
ఆడవాళ్లపై ‘శిలాహృదయులు’ అన్న నింద వేస్తారు కదా మన కవులు. ఆ శిలలకు సౌమ్యమైన కిరీటంలా ఊగే అలలివి. ఛాయవర్ణ అలలు!
హెయిర్ కలరింగ్ పెద్ద పని. వేసేవాళ్లు ఎక్స్‌పర్ట్‌లై ఉండాలి. వేయించుకునేవాళ్లు కాస్తయినా తీరిక ఉన్నవాళ్లై ఉండాలి. బాగా టైమ్ పడుతుంది. అసలు మన తలకు ఏ కలర్ సెట్ అవుతుందో తేల్చడానికే హెయిర్ కలరిస్టుకు కొంత స్టడీ అవసరం. ఈ స్టడీలు గొడవలు లేకుండా సెలూన్‌లోకి ఇలా పాత ఫేస్‌తో వెళ్లి, అలా కొత్త లుక్‌తో వచ్చేయాలంటే మాత్రం ఒకటే సొల్యూషన్. ‘బాలయేజ్’!బాలయేజ్ అంటే ఇదిగో (ఫొటోలు చూడండి) ఇలా ఉంటుంది. ఒక్క ముక్కలో అర్థమైపోయింది కదా! వావ్.. సూపర్బ్. మరి ఎగ్జాక్ట్‌గా ఈ కలర్ మిక్సింగ్‌లో ఏయే కలర్స్ ఉన్నాయో?! ముందీ విషయం తెలుసుకోండి. బాలయేజ్ అనేది కలరో, కలర్ కాంబినేషనో కాదు. అదొక కలరింగ్ టెక్నిక్. ఆంబ్రే, హైలైటెనింగ్ టెక్కిక్ లాంటిదే బాలయేజ్. ‘ఆంబ్రే’ అంటే షేడెడ్. ఒక రంగులోని వివిధ ఛాయలతో హెయిర్‌కి కలరింగ్ ఇవ్వడం. ‘హైలైటెనింగ్’ అంటే తెలిసిందే.. జుట్టుకి వేసిన కలర్‌లో హైలైట్స్‌ని సృష్టించడం.
మరి ఈ బాలయేజ్ ఏంటి? ఆంబ్రే, హైలైటెనింగ్‌ల కాంబినేషనే బాలయేజ్! పిచ్చికాకపోతే ఇదేమిటి.. రంగుల్ని అటుతిప్పి, ఇటుతిప్పి! తిప్పితేనే ట్విస్టు, ట్రిక్కు. బాలయేజ్ ఒక మ్యాజికల్ ట్రిక్. జుట్టు పాయలకు అలలు అలలుగా రంగులేసే ట్రిక్. ఆడవాళ్లపై ‘శిలాహృదయులు’ అన్న నింద వేస్తారు కదా మన కవులు. ఆ శిలలకు సౌమ్యమైన కిరీటంలా ఊగే అలలివి. ఛాయవర్ణ అలలు! బాలయేజ్‌లో నేచురల్ హెయిర్ కలర్స్‌నే ఉపయోగిస్తారు. వర్ణాల ఎంపిక పూర్తిగా మనదే. టెక్నీషియన్‌లు వచ్చి ప్రబోధించరు. వైల్డ్‌కలర్ కావాలంటే వైల్డ్. లైట్ కావాలంటే లైట్. బ్లెండింగ్ మాత్రం వాళ్ల చేతుల్లో విషయమే. ఆ కొద్దిసేపూ తల ఒక్కటే మనది. బాలయేజ్‌తో బయటికి వచ్చాక ప్రపంచం మిమ్మల్ని పోల్చుకోడానికి పడే తిప్పల్ని చూసి మీరు మనసారా నవ్వుకోవచ్చు.