ప్రపంచంలో నేను ఒంటరి వాడినైనప్పటికీ నేను ప్రాణప్రదంగా విశ్వ సించే కొన్ని సిద్ధాంతాలకు ప్రమాదం ఉండదని భావి స్తున్నాను. నేను ప్రేమించే సిద్ధాంతాలు, ఆదర్శాలు వ్యాప్తిలో ఉన్నంత కాలం మరణానంతరం సైతం సమాధిలోనే జీవిస్తాను. మరోమాటలో చెప్పా లంటే సమాధి నుండి సందేశం వినిపిస్తాను అన్న మహాత్ముడి మాటలు నేటికి అక్షర సత్యాలుగా మారాయి.
ప్రజలను సమీకరించడం గాంధీజీ రాజకీయ వ్యూహాల్లో ఒక అంశం. వలస పాలకుల్లో కొందరినైనా తటస్థు లుగా మార్చడం; హిందూ, ముస్లింల మధ్య ఐక్యతను తీసుకు రావడం. అంటరానివారుగా ఉన్న హరిజనులను (దళితులను) ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకు రావడం ఆయన వ్యూహాల లక్ష్యాలు.
తన సిద్ధాంతానికి ముఖ్య భూమికగా వున్న ‘హింద్ స్వరాజ్’లో తను కోరుతున్న సమాజాన్ని ఆవిష్కరించి చూపాడు. ఈయన తాత్విక నేపథ్యా నికి మూలాలు అహింస, ప్రేమలో ఉన్నాయి. జీవితాంతం వ్యక్తులతో సమాజంతో చర్చోప చర్చలు చేస్తూ సత్యాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే సత్యమే భగవంతుడు అని ప్రకటించారు. గాంధీ జీవిత కాలంలో రెండు విషయాల పట్ల చాలా ప్రస్ఫుటంగా వ్యధ చెందారు. ఒకటి మత సామరస్యం, రెండవది కుల నిర్మూలన. కుల నిర్మూలనకై గాంధీ చేసిన కృషి అనితర సాధ్యమైంది.
అస్పృశ్యతను నివారించి నట్లయితే కులాల మధ్య ఉండే అంతరాలు తగ్గుతాయని భావించారు. 1921లోనే అస్పృశ్య తను పాటించడం హిందూ మతానికి మచ్చ అన్నారు. ‘మతం’, అంటే ‘మూఢనమ్మకాలు, దుష్ట ఆచారాలు, మనిషికీ మనిషికీ మధ్యన నిర్మించబడ్డ అంతరాలు కాదు; మతం, రాజకీ యాలు, నైతిక సూత్రాలు, పరిశుద్ధ ప్రవర్తన... ఇవన్నీ పర్యాయ పదాలు అని గాంధీ ప్రకటిం చారు. ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ వారి ఉన్నతికి తోడ్పాటును అందిస్తూ, వారి అభివృద్ధిని కాంక్షించే దిగా మతాన్ని పేర్కొ న్నారు. నేడు గాంధీ చెప్పిన సిద్ధాంతాలు తల కిందులయ్యాయి.
గాంధీ రామరాజ్యం స్థాపిం చాలని కాంక్షించారు. అయినా మతాలనూ సమానంగా దర్శించిన దేశీయ తాత్వికమూర్తి. ఈయన సైద్ధాంతిక భావజాలాన్ని పసి గట్టిన మతోన్మాదులే ఆయన్ని హత్యగావించారు. గాంధీ మత సామరస్యం కోసమే ప్రాణత్యాగం చేశారు. సత్యం, సత్ప్రవర్తనలకు మించిన మతం లేదు అన్నారు. ప్రజలందరికీ సమానహక్కులు లభించే భారత దేశం అనే భావనను వ్యతిరేకించే భావజాలం ఉన్న వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా గాంధీపై దాడి చేస్తూనే ఉన్నారు. గాంధీయిజాన్ని తమ మార్గానికి అవ రోధంగా భావిస్తున్న వారే జనవరి 30, 1948న మహాత్ముడిని హత్య చేశారు. ఆయన చూపిన అహింసా మార్గమే భరతజాతికి భగవద్గీత!
-డొక్కా మాణిక్య వరప్రసాద్
వ్యాసకర్త ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్
(నేడు గాంధీ వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment