
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి(సెప్టెంబర్ 2) సందర్భంగా ఆస్టిన్ నగరంలో ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్టిన్ వైస్సార్ అభిమానులతో, కార్యకర్తలతో మహానేత సేవలను, ఆయన తెచ్చిన పథకాలను కొనియాడారు. ఆ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. రాజన్నతో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మరలా రాజన్న రాజ్యం సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున వైఎస్సార్ అభిమానులు ప్రతి నెల సమావేశం కావాలని ఆయన కోరారు. అలాగే ఏపీలోని తమ తమ నియోజకవర్గ ప్రజలతో, సన్నిహితులతో, పార్టీ ఇంచార్జ్‌లతో తరచూ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సహకరించాలని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఏపీకి వెళ్లి పార్టీ తరపున ప్రచారం చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమానికి వైస్సార్ అభిమానులు సుబ్బా రెడ్డి చింతగుంట, రవి బల్లాడ, పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి, వెంకట శివ నామాల, కుమార్ అశ్వపతి, అశోక్ గూడూరు, కొండా రెడ్డి ద్వారసాల, మల్లికార్జున రెడ్డి ఆవుల, స్వాదీప్ రెడ్డి, హనుమంత రెడ్డి, వెంకటరామి రెడ్డి ఉమ్మ, ప్రవర్ధన్ చిమ్ముల , నర్సి రెడ్డి గట్టికుప్పల,రమణ రెడ్డి కిచ్చిలి, సూరి, గురు చంద్రా రెడ్డి, రంగ, సంగమేశ్వర్ రెడ్డి, రామ కోటి రెడ్డి, యస్వంత్ రెడ్డి గట్టికొప్పుల, అన్వేష్ రెడ్డి, శివ, గంగి రెడ్డి, వెంకట గౌతమ్ రెడ్డి, ఫణి, జితేందర్ రెడ్డి, సుబ్బా రెడ్డి ఎర్రగుడి, వెంకట్ రెడ్డి పులి, ప్రవీణ్, అనిల్ కడిపికొండ ఇంకా మరెంతోమంది హాజరయి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.
Comments
Please login to add a commentAdd a comment