Chandrayaan-3Technician selling idli ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్ నిర్మాణంలో పనిచేసిన టెక్నీషియన్ దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడన్న వార్త మీడియాలో సంచలనం రేపుతోంది. ఇస్రోకు చెందిన HEC (హెవీఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్)లో దీపక్ కుమార్ ఉప్రారియా రాంచీలోని ధుర్వా ప్రాంతంలో టీ, ఇడ్లీ దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం వైరల్‌గా మారింది.
బీబీసీ కథనం ఆధారంగా ఎన్డీటీవీ అందించిన రిపోర్ట్ ప్రకారం చంద్రయాన్-3 కోసం ఫోల్డింగ్ ప్లాట్‌ఫారమ్ అండ్ స్లైడింగ్ డోర్‌ను తయారు చేసిన ప్రభుత్వ ఉద్యోగికి 18 నెలలుగా జీతం చెల్లించకపోవడంతో అతను రోడ్‌సైడ్ స్టాల్‌ను తెరిచాడు. హెచ్ఈసీలో పనిచేస్తున్న ఉప్రారియా ఏమన్నారంటే.. జీతం అందక కొన్నాళ్లు క్రెడిట్ కార్డ్‌తో నెట్టుకొచ్చా. ఆ తరువాత బంధువులు, స్నేహితుల ద్వారా దాదాపు నాలుగు లక్షల అప్పు చేశాను.. భార్య నగలు తాకట్టు పెట్టి కొన్ని రోజులు ఇంటిని నడిపించా.. ఇపుడిక అప్పులు తీర్చే పరిస్థితి లేదు ఆవేదన వ్యక్తం చేశారు
ఆకలితో చచ్చిపోవడం కన్నా
అందుకే ఇక వేరే గత్యంతరం లేక కడుపు నింపుకుంనేందుకు ఆకలితో చచ్చిపోవడం కన్నా ఇడ్లీ దుకాణం బెటర్ అనే ఉద్దేశంతో ఈ దుకాణాన్ని తెరవాల్సి వచ్చిందని చెప్పారు. భార్య మంచి ఇడ్లీలు చేస్తుంది. వాటిని అమ్మడం ద్వారా రోజుకి 300-400 రూపాయలొస్తాయి. తద్వారా 50-100 రూపాయల లాభం వస్తుంది ఈ డబ్బుతోనే ఫ్యామిలీని నెట్టుకొస్తున్నానని తెలిపారు. అంతేకాదు తనకు ఇద్దరు కూతుళ్లని, ఈ ఏడాది ఇంకా స్కూల్ ఫీజు కట్టలేకపోవడంతో స్కూల్ నుంచి రోజూ నోటీసులు పంపుతున్నా రన్నారు. క్లాస్ రూంలో టీచర్లు హెచ్ఈసీలో పనిచేస్తున్న వారి పిల్లలు ఎవరని అడిగి మరీ అవమానించారనీ, దీంతో తన కుమార్తెలు ఏడుస్తూ ఇంటికి రావడం చూసి గుండె పగిలిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఉప్రారియా తోపాటు సంస్థలోని దాదాపు 2,800 మంది ఉద్యోగుల జీతాలు అందలేదని తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన ఉప్రారియా 2012లో, ప్రైవేట్ కంపెనీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, 8,000 జీతంతో HECలో చేరాడు. ప్రభుత్వ సంస్థ కావడంతో తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశపడ్డాడు. కానీ అతని అంచనాలు తల్లకిందులైనాయి. అయితే జీతాల సమస్యపై కేంద్రం స్పందిస్తూ, హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ స్వతంత్ర సంస్థకాబట్టి ఉద్యోగుల జీతభత్యాల బాధ్యత ఆ సంస్థదే అని తెలిపింది. కాగా ఇస్రో చంద్రయాన్-3 జూలై 14న విజయ వంతంగా ప్రయోగించింది. తద్వారా చంద్రుని దక్షిణ ధృవంపై కాలిడిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
Meet Deepak Kumar Uprariya who sells Tea & Idli in Ranchi. He is a Technician, who worked for building ISRO's Chandrayaan-3 launchpad. For the last 18 months, he has not received any salary.
"When I thought I would die of hunger, I opened an Idli shop" (BBC Reports) pic.twitter.com/cHqytJvtfj
— Cow Momma (@Cow__Momma) September 17, 2023
Comments
Please login to add a commentAdd a comment