ప్రధాన వార్తలు

OP Mahadev: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్లో(లోక్‌సభ) చర్చ వేళ.. భారతసైన్యం ఘన విజయం సాధించింది. పహల్గాం ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సులేమాన్ అలియాస్ ముసాను శ్రీనగర్‌లో మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది.జమ్ము కశ్మీర్లో ఆపరేషన్ మహదేవ్ పేరిట ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు. మహదేవ్ పర్వత ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఉదయం 11.30 గం.ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో సోమవారం దాచిగాం ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా.. ముగ్గురు ముష్కరులు మరణించారు. తొలుత వీళ్లకు పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు అనుమానించారు. అయితే.. మృతుల్లో లష్కరే తాయిబా ఉగ్రవాది సులేమాన్ ఉన్నట్లు భద్రతా బలగాలు దృవీకరించాయి. సులేమాన్ అలియాస్ హషీమ్ మూసా గతంల పాక్ ఆర్మీలో పని చేశాడు. మూసా మృతిని భారత సైన్యం ధృవీకరించింది. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్న సమయంలో.. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను బలిగొన్నారు. ఈ దాడికి మాస్టర్‌మైండ్ సులేమాన్ అలియాస్ ముసానే. సోమవారం ఉదయం శ్రీనగర్ లిద్వాస్ దగ్గర ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మూసాతో పాటు అబూ హమ్జా, యాసిర్‌లు ఉన్నారు. ఈ ఇద్దరూ పహల్గాం దాడిలో పాల్గొన్నారు. డ్రోన్ల ద్వారా మృతదేహాలను గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే 47 రైఫిల్స్ ,17 గ్రానైడ్లు లభ్యమయ్యాయి. పహల్గాం దాడిలో పాల్గొంది ఈ ఉగ్రవాదులే.. మూసా(కుడివైపు చివర)అలాగే.. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సైన్యం ప్రకటించింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ను తెలియజేస్తామని ఎక్స్ ద్వారా తెలియజేసింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ములనార్, హర్వాన్ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మరిన్ని బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నట్లు సమాచారం. OP MAHADEVContact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 28, 2025

Live: ఆపరేష్ సిందూర్‌పై చర్చ.. విపక్షాలపై రాజ్‌నాథ్ సెటైర్లు
Parliament Monsoon Session Liveభారత సైనికులు సింహాలు : రాజ్‌నాథ్ సింగ్పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్యఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాంఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారుమతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చపంపారుమన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఉరుకునేది లేదుపాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాంభారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసిందిపాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రశిబిరాలపై దాడులు చేశాం100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాంహిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాంటెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాంపాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసిందిపాక్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాంఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్ పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదుభారత నౌకా దళం కూడా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పిందిపాక్ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదుతమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరిందిమనదాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది.ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. గ్యాప్ ఇచ్చాంఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదుబాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాంప్రతి పక్షాలపై రాజ్‌నాథ్ సెటైర్లుపరీక్ష రాసేటప్పుడు ఎలా రాస్తున్నాం అన్నది మాత్రమే చూడాలి. పెన్సిల్ విరిగిందా,అరిగిందా అన్నది చూడకూడదుపాక్ ఆర్మీ,ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని హతమార్చాంపాక్ న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ లెక్క చేయలేదుఎటుచూసుకున్నా.. పాక్ మనతో సమమానం కాదుప్రతిపకక్షాలు భారత సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదుభారత సైనికులు సింహాలుభారత్ దాడులకు పాక్ తట్టుకోలేకపోయిందిదేశ రక్షణ విషయంలో ఆచితూచి ప్రశ్నలు వేయాలి లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చప్రారంభమైన పార్లమెంట్లోక్సభలో ఆపరేషన్ సిందూర్‌పై మొదలైన చర్చచర్చ ప్రారంభించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ప్రతిపక్షాలు పారిపోతున్నాయ్: పీయూష్ గోయల్ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరగాల్సిన చర్చబీహార్ ఓటర్ల జాబితా అంశంతో ఉభయ సభల్ని అడ్డుకుంటున్న విపక్షాలుమూడుసార్లు వాయిదా పడ్డ సభలువిపక్షాల తీరుపై కేంద్రం ఫైర్ఆపరేషన్ సింధూర్ చర్చ నుంచి పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్భారత సైన్యం సాధించిన విజయాన్ని అగౌరవపరుస్తున్నారంటూ పీయూష్ వ్యాఖ్యమూడోసారి లోక్‌సభ వాయిదాఆపరేషన్ సిందూర్‌కు ముందు లోక్‌సభలో గందరగోళంవిపక్షాల ఆందోళనతో లోక్‌సభ మరోసారి వాయిదామధ్యాహ్నాం 2గం. దాకా వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లాఇవాళ మూడోసారి పడ్డ వాయిదాఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడేది వీళ్లేబీజేపీ తరపున.. రాజ్‌నాథ్ సింగ్బజ్యంత్ పాండాఎస్ జైశంకర్తేజస్వి సూర్యసంజయ్ జైశ్వాల్అనురాగ్ ఠాకూర్కమల్జీత్ షెరావత్కాంగ్రెస్ నుంచిగౌరవ్ గోగోయ్ప్రియాంక గాంధీ వాద్రాదీపేంద్ర హుడాపరిణితీ షిండేసప్తగిరి ఉలాకాబిజేంద్ర ఒలాఇతరులులావు కృష్ణదేవరాయ(టీడీపీ)హరీష్ బాలయోగి(టీడీపీ)రామశంకర్ రాజ్‌భర్(ఎస్పీ)చోటేలాల్(ఎస్పీ)కల్యాణ్ బెనర్జీ(ఏఐటీసీ)సయోని ఘోష్(ఏఐటీసీ)కే ఫ్రాన్సిస్ జార్జ్(కేరళ కాంగ్రెస్)ఏ రాజా(డీఎంకే)కనిమొళి(డీఎంకే)అమూర్‌కాలే(ఎన్సీపీ ఎస్పీ)సుప్రియా సూలే (ఎన్సీపీ ఎస్పీ) ఆపరేషన్ సిందూర్‌పై.. లోక్‌సభలో చర్చ ప్రారంభించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ఆపరేషన్ సిందూర్‌పై.. కాంగ్రెస్‌కు 2గంటల సమయంసాయంత్రం 4.30. గం. ప్రాంతంలో ప్రియాంక వాద్రా గాంధీ ప్రసంగించే ఛాన్స్సాయంత్రం ఏడున్నర గంటలకు మాట్లాడనున్న విదేశాంగ మంత్రి జైరాం రమేష్రాత్రి 10గం. దాకా సాగనున్న ఆపరేషన్ సిందూర్ చర్చలోక్‌సభ మళ్లీ వాయిదాఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ముందు లోక్‌సభలో విపక్షాల ఆందోళనబీహార్ ఓటర్ జాబితా సవరణపై చర్చకు పట్టులోక్ సభ వెల్‌లో విపక్షాల ఆందోళనబీఏసీ మీటింగ్‌లో ప్రతిపక్ష నేతలంతా ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ఒప్పుకున్నారు: స్పీకర్ ఓం బిర్లాఇప్పుడు ఆందోళన ఎందుకు చేస్తున్నారు?: స్పీకర్ ఓం బిర్లాఆందోళన చేస్తే ఆపరేషన్ సిందూర్‌పై చర్చ ఎలా జరుగుతుంది?: స్పీకర్ ఓం బిర్లావాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లాలోకసభ 1గం. వరకు వాయిదాఅటు రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనరాజ్యసభ 2.గం వరకు వాయిదాఆపరేషన్ సిందూర్‌పై చర్చఅధికార, ప్రతిపక్షాలకు స్పీకర్ ఓంబిర్లా విజ్ఞప్తివిపక్షాల తీవ్ర ఆందోళనచర్చ ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్మొత్తం 16 గం. పాటు జరగనున్న చర్చప్రభుత్వం తరఫున మాట్లాడనున్న కేంద్ర మంత్రులుచర్చలో చివరగా ప్రధాని మోదీ మాట్లాడే అవకాశంకాంగ్రెస్ నుంచి చర్చను ప్రారంభించనున్న గౌరవ్ గగోయ్కాంగ్రెస్కు 2 గంటల సమయంప్రారంభమైన లోక్సభమరికాసేపట్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చపార్లమెంట్లో 16 గంటలపాటు కొనసాగనున్న చర్చఇవాళ, రేపు లోక్‌సభలో చర్చ నడిచే అవకాశంరేపు రాజ్యసభలో చర్చ జరిగే చాన్స్లోక్సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్దేశ జాతయ భద్రతకు హాని కలిగించేలా, పహల్గాం బాధితులు నొచ్చుకునేలా మాట్లాడొద్దని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి కిరెన రిజిజు విజ్ఞప్తిపార్లమెంట్ ప్రారంభం.. ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభంవాయిదా తీర్మానాలపై విపక్షాల పట్టుస్పీకర్ చైర్లో ఎంపీ కృష్ణప్రసాద్ తెన్నేటీఉభయ సభల్లో ఆందోళనల నడుమ.. వాయిదా వేసిన స్పీకర్, చైర్మన్12గం. ప్రారంభం కానున్న ఉభయ సభలు మరికాసేపట్లో లోక్‌సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చచర్చను ప్రారంభించనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్దాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకోకపోవడంపై ప్రశ్నించనున్న విపక్షాలుఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిన భారత సైన్యంఆపరేషన్ సిందూర్‌ను మద్యలోనే నిలిపివేయడంపై ప్రతిపక్షాల అభ్యంతరందౌత్యం తన ప్రమేయం ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంపైనా ప్రశ్నించే అవకాశంశశిథరూర్ .. గప్చుప్పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్.. చర్చ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చర్చకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ వర్గాలు ఈ ప్రకటన చేశాయి. ఒకవేళ ఆయన గనుక చర్చలో పాల్గొంటే మాత్రం అది పార్టీ లక్ష్మణరేఖ దాటినట్లే కానుంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. ఐదో రోజు సెషన్ ప్రారంభమైంది. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఉభయ సభలు గత నాలుగు రోజులుగా సజావుగా సాగని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్చతో ఇవాళ సభ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.దేశాన్ని అవమానించొద్దు: రిజిజుఆపరేషన్ సిందూర్‌పై చర్చవేళ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప్రతిపక్షాలకు ఓ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో దేశ హుందాతనం, గౌరవాన్ని కాపాడాలి. విపక్షాలు పాక్ భాష వాడొద్దు. దేశ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దు. సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు అని కోరారు. రావణుడు లక్ష్మణ రేఖ దాటాడు కాబట్టే లంకా దహనం అయ్యింది. పాక్ ఉగ్రవాదులు సరిహద్దు దాటారు కాబట్టే వాళ్ల ఉగ్రవాద శిబిరాలు నాశనం అయ్యాయంటూ రిజిజు ట్వీట్ఉగ్రవాదులు మన దేశం వారేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంఇన్నిరోజులు జాతీయ దర్యాప్తు సంస్థ ఏం చేసిందని ప్రశ్నపాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చారనడానికి ఆధారాల్లేవ్ఇప్పటిదాకా ఉగ్రవాదుల జాడ ఎందుకు తెలుసుకోలేకపోయారని ప్రశ్నచిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరాలుచిదంబరాన్ని వెనకేసుకొస్తున్న కాంగ్రెస్ ఆయన అడిగినదాంట్లో తప్పేంటి? అని బీజేపీకి కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నలోక్సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్‌పై చర్చను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది. విపక్షాల తరఫున ప్రసంగించే నేతల వివరాలపై స్పష్టత లేదు. అయితే కాంగ్రెస్ తరఫున ఎంపీ ప్రియాంక గాంధీ, మరికొందరు ఎంపీలు ప్రసంగిస్తారని సమాచారం. చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ఏప్రిల్ 25వ తేదీన.. జమ్ము కశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) సంస్థ ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా ఆ ఉగ్రవాదుల భరతం పట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో ఓవైపు.. పాక్‌కు బుద్ధి చెప్పేందుకేనని కేంద్రం చెప్పిన ఆపరేషన్ సిందూర్‌ను అర్దంతరంగా ఆపేయడం పైనా మండిపడ్డాయి. మరోవైపు.. తన వల్లే కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన భారతదేశ విదేశాంగ విధానం వైఫల్యమని మండిపడుతున్నాయి. అయితే ట్రంప్ జోక్యాన్ని ఖండించిన భారత ప్రభుత్వం.. పహల్గాం దాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, ఆ ఆపరేషన్ విజయవంతంపైనా పార్లమెంట్లో చర్చిస్తామని చెబుతోంది. అటు రేపు రాజ్యసభలో ఆపరేషన్ సిందూరపై చర్చ జరగనుంది.

చంద్రబాబూ.. అత్త సొమ్ము అల్లుడి దానమా?: శోభనాద్రీశ్వరరావు ఫైర్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు. విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు ఇదే లులుకు ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎవరూ ఏమీ చేయలేరనే భావనతో చంద్రబాబు పాలన చేస్తున్నారు.చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉంది. విశాఖలో లులు కంపెనీకి కోట్ల రూపాయల స్థలం కట్టబెట్టాడు. గతంలో విజయవాడ స్వరాజ్య మైదానాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూశాడు. అప్పుడు నేను హైకోర్టులో పిల్ వేస్తే ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాజీవ్ గాంధీ పార్క్‌ను అభివృద్ధి పేరుతో చైనా కంపెనీలకు ఇవ్వాలని చూశాడు. కెనాల్ గెస్ట్ హౌస్ నాలుగు ఎకరాలు టూరిజం పేరుతో గోకరాజు గంగరాజుకు కట్టబెట్టాడు. 200 కోట్ల రూపాయల స్థలంలో ఆయన హోటల్ కట్టుకున్నాడు.చంద్రబాబు ఎవరి చెవిలో పువ్వులు పెడతాడు. డీమార్ట్, రిలయన్స్‌కి ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఇచ్చారా?. విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ స్థలం లులుకి ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది. చంద్రబాబు కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నాడు. అమరావతికి 34వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు రైతులను మోసం చేశాడు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి. రైతులు, వ్యవసాయం అంటే చంద్రబాబుకు లెక్కలేదు. ప్రస్తుతం చేసిన భూముల కేటాయింపులన్నింటినీ రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

భారత్‌తో ఐదో టెస్ట్.. మరో ఫాస్ట్ బౌలింగ్ అస్త్రాన్ని ప్రయోగించనున్న ఇంగ్లండ్
జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగబోయే ఐదో టెస్ట్ కోసం అప్డేటెడ్ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ఇవాళ (జులై 28) ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం నాలుగో టెస్ట్ ఆడిన జట్టును యధాతథంగా కొనసాగించిన ఈసీబీ అదనంగా మరో ఫాస్ట్ బౌలర్‌ను జట్టులో చేర్చుకుంది. 31 ఏళ్ల జేమీ ఓవర్టన్ ఐదో టెస్ట్ కోసం జట్టులో భాగం కానున్నాడు.నాలుగో టెస్ట్ సందర్భంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ అసౌకర్యంగా కనిపించడంతో అతనికి బ్యాకప్‌గా జేమీని ఎంపిక చేశారు. జేమీ చేరికతో జట్టులో పేసర్ల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ లాంటి పేసర్లు జట్టులో ఉన్నారు.జేమీ చివరిగా 2022లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతనికి కెరీర్లో అదే ఏకైక టెస్ట్ మ్యాచ్. నాడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జేమీ 97 పరుగులు (ఒకే ఇన్నింగ్స్‌లో) చేసి, 2 వికెట్లు తీశాడు. జేమీ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.భారత్‌తో ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, లియామ్ డాసన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్కాగా, మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నిన్న ముగిసిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఊహకందని రీతిలో పుంజుకుంది.కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) న భూతో న భవిష్యతి అన్న రీతితో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రా చేశారు. ముఖ్యంగా సుందర్-జడేజా జోడీ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో ఒకటి, మూడు మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది.

'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా
కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ఈ మూవీ మాత్రం మౌత్ టాక్‌తో పాటు కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.10 కోట్లకు పైన వసూళ్లు రావడం విశేషం.ఓవైపు 'హరిహర వీరమల్లు' లాంటి తెలుగు సినిమా పోటీ ఉన్నప్పటికీ.. 'మహావతార్ నరసింహా' స్క్రీన్ కౌంట్ పెంచుకుంటూ పోతోంది. తొలిరోజు కొన్ని థియేటర్లు దక్కగా.. రెండోరోజు, మూడో రోజుకి థియేటర్ల సంఖ్య పెరిగింది. అదే రీతిన వసూళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తొలిరెండు రోజుల్లో కలిపి రూ.5 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. మూడో రోజైన ఆదివారం మాత్రం దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)ఈ లెక్కన చూసుకుంటే మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.20 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహా'. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాలు ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజైన తొలి పార్ట్ ఇది. నరసింహా స్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చేస్తోంది.సాధారణంగా మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ కావు. గతంలో 'హనుమాన్' తదితర చిత్రాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు రాబట్టుకోలేకపోయాయి. ఈ సినిమా మాత్రం కోట్ల రూపాయలు కలెక్షన్స్, అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!)

మిథున్‌రెడ్డితో ములాఖత్.. కన్నీరు పెట్టిన తల్లి స్వర్ణలత
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. మిథున్ రెడ్డితో ఆయన తల్లి స్వర్ణలత, చెల్లి శక్తి రెడ్డి, బావ అఖిల్, ములాఖత్ అయ్యారు. వీరితో పాటుగా వైఎస్సార్సీపీ నేతలు కూడా అక్కడికి వెళ్లారు. ఈ సందర్బంగా మిథున్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో, ఆయన తల్లి స్వర్ణలత భావోద్వేగానికి గురయ్యారు. మిథున్ రెడ్డి పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.అనంతరం, మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత మాట్లాడుతూ.. ‘అన్యాయంగా నా కుమారుడిని జైల్లో పెట్టారు. టెర్రరిస్టులను చూసినట్టు చూస్తున్నారు. కనీస సదుపాయాలు కల్పించలేదు. కాస్త మెరుగైన సదుపాయాలు అందించాలని కోరుతున్నాం’ అని అన్నారు.మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను కొనసాగిస్తోంది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనకు ఇచ్చిన సదుపాయాలపై ఏనాడు రివ్యూ పిటిషన్ వేయలేదు. ఏసీ సదుపాయం కూడా కల్పించాం. జైలు అధికారులపై ప్రభుత్వ ఒత్తిడి ఎంత ఉందో రివ్యూ పిటిషన్ వేయడం చూస్తే అర్థమవుతుంది. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారు’ అని తెలిపారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ..‘ప్రభుత్వం దారుణమైన విధానాలను అనుసరిస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారు. మిథున్ రెడ్డిని అన్యాయంగా మద్యం కేసులో ఇరికించారు. కచ్చితంగా ప్రజలంతా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు.

టెస్లాతో శాంసంగ్ భారీ డీల్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రముఖ కంపెనీతో 16.5 బిలియన్ డాలర్ల(రూ.1.4 లక్షల కోట్లు) విలువైన భారీ చిప్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. 2033 చివరి వరకు కొనసాగే ఈ ఒప్పందం శాంసంగ్ చిప్ ఫౌండ్రీ వ్యాపారానికి ఊతమిస్తుందని నమ్ముతుంది. శాంసంగ్ గ్లోబల్ క్లయింట్‌లో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఏ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారో మాత్రం ధ్రువీకరించలేదు. అయితే ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడుతూ శాంసంగ్ టెస్లాతోనే డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పారు. శాంసంగ్ చిప్ ఫౌండ్రీ విభాగం ఇప్పటికే టెస్లాతో కలిసి పనిచేస్తోందని, ఈ కొత్త డీల్ ఆ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.మార్కెట్లో పెరుగుతున్న పోటీ వల్ల శాంసంగ్ తన తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునేంత ఆర్డర్లను ఆకర్షించలేకపోయింది. మెమొరీ చిప్‌ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న ఈ కంపెనీ చిప్ ఫౌండ్రీ వ్యాపారం డిమాండ్, పోటీని తట్టుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఈ కీలక సమయంలో దీర్ఘకాలిక ఒప్పందం రావడం కంపెనీకి కలిసొస్తుందని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఓలా కృత్రిమ్‌లో రెండో విడత లేఆఫ్స్తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ(తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ) ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫౌండ్రీ మార్కెట్లో టీఎస్ఎంసీకి 67.6 శాతం వాటా ఉందని పరిశోధన సంస్థ ట్రెండ్ ఫోర్స్ తెలిపింది. శాంసంగ్ షేరు 8.1 శాతం నుంచి 7.7 శాతానికి పడిపోయింది. టెస్లాతో కొత్త ఒప్పందం శాంసంగ్ భవిష్యత్ చిప్ టెక్నాలజీని బలోపేతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌తో సహా తదుపరి తరం పరికరాలు, అనువర్తనాలకు 2-నానోమీటర్ చిప్‌లు ఎంతో అవసరం అవుతాయి.

థరూర్ మౌన వ్రత్.. తప్పించారా? తప్పుకున్నారా?
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశంపై ఇవాళ పార్లమెంట్ లోక్‌సభలో చర్చ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర నేత రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతున్న వేళ.. శశిథరూర్ కారు దిగి పార్లమెంట్ లోపలికి వడివడిగా అడుగేశారు. ఆ సమయంలో.. మీ పార్టీ తరఫున మాట్లాడే అవకాశం మీకు ఇస్తారా? అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి ఆయన ‘మౌన వ్రత్.. మౌన వ్రత్’ అంటూ ముందుకు వెళ్లారు. అయితే కాస్త ముందుకు వెళ్లగానే ఆయన రేణుకా చౌదరిని గమనించారు. వెనక్కి వచ్చి మీడియాతో మాట్లాడుతున్న ఆమెను ఆప్యాయంగా పలకరించారు. వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ తాలుకా వీడియో వైరల్ అవుతోంది. ఆ సమయంలో రేణుకా చౌదరి.. ఆయనకు అన్ని విధాల ఆ అర్హత ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.#WATCH | Delhi | Lok Sabha to discuss Operation Sindoor today, Congress MP Shashi Tharoor says, "Maunvrat, maunvrat..." pic.twitter.com/YVOwS7jpk5— ANI (@ANI) July 28, 2025Interesting moment in #Parliament:On @NDTV’s question about whether he’ll speak today, @ShashiTharoor walked in silently.@RenukaCCongress, standing nearby, remarked: “He has every right to speak.”Then, interestingly asked him: “Why didn’t you invite me to the mango party?” pic.twitter.com/dkBb590z1W— AISHVARYA JAIN (@aishvaryjain) July 28, 2025ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ఇందులో కాంగ్రెస్‌కు 2గంటల సమయమే ఉంది. అయితే కాంగ్రెస్ తరఫున ఈ చర్చలో పాల్గొనబోయే లిస్ట్‌లో థరూర్ పేరు లేదు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రపంచానికి వివరించేందుకు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం ఎంపీల బృందాలను వివిధ దేశాలకు విదేశాలకు పంపించింది. అమెరికాకు వెళ్లిన ఎంపీల బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు. అటువంటి శశిథరూర్ పేరు డిబెట్ లో మాట్లాడే వారి జాబితాలో లేకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.2020 నుంచి కాంగ్రెస్ అధిష్టానంతో శశిథరూర్‌కు గ్యాప్ ఏర్పడింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకానొక దశలో ఆయన తిరువనంతపురం నుంచి పోటీ చేయరనే చర్చ సైతం నడిచింది. అయితే ఆయన అక్కడి నుంచే పోటీ చేసి నెగ్గారు కూడా. అయితే.. ఆపరేషన్ సిందూర్ పరిణామాల తర్వాత.. శశిథరూర్‌తో కాంగ్రెస్ గ్యాప్ మరింత పెరిగింది. మోదీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ.. పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్న శశిథరూర్ అధిష్టానం అసలు పట్టించుకోవడమే మానేసింది. ఈ తరుణంలో ఇవాళ్టి వరుస పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

గబ్బిలాలతో చిల్లీ చికెన్!!
ఫాస్ట్‌ఫుడ్ ప్రియులకు వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. మీరు ముక్కు తుడుచుకుంటూ, లొట్టలేసుకుంటూ తిన్నది ‘చిల్లీ చికెన్’ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే.. చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్‌కు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు చేరవేసే ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి.తమిళనాడు సేలం జిల్లా డేనిష్ పేట అటవీ ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పేర్లను కమల్, సెల్వంగా చెప్పిన నిందితులు.. విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలను తెలియజేశారు. కొన్ని నెలలుగా గబ్బిలాలను వేటాడుతున్న వీళ్లిద్దరూ.. వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్‌కు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. కొన్ని హోటల్స్‌కు చిల్లీ చికెన్ తదితర ఐటెమ్స్‌ను వీళ్లే స్వయంగా గబ్బిలాల మాంసంతో వండించి నేరుగా చేరవేస్తున్నారట. తమ కంటే ముందు కొంతమంది.. కొన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నారంటూ మరో బాంబ్ పేల్చారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులను అప్రమత్తం చేశారు. సేలం, కమల్ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్లపై పోలీసులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇంతకాలం పిల్లి, కుక్క, ఎలుకల మాంసాన్ని ఇలా తరలించడం చూశాం. ఇప్పుడు ఏకంగా గబ్బిలాల మాంసాన్ని చేరవేస్తుండడం ఇప్పుడు కలవరపాటుకు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

నో జిమ్, ఓన్లీ చాట్‌జీపీటీ, డంబెల్స్ 18 కిలోలు తగ్గి మెరుపు తీగలా
అధిక బరువును తగ్గించుకుని ఫిట్‌గా ఉండాలని అందరూ అనుకుంటారు. కొందరు అనుకోవడంతోనే సరిపెట్టుకుంటారు. మరికొందరు దాన్ని సాధించి తీరతారు. అదీ ఖరీదైన జిమ్‌లు, క్రాష్ డైట్లు ఇలాంటివేమీ లేకుండానే శరీరం మీద అవగాహన పెంచుకుని, అధిక బరువును తగ్గించుకుంది. 20 ఏళ్ల వయసులో చాలా పట్టుదలగా అదీ సింపుల్ చిట్కాలతో ఫిట్నెస్ సాధించింది. పదండి ఆమె పాటించిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రముఖ కంటెంట్ సృష్టికర్త ఆర్య అరోరా జత డంబెల్స్ , కొంచెం స్వీయ-అవగాహన, చాట్‌జీపీటీ సాయంతో 18 కిలోల బరువు తగ్గింది. ఈ వెయిట్ లాస్జర్నీని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు, వీడియోల ద్వారా అభిమానులను ఆకర్షిస్తోంది.తన విజయానికి కారణమైన చిట్కాల గురించి పంచుకుంటూ ఆర్య వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏడంటే ఏడు టిప్స్జిమ్ వర్కౌట్స్, ఫ్యాన్సీ డైట్ ఇవేమీ లేకుండా 18 కేజీల బరువు తగ్గింది. ఆర్య మొదట్లో అధిక బరువుతో బాధపడేది. కానీ , ఇపుడు స్లిమ్ అండ్ ట్రిమ్గా మారిపోయింది. ఇందుకు 7 చిట్కాలు ఫాలో అయినట్టు పేర్కొంది. View this post on Instagram A post shared by Aryaa Arora (@wutaryaadoin)BMR : ముందు తన శరీరానికి అవసరమైన కేలరీల గురించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. ఇందుకు చాట్ జీపీటీ సాయాన్ని తీసుకుంది. ChatGPT ప్రాంప్ట్‌ని ఉపయోగించి తన బేసల్ మెటబాలిక్ రేట్ (BMR)ను అంచనావేసింది. రోజువారీ కేలరీల అవసరాలను నిర్ణయించడంలో సహాయపడే మెట్రిక్. బరువు తగ్గడానికి కేలరీ ఇంటేక్ ఎంత? అని చాట్ జీపీటీని కోరింది. తన శరీరాకృతిని బట్టి ఏఐ ఇచ్చిన డేటాతో సరైన కేలరీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన పోర్షన్-బ్యాలెన్సింగ్: ఆర్య పోర్షణ్ బ్యాలెన్సింగ్ ప్రధానంగా పాటించింది. 40% ప్రోటీన్, 30% ఫైబర్, 20% కార్బోహైడ్రేట్లు, 10% ఆరోగ్యకరమైన కొవ్వులు.పరిమితంగా తినడం పరిష్కారం కాదని,అవగాహన , నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేసింది. "కటింగ్ లేదు, బ్యాలెన్స్ మాత్రమే" అంటుంది. View this post on Instagram A post shared by Aryaa Arora (@wutaryaadoin)బరువు తగ్గడమే కాదు ఎనర్జీ పెంచుకోవాలి : బరువు తగ్గడం, ఫ్యాట్‌ను కరిగించడంతోపాటు బాడీకి శక్తి కావాలి, దానికి తగ్గ వ్యాయామం కావాలి అంటుంది ఆర్య. ఈ విషయంలో తనకైతే డంబెల్స్చాలు అంటుంది.2.5 కిలోలతో ప్రారంచి, 5 కిలోల డంబెల్స్‌తో వర్కైట్స్ చేసింది. రోజూ నడక, రెండు రోజులు , 4 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో కండరాలు దృఢంగా మారడంతో పాటు వేగంగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని ఆర్య తెలిపింది. క్యాలరీల లెక్కలు: ఆర్య క్యాలరీల అవగాహన రావాలంటే వారం రోజులు చాలు అని, అలాగ ఒక వారంపాటు తన ఆహారాన్ని ట్రాక్ చేసుకుంటూ, ఆహార అలవాట్లను బాగా అర్థం చేసుసుకుని ఆచరించినట్టు తెలిపింది.జంక్ ఫడ్ : జంక్ ఫుడ్ విషయంలో 80:20 నియమాన్ని పాటించిదట. తినే ఫుడ్ లో జంక్ ఫుడ్ శాతాన్ని 20 శాతానికి పరిమితం చేసింది. ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెర, పిండి, నూనె పదార్థాలు, ఫ్రై చేసిన ఫుడ్ ను తీసుకోవడం ఆమె తగ్గించింది. నీళ్లు, నిద్ర: బరువు తగ్గే క్రమంలో రోజుకు 2-3 లీటర్ల నీరు, 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరమని తద్వారా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి, జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.హార్మోన్స్ : బరువు తగ్గడంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని ఆర్య తెలిపింది. ఇందుకోసం క్రమం తప్పకుండా చదవడం, ధ్యానం కృతజ్ఞతా భావంతో ఉండటం ఇవి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొంది.
అమ్మకాల ఒత్తిడి.. బేర్మన్న మార్కెట్లు
ముద్దుల తనయకు గణపతి బప్పా ఆశీర్వాదం : న్యూ డాడ్ సిద్ధార్థ్
బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర
‘సంపద సృష్టి ఏమైపోయింది.. ఇప్పుడు టీచర్లపై పడ్డారా?’
IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’
దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్
పెన్షనర్లు.. ట్యాక్స్ ప్లానింగ్
ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. గ్యాప్ ఇచ్చాం: రాజ్‌నాథ్ సింగ్
హత్య కేసులో వినుత కోట.. లేటెస్ట్ అప్డేట్
భారత్‌తో ఐదో టెస్ట్.. మరో ఫాస్ట్ బౌలింగ్ అస్త్రాన్ని ప్రయోగించనున్న ఇంగ్లండ్
బేబీ బంప్‌తో తొలిసారి కనిపించిన మెగా కోడలు
'నేను చేసిన తప్పు మీరు చేయకండి.. నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు'
విశ్వంభరకు బై బై
ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్‌తో పార్టీ!
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
డిప్యూటీ సీఎం డ్యూటీ.. వెంటనే సీఎం డ్యూటీ
‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ
భార్య భర్తలనగానే కలసి తినాలా? నువ్ కాసేపు ఆగి తినొచ్చుగా!!
కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య
... నిన్నొకరినే కాదమ్మా ఆయన ప్రపంచాన్నే అదోలా చూస్తున్నారు...!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, అనన్య మార్క్స్ షీట్ వైరల్
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
అమ్మకాల ఒత్తిడి.. బేర్మన్న మార్కెట్లు
ముద్దుల తనయకు గణపతి బప్పా ఆశీర్వాదం : న్యూ డాడ్ సిద్ధార్థ్
బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర
‘సంపద సృష్టి ఏమైపోయింది.. ఇప్పుడు టీచర్లపై పడ్డారా?’
IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’
దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్
పెన్షనర్లు.. ట్యాక్స్ ప్లానింగ్
ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. గ్యాప్ ఇచ్చాం: రాజ్‌నాథ్ సింగ్
హత్య కేసులో వినుత కోట.. లేటెస్ట్ అప్డేట్
భారత్‌తో ఐదో టెస్ట్.. మరో ఫాస్ట్ బౌలింగ్ అస్త్రాన్ని ప్రయోగించనున్న ఇంగ్లండ్
బేబీ బంప్‌తో తొలిసారి కనిపించిన మెగా కోడలు
'నేను చేసిన తప్పు మీరు చేయకండి.. నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు'
విశ్వంభరకు బై బై
ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్‌తో పార్టీ!
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
డిప్యూటీ సీఎం డ్యూటీ.. వెంటనే సీఎం డ్యూటీ
‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ
భార్య భర్తలనగానే కలసి తినాలా? నువ్ కాసేపు ఆగి తినొచ్చుగా!!
కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
... నిన్నొకరినే కాదమ్మా ఆయన ప్రపంచాన్నే అదోలా చూస్తున్నారు...!!
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, అనన్య మార్క్స్ షీట్ వైరల్
సినిమా

ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో రాబోయే సినిమాల్లో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనితో పాటు విజయ్ సేతుపతి 'సార్ మేడమ్', ఉసురే లాంటి డబ్బింగ్ చిత్రాలు.. సన్ ఆఫ్ సర్దార్ 2 అనే హిందీ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. నితిన్ 'తమ్ముడు' ఈ వీకెండ్లోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికైతే ఇదొక్కటే స్ట్రెయిట్ తెలుగు మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. దీనితో పాటు బకైటి అనే హిందీ సిరీస్ కొంతలో కొంత ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. మరి శుక్రవారంనాడు సడన్‌గా ఓటీటీల్లో కొత్త మూవీస్ స్ట్రీమింగ్ అవుతాయేమో చూడాలి. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 28 నుంచి ఆగస్టు 03 వరకు)నెట్ఫ్లిక్స్ఇరాన్ చెఫ్ థాయ్ లాంట్ వర్సెస్ ఆసియా (రియాలిటీ సిరీస్) - జూలై 28ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లీష్ మూవీ) - జూలై 29WWE: అన్ రియల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29కన్వర్జేషన్స్ విత్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 30అన్ స్పీకబుల్ సిన్స్ (స్పానిష్ సిరీస్) - జూలై 30యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ సినిమా) - జూలై 31గ్లాస్ హార్ట్ (జపనీస్ సిరీస్) - జూలై 31లియాన్నే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31మార్క్డ్ (జులు సిరీస్) - జూలై 31తమ్ముడు (తెలుగు సినిమా) - ఆగస్టు 01అమెజాన్ ప్రైమ్లోన్లీ ఇనఫ్ టూ లవ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 28చెక్ (తెలుగు సినిమా) - జూలై 28హాట్స్టార్అడ్డా ఎక్స్ట్రీమ్ బాటిల్ (రియాలిటీ సిరీస్) - జూలై 28క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 29బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 28పతీ పత్నీ ఔర్ పంగా (హిందీ సిరీస్) - ఆగస్టు 02సన్ నెక్స్ట్సురభిల సుందర స్వప్నం (మలయాళ సినిమా) - ఆగస్టు 01ఆపిల్ ప్లస్ టీవీచీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01జీ5బకైటి (హిందీ సిరీస్) - ఆగస్టు 01(ఇదీ చదవండి: చిరంజీవి 'విశ్వంభర' ప్లాన్ ఛేంజ్!)

ఓటీటీలో క్రిష్ ప్రాజెక్ట్.. 'అరేబియా కడలి' రిలీజ్‌పై ప్రకటన
'అరేబియా కడలి' వెబ్ సిరీస్ విడుదలపై ప్రకటన వచ్చేసింది. అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో సత్యదేవ్, ఆనంది జంటగా నటించారు. ఈ సిరీస్‌లో రెండు గ్రామాల మత్స్యకారులు ఇతర దేశాల జలాల్లోకి పొరపాటున వెళ్లి, అక్కడ బంధీ అవ్వడం ఆపై వారు ఎలా తిరిగొచ్చారనేది కథాంశం. ఈ వెబ్ సిరీస్‌కు క్రిష్ జాగర్లమూడి రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. సూర్య కుమార్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మించారు.'అరేబియా కడలి' వెబ్ సిరీస్ ఆగష్టు 8న విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం తండేల్ కాన్సెప్ట్‌లా ఉండబోతుందని తెలుస్తోంది. ఇదే స్టోరీ లైన్‌తో సినిమా తెరకెక్కించారని సమాచారం.time and tide wait for none, neither does their fate 🌊#ArabiaKadaliOnPrime, New Series, August 8@ActorSatyaDev @anandhiactress @DirKrish @DirectorSuryaVV @NagavelliV @firstframe_ent pic.twitter.com/5ACNKK4XHG— prime video IN (@PrimeVideoIN) July 28, 2025

విశ్వంభర స్పెషల్ సాంగ్‌లో బుల్లితెర నటి.. రెమ్యునరేషన్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే డైరెక్టర్ సినిమా కథ కూడా బయటపెట్టేశాడు. 'మనకు తెలిసినవి 14 లోకాలే.. ఈ పద్నాలుగు లోకాలకు పైనున్న లోకమే సత్యలోకం. విశ్వంభర కోసం వీటన్నింటినీ దాటుకుని పైకి వెళ్లాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను హీరో వెతుక్కుంటూ వెళ్లి ఆమెను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు? అన్నదే సినిమా కథ' అని చెప్పాడు.తెలుగులో తొలిసారి..సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ కూడా రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. ఈ పాటలో బుల్లితెర సీరియల్స్‌లో విలనిజం పండించిన మౌనీ రాయ్‌ను సెలక్ట్ చేశారు. ఈమె చిరుతో కలిసి తొలిసారి చిందేసింది. అంతేకాదు, టాలీవుడ్లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి! ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. అయితే ఆమె ఈ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందన్న చర్చ మొదలైంది. నిమిషానికి లక్షల్లో..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. మౌనీ రాయ్ నాలుగైదు నిమిషాల పాటకుగానూ రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్.. నాగిణి సీరియల్‌తోనే చాలామందికి పరిచయం. ఈ పాటలో కూడా ఆమె నాగిణిగా కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమన్నది క్లారిటీ రావాల్సి ఉంది.విశ్వంభర ఆలస్యం?నిజానికి ఈ పాట కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను సంప్రదించారట! కానీ, ఆమె రూ.8 కోట్లు డిమాండ్ చేయడంతో తనను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. విశ్వంభర చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా మరింత వాయిదా పడే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.చదవండి: 10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు

పిల్లలకు 'లింగ, యాత్ర' పేర్లు ఎందుకు పెట్టానంటే: ధనుష్
ప్రతిభ ఉంటే చాలు ఎలాంటి రంగంలోనైనా సరే రాణించవచ్చని జాతీయ నటుడు ధనుష్ నిరూపించాడు. చూడగానే ఆకట్టుకునే రంగు అతనిలో లేదు. అందుకే మొదటి సినిమాతోనే తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఆకర్షించే కటౌట్ అతనిది కాదు. అయితే ఏంటి..?, ఓటమి సమయంలో ఎలా నిలబడాలో తనకు తెలుసు. అసలు నటనంటే ఏంటో తెలీదు. కానీ, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు. ధనుష్ బలం ఏంటో మొదట గుర్తించింది తన తండ్రే.. నేడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.వెంకటేష్ ప్రభు కస్తూరిరాజా ఎవరు..? అంటే ‘ఏమో’ అనేవాళ్లే ఎక్కువ. ‘అదేనండీ ధనుష్’ అంటే మాత్రం తెలియదనే వాళ్లు తక్కువ. అది ఆయన స్క్రీన్‌నేమ్. చెఫ్ కావాలని ధనుష్ కోరుకున్నాడు. కానీ, తండ్రి కస్తూరి రాజాకు మాత్రం కుమారుడిని హీరో చేయాలని బలమైన కోరిక ఉంది. దీంతో తండ్రి మాటను కాదనలేక 'తుల్లువదో ఇలమై' (Thulluvadho Ilamai) సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చారు. 2002 మే 10న విడుదలైన ఈ చిత్రం మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, హీరో ఏంటి ఇలా ఉన్నాడంటూ ధనుష్‌పై విమర్శలు వచ్చాయి. కేవలం కథలో బలం ఉంది కాబట్టి సినిమా ఆడిందని ధనుష్‌కు ఎంతమాత్రం నటన రాదంటూ విమర్శించారు. అయితే, తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాలని ఆయన బలంగా ముందుకు సాగాడు. ఎక్కడ మాటల పడ్డాడో అక్కడే తనను మెచ్చుకునేలా నిలబడాలని రెండో సినిమాపై గురి పెట్టాడు.ధనుష్ నటించిన రెండో సినిమా 'కాదల్ కొండెయిన్'.. తన అన్నయ్య సెల్వ రాఘవన్ తెరకెక్కించాడు. ఈ సినిమా కోలీవుడ్‌లో ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ధనుష్ నటనకు తమిళ ప్రజలు ఫిదా అయ్యారు. మొదటి సినిమాను విమర్శించిన వారే ధనుష్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ విజయం వెనుక ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ శ్రమ ఎక్కువ ఉంది. ధునుష్ నుంచి మంచి నటనని రాబట్టుకునేందుకు ఒక్కోసారి ధనుష్‌ని రాఘవన్ కొట్టేవారట. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ధనుష్ చెప్పారు. అన్నయ్య వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నానంటూ పలుమార్లు ఆయన పంచుకున్నారు. ఇదే చిత్రాన్ని అల్లరి నరేశ్ హీరోగా తెలుగులో ‘నేను’గా తెరకెక్కించారు.వరుసగా రెండు విజయాలు దక్కడంతో ధనుష్ పేరు వైరల్ అయిపోయింది. కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్‌లోనూ ఛాన్సులు దక్కించుకున్నారు. బాలీవుడ్లో రంజనా, షబితాబ్ వంటి సినిమాలతో ప్రశంసలు అందుకున్నారు. ఆపై హాలీవుడ్లో 'ది ఎక్ట్స్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'తో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు వారికి 'రఘువరన్ బీటెక్' డబ్బింగ్ మూవీతో గుర్తింపు పొందారు. ఇలా అంతర్జాతీయ స్థాయికి ధనుష్ చేరుకున్నారు. టాలీవుడ్లో ఆయనకు ఉన్న ఇమేజ్ వల్ల ఏకంగా సార్, కుబేర వంటి డైరెక్ట్ చిత్రాలతో తెలుగులో నటించారు. ధనుష్ అంటే కేవలం నటుడు మాత్రమే అనకుంటే పొరపాటే.. ఆయనలో దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయిత, కథా రచయిత కూడా.. ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ‘వై దిస్ కొలవెరి’ పాటను కేవలం ఐదు నిమిషాల్లో రాశారు.కొత్త చరిత్రను లిఖించిన ధనుష్ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్ని ప్రయోగాత్మకంగా తెర కెక్కించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు . సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అందులోనూ ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను ధనుష్ లిఖించాడు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ సూపర్ స్టార్లు ధనుష్, తలైవా రజనీకాంత్ కొత్త చరిత్రను లిఖించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ (అసురన్) ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారు.ధనుష్ పిల్లల పేర్లు 'యాత్ర- లింగ' వెనుక స్టోరీధనుష్ రెండో సినిమా విడుదల సమయంలో ఐశ్వర్య (రజనీకాంత్ కుమార్తె)తో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో ధనుష్‌ని ఆమె ఇంటర్య్వూ చేశారు. అక్కడి నుంచి మొదలైన పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అయితే, కొంత కాలం క్రితం పరస్పర అంగీకారంతో ధనుష్ - ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ధనుష్ మొదటి నుంచి శివభక్తుడు కావడంతో తన పిల్లలకు లింగ, యాత్ర అని పేర్లు పెట్టుకున్నారు. షూటింగుల నుంచి కాస్త తీరిక దొరికినప్పుడల్లా ఆయన ఎక్కువ శైవక్షేత్రాలకు వెళ్తుంటారు. తనను నడిపించేది శివయ్యే అంటూ ఆయన పలుమార్లు చెప్పుకున్నారు. ముఖ్యంగా అరుణాచలం, చిదంబరం వంటి ఆలయాలకు తరుచూ వెళ్లడం ఆయనకు ఇష్టం. చాలా సార్లు గిరిప్రదక్షణ కూడా చేసినట్లు ధనుష్ చెప్పారు. అలాగే తను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు సొంతూరులోని (తేనీ జిల్లా - మల్లింగాపురం) ఉన్న కస్తూరీ మంగమ్మ ఆలయానికీ ఆయన వెళ్లడం విశేషం.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

చరిత్ర సృష్టించిన జడేజా.. రెండో ఆల్‌రౌండర్‌గా అరుదైన ఘనత
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇంగ్లండ్ గడ్డ మీద అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడిన జడ్డూ.. తాజాగా నాలుగో టెస్టులోనూ పట్టుదలగా నిలబడ్డాడు. సహచర ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)తో కలిసి శతక్కొట్టి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద 30కి పైగా వికెట్లు తీయడంతో పాటు.. వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆల్‌రౌండర్‌గా రెండో ఆల్‌రౌండర్‌గా అరుదైన ఘనత సాధించాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.జడేజా వీరోచిత పోరాటంఇందులో భాగంగా లీడ్స్ టెస్టులో 36 పరుగులు చేసిన జడేజా.. ఒక వికెట్ తీశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 89 విలువైన పరుగులు చేసిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు.ఇక ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జడేజా రెండు అద్భుత అర్ధ శతకాలు (72, 61 నాటౌట్) చేశాడు. అంతేకాదు.. ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మాంచెస్టర్ టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తన హాఫ్ సెంచరీని శతకంగా మలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకం (107)తో మెరిశాడు. అదే విధంగా.. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.రెండో ఆల్‌రౌండర్‌గా అరుదైన ఘనతఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఇప్పటి వరకు 34 వికెట్లు తీయడంతో పాటు వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు జడ్డూ. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం గ్యారీఫీల్డ్ సోబర్స్ తర్వాత ఇంగ్లండ్‌లో 30కి పైగా వికెట్లు తీయడంతో పాటు వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఓవరాల్‌గా విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన మూడో ఆల్‌రౌండర్ జడ్డూ. అతడి కంటే ముందు సోబర్స్‌తో పాటు ఇంగ్లండ్‌కు చెందిన విల్ఫ్రెడ్ రోడ్స్ ఈ ఫీట్ నమోదు చేశారు.‘డ్రా’ గా ముగిసిన నాలుగో టెస్టుకాగా మాంచెస్టర్ వేదికగా బుధవారం - ఆదివారం జరిగిన నాలుగో టెస్టు డ్రా అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 669 పరుగులు చేసింది. తద్వారా 311 పరుగుల ఆధిక్యం సంపాదించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన వేళ.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుత శతకం (103) సాధించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ హాఫ్ సెంచరీ (90)తో ఆకట్టుకున్నాడు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 203 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను డ్రాతో గట్టెక్కించారు. ఇక ఇప్పటికి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందున్న ఇంగ్లండ్‌కు.. ఓవల్‌లో జరిగే ఐదో టెస్టులో చెక్ పెట్టి సిరీస్‌ను డ్రా చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్

రిషబ్ పంత్ స్ధానంలో 'వైల్డ్ కార్డ్' ఎంట్రీ.. ఎవరీ జగదీశన్?
లండన్‌లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్ జరగనున్న ఐదో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నాలుగో టెస్టులో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓవల్ టెస్టుకు దూరమయ్యాడు. మాంచెస్టర్‌లో టెస్టులో బంతి బలంగా తాకడంతో కుడి కాలి బొటనవేలి ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలోనే తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది."మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా పంత్ కుడి పాదానికి ఫ్రాక్చర్ అయింది. దీంతో ఈ సిరీస్‌లోని ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు. త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని" ఆశిస్తున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా ఇది నిజంగా భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. రిషబ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 479 పరుగులు చేశాడు. ఇక అతడి స్ధానాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్‌తో సెలక్టర్లతో భర్తీ చేశారు.జట్టులో పంత్‌కు ప్రత్యామ్నాయంగా ధ్రువ్ జురెల్ ఉన్నప్పటికి, బ్యాకప్ వికెట్ కీపర్‌గా జగదీశన్‌ను తీసుకున్నారు. జగదీశన్ ఇప్పటికే లండన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఎవరీ జగదీశన్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ జగదీశన్..?తమిళనాడుకు చెందిన టాలెంటడ్ వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్.. దేశవాళీ క్రికెట్లో తనకంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జగదీశన్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నారాయణ్.. 47.50 సగటుతో 3,373 పరుగులు. అందులో 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత రంజీ ట్రోఫీ సీజన్లో జగదీశన్ తమిళనాడు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్‌లలో 56.16 సగటుతో 674 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో కూడా అతడు అదరగొడుతున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277).. వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లతో సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డు అతడి పేరిట ఉన్నాయి.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్

మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తీరుపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (Ravindra Jadeja), వాషింగ్టన్ సుందర్ సెంచరీ చేయకుండా అడ్డుకునేందుకు ఇంగ్లండ్ జట్టు ప్రవర్తించిన తీరును తప్పుబట్టాడు. టీమిండియా ఆటగాళ్ల స్థానంలో తమ ప్లేయర్లు ఉంటే కూడా స్టోక్స్ ఇలాగే చేసేవాడా అని ప్రశ్నించాడు. అసలేం విషయం ఏమిటంటే..ఆపేద్దాం.. లేదు ఆడేద్దాంభారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు (Ind vs Eng 4th Test)లో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో ఆఖరి గంటలో... ఆపేద్దామంటే, ఆడేద్దామనే హైడ్రామా చోటు చేసుకుంది. చివరి సెషన్లో ఇక గంట ఆటే మిగిలుంది. 15 ఓవర్లు పడాల్సి ఉంది. ఫలితం తేలని సందర్భాల్లో ఆ కనీస ఓవర్లకు ముందే ఇరు జట్ల కెప్టెన్లు పరస్పర సమ్మతితో ‘డ్రా’ పాట పాడే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. దీనికోసం ప్రయత్నించి ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ భంగపడ్డాడు.స్టోక్స్‌కు మింగుడుపడని విధంగా అసలేం జరిగిందంటే... 138 ఓవర్లలో భారత్ స్కోరు 386/4. 75 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మిగిలిపోయిన ఆ 15 ఓవర్లతో ఆలౌట్ చేయడం, తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం, ఇంగ్లండ్ గెలవడం జరిగేది కాదని అర్థమైంది. దీంతో అలసిన సహచరులకు కాస్త ముందుగానే విశ్రాంతినిద్దామనే ఆలోచనతో స్టోక్స్ డ్రా కోసం ‘ఇక చాలు ఆపేద్దాం’ అన్నాడు.శతకాలు పూర్తి చేసుకున్న తర్వాతకానీ అవతలి వైపు జడేజా (89 బ్యాటింగ్), సుందర్ (80 బ్యాటింగ్) సెంచరీలకు దగ్గరవడంతో భారత దళం ‘కుదరదు... ఆడేద్దాం’ అంది. స్టోక్స్ ప్రతిపాదనను జడేజా తోసిపుచ్చాడు. క్రీజులో ఉన్న ఇద్దరం శతకరేసులో ఉన్నామన్నాడు. దీంతో చేసేదేమీలేక చిన్నబుచ్చుకున్న స్టోక్స్ సులువైన బౌలింగ్‌నే పురమాయించాడు. ఫోరు, సిక్స్‌తో జడేజా... తర్వాత బౌండరీలతో సుందర్ చకచకా సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఈ ఆఖరి దూకుడుతో 5 ఓవర్ల వ్యవధిలో భారత్ 39 పరుగులు చేసింది. 400 స్కోరునూ దాటింది.మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?అయితే, ముందు జడ్డూ, వాషీల శతకాలకు అడ్డుపడేలా.. పదే పదే షేక్‌హ్యాండ్ ఇస్తూ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా స్పందించాడు. ‘‘ఒకరేమో 90, మరొకరేమో 85 పరుగుల వద్ద ఉన్నప్పుడు... సెంచరీ పూర్తి చేసుకునేందుకు వారు అర్హులా? కాదా?ఒకవేళ వారి ఆటగాళ్లు కూడా ఇలా మైలురాయికి చేరువైన వేళ ఇలాగే డ్రా ప్రతిపాదన తెచ్చేవారా? మా వాళ్లు పట్టుదలగా పోరాడారు. వాళ్ల కష్టానికి ప్రతిఫలమే ఆ శతకాలు. ఎవరినో సంతోష పెట్టడానికి మేము ఇక్కడ లేము’’ అంటూ స్టోక్స్ తీరుపై గంభీర్ మండిపడ్డాడు.ఆఖరి టెస్టు గెలిస్తేనేకాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో లీడ్స్‌లో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ జయభేరి మోగించింది. అయితే, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. తాజాగా మాంచెస్టర్‌లో ముగిసిన నాలుగో టెస్టులో ఫలితం తేలలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఓవల్ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకోగలుగుతుంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉భారత్: 358 & 425/4👉ఇంగ్లండ్: 669.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగాA day defined by three centurions as #ShubmanGill, #RavindraJadeja & #WashingtonSundar led #TeamIndia’s defiance & secured a draw! 🙌🏻Which moments did you enjoy the most? ✍🏻👇#ENGvIND 👉 5th TEST | Starts THU, 31st July, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/5uLQZD24Cq— Star Sports (@StarSportsIndia) July 27, 2025

స్టుపిడ్ పనులు చేయొద్దని బ్రూక్‌కు ముందే చెప్పా: బెన్ స్టోక్స్
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు తమ సెంచరీలకు దగ్గరగా ఉన్నప్పుడు స్టోక్స్.. కరచాలనం చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించాలని కోరుకున్నాడు.ఇంకా అప్పటికి 15 ఓవర్ల ఆట మిగిలి ఉంది. స్టోక్స్ ప్రతిపాదనను జడేజా, సుందర్‌లు తిరష్కరించారు. దీంతో స్టోక్స్ ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో స్టోక్స్‌తో పాటు తన సహచర ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారు. క్రీడాస్పూర్తిని మరిచి గల్లీ క్రికెటర్లా ప్రవర్తించారు. టీమిండియాకు డ్రాకు ఒప్పుకోలేదనో అక్కసుతో బ్రూక్‌తో స్టోక్స్ బౌలింగ్ చేశాడు. సాధరణంగా బ్రూక్ చాలా సందర్భాల్లో పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా తన సేవలను అందించాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం బ్రూక్ స్లోగా ఫుల్ టాస్‌లు వేస్తూ, ఈజీగా పరుగులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బౌలింగ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ భారత అభిమానుల అగ్రహానికి గురయ్యాడు.కాగాఈ హ్యాండ్‌షేక్ వివాదంపై మ్యాచ్ అనంతరం స్టోక్స్ స్పందించాడు. డ్రా తప్పదనే ఉద్దేశ్యంతో ముందుగానే హ్యాండ్ షేక్ ఇవ్వాలనుకున్నాను స్టోక్స్ తెలిపాడు."రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. మ్యాచ్‌ను వారికి అనుకూలంగా మార్చుకోవడంలో వీరిద్దరి భాగస్వామ్యం కీలకం మారింది. వారు బాగా ఆడారని అప్పటికే మేము ఒప్పుకొన్నాము . 80,90 పరుగులతో నాటౌట్‌గా ఉండి జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడడం కంటే, సెంచరీ చేసి ఆజేయంగా డ్రెసింగ్స్ రూమ్‌కు వెళ్లడం ఎక్కువ సంతృప్తి ఇస్తుందని నేను అనుకోవడం లేదు. సెంచరీకి 10 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ ఏదైనా సరే ఫలితం మాత్రం మారదు. ఆ విషయం వారికి కూడా తెలుసు. చాలా క్లిష్ట పరిస్థితి నుంచి జట్టును కాపాడడంలో విజయం సాధించారు. చివరి మ్యాచ్ కంటే ముందు సిరీస్ ఓటమి నుంచి మీ జట్టును కాపాడారు. అంతకుమించి ఇంకేమి కావాలి.అందుకే బ్రూక్‌కు ఇచ్చా..ఈ మ్యాచ్‌లో ఫలితం వచ్చే వచ్చే అవకాశం లేనందున, మిగిలిన ఓవర్లను ఫ్రంట్‌లైన్ బౌలర్లతో బౌలింగ్ చేయించి రిస్క్ తీసుకోడదని భావించాను. మా ప్రధాన బౌలర్లు వర్క్‌లోడ్ కారణంగా చాలా ఇబ్బందిపడ్డారు.అందుకే బ్రూక్‌తో బౌలింగ్ చేయించాను. ఎటువంటి స్టుపిడ్ పనులు చేయోద్దని బ్రూక్‌కు బంతి ఇచ్చే ముందు చెప్పా. మేము అప్పటికే ఎక్కువ సమయం ఫీల్డింగ్ చేసి అలిసిపోయాము. కానీ పరుగులిచ్చి మ్యాచ్‌ను తొందరగా ముగించాలని మేము అనుకోలేదు. సహజంగా మనం బౌలింగ్ చేయకపోయినా కూడా ఫీల్డ్‌లో ఉంటే అలసట వస్తుంది. అందుకే డ్రాకు వెళ్లాలని భావించాను. గంట ఆట మాత్రమే ఉన్నప్పుడు డ్రా కోసం షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోవచ్చు. కానీ అందుకు భారత్ తిరష్కరించింది" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో స్టోక్స్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
బిజినెస్

దేశానికి సిగ్గుచేటు.. బంగారు బాతులను చంపేస్తున్నారు!
గురుగ్రామ్, బెంగళూరుకు మధ్య కొన్ని విషయాల్లో దగ్గరి పోలికలున్నాయని బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. దేశంలోని రెండు అత్యంత సంపన్న నగరాల్లో స్థానిక ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించాయని విమర్శించారు. కాలమిస్ట్, వ్యాపారవేత్త సుహేల్ సేథ్ గురుగ్రామ్‌పై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.అంతకుముందు సేథ్ ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ..‘గురుగ్రామ్‌లోని మౌలిక సదుపాయాలు దేశానికి సిగ్గుచేటు. ఈ నగరం దేశ రాజధానికి సమీపంలో ఉన్నప్పటికీ అక్కడి నగర పాలక సంస్థ అధికారులతీరు దారుణంగా ఉంది. గురుగ్రామ్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ కంటే ఎక్కువ మద్యం దుకాణాలు, పాఠశాలల కంటే బార్లు అధికంగా ఉన్నాయి. స్మార్ట్‌గా వ్యవహరించని నాయకులతో స్మార్ట్ సిటీల ఏర్పాటు సాధ్యం కాదు’ అని ఘాటుగా విమర్శించారు.దీనిపై మజుందార్ షా ఎక్స్ ద్వారా స్పందించారు. ‘ధనిక నగరాల దుస్థితి ఇలాగే ఉంది. బెంగళూరు కూడా మరో గురుగ్రామ్లా మారుతోంది. మౌలిక సదుపాయాలు, పౌర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేకుండా ప్రభుత్వం బంగారు బాతు(అభివృద్ధి చెందుతోన్న నగరాలు)ను దోచుకుని చంపేస్తోంది. డబ్బు సంపాదన కోసం భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు’ అని సేథ్ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడారు.This is the fate of every rich city. Bengaluru is another Gurugram The state plunders n kills the golden goose with no responsibility to provide basic infrastructure n civic amenities -building rules are flouted to make money etc. @Suhelseth https://t.co/OLlM3YXaL1— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 26, 2025ఇదీ చదవండి: ఒకటికి మించిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘సరస్సులు, పచ్చదనం, సరైన ప్రణాళికతో కొత్త బెంగళూరును నిర్మించే అవకాశం ప్రభుత్వానికి లభించింది. కానీ ట్రాఫిక్, చెత్తాచెదారంతో కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నారు’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘పట్టణ ప్రణాళిక అనేది ఒక డెడ్ డిపార్ట్మెంట్. బహిరంగ ప్రదేశాలపై సరైన నిబంధనలు లేవు. బెంగళూరు రోడ్లు పార్కింగ్ స్థలాలుగా మారాయి’ అని ఒకరు చెప్పారు. స్మార్ట్ సిటీల గురించి 15-20 ఏళ్లుగా వింటున్నామని మరో యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 24,832కు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 ప్లాయింట్లు దిగజారి 81,397 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఒకటికి మించిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అంటే ఏంటి? ఏక మొత్తంలో ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? అలా అయితే అది నా పెట్టుబడిపై ప్రభావం చూపిస్తుందా? – రాఘవరాజుపెట్టుబడులను పెట్టడమే కాదు.. వాటిని వెనక్కి తీసుకునే విషయంలోనూ తగిన ప్రణాళిక కలిగి ఉండాలి. మార్కెట్లలో అస్థిరతలను అధిగమించేందుకు క్రమానుగత పెట్టుబడులకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. పెట్టుబడిని నిర్ణీత కాలానికి ఓసారి వెనక్కి తీసుకునేందుకు ఎస్‌డబ్ల్యూపీ వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎస్‌డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి, అదనపు ఆదాయం కోరుకునే వారికి అనుకూలం. దీని ద్వారా వారు తమకు కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది.ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల విలువ తగ్గుతుంటుంది. సిప్ ఎంపిక చేసుకుంటే.. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం బ్యాంకు ఖాతా నుంచి మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిగా వెళుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. మీ మొత్తం పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఏడాదిలో ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తం పెట్టుబడుల విలువలో 4–6 శాతం మించకుండా జాగ్రత్తపడాలి. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది.ఇదీ చదవండి: ‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8–9 శాతంగా ఉండి, 5 శాతాన్ని వెనక్కి తీసుకునేట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3–4 శాతం రాబడి పెట్టుబడిని వృద్ధి చేస్తుంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెట్టుబడి విలువ క్షీణించకుండా స్థిరంగా ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఏటా ఉపసంహరించుకునే మొత్తంపై పన్ను పడదు. నికర లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదిలో రూ.1.25 లక్షల దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను లేదు. అంతకు మించిన మొత్తంపైనే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఏడాదిలోపు ఈక్విటీ పెట్టుబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభం చెల్లించాలి. డెట్ పెట్టుబడులపై లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమేనా? – చిట్టి లాస్యఒకటికి మించిన మ్యూచువల్ ఫండ్స్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టుకున్నప్పటికీ.. నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్‌ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఈ పథకాలు అన్నిరకాల మార్కెట్ విభాగాల్లోని కంపెనీల్లో (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులు, వ్యాల్యూయేషన్ల ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయించే పెట్టు బడుల మొత్తం మారిపోతుంటుంది.సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70–75 శాతాన్ని లార్జ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీ క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మీరు విడిగా లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడులపై అధిక రాబడులు కోరుకుంటూ, రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగిన వారు.. ఫ్లెక్సీక్యాప్నకు అదనంగా 10–15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చు.

ప్యాసివ్ పెట్టుబడులకు ఆదరణ
గత కొన్నేళ్లుగా, దేశీయంగా ప్యాసివ్ తరహా పెట్టుబడులకు ఆదర ణ పెరుగుతోంది. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ తాజా నివేదిక ప్రకారం 2025 జూన్ నాటికి ప్యాసివ్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల ఏయూఎం రూ. 12 లక్షల కోట్లుగా ఉంది. ఇది నెలవారీగా 3% వృద్ధిని, మొత్తం మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ ఏయూఎంలో (నిర్వహణలోని ఆస్తులు) 17 శాతాన్ని ప్రతిబింబిస్తుంది. సంపద సృష్టి విషయంలో భారతీయ ఇన్వెస్టర్ల ధోరణుల్లో ఫండమెంటల్‌గా చోటు చేసుకుంటున్న మార్పునూ సూచిస్తోంది. ఒకప్పుడు చాలా నైపుణ్యాలు అవసరమ య్యే లేదా అనుబంధ వ్యూహంగానో పరిగణించిన ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు ఇప్పుడు క్రమంగా ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోల్లో కీలక భాగంగా మారుతు న్నాయి. సరళంగా, పారదర్శకంగా, తక్కువ ఖర్చులతో కూడుకున్నవిగా ఉండటం వల్లే కొత్త తరం ఇన్వెస్టర్లకు ఇవి బాగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. క్రమంగా ముందుకు .. భారత్‌లో ప్యాసివ్ ఇన్వెస్టింగ్ ప్రస్థానమనేది క్రమంగా, అనేక మైలురాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. 2010 తొలినాళ్లలో రిటైల్ ఇన్వెస్టర్లకు ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ అనేవి అంతగా తెలియదు. ప్రధానంగా నిఫ్టీ50, బీఎస్ఈ సెన్సెక్స్ ఆధారితమై, ప్రోడక్టు పరిధి చాలా పరిమితంగా ఉండేది. ప్యాసివ్ ఇన్వెస్టింగ్‌పై ఇన్వెస్టర్లకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. సంప్రదాయ యాక్టివ్ ఫండ్స్ వైపే మొగ్గు చూపే వారు. దీనితో ప్యాసివ్ ఫండ్స్ పక్క వాయిద్యాలుగానే ఉండిపోయేవి. అయితే, ఈటీఎఫ్‌ల ద్వారా డిజిన్వెస్ట్ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో పాటు ఈక్విటీ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయాలన్న ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయంతో ప్యాసివ్ ఇన్వెస్టింగ్‌పై ఫోకస్ పెరిగింది. నియంత్రణ సంస్థ సెబీ కూడా ఈ తరహా ఇన్వెస్టింగ్, నిర్వహణను సరళతరం చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. ఫలితంగా మ్యుచువల్ ఫండ్ కంపెనీలు ఇప్పుడు విస్తృత స్థాయిలో ప్యాసివ్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. ఇక, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాంలు పెరగడం కూడా ఈ ప్రోడక్టులు మరింతగా అందుబాటులోకి రావడానికి తోడ్పడింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు యాప్‌ల ద్వారా సులువుగా ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్‌ను కొనుక్కోగలుగుతున్నారు. ట్రాక్ చేయగలుగుతున్నారు. ఆ విధంగా ఇన్వెస్టింగ్ మరింత అందుబాటులోకి, యూజర్లకు మరింత అనుకూలమైనదిగాను మారింది. నియంత్రణ సంస్థపరమైన మద్దతు, సంస్థాగత భాగస్వామ్యం, ప్యాసివ్ ఇన్వెస్టింగ్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమ కృషి, సాంకేతిక ఆవిష్కరణల మేళవింపు కలిసి ప్యాసివ్ ఫండ్స్‌ను అన్ని వర్గాలకు అనువైన ఓ పెట్టుబడి సాధనంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. తక్కువ వ్యయాలు.. ప్యాసివ్ ఫండ్స్ ప్రాచుర్యంలోకి రావడానికి ఒకానొక కారణం, ఇవి తక్కువ వ్యయాలతో కూడుకున్నవి కావడమే. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ వ్యయ నిష్పత్తులు, మిగతా పెట్టుబడి సాధనాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వ్యయాల గురించి ఆలోచించే ఇన్వెస్టర్లకు ఇవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మార్కెట్లో విస్తృత స్థాయిలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండటం, ఒకే సాధనంపై మొత్తం ఇన్వెస్ట్ చేయడం మూలంగా వచ్చే రిసు్కలను తగ్గించడం, మార్కెట్ వృద్ధిలో స్థిరంగా పాలుపంచుకునే అవకాశం కల్పించడం వంటివి వీటికి సానుకూలాంశాలు. డిజిటల్ విప్లవం కూడా ప్యాసివ్ ఫండ్స్‌కు దన్నుగా నిలిచింది. ఫిన్‌టెక్‌లు, ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను సరళతరం చేశాయి. ‘సాషే ఇన్వెస్టింగ్’, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్‌లు) ద్వా రా చిన్న మొత్తాల్లో, క్రమం తప్పకుండా ప్యా సివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించాయి. తొలిసారిగా ఇన్వెస్ట్ చేసే వారికి ఎంట్రీపరమైన అవరోధాలు తగ్గేందుకు ఇది దోహదపడింది. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని పెంపొందించింది. అంతేగాకుండా, వివిధ డి్రస్టిబ్యూషన్ మోడల్స్ కూడా ప్యాసివ్ ఫండ్స్‌ను మెట్రోలు, పట్టణ కేంద్రాల పరిధిని దాటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా మరింత చేరువ చేశాయి.కొత్త ఆవిష్కరణలు.. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం విస్తత మార్కెట్ సూచీలకే పరిమితం కావడం లేదు. లో వోలటైలిటీ, క్వాలిటీ, వేల్యూ, లేదా మొమెంటంలాంటి అంశాల ప్రాతిపదికన ఉండే సూచీలను ట్రాక్ చేసే స్మార్ట్ బీటా ఫండ్స్‌లాంటి ఆవిష్కరణలు వచ్చాయి. మరింత అధునాతనమైన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ విధానాన్ని అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఈటీఎఫ్‌లనేవి నేరుగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉండే సంక్లిష్టతల బాదరబందీ లేకుండా భారతీయ ఇన్వెస్టర్లు అంతర్జాతీయంగా పెట్టుబడులను డైవర్సిఫై చేసేందుకు, విదేశీ మార్కెట్లు మరియు కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్ప డుతున్నాయి. హెల్త్‌కేర్, కన్జంప్షన్లాంటి థీమ్‌ల ఆధారితమైన థీమ్యాటిక్ ఇండెక్స్ ఫండ్స్ తరహాలోనే కమోడిటీల (గోల్డ్, సిల్వర్) ఆధారిత ఈటీఎఫ్‌లు, ఎఫ్‌వోఎఫ్‌లు కూడా ఇన్వెస్టర్లను ఆక ర్షిస్తున్నాయి. ప్యాసివ్ ఫండ్స్ ఆధిపత్యం పెరుగు తుండటమనేది భారత్‌లో అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమ రూపురేఖలను మారుస్తోంది. ఏఎంసీలు తమ ప్యాసివ్ ప్రోడక్ట్లను విస్తరిస్తున్నాయి. ప్యాసివ్ వ్యూహాలను తగిన విధంగా ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చనే దానిపై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పారదర్శకత, తక్కువ వ్యయాలతో అధిక ప్రయోజనాలను అందించడం, దీర్ఘకాలికంగా సంపద సృష్టించడం, ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చేలా పనిచేయడం, వారి ప్రయోజనాలే పరమావధిగా పనిచేయడం వైపుగా పరిశ్రమ మళ్లుతోంది. ప్యాసివ్ ఇన్వెస్టింగ్ మరింత పుంజుకోవాలంటే, ఈ కోవకు చెందిన ఫండ్స్‌లో పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలు కూడా ఉంటే శ్రేయస్కరంగా ఉంటుంది. పన్ను మినహాయింపుల్లాంటివి (ఈఎల్ఎస్ఎస్ స్కీముల తరహాలో) ఇస్తే, సగటు భారతీయుల పొదుపు మొత్తాలు, ఆదాయాన్నిచ్చే ఫిక్సిడ్ ఇన్‌కం పోర్ట్‌ఫోలియో నుంచి సంపదను సృష్టించే ప్యాసివ్ ఈక్విటీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలోకి మళ్లేందుకు తోడ్పడతాయి. వందన త్రివేది హెడ్ (ఇనిస్టిట్యూషనల్ బిజినెస్, ప్యాసివ్స్), యాక్సిస్ ఏఎంసీ
ఫ్యామిలీ

విశేష ఫల ప్రదం
నాగపంచమి/గరుడ పంచమి: నాగారాధనకు సంబంధించిన ముఖ్యరోజులలో కార్తీకశుద్ధ పంచమి ‘గరుడ పంచమి’ లేదా ‘నాగ పంచమి’ గా ప్రసిద్ది. కొన్నిప్రాంతాలలో నాగపంచమిని శ్రావణమాసంలో ఆచరిస్తారు. గరుత్మంతుడు సూర్యుడికి రథసారథి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందుకే ఆయనకి సుపర్ణుడని పేరు. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనిస్తే... ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూస్తూ ఉన్న మూర్తి కనిపిస్తుంది. అంటే విష్ణుమూర్తి తనను ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం కోసమే. నాగులనుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లలను కా పాడుకొనేందుకు చేసే పూజ నాగపంచమి, నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి.గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యం పోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. మనికొన్నిప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృ ప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ/నాగ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుందని నమ్ముతారు. ఇదే రోజున నాగపంచమి వ్రతం చేసుకునేవారు నాగుల ఆకారాన్ని ఇంటి గోడలమీద తీర్చిదిద్ది పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. నాగారాధన వల్ల సర్పదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఈరోజున చేసే నాగారాధన వల్ల చర్మవ్యాధులు, చెవి సంబంధిత రోగాలు తొలగుతాయని కూడా ప్రతీతి.మహనీయుల మాటలు→ ఏది మనకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించాలి. ఏది మనకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించాలి. ఏది మనకు మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం స్మరణ చేసుకోవాలి.→ మంచి ఆలోచనలతో మనసు నింపుకో మంచి పనులతో ప్రతిష్ట పెంచుకో మంచి పలుకులతో మన్ననలు అందుకో వీటి అన్నిటితో అందరిని కలుపుకొని పో→ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ భయపడేవారు ఏమీ సాధించలేరు. సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు.→ బయటకు కనిపించే రంగు,రూ పాన్ని చూసి ఎవ్వరినీ అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచేంతవరకూ కాకి, కోయిల రెండూ ఒకేలా ఉంటాయి.→ అవసరమైన దానికంటె ఎక్కువ విషయాలు సేకరించేవారు, తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడేవారు విజ్ఞాన వంతులు.‘

మహిళల శబరిమల గురించి తెలుసా? పురుషులకు నో ఎంట్రీ
Sabarimala of Women" మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతారని తెలుసు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో మహిళల కోసం ఏకంగా ఒక ఆలయమే ఉంది. పురాతన కథలు, మత సంప్రదాయాలకు ప్రసిద్ధిగాంచిన అట్టుకల్ భగవతి ఆలయం అది. భద్రకాళి దేవికి అంకిత మిచ్చిన ఈ ఆలయంలోని దేవేరిని అట్టుక్కల్ అమ్మగా పిలుస్తారు. ఆమె ఎంతటి రక్షకురాలో అంతటి విధ్వంసకురాలిగా భక్తులు భావిస్తారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో స్త్రీలకు మాత్రమే ప్రవేశం. అందుకే ఈ ఆలయాన్ని ‘మహిళల శబరిమల’గా పిలుస్తారు. ఏటా పది రోజులపాటు నిర్వహించే అట్టుకల్ పొంగళ (Attukal Pongala) ఉత్సవంలో ఆడవాళ్లు మాత్రమే పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో పురుషులను ఆలయ దరిదాపులకు కూడా రానివ్వరు.ఆలయ చరిత్రఒకానొక సాయంత్రం ఓ వ్యక్తి కిల్లియర్ నదిలో స్నానం చేస్తుండగా, ఒక బాలిక వచ్చి నది దాటడానికి సహాయం చేయాలని అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆమె ప్రవర్తనకు ముగ్ధుడైన ఆ వ్యక్తి బాలికను ఇంటికి ఆహ్వానించాడు. కుటుంబసభ్యులంతా చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది. అదే రాత్రి ఆ వ్యక్తికి కలలో ఆమె దేవత రూపంలో కనిపించింది. సమీపంలోని అడవిలో మూడు గీతలు గీసిన చోట తన కోసం గుడి కట్టించాలని ఆదేశించింది. మర్నాడు ఆ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లి మూడు గీతలను చూశాడు. వెంటనే ఆ స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అది పూర్తయ్యాక నాలుగు చేతులున్న దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా అట్టుక్కల్ భగవతి ఆలయం వెలుగు చూసింది.ఆలయ నిర్మాణంకేరళ, తమిళనాడు రాష్ట్రాల శిల్పులు గుడి గోపురాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ గోడలు, ప్రధాన ద్వారంపై∙మహిషాసురమర్దిని, కాళి, రాజరాజేశ్వరి, శివపార్వతుల దేవతా రూపాలను చక్కగా చెక్కారు. ఇంకా విష్ణుమూర్తి దశావతారాల కథలు కూడా తోరణంపై కనిపిస్తాయి. దక్షిణ గోపురంపై దక్షయజ్ఞం కథను చిత్రీకరించారు. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, శివుడు, నాగ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయం లోపల రెండు దేవతా విగ్రహాలు ఉంటాయి. ఒకటి ఆభరణాలతో అలంకరించిన అసలు విగ్రహం, దాని వెనుక మరో విగ్రహం ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించగానే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కణ్ణగిని అమ్మవారి అవతారంగా భావించి మహిళలు అత్యంత భక్తితో పూజిస్తారు.అట్టుక్కల్ పొంగళఏటా మార్చి నెలలో పది రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆలయంలో జరిగే అతి పెద్ద పండుగ. దీన్ని అట్టుకల్ పొంగళ అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది మహిళలు ఇక్కడికొస్తారు. స్త్రీ దైవత్వాన్ని గౌరవించడానికి మగువలకు మాత్రమే ఆలయ ప్రవేశం కల్పిస్తారు. అంతేతప్ప పురుషుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదు. ఆచార వ్యవహారాల్లో కేవలం మహిళల భాగస్వామ్యం కోసం మాత్రమేనని చెబుతారు. పేద, ధనిక, వివాహితులు, వితంతువులు అనే తేడా లేకుండా మహిళలందరూ బియ్యం, బెల్లం, కొబ్బరి ఉపయోగించి తీపి పొంగలిని కట్టెలపొయ్యిపై కుండల్లో వండి భగవతిదేవికి నైవేద్యం సమర్పిస్తారు. మహిళా శక్తిని ప్రదర్శించడానికి వనితలు దీన్ని వేదికగా మలచుకుంటారు. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేసిన పోరాటానికి ప్రతీక ఈ వేడుక అని పురాణ గా«థ ఒకటుంది. 2009లో గిన్నిస్ రికార్డుల్లోకి సయితం ఎక్కింది. ఒకే రోజు 25 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొన్న మతపరమైన సమావేశంగా గిన్నిస్ బుక్ గుర్తించడం విశేషం. ఈ వేడుకకు కేరళ రాష్ట్ర ఆర్టీసీ, భారతీయ రైల్వే ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాయి.ఇదీ చదవండి: Ananya Reddy తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, మార్క్ షీట్ వైరల్ఎలా చేరుకోవాలి?తిరువనంతపురం విమానాశ్రయం నుంచి ఆలయం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గంలో వస్తే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గుడి ఉంటుంది. ఇంకా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గుడికి చేరుకోవచ్చు. స్థానికంగా ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఉదయం 4–30 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8–30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. -చెన్నాప్రగడ శర్మ

తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, అనన్య మార్క్స్ షీట్ వైరల్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్ష భారతదేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్ష. UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చాలామంది కలలు కంటారు. IAS, IFS, IRS లేదా IPS అధికారి కావాలనే కలతో ప్రతీ ఏడాది వేలాది మంది ఈ పరీక్ష రాయాలని కోరుకుంటారు. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్య రెడ్డి. తొలి ప్రయత్నంలోనే అసాధారణ ప్రతిభతో సత్తాచాటిన అనన్యరెడ్డి మార్కుల షీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో అనన్య మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్లోనూ, హైదరాబాద్‌లో ఇంటర్ విద్యను పూర్తి చేసిన అనన్య ఢిల్లీలో మిరాండా హౌస్ నుండి ఎకనామిక్స్‌లో మైనర్‌తో భౌగోళిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రి పూర్తవుతున్న క్రమంలో UPSCపై దృష్టిపెట్టింది. ప్రతిరోజూ 12 నుండి 14 గంటలు చదువుకుంటూ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు. తన సబ్జెక్టు ఆంత్రోపాలజీలో ప్రావీణ్యం సంపాదించడానికి కోచింగ్ తీసుకున్నారట. (చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన)పట్టుదల దృఢనిశ్చయంతో చదవిUPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంక్ -3ని సాధించారు అనన్యరెడ్డి. రెండేళ్ల శ్రమతో తన తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకుతో సివిల్స్ సాధించడం విశేషం. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనకు ప్రేరణ అని వెల్లడించారు. అంతేకాదు నవలలు చదవడం, క్రికెట్ చూడటం ద్వారా అనన్య రెడ్డి తన టెన్షన్‌ను మేనేజ్ చేసుకునేదట. ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం

వైతరణి ఉగ్రరూపం : వరద బెడద
ఒడిశా, భువనేశ్వర్: రాష్ట్రంలో వరదలతో నదులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల ప్రమాద సంకేతం దాటి తీర ప్రాంతాల్లో కట్టలను బలహీనపరుస్తున్నాయి. నదీతీర ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రాణహాని జరగకుండా సమగ్ర యంత్రాంగం చురుకుగా పని చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ పేర్కొంది. ప్రధానంగా సువర్ణ రేఖ, వైతరణి, జలకా నదుల్లో వరద ఉద్ధృతి విపరీతంగా కొనసాగుతోంది. ఈ నదుల్లో నీటిమట్టం పలు తీర ప్రాంతాల్లో గరిష్ట పరిమితికి మించి ఉంది. వైతరణి నది ఆనందపూర్, అఖుపొదా, జలకా నది మథాని తీరం, సువర్ణ రేఖ నది జంసోలా ఘాట్, రాజ్‌ఘాట్ తీర ప్రాంతాల్లో గరిష్ట పరిమితిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల అంచనా. #WATCH | Bhadrak, Odisha | The Baitarani River has crossed the danger mark at Akhuapada, and a flood warning has been issued for Jajpur and Bhadrak districts. (26.07) pic.twitter.com/hHNQAwZtqD— ANI (@ANI) July 26, 2025ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం రాష్ట్రంలో వరద ముంపు పరిస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితి నివారణ కోసం ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. నదుల్లో వరద పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణ ఖరారు చేసింది. అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో వివిధ నదుల నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. నదుల్లో నీటిమట్టం పెరుగుతున్నందున వరద ముంపు పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ పాఢి శనివారం విలేకరులకు తెలియజేశారు. అవసరమైతే లోతట్టు వరద తాకిడి ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బాలాసోర్ జిల్లాలో 4 మండలాలు మళ్లీ ప్రభావితం అవుతాయని భావిస్తున్నారు. వాటిలో బలియాపాల్, భొగొరాయ్, బొస్తా, జలేశ్వర్ ఉన్నాయి. నిరంతర నిఘా ఉప్పొంగుతున్న నదీతీర ప్రాంతాల్లో పరిస్థితులపై అనుబంధ యంత్రాంగం నిరంతర నిఘా పెడుతోంది. రాష్ట్ర వరద విభాగం రాత్రింబవళ్లు చురుకుగా పని చేస్తుందని చంద్రశేఖర్ పాఢి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లకు అప్రమత్తం చేశారు. జాజ్‌పూర్, భద్రక్ – బాలసోర్ జిల్లా కలెక్టర్లు నదీతీర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, క్షేత్రస్థాయిలో అనుబంధ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సువర్ణరేఖ, బుఢా»ొలంగ్, మహానది, బ్రాహ్మణి, వైతరణి వ్యవస్థ నుంచి చీఫ్ ఇంజినీర్లు, బేసిన్ మేనేజర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయ కార్యాచరణను పర్యవేక్షిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి ఇద్దరు ఇంజినీర్ ఇన్ చీఫ్‌లను ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఉన్నతాధికారులు సువర్ణరేఖ బేసిన్, వైతరణి బేసిన్ పరిధిలో వారు క్షేత్రస్థాయిలో వరద నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఈ రెండు నదుల్లో నీటి మట్టాలు ప్రమాద స్థాయిని దాటిన తర్వాత ఈ అధికారులను తరలించారు. Flood Update: Flood Situation at 11 AM #Flood #Odisha@CMO_Odisha @DC_Odisha @_anugarg @IPR_Odisha@OLICLTD @OIIPCRA_OCTDMS @ltd_occ@GWDOdisha @CE_Megalift @dm_jajpur@DM_Bhadrak @DBalasore pic.twitter.com/VWOtvXcqBw— Deptt. of Water Resources (@OdishaWater) July 27, 2025 వైతరణి ఉగ్రరూపం భద్రక్ జిల్లా అఖుపొడా తీరంలో వైతరణి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ మేరకు కలెక్టర్ వరద హెచ్చరికను జారీ చేశారు. చాంద్‌బాలి, ధామ్నగర్లు తీవ్రంగా, భొండారి, పొఖొరి ప్రాంతాలు పాక్షికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నదీతీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మయూర్భంజ్ జిల్లాలో రాసగోవింద్‌పూర్, మోర్దా, షులియాపడా, చిత్రాడ్ మొదలైన ప్రాంతాల్లో ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జలకా నది నీటిమట్టం పెరుగుతోంది. ఇటీవల ఈ ప్రాంతం వరదలకు గురై వందలాది హెక్టార్లలోని వరి పొలాలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితి దిగజారకుంటే బొస్తా మండలంలో 8 పంచాయతీలు, సదర్ మండలంలో 2 పంచాయతీలు ప్రభావితం అవుతాయని భయపడుతున్నారు. వివిధ ప్రదేశాల్లో కరకట్టలు బలహీనంగా ఉండడంతో నదితీర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
ఫొటోలు
అంతర్జాతీయం

అమెరికాలో కత్తిపోట్లు.. 11 మందికి గాయాలు
ట్రావెర్స్ సిటీ: అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం ట్రావెర్స్ సిటీలో శనివారం చోటుచేసుకున్న కత్తిపోట్ల ఘటనలో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులందరినీ మున్సన్ హెల్త్‌కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వాల్‌మార్ట్ స్టోర్ వద్దకు వచ్చిన వారిపైకి అతడు ఫోల్డబుల్ చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఆయుధం సహా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మిషిగన్ వాసి అని తెలిపిన పోలీసులు అంతకుమించి వివరాలను వెల్లడించలేదు. ఇలా ఉండగా, అల్బుక్వెర్క్లోని న్యూమెక్సికో యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అనుమానితుడు జాన్ ఫుయెంటెస్(18)ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కాల్పుల్లో 14 ఏళ్ల బాలుడు చనిపోగా మరొకరు గాయపడటం తెల్సిందే. A knife-wielding man stabbed 11 in a Michigan Walmart. A brave armed civilian stepped in, likely saving lives.Most Americans know: Evil can't be reasoned with—only stopped. pic.twitter.com/w70HNNZtM2— Manni (@ThadhaniManish_) July 27, 2025

విమానం టేకాఫ్ సమయంలో మంటలు.. భయంతో ప్రయాణీకుల పరుగులు
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA-3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రన్‌పై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. కొలరాడలోని డెన్వర్ విమానాశ్రయంలో పెను విమానం ప్రమాదం తప్పింది. మియామాకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA-3023లో మంటలు చేలరేగాయి. బోయింగ్ 737 మాక్స్ 8 విమానం టేకాప్‌కు సిద్ధమవుతున్న సమయంలో (స్థానిక సమయం) మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. త తర్వాత కొద్దిక్షణాల్లోనే మంటలు చెలరేగాయి. డెన్వర్ విమానాశ్రయ పరిపాలన వెంటనే అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేసింది. దాంతో ఫైర్స్టాఫ్ వెంటనే విమానం వద్దకు చేరుకొని మంటలను ఆర్పి వేసింది. ఈ ఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విమానం నుంచి కిందకు దిగి.. రన్‌పై పరుగులు తీశారు. మంటలు వ్యాపించిన సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Landing gear bursts into flames on American Airlines plane at Denver airport. One person was injured. pic.twitter.com/VQlOAkQQwp— Pop Crave (@PopCrave) July 27, 2025విమానం నుంచి దట్టమైన పొగలు వస్తున్న సమయంలో పలువురు ప్రయాణికులు ఒక చేత్తో తమ పిల్లలు.. మరోచేత్తో తమ లగేజీతో స్లయిడ్‌పై నుంచి జారుతూ కిందకు వచ్చారు. ఈ ఘటనపై డెన్వర్ విమానాశ్రయం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఘటనలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాలయ్యాయి. సదరు వ్యక్తికి మొదట ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను అందరినీ బస్‌లో టెర్మినల్‌కు తరలించారు. విమానం టైర్‌కు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇప్పటికీ హెచ్చరికలు చేసినట్లుగా ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ ఘటన తర్వాత సర్వీస్ నుంచి తొలగించి, దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలోని రన్‌వేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాన్ని రన్ వే నుంచి తొలగించిన తర్వాత మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.🚨EMERGENCY AT DENVER AIRPORT: An American Airlines Boeing 737 Max 8 was forced to evacuate passengers after its landing gear caught fire during landing.Why always Boeing?pic.twitter.com/FT5tLeqtOr— 𝗗𝗼𝗻𝗮𝗹𝗱𝗼 𝗧𝗿𝘂𝗺𝗽ø 🇺🇲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 (@TrumpUpdateHQ) July 27, 2025There was a plane on fire at Denver airport today.Here's a woman who was nearly in a plane crash yesterday explaining her experience.pic.twitter.com/YCDMPPi4YF— Owen Shroyer (@OwenShroyer1776) July 27, 2025

థాయ్, కంబోడియా శాంతి చర్చలకు గ్రీన్‌సిగ్నల్: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: థాయ్‌ల్యాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆగ్నేయాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలను తన మధ్యవర్తిత్వంతో విరమింపజేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు త్వరలోనే ముగింపు పడనుందని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయని వెల్లడించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా.. కాల్పుల విరమణకు సంబంధి కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్‌లతో మాట్లాడానని.. ఇరువురు తక్షణ కాల్పుల విరమణకు, శాంతి నెలకొల్పేందుకు అంగీకరించారని చెప్పారు. వారు వెంటనే సమావేశమై చర్చించేందుకు సమ్మతించారన్నారు. అయితే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు, శాంతి చర్చలు ఎక్కడ జరుగుతాయని వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా, కాల్పుల విమరణకు సూత్రప్రాయంగా సుముఖతను వ్యక్తం చేసినట్లు థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు. అయితే కంబోడియా నిజాయితీగా వ్యవరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరినీ హెచ్చరించానని వెల్లడించారు.ఇక, ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య యుద్ధాల విషయంలో ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు నిలిచాయని పదేపదే చెప్పారు. అనంతరం, భారత ప్రధాని మోదీ ప్రకటనతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.Donald J. Trump Truth Social 07.26.25 12:23 PM EST pic.twitter.com/QB03NMNe9G— Fan Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) July 26, 2025ఇదిలా ఉండగా.. థాయ్‌ల్యాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 33 మంది మరణించారు. దాదాపు 1.68 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సరిహద్దు వెంబడి ఉన్న అనేక గ్రామాల్లో దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. దాడుల్లో ఎఫ్-16 విమానాలు, డ్రోన్లను కూడా వినియోగించినట్టు అధికారులు తెలిపారు. గత గురువారం సరిహద్దులో ఒక మందుపాతర పేలి ఐదుగురు థాయ్‌ల్యాండ్ సైనికులు గాయాలపాలు కావడం ఈ సంఘర్షణకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని ఉపసంహరించాయి. కంబోడియాలో తాజాగా 12 మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. ఈ పోరాటాన్ని నిలుపుదల చేయాల్సిందిగా ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియన్)పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. తమ దేశ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 37,635 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కంబోడియా సమాచార మంత్రి నెత్ ఫియాక్ట్రా వెల్లడించారు.

మూడో రోజూ కొనసాగిన ఘర్షణలు
సురిన్(థాయ్‌లాండ్): థాయ్‌లాండ్, కాంబోడియా ల మధ్య సరిహద్దుల్లో ప్రారంభమైన ఘర్షణలు శనివారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. కాల్పుల ఘటనల్లో ఇరు పక్షాలకు చెందిన కనీసం 33 మంది చనిపోగా, 1.68 లక్షల మధ్య నిరాశ్రయులయ్యారు. కాల్పుల విరమణకు రావాలంటూ ఇరుదేశాలపై అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. సరిహద్దు వివాదాస్పద ప్రాంతంలో గురువారం మందుపాతర పేలి ఐదుగురు థాయ్ సైనికులు చనిపోవడం ఘర్షణలకు ఆజ్యం పోసింది. శనివారం ఘర్షణలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఇరు పక్షాలు రాకెట్లు, శతఘ్నులతో కాల్పులకు దిగాయి. ఎఫ్–16 యుద్ధ విమానాలను, డ్రోన్లను దాడులకు వినియోగించినట్లు థాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇరు దేశాలు తమ రాయబారులను వెనక్కి పిలిపించుకున్నాయి. థాయ్‌లాండ్ ఈశాన్య ప్రాంతంలోని కాంబోడియా సరిహద్దును మూసివేసింది. మీరంటే మీరే.. సరిహద్దుల్లోని తమ పుర్సత్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలపైకి థాయ్ సైన్యం శనివారం ఉదయం శతఘ్ని కాల్పులకు దిగిందని కాంబోడియా రక్షణ శాఖ తెలిపింది. అదేవిధంగా, తమ కోహ్ కాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాల్లోకి థాయ్ నేవీ పడవలు ప్రవేశించాయంది. ఆ దేశం రెచ్చగొట్టేలా దురాక్రమణ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. థాయ్ కాల్పుల్లో ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఏడుగురు పౌరులు కాగా నలుగురు సైనికులు ఉన్నారంది. కాంబోడియాలోని పౌర నివాసాలను తాము లక్ష్యంగా చేసుకున్నామంటూ చేస్తున్న ఆరోపణలను థాయ్ ప్రభుత్వం ఖండించింది. కాంబోడియా ఆర్మీ పౌరులను రక్షణ కవచాలుగా వాడుకుంటూ నివాస ప్రాంతాల్లో ఆయుధాలను మోహరిస్తోందని ఆరోపించింది. ట్రాట్ ప్రావిన్స్‌లోకి ప్రవేశించేందుకు కాంబోడియా ఆర్మీ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టామంది. ఆసియాన్ చొరవను కోరిన మండలి థాయ్‌లాండ్ – కాంబోడియా ఉద్రిక్తతలపై హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులు, ముఖ్యంగా చిన్నారులకు హాని తలపెట్టేలా వ్యవహరించవద్దని కోరింది. సరిహద్దులు సమీపంలోని 852స్కూళ్లతోపాటు ఏడు ఆస్పత్రులను థాయ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మూసివేసిందని తెలిపింది. శనివారం మరో 12 మంది చనిపోయినట్లు కాంబోడియా తెలిపింది. దీంతో, ఆ దేశంలో మరణాల సంఖ్య 13కు చేరుకుంది. థాయ్‌లాండ్ సైతం మరణాల సంఖ్య 20కి చేరినట్లు ప్రకటించింది. వీరిలో అత్యధికులు పౌరులేనని పేర్కొంది. శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన ఐరాస భద్రతా మండలి రెండు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించేలా చొరవ తీసుకోవాలంటూ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఆసియాన్‌ను కోరుతూ తీర్మానం చేసింది. ఆసియాన్ అధ్యక్ష స్థానంలో ఉన్న మలేసియా దీనిపై స్పందించింది. రెండు దేశాలతో చర్చలు జరిపి, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే బాధ్యతను రక్షణ మంత్రికి అప్పగించినట్లు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న 800 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల విషయంలో దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ థాయ్‌లాండ్‌తో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో కాంబోడియాకు వచ్చే భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని నాంఫెన్లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ముఖ్యంగా కాంబోడియా సరిహద్దు ప్రాంతాల వైపు రావద్దని కోరింది. ఈ మేరకు శనివారం అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర సాయం కావాల్సిన వారు +855 92881676 నంబర్‌కు లేక cons.phnompenh@mea. gov.in. మెయిల్ ద్వారా సంప్రదించాలని కోరింది. ఇదే విషయమై శుక్రవారం థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేయడం తెల్సిందే.
జాతీయం

ఆత్మహత్యకు ప్రేరేపించిన ఫోన్ కాల్
కర్ణాటక: బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్య గ్రామంలో భీమన అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేసి అదేరోజు రాత్రి భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. అంచెపాళ్య నివాసి అభిషేక్ భార్య స్పందన (24) ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. తమ కుమార్తెను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని, వరకట్నం కోసం వేధించేవారని స్పదన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో స్పందన ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. భర్తకు పరాయి స్త్రీతో సంబంధం ఉందని స్పందనకు అనుమానం ఉండేది. భీమన అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేస్తున్న సమయంలో భర్తకు ఆ మహిళ ఫోన్ చేయడంతో కలత చెందిన స్పందన ఆరోజు రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇలా భర్త అక్రమ సంబంధం భార్య ప్రాణాలను బలిగొంది.

శివాలయంలో తొక్కిసలాట.. పలువురు మృతి
బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగిన కారణంగా ఇద్దరు భక్తులు మృతి చెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయంలోని ఓ విద్యుత్ తీగ తెగిపడిన కారణంగానే తొక్కిసలాట జరిగినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకిలో ఉన్న అవసనేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భక్తులు పూజలు చేసుకుంటున్న సమయంలో కొన్ని కోతులు అక్కడికి వచ్చాయి. ఈ క్రమంలో కోతి.. పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై దూకడంతో.. కరెంటు వైర్లు తెగి భక్తులపై పడిపోయాయి. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం, తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు.#BREAKING Stampede at Barabanki's Avsaneshwar Temple before darshan today... 15 devotees injured 📌The injured have been admitted to the hospitalpic.twitter.com/iJaQlnXUr4 #Barabanki #TempleStampede #India https://t.co/rVWlA2a7ab— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) July 28, 2025ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 40 మంది భక్తులు గాయపడినట్టు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఒకరిని లోనికాత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్‌పురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్‌గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి.. వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.Barabanki, Uttar Pradesh: A stampede occurred during Jalabhishek at the Awsaneshwar Mahadev Temple after an electric current spread through the premisesDM Shashank Tripathi says, "Devotees had gathered here for darshan on the third Monday of Sawan. Some monkeys jumped onto the… pic.twitter.com/AzLnRnFQKx— IANS (@ians_india) July 28, 2025

కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య.. కారణం ఇదే..
లక్నో: ప్రేమ పెళ్లి ఆమె పాలిట శాపమైంది. ఒక పోలీసు అధికారి భార్య.. భర్త ఇంట్లో వేధింపులు భరించలేక తనువు చాలించింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వివరాల ప్రకారం.. యూపీ రాజధాని లక్నోలోని బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్, మృతురాలు సౌమ్య కశ్యప్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన నాటి నుంచే సౌమ్యకు భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. సౌమ్య కట్నం తీసుకురాక పోవడంతో అనురాగ్ కుటుంబం కట్నం గురించి ఇబ్బందులకు గురిచేసేవారని బాధితురాలు వీడియోలో తెలిపింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో, అనురాగ్ ఆమెను వేరే వివాహం చేసుకోవాలని కూడా బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.🚨 Shocking! UP Cop’s Wife Dies by Suicide After Emotional VideoLucknow: Soumya Kashyap, wife of constable Anurag Singh, died by suicide.She posted a crying video blaming husband & in-laws for abuse and dowry torture. She showed her wounds, said husband threatened her: “I’m… pic.twitter.com/ripREYqDOQ— زماں (@Delhiite_) July 27, 2025ఇది మాత్రమే కాదు, అనురాగ్ తరచుగా తనను కొట్టేవాడని ఆరోపించింది. ఈ మేరకు సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. అయితే, అత్తింటి వేధింపులు, భర్త కూడా వారికి సపోర్టుగా మారడంతో సౌమ్య మానసికంగా కుంగిపోయింది. తనను మానసికంగా వేధించారని, తన భర్త, ఆయన బావ, బావ సోదరుడు కూడా తనను వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. నా భర్త బావ సంజయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతని సోదరులలో ఒకరైన రంజిత్ న్యాయవాది. వీరి వద్ద డబ్బు ఉంది, డబ్బుతో వారు ఏదైనా చేయగలరు. వారు నన్ను ఎంతగానో హింసించారు. ఈరోజు నేను చనిపోతున్నానంటే వీరే కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డ్రగ్ పార్టీపై పోలీసుల దాడి.. మాజీ మంత్రి అల్లుడు అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే పోలీసులు ఆదివారం ఉదయం ఓ అపార్టుమెంట్లో జరుగుతున్న డ్రగ్ పార్టీ గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలతో పాటు హుక్కాలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే కుమార్తె రోహిణి భర్త ప్రాంజల్ ఖెవల్కర్ సహా పలువురు పట్టుబడ్డారు.రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఖరాడీ ప్రాంతంలోని స్టూడియో అపార్టుమెంట్‌పై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో దాడి చేశామని డీసీపీ(క్రైం) నిఖిల్ పింగ్లే చెప్పారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో 2.7 గ్రాముల కొకైన్, 70 గ్రాముల గంజాయి, హుకా సామగ్రి, మద్యం దొరికాయన్నారు. పట్టుబడిన వారిపై నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్)చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించామని, నివేదికలు అందాల్సి ఉందన్నారు.ఎన్సీపీ(ఎస్పీ)నేత అయిన ఏక్నాథ్ షిండే ఈ పరిణామంపై మీడియా ఎదుట స్పందించారు. పోలీసుల దాడి వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే విషయం తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్సీపీ(ఎస్పీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా రోహిణీ ఖడ్సే వ్యవహరిస్తున్నారు. ఘటనపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఈ దాడి ఒక హెచ్చరిక వంటిదంటూ శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారె వ్యాఖ్యానించారు. प्रांजल खेवलकरांच्या रेव्ह पार्टीवर धाडीचा व्हिडिओ आला बाहेर, काय घडलं?#LokmatNews #MaharashtraNews #pranjalkhewalkar #raveparty #Policecase #MarathiNews pic.twitter.com/AufI7xJx0I— Lokmat (@lokmat) July 27, 2025
ఎన్ఆర్ఐ

లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే
పనిప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే మహిళలపై వేధింపులకు నిదర్శనం ఈ ఘటన. కావాలనే జీతాలు పెంచకపోవడం, ప్రమోషన్లు నిరాకరించడం, జీతం ఆలస్యంగా ఇవ్వడం ఇలాంటివి సాధారణంగా కొంతమంది ఉద్యోగులెదుర్కొనే వేధింపులు. దీనికి అదనంగా మహిళలు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన వేధింపుల పర్వంపై ఇండియన్ టెకీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.10 మంది ఉద్యోగులతో కూడిన ఒక చిన్న యూరోపియన్ టెక్ కంపెనీ అది. అలాంటి కంపెనీలో భారతీయ టెక్ రిమోట్‌గా పనిచేస్తోంది. అయితే ఆమెకు వివాహితుడైన మేనేజర్ ఒక అభ్యంతరకర ప్రపోజల్ పెట్టాడు. దీన్ని ఆమె అంగీకరించలేదు. అంతే అతగాడి వేధింపులు మొదలైనాయి. బాస్ ఇన్‌డైరెక్ట్‌గా పెట్టిన ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిన తర్వాత తనను వృత్తిపరంగా లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడని రెడ్డిట్‌లో ఆరోపగించింది. చీటికి మాటికి కోపగించుకోవడం, పురుష సహోద్యోగులతో మాట్లాడుతున్నా కూడా సహించేవాడు కాదు. వృత్తిపరంగా, జీతాల జాప్యం, ఆమె చేయని తప్పులకు బహిరంగంగా మందలింపులు లాంటివి కూడా ఎదుర్కొన్నానని తెలిపింది. తన ప్రతీ పనినీ, ప్రతీ కదలికను ప్రశ్నించడం, అవమానించడం, అతనికి పరిపాటిగా మారిపోయిందని వాపోయింది. ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాడు. గతంలో, రెండు రోజులు సెలవు అడిగినా ఇచ్చేవాడని, దీనికి తన పనితీరు, టాలెంటే కారణమని భావించాను కానీ, దాని వెనుకున్న అతని దుర్బుద్ధి ఇపుడు అర్థమవుతోందని తెలిపింది. ఇంత జరుగుతున్నా, ఈ ఉద్యోగాన్ని వదల్లేను. ఎందుకంటే..రిమోట్‌గా వర్క్ చేసుకోడానికి అవకాశం ఉంది.ఈ సమయంలో తన కుటుంబానికితన అవసరం చాలా ఉంది. కానీ ఈ వేధింపులో భరించలేనిదిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ గొప్పగా లేదు, కాబట్టి మారడం కష్టం అని ఆమె పేర్కొంది.దీనిపై నెటిజన్లు చాలా మంది ఆమెకు సంఘీభావం తెలుపుతూ, కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం మారితేనే మంచిది. ఎందుకంటే ఎవరికి కంప్లయింట్ చేసినా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు Prevention of Sexual Harassment (POSH) కేసు పనిచేస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే HRలు కంపెనీల కోసం పనిచేస్తాయి తప్ప ఉద్యోగుల కోసం కాదు. కాబట్టి వీలైతే ఉద్యోగం మారిపోండి అని మరికొందరు సలహా ఇచ్చారు.‘‘నీ పని నువ్వు చూస్కో.. అనవసర మెసేజ్‌లు జోలికి పోకు. మరో ఉద్యోగం దొరికేవరకు జాగ్రత్తగా ఉండు’’ అని ఒకరు, ‘‘మున్ముందు పరిస్థితి మరింత టాక్సిక్‌గా మారుతుంది. మీ మెంటల్ హెల్త్‌ను కాపాడుకోండి’’ అని ఒకరు, ఇది చేదు నిజం.ఉద్యోగం మారడం ఒక్కటే ఆప్షన్ మరొకరు సూచించారు. మొత్తానికి ఆమె పోస్ట్ కార్యాలయంలో వేధింపుల గురించి ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలామంది మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని , సురక్షితమైన ఆఫీసు వాతావరణాన్ని కోరుకోవాలని సూచించారు.

డల్లాస్‌లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంచ్
అమెరికాలోని డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా. టెక్సాస్, ఫెయిర్‌వ్యూ లోని సౌత్విండ్ ఎల్ఎన్ వేదికగా ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అమెరికా, భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ AAA నుంచి రఘు వీరమల్లు , పవన్ కుమార్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా AVని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ USA కి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ అవటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. ఇక సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ నార్త్ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు.

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్‌లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్‌వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.
క్రైమ్

మాజీ ప్రియుడి టార్చర్ భరించలేక..
బంజారాహిల్స్: యువతి ఆత్మహత్య కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకృష్ణానగర్ బీ–బ్లాక్‌లో నివసించే రేణుక కొంతకాలం క్రితం చల్లా వినయ్‌కుమార్‌ను ప్రేమించింది. సదరు యువకుడు జులాయిగా తిరుగుతుండడంతో పాటు డ్రగ్స్‌కు బానిస కావడంతో యువతి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు ఈనెల 9న యువతి పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లి తీవ్రంగా కొట్టి ఆమె ద్విచక్రవాహనంపైనే బలవంతంగా ఎక్కించుకుని మద్యం మత్తులో వస్తుండగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో వారు వాహనాన్ని సీజ్ చేశారు. ఇంటికి వెళ్లిన యువతిని ద్విచక్ర వాహనం ఏదని తల్లి ప్రశ్నించగా మెకానిక్కు ఇచ్చానని చెప్పింది. అయితే తల్లికి అబద్ధం చెప్పానన్న బాధను తట్టుకోలేక ఈనెల 10న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. దీంతో మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు వినయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వినయ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధిత యువతి ద్విచక్రవాహనం కూడా తన బాబాయిది కావడంతో పాటు పోలీసులు సీజ్ చేయడం, డ్రంకన్ డ్రైవ్‌లో వినయ్‌కుమార్ దొరకడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యకు ప్రేరేపించిన ఫోన్ కాల్
కర్ణాటక: బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్య గ్రామంలో భీమన అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేసి అదేరోజు రాత్రి భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. అంచెపాళ్య నివాసి అభిషేక్ భార్య స్పందన (24) ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. తమ కుమార్తెను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని, వరకట్నం కోసం వేధించేవారని స్పదన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో స్పందన ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. భర్తకు పరాయి స్త్రీతో సంబంధం ఉందని స్పందనకు అనుమానం ఉండేది. భీమన అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేస్తున్న సమయంలో భర్తకు ఆ మహిళ ఫోన్ చేయడంతో కలత చెందిన స్పందన ఆరోజు రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇలా భర్త అక్రమ సంబంధం భార్య ప్రాణాలను బలిగొంది.

కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య.. కారణం ఇదే..
లక్నో: ప్రేమ పెళ్లి ఆమె పాలిట శాపమైంది. ఒక పోలీసు అధికారి భార్య.. భర్త ఇంట్లో వేధింపులు భరించలేక తనువు చాలించింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వివరాల ప్రకారం.. యూపీ రాజధాని లక్నోలోని బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్, మృతురాలు సౌమ్య కశ్యప్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన నాటి నుంచే సౌమ్యకు భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. సౌమ్య కట్నం తీసుకురాక పోవడంతో అనురాగ్ కుటుంబం కట్నం గురించి ఇబ్బందులకు గురిచేసేవారని బాధితురాలు వీడియోలో తెలిపింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో, అనురాగ్ ఆమెను వేరే వివాహం చేసుకోవాలని కూడా బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.🚨 Shocking! UP Cop’s Wife Dies by Suicide After Emotional VideoLucknow: Soumya Kashyap, wife of constable Anurag Singh, died by suicide.She posted a crying video blaming husband & in-laws for abuse and dowry torture. She showed her wounds, said husband threatened her: “I’m… pic.twitter.com/ripREYqDOQ— زماں (@Delhiite_) July 27, 2025ఇది మాత్రమే కాదు, అనురాగ్ తరచుగా తనను కొట్టేవాడని ఆరోపించింది. ఈ మేరకు సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. అయితే, అత్తింటి వేధింపులు, భర్త కూడా వారికి సపోర్టుగా మారడంతో సౌమ్య మానసికంగా కుంగిపోయింది. తనను మానసికంగా వేధించారని, తన భర్త, ఆయన బావ, బావ సోదరుడు కూడా తనను వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. నా భర్త బావ సంజయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతని సోదరులలో ఒకరైన రంజిత్ న్యాయవాది. వీరి వద్ద డబ్బు ఉంది, డబ్బుతో వారు ఏదైనా చేయగలరు. వారు నన్ను ఎంతగానో హింసించారు. ఈరోజు నేను చనిపోతున్నానంటే వీరే కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయకు
మహబూబ్ నగర్ జిల్లా: ‘నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చెయ్యొద్దంటూ ప్రాథేయపడినా ఆ తండ్రి కనికరించలేదు. సభ్యసమాజం తల దించుకునేలా మృగంలా మారి కన్న కూతురిపైనే దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాము కథనం ప్రకారం.. కుర్వ కుర్మయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు మక్తల్‌లోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే చిన్న కూతురు (10)కు రెండు నెలల క్రితం కుక్క కరవటంతో చికిత్స చేయించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే 5వ తరగతి చదివిస్తున్నారు. ఈ నెల 25న తల్లి కూలీ పనులకు, తండ్రి మేకల దగ్గరకు వెళ్లాడు. చిన్న కూతురు పాఠశాల నుంచి వచ్చి సాయంత్రం ఇంట్లో చదువుకుంటుండగా ఇంటికి వచ్చిన తండ్రి కుర్మయ్య.. ఒంటరిగా ఉన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయొద్దని ప్రాథేయపడినా కనికరించలేదు. ఇంట్లో నుంచి బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కాపాడారు. అప్పటికే బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పగా.. గ్రామంలోని ఆర్ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆర్ఎంపీ చెప్పగా.. భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కుర్మయ్య భార్యను కొట్టి గ్రామం నుంచి పరారయ్యాడు. బాలిక పరిస్థితి మరింత విషమంగా మారడంతో అదే రోజు రాత్రి మరికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాలని చెప్పగా.. కుటుంబ సభ్యులు మరుసటి రోజు శనివారం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పోలీసు కేసు అయితేనే చికిత్స చేస్తామని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.