
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్‌ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు.
ఎలాన్ మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్‌ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్‌తో మస్క్‌కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment