
9 బిలియన్ డాలర్ల భారీ డీల్
న్యూయార్క్: షూస్ తయారీ సంస్థ స్కెచర్స్‌ను ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం 3జీ క్యాపిటల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 9 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కొనుగోలు తర్వాత ప్రైవేట్ సంస్థగా మార్చనుంది. ఈ ఒప్పందానికి స్కెచర్స్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొనుగోలు అనంతరం కూడా కంపెనీకి స్కెచర్స్ చైర్మన్, సీఈవో రాబర్ట్ గ్రీన్‌బర్గ్, ఆయన మేనేజ్‌మెంట్ బృందం సారథ్యం వహిస్తుంది. సంస్థ హెడ్‌క్వార్టర్స్ కూడా మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన చోటే (కాలిఫోరి్నయా) కొనసాగుతుంది.