Austin
-
రూ.295 కోట్లతో ఇల్లు కొన్న మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్‌ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్‌ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్తో మస్క్‌కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు. -
ఉద్రిక్తతల నడుమ ఉక్రెయిన్‌కు అమెరికా రక్షణ మంత్రి
కీవ్: రష్యాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో లాయిడ్ ఆస్టిన్ ఉక్రేనియన్ నేతలతో ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారు.I’m back in Ukraine for the fourth time as Secretary of Defense, demonstrating that the United States, alongside the international community, continues to stand by Ukraine. pic.twitter.com/0gCwAqqEpK— Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) October 21, 2024తన పర్యటన సందర్భంగా ఆస్టిన్ ఒక ట్విట్టర్ పోస్టులో ‘అంతర్జాతీయ సమాజంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తుందని తెలియజేయడానికే తాను నాల్గవసారి ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చానని’ తెలిపారు. మరోవైపు రక్షణ కార్యదర్శి లాయిడ్ జె. ఆస్టిన్ III ఉక్రెయిన్‌కు చేరుకున్నారని, ఉక్రెయిన్ స్వాతంత్ర్య పోరాటానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతును పునరుద్ఘాటించారని పెంటగాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా దురాక్రమణ నుండి ఉక్రెయిన్‌కు అవసరమైన భద్రతా సహాయాన్ని అందించడానికి యూఎస్ కట్టుబడి ఉందని పెంటగాన్ తెలిపింది. ఇది కూడా చదవండి: యాహ్యా సిన్వార్ మృతి.. హమాస్‌కు చీఫ్ లేనట్లే! -
అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం
ఆస్టిన్: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన తాడిబోయిన రవితేజ(28) స్విమ్మింగ్ ఫుల్లో జారిపడి తీవ్రగాయాలతో మరణించాడు. ఈ నెల 18వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఘటన చోటు చేసుకుంది. అయితే రవితేజ నేపథ్యం గురించి.. ఘటన గురించి అక్కడి అధికారుల నుంచి మరింత సమాచారం అందాల్సి ఉంది. -
టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 28వ రాష్ట్రం టెక్సాస్. దీని రాజధాని ఆస్టిన్. జనాభారీత్యా చూసినప్పుడు ఆస్టిన్ 9.58 లక్షలు. దీని కన్నా ఇదే రాష్ట్రంలోని డల్లాస్ ( 13 లక్షలు ), సాన్అంటానియో ( 14.45 లక్షలు ), హుస్టన్( 23 లక్షలు ) నగరాల్లో ఎక్కువ జనాభా. అయినా చారిత్రక ప్రాధాన్యాన్నిబట్టి రాష్ట్రం మధ్యలో ఉండడం వల్ల ఆస్టినే రాజధాని అయింది. ఆస్టిన్‌లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టేట్ లెజిస్లేచర్, గవర్నర్, మంత్రుల చాంబర్లు ఉన్నాయి. యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ ఉన్నది ఆస్టిన్‌లోనే. తప్పక చూడాల్సింది స్పేస్ సెంటర్..ఈ నగర జనాభాలో మూడింట ఒక వంతు హిస్పానిక్స్, ఆఫ్రికన్ / ఏసియన్ అమెరికన్లు. టెక్సాస్‌లోని అతి పెద్ద నగరమైన హుస్టన్ సిటీలో చూడదగ్గవి ఎన్నోఉన్నాయి. హుస్టన్ సిటీలో నేను మొదటగా చూసినవి అక్వేరియం, చిల్డ్రన్స్ మ్యూజియం లాంటివి. తప్పక చూడాల్సిన సందర్శనీయ స్థలాల్లో గాల్వెస్టన్ సముద్రతీరం, నాసా (NASA) వారి స్పేస్ సెంటర్ వంటివి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న విద్యార్థి అయినా.. శాస్త్ర సాంకేతికత మీద, అంతరిక్షం మీద ఆసక్తి ఉంటే.. నాసా సెంటర్ చూడాలనుకుంటారు. లిండన్ బి. జాన్సన్ స్పేస్ సెంటర్ పేరిట హ్యూస్టన్‌లో నిర్మించిన NASA కేంద్రాన్ని స్పేస్‌క్రాఫ్ట్ సెంటర్ అని పిలుస్తారు. ఇక్కడ అంతరిక్షయాన శిక్షణ, పరిశోధన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రానికి ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ పేరు పెట్టారు. తటస్థ ప్రయోగశాల అంటే..దీన్ని నవంబర్ 1961లో పూర్తి చేశారు. క్లియర్ లేక్ ఏరియాలో 1,620 ఎకరాల్లో 100 భవనాల్లో నిర్మించిన ఈ కేంద్రంలో దాదాపు 3,200 మంది పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్.. జెమిని 4 ( అపోలో , స్కైలాబ్ , అపోలో-సోయుజ్ మరియు స్పేస్ షటిల్‌తో సహా ) నుంచి ప్రతి అంతరిక్ష ప్రయాణాన్ని పరిశీలిస్తుంది. అంటే ఒక స్పేస్‌క్రాఫ్ట్ భూమి నుంచి దాని లాంచ్ టవర్‌ను క్లియర్ చేసిన క్షణం నుంచి తిరిగి భూమిపైకి తిరిగి వచ్చే వరకు దాని కంట్రోల్‌ను ఈ కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఈ కేంద్రంలో ఆసక్తి ఉన్న వారికి అర్థమయ్యేలా ఎన్నో ఆకర్షణీయ ఏర్పాట్లు ఉన్నాయి. తటస్థ ప్రయోగశాల.. అంటే అంతరిక్షంలో ఉన్నట్టుగా గాలిలో తేలే వాతావరణాన్ని ఇక్కడ స్వయంగా తెలుసుకోవచ్చు. అలాగే సుమారు 6.2 మిలియన్ యూఎస్ గ్యాలన్ల నీళ్లు ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో వ్యోమగాములు జీరో గ్రావిటీని అనుకరిస్తూ శిక్షణ పొందుతారు. సందర్శకులను స్పేస్ సెంటర్ వరకు అనుమతిస్తారు. అక్కడ ఉంటే హైదరాబాద్‌లో ఉన్నట్లే..ఇక టెక్సాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది. టెక్సాస్‌లో చాలా చోట్ల తెలుగు వాళ్లు కనబడతారు. డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్ ఎక్కడయినా.. చూస్తూ ఉంటే హైదరాబాద్‌లో ఉన్నామా అనిపిస్తుంది. హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. ఒక్క బిర్యానీనే కాదు, సీజన్లో హాలీం కూడా దొరుకుతుంది. ఇరానీ ఛాయ్, సమోసాలు, ఇడ్లీ-దోశ సెంటర్లు.. చూస్తూ ఉంటే సరదాగా అనిపిస్తుంది. ఒక్క భోజనమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో దొరికే ఏ వస్తువు అయినా.. టెక్సాస్‌లో కొనుక్కోవచ్చు. జండూబామ్ నుంచి గోధుమ పిండి వరకు, బియ్యం, నుంచి బాదాంపప్పు వరకు ఏం కావాలన్నా సులువుగా దొరుకుతాయి. కిషోర్ పబరి ఇండియా బజార్, పటేల్ బ్రదర్స్ కిరాణ మార్కెట్, సరిగమప సూపర్‌మార్కెట్, సబ్జీ మండీలతో పాటు బంగారు, వజ్రాల దుకాణాలు బాగానే కనిపిస్తాయి. ఇండియన్ దుస్తులు పంజాబీ డ్రెస్ నుంచి లుంగీల దాకా అన్నీ దొరుకుతాయి. చాలా చోట్ల సంగీతం, భరత నాట్యం నేర్పే వాళ్లు, యోగా క్లాసులు, తెలుగు భాష, మ్యాథ్స్ క్లాసులు దర్శనమిస్తాయి. డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో మనవాళ్లే టాప్. అన్నట్టు ఇక్కడ మనవాళ్లు అప్పుడే రియల్ ఎస్టేట్‌ను పీక్‌లోకి తీసుకెళ్లారు. అలాగే ఇండియన్ ఈవెంట్స్ కూడా. డాలస్ నగరాన్ని జలవనరుల ఆధారితంగా నిర్మించారు. ట్రినిటీ నది తెల్లరాళ్ళను దాటుతున్న ప్రాంతంలో ఈ సిటీ కట్టారు. నదికి ఇరువైపులా మట్టి గోడలను కట్టి ట్రినిటీ రివర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు. పార్క్‌లు, రెస్టారెంట్లతో వినోద విహార కేంద్రంగా మారింది. డాలస్ మొత్తం నగరం నదీతీరం పక్కనే.. దాదాపు 20 మైళ్ళు సిటీని ఆనుకుని నదీ తీరం ఉంటుంది. ప్రశాంతంగా రాజధానిడల్లాస్ ఓ రకంగా హైదరాబాద్ వాతావరణంలా అనిపిస్తుంది. హ్యూస్టన్లా గాలిలో తేమ ఉండదు. వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. హుస్టన్ కాలుష్య వాతావరణంతో పోల్చుకున్నప్పుడు ఆస్టిన్ నాకు ప్రశాంతంగా తోచింది. ఒక రాష్ట్ర రాజధాని ఇంత సింపుల్‌గా ఉండడం గొప్ప విషయమే అనిపించింది. మొత్తం మీద టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా.? అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సారి అమెరికా వచ్చినప్పుడు ఓ సారి ఓ లుక్కేయండి. మీరే చెబుతారు.వేముల ప్రభాకర్(చదవండి: అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !) -
US : ఆస్టిన్ తెలుగు సంఘానికి కొత్త కార్యవర్గం
అమెరికా టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో 2024కి గాను తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) నూతన కార్యవర్గం ఏర్పాటయింది. రౌండ్ రాక్ విన్గేట్ బై విందామ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కొత్త కార్యవర్గాన్ని ఆస్టిన్ తెలుగు కమ్యూనిటీ ప్రకటించింది. తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) కార్యవర్గం వివరాలు అధ్యక్షుడు : పరమేశ్వర రెడ్డి నంగి ఉపాధ్యక్షుడు : శ్రీని బైరపనేని సెక్రెటరీ : భరత్ పిస్సాయ్ ట్రెజరర్ : చిన్నపరెడ్డి కుందూరు సంయుక్త కార్యదర్శులు : కల్చరల్ : ప్రతిభ నల్ల ఫైనాన్స్ & స్పాన్సర్షిప్ : లక్ష్మీకాంత్ ఫుడ్ & లాజిస్టిక్స్ : వెంకటేష్ దూబాల మెంబర్షిప్ & టెక్నాలజీ : శ్రీలత అంబటి స్పోర్ట్స్ : సర్వేశ్వరా రెడ్డి పాశం బోర్డు అఫ్ డైరెక్టర్లు : అర్జున్ అనంతుల గిరి మేకల బ్రహ్మేంద్ర రెడ్డి లాక్కుని గత కార్యవర్గంలో సేవలందించిన రామ్ హనుమంతు మల్లిరెడ్డి,మురళీధర్ రెడ్డి వేలూరు, శ్రీనివాస్ బత్తుల మరియు ఇతర TCA సభ్యులకు కొత్త కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. అమెరికాలోని తెలుగు సమాజానికి, ప్రవాసాంధ్రులకు మరిన్ని సేవలందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపింది. -
అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్(70) అనారోగ్యంతో గత సోమవారం నుంచి విధులకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఆయన వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతున్నట్లు పెంటగాన్ తెలిపింది. స్వల్ప శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం సమస్యలు తలెత్తడంతో సోమవారం ఆయన్ను మెడికల్ సెంటర్లో చేరి్పంచినట్లు పెంటగాన్ ప్రతినిధి ఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ శుక్రవారం(స్థానిక కాలమానం ప్రకారం) చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని, ఈ రోజే ఆయన విధుల్లో చేరే అవకాశాలున్నాయని తెలిపారు. వ్యక్తిగత గోప్యత, వైద్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఆస్టిన్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపారు. అవసరమైన పక్షంలో సహాయ మంత్రి కాథ్లీన్ హిక్స్ ఆయన స్థానంలో బాధ్యతలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. -
సొంత పట్టణం నిర్మించనున్న ఎలాన్ మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ సొంతంగా ఒక పట్టణాన్నే నిర్మించబోతున్నారు. ఇందుకోసం ఆయన కంపెనీలు, అనుబంధ సంస్థలు టెక్సాస్‌లో వేలాది ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆస్టిన్‌కు సమీపంలోని బస్ట్రోప్ కౌంటీలోసుమారు 3,500 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయి. స్నెయిల్ బ్రూక్ అనే పేరుతో సొంత పట్టణాన్ని నిర్మించే పనుల్లో ఎలాన్ మస్క్ నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా మస్క్‌కు చెందిన బోరింగ్ కంపెనీ, టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సంస్థలకు ఆస్టిన్ సమీపంలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. కొత్త పట్టణంలో మార్కెట్ ధర కంటే చౌకగానే ఆఫీసులను ఏర్పాటు చేయనున్నాయి. ఉద్యోగుల నివాసాలు కూడా ఇందులోనే ఉంటాయి. నూతనంగా రూపుదాల్చే స్నెయిల్ బ్రూక్‌లో 100కు పైగా భవనాలను నిర్మిస్తారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాల వంటి ఏర్పాట్లూ ఉంటాయి. టెస్లా ప్రధాన కార్యాలయంతోపాటు తన వ్యక్తిగత నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మారుస్తానని గతంలోనే మస్క్ ప్రకటించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం గుర్తు చేసింది. -
ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో తెలుగు కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. బ్రశీ క్రీక్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా అర్జున్ అనంతుల, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా పరమేష్ రెడ్డి నంగీ , కార్యదర్శిగా శివ దుర్భాకుల, కోశాధికారిగా మధుకర్ రెడ్డి గంగాడి నియమితులు అయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా శైలజ కోమటి ( కల్చరల్), జగన్ మల్కారెడ్డి( ఫైనాన్స్ & స్పాన్సర్షిప్) ,భరత్ పిస్సాయ్(మెంబర్షిప్), గోపాల కృష్ణ అయితాబత్తుల(ఫుడ్ & లాజిస్టిక్స్), చిన్నప్ప కుందూరు(స్పోర్ట్స్), బోర్డు అఫ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ బత్తుల నియమితులయ్యారు. బోర్డు అఫ్ డైరెక్టరులుగా కొనసాగుతున్న రామ్ హనుమంతు , మురళీధర్ వేలూరికి నూతన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
ఆస్టిన్‌లో ఉత్సాహంగా దసరా - దీపావళి వేడుకలు
టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో తెలుగు కల్చర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి పండుగల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సినీ గాయకులు గీత మాధురి ,అఖిల మమందుర్, ఆదిత్య ఐయాంగర్లు తమ పాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో టీసీఏ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బత్తుల ప్రెసిడెంట్ ఎలెక్ట్ అర్జున్ అనంతుల ,సెక్రెటరీ శ్రీనివాస్ బైరపనేని ,ట్రెజరర్ వెంకట్ సాదినేని , స్పోర్ట్స్ కమిటీ చైర్ పరమేశ్వర్ రెడ్డి నంగి, ఫైనాన్స్ సెక్రటరీ మధుకర్ , ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ సెక్రటరీ చిన్నపరెడ్డి, మెంబర్షిప్ సెక్రటరీ భరత్ పిస్సాయ్ , కల్చరల్ సెక్రటరీ శైలజ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ వెంకటరామి రెడ్డి ఉమ్మ, రామ్ హనుమంత్ మల్లిరెడ్డి, మురళీధర్ రెడ్డి వేలూరు ధన్యవాదాలు తెలిపారు. -
'ఇలా అయితే కష్టం'..మనకంటూ ఓ సొంత ఎయిర్ పోర్ట్ ఉండాల్సిందే!
ప్రపంచ అపర కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకొక సొంత ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే వందల ఎకరాల్లో ఎయిర్ పోర్ట్‌ను నిర్మించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన పలు సంస్థల కార్యకలాపాలన్నీ టెక్సాస్‌లోనే జరుగుతున్నాయి. స్పేస్ ఎక్స్, బోరింగ్ కంపెనీతో పాటు గతేడాది డిసెంబర్ నెలలో టెస్లా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మస్క్ సిలికాన్ వ్యాలీకి తరలించారు. ఈ తరుణంలో తన బిజినెస్ కార్యకలాపాల్ని వేగవంతం చేసుకునేందుకు టెక్సాస్‌లోని బాస్ట్రాపో సమీపంలో ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం పనులు వేగం వంతం చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. మస్క్‌కు వేల ఎకరాలు ఎలాన్ మస్క్‌కు సెంట్రల్ టెక్సాస్‌లో వందల ఎకరాల భూములున్నాయి. అవి కాకుండా గిగా టెక్సాస్ కోసం 2,100 ఎకరాలున్నాయి. గతంలో స్పేస్ఎక్స్, బోరింగ్ కంపెనీ నిర్మాణల కోసం మరికొన్ని వందల ఎకరాల భూమిని సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆస్టిన్ సమీపంలో ఉన్న తన సొంత ల్యాండ్‌లో మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ నిర్మించనున్నారని, ఆ ఎయిర్ పోర్ట్‌ను ఎన్ని వందల ఎకరాల్లో నిర్మిస్తున్నారనే అంశంపై స్పష్టత లేదు. కానీ ఇప్పటికే ఆస్టిన్‌లో ఉన్న ఎగ్జిటీవ్ ఎయిర్పోర్ట్ 585 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. అదే తరహాలో నిర్మిస్తారా లేదంటే తక్కువ విస్తీర్ణయంలో నిర్మిస్తారా' అనేది తెలియాల్సి ఉంది. -
యోగర్ట్ షాప్ హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే..!
అమెరికన్స్‌ను వణికించిన అపరిష్కృత మిస్టరీల్లో ఈ కథొకటి. అది 1991 డిసెంబర్ 6. రాత్రి 11 దాటింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో ‘ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ యోగర్ట్’ అనే క్లోజ్ చేసి ఉన్న షాపులోంచి మంటలు రావడం పెట్రోలింగ్ పోలీసుల కంటపడింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, కొద్దిసేపటికే ఫైర్ ఇంజన్ల మోతమోగింది. మంటలార్పేటప్పుడు కనిపించిన భయంకరమైన దృశ్యాలు సంచలనానికి తెరతీశాయి. షాపు వెనుక గది మధ్యలో ఒక అమ్మాయి నగ్నంగా శవమై ఉంది. తన చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. ఆమె బట్టలతోనే ఆమెని ఎవరో బంధించారు. షాపులో చెలరేగిన మంటలకు సగానికి పైగా శరీరం కాలిపోయింది. వెనుక గదికి వెళ్లి చూస్తే, మరో ముగ్గురు అమ్మాయిలు అదే రీతిలో నగ్నంగా ఓ మూలన పడి ఉన్నారు. తెల్లారేసరికి చనిపోయిన వారి వివరాలను తేల్చేశారు పోలీసులు. మరునాడు దేశమంతా ఇదే వార్త. చనిపోయిన నలుగురిలో జెన్నిఫర్ హార్బిసన్(17), ఎలీజా థామస్(17) ఇద్దరూ ప్రాణస్నేహితులు. అదే షాపులో పార్ట్‌టైమ్ ఉద్యోగులు. ఆ రాత్రి నైట్ షిప్ట్‌లో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో సారా హార్బిసన్(15) జెన్నిఫర్ సొంత చెల్లెలు. మరో అమ్మాయి అమీ అయర్స్(13) సారా స్నేహితురాలు. ఈ నలుగురూ జీవితంలో తమకంటూ ప్రత్యేకత ఉండాలని కలలు కన్నవారే. సారా, జెన్నిఫర్ ఇద్దరూ స్పోర్ట్స్‌లో ఎన్నో అవార్డ్స్ సాధించారు. ఇద్దరూ అక్కా చెల్లెల్లా కాకుండా స్నేహితుల్లా కలిసుండేవారు. అమీ కూడా ఎప్పుడూ వారి స్నేహాన్నే కోరుకునేది. తను చిన్నప్పటి నుంచి ప్రకృతి ప్రేమికురాలు. ఫిషింగ్, హార్స్ రైడింగ్, పెట్స్ ట్రైనింగ్.. ఇలా తనదో ప్రత్యేక ప్రపంచం. ఇక ఎలీజా చాలా అందగత్తె. మోడల్ కావాలని కలలు కనేది. మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు కావలసిన డబ్బుల కోసమే పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ కష్టపడేది. ఒక్కోక్కరిదీ ఒక్కో కల. కానీ రాత్రికిరాత్రే అంతా తారుమారై, జీవితాలే ముగిసిపోయాయి. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో నలుగురినీ తీవ్రంగా హింసించి, లైంగిక దాడి చేశారని, తర్వాత తలలపై తుపాకీలతో కాల్చి చంపారని తేలింది. నేరస్థులు షాపు వెనుక డోర్ నుంచి పారిపోయినట్లుగా నిర్ధారించారు. కొన్ని సాక్ష్యాలు కాలి బూడిదైతే, మరికొన్ని మంటలార్పే క్రమంలో కొట్టుకుపోయాయి. దాంతో ఎవ్వరినీ అరెస్ట్ చేయలేకపోయారు. 1999 నాటికి బాధిత కుటుంబాల పోరు పెరిగింది. కేసు దర్యాప్తు చేసే అధికారులూ మారారు. అనుమానితుల్లో మారిస్ పియర్స్, ఫారెస్ట్ వెల్బోర్న్, మైకేల్ స్కాట్, రాబర్ట్ స్ప్రింగ్స్టీన్ అనే పాతికేళ్లలోపు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఎవరో కాదు హత్యలు జరిగిన ఎనిమిదో రోజు తుపాకీతో పట్టుబడి, తగిన సాక్ష్యాలు లేక విడుదలైన వాళ్లే! ఈసారి మెక్సికన్ అధికారులు విచారించినప్పుడు నేరాన్ని ఒప్పుకున్నారు. అయితే, కీలకమైన మరే సాక్ష్యాధారాలు లేకపోవడంతో.. ఆ తర్వాత పోలీసులే తమతో బలవంతంగా ఒప్పించారని చెప్పారు. ఇలాంటి సాక్ష్యం చెల్లదని కోర్టు కొట్టేసింది. పైగా అదే ఏడాది అమీ లైంగిక దాడిలో బయటపడిన డీఎన్ ఏ ఆ నలుగురిలో ఏ ఒక్కరితోనూ సరిపోలేదు. మరి అసలు నేరస్థులెవరని కోర్టు అధికారులను నిలదీసింది. ఈ నలుగురిపై అభియోగాలను కొట్టేసింది. అయితే 2010 డిసెంబర్ 25 రాత్రి 11 గంటల సమయంలో మారిస్ పియర్స్ పెట్రోలింగ్ పోలీసుల కంటపడ్డాడు. అతడి కంగారు చూసి... పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, కత్తిదూశాడు. అధికారుల్లో ఒకరైన ఫ్రాంక్ విల్సన్ తుపాకీతో కాల్చి అతడ్ని చంపేశాడు. జెన్నిఫర్, ఎలీజాల డ్యూటీ తర్వాత పార్టీకి వెళ్లాలనేది ఆ నలుగురు అమ్మాయిల ప్లాన్. అందుకే అమీ, సారాలూ వాళ్లతో ఉన్నారు. షాప్ క్లోజ్ చేసే టైమ్‌కి చివరిగా ఉన్న కస్టమర్స్‌ని కూడా పోలీసులు విచారించారు. సుమారు 52 మంది ఆ సమయంలో షాప్‌కి వచ్చి పోయారని ప్రత్యక్షసాక్షుల కథనం. అయితే క్లోజింగ్ టైమ్ కాబట్టి షాప్ ఫ్రంట్ డోర్ జెన్నిఫర్ మూసేసి, ఇతర కస్టమర్స్ లోనికి రాకుండా చేసిందని, ఆ టైమ్‌లో ఓ వ్యక్తి వాష్‌రూమ్ లోపలికి వెళ్లడం గమనించినా, తిరిగి రావడం తాము చూడలేదని కొందరు చెప్పారు. మరోవైపు చివరిగా షాప్ నుంచి బయటపడిన ఓ జంట.. షాప్‌లో ఇద్దరు మగవాళ్లు నక్కి నక్కి ఉన్నట్లు అనిపించిందని, వారిలో ఒకరు గ్రీన్ కలర్ జాకెట్, మరొకరు బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్నారని చెప్పారు. అయితే విచారించిన కస్టమర్స్‌లో ఆ ఇద్దరూ మిస్సయినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లే ఈ ఘాతుకానికి ఒడికట్టి ఉంటారని అంచనాలు వేశారు. మరోవైపు సీరియల్ కిల్లర్స్ పాత్రపై దర్యాప్తు చేసినా, ఫలితం దక్కలేదు. పైగా ఈ ఘటన జరిగిన రోజు షాప్‌లో 540 డాలర్లు గల్లంతైనట్లు యాజమాన్యం గుర్తించింది. అయితే అది నేరస్థుల డైవర్ టెక్నిక్‌లో భాగమేనని, వాళ్లు వచ్చింది డబ్బులు కోసం కాదని, అమ్మాయిల కోసమేనన్నది డిటెక్టివ్స్ నమ్మకం. అయితే ముప్పయ్యేళ్లు దాటినా ఈరోజుకీ నేరుస్థులెవరో తేలలేదు. నేటికీ యోగర్ట్ షాప్ పక్కనుంచి వెళ్లే వాళ్లు అక్కడ ఓ క్షణం ఆగుతారు. ఆ నలుగురు అమ్మాయిల స్మారక ఫలకంపై పూలు ఉంచి, ఎప్పటికైనా న్యాయం గెలవాలని కోరుకుంటారు. ∙సంహిత నిమ్మన -
సాయిబాబా ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు
షిరిడి సాయిబాబా దేవస్థానం ఆస్టిన్, వెంకటేశ్వర దేవస్థానం ఆస్టిన్ (టెక్సాస్) ఆధ్వర్యములో అంగరంగ వైభవముగా శ్రీ సీతారామ కళ్యాణం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సుమారుగా 6000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగం సాయిబాబాకి చందన, చావడి ఉత్సవం నిర్వహించగా సీతారాములుకి మంగళ స్నానం చేయించారు. సీతారామ కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. వచ్చిన ప్రతీ భక్తునికి బంతి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కల్పన నూకవరపు, రవి బురుజులు, మల్లిక్ ఆవుల, కేథార్‌నాధ్ ముండ్లురూ, పూర్ణేశ్ సవితాల, విజయ్ దొడ్ల, సౌజన్య , బాలాజీ ఆత్యంలు ఈ వేడుకులు నిర్వహించడంలో పాలు పంచుకున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, వలంటీర్స్‌కు పేరు పేరున కృతఙ్ఞతలు తెలిపారు. -
చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్
Samsung Texas Chip Factory: కరోనా వైరస్-లాక్డౌన్ ప్రభావాల వల్ల స్మార్ట్ డివైజ్‌లు, వాహనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు.. చిప్ కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు ఏకంగా సొంతంగా చిప్ తయారీకి పూనుకుంటున్నాయి ఫోన్ కంపెనీలు. ఈ క్రమంలో శాంసంగ్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. చిప్ ఫ్యాక్టరీల నిర్మాణానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్, యాపిల్ కంపెనీలు రంగంలోకి దిగగా.. ఇప్పుడు శాంసంగ్ వాటి ప్రాజెక్టులను తలదన్నేలా భారీ ప్రణాళికకు ముందడుగు వేసింది. ఏకంగా 17 బిలియన్ డాలర్ల(17 X ఏడువేల కోట్ల రూపాయలు) భారీ ఖర్చుతో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు టెక్సాస్ ఆస్టిన్ నగరం శివారులో జెయింట్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్లు ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం అధికారికంగా ప్రకటించింది కూడా. గత కొన్నేళ్లుగా టెక్ కంపెనీలకు అడ్డాగా మారుతున్న టెక్సాస్‌లో ఈ రేంజ్లో ఓ విదేశీ కంపెనీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుండడం విశేషం. వచ్చే ఏడాది నుంచి బిల్డింగ్ నిర్మాణం.. 2024 నుంచి చిప్ తయారీ పనులు ప్రారంభించాలని శాంసంగ్ ప్రణాళిక వేసుకుంది. చదవండి: గూగుల్.. చిప్ చిచ్చు రాజుకుందా? లాక్డౌన్ ప్రభావంతో చిప్ ఫ్యాక్టరీలు మూతపడగా.. ప్రస్తుతం చిప్ షార్టేజ్ సమస్య ప్రపంచం మొత్తం కొనసాగుతోంది. అమెరికా లాంటి అగ్రదేశాలు.. చైనా, తైవాన్ లాంటి ఆసియా దేశాల మీద చిప్ కోసం ఆధారపడి ఉన్నాయి. కానీ, ముందు ఆసియా దేశాల కొరత తీర్చాకే బయటి దేశాలకు ఉత్పత్తి చేసే ఉద్దేశంలో ఉన్నాయి చిప్ తయారీ కంపెనీలు. చదవండి: చిప్‌ల తయారీలోకి ఆపిల్, గూగుల్.. ఏమిటీ వివాదం? -
ఎలోన్ మస్క్ ఎంట్రీతో మెరుపు వేగంతో పెరిగిన ఇళ్ల ధరలు
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ టెస్లా కొద్ది రోజుల క్రితం అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ హెడ్ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు తరలించనున్నట్లు ప్రకటించి ఆటోమొబైల్ మార్కెట్‌కు భారీ షాక్ ఇచ్చింది. అక్టోబర్ 7న జరిగిన షేర్‌హోల్డర్స్ వార్షికోత్సవం సమావేశంలో కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఊహించని ఈ ప్రకటన చేశాడు. ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా టెస్లా నిర్మించబోయే గిగాఫ్యాక్టరీ చుట్టూ గృహా ధరలు భారీగా పెరిగాయి. గిగా ఫ్యాక్టరీ నిర్మించే టెక్సాస్ లోని ట్రావిస్ కౌంటీలో ఇంటి ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 53.7% పెరిగాయి. మొత్తం టెక్సాస్ లోని ఆస్టిన్‌తో పోలిస్తే ఇది 26% కంటే ఎక్కువ. టెస్లా సైబర్ ట్రక్, సెమీ ట్రక్, మోడల్ 3 & వై కోసం 5 మిలియన్ చదరపు అడుగుల కర్మాగారం అవసరం. అందుకే ఇక్కడ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇన్ సైడర్ ప్రకారం, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు గంటకు $15 ప్రారంభ వేతనంతో 5,000 మంది నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టెస్లా తెలిపింది. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చేసిన ప్రకటనతో ప్లాంట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మకానికి ఉన్న గృహాలు ధరలు రాకెట్ వేగంతో పెరగడం ప్రారంభించాయి. (చదవండి: అంతరిక్ష రంగంలో పోటీ పడుతున్న దేశీయ ప్రైవేట్ కంపెనీలు) -
Tesla: అనూహ్య నిర్ణయంతో షాకిచ్చిన టెస్లా
ఈవీ దిగ్గజ కంపెనీ టెస్లా అనూహ్య నిర్ణయం తీసుకుంది. కంపెనీ హెడ్ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు తరలించనున్నట్లు ప్రకటించి ఆటోమొబైల్ మార్కెట్‌కు భారీ షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన షేర్‌హోల్డర్స్ వార్షికోత్సవం సమావేశంలో ఊహించని ఈ ప్రకటన చేశాడు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న టెస్లా.. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ నుంచే ఆటోమొబైల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. అయితే ఉన్నపళంగా ఎందుకు తరలిస్తున్నారనే విషయం కాసేపు హైడ్రామా నడిపించిన మస్క్.. విస్తరణలో భాగంగానే ఈ తరలింపు చేపట్టినట్లు చెప్పారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు టెస్లా హెడ్ క్వార్టర్స్‌ను తరలించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత కాలపరిమితిలో చేస్తామనే విషయంపై మాత్రం మస్క్ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం చిప్, ఇతరత్ర కంపోనెంట్ల కొరత సమస్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. పాలో ఆల్టోలో ఉన్న హెడ్ క్వార్టర్స్ కేంద్రం టెస్లా సేల్స్ ఆశాజనకంగానే సాగుతున్నట్లు సమావేశంలో మస్క్ వెల్లడించాడు. అయితే ఫ్రెమోంట్ ప్లాంట్ నుంచి వాహనాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పరిమితుల కారణంగా అది జరగలేకపోతుందని ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక హెడ్‌క్వార్టర్స్ తరలింపు గురించి రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో ఉన్న చట్టాల వల్ల మస్క్ ఇబ్బందులు పడుతున్నాడని, అందుకే తరలింపునకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంతేకాదు తక్కువ ఇన్కమ్ ట్యాక్స్‌లు, తక్కువ రెగ్యులేషన్స్ ఉన్న ప్రాంతాలకు తరలిపోయే అంశం గురించి మస్క్ సహా పలువురు టెక్ దిగ్గజాలు చాలాకాలంగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలో ఆల్టోకు 2400 కిలోమీటర్ల దూరంలోని ఆస్టిన్‌కు హెడ్ క్వార్టర్స్‌ను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంతో ఆటోమొబైల్ రంగంలో ఎలాంటి కుదేలుకు లోనవుతుందో చూడాలి మరి!. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు.. మూల్యం -
రక్షణ భాగస్వామ్యం పెంచుదాం
వాషింగ్టన్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం వాషింగ్టన్లో అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో సమావేశయ్యారు. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. భారత్–అమెరికా మధ్య వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయానికొచ్చారు. రెండు దేశాలకు రక్షణపరంగా ఎదురవుతున్న సవాళ్ల గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. లాయిడ్ అస్టిన్‌తో సమావేశమై, కీలక అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు జైశంకర్ పేర్కొన్నారు. జాతీయ భద్రత సలహాదారుతో భేటీ శంకర్ గురువారం అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సాలివన్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు చర్చించారు. కరోనా మహమ్మారి అంతం, కోవిడ్ వ్యాక్సినేషన్, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం, వాతావరణ మార్పుపై పోరు, అఫ్గానిస్తాన్‌లో శాంతి.. తదితర అంశాలపై ఇరువురు లోతుగా చర్చించారు. ఇరు దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దేశం సందర్శించిన తొలి విదేశీ విదేశాంగ మంత్రి జైశంకర్ కావడం విశేషం. జేక్ సాలివన్‌తో భేటీ కావడం సంతోషదాయకమని అనంతరం జై శంకర్ ట్వీట్ చేశారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, ఉమ్మడిగా పాటించే విలువలు ఇండో యూఎస్ భాగస్వామ్యానికి పునాదులని సమావేశం అనంతరం జేక్ ట్వీట్ చేశారు. కోవిడ్‌పై పోరు కోసం ఇటీవలి కొన్ని వారాల్లోనే అమెరికా ప్రభుత్వం, అక్కడి సంస్థలు, ఆ దేశ పౌరులు దాదాపు 50 కోట్ల డాలర్ల విలువైన సాయం భారత్‌కు అందించారని అమెరికా జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి ఎమిలీ హార్నీ తెలిపారు. అమెరికాలోని పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన శక్తిమంతమైన రాజకీయ నాయకులతో జైశంకర్ భేటీ అయ్యారు. అమెరికాకు భారత్ 9వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ, ఈ ఏడాది జనవరి నుంచి మార్చ్ వరకు, 24.8 బిలియన్ డాలర్లు ఉంటుంది. -
లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ ఆధ్వరంలో ఫుడ్ డ్రైవ్
కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకొచ్చింది. కోవిడ్-19 ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చిన్నచిన్న వ్యాపారాలు మూతబడ్డాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో కుంటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అలాంటివారికి రోజుగడవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండుగ సందర్బంగా హోమ్‌లెస్, జాబ్ లెస్ వారి కుటుంబాల కోసం లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ Food Drive - 2020ను నిర్వహించారు. ఆస్టిన్, టెక్సాస్, అమెరికాలలో నివసిస్తున్న తెలుగు ప్రవాస భారతీయులు పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వరరెడ్డి నంగి, రవి కుమార్ రెడ్డి పులిమి, ప్రదీప్ ఉమ్మారెడ్డిలు తమకు చేతనైనంత సహాయం చేస్తూ హ్యూమన్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. తమ సంస్థ సేవలు కేవలం అమెరికాకే పరిమితం అవ్వకుండా, ఇండియా, ఇతర దేశాలలో కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 18, 2020న మూడు లక్షల రూపాయల(3,00,000) విలువ చేసే ఆహార పదార్థాలను "సెంట్రల్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకు" వారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఫౌండర్స్ పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వరరెడ్డి నంగి, రవి కుమార్ రెడ్డి పులిమి, ప్రదీప్ ఉమ్మారెడ్డి మరియు అడ్వైసరి కౌన్సిల్ మెంబెర్స్, శ్రీకాంత్ రెడ్డి చేగిరెడ్డి, వినోద్ రెడ్డి దువ్వూరు, సతీష్ యెన్న, దుశ్యంత్ రెడ్డి వంగల, శివ దుర్భకుల తదితరులు హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించడానికి సహాయసహకారాలందించిన దాతలకి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు రానున్న సంవత్సరంలో ప్రణాళికతో అందరిని కలుపుకొంటూ సేవలందించడమే తమ ముఖ్య ఉద్దేశమని ట్రస్ట్ ఫౌండర్స్ తెలియజేశారు. -
పాత కారు.. కొత్త మోజు
బంజారాహిల్స్: కాలం చెల్లిన పాత కార్లను చాలామంది స్క్రాబ్ దుకాణాలకు అమ్మేస్తుంటారు. కానీ బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లోని అరోరా కాలనీకి చెందిన యువకుడు నవాబ్ ముర్తుజా అలీ హుస్సేన్ మాత్రం అలా చేయడు. తన తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న పాత కార్లను భద్రంగా ఉంచుతున్నాడు. అంతేగాక పాత కార్లను కొనుగోలు చేస్తూ వాటిపై తన మక్కువను చాటుకుంటున్నాడు. ముర్తుజా అలీ హుస్సేన్ది నవాబుల కుటుంబం. ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం కార్ల వ్యాపారం చేస్తున్నాడు. తన షెడ్లో 1926 నాటి ఆస్టిన్, ఫోర్డ్ కార్లు ఇప్పటికీ ఉన్నాయి. 1938లో తయారైన మోరిస్ టైగర్, 1945కు చెందిన మోరిస్, 1948కు చెందిన జాగ్వార్ కార్లు ఆయన ఇంటిలో కొలువుదీరాయి. వింటేజ్ కార్ల ప్రదర్శనలో వీటిని పెడుతుంటారు. ఇప్పటి వరకు తన వద్ద 15 పాత కార్లు ఉన్నాయని, వాటిని అపురూపంగా చూసుకుంటానని వెల్లడించాడు. తన హాబీ వెనక ఉన్న విశేషాలను ఆయన ఇలా చెప్పుకొచ్చాడు. ఎంతో గర్వంగా ఉంటుంది.. ‘మా నాన్న నవాబ్ సయ్యద్ కుర్బాన్ అలీ. ముంబైలో అంబానీ వ్యక్తిగత సలహాదారుగా పనిచేసేవారు. కొన్నేళ్ల క్రితం ఆయన మృతి చెందారు. మా తాత నవాబ్ ఇనాయత్ జంగ్. బహదూర్ నిజాం సర్కార్‌లో పనిచేసేవారు. నాటి నుంచి మేం నవాబులమయ్యాం. 1926లో నగరంలో అతి కొద్ది మందికి మాత్రమే కార్లు ఉండేవి. అందులో మా కుటుంబం ఒకటి. అప్పటి కారును ఇప్పటి వరకు మా ఇంట్లో భద్రంగా ఉంది. తాత, తండ్రి వారసత్వంగా వచ్చిన పాత కార్లను భద్రంగా ఉంచారు. నేను సైతం ఇదే బాటలో నడుస్తున్నా. నేను జాగ్వార్ వింటేజ్ కారులో సిటీ రోడ్లపై తిరుగుతుంటా. అంతా నన్నే చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. వివిధ దేశాలవారు నా వద్ద ఉన్న కార్లను చూసేందుకు వస్తుంటారు. దేశంలో జరిగే వింటేజ్ కార్ల ప్రదర్శనకు కార్లను తీసుకెళ్తుంటాను. నా వద్ద 1926 నాటి మోడల్ ఫోర్డ్ కారు రూ.కోట్లు వెచ్చించినా దొరకదు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్లలోనే ఫంక్షన్లకు వెళుతుంటాం. అక్కడ అందరి కళ్లూ వీటిపై ఉంటాయి. అరోరా కాలనీలో పాత కార్లు ఒకే ఇంట్లో పార్కు చేసి ఉండటంతో చుట్టుపక్కల వారు ఆసక్తిగా చూస్తుంటారు’ అని ముర్తుజా అలీ హుస్సేన్ ఆనందం వ్యక్తంచేశారు. -
మంచి మనసు చాటుకున్న ఆస్టిన్ తెలుగు ప్రజలు
సాక్షి, వైఎస్ఆర్ కడప: వైఎస్ఆర్ జిల్లా రాజుపాళెం మండలం, అర్కటవేముల గ్రామానికి చెందిన రైతు నాయకంటి గురువి రెడ్డి (62) గత నెల పొలంలో సేద్యం చేసేందుకు వెళ్ళాడు. అయితే పొలంలోకి వెళ్లే సమయంలో ఎత్తుగా ఉన్న పొలంలో నుంచి కిందకి దిగుతుండగా కాడికి కట్టిన వృషభరాజం కిందకి దిగుతుండగా గొర్రు నగలు పైన ఉన్న విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు తగలడంతో వృషభరాజములతో పాటు రైతు గురువి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. భర్త మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మృతుడి భార్య భారతి గుండెలు పగిలేలా రోదించారు. గురువి రెడ్డి గారికి ఎద్దులతో విడదీయరాని బంధం. విధి విచిత్రం ఏమోగానీ వ్యవసాయం పనులకోసం వెళ్లిన ఆ రైతు కాడి ఎద్దులతో పాటు తాను కూడా మృతి చెందడం అందరిని కలచివేసింది. రైతు కటుంబానికి భరోసా ఈ విషయం తెలుసుకున్న అమెరికా, ఆస్టిన్ లో నివసిస్తున్నటువంటి తెలుగువారి మనసు చెలించి రైతు కుటుంబానికి భరోసా ఇవ్వడానికి 35000 రూపాయలు ఆత్మీయ ట్రస్ట్ ఛైర్పర్సన్ శెట్టిపి జయచంద్ర రెడ్డి గారికి పంపించి, ఆ మొత్తాన్ని గురివి రెడ్డి తనయుడు నాయకంటి పెద్ద లక్ష్మి రెడ్డి గారికి ప్రొద్దుటూరు డీఎస్పీలో సారి సుధాకర్ గారు, ఆత్మీయ ట్రస్ట్ చైర్పర్సన్ శెట్టిపి జయచంద్ర రెడ్డి గారి చేతుల మీదగా చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డీఎస్పీ గారి తో పాటు ముఖ్య అతిథులుగా సీఐ విశ్వనాధ్రెడ్డి హాజరయ్యారు. ఎస్ఐ లక్ష్మినారాయణ గారు మాట్లాడుతూ, దేశం వదిలి ఎంతో దూరంలో నివసిస్తున్నా, విషయం తెలుసుకొని రైతు గురువి రెడ్డి కుటుంబానికి సహాయం చేయడానికి వచ్చిన అమెరికా, ఆస్టిన్ తెలుగు వారిని ప్రశంసించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ ఆకాంక్షించారు. -
ఆస్టిన్‌లో వైఎస్సార్‌కు ఘన నివాళి
టెక్సాస్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదో వర్ధంతి(సెప్టెంబర్ 2) సందర్భంగా టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతి కోసం వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. వైఎస్సార్ గొప్ప మానవతావాది అని, ఆయన పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సెప్టెంబర్ 2ను తలచుకుంటే చాలా బాధ కలుగుతుందని, పదేళ్ల క్రితం ఆరోజు 10కోట్ల మంది హృదయాలు తల్లడిల్లిపోయాయన్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని కుల, మతాలకు అతీతంగా ప్రజలు పూజలు చేశారని గుర్తుచేశారు. ఏ నాయకుడికి ప్రజల్లో ఇంతటి స్థానం దక్కలేదన్నారు. వైఎస్సార్ మీద చూపిన అభిమానాన్నే ఈ రోజు ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద చూపుతున్నారని, వారి నమ్మకాన్ని సీఎం జగన్ తప్పకుండా నిలబెడతారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి వైస్సార్ అభిమానులు సుబ్బా రెడ్డి చింతగుంట, పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి, రవి బల్లాడ, ప్రవర్ధన్ చిమ్ముల, సాచి ముట్లూరు, మల్లికార్జున రెడ్డి ఆవుల,వెంకట శివ దుర్భకుల, మురళీధర్ రెడ్డి బండ్లపల్లి, అనురాగ్ , బాలాజి బొమ్ము, విట్టల్ రెడ్డి, శివ శంకర్ వంకదారు, మళ్ళా రెడ్డి, వెంకట రెడ్డి , భాను ప్రకాష్ , వినోద్, రాజేందర్, యస్వంత్ రెడ్డి గట్టికొప్పుల, ఇంకా మరెంతోమంది హాజరయి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. -
మంచి మనసు చాటుకున్న ఆస్టిన్‌లో నివసిస్తున్న తెలుగువారు
అనంతపురం: అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌లో నివసిస్తున్న తెలుగువారు తమ మంచి మనసును చాటుకున్నారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఒక రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాలపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు బోర్లు వేసి వేరుశనగ సాగు చేసేవారు. అయితే పండించిన పంటకి గిట్టుబాటు ధర దక్కకపోవడంతో అతను అప్పుల పాలయ్యారు. అప్పుల బాధ భరించలేక, దిక్కుతోచక నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందని విషయాన్ని ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. అయితే దీనిపై స్పందించిన ఆస్టిన్‌లో నివసిస్తున్న తెలుగువారు లక్ష రూపాయల మొత్తాన్ని చెక్కు రూపంలో కలెక్టర్ వీరపాండియన్ చేతుల మీదుగా నారాయణరెడ్డి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్టిన్ ఎన్ఆర్ఐ బృందం, వారి స్నేహితులు పాల్గొన్నారు. అలాగే ఈ వార్తను ప్రచురించిన సాక్షి శింగనమల రిపోర్టర్ మునియప్పను కొనియాడారు. -
పుల్వామా సైనికులకు ప్రవాస భారతీయుల నివాళులు
టెక్సాస్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 40 మంది భద్రతాదళ సభ్యల ప్రాణాలను బలిగొన్న తీవ్రవాదుల అమానవీయ ఘటన యావత్ దేశాన్నీ కుదిపేసింది. ఆస్టిన్ ఇండియన్ టీం ఆధ్వర్యంలో ఆస్టిన్ లో వీర సైనికులకు ప్రవాస భారతీయులు నివాళులు అర్పించారు. ఈ ఘటనలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు తోడుగా నిలవడానికి 2k రన్ నిర్వహించి వచ్చిన ఫండ్‌ని bharatkeveer.gov.in లో డొనేట్ చేయడం జరిగింది. తీవ్ర వాదం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యంగా భారత దేశం గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రవాదంతో ఇబ్బంది పడుతోందన్నారు. ప్రపంచ దేశాలు అన్ని కలిసి తీవ్రవాదం మీద పోరాడి తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించివేయాలని ప్రపంచదేశాలకి విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ దేశం పెంచిపోషిస్తోందని, అనేక తీవ్రవాద సంస్థలకి పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని ఆస్టిన్ ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ సైతం ఈ తీవ్రవాదంతో అనేక ఇబ్బందులు పడటమే కాకుండా తన దేశంలో ఉన్న అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటోదని, మిగిలిన దేశాల్లో సైతం తీవ్రవాద భావజాల వ్యాప్తికి ఆ దేశం సహకరించడమే కాకుండా తీవ్రవాదులకి అన్ని రకాలుగా సహాయపడుతూ దాడులకి వారిని ప్రోత్సహించడం దారుణమని ప్రపంచ దేశాలన్నీ కలిసి అలాంటి దేశాల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి కష్ట సమయంలో భారత దేశంలో ఉన్న ప్రజలంతా తమ దేశపు సైన్యానికి, వీరమరణం పొందిన కుటుంబ సభ్యులకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్టిన్ ఇండియన్ టీం ఆర్గనైజర్లు సుబ్బా రెడ్డి చింతగుంట, పుల్లా రెడ్డి ఎదురు, పరమేశ్వర రెడ్డి నంగి , సతీష్ యెన్న, దుశ్యంత్ వంగల తో పాటు మరెంతోమంది పాల్గొని వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు తోడుగా నిలవడానికి తరలివచ్చారు. -
జగనన్న కోసం అభిషేకాలు.. పూజలు
ఆస్టిన్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కాంక్షిస్తూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆస్టిన్‌లో పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. అన్ని ఆటంకాలు, దుష్ప్రభావాలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ.. సెడార్ పార్కులో గల సాయిబాబా దేవాలయంలో విఘ్నేశ్వర పూజ, శివునికి అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి ఆవుల, మల్లాది రాజ శేఖర శర్మ, నారాయణ రెడ్డి గండ్ర, రమణా రెడ్డి కిచిలీ, మురళి బండ్లపల్లి, శ్రీ కొత్తపల్లి, వెంకట్ ఉప్పాల, సుబ్బారెడ్డి ఎర్రగుడి, శివ ఎర్రగుడి, రాజశేఖర రెడ్డి, రాఘవ రెడ్డి, కొండా రెడ్డి ద్వారసల పాల్గొన్నారు. వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఘంటాపథంగా చెప్పారు. పార్టీకి సేవలందిస్తున్న అభిమానులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. -
వైఎస్ వివేకానందరెడ్డి మృతి పట్ల ద్రిగ్భాంతి
ఆస్టిన్ : వైఎస్ వివేకానందరెడ్డి మృతిపట్ల వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. సాల్ట్ ఎన్ పెప్పర్లో జరిగిన ఈ కార్యక్రమములో శివ ఎర్రగుడి , నారాయణ రెడ్డి గండ్ర , కొండా రెడ్డి ద్వారసల , వసంత్ ఉయ్యురు, గురు రెడ్డి, మురళి బండ్లపల్లి, శ్రీ కొత్తపల్లి, వెంకట్ ఉప్పాల, అనంత్ , సుబ్బారెడ్డి ఎర్రగుడి, చెన్నకేశవ రెడ్డి మల్లికార్జున రెడ్డి ఆవుల పాల్గొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డితో ఆస్టిన్‌కు వున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశ రాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావిగా పేరున్న వైఎస్ వివేకానందరెడ్డి గారి మృతి పట్ల అభిమానులందరూ సంతాపం తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్న ఆయన కలను నిజం చేయాలనీ ప్రతిజ్ఞ పూనారు. -
ఆస్టిన్‌లో ఘనంగా వైఎస్సార్సీపీ 9వ ఆవిర్భావ వేడుకలు
ఆస్టిన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ వేడుకలు ఆస్టిన్, టెక్సాస్‌లో ఘనంగా జరిగాయి. రాక్ ఎన్ గ్రిల్లో జరిగిన ఈ వేడుకలకు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి ఆవుల, శ్రీ కొత్తపల్లి, కొండా రెడ్డి ద్వారసల, అశోక్ రెడ్డి గూడూరు, కుమార్ అశ్వపతి, నారాయణ రెడ్డి గండ్ర, కరుణ్ రెడ్డిలు ప్రసంగించారు. వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, నవరత్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. అలాగే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయభేరి మోగిస్తుందని, ఈ శ్రీరామనవమితో ఆంధ్రాలో దుష్ట రాక్షస పాలన ముగిసి రామరాజ్యం రాబోతోందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆస్టిన్ అభిమానులు పలు సామజిక సేవా కార్యక్రమాలతో సమాజానికి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హేమంత్ బల్ల, ప్రవర్ధన్ చిమ్ముల, రఘు జడల, విఠల్ రెడ్డి, రాంమోహన్ అరికూటి, ఆసిఫ్, శివ ఎర్రగుడి, కేదార్, అనంత్, రమణా రెడ్డి, శ్రీని కొత్త, సుబ్బా రెడ్డి వైఎస్ఆర్, వెంకట్‌లతో పాటూ పలువురు పాల్గొని జయప్రదం చేశారు. -
టెక్సాస్‌లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
టెక్సాస్‌లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆస్టిన్ (టెక్సాస్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులు, జననేత అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. దివంగత మహానేత ఆశయ సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జననేత నాయకత్వం కోసం ఏపీ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని.. వంద మంది చంద్రబాబులు వచ్చిన ఆయనను ఆపే శక్తి వారికి లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఏకమై చంద్రబాబు సైకిల్‌కు పంక్చర్ చేసి ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. ఏపీలో నేడు రైతులను మరిచి, అధికార గర్వంతో అభివృద్ధిని తుంగలో తొక్కి, అవినీతిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న అధికార టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు. ప్రజా సంక్షేమం మరిచిన టీడీపీని భూస్థాపితం చేయాలని కోరారు. అందుకు వైఎస్సార్ సీపీ అమెరికా విభాగం నడుం బిగించి తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ గెలుపు కోసం కృషి చేయడానికి త్వరలోనే తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని, మహానేత వైఎస్సార్ బాటలో నడుస్తూ ప్రజాహితం కోసం సర్వదా పాటుపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి ఎదురు, పరమేశ్వర రెడ్డి నంగి,మల్లికార్జున రెడ్డి ఆవుల, రామ హనుమంత రెడ్డి , సంగమేశ్వర్ రెడ్డిగారి, అశోక్ గూడూరు, వసంత్ రెడ్డి ఉయ్యురు, దుశ్యంత్ రెడ్డి , గురుచంద్రహాస్ రెడ్డి , సుబ్బారెడ్డి ఎర్రగుడి, వెంకట రెడ్డి కొండా, యస్వంత్ రెడ్డి గట్టికుప్పల, శ్రీకాంత్ రెడ్డి ఐనాల, వెంకట్ కొట్టే, రవి, శివ శంకర్ వంకదారు, శ్రీకాంత్ రెడ్డి, చెన్నా రెడ్డి , ప్రవీణ్ కర్నాటి, అరుణ్ , అనిల్ కడిపికొండలతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వారంతా వీడియో, టెలీకాన్ఫెరెన్స్ ద్వారా జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
వైఎస్ జగన్‌పై దాడిని ఖండిస్తున్నాం
టెక్సాస్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆ పార్టీ అమెరికా విభాగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైఎస్ జగన్‌పై దాడిని ఆస్టిన్, టెక్సాస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సబ్బారెడ్డి చింతగుంట, పుల్లారెడ్డి ఎదురు, పరమేశ్వర రెడ్డి నంగి, మల్లిఖార్జున రెడ్డి ఆవుల, రవి బల్లాడ, నారాయణ రెడ్డి గండ్ర, కుమార్ అశ్వపతి, అశోక్ గూడూరు, వెంకట శివ నామాల, మురళి బండ్లపల్లి, కొండారెడ్డి ద్వారసాల, స్వాదీప్ రెడ్డి, ప్రవర్ధన్ చిమ్ముల, వంశి, రమణ రెడ్డి కిచ్చిలి, శివ ఎర్రగుడి, యశ్వంత్ రెడ్డి గట్టికొప్పుల, శ్రీనివాస్ సలుగుటి, శివ శంకర్ వంకదారు, ప్రవీణ్ కర్నాటి, సుజిత్, దిలావర్, శ్రీకాంత్ రెడ్డి ఐనాల, తదితరలు ఖండిస్తున్నామని తెలిపారు. ఒక ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. దాడి వెనుక ఎవరెవరు ఉన్నారో సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్ జగన్‌కు భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ దాడికి నిరసనగా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజాసంకల్పయాత్రకు ఎన్ఆర్ఐల సంఘీభావం
-
ప్రజాసంకల్పయాత్రకు ఆస్టిన్‌లో ఎన్ఆర్ఐల సంఘీభావం
టెక్సాస్ : కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోందని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్న విధానాలను తూర్పారబడుతూ సాగిస్తున్న యాత్రకు 11 జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆస్టిన్లోని ప్రవాసాంధ్రులు తెలిపారు. జనం కోసం జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారని తెలిపారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలంతా ఆవేదన చెందుతున్నారని.. అందుకే పాదయాత్రలో వైఎస్ జగన్‌కు అండగా నిలుస్తున్నారన్నారని తెలిపారు. జననేత ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా అమెరికాలో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు సుబ్బా రెడ్డి చింతగుంట, పరమేశ్వర రెడ్డి నంగి, మల్లికార్జున రెడ్డి ఆవుల, రవి బల్లాడ,నారాయణ రెడ్డి గండ్ర, మురళి బండ్లపల్లి, కొండా రెడ్డి ద్వారసాల, కరుణ్ రెడ్డి, వెంకటేష్ భాగేపల్లి, స్వాదీప్ రెడ్డి, హనుమంత రెడ్డి, ప్రవర్ధన్ చిమ్ముల, నర్సి రెడ్డి గట్టికుప్పల, రమణ రెడ్డి కిచ్చిలి, శివ ఎర్రగుడి, గురు చంద్రా రెడ్డి, దేవేందర్ రెడ్డి, రామ కోటి రెడ్డి, యశ్వంత్ రెడ్డి గట్టికొప్పుల, వెంకట గౌతమ్ రెడ్డి, మోహన్ రెడ్డి, లోకేష్, ప్రదీప్ లక్కిరెడ్డి, సుధాకర్ రెడ్డి, విట్టల్ రెడ్డి, హేమంత్, అనంత్, కమల్, రామి రెడ్డి, శివ ననుష్యల, వసంత్ రెడ్డి, శ్రీ దీపక్, శ్రీని చింత, ప్రవీణ్ కర్నాటి, మధు, వ్యాస్, సుజిత్, రేజేష్ కేతి రెడ్డి, వెంకట రెడ్డి కొండాలతో పాటూ పలువురు కేక్ కట్ చేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలిపారు. శ్రీధర్ కొర్సపాటి, పుల్లారెడ్డి ఎదురు, కుమార్ అశ్వపతి, అశోక్ గూడూరు, వెంకట శివ నామాల, సచి, వెంకట రామి రెడ్డి ఉమ్మలు ప్రత్యక్షంగా హాజరు కానప్పటికీ వీడియోకాన్ఫెరెన్స్‌లో పాల్గొని తమ మద్దతు తెలిపారు. -
ఆస్టిన్‌లో వైఎస్సార్‌కు నివాళి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి(సెప్టెంబర్ 2) సందర్భంగా ఆస్టిన్ నగరంలో ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్టిన్ వైస్సార్ అభిమానులతో, కార్యకర్తలతో మహానేత సేవలను, ఆయన తెచ్చిన పథకాలను కొనియాడారు. ఆ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. రాజన్నతో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మరలా రాజన్న రాజ్యం సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున వైఎస్సార్ అభిమానులు ప్రతి నెల సమావేశం కావాలని ఆయన కోరారు. అలాగే ఏపీలోని తమ తమ నియోజకవర్గ ప్రజలతో, సన్నిహితులతో, పార్టీ ఇంచార్జ్‌లతో తరచూ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సహకరించాలని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఏపీకి వెళ్లి పార్టీ తరపున ప్రచారం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి వైస్సార్ అభిమానులు సుబ్బా రెడ్డి చింతగుంట, రవి బల్లాడ, పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి, వెంకట శివ నామాల, కుమార్ అశ్వపతి, అశోక్ గూడూరు, కొండా రెడ్డి ద్వారసాల, మల్లికార్జున రెడ్డి ఆవుల, స్వాదీప్ రెడ్డి, హనుమంత రెడ్డి, వెంకటరామి రెడ్డి ఉమ్మ, ప్రవర్ధన్ చిమ్ముల , నర్సి రెడ్డి గట్టికుప్పల,రమణ రెడ్డి కిచ్చిలి, సూరి, గురు చంద్రా రెడ్డి, రంగ, సంగమేశ్వర్ రెడ్డి, రామ కోటి రెడ్డి, యస్వంత్ రెడ్డి గట్టికొప్పుల, అన్వేష్ రెడ్డి, శివ, గంగి రెడ్డి, వెంకట గౌతమ్ రెడ్డి, ఫణి, జితేందర్ రెడ్డి, సుబ్బా రెడ్డి ఎర్రగుడి, వెంకట్ రెడ్డి పులి, ప్రవీణ్, అనిల్ కడిపికొండ ఇంకా మరెంతోమంది హాజరయి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. -
‘నేను చేసేది పాపం కాదు.. క్షమాపణ చెప్పను’
ఆస్టిన్ : ‘నేను చేసేది పాపం కాదు.. నేను క్షమాపణలు చెప్పాలి.. కానీ అలా ఎప్పటికీ చెప్పను’అంటూ టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి చెప్పాడు. అతడు దాడికి పాల్పడటానికి ముందే తాను ఎందుకు దాడి చేస్తున్నానో అనే విషయాన్ని అతడి ఫోన్లో 25 నిమిషాలపాటు రికార్డింగ్ చేసి ముందే పెట్టుకున్నాడు. దీంతో అతడు ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతోనే దాడి చేసినట్లు స్పష్టమైంది. మూడు వారాల కిందట ఆస్టిన్‌లో మార్క్ కాండిట్ అనే వ్యక్తి బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా పలువురు గాయపడ్డారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే సమయంలోనే తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో పోలీసులకు అతడి ఫోన్ దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఓ 25 నిమిషాల నిడివితో వీడియో లభించింది. ఆ వీడియోలో ఉన్న ప్రకారం తాను చేసేది తప్పుకాదని అతడు చెప్పాడు. తన చర్యను ఓ సైకోపాథ్గా వర్ణించుకుంటూ క్షమాపణలు చెప్పాల్సి ఉన్నా తాను ఎప్పటికీ చెప్పబోనని తెలిపాడు. బాల్యం నుంచే తన జీవితం చిందరవందరగా ఉందని, ఒక వేళ తనను బందించాలని వస్తే అప్పటికప్పుడే తనను పేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందులో రికార్డు చేసి పెట్టి ఉంచాడు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాము అంతకంటే ఎక్కువ వివరాలు అందించలేమని పోలీసులు తెలిపారు. కాగా, మార్క్ రూమ్మేట్స్ను కొన్నిగంటలపాటు విచారించిన పోలీసులు అనంతరం విడుదల చేశారు. -
పేలుళ్ల మిస్టరీ వీడింది, కానీ...
ఆస్టిన్ : మూడు వారాలుగా టెక్సాస్ రాష్ట్ర పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పేలుళ్ల మిస్టరీ వీడింది. పేలుళ్లకు పాల్పడిన నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. కానీ, ఈ క్రమంలో తనను తాను పేల్చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత మూడు వారాలుగా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో వరుసగా పార్సిళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటిదాకా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఐదు పేలుళ్లు సంభవించగా ఇద్దరు మృతి చెందారు. ఐదుగురికి గాయలయ్యాయి. బోస్టర్ మారథాన్ పేలుళ్ల (2013) తర్వాత వరుసగా ఇవి చోటు చేసుకుండటంతో స్వాట్ విభాగం అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో నిందితుడి కోసం కీలక ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బుధవారం మార్క్ కండిట్ట్ అనే యువకుడు తానే ఈ పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులకు వీడియో సందేశం పంపాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో తాను ఉన్న ఎస్యూవీ వాహనాన్ని పేల్చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పేలుళ్లకు అతను ఎందుకు పాల్పడ్డడన్న విషయాన్ని మాత్రం అతను వెల్లడించకపోవటంతో.. కారణాలు వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మొత్తం ఏడు బాంబులతో తాను ప్రణాళిక రచించానని, కానీ, అవి విఫలం కావటంతో లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు నిందితుడు వీడియోలో వెల్లడించాడని అధికారులు చెబుతున్నారు. కాగా, ఐదు పేలుళ్లు సంభవించగా. మరొక దానిని బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. ఇక చివరిది కండిట్ట్ వాహనంలో పేలిపోయిందని అధికారులు తెలిపారు. AUSTIN BOMBING SUSPECT IS DEAD. Great job by law enforcement and all concerned! — Donald J. Trump (@realDonaldTrump) 21 March 2018 -
అమెరికాలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆస్టిన్ (టెక్సాస్): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలోని ఆస్టిన్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో ఆస్టిన్ లోని స్పైస్ రెస్టారెంట్ లో జరిగిన వేడుకలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకై కృషి చేయాలని ప్రవాసాంధ్ర ప్రముఖులు పిలుపునిచ్చారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పలువురు వక్తలు అన్నారు. జగన్ నాయకత్వం కోసం ఏపీ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. 2014 ఎన్నికల్లో చెప్పిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని, జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమంటూ ఆస్టిన్ లోని వైఎస్ఆర్ అభిమానులు విశ్వాసం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని వంద మంది చంద్రబాబులు వచ్చినా ఆపే శక్తి వారికి లేదన్నారు. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు ఇలా అందరూ ఏకం కావాలని, చంద్రబాబు సైకిల్‌కు పంక్చర్ చేసి ఇంటికి పంపించాలని ముక్త ఖంఠంతో పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలన అంతమైన అనంతరం జననేత జగన్ మోహన్ రెడ్డి ‘రాజన్న సువర్ణ యుగం’ పరిపాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటారని ధీమా వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ లో నేడు రైతులను మరిచి, అధికార గర్వంతో అభివృద్ధిని తుంగలో తొక్కి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న అధికార టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పి, ప్రజా సంక్షేమం మరచిన ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్నారు. అందుకు వైఎస్ఆర్సీపీ అమెరికా విభాగం నడుం బిగించి తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. తమ పూర్తి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని, దివంగత నేత వైఎస్ఆర్ బాటలో నడుస్తూ ప్రజాహితం కోసం సర్వదా పాటుపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి చింతగుంట, రవి బల్లాడ, పుల్లారెడ్డి ఏడురు, మల్లికార్జున రెడ్డి ఆవుల, నారాయణ రెడ్డి గండ్ర, రామ్ గొంగినేని, శివ ఎర్రగుడి, ప్రవర్ధన్ చిమ్ముల, వెంకట్రామ్ రెడ్డి ఉమ్మ, బ్రహ్మేంద్ర లక్కు, రామ హనుమంత, మల్లి రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డిగారి, పరమేశ్వర రెడ్డి నంగి, చెంగల్ రెడ్డి ఎర్రదొడ్డి, కొండా రెడ్డి ద్వరసాల, ప్రదీప్ లక్కిరెడ్డి, అనంత్ బోయపల్లె, బద్రి ఎల్ఎం, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. -
స్టీవ్ ‘వా’రసుడొచ్చాడు
సిడ్నీ: ఆస్ట్రేలియా విఖ్యాత క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ వా వారసుడు క్రికెట్లోకి వచ్చాడు. ఈ దిగ్గజ కెప్టెన్ కుమారుడైన ఆస్టిన్ వా శుక్రవారం ప్రకటించిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 17 ఏళ్ల ఆస్టిన్ వా దేశవాళీ క్రికెట్లో న్యూ సౌత్‌వేల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండేళ్లుగా అతను అండర్–17 స్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది అతను జాతీయ అండర్–17 టోర్నీలో న్యూ సౌత్‌వేల్స్ తరఫున అత్యధిక పరుగులు (372 పరుగులు) చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. జూనియర్ ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టును ఎంపిక చేశారు. వచ్చే నెల న్యూజిలాండ్‌లో అండర్–19 ప్రపంచకప్ జరగనుంది. భారత సంతతికి చెందిన ఓపెనర్ 18 ఏళ్ల జాసన్ సంగ సారథ్యం వహించే ఈ జట్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ కుమారుడు విల్ సదర్లాండ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ జట్టుకు మాజీ పేసర్ రియాన్ హారిస్ కోచ్. ఈ జూనియర్ మెగా ఈవెంట్లో గ్రూప్ ‘బి’లో ఉన్న ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో భారత్ (జనవరి 14న)తో తలపడుతుంది. జట్టు: జాసన్ సంగ (కెప్టెన్), విల్ సదర్లాండ్ (వైస్ కెప్టెన్), జేవియర్, బ్రియాంట్, ఎడ్వర్డ్స్, ఇవాన్స్, ఫ్రీమాన్, హ్యాడ్లీ, బాక్స్టెర్, నాథన్, జొనాథన్ మెర్లో, రాల్స్టన్, ఉప్పల్, ఆస్టిన్ వా, లాయిడ్ పోప్. -
డేట్‌కి తీసుకెళ్తే ఇలా చేస్తుందా?
ఆన్లైన్లో పరిచయం అయిన అమ్మాయిని అతను డేట్‌కు పిలిచాడు. సరేనన్న ఆమెను.. సరదాగా ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ సినిమాకు తీసుకెళ్లాడు. అయితే, సినిమా పూర్తయిన వెంటనే అనూహ్యంగా లాయర్‌ను కలసి.. ఆ అమ్మాయిపై దావా వేశాడు. ఇంతకీ థియేటర్లో ఏం జరిగి ఉంటుందో ఊహించగలరా? అమెరికాలోని టెక్సాస్ రాజధాని అస్టిన్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఆమెపై కేసు మాత్రమే వేస్తే సరిపోదు.. జైలుకు పంపాల్సిందే..’ అని నెటిజన్లు వత్తాసు పలుకుతున్నారు. విషయంలోకి వెళితే.. అస్టిన్‌కు చెందిన బ్రెండన్ వెజ్మర్ అనే యువకుడికి.. ఆన్లైన్లో ఓ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరూ కలసి మే 6న డేట్‌కు వెళ్లారు. అది.. అతని మొట్టమొదటి డేట్ అట! వాళ్లిద్దరూ ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ సినిమా చూస్తుండగా.. ఆమె ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. సినిమా చూస్తూనే ఆమె దానికి రిప్లై కూడా ఇచ్చింది. అలా ఓ 20 వెసేజ్లు రావడం, వాటన్నింటికీ ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. పక్కనే కూర్చున్న బ్రెండన్‌కు ఈ మెసేజ్‌ల వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చింది. ‘నా డబ్బులతో సినిమాకొచ్చి, నా పక్కనే కూర్చొన్న ఆమె.. వరుసగా మెసేజ్‌లు పంపించి, సినిమా చూడాలన్న నా హక్కును కాలరాసింది. హాలులో మొబైల్ వాడటం థియేటర్ పాలసీకి వ్యతిరేకం కూడా’ అని బ్రెండన్ కోర్టుకెక్కాడు. డేట్ కోసం ఖర్చుచేసిన 17.31 డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని లాయర్ ద్వారా అమ్మాయిని డిమాండ్ చేశాడు. ఆ విధంగా అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లడమేకాక, ఆమెపై దావా వేసిన బ్రెండన్ చర్యను వెర్రితనమని ఇంకొందరు అంటున్నారు. మరి మీరేమంటారు? -
అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లి, ఆపై..
అస్టిన్: ఆన్లైన్లో పరిచయం అయిన అమ్మాయిని డేట్‌కు పిలిచాడు. సరేనన్న ఆమెను.. సరదాగా ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ సినిమాకు తీసుకెళ్లాడు. అయితే, సినిమా పూర్తయిన వెంటనే అనూహ్యంగా లాయర్‌ను కలిసి.. ఆ అమ్మాయిపై దావా వేశాడు. ఇంతకీ ధియేటర్లో ఏం జరిగి ఉంటుందో ఊహించగలరా? అమెరికాలోని టెక్సాస్ రాజధాని అస్టిన్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఆమెపై కేసు మాత్రమే వేస్తే సరిపోదు.. జైలుకు పంపాల్సిందే..’ అని నెటిజన్లు వత్తాసు పలుకుతున్నారు. విషయంలోకి వెళితే.. అస్టిన్‌కు చెందిన బ్రెండన్ వెజ్మర్ అనే యువకుడికి.. ఆన్లైన్లో ఓ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరూ కలిసి మే 6న డేట్‌కు వెళ్లారు. అది.. అతని మొట్టమొదటి డేట్ అట! వాళ్లిద్దరూ ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ సినిమా చూస్తుండగా.. ఆమె ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. సినిమా చూస్తూనే ఆమె దానికి రిప్లై కూడా ఇచ్చింది. అలా ఓ 20 వెసేజ్లు రావడం, వాటన్నింటికీ ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. పక్కనే కూర్చున్న బ్రెండన్‌కు ఈ మెసేజ్‌ల వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చింది. ‘నా డబ్బులతో సినిమాకొచ్చి, నా పక్కనే కూర్చొన్న ఆమె.. వరుసగా మెసేజ్‌లు పంపుంపి, సినిమా చూడాలన్న నా హక్కును కాలరాసింది. హాలులో మొబైల్ వాడటం థియేటర్ పాలసీకి వ్యతిరేకం కూడా’అని బ్రెండన్ కోర్టుకెక్కాడు. డేట్ కోసం ఖర్చుచేసిన 17.31 డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని లాయర్ ద్వారా అమ్మాయిని డిమాండ్ చేశాడు. ఆ విధంగా అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లడమేకాక, ఆమెపై దావా వేసిన బ్రెండన్ చర్యను వెర్రితనమని ఇంకొందరు అంటున్నారు. మరి మీరేమంటారు? -
చంద్రబాబుపై మండిపడ్డ ఎన్ఆర్ఐలు
ఆస్టిన్(యూఎస్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆస్టిన్లోని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు బాసటగా నిలిచారు. టెక్సాస్‌లోని ఓయాసిస్లో కొవ్వొత్తులు వెలిగించి వైఎస్ జగన్‌కు ఎన్ఆర్ఐలు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిని సీఎం చంద్రబాబు నాయుడు అప్రజాస్వామ్య మార్గంలో అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాసటగా ఉంటామని ఆస్టిన్లోని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో.. రవి బల్లాడ, సుబ్బారెడ్డి చింతగుంట, మురళి బండ్లపల్లి, నారాయణ రెడ్డి గండ్ర, కుమార్ అశ్వపతి, రఘు సిద్దపు రెడ్డి, సచి ముట్లూరు, ప్రసాద్ గురిజల, వెంకట్ నామాల, వెంకట్ గొట్టం, స్వదీప్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి చౌటి, వెంకటేశ్ బాగేపల్లి, మోహన్ రెడ్డి, అశోక్ గూడూరు, దేవెందర్ రెడ్డి, హేమంత్ బల్ల, కొండా రెడ్డి దాసుర్ల, శ్రీని, నవీన్ కందుల, శ్యాం, ప్రదీప్ రెడ్డిలు పాల్గొన్నారు. -
ఐఎస్‌లో చేరాలనుకున్న అమెరికన్‌కి జైలు శిక్ష
వాషింగ్టన్: ఆస్టిన్ నగరానికి చెందిన మైఖేల్ టొడ్ ఫరూఖ్ తీవ్రవాద సంస్థ ఐఎస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాన్ని యూఎస్ కోర్టు తీవ్ర నేరంగా పరిగణించిది. ఈ నేపథ్యంలో మైఖేల్‌కి 82 నెలల జైలు శిక్ష విధిస్తూ జడ్జి సమ్ స్పార్క్స్ తీర్పు వెలువరించారని ఎఫ్‌బీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. 2013లో ఐఎస్‌లో చేరాలని మైఖేల్ నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా అతడు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందులోభాగంగా 2014 జూన్ 17న తూర్పు ప్రాచ్యా దేశాలకు పయనమైందుకు విమాన టికెట్లు కూడా కొనుగోలు చేశారు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం మైఖేల్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఐఎస్‌లో చేరేందుకు తాను చేసిన ప్రయత్నాలను మైఖేల్ కోర్టులో ఒప్పుకున్నాడు. దీంతో కోర్టు అతడికి 82 నెలల జైలు శిక్ష విధించింది. -
వైఎస్ జగన్ విడుదలతో ఆస్టిన్ లో సంబరాలు!
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై విడుదల కావడంతో అమెరికాలోని ఆస్టిన్ నగరంలో వైఎస్సార్ అభిమానులు హోటల్ దావత్ లో సంబరాల్ని జరుపుకున్నారు. వైఎస్ జగన్ రాకతో రాష్ట్ర రాజకీయాలు కొత్త రూపం సంతరించుకుంటాయని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఆస్టిన్ లో పండగ వాతావారణాన్ని తలపించింది. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని.. ఆయన నాయకత్వం కోసం తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని, ఆయన సీఎం అవుతారని ఆస్టిన్ వైఎస్సార్ అభిమానులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో అట్లాంటా నుండి గురవారెడ్డి, హౌస్టన్ నుండి రమణ రెడ్డి బొమ్మరెడ్డి, డల్లాస్ నుండి కృష్ణారెడ్డి కోడూరు, శ్రీనివాస రెడ్డి ఒబిలిరెడ్డి పాల్గొనగా, ఆస్టిన్ లోని ప్రవాసాంధ్రులు నారాయణరెడ్డి గండ్ర, సుబ్బారెడ్డి చింతగుంట, మురళి బండపల్లి, రవి బల్లాడ , ప్రవర్థాన్ చిమ్ముల, రఘుసిద్దపు రెడ్డి , అగ్గిరామయ్య దేవరపల్లి, వెంకట్ నామాల, ప్రదీప్ రెడ్డి చౌటి, వెంకట్ యీరగుడి , రామహనుమంత రెడ్డి, కొండా రెడ్డి ద్వారసాల , శ్రీని చింత, కరుణ్ రెడ్డి, వెంకట్ గోతం, సాచి ముట్టూరు, సుధాకర రెడ్డి చౌటి, చంద్రా రెడ్డి అనుమరెడ్డి, అశోక్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కిశోర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, నాగమణి , లీలవతమ్మ, సరిత, సంపూర్ణ , శైలజ, ,బిందు, జ్యోతి, శ్వేత ఇతరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు 100 మందికి పైగా హాజరయ్యారు. -
ఆస్టిన్ లో ఘనంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి!
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాలుగవ వర్ధంతిని టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో వైఎస్సార్ అభిమానులు హోటల్ కడాయిలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ ఆస్టిన్ లోని వైఎస్సార్ అభిమానులు వైఎస్ఆర్ లేని లోటు, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే అత్యున్నత నేతగా రాజశేఖర్ రెడ్డిగా అవతరించారన్నారు. రాష్ట్రంలోని పేద, బడుగు, మైనారిటీల అభ్యున్నతికి వైఎస్ఆర్ కృషి చేశారని పలువురు ఎన్నారైలు అన్నారు. ప్రస్తుతం మహానేత లేని లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందని, అన్ని రంగాల్లో అభివృధి కుంటుపడిందనే బాధను వ్యక్తం చేసారు. పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం పథకాలను రాష్ట్రంలో ప్రారంభించిన గొప్ప నేతగా అభివర్ణించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, జనంలోఉంటే ఆయన ప్రభంజనాన్ని తట్టుకోవడం అసాధ్యమని భావించి నిరాధారమైన ఆరోపణలతో, కుట్రలు కుతంత్రాలతో అరెస్టుచేశారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు చీకటి ఒప్పందానికి వచ్చి వైఎస్ జగన్ ను అక్రమంగా జైలుకు పంపించాయన్నారు. జననేత జగన్ అక్రమ అరెస్ట్ పై అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు అవలంభిస్తున్న కుమ్మక్కు రాజకీయాలను ఎన్నారైలు తీవ్రంగా ఖండిచారు. ప్రజాబలం ఉన్న నాయకుడిని ధైర్యంగా ఎదుర్కోలేక జైలులో పెట్టి ఎన్నికలో గెలవాలి అని అటు కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు కుట్ర పన్నాయని విమర్శించారు. సిబిఐ ఆధికార కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలలో పనిచేస్తూ జగన్ పై దర్యాప్తుని కాలయాపన తో విచారణ కొనసాగిస్తొందన్నారు. ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భంధించి తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఈకార్యక్రమమునకు ప్రవాసాంధ్ర ప్రముఖులు సుబ్బా రెడ్డి చింతగుంట, నారాయణ రెడ్డి గండ్ర, రవి బల్లాడ , మురళి బండపల్లి, ప్రవర్థాన్ చిమ్ముల, రఘు సిద్దపు రెడ్డి , అగ్గిరామయ్య దేవరపల్లి, వెంకటేష్ బాగేపల్లి , వెంకట్ యీరగుడి , శ్రీని చింత, వెంకట్ గోతం, రామహనుమంత రెడ్డి, కొండా రెడ్డి ద్వారసాల , వెంకట్ నామాల, ప్రదీప్ రెడ్డి చౌటి, సాచి ముట్టూరు, సుధాకర రెడ్డి చౌటి, చంద్రా రెడ్డి అనుమరెడ్డి, భరత్ రెడ్డి ,నాగమణి , లీలవతమ్మ, సరిత, సంపూర్ణ , ప్రశాంతి, శైలజ, సంధ్య, చరిత, శ్వేత గార్లు పాల్గొన్నారు. టెలికాన్ఫరెన్స్ కాల్ ద్వారా నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు రాజమోహన్ రెడ్డి ఆస్టిన్ వైఎస్సార్ అభిమానులతో సంభాషించారు.