన కోరారు. -
హెయిర్ కేర్ టిప్స్
ప్రతి రోజూ పది నుంచి పదిహేను నిమిషాలపాటు తలకు మసాజ్ చేసినట్లయితే జుట్టు కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడం తగ్గుతుంది. రోజూ తలస్నానం చేసేవాళ్లు తల రుద్దుకునేటప్పుడే పది నిమిషాల సేపు మసాజ్ చేసినట్లు రుద్దితే రెండు పనులూ అవుతాయి. ఉసిరిక పొడి, కుంకుడుకాయ, శీకాయపొడి అన్నీ సమపాళ్లలో అంతా కలిసి రెండు టేబుల్‌స్పూన్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఇందులో కోడిగుడ్డు సొన కలిపి అవసరమైతే కొద్దిగా నీటిని కలిపి పేస్టు చేసుకుని తలంతా పట్టించి పది నిమిషాల సేపు మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయిన తర్వాత ఇరవై నిమిషాలకు కడిగేయాలి. అవసరమనిపిస్తే కొద్దిగా గాఢత తక్కువగా ఉన్న షాంపూ వాడవచ్చు. వారానికి కనీసం మూడుసార్ల చొప్పున నెల రోజుల పాటు ఈ ట్రీట్మెంట్ చేస్తే హెయిర్‌లాస్‌ను పూర్తిగా నివారించవచ్చు. హెయిర్‌లాస్‌ను కంట్రోల్ చేయడానికి ఆముదం, బాదం నూనె చక్కటి కాంబినేషన్. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకుని గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయిన అరగంటకు తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిఫలితం ఉంటుంది. ఆముదం, బాదం బదులుగా కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు. రోజూ పది నిమిషాల సేపు ఆల్మండ్ ఆయిల్‌తో తలకు మసాజ్ చేస్తే జుట్టు రాలదు. -
బాలిక కడుపులో కిలో వెంట్రుకలు
గుడివాడటౌన్: కృష్ణాజిల్లా గుడివాడలో కడుపునొప్పితో బాధపడుతున్న బాలికకు శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న సుమారు కిలో వెంట్రుకలను తొలగించారు. ఈ శస్త్రచికిత్స వివరాలను డాక్టర్ పొట్లూరి వంశీకృష్ణ మంగళవారం మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన బాలిక (12) దీర్ఘకాలంగా కడుపు నొప్పి, వాంతులు, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతోంది. కుటుంబసభ్యులు ఆమెను గుడివాడలోని శ్రీరామా నర్సింగ్‌హోంలో చేర్పించారు. వైద్యులు ఎండోస్కొపి, స్కానింగ్‌ల ద్వారా కడుపులో నల్లని గడ్డ ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం శస్త్రచికిత్స చేసి దాన్ని వెలికితీశారు. దాన్ని వెంట్రుకల గడ్డగా గుర్తించారు. దీన్ని వైద్య విధానంలో ట్రైకోబీజోఆర్ అంటారని, చిన్న వయసు నుంచి కొందరికి వెంట్రుకలు తినే అలవాటు ఉంటుందని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. కొద్ది మొత్తంలో ఐతే బయటకు వస్తాయని, ఈ బాలిక ఎక్కువగా వెంట్రుకలు తినడానికి అలవాటుపడిందని, ఇవి కడుపులో పేరుకుపోయి జీర్ణకోశంలో పెద్ద గడ్డలా కట్టేశాయన్నారు. సుమారు కిలో బరువున్న వెంట్రుకలు జీర్ణాశయాన్ని నింపివేయడంతో తిన్న అన్నం ఇమడక బయటకు రావడం, మిగిలిన కొద్ది ఆహారం జీర్ణంగాక శక్తి కోల్పోవడం జరుగుతోందని చెప్పారు. దీంతో బాలిక అనారోగ్యం పాలైనట్టు తెలిపారు. రక్తహీనత కలిగినవారు ఈ విధమైన తిండికి అలవాటుపడతారని, తల్లిదండ్రులు గమనించాలని ఆయన సూచించారు. -
బస్సుకిందపడ్డ మహిళ.. చక్రంలో ఇరుక్కున్న జుట్టు.. అంతా క్షణాల్లో..
తిరువనంతపురం: కేరళ కొట్టాయంకు చెందిన ఓ మహిళ జీవితంలో మిరాకిల్ జరిగింది. బస్సు ఢీకొట్టి దాని కిందపడినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈమె జుట్టు బస్సు చక్రంలో ఇరుక్కుపోగా.. స్థానికులు చేశారు. తాను ఇంకా బతికి ఉన్నానంటే నమ్మలేకపోతున్నానని మహిళ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతా క్షణాల్లో జరిగిపోయిందని చెప్పింది. కొట్టాయం సమీపంలోని చింగవరానికి చెందిన ఈ మహిళ పేరు కే అంబిలి. స్కూల్ బస్సులో హెల్పర్‌గా పనిచేస్తోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ చిన్నారిని దాటించే సమయంలో ఆర్టీసీ బస్సు ఈమెను ఢీకొట్టింది. దీంతో ఆమె బస్సుకింద పడిపోయింది. డ్రైవర్ వెంటనే సడెన్ బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు బస్సు ముందు చక్రం ఆమెపైనుంచి వెళ్లలేదు. అయితే జుట్టు మాత్రం చక్రంలో ఇరుక్కుపోయింది. స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని మహిళకు సాయం చేశారు. ఓ బార్బర్‌ను పిలిపించారు. అతను బస్సు కిందకు వెళ్లి చక్రంలో ఇరుక్కున్న మహిళ జుట్టును కత్తిరించాడు. దీంతో మహిళ క్షేమంగా బయటపడింది. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. చదవండి: విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి బెయిల్.. -
ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా జుట్టు ఊడి..
భారత సంతతి టీనేజ్ అమ్మాయికి దారుణమైన ప్రమాదం బారిన పడింది. ఏకంగా నెత్తిపై జుట్టుతో సహా చర్మం ఊడొచ్చి.. వెన్నుకి సైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకెళ్తే..దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో గేట్‌వే మాల్లో భారత సంతతికి చెందిన క్రిస్టినా అనే టీనేజ్ అమ్మాయి గో కార్ట్ అనే స్పోర్ట్స్ కారుని నడుపుతోంది. అనుహ్యంగా ఆమె జుట్టు ఆ కారు చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో తలపై ఉన్న హెల్మట్ పడిపోయి.. నెత్తిమీద ఉన్న జుట్టుతో సహా చర్మం ఊడొచ్చేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. అంతేకాదు ఈ ప్రమాదంలో ఆమె వెన్నుకి కూడా తీవ్రగాయాలయ్యయి. ఈ ఘటన డర్బన్‌లోని ప్రముఖ గేట్ వే మాల్లోని ఎంటర్టైన్మెంట్ సెంటర్లో గత బుధవారం జరిగింది. కానీ క్రిస్టినా ఇప్పటికీ ఐసీయూలోనే చికిత్స పొందుతోంది. ఈ మేరకు బాధితురాలి తండ్రి వెర్నాన్ గోవేందర్ మాట్లాడుతూ...రేసింగ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియనిబంధనలు పాటించిందని అన్నారు. కానీ ఆ గో కార్ట్(స్పోర్ట్స్) కారులోని పరికరాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు. ఆమె తన జుట్టును కూడా పోనీటైల్లా కట్టేసిందని చెబుతున్నారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం తక్షణ సాయం అందించడంలో విఫలమైందని చెప్పారు. ఆ సమయంలో తన కూతురు వద్ద తన 13 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని ఈ ఘటన గురించి చెప్పేందుకు గో కార్ట్ కార్యాలయానికి కూడా వెళ్లాడని చెప్పారు. ఐతే అప్పటికే కార్యాలయాన్ని మూసేసి, వారంతా వెళ్లిపోయినట్లు వాపోయారు. రేసింగ్ కోర్సులో భాగంగా తన కూతురు క్రిస్టినా గో కార్ట్‌ని నేర్చుకుంటుండగా.. స్పిన్ అవుతున్న సమయంలో గో కార్ట్‌లోని చట్రంలో ఆమె జుట్లు ఇరుక్కుపోయి ఈ ఘోర ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మరొకరెవరూ.. ఇలాంటి ఘోరమైన ప్రమాదం బారినపడకూదని..సదరు గోకార్ట్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి తండరి గోవేందర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సదరు యాక్షన్ కార్టింగ్ గేట్‌వే యజమాని స్టీవెన్ పూల్ మాట్లాడుతూ.."రేస్ జరుగుతున్న ట్రాక్ వద్ద అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం. ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి అనుహ్య ఘటన జరగలేదు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని, కానీ ఆ సమయంలో బాధితురాలు క్రిస్టినా మామ చాలా దూకుడుగా ప్రవర్తించాడు. మాకు ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉంది. క్లైయింట్స్ అందరికీ సంరక్షణ పద్ధతులకు సంబంధించిన రేసింగ్ వీడియోని చూపిస్తాం. అలాగే కార్ట్‌ని ఎలా నడపాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేదానిపై కూడా మాకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆఖరికి ఇలాంటివి చేసేటప్పుడూ..జుట్టును ఎలా కట్టుకోవాలో కూడా పూర్తిగా వివరిస్తాం. ఐతే ఒకప్పుడూ ఈ రేసింగ్ నేర్చుకుంటున్న వాళ్లకి తమ సిబ్బందే జుట్టును దగ్గరుండి ముడివేసి కట్టేదని, కానీ తల్లిదండ్రుల అయిష్టత చూపడం తోపాటు ఫిర్యాదుల చేయడంతో వారి వ్యక్తిగతానికే వదిలేశామని" వివరించాడు స్టీవెన్ పూల్. (చదవండి: భార్య పిల్లలను చంపేందుకు పక్కా ప్లాన్? కొండపై నుంచి కారును అమాంతం..) -
విచిత్రమైన అలవాటు! తన జుట్టును తానే తింటున్న బాలిక!
చాలమందికి పలు రకాలు విచిత్రమైన హ్యబిట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి. మన అలవాట్లును మన పెద్దలు లేదా తల్లిదండ్రులు గమనించి అవి మంచివో లేక చెడ్డవో వివరించి చెప్పకపోతే ఇక్కడ ఉన్న బాలిక మాదిరి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు. వివరాల్లోకెళ్తే...చైనాకు చెందిన 14 ఏళ్ల బాలికకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే తన జుట్టును తానే తింటుంది. ఐతే దీన్ని ఆమె ఇంట్లో వాళ్లు గమనించకపోవడంతో అదే పనిగా చాలా ఏళ్ల నుంచి తన జుట్టును తానే తింటోంది. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె ఆహారం తీసుకోలేనంత దారుణమైన స్థితికి వచ్చేసి నీరసంగా తయారైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆమె కుటుంబసభ్యులు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో...ఆమె కడుపు మొత్తం ఏకంగా మూడు కిలోల జుట్టుతో నిండిపోయిందని, అందువల్లే ఆమె ఆహారం తీసుకోలేకపోతుందని అన్నారు. ఆ తర్వాత ఆ బాలికకు వైద్యులు సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి ఆ ముడు కిలోల హెయిర్ బాల్(ఉండలుగా ఉన్న జుట్టు)ని తీసేశారు. ఈ మేరకు జియాన్ డాక్సింగ్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ షిహై మాట్లాడుతూ...ఆ బాలిక ఆహారం తీసుకులేని పరిస్థితి ఏర్పడటంతోనే మా వద్దకు వచ్చింది. అసలు ఆమె పొట్టలో ఆహారం పట్టేందుకు అవకాశం లేకుండా జుట్లుతో నిండిపోయిందని, ఆఖరికి ఆమె ఆహార ప్రేగు కూడా మూసుకుపోయిందని చెప్పారు. ఆ బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటంతో ఆమె అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరుగుతుందన్నారు. దీంతో వారు ఆమె విచిత్రమైన అలవాటుని గుర్తించలేకపోయారు. ఆ బాలిక పికా అనే విచిత్రమైన డిజార్డర్‌తో బాధపడుతోందని చెప్పారు. ఇలాంటి సమస్యతో బాధపడే చిన్నారులు, కాగితాలు, సుద్ధ ముక్కలు వంటి తినకూడని వాటిని ఆహారంగా తింటుంటారని చెబుతున్నారు. అంతేగాదు తమ జుట్టును తామే తినడాన్ని రాంపూజ్ సిండ్రోమ్‌గా వ్యవహిరస్తారని చెప్పారు. ఇది ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆ చిన్నారి కూడా తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల చాల ఏళ్లుగా మానసిక సమస్యలతో బాధపడి ఉండవచ్చని, అందువల్లే ఆమె ఈ విచిత్రమైన అలవాటుకి అడిక్ట్ అయినట్లు వైద్యుడు షిహై చెప్పారు. (చదవండి: డార్విన్ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...) -
జుట్టు పట్టుకుని ఈడ్చేసిన నర్సు.. వీడియో దుమారం
లక్నో: ఒక మహిళా పేషంట్‌కి ఇంజక్షన్ ఇచ్చేందుకు ఒక నర్సు చాలా దురుసుగా ప్రవర్తించింది. ఆమె జుట్టు పట్టుకుని బలవంతంగా బెడ్‌పై పడుకోబెట్టి ఇంజెక్షన్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్మాధ్యమంలో వైరల్ కాగా, నర్సు తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సీతాపూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ఆస్పత్రి అధికారి స్పందించారు. రోగిని అక్టోబర్ 18న ఆమె బంధువులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆ పేషంట్ ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో హఠాత్తుగా హింసాత్మకంగా ప్రవర్తించడం ప్రారంభించింది. తన గాజులు పగలు కొట్టుకుని, బట్టలు చించేసుకుంది. దీంతో అదే వార్డులో ఉన్న ఇతర మహిళా పేషంట్లు భయాందోళనలకు గురయ్యారు. సదరు పేషంట్ని కంట్రోల్ చేసే నిమిత్తం అలా నర్సు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆ తదనంతరమే పోలీసులకు సమాచారం అందించామని వెల్లడించారు. ఆమెను అదుపుచేయడానికి నర్సు అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. నర్సు దురుసుగా ప్రవర్తించిందంటూ వస్తున్న ఆరోపణలను డాక్టర్ సింగ్ తోసిపుచ్చారు. सीतापुर जिला अस्पताल से हैरान करने वाला वीडियो आया सामने,स्टॉफ नर्स एक महिला मरीज की चोटी पकड़कर बेड पर पटकती नजर आई,वीडियो वायरल.@dm_sitapur @myogiadityanath @CMOfficeUP @brajeshpathakup#UttarPradesh #Sitapur#सीतापुर @abcnewsmedia pic.twitter.com/WhPaZUHbpx — ASHISH YADAV (@AshishYadavknp) October 28, 2022 (చదవండి: -
బాలిక కడుపులో వెంట్రుకల ముద్ద
ఆరిలోవ(విశాఖ తూర్పు): తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్న బాలికకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి స్వస్థత చేకూర్చారు వైద్యులు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో ఆధునిక పద్ధతిలో ఈ సర్జరీ చేశారు. విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాలివి.. రాజమండ్రికి చెందిన 13 ఏళ్ల బాలిక కొద్ది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడేది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకువెళ్లినా తగ్గకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 19న విశాఖలో విమ్స్‌కు తీసుకు వచ్చారు. ఇక్కడి వైద్యులు ఆ బాలికకు ఎండోస్కోపీ చేసి కడుపు లోపల వెంట్రుకలతో కూడిన పదార్థం ముద్దగా ఉన్నట్లు గుర్తించారు. దీనిని ట్రైకోబెజార్ వ్యాధిగా నిర్థారించారు. దీంతో ఈ నెల 23న లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి బాలిక కడుపులో ఉన్న వెంట్రుకలతో ఉన్న 300 గ్రాముల పదార్థాన్ని తొలగించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించారు. అరుదైన శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న బాలికను శనివారం డిశ్చార్జి చేశారు. 50 ఏళ్లలో 68 మందికి మాత్రమే.. ఇలాంటి వ్యాధి అరుదుగా వస్తుందని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. 50 ఏళ్లలో దేశంలో 68 మందికి మాత్రమే ఈ తరహా శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. విమ్స్‌లో చిన్నారికి జరిగిన సర్జరీ 68వది అని తెలిపారు. సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులను అభినందించారు. బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేసి తమ కుమార్తె ప్రాణాలను కాపాడారని విమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ స్రవంతి బృందం, విమ్స్ ఆర్ఎంవో డాక్టర్ విజయకుమార్ పాల్గొన్నారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
జుట్టును ఎంత దువ్వినా మాట వినదు.. ఈ వ్యాధికి చికిత్స ఉందా?
ఫొటో చూడండి. పిల్లాడి జుట్టు గమ్మత్తుగా ఉంది కదా. ఏ హెయిర్ స్టైలిస్టో కానీ భలే పనిమంతుడు.. బాగా సెట్ చేశాడు అనుకుంటున్నారు కదా. కానీ ఇది మనుషులు సెట్ చేస్తే వచ్చేది కాదు. వెంట్రుకలకు వచ్చే వ్యాధి వల్ల జుట్టు ఇలా తయారైంది. దీన్ని అన్ కోంబబుల్ హెయిర్ సిండ్రోమ్ (యూహెచ్ఎస్) అంటారు. జన్యుప రమైన సమస్యలతో ఇలాంటి సమస్య వస్తుంటుంది. ప్రతి పది లక్షల మందిలో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా 3–12 ఏళ్ల చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. ఈ సమస్య ఉన్న వాళ్ల జుట్టును ఎంత దువ్వినా చెప్పిన మాట వినదు. పొలుసులుగా నిటారుగా నిలబడి ఉంటుంది. మెల్లమెల్లగా రాలిపోతుంటుంది. ఇలాంటి వాళ్ల జుట్టులో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. మామూలు మనుషుల వెంట్రుకల మొనలు స్థూపాకారంలో ఉంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ల వెంట్రుకలు త్రిభుజాకారంలో మారిపోతాయి. చదవండి👉ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. 10 ఏళ్లు యవ్వనంగా.. అందుకే దువ్వెనతో కూడా దువ్వలేనంతగా వింతగా, అడ్డదిడ్డంగా పెరుగుతాయి. జన్యుపరమైన మార్పు వల్ల కొందరిలో చర్మం, పళ్లు, గోర్లకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ప్రస్తుతానికైతే ఈ వ్యాధికి చికిత్స అంటూ ఏం లేదు. అయితే కొందరు పిల్లల్లో బయోటిన్ వాడటం వల్ల కొంత మార్పు కనిపిస్తోందని.. మరికొందరిలో వయసు పెరుగుతున్నాకొద్దీ సమస్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
హేలాపురి..కురుల సిరి
ఏలూరు (టూటౌన్): హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీకి పెట్టింది పేరు ఏలూరు. ఒకప్పుడు నగరం, పరిసర గ్రామాల్లో కుటీర పరిశ్రమగా విరాజిల్లింది. ఇళ్ల వద్ద మహిళలు జుట్టును శుభ్రం చేసి, ఆరబెట్టి, చిక్కులను తీసి సాఫ్ చేసిన అనంతరం గ్రేడింగ్ చేసేవారు. ఇందుకు కంపెనీ ప్రతినిధులు కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు చెల్లించేవారు. ఇలా వేలాది మంది మహిళలు ఉపాధి పొందేవారు. ఏలూరు నగర పరిధిలోని తూర్పువీధి, కట్టేపు వీధి, ఆముదాల అప్పలస్వామి కాలనీ, వంగాయగూడెం, ఏలూరు రూరల్ మండల పరిధిలోని మాదేపల్లి, చాటపర్రు, వెంకటాపురం తదితర గ్రామాల్లో మహిళలు ఇళ్ల వద్ద జట్టును శుభ్రం చేసే పనిలో ఉండేవారు. 20 ఏళ్ల క్రితం దాదాపు 5 వేల మందికి పైగా కార్మికులు ఇలా ఉపాధి పొందేవారు. అలాగే పది వరకు జట్టు కంపెనీల్లో నెలవారీ జీతానికి వందలాది మంది కార్మికులు పనిచేసేవారు. ఈ ప్రాంతంలో జట్టు ఉపాధి మార్గంగా ఉండేది. అంతర్జాతీయ ఖ్యాతి ఏలూరు జట్టుకు అంతర్జాతీయంగా గిరాకీ ఉండేది. జుట్టు నాణ్యతతో పాటు ధర అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. గతంలో కోట్లాది రూపా యల వ్యాపారం కూడా జరిగేది. దక్షిణ భారత జుట్టు ఎగుమతిదారుల సంఘ ప్రతినిధుల్లో ఏలూరుకు చెందిన వారు సైతం ఉండేవారు. ఏలూరుకు చెందిన మడిపల్లి మోహనగుప్తా వంటి వారు ఈ పరిశ్రమలో పేరు గడించారు. ఇప్పటికీ ఈయన ఆధ్వర్యంలో పరిశ్రమ నడుస్తోంది. ఏలూరులో గ్రేడింగ్ చేసిన జు ట్టును దేశ, విదేశాలకు ఎగుమతి చేసేవారు. జపాన్, చైనా, యూరప్ దేశాల ప్రతినిధులు ఇక్కడకు వచ్చి జుట్టు గ్రేడింగ్, శుభ్రం చేయడం, ప్యాకింగ్ వంటి పనులను స్వయంగా పరిశీలించేవారు. భారీ ఎత్తున ఆర్డర్లు ఇచ్చేవారు. ఆలయాల వేలం పాటల్లో.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో నిర్వహించే తలనీలాల వేలం పాటలకు ఏలూరు ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా వెళ్లేవారు. 70 శాతం మంది ఈ ప్రాంత వ్యాపారులే ఉండేవారు. తిరుమల తిరుపతి, అన్నవరం, ద్వారకాతిరుమల, శ్రీశైలం వంటి క్షేత్రాల్లో భక్తులు సమర్పించిన తలనీలాలను ఏలూరు తీసుకువచ్చి ఇక్కడ శుభ్రం చేయించేవారు. ఇలా శుభ్రం చేసిన జట్టును ఆయా వ్యాపారుల ప్రతినిధులు వచ్చి తీసుకువెళ్లేవారు. ప్రస్తుతం పరిమితంగా.. గతంలో వేలాది మందికి ఉపాధి చూపిన వెంట్రుకల పరిశ్రమ ప్రస్తుతం రెండు, మూడు సంస్థలకే పరిమితమైంది. కార్మికుల సంఖ్య వందల్లోకి తగ్గింది. గతంలో పాలకుల ప్రోత్సాహం లేకపోవడం, జట్టు కొనుగోలులో పోటీ పెరగడం, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్ల వద్ద జట్టు శుభ్రం చేసే పనులు తగ్గిపోయాయి. కొద్ది కంపెనీలు మాత్రమే ఈ పనులు చేస్తున్నాయి. గత వైభవం తీసుకురావాలి ఏలూరులో వెంట్రుకల పరిశ్రమకు గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పలువురు కోరుతున్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. -
అమానుష దాడి: నెత్తిపై జుట్టు చర్మంతో సహా వచ్చేలా మహిళ పై దాడి!!
woman had hair ripped from her scalp in a racial attack: లండన్‌లో జాతి విద్వేషపూరిత దాడిలో భాగంగా ఒక వ్యక్తి మహిళ పై అత్యంత అమానుషంగా దాడి చేశాడు. ఆ మహిళ నెత్తిపై జుట్టు చర్మంతో సహా వచ్చేలా భయంకరంగా దాడి చేశాడు. అయితే ఈ సంఘటన డిసెంబర్ 18, 2021న దక్షిణ లండన్‌లోని ఈస్ట్ క్రోయ్డాన్ రైల్వే స్టేషన్ వెలుపల చోటు చేసుకుంది. ఆమె రూట్ నెం 119 బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక దుండగుడు ఆమె పై దాడి చేశాడు. స్కాట్లాండ్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..మహిళ జుట్టును దుండగడు గట్టిగా లాగాడని చెప్పారు. ఫలితంగా ఆమె నెత్తిపై ఒక వైపు భాగం జుట్టు చర్మంతో సహా ఊడిపోయిందని తెలిపారు. అంతేగాక ఆ నిందితుడు ఆమెను తల వెనుక భాగంలో గట్టిగా కొట్టడంతో ఆమె పడిపోయిందని కూడా చెప్పారు. పైగా సుదీర్ఘమైన జాతి విద్వేషపూరిత దాడిలో బాధితురాలి ముఖానికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు. ఈ మేరకు డిటెక్టివ్ కానిస్టేబుల్ బెక్కీ హ్యూస్ మాట్లాడుతూ, "ఇది పూర్తిగా రెచ్చగొట్టబడని దాడి. బాధితురాలు నేలపై పడిపోయినప్పుడు ఈ దుశ్చర్యకు పూనకున్నాడు. అంతేకాదు ఆ ఘటనకు సంబంధించిన ఫోటోని కూడా విడుదల చేశాం. ఆ సంఘటన జరిగినప్పుడూ ఉన్నవారు ఎవరైన మా ముందుకు రావాలి. ఆ నిందుతుడి గురించి తెలియజేయాలి" అని కోరారు. పైగా హింసాత్మక దాడులను ఎదుర్కొంటున్న మహిళల, పిల్లలను రక్షించడమే తమ తక్షణ కర్తవ్వం అని బెక్కీ హ్యూస్ చెప్పారు. (చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!) -
పట్టులాంటి జుట్టుకోసం.. ఇవి కలిపి జుట్టుకి పట్టించండి..
► రెండు కోడిగుడ్ల తెల్లసొనలో రెండు టీ స్పూన్ల ఆముదం, ఒక టీస్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల మొదలు నుంచి జుట్టుకంతా పట్టించి, 20 నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. ► ముందురోజు రాత్రి ఒక కప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల మెంతులు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు నాలుగయిదు మందార ఆకులని జతచేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్నంతటినీ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి 20 నిమిషాలపాటు ఉంచి తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ► ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ► తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టుని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ► పెరుగు కదుళ్ల నుండి జుట్టుకంతటికీ పట్టించి పది నిమిషాలయ్యాక తల స్నానం చేస్తే పట్టులా మెరుస్తుంది. -
జడతో కారు లాగిన చిన్నారి!
మార్కాపురం: రెండు జడలతో కారును లాగి అందర్నీ అబ్బురపరిచిందో చిన్నారి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన క్రీడా కోచ్ చిట్టిబాబు కుమార్తె టి.బిందు (సౌజన్య) స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. (చదవండి: వెంట్రుకలను ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా..) బుధవారం పీఎస్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్లో సాహసం చేసి అందరితో శభాష్ అనిపించుకుంది. పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారి.. తన జడతో మారుతీకారును 50 మీటర్లు లాగింది. ఈ సాహసాన్ని చూసిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి బిందును అభినందించారు. -
వెంట్రుకలను ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా..
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): తలపై జుట్టు ప్రతి ఒక్కరికీ ఎంతో అపురూపం. ఒక్క వెంట్రుక రాలిపోతున్నా ఎంతో మనోవేదనకు గురవుతారు. అలాంటిది క్యాన్సర్ బాధితులకు ఇచ్చే చికిత్సలో తల వెంట్రుకలు మొత్తం పోతే వారి బాధ వర్ణణాతీతం. అలాంటి వారి కోసం మేమున్నామంటూ.. పిల్లల నుంచి పెద్దల వరకు ముందుకు వస్తున్నారు. వారి కోసం కేశాలు దానం చేసి విగ్గుల తయారీకి సహకరిస్తున్నారు. ఇటీవల కర్నూలులో నిర్వహించిన కేశదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. క్యాన్సర్ బారిన పడిన వారికి కీమోథెరపి ఇవ్వడం కారణంగా వారి తలవెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి గుండు ఏర్పడుతుంది. ఇలాంటి వారికి తలవెంట్రుకలు తిరిగి రావడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వైపు క్యాన్సర్ మహమ్మారి నుంచి వేదన మరోవైపు ఎంతో అపురూపంగా చూసుకున్న తలవెంట్రుకలు పోయి అందవిహీనంగా మారామనే మనోవేదన వారిని తీవ్రంగా కలిచివేస్తుంది. ఇలాంటి వారికి ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇచ్చేందుకు ముంబయిలోని నోవా హాస్పిటల్ వారు ఇతోధికంగా సేవలు అందిస్తున్నారు. దాతల ద్వారా వారికి అందిన వెంట్రుకలను విగ్గులుగా మార్చి కీమోథెరపి ద్వారా వెంట్రుకలు కోల్పోయిన వారికి అందజేస్తున్నారు. కేశదానానికి విశేష స్పందన యువభారత్ సేవా సమితి ఆధ్వర్యంలో రాయలసీమలో మొదటిసారి గత నెల 29వ తేదీన నిర్వహించిన కేశదానం, రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కేశదానానికి ముందుగా 25 మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా 49 మంది మహిళలు, యువతులు, పిల్లలతో పాటు నలుగురు యువకులు కేశదానానికి ముందుకు వచ్చారు. స్థానిక దేవిఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నలుగురు యువకులు క్యాన్సర్ బాధితుల కోసమే వెంట్రుకలను 15 సెం.మీ. కంటే ఎక్కువగా పెంచి మరీ కేశదానం చేశారు. నంద్యాల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకటహరీష్ అనే యువకుడు ఇప్పటికే రెండుసార్లు కేశదానం చేశారు. ఈ కార్యక్రమంపై యువభారత్ సేవా సమితి వారు నెలరోజుల ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందులో అధికంగా మహిళలు భాగస్వామ్యమయ్యేలా చేశారు. ఎంతో తృప్తినిస్తోంది క్యాన్సర్ బాధితుల కోసం చేసే కేశదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని మొదట భావించినప్పుడు అందరూ ప్రశ్నార్థకంగా చూశారు. క్రమంగా కార్యక్రమం ఉద్దేశాన్ని అందరికీ చెప్పి ఒప్పించాం. అనూహ్యంగా 53 మంది తరలివచ్చి కేశ దానం చేయడం మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. నేను కూడా కేశదానం చేశాను. ఇప్పటికే 22 సార్లు రక్తదానం కూడా చేశాను. ఎవ్వరైనా కేశదానం చేయాలనుకుంటే హైదరాబాద్‌లోని కోట సంపత్‌కుమార్ (9992345678, 93463445)కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే చాలు ఏర్పాట్లు చేస్తారు. –సి. రేణుక, యువభారత్ సేవా సమితి సహాయ కార్యదర్శి, కర్నూలు నేనూ దానం చేశా క్యాన్సర్ బాధితుల కోసమని కేశదానం చేస్తున్నారని తెలిసి అక్క వారితో కలిసి నేనూ వెళ్లాను. అక్కడ ఆంటీలు, అక్కలు వారి వెంట్రుకలను కత్తిరిస్తూ ఉంటే ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా. క్యాన్సర్ బాధితుల కోసం విగ్గులు తయారు చేసి ఉచితంగా ఇస్తారని చెప్పడంతో నేను కూడా నా వెంట్రుకలను కత్తిరించి వారికి ఇచ్చాను. నాతో పాటు నా స్నేహితులు సైతం ఇచ్చారు. – సి. శ్రీమహి, కర్నూలు -
ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో
ఇటీవలకాలంలో ఒక మహిళ పామును చుట్టుకుని పడుకొని ఉన్న వైరల్ వీడియోలను చూశాం. అంతేందుకు ఒక అమ్మాయి ఐలవ్యూ అంటూ పాముకి తెగ ముద్దులు పెడుతున్న వైరల్ వీడియోలు సైతం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అచ్చం అలానే ఇక్కడొకామె ఒక పాముని హెయిర్ బ్యాండ్‌గా వాడేసింది. (చదవండి: ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!) అసలు విషయంలోకెళ్లితే ...అయితే ఒక మహిళ పాముని హెయిర్‌బ్యాండ్ తలకు చుట్టుకుని షాపింగ్ మాల్కి వచ్చి సందడి చేసింది. మొదటగా చూసిన వెంటనే మనకు అది పాము అని అనిపించదు. కాస్త నిశితంగా పరిశీలించగానే అవాక్కు అవక మానరు. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కి గురై రకరకాలుగా ట్వీట్ చేశారు. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: హ్యాట్సాఫ్!..కుక్కని భలే రక్షించాడు) View this post on Instagram A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world) -
విగ్గుతో పరీక్షల్లో కాపీయింగ్! ఎలా దొరికాడంటే..
లక్నో: ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజే వేరు. దీనిలో ఉద్యోగ భద్రతతో పాటు, అనేక వెసులు బాటులు ఉంటాయి. అందుకే చాలా మంది యువత పోటీపరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. కొందరు కష్టపడి ఉద్యోగాన్ని సాధిస్తే.. మరికొందరు దళారులను లేదా హైటెక్ మాస్ కాపీయింగ్‌లకు పాల్పడుతుంటారు. దీనికోసం టెక్నాలజీని బీభత్సంగా ఉపయోగించుకుంటారు. ఇప్పటికే హైటెక్ కాపీయింగ్ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక మాస్ కాపీయంగ్ ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీన్ని ఐపీఎస్ అధికారి రూపిన్‌శర్మ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వివరాలు.. గత వారం యూపీలో సబ్ఇన్స్పెక్టర్ మెయిన్స్ రాతపరీక్షలు జరుగాయి. దీనిలో ఒక అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వచ్చాడు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో.. ప్రత్యేక అధికారులు అతడిని బయటకు తీసుకెళ్లి తనిఖీ చేశారు. ఆ యువకుడిని పూర్తిగా పరిశీలించారు. ఎక్కడ కూడా.. ఎలాంటి కాపీయంగ్ ఆనవాళ్లు దొరకలేదు. చివరకు వారు.. అతగాడి తలపైన తనిఖీ చేశారు. అతడి జుట్టును పక్కకు జరిపి చూశారు. అప్పుడు షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. యువకుడి తలపైన ఒక విగ్ మాదిరిగా వెంట్రుకలు ఉన్నాయి. దానికింద ప్రత్యేక చిప్, బ్లూటూత్‌లు ఉన్నాయి. దీన్ని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఆ తర్వాత.. యువకుడిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హైటెక్ మాస్‌కాపీయంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం తెలివిరా బాబు..’, ‘ఈ తెలివి చదువులో చూపిస్తే బాగుండు..’,‘ నీ తెలివి తెల్లారినట్లే ఉందంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్ #UttarPradesh mein Sub-Inspector की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️😊😊😊@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry — Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021 -
కరోనా వచ్చి వెళ్లాక.. వదలని బాధలు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబళించిన కరోనా మహమ్మారి దాని బారినపడి కోలుకున్న బాధితుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో తాజా పరిశోధనల్లో వెల్లడైంది. జుట్టు రాలడం మొదలు పళ్లు కొరకడం వరకు ఎన్నో కొత్త సమస్యలు సృష్టించిందని తేలింది. ఆపాదమస్తకమంతా మనిషి శరీరంలో కరోనా తెచ్చిన మార్పులు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం. జుట్టు ►కరోనా బారినపడిన 2–3 నెలల్లోనే బాధితులకు విపరీతంగా జుట్టు రాలినట్లు ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. టెలోజెన్ ఎఫ్లువియమ్ అనే పరిస్థితే ఇందుకు కారణమని తేల్చింది. ►శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, ఆకలి లేకపోవడం, వైరస్ బారిన పడ్డామన్న ఆందోళన, లాక్డౌన్ల విధింపుతో ఒత్తిడి లేదా మహమ్మారి వ్యాప్తితో జీవనశైలిలో వచ్చిన మార్పులు కేశాల సాధారణ ఎదుగుదల, అవి రాలే కాలచక్రంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ►అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏమిటంటే రాలిన జుట్టులో చాలా వరకు లేదా మొత్తమంతా తిరిగి వస్తుందని రిచర్డ్ స్పెన్సర్ అనే ట్రైకాలజిస్ట్ తెలిపారు. మానసిక ఆరోగ్యం ►క్వారంటైన్, భౌతికదూరం నిబంధనలు బాధితుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఈ పరిణామం వారిలో ఆందోళన, ఉద్రేకం, కుంగుబాటు, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీసింది. ►కరోనా నుంచి కోలుకున్న 90 రోజుల్లోనే ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు మానసిక అనారోగ్యానికి గురైనట్లు ఒక అధ్యయనం తెలిపింది. ►ప్రతి ముగ్గురు కరోనా రోగుల్లో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడ్డట్లు మరో సర్వే తేల్చింది. కళ్లు ►కరోనా వ్యాప్తితో సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువ కావడం వల్ల చాలా మంది కళ్లు పొడిబారడం, దురదపెట్టడం, ఎర్రబడటం, మసకబారడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. తెరలపై ఉండే నీలికాంతి ప్రభావమే ఇందుకు కారణం. ►పలు అధ్యయనాల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 11 శాతం మంది కళ్ల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో చాలా మందికి తరచుగా సోకుతున్నది కళ్లకలక. ఉదరం ►కొందరు గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం... కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే పేగుల సంబంధ వ్యాధి కేసులు పెరిగాయి. పొత్తికడుపులో నొప్పి, విరేచనాలు, మలబద్ధకం వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా కరోనా బాధితులకు తలెత్తాయి. ►ఒత్తిడి, ఆందోళన కారణంగా ఐబీఎస్ వంటి రోగాల సంఖ్య పెరిగాయని ఓ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అభిప్రాయపడ్డారు. పళ్లు ►కరోనా వ్యాప్తి మొదలయ్యాక పళ్లు కొరకడం, బిగపట్టడంతో బాధపడుతున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగింది. ఏడీఏ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం 2,300 మంది డెంటిస్టుల్లో 71 శాతం మంది ఇదే విషయాన్ని తెలియజేశారు. బ్రక్సిజం అని పిలిచే ఈ వ్యాధి మనిషి తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు వస్తుందన్నారు. ►జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకా రం ఇదే కాలంలో పంటి, దవడ నొప్పులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. బరువు ►కరోనా మహమ్మారిని వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్లు/క్వారంటైన్ నిబంధనలతో ప్రజల బరువులో మార్పులు చోటుచేసుకున్నాయి. తక్కువగా తినడం, శారీరక శ్రమ తగ్గడం లేదా ఒత్తిడి ఇందుకు కారణం కావొచ్చు. ►ఒక అధ్యయనం ప్రకారం కరోనా రోగుల్లో 39 శాతం మంది బరువు పెరిగారు. కాలేయం ►కరోనా వ్యాప్తి కాలంలో తీవ్ర మద్యపాన సేవనం వల్ల తలెత్తే హెపటైటిస్ అనే కాలేయ వ్యాధి కేసుల సంఖ్య భారీగా పెరినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీని చికిత్స కోసం బాధితులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ►కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన కొందరు బాధితుల్లో కాలేయ ఆమ్ల ద్రవాల స్థాయి సైతం పెరిగింది. పాదాలు ►పాదాల సంబంధ వ్యాధుల వైద్యురాలు ఎమ్మా కొన్నాకీ ప్రకారం ప్రజల్లో కండరాలు పట్టేయడం, మడమలు నొప్పిపెట్టడం వంటి సమస్యలు పెరిగాయి. పాదాలకు ఆసరా కల్పించే పాదరక్షలు ధరించే పరిస్థితి లేకపోవడం ఈ సమస్యకు ఒక కారణమై ఉండొచ్చని ఆమె అంచనా వేశారు. ►అరికాలు, చీలమండ, దాని వెనుకాల నొప్పితో బాధపడే వారి కేసుల సంఖ్య కూడా పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. చర్మం ►కరోనా నుంచి కోలుకున్న బాధితులు ఎదుర్కొన్న అతిసాధారణ చర్మ సంబంధ సమస్యల్లో దద్దుర్లు ఒకటి. ►కాళ్లు, చేతులు ఎరుపెక్కడం, నొప్పి రావడం, చర్మం దురదపెట్టడం దీని లక్షణాలు. ఈ పరిస్థితిని ‘కోవిడ్ టోస్’గా పేర్కొంటారు. -
మామూలోడు కాదుగా..! గడ్డంతో 63 కేజీల యువతిని ఎత్తాడు.. రికార్డు కొట్టాడు!!
Guinness World Record Man Lifting 63 kg Woman Using Beard: గిన్నీస్ వరల్డ్ రికార్డు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వృద్ధుడు 63 కేజీల మహిళలను పైకి ఎత్తుతాడు. ఆ.. ఇలాంటివి చాలానే చూశాం.. అనుకుంటున్నారా! అతను ఎత్తింతి చేతులతో కాదు.. అదే ట్విస్ట్!! ఈ వీడియోలో స్టంట్ చేసిన వ్యక్తి పేరు అంటనాస్ కాంట్రిమాస్. అతని గడ్డంకు ఉన్న జుట్టుకు కట్టిన 63.80 కేజీ బరువున్న మహిళను ఏ సపోర్టు తీసుకోకుండా లేపడం కనిపిస్తుంది. మహిళను పైకి ఎత్తేటప్పుడు అతని ముఖంలో బాధ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఐతే ఆ బాధంతా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడానికే భరించానని అంటున్నాడు ఈ గెడ్డం వీరుడు. దీంతో గడ్డంతో అత్యంత బరువును ఎత్తిన మొట్టమొదటివ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు మిలియన్లలో వీక్షణలు, లక్షల్లో కామెంట్లతో వైరల్ అవుతోంది. ఇది నిజంగా చాలా అద్భుతం, భిన్నమైన ప్రతిభ అని ఒకరు, ఇతని వెంట్రుకలు దేనితో తయారు చేయబడ్డాయో.. ఇంత స్రాంగ్‌గా ఉన్నాయని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. ఏదిఏమైనప్పటికీ ఇతని గడ్డం గురించి నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి. చదవండి: Wild Facts About Octopuses: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
నా కొడుకు గుండె పగిలింది, అందుకే : హీరోయిన్
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కుమారుడు ర్యాన్ పెద్ద మనసుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేషనల్ కేన్సర్ అవేర్నెస్ డే (నవంబర్ 7) సందర్భంగా కేన్సర్ బాధితుల కోసం తన జుట్టును దానం చేయడం విశేషంగా నిలిచింది. స్వయంగా మాధురీ దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. (Kamal Haasan: తొలి భారతీయుడిగా కమల్ మరో సంచలనం) అలనాటి అందాల నటి, డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నెనె దంపతుల చిన్న కుమారుడు ర్యాన్ తన పొడవైన జుట్టును కీమో థెరపీ చేయించుకున్న పేషెంట్ల కోసం డొనేట్ చేశాడు. సెలూన్లో ర్యాన్ హెయిర్‌కట్ చేయించుకుంటున్న వీడియోను షేర్ చేశారు మాధురి. కేన్సర్ బారిన పడి కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి ర్యాన్ చలించి పోయాడు. అందుకే కీమో ద్వారా జుట్టును కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా తన జుట్టును కేన్సర్ సొసైటీకి దానం చేయాలనుకున్నాడని మాధురి తెలిపారు. ఇది విని తాము చాలా ఆశ్చర్యపోయామని, దాదాపు రెండు సంవత్సరాలుగా పెంచు కుంటున్న తన జుట్టును డొనేట్ చేయడంపై చాలా గర్వ పడుతున్నామని మాధురి పేర్కొన్నారు. ర్యాన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene)