vardhanthi
-
సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీశ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని.. వాళ్లు చేసిన పాపాలపై నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయంగా బతికేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అనుకోని విధంగా వచి్చన ఈ విపత్తును ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలకు పని లేదని.. వారు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగిపోయాయని, కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ నేడు సురక్షితంగా ఉందంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమేనని భట్టి తెలిపారు. భారీ వర్షాలు, వరదతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. -
వైఎస్ఆర్ కు రోజా నివాళి
-
సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత
సాక్షి, అమరావతి: వైఎస్సార్.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది ఐదేళ్ల మూడు నెలలే! కానీ మంచి చేయాలన్న మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే నిరూపించారు. భౌతికంగా దూరమైనా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సోమవారం వైఎస్సార్ 15వ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ జీవచ్ఛవంలా మారిన తరుణంలో వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. మండుటెండలో 1,475 కి.మీ. నడిచారు. పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ అధికారంలోకి తెచ్చారు. 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. ఆరోగ్యశ్రీ... ఫీజులు 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.168.52 కోట్లను వైఎస్సార్ విడుదల చేశారు. అనంతరం ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 108, 104 స రీ్వసులను ప్రారంభించారు. ఆయన తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లక్షలాది పేద విద్యార్థులకు మేలు జరిగింది. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం.. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్సిటీ.. తిరుపతిలో పశువైద్య కళాశాల, హైదరాబాద్‌లో ఐఐటీని ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. జలయజ్ఞం ద్వారా ఒకేసారి 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేశారు. గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిరి్మంచారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. -
YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. పేదలకు.. తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి అండగా నిలిచే వారు. కరవు పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు దివంగత వైఎస్.రాజారెడ్డి. 1925 సంవత్సరంలో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు వైఎస్.రాజారెడ్డి జన్మించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ, కుమారులు, కుమార్తెలను ఉన్నత స్థానంలో నిలపడంలో ఆయన పాత్ర ఎనలేనిది.పులివెందుల గ్రామ సర్పంచ్గారాజకీయాల్లోకి రాక మునుపు నుంచి పులివెందులలో వైఎస్.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్యనైనా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల సర్పంచుగా తన ప్రజాప్రస్థానం ప్రారంభించారు. 1988 నుండి 1995 వరకు ఆయన పులివెందుల సర్పంచ్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే పులివెందులలో వీధి దీపాలు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవ్వించారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేవారు. అప్పట్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి సమస్య పరిష్కరించారు. గ్రామ సమస్యలపై పోరాడుతూనే మరో వైపు తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రజలకు నేడు జనరంజక పాలన అందడానికి, పేదల పట్టెడు అన్నం, గూడు, బట్టలు కట్టడమే కాకుండా రైతులను అన్ని విధాలా ఆదుకున్న పెద్దాయన కుమారుడు దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కృషి ఉంది. నేటికీ అక్కడక్కడా పెద్దాయన పేరుతో సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. పులివెందులలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు వెలిశాయి.ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానంపులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో వైఎస్.రాజారెడ్డి ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఆయన బ్రతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన పెద్దాయన. ప్రజలు తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలవబడే వైఎస్.రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. అంతేగాక ఆయన తనయుడు దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్.రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. పెద్దాయన పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలు, రాజకీయాలను అన్నీ తానై చూసుకొనేవాడు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తపించేవాడు.విద్యా ప్రదాతగాదివంగత వైఎస్.రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు నెలకొల్పాడు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవాడు. వైఎస్.రాజారెడ్డి, వైఎస్సార్‌లు చూపిన బాటలోనే వైఎస్.జగన్మోహన్రెడ్డి, వైఎస్.అవినాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికీ పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు.నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబసభ్యులునేడు దివంగత వైఎస్.రాజారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా గురువారం పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ సమాధుల తోటలో వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ కుటుంబీకులు నివాళులర్పించనున్నారు. అనంతరం వైఎస్.రాజారెడ్డి పార్కులోని ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం జీసెస్ చారిటీస్‌లో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానికంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
Ghantasala: మధుర కంఠశాల
జయ జననీ పరమ పావని జయ జయ భారత జననీ... దేశం తాలూకు ప్రేమ స్పష్టంగా వినిపించిన గాత్రం. ‘మన దేశం’లోని ఈ పాట ఎవర్గ్రీన్.కలవర మాయె మదిలో.. నా మదిలో... కన్నులలోన గారడి ఆయే... ‘పాతాళ భైరవి’లో అదే గాత్రం ప్రేమ కురిపించింది.శేషశైలవాస.. శ్రీవెంకటేశా... ‘వెంకటేశ్వర మహత్మ్యం’లో ఆ గాత్రంలోని భక్తిభావం అద్భుతం. ఎట్టాగొ ఉన్నాది ఓ లమ్మీ... ప్రేయసితో గారాలు పోయింది ఆ గాత్రం..జగమే మాయ బతుకే మాయ.. వేదాలలో సారమింతేనయా.. ‘దేవదాసు’లో మత్తు నింపిన గాత్రం అది..లేచింది నిద్ర లేచింది మహిళాలోకం... ‘గుండమ్మ కథ’లో సమాజాన్ని మేల్కొల్పిన గాత్రం అది.దైవ భక్తి, దేశ భక్తి, ప్రేమ, విరహం, ఉత్సాహం... ఇలా అన్నింటినీ మధురంగా పలికించిన కంఠం అది. అందుకే ఘంటసాల దూరం అయినా ఆ స్వరం దూరం కాలేదు.. తెలుగు ప్రజల మనసుల్లో అలా నిలిచిపోయింది. ఆ ‘మధుర కంఠశాల’ ఘంటసాల 50వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఘంటసాల మాస్టారు జీవితంలోని కొన్ని విశేషాలు ఈ విధంగా... ఘంటసాల వెంకటేశ్వర రావ్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లిలో 1922 డిసెంబరు 4న సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు సూరయ్య, తల్లి పేరు రత్తమ్మ. ఘంటసాలకు సంగీతమంటే ప్రాణం. స్వతహాగా మంచి గాయకుడైన ఆయన శ్రీ నారాయణతీర్థుల తరంగాలను వినసొంపుగా పాడేవారు. మృదంగ వాయిద్యంలో కూడా ఘంటసాలకి మంచి ప్రవేశం ఉంది. ఆయన పాటలు పాడటంతో పాటు నృత్యం కూడా చేసేవారు. శ్రీ నారాయణ తీర్థుల తరంగాలను పాడటంలో తండ్రికి సహాయంగా ఉండేవారు ఘంటసాల. అలా పాటలు పాడుతూ, నృత్యాన్ని అభినయించే ఘంటసాలను అందరూ ‘బాల భరతుడు’ అని పిలిచేవారు. ఒకానొక సందర్భంలో ఘంటసాల సంగీత కచేరీ చేస్తున్నప్పుడు కొందరు ఆయన సంగీత పరిజ్ఞానాన్ని హేళన చేశారు. ఆ హేళనను ఆయన ఒక సవాల్‌గా స్వీకరించి, సంగీతంలో మంచిప్రావీణ్యాన్ని సంపాదించటానికి విజయనగరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే అందుకు ఆయన కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తన బంగారు ఉంగరం విక్రయించి, సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం చేరుకున్నారు. అక్కడ ఓ కళాశాలలో ప్రవేశం పొంది, విద్వాన్ పట్టాతో కళాశాల నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తన 14వ ఏట వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రోత్సాహంతో పట్రాయని సీతారామశాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతం అధ్యయనం చేశారు. హఠాత్తుగా తన తండ్రి సూరయ్య మృతి చెందడంతో మేనమామ శ్రీ ర్యాలి పిచ్చిరామయ్య వద్దకు చేరుకున్నారు ఘంటసాల. ఆ తర్వాత 1944 మార్చి 4న ఆయన కుమార్తె సావిత్రిని పెళ్లాడారు. సమీప బంధువైన సినీరంగ ప్రముఖుడు సముద్రాల రాఘవాచారి ఆశీస్సులతో 1944లో మద్రాసు చేరుకుని, గాయకుడిగా అవకాశాల కోసం ఏడాది పాటు ఎదురు చూశారు ఘంటసాల. 1945లో తొలిసారి ‘స్వర్గసీమ’ సినిమాలోని ‘గాజులపిల్ల..’ అనే పాట ద్వారా ఆయన గొంతు తెలుగు వారికి పరిచయమైంది. ఈ పాటకు ఆయన అందుకున్న పారితోషికం రూ. 116. ఆ తర్వాత ఎన్నో గీతాలు పాడారు. అలాగే తెలుగులో దాదాపు ఎనభై చిత్రాలకు, తమిళం, కన్నడంలో కొన్ని చిత్రాలకు సంగీతదర్శకత్వం వహించారు. ఇక ఘంటసాలకు దేశభక్తి కూడా ఎక్కువే. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు. ఘంటసాల చివరిగా పాడిన పాట ‘యశోదకృష్ణ’ సినిమాలోని ‘చక్కనివాడే భలే టక్కరివాడే..’. ఆ తర్వాత ఆయన తన జీవితమంతా పరితపించిన భగవద్గీత ప్రయివేటు రికార్డును పూర్తి చేసి, మరణించారు. జీవిత చరమాంకంలో చేసిన భగవద్గీత ఆయనకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టింది. 1972లో హైదరాబాద్ రవీంద్రభారతిలో కచేరీ చేస్తుండగా ఆయనకు గుండెలో నొప్పిగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. దాదాపు నెల రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత అనారోగ్యంపాలు కావడంతో ఒక విలేకరి సూచించిన నాటు మందు వాడారు. అది వికటించడంతో ఆరోగ్యం ఇంకా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల తుది శ్వాస విడిచారు. ‘శ్రీనివాసా... బాధ లేకుండా పోతే ఫర్వాలేదు’ అని చనిపోయే నాడు ఉదయం ఆస్పత్రిలో అన్నారట. ఘంటసాల పలికిన చివరి మాట ఇదేనట. తెలుగు చిత్రసీమ ఉన్నంతవరకూ నిలిచిపోయేలా పాటల రూపంలో మధురాన్ని పంచిన ఘంటసాల 52 ఏళ్ల వయసుకే దూరమయ్యారు. ఘంటసాలకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. ఓ నిర్మాత మన సినిమాలోని పాటలన్నీ హిట్ కావాలని సంగీత దర్శకుడు ఇళయారాజాకి చెప్పారట. అయితే ఇది ఒక్క ఘంటసాలగారికే సాధ్యం అన్నారట ఇళయరాజా. ఈయనే కాదు.. అప్పట్లో ఏ సంగీతదర్శకుడికైనా తొలిప్రాధాన్యం ఘంటసాలకే. పాటలు మాత్రమే కాదు.. పద్యాలు పాడటంలోనూ ఘంటసాల సూపర్. కొంతమంది సంగీత దర్శకులు వారి సినిమాల్లోని పద్యాలను ఘంటసాలతోనే పాడించుకున్నారు. స్వతహాగా ఘంటసాలకు కూడా పద్యాలు పాడటం అంటే చాలా ఇష్టం. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో చాలా పద్యాలు ఉంటాయి. తొలుత ఈ పద్యాలను పాడినందుకు ఘంటసాల పారితోషికం తీసుకోలేదట. ‘పద్యాలే కదా ఫర్వాలేదులే’ అన్నారట. కానీ ఈ చిత్రనిర్మాత బీఎస్ రంగా పద్యానికి వంద రూపాయల చొప్పున లెక్కగట్టి ఘంటసాలకి ఇచ్చారట. అలాగే ‘రహస్యం’ (1967) సినిమాకు ఎంతో ఇష్టపడి సంగీతం ఇచ్చారట ఘంటసాల. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఘంటసాల చాలా నిరాశ చెందారట. అలాగే తిరుమలేశునిపై ఎక్కవ పాటలు స్వరపరిచి, గానం చేసిన గాయకుల్లో ఘంటసాల పేరు ముందు వరుసలో ఉంటుంది. -
పేదల కోసం పరితపించిన వ్యక్తి వంగవీటి రంగా: ఎంపీ బాలశౌరి
-
స్వరార్చన
-
దివంగత మహానేత వైఎస్ఆర్కు TPCC ఘననివాళి
-
‘రాజన్నా’.. ఆ హస్తం పేదల ఆకలి తీర్చే భరోసా: వెంకన్న భావోద్వేగం
సాక్షి, నల్లగొండ: నేడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఆయన వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల.. మహానేతకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు నివాళులు అర్పించారు. మహానేతను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ తన మనసులో ఆయనకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్ వేదికగా.. ‘‘అన్నలా మీరిచ్చిన భరోసా.. ‘వెంకన్నా’ అంటూ పిలిచిన ఆ పిలుపులోని ఆప్యాయత.. ఎప్పటికీ శాశ్వతం రాజన్న! జన హృదయ నేతకు నివాళులు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ హస్తం.. పేదల ఆకలి తీర్చే భరోసా ఆ హస్తం.. కూలుతున్న గుడిసెకు భరోసా ఆ హస్తం.. సరస్వతీ పుత్రులకు ఫీజు రియంబర్సుమెంటు ప్రోత్సాహం ఆ హస్తం.. కుటిల రాజకీయాలకు పాశుపతాస్త్రం పేదల చిరునవ్వుల్లో చిరంజీవిగా నిలిచిన జన హృదయ నేతకు ఇదే నా నివాళులు అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. అన్నలా మీరిచ్చిన భరోసా.. ‘వెంకన్నా ‘ అంటూ పిలిచిన ఆ పిలుపులోని ఆప్యాయత.. ఎప్పటికీ శాశ్వతం రాజన్న! జన హృదయ నేతకు నివాళులు 🙏🏻💐#YSRVardanthi pic.twitter.com/JAE3GxawzW — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) September 2, 2022 ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి -
గాంధీ వర్ధంతి: మాంసం కోసం కొట్టుకున్న యువకులు
సాక్షి, రాయచూరు (కర్ణాటక): మాంసం కొనుగోలు విషయంలో చిన్నపాటి ఘర్షణ జరిగి 21 మంది గాయపడిన ఘటన ఆదివారం రాయచూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేశారు. సాయంత్రం నీరుబావి కుంటలో మాంసం దుకాణాలు తెరవడంతో శివప్ప, సూర్య ప్రకాశ్‌లు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాంసం కొనుగోలు సందర్భంగా చిన్నపాటి గలాటా జరిగింది. దీంతో ఇద్దరు వారి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకుని కొట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. చదవండిః సిద్ధు భస్మాసురుడు వంటి వాడు -
అసెంబ్లీలో గాంధీ వర్ధంతి
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. -
అదే... భరతజాతికి భగవద్గీత!
ప్రపంచంలో నేను ఒంటరి వాడినైనప్పటికీ నేను ప్రాణప్రదంగా విశ్వ సించే కొన్ని సిద్ధాంతాలకు ప్రమాదం ఉండదని భావి స్తున్నాను. నేను ప్రేమించే సిద్ధాంతాలు, ఆదర్శాలు వ్యాప్తిలో ఉన్నంత కాలం మరణానంతరం సైతం సమాధిలోనే జీవిస్తాను. మరోమాటలో చెప్పా లంటే సమాధి నుండి సందేశం వినిపిస్తాను అన్న మహాత్ముడి మాటలు నేటికి అక్షర సత్యాలుగా మారాయి. ప్రజలను సమీకరించడం గాంధీజీ రాజకీయ వ్యూహాల్లో ఒక అంశం. వలస పాలకుల్లో కొందరినైనా తటస్థు లుగా మార్చడం; హిందూ, ముస్లింల మధ్య ఐక్యతను తీసుకు రావడం. అంటరానివారుగా ఉన్న హరిజనులను (దళితులను) ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకు రావడం ఆయన వ్యూహాల లక్ష్యాలు. తన సిద్ధాంతానికి ముఖ్య భూమికగా వున్న ‘హింద్ స్వరాజ్’లో తను కోరుతున్న సమాజాన్ని ఆవిష్కరించి చూపాడు. ఈయన తాత్విక నేపథ్యా నికి మూలాలు అహింస, ప్రేమలో ఉన్నాయి. జీవితాంతం వ్యక్తులతో సమాజంతో చర్చోప చర్చలు చేస్తూ సత్యాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే సత్యమే భగవంతుడు అని ప్రకటించారు. గాంధీ జీవిత కాలంలో రెండు విషయాల పట్ల చాలా ప్రస్ఫుటంగా వ్యధ చెందారు. ఒకటి మత సామరస్యం, రెండవది కుల నిర్మూలన. కుల నిర్మూలనకై గాంధీ చేసిన కృషి అనితర సాధ్యమైంది. అస్పృశ్యతను నివారించి నట్లయితే కులాల మధ్య ఉండే అంతరాలు తగ్గుతాయని భావించారు. 1921లోనే అస్పృశ్య తను పాటించడం హిందూ మతానికి మచ్చ అన్నారు. ‘మతం’, అంటే ‘మూఢనమ్మకాలు, దుష్ట ఆచారాలు, మనిషికీ మనిషికీ మధ్యన నిర్మించబడ్డ అంతరాలు కాదు; మతం, రాజకీ యాలు, నైతిక సూత్రాలు, పరిశుద్ధ ప్రవర్తన... ఇవన్నీ పర్యాయ పదాలు అని గాంధీ ప్రకటిం చారు. ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ వారి ఉన్నతికి తోడ్పాటును అందిస్తూ, వారి అభివృద్ధిని కాంక్షించే దిగా మతాన్ని పేర్కొ న్నారు. నేడు గాంధీ చెప్పిన సిద్ధాంతాలు తల కిందులయ్యాయి. గాంధీ రామరాజ్యం స్థాపిం చాలని కాంక్షించారు. అయినా మతాలనూ సమానంగా దర్శించిన దేశీయ తాత్వికమూర్తి. ఈయన సైద్ధాంతిక భావజాలాన్ని పసి గట్టిన మతోన్మాదులే ఆయన్ని హత్యగావించారు. గాంధీ మత సామరస్యం కోసమే ప్రాణత్యాగం చేశారు. సత్యం, సత్ప్రవర్తనలకు మించిన మతం లేదు అన్నారు. ప్రజలందరికీ సమానహక్కులు లభించే భారత దేశం అనే భావనను వ్యతిరేకించే భావజాలం ఉన్న వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా గాంధీపై దాడి చేస్తూనే ఉన్నారు. గాంధీయిజాన్ని తమ మార్గానికి అవ రోధంగా భావిస్తున్న వారే జనవరి 30, 1948న మహాత్ముడిని హత్య చేశారు. ఆయన చూపిన అహింసా మార్గమే భరతజాతికి భగవద్గీత! -డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ (నేడు గాంధీ వర్ధంతి) -
ఎన్టీఆర్‌కు మరణం ఉండదు: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్‌కు మరణం ఉండదని లక్ష్మీపార్వతి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లోని సమాధి వద్ద లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా అందరి మనసుల్లో ఉన్నారన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని లక్ష్మీపార్వతి అన్నారు. చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్.. -
నాయకత్వ మార్పిడి కసరత్తు నడుస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ (64) తన వారసులకు ‘రిలయన్స్’ సామ్రాజ్యాన్ని అప్పగించే పనిని ప్రారంభించినట్టు ప్రకటించారు. తనతో సహా సీనియర్లతో కలసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వారసత్వ ప్రణాళికల గురించి అంబానీ మాట్లాడడం ఇదే మొదటిసారి. ముకేశ్ అంబానీకి కవలలు ఆకాశ్, ఇషాతోపాటు అనంత్ ఉన్నారు. రిలయన్స్ కుటుంబ దినం సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడారు. రిలయన్స్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ వర్ధంతి నాడు కుటుంబ దినం జరుపుకుంటూ ఉంటారు. రానున్న సంవత్సరాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అత్యంత బలమైన, ప్రసిద్ధి చెందిన భారత బహుళజాతి సంస్థగా అవతరిస్తుందన్నారు. శుద్ధ, గ్రీన్ ఎనర్జీలోకి ప్రవేశించడంతోపాటు.. రిటైల్, టెలికం వ్యాపారాలతో అసాధారణ స్థాయికి రిలయన్స్ చేరుకుంటుందని చెప్పారు. సరైన నాయకత్వంతోనే సాధ్యం.. ‘‘పెద్ద కలలు, అసాధారణమనుకునే లక్ష్యాలు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యపడతాయి. రిలయన్స్ ఇప్పుడు ముఖ్యమైన, నాయకత్వ మార్పిడిలో ఉంది. సీనియర్లు అయిన నాతరం నుంచి.. యువ నాయకులైన తదుపరి తరానికి బదిలీ కానుంది. ఎంతో పోటీవంతమైన, ఎంతో అంకితభావం కలిగిన, అద్భుతమైన యువ నాయకత్వం రిలయన్స్‌లో ఉంది. మేము వారిని ప్రోత్సహించి నడిపించాలి. వారి వెనుకనుండి.. వారు మాకంటే మెరుగ్గా పనిచేస్తుంటే వెన్నుతట్టి ప్రోత్సహించాలి’’ అని అన్నారు. ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు ‘‘ఆకాశ్, ఇషా, అనంత్ తదుపరి తరం నాయకులు. వారు రియలన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. దిగ్గజ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ ఎంతో చురుకుదనం, సామర్థ్యాలున్నాయి. రిలయన్స్‌ను మరింత విజయవంతంగా నడిపించాలని మనమందరం కోరుకుందాం’’ అని ముకేశ్ పేర్కొన్నారు. ప్రసంగంలో ఇషా భర్త ఆనంద్ పిరమల్, ఆకాశ్ భార్య శ్లోక, అనంత్‌కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న రాధిక పేర్లను అంబానీ ప్రస్తావించడం గమనార్హం. భవిష్యత్తుకు పునాది రాళ్లు రానున్న దశాబ్దాల్లో అపార అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా రిలయన్స్ భవిష్యత్తు వృద్ధికి పునాదులు వేయాల్సిన సమయం ఇదేనని అంబానీ అన్నారు. ‘‘రిలయన్స్ తన స్వర్ణ దశాబ్దం రెండో భాగంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పగలను. ప్రపంచ టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ చేరుతుంది. రిలయన్స్ ప్రముఖ బహుళజాతి సంస్థగా అవతరిస్తుంది’’ అని అంచనాలను వ్యక్తీకరించారు. -
మావోయిస్టు అగ్రనేత ఆర్కే వర్ధంతి సభ
-
తెలంగాణ ఆత్మ ప్రొఫెసర్ జయశంకర్
తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యంగా యావత్ కాలాన్ని ఉద్యమంలో గడిపిన కొత్తపల్లి జయశంకర్.. వరంగల్ జిల్లాలోని అక్కంపేటలో 1934 ఆగష్టు 6వ తేదీన మహాలక్ష్మి, లక్ష్మీకాంతరావు దంపతులకు జన్మించారు. హనుమకొండ, వరంగల్‌లో ప్రా«థమిక, ఉన్నత విద్య అభ్యసించి, బెనారస్, అలీగడ్ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులు పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. బీఈడీ చదివారు. తెలుగు తోపాటు ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో పట్టు సాధించారు. ఇంటర్మీడియట్ లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలంటూ నినదించి 1952లో ’ముల్కి‘ విధానాలు వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమానికి నడుం బిగించారు. అధ్యాపకులుగా సీకేఎం కళాశాలలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వచ్చే అనేక ప్రయోజనాలను విద్యార్థులకు నూరిపోసి చైతన్య దీపం వెలిగించారు. విశాలాంధ్రకు వ్యతిరేకంగా లాఠీదెబ్బలు తిన్నారు. 1954 లోనే విద్యార్థి నేతగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనానికి వ్యతిరేకంగా ‘ఫజిల్ ఆలీ‘ కమిషన్‌కు నివేదిక సమర్పించిన ధీశాలి. 1969లో పదిమంది మేధావులతో ఆర్.సత్యనారాయణ, శ్రీధరస్వామి తదితరులతో ఒక టీం ఏర్పాటు చేసి, తెలంగాణ సాధనకు వ్యూహాలు రచింపజేసిన మేధావి. ‘తెలంగాణ జనసభ‘ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆవశ్యకత గురించి అనేక రచనలను, ఎన్నో డాక్యుమెంట్లను రూపొందించి ప్రచురించారు. చిన్నతనం నుండి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, అసమానతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తెలంగాణ రావాలి!..మా తెలంగాణ మాగ్గావాలి!!‘‘అని నినదించాడు. ‘స్వయంపాలనలో శాసిస్తాం... కానీ ప్రస్తుతం ఇతరుల పాలనలో యాచిస్తున్నాం‘ అని బాధపడేవారు. 1975–79 వరకూ సీకేఎం కళాశాలకు ప్రిన్సిపాల్‌గా, 1979–81 వరకూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, 1982–91 వరకూ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్‌గా, 1991–94 వరకూ కాకతీయ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 1999–2000 మధ్య కాలంలో అమెరికా పర్యటించి, అనేక తెలుగు వారి సభల్లో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ ఆవశ్యకతను తెలిపి, రాష్ట్ర ఏర్పాటుకు మంచి వాతావరణాన్ని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణలో ఏమి జరుగుతుంది, వక్రీకరణలు–వాస్తవాలు, తల్లడిల్లుతున్న తెలంగాణ (వ్యాస సంపుటి), తెలంగాణ (ఇంగ్లిష్) తదితర రచనలు చేశారు. తెలంగాణ ఐక్య వేదిక వ్యవస్థాపకుడుగా పనిచేశారు. 2009లో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన చారిత్రక నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవిశ్రాంత కృషి చేసి, తాను కలలు కన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చూడకుండానే, 2011 జూన్ 21న కన్నుమూశారు. ఆయన ఆశయాలు, దిశా నిర్దేశనంతో కేసీఆర్ ఆధ్వర్యంలో, ఉద్యమకారులు, ప్రజానీకం సహకారంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, ప్రస్తుతం దేశంలో ఒక మార్గదర్శి రాష్ట్రంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాఫ్ట్వేర్ రంగాల్లో ముందుకు సాగుతోంది. ఆయనపై గౌరవంతోనే కేసీఆర్ ఒక జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని పేరు పెట్టి గౌరవించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశించిన తెలంగాణ.. ప్రజల గుండెచప్పుడు కావాలని ఆశిద్దాం.... –ఇ. ప్రసాదరావు వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 99482 72919 (నేడు ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా) -
సినారెకు సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నివాళులు అర్పించారు. ‘సినారె తెలంగాణ సాహితీ సౌరభాలను 'విశ్వంభర'తో విశ్వవ్యాపితం చేశారు. తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన వ్యక్తి సినారె’ అని సీఎం కేసీఆర్ ట్వీట్ చేశారు. చదవండి: ఈ నెల 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో పర్యటిస్తా -
విప్లవ నాయకురాలికి నివాళి
డిసెంబర్ 4 నటి, రాజకీయ నాయకురాలు జయలలిత వర్ధంతి. ఆమె జీవితం ఆధారంగా తమిళంలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘తలైవి’ ఒకటి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు కంగనా. అలానే ‘తలైవి’ సినిమాలోని పలు వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ప్రపంచం నటీమణులను చూసే దృష్టి కోణాన్నే మార్చేసిన నటి జయమ్మ. అలాంటి గొప్ప నటికి, విప్లవ నాయకురాలికి నివాళి అర్పించడం చాలా సంతోషంగాను, గర్వంగానూ ఉంది. ఫెమినిటీని (స్త్రీత్వం) గౌరవిద్దాం’’ అంటూ నివాళి అర్పించే ఫోటోను షేర్ చేశారు కంగనా రనౌత్. అలానే సినిమా గురించి మాట్లాడుతూ– ‘‘తలైవి’ సినిమా అనుకున్నట్టే వస్తోంది. దీనికి కారణం మా టీమ్. మా టీమ్ లీడర్ ఏఎల్ విజయ్‌కి చాలా థ్యాంక్స్. ఈ సినిమాను అద్భుతంగా మలచడం కోసం నిరంతరం సూపర్‌మేన్‌లా పని చేస్తున్నారు. ఇంకో వారం రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు కంగనా. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
ఐరన్‌లెగ్ అనేది నెగటివ్ అయింది
గునుపూడి విశ్వనాథ శాస్త్రి... ఈ పేరంటే ఏ కొద్ది మందికో తప్ప బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. అదే ఐరన్‌లెగ్ శాస్త్రి అంటే తెలిసిపోతుంది. తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఐరన్‌లెగ్ శాస్త్రి 14వ వర్ధంతి నేడు. 2006లో ఆయన మరణించారు. తండ్రి వర్ధంతి సందర్భంగా గునుపూడి సాయిదుర్గా ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత పౌరోహిత్యం చేపట్టారు. హైదరాబాద్ వచ్చాక సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేసేవారు. అలా ఏర్పడిన పరిచయంతో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణగారు ‘ప్రేమఖైదీ’లో నాన్నకి అవకాశమిచ్చారు. అయితే గునుపూడి విశ్వనాథశాస్త్రి పేరు స్క్రీన్ నేమ్‌గా బాగోదని ఐరన్‌లెగ్ శాస్త్రి అని పెట్టారు. ‘ఏవండీ ఆవిడ వచ్చింది, జంబలకిడి పంబ’ సినిమాలు నాన్నకి మంచి బ్రేక్ ఇచ్చాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. అయితే ఐరన్‌లెగ్ శాస్త్రి పేరు పాజిటివ్‌గా కంటే నెగటివ్‌గా క్లిక్ అయింది. నిజంగానే తను ఐరన్‌లెగ్ అని భావించారేమో పౌరోహిత్యానికి పిలవడం మానేశారు. 42ఏళ్లకే నాన్న మాకు దూరమయ్యారు. ఎంబీఏ చేసిన నేను సీఏ ఫైనలియర్ చేస్తున్నాను. నటన మీద ఆసక్తితో ‘ఐరన్‌లెగ్’, ‘ఐరన్‌లెగ్ 2.0’ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశా. ‘జంబలకిడి పంబ’లో నటించా. సంపూర్ణేశ్‌బాబు ‘రాధాకృష్ణ’లో మంచి పాత్ర ఇప్పించారు. మరో సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇంకో సినిమాలో నటిస్తున్నా’’ అన్నారు. -
రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ నగర్‌గా మార్చాలి
‘‘తెలుగు సినిమా పరిశ్రమ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు పేరును ఫిల్మ్‌నగర్‌కి చేర్చి ‘రఘుపతి వెంకయ్యనాయుడు ఫిల్మ్ నగర్’గా మార్చాలి’’ అని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ సభ్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఎదుట ఉన్న రఘుపతి వెంకయ్య నాయుడు విగ్రహం వద్ద ఆయన 79వ వర్ధంతిని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ ఆధ్వర్యంలో నిర్వహించారు. ‘‘ఇక నుంచి ప్రతి సంవత్సరం మార్చి 15న రఘుపతి వెంకయ్యగారి వర్ధంతిని, అక్టోబర్ 15న జయంతిని ఘనంగా జరుపుతాం’’ అని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ సభ్యులు పేర్కొన్నారు. ‘‘ఫిల్మ్‌చాంబర్ వద్ద రఘుపతి వెంకయ్య నాయుడుగారి విగ్రహాన్ని బాగు చేయించి, దాని చుట్టూ ఫెన్సింగ్, గొడుగు, నిచ్చెనలాంటి వాటిని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందిస్తా’’ అని మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ నూతన అధ్యక్షుడు యన్.గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు పి.విజయ వర్మ, ప్రధాన కార్యదర్శి జె.వి. మోహన్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాబ్జీ, సహాయ కార్యదర్శి యస్.ఏ.ఖుద్దూస్, కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కమిటీ సభ్యులు గాంధీ, జమా, హనుమంతరావు తదితరులు వెంకయ్యనాయుడి సేవలను కొనియాడారు. -
‘లోకేశ్‌కు శిష్యుడి వర్ధంతి శుభాకాంక్షలు’
-
‘లోకేశ్‌కు శిష్యుడి వర్ధంతి శుభాకాంక్షలు’
సాక్షి, హైదరాబాద్ : మంత్రి నారా లోకేశ్‌కు తగ్గ శిష్యుడు దొరికాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. హైటెక్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలినుంచీ సోషల్ మీడియాలోదూసుకుపోతున్న లోకేశ్‌పై అదే స్థాయిలో విమర్శలు, జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అభిమాని ఒకరు చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది. బుధవారం లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అయితే ఓ టీడీపీ నాయకుడు మాట్లాడుతూ.. నారా లోకేశ్ గారికి 36వ వర్ధంతి శుభాకాంక్షలు అని ఆ తర్వాత వెంటనే పక్కన వాళ్లు అందిస్తే సవరించుకున్నాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో.. అంబేద్కర్ జయంతినాడు వర్ధంతి శుభాకాంక్షలు చెప్పిన లోకేశ్‌ను గుర్తు చేసుకుని గురువుకు తగ్గా శిష్యుడు అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా శ్రద్ధాపూర్వకంగా అనే బదులు శ్రద్ధాంజలి అంటూ లోకేశ్ తడబడ్డారు. ఓ టీడీపీ కార్యక్రమంలో బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే అంటూ టంగ్ స్టిప్ అయ్యారు. పొరపాటున కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనల్ని మనం ఉరి తీసుకున్నట్టే అంటూ నోరుజారారు. ఇప్పటికే మంత్రి హోదాలో బహిరంగ వేదికలపై మాట్లాడుతూ.. ‘మంచి నీటి సమస్య కల్పన..’, ‘వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు..’ లాంటి వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు అందరికీ తెలిసిందే. -
ఆస్టిన్‌లో వైఎస్సార్‌కు నివాళి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి(సెప్టెంబర్ 2) సందర్భంగా ఆస్టిన్ నగరంలో ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్టిన్ వైస్సార్ అభిమానులతో, కార్యకర్తలతో మహానేత సేవలను, ఆయన తెచ్చిన పథకాలను కొనియాడారు. ఆ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. రాజన్నతో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మరలా రాజన్న రాజ్యం సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున వైఎస్సార్ అభిమానులు ప్రతి నెల సమావేశం కావాలని ఆయన కోరారు. అలాగే ఏపీలోని తమ తమ నియోజకవర్గ ప్రజలతో, సన్నిహితులతో, పార్టీ ఇంచార్జ్‌లతో తరచూ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సహకరించాలని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఏపీకి వెళ్లి పార్టీ తరపున ప్రచారం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి వైస్సార్ అభిమానులు సుబ్బా రెడ్డి చింతగుంట, రవి బల్లాడ, పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి, వెంకట శివ నామాల, కుమార్ అశ్వపతి, అశోక్ గూడూరు, కొండా రెడ్డి ద్వారసాల, మల్లికార్జున రెడ్డి ఆవుల, స్వాదీప్ రెడ్డి, హనుమంత రెడ్డి, వెంకటరామి రెడ్డి ఉమ్మ, ప్రవర్ధన్ చిమ్ముల , నర్సి రెడ్డి గట్టికుప్పల,రమణ రెడ్డి కిచ్చిలి, సూరి, గురు చంద్రా రెడ్డి, రంగ, సంగమేశ్వర్ రెడ్డి, రామ కోటి రెడ్డి, యస్వంత్ రెడ్డి గట్టికొప్పుల, అన్వేష్ రెడ్డి, శివ, గంగి రెడ్డి, వెంకట గౌతమ్ రెడ్డి, ఫణి, జితేందర్ రెడ్డి, సుబ్బా రెడ్డి ఎర్రగుడి, వెంకట్ రెడ్డి పులి, ప్రవీణ్, అనిల్ కడిపికొండ ఇంకా మరెంతోమంది హాజరయి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. -
ఆయన సేవలు అజరామరం
భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి 105వ వర్ధ్దంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బన్వరిలాల్ చెన్నైలో ఆవిష్కరించారు. తమిళసినిమా: నాగిరెడ్డి సేవలు అజరామరం అని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మేలు చేసే చిత్రాలు రూపొందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ సినీ పితామహుడు, దివంగత ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత, వాహినీ స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను శుక్రవారం చెన్నైలో ఆవిష్కరించారు. భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి విజయా ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో ఎన్నో అద్భుత కళాఖండాలను నిర్మించారు. పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్ వంటి ఆ పాత మధుర చిత్రాలతో పాటు నమ్‌నాడు, ఎంగవీట్టు పిళ్లైవంటి పలు జనరంజక తమిళ చిత్రాల నిర్మించారు. అదేవిధంగా భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వాహినీ స్టూడియో నిర్మాణ కర్త బి.నాగిరెడ్డినే. విజయా వైద్య, విద్యా సంస్థల వ్యవస్థాపకుడు అయిన నాగిరెడ్డికి ఈ నెల 25న 105వ వర్ధంతి రోజు. ఈ రోజును పురçస్కరించుకుని ఆయన పేరుతో తపాలాబిళ్లను విడుదల చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోíహిత్ హాజరయ్యారు. బి.నాగిరెడ్డి రూ.5 తపాలాబిళ్లను వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ బి.నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ బి.నాగిరెడ్డి అన్నా, ఆయన చిత్రాలన్నా తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే చిత్రాలనే నాగిరెడ్డి రూపొందించారని కీర్తించారు. ఆయన చిత్రాల్లో భాషకు, యాసకు ప్రాముఖ్యత ఉండేదన్నారు. శృంగారం లాంటి అసభ్య దృశ్యాలు లేకుండానే నాగిరెడ్డి ఎన్నో గొప్పగొప్ప ప్రేక్షకాదరణ పొందిన మంచి సందేశాత్మక కథా చిత్రాలను నిర్మించారని, ఇప్పుడు శృంగారం పేరుతో అపహాస్యం చేస్తున్నారని అన్నారు. నిజానికి ఇప్పటి చిత్రాల్లో శృంగారం కంటే, అంగారమే కనిపిస్తుందని అన్నారు. అలా కాకుండా సమాజానికి మంచి చేసే కథా చిత్రాలతో భావితరానికి మంచి సందేశాన్ని అందించే బాధ్యత నేటి దర్శక నిర్మాతలపై ఉందన్నారు. నైతిక విలువలతో కూడిన భారతీయ సంస్కృంతి, సంప్రదాయాలను పెంపొందించే చిత్రాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భాష ఏదైనా మనందరం భారతీయులమని వ్యాఖ్యానించారు. మాతృభాష తల్లిపాలు లాంటిదని, ఇతర భాషలు అద్దం లాంటివని పేర్కొన్నారు. అలాంటి తెలుగు భాషను మనమే చెడగొట్టుకుంటున్నామని అన్నారు. ఎన్ని గూగుల్స్ వచ్చినా మన గూగుల్ (ఉపాధ్యాయులు)లను మరవరాదని అన్నారు. నాగిరెడ్డి సినిమాలతోనే కాకుండా రియల్ లెజెండ్ అని వ్యాఖ్యానించారు, ఆయన సేవలు అజరామరం అని, సినీమారంగానికే కాకుండా వైద్య, విద్యారంగాల్లోనూ ఉత్తమ సేవలను అందించిన గొప్ప మానవతావాది ఆయన అని అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నాగిరెడ్డి ఎంతో సాధించారని పేర్కొన్నారు. అందుకే ఆయన దాదా సాహెబ్ పాల్కే అవార్డులాంటి ఎన్నో గొప్పగొప్ప అవార్డులతో సత్కరింపబడ్డారని గుర్తు చేశారు.నాగిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఈ తరం దర్శక నిర్మాతలు చిత్రాలు చేయాలని హితవు పలికారు. నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను విడుదల చేసిన తపాలా శాఖకు, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ తపాలాబిళ్లను తన చేతులమీదగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నాగిరెడ్డి గొప్ప మానవతావాది అని తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పేర్కొన్నారు. స్వశక్తితో ఎదిగి ఎంతో సాధించిన గొప్ప వ్యక్తి నాగిరెడ్డి అని శ్లాఘించారు. చందమామ హిందీ పత్రికను తాను చిన్నతనంలోనే చదివాననని, అయితే ఆ పత్రిక సంపాదకుడు బి.నాగిరెడ్డి అన్న విషయం ఇప్పుడే తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి తనయుడు బి.వెంకటరామిరెడ్డి, ఆయన సతీమణి బి.భారతీదేవి, రాష్ట్ర మంత్రి అన్భళగన్, ప్రముఖ చిత్ర నిర్మాత ఏవీఎం.శరవణన్ వేదికనలంకరించారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.నాగిరెడ్డి మనువడు వినయరెడ్డి వందన సమర్పణ చేశారు. నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు -
జనయోధుడికి ఘన నివాళి
జిల్లావ్యాప్తంగా జక్కంపూడి వర్ధంతి విస్తృతంగా సేవా కార్యక్రమాలు సాక్షి, రాజమహేంద్రవరం : మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ఐదో వర్ధంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆయన అభిమానులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి మాజీ మంత్రి జక్కంపూడి నిరంతర పోరాటం చేశారని, తుది శ్వాస వరకూ పేదల కోసమే పని చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కొనియాడారు. జక్కంపూడి అనుచరుడు నరవ గోపాలకృష్ణ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ‘జక్కంపూడి ప్రజా వారధి’ స్వచ్ఛంద సేవా సంస్థను, సంస్థ వ్యా¯Œæను అంబటి ప్రారంభించారు. కంబాలచెరువు సెంటర్లో ఉన్న జక్కంపూడి విగ్రహానికి ఆయన, సినీ నటుడు సుమన్, పార్టీ సిటీ, రూరల్ కో ఆర్డినేటర్లు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, జక్కంపూడి తనయుడు జక్కంపూడి రాజాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. అంతకుముందు వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో జక్కంపూడి చిత్రపటానికి అంబటి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వెఎస్ రాజశేఖరరెడ్డికి అంత్యంత సన్నిహితుడుగా రామ్మోహనరావు నిలిచారని అన్నారు. వైఎస్ జిల్లాలో పాదయాత్ర చేసినప్పడు అనారోగ్యానికి గురైతే వెన్నంటే ఉన్నారని గుర్తు చేశారు. జక్కంపూడి అనారోగ్యానికి గురైనా మంత్రివర్గంలో వైఎస్ కొనసాగించారని, ఇది వారి స్నేహాన్ని స్పష్టం చేస్తుం దన్నారు. వైఎస్ కుటుంబానికి జక్కంపూడి ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తని అన్నారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, తనను నమ్ముకున్న వారికోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉండే గొప్ప వ్యక్తి జక్కంపూడి అని అన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి పోరాట పటిమే స్ఫూర్తిగా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానన్నారు. నమ్మకానికి మారుపేరు జక్కంపూడని ఆకుల వీర్రాజు కొనియాడారు. పార్టీ నేతలు మిండగుదిటి మోహన్, రావూరి వెంకటేశ్వరరావు, మేడపాటి షర్మిలారెడ్డి, మింది నాగేంద్ర, సుంకర చిన్ని, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, దంగేటి వీరబాబు, ఆర్వీవీ సత్యనారాయణ, జక్కంపూడి గణేష్, గుర్రం గౌతం పాల్గొన్నారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు వైఎస్సార్ సీపీ కడియం మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి ఏర్పాటు చేసిన వైద్య, రక్తదాన శిబిరాలను అంబటి రాంబాబు, సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. రాజానగరంలో వృద్ధులకు అంబటి దుప్పట్లు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యాన జక్కంపూడి వర్ధంతి నిర్వహించారు. మలికిపురంలో జక్కంపూడి చిత్రపటానికి వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ ఆధ్వర్యాన అమలాపురం ఎన్టీఆర్ మార్‌్గలో జక్కంపూడి రామ్మోహనరావు వర్థంతి సభ నిర్వహించారు.