mahatma gandhi
-
Sarojini Naidu: మహాత్మునితో ‘మిక్కీ మౌస్’ అని పిలిపించుకుని..
ఆమె ఆరేళ్ల చిరుప్రాయంలోనే కవితలు రాసేది . 12 ఏళ్ల వయసులో రచించిన నాటకం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. లండన్‌లో విద్యాభ్యాసానికి స్కాలర్షిప్ పొందిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించాలని పోరాడిన ఆమె.. మరెవరో కాదు..స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు(Sarojini Naidu). చిన్నవయసులోనే ఆమె చూపిన తెగువ, పోరాట పటిమను మెచ్చుకున్న మహాత్మాగాంధీ ఆమెను ప్రేమగా ‘మిక్కీమౌస్’ అని పిలిచేవారు.సరోజినీ నాయుడు 1979, ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఆమెను శాస్త్రవేత్తగా చూడాలనుకున్నారు. కానీ ఆమె ఆమెకు కథలు, కవితలు రాయడమంటే అమితమైన ఆసక్తి. తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. సరోజినీ తన 12 ఏళ్ల వయసులో రాసిన ‘మహేర్ మునీర్’ నాటకం ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది.చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే సరోజినీకి 16 ఏళ్ల వయసులో హైదరాబాద్ నిజాం నుంచి స్కాలర్షిప్ లభించింది. ఈ స్కాలర్‌షిప్‌తో ఆమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదువుకునేందుకు వెళ్లింది. అక్కడ ఆమె పెద్దిపాటి గోవిందరాజులు నాయుడును కలుసుకుంది. ఇది తరువాతి కాలంలో వారి మధ్య ప్రేమగా పరిణమించి, వివాహానికి దారి తీసింది. పెళ్లి చేసుకునే సమయానికి సరోజినీ వయసు కేవలం 19 ఏళ్లు. నాడు జరిగిన వీరి కులాంతర వివాహం పలు చర్చలకు దారితీసింది. అయితే వారి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగింది. వారికి ఐదుగురు సంతానం. వారి కుమార్తె పద్మజ కూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు. సరోజినీ నాయుడు రాజకీయ జీవితం 1905లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్(Women's Indian Association) (డబ్ల్యూఏఐ) స్థాపనతో ప్రారంభమైంది. ఆమె సాగించిన రచనలు దేశ స్వాతంత్య్రాన్ని, మహిళా స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రతిబింబించేవి. ఆమె 1906లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించారు. సరోజనీ నాయుడు సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ఎనలేని కృషి చేశారు. 1925లో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొని జైలుకు వెళ్లారు.సరోజినీ నాయుడు తొలి కవితా సంకలనం 1905లో ప్రచురితమైంది. దాని పేరు - 'ది గోల్డెన్ థ్రెషోల్డ్.' సరోజినీ నాయుడు భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్. 1947 నుండి 1949 వరకు యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔద్(United Provinces of Agra and Oudh)కు గవర్నర్‌గా పనిచేశారు. సరోజినీ నాయుడు జ్ఞాపకార్థం దేశంలోని పలు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులకు ఆమె పేరు పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన రెండేళ్ల తర్వాత అంటే 1949 మార్చి 2న సరోజినీ నాయుడు తన 70వ ఏట ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గుండెపోటుతో కన్నుమూశారు.ఇది కూడా చదవండి: నేడు తొలి విశ్వశాంతి కేంద్రం ప్రారంభం -
హిట్లర్‌ను మానవుడన్న మహాత్ముడు!
ఇప్పుడు రాస్తున్న దానిని గతవారమే నేను ఈ కాల మ్లో రాసి ఉంటే, అప్పు డది మహాత్మాగాంధీ వర్ధంతి రోజుకు మరింత సంద ర్భోచితంగా ఉండి ఉండే దని అనిపించవచ్చు. అదే కారణంతో అలా నేను రాసి ఉంటే సమయం,సందర్భం చూసి, రెచ్చకొట్టడానికి నేను రాసిన ట్లుగా ఉండేది. లేదంటే, మనోభావాలను దెబ్బ తీసినట్లయ్యేది. కాబట్టి, ఈరోజు నేను లేవనెత్తు తున్న విషయాలపై మీ ప్రతిస్పందన భావావేశా లకు లోను కాని విధంగా ఉంటుందని ఆశిస్తాను. గాంధీ మరణించిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడైనా – ఆయనకున్నటువంటి కొన్ని వివాదాస్పద, లేదా విరుద్ధమైన, అదీ కాకుంటే ఆమోదయోగ్యం కానివైన అభిప్రాయాలను మనం ఎలా పరిగణించాలన్న దానిని పరిశీలించవలసిన అవసరం ఉంది. 2024లో అవి మనకు దిగ్భ్రాంతిని గొల్పవచ్చు. 1940ల లోనైనా వాటికి ఇప్పటి కన్నా ఎక్కువగానే సమ్మతి లభించి ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. భారత స్వాతంత్య్రం, దేశ విభజనలపై అలెక్స్ వాన్ తంజల్మాన్ (బ్రిటిష్ చరిత్రకారిణి) పుస్తకం ‘ఇండియన్ సమ్మర్’ (2007)ను జాగ్ర త్తగా చదివినప్పుడు–రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్, ఆనాటి మారణహోమం పైన గాంధీజీ దృష్టికోణం ఏమిటో తెలిసి నిర్ఘాంతపోయాను. గాంధీ శాంతి కాముకులని, అహింస పట్ల ఆయన నిబద్ధత తిరుగులేనిది, కొదవలేనిదని మనకు తెలిసిందే. ఆ నిబద్ధతే ఆయనను... హిట్లర్, ముస్సోలినీల దురాక్రమణ ప్రయత్నాలను అడ్డుకోవద్దని బ్రిటన్‌కు సలహా ఇచ్చేంతవరకు తీసుకెళ్లిందా! ‘‘వారిని మీ అందమైన దీవిని జయించనివ్వండి. పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని చంపేయటానికి మీకై మీరు వారిని అనుమతించండి. అయితే వారికి విధేయంగా ఉండటానికి మాత్రం నిరాకరించండి’’ అని చెప్పారాయన. 1962లో ఇండియాపై చైనా దాడి, లేదా ఇండి యాపై పాకిస్తాన్ పదే పదే చేస్తుండే దాడుల విషయంలో కూడా గాంధీ అలాగే స్పందించే వారా? ఏమైనా మహాత్ముడు భీతికొల్పేంత స్థిర చిత్తుడు అయుండాలి కానీ కపటి మాత్రం కాదు. మరీ అధ్వాన్నం... హిట్లర్ దుష్టుడు అంటే గాంధీకి నమ్మబుద్ధి కాకపోవటం! ‘‘గౌరవనీయు లైన హిట్లర్‌ను – ఆయన్ని చిత్రీకరించినంత – చెడ్డ వారిగా నేను పరిగణించను’’ అని 1940లో గాంధీ రాశారు. ‘‘ఎక్కువ రక్తపాతం లేకుండా విజయాలు సాధించే అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న ట్లుగా ఆయన నాకు కనిపిస్తారు’’ అన్నారు. ‘‘భవి ష్యత్ జర్మన్లు శ్రీ హిట్లర్‌ను మేధావిగా, ధీశాలిగా, సాటిలేని కార్యాచరణశీలిగా, మరెన్నో విధాలుగా గౌరవిస్తారు’’ అని గాంధీ భావించారు. దీనికన్నా కూడా, మాటల్లో వివరించలేనిది ఏమిటంటే – యూదుల పట్ల నాజీల అమానవీయ ప్రవర్తనపై గాంధీ ప్రతిస్పందన. లూయీ ఫిషర్ (అమెరికన్ జర్నలిస్ట్) రాసిన మహాత్ముడి జీవిత కథను ఉటంకిస్తూ, వాన్ తంజల్ మాన్... యూదులు సానుకూలమైన ప్రతిఘటనను మాత్రమే నాజీలకు అందించాలనీ, అవసరం అయితే తమ జీవితాలను సైతం త్యాగం చేయాలనీ గాంధీ సలహా ఇచ్చారని వెల్లడించారు. అడాల్ఫ్ హిట్లర్ కోసం ప్రార్థించమని కూడా ఆయన వారిని కోరారట. ‘‘కనీసం ఒక యూదుడు ఇలా చేసినా అతడు తన ఆత్మగౌరవాన్ని కాపాడు కున్నట్లేనని, అందువల్ల ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాడని, ఆ మంచితనం అంటువ్యాధిలా విస్త రించి మొత్తం యూదు జాతినే కాపాడుతుందని, మానవాళికి సుసంపన్నమైన ఒక గొప్ప వారస త్వాన్ని వదిలివెళుతుందని గాంధీ అన్నారు’’ అని లూయీ ఫిషర్ రాసినట్లు వాన్ పేర్కొన్నారు. యూదుల నిర్బంధ శిబిరాలను కనుగొన్నాక కూడా, వాటిల్లో జరుగుతున్న అతి భయానక దారుణాలు ప్రపంచం దృష్టికి వచ్చాక కూడా లూయీ ఫిషర్‌తో గాంధీ ఇలా అన్నారు: ‘‘హిట్లర్ 50 లక్షల మంది యూదులను చంపాడు. ఇది మనకాలపు అతి పెద్ద నేరం. కానీ యూదులు తమకై తాము కసాయి కత్తికి తమను సమర్పించుకుని ఉండాల్సింది. తమను తాము శిఖరం అంచులపై నుండి సముద్రంలోకి తోసుకుని ఉండాల్సింది...’’హింసపై పూర్తి వ్యతిరేకత, అహింస పట్ల అచంచలమైన నిబద్ధత కలిగి ఉన్న కారణంగానే గాంధీ అలా అని ఉంటారనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే అంతవరకే అది ఏకైక ఆమోదయోగ్యమైన ప్రతిస్పందన. హిట్లర్‌ను ఎది రించవద్దని, హిట్లర్ కోసం ప్రార్థించమని, తమకు తాము ఆత్మార్పణం చేసుకోవాలని ఆయన యూదులకు చెప్పటం మాత్రం విడ్డూరం. కనికరం లేకపోవటం, కించపరచటం, క్రూరత్వం.1984లో సిక్కులకు, 2002లో ముస్లింలకు, నేటి ఆదివాసీలకు గాంధీ ఇచ్చే సలహా కూడా అదే విధంగా ఉండేదా? బహుశా... ఉండేది! మళ్లీ అడి గినా ఇదే సమాధానం. బ్రహ్మచర్యంతో గాంధీ చేసిన ప్రయోగాల మాదిరిగా కాకుండా... యుద్ధం మీద, హిట్లర్ మీద, మారణహోమం మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు వ్యక్తిగత వ్యామోహాలు, బలహీనతల స్థాయికి మించినవి. ఆయన ఒకవేళ దేశాన్ని పరిపాలించి ఉంటే అవి విధానాలుగా మారిఉండేవి. అందుకే వాటిని చర్చించి, పరిష్కరించాల్సి ఉంది. అంతిమంగా, వాటికి ఆమోదయోగ్యమైన వివరణ లభించకపోతే వాటిని విమర్శించాలి. తిప్పికొట్టాలి. ఇలా అంటున్నందుకు నేను చిక్కుల్లో పడతాననే మాటనైతే నేను కాదనను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మహత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళి
-
మహాత్ముడికి వైఎస్ జగన్ నివాళి
-
మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన YSRCP నేతలు
-
డల్లాస్‌లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సాస్, అమెరికా: అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద భారతదేశ 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన వందలాదిమంది ప్రవాసభారతీయుల ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగాయి.మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల హాజరైన వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ “చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస భారతీయలకు కృతజ్ఞతలు అన్నారు. అవతారిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు, మొత్తం 251 పేజీలఉన్న రాజ్యాంగం భారతదేశ పరిపాలనకు సంబంధించిన ప్రామాణిక గ్రంథం అని దీనిలో ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వసంస్థల విధులు, పౌర హక్కులు వివరంగా పేర్కొనబడి ఉన్నాయన్నారు. 1950లో జనవరి 26న అమలులోకి వచ్చిన ఈ రాజ్యంగ రచన వెనుక రాజ్యాంగ ముసాయిదాను రూపొందించిన బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వెంట్‌గా పనిచేసిన సర్ బెనెగళ్ నర్సింగరావు (బి.ఎన్ రావు) కృషి, ముసాయిదా కమిటీకు చైర్మన్ గా విశేష సేవలందించిన బీ.ఆర్ అంబేడ్కర్ మరియు వారి కమిటీ సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, కే.ఎం మున్షి, మహ్మద్ సాదుల్లా, బీ.ఎల్ మిట్టర్, డీ.పీ ఖైతాన్ లు అభినందనీయులు అన్నారు.ప్రధాని నెహ్రు అభ్యర్ధన మేరకు ప్రముఖ చేతివ్రాత నిపుణుడు ‘ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా’ తన సొంత దస్తూరితో ఆరునెలల పాటు శ్రమించి హిందీ, ఆంగ్ల భాషలలో వ్రాసిన మన భారత రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని, దీని అసలు ప్రతిని ఇప్పటికీ పార్లమెంట్ గ్రంథాలయంలో అందరూ చూడవచ్చు అని అన్నారు.”ఎంతో కోలాహలంగా మాతృదేశభక్తి స్ఫూర్తి తో జరిగిన ఈ వేడుకలలో మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కో-ఛైర్మన్ తయాబ్ కుండావాలా, రాజీవ్ కామత్, కార్యదర్శి రావు కల్వాల, బోర్డ్ సభ్యులు బి.యెన్. రావు, మహేంద్ర రావు, అనంత్ మల్లవరపు తో పాటు ఐఎఎన్టి నాయకలు, వివిధ సంఘాల ప్రతినిధులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
లాంగ్ లివ్ ద రిపబ్లిక్
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్‌కు చేర్చిన టీమ్ క్యాప్టెన్ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్అండ్ బ్యాలెన్సెస్లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్‌తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్ ది కాన్స్టిట్యూషన్’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్ ది స్టేట్’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్ ఆఫ్ ది స్టేట్స్’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్ హార్స్’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్’ (ఓఎన్ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Mahakumbh: కుంభమేళాకు భయపడిన బ్రిటీష్ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల పవిత్ర త్రివేణీ సంగమంలో జరుగుతున్న కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అత్యంత భారీగా జరుగుతున్న కుంభమేళాను వీక్షించేందుకు, సనాతన ధర్మం గురించి తెలుసుకునేందుకు లక్షలాదిమంది విదేశీయులు కూడా భారత్‌కు తరలిరావడం విశేషం. కుంభమేళాకు ఘన చరిత్ర ఉంది. 1942లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగిన కుంభమేళా ఉదంతం గురించి యూపీకి చెందిన భాషావేత్త పృథ్వీనాథ్ పాండే మీడియాకు తెలిపారు.కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవమే కాదు. భారతదేశ స్వాతంత్య్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. 1857లో ఆధ్యాత్మిక బోధనలు సాగించిన పండితుడు ప్రయాగ్వాల్ నాటి విప్లవకారులకు అండగా నిలిచారని భాషావేత్త పృథ్వీనాథ్ పాండే తెలిపారు. ఆయన స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా నాటి ఉద్యమకారులకు ఊపిరిపోశారన్నారు. నాడు మహారాణి లక్ష్మీబాయి ప్రయాగ్‌రాజ్ వచ్చినప్పుడు ఆమె పండితుడు ప్రయాగ్వాల్ ఇంట్లో ఆశ్రయం పొందారు. స్వాతంత్య్ర పోరాటంలో కుంభమేళా భాగస్వామ్యం కూడా ఉంది. దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న 1918 నాటి రోజుల్లో కుంభమేళా అంత్యంత వైభవంగా జరిగింది. దీనిలో పాల్గొనేందుకు జాతిపిత మహాత్మాగాంధీ ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. నాడు ఆయన త్రివేణి సంగమంలో స్నానం చేయడమే కాకుండా, అక్కడున్న సాధువులను కలుసుకున్నారు. యాత్రికులతో సంభాషించారు.హిందువుల ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచిన కుంభమేళా ఉత్సవం బ్రిటిష్ ప్రభుత్వ ఆందోళనను మరింతగా పెంచింది. మరోవైపు అదేసమయంలో గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకుంది. 1942లో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరిగింది. ఇది తమ పరిపాలనకు అడ్డుకులు కల్పిస్తుందనే ఉద్దేశంలో బ్రిటీషర్లు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే రైళ్లు, బస్సులను అడ్డుకున్నారు. ఈ ప్రయాణ సాధనాలకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలను నిషేధించారని భాషావేత్త పృథ్వీనాథ్ పాండే తెలిపారు. కుంభ్ ప్రాంతం విప్లవ ప్రదేశంగా మారుతుందని బ్రిటీష్ పాలకులు భయపడ్డారు. బ్రిటీషర్లు అడ్డుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఇది కూడా చదవండి: Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి -
రేపటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురష్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేక భేటీ నిర్వహింనుంది. మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించిన కర్ణాటకలోని బెలగావిలోనే ఈ నెల 26, 27 తేదీల్లో రెండ్రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీకి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేసింది. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ సీఎంలు హాజరుకానున్నారు. మొత్తంగా 200ల మంది కీలక నేతలు హాజరవుతారని ఏఐసీసీ ప్రకటించింది. 26న మహాత్మాగాంధీ నగర్లో మధ్యాహ్నం 2.30 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం కానుంది. 27వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ రెండు తీర్మానాలను ఆమోదించనుంది. దీంతో పాటే వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై ఇందులో కీలక చర్చలు చేయనున్నారు. దీంతో పాటే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంశంపైనా చర్చించనున్నారు. ‘1924లో బెలగావిలో తన తొలి ప్రసంగంలో మహాత్మాగాంధీ అహింస, సహాయ నిరాకరణ, అంటరానితనం నిర్మూలన, వివిధ వర్గాల మధ్య ఐక్యత, సామాజిక–ఆర్ధిక సమతుల్యత, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రసంగించారు. ఈ భేటీకి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నాం. 200 మందికి పైగా నాయకులు దీనికి హాజరవుతారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో కీలక నేతలతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొంటారు’అని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆర్ధిక అసమానత, ప్రజాస్వామ్య ఖూనీ, రాజ్యాంగ సంస్థలపై దాడి, బీజేపీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లు వంటి అంశాలపై ఇందులో చర్చిస్తామన్నారు. -
అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ని డాలస్‌లో స్థాపించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో దశమ వార్షికోత్సవ వేడుకలు గత ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ నిర్మాణంలో సహకరించిన దాతలకు, అధికారులకు అభినందన పూర్వక విందు సమావేశం ఇర్వింగ్ నగరంలో ఉన్న విండాం హోటల్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీకరి లంకా వీణానాదం; చక్రి పైలా శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు గాంధీ ఆశయాలపై చేసిన ప్రసంగాలు, రవీంద్ర గుడిమెళ్ళ, సమీర శ్రీపాద శిక్షణలో పాల్గొన్న సింధు గుడిమెళ్ళ, సంయుక్త గుడిమెళ్ళ, అన్షు చుండి, అయేషాని చుండి, సంహిత్ చిలకమర్రి, రిత్విక లక్కిరెడ్డి, అభినవ్ కార్తీక్ లక్కిరెడ్డి, సమన్విత మాడా, పవన్ కుమార్ గడగండ్ల, రవీంద్ర గుడిమెళ్ళ, శ్రీకర్ దేసు లు గానం చేసిన దేశభక్తి గీతాలు; సింధుజ ఘట్టమనేని శిక్షణలో పాల్గొన్న నందిత దినేష్, గ్రీష్మ అశోక్, తేజస్విని శర్వణన్, నక్షత్ర నల్లమోతు, నిత్య ఆవాల, ఆర్షియ మాచవోలు, ప్రియ దర్శిని కృష్ణమూర్తి, రుషిక కల్ల, సహన కార్తీక్, శ్రీనిత ఆర్కాటి, రియ బూర, వీక్షవ్ సురకంటి, ప్రణిత కొసరాజు, నేహశ్రీ పిల్లా, ప్రిష మదన్, సరయు తూనుగుంట్ల, అకిర తేర, నిహారిక కొండూరు, సాన్విక కొలన్పాక, ఆద్యవర్మ కొండూరు బృందం వందేమాతరం, జనగణమన గీతాలకు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకత్వానికి దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు శుభాశ్సీసులు తెలియజేసిన ప్రత్యేక అతిథులుగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ ప్రోటెం డెన్నిస్ వెబ్, కౌన్సిల్ మెంబర్ అబ్దుల్ ఖబీర్, కాపెల్ నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యు, రమేశ్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఉపాధ్యక్షులు గోపాల్పోణంగిలను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యులు మురళి వెన్నం, రన్నా జానీ, జాన్ హామండ్, కమల్ కౌశల్, బి.ఎన్ రావు, తాయాబ్ కుండావాల, సి.సి తియోఫిన్, స్వాతి షా, షబ్నం మాడ్గిల్ లు సత్కరించారు.కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజూ మాత్యు మరియు రమేశ్ ప్రేమ్ కుమార్ లు కాపెల్ నగర మేయర్ మహాత్మా గాంధీ మెమోరియల్ ను అభినందిస్తూ చేసిన అధికారిక అబినందన పత్రాన్ని (ప్రోక్లమేషన్), మరియు ఇర్వింగ్ నగర మేయర్ వ్రాసిన ప్రశంసా పత్రాన్ని మేయర్ ప్రోటెం డెన్నిస్ వెబ్ లు డా. ప్రసాద్ తోటకూర కు అందజేశారు.ఇటీవలే గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డు సభ్యులుగా నియమితులైన రాంకీ చేబ్రోలు, జాన్ హామండ్, రన్నా జానీ, కిషోర్ కంచర్ల, తిరుమలరెడ్డి కుంభం, లోకేష్ నాయుడు కొణిదల, అనంత్ చౌదరి మల్లవరపు, అక్రం సయ్యద్, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట్ల, వినోద్ ఉప్పు, రాజేంద్ర వంకావాల లను డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేసి తోటి సభ్యులతో కలసి వారందరినీ సన్మానించారు.మహాత్మాగాంధీ విగ్రహాన్ని తయారుచేసిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత, విజయవాడకు చెందిన బుర్రా శివ వరప్రసాద్, గుజరాత్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోనీను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులందరూ కలసి ఘనంగా సన్మానించారు. షబ్నం మాడ్గిల్ వందన సమర్పణతో, రుచికరమైన విందు భోజనంతో ఈ దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.(చదవండి: కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు) -
డాలస్‌లో ఘనంగా 'గాంధీ శాంతి నడక-2024'
డాలస్, టెక్సాస్: ఇర్వింగ్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద ఐఎఎన్టి నిర్వహణలో “గాంధీ శాంతి నడక 2024 పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది ప్రవాసభారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐఎఎన్టి అధ్యక్షులు రాజీవ్ కామత్, మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎం.జి.ఎం.ఎన్.టి) కార్యదర్శి రావు కల్వాల అతిథులకు స్వాగతం పలికారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మహాత్మాగాంధీ స్మారకస్థలి నిర్మాణంలో సహకరించిన తోటి కార్యవర్గ సభ్యులకు, ప్రజలకు, సంస్థలకు, దాతలకు, ఇర్వింగ్ నగర అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్ మాట్లాడుతూ “నేను ఎక్కడకు వెళ్ళినా, విదేశాలలో సైతం మీది మహత్మాగాంధీ విగ్రహం నెలకొనియున్న ఇర్వింగ్ నగరమేనా అని అడుగుతున్నప్పుడు ఆశ్చర్యంతోపాటు గర్వం కలుగుతోందన్నారు. కేవలం మహత్మాగాంధీ విగ్రహ నిర్మాణమేగాక, ఈ 18 ఎకరాల సువిశాలమైన పార్క్ సుందరీకరణలో కూడా భాగమైన ఎం.జి.ఎం. ఎన్.టి నాయకత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు అన్నారు.్ఙ హ్యుస్టన్ నగరంనుంచి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాన్సుల్ జెనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ మాట్లాడుతూ “మహాత్మాగాంధీ ఆలోచనలు, ఆశయాలు సర్వత్రా అన్నివేళలా సజీవంగా ఉంటాయి. శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహత్మాగాంధీ విగ్రహాన్ని ఇర్వింగ్ నగరంలో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ హృదయపూర్వక అభినందనల్ఙు అన్నారు. ఈ వేడుకలలో ప్రత్యేకఅతిథులుగా హాజరైన ఈ మహత్మాగాంధీ విగ్రహశిల్పి బుర్రా శివ వరప్రసాద్ విజయవాడనుండి, ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోని గుజరాత్ నుండి, కాపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్ల గా ఎన్నికైన భారత సంతతికి చెందిన బిజు మాత్యు, రమేశ్ ప్రేమ్ కుమార్ లను, గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డు సభ్యులు రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, లోకేష్ నాయుడులను డా. ప్రసాద్ తోటకూర, ముఖ్య అతిథులు, కార్యవర్గ సభ్యులు అందరూ కలసి ఘనంగా సన్మానించారు. దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాతలపేర్లతో కూడిన శిలాఫలకాన్ని కాన్సుల్ జెనరల్ ఆఫ్ ఇండియా డి. సి మంజునాథ్ ఆవిష్కరించారు. “గాంధీ శాంతి నడక 2024్ఙ ను ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్ ప్రారంభించే ముందు శాంతికి సంకేతంగా 10 తెల్లటి పావురాలను అందరి హర్ష ధ్వానాలు, కేరింతలమధ్య గాలిలోకి విడుదలజేశారు. నడక పూర్తయిన తర్వాత, మహాత్మాగాంధీ విగ్రహానికి అందరూ పుష్పాంజలి ఘటించి అల్పాహారం ఆరగించి, ఫోటోలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈనాడు దినపత్రిక (ఆంధ్రప్రదేశ్, న్యూ ఢిల్లీ, కర్ణాటక) సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ ఈ విగ్రహనిర్మాణ సాకారంలో అవిరళ కృషిచేసి సాధించిన వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, కార్యవర్గ సభ్యులందరినీ ప్రశంసిస్తూ ఇది ప్రవాసభారతీయులు ఐకమత్యానికి చిహ్నం అన్నారు. ప్రవాస భారతీయుడుగాఉన్న గాంధీ దక్షిణఆఫ్రికా దేశంనుండి మాతృదేశానికి తిరిగివచ్చి భారతదేశపు స్వాతంత్య్ర సముపార్జనలో దశాబ్దాలగా సాగించిన శాంతియుత పోరాటం చరిత్ర మరువలేని సత్యం అన్నారు. అమెరికాపర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ వారి పర్యటనలో భాగంగాఉన్న ప్రవాస తెలుగుదేశంపార్టీ నాయకులు జయరాం కోమటి, సతీష్ వేమన, సినీ నిర్మాత ఎం.ఎల్ కుమార్ చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త రాం గుళ్ళపల్లి, మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.వేడుకలలో: ఎం.జి.ఎం.ఎన్.టి వవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డ్ సభ్యులు రావు కల్వాల, మురళి వెన్నం, రాజీవ్ కామత్, కమల్ కౌశల్, బి.ఎన్ రావు, షబ్నం మాడ్గిల్, కుంతేష్, గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు, రాజేంద్ర వంకావాల, వినోద్ ఉప్పు, లోకేష్ నాయుడు వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. -
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా YS జగన్ నివాళి
-
'ఖాదీ'.. గాంధీ చూపిన దారే!
ఖాదీ అనేది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్రంగా ఉంటుంది. ఆ వస్త్రం ధరిస్తే ఓ పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ఖాదీ వలస పాలన విముక్తికి చిహ్నాంగా నిలిచి అందరిలోనూ స్వరాజ్య కాంక్ష రగిల్చేందుకు కారణమయ్యింది. అందుకు ఊపిరిపోసింది మహాత్మ గాంధీ. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ఖాదీతో ఆయన ఎలా స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికారు?. ఆ ఫ్యాబ్రిక్ నేడు ఫ్యాషన్ ప్రపంచంలో 'జయహో ఖాదీ' అనేలా ఎలా రాజ్యమేలుతుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందాం.!ఖాదీ అనేది పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్. భారతీయుల సంప్రదాయ వస్త్రంగా కీర్తించబడుతోంది. అలాంటి ఈ వస్త్రమే స్వరాజ్య కాంక్షకు ఊపిరిపోసి భారతీయులను వలస పాలకుల విముక్తికై పాటు పడేలా చేసింది. దీనికి శ్రీకారం చుట్టింది మహాత్మాగాంధీనే. 1918లో భారతదేశంలోని గ్రామాలలో నివసించే పేద ప్రజల కోసం ఖాదీ ఉద్యమాన్ని చేపట్టారు. నాడు వారికి ఉపాధి లేకుండా చేసి పొట్టకొడుతున్న విదేశీ వస్తువులకు ముగింపు పలికేలా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. నిజమైన స్వాతంత్ర్య కాంక్షకు కావల్సింది మనల్ని బానిసలుగా చేసి బాధపెడుతున్న విదేశీయల వస్తువులున బహిష్కరించి స్వదేశీ వస్తువులకు ప్రాముఖ్యత ఇవ్వడమే అని ఓ గొప్ప పాఠాన్ని బోధించారు.ఆయన ఇచ్చిన ఈ పిలుపు ప్రతి ఒక్కడి భారతీయుడి గుండెల్లో స్వతంత్ర కాంక్ష ఉవ్వెత్తున ఎగిసిపడేలా రగిల్చారు. అలా మొదలైన 'ఖాదీ' హవా..ఇప్పటికీ తన వైభవాన్ని చాటుతూ దేశ విదేశాల ప్రజల మన్నలను అందుకుంది. మన ప్యాషన్ పరిశ్రమలో తనదైన ముద్రతో సత్తా చాటుతుంది. మన భారతీయ డిజైనర్లు దీన్ని కనుమరగవ్వనివ్వకుండా పునరుజ్జీవింప చేశారు. తమదైన సృజనాత్మకతతో ఖాదీతో చేసిన లెహంగాలు, కోట్లు, వంటి లగ్జరియస్ వస్తువులను తీసుకొచ్చి ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడి ధరించేలా రూపొందించారు.ఖనిజో, అనీత్ అరోరా, రినా ధాకా, అనవిలా 11.11 లేబుల్ సహ వ్యవస్థాపకులు షానీ హిమాన్షు అండ్ మియా మోరికావా కొ వంటి దిగ్గజ డిజైనర్లు ఎంతో విలక్షణమైన ఖదీ డిజైన్ల కలెక్షన్లను అందించారు. అలాగే 2019లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో, డిజైనర్ రాహుల్ మిశ్రా తన ఖాదీ సేకరణ ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక రెండేళ్ల క్రితం ఎఫ్‌డీసీఐ ఎక్స్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో, ఫ్రెంచ్ డిజైనర్ మోస్సీ ట్రారే ఖాదీ డిజైన్ని ప్రదర్శించి అందర్ని విస్మయానికి గురిచేశాడు. ఇక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరుగాంచిన సబ్యసాచి ముఖర్జీకి బ్రైడల్ డిజైనర్ మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఆయన ఎన్ని రకాలఫ్యాబ్రిక్లతో డిజైన్ చేసినా.. ఖాదీ సరిసాటి రాదన్నారు. దీనికి మించిన విలాసవంతమైన వస్త్రం ఇంకొటి ఉండదు అంటూ ఖాదీపై తనకున్నా ఆకాశమంతా అభిమానాన్ని చాటుకునన్నారు. ప్రస్తుతం సామాజికి కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు పర్యావరణ స్ప్రుహతో గాంధీ చూపిన దారిపై దృష్టి సారించి..ఖాదీకి పెద్ద పీటవేశారు. ఎందుకంటే..ఖాదీకి పరిమిత విద్యుత్ సరిపోతుంది. అంతేగాదు ఒక మీటరు ఖాదీకి మూడు లీటర్ల నీరు చాలు. అదే మిల్లులో ఉత్పత్తి అయ్యే బట్టకు 55 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అలా స్వతంత్ర పోరాటానికి చిహ్నమైన ఖాదీ ఫ్యాషన్ పరిశ్రమలో తన దైన ముద్రవేసి అందరికీ చేరువయ్యింది. అంతేగాదు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ప్రకారం, 2013-14 ఏడాదిలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తి ₹811.08 కోట్లు అయితే, 2023-24లో అది ₹3,206 కోట్లకు చేరుకుంది. ఇక 2022-23 ఏడాదికల్లా ఖాదీ వస్త్రాల ఉత్పత్తి ₹2,915.83 కోట్లుగా ఉండటం విశేషం.(చదవండి: బాపూ సమరం తెరపై చూపుదాం) -
రాజఘాట్ లో నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
-
గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. -
మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ:ఈరోజు (అక్టోబర్ 2) జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగా మహాత్ముని సేవలను దేశ ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు. అలాగే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తున్నారు.#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने महात्मा गांधी की जयंती के अवसर पर राजघाट पर उन्हें श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/MR16VWiugs— ANI_HindiNews (@AHindinews) October 2, 2024ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(మంగళవారం) ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని, మహాత్మునికి నివాళులు అర్పించారు. జాతిపితను స్మరించుకుంటూ, బాపూజీ జయంతి సందర్భంగా దేశప్రజలందరి తరపున ఆయనకు నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో రాశారు. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆయన జీవితం, ఆదర్శాలు ఎల్లప్పుడూ దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన మహాత్మా గాంధీ స్వాతంత్య్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించారు. గాంధీ చేపట్టిన ఉద్యమాలు దేశ ప్రజలను స్వాతంత్య్ర పోరాటానికి పురిగొల్పాయి. జాతిపిత మహాత్మాగాంధీ నాడు చూపిన తెగువ, అంకితభావాన్ని నేడు అందరూ గుర్తుచేసుకుంటున్నారు.सभी देशवासियों की ओर से पूज्य बापू को उनकी जन्म-जयंती पर शत-शत नमन। सत्य, सद्भाव और समानता पर आधारित उनका जीवन और आदर्श देशवासियों के लिए सदैव प्रेरणापुंज बना रहेगा।— Narendra Modi (@narendramodi) October 2, 2024లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా గాంధీ పుట్టినరోజున అంటే అక్టోబర్ 2వ తేదీనే జరగడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని కూడా గుర్తు చేసుకున్నారు. దేశ సైనికులు, రైతుల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శాస్త్రికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. देश के जवान, किसान और स्वाभिमान के लिए अपना जीवन समर्पित करने वाले पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि।— Narendra Modi (@narendramodi) October 2, 2024ఇది కూడా చదవండి: అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు -
బాపూ సమరం తెరపై చూపుదాం
‘రక్త మాంసాల దేహంతో అలా ఓ మనిషి ఈ నేలమీద నడయాడాడని చెబితే, ముందు తరాల వారు నమ్మరు’ అన్నాడు ఐన్‌స్టీన్. టాల్ స్టాయ్, జోసెఫ్ స్టాలిన్, విన్స్టన్ చర్చిల్, జె.ఎఫ్. కెన్నెడీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా దాకా... ఎందరో గాంధీజీ వల్ల ప్రభావితం అయ్యారు. గాంధీజీ ఆత్మకథ పిల్లలందరూ చదవాలి. లేదా కనీసం ఆయన పై వచ్చిన సినిమాలు చూడాలి. గాంధీపై వచ్చిన కొన్ని సినిమాలు. అలాగే గాంధీ గారి వల్ల వచ్చిన సినిమాలుమోడర్న్ టైమ్స్: 1936లో వచ్చిన ఈ సినిమా నేటికీ గొప్ప క్లాసిక్‌గా నిలిచి ఉంది. యంత్రం కంటే మానవుడే గొప్పవాడు అని చెప్పే సినిమా అది. చార్లి చాప్లిన్ ఈ సినిమా తీసి నటించడానికి కారణం గాంధీ మహాత్ముడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ లండన్ వెళ్లినప్పుడు అక్కడ చార్లీ చాప్లిన్‌ను కలిశాడు. అప్పటి వరకూ చార్లీ చాప్లిన్ యంత్రాలు మనుషులను శ్రమ నుంచి విముక్తి చేస్తాయని భావించాడు. కాని గాంధీజీ చెప్పిన మాటల వల్ల యంత్రాలు మనిషికి సహాయం చేయడం కంటే అతడికి పని కోల్పోయేలా చేయడమే గాక బానిసగా చేసుకుంటున్నాయని అర్థం చేసుకున్నాడు. ఆ ప్రభావంతోనే చాప్లిన్ మోడర్న్ టైమ్స్ తీశాడు.ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ: భారతదేశంలో గాంధీ అడుగు పెట్టి బ్రిటిష్ వారిపై పోరాడక ముందు దక్షిణాఫ్రికాలో ఆయన వర్ణ వివక్షపై పోరాడాడు. గాంధీలోని పోరాటగుణం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలిచే సాహసం దక్షిణాఫ్రికాలోనే రూపుదిద్దుకున్నాయి. అక్కడ ఒక చలిరాత్రి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి గాంధీని కిందకు దించి అవమానించారు, ఆయన దగ్గర టికెట్ ఉన్నా, నల్లవాళ్లు ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించకూడదని. ప్రతి వ్యక్తికీ ఆత్మగౌరవంతో, స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో, సమాన భావనతో జీవించే హక్కు ఉందని చాటడమే గాంధీజీ జీవన సందేశం. అది ‘ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా’లో చూడవచ్చు. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1996లో విడుదలైంది. రజత్ కపూర్ గాంధీగా నటించాడు.లగే రహో మున్నాభాయ్: గాంధీజీ అంటే చౌరస్తాలో కనిపించే ఒక విగ్రహం కాదు, గాంధీ జయంతి రోజు స్కూళ్ల సెలవుకు కారణమయ్యే ఒక వ్యక్తి కాదు... గాంధీజీ అంటే జీవన మార్గదర్శి. జీవితం నిర్భయంగా సాగాలంటే గాంధీజీ అనుసరించిన మార్గంలో నడిస్తే చాలు. ఆశ, దురాశ, అవినీతి, ఆడంబరం... ఇవన్నీ లేకపోతే జీవితం సులభంగా ఉంటుందని చెప్పే సినిమా ‘లగే రహో మున్నాభాయ్’. 2006లో వచ్చిన ఈ సినిమా గాంధీజీని కొత్త తరానికి మరోసారి పరిచయం చేసింది. అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాను రాజ్ కుమార్ హిరాణి సాధించాడు. వీధి రౌడీగా ఉండే ఒక వ్యక్తి గాంధీ ప్రభావంతో ఎలా మారాడనేది కథ. సంజయ్ దత్ హీరో.గాంధీ మై ఫాదర్: ఇది మొదట తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. మహాత్ములు విశాల ప్రజానీకం కోసం ఎన్ని త్యాగాలు చేసినా కుటుంబం దృష్టికోణంలో వాళ్లేమిటి అనేది కూడా ముఖ్యమే. మహాత్మునిగా గాంధీజీ ఆరాధ్యనీయుడు. కాని సొంత కొడుకు దృష్టిలో ఆయన గొప్ప తండ్రిగా ఉన్నాడా? గాంధీ కుమారుడు హరిలాల్ తన తండ్రి గాంధీలా లేదా గాంధీ అనుయాయుల్లా ఏనాడూ వెలుగులోకి రాలేదు. తండ్రి మీద ఎన్నో ఫిర్యాదులు పెట్టుకున్నాడు. అతని ఆత్మకథ ఆధారంగా తీసిన సినిమా ‘గాంధీ మై ఫాదర్’. 2007లో వచ్చిన ఈ సినిమాలో గాంధీ కుమారుడు హరిలాల్గా అక్షయ్ ఖన్నా నటించాడు.గాంధీ: మన మహాత్ముని సినిమాను మన దర్శకులు తీయలేకపోయినా బ్రిటిష్ డైరెక్టర్ తీశాడు. ఏ బ్రిటిషర్ల మీద గాంధీజీ పోరాడారో ఆ బ్రిటిష్ జాతి నుంచి అటెన్ బరో వచ్చి ఈ సినిమా తీసిప్రాయశ్చిత్తం చేసుకున్నాడని భావించాలి. గాంధీ జీవితంపై సినిమా తీసేందుకు 1952 తర్వాత నుంచి ప్రయత్నాలు జరిగాయి. రిచర్డ్ అటెన్ బరోనే 1960ల్లోనే ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు 1980 నవంబర్‌లో అటెన్ బరో ఈ సినిమా షూటింగ్ప్రారంభించారు. 1981 మే నెలలో షూటింగ్ పూర్తి అయింది. గాంధీ పాత్రను బెన్ కింగ్స్లే పోషించారు. నెహ్రూ పాత్రలో రోషన్ సేథ్, గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే పాత్రలో హర్‡్ష నాయర్ నటించారు. 1982 నవంబర్ 30న ఢిల్లీలో విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమాను అమెరికా, బ్రిటన్ లలో కూడా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమాకు గొప్ప స్పందన వచ్చింది. గొప్ప కలెక్షన్లు సాధించింది. ఆస్కార్ పురస్కారాలను గెలుచుకుంది. మహాత్మాగాంధీని తెరపై కళ్లకు కట్టినట్లు చూపిన బెన్ కింగ్స్లేకి ఆస్కార్ అవార్డు లభించింది. -
డాలస్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సస్: డాలస్‌లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ కార్యదర్శి రావు కల్వాల అందరికీ స్వాగతం పలుకుతూ వారాంతం కాకపోయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందదాయకమని, మహాత్మాగాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చెయ్యడానికి విశేష కృషిచేసి, నాయకత్వం వహించిన ప్రవాసభారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూరకు, సహకరించిన అధికారులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశం భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమని, స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని, దేశస్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగంచేసిన సమరయోధులు అయినా గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఘన నివాళులర్పించారు.ఎన్నో దశాబ్దాలగా ఇక్కడ నివాసముంటున్న ప్రవాస భారతీయులు అమెరికాదేశ విధి విధానాలను గౌరవిస్తూ, ఎన్నికలలో పాల్గొంటూ, ఇక్కడి జనజీవన స్రవంతిలో మమేకం అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు... మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులు సుష్మా మల్హోత్రా, బి.ఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, జగజిత్లు అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు - సత్యన్ కల్యాణ్ దుర్గ్, శాంటే చారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని మొదలైన వారు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన “జనయిత్రీ దివ్యధాత్రి” గీతం లెనిన్ వేముల శ్రావ్యంగా గానంచేసి అందరినీ పరవశుల్ని చేశారు. -
బాపు ఘాట్ వద్ద ప్రధాని మోదీ నివాళులు
-
మనం మరచిన గాంధీజీ రక్షకుడు..
జాతిపిత మహాత్ము ప్రాణాలు కాపాడిన ఓ త్యాగశీలి జన్మదినం నేడు. ఆయన పేరు బతఖ్ మియా అన్సారీ. 1869 జూన్ 25న బిహార్‌లోని మోతీహార్ గ్రామంలో జన్మించారు. బిహార్ లోని చంపారణ్ జిల్లాలో ఆహార పంటలు వదలి, నీలిమందు లాంటి వాణిజ్య పంటలు పండించమని బ్రిటిష్ వలస పాలకులు రైతులను నిర్బంధించేవారు, హింసించేవారు. ఈ అకృత్యాలను వివరించి అక్కడి రైతులను పరామర్శించమని ఆ ప్రాంతంవారు కొందరు గాంధీజీని అభ్యర్థించారు.దీంతో 1917 ఏప్రిల్‌లో ఆయన అక్కడికి వెళ్లారు. దీంతో ఇర్విన్ అనే బ్రిటిష్ ఇండిగో ఎస్టేట్ మేనేజర్ గాంధీజీని భోజనానికి ఆహ్వానించి అంతం చేయాలని పథకం పన్నాడు. తన వంటమనిషి బతఖ్ మియా అన్సారీని పిలిచి, గాంధీజీకి పాలలో విషం కలిపి ఇచ్చి చంపాలని ఆదేశించాడు.ఈ పని చేస్తే జీతం పదింతలు పెంచుతాననీ, విలువైన భూములు ఇస్తాననీ చెప్పాడు. బాబూ రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి గాంధీజీ భోజనానికి వచ్చారు. ఇర్విన్ ఆజ్ఞను ధిక్కరిస్తే గతి ఏమవుతుందో తెలిసినప్పటికీ, పాలు అందిస్తూనే అందులో విషం కలిపిన విషయాన్ని ఆయన గాంధీజీకి చెప్పి ఆయన ప్రాణాలు రక్షించారు. అగ్గిమీద గుగ్గిలమైన ఇర్విన్ ఆ తరువాత అన్సారీ ఇంటినీ, ఆయనకున్న కొద్దిపాటి భూమినీ జప్తుచేయించి ఊరి నుండి వెళ్ళగొట్టాడు.1950లో మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మోతీహార్ వెళ్ళి ఒక సభలో ప్రసంగిస్తుండగా తనను కలవడానికి ప్రయత్నిస్తున్న అన్సారీని వేదికపైకి పిలిచి ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. ఇర్విన్ అకృత్యాలు విని విచలితుడై అప్పటికప్పుడు 50 ఎకరాల భూమిని అన్సారీ, ఆయన ముగ్గురు కుమారుల కుటుంబాలకూ కేటాయించాల్సిందిగా ఆదేశించారు. అన్సారీ ఏడేళ్ళపాటు కార్యాలయాల చుట్టూ తిరిగినా రాష్ట్రపతి ప్రకటించిన భూమి ఆయనకు దక్కలేదు.చివరికి 1957 డిసెంబర్ 4న కన్నుమూశారు. మొత్తంమీద ఒక ఆరు ఎకరాల భూమిని ఓ నది ఒడ్డున జిల్లా కలెక్టర్ కేటాయించారు. ప్రస్తుతం నది కోతకు గురై ఐదెకరాల భూమి మాయమై ఎకరం మిగిలింది. ఇప్పటికీ తమకు రావలసిన భూమికోసం అన్సారీ కుటుంబీకులు అర్జీలు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. – ఎమ్.డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ -
జీ7సమ్మిట్‌కు ముందు.. ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం
రోమ్: జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటలీలో ఖలిస్తానీ తీవ్రవాదులు బుధవారం(జూన్12) ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా మరణించిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన నినాదాలను అక్కడ రాసి వెళ్లారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. ఇటలీ విదేశీవ్యవహారాల శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వత్రా తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే విగ్రహ శిథిలాలను ఇటలీ ప్రభుత్వం అక్కడినుంచి తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించింది.ప్రధాని మోదీ జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్న తరుణంలో ఈ దుశ్చర్యకు తీవ్రవాదులు ఒడిగట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇటలీలోని ఎపులియాలో జూన్ 13 నుంచి 15దాకా జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. జీ7లో భారత్ సభ్య దేశం కానప్పటికీ మోదీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్నారు. -
మహాత్ముడికి మోడీ నివాళి
-
అట్లాంటాలోని గాంధీ విగ్రహానికి తెలంగాణ ఐటీ మంత్రి నివాళులు
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అట్లాంటాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్ఏ (ఎఊ్ఖ అ) ఆహ్వానం మేరకు అట్లాంటా వెళ్లిన ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్లోని గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ హాల్, గాంధీ రూమ్, కింగ్ రూమ్, ఎటర్నల్ ఫ్లేమ్, ప్రసిద్ధ ఎబినేజర్ బాప్టిస్ట్ చర్చి, కింగ్స్ బర్త్ హోమ్, విజిటర్స్ సెంటర్, కింగ్ క్రిప్ట్‌లను సందర్శించారు.అట్లాంటాలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు సాకారం చేసినందుకు ఇండియన్ ఎంబసీ, ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, వివిధ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌తో పాటు నేషనల్ పార్క్ సర్వీస్‌కు శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ స్మారక చిహ్నం ఏటా కింగ్ పార్క్‌ను సందర్శించే లక్షలాది మంది పర్యాటకులకు అహింస, శాంతి కోసం పోరాడాలనే విషయం గుర్తుకుతెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, జీఎఫ్‌యూఎస్‌ఏ మీడియా డైరెక్టర్ రవి పోణంగి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోనీ థాలియాత్, ఛైర్మన్ సుభాష్ రజ్దాన్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోని గాంధీ ఫౌండేషన్‌ను 1997 అక్టోబర్ 26న స్థాపించారు. -
డబ్బులు పంచనందుకే ఎన్నికల్లో ఓడిపోయా: తెలంగాణ గవర్నర్
సాక్షి, హైదరాబాద్: మహత్మా గాంధీ టెంపుల్ ట్రస్ట్ (హైదరాబాద్) ప్రతినిధుల బృందం ఆదివారం తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ బృందం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘‘ఒటర్ అవేర్నెస్ అండ్ ఎథికల్ ఓటింగ్ క్యాంపెయిన్’’ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని మే 1 నుంచి మే 13 వరకు నిర్వహించామని గవవర్నకు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు వారికి గవర్నర్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా మద్యపాన నిషేధంపై కూడా అవగాహాన కార్యక్రమం చేపట్టాలని గాంధీ టెంపుల్ ట్రస్ట్ బృందానికి ఆయన సూచించారు. ఇక.. ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు, ఓటు వేసే ఓటర్లు.. మద్యం, డబ్బు ముట్టుకోమని ప్రతిజ్ఞ చేయాలన్నారు. అయితే తాను కూడా ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేశాని తెలిపారు. ఓటర్లకు ఎట్టిపరిస్థితులు డబ్బు పంచకూడదని ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయినట్లు తెలిపారు.ఈ ట్రస్ట్ బృంద ఏపీ, తెలంగాణలోని 22 ప్రాంతాల్లో ఓటర్లకు అవగాహన కల్పించారు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. ఏపీలో వైజాగ్, రాజమండ్రీ, కాకినాడ, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు, తెనాలి, నార్సరావుపేట, ఒంగోల్, నెల్లూరు, కర్నూల్, తిరుపతి, చిత్తూరు, కడప ప్రాంతాలో గాంధీ టెంపుల బృందం ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించింది.గవర్నర్ కలిసిన బృందంలో మహత్మా గాంధీ టెంపుల్ ట్రస్ట్ (హైదరాబాద్) అధ్యక్షులు భోపాల్ మోరా, సెక్రటరీ వీపీ కృష్ణారావు, సలహాదారులు వీపీ రావు, నగేంద్రరెడ్డి, ట్రస్టీలు డా. సీత, నర్సిరెడ్డిలు ఉన్నారు. -
గాంధీ మార్గంలో ప్రచారం.. భేష్ అంటున్న జనం!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ జరగని స్థానాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నాయకులు వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే గుజరాత్‌లోని పోర్బందర్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రత్యేక రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. పోర్బందర్.. జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. అందుకే మన్సుఖ్ మాండవియా.. మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకుని ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.మన్సుఖ్ మాండవియా గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తూ రోడ్ షోలకు దూరంగా ఉంటున్నారు. ఈ పాత విధానంలో ప్రచారానికి కారణమేమిటని విలేకరులు అడగగా, ఆయన తాను పోర్బందర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందుకే మహాత్మాగాంధీ పాదయాత్రలు చేపట్టిన మాదిరిగా ప్రచారం కొనసాగిస్తున్నానని అన్నారు.తన ఎన్నికల పాదయాత్ర ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు వస్తున్నదని ఆయన తెలిపారు. కాలినడకన ఇంటింటికీ ప్రచారం చేయడం వల్ల ఎన్నికల ఖర్చు కూడా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఖర్చులు తగ్గించాలని అన్నారు. బహిరంగ సభ నిర్వహిస్తే, వేడి వాతావరణంలో జనం కూర్చోలేరని, అందుకే ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కాగా పోర్బందర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయాపై మాండవ్య పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. -
మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన సీఎం జగన్
-
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ‘‘సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/JzQs860tFe — YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2024 -
అందుకే ఆయన మహాత్ముడు
అవి గాంధీ మహాత్ముడు మొట్టమొదటిసారిగా ప్రజా జీవితంలో అడుగు పెట్టినప్పటి రోజులు. ఓరోజు గాంధీజీ తన మిత్రుడితో కలిసి అతని కారులో ప్రయాణం చేస్తున్నారు. గాంధీజీ అలా ప్రయాణం చేయడం నచ్చని కొందరు వ్యతిరేకులు ఆయనకు అడ్డంకులు కల్పించడానికి గాను ఓ చెట్టు చాటు నుంచి కారుపై రాళ్లు రువ్వారు. రాళ్ళు కారుమీద పడగానే గాంధీజీ మిత్రుడితో కారును ఓ పక్కగా ఆపమన్నారు. అనంతరం ఆయన నెమ్మదిగా కారు లోంచి కిందకు దిగారు. చుట్టూ చూశారు. కనుచూపుమేరలో ఓ చెట్టు దగ్గర నిల్చున్న కొందరిని గాంధీజీ చూశారు. వారు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. దాంతో తిన్నగా వారి దగ్గరకు వెళ్లారు. కారు మీద రాళ్ళు విసిరిన వారు వారే అయి ఉండొచ్చని అనుకున్నారు. వారిని సమీపించి ‘‘మీకు నా మీద కోపం ఉండొచ్చు. కాదనను. ఆ కోపం మీ వరకూ సబబే కూడా అయి ఉండొచ్చు. అది కూడా నేను కాదనను. అయితే, మీ కోపాన్ని చూడానుకుంటే రాళ్ళు నామీద విసరాలే తప్ప పాపం ఈ కారు ఏం చేసింది? అంతేకాదు, ఆ కారు కూడా నాది కాదు. నా మిత్రుడిది. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు మీ కోపాన్నినా మీద చూపండి. ఇదిగో మీముందే నిల్చున్నాను. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి, నేను మీ ముందు ఒంటరిగా నిల్చున్నాను. నన్ను మీరేమైనా చేసుకోవచ్చు. అందుకు నేనేమీ అనుకోను. కారు మీద రాళ్ళు విసరడం మాత్రం తప్పు. ఎందుకంటే అది మిమ్మల్నేమీ చెయ్యలేదు. చెయ్యదు కూడా. అయినా మీరు రాళ్లు విసరడం వల్ల అది నాశనమవుతుంది. అప్పుడు నా మిత్రుడు బాధపడతాడు. నష్టం అతనికి తప్ప నాకు కాదుగా...’’ అని గాంధీజీ చెప్పడంతో ఆయనను ఆట పట్టించాలనుకున్న వాళ్ళు గాంధీజీ మాటలకు సిగ్గుపడి తల దించుకున్నారు. కాస్సేపు అక్కడ మౌనం తాండవించింది. అనంతరం ఆ అల్లరిమూక గాంధీజీ కాళ్ళపై పడి తమను క్షమించాలని అడిగారు. గాంధీజీ చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా వారితో కరచాలనం చేశారు. క్షమ లేకనే మనం మామూలు వాళ్లలా ఉన్నాము. క్షమాగుణం వల్లనే గాంధీజీ మహాత్ముడయ్యాడు. అందుకే క్షమ కలవాడు అందరికన్నా బలమైన వాడని సామెత. – డి.వి.ఆర్. -
రూ.500 నోటుపై గాంధీ స్థానంలో శ్రీరాముడు..?
-
వాస్తవ రూపంలో ‘దున్నేవాడిదే భూమి’
‘ఎవరెన్ని చెప్పినా పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదు. మన ప్రభుత్వం నమ్రతతో ఈ సత్యాన్ని అంగీకరించి తీరాలి’ అని ఒకప్పుడు కఠోర సత్యం చెప్పారు మహాత్మా గాంధీ. కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కూడా ఆ ధోరణిలో మార్పు రాలేదు. తరాలుగా పేద ప్రజలు కాయకష్టం చేసి సంపద సృష్టిస్తున్నారు. అలాంటి పేద ప్రజలకు నిర్ణయాధికారం లేదు. వారి యాజమాన్య హక్కులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాణం పోశారు. అసైన్డ్ భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించడం ఒక చారిత్రక నిర్ణయం. దశాబ్దాలుగా పోరాటాల రూపంలో వెల్లడైన పేదల కాంక్షలకు నేటి ఈ నిర్ణయం అంతిమ విజయంగా భావించుకోవాలి. ‘‘కోట్లాది దేశ ప్రజలకు ఆహార పంటలు అందించే రైతులకన్నా దేశంలోని పెట్టుబడి దారులకే ప్రభుత్వాలు సర్వ సౌకర్యాలు కల్గిస్తున్నాయి. ఇది కంటికి కన్పించే నగ్న సత్యం. నేను పెట్టుబడిదారులకు వ్యతిరేకిని కాదు. నిజం చెప్పాలంటే, నేను ఒక పెట్టుబడిదారుడికి చెందిన ఇంట్లోనే ఉంటు న్నాను. కానీ పెక్కుమంది పెట్టుబడిదారుల వైఖరి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రభుత్వాలు మాత్రం తాము పేద ప్రజలకు చేయవలసిందంతా చేస్తున్నామని పైకి చెప్పొచ్చుగాక. ఆ మాటకొస్తే వలస పాలకు లైన బ్రిటిష్ వాళ్ళు కూడా అలాగే చెబుతూండేవాళ్లు. అసలు సత్యం ఏమంటే – ఎవరెన్ని చెప్పినా పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదు. మన ప్రభుత్వం నమ్రతతో ఈ సత్యాన్ని అంగీకరించి తీరాలి. అంతేగాదు, ఏ ప్రయివేట్ ఆస్తి అయినా సరే, అది సిగ్గుఎగ్గూ లేకుండా దొంగిలించిన ఆస్తిగానే నేను పరిగణిస్తాను. ఎవరైనా సరే తన కాయకష్టం ద్వారా సంపాదించని ఆస్తి, లేదా బతుకుతెరువుకు అవసర మైన కనీస శ్రమ ఫలితంగా దక్కని సొమ్ము... సిగ్గూ ఎగ్గూ లేని సంపా దన అవుతుంది.’’ – మహాత్మా గాంధీ (11.12.1947). వి. రామ్మూర్తి ‘హిందూ’ పత్రిక తరఫున ఎడిటర్‌గా సంకలనం చేసి ‘కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ (చెన్నై) తరఫున 2003లో ప్రచురించిన గ్రంథం నుంచి. తరాలుగా పేద ప్రజలు కాయకష్టం చేసి సంపద సృష్టిస్తున్నారు.ఆ బడుగు, బలహీన వర్గాలకు చెందిన హక్కులను మొట్టమొదటి సారిగా సాధికారికంగా క్రోడీకరించి... ‘దున్నేవాడిదే భూమి’ అన్న దశాబ్దాల వామపక్ష ఉద్యమాల స్ఫూర్తిని కొలది రోజుల నాడు ఆచరణలోకి తెచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేద ప్రజల సాగు హక్కులకు ప్రాణం పోశారు. దీనితో పది రకాల వ్యాఖ్యా నాల ద్వారా పేదల భూమి హక్కులను, సాగు హక్కులను తారు మారు చేసే మోతుబరుల ప్రయత్నాలకు స్వస్తి పలికారు. రాష్ట్రంలో మరే ప్రభుత్వం వచ్చినా, దీన్ని చెదరగొట్టే ప్రయత్నాలు చెల్లవు. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టే శక్తినిచ్చేదే ఈ ముందడుగు. వామపక్షాలు దశాబ్దాల తరబడిగా ఆంధ్ర, తెలంగాణలలో కౌలు దారీ చట్టాల కోసం చేస్తూ వచ్చిన పోరాటాలతో సాధించిన పాక్షిక విజయాలకు... నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు అసైన్డ్ భూములపై హక్కులు ఇచ్చిన తీరు భూ చరిత్రలో అంతిమ విజయంగా భావించుకోవాలి. పేదలకు ఈ యాజమాన్య హక్కులు రావడం వలన వారు అవసరం అయితే తమ భూమిని విక్రయించుకోవచ్చు. ఇక, ఇంతకుపూర్వం కౌలు రైతులకు రుణాలు పొందే అర్హత కార్డులు ఉండేవి కావు. ఈ కార్డులు లేకనే బ్యాంకులు రుణాలివ్వలేదు. ఎంతసేపూ భూములకు పట్టాలున్న రైతుల్నే గుర్తిస్తారు. కౌలు రైతులను గుర్తించేది లేదన్న వైఖరిని కేసీఆర్ లాంటి నాయకులు కనబరిచారు. ఏదైనా ఇంట్లో అద్దెకు ఉంటే, ఆ ఇంటిపై హక్కు అతనికి ఇవ్వగలమా అని కూడా ప్రశ్నించారు. కానీ ఒకప్పుడు వై.ఎస్. రాజ శేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో నాలుగు లక్షల మందికి పైగా కౌలు రైతులు రుణ అర్హత కార్డులు పొందారు. తద్వారా అనేకమంది బ్యాంకు రుణాలు పొందగలిగారు. కౌలుదారులకు విధిగా వర్తించాల్సిన రక్షణ చట్టాల కోసం సుదీర్ఘ పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. ఆంధ్ర–తెలంగాణ వామపక్ష నాయకులు ఆ యా ప్రాంతాలలో విడివిడిగానూ, ఉమ్మడి గానూ కలిసి పోరాటం జరిపారు. చండ్రరాజేశ్వర్రావు, చలసాని వాసుదేవరావు, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, ఎస్వీకే ప్రసాద్– సుగుణ దంపతులు లాంటివాళ్లు ఇందులో ఉన్నారు. ఉభయ రాష్ట్రాల చరిత్రలో తొలి భూపోరాటాలు, పాక్షిక విజయాలన్నీ వామపక్షాల నేతృత్వంలోనే సాధ్యమయ్యాయి. ఒక్క ముక్కలో, పాత ఫ్యూడల్ శక్తులకు ముగుదాడు వేసి సాధించిన విజయాలన్నీ వామపక్షాలు బలంగా ఉన్నప్పటివే. అవి ఎప్పుడు బలహీనపడ్డాయో అప్పటినుంచీ పటిష్ఠమైన పార్టీగా ఉమ్మడి వామపక్షాల మాట గతకాలపు ‘ముచ్చట’గానే మిగిలి పోయింది. కానీ ప్రస్తుత దశ వేరు. కార్పొరేట్ శక్తుల చేతిలో దేశం నడుస్తున్నది. చాలక, వారి ఆధ్వర్యంలో ప్రసార మాధ్యమాలు కూడా లొంగిపోతున్నాయి. దేశీయ, విదేశీయ ఆశ్రిత పెట్టుబడుల పెత్తనం స్వతంత్ర భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను పాతి పెట్టింది. ఈ దుఃస్థితిని కనిపెట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, ‘రానున్న రోజుల్లో ప్రజలు పార్లమెంట్‌ను కూల్చేస్తా’రని ముందుగానే హెచ్చరించారు. గత పదేళ్లుగా ప్రతియేటా భారత పరిశోధనా సంస్థ ‘ఏడీఆర్’ నివేదికలు విషాద వాస్తవాన్ని చెబుతున్నాయి. అటు పార్లమెంట్ సభ్యులలో (అన్ని రకాల పార్టీల వాళ్ళు), ఇటు రాష్ట్రాల శాసన సభ్యులలో, మంత్రులలో ఎంత భారీ స్థాయిలో అవినీతి పేరుకు పోయిందో, సవరణకు వీలుకాని స్థాయిలో అవినీతి ఎలా రాజ్య మేలుతోందో ఏడీఆర్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే మన పాలకుల్ని ఉద్దేశించి ఒక మహాకవి ఇలా హెచ్చరించాడు:‘విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే పరిణతమతి ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే!’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాకులు abkprasad2006@yahoo.co.in -
బ్రెజిల్లో ఫుట్‌బాల్ ఆడుతున్న మహాత్మాగాంధీ!
రియో డీ జెనెరో : బ్రెజిల్లో కుర్రాళ్లు ఫుడ్‌బాల్ ఆడడంలో వింతేం లేదు. ఆ దేశంలో ఫుట్‌బాల్‌కు ఇండియాలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.అయితే ఓ యువ ఫుట్‌బాల్ ప్లేయర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.దీనికి కారణం అతని ఆట తీరో ఇంకొకటో కాదు.అతని పేరులోని గొప్పతనం. బ్రెజిల్‌లోని ట్రిండేడ్ ఫుట్‌బాల్ క్లబ్లో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్న 31 ఏళ్ల ఆ ఆటగాడి పేరు మహాత్మాగాంధీ హెబెర్పియో మట్టోస్ పిరెస్.దీంతో అందరి దృష్టి అతడిపై పడుతోంది.2011 నుంచి మహాత్మా గాంధీ క్లబ్ తరపున ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. మహాత్మాగాంధీ ఒక్క పేరే కాకుండా బ్రెజిల్‌లోని ఫుట్‌బాల్ క్లబ్బుల్లో చాలా మంది ఆటగాళ్లకు ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల పేర్లుండడం విశేషం.ఒక ఆటగాడికి బీటిల్స్ సింగర్ జాన్ లెన్నన్ పేరుండగా మరో ఆటగాడు బ్రెజిల్ ఫుట్‌బాల్ టీమ్‌లలో ఒకటైన పికాచు అనే పేరు పెట్టుకున్నాడు.ఇవే కాకుండా మర్లన్ బ్రాండో,మస్కిటో లాంటివి ఇంకా చాలా అందరి దృష్టిని ఆకర్షించే పేర్లున్న ఆటగాళ్లున్నారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకారం జాతిపిత మహాత్మాగాంధీ 1893 నుంచి 1915 వరకు దక్షిణాఫఫ్రికాలో ఉన్నపుడు అక్కడ మూడు ఫుట్‌బాల్ టీమ్‌లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. జోహెన్నెస్ బర్గ్, ప్రిటోరియా, డర్బన్ ఫుట్‌బాల్ క్లబ్లును గాంధీ స్వయంగా స్థాపించారు.దీంతో ఫుట్‌బాల్ క్రీడపై గాంధీ చెరగని ముద్ర వేసినట్లయింది. ఇదీ చదవండి.. ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? -
గాంధీ వాడిన ఊతకర్ర కథ ఏమిటి? ఇప్పుడు ఎక్కడుంది?
దండి మార్చ్‌కు ముందు.. ఆ తరువాత గాంధీ ఫోటోల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఊతకర్ర. గాంధీ 1930లో దండి మార్చ్‌తో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చేతిలో ఊతకర్ర చేరింది.ఇంతకీ ఈ ఊతకర్ర కథ ఏమిటి? దీనిని ఎవరు గాంధీకి ఇచ్చారు? 1930, మార్చి 12న తన 60 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుండి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి చారిత్రాత్మక యాత్రకు బయలుదేరారు. అప్పుడు గాంధీ సహచరుడు, స్నేహితుడు కాకా కలేల్కర్ మహాత్మునికి ఊతమిచ్చేందుకు ఒక కర్ర అవసరమని భావించారు. గాంధీ సాగించే అంత సుదీర్ఘ నడకలో ఆ కర్ర ఉపయోగకరంగా ఉండవచ్చనుకున్నారు. ఈ ఊతకర్రను తీసుకుని గాంధీ 24 రోజుల పాటు ప్రతిరోజూ పది మైళ్లు నడిచేవారు. ఈ నేపధ్యంలోనే ఆ ఊతకర్రకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. కాగా గాంధీ తన జీవితంలో అనేక ఊతకర్రలను ఉపయోగించారు. అయితే ఆయన దండి మార్చ్‌లో ఉపయోగించిన ఊతకర్ర ఆ ఉద్యమానికి ప్రతీకగా మారింది. ఇది గాంధీ ఊతకర్రగా ప్రసిద్ధి చెందింది. ఈ కర్ర బలంగా ఉంటుంది. 54 అంగుళాల ఎత్తు కలిగిన వెదురు కర్ర ఇది. ఈ ప్రత్యేకమైన వెదురు కర్ణాటక తీర ప్రాంతంలోని మల్నాడులో మాత్రమే పెరుగుతుంది. 1948 జనవరి 30వ తేదీ వరకు అంటే గాంధీ హత్యకు గురయ్యే వరకు ఈ ఊతకర్ర గాంధీ దగ్గరే ఉంది. ప్రస్తుతం ఈ ఊతకర్ర న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న నేషనల్ గాంధీ మ్యూజియంలో ఉంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? -
వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? మహాత్ముని అంతరంగ రహస్యం ఏమిటి?
ఇటీవలి కాలంలో వీధి కుక్కల ఆగడాలకు సంబంధించి తరచూ వార్తలు వస్తున్నాయి. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. వీధికుక్కలకు సంబంధించి నాటి రోజుల్లో మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది 1942వ సంవత్సరం. ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. గాంధీ మౌన దీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రోజు కూడా గాంధీ సందర్శకులను కలుసుకునేవారు. ఎదుటివారి మాటలు విని, రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేవారు. ఇదే సమయంలో గాంధీ ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకున్నారు. సుప్రసిద్ధ అమెరికన్ జర్నలిస్ట్ లూయిస్ ఫిషర్ రాసిన ‘ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ’ పుస్తకం గాంధీజీ జీవితానికి సంబంధించిన అత్యంత విశ్వసనీయ పుస్తకంగా పరిగణిస్తుంటారు. ఈ పుస్తకంలోని 10వ అధ్యాయంలో ఒక ఉదంతం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ తన మిల్లు ఆవరణలో తిరుగుతున్న 60 వీధికుక్కలను పట్టుకుని చంపాడు. అనంతరం గాంధీజీ దగ్గరకు పరుగున వచ్చి, తన భయాన్ని, బాధను వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ అహ్మదాబాద్‌లోని జీవ్ దయా సమితికి ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంగా వారు గాంధీజీకి రాసిన లేఖలో ‘హిందూ మతంలో ఏదైనా ప్రాణిని చంపడాన్ని పాపంగా భావించినప్పుడు, పిచ్చి కుక్కలను చంపడం సరైనదని మీరు ఎలా అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. దీనికి గాంధీ ఇచ్చిన సమాధానాన్ని ‘యంగ్ ఇండియా’లో ప్రచురించారు. ‘మనలాంటి అసంపూర్ణులు, మందబుద్ధిగలవారికి కుక్కలను చంపడం తప్ప మరో మార్గం లేదు. కొన్నిసార్లు మనని హత్య చేసేందుకు ప్రయత్నించే వ్యక్తిని చంపడమనే అనివార్యమైన విధిని మనం ఎదుర్కొంటాం’ అని గాంధీ పేర్కొన్నారు. ఈ కథనంపై ఆగ్రహంతో పలువురి నుంచి గాంధీకి లేఖలు వెల్లువెత్తాయి. చాలామంది గాంధీని తిట్టడం మొదలుపెట్టారు. అయితే గాంధీ తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారు. ‘యంగ్ ఇండియా’ రెండవ, మూడవ సంచికల్లోనూ గాంధీ తన అభిప్రాయాన్ని ఇదే రీతిలో తెలిపారు. కొందరు విమర్శకులు గాంధీ హద్దులు దాటిపోయారని ఆరోపించారు. ‘ఒకరి ప్రాణం తీయడం కూడా ఒక్కోసారి మన విధిగా మారుతుందని’ గాంధీ ‘యంగ్ ఇండియా’లో రాశారు. ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని పరుగెడుతూ, ఎదురుగా వచ్చిన వారిని చంపుతున్నాడనుకోండి. అప్పుడు అతన్ని సజీవంగా పట్టుకునే ధైర్యం ఎవరికీ లేనప్పుడు, ఆ పిచ్చివాడిని యమపురికి పంపించిన వ్యక్తి.. సమాజం అందించే కృతజ్ఞతకు పాత్రుడని గాంధీ పేర్కొన్నారు. కాగా ఈ కుక్కల వివాదం గాంధీని ఏడాదిపాటు చుట్టుముట్టింది. ఇది కూడా చదవండి: ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి? -
గాంధీ జయంతి సందర్బంగా సీఎం జగన్ నివాళులు
-
గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా! మళ్లీ ఆయన..
మహాత్ముడి అవసరం పెరిగిందిగాంధీజీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. తన సిద్ధాంత బలంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనది. అహింస అనే ఆయుధంతో, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం ‘డూ ఆర్ డై’ ఎందరినో ఉత్తేజితులను చేసింది. ‘విజయమో, వీర స్వర్గమో’ అనే నినాదంతో యావత్ దేశ ప్రజలు ముందుకురికి భారత గడ్డ మీద నుంచి బ్రిటిష్ వారిని తరిమేశారు. మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరం తిరగకుండానే 1948 జనవరి 30న ఆయన హత్యకు గురై దేశాన్ని శోకసంద్రంలో ముంచారు. ఆయన ఘనత ప్రపంచ మంతా గుర్తించింది. అయితే భారతదేశంలో ఆయన్ని మెల్లగా మరచిపోతున్న ధోరణి కనిపించడం బాధాకరం. గాంధీజీ జయంతి సందర్బంగా ఆయన ఆశ యాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేసుకోవ లసిన అవసరం ఉంది. ‘అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్లు ఎప్పుడైతే క్షేమంగా వెళతారో ఆరోజే నా దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని ప్రకటించారు గాంధీ. గాంధీ సహించనివి– మగువలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, హత్యలు, కక్షలు, వైషమ్యాలు. కానీ ఇవే ఎక్కువైన ఈ సమాజంలో ఆయన ఆదర్శం గాలికి కొట్టుకుపోయిందని చెప్పక తప్పదు. మతసామరస్యాన్ని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. కానీ ఇవాళ మత అసహనం పెచ్చరిల్లుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి చంపేసే దృశ్యాలు అనేకం చూస్తున్నాం. నేడు అంతటా, అన్ని రంగాలలో అవినీతి పెచ్చరిల్లింది. గాంధీజీ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా గ్రామాలు స్వయం పోషకత్వం సాధించి ఏ గ్రామానికది ‘స్వరాజ్యం’గా అభివృద్ధి చెందాలనుకున్నారు. మరి ఆయన కలలను మన పాలకులు ఎంతవరకు నెరవేర్చారో సమీక్షించుకోవాలి. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు, తాడిపత్రి ‘ 93915 23027 (చదవండి: తెలంగాణ పోరాట స్ఫూర్తి!) -
మహాత్ముడి అవసరం పెరిగింది
గాంధీజీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. తన సిద్ధాంత బలంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనది. అహింస అనే ఆయుధంతో, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం ‘డూ ఆర్ డై’ ఎంద రినో ఉత్తేజితులను చేసింది. ‘విజయమో, వీర స్వర్గమో’ అనే నినాదంతో యావత్ దేశ ప్రజలు ముందుకురికి భారత గడ్డ మీద నుంచి బ్రిటిష్ వారిని తరిమేశారు. మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరం తిరగకుండానే 1948 జనవరి 30న ఆయన హత్యకు గురై దేశాన్ని శోకసంద్రంలో ముంచారు. ఆయన ఘనత ప్రపంచ మంతా గుర్తించింది. అయితే భారతదేశంలో ఆయన్ని మెల్లగా మరచిపోతున్న ధోరణి కనిపించడం బాధాకరం. గాంధీజీ జయంతి సందర్బంగా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది. ‘అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్లు ఎప్పుడైతే క్షేమంగా వెళతారో ఆరోజే నా దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని ప్రకటించారు గాంధీ. గాంధీ సహించనివి– మగువలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, హత్యలు, కక్షలు, వైషమ్యాలు. కానీ ఇవే ఎక్కువైన ఈ సమాజంలో ఆయన ఆదర్శం గాలికి కొట్టుకుపోయిందని చెప్పక తప్పదు. మతసామరస్యాన్ని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. కానీ ఇవాళ మత అసహనం పెచ్చరిల్లుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి చంపేసే దృశ్యాలు అనేకం చూస్తున్నాం. నేడు అంతటా, అన్ని రంగాలలో అవినీతి పెచ్చరిల్లింది. గాంధీజీ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా గ్రామాలు స్వయం పోషకత్వం సాధించి ఏ గ్రామానికది ‘స్వరాజ్యం’గా అభివృద్ధి చెందా లనుకున్నారు. మరి ఆయన కలలను మన పాలకులు ఎంతవరకు నెరవేర్చారో సమీక్షించుకోవాలి. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు, తాడిపత్రి ‘ 93915 23027 -
వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది?
వినోబా భావే పాత్ర భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినోబా భావే స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడని చెబుతారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే, దేశానికి సేవ చేయాలనే తన సంకల్పాన్ని నిరంతరం కొనసాగించారు. గాంధీజీని కలిసిన తర్వాత తన జీవిత లక్ష్యాలను వినోబా భావే అంకితభావంతో ఎలా సాగించాడో అతని జీవిత ప్రయాణం చెబుతుంది. గాంధీజీ మరణానంతరం మహాత్ముని జీవన విధానాలను సజీవంగా నిలిపివుంచి, దేశ సేవను కొనసాగించిన వారిలో ఆయన ఒకరు. భగవంతునిపై నమ్మకం, ఆధ్యాత్మికతపై ప్రేమ వినోబా భావే 1895 సెప్టెంబర్ 11న మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని గగోడా గ్రామంలో జన్మించారు. చిత్పావ్ బ్రాహ్మణ నరహరి భావే, రుక్మణి బాయిల ఐదుగురు పిల్లలలో వినోబా పెద్దవాడు. వినోబా చిన్నప్పటి నుంచి తెలివైన పిల్లాడిగా గుర్తింపు పొందారు. తల్లి సాంగత్యంలో ఆయనకు మొదటి నుంచీ భగవంతునిపై నమ్మకం, ఆధ్యాత్మికతపై ప్రేమ ఏర్పడింది. తార్కిక ఆలోచనలు కలిగిన వినోబా తన తండ్రి నుండి గణితం, సైన్స్ నేర్చుకున్నారు. తండ్రి చెప్పారని ఫ్రెంచ్, తల్లి కోరిక మేరకు సంస్కృతం.. వినోబా హైస్కూల్‌కు చేరుకున్న తర్వాత అతని తండ్రి వినాయక్ ఫ్రెంచ్ నేర్చుకోవాలని కోరగా, అతని తల్లి సంస్కృతం నేర్చుకోవాలని కోరింది. వినాయక్ హైస్కూల్లో ఫ్రెంచ్ను ఎంచుకున్నారు. తల్లి కోరిక మేరకు ఇంట్లో సంస్కృతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వినాయక్‌కు చదువుపై ఉన్న ఆసక్తి కారణంగా మతపరమైన పుస్తకాలు చదివేవారు. ఫ్రెంచ్ సాహిత్యంతో పాటు వేదాలు, ఉపనిషత్తులు కూడా శ్రద్ధగా చదివారు. ఈ నేపధ్యంలో వినోబా ఆధ్యాత్మిక ఆకలి పెరుగుతూ వచ్చింది. అతను తన జీవిత లక్ష్యాలపై మరింత లోతుగా ఆలోచించేవారు. కాశీలో రైలు దిగిపోయి.. ఆ రోజుల్లో వినోబా చదువుకోసం ముంబై వెళ్లాల్సి వచ్చింది. 1916 మార్చి 25న ముంబై వెళ్లేందుకు రైలు ఎక్కారు. అయితే అక్కడ చదువు పూర్తయ్యాక ఏం చేయాలి? తన జీవిత లక్ష్యం ఏమిటి? ఏం చేయాలి అనే ప్రశ్నలు మనసులో కలకలం రేపాయి. ఇంతలో వినోబా ప్రయాణిస్తున్న రైలు సూరత్ చేరుకుంది. ఆయన అక్కడ రైలు దిగి, హిమాలయాలవైపు పయనమయ్యేందుకు తూర్పు వైపునకు వెళ్లే రైలులో కూర్చున్నారు. అయితే కాశీలో రైలు దిగిపోయాడు. శివుని నివాసమైన కాశీలో తనకు సరైన మార్గాన్ని చూపించగల ఋషులు, సాధువులను కలుసుకోవచ్చని భావించారు. గంగా తీరంలో చాలా కాలం పాటు తిరిగారు. అక్కడ తాను ఆశించినది దొరకకపోవడంతో హిమాలయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వినోబా స్వయంగా గాంధీజీకి లేఖ రాయగా... ఆ సమయంలో యాదృచ్ఛికంగా హిందూ విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరుగుతోంది. దీనిలో గాంధీజీ ధనవంతులకు ఒక విజ్ఞప్తి చేశారు. వారు తమ సంపదను పేదల సేవకు వినియోగించాలని కోరారు. అ అంశంపై జరిగిన చర్చ మరుసటి రోజు దినపత్రికల్లో ప్రచురితమైంది. వినోబాకు ఈ వార్తాపత్రిక కనిపించింది. అందులో గాంధీజీ గురించి చదివిన తర్వాత, గాంధీజీ మాత్రమే తనకు సరైన మార్గాన్ని చూపగలరని వినోబా భావించారు. దీంతో వినోబా స్వయంగా గాంధీజీకి లేఖ రాయగా, గాంధీజీ దానికి సమాధానమిస్తూ ఆహ్వానం పంపారు. ఈ మేరకు వినోబా.. గాంధీజీ ఆశ్రమం ఉన్న అహ్మదాబాద్‌కు బయలుదేరారు. వారిద్దరూ 1916 జూన్ 7న తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితులయ్యారు. గాంధీజీ అతనికి వినోబా అని పేరు పెట్టారు. అంతకు ముందు అతని పేరు(వినాయక్ నరహరి భావే). గాంధీజీని కలిసినది మొదలు వినోబా గాంధేయవాదిగా మారారు. అదే బాటలో జీవితాన్ని కొనసాగించారు. ఇది కూడా చదవండి: ‘భారత్ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా? -
మహాత్ముని పలుకులే భారత్–అమెరికా మైత్రికి మూలం
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సంరక్షణ సూక్తులే భారత్–అమెరికా మధ్య సత్సంబంధాలకు మూలమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మహాత్ముని సమాధి ‘రాజ్‌ఘాట్’లో నివాళులరి్పంచిన సందర్భంగా బైడెన్ పలు ట్వీట్లు చేశారు. ‘ గాం«దీజీ ప్రవచించిన సంరక్షణ సూక్తులే ఇరు దేశాల మధ్య దృఢ బంధానికి మూలం. మన రెండు దేశాలు మధ్య నెలకొన్న పరస్పర నమ్మకం, సంరక్షణ బాధ్యతలే మన పుడమి సంరక్షణకూ దోహదపడుతున్నాయి’ అని అన్నారు. ‘మోదీతో విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా ముగిశాయి. 31 అధునాతన డ్రోన్ల కొనుగోలు, భారత్‌లో జీఈ జెట్ ఇంజిన్ల సంయుక్త తయారీసహా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి’ అని చెప్పారు. ‘ఈ రోజు ఇక్కడికి(రాజ్‌ఘాట్)కు తీసుకొచ్చిన మీకు(ప్రధాని మోదీ) నా కృతజ్ఞతలు. అద్భుతంగా అతిథ్యమిచి్చ, జీ20 సదస్సును సజావుగా నిర్వహించి, కూటమికి విజయవంతంగా సారథ్యం వహించారు. రాజ్‌ఘాట్‌కు రావడం నిజంగా గర్వంగా ఉంది. గాం«దీజీ ఆచరించి చూపిన సత్యం, అహింసా మార్గాలు ప్రపంచానికి ఆచరణీయాలు. ఇవి ఎల్లప్పుడూ ప్రపంచదేశాలకు స్ఫూర్తిదాయకాలు. ఇదే మన రెండు దేశాల బంధానికి పునాది రాళ్లు’ అని మోదీనుద్దేశిస్తూ బైడెన్ ట్వీట్‌చేశారు. జీ20 సదస్సు ముగిశాక భారత్‌కు బైబై చెప్పిన బైడెన్.. వియత్నాంకు పయనమయ్యారు. మహాత్మునికి జీ20 నేతలంతా పుష్పగుచ్ఛాలతో నివాళులర్పిస్తున్న ఫొటోను, కార్యక్రమానికి సంబంధించిన 19 సెకన్ల వీడియోను బైడెన్ ట్వీట్ చేశారు. జీ20 దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూటమే స్వయంగా పరిష్కార మార్గాలు కనిపెట్టగలదని బైడెన్ ధీమా వ్యక్తంచేశారు. మహాత్మునికి నేతల నివాళి జీ20 సదస్సుకు విచ్చేసిన నేతలంతా ఆదివారం రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాం«దీకి నివాళులరి్పంచారు. మొదట వారంతా వర్షం నీరు నిలిచిన రాజ్‌ఘాట్ లోపలికొచ్చారు. 1917 నుంచి 1930 వరకు గాం«దీజీ నివసించిన సబర్మతి ఆశ్రమం ఫొటో ఉన్న ప్రాంతం వద్ద నిల్చుని విడివిడిగా ఒక్కో నేతకు మోదీ స్వాగతం పలికారు. ఫొటో చూపిస్తూ ఆశ్రమం ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ అంగవస్త్రం బహూకరించారు. మోదీ, సునాక్ పాదరక్షలు లేకుండా రాజ్‌ఘాట్ లోపలికి ప్రవేశించగా, మిగతా నేతలు.. నిర్వాహకులు సమకూర్చిన తెల్లని పాదరక్షలు ధరించారు. తర్వాత నేతలంతా కలిసి గాం«దీజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అక్కడి శాంతికుడ్యంపై సంతకాలు చేశారు. -
అభిమాన సంపన్నులు
విద్యావంతులైన వాళ్లు ఎవరైనా జీవితాంతం తమ గురువులను స్మరించుకుంటారు. మన దేశంలో గురుశిష్య పరంపర వేదకాలం నుంచి ఉంది. పాశ్చాత్య నాగరికతల్లో కూడా క్రీస్తుపూర్వం నుంచే గురుశిష్య పరంపర కొనసాగేది. విద్య నేర్పించే గురువులే లేకుంటే, ఈ ప్రపంచం ఇంకా అజ్ఞానాంధకార యుగంలోనే మిగిలి ఉండేదేమో! గురువులు లేని లోకాన్ని ఊహించుకోలేం. గురువులు ఊరకే పాఠాలను వల్లెవేయించడమే కాదు, భావితరాలను జ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దుతారు. పరోక్షంగా సమాజాన్ని మెరుగుపరుస్తారు. బడిలో చేరిన పిల్లల మీద తల్లిదండ్రుల కంటే గురువుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురువుల మీద అమితమైన గురి ఉంటుంది. ‘ఎలా ఆలోచించాలో తెలిసిన వాళ్లకు అధ్యాపకుల అవసరం లేదు’ అని మహాత్మాగాంధీ అన్నారు. అయితే, అమాయకపు బాల్యావస్థలో ఆలోచనను పదునెక్కించే గురువులు అత్యవసరం. జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంబంధాల్లో గురుశిష్య సంబంధం ప్రత్యేకమైనది. లోకంలో ఎందరో ఉత్తమ గురువులు, వారు తీర్చిదిద్దిన ఉత్తమ శిష్యులు ఉన్నారు. వారందరూ గతించిపోయినా, వారి చరిత్రను జనాలు చర్వితచర్వణంగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. మన పురాణాల్లోనూ గురుశిష్యుల కథలు కొల్లలుగా కనిపిస్తాయి. పురాణాల్లో దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువులుగా వాసికెక్కారు. అవతార పురుషులైన రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపని మహర్షి గురువులుగా ఉండేవారు. పురాణ గురువుల్లో మిగిలినవారిదంతా ఒక ఎత్తు అయితే, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పిన చండా మార్కుల వారిది మరో ఎత్తు. దండోపాయాన్ని సాధనంగా ఎంచుకున్న తొలిగురువు బహుశా ఆయనే! చండామార్క వారసులైన గురువులు అక్కడక్కడా తారసపడుతుంటారు. మనుషుల్లో ఉండే వైవిధ్య వైరుద్ధ్యాలు గురుశిష్యుల్లోనూ కనిపిస్తాయి. గురువులందరూ ఉత్తములేనని, శిష్యులందరూ ఆణిముత్యాలేనని చెప్పలేం. గురువుల్లో ఔదార్యమూ, ఉదాత్తతలతో పాటే స్వార్థ సంకుచిత లక్షణాలూ కనిపిస్తాయి. గురువులు కూడా మానవ మాత్రులే! ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా కోరిన ద్రోణుడు మనకు తెలుసు. గురువుకే పంగనామాలు పెట్టిన ఆషాఢభూతి కూడా మనకు తెలుసు. గురజాడవారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఆషాఢభూతికి ఏమీ తీసిపోయే రకం కాదు. కాకుంటే, అతగాడు గురుత్వం వెలగబెట్టాడు. గిరీశం శిష్యరికంలో వెంక టేశానికి చుట్ట కాల్చడం పట్టుబడిందే గాని, చదువు ఒంటబట్టలేదు. అయితే, మన దేశంలో వివిధ రంగాల్లో రాణించిన గురువులు, గురువులకు గర్వకారణంగా నిలిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. సాహితీరంగంలో తమదైన ముద్రవేసిన గురుశిష్యులు కొందరు ఇప్పటికీ ప్రస్తావనల్లోకి వస్తుంటారు. అటువంటి గురుశిష్యుల్లో మొదటగా చెప్పుకోవల సిన వారు – తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ. వారిద్దరూ అరుదైన గురుశిష్యులు. పాండితీ ప్రాభవంలోను, కవన శైలిలోనూ ఇద్దరూ ఇద్దరే! చెళ్లపిళ్లవారి గురించి విశ్వనాథ ఒక చమత్కార పద్యం చెప్పారు. అది: ‘అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు... బ్రాహ్మీమయమూర్తి శిష్యు డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళవంశస్వామి కున్నట్లుగన్’. నన్నయకు, తిక్కనకు తన వంటి శిష్యులెవరూ లేరని, తన గురువైన చెళ్లపిళ్ల వారికే ఆ వైభోగం, కీర్తి దక్కాయని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వనాథ. అధ్యాపక వృత్తిలో కొనసాగిన విశ్వనాథకు ఎందరో ప్రత్యక్ష శిష్యులే కాకుండా, మరెందరో పరోక్ష శిష్యులూ ఉన్నారు. విశ్వనాథను శ్రీశ్రీ ‘కవికుల గురువు’గా ప్రస్తుతించడమే కాదు, ‘తెలుగువాళ్ల గోల్డు నిబ్బు’గా అభివర్ణించారు. ఒకానొక సందర్భంలో ‘నా వంటి కవి మరో వెయ్యేళ్ల వరకు పుట్టడు’ అని విశ్వనాథ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా శ్రీశ్రీ ‘నిజమే! వారు పుట్టి వెయ్యేళ్లయింది’ అని వ్యాఖ్యానించడం ఒక వైచిత్రి. తొలినాళ్లలో శ్రీశ్రీపై విశ్వనాథ ప్రభావం ఉండేది. తర్వాతికాలంలో అబ్బూరి రామకృష్ణారావు శ్రీశ్రీపై ఎనలేని ప్రభావం చూపారు. అబ్బూరి వద్ద శ్రీశ్రీ నేరుగా తరగతిలో పాఠాలు నేర్చుకోకపోయినా, వారిద్దరిదీ గురుశిష్య సంబంధమే! సాహితీ లోకంలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేసిన మరో గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నరాల రామారెడ్డి వంటి ఉద్దండులు ఆయన శిష్యులే! ఇక భద్రిరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర ఆచార్యులుగా సుప్రసిద్ధులు. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, తూమాటి దొణప్ప వంటి శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. ఎందరో గురువులు ఉన్నా, శిష్యుల మనసుల్లో చెరగని ముద్రవేసే వారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఉత్తమ గురువులుగా చరిత్రలో గుర్తుండిపోతారు. మన దేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా ఎందరో శిష్యులను తయారు చేశారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్లేటప్పుడు ఆయనను గుర్రపు బండిలో కూర్చోబెట్టి శిష్యులే స్వయంగా బండిని లాక్కుంటూ వెళ్లి మరీ మైసూరు రైల్వేస్టేషన్లో సాగనంపారు. అదీ రాధాకృష్ణన్ ఘనత! రేపు రాధాకృష్ణన్ పుట్టినరోజు. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. గురువుల ఘనతకు శిష్యుల అభిమానమే గీటురాయి! జీతంరాళ్ల కంటే శిష్యుల అభిమాన ధనమే అసలైన సిరిసంపదలుగా తలచే గురువులు ఉంటారు. అలాంటి వాళ్లే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తారు. -
బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్
నేడు దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. లడఖ్‌లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున రాహుల్ తన తండ్రికి నివాళులర్పించారు. 21వ శతాబ్దపు సృష్టికర్తగా పేరొందిన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగానే ఇండియన్ టెలికాం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఓటింగ్ పరిమితి 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. దేశంలోకి మొదటిసారిగా కంప్యూటర్లను తీసుకువచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇవన్నీ రాజీవ్ విజయాల ఖాతాలో చేరుతాయి. రాజీవ్ గాంధీ జీవితానికి సంబంధించిన పలు అంశాలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. వీటిలో ఒకటి ఆయన మహాత్మా గాంధీని కలవడం. అప్పుడు రాజీవ్ వయసు 4 సంవత్సరాలు. అది 1948, జనవరి 29... సాయంత్రం మహాత్మా గాంధీని కలవడానికి రాజీవ్‌ను తీసుకుని అతని తల్లి ఇందిరా గాంధీ వెళ్లారు. ఇందిర, రాజీవ్‌లతో పాటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అతని సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు మహాత్ముడిని కలవడానికి వెళ్లినవారిలో ఉన్నారు. ఇందిరా గాంధీ జీవిత చరిత్రను రాసిన కేథరీన్ ఫ్రాంక్.. ఆ రోజు సాయంత్రం ఇందిర ఇంటి నుండి బయలుదేరే ముందు, వారి ఇంటి తోటమాలి మల్లెపూలను తీసుకువచ్చి, ఆమెకు ఇచ్చారని రాశారు. ఆ మల్లెపూలను గాంధీజీకి ఇవ్వాలని ఇందిరాగాంధీ అనుకున్నారు. వారంతా కలిసి బిర్లా హౌస్‌కు బయలుదేరారు. ఎప్పటిలాగే ఆ సమయంలో మహాత్మా గాంధీ బిర్లా హౌస్ లాన్లో సన్‌బాత్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ, నెహ్రూ సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు తదితరులు గాంధీ దగ్గర కూర్చున్నారు. ఆ పక్కనే రాజీవ్ గాంధీ సీతాకోక చిలుకలతో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్.. మహాత్మా గాంధీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ చిన్నారి రాజీవ్ మనసులో ఏమనుకున్నాడోగానీ మహాత్ముని పాదాలపై మల్లెపూలు జల్లడం మొదలుపెట్టాడు. దీనిని గమనించిన జాతిపిత మహాత్మాగాంధీ.. రాజీవ్‌ను పైకి లేపి.. ‘అలా చేయకూడదు. చనిపోయిన వ్యక్తుల పాదాలపై మాత్రమే పూలు జల్లుతారని’ హితవు పలికారు. ఆ మరుసటి రోజే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. 1948, జనవరి 30 న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. మహాత్ముడు ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా నాథూరామ్ గాడ్సే జనసమూహం మధ్య నుంచి వచ్చి, గాంధీపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది? -
బాబూజీ నా రోల్‌మోడల్!
జవహర్లాల్ దర్డా (1923–1997) లేదా ‘బాబూజీ’ ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు కానీ... ఆయన ఆలోచనలు నిత్యం మన వెంటే ఉంటాయి. రాజకీయాల్లో అత్యంత మేధతో ఆయన పనిచేశారు. జీవితాంతం మహాత్మాగాంధీ ఆలోచనలతోనే గడిపారు. ఆ కాలంలో ఇంకా చాలామంది నేతలు చురుకుగానే వ్యవహరించారు కానీ... బాబూజీ మాత్రం మహారాష్ట్రలో అజాతశత్రువుగా ఉండిపోయారు. మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. మహారాష్ట్ర రాష్ట్రంలో వార్తా పత్రికల ద్వారా సామాజిక సేవ చేయాలన్స్నది బాబూజీ ఎంచుకున్స్న మార్గం! అచార్య వినోభా భావేను కలిసేందుకు నేను ఒకానొక సందర్భంలో విదర్భ వెళ్లాను. ఆ పర్యటన నాకు బాగా గుర్తుంది. బాబూజీ ఆలోచనలు బోలెడన్స్ని నన్స్ను చుట్టుముట్టాయి. బాబూజీ కలం మహాత్మగాంధీ, వినోభా భావేల ఆలోచనలతోనే రచనలు చేస్తుందని అప్పుడే గుర్తించాను. వాస్తవానికి నేను రాజకీయాల్లోకి రాకముందే బాబూజీని కలిశాను. ఓ హౌసింగ్ సొసైటీ మరమ్మతుల విషయమై ఆయన్స్ని కలవాల్సి వచ్చింది. హౌసింగ్ ఫైనాన్స్ కు ఛైర్మన్స్ గా వ్యవహరిస్తూండేవారు ఆయన అప్పట్లో. తొలి సమావేశంలోనే ఆయన నన్స్ను ఆకట్టుకున్స్నారు. స్వభావం కూడా బాగా నచ్చింది. భిన్స్నమైన వ్యక్తిత్వమని అర్థమైంది. హౌసింగ్ సొసైటీ సమస్యలను ఏకరవు పెట్టినప్పుడు ఆయన వాటిని వెంటనే అర్థం చేసుకోగలిగారు. సొసైటీ పేదవారికి చెందినదని తెలుసుకున్స్న తరువాత వెంటనే సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఆ సొసైటీ ఇప్పుడు ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో ఉంది. 1974లో నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్స్నికయ్యాను. ఆ తరువాత బాబూజీని వేర్వేరు సందర్భాల్లో రకరకాల అంశాల విషయంలో కలిశాను. అంతేకాదు, రాజకీయాల్లో బాబూజీని (మహారాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు) నా రోల్‌మోడల్‌గా ఎంచుకున్స్నాను కూడా. ఇష్టమైన విషయాలపై ఎంత లోతుగా తెలుసుకోవాలి, ఎంతగా ఆనందించాలి? ఇష్టం లేని విషయాలను కూడా ఎంత మేరకు పట్టించుకోవాలో నేను బాబూజీ ప్రవర్తన ద్వారా అర్థం చేసుకోగలిగాను. అందుకే ఆయన రాజకీయాల్లో ఓ ఆదర్శ వ్యక్తి అని నేను భావిస్తాను. రాజకీయాలకు అతీతంగా కూడా ఆనందం ఉందని మాకు బాగా తెలుసు. ఆ జీవితాన్స్ని కూడా అనుభవించాలి, ఆనందించాలి. అయితే ఈ విషయంలో బాబూజీ నాకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందుండేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనకంటూ ఓ సిద్ధాంతం కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. బాబూజీ ఎప్పుడూ సైద్ధాంతిక, వ్యక్తిగత సంబంధాల మధ్య అంతరాన్స్ని స్పష్టంగా గుర్తించేవారు. బాబూజీకి వసంతరావ్ నాయక్ అతిదగ్గరి మిత్రుల్లో ఒకరు. అయితే రాజకీయపరమైన, సైద్ధాంతిక పరమైన విషయాల్లో వసంతరావ్ నాయక్‌కు (మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి) దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అయితే ఎంతటి విభేదాలున్స్నా వ్యక్తిగత మైత్రిని మాత్రం వదులుకోలేదు. బారిస్టర్ ఎ.ఆర్.అంతులే విషయంలోనూ ఇంతే. బాబూజీకి ఆయనతో మంచి సంబంధాలుండేవి. కానీ అంతులే కాంగ్రెస్‌ను వదిలేశారు. బాబూజీ మాత్రం కాంగ్రెస్‌ను, రాజీవ్‌జీని (మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) మాత్రం వదల్లేదు. నేను రాజకీయాల్లోకి రావడానికి శరద్ పవార్ (అనంతరం, ఎన్స్సీపీ వ్యవస్థాపకుడు) కారణం. అయితే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మాత్రం ఇందిరాజీ, రాజీవ్‌జీ, పీవీ నరసింహరావుజీ, కాంగ్రెస్ పార్టీలకు నేను దూరం కాలేదు. ప్రస్తుతం దేశం అలివికానీ సమస్యలు ఎదుర్కొంటోంది. విషయం రాజ్యాంగానికి సంబంధించినది. మహానేతలు మనకు అందించిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశాన్స్ని నడిపేందుకు మనం ప్రయత్నిస్తున్స్నాం. ఈ సమయంలో జవహర్లాల్ నెహ్రూ నమ్మిన ఆలోచనలు, సిద్ధాంతాలు చాలా ముఖ్యం. ఈ సిద్ధాంతాలు, ఆలోచన ధోరణితో ముందుకెళితేనే దేశంలో శాంతి సాధ్యం. బాబూజీ బతికి ఉన్స్నంత కాలం మహాత్మాగాంధీ సిద్ధాంతాలనే నమ్మారు, ఆచరించారు. గాంధీ సిద్ధాంతాలకు కట్టుబడి నట్లుగానే తన వార్తా పత్రికకు(లోక్మత్) ఆయన విశ్వాసంగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారులు విజయ్జీ దర్డా, రాజేంద్రజీ దర్డా బాబూజీ ఆశయాలను, జాతీయత స్ఫూర్తిని కొనసా గించే ప్రయత్నం చేస్తున్స్నారు. బాబూజీ మహారాష్ట్ర ముద్దుబిడ్డ మాత్రమే కాదు, ఈ దేశానికి సంబంధించిన ముఖ్య నేత కూడా. ఆయనకు నా మనఃపూర్వక శ్రద్ధాంజలి. సుశీల్ కుమార్ శిందే వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్;కేంద్ర మాజీ హోంమంత్రి (నేడు జవహర్లాల్ దర్డా శతజయంతి) -
‘స్వేచ్ఛ’యను రెండక్షరములు...
‘స్వేచ్ఛ’ అంటే కేవలం రెండక్షరాలు కాదు, దిగంతాలను కొలిచే పక్షికి రెండు రెక్కలు;భూమండలాన్ని చుట్టే మనిషికి రెండు పాదాలు; స్వేచ్ఛ అంటే ఒక నిర్నిబంధమైన మాట; ఒక స్వతంత్రమైన చేత. హద్దులేని ఆకాశమూ, అంతులేని భూమండలమూ స్వేచ్ఛాసంచారానికి ప్రకృతి చేసిన ఏర్పాట్లు. ప్రకృతి నిఘంటువులో మొదటి మాటా, చివరి మాటా స్వేచ్ఛే! ఎగిరే పక్షిని ఏ వేటగాడి బాణమో పడగొట్టినప్పుడూ, నడిచే మనిషి కాళ్ళకు ఏ నిరంకుశపు సంకెళ్ళో పడినప్పుడూ, ఏ నిషేధాల కత్తుల బోనులోనో మాట బందీ అయినప్పుడూ అది అక్షరాలా ప్రకృతి మీద జులుము, ప్రకృతి ఏర్పాటు మీద దాడి. స్వేచ్ఛ రెక్క విరిచిన రోజు వచ్చి వెడుతూ, దాని విలువను మరోసారి గుచ్చి చెప్పింది. చెరబడ్డప్పుడు తప్ప సాధారణ పరిస్థితుల్లో పూర్తిగా గుర్తించలేని విలువ స్వేచ్ఛ. అడవుల పాలైన ధర్మరాజుకు ఆ విలువ తెలుసు. మనిషికి ఆనందమిచ్చేది ఏదని యక్షుడు అడిగినప్పుడు ప్రవాసంలో కాకుండా స్వవాసంలో ఉండడమేనంటాడు. పరాయి పాలనలో వ్యధార్త జీవితాలు గడిపిన నిన్నమొన్నటి మన స్వాతంత్య్ర సమరయోధులకు, ఇతర బుద్ధిజీవులకే కాదు; సామాన్య జనానికి సైతం స్వేచ్ఛ విలువ తెలుసు. ‘స్వేచ్ఛ మన ఊపిరి’ అంటాడు మహాత్మాగాంధీ. ఊపిరి నిలుపుకోవడానికి ఎంత మూల్యమైనా చెల్లించవలసిందే. ‘ఎక్కడ మనసు నిర్భయమవుతుందో, ఎక్కడ తలెత్తుకుని ఉండగలమో, ఎక్కడ జ్ఞానం శృంఖలాబద్ధం కాదో, ఎక్కడ సంకుచితపు గోడలతో ప్రపంచం ముక్కముక్కలు కాదో, ఎక్కడ మాట సత్యపు లోతుల్లోంచి జాలువారుతుందో, ఎక్కడ శ్రమించే చేతులు పరిపూర్ణత వైపు బారలు చాచగలవో, ఎక్కడ హేతుత్వమనే స్వచ్ఛ స్రవంతి దారి తప్పకుండా ఉంటుందో...’ అలాంటి స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం విశ్వకవి టాగోర్ పరితపిస్తాడు. మానసిక స్వేచ్ఛనే నిజమైన స్వేచ్ఛగా బాబా సాహెబ్ అంబేడ్కర్ అభివర్ణిస్తాడు. సంకెళ్లలో లేకపోయినా స్వేచ్ఛాయుత చింతన లేనివాడు బానిసే తప్ప స్వతంత్రజీవి కాడనీ, జీవన్మృతుడనీ అంటాడు. ‘మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి, కానీ ప్రతిచోటా సంకెళ్ళలో చిక్కుకున్నా’డన్న రూసో నిర్వచనం ఎంతైనా నిజం. స్వేచ్ఛా, మనిషీ కలిసే పుట్టారు. ఆధిపత్యాలు, అంకుశాలు, అణచివేతలు తర్వాత వచ్చాయి. దేశాల హద్దులూ, వీసాల నిర్బంధాలూ లేని కాలంలో మనిషి స్వేచ్ఛగా భూమండలమంతా కలయదిరిగాడు. అందుకే ప్రపంచంలోని ప్రతి తావూ అతని చిరునామా అయింది. సంస్కృతీ, నాగరికతలను సంతరించుకున్న తర్వాతా; భాషాభేదాలూ, ప్రాంతాల తేడాలూ, జాతీయతా వాదాలూ పొటమరించిన తర్వాతా అతని స్వేచ్ఛాగమనానికి అడ్డుగోడలు లేచాయి. అదొక విచిత్ర వైరుద్ధ్యం. వేల సంవత్సరాల క్రితం జరిగిన జన్యుపరివర్తన కారణంగా గొంతుముడి వీడి మనిషి మాట్లాడగలిగిన దశకు చేరాడంటారు. అప్పుడు తన ఆనందోద్వేగాలను ఎంత స్వేచ్ఛగా గొంతెత్తి ప్రకటించుకుని ఉంటాడో! క్రమంగా తన మాటను రకరకాల నిషేధాలూ, నిర్బంధాల కత్తివేటూ భయపెట్టినప్పుడు స్వేచ్ఛనుడిగి మూగవోయిన దుఃఖచరిత్ర అతనిది. పురాణకాలం నుంచి నవీనకాలం వరకూ ఏ ఘట్టంలోనూ స్వేచ్ఛారాహిత్యంతో రాజీపడని ధిక్కారచరిత్రా అతనికుంది. తన సహజస్వేచ్ఛపై అత్యాచారం శ్రుతిమించిన ప్రతిసారీ అగ్గిరవ్వ అయ్యాడు. చండశాసనం ఉన్నచోట దాని అతిక్రమణా ఉండితీరుతుందనడానికి రామాయణమే సాక్ష్యం. హనుమంతుడు సీతను చూసొచ్చిన తర్వాత సంబరం పట్టలేకపోయిన వానర సమూహం కిష్కింధలోని మధువనంలోకి జొరబడి అక్కడి తేనెతో విందు చేసుకుని, మత్తిల్లి వనాన్ని ధ్వంసం చేస్తారు. ఆ క్షణంలో వారిలో పురివిప్పిన స్వేచ్ఛాసహజాతం చండశాసనుడైన తమ ఏలిక సుగ్రీవుడు దండిస్తాడన్న భయాన్ని కూడా జయించింది. పీడనకూ, పెత్తనానికీ గురవుతున్నాసరే తమ సహజసిద్ధమైన స్వేచ్ఛాదాహాన్ని తీర్చుకునేందుకు మనిషి అవకాశాలు వెతుక్కుంటూనే ఉంటాడు. ఆ మేరకు పెత్తందార్లకూ, పీడితులకూ మధ్య రాజీ ఏర్పాట్లు కూడా ఉండేవి. ఈ సందర్భంలో ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత రాంభట్ల కృష్ణమూర్తి తన ‘సొంతకథ’లో ‘వాలకం’ అనే ప్రదర్శన రూపాన్ని ప్రస్తావిస్తారు. గౌరమ్మ సంబరాలప్పుడు కొంతమంది గ్రామస్తులు ఊళ్ళోని మోతుబరుల వేషంకట్టి వారి నడకను, నడవడిని అనుకరిస్తూ పాటల రూపంలో వారిపై ఆక్షేపణను చాటుకోవడమే ‘వాలకం’. ఒక్కోసారి ఆగ్రహించి మోతుబరులు దేహశుద్ధి చేయడం గురించీ ఆయన రాస్తారు. ఈ శతాబ్ది ప్రారంభంలో ఇలాంటి ప్రదర్శన అమెరికాలోనూ ఉండేదనీ, దానిని వాడెవిల్ అంటారనీ, చార్లీ చాప్లిన్ ఇందులో ప్రసిద్ధుడనీ ఆయన అంటారు. పురాతన సుమేరు సమాజంలో జనం ఎలాంటి నిర్బంధాలూ, నిబంధనలూ లేని స్వేచ్ఛను అనుభవించడానికి ఏటా వారం రోజులు కేటాయించేవారు. అలాగని స్వేచ్ఛ అంటే ఎలాంటి అదుపాజ్ఞలూ లేని ఇచ్ఛావిహారం కాదు. సమష్టి శ్రేయస్సు కోసం స్వీయ నియంత్రణలో ఉంచుకోవలసిన బాధ్యత కూడా! పాలకులు, పాలితుల వ్యవహరణలో ఎక్కడ తూకం తప్పినా దెబ్బతగిలేది స్వేచ్ఛకే! నిరంతర అప్రమత్తతే స్వేచ్ఛకు చెల్లించే మూల్యం. -
విలువల్లోనూ పట్టువిడుపులు!
వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు అభిషేక్ చౌధరి. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్‌పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటారాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేక పోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టుకోవాలా? ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలేమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు’ అని చౌధరి రాశారు. అయితే యౌవనానంతర దశలో పరిణతి కలిగిన నాయకుడిగా తన పూర్వపు ధోరణికి భిన్నంగా అటల్ బిహారీ వాజ్‌పేయి మారిపోయారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి మనకు తెలుసనే అనుకుంటాం. నిజంగానే మనకు తెలుసా? ఎందరికో ఆయన ఆరాధ్యులు. చాలామందికి ఆయనొక మంచి ప్రధాని కూడా. ఇక ఆయన వాగ్ధాటికైతే మంత్రముగ్ధులు కానివాళ్లెవరు! అయిన ప్పటికీ, ఆయనేమిటో పూర్తిగా మనకు తెలుసా? వాజ్‌పేయి ఛాయ వెనుక ఉన్న వాజ్‌పేయి గురించి మనకు తెలుసా? ఇటీవల విడుదలైన వాజ్‌పేయి జీవిత చరిత్రలో మనకు తెలి యని, మనం ఊహించని ఎన్నో అంశాలు ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఆయన గురించి కచ్చితమైనవిగా మనం ఇప్పటివరకూ భావిస్తూ వస్తున్న కొన్ని కథనాలకు రుజువులు లేవని ఆ పుస్తకం ద్వారా తెలుస్తుంది. సంప్రదాయబద్ధం కాని వాజ్‌పేయి వ్యక్తిగత జీవితాన్ని కూడా పుస్తకం స్పృశించింది. ఆయనను బాగా ఎరిగిన వాళ్లు సైతం వాజ్‌పేయిలోని ఈ అసంప్రదాయపరత్వాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. తాజాగా అభిషేక్ చౌధరి రాసిన ‘వాజ్‌పేయి: ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్ 1924–1977’ అనే పుస్తకంలోని విశేషాలు ఇవన్నీ. రెండు సంపుటాల ప్రయత్నంలోని మొదటి భాగం ఇది. రెండో భాగం డిసెంబరులో రానుంది. వాజ్‌పేయి ఆహార ప్రియులనీ, విలాసజీవుడనీ మనం విన్నాం. ‘భంగ్ ఆయనకు ప్రీతికరమైనది. తగు మోతాదుల్లో సేవించేవారు’. ‘చైనా వంటల్ని అదే తన జీవితేచ్ఛ అన్నట్లుగా ఆరగించేవారు’. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు రాత్రి క్లబ్బులు ఆయన్ని రంజింప జేశాయి. ఆ అనధికార సందర్శనలలో ఒకటీ అరా పెగ్గులు మనసారా గ్రోలేవారు. చౌధరి అనడం అటల్ తన యౌవనంలో ముస్లిం వ్యతిరేకి అని. ‘జీవిక కోసం భారతదేశాన్ని ఎంపిక చేసుకున్న ముస్లింలను దేశ ద్రోహులుగానే చూడాలని అటల్ వాదించేవారు’ అని రాశారు. అటల్ ‘రాష్ట్రధర్మ’ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ముస్లింలను ‘ఫిప్త్ కాలమిస్ట్‌లు’ (ఆశ్రయమిచ్చిన దేశంలో ఉంటూనే ఆ దేశానికి వ్యతి రేకంగా పోరాడేవారు) అని పేర్కొన్నారు. యౌవనానంతర దశలో మాత్రం తన పూర్వపు ధోరణికి పూర్తి భిన్నంగా ఆయన మారి పోయారు. అది నిజం. ఆ మార్పు ఎంత గొప్పదో చెప్పే వెల్లడింపులు కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. మహాత్మా గాంధీ పట్ల వాజ్‌పేయి వైఖరిని గురించి చెబుతూ, ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలు ఏమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు. అటల్ రాసిన అనేక వ్యాసాలు దేశ విభజనకు కారకుడిగా మహాత్ముడినే బాధ్యుడిని చేశాయి. నీతి కాని రీతిలో ముస్లింలను గాంధీజీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడం అన్నది ఆయన్ని హత్య చేసేంతగా పర్యవసాన పరిణా మాలను విషతుల్యం చేసిందని అటల్ విమర్శించారు’ అని అభిషేక్ రాశారు. ఇదేమైనా నిందను సంకేతిస్తోందా? కావచ్చు. వాజ్‌పేయి గురించి బాగా ప్రచారంలో ఉన్న కొన్ని కథనాల్లో అసలు నిజమే లేదనీ, అవి కేవలం అపోహలేననీ ఈ పుస్తకం తేల్చే స్తుంది. 1971 భారత్–పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన డిసెంబర్ 16వ తేదీ నాడు ఇందిరాగాంధీని దుర్గాశక్తిగా అటల్ కీర్తించారని ఒక కథనం. అయితే అది నిజం కాదని, ‘ఆ సాయంత్రం అటల్ పార్లమెంటులోనే లేరు. అప్పుడు ఆయన ఏదైనా ప్రయాణంలో గానీ, లేదా స్వల్ప అస్వస్థతతో గానీ ఉండి ఉండాలి’ అని అభిషేక్ రాశారు. అలాగే, అటల్ గురించి నెహ్రూ గొప్పగా భావించేవారనీ, ఆయనను భావి భారత ప్రధానిగా గుర్తించేవారనీ ఒక ప్రచారం ఉంది. అది అబద్ధం కాదు. అయితే మునుపు మనకు తెలియని విషయం ఒకటి కూడా ఈ పుస్తకంలో ఉంది. తొలినాళ్లలో అటల్‌పై నెహ్రూ అభిప్రాయం ఇంకోలా ఉండేదని! మొదట్లో ఆయన వాజ్ పేయిని ‘అత్యంత అభ్యంతరకరమైన వ్యక్తి’గా భావించారు. ‘జమ్మూలో మితిమీరిన తెంపరితనాన్ని ప్రేరేపిస్తున్నాడు’, ‘అతడిని జమ్మూలోకి అడుగుపెట్టనివ్వకండి’ అని నెహ్రూ తన క్యాబినెట్ కార్యదర్శి విష్ణు సహాయ్ని కోరినట్లు ఈ పుస్తకం చెబుతోంది. స్వాతంత్య్రోద్యమంలో వాజ్‌పేయి పాత్ర లేదన్న కాంగ్రెస్ వాదనను కూడా రచయిత కొట్టిపారేశారు. ‘గ్వాలియర్‌లో జరిగిన క్విట్ ఇండియా నిరసనల్లో వాజ్‌పేయి పాల్గొన్నారన్నది నిజం’. మరీ ముఖ్యంగా, బ్రిటిష్ వారికి అటల్ సమాచారం చేరవేస్తుండేవాడు అని ‘బ్లిట్జ్’ పత్రిక కలిగించిన ప్రేరేపణ పచ్చి అబద్ధం.’ మిమ్మల్ని ఆశ్చర్యపరచగల మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. బాల్యంలో వాజ్‌పేయి పేద విద్యార్థి. స్కూల్లో చాలా అరుదుగా మాత్రమే ఆయనలోని ప్రతిభ బయట పడేది. ‘పాంచజన్య’ పత్రిక మాత్రం ఆయన్ని ఆకాశానికెత్తింది. అటల్ ఎప్పుడూ తరగతిలో రెండో స్థానంలో నిలవలేదని రాసింది. ఆయనకు ఎల్ఎల్బి డిగ్రీ ఉందన్న మాటలో కూడా నిజం లేదు. నిజానికి, ‘అటల్ లా డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేశారు.’ శ్రోతల్ని కట్టిపడేసే వక్తగా ప్రసిద్ధి చెందిన మనిషి, తన తొట్టతొలి స్కూల్ డిబేట్లో ఘోరంగా ఓడిపోయాడని తెలుసుకోవడం నన్ను ఆహ్లాదపరిచింది. ‘అతడి కాళ్లు చల్లబడ్డాయి. తడబడటం మొదలు పెట్టాడు. ప్రసంగ పాఠం మర్చేపోయాడు. అదొక అవమానకరమైన అనుభవం. సాటి విద్యార్థుల ఆనాటి వెక్కిరింతల్ని జీవితాంతం ఆయన గుర్తుచేసుకుంటూనే ఉన్నారు’. వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు పుస్తక రచయిత. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్ పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటా రాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేకపోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టు కోవాలా? రెండవ సంపుటి కూడా మొదటి సంపుటం మాదిరిగానే అనేక విశేషాలతో కూడి ఉన్నట్లయితే 1977–2004 మధ్య వాజ్‌పేయి గురించిన సత్యాలను తెలుసుకోడానికి నేను ఎక్కువ కాలం వేచి ఉండలేను. అది ఉత్తమ భాగం అవుతుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్. ట్విట్టర్లో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మహాత్మా గాంధీలా నడుచుకుంటూ వెళ్లి ప్రజల మనసులు గెలుచుకున్నావని కొనియాడారు. 'మీ సౌమ్యమైన మార్గంలో ప్రేమ, వినయంతో ప్రపంచంలో ఏ శక్తినైనా కదలించవచ్చనని నిరూపించారు. ప్రగల్భాలకు పోకుండా, రొమ్ముచరుచుకోకుండా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరిస్తారని మీరు నమ్మారు. ఇప్పుడు వారంతా ఐకమత్యంగా స్పందించి మీపై ఉన్న నమ్మకాన్ని తెలియజేశారు. విజయానికే కాదు.. ఆ విజయం సాధించిన తీరుకు కూడా మీకు వందనం..' అని కమల్ ట్వీట్ చేశారు. Shri @RahulGandhi ji, Heartiest Congratulations for this significant victory! Just as Gandhiji, you walked your way into peoples hearts and as he did you demonstrated that in your gentle way you can shake the powers of the world -with love and humility. Your credible and… pic.twitter.com/0LnC5g4nOm — Kamal Haasan (@ikamalhaasan) May 13, 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 136 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. బీజేపీ కేవలం 64 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 20 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన 6 మంత్రాలివే.. -
మహాత్మా గాంధీ మనవడు కన్నుమూత
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) మంగళవారం తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మరణించినట్లు ఆయన కుటుంబికులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కొల్హాపూర్‌కు వచ్చిన అరుణ్ గాంధీ.. అక్కడే పదిరోజుల పాటు బస చేయాలని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి బయలుదేరే ముందే అరుణ్ గాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తదుపరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచించడంతో అరుణ్ గాంధీ అక్కడ ఉండిపోయారని, ఈరోజు ఉదయమే తుదిశ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమేరకు ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కాగా, మహాత్మా గాంధీ కొడుకు మణిలాల్ గాంధీ, సుశీ మష్రువాలా దంపతులకు అరుణ్ గాంధీ ఏప్రిల్ 14, 1934న డర్బన్‌లో జన్మించారు. అరుణ్ గాంధీ సామాజిక కార్యకర్తగా తన తాత అడుగుజాడల్లోనే నడిచారు. ఈమేరకు ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. Bereaved. Lost my father this morning🙏🏽 — Tushar बेदखल (@TusharG) May 2, 2023 (చదవండి: "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!": ప్రియాంక గాంధీ) -
చరిత్ర పుస్తకాల్లో ‘గాంధీ, ఆరెస్సెస్’ తొలగింపు
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవలు, సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆరెస్సెస్‌పై నిషేధం, గోధ్రా అల్లర్ల తర్వాత ఘటనలు తదితరాలను పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించింది. హేతుబద్ధీకరణలో భాగంగా ఏయే అంశాలను తొలగించబోతున్నదీ తెలుపుతూ మండలి గత జూన్‌లో విడుదల చేసిన బుక్‌లెట్‌లో వీటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. హిందూ అతివాదంపై గాంధీ అభిప్రాయాలు వంటి అంశాలను తొలగించడం భావితరాలకు వాస్తవాలు తెలియకుండా చేసే కుటిల యత్నమని ఆరోపించింది. బీజేపీ, ఆరెస్సెస్ ఎంత ప్రయత్నించినా చరిత్రను మార్చలేవని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. విషయ నిపుణుల సూచన మేరకే వాటిని తొలగించినట్టు ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ సాక్లానీ చెప్పారు. ఈ విషయంలో రాద్ధాంతం అనవసరమని అభిప్రాయపడ్డారు. -
మహాత్మాగాంధీ డిగ్రీ కూడా చేయలేదు! గవర్నర్ షాకింగ్ వ్యాఖ్యలు
భారత జాతీయ కాంగ్రెస్ మాజీ నాయకుడు మహాత్మాగాందీ ఎలాంటి డిగ్రీలు చేయలేదని జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సిన్హా గాల్వియర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..డిగ్రీ పోందడం విద్య కాదని చెబుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీకి న్యాయశాస్త్రంలో డిగ్రీ లేదని, ఆయన ఏ ఒక్క యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేయలేదని చెప్పారు. గాంధీజీ చదువుకోలేదని ఎవరూ అనరు. అలా చెప్పరు కూడా. కానీ ఆయన కేవలం హైస్పూల్ డిప్లొమాలో మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఆయనకు ఎటువంటి డిగ్రీ లేదు. అయితే చాలామంది ఆయన న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశాడనుకుంటారు కానీ ఆయన లా చేసేందుకు అర్హత సాధించాడే తప్ప డిగ్రీ లేదు. కానీ ఆయన ఎంత చదువుకున్నాడంటే దేశానికి జాతిపిత అయ్యేంతగా జ్ఞానాన్ని సముపార్జించాడు. డిగ్రీలు చేశామనే దర్పంలో మునిగిపోకండి. డిగ్రీ పొందడం చదువు కాదు. అలాగే మార్క్‌ట్వైన్ అనే కలం గురించి వినే ఉంటారు. ఆ కలంతో పుస్తకాలు రచించిన శామ్యూల్ లాంఘోర్న్ క్లెమెన్స్‌కు కూడా పెద్దగా చదుదుకోలేదు. కానీ అతను 12 ఏళ్ల వయసులోనే పాఠశాలను విడిచిపెట్టి పబ్లిక్ లైబ్రరీలలో చదువుకున్నాడన్నారు. కేవలం డిగ్రీలు చేస్తే అది విద్య కాదని తన ఎదుగదలకు, దేశ భవితవ్యానికి ఉపయోగపడేదే నిజమైన విద్య అని చ్పెపారు. అందుకు సబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. Modi’s representative in Kashmir says Mahatma Gandhi had no academic degree. These guys to justify Modi’s fake degrees can even insult Mahatma. Gandhi had a law degree from University College London. pic.twitter.com/kbkmATCBOP — Ashok Swain (@ashoswai) March 24, 2023 (చదవండి: ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత) -
నీలోని నువ్వు చెప్పేది విను...చాలు
ధర్మం చెప్పడానికి లోకంలో ఉన్న ఐదు ప్రమాణాలలో ఒకటి అంతరాత్మ ప్రబోధం. అది మనిషికి ఎప్పుడూ లోపల ఉండే ధర్మాన్ని చెబుతుంటుంది. చెయ్యకూడని పని చేస్తున్నప్పుడు... లోపలినుంచి ఒక సణుగుడు వినిపిస్తుంటుంది. ‘‘ఎందుకు చేస్తున్నావు... నలుగురి లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు. తప్పుచేసి మచ్చ తెచ్చుకోకు, నామాట విను... దానికి దూరంగా ఉండు..’’అని లోపలి నుంచి ఘోషిస్తుంటుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా ఒక్క అంతరాత్మ మాత్రమే ఒక ప్రశ్నతో మిమ్మల్ని నిలదీస్తుంటుంది. ‘ఇది చేయవచ్చా ?.. అని! అలా నిలదీస్తున్నందుకు దాని గొంతు పిసికేయకూడదు. అదేం చెబుతుందో ఓపికగా విని ఆలోచించినవారిని ‘‘శ్రద్ధ కలిగిన వారు’’ అంటారు. అలా ఎందుకడుగుతుంది అంటే... అప్పటికే ఆయన.. శారీరక, మానసిక సుఖాలకోసం దిగజారిపోయాడు. అయినా అది మాత్రం హెచ్చరిస్తూనే ఉంటుంది. దాని మాట విన్నవాడు మహాత్ముడవుతాడు. శరీరంలో శక్తి, ఇంద్రియాలకు పటుత్వం, మనసులో విజృంభణ ఉందని సుఖాన్ని పొందడం మంచిది కాదు. ఎవరూ కూడా మొదటినుంచే నూరు శాతం నిలకడగా ఉండలేరు. అది అంత తేలికేం కాదు కూడా. కానీ లోపలిమనిషి చెబుతున్నవాటిని శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంటే.. క్రమేణా ఆచరణలో కూడా అలవాటవుతుంది. అదే ధర్మంగా నడుచుకోవడం అంటే. మహాత్మాగాంధీ మొదటిసారి లండన్ బయల్దేరుతున్నప్పుడు... మద్యం, మాంసం, మగువలకు వశపడే అవకాశాలు అక్కడ ఎక్కువని వినడం వల్ల తల్లి అనుమతి నిరాకరించింది. వారి కుటుంబ శ్రేయోభిలాషి అయిన ఒక స్వామీజీ జోక్యం చేసుకొని ..‘‘ఏ కారణం చేత కూడా ఈ మూడింటికీ వశపడను’’ అని తల్లికి ప్రమాణం చేయించి పంపారు. తల్లి భయాలే నిజమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక స్త్రీతో ఆయనకు హద్దులు దాటిన సంబంధం ఏర్పడుతున్న క్షణాల్లో ఉన్నట్టుండి అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చింది. ఆయన వెంటనే వెళ్ళిపోయి.. తరువాత ఆ స్త్రీకి నిజాయితీగా ఒక ఉత్తరం రాస్తూ... తనకు పెళ్ళయిందనీ, ఒక కుమారుడు కూడా ఉన్నాడనీ, ముందుగా ఈ విషయాలు చెప్పకపోవడం తప్పేనని, తనను క్షమించాలని కోరాడు. అదీ అంతరాత్మ ప్రబోధం అంటే. అదీ లోపలున్న మనిషి మాటను నువ్వు వినడం అంటే.. ఇటువంటిదే మరో సంఘటన జరిగినా.. మనసు మాట విని దానికి దూరంగా జరిగాడు... వీటిని నెమరేసుకుంటూ ఆయన ఇలా రాసుకున్నారు... ‘‘భక్తి అనేది మనిషిలో ఉన్న విశృంఖలత్వాన్ని తుడిచేస్తుంటుంది. ఇంటిని ఏ కారణం తో శుభ్రపరుచు కుంటుంటామో... మనసును కూడా భగవద్భక్తి అనే చీపురుపట్టి లోపలి మాలిన్యాలను శుభ్రపరుచుకుంటుండాలి. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు అంతరాత్మ మాట విని ధర్మమార్గంలోనే నడుస్తుంటుంది. సుఖాలకోసం పక్క చూపులు చూడదు.’’ - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Best Newspaper Art: మహాత్మా గాంధీ 150వ జయంతి.. సాక్షి కార్టూన్‌కు జాతీయ అవార్డు..
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీజీ 150వ జయంతి సందర్భంగా 2019 అక్టోబర్ 2న సాక్షి దినపత్రికలో ప్రచురించిన బాపు కార్టూన్‌ను ప్రతిష్టాత్మక ప్రెస్ కౌన్సిల్ జాతీయ అవార్డు వరించింది. సాక్షి దినపత్రిక చీఫ్ కార్టూనిస్టు శంకర్ ఈ కారికేచర్‌ను గీశారు. 'భారత భాగ్య విధాతా!' పేరుతో బాపు బొమ్మను ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమానికి అద్దం పట్టేలా చిత్రీకరించారు. బక్కపల్చటి గాంధీ రూపానికి సమున్నత స్వాతంత్య్ర ఆకాంక్షను కలిపి స్వేచ్ఛాభారతం కోసం మరికొందరు నాయకులతో వేస్తున్న అడుగులను ఈ కారికేచర్‌లో శంకర్ తీర్చిదిద్దారు. "ఐదున్నర అడుగుల ఆ రూపం ఈ దేశానికి చెక్కు చెదరని ప్రతిరూపం అయ్యింది. ఆ పెదాల మీది బోసినవ్వు బ్రిటీష్ సామ్రాజ్యాన్నే హడలెత్తించగలిగింది. ఆయన వేసిన ప్రతి అడుగూ చెదిరి ఉన్న మతాలను, జాతులను, భాషలను, సంస్కృతులను ఒక్క చోటుకు చేర్చగలిగింది. సమస్త భారతీయుల దీక్షను చేతికర్రగా ధరించి ఆయన ఈ దేశాన్ని స్వతంత్ర భారతదేశం చేశారు. దేశీయతను భారతీయతగా మలిచారు. ప్రజలను జాతిగా సంఘటితం చేశారు. మొలన ఉన్న గడియారంలోని పెద్దముల్లు లక్ష్యంగా, చిన్నముల్లు కర్తవ్యంగా ఆయన చేసినది మహా పరిశ్రమ. ఆయన కప్పుకున్న ధవళ వస్త్రం స్వచ్ఛతకు చిహ్నం. ఆయన అహింసను గెలిచే ఆయుధం లేదు. ఆయన సత్యాగ్రహాన్ని ఓడించేదే లేదు. తన సులోచనాలతో అనునిత్యం దర్శించినది ఒకే ఒక స్వప్నం" స్వేచ్ఛాభారతం.. సహన భారతం.. జ్ఞాన భారతం.. ఆధ్యాత్మిక భారతం.. సాక్షి ప్రచురించిన భారత భాగ్య విధాత ప్రజంటేషన్ను బెస్ట్ న్యూస్‌పేపర్ ఆర్ట్ : కవరింగ్ కార్టూన్స్, కారికేచర్స్ అండ్ ఇల్లస్ట్రేషన్ కేటగిరీ కింద 'నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం 2020'కి గాను ప్రెస్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ అవార్డు ఒక్క సాక్షి మీడియా గ్రూపుదే కాదు.. సాక్షిని ఆదరిస్తున్న పాఠకులు, అభిమానిస్తున్న సాక్షి కుటుంబానిది. ఫిబ్రవరి 28 న డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, రఫీ మార్గ్, న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్దు ప్రదానోత్సవం జరుగుతుంది. భారత భాగ్య విధాతా! పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
MP: మహాత్ముడే మాకు ఉపాధి కల్పించాడు.. బాపూజీ బాటలో..
రాట్నం వడకడం అనేది సాంకేతిక విషయం కాదు. స్వాతంత్య్ర ఉద్యమంతో ముడిపడి ఉన్న విలువైన చారిత్రక జ్ఞాపకం. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతీక్ష సోనీకి ఆ చారిత్రక జ్ఞాపకాల సమహారం అంటే ఇష్టం. వాటి నుంచి స్ఫూర్తి పొంది నలుగురికి సహాయపడడం అంటే ఇష్టం... మధ్యప్రదేశ్‌లోని ఖరగ్‌పూర్‌కు చెందిన ప్రతీక్ష సోనీ బాల్యం నుంచి బాపూజీ గురించి వింటూ పెరిగింది. రాట్నం వడకడం ద్వారా స్వదేశీ ఖాదీ ఉద్యమానికి ఊపిరులూదిన మహాత్ముడి గురించి ఎన్నో కథలు విన్నది. అలా తనకు తెలియకుండానే రాట్నం వడకడంపై ఆసక్తి మొదలైంది. చివరికి అదే తన ఉపాధిగా మారింది. ‘మహాత్ముడు మాకు ఉపాధి కల్పించాడు. ఇంటి దగ్గరే రాట్నం వడుకుతూ ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటున్నాం. ఇదంతా ఆ మహాత్ముడి దయ’ అంటుంది పద్దెనిమిది సంవత్సరాల ప్రతీక్ష. ఆర్థికంగా బలహీనంగా ఉన్న 93 మందికి పైగా మహిళలకు రాట్నం వడకడం నేర్పించి సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది ప్రతీక్ష. ‘ఒకరోజు కూలి దొరికి, మరొక రోజు దొరకక ఆర్థికంగా ఇబ్బందులు పడేదాన్ని. అప్పులు చేయాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితులలో ప్రతీక్ష నాకు కొత్త దారి చూపించింది’ అంటుంది ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సుమిత్ర. ఇరవై సంవత్సరాల విమల పట్నంలో ఉద్యోగం చేయడానికి వెళ్లింది. అయితే మూడు నెలలు గడవకుండానే తాను అక్కడ ఉండడం కష్టమనే విషయం అర్థమైంది. తన జీతంలో సగం డబ్బులు ఇంటి అద్దెకే పోయేవి. అలా అని ఊరుకెళ్లలేని పరిస్థితి. అక్కడ ఏ పని దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతీక్ష గురించి తెలుసుకుంది. రాట్నం వడకడం నేర్చుకొని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఊళ్లోనే ఉంటుంది విమల. ఇటీవల నేపియ పట్టణంలో జరిగిన స్వదేశి ఖాదీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీక్ష– ‘ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త ఉత్తేజం వస్తుంది. పదిమందికి సేవ చేయాలనే దృక్పథం ఉన్న వారు పరిచయం అవుతారు. అలాంటి వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఎన్నో మంచి పనులు చేయవచ్చు’ అంటుంది. చదవండి: 54 ఏళ్ల క్రితం హడలెత్తించిన 'డ్రమ్ములో శవం' పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి... -
మహాత్మునికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి మోదీ సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని మహాత్ముని సమాధి రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలుంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. గన్ సెల్యూట్ , సర్వమత ప్రార్థనలు, గాంధీకి ఇష్టమైన గేయాలాపన జరిగాయి. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు నివాళులర్పించారు. ‘బాపుకు నా నివాళులు. దేశ సేవలో ప్రాణాలర్పించిన ఎందరో అమరుల త్యాగాలు దేశం కోసం పనిచేయాలనే సంకల్పాన్ని మరింత పెంచుతాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో కొరోసీ భేటీ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యూఎన్జీఏ) అధ్యక్షుడు సాబా కొరోసీ మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్‌తో భేటీ అయ్యారు. పలు అంతర్జాతీయ సవాళ్లపై చర్చలు జరిపారు. జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం ఆవశ్యకత కూడా ప్రస్తావనకు వచ్చినట్లు అనంతరం మోదీ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం, జీ20 ఎజెండాతోపాటు ఐరాస సంస్కరణలపై చర్చించినట్లు జై శంకర్ పేర్కొన్నారు. పలు అంశాలపై వారి అవగాహన, స్పందన అద్భుతమని కొరోసీ కొనియాడారు. భారత్‌తోపాటు పలు దేశాలు సీమాంతర ఉగ్రవాదంతో బాధ పడుతున్న విషయం తనకు తెలుసునన్నారు. -
మహాత్మా! చూస్తున్నావా!!
ఓ మహాత్మా! చెడు అనకు, వినకు, చూడకు అన్న పలుకులు నీవైతే నేటి సమాజానికవే ప్రీతిపాత్రం. అహింసాయోధుడవు నీవు, హింసా వీరులు నేటి నాయకగణం. సర్వమత ఐక్యత నీ పథం అనైక్యతే నేటి జనుల మార్గం. మద్యం వద్దని నీవు, అదే ముద్దని నేటి ప్రభుత. మహిళా సాధికారత నీ కల, మరి నేడో కలకంఠి కంట కన్నీరు చూడందే నిద్రపోని పాషండులెందరో! గ్రామ స్వరాజ్యం నీ ఊహాసుందరి, దాని అభావానికై నేటి పాలకుల శక్తివంచన లేని కృషి. నీవు చూపిన నాటి విరి బాట నేటి రాజకీయులకు ముళ్లబాట. సమానతే నీ ధ్యేయం, అసమానతే నేటి తరం లక్ష్యం. నిరాడంబరతే నీ భావనైతే ఆడంబరయుత పోకడలు నేటి యువత చిరునామా! నాటి నీ పాదయాత్ర ఏకతా రాగమైతే నేటి పాదయాత్రలు హింసాయుత మార్గాలు, శాంతి భద్రతల భగ్నానికి దగ్గర దారులు. బాపూ! నీ మార్గంలో నేటితరం పయనించేలా దీవించవా! – వేమూరి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం (నేడు మహాత్మా గాంధీ వర్ధంతి) -
గాంధీజీ ఆదర్శాలు దేశానికి తక్షణావసరం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కుల, మత వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మాగాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణ అవసరమని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి (అమరవీరుల దినోత్సవం) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన్ను స్మరించుకున్నారు. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్మాగాంధీ ఈ దేశ పురోగమనానికి సదా ఓ దిక్సూచిలా నిలుస్తారని పేర్కొన్నారు. నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదుర య్యే ఆటంకాలను లెక్క చేయకుండా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ విజయతీరాలకు చేరాలనే స్ఫూర్తిని గాంధీ జీవితం నుంచి ప్రతిఒక్కరూ నేర్చుకోవాల్సి ఉందని సీఎం సూచించారు. -
డల్లాస్‌లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత 74వ గణతంత్ర దినోత్సవాలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని ప్రసాద్ తోటకూర, ఛైర్మన్, రావు కల్వల సెక్రటరీ & బోర్డు సభ్యుడు, దినేష్ హుడా బోర్డు సభ్యుడు & కో-చైర్, ఐఏఎన్టీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. -
గతం గతహా.. వాళ్లతో నన్ను పోల్చకండి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
జైపూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మహానేతలతో పోల్చవద్దని పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒకప్పటి కాంగ్రెస్ నాయకులపై ఇప్పుడు ఆధారపడవద్దని, ప్రస్తత తరం పరిస్థితులు పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పార్టీ నాయకుడు ఒకరు రాహుల్‌ను మహాత్మా గాంధీతో పోల్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'ఇలా పోల్చడం తప్పు. ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పటి నాయకులతో పోల్చడం సరికాదు. మహాత్మ గాంధీ గొప్ప వ్యక్తి. దేశ స్వేచ్ఛ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. 10-12 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నన్ను ఆయనతో పోల్చవద్దు.' అని రాహుల్ అన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీల గురించి కూడా ప్రస్తావించి భారమైన హృదయంతో సందేశం ఇచ్చారు. 'రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ దేశం కోసం ఎంతో చేసి అమరులయ్యారు. తమ వంతు కృషి చేశారు. కానీ కాంగ్రెస్ ప్రతి సమావేశంలో వాళ్ల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ.. వాళ్లు చేయగలిగినంత చేశారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ల వంతు భూమిక పోషించారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనే దానిపైనే దృష్టి సారించాలి. ప్రజల కోసం ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి' అని రాహుల్ పేర్కొన్నారు. मैं अपने कांग्रेस पार्टी के मित्रों से थोड़ी कड़ी बात कहना चाहता हूं। इंदिरा गांधी जी और राजीव गांधी जी ने अच्छा काम किया... लेकिन कांग्रेस को हर मीटिंग में यह दोहराना नहीं चाहिए। हमें अब ये बोलना चाहिए कि हम जनता के लिए क्या करेंगे। यह ज्यादा जरूरी है। - @RahulGandhi जी pic.twitter.com/0VyYfb478S — Congress (@INCIndia) December 14, 2022 రాహుల్ భారత్ జోడో యాత్రలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా బుధవారం రాజస్థాన్‌లో రాహుల్‌తో పాటు కలిసి పాదయాత్ర చేశారు. శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంటున్న ఈ యాత్రతో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. చదవండి: వారసత్వ ముద్రను పనితీరుతో తొలగిస్తా: ఉదయనిధి -
నెహ్రూ మునిమనవడితో గాంధీ మునిమనవడు
-
నెహ్రూ మునిమనవడితో గాంధీ మునిమనవడు.. వీడియో వైరల్
ముంబై: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతంలోని ప్రముఖులు ఈ జోడో యాత్రలో పాల్గొని ఆకర్షణగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అదీగాక రాహుల్ ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా రాహుల్ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని షెగావ్కి చేరుకోగానే మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ షెగావ్‌లోని భారత్ జోడో యాత్రలో తుషార్ గాంధీ పాల్గొనడం అనేది ఒక చారిత్రత్మకమని ప్రశంసించింది. రచయిత, కార్యకర్త అయిన తుషార్ గాంధీ రాహుల్ గాంధీతో ఈ యాత్రలో హుషార్‌గా పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీల ముని వనవళ్లు ఈ యాత్రలో కలిసి నడవడం అత్యద్భుతమని, ఇద్దరు దివగంత నాయకుల వారసత్వాన్ని కొనసాగించే మహోన్నత వ్యక్తులగా అభివర్ణించింది. ఈ యాత్రలో తుషార్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, దీపేందర్ హుడా, మిలిందా దేవదా, మాణిక్ ఠాక్రే, ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు భాయ్ జగ్తాప్, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలే తదితరలు రాహుల్ వెంట నడిచారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Rahul Gandhi Ji resumes his Padyatra with massive crowds from Akola, Maharashtra. Mahatma Gandhi's great-grandson @TusharG Ji joins #BharatJodoYatra. The Yatra is heading to Shegaon. pic.twitter.com/QRmnkTeMXs — Madhu (@Vignesh_TMV) November 18, 2022 ఈ మేరకు తుషార్ గాంధీ ట్విట్టర్లో ...షేగావ్ తన జన్మస్థం అని, జనవరి 17, 1960న తన అమ్మ వయా నాగ్‌పూర్ హౌరా మెయిల్లో ప్రయాణిస్తున్నప్పుడూ షేగావ్‌లో ఆగిపోయిందని అప్పుడే తాను పుట్టానని చెప్పుకొచ్చారు. ఈ సాయంత్రం షెగావ్‌లో జరిగే బహిరంగ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఈ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో చివరి దశలో ఉంది. నవంబర్ 20కల్లా మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనుంది. తుషార్‌గాంధీ అరుణ్మణిలాల్ గాంధీ తనయుడు. అరుణ్ మణిలాల్ గాంధీ.. గాంధీ-కస్తూరబా గాంధీల రెండో సంతానం అయిన మణిలాల్ మోహన్ దాస్ తనయుడు. (చదవండి: రాహుల్ పాదయాత్రలో మెరిసిన హీరోయిన్.. ఫోటోలు, వీడియోలు వైరల్) -
‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి
భారతదేశం ఈనాడు అంబేడ్కర్ మార్గంలో నడవాలా? గాంధీ మార్గంలో నడవాలా? అనే పెద్ద ప్రశ్న దేశంలోని పార్టీల ముందు ఉంది. భారత దేశంలో ఈనాడు రాజకీయ కూటములు ఎక్కువ ఏర్పడు తున్నాయి. బీజేపీ కూటమి గాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్ భావజాలాల్లో నడుస్తోంది. కాంగ్రెస్ కూటమి గాంధీ, నెహ్రూ భావజాలాల్లో నడుస్తున్నది. కేసీఆర్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి వారితో ఏర్పడుతుందని చెబుతున్న మూడవ కూటమి ఇంకా తన భావజాలాన్ని ప్రస్పుటం చేయలేదు. కానీ భారతదేశంలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మౌలికమైన మార్పు రావాలంటే తప్పకుండా అంబేడ్కర్ భావజాలమే ఈనాడు భారతదేశానికి అవసరం. బీజేపీ పైకి గాంధీ పేరు చెప్తున్నా అది హిందూ మతోన్మాద భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ మార్గంలో నడుపుతోంది. హిందూ మతోన్మాదాన్ని భారతదేశంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సరిగ్గా అంచనా వేశారు. హిందూ మతాన్ని నిర్మూలించకుండా భారతీయ సామాజిక విప్లవం విజయవంతం కాదనీ, హిందూ మతోన్మాదం ప్రమాదకరమైనదనీ అంబేడ్కర్ నొక్కి వక్కాణించాడు. భారత సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోయిన బౌద్ధ ఉద్యమంలోని మాన వతా వాదాన్ని ఆయన పరివ్యాప్తం చేశాడు. కమ్యూని స్టులు ప్రాచీన భారత సామాజిక ఉద్యమకారులను, ఆధునిక సామాజిక ఉద్యమకారులైన మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరియార్ వంటి వారినీ; వారి సిద్ధాంతా లనూ నిర్లక్ష్యం చేశారు. దాని ఫలితంగా భారతదేశంలో ఈనాడు మతోన్మాదం తెట్టెం కట్టుకుపోయింది. మతోన్మాదులు, సామ్రాజ్యవాదుల అండ తీసుకొని మరింతగా బలపడటం ప్రారంభించారు. ఇక దీనికి రాజ్య వ్యవస్థ తోడైందంటే ఎంత ప్రమాదమో చూడండి! అంబేడ్కర్ విషయానికి వస్తే... మొదటి నుండి ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రత్యామ్నా యంగా... భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, తాత్విక రంగాలలో ప్రామాణికమైన కాంగ్రెస్ నాయకులు మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూలను ఎదిరిస్తూ వచ్చాడు. తన ‘వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హావ్ డన్ టు ది అన్‌టచ్‌బుల్స్’ అనే గ్రంథంలో కాంగ్రెస్ నాయకుల నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. నిజానికి కాంగ్రెస్‌లో అంత ర్గతంగా హిందూయిజం వుంది. బీజేపీ తమ సిద్ధాంతకర్తలుగా కాంగ్రెస్ నాయకులను తలకెత్తు కోవడంలోని ఆంతర్యం అదే. అంబేడ్కర్ అసలు హిందూమతం అంటే ఏమిటి? హిందూ మత భావజాలంతో నడిచేవి అసలు పార్టీలు అవుతాయా? అని ప్రశ్నించాడు. నిషేధాల శిక్షాస్మృతినే హిందూ మతంగా చలామణీ చేసి ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించడం జరుగుతోందని అంబే డ్కర్ అన్నారు. ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరొక న్యాయం... వీటిలో ఎప్పటికీ మార్పు లేకుండా చేసి అన్యాయాన్ని శాశ్వతీకరించడం మరీ దురన్యాయం అన్నారాయన. లేని ‘హిందూ’ మతాన్నీ, వాదాన్నీ గాంధీ తలకెత్తుకున్నాడు. దానితో ముస్లిం లీగ్ విజృంభించింది. మతవాద రాజకీయాలు, స్వాతంత్య్ర ఉద్యమాలతోనే హిందూ రాజకీయ వాదం ప్రారం భమైంది. హిందూ శబ్దం వేదాల్లో లేదు. భారత, రామాయణ, భాగవత అష్టాదశ పురాణాల్లో లేదు. వైదిక మతం, బ్రాహ్మణమతం ఉన్నాయి కానీ హిందూ మతం లేదు. ఇప్పుడు బీజేపీ హిందూ మతోన్మాదాన్నీ, కాంగ్రెస్ హిందూ సాంప్రదాయ వాదాన్నీ ముందుకు తెస్తున్నాయి. ఇప్పటికే అంబేడ్కర్ హిందూ ప్రత్యా మ్నాయ రాజకీయ వ్యవస్థను రూపొందించారు. ఆయన కొత్త మ్యానిఫెస్టోలు ఎప్పటికప్పుడు రచిం చారు. అంబేడ్కర్ రాజకీయ ఉద్యమంలో బౌద్ధ తత్వ ప్రభావం వుంది. బౌద్ధ తాత్వికతలో వున్న సమసమాజ నిర్మాణ భావన ఆయనలో వ్యక్తమయ్యింది. అంబేడ్కర్ మానవతావాది. హేతువాది సామ్య వాది. ఆయన జాన్‌డ్యూయీ శిష్యుడు. జాన్‌డ్యూయి లోని ప్రజాస్వామ్య భావాలనూ, కారల్ మార్క్స్‌లోని సామ్యవాద భావాలనూ, కబీరులోని మానవతావాద భావాలనూ ఆయన రాజకీయాలతో సమన్వయిం చారు. ఆయన నిర్మించిన రాజకీయ పార్టీలో సామ్య వాద భావాలు నిండి వున్నాయి. మార్క్స్ భావజాలాన్ని కూడా ఆయన తన రాజకీయ ప్రణాళికలో చేర్చాడు. మార్క్సియన్ పద్ధతిలో కాకపోయినా, భారతీయ సామాజిక విప్లవకారుడిగా సమసమాజం కోరుతున్న అంబేడ్కర్ కుల నిర్మూలనా వాదం వర్గపోరాటానికి సజీవశక్తి అనడంలో అతిశయోక్తి లేదు. అంబేడ్కర్ కొన్ని అంశాల్లో మార్క్స్‌తో విభేదించాడు. కొన్ని అంశాల్లో అంగీకరించాడు. అంగీకరించిన ప్రధాన అంశం ‘సమ సమాజం’. అంగీకరించని అంశం సాధించే పద్ధతిలోనే బలప్రయోగం లక్ష్యం. ఇద్దరిదీ సమ సమాజమే. సాధించే పద్ధతిలోనే కొంత తేడా వుంది. ఇద్దరి సామా జిక తత్త్వవేత్తల వైరుద్ధ్యాలను, సమన్వయాలను పరి శీలించి భారత సామాజిక విప్లవానికి వారిరువురి సిద్ధాంతాలను ఉపయుక్తం చేసుకోవలసిన ‘సమ సామాజిక వాదులు’ ఆ చారిత్రక బాధ్యతను విస్మరిం చారు. కులవాదం మీద అంబేడ్కర్ విశ్లేషణలను మార్క్స్ మీద అంబేడ్కర్ చేసిన విశ్లేషణలుగా ప్రచారం చేసి అంబేడ్కర్‌ను మార్క్స్ వ్యతిరేకిగా చిత్రించడంలో హిందూ కమ్యూనిస్టులు కృతకృత్యులయ్యారు. అంబేడ్కర్, లోహియా, మార్క్స్‌ల భావజాలాల సమన్వయమే హిందూ భావజాల రాజకీయాలకు ప్రత్యామ్నాయం. దళిత బహుజన మైనార్టీ లౌకిక వాదులు ఈ మార్గంలో నడిస్తేనే భారతదేశానికి భావ జాల విముక్తి. భావజాల విముక్తి వల్లే రాజకీయాలకు ప్రత్యామ్నాయ యుగం ఆవిర్భవిస్తుంది. ఆ దిశగా పయనిద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నేత మొబైల్: 98497 41695 -
అవమానించిన ప్రతిసారి గాంధీనే తలచుకున్నా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను అందించిన మహనీయుడు మహాత్మాగాంధీ. అలాంటి మహాత్ముడిని కించపరిచేలా సమాజాన్ని చీల్చే కొన్ని చిల్లరమల్లర శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి విన్నప్పుడల్లా హృదయం బాధపడుతుంది. వారి వెకిలి ప్రయత్నాల వల్ల మహాత్ముడి ప్రభ తగ్గదు. మరుగుజ్జులు ఏనాటికీ మహాత్ములు కాలేరు. వెకిలిగానే చరిత్రలో మిగి లిపోతారు..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొ న్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం బయలుదేరిన తనను కూడా చాలా మంది ఎగతాళి చేసేవారని గుర్తు చేసుకున్నా రు. ఈ బక్కపల్చటోడు ఏం చేస్తాడు, వీడితో ఏం అవుతుందని అవహేళన చేశారని.. అలాంటి సమయంలో తాను కళ్లుమూసుకుని మహాత్మా గాంధీని స్మరించుకునే వాడినని చెప్పారు. గాంధీజీ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ప్రేరణ మహాత్ముడేనన్నారు. గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన 16 అడుగుల మహాత్ముడి కాంస్య విగ్రహాన్ని కేసీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. మేధావులు మౌనం పాటించొద్దు నిస్వార్ధ సేవాపరుడు, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కూడా గాంధీ జయంతి రోజునే అని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ దేశాన్ని రక్షించేవాడు జవాన్ అయితే, అన్నం పెట్టేవాడు కిసాన్ అనే గొప్ప నినాదం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు. కానీ ఈ రోజు మన కళ్లముందు ఏం జరుగుతుందో మేధావులు గమనించాలని.. మౌనం పాటించొద్దని కోరారు. తప్పును విమర్శించి, మంచిని ప్రోత్సహించినప్పుడే ఈ సమాజం ఆరోగ్యంగా ముందుకెళుతుందన్నారు. ఇప్పుడు దేశంలో జవాన్ అగ్నిపథ్‌లో కాలిపోతుంటే.. కిసాన్ మద్దతు ధర లేక కృషించిపోతున్నాడని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. మేధావి లోకం ముందుకొచ్చి దీనిని ఖండించాలన్నారు. అందరికీ ఆయన ఆదర్శం. ఎన్నో కులాలు, మతాలు, జాతులు, భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న దేశంలో ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించి.. నడిపించిన సేనాని మహాత్మాగాంధీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన చేసిన ప్రతిపని, చెప్పిన ప్రతి మాట ఆచరణీయమే అన్నారు. నెహ్రూ, వల్లబ్‌భాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్‌లతోపాటు మార్టిన్ లూథర్‌కింగ్, దలైలామా, నెల్సన్ మండేలా వంటి ప్రపంచ నేతలకూ మహాత్ముడే ఆదర్శమని చెప్పారు. మహాత్మా గాంధీ పుట్టి ఉండకపోతే తాను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కాదని బరాక్ ఒబామా పేర్కొన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. కరోనా మహమ్మారిపై ‘గాంధీ’యుద్ధం! ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి కాలంలో మన రాష్ట్రంలో అత్యంత ధైర్యంగా ప్రజల ప్రాణాలను కాపాడిన ఆరోగ్య సంస్థ గాంధీ ఆస్పత్రి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఇక్కడి వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది గాంధీ ఆదర్శాన్ని పుణికి పుచ్చుకుని.. ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగులను తిప్పిపంపితే.. గాంధీ ఆస్పత్రి అక్కున చేర్చుకుని వేలాది మంది ప్రాణాలను కాపాడిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జీవన్‌రెడ్డి, ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ సురభి వాణి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గాంధీ అహింస విధానం విశ్వజనీనమైంది : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
-
తాడేపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
-
గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్
-
మహాత్మా గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నివాసంలో వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ప్రముఖుల సేవలను స్మరించుకున్నారు. వారి ఆదర్శాలు, ఆలోచనలు సమాజ ఉన్నతి కోసం, దేశ పురోగతి కోసం మనం వేసే ప్రతి అడుగులో ప్రతిధ్వనిస్తాయని సీఎం జగన్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. Fondly remembering two noble personalities of India, father of the nation Mahatma Gandhi and former Prime Minister Lal Bahadur Shastri on their Jayanti. Their ideals and thoughts for the greater good of society will eternally resonate in every stride our nation makes to progress. — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2022 -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మహాత్ముని మాట... స్ఫూర్తి బావుటా: ఉమ్మడి జిల్లాలో రెండుసార్లు పర్యటన
సాక్షి, కర్నూలు: మహాత్ముడు కాలంతో ప్రయాణించే మహనీయుడు. తరాలు మారినా ఇప్పటికీ ఆయన నడిచిన మార్గాన్ని ప్రపంచం అనుసరిస్తోంది. ఆయన జీవితం పవిత్రతకు ప్రతి రూపం. ఆయన బాటే అనుసరణీయం. జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన 1921, 1929 సంవత్సరాల్లో రెండుసార్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నడయాడి స్వాతంత్య్ర ఉద్యమంలో జిల్లా ప్రజలు పాల్గొనేలా చైతన్య వంతం చేశారు. జాతీయ నిధికి విరాళాలు సేకరించడం కోసం మహాత్మా గాంధీ 1921 సెప్టెంబర్ 30న మొట్టమొదటి సారిగా జిల్లాలో అడుగు పెట్టారు. కర్నూలు పురవీధుల్లో ఓపెన్ టాప్ జీపులో తిరిగారు. ఆర్ఎస్ సర్కిల్, ఎస్టీబీసీ కళాశాల, స్టేట్ బ్యాంక్ సర్కిల్, పాత బస్టాండ్, గడియారం ఆస్పత్రి, పూలబజార్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ మీదుగా జాతీయ కాంగ్రెస్ నాయకులు మేడం వెంకయ్యశెట్టి ఇంటికి చేరుకున్నారు. దారి పొడవునా ఇసుకేస్తే రాలని జనం. మేడలపై, మిద్దెలపై బారులు తీరిన జనం. గాంధీని చూడటానికి రోడ్లపై గుమికూడారు. కర్నూలులో అప్పటి ప్రముఖ స్వాతంత్రయ సమరయోధులు మేడం వెంకయ్య శెట్టి, లక్ష్మణస్వామి, రంగనాథ మొదలియార్, పొలిమేర శేషయ్యశెట్టి, గొల్లపూడి సీతారామ శాస్త్రి, గాడిచెర్ల, ఆయన వెంట ఉన్నారు. తుంగభద్రా తీరంలో బహిరంగ సభ తుంగభద్రా నది తీరంలో ఇసుకతిన్నెలో గాంధీజీ బహిరంగ సభ జరిగింది. ఉదయం పదకొండు గంటలకు ఎర్రటి మండుటెండలో జరిగిన ఈ సభకు అప్పట్లోనే దాదాపు 25వేల మంది దాకా జిల్లా నలుమూలల నుంచి హాజరయ్యారని ఒక అంచనా. సభా ప్రాంగణమంతా వందేమాతరం నినాదం మార్మోగింది. గాంధీజీ హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని గాడిచెర్ల తెలుగులో అనువదించారు. 1929లో రెండవ పర్యటన మహాత్మా గాంధీ జిల్లాలో రెండవసారి అడుగు పెట్టింది 1929 మే 21న. ఈ సారి ఆయన పర్యటన పత్తికొండ ప్రాంతంలో జరిగింది. ఖద్దరు నిధికి విరాళాలు సేకరిస్తూ ప్రజల్లో జాతీయ చైతన్యం కలిగిస్తూ గాంధీజీ పర్యటన జరిగింది. జిల్లాలోని చాగల మర్రి, నల్లగట్ల, శిరువెళ్ల, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, నంద్యాల, అయ్యలూరు, పాణ్యం, కర్నూలు, కొనిదేడు, నాగలాపురం, ప్యాలకుర్తి, కోడుమూరు, దేవ నకొండ, జొన్నగిరి, తుగ్గలి పత్తికొండ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో మహాత్మా గాంధీతో పాటు వారి సతీమణి కస్తూరిబా కూడా పాల్గొన్నారు. మహాత్మా గాంధీతో పాటు దేశభక్త కొండా వెంకటప్పయ్య, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, పత్రికా సంపాదకులు వనం శంకరశర్మ, పత్తికొండ తాలుకా ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, ధరణీ రామచంద్రరావు, తొమ్మండ్రు వెంకట నరసయ్య, అగ్రహారం నరసింహారెడ్డి, హెచ్. మాణిక్యరావు, పెండేకల్ రెడ్డిలక్ష్మమ్మ, సి.బజార్రెడ్డి, కాదర్‌బాద్ నర్సింగరావు తదితరులు పత్తికొండ పంచాయతీ బోర్డు కార్యాలయం ముందున్న ఖాళీ స్థలంలో గొప్ప సభ జరిపారు. ఖద్దరు నిధికి విరాళాలు సేకరించి గాంధీజీకి అందించారు. వనం శంకరశర్మ ప్రజలు అందించిన విరాళం రూ.1116ను వేదిక మీద ఖద్దరు నిధికి అందించడం జరిగింది. -
సమగ్ర సమదర్శి... గాంధీజీ!
పుణ్యదంపతులు పుత్లీ బాయి, కరంచంద్ గాంధీలకు 1869 అక్టోబర్ 2న జన్మించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడై మన దేశానికి ఖ్యాతి తెచ్చిన వారిలో అగ్రగణ్యుడుగా నిలి చాడు. మానవాళికి ఎన్నో కొత్త మార్గాలతో తనదైన సరళిలో వెలుగు చూపిన పుణ్యపురుషుని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మహాత్ముని జీవితం నుంచి మనం నేర్చుకోదగినవి ఎన్నో. జాతిని ఏకతాటిపై నడిపించే నాయకులకు ఆర్థిక, సామాజిక, నైతిక విధా నాలపై ఎంతటి అవగాహన ఉండాలో గమనిద్దాం. మహాత్మా గాంధీ అనగానే మనకి స్వతంత్ర సమరం గుర్తుకొస్తుంది. స్వాతంత్య్రమనగానే గాంధీజీ గుర్తుకొస్తారు. అన్ని మత ధర్మాలను చదివి, మంచి విషయాలను ఏరుకొని తనదైన సరళిలో కొత్త కొత్త మార్గాలను సృష్టించారు. వారి విధానాలకు ఎంతో ప్రభావితులమైన మనకు ‘ఒక చెంప కొడితే మరో చెంప చూపడమ’నేది సనాతన ధర్మంలో లేని విషయం అంటే ఆశ్చర్యమేస్తుంది. మన ఆలోచనా విధానాలను ఆయన అంతగా ప్రభావితం చేశారు. ఒక్క మనల్నే మిటి సమస్త ప్రపంచాన్నీ ఎంతో ప్రభావితం చేశారు. అందుకే ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ‘గాంధీజీ లాంటి వ్యక్తి రక్తమాంసాలతో ఈ నేలపై నడయాడారంటే ముందు తరాలవారు నమ్మలేకపోతారు’ అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయా లలో గాంధీజీపై ఏకంగా కోర్సులే నిర్వహిస్తున్నారు (ఉదాహరణకు వర్జీనియా, కొలంబో, ఎడింబరో విశ్వవిద్యాలయాలు). ‘సత్యమేవ జయతే’ అన్నది ఎన్నోతరాలుగా తెలి సిన సత్యం. కానీ ఆచరణలో చూపి అది అందరికీ సాధ్యమని, సత్యాగ్రహం ఒక గొప్ప ఆయుధం అని నిరూపించారు గాంధీజీ. జీవన మార్గాలపై ఎన్నో ప్రయోగాలు చేసిన గాంధీజీ తన ఆత్మకథకు ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’ అని పేరుపెట్టారు. దానికి అదే సరైన పేరు. అప్పటికే మహాత్ముడిగా పేరొందిన గాంధీజీ (ఆ బిరుదును రవీంద్రనాథ్ టాగోర్ ఇచ్చారు), తన ఆత్మకథలో తన తప్పిదాలను ఎన్నో ప్రస్తావించారు. చిన్నప్పుడు పొగతాగుతూ పట్టుబడి తండ్రి చేతిలో దెబ్బలుతిన్న విషయం ప్రస్తావించారు. పెళ్ళైన తరువాత విదేశాలకు వెళ్తు న్నప్పుడు తల్లితో మద్యం, మాంసం, మగువలను ముట్టనని ఒట్టువేసి వెళ్ళారు. మద్యం ఒకసారీ, మాంసం ఒకసారీ రుచి చూడడం చేశానని రాసు కొన్నారు. మగువ విషయంలోనూ ఒకానొకప్పుడు ఎంతో ఉద్వేగానికి గురై త్రుటిలో తప్పించుకొన్నాననీ రాసుకొన్నారు. మామూలు మనుషులైతే తప్పి పోయిన ఒట్టు గురించి ప్రస్తావనే చేసేవారు కాదేమో. అంతటి సత్యవాది కనుకనే ఆయన మహాత్ము డైనాడు. అహింస గురించి బుద్ధుడు, అశోకుడు ఎంతో ప్రచారం చేశారు. కానీ అహంస ఒక తిరుగులేని గొప్ప ఆయుధం అని నిరూపించడం గాంధీకే సాధ్యమైంది. ఆయన చూపిన అహింస సత్యాగ్రహాలను వాడి మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా మహోన్నత చరితులుగా నిలిచారు. కొద్ది సంవత్సరాల క్రితం మండేలా కనుమూసినప్పుడు ఆయనను, ఆయన అనుసరించిన అహింసామార్గాన్ని శ్లాఘించని ప్రపంచ పత్రిక లేదు. అసంఖ్యాకులు పాల్గొనే ఉద్యమంలో అహింసా మార్గాన్ని మొదటిసారిగా ప్రయోగించి దానికి వెలుగు తెచ్చిన మహాత్ముడు మన గాంధీజీ. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశ లింగం వంటి సంఘసంస్కర్తలు అంటరాని తనాన్ని ఖండించారు. ఐతే వారి ప్రభావం కేవలం విద్యా వంతుల మీద మాత్రమే వున్నది. కానీ గాంధీజీ అస్పృశ్యతా నివారణ చేపట్టిన తరువాత అంటరాని తనం అమానుషమని చాలామంది గమనించారు. బాల్యవివాహాలను ఖండించారు. బాలవితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించారు. బోధించిన ప్రతి విషయాన్ని ఆచరణలో చూపే గాంధీజీ తత్వం, ఆయన ఏ ఉద్యమం చేపట్టినా విజయవంతం చేసేది. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని నినదించి పల్లెసీమల బడుగు వర్గాల అభివృద్ధికి పాటుబడ్డారు. పదిమందికీ మేలుజరగని దేశాభివృద్ధి అర్థరహితమైన అభివృద్ధని కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. విదేశీ వస్తువులను బహిష్కరించి తన స్వహస్తాలతో రాట్నం తిప్పి నూలు వడికి ఖద్దరు ధరించి స్వాతంత్య్ర సమరానికి రాట్నాన్ని చిహ్నం చేశారు. దేశ ఆర్థిక, సామాజిక, నైతిక పరిస్థితుల గురించి ఆలోచించే సమగ్ర సమదర్శకులు ఆయన. అన్ని విషయాలనూ క్షుణ్ణంగా పరిశీలించే సంపూర్ణ మేధావిగా గాంధీజీ నిలిచారు. అనుక్షణం దైవస్మరణలో జీవితం గడిపే గాంధీజీకి తెలుగువారిలో ప్రముఖ నాస్తికవాదులుగా పేరొందిన గోరాకి సత్సంబంధాలుండేవి. మార్గాలు వేరైనా మానవతావాదులుగా ఒకటైన వారి స్నేహం ఎలాగుండేదంటే గోరా గారి పుత్రుడైన లవణంకు ప్రముఖ తెలుగుకవి గుర్రం జాషువా పుత్రిక హేమ లతతో వివాహం గాంధీ ఆశ్రమంలో వారి అభినం దనలతో జరిగింది. బాపూజీతో ఎన్నో అభిప్రాయ భేదాలున్న నేతాజీ గాంధీజీని అందరికన్నా ముందుగా జాతిపితగా అభివర్ణించారు. వ్యాసకర్త: ప్రొఫెసర్ ఎమ్ఆర్కే కృష్ణారావు, గాయత్రీ విద్యాపరిషత్, వైజాగ్, మొబైల్: 93924 81282 -
మహాత్ముని మార్గంలో " ర్యాగట్లపల్లి "
-
వైఎస్సార్ జిల్లా యువతికి అరుదైన అవకాశం.. పార్లమెంట్లో ప్రసంగించే చాన్స్
వైవీయూ: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది కడపకు చెందిన యువతి మిద్దె రూప. ఆర్థిక ఇబ్బందులు వెక్కిరిస్తున్నా.. అధ్యాపకుల తోడ్పాటుతో అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతున్న ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్‌శాస్త్రి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే అరుదైన చాన్స్ పొందింది. దేశవ్యాప్తంగా 15 మంది యువతీ యువకులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కడప జిల్లాకు చెందిన మిద్దె రూప ఒక్కరే ఉండటం విశేషం. వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురానికి చెందిన మిద్దె సత్యనారాయణ (లారీ డ్రైవర్), రమాదేవి (గృహిణి) దంపతుల కుమార్తె మిద్దె రూప కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ టూరిజం కోర్సును ఇటీవల పూర్తి చేసింది. అధ్యాపకులు, ప్రిన్సిపాల్ తోడ్పాటుతో రూప చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తూ పోటీ ఏదైనా విజేతగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె దాతల సహకారంతో హైదరాబాద్‌లోని ఓ స్టడీ సర్కిల్లో సివిల్స్‌కు సన్నద్ధం అవుతోంది. ప్రభుత్వ కళాశాల నుంచి పార్లమెంట్ వరకు... అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే విద్యార్థులు, యువతీ యువకులను ఎంపిక చేసేందుకు నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న తొలుత జిల్లాస్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా, వీరిలో రూప అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన నలుగురిలో ఒకరిగా నిలిచింది. అనంతరం జాతీయ స్థాయిలో 35 మంది పోటీపడ్డారు. చివరగా టాప్–15 అభ్యర్థులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు ఎంపిక చేశారు. ఈ 15 మంది జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని మిద్దె రూప కావడం విశేషం. రూప పార్లమెంట్లో అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ గురించి ఇంగ్లిష్‌లో ప్రసంగించనుంది. కడప విద్యార్థినికి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లభించడంపై నెహ్రూ యువకేంద్రం జిల్లా సమన్వయకర్త మణికంఠ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సుబ్బలక్షుమ్మ, చరిత్ర అధ్యాపకుడు బాలగొండ గంగాధర్ తదితరులు సంతోషం వ్యక్తంచేశారు. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) -
గాంధీ వేషధారణలో 750 మంది చిన్నారులు
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 750 మంది విద్యార్థులు మహాత్మాగాంధీ వేషధారణలో అలరించారు. చేనేత మగ్గం, రాట్నం, రాట్నంపై నూలు వడికే విధానాన్ని ప్రదర్శించారు. విద్యార్థులంతా జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటిచెప్పారు. -
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కొన్ని సంగతులు...
►1947, ఆగస్ట్ 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాల్లో మునిగి ఉంటే గాంధీ మాత్రం ఆ వేడుకలకు దూరంగా ఉండిపోయారు. బెంగాల్లో చెలరేగిన మతకలహాలకు నిరసనగా నిరహార దీక్ష చేస్తూ. ►రవీంద్రనాథ్ టాగోర్ ‘జనగణ మన’ను 1911లో రచించారు. అది జాతీయ గీతంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది 1950, జనవరి 24 నుంచి. రవీంద్రుడే రాసిన (1905) ‘అమోర్ సోనార్ బంగ్లా’లోని మొదటి పదిలైన్లను తీసుకొని బంగ్లాదేశ్ తన జాతీయ గీతంగా పాడుకుంటోంది. అంతేకాదు శ్రీలంక జాతీయ గీతమైన ‘శ్రీలంక మాతా’ గీతానికి, స్వరకల్పనకూ రవీంద్రనాథ్ టాగోర్ సాహిత్యం, సంగీతమే స్ఫూర్తి. ►స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1973 వరకు ఆగస్ట్ 15న గవర్నర్లే ఆయా రాష్ట్రాల్లో జెండా వందనం చేసేవారు. ఈ పద్ధతిని కాదని ఆగస్ట్ 15న ముఖ్యమంత్రులే జెండా వందనం చేయాలనే కొత్త సంప్రదాయాన్ని సూచించింది ఎమ్. కరుణానిధి.. 1974లో. ►ప్రతి ఆగస్ట్ 15న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే జెండా వందనం చేస్తే బాగుంటుందని.. ఈ సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి లేఖ రాశారట. ఆ ప్రతిపాదనను ఆమె ప్రభుత్వం ఒప్పుకుంటూ 1974 నుంచి అమల్లోకి తెచ్చింది. ►మన జాతీయ పతాకం తయారయ్యేది ఒకే ఒక్క చోట. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఉన్న ‘కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగసంయుక్త సంఘ (కేకేజీఎస్సెస్)’లో తయారయ్యి దేశమంతా పంపిణీ అవుతుంది. అదీ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్ధారించిన ప్రమాణాల్లో. -
మహాత్మా మన్నించు..
దేశమంతటా తిరంగా ఉత్సవాల్లో మునిగితేలుతోంది. స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిని నడిపించి అహింసా విధానంలో స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన గాంధీజీకి జేజేలు పలుకుతున్నాం. కానీ ఆయన విశ్రమించిన భవనాల బాగోగులూ ఎవరికీ పట్టడం లేదు. తుమకూరు: జాతి పిత మహాత్మా గాంధీ నడయాడిన స్థలాలు ఎంతో పేరుపొంది నేడు పర్యాటక ప్రదేశాలుగా మారాయి. ఆ మహానుభావుడు బసచేసిన భవనాలు స్మారక కట్టడాలుగా పేరు పొందాయి. కానీ తుమకూరు జిల్లాలోని తిపటూరులోని ఓ కట్టడానికి ఆ భాగ్యం కలగలేదు. గాంధీజీ సేదతీరిన ఒకనాటి ఇల్లు నేడు కనీస పర్యవేక్షణ లేక అధ్వాన్నంగా మారిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. తిపటూరులోని పాత బీడిఓ కార్యాలయం ప్రస్తుతం తాలూకా పంచాయతీ ఆఫీసు వెనుక భాగంలో ఉన్న ఓ ఇల్లు ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో.. 1927 ఆగస్టు 21వ తేదీన దేశమంతటా పర్యటిస్తూ తిపటూరుకు వచ్చిన బాపూజీ ఇదే గదిలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే ఉన్న చేద బావి నీటిని ఉపయోగించారు. అలా ఆ భవనం చరిత్రకెక్కింది. 1915– 1948 వరకు సంఘటనలతో కూడిన డీటైల్డ్ క్రోనాలజీ అనే పుస్తకంలో కూడా నమోదు చేశారు. జయదేవ హాస్టల్ ఆవరణలో సభలో గాంధీజీ ప్రసంగిస్తూ స్వరాజ్య సంగ్రామంలో పాల్గొనాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ ఘన చరిత గల భవనం నేడు నిర్లక్ష్యపు చీకట్లో మగ్గుతోంది. చుట్టూ చెత్త పేరుకుపోయింది. జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. తుమకూరు కాలేజీ మైదానం గది కూడా.. అలాగే తుమకూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న మహాత్మా గాం«దీజీ స్మారక భవనం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎమ్మెల్యే పరమేశ్వర్ ఆదివారం ఆ భవనాన్ని పరిశీలించారు. 1932లో, 1937లో గాం«దీజీ పలుమార్లు తుమకూరు జిల్లాకు వచ్చారని, అప్పుడు కాలేజీ మైదానంలో ఉన్న గదిలో బస చేశారని చెప్పారు. ఆ గదిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పటికైనా సంరక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: వీడియో: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు.. ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి -
స్వాతంత్య్ర పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు గాంధీజీ ప్రేరణ
సాక్షి, అమరావతి/విజయవాడ సెంట్రల్: దేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు మహాత్మా గాంధీ ప్రేరణగా నిలిచారని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సర్వోదయ ట్రస్ట్ నేతృత్వంలో విజయవాడలోని స్వాతంత్య్ర సమర యోధుల భవన్లో గాంధీజీ 30 అడుగుల కుడ్య చిత్రాన్ని ఆదివారం గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న తరుణంలో ఆగస్టు 15 వరకు తమ నివాసాలపై ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. ఇది దేశాన్ని ఐక్యత దిశగా నడిపే ‘ఏక్ భారత్–శ్రేష్ట భారత్’దిశగా పయనింపచేస్తుందన్నారు. జాతీయ జెండా ఎగురవేస్తున్న గవర్నర్ హరిచందన్.30 అడుగుల మహాత్మాగాంధీ కుడ్య చిత్రం దేశభక్తుల భూమి ఆంధ్రా స్వాతంత్య్ర సమర వీరులు, దేశభక్తుల భూమి ఆంధ్రప్రదేశ్ అని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి స్వాతంత్య్ర సమరయోధుల సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం గాంధేయ తత్వానికి నాడీ కేంద్రంగా పని చేస్తుండటం గొప్ప విషయమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించే లక్ష్యంతో సర్వోదయ ట్రస్ట్ పనిచేస్తుండటం ముదావహమన్నారు. సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధుడు గద్దె లింగయ్య పేరిట గ్రంథాలయం నిర్వహించటం అభినందనీయమని పేర్కొన్నారు. పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, సర్వోదయ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ జీవీ మోహనప్రసాద్, కలెక్టర్ ఢిల్లీరావు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, స్వాతంత్య్ర సమరయోధురాలు మనోరమ, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ ఎంసీ దాస్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోతుకూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
గాంధీ.. ఆ ఊరోళ్లకు గాంధమ్మ
మహాత్మా గాంధీ.. ఆ ఊరి వాళ్లకు ఓ శక్తి స్వరూపిణి. అందుకే ఏటా శ్రావణ మాసంలో మొదటి ఆదివారం గాంధీజీని గ్రామ దేవత రూపంలో గాంధమ్మగా కొలుస్తారు. పూలు, పసుపు, కుంకుమ, నైవేద్యాలు సమర్పించి సంబరాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న ఆచారం ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఏటా కేదారిపురంలో రైతులు పొలాల్లో నాట్లు వేయడానికి ముందు గాంధమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. గాంధీజీ తమ గ్రామంలో శక్తి అవతారం గాంధమ్మగా వెలిశారని.. ఆ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్తుల విశ్వాసం. అందుకే.. తొలకరి వర్షాలు కురిసిన తరువాత దుక్కులకు వెళ్లే ముందు గాంధమ్మ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ప్రతి ఇంటినుంచీ వడపప్పు, పానకాలు, పసుపు నీటితో భారీ ఊరేగింపు నిర్వహించి గ్రామ నడిమధ్యన గాంధీజీ చిత్రపటాన్ని ఉంచి ముర్రాటలు సమర్పిస్తారు. ఆదివారం నాడు గ్రామంలోని మహిళలంతా ఊరేగింపు నిర్వహించి పూజలు నిర్వహించారు. గాంధమ్మకు నైవేద్యం సమర్పించి ప్రసాదంగా పంచి పెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఈ ఊరి వారంతా గాంధేయ వాదులుగా ఉంటూ ఆయనపై అపరిమిత ప్రేమ చూపించేవారు. అవే ఇప్పుడు ఇలా గాంధమ్మ పూజలుగా మారాయి. – కాశీబుగ్గ -
వాస్తవాలే లక్ష్యంగా ‘1948 - అఖండ భారత్’
మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి గల కారణం ఏంటి? హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘1948 - అఖండ భారత్’. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలేఖ్య శెట్టి, రఘనందన్, ఆర్యవర్ధన్ రాజ్, ఇంతియాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్ర విడుదలను పుర్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ... "గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానికి కారణం... కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. వాటిని తమ చిత్రంలో చూపించబోతున్నామని చెప్పారు. ‘70 సంవత్సరాల పాటు దాచి పెట్టబడిన నిజాలను... ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్ ని సిద్ధం చేశాం... మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం' అన్నారు చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి.బాబు మాట్లాడుతూ...11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి... 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో... ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’అన్నారు. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉందని... దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్... ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే... ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు. ‘1948 - అఖండ భారత్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి పనిచేసే అవకాశం రావడం పట్ల సంగీత దర్శకుడు ప్రజ్వల క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. -
సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డు ఏరియాకు ఎన్నో ప్రత్యేకతలు
సాక్షి, హైదరాబాద్: 75 ఏళ్ల భారత స్వాతంత్ర సమరోత్సవాన్ని పురస్కరించుకొని.. అప్పటి మహా సంగ్రామ సమయంలో హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉన్న అద్భుత ఘట్టాలను ‘సాక్షి’ ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ మొదటిసారి నగరంలో పర్యటించిన సందర్భానికి ప్రత్యేక విశేషముంది. 1929 ఏప్రిల్ 7వ తేదీన గాంధీ మొదటిసారి నగరానికి విచ్చేశారు. ఆ రోజు జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్లో దిగిన గాంధీజీ. అక్కడి నుంచి సుల్తాన్ బజార్ చేరుకున్నారు. ఈ సందర్భానికి గుర్తుగా భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత జేమ్స్ స్ట్రీట్‌కు ఎంజీ (మహాత్మా గాంధీ) రోడ్డుగా నామకరణం చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతంలో నివాసమున్న జేమ్స్ కిర్క్‌పాట్రిక్ పేరు మీద ఆ వీధిని జేమ్స్ స్ట్రీట్‌గా పిలిచారు. వ్యాపారానికి కేంద్రం ప్రస్తుత ఎంజీ రోడ్డు జేమ్స్ స్ట్రీట్‌గా పిలువబడుతున్నప్పటి నుంచే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జేమ్స్ స్ట్రీట్ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్తక వ్యాపారాలకు చెందిన పెద్ద షాప్‌లు దర్శనమిస్తాయి. దాదాపు 150 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో గోల్డ్ మార్కెట్ అభివృద్ధి చెందుతూ వస్తుంది. జనరల్ బజార్, క్లాత్ మార్కెట్‌కు ఎంజీ రోడ్డు మీదుగానే చేరుకునేవారు. ఇక్కడి వస్త్ర వ్యాపారం గురుంచి తెలుసుకున్న మహాత్మా గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. దేశంలోని వస్త్ర వ్యాపారానికి హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు ప్రత్యేక కేంద్రాలని కొనియాడారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాహనాలు ఎంజీ రోడ్ మీదుగానే ప్రయాణిస్తాయి. నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్, రాణీ గంజ్ బస్ డిపో, జూబ్లీ బస్టాండ్లకు మధ్య వారధిగా కూడా ఎంజీ రోడ్ ఉంటుంది. ప్రభుత్వం వారసత్వ కట్టడంగా గుర్తించిన మలానీ భవనం కూడా ఎంజీ రోడ్లోనే ఉంది. ఈ భవనాన్ని నిర్మించిన దేవాన్ బహదూర్ రాంగోపాల్ మలానీ పోలీసు శాఖకు విరాళంగా ఇవ్వగా..ఈ భవనం పోలీస్ స్టేషన్‌గా మారింది. ఇక్కడే ఉన్న గడియారాన్ని 1998లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించింది. ఆ విగ్రహం.. ఎంతో ప్రత్యేకం.. ప్రస్తుతం ఎంజీ రోడ్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్యారడైజ్ బిర్యానీ రెస్టారెంట్ స్థానంలో ప్యారడైజ్ థియేటర్ ఉండేది. ఆ థియేటర్ యజమాని తొడుపునూరి అంజయ్య గౌడ్ గాంధీజీ పర్యటనకు గుర్తుగా అప్పట్లోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని విరాళంగా అందించారు. 1951లో ఈ విషయం తెలుసుకున్న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో ప్రత్యేకంగా ఇటలీలో తయారు చేయించారని సమాచారం. 70 ఏళ్లుగా ఈ విగ్రహం ఎంజీ రోడ్డులో అందరికీ కనిపిస్తుంది. ఈ గాంధీ సర్కిల్‌కు ఇటీవల జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులను చేపట్టారు. -
భయంకర వెంకటాచారి: గాంధీమార్గం వీడి బాంబులతో జోడీ
గాంధీ– ఇర్విన్ ఒప్పందంలో భాగంగా ఖైదీల విడుదల జరిగినప్పుడు భయంకర్ కూడా విడుదలయ్యారు. ఈ ఘటన అనంతరం ఆయన భావజాలంలో మార్పు వచ్చింది. కేవలం విప్లవం ద్వారా మాత్రమే సంపూర్ణ స్వతంత్రం సిద్ధిస్తుందని ఆయన భావించారు. పేరులో మాత్రమే కాదు చర్యలతో కూడా వలసపాలకులకు దడ పుట్టించిన పోరాట యోధుడు భయంకర వెంకటాచార్యులు. బ్రిటిష్‌వారి తొత్తులుగా పనిచేసే స్థానిక అధికారులను మట్టుబెట్టి తద్వారా వారిలో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నించిన వ్యక్తి. కాకినాడ బాంబు కేసుగా ప్రసిద్ధి గాంచిన కేసులో ప్రథమ ముద్దాయి. విప్లవ భావాలు కల దేశభక్తుడు భయంకరాచారిని స్థానికులు ఆంధ్రా భగత్ సింగ్ అనేవారు. సాహో లాహోర్ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1910లో జన్మించిన భయంకరాచారి పదో తరగతి వరకు అక్కడే చదివారు. అనంతరం విశాఖలో చదువు కొనసాగించారు. చదువుకునే రోజుల్లోనే ఆయన లాహోర్ కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం గాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొన్నారు. గురజానపల్లిలో ఆయన ఉప్పు సత్యాగ్రహం నిర్వహిస్తుండగా అరెస్టయి జైలుకు వెళ్లారు. గాంధీ– ఇర్విన్ ఒప్పందంలో భాగంగా ఖైదీల విడుదల జరిగినప్పుడు ఆయన కూడా విడుదలయ్యారు. ఈ ఘటన అనంతరం ఆయన భావజాలంలో మార్పు వచ్చింది. కేవలం విప్లవం ద్వారా మాత్రమే సంపూర్ణ స్వతంత్రం సిద్ధిస్తుందని ఆయన భావించారు. ఇందుకోసం బ్రిటిష్ ప్రభుత్వం కింద పనిచేస్తూ స్వదేశీయులపై దమనకాండ జరిపే అధికారులను మట్టుబెట్టాలని ఆలోచన చేశారు. దీనివల్ల బ్రిటిషర్లకు స్థానికాధికారుల సాయం తగ్గుతుందని భావించారు. డీఎస్పీకి ముహూర్తం! ఆ సమయంలో కాకినాడలో ముస్తఫా ఆలీ ఖాన్ డీఎస్పీగా పనిచేస్తుండేవాడు. ఆయన కింద డప్పుల సుబ్బారావనే సీఐ ఉండేవాడు. వారిద్దరూ స్వతంత్ర సమర యోధుల పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించేవారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలని భయంకరాచార్యులు నిర్ణయించుకున్నారు. కామేశ్వర శాస్త్రి తదితరులు ఆయనకు సహకరించేందుకు అంగీకరించారు. వీరంతా కలకత్తా, బొంబాయి, పాండిచ్చేరి నుంచి బాంబు తయారీ సామగ్రిని తెప్పించి తమ ప్రణాళికను కొనసాగించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యక్షేత్రంగా ఉండేందుకు గాను సి.హెచ్.ఎన్.చారి అండ్ సన్స్ అనే ఒక దొంగ కంపెనీని పెట్టారు. అయితే 1933 ఏప్రిల్ 6, 14 తేదీలలో చేసిన వీరి యత్నాలు రెండూ విఫలమయ్యాయి. అనంతరం ఏప్రిల్ 15న మూడో ప్రయత్నానికి వీరంతా సిద్ధమయ్యారు. కాకినాడలో కాపుగాసి 1933 ఏప్రిల్ 15న ముస్తఫా కాకినాడ వస్తాడని తెలుసుకొన్న భయంకరాచార్యుల బృందం బాంబులు తయారుచేసుకొని పోర్టులో మాటు వేసారు. కానీ మూడోసారి కూడా ముస్తఫా అటు వైపు రాలేదు. దీంతో ఈదఫా ముస్తఫాను చంపకుండా ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకొని, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి, దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్లారు. వీళ్లు కాఫీ తాగుతూండగా రేవు కూలీ ఒకతను పడవలో ఉన్న సంచీని చూసి కుతూహలం కొద్దీ సంచీని తెరచి బాంబులను బయటికి తీసాడు. బాంబు పేలింది. ఆ కూలీతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు. పేలుడు స్థలానికి కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే ఉన్న ముస్తఫా, పేలుడును విని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. తక్షణం దర్యాప్తు మొదలైంది. ఘటనా స్థలంలో మరో మూడు బాంబులు దొరికాయి. అదొక విప్లవకారుల కుట్ర అని, అధికారులను చంపే పథకమనీ ఓ ఐదు రోజుల వరకూ దర్యాప్తు అధికారులకు తెలియలేదు. ఐదు రోజుల తరువాత కాకినాడకు చెందిన ఎస్.కె.వి.రాఘవాచారి అనే వ్యక్తి రామచంద్రాపురం పోలీసులకు కుట్ర సంగతి వెల్లడించడంతో విషయం బైటపడింది. అండమాన్‌లో ఏడేళ్లు అనంతరం పోలీసులు కుట్రలో పాల్గొన్న వారిని ఒక్కొక్కర్ని పట్టుకున్నారు. ఆ ఏడాది సెప్టెంబర్ 11 న భయంకరాచారిని ఖాజీపేట్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. డిసెంబరు 1933 నుండి ఏప్రిల్ 1934 వరకు తూర్పు గోదావరి జిల్లా సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మంది కుట్రదారులకు వేరువేరు శిక్షలు విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ తీర్పు 1935 సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచార్యులు, కామేశ్వరశాస్త్రిలను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురినీ అప్పటికే వారు గడిపిన రెండేళ్ల శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది. భయంకరాచారికి ఏడేళ్ల జైలుశిక్షను విధించి, అండమాను జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ల శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చాక ఆయన ‘క్రైగ్స్ పారడైజ్’ అని అండమా¯Œ లో దుర్భర పరిస్థితులను వర్ణిస్తూ పుస్తకం రాశారు. తర్వాత రోజుల్లో ఆయన ప్రకాశం పంతులుగారికి మద్దతుదారుగా మారారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వంలో ఉద్యోగం చేశారు. 1978లో మరణించారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
ఐమాక్స్‌లో ‘గాంధీ’ చిత్ర ప్రదర్శన.. ప్రారంభించిన మంత్రి తలసాని
-
మహాత్ముడికే కళంకమా?.. చిల్లర వేషాలు ఆపాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘విశ్వమానవుడు అని ప్రపంచం కీర్తిస్తున్న జాతిపిత మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యలు వింటున్నాం. దురదృష్టకరమైన సంఘటనలు చూస్తున్నాం. ఇది ఏమాత్రం మంచిదికాదు. కోటానుకోట్ల మంది గాంధీజీ ఫొటోను నెత్తిన పెట్టుకొని ఊరేగిన దేశం ఇది. ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను తానే మలినం చేసుకోదు. అలాంటి వెకిలి, మకిలి ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా ఏకీకృతంగా, ఏకోన్ముఖంగా, ఏకకంఠంతో ఖండించాలి. మహాత్ముని కీర్తి మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ప్రయత్నించాలి. మహాత్ముడు ఎన్నటికీ మహాత్ముడిగానే ఉంటడు. చిల్లరమల్లర శక్తులు చేసే ప్రయత్నాలు ఏనాటికీ నెరవేరవు. ఆకలి, పేదరికం ఉన్నంత వరకు ఆక్రందనలు, అలజడులు ఉంటాయి’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. జాతీయ జెండాను ఎగరేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిఒక్కరూ ఖండించాలని, కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... త్యాగధనులకు నివాళులు... నేను గాంధేయవాదిని అని గర్వంగా చెప్పుకొనే వాళ్లు కోటాను కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. చౌటుప్పల్ దగ్గర ఓ అధికారి మహాత్మునికి గుడి కట్టించాడు. ఇండియా నుంచి వచ్చామని చెబితే విదేశీయులు గాంధీ దేశం నుంచా? అని అడిగినప్పుడు గర్వపడ్డ చరిత్ర మనది. అలాంటి మహాత్మునికి ఏమాత్రం కళంకం వచ్చినా సహించరాదు. 1947 ఆగస్టు 15 నుంచి 1975 మే 16 వరకు ఎన్నో ప్రయాసాలకు ఓర్చి 584 సంస్థానాలను, స్వతంత్ర దేశాలను విలీనం చేస్తే ప్రస్తుత భారతదేశం రూపుదాల్చింది. ఈ కూర్పు కోసం ఎందరో మహానుభావులు, ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని చూశాం. ఎంతమందిమైనా చస్తం కాని మా స్వేచ్ఛ వాయువులు పీల్చేంత వరకు జెండా దించబోమని అనేక మంది భరతమాత బిడ్డలు, భగత్‌సింగ్ లాంటి త్యాగధనులు అసువులు బాసారు. వారందరికీ తెలంగాణ తరఫున నివాళులు. అభివృద్ధిని ద్విగుణీకృతం చేసే దిశగా... కొన్ని ప్రతికూల శక్తులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని చూసి బాధ పడాల్సిన అవసరం లేదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి తరిమికొట్టిన గడ్డ మనది. ప్రశాంత, సస్యశ్యామల భారతదేశాన్ని చీల్చడానికి జరుగుతున్న చిల్లరమల్లర ప్రయత్నాలను ఏకకంఠంతో ఖండించాలి. స్వాతంత్య్ర స్ఫూర్తిని, జరుగుతున్న అభివృద్ధిని ద్విగుణీకృతం చేసే దిశగా ముందుకు పోవాలె. తెలంగాణ నుంచి అవసరమైతే జాతీయ స్థాయిలో వెళ్లి పనిచేయడానికి సమాయత్తం కావాలె. ఉప్పు సత్యాగ్రహంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి వాళ్లు చాలా మంది పాల్గొన్నారు. ఆ స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలి. సిపాయిల తిరుగుబాటు విఫలమైనా పోరు ఆగలేదు భారత స్వాతంత్య్రం సుమారు ఒకటిన్నర శతాబ్దంపాటు కొనసాగిన పోరాటం. విప్లవ శక్తులు విజయం సాధించిన వేళ కూడా వాళ్లతో రాజ్యానికి సహకరించే సగం మంది కలిసినప్పుడే విజయం సాధిస్తుంది. అట్లాగే సాయుధ బలగాలు పోరాటం, తిరుగుబాటు చేస్తే రాజ్యం పోవాలి. కానీ భారత స్వతంత్ర సమరంలోని 1857 సిపాయిల తిరుగుబాటు వంటి ఉజ్వల ఘట్టం తర్వాత కూడా ఆనాటి బ్రిటిష్ వలసరాజ్యం కూలిపోలేదు. మరింతగా ఉద్యమాన్ని అణచివేసింది. అయినా ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు విఫలమైందని ఎనాడూ నిరాశ చెందలెదు. వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకొని పోరాటాన్ని కొనసాగించారు. మహాత్మాగాంధీ నడుంకట్టడంతో దేశం ఆయన వెంట నడిచింది. అద్భుతంగా వజ్రోత్సవ వేడుకలు జరగాలి మహోజ్వలమైన స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి.. వాడవాడలా గ్రామగ్రామాన అద్భుతంగా జరగాలి. ఎన్ని త్యాగాలతో, పోరాటాలతో, వేదనలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం వచ్చిందో ప్రతిగడపకూ తెలిసేలా ఉత్సవాలు నిర్వహించాలి. కొత్త తరానికి స్వతంత్ర భారత పోరాటాల గురించి తెలియజేయాలి. గాంధీజీ సినిమాను 560 స్క్రీన్లలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు చూపించేలా ఏర్పాట్లు చేశాం. ఎక్కడివారు అక్కడే ఉండి సామూహిక జాతీయ గీతాలాపనను రాష్ట్రమంతా ఏకకాలంలో నిర్వహిస్తాం. పేదరికాన్ని నిర్మూలిస్తేనే శాంతి.. దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తేనే సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం లభిస్తుంది. ప్రజల ఆపేక్షలు అనుకున్న స్థాయిలో నెరవేరలేదు. దళిత సమాజం మాకు జరగవలసినంత జరగలేదని ఆక్రోశిస్తుంది. ఇంకా కొన్ని అల్పాదాయ వర్గాలు, పేదలు అసంతృప్తితో ఉన్నారు. సాయుధ పోరాటాలు వచ్చినయ్. స్వాతంత్ర్యం రాకముందే 1940లో తెలంగాణ గడ్డ మీద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జాగీర్దారీ వ్యతిరేక పోరాటం జరిగింది. అది కొంత చైతన్యాన్ని తెచ్చింది. ఆ తర్వాత నక్సలిజంతోపాటు అనేక పోరాటాలు వచ్చాయి. వాటన్నింటినీ అధిగమించాలంటే సంకుచిత భావాలను పక్కనబెట్టి విశాల దృక్పథంతో ఆర్తులు, అన్నార్థులు, పేదలందరి సౌభాగ్యం కోసం కంకణబద్ధులై సాగాలి. ఈ దేశం నాదనే అభిప్రాయం ప్రతిఒక్కరిలో కలగాలి. తెలంగాణ వచ్చాక పునర్నిర్మాణంలో ఎంతగానో కష్టపడుతున్నాం. ఎనిమిదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నో సాధించాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఫరిడవిల్లుతున్నాయి. 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. విశ్వమానవుడు మహాత్మా గాంధీ.. భారతదేశ స్వతంత్ర సముపార్జన సారథే కాదు.. యావత్ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు మన మహాత్మాగాంధీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా భారత పర్యటనలో భాగంగా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ‘గాంధీజీ ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’ం అని ఆయన పేర్కొనడంతో అప్పుడు ఎంపీగా ఉన్న ఎంతో గర్వపడ్డాను. అలాగే ఐన్‌స్టీన్, నెల్సన్ మండేలా గాంధీజీ వ్యక్తిత్వాన్ని ఎంతగానో కొనియాడారు. అటువంటి జాతికి వారసులం మనందరం. యువతకు స్వాతంత్ర్యం విలువ తెలపాలి క్విట్ ఇండియా సంస్మరణ సందర్భంగా కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరంలో భాగంగా డూ ఆర్ డై నినాదంతో 1942 ఆగస్టు 8న గాంధీజీ ప్రారంభించిన క్విట్ ఇండియా మహోద్యమాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నాటి మహనీయులకు నివాళులరి్పంచారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంతటి విలువైనవో నేటి యువత తెలుసుకోవాలి్సన అవసరం ఉందన్నారు. అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వతంత్ర వజ్రోత్సవ కార్యకలాపాలు సోమవారం హెచ్ఐసీసీలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా కళాకారులు నిర్వహించిన నృత్య, సంగీత ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఆసక్తిగా తిలకించి కళాకారులను అభినందించారు. లేజర్ షోలు, ఫ్యూజన్ డ్యాన్స్‌లు సభికుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ కార్యక్రమాలకు ముందు పోలీసులు గౌరవ వందనంతో ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు. గాంధీ విగ్రహానికి, భరతమాత చిత్రపటానికి కేసీఆర్ పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలకు చెందిన 2,500 మందికిపైగా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారు: జీవన్ రెడ్డి -
Quit India Movement: ఉద్యమం కాదు.. మహాభారత యుద్ధం!
స్వాతంత్య్రం కోసం ఇండియా ఎన్నో ఉద్యమాలు చేసింది. వాటిల్లో చివరి ఉద్యమం.. క్విట్ ఇండియా! నిజానికది ఉద్యమం కాదు. ఒక యుద్ధం. భరతజాతి అంతా ఏకమై బ్రిటిషర్లపై విరుచుకుపడిన మహాభారత యుద్ధం! ఆ యుద్ధంతోనే మనం స్వాతంత్య్రాన్ని గెలుచుకున్నాం. ఈ డెబ్బ ఐదేళ్లను నడిపిన ఒక స్ఫూర్తిగా క్విట్ ఇండియా ఉద్యమం నేటితో 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇండియాలో బ్రిటిష్ పాలనను తుదముట్టించేందుకు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో పిలుపు నిచ్చిన ఉద్యమమే క్విట్ ఇండియా. ఆ రోజున బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ ‘డూ ఆర్ డై’ అన్నారు. ఆ వెంటనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి ‘క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ‘ కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది. ప్రపంచ యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ, ఈ నిరసనలపై చర్య తీసుకోవడానికి బ్రిటిషు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్నీ విచారణనేది లేకుండా జైల్లో వేసింది. వీళ్లలో చాలామంది యుద్ధం ముగిసే వరకు జైలులోనే, ప్రజలతో సంబంధం లేకుండా గడిపారు. మరోవైపు.. క్విట్ ఇండియాకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్, రాచరిక సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ (ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు)లు బ్రిటిస్ వారికి మద్దతుగా నిలిచాయి! యుద్ధకాలంలో జరుగుతున్న భారీ వ్యయం నుండి లాభం పొందుతున్న భారతీయ వ్యాపారవేత్తలు చాలామంది కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. విద్యార్థులు అక్ష రాజ్యాలకు (జర్మనీ, ఇటలీ, జపాన్) మద్దతు ఇస్తూ ప్రవాసంలో ఉన్న సుభాస్ చంద్రబోస్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపారు. దాంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం సమర్థవంతంగా అణì వేయగలిగింది. వెంటనే స్వాతంత్య్రం ఇవ్వడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసాక చూద్దాం లెమ్మంది. ఈ ఘర్షణలో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. బ్రిటిషు వారు పదివేల మంది నాయకులను అరెస్టు చేసి, వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కారణంగా భారతదేశాన్ని ఇక నియంత్రణలో పెట్టలేమని బ్రిటిషు ప్రభుత్వం గ్రహించింది. మర్యాద కోల్పోకుండా, శాంతియుతంగా ఎలా నిష్కమ్రించాలనే ప్రశ్న యుద్ధానంతరం వారికి ఎదురుగా నిలిచింది. అనంత పరిణామాలు ఇండియా స్వాతంత్య్రానికి పురికొల్పాయి. అసలు క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపునివ్వడానికి క్రిప్స్ మిషన్ చర్చల వైఫల్యం ప్రధాన కారణం. 1942 మార్చి 22 న బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతును పొందటానికి బ్రిటిషు ప్రభుత్వం సర్ స్టాఫోర్డ్ క్రిప్స్‌ను ఇండియా పంపింది. ఆయన బ్రిటిషు ప్రభుత్వపు ముసాయిదా ప్రకటనను సమావేశానికి సమర్పించారు. అందులో రాజ్యాంగ సభ ఏర్పాటు, రాష్ట్రాల హక్కుల వంటివేవో ఉన్నాయి. అయితే అవి కూడా రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తరువాత మాత్రమే. అంటే ఇప్పుడు కాదు అని. క్రిప్స్ ప్రతిపాదనపై గాంధీజీ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఇది మునిగిపోతున్న బ్యాంకుకు చెందిన పోస్ట్ డేటెడ్ చెక్కు’’ అని అన్నారు. -
మహాత్ముడు నడయాడిన నేల
భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకొని 75 ఏళ్లవుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు అంబరమంటుతున్నాయి దేశమంతటా. ఇంటింటా జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన మహాత్మా గాంధీతో ‘అనంత’కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన అడుగుజాడల్లో ఎందరో నడిచారు. జిల్లాతో మహాత్మునికి ఉన్న అనుబంధం గురించి మరోసారి మననం చేసుకుందాం. అనంతపురం కల్చరల్: స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ అనేక పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకూ వచ్చారు. 1921లో లోకమాన్య తిలక్ నిధి వసూలు, 1929లో ఖద్దరు నిధి వసూలు కార్యక్రమాలు, 1933లో హరిజన చైతన్య యాత్రలో భాగంగా గాంధీజీ అనంతలో విస్తృతంగా పర్యటించారు. ఆయన ఎప్పుడు వచ్చినా జిల్లా హార్థికంగా, ఆర్థికంగా ఆదరించి దేశభక్తిని చాటుకుంది. గ్రామాల నుంచి ప్రజలు బండ్లు కట్టుకుని వచ్చి గాంధీజీని చూసి, ఆయన చెప్పింది విని అనుసరించేవారు. ప్రజలు వస్తు రూపంలో ఇచ్చిన కానుకల్ని బహిరంగ వేలం వేస్తే పోటీ పడి కొనేవారు. దురాచారాలు రూపుమాపండి 1921 సెప్టెంబర్ 20న గాంధీజీ మద్రాసు నుంచి తాడిపత్రికి వచ్చారు. కలచవీడు వెంకటరమణాచార్యులు గాంధీజీని పద్యాలతో స్తుతించారు. గాంధీజీ హిందూ– ముస్లింల ఐక్యత, జూదం, తాగుడు, వ్యభిచారం మానమని, అస్పృశ్యతను వీడాలని బోధించారు. ఆ సభలో వేలాది మంది స్త్రీలు తమ ఆభరణాలను స్వాతంత్య్ర సమరానికి విరాళంగా ఇచ్చారు. సెప్టెంబరు 30న గాంధీజీని అరెస్టు చేస్తారన్న వదంతులు వ్యాపించడంతో బ్రిటీష్‌వారిని అడ్డుకోవడానికి కల్లూరు సుబ్బారావు ఆయన వెన్నంటే ఉన్నారు. అప్పుడే ఖద్దరు వస్త్రధారణ.. 1929 మే 16న గాంధీజీ మరోసారి ‘అనంత’ పర్యటనకొచ్చారు. కదిరి, కుటాగుళ్ల, ముదిగుబ్బ, దంపెట్ల గ్రామాలు తిరిగి అదే రోజు రాత్రి ధర్మవరం చేరుకున్నారు. దంపెట్ల గ్రామ ప్రజలు చిత్రావతి నది ఇసుకలో ఇరుక్కుపోయిన గాంధీజీ కారును దాటించారు. ధర్మవరంలో ప్రసంగించిన అనంతరం ఆయన అనంతపురం చేరుకున్నారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆయన వెంట ఉన్నారు. ఖద్దరు కట్టండని గాంధీజీ ఇచ్చిన పిలుపుతో విదేశీ వస్త్రాలు తగలబెట్టి అనంతవాసులు భారతీయత ఉట్టిపడే ఖద్దరు వస్త్రాలు ధరించారు. అనంతరం గాంధీజీ తాడిపత్రికి వెళ్లారు. అక్కడ హైస్కూలు డ్రాయింగ్ మాస్టర్ 107 అక్షరాలు రాసి బహూకరించిన బియ్యపు గింజ వేలం వేశారు. రూ.5,330 నిధి వసూలు అయ్యింది. అడుగడుగునా విరాళాల వెల్లువ 1934లో గాంధీజీ గుత్తి స్టేషన్‌కు వచ్చారు. కల్లూరు సుబ్బారావు తదితరులు తోడుగా ఆయన పెద్దవడుగూరుకు వెళ్లారు. అక్కడ చిన్న నారపరెడ్డి రూ.1116 విరాళంగా వచ్చిన «మొత్తాన్ని కేశవ పిళ్లై స్మృతి చిహ్నంగా హరిజనుల కోసం నిర్మించిన కేశవ విద్యాలయానికి అందజేశారు. అంటరానితనం కొనసాగితే హిందూమతం అదృశ్యమవుతుందని గాంధీజీ ప్రబోధించారు. అక్కడ కూడా మరో డ్రాయింగ్ టీచర్ శ్రీనివాసన్ ఒక బియ్యపు గింజపై గాంధీ బొమ్మను చెక్కి బహూకరించారు. గుత్తి హైస్కూలు మైదానంలో జరిగిన సభలో కొందరు హరిజన విద్యార్థులు గాంధీజీని పద్యాలతో సత్కరించారు. అనంతరం గుత్తి నుంచి గుంతకల్లు వెళ్లే మార్గంలో తిమ్మన దర్గాలో ఒక తోళ్ల యజమాని కొడుకైన మహదేవ అనే ఏడేళ్ల కుర్రాడు గాంధీజీకి బంగారు ఉంగరం ఇచ్చాడు. అక్కడ నుండి ఉరవకొండ చేరుకున్న గాంధీజీ అందరిలోనూ హృదయ పరివర్తన రావాలని.. అప్పుడే స్వాతంత్య్రం త్వరగా సిద్ధిస్తుందని చైతన్యపరిచారు. అక్కడ ఇద్దరు రైతులు విడివిడిగా కానుకలివ్వడంతో అందరూ ఐకమత్యంగా ఉంటేనే కానుకలు స్వీకరిస్తానని సంఘటితపరిచారు. అక్కడి నుంచిఅనంతపురం చేరుకున్న గాంధీజీ హరిజన కాలనీలో కుళాయి ప్రారంభించారు. ఆ తర్వాత హిందూపురం వెళ్లారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ హరిజనుల పట్ల భేదభావం రూపుమాపుకోవాలని పిలుపునిచ్చారు. అంటరానితనం పోయేంత వరకు తనకు మనశ్శాంతి లేదని ఆవేదన చెందారు. ఇలా జిల్లాలో పర్యటించిన గాంధీజీని చూడడానికి వేల సంఖ్యలో బండ్లు కట్టుకుని వచ్చేవారని అప్పటివారు చెపుతారు. ఆయన్ను చూడడం, ఆయన చెప్పింది శ్రద్ధగా వినడం, మనసా వాచా కర్మణా ఆచరించడం చేసేవారు. గాంధీజీ రగిలించిన స్ఫూర్తితోనే భారతమాత స్వాతంత్య్ర సముపార్జనలో ‘అనంత’ వాసులు కీలక పాత్ర పోషించారు. ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి.. స్వాతంత్య్రోద్యమ పోరును కనులారా చూసిన భాగ్యం భగవంతుడు నాకు కల్పించినందుకు మురిసిపోతుంటాను. నా వయసు 95 ఏళ్లు. నేను ఇప్పటికీ పాత విషయాలన్నీ మా పిల్లలకు తరచుగా చెబుతుంటా. మా నాన్న వెంకటరమణప్ప, అమ్మ నారాయణమ్మ. రైతు కుటుంబం. అనంతపురంలోనే ఉండేవాళ్లం. బహుశా నాకు 9, 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడనుకుంటా.. మహాత్మా గాంధీ ధర్మవరానికి వచ్చిన సమయంలో నేను బంధువుల ఇంట్లో అక్కడ ఉన్నా. ఆనాడు గాంధీజీ మాట్లాడిన మాటలు అర్థం కాలేదు కానీ మేము దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేదాకా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాం. నేను పాతూరులోని కస్తూరిబా పాఠశాలలో చదువుకునేదాన్ని. – ఆనెగొంది సుభద్రమ్మ, అనంతపురం -
ఆగస్టు 12న ‘1948 - అఖండ భారత్’
మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి గల కారణం ఏంటి? హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘1948 - అఖండ భారత్’. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలేఖ్య శెట్టి, రఘనందన్, ఆర్యవర్ధన్ రాజ్, ఇంతియాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత ఎమ్.వై.మహర్షి, దర్శకుడు ఈశ్వర్ డి.బాబు, రచయిత మరియు గాడ్సే పాత్రధారి డా. ఆర్యవర్ధన్ రాజు, సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ పాల్గొన్నారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి... బాలకృష్ణ నటించగా అద్భుత విజయం సాధించిన ‘అఖండ’ తరహాలో విజయం సాధించే చిత్రంగా ‘1948 - అఖండ భారతి’చిత్రాన్ని అభివర్ణించారు. డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ... "గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. వాటిని తమ చిత్రంలో చూపించబోతున్నామని చెప్పారు. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి... హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం' అన్నారు! చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి.బాబు మాట్లాడుతూ...11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి... 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో... ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం" అన్నారు ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉందని... దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్... ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే... ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు. -
మహాత్ముడి మాటే మహాదేవి బాట
బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టడానికి ఉద్యమించిన మహామహ నాయకులెందరో. వారి నాయకత్వంలో భారత జాతీయోద్యమం అనేక రూపాల్లో దారులు వేసుకుంది. రైల్‌రోకోలు, జైల్‌భరోలు, రాస్తారోకోలతో ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నవాళ్లు జాతీయోద్యమ యవనిక మీద కనిపిస్తారు. అదే సమయంలో పరోక్షంగా జాతీయోద్యమానికి బీజాలు వేసిన మహామహులూ స్మరణీయులే. అలాంటి వారిలో ముఖ్యులు మహాదేవి వర్మ. వలస పాలనకు వ్యతిరేకంగా మహాదేవి అక్షరోద్యమాన్ని చేపట్టారు. కుగ్రామాలకు, అడవి మధ్యలో ఉండే జనావాసాలకు వెళ్లి గ్రామీణులను, ఆదివాసీలను చైతన్యవంతం చేశారు. వారికి అక్షరాలు నేర్పించే నెపంతో గ్రామంలో నివాసం ఏర్పరుచుకున్నారు. అక్షరాలతోపాటు వారికి స్వాతంత్య్రం కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకతను బోధించారు. గాంధీజీ సూచనల మేరకు ప్రజాజీవితంలోకి వచ్చిన మహాదేవి వర్మ జాతీయోద్యమ విస్తరణకు తన వంతు పాత్రను ప్రభావవంతంగా పోషించారు. అత్తగారింటికి వెళ్లలేదు! మహాదేవి వర్మ ఉత్తరప్రదేశ్‌లోని ఫరక్కాబాద్‌లో జన్మించారు. బ్రిటిష్ పాలనలో ఆ ప్రాంతం యునైటెడ్ ప్రావిన్స్‌లో ఉండేది. మహాదేవి తండ్రి గోవింద్ ప్రసాద్ వర్మ సంస్కృత పండితులు, అలహాబాద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆమెకు తొమ్మిదో ఏటనే పెళ్లి చేశారు, భర్త స్వరూప్ నారాయణ్ వర్మ. ఆమె చదువు పట్ల ఆమె తాతగారు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఉండడంతో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాతనే అత్తగారింటికి పంపించాలని పెద్దలందరూ కలిసి నిర్ణయించారు. మహాదేవి వర్మ బీఏ పూర్తి చేసే నాటికి స్వరూప్ వర్మ చదువు కూడా పూర్తయింది. అత్తగారింటికి పంపించడానికి సన్నాహాలు మొదలవుతున్న సమయంలో ఆమె తన ఆందోళనను బయటపెట్టారు. అందుకు తగిన కారణమే ఉంది. ఆమె జంతు ప్రేమికురాలు. మానవ వినోదం కోసం జంతువులను, పక్షులను గాయపరచడానికి, హింసించడానికి, బంధించి ఆనందించడానికి ఆమె వ్యతిరేకి. స్వరూప్ వర్మకు జంతువులను వేటాడడం హాబీ. అదే విషయాన్ని చెప్పి జంతువులను వేటాడి, మాంసాహారాన్ని భుజించే వ్యక్తితో జీవించలేనని తేల్చేశారామె. ఆ తరవాత బౌద్ధాన్ని స్వీకరించి పాళి, ప్రాకృత భాషలు చదివారు. ప్రయాగ విద్యాపీఠ్‌లో సంస్కృతంలో ఎం.ఏ చేయడంతోపాటు ఆ విద్యాలయానికి ప్రిన్సిపల్‌గా కూడా విధులు నిర్వర్తించారు. చిత్రలేఖనంలో కూడా మేటి ఆమె. బ్రిటిష్ వారి కన్నుకప్పి..! గాంధీజీ పరిచయంతో మహాదేవి వర్మ జీవితపంథా మారిపోయింది. ప్రజాసేవకు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీని కార్యక్షేత్రంగా మలుచుకున్నారామె. ఆ పరిసర గ్రామాల్లో తాత్కాలికంగా నివాసం ఏర్పరుచుకుంటూ అక్కడి వారికి అక్షరాలు నేర్పించేవారు. ఉపాధ్యాయినిగా గ్రామీణులకు భారతీయతను బోధించడంతోపాటు భారతదేశం వలసపాలనలో మగ్గుతున్న వైనాన్ని వివరించేవారు. గ్రామీణుల, గిరిజనుల ఆలోచనలను జాతీయోద్యమం దిశగా ప్రభావితం చేసేవారు. ఒక గ్రామంలో ఎక్కువ కాలం ఉండే కొద్దీ ఆమె కార్యకలాపాల మీద బ్రిటిష్ పాలకుల ప్రతినిధులు నిఘా పెట్టేవారు. అనుమానం వచ్చిన వెంటనే ఆమె మరో గ్రామానికి తరలి పోయేవారు. అలా ఉత్తరాఖండ్ రాష్ట్రం, నైనితాల్‌కు పాతిక కిలోమీటర్ల దూరాన ఉమాగర్ గ్రామంలో కొంతకాలం స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడ కూడా అక్షరాలతోపాటు జాతీయత బీజాలను నాటారు. అక్కడ ఆమె మహిళల విద్య మీద కూడా దృష్టి పెట్టారు. మహిళల స్వయంసమృద్ధి కోసం పని చేశారు. మహిళలకు జాతీయోద్యమ స్ఫూర్తిని నూరిపోశారు. వలసపాలనలో భరతజాతికి ఎదురవుతున్న వివక్షను తెలియజెప్పారు. స్త్రీ చైతన్యవంతం అయితే ఆ ఇంటి మగవాళ్లు జాతీయోద్యమంలో ఎక్కువ కాలం కొనసాగగలుగుతారని నమ్మేవారామె. ఉమాగర్లో తన ఇంటికి మీరా టెంపుల్‌గా నామకరణం చేసుకున్నారు మహాదేవి వర్మ. ఆ ఇల్లు ఇప్పుడు మహాదేవి సాహిత్య మ్యూజియంగా కొనసాగుతోంది. 1932లో దేశంలో జాతీయోద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో మహాదేవి వర్మ 25 ఏళ్ల యువతి. అదే సమయంలో ఆమెకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌పై సీటు వచ్చింది. వెళ్లాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయారు. అహ్మదాబాద్ వెళ్లి గాంధీజీని కలిసి, ‘‘బాపూజీ.. నన్నేం చేయమంటారు?’’ అని అడిగారు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న గాంధీజీ.. ‘‘ఇక్కడ ఇంత పోరాటం జరుగుతుంటే, అక్కడికి ఎలా వెళ్తావ్? ఇక్కడే ఉండి నీ తోటి భారతీయుల్ని జాగృతం చెయ్యి’’ అని అన్నారు. ఆ ఒక్కమాటతో.. మహాదేవి వర్మ తనకొచ్చిన ఆక్స్ఫర్డ్ అవకా శాన్ని వదులుకున్నారు. మహాత్ముని బాటలో నడిచారు. మహిళల వెలుగు మహాదేవి వర్మ హిందీ సాహిత్యంలో ఛాయావాద సాహిత్యానికి ఒక మూలస్తంభం. నిహార్, రశ్మి, నీర్జ, సంధ్యాగీత్ (కవితల సంకలనం), 18 నవలలు, అనేక కథలు రాశారు. ‘యమ’ పేరుతో చిత్రలేఖనాలు వేశారు, మనదేశంలో స్త్రీవాద కోణంలో రచనలు చేసిన తొలి రచయిత్రిగా మహాదేవి వర్మను చెప్పుకోవాలి. ఆమె ‘పయనీర్ ఆఫ్ ఫెమినిజమ్’. స్త్రీ విద్య కోసం అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టారు. మహిళల పత్రిక ‘చాంద్’ను నిర్వహించారు. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆమె అలహాబాద్‌లో బోధనావృత్తికి పరిమితమవుతూ రచనలను కొనసాగించారు. జ్ఞాన్‌పీఠ్, పద్మవిభూషణ్, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ పురస్కారాలందుకున్న వర్మ 1987 అక్టోబరు 11వ తేదీన అలహాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: మనది కాని యుద్ధంలో మన సైనికులు!) -
మహాత్మ గాంధీకి నివాళులర్పించిన రామ్ నాథ్ కోవింద్
-
గాంధీజీ ప్రసంగం అనువాదం! వెంకట సుబ్బమ్మ
భారత జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలై, ఉద్యమం ఊపందుకున్న రోజులు అవి. దేశ ప్రజలందరిలో జాతీయత భావం ఒకేరకంగా ఉన్నప్పటికీ భాష వేరు కావడం వల్ల పోరాటం సంఘటిత శక్తిగా మారడంలో విఫలమవుతోందని గ్రహించిన గాంధీజీ ‘దక్షిణ భారత హిందీ ప్రచారసభ’ను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ నేర్పించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. గూడూరులో బహిరంగ సభ హిందీ ప్రచారంలో భాగంగా దక్షిణాదిలో ఎక్కువగా పర్యటించారు గాంధీజీ. అలాగే హరిజనోద్ధరణ కోసం కూడా ఆయన విస్తృతంగా గ్రామాలను సందర్శించారు. 1934లో గాంధీజీ చెన్నై నుంచి రైల్లో గూడూరు మీదుగా నెల్లూరుకు పర్యటిస్తున్నప్పుడు గూడూరులో ధర్మరాజు ఆలయం ముందు ఒక బహిరంగ సభ జరిగింది. ఆ సభలో గాంధీజీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించడానికి హిందీ, తెలుగు తెలిసిన వారొకరు కావలసి వచ్చారు. అప్పుడు గాంధీజీ ప్రసంగాన్ని తెనుగీకరించింది ఓ పదమూడేళ్ల అమ్మాయి! ఆమె పేరు తన్నీరు వెంకటసుబ్బమ్మ. అనువాదం ఒక్కటే కాదు, ఆనాటి జాతీయోద్యమంలో వెంకటసుబ్బమ్మగారు అనేక విధాలుగా పాల్పంచుకున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఆమె కుమారుడు డాక్టర్ బెజవాడ రవికుమార్ సాక్షి ‘జైహింద్’తో పంచుకున్నారు. ‘బాలకుటీర్’లో నేర్చుకుంద ‘‘మా అమ్మ పుట్టిల్లు తిరుపతి జిల్లా గూడూరు (అప్పటి నెల్లూరు జిల్లా). మా తాత తన్నీరు రమణయ్య సోడా వ్యాపారి. స్వాతంత్య్రపో రాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన గూడూరు పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి. జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు కొంతకాలం బళ్లారిలో జైలు శిక్షను కూడా అనుభవించారు. గాంధీజీ హిందీ ప్రచారోద్యమాన్ని చేపట్టినప్పుడు హిందీ నేర్చుకోవడానికి మా అమ్మను గూడూరులోని ‘బాల విద్యాకుటీర్’లో చేర్పించారు మా తాతయ్య. గూడూరులో శిక్షణ తర్వాత చురుగ్గా ఉన్న ముగ్గురిని ఎంపిక చేసి ప్రయాగ మహిళా విద్యాపీఠంలో విదుషీ పట్టా కోర్సు కోసం అలహాబాద్‌కు పంపించారు వాళ్ల హిందీ టీచర్ గుద్దేటి వెంకట సుబ్రహ్మణ్యంగారు. అలా అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో హిందీ నేర్చుకుంటూ, కస్తూర్బా ఆశ్రమంలో జాతీయ నాయకులకు సహాయంగా పని చేసే అవకాశం వచ్చింది అమ్మకు. సరోజినీ నాయుడు, జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ, అనిబీసెంట్, విజయలక్ష్మీ పండిట్ వంటి నాయకుల మధ్య జరిగే చర్చలను దగ్గరగా చూశారామె. ఆమెలో జాతీయోద్యమ స్ఫూర్తికి బీజాలు పడిన సందర్భం అది. బాపూజీ ముగ్ధులయ్యారు కోర్సు పూర్తయిన తర్వాత ఇక పెళ్లి సంబంధాలు చూడాలనే ఉద్దేశంతో అమ్మను గూడురుకు తీసుకువచ్చేశారు మా తాతయ్య. గాంధీజీ హరిజనోద్ధరణ మూవ్మెంట్లో భాగంగా దక్షిణాది యాత్ర చేసినప్పుడు అమ్మ దుబాసీగా గాంధీజీ ప్రసంగాన్ని తర్జుమా చేయడంతోపాటు బాపూజీకి స్వాగతం పలుకుతూ సన్మాన పత్రం చదివింది. స్పష్టమైన ఉచ్చారణకు, ధీర గంభీరంగా చదివిన తీరుకు ముగ్ధుడైన బాపూజీ అమ్మ చేతిని ముద్దాడి, తన మెడలో ఉన్న ఖాదీ మాలను తీసి అమ్మ మెడలో వేశారు. తాను రాసుకుంటున్న పెన్నును కూడా బహూకరించారు. ఆ సమయంలో అమ్మ నడుముకు వెళ్లాడుతున్న ఒక తాళం చెవిని గమనించారాయన. అది మా అమ్మ ట్రంకు పెట్టె తాళం చెవి. ‘చాబీ ఇస్తావా’ అని అడిగారట. అప్పుడు అమ్మ నిర్మొహమాటంగా ‘ఇవ్వను’ అని చెప్పిందట. అప్పుడాయన అమ్మ తల మీద చెయ్యి వేసి పుణుకుతూ నవ్వారట. అమ్మ తరచూ ఆ సంగతులను చెబుతూ ఉండేది. జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా 80 ఏళ్ల వయసులో వెంకట సుబ్బమ్మ హిందీలో దేశభక్తి గీతాలను ఆలపించినప్పటి చిత్రం అలహాబాద్ జ్ఞాపకాలు అమ్మకు పదిమంది సంతానం. నేను తొమ్మిదో వాడిని. నేను, మా ఆవిడ డాక్టర్లం కావడంతో అమ్మ ఆరోగ్యరీత్యా కూడా మా దగ్గర ఉండడమే ఆమెకు సౌకర్యం అనే ఉద్దేశంతో అమ్మను నేనే చూసుకు న్నాను. అలా రోజూ సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్య అమ్మ దగ్గర కూర్చుని ఆమె చెప్పే కబుర్లు వినడమే నేను ఆమెకిచ్చిన ఆనంద క్షణాలు. ఆ సమయంలో నాకు ఆమె అలహాబాద్ జ్ఞాపకాలను ఎన్నిసార్లు చెప్పిందో లెక్కేలేదు. ఆమె 83 ఏళ్లు జీవించి 2004లో పరమపదించారు. ఆశ్చర్యం ఏమిటంటే... అంతకు ముందు మూడేళ్ల కిందట జాతీయపతాకావిష్కరణ సందర్భంగా ఆమె హిందీలో దేశభక్తి గీతాలను ఆలపించారు. ఆమె మంచి రచయిత కూడా. చరణదాసు శతకాలు రెండు, కాలేజ్ అమ్మాయిల కోసం నాటకాలు, ప్రభోద గీతాలు రాశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె బయోగ్రఫీ రాసుకున్నారు. కానీ అప్పుడు కొంత అప్పుడు కొంత రాస్తూ ఉండడంతో కొన్ని పేజీలు లభించలేదు. ఆ రచనను పరిష్కరించి ప్రచురించడం నాకు సాధ్యం కాలేదు..’’ అని తన తల్లికి చేయాల్సిన సేవ మరికొంత మిగిలిపోయిందన్నట్లు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ రవి కుమార్. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని ఆయన ఇల్లు... తల్లి రాసిన పుస్తకాల ప్రతులు, ఆమె పుస్తకావిష్కరణల ఫొటోలతో వెంకటసుబ్బమ్మ జాతీయోద్యమ జ్ఞాపకాల దొంతరలా ఉంటుంది. – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా?) -
విశ్వమానవుడు: అమర్త్యసేన్ (1933)
మహాత్మాగాంధీ గురించి ఎరిక్ ఎరిక్సన్ అన్న మాటలు అమర్త్య సేన్‌కు కూడా వర్తిస్తాయి. ఇతర ప్రపంచ దేశాల ప్రజలను దిగువ నుంచి లేదా పైనుంచి కాక సమాంతరంగా కళ్లలోకి కళ్లు పెట్టి చూడగల సామర్థ్యం ఆయనది. అమర్త్యసేన్ వయసు స్వతంత్ర భారతదేశ వయసు కన్నా కేవలం 14 ఏళ్లు ఎక్కువ. కాబట్టి సహజంగానే ఆయనకున్న స్థాయి స్వతంత్ర యువ భారత ఆశలు, ఉద్వేగాలతో ముడివడి ఉంటుంది. విస్తృత స్థాయిలో చూస్తే ఆయన వ్యక్తిగత విజయాలన్నీ జాతీయ విజయాలే. ఇతర రంగాల వృత్తి నిపుణులను ఆయన పేదరికం, అసమానత్వం, అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించేలా చేశారు. అందుకే ఆయన విజయాలు భారతదేశానికి, భారత పౌరులకు ఎంతో ముఖ్యమైనవిగా మారాయి. అంతకుముందు ఆ అంశాలను ఏదో పైపైన పట్టించుకునేవారు. ఆయన భారతదేశ పాస్‌పోర్టును వదులుకోని ప్రపంచ పౌరుడు. దేశభక్తి కలిగిన విశ్వమానవుడు. సంక్లిష్టతను ప్రాచుర్యంతో మేళవించిన సేన్‌ను జాన్ మేనార్డ్ కీన్స్‌తో మాత్రమే పోల్చగలం. ఆయనకు ప్రాచుర్యం లభించడానికి చాలా కారణాలే ఉన్నాయి. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో చదువుకున్న సేన్ 22 ఏళ్లకే జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారు! ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీలలో వివిధ హోదాలలో పని చేశారు. ఎన్నో సత్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్న సేన్ 1998లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన చరిత్రను, నైతిక, రాజకీయ తత్వ శాస్త్రాలను కూడా బాగా అధ్యయనం చేశారు. హార్వర్డ్‌లో తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రాల ప్రొఫెసర్‌గా ఉన్నారు. సేన్ కృషికి తగినట్లుగా ఎన్నో పురస్కారాలు లభించాయి. భారతదేశం ఆయనకు అత్యున్నత భారత రత్న పురస్కారాన్ని ఇచ్చింది. స్వతంత్ర భారత ప్రజ్ఞావంతుల చరిత్రలోని ముఖ్యులలో ఒకరైన సేన్ ఈ స్థాయిని అందుకోవడానికి ప్రధాన కారణం ఆయన వైయక్తిక ఆలోచనా విధానంతో విద్యా సంబంధమైన వాతావరణంలో ఒక ఆర్థికవేత్తగా వికసించడమే. ఆర్థిక శాస్త్రమనేది సామాజిక శాస్త్రానికి, సాంకేతిక శాస్త్రానికి మధ్యలో ఉంటుందని చెప్పాలి. ఇది సాధారణంగా గణితశాస్త్ర పద్ధతిలో హేతుబద్ధమైన సంక్లిష్టమైన క్రమశిక్షణను ఉపదేశి స్తుంది. కానీ, సేన్ రచించిన పుస్తకాలు ప్రజాదరణ పొందిన ఇతర ఆర్థికవేత్తల్లాగా వ్యక్తుల విశ్లేషణకు పరిమితం కాలేదు. ఆయన తన రచనల్లో సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను ప్రధానంగా చర్చించారు. – ఎస్. సుబ్రహ్మణ్యన్, ఆర్థిక శాస్త్రవేత్త, అమర్త్యసేన్ శిష్యుడు -
మహోజ్వల భారతి: సబర్మతి ఆశ్రమానికి మారిన గాంధీజీ
గాంధీజీ సబర్మతి ఆశ్రమంలోకి మారిన రోజు ఇది. సబర్మతీ ఆశ్రమాన్నే.. గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం, సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా అంటారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదుకి 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతీ నది ఒడ్డున స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ ఈ ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. గాంధీజీ తన భార్య కస్తూర్బాతో పాటు ఇక్కడ పన్నెండేళ్లు నివాసమున్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఈ ఆశ్రమం కీలక పాత్ర పోషించింది. ఉద్యమంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మొదలైనవి ఇక్కడి నుండే ప్రారంభమయ్యాయి. అంతకుక్రితం గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రాగానే జీవన్ లాల్ దేశాయ్ అనే స్నేహితుడి బంగళాలో 1915 మే 25 న ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో ఆ ఆశ్రమాన్ని సత్యాగ్రహ ఆశ్రమంగా పిలిచేవారు. ఐతే గాంధీజీ తన ఆశ్రమంలో వ్యవసాయం, పశుపోషణ చేపట్టాలనుకోవడంతో ఎక్కువ స్థలం అవసరమైంది. అందుకోసం రెండు సంవత్సరాల తర్వాత 1917 జూన్ 17న సబర్మతీ నది ఒడ్డున 36 ఎకరాల సువిశాల స్థలానికి ఆశ్రమాన్ని తరలించారు. ఈ ఆశ్రమం జైలుకు, శ్మశానానికి మధ్యలో ఉండేది. ఒక సత్యాగ్రాహి ఇలా అనేవారట : ఈ రెండింటిలో ఏదో ఒక చోటుకు వెళ్లవలసి వస్తుంది కాబట్టి దీన్ని అనువైన ప్రదేశంగా గాంధీజీ భావించారు’’అని. గాంధీజీ ఈ ఆశ్రమంలో ఉండగానే వ్యవసాయం, అక్షరాస్యత మొదలైన అంశాల మీద శిక్షణ ఇచ్చేందుకు ఒక పాఠశాలను కూడా నెలకొల్పారు. గాంధీజీ ఈ ఆశ్రమం నుంచే 1930 మార్చి 12 న అక్కడికి 241 మైళ్ల దూరంలో ఉన్న దండికి 78 మంది అనుచరులతో పాదయాత్ర ప్రారంభించాడు. బ్రిటిష్ వారు ఉత్పత్తి చేసే ఉప్పును భారతీయులకు అమ్మేందుకు పన్నిన కుట్రకు; స్వదేశీ ఉప్పు మీద పాలకులు విధించిన పన్నుకు నిరసనగానూ ఈ ఉద్యమం సాగింది. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ప్రభుత్వం గాంధీజీ స్మారక కేంద్రాన్ని నడుపుతోంది. మొదట్లో ఈ మ్యూజియంని ఆశ్రమంలో గాంధీజీ నివసించిన హృదయకుంజ్ అనే కుటీరంలో ఏర్పాటు చేశారు. తరువాత 1963లో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా ఒక మ్యూజియాన్ని రూపకల్పన చేశారు. ఆ మ్యూజియాన్ని 1963 మే 10 న అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇక్కడ గాంధీజీ జీవితానికి సంబంధించిన ఛాయాచిత్రాలు, ఆయన రాసిన ఉత్తరాలు, సందేశాలు, ఆయన జీవితంపై వచ్చిన సాహిత్యం, చిత్రాలు పొందుపరిచారు. ఆశ్రమ ప్రాంగణంలోనే వినోబా–మీరా నివసించిన వినోబా–మీరా కుటీరం, ప్రార్థనా భూమి, కుటీర పరిశ్రమలకు శిక్షణనిచ్చే కేంద్రం మొదలైనవి ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఉదయం 8:30 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు. -
ఏకాభిప్రాయ సారథి: రాజేంద్ర ప్రసాద్ (1884–1963)
ఉత్తర బిహార్‌లోని ఒక కుగ్రామం నుంచి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీకి అకుంఠితమైన అనుచరుడిగా పేరు పొందారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కి, చక్రవర్తి రాజగోపాలాచారికి సన్నిహితంగా మెలిగారు. ఆ ముగ్గురినీ కలిపి తక్కినవారు కాంగ్రెస్‌లోని మితవాద పక్షంగా వ్యవహరించేవారు. జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాస్ చంద్రబోస్‌లు అనుసరించిన వామపక్ష అనుకూల రాజకీయాలను ఈ ముగ్గురూ వ్యతిరేకించేవారు. చాలా విషయాలలో రెండు వర్గాల విభేదాలు చరిత్ర ప్రసిద్ధి పొందాయి. ఉదాహరణకు, మంత్రి అయిన సర్దార్ పటేల్ అంత్యక్రియలకు రాష్ట్రపతి హాజరు కావడం సముచితం కాదని నెహ్ర ఇచ్చిన సలహాను తోసిరాజని, రాష్ట్రపతి హోదాలో ఆయన 1950లో పటేల్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక రాజ్యాంగ నిర్ణాయక సభ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ నిర్ణాయక సభలో మెజారిటీ అభిప్రాయం సరిపోదనీ, ఏకాభిప్రాయం తప్పనిసరి అనీ ప్రారంభంలోనే సూత్రీకరించారు. దీంతో మెజారిటీ వాదులు మైనారిటీల ఆక్షేపణలను అర్థం చేసుకుని, సర్దుబాట్ల ద్వారా వారిని కూడా కలుపుకుని పోవలసిన పరిస్థితి అభివృద్ధి చెందింది. ఏకాభిప్రాయాన్ని సాధించే వరకు నిర్ణయాన్ని నిలిపేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని వల్ల రాజ్యాంగాన్ని ఖరారు చేయడానికి మూడేళ్లకు పైగా ఆలస్యమైపోయింది. ఎట్టకేలకు 1950 నాటికి భారతీయులకు రాజ్యాంగం లభించింది. అది భారతీయులందరూ గర్వించదగిన స్థాయిలో ఉందంటే, ఆ ఖ్యాతి రాజేంద్ర ప్రసాద్‌కు దక్కవలసిందే. రెండు పర్యాయాలు భారత రాష్ట్రపతిగా వ్యవహరించిన రాజేంద్ర ప్రసాద్, తన హయాంలో రాష్ట్రపతి వ్యవస్థ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా అభివృద్థి చెందకుండా సకల జాగ్రత్తలూ వహించారు. అయితే జాగృతమైన, అప్రమత్తమైన వ్యవస్థగా రాష్ట్రపతి పదవీ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఆర్భాటానికి తావివ్వని మృదు స్వభావిగా, నిరాడంబరునిగానే ప్రసాద్ తన జీవితమంతా గడిపారు. – సలీల్ మిశ్రా, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకులు -
మార్గరెట్ బూర్కి–వైట్: తను లేరు, తనిచ్చిన లైఫ్ ఉంది
దేశ విభజన రక్తకన్నీటి ధారలను తన కెమెరాతో బంధించిన వారిలో ముఖ్యులు మార్గరెట్ బూర్కి–వైట్. ‘గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్’ పేరుతో ప్రసిద్ధమైన హత్యాకాండ మిగిల్చిన విషాదాన్ని మార్గరెట్ భావి తరాలు మరచిపోలేని విధంగా చిత్రీకరించారు. మార్గరెట్ (1904–1971) అమెరికా పౌరసత్వం తీసుకున్న పోలెండ్ జాతీయురాలు. తండ్రి జోసెఫ్ వైట్ యూదు జాతీయుడు. తల్లి మిన్నీ బూర్కి ఐరిష్ జాతీయురాలు. తల్లి మీద ప్రేమతో బూర్కి (ఆమె ఇంటిపేరు) పేరును కూడా మార్గరెట్ తన పేరులో చేర్చుకున్నారు. మార్గరెట్ చిన్నతనం న్యూజెర్సీలో గడిచింది. కెమెరాలంటే ఆసక్తి చూపించే తండ్రి నుంచి ప్రోత్సాహం రావడంతో చిన్ననాడే ఆమె ఫొటోలు తీయడం ఆరంభించారు. ఆమె ప్రఖ్యాత ‘లైఫ్’లో పనిచేసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్. అలాగే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రణభూమి దగ్గర ఉండి ఫొటోలు తీసే అవకాశం వచ్చిన మొదటి మహిళ మార్గరెట్. అప్పుడే క్రెమ్లిన్ (రష్యా) మీద నాజీ సేనల దాడుల (1941) దృశ్యాలను తన కెమెరాలో బంధించే అవకాశం ఆమెకు దక్కింది. ఇలాంటి సంక్షుభిత పరిణామాలను చిత్రించేందుకు అనుమతి పొందిన ఏకైక విదేశీయురాలు మార్గరెట్. తన ఫొటో తీయడానికి స్టాలిన్ కూడా ఆమెను అనుమతించాడు. సోవియెట్ పరిశ్రమలను ఫొటోలు తీయడానికి అనుమతి పొందిన తొలి పాశ్చాత్య మహిళ కూడా ఆమే. హిట్లర్ పతనం తరువాత జర్మనీ దుస్థితిని కూడా ఆమె తన ఫ్రేములలో బంధించారు. మహాత్మా గాంధీ ఫొటోలు తీయడానికే మార్గరెట్ మార్చి, 1946లో భారతదేశానికి వచ్చారు. చరఖా ముందు కూర్చుని ఉన్న గాంధీజీ ఫొటో మార్గరెట్ తీసిందే. ఇంకా చాలా పోజులలో గాంధీజీ ఫొటోలు ఉన్నాయి. ఆమె భారతదేశం కోసం తీసిన ఫొటోలు 66. అందులో గాంధీ, జిన్నా, అంబేడ్కర్ వంటి చరిత్రపురుషుల పోర్ట్రయిట్లు, విభజన విషాదాల ఫొటోలు ప్రధానంగా ఉన్నాయి. అసలు భారత విభజన విషాదాన్ని కెమెరాలో బంధించడానికే ఆమె ఇక్కడికి వచ్చారని అనిపిస్తుంది. మార్గరెట్ పార్కిన్సన్ పెయిన్ వ్యాధితో 1971లో తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్య్ర సమరం అహింసాయుతంగా మొదలై, దారుణమైన హింసతో ముగిసింది. ఇదొక వైచిత్రి. గాంధీజీ వంటి అహింసామూర్తిని ఫొటోలు తీయడానికి వచ్చిన మార్గరెట్ హింసాత్మక భారతాన్ని చూశారు. నేడు (జూన్ 14) మార్గరెట్ జయంతి. గాంధీజీ నూలు వడికే మగ్గం దగ్గర ఉన్న చరిత్రాత్మకమైన ఫొటోను తీసింది మార్గరెటే! (పైఫొటో:) మార్గరెట్ బూర్కి వైట్ -
స్వతంత్ర భారతి: మోహన్‌దాస్-ఘనశ్యాం దాస్
జీ.డి. బిర్లాగా ప్రఖ్యాతులు.. ఘనశ్యామ్ దాస్ బిర్లా. భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని. 50 లక్షల పెట్టుబడి దాటిన తరువాత తన సోదరులతో కలిసి 1919లో గ్వాలియర్ పట్టణంలో సొంతంగా బట్టల మిల్లు స్థాపించారు. తరువాత రాజకీయాలలోనూ రాణించారు. 1926లో బ్రిటిష్ వారి హయాంలో శాసనసభకు వెళ్లారు. అనంతరం కార్ల వ్యాపారంలో ప్రవేశించి 1940లో హిందూస్తాన్ మోటార్స్ అనే సంస్థను స్థాపించారు. అటు తరువాత సిమెంట్, ఇనుము, కెమికల్స్, ప్లాస్టిక్ పరిశ్రమలలో రాణించారు. 1943 ప్రాంతంలో కలకత్తాలో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్‌ను (యూకో) స్థాపించారు. 1983 జూన్ 11 న తన 90 వ ఏట మరణించారు. 1957లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో గౌరవించింది. దాస్ తన జీవితాంతం గాంధీ మార్గాన్నే అనుసరించారు. గాంధీజీకి ఆయన అనుచరుడిగా కూడా ఉన్నారు. గాంధీజీ చనిపోవడానికి ముందు నాలుగు నెలలు ఢిల్లీలోని బిర్లా హౌస్‌లోనే ఉన్నారు! -
మహోజ్వల భారతి: మహాత్ముడి అవమానానికి 129 ఏళ్లు!
ఉపాధి కోసం సాధారణ వ్యక్తిగా దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీకి అక్కడ జరిగిన ఓ అవమానం ఆయన ఓ అసాధారణ శక్తిగా అవతరించేందుకు దోహదపడింది. అది అందరికీ తెలిసిన ఘటనే. దక్షిణాఫ్రికాలోని తెల్లవాళ్లు గాంధీని రైలు నుంచి బయటకు గెంటివేయడం! 1893 జూన్ 7న జరిగిన ఆ ఘటన, గాంధీ ఆలోచన తీరుపై బలమైన ముద్రవేసింది. నాడు తాను ఎదుర్కొన్న అవమానం, అప్పుడు ఆయన పడిన వేదన, మనసులోని కల్లోలం ఆయన తన ఆత్మకథ ‘ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’ లో రాసుకున్నారు. గాంధీ లా చదువుకున్నారు. న్యాయవాదిగా పని చేసేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ తాను పని చేసే అబ్దుల్లా సేఠ్ కంపెనీ తరపున ఒక కేసు వాదించేందుకు డర్బన్ నుంచి ప్రిటోరియా వెళ్లాల్సి వచ్చింది. అది రైలు ప్రయాణం. డర్బన్ రైల్వే స్టేషన్లో గాంధీ మొదటి తరగతి రైలు టికెట్ తీసుకున్నారు. అయితే ఆ రైలు ప్రయాణం తన జీవితాన్ని మార్చి వేస్తుందని ఆనాటికి 24 ఏళ్ల వయసున్న గాంధీ ఊహించి ఉండరు. రాత్రి 9 గంటల ప్రాంతంలో నతాల్ రాజధాని మారిట్జ్బర్గ్కు రైలు చేరుకుంది. రైలు ఆగగానే బోగీలోకి ఒక తెల్లజాతీయుడు వచ్చాడు. గాంధీజీని చూడగానే దిగిపోయాడు. అందుకు కారణం గాంధీజీ నల్లవాడు కావడమే. అది ఆయనకు ఎంతో బాధ కలిగించింది. రైలు దిగిన తెల్లజాతీయుడు కొందరు అధికారులను వెంటబెట్టుకొని వచ్చాడు. వారంతా గాంధీజీ వద్దకు వచ్చి నిలబడ్డారు. ఆయననే చూస్తూ ఉన్నారు. మరో అధికారి గాంధీజీ వద్దకు వచ్చి ‘‘నాతో రా, నువ్వు సాధారణ బోగీలో ఎక్కాలి’’ అని అన్నాడు. ‘‘ఎందుకు? నేను మొదటి తరగతి టికెట్టు తీసుకున్నాను’’ అని గాంధీజీ చెప్పారు. ‘‘అదంతా తెలియదు. ముందు నువ్వు దిగి, మిగతావాళ్లు ఉండే సాధారణ బోగీ ఎక్కు’’ అంటూ ఆ అధికారి ఆయన్ని గదమాయించాడు. ‘‘మరోసారి చెబుతున్నా. మొదటి తరగతిలో ప్రయాణించేందుకు అవసరమైన టికెట్ నా వద్ద ఉంది. డర్బన్ స్టేషన్ ఈ టికెట్ ఇచ్చింది. నేను ఈ బోగీలోనే ప్రయాణిస్తాను’’ అని గాంధీజీ స్పష్టం చేశారు. ‘‘నువ్వు ఇందులో ప్రయాణించడం కుదరదు. దిగిపోతావా? లేక పోలీసులను పిలిచి బయటకు గెంటించమంటావా?’’ అంటూ అధికారి అరిచాడు. ‘‘మీరు చేయాల్సింది చేసుకోండి. నేను మాత్రం దిగను’’ అని గాంధీజీ అన్నారు. అప్పుడు ఓ పోలీసు కాన్స్టేబుల్ వచ్చి, గాంధీజీ రెక్క పుచ్చుకొని బయటకు లాగేశాడు. ఆయన పెట్టెబేడను కూడా ప్లాట్‌ఫాంపై విసిరేశాడు. గాంధీజీ మరో బోగీ ఎక్కడానికి ఒప్పుకోలేదు. ఆయన్ని అక్కడే వదలి రైలు వెళ్లిపోయింది. నల్లజాతీయులను ఎంత హీనంగా చూస్తారో, జాత్యాంహకారం వల్ల కలిగే బాధ ఏమిటో ఆ ఘటనతో గాంధీజీకి తెలిసింది. జాతి వివక్షను రూపు మాపాలని ఆ క్షణమే ఆయన కంకణం కట్టుకున్నారు. అందుకు ఎందాకైనా పోరాడాలని నిర్ణయించుకున్నారు. పోరాటానికి సిద్ధమైన గాంధీ, చివరకు ప్రిటోరియా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా రైల్వే జనరల్ మేనజర్‌కు టెలిగ్రాం ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి, తన నిరసనను తెలియజేశారు. ఇక్కడ నుంచి మొదలైన గాంధీ పోరాటం భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చే వరకు ఆగలేదు. (సౌజన్యం బి.బి.సి) -
ఉరి సమయంలో గాడ్సే గొంతు జీరబోయింది!
స్వతంత్ర భారతి 1949/2022 ఘట్టంలో.. పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి గాంధీజీపై నాథూరామ్ గాడ్సే మూడుసార్లు కాల్పులు జరిపాక అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా గాడ్సేపై దాడి చేశారు. అయితే పోలీసులు రావడంతో వారి నుంచి గాడ్సే తప్పించుకున్నాడు. గాడ్సేను అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ హత్యలో అతడికి సహకరించిన నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. గాంధీ హత్య ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత జడ్జి ఆత్మ చరణ్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. ఏడాది తర్వాత 1949, ఫిబ్రవరి 10న కోర్టు తన తీర్పు వెలువరించింది. హిందూ మహాసభ నాయకుడు వీర్ సావర్కర్‌కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని తేల్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా ఆయన బయటపడ్డారు. అనంతరం నాథూరామ్ గాడ్సే, అతడి స్నేహితుడు నారాయణ ఆప్టేలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో నిందితులు పంజాబ్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ముగ్గురు న్యాయవాదులతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. ఇక్కడ కూడా గాడ్సే, ఆప్టేలకు ఉరిశిక్ష విధించాలనే కోర్టు తీర్పునిచ్చింది. ఆ ప్రకారం 1949, నవంబరు 15న వారిద్దరిని అంబాలా జైలులో ఉరితీశారు. ‘‘శిక్ష అమలు కావడానికి ముందు బతికేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా గాడ్సే కోరాడు. శాంతి గురించి ప్రచారం చేసుకుంటూ దేశ సేవలో తన శేష జీవితాన్ని గడుపుతానని పేర్కొన్నాడు. కానీ గాడ్సేకు ఆ అవకాశం లభించలేదు. ఉరిశిక్ష అమలయ్యే రోజున ఆ ఇద్దరు ఖైదీల చేతులు వెనక్కి మడిచి అధికారులు ఉరికంబం దగ్గరికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తడబడుతూనే గాడ్సే ముందుకు నడిచాడు. విషణ్ణ వదనంతో, భయంతో ఆయన ముఖకవళికల్లో పూర్తి మార్పు కనిపించింది. ఉరికంబం ముందు నిల్చుని గాడ్సే మానసిక యుద్ధం చేశాడు. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాడు. ఉరి తీయడానికి కొన్ని క్షణాల ముందు అఖండ భారత్ అంటూ నినదించిన గాడ్సే గొంతు జీరబోయింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ వాదించినప్పుడు ఉన్నంత ధైర్యం అప్పుడు ఆ గొంతులో ప్రతిధ్వనించలేదు’’ అని చరిత్రకారులు కొందరు రాశారు. -
గోఖలేనే లేకుంటే.. గాంధీనే రాకుంటే
‘‘ఏప్రిల్‌లో నేను భారతదేశానికి బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. నేనిక మీ చేతులలోనే ఉంటాను...’’ ఫిబ్రవరి 27,1914 న దక్షిణాఫ్రికా నుంచి తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలేకు గాంధీజీ రాసిన లేఖలోని తొలి వాక్యాలివి. దక్షిణాఫ్రికాను శాశ్వతంగా వీడి భారతదేశం రావలసిందని గోఖలే పలుమార్లు కోరిన తరువాత గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 1896లో గాంధీజీ భారతదేశం వచ్చినప్పుడు పూనాలో మొదటిసారి గోఖలేను చూశారు. తరువాత 1901 నాటి కలకత్తా కాంగ్రెస్ సమావేశాల కోసం ఇద్దరూ దాదాపు నెలరోజులు కలసి ఉన్నారు. అప్పుడే గోఖలే తన మనసులోని మాటను గాంధీకి చెప్పారు. దక్షిణాఫ్రికా భారతీయుల హక్కుల ఉద్యమానికి చేస్తున్న సేవలకు గాను 1911 నాటి కలకత్తా కాంగ్రెస్ సమావేశాలు గాంధీని అభినందించాయి కూడా. గోఖలే జాంజిబార్ (టాంజానియా) పర్యటనలో ఉన్నప్పుడు గాంధీ వెళ్లి కలుసుకున్నారు. అప్పుడే భారత్‌కు వచ్చేయమని గోఖలే కచ్చితంగా చెప్పారు. ఆఖరికి 21 ఏళ్ల మజిలీ తరువాత జూలై 18, 1914 న గాంధీ కేప్టౌ¯Œ నుంచి భారత్‌కు బయలుదేరారు. ఇంగ్లిష్ చానల్ దాటగానే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. కొద్దికాలం ఇంగ్లండ్‌లో చిక్కుకుపోయారు. అప్పుడే వైద్యం కోసం ఫ్రా¯Œ ్సలోని విచీ ప్రాంతానికి గోఖలే వెళ్లారు. అక్కడ మళ్లీ ఇద్దరూ కలుసుకున్నారు. చివరికి డిసెంబర్ 19, 1914న గాంధీ, కస్తుర్బా ఇంగ్లండ్‌లో ఎస్ఎస్ అరేబియా ఓడ ఎక్కారు. జనవరి 9, 1915 న ఉదయం 7.30 లకి ఆ ఓడ బొంబాయి తీరంలోని అపోలో బందర్ చేరుకుంది. గుజరాతీ కట్టూబొట్టూతో దిగిన గాంధీకి ఘనస్వాగతం లభించింది. అదీ నెటాల్.. ఇది నేషనల్ గాంధీజీ ఇండియా వచ్చి స్థిరపడే నాటికే దక్షిణాఫ్రికాలో శాంతియుత సత్యాగ్రహోద్యమంతో ప్రిటోరియా ప్రభుత్వాన్ని లొంగదీసిన ఉద్యమకారునిగా భారతీయులకు చిరపరిచితులు. నాయకుల దృష్టిలో ఒక విశిష్ట ఉద్యమకారుడు. కానీ భారత స్వాతంత్య్ర సమరం రూపురేఖలు, పంథా ఎలా ఉన్నాయో చూడండి. జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు నాటి రాజకీయ అనైక్యత జాడలు కనిపిస్తున్నాయి. జాతీయోద్యమం మితవాద, అతివాద వర్గాల మధ్య నలుగుతున్నది. తీవ్ర జాతీయవాదంతో, వ్యక్తిగత హింసాపథంతో భీతిల్లుతున్న బ్రిటిష్ ప్రభుత్వం దేశవాసులందరి మీద అణచివేతను తీవ్రతరం చేసింది. అయినా జాతీయోద్యమం శాంతి పథాన్ని వీడరాదన్నదే నాయకుల అభిమతం. జాత్యహంకారం, అణచివేతలకు పేర్గాంచిన దక్షిణాఫ్రికా శ్వేతజాతి పాలన మీద ‘నెటాల్ ఇండియ¯Œ కాంగ్రెస్’ సంస్థతో గాంధీ సాధించిన విజయాలు శాంతియుత పంథాలోనే సాధ్యమైనాయి. హింస, ప్రతిహింస లేవు. అదే గోఖలేని ప్రభావితం చేసి, గాంధీజీని భారత దేశం రప్పించింది. భారత స్వాతంత్య్ర పోరాటాన్ని ఐక్యంగా సాగించగల నాయకుడిని గోఖలే గాంధీలో చూశారని అనిపిస్తుంది. పెరుగుతున్న ముస్లిం లీగ్ ప్రాబల్యం జాతీయోద్యమానికి ఉపకరించేటట్టు మలచడం నాటి అవసరం. 1893లో ఎస్ఎస్ సఫారీ ఓడ మీద దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీ కుల,మత, ప్రాంత విభేదాల ప్రసక్తి లేకుండా అక్కడ మొత్తం భారతీయులందరికి ఆమోదయోగ్యుడయ్యారు. 50,000 మంది భారతీయుల హక్కుల కోసం సాగిన ఆ పోరాటంలో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా ఉన్నారు. క్రైస్తవుల వివాహ హక్కు గురించి కూడా గాంధీ ఉద్యమించారు. లక్ష్య సాధనలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లడం అనే విద్య గాంధీలో ఉంది. దక్షిణ భారతదేశం వారు, ఉత్తర భారతం వారు కూడా ఆయన వెంట నడిచారు. గాంధీకి ముందే.. మహామహులు! దక్షిణాఫ్రికా నుంచి గాంధీ ఇండియాకు వచ్చేవరకు ఇక్కడ జాతిని కదిలించే స్థాయిలో ఉద్యమం ఆరంభం కాలేదని అనుకోడాని లేదు. ఒక శక్తిమంతమైన స్వాతంత్య్ర పోరాట జాడలు సుస్పష్టంగా ఉన్నాయి. దాదాభాయ్ నౌరోజీ, రెనడే, గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, లాల్, పాల్, బాల్, ఫిరోజ్‌షా మెహతా, మదన్ మోహన్మాలవీయ, సరోజినీనాయుడు, మోతీలాల్ వంటివారు నిర్వహించిన ఉద్యమమది. అయినా అది వేరు, గాంధీ రాక తరువాతి పోరాట స్వరూపం వేరు. గాంధీ ఉద్యమ రూపం వేరైనా, అంతకు ముందు జరిగిన ఉద్యమాన్ని తక్కువ చేయడం చారిత్రక దృష్టి కాబోదు. మైదాన ప్రాంత స్వరాజ్య సమరంతో పాటు, రైతాంగ ఉద్యమాలు, కొండలలో గిరిజనోద్యమాలు జరిగాయి. విదేశాలు కేంద్రంగా తీవ్ర జాతీయవాదంతో భారత్ స్వేచ్ఛ కోసం గదర్ పార్టీ ఉద్యమించిన కాలం కూడా అదే. వీటితో భారతీయులు సాధించిన కొన్ని విజయాలూ ఉన్నాయి. – డా. గోపరాజు నారాయణరావు -
కేజ్రీవాల్ పొలిటికల్ ప్లాన్ షురూ.. టెన్షన్లో మోదీ!
గాంధీనగర్: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన మార్క్ చూపించింది. పంజాబ్‌లో భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అనంతరం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్.. రెండు పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని శనివారం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం సందర్శించారు. ఈ క్రమంలో ఆశ్రమంలో ఉన్న మహాత్మా గాంధీ చరఖా తిప్పారు. అనంతరం అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శించారు. కాగా, స్వాతంత్ర్య ఉద్యమంలో సబర్శతి ఆశ్రమం నుంచే మహాత్మా గాంధీ.. ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. ఈ ఆశ్రమం ఆథ్యాత్మిక ప్రదేశమని, గాంధీజీ స్ఫూర్తి తమలో ఆధ్యాత్మిక భావనలు రేకెత్తిస్తోందని గాంధీ పుట్టిన దేశంలో తాను జన్మించడం గర్వకారణమని కేజ్రీవాల్ తెలిపారు. ఈ క్రమంలో భగవంత్ మాన్ స్పందిస్తూ.. గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని భిన్నమైన అనుభూతి కలుగుతోందని పేర్కొన్నారు. మరోవైపు.. వీరి పర్యటనలో రాజకీయ విషయాలపై మీడియా కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా.. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడవద్దని సున్నితంగా తిరస్కరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్ నేతలు ఇక్కడ పర్యటిస్తున్నారని రాజకీయంగా చర్చ నడుస్తోంది. కాగా, గుజరాత్‌లోని మొత్తం 182 స్ధానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఇప్పటి నుంచే గుజరాత్‌పై కేజ్రీవాల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. आज गुजरात के साबरमती आश्रम जाने का सौभाग्य मिला। यह आश्रम एक आध्यात्मिक स्थान है, ऐसा प्रतीत होता है कि जैसे यहाँ गांधी जी की पूज्य आत्मा बसती है। यहाँ आकर आध्यात्मिक अनुभूति होती है। मैं स्वयं को धन्य मानता हूँ कि मैं भी उस देश में पैदा हुआ जिस देश में गाँधी जी पैदा हुए। pic.twitter.com/oUg2yOGMlq — Arvind Kejriwal (@ArvindKejriwal) April 2, 2022 -
మద్యం తాగే వాళ్లు భారతీయులే కాదు..
పాట్నా: మద్యం తాగే వాళ్లు అసలు భారతీయులే కాదంట.. మందు తాగే వారందరూ మహా పాపులు అంటూ స్వయంగా ఓ రాష్ఠ్ర ముఖ్యమంత్రే అనడం ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఎవరంటే.. బీహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022ను కఠినతరం చేస్తూ సవరణలు చేశారు. ఈ బిల్లు తాజాగా గవర్నర్ ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం.. ఎవరైనా మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే జరిమానాతో పాటుగా ఒక నెల జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. కాగా, జరిమానా డిపాజిట్ చేసి బెయిల్ పొందే అవకాశం కల్పించారు. అయితే, ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగుతుండగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సందర్బంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. మద్యం సేవించే వారు అసలు భారతీయులే కాదన్నారు. మందు తాగే వారందరూ మహా పాపులు అంటూ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారని అన్నారు. ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా మద్యం సేవించే వారిని తాను భారతీయులుగా పరిగణించను అని వ్యాఖ్యానించారు. మద్యం సేవించడం హానికరం అని తెలిసిన కొందరు సేవిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మద్యం సేవించి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 2021లో చివరి ఆరు నెలల్లో మద్యం కారణంగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. బీహార్‌లో 14-15 మంది పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం కింద చేసిన అరెస్టులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను మాత్రమే విచారించడంతో బీహార్‌లోని న్యాయవ్యవస్థ పనితీరుపై మద్యం చట్టం ప్రభావం చూపుతోందని సుప్రీంకోర్టు గత ఏడాది వ్యాఖ్యానించింది. शराब पीने वाले @NitishKumar के अनुसार हिंदुस्तानी नहीं और वो महापापी और महाअयोग्य और उनके लिए कोई सहानुभूति नहीं @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/bfTB4YU28w — manish (@manishndtv) March 31, 2022 -
World Speech Day: మంచి గొంతు, భాష ఉంటే సరిపోదు.. భావోద్వేగాన్ని జత చేస్తేనే
‘ప్రసంగం శక్తివంతమైనది. మంచి ప్రసంగం.. ప్రపంచాన్ని ఒప్పించేది, మార్చేది, ఆచరింపజేసేది’అంటాడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. మాట ప్రపంచాన్ని నడిపించే వాహకం. దాన్ని అద్భుతంగా ఉపయోగించినవాళ్లు మంచి వక్తలవుతారు. అలా మనసును కదిలించే ప్రసంగాలతో ప్రపంచగతిని మార్చిన వాళ్లున్నారు. నేడు అంతర్జాతీయ ప్రసంగ దినోత్సవం సందర్భంగా దాని ప్రాసంగికత గురించి కొన్ని ముచ్చట్లు... ప్రసంగం అంటే.. మంచి గొంతు ఉంటే సరిపోదు. మంచి భాష తెలిసినంత మాత్రాన వక్తలైపోరు. ఎందుకంటే కొన్నిసార్లు పదాలు ఉత్తి శబ్దాలు. వాటికి భావోద్వేగాన్ని, ఆలోచనలను జత చేసి వ్యక్తీకరిస్తేనే అద్భుతమైన ప్రసంగం అవుతుంది. అది జనంలో మార్పు తీసుకురాగలిగితే చరిత్రలో నిల్చిపోతుంది. రకరకాల ప్రసంగాలు.. ప్రసంగాల్లో చాలా రకాలుంటాయి. కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని విజ్ఞానాన్ని అందజేస్తాయి. కొందరి ప్రసంగాలు ఆలోచనల్లో పడేస్తాయి. ఇంకొన్ని మనకు తిరుగులేదన్న ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. అంశమేదైనా దాన్ని ముందు వక్త నమ్మితే.. అది విన్నవాళ్లను సైతం ఒప్పించగలుగతారు. అలా తమ ప్రసంగాలతో ప్రపంచగతిని మార్చేసిన కొందరు నేతలున్నారు. కొందరి ప్రసంగాలు స్ఫూర్తిని రగిలిస్తే... విద్వేషాలను రెచ్చగొట్టిన మరికొన్ని ప్రసంగాలూ ఉన్నాయి. చదవండి: ముప్పు ముంగిట అమెజాన్.. కథ మారకపోతే కష్టాలకు తలుపులు బార్లా తెరిచినట్టే! నాకో కల ఉంది : మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) ‘ఏదో ఒక రోజున నా నలుగురు పిల్లలు వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వ్యక్తిత్వాలను బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది’అంటూ 1963లో అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్(జూనియర్) చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని కదిలించింది. అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని మలుపు తిప్పిన ప్రసంగమది. స్వేచ్ఛ కోసం మానవ హక్కుల కోసం, స్వేచ్ఛ, సమానత్వం కోసం తన జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు నెల్సన్మండేలా. రివోనియా ట్రయల్ దగ్గర 1964లో సౌత్ ఆఫ్రికా సుప్రీంకోర్టు ముందు నిలబడి ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయం. ‘నా జీవితకాలం లో ఆఫ్రికన్ ప్రజల కోసం నన్ను నేను అంకితం చేసుకున్నా ను. నేను తెల్లజాతి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను, నల్లజాతి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను. ప్రజలందరూ సామరస్యంగా, సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య, స్వేచ్ఛా సమాజం కోసం అవసరమైతే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ హక్కుల కోసం నువ్వు పోరాడు, నీ స్వేచ్ఛకోసం నువ్వు పోరాడు. ఇతరుల హక్కులపై ఆధిపత్యం కోసం పోరాడకూడదు’ ఆయన చేసిన ప్రసంగం ఆయనను చెరసాల నుంచి కాపాడలేకపోయింది కానీ... దక్షిణాఫ్రికా ప్రజల గుండెలను పిండేసింది. స్వేచ్ఛ కోసం ఆఫ్రికన్లను కార్యోన్ముఖులను చేసింది. స్వామి వివేకానందకు స్టాండింగ్ ఒవేషన్ స్వామి వివేకానంద.. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్ సందర్భంగా ‘అమెరికా సోదర, సోదరీమణులకు’అంటూ ఆయన మొదలుపెట్టిన ప్రసంగం రెండు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. సమయం తక్కువగా ఉందని చెప్పిన నిర్వాహకులు... ఆయన ప్రసంగం మొదలుపెట్టాక మైమరచిపోయి విన్నారు. మహాత్ముని మాట.. అత్యంత ప్రభావితం చేయగలిగిన వక్తల్లో ఒకరు మన జాతిపిత మహాత్మాగాంధీ. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన చేసిన ప్రసంగాలు భారత జాతిని మేల్కొల్పాయి. ‘మనం ద్వేష భావం వీడాలి, స్నేహభావం అలవరుచుకోవాలి. బ్రిటిష్ వారిప్పుడు ప్రమాదపుటంచుల్లో ఉన్నారు. వారి సహాయం కోసం నేను చేయి అందిస్తాను... దాన్ని కత్తిరించడానికి వారు సిద్ధంగా ఉన్నా సరే. వారికి సాయపడేందుకే నేను ముందుంటాను’అంటూ గాంధీ చేసిన ప్రసంగాలు బ్రిటిష్‌వారిని సైతం ఆలోచింపజేశాయి. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో మార్చి 7న ఢాకాలోని రేస్ కోర్స్ మైదానంలో షేక్ ముజీబుర్ రెహ్మాన్ చరిత్రాత్మక ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కావాలంటూ ముజీబుర్ రహ్మాన్ ప్రసంగం వినేందుకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. పాక్ సైన్యం నుంచి ర క్షణ కోసం కాకుండా ప్రతిఘటనకు ప్రతీకగా వెదురు క ర్రలు చేతబూని ప్రజలు బహిరంగసభకు వచ్చారు. ఈ సందర్భంగా ముజీబుర్ చేసిన ప్రసంగం భారత ఉప ఖండంలో రాజకీయ ప్రసంగాలలోకెల్లా అత్యున్నతమైనదిగా నిలిచింది. ఈ ప్రసంగాన్ని ప్రపంచ వారసత్వ డాక్యుమెంటరీగా యునెస్కో 2017లో గుర్తించింది. -
అసెంబ్లీలో గాంధీ వర్ధంతి
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. -
జాతి పితకు ప్రముఖుల నివాళులు
-
మహాత్ముడికి సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చదవండి: (‘ప్రకాశం’లో ఎయిర్‌పోర్టు) -
అదే... భరతజాతికి భగవద్గీత!
ప్రపంచంలో నేను ఒంటరి వాడినైనప్పటికీ నేను ప్రాణప్రదంగా విశ్వ సించే కొన్ని సిద్ధాంతాలకు ప్రమాదం ఉండదని భావి స్తున్నాను. నేను ప్రేమించే సిద్ధాంతాలు, ఆదర్శాలు వ్యాప్తిలో ఉన్నంత కాలం మరణానంతరం సైతం సమాధిలోనే జీవిస్తాను. మరోమాటలో చెప్పా లంటే సమాధి నుండి సందేశం వినిపిస్తాను అన్న మహాత్ముడి మాటలు నేటికి అక్షర సత్యాలుగా మారాయి. ప్రజలను సమీకరించడం గాంధీజీ రాజకీయ వ్యూహాల్లో ఒక అంశం. వలస పాలకుల్లో కొందరినైనా తటస్థు లుగా మార్చడం; హిందూ, ముస్లింల మధ్య ఐక్యతను తీసుకు రావడం. అంటరానివారుగా ఉన్న హరిజనులను (దళితులను) ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకు రావడం ఆయన వ్యూహాల లక్ష్యాలు. తన సిద్ధాంతానికి ముఖ్య భూమికగా వున్న ‘హింద్ స్వరాజ్’లో తను కోరుతున్న సమాజాన్ని ఆవిష్కరించి చూపాడు. ఈయన తాత్విక నేపథ్యా నికి మూలాలు అహింస, ప్రేమలో ఉన్నాయి. జీవితాంతం వ్యక్తులతో సమాజంతో చర్చోప చర్చలు చేస్తూ సత్యాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే సత్యమే భగవంతుడు అని ప్రకటించారు. గాంధీ జీవిత కాలంలో రెండు విషయాల పట్ల చాలా ప్రస్ఫుటంగా వ్యధ చెందారు. ఒకటి మత సామరస్యం, రెండవది కుల నిర్మూలన. కుల నిర్మూలనకై గాంధీ చేసిన కృషి అనితర సాధ్యమైంది. అస్పృశ్యతను నివారించి నట్లయితే కులాల మధ్య ఉండే అంతరాలు తగ్గుతాయని భావించారు. 1921లోనే అస్పృశ్య తను పాటించడం హిందూ మతానికి మచ్చ అన్నారు. ‘మతం’, అంటే ‘మూఢనమ్మకాలు, దుష్ట ఆచారాలు, మనిషికీ మనిషికీ మధ్యన నిర్మించబడ్డ అంతరాలు కాదు; మతం, రాజకీ యాలు, నైతిక సూత్రాలు, పరిశుద్ధ ప్రవర్తన... ఇవన్నీ పర్యాయ పదాలు అని గాంధీ ప్రకటిం చారు. ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ వారి ఉన్నతికి తోడ్పాటును అందిస్తూ, వారి అభివృద్ధిని కాంక్షించే దిగా మతాన్ని పేర్కొ న్నారు. నేడు గాంధీ చెప్పిన సిద్ధాంతాలు తల కిందులయ్యాయి. గాంధీ రామరాజ్యం స్థాపిం చాలని కాంక్షించారు. అయినా మతాలనూ సమానంగా దర్శించిన దేశీయ తాత్వికమూర్తి. ఈయన సైద్ధాంతిక భావజాలాన్ని పసి గట్టిన మతోన్మాదులే ఆయన్ని హత్యగావించారు. గాంధీ మత సామరస్యం కోసమే ప్రాణత్యాగం చేశారు. సత్యం, సత్ప్రవర్తనలకు మించిన మతం లేదు అన్నారు. ప్రజలందరికీ సమానహక్కులు లభించే భారత దేశం అనే భావనను వ్యతిరేకించే భావజాలం ఉన్న వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా గాంధీపై దాడి చేస్తూనే ఉన్నారు. గాంధీయిజాన్ని తమ మార్గానికి అవ రోధంగా భావిస్తున్న వారే జనవరి 30, 1948న మహాత్ముడిని హత్య చేశారు. ఆయన చూపిన అహింసా మార్గమే భరతజాతికి భగవద్గీత! -డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ (నేడు గాంధీ వర్ధంతి) -
బీటింగ్ రిట్రీట్‌లో గాంధీకి ఇష్టమైన పాట తొలగింపు.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఈ నెల 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్‌లో ఈసారి గాంధీజీకి ఇష్టమైన ‘అబిడ్ విత్ మీ’ పాటని తొలగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ ఏడాది దేశీ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ' ఈ పాట స్థానంలో ప్రముఖ దేశభక్తి గీతం ‘ఏ మేరే వతన్ కే లోగో’ను వాయించనున్నారు. 1962 ఇండో–చైనా యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ కవి ప్రదీప్ ఈ గీతాన్ని రాశారు. దేశ భద్రత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ ఈ గీతాన్ని ఆలపిస్తారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్ను నిర్వహిస్తారు. (చదవండి: పొలిటికల్ ప్లేయర్: ప్రత్యర్థులతో ఫుట్‌బాల్ ఆడేయగలరు) 2020లోనే తొలగించాలనుకున్నా.. ‘అబిడ్ విత్ మీ’ని 1847లో స్కాటిష్ ఆంగ్లికన్ కవి హెన్రీ ఫాన్రిస్ లైట్ రాశారు. 1950 నుంచి బీటింగ్ రిట్రీట్ వేడుకలో దీన్ని వాయిస్తున్నారు. తాజాగా దీన్ని విరమిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. 2020లోనూ అబిడ్ విత్ మీ పాటను తొలగిం చాలని అనుకున్నా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. తాజాగా అబిడ్ విత్ మీని బీటింగ్ రిట్రీట్ వేడుక నుంచి తొలగించడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వారసత్వాన్ని తుడిచేసే పనిలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడింది. వలస పాలనను గుర్తు చేసే పాట కన్నా దేశీయులకు బాగా తెలిసిన పాటను చేర్చడం మేలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏ మేరే వతన్ లోగోతో పాటు 26 పాటనలు భారతీయ ఆర్మీ రిపబ్లిక్ డే పెరేడ్లో వాయించనుంది. (చదవండి: తన పేరు మార్పుపై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
కాళీచరణ్ అరెస్ట్
రాయ్‌పూర్: మహాత్మాగాంధీపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ సాధువు కాళీచరణ్ మహరాజ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తమ రాష్ట్రం నుంచి అనుమతి లేకుండా ఆయన్ను అరెస్ట్ చేయడం అంతర్రాష్ట్ర ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనంటూ మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కాళీచరణ్ మహరాజ్ అలియాస్ అభిజీత్ ధనంజయ్ సరాగ్ను ఖజురహోకు 25 కిలోమీటర్ల దూరంలోని బాగేశ్వర్ధామ్లోని ఓ అద్దె ఇంట్లో మారుపేరుతో ఉండగా గురువారం వేకువజామున అదుపులోకి తీసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీని అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు సంతోషిస్తున్నారా, లేక విచారిస్తున్నారా తెలపాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళీచరణ్‌ను గురువారం రాత్రి కోర్టులో హాజరుపరచగా రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ పోలీసుల చర్య తీవ్ర అభ్యంతరకరమని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభు త్వం అంతర్రాష్ట్ర ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఆదివారం రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో కాళీచరణ్ మాట్లాడుతూ.. ‘రాజకీయాలు చేసి దేశాన్ని కబళించడమే ఇస్లాం లక్ష్యం. మన కళ్లముందే 1947లో దేశ విభజన జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయాయి. గాంధీని తు పాకీతో కాల్చి చంపిన నాథూరాం గాడ్సేకి సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు పశ్చాత్తాప పడటం లేదని, గాంధీని ద్వేషిస్తానని సర్దార్ పటేల్ ప్రధాని కాకుండా గాంధీయే అడ్డుపడ్డారని కూడా ప్రకటన చేశారు. కాళీచరణ్‌పై మహారాష్ట్రలోనూ పలు కేసులు నమోదయ్యాయి. -
నేను ప్రేమించిన యేసు.. మహాత్మ గాంధీ సందేశం
క్రైస్తవం అనేది ‘మతం’ కాదు, ‘జీవన విధానం’ అని. ఏ వ్యక్తి అయితే అవధులు లేని ప్రేమని చూపిస్తూ ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటివి మరచిపోతాడో అతడే నిజమైన క్రైస్తవుడు. లండన్‌లో 1931 డిసెంబర్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీ తన బృందంతో సముద్రమార్గంలో ఇండియాకి తిరిగి వస్తూ ‘క్రిస్మస్’ రోజున చేసిన ప్రసంగమిది. ప్రతిరోజూ ఆయన ఉదయం చేసే ప్రార్థనలో పాల్గొనే కొందరు ఆరోజు ఆయన్ని జీసస్ గురించి మాట్లాడమని కోరడంతో... గాంధీజీ మాట్లాడారు. అదే రోజు ఓడలో వున్న అసోసియేట్ ప్రెస్ ఆఫ్ అమెరికా ప్రతినిధి మిస్టర్ మిల్స్ ఆ ప్రసంగ పాఠం తనకు చెప్పమని అడిగి రాసుకున్నారు. అదే వారం అది వ్యాసంగా ‘యంగ్ ఇండియా’, ‘హరిజన్’ పత్రికల్లో వచ్చింది. ‘గాంధీస్ క్రిస్టమస్ సెర్మన్’ శీర్షికతో 1932, జనవరి7న ‘ది గార్డియన్’ పత్రికలో వచ్చింది. మొదటిసారి దీని తెలుగు అనువాదం ‘సాక్షి’ పాఠకుల కోసం.. ఒక హైందవ మతస్థుడనైన నేను యేసుక్రీస్తు జీవితం గురించి, ఆయన బోధల గురించి ఎలా తెలుసుకున్నానో మీరు కచ్చితంగా తెలుసుకోవాలి అని ఆశిస్తున్నాను. దాదాపుగా నలభై ఐదేళ్ళ కిందటే నాకు ‘పరిశుద్ధగ్రంథం’తో పరిచయం అయింది. హోటల్లో పరిచయమైన నా స్నేహితుడి ప్రోత్సాహం వల్లే ఇదంతా జరిగింది. పరిశుద్ధగ్రంథాన్ని మొదటిసారి చదివినప్పుడు నాకు పాత నిబంధన గ్రంథం మీద అంతగా ఆసక్తి కలగలేదు. కానీ, ఎప్పుడైతే నేను కొత్త నిబంధన చదవడం మొదలుపెట్టానో నాకు క్రీస్తు బోధల మీద ఒక అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా ‘కొండ మీద ప్రసంగం’ నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ ప్రసంగం చిన్నతనంలో నేను నేర్చుకున్న విలువలని గుర్తు చేసింది. అది నా జీవన విధానానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. వేరే మతస్థుడనైన నాకు ఆ ప్రసంగం అంత ప్రాముఖ్యమైనది కాకపోవచ్చును. కానీ ఇది చెడుశక్తులతో సహా ఎవరికీ హాని కలిగించనిది. దీన్ని చదివాక నేను తెలుసుకున్నదేమిటంటే, యేసుక్రీస్తు ఒక కొత్త ధర్మాన్ని బోధించడానికి వచ్చారని. నిజానికి ఆయన తాను కొత్త ధర్మాన్ని ఇవ్వడానికి రాలేదు అని చెప్పినప్పటికీ, పాతనిబంధనలోని మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరణ సాధ్యమైనరీతిలో సరళతరం చేయడానికి ఆయన వచ్చారు. కంటికి కన్ను, పంటికి పన్ను చట్టం కాకుండా, ఒక అంగీ అడిగితే రెండు అంగీలు ఇవ్వడం, ఒక మైలు తోడు రమ్మంటే, రెండు మైళ్ళు వెళ్ళమనే సహృదయతను ఆయన బోధించారు. ఈ మంచి లక్షణాలను ప్రతి ఒక్కరూ బాల్యంలోనే నేర్చుకోవడం చాలా అవసరమని నేను భావించాను. చిన్నతనంలో క్రైస్తవం అన్నా, క్రైస్తవులు అన్నా నాకొక దురభిప్రాయం ఉండేది. వారికి ఒక చేతిలో మద్యం, మరో చేతిలో మాంసం ఉంటాయని అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను ‘కొండ మీద ప్రసంగం’ చదివానో, వారిపట్ల నాకున్న ఈ చెడు అభిప్రాయం పటాపంచలయ్యింది. ఆ తరువాత, దేవునికి నిజంగా భయపడే నా క్రైస్తవ స్నేహితులు కొందరు క్రైస్తవంపై నాకున్న సదభిప్రాయాన్ని మరింత పెంచారు. క్రైస్తవ జీవితం చాలావరకు ‘కొండ మీద ప్రసంగం’లో ఇమిడి ఉంది. ఒక వ్యక్తి నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని కోరుకున్నట్లయితే అతను యేసుక్రీస్తు ‘కొండ మీద చేసిన ప్రసంగం’లోని అంశాలను నిజాయితీగా ఆచరిస్తే చాలు. నా జీవితంలో నేనెన్నడూ యేసుక్రీస్తు ఉనికిని గురించి సందేహించలేదు. ఒకవేళ ఎవరైనా ఆయన అసలు ఇక్కడ జన్మించలేదని నిరూపించినా, నేను ఆ విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వను. నాలుగు సువార్తలు రాసిన వ్యక్తులు, వారికి క్రీస్తుతో ఉన్న సాన్నిహిత్యం, వారు ఆయనను చూసిన విధానాన్ని బట్టి ఆయనని వారు వివరించారు. కానీ, నాకు మాత్రం ‘కొండ మీద ప్రసంగం’ మాత్రమే ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని చదివి, అర్థం చేసుకున్నాక– నేను తెలుసుకున్నదేమిటంటే క్రైస్తవం అనేది ‘మతం’ కాదు, ‘జీవన విధానం’ అని. ఏ వ్యక్తి అయితే అవధులు లేని ప్రేమను చూపిస్తూ ప్రతీకారం, ఈర‡్ష్య, అసూయ, ద్వేషం లాంటివి మరచిపోతాడో అతడే నిజమైన క్రైస్తవుడు. అలాంటి వ్యక్తి జీవితంలో అన్ని ఆటంకాల్ని అధిగమిస్తాడు. ఇటువంటి జీవన విధానం అవలంబించడం ఒకింత కష్టంగానూ, ఎదుటివారికి అర్థం కానట్లుగానూ ఉంటుంది. దీన్ని కేవలం మనసుతో మాత్రమే చూడగలం. విషాదమేమిటంటే ఈ విధమైన క్రైస్తవం చాలామందికి అర్థం కాకుండా ఉంది. దేవుని దయ వలన పరిశుద్ధగ్రంథం కొందరు విధ్వంసకారుల నుంచి భద్రపరచబడింది. బ్రిటిష్ వారు, ఫారిన్ బైబిల్ సొసైటీ వారు పరిశుద్ధ గ్రంథాన్ని అనేక భాషల్లో తర్జుమా చేశారు. ఆ తర్జుమాలు సమయం వచ్చినప్పుడు, వాటి ఉద్దేశాన్ని నెరవేర్చాయి. యేసుక్రీస్తు బోధించిన ఈ అంశాలను మనం ఆచరించకపోతే, రెండువేల సంవత్సరాల పాటు ఉన్న ఈ సజీవ నమ్మకానికి అర్థం లేనట్లే. మనం పాడుకునే ‘పరలోకమందున్న దేవునికి సమస్త మహిమ, భూమి మీద ఆయన భక్తులకి సమాధానం కలుగును గాక...’ అనే పాటలో ఉన్నట్లుగా దేవునికి మహిమ, మనకి సమాధానం రెండూ కలగవు. మనలోని ఆత్మీయ తృష్ణ చల్లారేంత వరకూ, క్రీస్తు మన హృదయంలో జన్మించేంత వరకూ మనం ఆయన కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఆయన మన హృదయాల్లో జన్మించడం వలన నిజమైన శాంతి నెలకొంటుందో, అప్పుడు మనకిక వేరే సాక్ష్యాలు అవసరం లేదు. అది మన జీవితాల ద్వారా ప్రతిబింబిస్తుంది. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా ఈ మార్పు కనపడుతుంది. నా మటుకు ఈ పాటకు అసలైన అర్థం ఇదేనని తోస్తుంది. క్రీస్తు మనలో జన్మించడం అన్నది కేవలం ఒకరోజుకే పరిమితమయ్యేది కాదు. మన జీవితాల్లో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ లోకంలోని మతాల గురించి నేను ఆలోచించినప్పుడల్లా, ఈ భూమి మీదకి దిగివచ్చిన మహోన్నతమైన గురువుల గురించి ఆలోచిస్తాను. వారి పుట్టుకకి కారణం– నేను మొదట చెప్పినట్టుగా, వారు ఈ భూమి మీద ఒక సత్యాన్ని ప్రచురించడానికి అవతరించారు. దానికి ఏ గుర్తు, సాక్ష్యం అవసరం లేదు. ఆ సత్యాన్ని వాళ్ళు జీవించిన జీవన విధానం ద్వారా లోకానికి తెలియజేశారు. ఈ సత్యం ఎన్నటికీ ఆగిపోదు, నాశనం చెందదు. క్రీస్తు తమలో జన్మించనంత వరకూ ఎవరైనా ‘క్రిస్మస్ శుభాకాంక్షలు’ తెలియజేస్తే, అది అర్థం లేనిదే అవుతుంది. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నవారి శాంతిని తాను ఆకాంక్షించకుండా, తనకు శాంతి కలగాలని కోరుకోవడం దురాశ అవుతుంది. ‘యూక్లిడ్ సూత్రం’ ప్రకారం ఎవరైతే తన చుట్టూ ఉన్న వారి శాంతిని కోరుకుంటారో, వాళ్ళ జీవితాల్లో కూడా శాంతి నెలకొంటుంది. ఇందుకు భిన్నంగా ఉండేవారి జీవితాల్లో, చిన్నచిన్న కలహాలు కూడా పెద్ద సమస్యలుగా మారతాయి. కేవలం, యేసుక్రీస్తు ఈ చారిత్రాత్మక జన్మని మాత్రమే మనం స్మరించుకుంటూ, ఆయన సిలువ త్యాగాన్ని విస్మరిస్తే, ఈ పర్వదినానికి విలువ లేనట్లే! అప్పుడు మన విశ్వాసం మృతమైన విశ్వాసం అవుతుంది.. తెలుగు అనువాదం: సి. షఫేల ఫ్రాన్కిన్సన్ -
బిపిన్ రావత్ అంత్యక్రియలు: 17 తుపాకీ వందనాలే ఎందుకు..
సాక్షి, వెబ్‌డెస్క్: తమిళనాడు కూనూర్ సమీపంలో డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన భార్య కూడా మరణించారు. రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి తుపాకీ వందనం (గన్ సెల్యూట్) సమర్పిస్తారు. అంత్యక్రియల సందర్భంగా బిపిన్ రావత్‌కు 17 గన్ సెల్యూట్ సమర్పిస్తారు. ఈ క్రమంలో మన మదిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఈ గన్ సెల్యూట్ ఎందుకు, ఎవరికి సమర్పిస్తారు. వేర్వేరు సందర్భాలలో ఈ తుపాకీ గౌరవ వందనం వేర్వేరుగా ఉండటానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తాయి. వాటన్నింటికి సమాధానాలు.. ఇక్కడ లభిస్తాయి. అంత్యక్రియలో సమయంలో తుపాకీ వందనం సమర్పించడం అంటే.. ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అర్థం. అయితే ఎవరికి ఈ గౌరవం లభిస్తుంది అంటే.. రాజకీయం, సాహిత్యం, న్యాయ, విజ్ఞాన, కళా రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి తుపాకీ వందనం సమర్పిస్తారు. అలానే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున కూడా గన్ సెల్యూట్ ఉంటుంది. దీంతో పాటు భారత సైన్యం.. యుద్ధ, శాంతి సమయాల్లో విశేష కృషి చేసిన వారికి సైనిక వందనం సమర్పిస్తోంది. ఫిరంగి వందనం కూడా సమర్పిస్తారు. ఎవరికి, ఎన్ని తుపాకీ వందనాలు సమర్పిస్తారంటే.. భారత రాష్ట్రపతి, మిలిటరీ, సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు.. 21 తుపాకీ వందనాలు (గాల్లోకి 21 సార్లు కాల్పులు జరుపుతారు) సమర్పిస్తారు. త్రివిధ దళాలలో పని చేసిన ఉన్నతాధికారులు మరణిస్తే.. 17 తుపాకీ వందనాలు సమర్పిస్తారు. గతంలో మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆయన గౌరవార్ధం.. ఢాకాలో 19 తుపాకీ వందనాలు సమర్పించారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి.. తుపాకీ వందనం సమర్పిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తే.. దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించడం, జాతీయ జెండాను అవనతం చేయడం, దేశం అంతటా సెలవు ప్రకటించడం వంటివి చేస్తారు. తొలిసారి మహత్మ గాంధీకి ఇటీవలి కాలంలో మరణించిన వ్యక్తికి సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలో.. లేదో నిర్ణయించే విధంగా నిబంధనలు మార్చబడ్డాయి. భారతదేశంలో తొలిసారిగా మహాత్మా గాంధీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు దీనికి సంబందించి ఎలాంటి నియమ నింబధనలు రూపొందించలేదు. తుపాకీ వందనం వెనక ఉన్న చరిత్ర... బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి భారతదేశం 21 తుపాకీ వందన సంప్రదాయాన్ని వారసత్వంగా పొందింది. స్వాతంత్య్రానికి ముందు అత్యధికంగా 101 తుపాకీ వందనం ఉండేది. దీనిని రాయల్ సెల్యూట్ అని పిలుస్తారు. దీనిని భారత చక్రవర్తికి (బ్రిటీష్ క్రౌన్) మాత్రమే అందించారు. దీని తర్వాత 31-గన్ సెల్యూట్, రాయల్ సెల్యూట్ ఉంటుంది. ఇది రాణి, రాజ కుటుంబ సభ్యులకు సమర్పిస్తారు. ఇదే పద్దతిని వైస్రాయ్, భారత గవర్నర్ జనరల్‌కు కూడా పాటిస్తారు. దేశాధినేత, విదేశీ సార్వభౌమాధికారులు, వారి కుటుంబ సభ్యులకు 21 గన్ సెల్యూట్ సమర్పించారు. ఇక భారత రాష్ట్రపతికి పలు సందర్భాల్లో.. 21 తుపాకీ వందనం సమర్పిస్తారు. నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజున తుపాకీ వందనం స్వీకరిస్తారు. ఇక స్వాంతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు.. 21 తుపాకీ వందనం స్వీకరిస్తారు. చదవండి: మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ సాయితేజ మృతి: కన్నీటి సుడులు.. సంద్రమైన ఓదార్పులు -
కంగన ఎఫెక్ట్: గాంధీజీపై నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నకు, గాంధీజీకి మధ్య సంబంధాలు అంత బాగుండేవి కావు. కానీ మా నాన్నకు గాంధీజీ అంటే చాలా అభిమానం’’ అన్నారు. ఉన్నట్లుండి నేతాజీ కుమార్తె.. తన తండ్రి గురించి, గాంధీజీ గురించి మాట్లాడటానికి కారణం ఏంటంటే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ వివరాలు.. స్వాతంత్య్రం గురించి వివాదం రాజేసి.. అది సద్దుమణగకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కంగన. గాంధీజీ, నెహ్రూ ఇద్దరు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటీష్ వారికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక చరిత్ర ప్రకారం చూసుకున్న గాంధీజీ, నేతాజీకి మధ్య సిద్ధాంతపరమైన విబేధాలున్న సంగతి తెలిసిందే. (చదవండి: మహాత్ముడు కొల్లాయి గట్టింది ఎందుకు?) ఈ క్రమంలో తాజాగా కంగన వ్యాఖ్యలపై నేతాజీ కుమార్తె అనిత బోస్ స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కంగన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. ‘‘మా నాన్నకు, గాంధీ గారికి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావు. మరోవైపు మా నాన్నకు గాంధీ గారంటే చాలా ఇష్టం’’ అని తెలిపారు. ‘‘వారిద్దరు గొప్ప నాయకులు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఒకరు లేకుండా ఒకరిని ఊహించుకోలేం. వారిద్దరిది గొప్ప కలయిక. కేవలం అహింసా సిద్ధాంతం వల్ల మాత్రమే మనకు స్వాతంత్య్రం సిద్ధించింది అంటూ చాలాకాలం నుంచి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ, ఐఎన్ఏ పోషించిన పాత్ర మనందరికి తెలుసు’’ అన్నారు అనితా బోస్. (చదవండి: మరోసారి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియో వైరల్) ‘‘అలానే కేవలం నేతాజీ, ఐఎన్ఏ వల్ల మాత్రమే స్వాతంత్య్రం వచ్చింది అనే ప్రచారం వ్యర్థం. గాంధీజీ మా నాన్నతో సహా ఎందరికో ప్రేరణగా నిలిచారు. స్వాతంత్య్రం గురించి ఏకపక్ష ప్రకటనలు చేయడం తెలివితక్కువతనం’’ అంటూ పరోక్షంగా కంగనకు చురకలు వేశారు అనితా బోస్. చదవండి: బేలాబోస్: ఆమె పేరు మీద ఒక రైల్వేస్టేషన్! -
సాక్షి కార్టూన్ 31-10-2021
-
మహాత్ముని తర్వాత మోదీయే: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ తర్వాత భారత సమాజం, ప్రజల అంతరంగం లోతుగా తెలిసిన ఏకైక నేత ప్రధాని మోదీయేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పొగడ్తల వర్షం కురిపించారు. సవాళ్లను ఆయన ఎలా అధిగమించారో చూస్తే సమాజంపై ఆయనకు ఎంతటి అవగాహన ఉందో తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వాధినేతగా నరేంద్రమోదీ రెండు దశాబ్దాల పాలన అంశంపై జరిగిన జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన శుక్రవారం మాట్లాడారు. మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్యార్థులకు ‘సమర్థ నాయకత్వం, సమర్థవ పాలన‘ అంశంపై రెండు దశాబ్దాల మోదీ రాజకీయ ప్రస్థానాన్ని పాఠ్యాంశంగా చేయాలన్నారు. 20 ఏళ్ల పాలనాకాలంలో ఆయనపై ఎటువంటి అవినీతి మరక పడలేదన్నారు. ప్రధాని మోదీని 24 క్యారెట్ల బంగారం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. 100 ఏళ్ల క్రితం గాంధీజీ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం ప్రధాని మోదీ స్వదేశీ 4.0కు కొత్త నిర్వచనం చెప్పారన్నారు. 2001–2014 సంవత్సరాల్లో మోదీ గుజరాత్ సీఎంగా, 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. -
మహాత్ముడు మెచ్చిన జిల్లా.. ఏకంగా ఐదు సార్లు పర్యటన
నెల్లూరు సిటీ: భారతదేశాన్ని ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కల్గించిన జాతిపిత మహాత్మాగాంధీకి నెల్లూరు జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. నెల్లూరు జిల్లాలో మహాత్మాగాంధీ ఐదు సార్లు పర్యటించారు. 1915–1946 సంవత్సరాల మధ్యలో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు గాంధీ. నెల్లూరు నుంచి వెంకటగిరి వరకు, సంగం నుంచి అనంతసాగరం వరకు, కావలి నుంచి సూళ్ళూరుపేట వరకు అనేక గ్రామాల్లో పర్యటించారు. 1915వ సంవత్సరం మే 14వ తేదీన తొలిసారిగా మహాత్మాగాంధీ భార్య కస్తూర్బాగాంధీతో నెల్లూరుకు వచ్చారు. అప్పట్లో మద్రాసు రాష్ట్ర రాజకీయ మహాసభ నెల్లూరులో జరగడంతో ఆయన పాల్గొన్నారు. 1921 ఏప్రియల్ 7వ తేదీన ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో పెన్నానది తీరాన నిర్మించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. అదే పర్యటనలో నెల్లూరులో తిలక్ విద్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు టౌన్హాల్లో జరిగిన మహిళా సమావేశంలో, వీఆర్ కళాశాల ఆవరణంలో మతసామరస్య సరస్సులో పాల్గొన్నారు. తల్పగిరి రంగనాధున్ని దర్శించుకున్నారు. 1929వ సంవత్సరంలో గాంధీజీ ఐదురోజులు పాటు జిల్లాలో ఉన్నారు. మే 10వ తేదీన బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన బహిరంగసభలో పాల్గొనడంతోపాటు యల్లాయపాళెం, రాజుపాళెం, గండవరం, పార్లపల్లి, విడవలూరు, మోపూరు, అల్లూరులో పర్యటించారు. ఈ పర్యటనలో బుచ్చిరెడ్డిపాళెంలో ఖాదీ నిధికోసం రూ.7వేలు నగదు సేకరించారు. 11వ తేదీన కావలి, ఉలవపాడు, సిద్దనకొండూరు, చింతలపాళెం, పామూరు, కందుకూరు ప్రాంతాల్లో, 12వ తేదీన సంగం, మైపాడు, గంగపట్నం, ఇందుకూరుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనల్లో ప్రజలకు స్వాతంత్ర స్పూర్తిని నింపారు. ఈ పర్యటనలోనే కస్తూరిదేవీ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. నాలుగోసారి 1933 డిసెంబర్ 30వ తేదీన జిల్లాకు వచ్చిన జాతిపిత బిట్రగుంట, కావలి, అల్లూరు, గండవరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు, వెంకటగిరి, నాయుడపేట గ్రామాల్లో పర్యటించారు. ఐదవసారి 1946 జనవరి 21వ తేదీన బిట్రగుంట నుంచి మద్రాసు వరకు పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. లక్షలాది మంది ఆయన వెంట నడిచారు. జిల్లాలో జాతిపిత పర్యటనకు గుర్తుగా పత్తి సుబ్బారావు అనే వ్యక్తి నెల్లూరు నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు గాంధీబొమ్మ సెంటర్‌గా పిలుస్తున్నారు. -
పాన్ ఇండియా స్థాయిలో ‘1948 - అఖండ భారత్’
మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి గల కారణం ఏంటి? హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘1948 - అఖండ భారత్’. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలేఖ్య శెట్టి, రఘనందన్, ఆర్యవర్ధన్ రాజ్, ఇంతియాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ని గాంధీ జయంతి సందర్భంగా శనివారం విడుదల చేశారు. సుమారు 92 ముఖ్య పాత్రలతో భారీగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు నిర్మాత ఎం.వై.మహర్షి తెలిపారు. ఈ సందర్భంగా రీసెర్చ్ డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి... హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని చెప్పారు. 70 సంవత్సరాల పాటు దాచి పెట్టబడిన నిజాలను... ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్ ని సిద్ధం చేశామన్నారు. ఈ చిత్రానికి ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే -మాటలు - రీసెర్చ్: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్, సంగీతం: శశిప్రీతమ్. -
AP: రాజ్‌భవన్‌లో ఘనంగా గాంధీజీ, శాస్త్రిజీ జయంతి వేడుకలు
సాక్షి, అమరావతి: అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటిన మహాత్ముడు గాంధీజీ అని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. మహత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్‌భవన్ ఆవరణలో గవర్నర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముని జీవితం ఆచరణీయమని అన్నారు. కేవలం భారతీయులే కాక ప్రపంచవ్యాప్తంగా జాతి పిత మహాత్మా గాంధీ 152వ జయంతి, భారతదేశ ద్వితీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని జరుపుకుంటున్నారన్నారని తెలిపారు. గాంధీ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా జరుపుకోవటం భారతీయులుగా మనకు గర్వకారణమన్నారు. మహాత్మా గాంధీ సత్యం, న్యాయం పట్ల విశ్వాసంతో యావత్త్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. అహింసా మార్గంలో శాంతిని నెలకొల్పటానికి గాంధీజీ చేసిన కృషి చిరస్ధాయిగా నిలిచి పోతుందన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన గొప్ప నాయకుడిని స్మరించుకోవటానికి, ఆయన కలలు కన్న భారతదేశ నిర్మాణంలో పునరంకితం కావటానికి జయంతి వేడుకలు ప్రేరణగా నిలుస్తాయన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి సామాన్యులతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేపథ్యంలో ప్రజా జీవితం దేశ ప్రజలలో చిరస్ధాయిగా నిలిచిపోయిందన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి బలమైన నాయకునిగా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నప్పటికీ వినయంతో, మృదువుగా మాట్లాడేవారని గవర్నర్ అన్నారు. గాంధీజీ జయంతి వేడుకలలోభాగంగా గవర్నర్.. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో పది లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారంచుట్టారు. రాజ్‌భవన్ ఆవరణలో తొలిమొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మొక్కలను నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్పీ సిసోడియా, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏకే ఫరీడా తదితరులు పాల్గొన్నారు. -
‘గాంధీ’ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షల మంది..: హాలీవుడ్ నటుడు
మహాత్మా గాంధీ జీవితంపై వివిధ వెర్షన్లలో భారతీయ, అంతర్జాతీయ చిత్రాలు తెరకెక్కాయి. అందులో 1982లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘గాంధీ’ ఒకటి. ఈ మూవీలో బ్రిటీష్ నటుడు బెన్ కింగ్స్లే గాంధీజీ పాత్ర పోషించాడు. గతేడాది ఈ సినిమా మళ్లీ చూసిన యాక్టర్.. గాంధీ అంత్యక్రియల సీన్ చిత్రీకరణ సమయంలో 4 లక్షలకి పైగా భారతీయులు వచ్చినట్లు తెలిపాడు. ‘ఎవరైనా ఓ వ్యక్తిని అభిమానించడం సాధారణం. కానీ ఓ సినిమాలో ఆయన పాత్రని సైతం అంతే అభిమానించడం అద్భుతం. ‘గాంధీ’ సినిమా సమయంలో అది జరిగింది. అందులో బాపూజీ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షలకు పైగా భారతీయులు హాజరయ్యారు. నిజంగా భారతదేశంలో ప్రజలు చాలా ఉదారంగా ఉంటారు’ అని నటుడు బెన్ తెలిపాడు. కావాలంటే ఆ సీన్ మీరు చూడండి అంటూ.. సీజీఐ లేని పుటేజీని షేర్ చేశాడు. అయితే ఈ సీన్ గురించి ప్లానింగ్‌లో ఉన్నప్పుడు.. ‘దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో గాంధీ అంత్యక్రియల పుటేజీ చూపించాడు. అలాంటి సీన్ రిక్రియేట్ చేయడం కష్టం అనుకున్నా. కానీ రిచర్డ్ అసాధ్యాన్ని, సాధ్యం చేసి చూపించాడని’ బెన్ వివరించాడు. అయితే ఈ చిత్రం ఆ ఏడాది ఆస్కార్ పురస్కారాల్లో 11 నామినేషన్లకు పొందగా.. 8 ఆస్కార్ అవార్డులు అందుకుని సత్తా చాటింది. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడి గొప్పతనాన్ని తెలిపే ఆ సినిమాలోని మొదటి 10 నిమిషాల వీడియోపై మీరు ఒకసారి లుక్కేయండి. చదవండి: జాతిపిత గొప్పదనం తెలిపే చిత్రాలివే.. -
జాతిపిత గొప్పదనం తెలిపే చిత్రాలివే..
భారత దేశం గర్వించదగిన మహనీయులలో మహాత్మా గాంధీ ఒకరు. భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించడం కోసం చేసిన పోరాటానికి గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు.. యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అందుకే ఆయన మహాత్ముడు అయ్యారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతిపితను మరోసారి స్మరించుకుంటూ.. గాంధీజీ జీవిత చరిత్ర ఆధారంగా, ఆయన సాగించిన స్వాతంత్య్ర పోరాట పటిమ ఆధారంగా తెరకెక్కిన చిత్రాలపై ఓ ఇక్కడ ఓ లుక్కేయండి. 1) గాంధీ (1982) బ్రిటీష్ ఫిలిం మేకర్ రిచర్డ్ అటెన్ బర్గ్ తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ’. 1982 లో విడుదలైన ఈ సినిమాలో బ్రిటీష్ యాక్టర్ బెన్ కింగ్స్లే మహాత్మా గాంధీ పాత్రలో నటించాడు. బ్రిటీష్ పాలనకు బాపూజీ ఎలా చరమగీతం పాడారనేది ఇందులో చూపించారు. సినిమా తెరకెక్కించిన తీరు ఆస్కార్ అవార్డుకు సైతం ఎన్నికైంది . బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ లాంటి కేటగిరీలు అన్నీ కలిపి గాంధీ మూవీకి మొత్తం 8 ఆస్కార్ అవార్డులు వరించడం విశేషం. 2) ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’ (1996) మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే సాధారణ పౌరుడు దేశం గర్వించేలా ‘మహాత్మా గాంధీ’ ఎలా అయ్యారనే అంశంతో ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’ సినిమా తెరకెక్కింది. దక్షిణాఫ్రికాలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం నుంచి కసితో స్ఫూర్తిని పొందిన గాంధీ.. భారత్‌కి తిరిగొచ్చి స్వాతంత్య్ర ఉద్యమానికి ఎలా నాయకత్వం వహించారు?.. బ్రిటిషర్లను దేశం నుంచి ఎలా తరిమి కొట్టారనే అంశాలను ఈ మూవీలో చూపించారు. 3) హే రామ్ (2000) కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హే రామ్’. ఈ మూవీ గాంధీ హత్యోదంతంపై ఫోకస్ చేస్తూ తెరకెక్కించారు. గాంధీ హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. 4) గాంధీ మై ఫాదర్ (2007) ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ మై ఫాదర్’. ఈ మూవీ గాంధీలోని మరో కోణాన్ని చూపించింది. యావత్ జాతికి జాతి పితగా నిలిచిన గాంధీ తన సొంత కుమారుడి చేత మాత్రం ఒక మంచి తండ్రి అనిపించుకోలేకపోయారనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శన్ జరివాలా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నిజ జీవితంలో గాంధీకి, ఆయన వారసుడు హీరాలాల్‌కి మధ్య దూరం విధానం గురించి తెరకెక్కించారు. గాంధీ హత్య తర్వాత కొద్ది రోజులకే అత్యంత పేదిరకంతో హీరాలాల్ చనిపోయినట్టు ఈ చిత్రంలో చూపించారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాను నిర్మించారు. 5)‘మహాత్మ’ (2009) శ్రీకాంత్ హీరోగా, భావన హీరోయిన్గా కృష్ణవంశీ తెలుగులో తెరకెక్కించిన చిత్రం ‘మహాత్మా’. ఈ మూవీలో రౌడీగా ఉన్న కథనాయకుడు గాంధీజీ ప్రేరణతో ఎలా మారాడు అనేది ఈ సినిమా వృత్తాంతం. హింసే సమస్యలకు మార్గం అనుకునే హీరోను బాపూజీ అహింస సిద్ధాంతంతో హీరోయిన్ ఎలా మార్చింది.. అతడు మారిన తర్వాత ఎదుర్కొన్న పరిణామాలను ఇందులో చక్కగా చూపించారు. 6) లగేరహో మున్నా భాయ్ (2010) ఈ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఈతరం ఆడియెన్స్ చూసిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఇది ఒకటి. పైగా ఇదే సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ అనే టైటిల్‌తో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. గాంధీగిరితో ఏదైనా సాధించొచ్చనే స్టోరీలైన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇవే కాకుండా ఇంకా మరెన్నో చిత్రాలు గాంధీజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కాయి. బాపూజీ జీవితంలో అందరికీ తెలిసిన విషయాల నుంచి ఎవరికీ తెలియని కోణాల వరకు వివిధ రకాల అంశాలను ఆ సినిమాల్లో చూపించారు. -
గతమెరిగి ముందుకు నడుద్దాం
ఏ మహనీయుల జయంతి వేడుకలైనా జరుపుకోవడం కేవలం వారిని స్మరించుకోడానికా? వారి ఆశయాలను అనుసరిస్తూ, మనను మనం ఉన్నతీకరించుకునే ఒక స్ఫూర్తి అవకాశంగా మలచు కోవడానికా? జవాబు మొదటిదే అయితే చర్చే లేదు! రెండోదయితేనే.. ఆత్మపరిశీలన చేసుకోవాలి. యేటా అక్టోబరు 2న మనం జాతిపిత బాపూజీ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. బాపూజీని ఎంతవరకు అనుసరిస్తున్నాము, ఆయన చేసిన కర్తవ్య బోధ, పాటించిన విలువలు, అనుసరించిన జీవనవిధానం మనను ఏ మేరకు ప్రభావితం చేసింది? అని ఎవరికి వారం ప్రశ్నించుకోవాలి. విశాల భారత దేశాన్ని ఏకతాటిపై నడిపి, మానవాళి చరిత్రలోనే అపురూపమైన మహోజ్వల స్వాతంత్య్రో ద్యమాన్ని శీర్షభాగాన నిలిచి నడిపించిన సమరశీలి! సత్యం, శాంతి, అహింస, సహాయ నిరాకరణ ఆయుధాలుగా నిరసనకు ఓ కొత్త సాంకేతిక నిర్వచనం ఇచ్చి, త్రికరణశుద్ధిగా ఆచరించి చూపిన యోగి! అప్పటికే దక్షిణాఫ్రికాలో సంచలనం సృష్టించి భారత్‌కు తిరిగి వస్తూ, ముంబాయిలో అడుగు పెట్టే నాటికే గాంధీజీ విశ్వనరుడు. ఇక్కడ ఆయనను ఉద్యమ నాయకుణ్ణి చేసినవి నాటి పరిస్థితులు, అంతకుమించి ఆయన నిరాడంబరత–నిబద్ధతలు! భూగోళమంతా విస్తరించి, రవి అస్తమించని సామ్రాజ్యమనే ఖ్యాతి గడించిన బ్రిటీష్ పాలకులను భారత భూభాగం నుంచి బేషరతుగా పంపిం చిన ఘన విజేత! ‘సత్యాగ్రహం’ అనే సరికొత్త బాటలో నడిపారాయన. ఒక పిలుపు ఇస్తే దేశమంతా కదిలి వచ్చేది. ప్రజలు విదేశీ వస్తుబహిష్కరణ చేశారు, స్వదేశీ బట్టగట్టారు, ఉపవాసమున్నారు, లాఠీదెబ్బలు తిన్నారు, నెలల తరబడి జైళ్లలో మగ్గారు. మధురై ప్రసంగంలో బీహార్ వరద బాధితుల ఆక్రందనల్ని ప్రస్తావించి, ‘వారూ మన సోదరులే... అన్నీ పోగొట్టుకొని నిరాశ్రయులయ్యారు, మనం చేతనైన సాయం చేద్దాం’ అని గాంధీజీ అంటే, అక్కడికక్కడ పౌరులు జేబుల్లో ఉన్న డబ్బుతో పాటు ఒంటిమీదున్న నగలూ, నట్రా కుప్పపోశారు. ఆ రోజుల్లో ఆయన మాట అలా ఒక సమ్మోహన శక్తి అయింది. స్వాతంత్య్రంతో పాటు ఆ క్రమంలో గాంధీజీ సాధించిన ఓ అసాధారణ ఫలితమే మంటే సగటు భారతీయుల వ్యక్తిత్వాన్ని మహోన్నత స్థాయికి పెంచడం! నిజమైన దేశభక్తి, జాతీయ వాదం, నిజాయితీ, మానవత్వం వంటి విలువల్ని ‘జీవన విధానం’ అనే లంకెతో గాంధీజీ సూత్ర బద్దం చేశారు. స్వాతంత్య్రానంతరం ఒకట్రెండు దశాబ్దాల పాటు దాదాపు అన్ని రంగాల్లోనూ అది ప్రతిఫలించింది. రాజకీయ నాయకుల నుంచి సామాజికవేత్తలు, వర్తకులు, వ్యాపారులు, పారి శ్రామికవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, వకీళ్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వోద్యోగులు... ఇలా సమాజంలోని సమస్త వర్గాలవారు విలువలతో పనిచేశారు. ‘మేం వెళ్లిన మరుక్షణం మీ దేశం నిలువదు, ముక్క చెక్కలవుతుంది’ అన్న బ్రిటిష్‌వాడి మాటల్ని వమ్ము చేసి, భారత్ ఎదగడమన్నది గాంధీజీ సాధించిన ఒంటిచేతి విజయఫలం! కానీ, ఇవాల్టి పరిస్థితి.. అందుకు పూర్తి భిన్నంగా, ఎంతో దయనీయంగా ఉంది. కారణం, మనం గాంధేయవాదానికి ఆచరణలో తిలోదకాలిచ్చాం. అందుకే, గాంధీజీ– ఆయన విధానాల అవసరం ఆయన కాలంలో కన్నా నేడే ఎక్కువ! స్వప్రయోజనాలకో, లోతైన అవగాహన లేకో... గాంధీజీని, ఆయన విధానాల్ని విమర్శిస్తూ, వివాదాస్పదం చేసే వ్యక్తులు, గుంపులు తర్వాత్తర్వాత మొదలయ్యాయి. ఏ విషయంపైనా ఇంచ్‌కి మించిన లోతు అవగాహన లేని అల్లరి, అజ్ఞానపు మూకల్ని మాత్రమే వారు ప్రభావితం చేయగలరు. ‘రక్తమాంసాలతో ఇలాంటి ఒక మనిషి నేలపై నడయాడాడు అంటే భవిష్యత్తరాలు నమ్మవు’ అని గాంధీజీ జీవన విధానాల్ని కీర్తించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటల ముందు ఈ పిల్లచేష్టలు చల్లబడతాయి. ‘గాంధీ జీయే నాకు స్ఫూర్తి’ అన్న మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) విశ్వాసం ముందు విమర్శలు వీగి పోతాయి. ‘ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రతీక గాంధీ, తరతరాల మానవాళికి మార్గదర్శి’ అన్న నెల్సన్ మండేలా ప్రశంస విమర్శకుల నోళ్లు మూయిస్తుంది. ఈ కాలపు అమెరికా ప్రొఫెసర్ జెనె షార్ప్ ‘డిక్టేటర్షిప్ టు డెమాక్రసీ’ అనే పుస్తక ప్రభావం పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలె న్నింట్లోనో ప్రజాస్వామ్య నవ వసంత వీచికలకు కారణమైంది. బలోపేతంగా కనిపించే నియంతృత్వ ప్రభుత్వాలు కూడా, సరైన పంథాలో ఉద్యమాలు నడిపితే... ‘ఒక ఇటుక లాగితే కుప్పకూలే భవ నాల్లా’ కూలి నేలమట్టమవుతాయని రాసిన జెనెషార్ప్, గాంధేయవాదంలో ఆ సత్తావుందని పుస్త కంలో పలుమార్లు ఉటంకించారు. గాంధీజీ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని, మనమంతా గాంధేయవాదాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా యువ రాజకీయ నాయకత్వం ఆయన బాటలో సాగితే అద్భుతమైన ఫలితాలుంటా యనడానికి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ కళ్లెదుటి సాక్ష్యం. గాంధీజీ కలలు కన్న ‘గ్రామస్వరాజ్యం’ సాకారమౌతున్న జాడలు రెండేళ్లలోనే మొదలయ్యాయి. ఏ ఏడు సామాజిక పాపాలు గాంధీజీ వద్దన్నాడో, అవే ఇపుడు దేశమంతా బలపడుతున్నాయి. శ్రమలేకుండా గడించే సంపద, అంతరాత్మ ఒప్పని విలాసాలు, వ్యక్తిత్వం ఇవ్వని జ్ఞానం, విలువల్లేని వ్యాపారం, మానవత చూపని విజ్ఞానం, త్యాగం లేని మతం, సిద్దాంతాలకు లోబడని రాజకీయాలు వద్దంటే వద్దన్నాడా యన. ఆ పాపాలే రాజ్యమేలుతున్న దుష్టకాలమిది. దీన్నుంచి బయటపడటానికి మళ్లీ గాంధీ, గాంధేయ విధానాలే మనకు మార్గం. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో అక్షరాలా గాంధేయ వాదముంది. వ్యక్తి క్రమశిక్షణ ప్రధానమని గాంధీ నొక్కి చెప్పారు. ఎవరి స్థాయిలో వారం పాటిం చాలి. ఆయనే చెప్పినట్టు ‘మనం ఆశించే మార్పు, మననుంచే మొదలవ్వాలి’! -
సాధికారత సాధించని ఒడంబడిక
ఎన్నికల్లో ఇప్పుడు రిజర్వుడు స్థానాలుగా ప్రతిఫలించిన పూనా ఒడంబడిక జరిగి తొమ్మిది దశాబ్దాలు గడిచింది. స్వాతంత్య్ర పూర్వ భారతదేశంలో అంబేడ్కర్‌కూ, మహాత్మాగాంధీకీ కుదిరిన ఈ ఒడంబడిక గట్టి వాదోపవాదాలకు కేంద్రబిందువైంది. అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, దీనికి నామినేషన్ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్లే ప్రతినిధులుగా ఎన్నిక కావాలని అంబేడ్కర్ వాదించారు. ఇది హిందూ సమాజాన్ని మరింత చీల్చుతుందని గాంధీజీ భావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిమధ్యా కుదిరిన, కుదిర్చిన రాజీయే పూనా ఒడంబడిక. ఈ ఒడంబడిక రావడానికి కారణమైన ముందటి, అనంతర పరిణామాలు స్వాతంత్య్ర పోరాటానికి సమాంతరమైన చరిత్ర! ‘‘భారత సామాజిక నిర్మాణం రెండు ముఖ్యమైన భాగాలుగా విభజితమైంది. అందులో ఒకటి వర్ణం, రెండవది అవర్ణం. వర్ణంలో ద్విజులు, ద్విజులు కానివారు ఉంటారు. అవర్ణంలోని వారిని అంటరాని తెగలు, నేరస్థ, ఆదిమ తెగలుగా వర్గీకరించారు. అయితే వర్ణంలోని ద్విజులు, ద్విజులు కానివారి మధ్య విభజన ఉంటుంది. అది పెద్దగా కనిపించని సన్నని పొర. అవర్ణంలోని ఆదిమ తెగలు ఎవరికి వారుగానే జీవిస్తారు. వర్ణంలోని కులాలతో వీరికి అంతగా సంబంధాలుండవు. అయితే వర్ణా నికి బయట అవర్ణులుగా ఉన్న అంటరాని కులాలకు, మిగతా సమా జానికీ మధ్య ఉన్న వైరుధ్యం ఇనుప కంచె లాంటిది. దానిని ఛేదిం చడం అంత సులువు కాదు.’’ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1940కి ముందే చేసిన విశ్లేషణ ఇది. ఆ రోజు అంటరాని కులాలుగా పిలిచిన నేటి షెడ్యూల్డ్ కులాలు, రాజకీయ పరిభాషలో దళితులు ఈ సమా జంలో ఇప్పటికీ భాగం కాలేకపోయారు. భారతదేశంలో ప్రజా ప్రభుత్వాల ఏర్పాటు, ప్రజాప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య స్థాపన అవగాహనల కోసం 1919లో భారత దేశం సందర్శించిన సౌత్‌బరో కమిటీ ముందు ఒక ముప్ఫై యేళ్ళ యువ కుడైన అంబేడ్కర్, అమెరికాలో చదివిన ఉన్నత విద్యావంతుడిగా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. భారతదేశంలో కులాల మధ్య ఉన్న అంతరాలు, ముఖ్యంగా అంటరాని కులాలకూ, ఇతర కులాలకూ మధ్య ఉన్న అసమానతలు ప్రభుత్వాల ఏర్పాటులో ప్రభావం చూప కూడదంటే, అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించా లని, దీనికి నామినేషన్ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారానే వాళ్ళ ప్రతినిధులుగా ఎన్నిక కావాలని, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగా లని సూచించారు. అంటే సమాజంలోని విద్యావంతులకు, సంపన్ను లకు, భూస్వాములకు, వ్యాపారస్తులకు మాత్రమే ఓటు హక్కు కల్పిం చడం సరిపోదని, కుల, మత, ప్రాంత భేదం లేకుండా ప్రతి వయో జనుడికీ ఓటు హక్కు కల్పించాలని సౌత్ బరో కమిటీ ముందు ప్రతిపాదించాడు ఆ యువకుడు. ఆ తర్వాత సైమన్ కమిషన్ ముందు, 1930–32 మధ్య జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లలోనూ ఆయన ఇదే అంశాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో వాదించారు. అప్పటికే ముస్లింలకు, క్రిస్టియన్లకు అమలు జరుగుతున్న ప్రత్యేక ఎన్నిక విధా నాన్ని, అంటే తమ అభ్యర్థులకు తామే ఓట్లు వేసుకునే పద్ధతిని అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్‌గా పిలుస్తోన్న అంటరాని కులాలకు వర్తిం పజేయాలని వాదించారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు గాంధీజీ హాజరుకాలేదు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మొదటి సభలో ఈ విషయంపై చేసిన ప్రతిపాదనను విని బెంబేలెత్తిపోయిన గాం«ధీజీ, రెండో సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీజీ అత్యంత శ్రద్ధపెట్టిన అంశం డిప్రెస్డ్ క్లాసెస్‌కు ప్రత్యేక ఎన్నిక విధానాన్ని వ్యతిరేకించడమే. అంబేడ్కర్, గాం«ధీ మధ్య ఈ విషయమై తీవ్ర వాదోపవాదాలు జరి గాయి. అంటరాని కులాలను తరతరాలుగా వెలివేశారని, హిందువు లలో భాగంగా వారిని ఎన్నడూ చూడలేదని, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారని అంబేడ్కర్ వాదించారు. ఈ కారణంగానే వారికి రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కావాలని; వారి ప్రతినిధు లను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలని కుండబద్దలు కొట్టారు. లేదంటే, రాజకీయ స్వేచ్ఛకు బదులు దళితులు తరతరాల బానిసత్వా నికి బలి కావాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అంబేడ్కర్ సూచించి నట్టుగా, అంటరాని కులాలకు ప్రత్యేక ఎన్నిక విధానంలో తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. అందుకు అనుగుణంగా నాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ ఒక ఉత్తర్వును జారీచేశారు. దానిపేరే కమ్యూనల్ అవార్డు. అయితే, గాంధీ దీనిని జీర్ణించుకోలేకపోయారు. 1932, మార్చి 11న బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఒక లేఖ రాశారు. ‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ విధానం కల్పించి, వారి అభ్యర్థిత్వాన్ని వారే ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తే, నేను ఆమరణ దీక్షకు పూనుకుం టాను’ అన్నారు. రామ్సే మెక్‌డొనాల్డ్ గాంధీ లేఖకు, ‘‘మీ ఉద్దేశం హిందువులకు, అంటరాని కులాలకు కలిపి ఓటింగ్ ఉండాలని కాదు. హిందువుల మధ్య ఐక్యత సాధించాలని కాదు. అంటరాని కులాల తరఫున శాసనసభలో నలుగురు నిజమైన ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకోవడమే తప్ప మరొకటి కాదు’’ అని తీవ్రంగా జవాబి వ్వడం గమనించాల్సిన విషయం. రామ్సే మెక్‌డొనాల్డ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దానితో కాంగ్రెస్ పార్టీ, హిందూ సంఘాల నాయకులు అంబేడ్కర్ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. చివరిదాకా అంబేడ్కర్ వాళ్ళ ఆలోచనలకు తలొగ్గలేదు. కానీ, ఒకవేళ గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే గ్రామాల్లో అల్పసంఖ్యాకులుగా ఉన్నవారిపై, అగ్రవర్ణాలు దాడులకు తెగబడతారనే భయంతో రామ్సే మెక్‌డొనాల్డ్ ఇచ్చిన ఉత్తర్వులను వదులుకోవాల్సి వచ్చింది. దాని స్థానంలో 1932 సెప్టెంబర్ 24వ తేదీన పూనా ఒడంబడిక జరిగింది. పూనా ఒడంబడిక ద్వారా ప్రత్యేక ఓటింగ్, అంటే తమ అభ్యర్థులను తాము మాత్రమే ఎన్నుకునే విధానానికి బదులుగా, రిజర్వుడు నియోజక వర్గాల విధానం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న రిజర్వుడు స్థానాల ఎన్నికల విధా నంలో కేవలం ఆధిపత్య కులాల, సవర్ణ హిందువుల అంగీకారం ఉన్నవాళ్ళే ఎస్సీ ప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. దళితుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళు, కులసమాజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు ఎస్సీల ప్రతినిధులు కాలేకపోతున్నారు. కారణం మనందరికీ తెలుసు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మెజారిటీగా ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్నాయి. అంతేకాకుండా, ఓటర్లలో నూటికి 70 నుంచి 80 శాతం మంది దళి తులు కానివారే. అందువల్ల కూడా నిజమైన దళిత ప్రజాప్రతి నిధులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నిక కావడం లేదు. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. దీనికి ప్రస్తుతం ఎన్నికవుతున్న ఎస్సీ ప్రజాప్రతినిధులను బాధ్యులను చేయాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఎన్నికల విధానమే తప్ప వ్యక్తులు కాదు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశించినట్టుగా, తమ ప్రతి నిధులను తామే ఎన్నుకునే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే భారత సామాజిక, రాజకీయ రంగంలో మౌలికమైన మార్పులు వచ్చేవి. కానీ ఎస్సీ ప్రతినిధులందరూ ఈ రోజుకు కూడా అసెంబ్లీలోగానీ, పార్లమెంటులో గానీ దళితుల పక్షాన నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు కొంత మంది మాట్లాడుతుంటారు. వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. మళ్ళీ వాళ్ళే అధికార పక్షంలోకి వెళ్తే నోటికి తాళాలు పడిపోతాయి. ఇది ఒక కఠోర వాస్తవం. అయితే దీనికి పరిష్కారమేమిటి అనే సందేహం వస్తుంది. తక్షణమైతే ప్రజా ప్రతినిధులు తమలో తాము అవలోకనం చేసు కోవాలి. కనీసం తక్షణ సమస్యలపైనైనా దళితుల పక్షాన నిలబడ టానికి ప్రయత్నించాలి. అంతిమంగా ఈ ఎన్నికల విధానాన్ని మార్చడానికి మళ్ళీ ఒక రాజకీయ ఉద్యమం జరగాలి. తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే విధానంపైన ఒక చర్చ జరగాలి. ఇందుకుగాను దళితులు రాజకీయ ఉద్యమానికి సన్నద్ధం కావాలి. సమాజంలోని ప్రజాస్వామిక శక్తులు, అసమానతలు తొలగిపోవాలనే వ్యక్తులు, సంస్థలు, దళిత ప్రజాప్రతినిధుల ఎన్నిక విధానంలో మార్పు కోసం కలిసి రావాలి. లేనట్లయితే సామాజిక ఆర్థిక అసమానతలకు తోడుగా రాజకీయ బానిసత్వం ఇంకా పాతుకుపోయే ప్రమాదం ఉంటుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
మహాత్ముడు కొల్లాయి గట్టింది ఎందుకు?
గాంధీజీ నిర్ణయం తీసుకున్నారు! అంతే, రాత్రి పది గంటలప్పుడు గుండు గీయించుకున్నారు. మర్నాడు చేనేత కార్మికుల సభలో కొల్లాయి గుడ్డతో ప్రసంగించారు. అది 1921 సెప్టెంబర్ 22. సరిగ్గా వందేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. మోకాళ్ళు దాటని గోచీ, పైన తువ్వాలు. ఇంతే ఆహార్యం! చలికాలం అవసరమనుకుంటే నూలు శాలువా. కన్ను మూసే దాకా అలాగే కొనసాగారు. ఖాదీ తనకు ‘ఐడియా’, ‘ఐడియల్’ అని గాంధీజీ పేర్కొంటారు. పలు భాషలు, సంస్కృతుల భారత దేశానికి ఆయన దుస్తులు గొప్ప ‘కమ్యూనికేషన్’గా పనిచేశాయి. 1921 జూలై 31న బొంబాయిలో అధికారికంగా ప్రారంభించిన విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్‌కి ముగిసిపోవాలి. అయితే అది తృప్తిగా సాగడం లేదు. తగినంత ఖద్దరు దొరకడం లేదని తెలిసింది. ఖరీదు ఎక్కువ కావడంతో కొనడం కష్టం అని కూడా చెప్పారు. దానికి గాంధీజీ, ‘ఖాదీ చాలి నంత దొరక్కపోతే కొల్లాయితో సరిపుచ్చుకోండి’ అంటూ ఉపన్యసించారు. సరిగ్గా ఈ దశలో గాంధీజీ వ్యక్తిగా వంద రెట్లు, కాదు వెయ్యి రెట్లు ఎదిగారు. బిహార్ చంపారణ్య ప్రాంతంలో నీలిమందు పండించే రైతుల కష్టాల పరిష్కారానికి దోహదపడింది గాంధీజీ నాయకత్వం వహించిన తన తొలి భారత దేశపు ఉద్యమం. అహ్మదాబాద్ జౌళి కార్మికుల కోర్కెలకు మద్దతుగా నిలిచింది రెండో పెద్ద ఉద్యమం. ఈ రెండూ గుడ్డలకు సంబంధించినవే. 1918లో జరిగిన జౌళి కార్మిక ఉద్యమంలో రెండు వారాలు గడిచింది. నిరసన తెలిపే కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఓ రోజు గాంధీజీ, అనసూయబెన్ వచ్చారు. సమ్మె కార్మికులెవరూ చెట్టుకింద లేరు. కారణం ఏమిటి అని ఆరా తీశారు. ఓ కార్మికుడు చెప్పాడు: వారికి పోయేదేముంది? కార్లో వస్తారు, ఇంటికెళ్లి భోంచేస్తారు అనే అభిప్రాయముందని! గాంధీజీ మనసు కల్లోలమై, దీర్ఘాలోచనల్లో పడింది. దాని ఫలితమే తన తొలి నిరాహారదీక్ష. 1918 మార్చి 15న ప్రారంభమైంది. ఫలితంగా వారం రోజుల్లో పరిష్కారం లభించింది. ‘త్రికరణ శుద్ధి’ అని అంటామే, దాన్ని సంపూర్తిగా కలిగిన నాయకుడు గాంధీజీ. మోకాళ్లు దాటని గోచీ, లేదా కొల్లాయి కట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? గాంధీజీ మూడవ తరగతి రైలు బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ గుండా రాయలసీమ ప్రాంతపు రైతులను చూశారని, అదే స్ఫూర్తి అని అక్కిరాజు రమాపతిరావు తన ‘దుర్గా బాయి దేశ్‌ముఖ్’ మోనోగ్రాఫ్‌లో పేర్కొన్నారు. మోప్లాల తిరుగుబాటు విషయం తెలిసి మహమ్మ దాలీతో మలబారు ప్రయాణమయ్యారు గాంధీజీ. కానీ వాల్తేరులో మహమ్మదాలీని అరెస్టు చేయడమే కాక, గాంధీజీ మలబారు పర్యటనను కూడా బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. దీనితో గాంధీజీ తన పర్య టనను కుదించుకుని, మదురై వెళ్ళారు. తిరుచురాపల్లి నుంచి మదురైకి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు – తను కొల్లాయి కట్టుకోనంత వరకు రైతులకు ఆ ప్రబోధం చేయకూడదని నిర్ణయించు కున్నారు. తనతో పాటు ప్రయాణం చేస్తున్న రాజాజీకి చెబితే నచ్చలేదు. కానీ గాంధీజీ స్థిర నిర్ణయానికి వచ్చేశారు. విదేశీ వస్త్ర బహిష్కరణకు ఇది తోడ్పడుతుంది. ఖద్దరు ధరించాలనే నియమానికి ప్రతీక అవుతుంది. ఖద్దరు లోటును కొంత పరిష్కరిస్తుంది. మన దేశపు శీతోష్ణస్థితుల్ని బట్టి కూడా గోచీ ధరించడం ఇబ్బంది కాదు. మన సంస్కృతి కూడా మగవాళ్లను తమ శరీరం పూర్తిగా కప్పుకోమని నిర్దేశిం చదు. ఇన్ని కారణాలతో గాంధీజీ యాభై రెండేళ్ళ వయసులో, స్వాతంత్య్రోద్యమం తొలి రోజుల్లో కొల్లాయి గట్టడం ప్రారంభించారు. దేశంలోని ఎందరో దరిద్ర నారాయణులకు ప్రతీక అయ్యారు. కోటానుకోట్ల భారతీయులకు ఆరాధ్యుడయ్యారు. డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి మొబైల్ : 94407 32392 (నేడు గాంధీజీ కొల్లాయి ధారణ శత వసంతాల వేడుక) -
రత్నం పెన్ అండ్ సన్స్ అధినేత అస్తమయం
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం నగరానికి చెందిన రత్నం పెన్ అండ్ సన్స్ అధినేత కేవీ రమణమూర్తి (80) సోమవారం కన్నుమూశారు. స్వాతంత్రోద్యమ సమయంలో స్వదేశీ వస్తువుల వాడకం విషయమై మహత్మాగాంధీ పిలుపును అందుకుని రమణమూర్తి తండ్రి కోసూరి వెంకటరత్నం రాజమహేంద్రవరంలో తొలి స్వదేశీ పెన్ (రత్నం పెన్ ) తయారీ పరిశ్రమను నెలకొల్పారు. చదవండి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ‘దేవరవాండ్లు’కు కుల ధ్రువీకరణ పత్రాలు రమణమూర్తికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆయన మృతికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: రాష్ట్ర పోలీసు అధికారులతో పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ హీనా విజయ్‌కుమార్ -
కాలరేఖలు: మహాత్ముడి మౌనం
స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం సాగిన సమరంలోని ప్రతి కదలిక.. ప్రతి సందర్భం చిరస్మరణీయం! నిత్య ప్రేరణ.. స్ఫూర్తి!! భారత స్వాతంత్య్ర పోరాటంలోని అలాంటి ఘట్టాలను అమృతోత్సవ నేపథ్యంలో ప్రతి వారం ‘కాలరేఖలు’ పేరుతో కథనాలుగా అందిస్తున్నాం. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక నేపథ్యంలో స్మరించుకోవలసిన మరొక తేదీ–జూన్ 3, 1947. భారతదేశానికి ‘అధికార బదలీ’ చేస్తున్నట్టు ఇంగ్లండ్ ప్రకటించిన రోజు. దాదాపు తొమ్మిది దశాబ్దాల స్వరాజ్య సమరం ఆ రోజుతో ముగుస్తుంది. ఆ పోరు చాలా పంథాలలో సాగినా జాతీయ కాంగ్రెస్‌కు ఆ కీర్తి దక్కింది. ముస్లింలీగ్ ఆశయం నెరవేరింది. హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాన్ని భారత్ అని, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ అని ఇంగ్లిష్ ప్రభువులు నామకరణం చేశారు. పెద్ద దేశం! ఇన్ని సంస్కృతులు, భాషలు, వైవిధ్యం ఉన్న ప్రజలను విభజించడానికి ప్రాతికపదిక ఏమిటి? భారతీయులకు ‘అధికార బదలీ’ (స్వతంత్రం అన్నమాట లేదు) చేస్తున్నట్టు 1947 ఫిబ్రవరి 20న నాటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ (లేబర్ పార్టీ) వారి పార్లమెంట్లో ప్రకటించాడు. అందుకు ముహూర్తం జూన్, 1948. అక్షరాలా జూన్, 1948. ఈ ప్రక్రియని వేగంగా పూర్తి చేయడానికి ఏరి కోరి పంపిన వ్యక్తి, ఆఖరి వైస్రాయ్ లార్డ్ లూయీ ఫ్రాన్సిస్ అల్బర్ట్ విక్టర్ ‘డికీ’ మౌంట్‌బాటన్. విభజన వాదంతో భారత్ రక్తమోడుతున్న క్షణాలలో, మార్చి 22న మౌంట్‌బాటన్ భారత్‌లో అడుగుపెట్టాడు. వెంటనే నేతలతో చర్చించాడు. విభజనకి గాంధీజీ అంగీకరించలేదు. ‘నా శవం మీద విభజన జరగాలి’ అన్నాడాయన. ఆ వేసవిలో నెహ్రూను సిమ్లాకు ప్రత్యేక అతిథిగా పిలిచి విభజన ప్రణాళికను ఆయన ముందుంచాడు వైస్రాయ్. నెహ్రూ మండిపడ్డాడు. తరువాత విభజన పట్ల కాస్త మెత్తబడినా మిగిలిన విషయాలకు జాతీయ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగానే ఉన్నారు. దీనితో తన వ్యక్తిగత సిబ్బందిలోని ఏకైక భారతీయుడు వీపీ మేనన్ (రాజ్యాంగ వ్యవహారాల సలహాదారు)ను కొత్త ప్రణాళిక తయారు చేయమని మౌంట్‌బాటన్ ఆదేశించాడు. ఆ ప్రణాళికను తీసుకుని మౌంట్‌బాటన్ లండన్ వెళ్లాడు. దీనిలో కీలకాంశమూ విభజనే. దీనిని ఆమోదించడానికి అట్లీ మంత్రిమండలి తీసుకున్న సమయం ఐదు నిమిషాలే. మే 31న మౌంట్‌బాటన్ భారత్ తిరిగి వచ్చాడు. మళ్లీ చర్చలు. పటేల్, రాజాజీ వంటివారు ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. ఇది తక్కువ ప్రమాదకర ఆలోచన అన్నాడు నెహ్రూ. నిజానికి విభజన కోరి తప్పు చేశామని ముస్లింలీగ్ పశ్చాత్తాపపడుతుందని నాడు చాలామంది నమ్మినట్టు సమకాలికుల అభిప్రాయంగా నమోదైంది. 1947 జూన్2న వైస్రాయ్ హౌస్ (నేటి రాష్ట్రపతి భవన్)లో సమావేశం. అది జరగడానికి రెండు మూడు గంటల ముందు కూడా జిన్నా అంగీకరించలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలతో పాటు అస్సాం కూడా పాకిస్తాన్లో ఉండాలని ఆయన కోరిక. అది కుదరకపోవడంతో ‘చిమ్మెటలు కొట్టేసిన గుడ్డ’ ఎందుకు అన్నాడు. అయితే ముస్లింలీగ్ నేతలతో తానే మాట్లాడతానని మౌంట్‌బాటన్ బెదిరించడంతో ఎట్టకేలకు జిన్నా అంగీకరించాడు. మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ కాంగ్రెస్ నేత/ తాత్కాలిక ప్రభుత్వ (1946 సెప్టెంబర్ 2న ఏర్పడింది) ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ, హోమ్ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్‌పటేల్, కాంగ్రెస్ అధ్యక్షుడు జేబీ కృపలానీ, ముస్లింలీగ్ తరఫున మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (నెహ్రూ మంత్రిమండలిలో ఆర్థికమంత్రి), అబ్దుల్ రబ్ నిష్తార్ (మరొక మంత్రి), సిక్కుల తరఫున బలదేవ్ సింగ్ (రక్షణ మంత్రి) పిలుపు మేరకు వచ్చారు. మౌంట్‌బాటన్, వైస్రాయ్ సలహాదారు ఎరిక్ మీవిల్లె, సిబ్బంది ప్రధాన అధికారి లార్డ్ ఇస్మే ఉన్నారు. మొత్తం తొమ్మిది మంది. విభజన ప్రణాళిక లేదా మౌంట్‌బాటన్ పథకం లేదా జూన్ 3 పథకానికి వీరే ఆమోదముద్ర వేశారు. విభజనతో కూడిన అధికార బదలీ గురించి జూన్ 3న రేడియోలో మౌంట్‌బాటన్, నెహ్రూ, జిన్నా, బల్దేవ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. ఆ సాయంత్రమే బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది. జూన్ 15న వాగ్వాదాల మధ్య ఏఐసీసీ కూడా అంగీకరించింది. ఒక ప్రశ్న! విభజిస్తూనే కావచ్చు, భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ సమావేశంలో స్వతంత్ర సమర సారథి గాంధీజీ ఎక్కడ? గాంధీ ఆ సమావేశంలో ఉండడం మౌంట్ బాటన్‌కు ఇష్టంలేదు. ఆయన అంతరంగాన్ని బట్టే కాంగ్రెస్‌నేతలు వ్యవహరించారు. నిజానికి ఆ రోజు ఉదయం పదకొండు గంటల వేళ మను, అభాల సాయంతో గాంధీ వైస్రాయ్ హౌస్‌కు వెళ్లారు. ఒక లేఖ ఇచ్చి ‘మౌనంగా’ నిష్క్రమించారు. అంతే. ఆ లేఖలో ఏముంది? ‘నన్ను మన్నించండి! నేను మాట్లాడలేను. కానీ ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు మినహాయింపులు చేసుకున్నాను. అవి, అత్యవసర అంశాల మీద అత్యున్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, లేదా అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించవలసినప్పుడు తప్ప. అయితే ఇప్పుడు నేను మౌనం వీడరాదనే మీరు కోరుకుంటున్నారు. నా ఉపన్యాసాలలో మీకు వ్యతిరేకమైన మాట ఎప్పుడైనా మాట్లాడానా? లేదని మీరు ఒప్పుకుంటే ఈ ఆంక్ష అనవసరం. అయినా మీతో తప్పనిసరిగా మాట్లాడవలసిన ఒకటి రెండు విషయాలు ఉన్నాయి. అవైనా ఇవాళ కాదు. మళ్లీ మనం కలుసుకునే అవకాశం వస్తే మాట్లాడతాను.’ -డా. గోపరాజు నారాయణరావు -
ఆగమన సన్నాహాల్లో ‘1948 - అఖండ భారత్’
మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి గల కారణం ఏంటి? హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘1948 - అఖండ భారత్’. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలేఖ్య శెట్టి, రఘనందన్, ఆర్యవర్ధన్ రాజ్, ఇంతియాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, లిరికల్ వీడియో సాంగ్‌ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి... హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే -మాటలు - రీసెర్చ్: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్, సంగీతం: శశిప్రీతమ్. -
గాంధీజీ రాయలసీమ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ..
గాంధీజీ ఒకసారి మూడో తరగతి రైలుపెట్టెలో రాయలసీమ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ రైలు కిటికీలోంచి పొలాలు దున్నుకుంటున్న రైతులను చూసి, వారు మొలచుట్టూ ఒక ఖద్దరు వస్త్రాన్ని మాత్రమే ధరించి, తక్కిన శరీరమంతా నిరాచ్ఛాదనగా చెమట లోడుస్తూ ఎండలో కష్టపడుతూ కనపడగా– రత్నగర్భ నా దేశంలో ప్రజలందరికీ తినటానికి తిండి, కట్టడానికి బట్టలేక పోవటం ఎంత దురదృష్టకరం, దుఃఖకరం అని బాధపడి తాను కూడా ఈ దేశ దౌర్భాగ్య చిహ్నంగా మొలకు అంగవస్త్రం మాత్రమే ధరించాలని కృతనిశ్చయుడైనట్లూ, స్వాతంత్య్రం వచ్చినదాకా అర్ధనగ్నంగానే జీవించాలని నిర్ణయించినట్లూ భోగరాజు పట్టాభిసీతారామయ్య రచించిన సమకాలీన భారతదేశ చరిత్రలో ప్రసక్తమైంది. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు కూడా స్వీయ చరిత్ర (జీవిత నౌక)లో తాను ఇంగ్లండు మొదటిసారి వెళ్లినప్పుడు ఏదో గొప్ప హోటలులో గాంధీజీని యాదృచ్ఛికంగా చూసినప్పుడు మిస్టర్ మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ ఫుల్‌సూట్‌లో, నెక్‌టైతో సహా కనపడిన ఉదంతం ప్రస్తావించారు. ఆ సూట్ చాలా ఖరీదైనదిగా కూడా ఆంధ్రకేసరి అభిప్రాయపడ్డారు. కాబట్టి స్వరాజ్యోద్యమ తీవ్ర కాంక్ష కలిగించినవారు బక్కచిక్కిన తెలుగు రైతులు అనుకోవద్దా?! స్వరాజ్య ఫలసిద్ధి ఉద్యమంలో తెలుగువారి పాత్ర గణనీయమైనది; వ్యక్తులు, సంస్థలు, ఉద్యమాలు తెలుగునాట స్వరాజ్య సంపాదన ఉద్యమాన్ని ముమ్మరం చేశాయి. భారతదేశ స్వతంత్ర పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు వారికే కాక అఖిల భారతదేశానికి మాననీయుడు. ఒకప్పుడు అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులు న్యాపతి సుబ్బారావు, కార్యదర్శి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అప్పుడు అఖిల భారత కాంగ్రెసు కార్యస్థానం బెజవాడకు వచ్చింది. తెలుగునాట గాంధీ మైదానాలెన్నో ఉన్నవి. ‘హిందూ’ పత్రిక సంస్థాపనంలో న్యాపతి సుబ్బారావు పంతులు సహ భాగస్వామి. అయినా ‘హిందూ’ పత్రిక ఆ విషయం ప్రస్తావించదు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతికి తెలుగు వారంటే గొప్ప ఆదర్శం. తెలుగు భాషనాయన ‘సుందర తెలుంగు’ అని ప్రస్తావించాడు. ఆయన ఒక్కడే కాదు భగవాన్ రమణ మహర్షి ‘తెలుగు మధురమైన భాష, మీ పిల్లలకు నేర్పండి’ అని ఉద్బోధించాడు. ఈ విధంగా తెలుగువారు అనేక త్యాగాలు చేసి, సంస్థలు నిర్మించి, జైళ్ల పాలై స్వరాజ్యోద్యమంలో పాల్గొన్నారు. పెదనందిపాడు రైతుల సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, సైమన్ కమిషన్‌ను వెనక్కి వెళ్లిపోవల్సిందన్న గర్జన, పల్నాటి మించాలపాటి పన్నుల నిరాకరణ తెలుగువారు స్వరాజ్యోద్యమంలో నిర్వహించిన పాత్ర స్మరణీయమైనవి. వాటి గూర్చి ఇటువంటి ఉత్తేజకర సంగతులు తెలుసుకుందాం. తెలుగువారిలో గాంధీలు, తిలక్‌లు, బోసులు, నెహ్రూల పేర్లు ఉన్నంతగా భారతదేశం ఇతర ప్రాంతాలలో ఉన్నాయో, లేదో?! – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవం సందర్భంగా) -
కలాం సింప్లిసిటీకి ఎగ్జాంపుల్ ఈ ఘటన
ఎంతోమంది గాంధీ పేరు పెట్టుకున్నా, గాంధీజీకి నిజమైన వారసుడు ఏపీజే అబ్దుల్ కలాం!. ఇద్దరి మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. అందుకు ఉదాహరణలుగా నిలిచిన కొన్ని ఘటనలు ఉన్నాయి. కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు, బంధువులంతా రాష్ట్రపతి భవన్లో కొన్ని రోజుల పాటు ఉండగా వారి భోజన, వసతి ఖర్చులన్నీ కలాం లెక్కకట్టి చెల్లించారు. గాంధీ తన కుటుం బంతో సహా దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చేస్తున్నప్పుడు మిత్రులు, అభిమానులు కస్తూర్బాకు నగలను బహుమతులుగా ఇచ్చారు. ‘ఇవి నా కష్టార్జితం కాదు. కావున ఇవి సమాజానికే ఉపయోగపడాలి’ అని దక్షిణాఫ్రికా లోనే ఒక ట్రస్టును ఏర్పరచి, దానికే వాటిని గాంధీ ఇవ్వడం జరిగింది. కలాం డీఆర్డీఓ డైరెక్టరుగా ఉన్నప్పుడు ఆయనకు వీణ నేర్చుకోవాలనిపించింది. ఒక సామాన్య ఉద్యోగి భార్య (కళ్యాణి) చిన్న పిల్ల లకు ఇంట్లోనే వీణ నేర్పిస్తోందని తెలిసి, కలాం వెళ్లారు. ఈ వయసులో మీకెందుకు వీణ అంటూనే నెలకు వంద రూపాయల ఫీజు అని చెప్పి, విద్యార్థులతో కలసి కూర్చోమంది. ఒక రోజు ఇంటి దగ్గర పనిమీద ఇంటికివచ్చిన ఉద్యోగి తన ఇంట్లో కలాంను చూశాడు. అప్పుడు విషయం తెలిసిన కళ్యాణి మీరు ముందే మాకు ఈ విషయం చెప్పి ఉంటే మేమే మీ ఇంటికి వచ్చి రోజూ చెప్పేవాళ్ళం, ఫీజు కూడా తీసుకునే వాళ్ళం కాదు అని బాధపడుతుంటే– ‘అందుకే నేను మీ ఆయనకు తెలియ కుండా వచ్చి నేర్చు కుంటున్నాను. విద్యార్థి ఎంత గొప్పవాడైనా టీచర్ దగ్గర శిష్యుడిగానే ఉండాలన్నారు కలాం. సంస్కృతం కష్టం అని గాంధీ అందరు పిల్లల్లాగే తలచి పెర్షియన్ భాష క్లాసులో కూర్చుంటే, కృష్ణశంకర పాండ్యా అనే సంస్కృత ఉపాధ్యాయుడు ‘సంస్కృతం నేర్చుకోవడంలో ఏదైనా కష్టముంటే నా దగ్గరకు రా’ అన్నారు. ఆ రోజు పాండ్యా వద్ద సంస్కృతం నేర్చుకొని ఉండకపోతే భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవగలిగేవాడిని కాదన్నారు గాంధీ. కలాంను విశాఖపట్నం జిల్లా చోడవరం తీసుకొచ్చి సుమారుగా 10 వేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ఆయన ప్రసంగం వినిపించాలని ‘కల’గన్నాను. కానీ ఆయన ఆరోగ్యం క్షీణిం చడంతో అది ‘కల’గానే మిగిలిపోయింది. ఎప్పుడూ ‘కలలు’ వాటి సాకారం గురించి మాట్లాడే ఆయన నా ‘కల’ మాత్రం సాకారం కాకుండానే భగవంతుడిలో లీనమైపోయారు. నేడు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా.. ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు, మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం ఈ–మెయిల్: mnaidumurru@gmail.com -
అసాంఘిక చర్యలకు అడ్డాగా మారిన బాపూఘాట్..
సాక్షి, హైదరాబాద్: అసాంఘిక కార్యకలాపాలకు లంగర్‌హౌస్‌లోని బాపూఫట్ అడ్డాగా వరింది. జాతిపిత మహాత్మాగాంధీని ప్రపంచ దేశ ప్రజలంతా గౌరవిస్త ఆయన సమాధిని పవిత్ర మందిరంగా భావిస్తారు. అయితే దక్షిణాదిలో ఉన్న బాపూజీ ఏకైక సమాధి లంగర్‌హౌస్ త్రివేణి సంగం వద్ద ఉన్నది. ఇంతటి పవిత్రమైన ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడంతో వీరి ఆగడాలకు హద్దులు లేకుండా పోయాయి. పేకాట, మద్యం, మాంసం.. మామూలుగానే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం. అయితే పోకిరీలు నిత్యం బాపూ సమాధి ఎదురుగా కూర్చొని మద్యం సేవిస్తున్నారు. ఆ ఖాళీ మద్యం బాటిళ్లు బాపూ సమాధి ప్రాంగణంలోకి విసురుతున్న సంఘటనలు ఉన్నాయి. ఓ వైపు దేవాలయం, మరో వైపు బాపూ సమాధి ఉన్నాయని ఇక్కడ మద్యం సేవించకూడదని చెప్పిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. సమాధి ప్రాంతాన్ని తమ అదుపులో పెట్టుకున్న తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు కూడా పోకిరీల బెడదను అరికట్టడంలో విఫలమవుతున్నారు. ఇక్కడే మాంసాహారం తింటూ పేకాట ఆడుతున్నారు. తాజాగా శనివారం మద్యం సేవిస్త వంసం తింటున్న వారిని స్థానికులు, భక్తులు నిలదీయగా వారిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రివేళల్లో.. పోకిరీలు ఇంతటితో ఆగకుండా రాత్రి వేళ్లలో మరింతగా ర్చెపోతున్నారు. ఏటవాలు ఆకారంలో బాపూ సమాధి నిర్మాణం ఉండటంతో దాని కింద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రయితే చాలు బాపూ సమాధి కింద యథేచ్ఛఫగా వ్యభిచారకార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆలయం, బాపూ సవధి ఉన్న ఇంతటి పవిత్ర ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అరికట్టాలని స్థానికులు, ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. బాపూఫట్ నిర్వహణపై ప్రైవేట్ వ్యక్యులకు, ప్రభుత్వానికి హక్కు ఉండటంతో ఎవర పట్టించుకోవడంలేదని దీంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందిం బాపూ సమాధి, రామాలయాల పవిత్రతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే.... బాపూ సమాధి ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణం. బాపూఫట్ ప్రాంగణానికి కొద్ది దరంలోనే త్రివేణి సంగం ఒడ్డున మహాత్ముని సమాధి నిర్మించారు. దీని నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో వారు నిత్యం బాపూఫట్‌కు తాళం వేసి, సవధి ఉన్న ప్రాంగణాన్ని గాలికి వదిలేస్తున్నారు. వీరితో పాటు పర్యాటక శాఖ అధికారులు కూడా తమకు సంబంధం లేదని దాటవేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి బాపూ సమాధి ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: అది బస్తీ దవాఖానా.. కానీ అక్కడికి ఐఏఎస్‌లూ వస్తారు -
గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలుశిక్ష
జోహన్నస్బర్గ్: దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ మునిమనవరాలికి స్థానిక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మహాత్మాగాంధీ ముని మనవరాలైన ఆశిశ్ లత రామ్గోబిన్ 62 లక్షల ర్యాండ్ (దాదాపు 3.32 కోట్ల రూపాయల)ల మేరకు స్థానిక వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజ్‌ను మోసం చేయడంతో పాటు, ఫోర్జరీకి పాల్పడినట్లు రుజువు కావడంతో డర్బన్‌లోని ఒక కోర్టు సోమవారం ఆమెకు ఈ శిక్ష విధించింది. భారత్ నుంచి ఒక కల్పిత కన్సైన్మెంట్ను సృష్టించి, దానికి ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పి ఎస్ఆర్ మహారాజ్ నుంచి ఆమె మోసపూరితంగా 62 లక్షల ర్యాండ్లు తీసుకున్నారన్న ప్రధాన ఆరోపణపై ఈ జైలుశిక్ష విధించారు. సంబంధిత లావాదేవీలో లభించిన లాభంలో వాటా ఇస్తానని కూడా ఆమె హామీ ఇచ్చారని మహారాజ్ ఆరోపించారు. దక్షిణాఫ్రికాలో ప్రముఖ హక్కుల కార్యకర్త అయిన ఈలా గాంధీకి లత రామ్గోబిన్ కూతురు. మూడు కంటెయినర్ల లినెన్ వస్త్రం భారత్ నుంచి వస్తోందని పెట్టుబడిదారులను నమ్మిం చేందుకు ఆమె ఇన్వాయిస్లను, ఇతర డాక్యుమెంట్లను సృష్టించారని నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ కోర్టుకు తెలిపింది. ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం.. 2015 ఆగస్ట్‌లో న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ డైరెక్టర్ ఎస్ఆర్ మహారాజ్‌ను లత రామ్గోబిన్ కలిశారు. ఆ సంస్థ వస్త్ర వ్యాపారంలోనూ ఉంది. నెట్‌కేర్ అనే హాస్పిటల్ గ్రూప్ కోసం భారత్ నుంచి మూడు కంటెయినర్లలో లినెన్ వస్త్రం దిగుమతి చేసుకున్నానని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటి ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ పన్ను చెల్లించలేకపోతున్నానని, 62 లక్షల ర్యాండ్లు సర్దుబాటు చేస్తే నౌకాశ్రయం నుంచి ఆ కంటెయినర్లు బయటకు వస్తాయని ఆమె ఆయనకు వివరించారు. ఆ తరువాత, ఆ డబ్బు చెల్లించడంతో పాటు లాభంలో వాటా ఇస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. ఆయనను నమ్మించడం కోసం నకిలీ ఇన్వాయిస్లు, ఇతర డాక్యుమెంట్లను చూపించారు. లత రామ్గోబిన్ కుటుంబానికి ఉన్న విశ్వసనీయత దృష్ట్యా ఆర్ఎస్ మహారాజ్ ఆ డబ్బు చెల్లించి, లిఖితపూర్వక ఒప్పందం చేసుకున్నారు. అనంతరం, జరిగిన మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీ కుటుంబానికి చెందిన పలువురు దక్షిణాఫ్రికాలో సామాజిక కార్యకర్తలుగా, పౌరహక్కుల కోసం పోరాడుతున్నారు. మానవ హక్కుల కార్యకర్తగా లత రామ్గోబిన్ తల్లి ఈలా గాంధీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ఆమెను భారత్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాలు అవార్డులతో సత్కరించాయి. -
గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ళ జైలుశిక్ష
డర్బన్: జాతిపిత మహాత్మగాంధీ మునిమనుమరాలు 56 ఏళ్ల ఆశిష్ లతా రాంగోబిన్ ఫోర్జరీ కేసులో అరెస్టయ్యారు. విచారణ జరిపిన డర్బన్ కోర్టు సోమవారం లతా రాంగోబిన్‌ను దోషిగా పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమె 2015లో ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి ఆర్6.2 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ గా తీసుకుని ఇండియా నుంచి వచ్చే అనధీకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చారు. దానికి బదులుగా లాభాల్లో వాటా ఇస్తానని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అయితే లతా రాంగోబిన్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఇన్వాయిస్లు ఫ్రాడ్ ఉందని.. సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని తేలింది. అంతేగాక ప్రతీ డాక్యుమెంట్లోనూ భారత్ నుంచి మూడు కంటైనర్ల లినెన్ వస్తుందని చెప్పి ఆమె మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2015లోనే లతా గోబిన్‌కు వ్యతిరేకంగా ట్రయల్ ప్రారంభమైంది. కంపెనీని మోసం చేశారన్న అభియోగాలతో నేషనల్ ప్రోసిక్యూటింగ్ అథారిటీ ఆశిష్ లతాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతూ వస్తుంది. తాజాగా మరోసారి కోర్టులో విచారణకు రాగా.. ఈ కేసులో లతా రాంగోబిన్ దోషిగా తేలడంతో సోమవారం డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. చదవండి: గూగుల్‌కు భారీ జరిమానా -
గాంధీజీ హైదరాబాద్‌కు తొలిసారి ఎప్పుడొచ్చారో తెలుసా?
హైదరాబాద్‌లో సుల్తాన్ బజార్‌లోని ఫ్రేం థియేటర్లో 1929 ఏప్రిల్ 7న మహాత్ముని గౌరవార్థం మహిళా సభను ఏర్పాటు చేశారు. మహాత్ముని తొలి హైదరాబాద్ పర్యటన 1929 ఏప్రిల్‌లో జరిగింది. కృష్ణస్వామి ముదిరాజ్ తన ఆంధ్ర వాలంటీర్ దళాన్ని వాడి స్టేషన్‌కు తీసుకువెళ్ళి మహాత్మునికి స్వాగతం పలికి నాంపల్లి స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆ తరువాత ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. స్థానిక నాయకులైన వామన్ నాయక్, మాడపాటి హనుమంతరావు, మందుమల నరసింగారావు, ఆర్.ఎస్.ఎస్. నాయక్, రాజ్ బన్సీలాల్, ముకుంద్ దాస్ మొదలైన వారు వివేకవర్థినీ మైదానంలో మహాత్మునికి స్వాగతం పలికి తీసుకుపోయారు. వామన్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో మహా త్ముని ప్రసంగం క్లుప్తంగా జరిగింది. ‘‘రాట్నం కామధేనువు. మన దేశానికది సకల వరప్రదాయిని. ఖద్దరు ఉత్పత్తికి హైదరాబాద్ రాష్ట్రంలో మంచి వాతావరణం ఉందని నాకు తెలిసింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సహాయ సహకారాలందించే స్థితిలో మీరున్నారు. ఇక్కడ మంచి నాణ్యత గల ఖాదీ ఉత్పత్తి అవుతుందని సరోజినీ నాయుడు నాకు చెప్పారు. నా మెడలో వేసిన నీలదండ హరిజనులు వడికినదని తెలుసుకొని నేనెంతో సంతోషపడ్డాను. హిందూదేశం కన్నా దరిద్రదేశం మరొకటి లేదు. ఎందుకంటే మన దేశంలో రోజుకి ఒక్కపూటైనా అన్నం దొరకని వారి సంఖ్య మూడు కోట్ల మందికి పైగానే ఉంటుంది. అటువంటి వారికి రాట్నం కామధేనువు వంటిది. రాట్నం వలన ఒక లక్ష మంది స్త్రీలకు జీవనోపాధి కలుగుతున్నది. వారు తాము వడికిన నూలు అమ్మకం కోసం 5.6 మైళ్ళు నడిచి వెలుతున్నారు. రాట్నంలో వడికి, ఖద్దరు ఉత్పత్తి చేసి హిందుస్థాన్ అంతటికీ మీరు సప్లై చేయగలుగుతారు. మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఒక ఏడాదిలోనే కావలసినంత ఖాదీ తయారవుతుంది. మీకు సన్నని బట్టలు విదేశీ బట్టల మీద మోజు ఉన్న సంగతి నాకు తెలుసు కానీ సోదర భారతీయులను దృష్టిలో పెట్టుకుని ముతక బట్టలు ధరిస్తే వారికి సహాయపడిన వారవుతారు’’ అని గాంధీ అన్నారు. ఆ ఉపన్యాసం పూర్తి కాగానే రాజ్ ధన్‌రాజ్ గిర్జీ 2 వేల రూపాయలు. ముకుందదాస్ నూరు రూపాయలు మహాత్మునికి సమర్పించుకున్నారు. వామన్ నాయక్ సమర్పించుకున్న సన్మాన పత్రానికి మహాత్ముడు స్పందిస్తూ ‘‘ఉపన్యాసానంతరం 12వేల రూపాయల విరాళాలు వసూలయ్యాయి. మీరు ఈ దరిద్ర నారాయణుడిని డబ్బిచ్చి సత్కరించినందుకు కృతజ్ఞతలు’’ అని చెప్పారు. (1929 ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్‌లో మహాత్మాగాంధీ తొలి పర్యటన సందర్భంగా) – కొలనుపాక కుమారస్వామి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, వరంగల్ మొబైల్ : 99637 20669 -
అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం
సామాన్యులను విశేషంగా ప్రభావితం చేసే ఉప్పు కోసం సామాన్యులందరినీ కలుస్తూ దానికి నడకను సాధనంగా చేసుకున్న మహాఉద్యమ పథికుడు మహాత్మాగాంధీ. 1930 ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల ముప్పై నిమిషాలకు 61 ఏళ్ల వృద్ధ నేత గాంధీ తన సహచరులతో కలిసి నాటి బ్రిటిష్ చట్టాన్ని ధిక్కరిస్తూ, గుజరాత్ తీరంలోని దండి వద్ద చేసిన ఉప్పు తయారీ బ్రిటిష్ పాలకులను వణికించింది. ఈ ఉద్యమమే తర్వాత భారత స్వాతంత్య్రానికి నాంది పలికింది. అటు జాతీయ నాయకులు, ఇటు బ్రిటిష్ పాలకులు పరాచికాలు ఆడినప్పటికీ ఈ రెండు వర్గాల అంచనాలను వమ్ము చేస్తూ దండి సత్యాగ్రహం ఘన విజయం సాధించడమే కాకుండా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది. అది 1930 ఏప్రిల్ 6. ఉదయం 6 గంటల 30 నిమిషాలు. 61 సంవత్సరాల వృద్ధుడు తన సహచరులతో వచ్చి ఉప్పును తయారు చేశారు. ఆ నాయకుడు గాంధీజీ. అలా ఉప్పు సత్యాగ్రహానికి రంగస్థలం అయిన ప్రాంతం గుజరాత్ తీరంలోని దండి. వందేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన అప్పటి బ్రిటీషు పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఉద్య మంతోనే భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. వ్యూహంలో చాతుర్యం: గాంధీజీ వేషభాషలు చాలా మామూలుగా కనబడతాయి. ఇంగ్లండు చదువు గానీ, దక్షిణాఫ్రికా అనుభవం గానీ ఆయనకు ఉన్నట్టు మాటలు, దుస్తుల ద్వారా అంచనా వేయలేం. ఈ దండి సత్యాగ్రహం భావనలో రెండు అంశాలు మనం గమనించవచ్చు. ఒకటి ఉప్పు, రెండవది నడక. గాలి, నీరు తర్వాత ముఖ్యమైనది ఉప్పు అని గాంధీజీ దండి సత్యాగ్రహం గురించి వివరిస్తూ పేర్కొన్నారు. అప్పటి బ్రిటీష్ వారు భారతీయుల నుంచి వసూలు చేసే పన్నుల్లో ఉప్పు పన్ను 8.2 శాతం ఆక్రమించేది. నిజానికి సుదీర్ఘమైన సముద్రతీరంగల ఈ దేశంలో ఉప్పు వద్దన్నా లభిస్తుంది. మనకు సూర్యరశ్మి కూడా కొరత కాదు. అయితే బ్రిటీష్ వాళ్ళు తమకనుకూలంగా ఉప్పు తయారీని నిషేధిస్తూ చట్టాలు చేశారు. ఈ ఉప్పు పన్ను ధనికుల కన్నా పేదవారినే ఎక్కువ బాధించేది. దేశంలోని పేదలను కదిలించే ఉప్పును గాంధీ తన ఉద్యమానికి ఒక ప్రతీకగా స్వీకరించడం అమోఘమైన పాచిక. గాంధీ చంపారన్ ఉద్యమ సమయంలో ఏనుగునెక్కి కూడా ప్రయాణం చేశారు. దండి సత్యాగ్రహానికి బండ్లు, కార్లు కాకుండా కేవలం నడిచే కార్యక్రమంగా ఆయన మలిచాడు. సబర్మతీ ఆశ్రమానికి దగ్గరలో వుండే ఏదో ఒక తీర ప్రాంతాన్ని కాకుండా 200 మైళ్ళ దూరంలో వుండే నౌసరి (దండికి అప్పటి పేరు) ని ఎంచుకోవడం కూడా గాంధీ ప్రతిభావంతమైన ప్రణాళిక. 1930 మార్చి 12వ తేదీన 78 మంది అనుచరులతో 24 రోజుల పాటు నడుస్తూ మధ్యమధ్యన ప్రతి రోజూ ఒక ఊరిలో ఆగుతూ సాగడం అప్పటికి చాలా కొత్త వింతగా కనబడింది. మిగతా జాతీయ నాయకులు ఇదేమి వ్యూహమని పరాచికాలు ఆడగా బ్రిటీష్ పాలకులు 6 పదులు దాటిన ముదుసలి ఏమి నడుస్తాడులే అని తమలో తాము నవ్వుకున్నారు. ఈ రెండు వర్గాల అంచనాలను వమ్ము చేస్తూ దండి సత్యాగ్రహం విజయవంతం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది. యువకులకు పెద్ద పీట: గాంధీతోపాటు 200 మైళ్ళు నడచిన 78 మంది వివరాలు పరిశీలిస్తే అందులో 40–50 ఏళ్ల వయసున్నవాళ్ళు 6గురు మాత్రమే వుండగా... 60 దాటినవాడు ఒక్క గాంధీజీయే. ఈ బృందంలో ఎక్కువమంది 20–25 మధ్య వయసున్న యువకులే కావడం విశేషం. చాలా జాగ్రత్తగా గాంధీజీ ఈ 78 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరిలో ఒకే ఒక తెలుగు వ్యక్తి 25 సంవత్సరాల ఎర్నేని సుబ్రహ్మణ్యం. వీరే తరువాతి దశలో పొట్టి శ్రీరాములుకు మిత్రుడిగా, గురువుగా కొనసాగారు. భారత స్వాతంత్య్రోద్యమంలో క్రియాశీలక సంఘటనలు సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనం వంటివి ఉవ్వెత్తున మొదలైనా చౌరీచౌరాలో జరిగిన అల్లర్ల కారణంగా గాంధీ తన వ్యూహాన్ని మార్చేశారు. తరువాత మనకు కనబడే ప్రధాన సంఘటన దండి సత్యాగ్రహమే. సంఘటనలకు స్పందనగా ఎలా వ్యక్తులు తమను తాము మలచుకోవాలో సత్యాగ్రహ శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. అటువంటి వినూత్న శిక్షణకు రాజమండ్రి దగ్గర వున్న సత్యాగ్రహ ఆశ్రమం కేంద్రం కావడం తెలుగువారందరికీ గర్వకారణం. దండి సత్యాగ్రహం ప్రభావం: 1930 ఏప్రిల్ 6న గాంధీ తన సహచరులతో కలసి ఉప్పును తయారు చేసి, బ్రిటీష్ శాసనాన్ని ఉల్లంఘించారు. అలా గాంధీ తయారు చేసిన ఉప్పు గడ్డను తరువాత వేలం వేయడం ఒక చారిత్రక విశేషం. గాంధీజీ ఉప్పు తయారు చేసిన సమయంలో తెలుగింటి కోడలైన సరోజినీ నాయుడు చట్టాన్ని గాంధీ అతిక్రమించారని బిగ్గరగా ప్రకటించడం ఇంకో విశేషం. కమలాదేవి ఛటోపాధ్యాయ స్వాతంత్య్రం ఉప్పును కొంటారా అని బొంబాయిలో మెజిస్ట్రేట్‌ను అడగడం మరో ఆశ్చర్యకరమైన అంశం. ఈ రీతిలో దేశవ్యాప్తంగా ఉప్పు స్వాతంత్య్ర ఉద్యమానికి నిప్పు రవ్వగా పనిచేసింది. 1930 ఫిబ్రవరి 27న యంగ్ ఇండియా పత్రికలో నేను అరెస్టయితే అనే శీర్షికతో గాంధీ ఒక సంపాదకీయాన్ని రాస్తూ ఉప్పు పన్ను దుష్ప్రభావాన్ని వివరించాడు. మార్చి రెండవ తేదీ గాంధీజీ వైస్రాయ్ కి సుదీర్ఘమైన ఉత్తరం రాసి ఈ పన్ను ద్వారా పేదలను ఏ స్థాయిలో పీడిస్తున్నారో తెలియజేసారు. ఒక వేళ మీరు సానుకూలంగా స్పందించక పోతే 11వ రోజున సబర్మతీ ఆశ్రమం నుంచి బయలుదేరి ఉప్పు పన్ను చట్టాన్ని అతిక్రమిస్తానని హెచ్చరించారు. ఏప్రిల్ 6వ తేదీన చూసీచూడనట్టున్న బ్రిటీష్ ప్రభుత్వం అప్రమత్తమై మే 5వ తేదీన గాంధీజీని అరెస్టు చేసింది. ప్రపంచ వ్యాప్త స్ఫూర్తి : శాంతియుతంగా నిరసన తెలిపే విధానం (సత్యాగ్రహం) ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. గాంధీ దండి సత్యాగ్రహం నడకను చిత్రిం చిన దృశ్యాలు యూరప్‌ను, అమెరికాను విపరీతంగా ఆకర్షించాయి. న్యూయార్క్ టైమ్స్ ప్రతి రోజూ వార్తలు ప్రచురించటమే కాకుండా ఏప్రిల్ 6, 7 తేదీల్లో తొలి పేజీ కథనాలను ప్రచురించింది. 1930 సంవత్సరం మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా గాంధీజీని టైం మ్యాగజైన్ ఎంపిక చేయడం విశేషం. ఉప్పు పన్నుకు సంబంధించిన సామాజిక ఆర్థికపరమైన పార్శా్వలను వివరించే రీతిలో రామమనోహర్ లోహియా ఉద్యమం జరిగిన మూడేళ్ళలో పీహెచ్.డి పట్టాను గడిం చడం ఇంకో విశేషం. దండి ఉద్యమం జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో నల్లజాతి వారికి వెలుగు చుక్కానిగా మారింది. ఆ ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. తొలుత తాను గాంధీజీని సీరియస్‌గా పట్టించుకోలేదని అయితే ఉప్పు సత్యాగ్రహం, ఆయన నిరాహార దీక్షలు, సత్యాగ్రహ భావన ఆకర్షించాయని తరువాత గాంధీ సిద్ధాంతాలను లోతుగా అన్వేషించడం మొదలైందని, చివరకు గాంధీపట్ల ఆయన ఉద్యమంపట్ల ఆరాధనగా మారిందని అదే తన ఉద్యమాన్ని నడిపించిందని మార్టిన్ విశ్లేషించారు. దండి సత్యాగ్రహానికి 75 ఏళ్ళ పండుగ : 1980లో దండియాత్ర స్వర్ణోత్సవం, 2005లో 75 ఏళ్ళ పండుగ జరి గాయి. ఈ రెండు సందర్భాలలో భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్ళలను విడుదల చేసింది. మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ 2005లో చేసిన రిఎనాక్టిమెంట్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా వార్తలకెక్కింది. 9 దేశాల నుంచి 900 మందితో ప్రారంభమైన తుషార్ గాంధీ బృందం అప్పటి దండి సత్యాగ్రహం దారిలోనే కదిలితే రోజు రోజుకూ కొత్తవారు వచ్చి చేరడంతో ఆ సంఖ్య కొన్ని వేలుగా పెరిగింది. దీనిని న్యాయం, స్వాతంత్య్రం కోసం చేసిన అంతర్జాతీయ నడక అని నామకరణం చేశారు. సబర్మతీ ఆశ్రమం నుంచి దండి దాకా సాగే ఈ దారిని ఇపుడు దండి దారి (దండి పాత్) అని నామకరణం చేశారు. 2019 జనవరి 30వ తేదీన దండిలో నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్ మ్యూజియంను భారత ప్రభుత్వం ప్రారంభించింది.సామాన్యులను విశేషంగా ప్రభావితం చేసే విషయం కోసం సామాన్యులందరినీ కలుస్తూ దానికి నడకను సాధనంగా చేసుకున్న మహాఉద్యమ పథికుడు మహాత్మాగాంధీ. ఇప్పటికీ ఈ విశేషాలు తలుచుకుంటే, తవ్వి పోసుకుంటే ఆశ్చర్యకరం... స్ఫూర్తిదాయకం! వ్యాసకర్త:డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్ : 94407 32392 -
జాతిపితపై కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంటుంది. సినీ, రాజకీయ ప్రముఖులపై ఆసభ్య వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. రైతుల నిరసనను వ్యతిరేకిస్తూ కంగనా చేసిన ట్వీట్లు వివాస్పదం కావడంతో ఆమెపై కేసు కూడా నమోదైంది. దీనిపై ఆమె కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా కంగనా జాతిపితను టార్గెట్ చేసింది. మహాత్మాగాంధీని విమర్శిస్తూ ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. గాంధీ తన భార్య, బిడ్డలను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయంటూ శుక్రవారం ట్వీట్ చేసింది. ‘జాతిపిత తన సొంత బిడ్డలను వేధించి చెడ్డ తండ్రిగా పేరుతెచ్చుకున్నారు. తన భార్య అతిధుల మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టివేసినట్లు పలు ప్రస్తావనలు ఉన్నాయి. అయినప్పటికి గాంధీజీ జాతిపిత అయ్యారు. ఆయన మంచి భర్త, తండ్రి కాకపోయిన ఒక గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది’ అంటూ కంగనా ట్విటర్లో రాసుకొచ్చింది. ఇది వరకు కంగనా సాధారణ వ్యక్తులను సినీ, రాజకీయ ప్రముఖలను మాత్రమే టార్గెట్ చేయడంతో అంతా ఆమె తీరు ఇంతెనంటూ ఉరుకునేవారు. కానీ ఈసారి గాంధీపై ఆమె విమర్శ వ్యాఖ్యలు చేయడంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు కంగనాపై మండిపడుతున్నారు. కంగనా మితిమీరి ప్రవర్తిస్తోందని, ఇలాగే వదిలేస్తే ఆమె మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Mahatma Gandhi was accused of being a bad parent by his own children, there are various mentions of him pushing his wife out of the house for refusing to manually clean guets toilets, he was a great leader may not a great husband but the world is forgiving when it comes to a man — Kangana Ranaut (@KanganaTeam) March 12, 2021 చదవండి: ‘అలా అయితే కంగనా కూడా సిగ్గుపడాలి’ మంచు విష్ణుకు విశాఖ ఉక్కు సెగ ‘సీఎం సాబ్... నాకు పెళ్లి కూతుర్ని చూడండి’ -
పెళ్లి విందులో చిందులు.. నేలకొరిగిన ‘మహాత్ముడు’
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం గాజులగూడెం గ్రామంలో పెళ్లి విందులో చిందులు వేస్తున్న కొంతమంది యువకులు ఆదివారం రాత్రి మహాత్మా గాంధీ విగ్రహానికి తగలడంతో అది కింద పడిపోయింది. అయినా సంఘటనకు కారకులైన వారిలో పశ్చాత్తాపం కనిపించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. కాగా మాజీ సర్పంచ్ బాలాగౌడ్ మాట్లాడుతూ విగ్రహాన్ని పునరుద్దరిస్తామని తెలిపారు. పెళ్లి కావడం లేదని.. వెల్దుర్తి(తూప్రాన్): వివాహం కావడం లేదని ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వెల్దుర్తి పంచాయతీ పరిధి ఎల్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కానికె రమేశ్ కుమారుడు గణేష్(24) పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా ఆదివారం రాత్రి భోజనం ముగించుకొని కుటుంబసభ్యులు నిద్రకు ఉపక్రమించారు. అయితే తెల్లవారు జామున చూసేసరికి గణేష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించాడు. వివాహం కావడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్ వెల్లడించారు. చదవండి: బూడిదతో గాంధీ బొమ్మ.. లిమ్కా బుక్‌లో చోటు -
అమెరికాలో గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ: అమెరికాకు బహుమానంగా ఇచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనను ఖండించింది. ఇది హేయమైన చర్య అని తెలిపింది. బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. అమెరికాలో డేవిస్ పట్టణంలో జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. అంతర్జాతీయంగా శాంతి, సమానత్వానికి ప్రతీకగా ఉన్న గాంధీ విగ్రహం కూల్చివేత హేయమైనదని భారత్ పేర్కొంది. దీనిపై అమెరికా ప్రభుత్వం కూడా స్పందించింది. భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నామని వెంటనే చర్యలు తీసుకుంటామని డేవిస్ మేయర్ ప్రకటించారు. కాగా, 2016లో ఆరడుగుల ఎత్తు, 4 అంగుళాల వెడల్పు, 294 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలోని సెంట్రల్ పార్క్‌లో దీనిని ప్రతిష్టించారు. ఇక నేడు మహాత్మాగాంధీ వర్ధంతి అని తెలిసిందే. On 28 Jan'21, Mahatma Gandhi statue at Central Park in City of Davis, California was vandalised by unknown persons. Statue was a gift by Govt of India in '16. The Govt strongly condemns this malicious & despicable act against a universally respected icon of peace & justice: MEA pic.twitter.com/vEy0I33gpV — ANI (@ANI) January 30, 2021 -
బూడిదతో గాంధీ బొమ్మ.. లిమ్కా బుక్‌లో చోటు
ఆదోని: బూడిదతో బాపూ బొమ్మను అత్యంత సహజంగా చిత్రీకరించిన ఆదోని యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. అతని ప్రతిభను అత్యుత్తమంగా గుర్తించిన ముంబై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ 2021 రికార్డుల జాబితాలో చోటు కల్పించింది. కరోనా నిబంధనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్లో పంపి సత్కరించింది. ఆదోని పట్టణం, నారాయణ గుంతకు చెందిన లక్ష్మీ, పద్మనాభం దంపతుల రెండో సంతానం శ్రీకాంత్ ఎంబీఏ పూర్తి చేసి చెన్నైలో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నారు. కళాఖండాలను సృష్టించడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. తాజాగా ఈ నెల 4న కాగితాన్ని కాల్చగా వచ్చిన బూడిదలో తన చేతి మునివేళ్లను అద్ది తెల్ల కాగితంపై బాపూ (మహాత్మా గాంధీ) బొమ్మను అపురూపంగా తీర్చిదిద్దారు. కాగితం కాల్చి బూడిద చేయడం నుంచి బొమ్మ పూర్తిగా చిత్రీకరించే వరకు వీడియో రికార్డు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు పంపారు. రికార్డును పరిశీలించిన ఆ సంస్థ ప్యానల్ కమిటీ 2021– 22లో అత్యుత్తమ ఆర్ట్‌గా గుర్తించింది. అతన్ని గౌరవిస్తూ కరోనా నిబంధనల దృష్ట్యా గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్లో పంపింది. బుధవారం రాత్రి కొరియర్ అందుకున్న శ్రీవైష్ణవ శ్రీకాంత్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాను సరికొత్త ప్రయోగంతో చిత్రీకరించిన బాపు బొమ్మ జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిపెట్టడం ఆనందం కలిగించిందన్నాడు. -
గాంధీ స్ఫూర్తికి సాగు చట్టాలు విరుద్ధం
కారుచీకటిలో కాంతిరేఖలా దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా రైతు– వ్యవసాయ కార్మికులు సమష్టిగా ఒక్క శక్తిగా కదలబారడం 20వ శతాబ్దం తొలి జాతీయోద్యమ రోజుల తర్వాత బహుశా ఇదే మొదటి ఉదాహరణ! పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రైతాంగం, వ్యవసాయ కార్మికుల సారథ్యంలో– ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతు ఉద్యమం అనేక రాష్ట్రాల రైతాంగ, కార్మిక ప్రజాబాహుళ్యాన్ని కదిలించి, కేంద్రం రూపొందించిన మూడు రైతాంగ వ్యతిరేక సాగు చట్టాలను ప్రతిఘటించేట్లు చేసింది! పచ్చి నిజమేమంటే ఏ బిహార్‡ నీలిమందు రైతులను బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వ దమనకాండ నుంచి, దాస్యం నుంచి గాంధీ బయటపడేశాడో.. ఆ మహాత్ముడి శాంతిని భగ్నం చేసే చట్టాలను తిరిగి ఈనాటి కేంద్ర పాలకులు తలెత్తుకోవడం! రైతాంగ, వ్యవసాయ కార్మికుల ప్రయోజ నాలను రక్షించడంలో కేంద్ర, రాష్ట్రాల పాల కులు మూడు కొత్త వ్యవసాయ బిల్లులను రుద్దడంలో భారత రాజ్యాంగ చట్ట నిబంధనలను ఉల్లంఘించారు. ఈ క్రమంలో పాలకులు రాజ్యాంగం శాసిస్తున్న కేంద్ర, రాష్ట్రాలు విధిగా పాటించాల్సిన ఉమ్మడి జాబితాను ఉల్లంఘించారు. తద్వారా రాజ్యాంగ చట్టం ఫెడరల్ (సమాఖ్య) స్వభావంపైనే దాడికి తలబడ్డారు. ఇందువల్ల ప్రత్యక్షంగా నష్టపోయే రైతులతో ఎలాంటి చర్చలు జరపకుండానే బిల్లులు తెచ్చారు. చివరికి ఈ బిల్లులపై పార్లమెంటులో వ్యతిరేకత అభ్యంతరాలు వచ్చినా వాటిని వినిపించుకోలేదు. కనీసం బిల్లులపై చర్చించేందుకు కూడా వ్యవధిని ఇవ్వకుండా నల్లేరు మీద బండిని నడిపించినట్టు తోసేశారు. అలాగే, రాజ్యసభలో ఈ బిల్లులపై ఓటింగ్‌ను కోరితే దాన్నీ నిరాకరిం చారు పాలకులు. ఈ గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందినట్లు రాజ్యసభ చైర్మన్ చెప్పారు. కోవిడ్ ముమ్మరంగా ఉన్న సమయంలో బిల్లులపై నిరసన తెల్పడానికి ప్రజలు తెగబడి వీధుల్లోకి వచ్చి నిరసన తెలపలేరన్న భరోసాతో ఆ బిల్లుల్ని ఆమోదిం పజేసుకున్నారు. – కేంద్ర, రాష్ట్రాల సర్వీసులలో పనిచేసిన 78 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంయుక్త ప్రకటన రైతాంగ, వ్యవసాయ కార్మిక సంఘాలు, సంస్థలూ ఏకవాక్యతతో పలు రాష్ట్రాల నుంచి బయల్దేరి ఢిల్లీ సరిహద్దులలో, ఢిల్లీని ముట్టడించే కూతవేటు దూరంలోనే భారీఎత్తున సమీకరణ జరిగి గత 18 రోజు లకు పైగా భీకరమైన స్థాయిలో ఆందోళన కొనసాగిస్తున్న సమయం ఇది. అసలు భూమికోసం, భుక్తికోసం దేశంలో నేడు జరుగుతున్న పోరు.. దేశ పాలకులు ఎంచుకున్న ‘అభివృద్ధి నమూనా’నే తీవ్ర చర్చ లోకి లాగిందని మరచి పోరాదు! ఎందుకంటే మనదేశంలో భూమిలేని వ్యవసాయ కార్మికులు, సాగుచేసుకోవడానికి ఇంత కొండ్ర కూడా లేని నిరుపేద రైతుల సంఖ్యే–భూములున్న రైతుల సంఖ్య కన్నా ఎక్కువని గుర్తుంచుకోవాలి. వ్యవసాయంపై రూపొందించే విధానంలోగాని, వ్యవసాయానికి సంబంధించిన విధాన చర్యలలోగానీ ప్రధానంగా భూమిలేని వ్యవసాయ కార్మికులు, భూమిలేని రైతుల ప్రస్తావన మృగ్యమవుతూ వస్తోంది. దేశంలోకి కాంగ్రెస్, బీజేపీ పాలకులు ప్రవేశ పెట్టిన.. దేశ ప్రయోజనాలకు, రైతాంగ, వ్యవసాయ కార్మిక మౌలిక ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రపంచబ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్క రణలలో అసలు ‘కల్మషం’ అంతా కేంద్రీకరించి ఉంది. ఈ దుస్థితిలో, కారుచీకటిలో కాంతిరేఖలా దేశవ్యాప్తంగా మొట్ట మొదటిసారిగా రైతు– వ్యవసాయ కార్మికులు సమష్టిగా దేశవ్యాప్తంగా ఒక్క శక్తిగా కదలబారడం 20వ శతాబ్దం తొలి జాతీయోద్యమ రోజుల తర్వాత బహుశా ఇదే మొదటి ఉదాహరణ! ఇందుకు చరిత్రలో తొలి ఉదాహరణగా గాంధీజీ చంపారన్ రైతాంగ సత్యాగ్రహాన్ని ఉదహరిం చుకోవచ్చు! ఆ పిమ్మట దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తలెత్తుతూ వచ్చిన ‘పునప్రా’, బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఫ్యూడల్, భూస్వామ్య దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతుల వ్యవసాయ కార్మికోద్యమాలు, రైతాంగ సత్యాగ్రహోద్యమాలు, రైతాంగ తిరుగుబాట్లను తెలుగునాట, పల్నాటిసీమలో ‘ పుల్లరి’ కోసం సామాన్య ప్రజలు కన్నెగంటి హనుమంతు నడిపిన మహోద్యమం పేద రైతాంగ, ప్రయోజనాలకోసం త్యాగాలతో నిర్వహించిన ఉద్య మాలు, మహోద్యమాలేనని మరువరాదు! ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రైతు ఉద్యమ నాయకులు ఈ కొసన ఉన్న శ్రీకాకుళం నుంచి ఆ కొసన ఉన్న మద్రాసు వరకు 1,500 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా వెళ్లి రైతాంగ ప్రజల బాధల గురించి సమర్పించిన వినతి పత్రమూ ఈ ఉద్యమాలలో అంతర్భాగమే! వీటన్నింటి సమా హారంగానే నేడు పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రైతాంగం, వ్యవ సాయ కార్మికుల సారథ్యంలో– ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి అనేక రాష్ట్రాల రైతాంగ, కార్మిక ప్రజాబాహుళ్యాన్ని కదిలించి మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ప్రతిఘటించేట్లు చేసింది! లక్షలమంది రైతులను కూడగట్టి 20వ శతాబ్దం తొలి దశాబ్దంలోనే గాంధీజీ తొలిసారిగా ప్రారంభించిన ‘చంపారన్’ (బిహార్) రైతాంగ సత్యాగ్రహం, ఆ తర్వాత ఉద్యమాలన్నింటికి స్ఫూర్తిగా నిలిచిందని మరువరాదు! కానీ ఏ బిహార్ నీలిమందు రైతులను ౖబ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వ దమనకాండ నుంచి, దాస్యం నుంచి ఏ గాం«ధీ బయటపడే శాడో ఆ మహాత్ముడి శాంతిని భగ్నం చేసే చట్టాలను తిరిగి ఈనాటి పాలకులు తలెత్తుకున్నారు. పైగా, దేశంలోని బుద్ధిజీవులంతా భారత పారిశ్రామిక వేత్తల జాతీయ సమాజ సదస్సులో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో.. భారత రైతాంగంకి ఆదాయం పెంచుకోవడానికి ఇప్పు డున్న మార్కెట్లుగాక ‘ప్రత్యామ్నాయ మార్కెట్లను చూపడానికే మూడు వ్యవసాయ చట్టాలను’ ప్రవేశపెట్టాల్సి వచ్చిందని.. వీటిద్వారా రైతాం గానికి ఆదాయాలు పెరుగుతాయని నమ్మింపజూశారు! పైగా రైతాంగ ‘సంక్షేమం కోసమే’ ఈ చట్టాలని ఉద్దేశించామని చెప్పారు. కానీ పాత, మధ్య దళారీలను ఎలా తొలగిస్తారో చెప్పకుండా ‘రైతాంగ ప్రయోజ నాల’ పేరిట బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ ఉత్పత్తులను అప్పగించడం ద్వారా రైతుల పంటలకు కనీస మద్దతు ధరను ఎలా గ్యారంటీ ఇవ్వగలరో మోదీ భరోసా కల్పించలేకపోయారు. అందుకే కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇస్తూ వ్యవసాయ చట్టా లలో లీగల్‌గా రక్షణ కల్పించి తీరాలని రైతాంగం కోరుతోంది. ఆ చట్టబద్ధ భద్రత మినహా లిఖిత పూర్వక హామీ ఏదైనా ఇస్తామన్నది మోదీ ప్రభృతుల వాదన! ఇక్కడే ఉంది అసలు ‘కిటుకు’ అంతా అని, ఆవులిస్తే పేగులు లెక్కించడంలో ఇన్నేళ్ల అనుభవం తర్వాత రైతాంగ ప్రజలకు తెలిసిపోయింది. కనుకనే పందొమ్మిది రోజుల సత్యా గ్రహాన్ని మరింతగా ఉధృతం చేయాల్సి వచ్చింది రైతాంగం. వారి దృఢ సంకల్పానికి గాంధీజీ సుదీర్ఘ ‘చంపారన్ రైతాంగ సత్యా గ్రహమే’ గీటురాయి అయింది. ఎందుకంటే ఆంగ్లో అమెరికన్ సామ్రా జ్యవాద పెట్టుబడులను ఇండియా లాంటి వర్ధమాన దేశాల మార్కెట్ల లోకి చొరబడేలా చేసి వాటి స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసి ధనిక దేశాల ప్రయోజనాలు కాపాడడమే ప్రపంచ బ్యాంకు, గుత్త పెట్టుబడి వర్గాల టెక్నాలజీ గుట్టుమట్టులని మరచిపోరాదు. ఈ విషయాన్ని వరల్డ్‌బ్యాంకు దాని అనుబంధ సంస్థలలో కీలక బాధ్యతల్లో పనిచేసిన డేవిసన్ బుధూ, డాక్టర్ జోసెఫ్ స్టిగ్లిజ్లు ఒకటికి పదిసార్లు వర్ధమాన దేశాలకు పాఠంగా బోధించి హెచ్చరించారు. వీరిలో డేవిసన్ బుధూ వరల్డ్ బ్యాంకు వర్ధమాన దేశాలలో తనకు అమలు జరపమని పురమా యించిన బాధ్యతల మూలంగా పేదప్రజల ప్రాణాలతో చెలగాట మాడి ‘నా చేతులు రక్తసిక్తమయ్యాయి. ఈ చేతుల్ని కడిగి పరిశుభ్రం చేసుకోవడానికి ఏ నదీ జలాలూ సరిపోవు’ అని బాహాటంగా ప్రక టించి బ్యాంకు కొలువును చాలించుకున్నాడు. ఇక బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త (స్టిగ్లిజ్) బ్యాంక్ పదవికి రాజీనామా చేసి, తప్పుకున్నాడు! ఇలాంటి పరిణామాల మధ్య భారత రైతాంగ ప్రజల పలు ఉత్ప త్తులకు, ప్రధానంగా ధాన్యం, గోధుమ పంటలకు కనీస ధరను, కనీస మార్కెటింగ్ సౌకర్యాలను గ్యారెంటీ చేస్తూ ప్రభుత్వం హామీ పడాలని, గ్రామీణ స్థానిక మార్కెట్లకు (మండీలు) ప్రైవేటు గుత్త వ్యాపార వర్గాల చేతుల్లో పెట్టరాదని, ప్రభుత్వ ఆహార సంస్థే నేరుగా రైతుల నుంచి ధాన్యోత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటు న్నారు. గాంధీజీ చంపారన్ రైతాంగ ఉద్యమం.. దాదాపు అదే కాలంలో స్వదేశీ మిల్లు యజమానుల దోపిడీకి వ్యతిరేకంగా అహ్మదా బాద్ కార్మికులు, కరువు రోజుల్లో కూడా వృత్తి ద్వారా చేసే రెవెన్యూ వసూళ్లకు నిరసనగా జరిగిన ‘ఖేడా’ ప్రతిఘటనోద్యమాలకు దీటైన ఉద్యమంగా నేటి రైతు ఉద్యమాన్ని పరిగణించాలి! అందువల్ల మోదీ తమ మూడు రైతాంగ వ్యతిరేక చట్టాల ద్వారా ‘తొలగించాలని భావిం చుకున్న అడ్డంకులు’ తద్వారా బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగంపై ఆధిపత్యం కల్పించడానికి చేస్తున్న చట్టాల ద్వారా పెంచేవి లేదా పెంచాలని ఆశిస్తున్నవీ రైతాంగ ఆదాయాలు మాత్రం కావు. గుత్తేదారుల, వారి కంపెనీల ఆదాయాలు మాత్రమే! అందుకే ‘గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి వర్గాలకు ప్రధాన మైన వనరు. అందువల్లనే పారిశ్రామికవేత్తల లాభాలకు అడ్డుగోడలన్నిం టినీ తొలగించడానికే వ్యవసాయ సంస్కరణల’ని మోదీ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు! అందుకే సెయింట్ అగస్తిన్ అని ఉంటాడు. ‘పాల కుడెవరో చెప్పండి, ఆ చట్టం ఎలా ఉంటుందో చెప్తా’ అన్నాడు! అందుకే కొందరు పాలకుల్ని గురించి లోకంలో ఒక సామెత స్థిరపడి ఉంటుంది. ‘చీకటి తన నల్ల దుప్పటిని అందరికీ సమంగా పంచాలని చూస్తుందట’! వెలుగు చీకట్లతో మానవులు కాపురం చేయక తప్పదు గానీ, ఎప్పటికప్పుడు చీకటిని వెడలుగొట్టుకుంటూనే ఉండాలి మరి! అదే నిత్య విమోచనకు అర్థం!! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
గాంధీ మునిమనవడు మృతికి నివాళులు
టెక్సాస్: కరోనా కారణంగా చనిపోయిన మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా మృతి పట్ల మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ రెండో కుమారుడు మణిలాల్, సుశీలాబెన్ల కుమార్తె సీతా, శశికాంత్‌ల తనయుడు సతీష్ ధుపేలియా దక్షిణాఫ్రికాలో మృతి చెందారని తెలిపారు. గత నెల రోజులగా న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలోనే ఆస్పత్రిలో కరోనాసోకి నవంబర్ 22న మృతి చెందడం విచారకరమన్నారు. మూడు రోజులక్రితమే సతీష్ ఆస్పత్రిలో తన 66 వ జన్మదినాన్ని జరుపుకున్నారన్నారు. 2014 లో అక్టోబర్ 2 వ తేదిన అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ను డల్లాస్‌లో సతీష్ చేతులమీదుగా ఆవిష్కరణ జరుపుకోవడం ఒక మధురానుభూతని పేర్కొన్నారు. విజయవాడకు చెందిన శిల్పి బుర్రా శివ వరప్రసాద్ తయారుచేసిన ఆ మహాత్మాగాంధీ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోందని సతీష్ ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఉన్న నాలుగు రోజులు డల్లాస్‌లో అనేక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. (చదవండి: సియాటిల్‌లో ప్రవాస భారతీయుల వర్చువల్ భేటీ) గాంధీ మునిమనవడు సతీష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఎమ్జీఎమ్ఎన్టీ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూరతో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ రావు కల్వల, మురళి వెన్నం, జాన్ హేమండ్, రన్నా జాని, అభిజిత్ రాయల్కర్, స్వాతి షా, శైలేష్ షా, లోక్ నాథ్ పాత్రో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన సతీష్ వృత్తి పరంగా మీడియా ఫోటోగ్రాఫర్‌గా, వీడియో గ్రాఫర్‌గా పని చేశారు. ప్రవృత్తి పరంగా మహాత్మాగాంధీ 1904లో స్థాపించిన ఫేనెక్ష్ సెటిల్మెంట్లో, డర్బాన్ దగ్గరలో ఉన్న సంస్థలోను, గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్‌లోనూ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు. సతీష్‌కు ఉమ, కీర్తి అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. (చదవండి:అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?) -
కరోనాతో గాంధీ మునిమనవడు మృతి
జోహన్నెస్‌బర్గ్: కరోనా వైరస్ కారణంగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో మరణించారు. ఆయన కరోనా వైరస్‌తో మృతి చెందినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా తెలిపారు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరిన తన సోదరుడికి కరోనా వైరస్ కూడా సోకిందని తెలిపారు. ఆయన నెల రోజుల నుంచి ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న సతీష్‌కి ఆదివారం హఠాత్తుగా గుండెపోటు రావటంతో మృతి చెందారని ఆమె సోషల్ మీడియలో వెల్లడించారు. ఆయనతో పాటు సోదరి ఉమా, మరో సోదరి కీర్తి మీనన్ జోహన్నెస్‌బర్గ్‌లో నివసిస్తున్నారు. చదవండి: ఆ రెండు మార్కెట్ల మూసివేత: ఆదేశాలు వెనక్కి! వీరు ముగ్గురు మహాత్మా గాంధీ చూపిన మార్గంలో రెండు దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సతీష్ ధుపేలియా మీడియా రంగంలో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. గాంధీ ప్రారంభించిన ‘గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్’ ద్వారా అనేక సేవలు అందింస్తూ.. సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు. సతీష్ ధుపేలియా, ఉమా ధుపేలియా, కీర్తి మీనన్ వీరు ముగ్గురు మహాత్మాగాంధీ రెండో కుమారుడు మనీలాల్ గాంధీ వారసులు. చదవండి: భోజనం డబ్బు మా నాన్న తినేస్తున్నాడు -
‘కళ్లు మూసుకోవడం కాదు మాట్లాడండి’
మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా షారుక్ ఖాన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వివాదానికి కారణమయ్యింది. ఈ ట్వీట్‌పై ఫోర్ మోర్ షాట్స్ ఫేమ్ నటి సయాని గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు సరైన విషయాలు బోధించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు విషయం ఏంటంటే గాంధీ జయంతి సందర్భంగా షారుక్ ఖాన్ ‘ఈ సమయంలో మన పిల్లలకు ఒకే ఆదర్శం బోధించాలి. అది ఏంటంటే మంచి, చెడు అన్ని వేళలా పిల్లలు చెడు వినకూడదు.. చూడకూడదు.. మాట్లాడకూడదు. 151వ జయంతి సందర్భంగా గాంధీ విలువలను స్మరించుకోవాలి’ అంటూ ట్వీట్ చేశారు షారుక్ ఖాన్. (చదవండి: దద్దమ్మల్లారా, నేను అన్నదాంట్లో తప్పేముంది) దీనిపై సయాని గుప్తా స్పందించారు. ‘పిల్లలకు మంచి విషయాల గురించి చెప్పండి. సత్యం కోసం మాట్లాడమని గాంధీ మనకు బోధించారు. అణగారిని, దోపిడికి గురయిన మన దళిత సోదరులు, సోదరీమణుల గురించి మాట్లాడండి. మీ కళ్లను, నోటిని మూసుకోకండి.. సత్యం కోసం మాట్లాడండి’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు సయాని గుప్తా. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు తెగ ట్రెంఢ్ అవుతున్నాయి. Say something. The Right thing. Gandhi also taught us to speak up for the Truth, the downtrodden, the exploited, for our Dalit brothers and sisters. Don't just shut your ears and eyes and mouths. @iamsrk https://t.co/IChzz2k5n0 — Sayani Gupta (@sayanigupta) October 2, 2020 -
ఆ ఏడాది గాంధీకే నోబెల్ పీస్ ప్రైజ్.. కానీ
(వెబ్ స్పెషల్): నోబెల్ శాంతి బహుమతి.. ప్రపంచ శాంతికి కృషి చేసిన ఎందరికో ఈ బహుమతిని ప్రదానం చేశారు. మరి భారత్, ఆఫ్రికా దేశాల్లో శాంతియుత పోరాటాలు చేసిన జాతిపిత, మహాత్మగాంధీని ఈ బహుమతిని ఎందుకు వరించలేదు. ఈ ప్రశ్నే గాంధీ జయంతి(అక్టోబర్ 2న) సందర్భంగా కోట్లాది మంది భారతీయులను తొలుస్తోంది. అందుకు గల కారణాలు తెలుసుకుందాం. నోబెల్ శాంతి పురస్కారంతో గౌరవించడం రెడ్ క్రాస్ స్థాపకులు జీన్ హెన్రీ డ్యూనెంట్ నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు 19 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు. ఇక 27 సార్లు ఈ పురస్కారాన్ని వ్యక్తుల కంటే సంస్థలకు ఇవ్వడమే సబబని భావించారు. ఒక్కసారి నోబెల్ బహుమతిని ప్రదానం చేసిన తర్వాత తిరిగి వెనక్కు తీసుకోరు. అందుకే బహుమతికి ఎంపిక చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇక జాతిపితకు ఈ పురస్కారం దక్కకపోవడం పట్ల పలు వివరణలు వినిపిస్తాయి. ముఖ్యంగా గాంధీజీకి ఈ పురస్కారం ఇచ్చి ఆంగ్లేయ పాలకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోకూడదని నోబెల్ కమిటీ భావించిందనే వాదన ఎక్కువగా ప్రచారంలో ఉంది.(చదవండి: నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్) నాలుగు సార్లు నామినేట్ అయిన గాంధీ నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీ నాలుగు సార్లు నామినేట్ అయ్యారు. ఆయనను వరసగా 1937, 1939లో నామినేట్ చేశారు. 1947లో కూడా ఆయన నామినేట్ అయ్యారు. చివరగా 1948లో గాంధీని నామినేట్ చేశారు. కానీ తర్వాత రెండు రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. మొదటిసారి ఒక నార్వే ఎంపీ గాంధీ పేరును సూచించారు. పురస్కారం ఇచ్చే సమయంలో కమిటీ ఆయనను పట్టించుకోలేదు. దీని గురించి నోబెల్ కమిటీలోని జాకబ్ వార్మూలర్ అనే సలహాదారు గాంధీకి నోబెల్ పురస్కారం ఇవ్వకపోవడం గురించి తన అభిప్రాయం రాశారు. ‘గాంధీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తను చేస్తున్న అహింసా ఉద్యమం ఎప్పుడో ఒకప్పుడు హింసాత్మకంగా మారొచ్చని తెలిసినా దానిని వీడలేదు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘దక్షిణాఫ్రికాలో, భారత్‌లో ఆయన కేవలం తన దేశస్తుల కోసమే పోరాడారు. నల్లజాతి వారికోసం ఆయన ఏం చేయలేదు’ అని రాసుకొచ్చారు. (చదవండి: సరైన నేతకు ‘నోబెల్ శాంతి’) 1947లో మరోసారి.. 1947 లో నోబెల్ కోసం గాంధీని బీజీ ఖేర్, జీవీ మౌలాంకర్, జీపీ పంత్ నామినేట్ చేశారు. ఆ సమయంలో కమిటీ ఛైర్మన్ గున్నార్ జాన్ ఇద్దరు సభ్యులు, క్రిస్టియన్ కన్జర్వేటివ్ హర్మన్ స్మిట్ ఇంజిబ్రేట్సెన్, క్రిస్టియన్ లిబరల్ క్రిస్టియన్ ఒఫ్టెడల్ గాంధీ వైపు మొగ్గు చూపారు, కాని మిగతా ముగ్గురు - లేబర్ రాజకీయ నాయకుడు మార్టిన్ ట్రాన్మాల్, మాజీ విదేశాంగ మంత్రి బిర్గర్ బ్రాడ్ల్యాండ్లు వ్యతిరేకించారు. దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లు.. గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆయనకు ఆ ఏడాది పురస్కరం లభించలేదు. దేశ విభజన వల్ల భారత్-పాక్‌ల మధ్య యుద్ధం తప్పక వస్తుందని కమిటీ భావించింది. దాంతో గాంధీకి పురస్కారం దక్కలేదు. దాంతో అది మానవ హక్కుల ఉద్యమం ‘క్వేకర్’కు లభించింది. 1948లో మరోసారి.. ఒట్టిదే నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ చివరి తేదీకి రెండు రోజుల ముందు గాంధీ హత్య జరిగింది. ఆ సమయానికే నోబెల్ కమిటీకి గాంధీ తరఫున ఆరు సిఫార్సులు అందాయి. వాటిలో 1946, 47 అవార్డు గ్రహీతలు ది క్వేకర్స్, ఎమిలీ గ్రీన్ బాల్చ్ ఉన్నారు. కానీ అదే ఏడాది గాంధీ మరణించారు. దాంతో కొత్త సమస్య తెరమీదకు వచ్చింది. అప్పటి వరకు మరణానంతరం ఎవరికీ నోబెల్ పురస్కారం ఇవ్వలేదు. దాంతో మరో సారి నోబెల్ ఆశ నిరాశ అయ్యింది. అయితే ప్రస్తుతం మరణించిన తర్వాత కూడా ఇస్తున్నారు. దీంతో పాటు మరో ప్రశ్న కూడా ఎదురయ్యింది. శాంతి పురస్కారం నగదు ఎవరికి చెల్లించాలి అని. ఎందుకంటే అప్పటికి గాంధీ పేరు మీద ట్రస్టుగానీ, సంఘం గానీ లేదు. ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వీలునామా కూడా రాయలేదు. దాంతో మరోసారి నోబెల్ చేజారింది. (చదవండి: గాంధీజీ కళ్లజోడు.. జీవితాన్నే మార్చేసింది!) ఇక ఆ ఏడాది ఎవరికి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వలేదు. దీని గురించి కమిటీ ‘జీవించి ఉన్న ఏ అభ్యర్థినీ శాంతి పురస్కారానికి తగిన వారుగా భావించలేదు’ ప్రకటించింది. ఇక్కడ 'జీవించి ఉన్న' అనే మాట చాలా ముఖ్యమైనది. దానిని బట్టి, మరణానంతరం ఎవరికైనా పురస్కారం ఇచ్చే అవకాశం ఉండుంటే, అది కచ్చితంగా గాంధీకి తప్ప వేరే వారికి దక్కేది కాదనేది స్పష్టమవుతోంది. -
జాతిపితపై గుడ్లు, రాళ్లు రువ్విన వేళ
(వెబ్ స్పెషల్): మహాత్మ గాంధీ గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ఓ వ్యాఖ్య ఆయన జీవితాన్ని అత్యంత అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. జాతిపితను ఉద్దేశించి ఐన్‌స్టీన్ ‘ఇలాంటి వ్యక్తి ఒకరు, రక్తమాంసాలతో ఈ నేలమీద నడిచారు అనే విషయాన్ని ముందు తరాలవారు విశ్వసించటం కూడా కష్టమే!’ అన్నారు. ఈ ఒక్క మాట చాలు ఆయన గొప్పతనాన్ని వెల్లడించడానికి. బ్రిటిషర్లు దాదాపు రెండు వందల ఏళ్ల పాటు మనల్ని పాలించారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గాంధీ ఎలాంటి ఆయుధం వాడకుండా తరిమి కొట్టారంటే ఇప్పటికి వింతగానే ఉంటుంది. ఆయన అహింసా వాదం ఆ తర్వాత ఎందరికో ఆదర్శంగా నిలిచింది. హింసకు వ్యతిరేకి అయిన గాంధీ ఓ సారి దారుణ హింసకు గురయ్యారు. అది దక్షిణాఫ్రికాలో. దాదాపు 6వేల మంది తెల్ల యూరోపియన్లు గాంధీ మీద రాళ్లు రువ్వి, కోడి గుడ్లు విసిరి.. పిడి గుద్దులు కురిపించారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం లేకుండా ఆయన ఆ దాడి నుంచి బయటపడగలిగారు. ఈ సంఘటన 1897, జనవరి 13న చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పని చేస్తున్న గాంధీ భారత పర్యటన తర్వాత కుటుంబంతో కలిసి డర్బన్‌కి తిరిగి వచ్చారు. గాంధీ రెండు ఓడల కాన్వాయ్‌లో దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అయితే ఆ సమయంలో గాంధీకి వ్యతిరేకంగా తెల్ల యూరోపియన్లు ఆందోళన చెపట్టడంతో ఆయన కొంత సమయం ఓడలోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే గాంధీ నాటల్ ప్రాంతంలోని భారతీయ ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు. దాంతో వారు ఆయన మీద కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో వారు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. బ్రిటీషర్లతో పాటు భారతీయుల సమానత్వం కోసం ఆయన కృషి చేశారు. దాంతో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆందోళన నేపథ్యంలో ఓడ కెప్టెన్ మహాత్మ గాంధీని కిందకు దిగవద్దని హెచ్చరించాడు. ఆ సమయంలో యూరోపియన్లు గాంధీ వచ్చిన ఓడ తిరిగి భారతదేశానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. తిరిగి వెళ్లందుకు అవసరమైన డబ్బులు తామే ఇస్తామన్నారు. తమ మాట వినకపోతే దాడి చేస్తామని హెచ్చరించారు. (చదవండి: ఇప్పటికీ 'ఆమె' పోరాడుతూనే ఉంది) కొంత సమయం తర్వాత ప్రమాదం లేదని తెలియడంతో గాంధీ కిందకు దిగారు. పక్కనే ఉన్న ఓ వీధిలోకి వెళ్తుండగా దాదాపు 6 వేల మంది ఆయనను చుట్టు ముట్టారు. వారు చాలా కోపంగా ఉన్నారు. వారిలో కొందరు గాంధీ మీద రాళ్లు రువ్వారు.. కోడి గుడ్లతో దాడి చేశారు. ఓ వ్యక్తి గాంధీ తలపాగాను కింద పడేశాడు. కొందరు ఆయన మీద పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో గాంధీ స్పృహ కోల్పోయాడు. పోలీసులు గాంధీని దాడి చేసిన వారి నుంచి సురక్షితంగా రక్షించారు. గాంధీ తన స్నేహితుడు పార్సీ రుస్తమీ ఇంటికి చేరుకున్నారు. కానీ వందలాది మంది గుంపు ఆ ఇంటిని చుట్టుముట్టి, "గాంధీని తిరిగి మాకు అప్పగించండి" అని అరవడం ప్రారంభించింది. ఆందోళనకారులు ఇంటికి నిప్పంటించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో ఇంటి లోపల పిల్లలు, మహిళలు సహా సుమారు 20 మంది ఉన్నారు. అప్పుడు చీఫ్ కానిస్టేబుల్ అలెగ్జాండర్ గాంధీని ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి గుంపు నుంచి రక్షిస్తాడు. (చదవండి: మహమ్మారులపై మహాత్ముడి మంత్రోపదేశం) అలెగ్జాండర్ బ్రిటిషర్ కాని గాంధీ స్నేహితుడు. అతను గాంధీని భారత పోలీసు కానిస్టేబుల్‌గా తయారు చేసి, సమీప పోలీస్ స్టేషన్‌కు సురక్షితంగా రవాణా చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అలెగ్జాండర్ స్వయంగా జనసమూహంలో కలిసి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయనను అక్కడి నుంచి తప్పిస్తాడు. అలా భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి 50 సంవత్సరాల కంటే ముందే మహాత్మా గాంధీ ప్రాణాంతకమైన మూక దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయన 1915 లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు.. ఆ తర్వాత స్వాతంత్య్ర సంగ్రామానికి కొత్త దిశను ఇచ్చారు. -
గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. మహాత్ముడి 151వ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన బోధించిన సత్యం, అహింసా ఎంతో ఉన్నతమైనవని కొనియాడారు. గాంధీ ఆశయాల సాధన కోసం ఆయన సిద్ధాంతాలను పాటిస్తూ పాలనతో ముందడుగు వేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆయన కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలను స్థాపించి గాంధీ కలలుకన్న దేశాన్ని నిర్మించేందుకు ముందడుగు వేశాం అని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సీఎం జగన్ ట్వీట్ చేశారు. (బాపు కల నెరవేరిందిలా..) మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. మంత్రి కన్నబాబు, ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. -
మహాత్మునికి మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగానూ విజయ్‌ఘాట్ వద్ద ప్రధాని నివాళి అర్పించి.. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు గాంధీకి నివాళి అర్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగానూ మహాత్ముని జయంతి వేడుకలు ఘనంగా జరుతున్నాయి. -
ఇప్పటికీ 'ఆమె' పోరాడుతూనే ఉంది
స్త్రీల శక్తిపై గాంధీజీకి నమ్మకం. ‘ఇన్ని సీట్లు ఇచ్చేయడం కాదు..అన్ని సీట్లలోకీ రానివ్వాలి’ అనేవారు! సీట్లతో పరిమితం చెయ్యొద్దని. పోటీకొస్తుంటే అడ్డు పడొద్దని..స్త్రీల పాలనా సామర్థ్యాలను తక్కువగా చూడనే చూడొద్దని.. ఇంకోమాట కూడా అనేవారు పురుషుల అనుగ్రహాలు స్త్రీలకు జరిగే న్యాయాలేం కావని. స్త్రీ సాధికారతకూ గాంధీమార్గం ఉంది. ఆ మార్గంలో నడవాల్సింది పురుషులే. అడిగింది ఇవ్వడం ఇష్టం లేకపోతే, ‘కూర్చొని మాట్లాడుకుందాం రండి’ అని పిలుస్తారు అధికారంలో ఉన్నవారు. గాంధీజీని అలాగే రౌండ్ టేబుల్ సమావేశానికి పిలిచారు బ్రిటిష్ వాళ్లు. సమావేశం లండన్‌లో. ‘మమ్మల్ని మేం పరిపాలించుకుంటాం’ అంటారు గాంధీజీ. అంటే, మీరు మీ దేశానికి వెళ్లిపోండని బ్రిటిష్ వాళ్లకు మృదువుగా చెప్పడం. 1930 నుంచి 32 వరకు మొత్తం మూడు ‘రౌండ్’ల సమావేశాలు జరిగాయి. రెండో రౌండ్‌కు మాత్రమే వెళ్లారు గాంధీజీ. మొదట , మూడవ రౌండ్లలో ఆయన గానీ, మనవాళ్లలో ముఖ్యులు గానీ ఎవరూ కూర్చోలేదు. రెండో రౌండ్ సమావేశానికి వెళ్లే ముందు 1931 సెప్టెంబర్ 17న గాంధీజీ ఒక మాట అన్నట్లు చెబుతుంటారు. ‘‘భారతదేశ చట్టసభలో కనుక మహిళలకు తగిన భాగస్వామ్యం లేకపోతే నేను ఆ సభలోకే అడుగు పెట్టను’’ అని గాంధీజీ అన్నట్లుగా చరిత్రలో ఉన్న ఆ మాట మన దగ్గర చివరిసారిగా వినిపించింది 2010 మార్చి 9న రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పుడు. ‘స్త్రీ పురుష సమానత్వం కోసం గాంధీజీ కనిన కల సాకారం అయింది’ అని కూడా ఆ బెంచీల లోంచి ఎవరో పెద్దగా అరిచారు. దేశానికి స్వాతంత్య్రాన్ని కోరుకున్నట్లే, దేశంలోని మహిళల స్వాతంత్య్రాన్నీ గాంధీజీ కోరుకున్న మాట నిజమే. అసమానతల నుంచి ఆ స్వాతంత్య్రం. అయితే రిజర్వేషన్లతోనే మాత్రమే దానిని మనం సాధించగలం అని గాంధీజీ చెప్పలేదు. మహిళలకు మనం ఏదైనా ఇస్తున్నామూ అంటే , అది ఏనాడో వారికి దక్కవలసి ఉండింది మాత్రమేనని గాంధీజీ అభిప్రాయపడేవారు. ‘‘సమానత్వం అంటే వాళ్లకు కొన్ని సీట్లు వేసి కూర్చోమనడం కాదు, పోటీ పడి పోరాడే అవకాశం ఉండటం. స్త్రీకి.. పురుషుడితో సమానమైన శక్తి ఉంది. అంతకన్నా ఎక్కువ శక్తి కూడానేమో. ఆ శక్తిని అడ్డుకునే పురుషాధిక్య ప్రదర్శనకు రాజకీయాల్లో గానీ, ఇంకెక్కడైనా కానీ తావు ఉండకూడదు’’ అనేవారు గాంధీజీ. దేశానికి స్వాతంత్య్రం రాకముందే దేశ స్వాతంత్య్రాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో గాంధీజీ స్పష్టమైన రూపురేఖలు గీసుకున్నారు. ఎవరూ ఎవరికీ బానిసలుగా ఉండకూడదు. ఎవరూ ఎవరిపై అధికారం చెలాయించకూడదు. పురుషులతో సమానంగా స్త్రీలూ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను అనుభవించాలి. పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి లభించినా, పురుషాధిపత్యాల నుంచి స్త్రీలకు విముక్తి లభించనిదే స్వాతంత్య్రం పరిపూర్ణమైనట్లు కాదు. ఇలా భావించారు గాంధీజీ. దేశ స్వాతంత్య్రం కోసం కలిసి తిరుగుబాట్లు, కలిసి ఉద్యమాలు, కలిసి పోరాటాలు చేసిన స్త్రీ పురుషులు.. స్వాతంత్య్రం తర్వాత ఎక్కువ తక్కువల పౌరులు అయేందుకు వీలే లేదని స్వాతంత్య్రానికి మునుపే ఆయన భారతీయ సమాజానికి హెచ్చరిక చేశారు. పరాయి పాలన నుంచి అహింస ద్వారా దేశానికి స్వతంత్రాన్ని సాధించడం ఎలా, సాధించిన స్వాతంత్య్రంతో సమాజంలోని అన్ని వర్గాల వారూ సమాన ఫలాలను పొందడం ఎలా అని గాంధీజీ 18 కీలకాంశాలతో కూడిన ఒక విప్లవాత్మక కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అందులోని ఒక అంశం.. దైనందిన, సామాజిక జీవితంలోని ప్రతి హక్కులోనూ స్త్రీలు సమ భాగస్వామ్యం కలిగి ఉండటం! అంత ముందుచూపు గాంధీజీది. ‘‘స్త్రీలు ఒక విధమైన బానిసత్వంలో ఉన్నారు. ఎప్పటికైనా ఆ బానిసత్వం నుంచి తాము బయట పడతామో లేదోనన్న భయంలోనూ ఉన్నారు’’ అనీ ఆయన వ్యాఖ్యానించారు! స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అయ్యాయి. గాంధీజీ ఊహించినట్లు (భయపడినట్లు అనాలి) నేటికింకా మహిళలు స్వేచ్ఛా సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పురుషులకు స్త్రీలు తోడున్నారు. స్వేచ్ఛ కోసం స్త్రీలు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. భారతదేశ స్వాతంత్య్ర ప్రకటనకు ఏడాది ముందు కూడా మహిళల విషయమై గాంధీజీ చింతాక్రాంతులై ఉన్నారని అంటారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పురుషులు అడ్డకోవడం ఆయన ఆవేదనకు కారణం అయింది. ‘‘ఎందుకు మీరింతగా స్త్రీ పురుష సమానత్వం కోసం ఆరాట పడుతున్నారు?’’ అని ఒక ప్రశ్న కూడా ఆయనకు ఎదురైంది. ‘‘ఇన్నాళ్లూ వాళ్లు పురుషుల వెనుక నడిచారు. సంగ్రామంలో పురుషుల పక్కన నడిచారు. ఇప్పుడు పురుషులకు ముందు నడవాల్సిన తరుణం వచ్చింది’’ అని గాంధీజీ సమాధానం. మహిళలు ముందు నడవడం అంటే దేశాన్ని ముందుకు నడిపించడం అని ఆయన ఉద్దేశం. ‘‘వాళ్లమీద కురుస్తున్న అనుగ్రహాలేమీ లేవు. వాళ్లకేదైనా మేలు జరుగుతోందంటే స్త్రీలు అయిన కారణంగా వాళ్లకు జరిగిన అన్యాయానికి ఆలస్యంగా న్యాయం లభించడం మాత్రమే ఆ మేలు’’ అని అంటారు గాంధీజీ. నేడు ఆ మహాత్ముని, మహిళాన్వితుని జయంతి. -
మహమ్మారులపై మహాత్ముడి మంత్రోపదేశం
‘‘శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటేనే మనం సవాళ్లతో యుద్ధం చేయగలం. మంచి అలవాట్లతో దినచర్యను ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ప్రణాళికలు ఫలిస్తాయి. ప్రకృతి చెప్పిన మాట వింటే మానవాళికి మంచి జీవితం ఉంటుంది’’వందేళ్ల కిందట జాతిపిత గాంధీ మహాత్ముడు అన్న మాటలివీ. కోవిడ్ కోరల నుంచి బయటపడేందుకు ఇప్పుడు మానవాళి పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ మాటలను సరిగ్గా ఆయన 150వ జయంతి వేళ మననం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి, హైదరాబాద్: అహింస.. రెండొందల ఏళ్ల ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడిన ఆయుధం. దేశ స్వాతంత్య్ర పోరాటకాలంలో మహాత్ముడు చెప్పిందదొక్కటేనా? ‘ఆరోగ్యమే మహాభాగ్యం’మనం ఇప్పుడు రోజులో ఒక్కసారైనా వినే, అనే మాట. ఇది కూడా మహాత్ముడి మంత్రోపదేశమే. కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మనం ప్రాణాలు దక్కించుకోవటంలో కొంతమేర పదిలంగా ఉన్నామంటే, మహాత్ముడి ఆ మాట కూడా కొంత కారణమనేవారూ లేకపోలేదు. మహమ్మారి అనగానే ఇప్పుడు మనకు కోవిడ్ స్ఫురణకు వస్తుంది. కానీ సరిగ్గా వందేళ్ల క్రితం ప్రపంచాన్ని ఇంతకు కొన్ని రెట్లు ఎక్కువగా అట్టుడికించిన స్పానిష్ ఫ్లూకు పర్యాయపదంగా దాన్ని వాడేవారు. వందేళ్ల క్రితం ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల ద్వారా మనదేశంలోకి వచ్చిన ఈ మహమ్మారి అప్పట్లో దాదాపు కోటిన్న ర మందిని బలితీసుకుంది. ఆంగ్లేయుల పాలనను అంతం చేసేందుకు స్వాతం త్య్ర ఉద్యమం క్రమంగా తీవ్రమవుతున్న తరుణంలో ఈ వ్యాధి ప్రబలింది. స్పానిష్ ఫ్లూతో నెలన్నర పోరాడిన మహాత్ముడు సరిగ్గా అంతకు నాలుగేళ్ల ముందే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మహాత్మాగాంధీ, సబర్మతి ఆశ్రమంలో జాతీయోద్యమ రచనలో తలమునకలై ఉన్నారు. అదే సమయంలో గాంధీ, ఆయన అనుచరులకు కూడా స్పానిష్ ఫ్లూ సోకింది. దాదాపు నెలన్నరపాటు ఫ్లూను వదిలించుకునే పనిలో ఉండిపోయారు. చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటించే అలవాటున్న 48 ఏళ్లనాటి గాంధీ, సులభంగానే దాని నుంచి బయటపడ్డారు. కానీ, ప్రజల పరిస్థితే దారుణంగా ఉంది. ఫ్లూ దెబ్బకు యావత్తు దేశం బెంబేలెత్తింది. మళ్లీ వారిలో స్వాతంత్య్రోద్యమ కాంక్షను రగిల్చేందుకు దేశం నలుమూలలు పర్యటించిన మహాత్మాగాంధీ.. వెళ్లిన ప్రతిచోటా విధిగా చెప్పిన మాట.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ వైద్యుడి అవతారమెత్తిన గాంధీ అంటువ్యాధులు ప్రబలేందుకు అపరిశుభ్ర వాతావరణం, అలవాట్లే కారణాలు. అన్నింటా వెనకబడిన మనదేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు మరిన్ని వస్తాయని పసిగట్టిన గాంధీజీ జనంలో ఆరోగ్యంపై చైతన్యాన్ని రగిలించాలని గట్టిగా సంకల్పించుకున్నా రు. ఆయన పర్యటించిన ప్రతిచోటా స్వాతంత్య్ర ఉద్యమ నినాదాలు, ఆరోగ్య సూత్రాలు చెప్పేవారు. అలా దేశవ్యాప్తంగా మారుమోగిన మాటే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’. ధ్యానం.. వ్యాయామం.. రోజూ ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచే అలవాటున్న మహాత్ముడికి ప్రాతఃవేళ ప్రకృతిని పరిశీలించటమంటే ఎంతో ఇష్టం. ధ్యానం, వ్యాయామం ఆయన నిత్యకృత్యం. ఆ తర్వాత హాయిగా నడక సాగిస్తారు. చివరకు తన ఉద్యమ కార్యాచరణతోనూ దాన్ని అనుసంధానించేవారు. ఎక్కడికి వెళ్లినా వేగంగా నడుస్తూ ముందుకు సాగటాన్ని ఆయన అలవాటు చేసుకున్నారు. ఇక సాయంత్రం వేళ దాదాపు గంట సేపు ప్రత్యేకంగా వ్యాయామ నడకకు ప్రాధాన్యం ఇచ్చేవారు. పడుకునే వేళ మళ్లీ కాసేపు నడకకు సమయం కేటాయించేవారు. వెరసి ఒక రోజులో 8 మైళ్లకు తగ్గకుండా నడిచేవారట. భోజనంలోనూ ఆయన ప్రత్యేకతను చూపించారు. పచ్చి కూరలు, తాజా పళ్లను ఎక్కువగా ఇష్టపడేవారు. వాటిల్లో ఉండే పోషకాలను ఒడిసి పట్టుకోవటం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండాలన్నది ఆయన మాట. దేశంలో ఎక్కువ మంది పేదలే అయినందున వారు చవకగా ఆరోగ్యాన్ని పొందటం వీటితోనే సాధ్యమని పదేపదే చెప్పేవారు. చలికాలమైనా కిటికీ కొంత తెరిచి ఉండాల్సిందే.. ఎంతటి చలి ఉన్నా ఇంటి కిటికీ అద్దాలను కనీసం 4 అంగుళాల మేర అయినా తెరిచిపెట్టుకోవటం గాంధీకి అలవాటు. ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన గాలిని ఆహ్వానించటం ఆరోగ్యానికి మంచిదని ఆయన బలంగా నమ్మేవారు. జ్వరం ఉంటే కనీసం రెండు సార్లు స్నానం చేయాలని ఆయన చెబుతారు. ఒకవేళ స్నానం చేసే ఓపిక లేని పక్షంలో కనీసం పొత్తికడుపుపై మట్టి పట్టీ వేసుకోవాలని చెప్పేవారు. నిత్యం రెండు నిమ్మకాయల రసాన్ని వినియోగించటం బాపూకు ఉన్న అలవాటు. పచ్చి కూరలు, పండ్లు ఆ పక్కనే నూనె, పంచదార, మాంసం.. ఇవి అనారోగ్యకర ఆహార కలయిక అనేవారు. రాత్రి తొందరగా నిద్రకు ఉపక్రమించటం, ఉదయం తొందరగా లేవటం లాంటి అలవాట్లు జీవితాన్ని సక్రమ మార్గంలో ఉంచుకోవటం, ఏకాదశి, ఇతర కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉపవాసం చేయటం ద్వారా శరీర అవయవాల గతిని నియంత్రణలో ఉంచుకోవటం.. ఇలాంటి ఆరోగ్య సూత్రాలు బాపూ వద్ద ఎన్నో... -
గాంధీ బయోపిక్: అతిధి పాత్రలో కోదాడ వాసి
సాక్షి, కోదాడ: ‘న్యూయార్క్’ చిత్ర దర్శకుడు రామ్ అల్లాడి గాంధీజీ జీవిత ఇతివృత్తం మీద ‘మెటనోయా’ అనే చిత్రం తీర్చిదిద్ది విడుదలకు సిద్ధం చేశారు. గాంధీ జీవితంలో యదార్థ సంఘటనల ఆధారంగా.. కొన్ని కాల్పనిక అంశాలతో ఈ చిత్రం తీశారు. ఈ చిత్రం పూర్తి స్థాయిలో అమెరికాలో, హాలీవుడ్ పరిజ్ఞానంతో నిర్మించారు. గాంధీజీ బాల్యం నుంచి, 1948లో న్యూఢిల్లీలో ఆయన హఠాన్మరణం వరకు ముఖ్య ఘట్టాలను, చరిత్రకు చెందిన కాలపట్టికకు అనుగుణంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇతి వృత్తం.. మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ న్యాయవాది, వలసరాజ్య వ్యతిరేకి, జాతీయ వాది, రాజకీయ వేత్తగా తమ అహింసా శక్తితో, పౌర హక్కుల ఉద్యమంతో, భారత్‌ను బ్రిటీష్ బానిసత్యం నుంచి విముక్తి చేయడమే కాకుండా ప్రపంచానికి శాంతియుత మార్గదర్శకుడైన వైనాన్ని చిత్రీకరించారు. కాల్పనిక అంశాల సమ్మేళనంతో క్యాంట్ మెకానిజం, ఇన్సి్టయిన్ రోసన్బెర్గ్ బ్రిడ్జి, అంతరిక్షాంశాల వంటి శాస్త్రీయ విషయాలను మేళవిస్తూ గాంధీజీ జీవితాంశాలు వివరిస్తూ వారి సిద్ధాంతాలతో కూడిన సుసంపన్న జీవిత గాథను హృద్యంగా ఆవిష్కరించే విధంగా ఈ డాక్యుమెంటరీకి రూపకల్పన చేశారు. అద్భుతమైన అంతర్జాతీయ చిత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తమ లక్ష్యం సాధించగలిగానని రామ్ అల్లాడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాంధీజీ బాల్యం, గాంధీజీపై ఉన్న మక్కువ మెటనోయాలో ఆవిష్కృతమైంది. గాంధీజీ తత్వం, కేంద్ర బిందువుగా ఎక్కువ భాగం గాంధీజీ సొంత మాటల్లోనే చిత్ర సంభాషణలు ఉంటాయని, గాంధీ ఆత్మక«థ సత్యశోధనలోని మేజిక్ స్పెల్ ఆఫ్ బుక్ అనే అధ్యాయం ఆధారంగా కొన్ని కల్పానిక అంశాలతో రూపొందించినట్లు దర్శకుడు అల్లాడి పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూ ట్యూబ్‌లో ఇప్పటికే రిలీజ్ అయింది. అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా చూసే అవకాశం కల్పించారు. చిత్రంలో కోదాడ వాసులు... ఈ చిత్రంలో గాంధీజీ చిన్ననాటి మిత్రుడిగా కోదాడకు చెందిన అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన కొండపల్లి రాధాకృష్ణ కుమారుడు కొండపల్లి అనీష్ నటించాడు. అదేవిధంగా గాంధీజీ, ఫాదర్ ఆఫ్ లేడీతో కలిసి రైలులో ప్రయాణించిన వ్యక్తిగా అతిథి పాత్రలో కోదాడ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన కొండపల్లి సీతారామచందర్‌రావు నటించారు. కాగా గాంధీ వివిధ వయస్సు పాత్రలను అమెరికాలో స్థిరపడిన మన తెలుగువారు శ్రీనివాసరావు సనా పతి, రాజేష్రాజ్గోపాల్, తేజ్ కొండేటి, దీపక్ భీమ్రాశెట్టి నటించారు. కాగా కస్తూర్బా గాంధీగా అమెరికాకు చెందిన లారెంజో పల్లాడినో, మమాడివ్ శిశి, సరితా నవాలీ, కామ్యరాయసం నటించారు. కాగా... అమెరికాలో స్థిరపడిన కోదాడ వాసి అయిన భరద్వాజ్ వి .కొమరగిరి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం.. గాంధీజీ జయంతి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన చిత్ర సంస్థ అమెరికాతో పాటు అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకులు రామ్ అల్లాడి తెలిపారు. ఈ చిత్రానికి రామ్ దర్శకత్వం వహించడమే కాకుండా పూర్ణిమా దిగ్వీతో పాటు మరికొందరు అమెరికన్స్ సహకారంతో నిర్మించారు. కాగా దర్శకుడు వరంగల్ వాసి.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన గతంలో వరంగల్‌లోని పలు దేవాలయాలు, ఓరుగల్లు కోట తదితర చారిత్రాత్మక ఇతి వృత్తాలపై డాక్యుమెంటరీలు తీసి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను అందుకున్నారు. -
గాంధీ కళ్లద్దాలకు రూ. 2.55 కోట్లు
లండన్: మహాత్మాగాంధీ ధరించాడని భావిస్తున్న బంగారుపూత పూసిన కళ్లద్దాలు బ్రిటన్‌లో రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ కళ్లజోడు 2,60,000 పౌండ్ల (రూపాయలు 2.55 కోట్లు)కు అమ్ముడైంది. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ పెట్రోలియంకు పనిచేస్తున్న సమయంలో, 1910– 1930 మధ్యకాలంలో బ్రిటన్ దేశస్తుడికి ఇవి బహుమతిగా వచ్చాయి. తర్వాత ఆయన తన బంధువులకు వీటిని అందజేశారు. సౌత్ గ్లూసెస్టర్‌షైర్‌లో నివసించే వ్యక్తి 50 ఏళ్లుగా తమ ఇంట్లో ఉన్న ఈ కళ్లజోడును వేలం వేయాల్సిందిగా కోరారు. 10 నుంచి 15 వేల పౌండ్లు పలుకుతాయని భావించారు. అయితే ఏకంగా రెండు లక్షల అరవై వేల పౌండ్లకు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నాడు. భారత్, ఖతార్, అమెరికా, రష్యా, కెనడాల నుంచి పలువురు వేలం పాటలో పాల్గొన్నారు. ఇంత ధర పలకడంతో వేలానికి పెట్టిన వ్యక్తి ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఈ సొమ్మును కూతురుతో పంచుకుంటానని చెప్పారు. -
గాంధీజీ కళ్లజోడు.. జీవితాన్నే మార్చేసింది!
ప్రిటోరియా: దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ ధరించిన బంగారు వృత్తాకారపు కళ్లజోడు ఇటీవల వేలం పాటలో అత్యంత భారీ మొత్తానికి అమ్ముడు పోయింది. మూడు వారాల క్రితం దక్షిణాఫ్రికాలోని బ్రిస్టల్‌ల్లో నిర్వహించిన ఈ వేల పాటలో ఆ కళ్లజోడు సుమారు 260,000 పౌండ్లకు అమ్ముడుపోడంతో దాని యాజమాని హర్షం వ్యక్తం చేశాడు. ఈ కళ్లజోడును దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో మహత్మా గాంధీ ధరించారు. ఈ అరుదైన వస్తువును ఆమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. గాంధీజీ కళ్లద్దాలకు రిజర్వ్ ధరను 15,000 పౌండ్లగా నిర్ణయించారు. అయితే దీనిని సొంతం చేసుకునేందుకు భారతదేశంతో సహా వివిధ దేశాల నుండి చాలా మంది ఆసక్తిచూపించినట్లు వేలం పాట నిర్వహకుడు ఆండీ స్టోవ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా స్టోవ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. “ఇది అద్భుతమైన ఫలితం. ఇప్పటికీ నమ్మలేకపోతున్న. ఇంత మొత్తంలో ఈ కళ్లజోడు వేలానికి పోతుందని ఎవరూ కూడా ఊహించలేదు. నిజానికి ఈ కళ్లద్దాలు దాదాపు 50 ఏళ్లుగా తమ ప్రదర్శన శాలలోనే ఉంటోంది. అయితే కొంతమంది దీనిని వేలంలో ఎవరూ కొనరని, పనికి రాని వస్తువుగా చూసేవారు. దీనిని బయటపడేయడమే ఉత్తమమంటూ దీని యాజమానికి పలువురు సూచించారు. అయితే ఈ కళ్లజోడు యాజమాని ఓ వృద్ధుడు. అతడి కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వేలంలో ఊహించనంతా మొత్తానికి అమ్ముడుపోడంతో అతడి జీవితాన్నే మార్చేసేంతా డబ్బును అతడు పొందాడు’ అని పేర్కొన్నాడు. అయితే కళ్లద్దాలను కొనుగోలును సొంతం చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా భారత్, ఖతార్, కెనడా, రష్యా, అమెరికా నుంచి పాల్గొన్నారని చెప్పాడు. అయితే దీనిని 1920-1930 మధ్య కాలంలో గాంధీజీ దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం తిరిగి భారత్‌కు వెళ్లేటప్పుడు సదరు వృద్దుడి మామకు ఇచ్చినట్లు స్టోవ్ వెల్లడించాడు. ఇది దాదాపు దశాబ్ధాలుగా వారి వద్దే ఉంటోందని, గాంధీ ఇక్కడకు వచ్చినప్పుడు వృద్ధుడి మామ దక్షిణాఫ్రికాలోని బ్రిటిష్ పెట్రోలియంతో కలిసి పనిచేసేవాడని చెప్పాడు. భారత్‌లో గాంధీ స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ చాలా సంవత్సరాలు గడిపారని, ఆ సమయంలో గాంధీజీ వారి ఇంట్లోనే నివిసించినట్లు అతడు తెలిపాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా గాంధీ ఈ కళ్లజోడును వారికి బహుకరించారని స్టోవ్ వెల్లడించాడు. అయితే ఈ కళ్లద్దాలు మొత్తం బంగారు పూతతో ఉండి ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లతో ఇమిడి ఉంటుందని అతడు చెప్పాడు. ఇక ముక్కు పట్టి కూడా బంగారంలోనే ఉంటుందన్నాడు. ఈ వేలంలో గాంధీకి సంబంధించిన పలు వస్తువులలో ఈ అద్దాలు ఉత్తమైనవే కాకుండా మొత్తం ప్రదర్శనలో ఐకానిక్‌గా నిలిచిందని స్టోవ్ తెలిపాడు. -
నోటు నోటుకో ప్రత్యేకత..
ఏ వస్తువు కొనాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. సమాజంలో డబ్బుకు ఉన్న విలువ అలాంటిది. నోటు అనేది సాధారణ కాగితం కాదు. అది దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. మార్కెట్ విక్రయాల్లో నోట్లదే ప్రధాన పాత్ర. అందుకోసం ప్రతి దేశమూ ఒక్కో కరెన్సీని ముద్రిస్తుంది. ఏ దేశంలో నోట్లు ఆ దేశంలోనే చెల్లుబాటు అవుతాయనేది అందరికీ తెలిసిన విషయం. ఇతర దేశాల్లో మన కరెన్సీ నోట్లకు విలువ లేకున్నా వినమయశక్తి ఉంటుంది. పలు ప్రత్యేకతలతో భద్రతా పరమైన చర్యలతో నోట్లను ముద్రిస్తూ ఉంటారు. ఇందుకు దేశ సార్వభౌమాధికార చిహ్నాలు, సంస్కృతి, సంప్రదాయాల ఆనవాళ్లు, జాతి నేతల చిత్రాలను కరెన్సీపై ముద్రిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారత కరెన్సీ(నోట్లు)పై ప్రత్యేక కథనం. దత్తిరాజేరు: మన దేశ కరెన్సీ నోట్లపై ఇప్పటికీ మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రిస్తూ ఆయనకు మనం ఇచ్చే గౌరవాన్ని ప్రభుత్వాలు చాటిచెబుతున్నాయి. పెద్ద నోట్లు రద్దు తరువాత రూ.2 వేల నోటును రిజర్వ్ బ్యాంక్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నోటుకు ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రం, కుడివైపు అశోక స్థూపం ఉంటాయి. వెనుక వైపు స్వచ్ఛభారత్ లోగో, మంగళయాన్ ప్రయోగ చిహ్నాన్ని ముద్రించారు. గులాబీ రంగులో ఉన్న ఈ నోటు ముద్రణలో 19 జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చర్యలు వలన ఈ నోటును నకిలీ చేయడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం బల్లగుద్ది మరీ చేబుతోంది. చారిత్రక ఎర్రకోట మన దేశ అద్భుత కట్టడాల్లో ఢిల్లీలోని స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు ఇది కేంద్రం. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సంబరాలను ఇక్కడే నిర్వహిస్తారు. ఈ కోటపైనే మువ్వన్నెల జెండాను దేశ ప్రధాని ఎగురవేస్తుంటారు. ఈ కోటకు 360 ఏళ్ల చరిత్ర ఉంది. 1638లో యమునా నది ఒడ్డున ఈ కోట నిర్మాణ పనులు చేపట్టి, 1648లో పూర్తి చేశారు. ఈ కోట చిత్రం ప్రస్తుతం రూ.500 నోటుపై చోటు దక్కించుకుంది. జాతి ఔన్నత్యాన్ని చాటే.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలైన హిమాలయాలను రూ.100 నోటు వెనుక చూడవచ్చు. ఇందులో సుమారు నూరు శిఖరాలు 7.200 మీటర్లు ఎత్తుకు మించి ఉన్నాయి. ఆసియాలోని భూటాన్, చైనా, భారత్, నేపాల్, పాకిస్థాన్ భూ భాగాల్లో ఈ పర్వత శ్రేణులు పెట్టని కోట గోడలుగా ఉన్నాయి. చట్ట సభలకు ప్రత్యేకం ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యంగ వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది. అతి పెద్ద ప్రజా స్వామ్య దేశంగా ఇతర దేశాలకు సైతం తలమానికంగా ఉండే భారత పార్లమెంట్ భవనం. ఈ చిత్రం రూ.50 నోటు వెనుక ముద్రితమై ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు, దేశ పాలనా పరమైన అంశాలను ఇక్కడ చర్చించి చట్టాలను అమలులోకి తీసుకొస్తుంటారు. పర్యావరణానికి పెద్ద పీట పర్యావరణానికి ప్రతి రూపంగా భావించేది అండమాన్, నికోబార్ దీవుల్లో అమౌంట్ హేరియంట్ నేషనల్ పార్క్. ఈ చిత్రాన్ని రూ.20 నోటుపై ముద్రించారు. ఈ పార్క్‌ను 1979లో 46.62 కి.మీ. మేర విస్తరించారు. అద్భుత శిల్ప కళా సంపద రూ.10 నోటుపై మనకు ఒక పెద్ద చక్రం కనిపిస్తుంది. ఆ చక్రం ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కోణార్క్ సూర్యదేవాలయం లోనిది. సూర్య గమనానికి అనుగుణంగా నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్ప కళా సంపదకు నిలయం. మన దేశంలోని ఏడు వింతలలో ఇది ఒకటి ఈ దేవాలయం ఒడిశాలోని పూరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఏడు గుర్రాలు ఓ ర«థానికి కట్టి ఉన్నట్లుగా ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు ప్రతీకగా చెబుతారు. ఇక ఈ రథానికి ఉన్న 24 చక్రాలు రోజులోని 24 గంటలకు ప్రతీకగా చెబుతుంటారు. కర్షకులకు చిహ్నంగా.. వ్యవసాయ నిర్మాణ రంగంలో ఎక్కువ వాడుకలో ఉన్న ట్రాక్టర్‌ను రూ.ఐదు నోటు వెనుక ముద్రించారు. ట్రాక్టర్ అనే పదం ట్రహేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దేశం వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటిదని తెలియజేసే లక్ష్యంతో ఐదు రూపాయల నోటుపై ఈ చిత్రాన్ని ముద్రించారు. జాతీయ జంతువు.. రెండు రూపాయలు నోటుపై మన జాతీయ జంతువు పులి బొమ్మ ఉంటుంది. వన్య ప్రాణుల సంరక్షణకు ప్రాముఖ్యనిస్తూ ఈ నోటుపై పులి బొమ్మను ముద్రించారు. సాగర్ సామ్రాట్ మన కరెన్సీలో రూపాయి నోటుకి అధిక ప్రాధాన్యం ఉంది. ఈ నోటు వెనుక సాగర్ సామ్రాట్ ఆయిల్ రిగ్ కనపడుతుంది. ఓఎన్జీసీకి చెందిన ఈ ఆయిల్ రిగ్ దేశ మౌలిక వసతులను తెలియజేస్తుంది. -
అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం పట్ల తీవ్ర నిరసన
డల్లాస్ : వాషింగ్టన్ డి.సి లో ఇండియన్ ఎంబసీకి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని దౌర్జన్యకారులు ధ్వంసం చేయడాన్ని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస భారతీయులను, గాంధేయవాదులను తీవ్రంగా కలచి వేసిందన్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న జాతివివక్షత నిరసనకు ఈ ధ్వంసానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో మే 25న ఒక పోలీస్ అధికారి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ మెడను ఎనిమిది నిమిషాల పాటు తొక్కి పట్టి ఉంచడం ద్వారా అతని మరణానికి కారణం అవడం ఒక అనాగరిక, పాశవిక చర్య అని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన మొదటిది కాదని, గతంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా జరగడం ఏ మాత్రం సమర్ధనీయం కాదన్నారు. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో ముప్పై కి పైగా నగరాల్లో అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది. ఆఫ్రికన్ అమెరికన్ల ఆగ్రహానికి, ఆవేదనకు, నిరసనకు అర్థం ఉందని, తప్పనిసరిగా అందరూ మద్దతు పలకాలని ప్రసాద్ అన్నారు. అయితే ఆఫ్రికన్ అమెరికన్లకు న్యాయం జరగాలని ఏ ఉద్దేశ్యంతో ఆందోళన ప్రారంభించారో, గత పది రోజులుగా జరుగుతున్న ఈ దౌర్జన్యాలు, దహనకాండ, ధ్వంసంతో ఆ ఆశయం పక్క మార్గం పట్టి దహనాలు, దోపిడీలు, విధ్వంసాలకు దారి తీయడం శోచనీయమన్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ల ఆత్మ గౌరవాన్ని, వారి హక్కులకై నిరంతర పోరాటం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాంటి నాయకులు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని శాంతియుత పంథాలో ఉద్యమాలను నిర్వహిస్తే అదే గాంధీ విగ్రహాన్ని ఇప్పుడు ధ్వంసం చేయడం ఒక అనాలోచిత చర్య అని డా. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు . ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులలో ప్రభుత్వం, ప్రభుత్వాధికారుల వ్యాఖ్యానాలు ఆఫ్రికన్ అమెరికన్లకు స్వాంతన చేకూర్చే విధంగా ఉండాలే తప్ప అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉండకూడదు. ప్రజల రక్షణలో చాలా మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోవడం కూడా ప్రజలందరూ గుర్తుంచుకోవాలని.. అయితే పోలీసులు నేరస్తులను పట్టుకొని న్యాయస్థానానికి అప్పగించాలే తప్ప, తమకున్న విచక్షణాధికారాలను దుర్వినియోగ పరిచి ఈ విధంగా ప్రాణాలు తీయడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర అన్నారు. -
కరెన్సీ నోటు మీద గాడ్సే చిత్రం
భోపాల్: ఓ వ్యక్తి కరెన్సీ నోటు మీద మహాత్మాగాంధీకి బదులు గాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సే ఫొటోను ఎడిట్ చేశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు వారం రోజుల తర్వాత కేసు నమోదు చేసిన ఘటన మధ్య ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)కి చెందిన శివమ్ శుక్లా మే 19న నాథూరాం గాడ్సే జయంతిని పురస్కరించుకుని సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. (వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..) 'నాథూరాం గాడ్సే వర్ధిల్లు గాక' అంటూ రూ.10 నోటుపై మహాత్ముడి చిత్రానికి బదులు నాథూరాం గాడ్సే ఉన్న చిత్రాన్ని ఫేస్బుక్లో షేర్ చేశాడు. "దేశాన్ని నాథూరాం రక్షించాడు" అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ(నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చేపట్టామని కొత్వాలీ సిధి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఎమ్ పటేల్ తెలిపారు. (ఈ రోజు నా గడువు తీరిందని లేఖలో ..) -
గాడ్సే దేశాన్ని రక్షించారంటూ పోస్ట్
భోపాల్: రూ. 10 కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మ స్థానంలో నాథూరామ్ గాడ్సే బొమ్మను క్లోన్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)తో సంబంధమున్న సిధి జిల్లాకు చెందిన శివమ్ శుక్లాగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను హీరోగా పేర్కొంటూ శుక్లా ఫేస్బుక్లో 'లాంగ్ లివ్ నాథురామ్ గాడ్సే' అంటూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. మే 19న గాడ్సే 111 వ జయంతిని పురస్కరించుకొని శివమ్ శుక్లా ఈ పోస్ట్ చేసినట్లు తెలిపారు. మరో పోస్ట్‌లో.. రఘుపతి రాఘవ రాజా రామ్, దేశ్ బచ్చా గే నాథూరాం' (నాథూరాం దేశాన్ని రక్షించారు) అని పేర్కొన్నారు. అదే పోస్ట్‌లో 'శుక్లా గాడ్సేను మహాత్మా' అని సంభోదించి.. 'పూజ్య పండిట్ నాథూరాం గాడ్సే అమర్ రహీన్' అంటూ పోస్ట్ చేశారు. ఇదే విషయంపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ (ఎన్ఎస్యూఐ) కాంగ్రెస్ విద్యార్థి విభాగం శుక్లాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు శుక్లాను గుర్తించడానికి సైబర్ నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఏబీవీపీ.. సంబంధం లేని విషయాల్లో తమ పేరును తప్పుగా వాడుతున్నట్లు కాంగ్రెస్‌పై ఫిర్యాదు చేసింది. కాగా నవంబర్ 15, 1949న 'ఫాదర్ ఆఫ్ ది నేషన్'ను హతమార్చినందుకు గాడ్సేను అంబాలా జైలులో ఉరితీసిన సంగతి తెలిందే. చదవండి: గాడ్సేపై నాగబాబు వివాదాస్పద ట్వీట్ -
నాగబాబు మరో సంచలన ట్వీట్: వైరల్
హైదరాబాద్ : మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు కొణిదెల సోషల్ మీడియాలో రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవలె జాతిపిత మహాత్మ గాంధీజీని హత్యచేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ వివాదస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. నాగబాబు వ్యాఖ్యలపై గాంధేయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భగ్గుమన్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తాజాగా ఈ మెగా బ్రదర్ చేసిన మరో ట్వీట్ వివాదస్పదమవుతోంది. ‘భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్బావానికి కృషి చేసి మహానుభావులను జనం మర్చిపోకూడదని ఒక ఆశ’ అంటూ ట్వీట్ చేశారు. ‘గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసి దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అంటూ మరో ట్వీట్లో నాగబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెంటు ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నాగబాబు వ్యాఖ్యలపై కొందరు మండిపడుతుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. చదవండి: గాడ్సే నిజమైన దేశభక్తుడు పార్టీకి, ఫ్యామిలీకి సంబంధం లేదు : నాగబాబు అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం -
నాగబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచారంటూ సినీ నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. నాగబాబుపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మానవతారాయ్ మాట్లాడుతూ.. నాగబాబుకు మతిభ్రమించిందని, ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలన్నారు. మానసిక స్థితి బాగాలేకపోవడంతోనే ట్విటర్లో గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడని కొనియాడారని విమర్శించారు. నాగబాబుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానవతారాయ్ డిమాండ్ చేశారు. కాగా, మంగళవారం గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే జన్మదినం సందర్భంగా నాగబాబు వివాదస్పద ట్వీట్ చేసిన విషయం తెలసిందే. ‘ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్. అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు అంతే). గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఓసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. చదవండి: గాడ్సే నిజమైన దేశ భక్తుడు: నాగబాబు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను: ఎన్టీఆర్ ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ..contd pic.twitter.com/WNIpG6gsVO — Naga Babu Konidela (@NagaBabuOffl) May 19, 2020 -
గాడ్సేపై నాగబాబు వివాదాస్పద ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేపై సినీనటుడు నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేశారు. నాథురాం గాడ్సే దేశభక్తిని శంకించలేమని, ఆయన నిజమైన దేశ భక్తుడని కొనియాడారు. మంగళవారం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ రోజు నాథురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది చర్చనీయాంశం. కానీ అతని వైపు వాదనలను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి మాత్రమే పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తాను అనుకున్నది చేశాడు. నాథురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తుచేసుకోవాలనిపించింది. పాపం నాథురాం గాడ్సే.. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.’ అని ట్విటర్లో అభిప్రాయపడ్డారు. (అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశా) గాడ్సేపై నాగబాబు చేసిన పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గాంధీని చంపిన వ్యక్తి దేశ భక్తుడు ఎలా అవుతాడు..? అంటూ కొంతమంది ప్రశ్నించగా.. అతను ముమ్మాటికీ హంతకుడేనని మరికొందరు ట్వీట్ చేశారు. ‘ఇంకా నయం డబ్బులు మీద గాంధీ బొమ్మ కాకుండా గాడ్సే బొమ్మ ఉండాలి అని చెప్పలేదు సంతోషం’ అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా స్పందించారు. -
మహాత్ముడు మహమ్మారిని జయించాడు
‘గాంధీ ప్రాణాలపై ఆయనకు కాదు, దేశానికి హక్కు ఉంది.. ఎందుకంటే ఆయన దేశం ఆస్తి’1918లో దేశం నలుమూలలా వినిపించిన మాట. అప్పటికి ఆయన ‘జాతిపిత’అనిపించుకోలేదు. ఆయన గురించి ఇంకా అంత గొప్ప ప్రచారం జరగలేదు. అయినా జనం ఇలా కోరుకున్నారు. ఆంగ్లేయులను తరిమే ఆశాకిరణంగా ఆయనను అప్పటికే భావించారు. వారి ఆవేదనకు అసలు కారణం.. దేశాన్ని శవాల దిబ్బగా మార్చిన స్పానిష్ ఫ్లూ బారిన ఆయన పడటమే. నీతులు చెప్పే ముందు ఆచరించి చూపే తత్వం ఉన్న గాంధీ, ఆరోగ్యమే మహాభాగ్యం సూత్రాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. మరి దాని ప్రభావమేనేమో.. ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ వైరస్‌ను జయించి ఆంగ్లేయుల పాలన అంతు చూసేందుకు అడుగు ముందుకేశారు.. సాక్షి, హైదరాబాద్: ఆంగ్లేయులను ఓడించటానికి ముందే మహాత్మా గాంధీ మహమ్మారిని జయించారు. రక్తం చిందించకుండా శాంతి మంత్రాన్నే ఆయుధంగా చేసుకుని ఆంగ్లేయులను జయిస్తే.. ఆరోగ్య సూత్రాలను నిరంతరం పాటించే అలవాటున్న ఆయన ప్రాణాంతక స్పానిష్ ఫ్లూ మహమ్మారిపై విజయం సాధించారు. నాడు మహాత్ముడు చెప్పిన ఆరోగ్య సూత్రాలను ప్రజలు పాటించి ఉంటే ఇప్పుడు కరోనా విషయంలో మన దేశం ఇంతగా భయపడి ఉండేది కాదేమో.. కనీసం ఇప్పటికైనా జాతిపిత ఆరోగ్య సందేశాన్ని మననం చేసుకుని ఆచరించే మనసుపెడితే భవిష్యత్తులో మహమ్మారుల వ్యాక్సిన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా మన ఇమ్యూనిటీతోనే తరిమికొట్టొచ్చు..!!! దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చి సరిగ్గా నాలుగేళ్లయింది.. 48 ఏళ్ల మహాత్మాగాంధీ సబ ర్మతి ఆశ్రమంలో నిరంతరం దీర్ఘాలోచనతో ఉంటున్నారు. అప్పుడు దేశంలోని చాలా ప్రాంతాలు కరువుకోరల్లో చిక్కుకున్నాయి. కాలం కలసిరాక అన్నదాత చెమట చుక్క బీళ్లు తేలి న భూముల్లో ఆవిరైంది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం పన్నుల కోసం వేధిస్తోంది. ‘కరువు తీవ్రం గా ఉన్న సమయంలో పన్ను లు చెల్లించం’నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్నదే గాంధీ దీర్ఘాలోచనకు కారణం. అందుకు ఆయన సత్యాగ్రహాన్ని నమ్ముకున్నారు. ఆ సత్యాగ్రహం ఎలా ఉండాల న్న విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో కలసి సమాలోచనలు చేస్తూ దానికి తుది రూపం ఇస్తున్నారు. కానీ కరువును మించిన ప్రమాదకారి అప్పటికే దేశంలోకి చొరబడిందన్న సంగతి మహాత్ముడికి తెలియదు. అదే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మందికిపైగా పొట్టనపెట్టుకున్న స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా. ఆ ప్రమాదకర వైరస్ తొలి దాడి సాధారణంగా ఉన్నా, రెండో విడత విరుచుకుపడింది. చూస్తుండగానే దేశం అల్లకల్లోలమైంది. కోటిన్నర మంది (కచ్చితమైన అంచనా లేదు) మన దేశంలో దానికి బలయ్యారు. అంతటి ప్రమాదకర వైరస్ దాడి ప్రారంభమైన సమయం. సబర్మతి ఆశ్రమంలో తన అనుచరులతో కలసి ఉన్న మహాత్ముడిని కూడా అది వదల్లేదు. తీవ్ర జ్వరం, అలసట, నీరసం, ప్రాణం ఉంటుందో లేదోనన్న బాధ.. స్పానిష్ ఫ్లూ ఆవహించిందని మహాత్ముడు సులభంగానే గ్రహించారు. సత్యాగ్రహాన్ని విజయవంతంగా జనంలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యం.. దాన్ని సాధించాలంటే ముందుగా వైరస్ చెర నుంచి విడిపించుకోవాలి. వెరసి బాపూ ముందు రెండు టార్గెట్లు.. ఆరోగ్య సూత్రాలే కాపాడి ఉంటాయి.. ప్రపంచం మొత్తాన్ని కబళించాలన్న కసితో పంజా విసిరిందా అన్నట్టు నాటి స్పానిష్ వైరస్ ఉగ్రరూపాన్ని చూసి మానవజాతే వణికిపోయిం ది. అంతటి భయంకరమైన వైరస్ బారిన పడ్డ వృద్ధుల్లో చాలామంది చనిపోయా రు. అలా అని మధ్య వయస్కులంతా బయటపడలేకపోయారు. కానీ శరీరం లో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉన్నవారిలో చాలామంది వైరస్ సోకినా కూడా ప్రాణా లు దక్కించుకోగలిగారు. 48 ఏళ్ల వయసు కావటం వల్లనేమో గాంధీ కూడా దాన్ని తరిమేయగలిగారు. అయితే, అది అంత సులువుగా జరిగింది కాదు. గాంధీ జీవితంలో ఎక్కువ రోజు లు అనారోగ్యంతో గడిపిన సందర్భం అదేనట. కొన్ని నెలల పాటు ఆయన అనారోగ్యంతో పోరాడి గెలిచా రు. క్రమశిక్షణకు మారుపేరైన కరంచంద్ గాంధీ.. ఆరోగ్యం విషయంలోనూ అలాగే ఉండేవారు. ముఖ్యంగా ఆయన భోజన అలవాట్లు చాలా ఆరోగ్యకరం గా ఉండేవి. రాత్రి తొందరగా పడుకోవటం, ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర లేవడం, ధ్యానం, యోగా, వేళకు భోజనం, అదీ మితంగా, అందులోనూ సాత్వికాహారం.. వెరసి ఆయన శరీరం తన చేతుల్లో ఉండేది. కఠోర కాలాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించదగ్గ మానసిక స్థితి గాంధీని కాపాడిందని చరిత్రకా రులు చెబుతారు. ‘వందేళ్ల నాడు దాదాపు భారతీయులందరూ ఈ వైరస్ బారినపడ్డవారే.. కొందరిలో దాని తీవ్రత ఎక్కువ, కొందరిలో తక్కువ. చాలామందికి అసలు వైరస్ సోకిందన్న సంగతే తెలియదు. రోగ నిరోధక శక్తి ఉన్నవారు మామూలు జలుబు జ్వరంగానే భావించి దాని నుంచి బయటపడ్డారు. గాంధీ శరీరంలోకి చేరిన వైరస్ తీవ్రత గురించి తెలియదు. కానీ, క్రమశిక్షణతో కూడిన జీవనం, ఆహార అలవాట్లున్న వారు కాస్త తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వైరస్ నుంచి తేరుకోగలరు. గాంధీ అలా బయటపడి ఉండొచ్చు’ అని చరిత్రకారుడు డాక్టర్ రాజారెడ్డి వ్యాఖ్యానించారు. ఆ సమయమే పోరాటపటిమను పెంచింది.. దేశం నుంచి ఆంగ్లేయులను తరిమికొట్టాలన్న కసితో ఉన్న గాంధీకి ఆ వైరస్ సోకిన సమయం గొప్ప పోరా ట పటిమను పెంచిందంటారు. దేశంలో కోటిన్నర మంది చనిపోయేంత అతి తీవ్ర పరిస్థితులు నెలకొన్నా బ్రిటిష్ పాలకులు సరిగా వ్యవహరించకపోవటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. వారిని తరిమికొట్టే వరకు పోరు ఆపొద్దని గట్టిగా సంకల్పించుకున్నారు. ‘ఆరోగ్య’ నినాదానికి పదునప్పుడే.. స్వాతంత్య్రోద్యమంలో ప్రజలను సమాయత్తం చేసేందుకు దేశం నలుమూలలా తిరిగిన గాంధీ, వారిలో ఉత్తేజం నింపే ఉద్యమ మాటలే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడుకునే గొప్ప నినాదాన్నీ వారికి నూరిపోశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని ఊరూరుకు తీసుకెళ్లగలిగారు. ఇందుకు నాటి వైరస్ రోజుల్లో అనుభవించిన కష్టాలే కారణం. అప్పటికే ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చే గాంధీ, స్పాని ష్ ఫ్లూ లాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉండాలని పిలుపిచ్చారు. మహాత్ముడు.. మేక పాలు: ఆవు, గేదె పాలు తాగొ ద్దని నిర్ణయించుకుని చివరకు మేక పాలు తాగటాన్ని అలవాటు చేసుకున్న గాంధీ.. ఆ నిర్ణయాన్ని కడవరకూ ఎలా అమలు చేశారో ఆయన చరిత్రలో కథలు కథలుగా చెప్పుకొంటారు. మేకలు అన్ని చోట్లా ఉన్నా, వాటి పాలు అందుబాటులో ఉండవు. వాటిని తాగే వారి సంఖ్య అతి తక్కువగా ఉండటమే కారణం. గాంధీ వేరే ప్రాంతానికి వెళ్తే మేక పాలు దొరికేవి కావు. ఒకసారి ఆవు, గేదె పాలు తాగొద్దని నిర్ణయించుకున్నాక వాటిని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకపోవటం ఆయన నియమం. అందుకోసం ఆయన ఎక్కడికెళ్లినా వెంట మేకను తీసుకెళ్లే వారు, విదేశాలకు వెళ్లినా ఆయన వెంట రెండు మేకలు కూడా ఉండేవి. ఆ మాటలు ఆచరించి ఉంటే కరోనా కష్టాల తీవ్రత తగ్గేది ఆరోగ్యం విషయంలో మహాత్ముడు చెప్పిన అంశాలను నాటి జనం విన్నా, నేటి తరం పెడచెవిన పెడుతోంది. ఆరోగ్యం బాగుంటేనే ఉద్యమం చేయగలుగుతామని నాటి స్వాతంత్య్ర సమర సమయంలో గాంధీ తేల్చుకున్నారు. వైరస్ దెబ్బకు దేశం మొత్తం కుదేలవటాన్ని కళ్లారా చూసిన ఆయన, తొలుత ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితేనే బ్రిటిష్ వారిని తరమగలరని భావించారు. అందుకే తన ఉద్యమ ఉపన్యాసంలో ‘ఆరోగ్య మంత్రాన్నీ’చేర్చారు. తాను ఆచరించి చూపితేనే ప్రజలు అమలు చేస్తారని భావించి వారికి అదర్శంగా నిలిచారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ మాటను ఆయన నిజం చేసుకున్నారు ‘గాంధీలోని గొప్ప లక్షణం ఏంటంటే తను నమ్మిన సిద్ధాంతాన్ని ముందుగా తను ఆచరించే జనాన్ని అనుసరిం చాలని కోరేవారు. ఆరోగ్యం విషయంలోనూ అంతే. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంద ని బలంగా నమ్మిన ఆయన, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ జనానికి చేసిన హిత బోధ మామూలుది కాదు. ఈ విషయంలో ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆరోగ్య సూత్రాలు పాటించే తత్వం అయినందునే ఆయన అత్యంత ప్రమాదకరంగా చరిత్రలో నిలిచిపోయిన స్పానిష్ ఫ్లూ నుంచి బయటపడ్డారని భావిస్తాను. నేను పాఠశాల విద్యార్థిగా ఉండగా, ఆయన ఫ్లూ బారిన పడి మళ్లీ పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎదిగిన తీరుపై మాట్లాడుకోవడం విన్నాను...’ – చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త -
వినూత్న వేషం.. 150 కిమీ నడక
భువనేశ్వర్ : ప్రపంచాన్ని కరోనా కాటేస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటికి తోడు మహమ్మారి దరిచేరకుండా ఉండేందుకు మాస్కులు, శానిటైజర్ల వాడకం కూడా అంతే ముఖ్యం. అయితే కొంత మంది వీటిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని విధాలుగా చెప్పినా నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఈక్రమంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి.. కరోనా ముందు జాగ్రత్తలను వివరిస్తున్నాడు. ఇందుకు వినూత్న వేషం ధరించి మాస్కులు, శానిటైజర్లను ప్రజలకు అందజేస్తున్నాడు. (కరోనా.. కొడుకు గురించి విజయ్ ఆందోళన! ) అతని పేరు సాయిరామ్. అచ్చం మహాత్మా గాంధీలా.. సిల్వర్ రంగు పెయింట్ వేసుకుని భువనేశ్వర్‌లోని మురికి వాడల్లో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నాడు. దీనికి తోడు గత వారం రోజులుగా చేతిలో జాతీయ జెండా పట్టుకుని కాలినడకన నడుస్తూ, ప్రతి ఇంటింటికి వెళ్లి కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇలా ఇప్పటి వరకు 150 కిలోమీటర్ల మేర నడిచాడు. (లాక్డౌన్.. విమాన, రైల్వే సర్వీసులపై క్లారిటీ) ఈ విషయంపై సాయిరామ్ మాట్లాడుతూ.. ‘ప్రజలు నన్ను సిల్వర్ గాంధీ అని పిలుస్తారు. కరోనా గురించి అవగాహన కల్పించడానికి కాలినడకన నడవడం ప్రారంభించాను. ఈ ప్రయాణం కోసం నా దగ్గర ఉన్న డబ్బులతో కొన్ని మాస్కులు, శానిటైజర్లను కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. ప్రస్తుతం మురికివాడ ప్రాంతాలకు వెళ్లి కూడా కరోనా వైరస్‌ను అరికట్టడానికి, కరోనాకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో విజయం సాధించాలని వివరిస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’. అంటూ సాయి రామ్ తన ఆలోచన వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని వెల్లడించాడు. (లాక్డౌన్: ఒడిశా కీలక నిర్ణయం)