Technician
-
1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్య,ఆరోగ్యశాఖలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు విధించారు. దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునేందుకు అదే నెల ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఉంటుందని గోపీకాంత్‌రెడ్డి వెల్లడించారు. వయో పరిమితి 46 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రాత పరీక్షలు రెండు, మూడు సెషన్లో నిర్వహిస్తారు. పరీక్ష పేపరు ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. » మొత్తంగా 1,284 పోస్టులుండగా, అందులో 1,088 ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) విభాగంలో, మరో 183 తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో, మరో 13 హైదరాబాద్ ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నాయి. » ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ విభాగంలోని పోస్టులకు పేస్కేల్ రూ.32,810– రూ.96,890. » ఎంఎన్‌జే ఆస్పత్రిలోని పోస్టులకు పేస్కేల్ రూ.31,040–రూ.92,050. ముఖ్యాంశాలు...»అన్ని పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల పరీక్ష కేంద్రాలుంటాయి. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. » ఆన్లైన్ పరీక్ష ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 » మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. » విద్యార్హతలు: అభ్యర్థులు ల్యాబ్ టెక్నిïÙయన్ కోర్సు చేసి ఉండాలి. ఎంఎల్ ఒకేషనల్, ఇంటర్మీడియట్లో ఎంఎల్ ఒకేషనల్ చేసి ఒక ఏడాది క్లినికల్ శిక్షణ పొందిన వారూ అర్హులే. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిïÙయన్ కోర్సు(డీఎంఎల్డీ), బీఎస్సీ (ఎంఎల్), ఎంఎస్సీ (ఎంఎల్టీ), డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ (క్లినికల్ పాథాలజీ) టెక్నిïÙయన్ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ(బీఎంఎల్టీ) పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమో ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ(మైక్రోబయాలజీ), ఎంఎస్సీ (మైక్రోబయాలజీ) ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు » పోస్టుల నియామక ప్రక్రియ వంద పాయింట్ల ప్రాతిపదికగా భర్తీ చేస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తే వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆరు మాసాలకు పైగా వైద్యసేవలందిస్తే 2.5 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. కనీసం ఆరు నెలలు పనిచేస్తేనే వెయిటేజీ మార్కులొస్తాయి. » నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి వెయిటేజీ కటాఫ్ తేదీగా నిర్ణయించారు. » కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అభ్యర్థులు అనుభవపూర్వక ధ్రువీకరణపత్రాన్ని వారు విధులు నిర్వర్తిస్తున్న ఆస్పత్రుల నుంచే తీసుకోవాలి. » మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb. ్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను సందర్శించాలి. -
స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లోని ఓ స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ అకృత్యాలు వెలుగు చూశాయి. స్కానింగ్ వచ్చే మహిళలు న్యూడ్ ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అనేక మంది ఆ కామాంధుని అకృత్యాలకు బలయ్యారు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది.స్కానింగ్ సెంటర్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.. విచారణ ప్రారంభించారు.నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యజమాని డాక్టర్ చంద్రశేఖర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.. ఆపరేటర్ ప్రశాంత్ స్పై కెమెరాతో ఫొటోస్ వీడియో తీసినట్లు తెలిసిందని బాధితుల ఫిర్యాదుతో ప్రశాంత్‌ను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. ప్రశాంత్‌ను ఉద్యోగం నుంచి తొలగించామని కూడా చెప్పారు. ప్రశాంత్ అమ్మాయిలతో చాట్ చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్ చంద్రశేఖర్. -
చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, ఇడ్లీ బండి నడుపుకుంటున్నా!
Chandrayaan-3Technician selling idli ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్ నిర్మాణంలో పనిచేసిన టెక్నీషియన్ దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడన్న వార్త మీడియాలో సంచలనం రేపుతోంది. ఇస్రోకు చెందిన HEC (హెవీఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్)లో దీపక్ కుమార్ ఉప్రారియా రాంచీలోని ధుర్వా ప్రాంతంలో టీ, ఇడ్లీ దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం వైరల్‌గా మారింది. బీబీసీ కథనం ఆధారంగా ఎన్డీటీవీ అందించిన రిపోర్ట్ ప్రకారం చంద్రయాన్-3 కోసం ఫోల్డింగ్ ప్లాట్‌ఫారమ్ అండ్ స్లైడింగ్ డోర్‌ను తయారు చేసిన ప్రభుత్వ ఉద్యోగికి 18 నెలలుగా జీతం చెల్లించకపోవడంతో అతను రోడ్‌సైడ్ స్టాల్‌ను తెరిచాడు. హెచ్ఈసీలో పనిచేస్తున్న ఉప్రారియా ఏమన్నారంటే.. జీతం అందక కొన్నాళ్లు క్రెడిట్ కార్డ్‌తో నెట్టుకొచ్చా. ఆ తరువాత బంధువులు, స్నేహితుల ద్వారా దాదాపు నాలుగు లక్షల అప్పు చేశాను.. భార్య నగలు తాకట్టు పెట్టి కొన్ని రోజులు ఇంటిని నడిపించా.. ఇపుడిక అప్పులు తీర్చే పరిస్థితి లేదు ఆవేదన వ్యక్తం చేశారు ఆకలితో చచ్చిపోవడం కన్నా అందుకే ఇక వేరే గత్యంతరం లేక కడుపు నింపుకుంనేందుకు ఆకలితో చచ్చిపోవడం కన్నా ఇడ్లీ దుకాణం బెటర్ అనే ఉద్దేశంతో ఈ దుకాణాన్ని తెరవాల్సి వచ్చిందని చెప్పారు. భార్య మంచి ఇడ్లీలు చేస్తుంది. వాటిని అమ్మడం ద్వారా రోజుకి 300-400 రూపాయలొస్తాయి. తద్వారా 50-100 రూపాయల లాభం వస్తుంది ఈ డబ్బుతోనే ఫ్యామిలీని నెట్టుకొస్తున్నానని తెలిపారు. అంతేకాదు తనకు ఇద్దరు కూతుళ్లని, ఈ ఏడాది ఇంకా స్కూల్ ఫీజు కట్టలేకపోవడంతో స్కూల్ నుంచి రోజూ నోటీసులు పంపుతున్నా రన్నారు. క్లాస్ రూంలో టీచర్లు హెచ్ఈసీలో పనిచేస్తున్న వారి పిల్లలు ఎవరని అడిగి మరీ అవమానించారనీ, దీంతో తన కుమార్తెలు ఏడుస్తూ ఇంటికి రావడం చూసి గుండె పగిలిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఉప్రారియా తోపాటు సంస్థలోని దాదాపు 2,800 మంది ఉద్యోగుల జీతాలు అందలేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన ఉప్రారియా 2012లో, ప్రైవేట్ కంపెనీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, 8,000 జీతంతో HECలో చేరాడు. ప్రభుత్వ సంస్థ కావడంతో తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశపడ్డాడు. కానీ అతని అంచనాలు తల్లకిందులైనాయి. అయితే జీతాల సమస్యపై కేంద్రం స్పందిస్తూ, హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ స్వతంత్ర సంస్థకాబట్టి ఉద్యోగుల జీతభత్యాల బాధ్యత ఆ సంస్థదే అని తెలిపింది. కాగా ఇస్రో చంద్రయాన్-3 జూలై 14న విజయ వంతంగా ప్రయోగించింది. తద్వారా చంద్రుని దక్షిణ ధృవంపై కాలిడిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. Meet Deepak Kumar Uprariya who sells Tea & Idli in Ranchi. He is a Technician, who worked for building ISRO's Chandrayaan-3 launchpad. For the last 18 months, he has not received any salary. "When I thought I would die of hunger, I opened an Idli shop" (BBC Reports) pic.twitter.com/cHqytJvtfj — Cow Momma (@Cow__Momma) September 17, 2023 -
ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం, టెక్నీషియన్ మృతి
స్వర మాంత్రికుడు, లెజెండరి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టెక్నీషియన్ మృతి చెందినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. వివరాలు.. చెన్నైలోని రెహమాన్ పంచతాన్ రికార్డింగ్ స్టూడియోలో ఇటీవల ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా లైట్ మెన్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. లైట్ బిగిస్తుండగా ఆయనకు షాక్ తగలడంతో కిందపడి మృతి చెందినట్లు పలు తమిళ వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ స్టూడియో ద్వారా రెహమాన్ లైవ్ షోలు, కన్సర్ట్లు చేస్తారు. చెన్నైలో తన ఇంటిలోనే ఈ స్టూడియోను నిర్వహిస్తున్నారు. కాగా చాలా గ్యాప్ తర్వాత రెహమాన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది వచ్చిన విక్రమ్ కోబ్రా, లైఫ్ ఆఫ్ ముత్తు, పొన్నియన్ సెల్వన్ పార్ట్-1కు సంగీతం అందించారు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్-2తో పాటు తమిళంలో పలు చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చదవండి: శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడంపై వివరణ ఇచ్చిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని -
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీలు
కొచ్చిలోని మినీరత్న కంపెనీ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 355 ► ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్‌లు–347, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు–08. ► ట్రేడ్ అప్రెంటిస్‌లు: ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ తదితరాలు. అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 27.11.2003 తర్వాత జన్మించి ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► టెక్నీషియన్ అప్రెంటిస్‌లు: విభాగాలు: అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, బేసిక్ నర్సింగ్ అండ్ పల్లియేటివ్ కేర్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్. అర్హత: ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్(వీహెచ్ఎస్ఈ) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 27.11.2003 తర్వాత జన్మించి ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హతలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021 ► వెబ్సైట్: www.cochinshipyard.in -
50,000 మందికి ఏసీలపై శిక్షణ: జాన్సన్ హిటాచీ
న్యూఢిల్లీ: జాన్సన్ కంట్రోల్స్ హిటాచీ ఎయిర్ కండీషనింగ్ ఇండియా 2025 నాటికి 50 వేల మందిని ప్రపంచస్థాయి ఏసీ టెక్నీషియన్లుగా తీర్చిదిద్దనున్నట్టు ప్రకటించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, గుజరాత్‌లోని ఒక కేంద్రంలో యువతకు శిక్షణ ఇస్తామని ప్రకటించింది. భారత్‌లో వచ్చే 20 ఏళ్లలో ఏసీలకు డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని పేర్కొంది. దేశంలో సుమారు రెండు లక్షల మంది ఏసీ టెక్నీషియన్లు ఉన్నారని అంచనా. -
రైలు ఢీకొని టెక్నీషియన్ మృతి
వేలూరు: జోలార్‌పేట సమీపంలో రైలుకు విద్యుత్ సరఫరా చేసే రాడ్ విరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నై–బెంగుళూరు మీదుగా వెళ్లే రైళ్లన్నీ మార్గ మధ్యలోనే నిలిచి పోయాయి. వేలూరు జిల్లా అరక్కోణం నుంచి జోలార్‌పేట మీదుగా సేలం వెళ్లే ప్యాసింజర్ రైలు మంగళవారం ఉదయం 7.50 గంటల సమయంలో వచ్చింది. రైలు జోలార్‌పేట సమీపంలోని కోదండపట్టి రైల్వే స్టేషన్ చేరుకున్న సమయంలో రైలు ఇంజన్‌పై విద్యుత్ సరఫరా చేసే రాడ్డు విరిగి పోయింది. దీంతో రైలు అక్కడిక్కడే నిలిచి పోయింది. వెంటనే లోకోపైలట్ జోలార్‌పేట రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే విద్యుత్ టెక్నిషియన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో కాకినాడ నుంచి బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ రైలు, చెన్నై నుంచి వచ్చిన కోవై ఎక్స్‌ప్రెస్ రైళ్లు అక్కడికక్కేడే నిలిపి వేశారు. గంటపాటు తీవ్రంగా శ్రమించి రైలుకు మరమ్మతులు చేశారు. శేషాద్రి ఎక్స్‌ప్రెస్, కోవై ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు గంట పాటు ఆలస్యంగా నడిచాయి. రైలు ఢీకొని టెక్నీషియన్ మృతి.. కోదండపట్టి రైల్వేస్టేషన్లో నిలిచి పోయిన రైలుకు మరమ్మతులు చేసేందుకు అరక్కోణం రైల్వే స్టేషన్ నుంచి నలుగురితో కూడిన బృందం వచ్చారు. వీరిలో సినియర్ టెక్నిషియన్ గోపినాథ్(40) కూడా వచ్చారు. మరమ్మతులు పూర్తి చేసి రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు పట్టాలు దాటుతుండగా బెంగుళూరు నుంచి చెన్నై వైపు వెళ్తుతున్న లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో గోపీనాధ్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీనిపై రైల్వే కార్మికులు జోలార్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అమ్మను కాపాడారిలా..
విశాఖపట్నం ,పెదబయలు (అరకులోయ): భారీ వర్షం.. కల్వర్టు కొట్టుకుపోవడంతో మూసుకుపోయిన మార్గం.. గ్రామం దాటాలంటే గెడ్డ మీదుగా 3 కిలోమీటర్లు నడవాల్సిందే.. ఈ అవరోధాలేవీ ఆ వైద్య ఉద్యోగి అంకిత భావాన్ని అడ్డుకోలేకపోయాయి. పురిటి నొప్పులతో అవస్థ పడుతున్న నిండు చూలాలిని బంధువుల సాయంతో డోలీలో తీసుకొచ్చి పీహెచ్‌సీకి తరలించారు. తల్లితోపాటు బిడ్డను బతికించారు. పెదబయలు మండలం సీకరి పంచాయతీతో జరిగింది ఈ అపురూప సంఘటన. అరమెర గ్రామానికి చెందిన కోడ సావిత్రి తొలి కాన్పు కోసం పురిటి నొప్పులు పడుతోంది. మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న ఫీడర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ లకే అశోక్‌కుమార్ వెంటనే బయలుదేరారు. ఇటీవలి వర్షాలకు రోడ్డు, కల్వర్టు కొట్టుకుపోవడంతో గ్రామంలోనికి వెళ్లడానికి మార్గం లేదు. 3 కిలోమీటర్ల ముందే వాహనాన్ని నిలిపేయాల్సివచ్చింది. తనకెందుకులే అని ఊరుకోలేదా టెక్నీషియన్.. అక్కడ నుంచి నడుచుకుని వెళ్లి డోలీ కట్టుకుని మూడు కిలోమీటర్లు బంధువుల సాయంతో మోసి, గెడ్డ దాటించారు. అక్కడ నుంచి పెదబయలు పీహెచ్‌సీకి తరలించారు. తెచ్చిన రెండు గంటల వ్యవధిలోనే సుఖ ప్రసవం అయ్యింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఫీడర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ లకే అశోక్‌కుమార్‌కు గర్భిణి బంధువులు కృతజ్ఞతలు చెప్పగా.. వైద్యాధికారి, సిబ్బంది అభినందనల్లో ముంచెత్తారు. -
9న రైల్వే లోకోపైలట్, టెక్నీషియన్ పరీక్ష
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 26,502 అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ పోస్టులకు ఆగస్టు 9న మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. ఈ పరీక్షకు నాలుగురోజుల ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చంది. సాధారణ అభ్యర్థులకు 60 నిమిషాలు, దివ్యాంగులకు అదనంగా 20 నిమిషాల సమయాన్ని కేటాయించనున్నట్లు పేర్కొంది. -
అమ్మాయ్లూ ఇదిగో.. న్యూ లుక్!
ఆడవాళ్లపై ‘శిలాహృదయులు’ అన్న నింద వేస్తారు కదా మన కవులు. ఆ శిలలకు సౌమ్యమైన కిరీటంలా ఊగే అలలివి. ఛాయవర్ణ అలలు! హెయిర్ కలరింగ్ పెద్ద పని. వేసేవాళ్లు ఎక్స్పర్ట్లై ఉండాలి. వేయించుకునేవాళ్లు కాస్తయినా తీరిక ఉన్నవాళ్లై ఉండాలి. బాగా టైమ్ పడుతుంది. అసలు మన తలకు ఏ కలర్ సెట్ అవుతుందో తేల్చడానికే హెయిర్ కలరిస్టుకు కొంత స్టడీ అవసరం. ఈ స్టడీలు గొడవలు లేకుండా సెలూన్‌లోకి ఇలా పాత ఫేస్‌తో వెళ్లి, అలా కొత్త లుక్‌తో వచ్చేయాలంటే మాత్రం ఒకటే సొల్యూషన్. ‘బాలయేజ్’!బాలయేజ్ అంటే ఇదిగో (ఫొటోలు చూడండి) ఇలా ఉంటుంది. ఒక్క ముక్కలో అర్థమైపోయింది కదా! వావ్.. సూపర్బ్. మరి ఎగ్జాక్ట్‌గా ఈ కలర్ మిక్సింగ్‌లో ఏయే కలర్స్ ఉన్నాయో?! ముందీ విషయం తెలుసుకోండి. బాలయేజ్ అనేది కలరో, కలర్ కాంబినేషనో కాదు. అదొక కలరింగ్ టెక్నిక్. ఆంబ్రే, హైలైటెనింగ్ టెక్కిక్ లాంటిదే బాలయేజ్. ‘ఆంబ్రే’ అంటే షేడెడ్. ఒక రంగులోని వివిధ ఛాయలతో హెయిర్‌కి కలరింగ్ ఇవ్వడం. ‘హైలైటెనింగ్’ అంటే తెలిసిందే.. జుట్టుకి వేసిన కలర్లో హైలైట్స్‌ని సృష్టించడం. మరి ఈ బాలయేజ్ ఏంటి? ఆంబ్రే, హైలైటెనింగ్ల కాంబినేషనే బాలయేజ్! పిచ్చికాకపోతే ఇదేమిటి.. రంగుల్ని అటుతిప్పి, ఇటుతిప్పి! తిప్పితేనే ట్విస్టు, ట్రిక్కు. బాలయేజ్ ఒక మ్యాజికల్ ట్రిక్. జుట్టు పాయలకు అలలు అలలుగా రంగులేసే ట్రిక్. ఆడవాళ్లపై ‘శిలాహృదయులు’ అన్న నింద వేస్తారు కదా మన కవులు. ఆ శిలలకు సౌమ్యమైన కిరీటంలా ఊగే అలలివి. ఛాయవర్ణ అలలు! బాలయేజ్లో నేచురల్ హెయిర్ కలర్స్‌నే ఉపయోగిస్తారు. వర్ణాల ఎంపిక పూర్తిగా మనదే. టెక్నీషియన్లు వచ్చి ప్రబోధించరు. వైల్డ్కలర్ కావాలంటే వైల్డ్. లైట్ కావాలంటే లైట్. బ్లెండింగ్ మాత్రం వాళ్ల చేతుల్లో విషయమే. ఆ కొద్దిసేపూ తల ఒక్కటే మనది. బాలయేజ్తో బయటికి వచ్చాక ప్రపంచం మిమ్మల్ని పోల్చుకోడానికి పడే తిప్పల్ని చూసి మీరు మనసారా నవ్వుకోవచ్చు. -
పేలని రెయిన్ గన్..!
– జిల్లాకు 4,742 మంజూరు – గోదాములకే పరిమితం – విడుదల కాని మార్గదర్శకాలు – కనిపించని టెక్నీషియన్లు – ఎండుతున్న పంటలు – పట్టించుకోని ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్): రూ.150 కోట్లతో రెయిన్గన్లను సిద్ధం చేశాం. ఒక్క ఎకరాలో కూడ పంట ఎండకూడదు. ఎండితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రెయిన్ గన్లు పది రోజులు క్రితమే వచ్చాయి. పంటలు తడపడానికి ఇప్పటి వరకు సరైన మార్గదర్శకాలు లేవు. సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్న కంపెనీలు ఇంతవరకు టెక్నీషియన్లను నియమించుకోలేదు. ఎండుతున్న పంటలు కాపాడటం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉంది. రెయిన్గన్ల వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాకు 4,742 రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, పైపులు పది రోజుల క్రితమే వచ్చాయి. వాడితో పంటలకు ప్రాణం పోస్తున్నారా..అంటే లేదు. వాటిని మార్కెట్ యార్డ్ గోదాముల్లో భద్రంగా ఉంచారు. ఎండుతున్న పంటలను చూసి రైతులు గగ్గోలు పెడుతుంటే అదిగో రెయిన్ గన్..ఇదిగో అంటూ హడావుడి చేయడం తప్ప కార్యాచరణ కనిపించడం లేదు. వివిధ మండలాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం జిల్లాలోని కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో లక్షకు పైగా హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. అధికారులు మాత్రం 24వేల హెక్టార్లే అని చెబుతున్నారు. అతిపెద్ద డ్రై స్పెల్ .. వర్షానికి, వర్షానికి మధ్య పది రోజుల వరకే ఎడం ఉండాలి. లేదంటే పైర్లు దెబ్బతింటాయి. ఈ సారి 25 రోజులుగా వానల్లేవు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా ఇంతవరకు 22.1 మిమీ మాత్రమే వర్షం కురిసింది. దీంతో భూమిలో తేమ శాతం రోజురోజుకు పడిపోతోంది. పైర్లు వాడుముఖం పట్టి ఎండిపోతున్నాయి. జూలై నెలలో కూడా పలు మండలాల్లో వర్షాలు తూతూ మంత్రంగానే కురిశాయి. ఆగస్టులో చినుకు జాడ కరువైంది. పైగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో పైర్లు మాడిపోతున్నాయి. కొద్ది రోజులుగా వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, కొర్ర, మినుము తదితర పైర్లను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తర్వులేవీ? రెయిన్గన్లతో పైర్లనుతడపడానికి రైతులే నీళ్లు సమకూర్చాలి. ‘తాగడానికే నీళ్లులేవు.. రెయిన్గన్లకు ఎక్కడి నుంచి తేవాలి’ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. నీళ్లకు, డీజిల్‌కు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. కాని ఇంతవరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రాలేదు. ఒక్క ఎకరా భూమిని తడపాలంటే కనీసం 40 వేల లీటర్ల నీరు అవసరం. డోన్, ప్యాపిలి, తుగ్గలి, పత్తికొండ, అలూరు, దేవనకొండ, పెద్దకడుబూరు. వెల్దుర్తి, కష్ణగిరి తదితర మండలాల్లో చుట్టూ 20 కిలో మీటర్ల పరిధిలో నీళ్లు లేవు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు సమకూర్చాలంటే ఎకరాకు కనీసం రూ.5వేలు వ్యయం చేయాల్సి ఉంది. సబ్సిడీ వస్తుందా... లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఆయిల్ ఇంజిన్లు ఎవరిస్తారు? పైర్లను రెయిన్గన్ల ద్వారా తడపాలంటే అయిల్ ఇంజన్లు అవసరం. ఒకవైప పైర్లు ఎండుతూ..రైతులు అల్లాడుతున్నా జిల్లాకు ఒక్క అయిల్ ఇంజిన్ కూడ రాలేదు. అయిల్ ఇంజన్లు రాకపోతే పైర్లను తడపడం ఎలా అనేది ప్రభుత్వానికే తెలియాలి. రెయిన్గన్లు, స్ప్రింకర్లు వచ్చినా... అయిల్ఇంజన్లు రాకపోవడంతో పంటలను కాపాడటం ప్రశ్నార్థకం అయింది. ఎండుతున్న పంటలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు కూడా వర్షాభావం వల్ల పంటలకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొంటున్నారు. =========== పెట్టుబడి మట్టిపాలు: రంగన్న, గాజులదిన్నె, గోనెగండ్ల మండలం నేను ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ వేసింటి. ఇప్పటి వరకు 80వేల రూపాయల పెట్టుబడైంది. చెట్టు కాయలొచ్చే టయానికి వాన లేకపాయె. ఒక్క వాన పడినా ఆశలు పండేటేవి..మా దురదష్టం.. చెట్టుకు రెండు, మూడు కాయలు కూడ లేవు. చేలో తేమ లేక కాయలు కూడ లొట్టలయితున్నాయి. పెట్టుబంతా మట్టిపాలైంది. ప్రభుత్వమే మమల్ని ఆదుకోవాల. ===================== సాగు వివరాలు (హెక్టార్లలో) సాధారణం: 6.21 లక్షలు ఈ ఏడాది సాగు: 4.73 లక్షలు పత్తి: 1.49 లక్షలు వేరుశనగ: 94,999 కంది: 85,300 ఉల్లి : 19,157 మిరప: 17,146 మొక్కజొన్న: 22,929 కొర్ర: 10,017 మినుము: 11,032 వరి: 14,407 ============== ఇప్పటి వరకు ఎండిన పంటలు: లక్ష హెక్టార్లు అధికారిక లెక్కలు: 24 వేల హెక్టార్లు =============== -
ఎయిర్ ఇండియా విమానం ఇంజన్లో ఇరుక్కొని..
ముంబై: ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన టెక్నీషియన్ విమానం ఇంజన్లో ఇరుక్కొని బుధవారం మృతి చెందాడు. ముంబై నుంచి హైదరాబాద్‌కు రావల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన AI619 విమానానం అప్పటికే గంటకు పైగా ఆలస్యం అయింది. అదే సమయంలో పార్కింగ్ లో ఉన్న విమానంలో టెక్నిషియన్ ఇంజన్ తనిఖీ చేస్తున్నాడు. టెక్నిషియన్ బయటకు రాకముందే విమానాన్ని స్టార్ట్ చేయండంతో అందులోనే ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పై విచారణకు ఆదేశించినట్టు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. -
టూల్ పట్టిన క్రికెట్ దేవుడు
క్రికెట్ దేవుడు అంటూ క్రీడాభిమానుల చేత కీర్తిప్రతిష్టలు అందుకున్న సచిన్ టెండూల్కర్ చెన్నైలో గురువారం చిత్రమైన రీతిలో సందడి చేశారు. క్రికెట్ బ్యాట్ పట్టిన చేత్తో టూల్స్ పట్టుకుని బీఎండబ్ల్యూ కారు ఇంజిన్‌ను బిగించారు.సుమారు గంటన్నరపాటు తన చిత్ర విచిత్రమైన విన్యాసాలతో అబ్బురపరిచారు ప్రసిద్ధ బీఎండబ్ల్యూ కార్ల సంస్థ చెన్నై శివార్లలోని కార్ల ప్లాంట్‌కు సచిన్ టెండూల్కర్‌ను ఆహ్వానించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కారు ప్లాంట్‌కు చేరుకున్న సచిన్‌ను కంపెనీ ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్సహర్, మేనేజింగ్ డెరైక్టర్ రాబర్ట్ ఫ్రిట్టరాంగ్ ఆహ్వానం పలికారు. టెక్నీషియన్ సచిన్ కారును బిగించేందుకు ముందుకు వచ్చినందుకు ఎంతో సంతోషం, అయితే అసలు ఈ కారులో ఎన్ని విడిభాగాలు ఉన్నాయో తెలుసా అని ఎండీ ప్రశ్నించారు. తెలియకేం, ఇక్కడకు వచ్చేముందు రాత్రంతా స్టడీ చేశాను..మొత్తం 2800 కాంపొనెంట్స్ ఉన్నాయని సచిన్ బదులివ్వగా, కరెక్ట్ అని ఎండీ మెచ్చుకున్నారు. ఆ తరువాత సమీపంలోని ఒక ట్రాలీలో సిద్ధంగా ఉన్న కారు ఇంజిన్‌భాగాన్ని సచిన్ తోసుకుంటూ వచ్చారు. పైభాగాన వేలాడుతున్న కారు క్రేన్ సహాయంతో కిందుకు రాగానే సచిన్ సహా అందరూ ఇంజన్‌ను లోన కూర్చోబెట్టారు. స్క్రూడ్రైవర్లు, మిషన్‌తో బోల్టులను బిగించే భారీ పనిముట్ల సహాయంతో ఇంజన్‌ను బిగించారు. ఆ తరువాత ముందువైపు టైరు బిగించే ప్రదేశంలో ఇంజన్ సరిగా కూర్చుందాని తనిఖీ చేసి పనిముగించారు. కారు ఇంజిన్‌ను బిగించడంలో తనకు శిక్షణ నిచ్చిన వెంకట్, నరేష్, ఇస్మాయిల్‌లను పిలిచి అభినందించారు. బీఎండడ్ల్యూ కార్ల ప్లాంట్ సిబ్బంది, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు సమక్షంలో ఒక సామాన్య టెక్నీషియన్‌గా సుమారు అరగంటపాటూ సచిన్ శ్రమించడం అందరినీ అబ్బురపరిచింది. మీడియా ప్రతినిధిగా సచిన్ టెక్నీషియన్‌గా అవతారం చాలించిన సచిన్ మీడియా ప్రతి నిధిగా సంస్థ ఎండీకి ఒక ప్రశ్నను సంధించారు. క్రికెటర్‌గా తాను అనేక దేశాల్లో ఈ కంపెనీ కార్లను చూశాను, నేడు 50 శాతం చెన్నై ప్లాంట్‌లోనే తయారవుతోందని అంటున్నారు, నాణ్యతా ప్రమాణాల్లో అక్కడి కార్లకు, భారతీయ తయారీకి ఏమైనా తేడా ఉందాని ప్రశ్నించారు. భారతీయమైన, విదేశమైనా నాణ్యతా ప్రమాణాల్లో సమభావం ప్రదర్శిస్తున్నామ ని, ఇందులో ఎటువంటి రాజీ లేదని ఎండీ స్పష్టం చేశారు. బీఎండబ్ల్యూ నా డ్రీమ్ కారు చిన్ననాటి నుండి అభిమానిస్తూ గమనిస్తున్న బీఎండబ్ల్యూ తన కలల కారుగా సచిన్ అభివర్ణించారు. నేడు అదే కారు ప్లాంట్‌కు తనను ఆహ్వానించడం జీవితంలో తనకు లభించిన గొప్ప బహుమతిగా భావిస్తున్నానని అన్నారు. ఈ ప్లాంట్‌లో గడిపిన క్షణాలు ఒక మధురమైన అనుభూతి అన్నారు. ప్రపంచంలోనే ఇది సూపర్‌క్లాస్ కారు అని సచిన్ వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన అనంతరం పది నిమిషాలపాటు కారు ముందు ఫోటోకు ఫోజులిచ్చారు. -చెన్నై,సాక్షి ప్రతినిధి -
పెద్దాసుపత్రుల్లో టెక్నీషియన్ల కొరత
► కీలకమైన కార్డియాలజీ, క్యాథ్‌ల్యాబ్, ఈసీజీ, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్లు లేరు ► అల్లాడుతున్న రోగులు.. ► వైద్య పరీక్షలకోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ► రోగులకే కాదు.. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకూ ఇక్కట్లు ► 350 మంది టెక్నీషియన్ల కొరత ఉన్నట్టు ప్రాథమిక నివేదిక హైదరాబాద్: జబ్బు నిర్ధారణలో వైద్య పరీక్షలు చాలా కీలకం. తద్వారా ఈ పరీక్షలు చేసే టెక్నీషియన్లది ఎంతో కీలక పాత్ర. రోగికి సరైన వైద్యం చేయాలంటే వైద్యుడు సైతం టెక్నీషియన్పైన ఆధారపడాల్సిందే. దురదృష్టవశాత్తూ మన ప్రభుత్వాసుపత్రుల్లో టెక్నీషియన్లే లేరు. ఫలితంగా పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో సరిగా వైద్యమందని పరిస్థితి నెలకొంది. పెద్దాసుపత్రికి వెళ్లి, ఔట్‌పేషెంట్ చిట్టీ రాయించుకుని.. వైద్యుని వద్దకు వెళ్లగానే.. జబ్బు నిర్ధారణకోసం వైద్య పరీక్షలు రాస్తే అవి చేసే టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేక రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఫలితంగా వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత..: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలూ.. వాటికి అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రులను టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పెద్దాసుపత్రులకు ఏటా దాదాపు 40 లక్షల మంది ఔట్పేషెంట్లు వస్తుంటే.. అందులో ఐదారు లక్షల మందికి మాత్రమే కొద్దోగొప్పో వైద్య పరీక్షలు అందుతున్నాయి. మిగతావారిలో చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఏటా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పొందే ఔట్పేషెంట్లు లేదా ఇన్‌పేషెంట్లు వైద్య పరీక్షలకోసం కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకూ ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లిస్తున్నట్టు అంచనా. ప్రభుత్వాసుపత్రుల్లో టెక్నీషియన్లు లేకపోవడమే ఇందుకు కారణం. టెక్నీషియన్ల కొరత కారణంగానే.. మన పెద్దాసుపత్రుల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన పరికరాలు మూలనపడి ఉండడం గమనార్హం. కీలకమైన విభాగాల్లోనే కొరత.. రాష్ట్రంలో ఔట్పేషెంట్ల రద్దీ బాగా ఉండే ఆస్పత్రుల్లో విశాఖ కింగ్‌జార్జి, గుంటూరు పెద్దాసుపత్రి, కర్నూలు, కాకినాడలోని రంగరాయ, విజయవాడలోని సిద్ధార్థ వంటివి ఉన్నాయి. వీటికి రోజూ వేలల్లో పేషెంట్లు వస్తారు. కానీ వీటిలో కీలకమైన కార్డియాలజీ, ఈసీజీ, క్యాథ్‌ల్యాబ్, అనస్థీషియా, రేడియోగ్రాఫర్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, థియేటర్ అసిస్టెంట్లు, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్లు లేరు. దీంతో వైద్యులు నిర్ధారణ పరీక్షలు రాసినా అవి చేసేవారు అక్కడ లేకుండా పోయారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటున్నది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఈసీజీలకు వస్తూంటారు. వీళ్లు బయటకు పోలేరు. లోపల టెక్నీషియన్లు ఉండరు. దీంతో వారి మనోవేదన వర్ణనాతీతం. వైద్యవిద్యార్థులకూ ఇక్కట్లే.. టెక్నీషియన్లు లేకపోవడం, వైద్య పరీక్షలు సరిగా జరగకపోవడంతో ఎంబీబీఎస్, పీజీ వైద్యవిద్యార్థులూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు సక్రమంగా జరిగితేనే ఆ రోగమేంటీ? ఎలా వైద్యమందించాలన్నది వైద్యవిద్యార్థులకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏటా 1,750 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 675 మంది పీజీ విద్యార్థులు కొత్తగా చేరుతుంటారు. అయితే పలు రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు జరగకపోవడంతో వీరందరికీ పలు రోగాల విషయంలో నేర్చుకోవాల్సి అంశాలపై సందిగ్ధత ఏర్పడుతున్నట్టు విద్యార్థులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్దాసుపత్రులు, వైద్య కళాశాలల్లో 350 మందికిపైగా టెక్నీషియన్ల కొరత ఉన్నట్టు వైద్యాధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన ఆసుపత్రుల్లోని వివిధ విభాగాల్లో టెక్నీషియన్ల ఖాళీల వివరాలివీ... ఆస్పత్రి టెక్నీషియన్ల కొరత జీజీహెచ్, కాకినాడ 40 జీజీహెచ్, గుంటూరు 45 కింగ్‌జార్జి, విశాఖ 40 జీజీహెచ్, అనంతపూర్ 25 జీజీహెచ్, కర్నూలు 35 ఎస్వీఆర్, తిరుపతి 33 జీజీహెచ్, విజయవాడ 28 -
ఉద్యోగాలు,ప్రవేశాలు
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్, నాసిక్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నీషియన్ ఖాళీల సంఖ్య: 56 విభాగాలు: ఎయిర్‌ఫ్రేమ్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంట్, రేడియో, రాడార్, అర్మామెంట్, మెటీరియాలజీ. అర్హతలు: ఐఏఎఫ్ డిప్లొమా/ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉండాలి.మెటీరియాలజీ విభా గానికి ఇంటర్, పీసీ ఆపరేషన్స్‌లో ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ ఉండాలి.సంబంధిత విభా గంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా చివరి తేది: ఆగస్టు 20 వెబ్సైట్: www.halin-dia.com క్యాట్ -2014 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లలో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2014 నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం క్యాంపస్‌ల్లో మేనేజ్మెంట్ పీజీ, ఫెలో ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. పరీక్ష తేదీలు: నవంబరు 16, 22 ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 30 వరకు వెబ్సైట్: www.iimcat.ac.in నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా-బెంగళూరు చాప్టర్ కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంటెన్సివ్ కోర్స్ ఇన్ యాక్టింగ్ సీట్ల సంఖ్య: 20 కాలపరిమితి: ఏడాది అర్హతలు: ఏదైనా డిగ్రీ. థియేటర్ ఆర్ట్స్‌లో పూర్తి పరిజ్ఞానం ఉండాలి. కనీసం నాలుగు స్టేజి ప్రొడక్షన్స్‌లో పాల్గొని ఉండాలి. వయసు: 20నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 13 వెబ్సైట్:http://nsd.gov.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ, బడౌహి (ఉత్తర ప్రదేశ్) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్స్: బీటెక్ (కార్పెట్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ) విభాగాలు: అడ్వాన్సెస్ ఇన్ కార్పెట్ టెక్నాలజీ, హోమ్ టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ డిజైన్ టెక్నాలజీ. ఎంపిక: జేఈఈ మెయిన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 9 వెబ్సైట్: http://iict.ac.in -
బెజవాడలోనైనా సినిమా తీయొచ్చు
నిర్మాత డి.సురేష్‌బాబు విజయవాడ : టెక్నీషియన్స ఉంటే బెజవాడలోనైనా చలనచిత్రాన్ని నిర్మించవచ్చని ప్రముఖ సినీ నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. ‘దృశ్యం’ చిత్రం విడుదల సందర్భంగా శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ర్టం విడిపోవడం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు ఎటువంటి నష్టం ఉండదన్నారు. సరైన టెక్నీషియన్స్ ఉంటే బెజవాడలోకూడా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయన్నారు. కేరళలో ఏప్రాంతంలోనైనా సినిమాలు తీస్తారని చెప్పారు. దృశ్యం సినిమా యూత్, ఫ్యామిలీని ఆకట్టుకుంటుందన్నారు. చిత్రం బావుందని చాలంమంది ప్రశంసిస్తున్నారని చెప్పారు. వెంకటేష్, పవన్ కల్యాణ్ కలిసి నటిస్తున్న గోపాలా..గోపాలా చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు.