తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అట్లాంటాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్‌ఏ (ఎఊ్ఖ అ) ఆహ్వానం మేరకు అట్లాంటా వెళ్లిన ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్‌లోని గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ హాల్, గాంధీ రూమ్, కింగ్ రూమ్, ఎటర్నల్ ఫ్లేమ్, ప్రసిద్ధ ఎబినేజర్ బాప్టిస్ట్ చర్చి, కింగ్స్ బర్త్ హోమ్, విజిటర్స్ సెంటర్, కింగ్ క్రిప్ట్‌లను సందర్శించారు.
అట్లాంటాలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు సాకారం చేసినందుకు ఇండియన్ ఎంబసీ, ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, వివిధ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌తో పాటు నేషనల్ పార్క్ సర్వీస్‌కు శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ స్మారక చిహ్నం ఏటా కింగ్ పార్క్‌ను సందర్శించే లక్షలాది మంది పర్యాటకులకు అహింస, శాంతి కోసం పోరాడాలనే విషయం గుర్తుకుతెస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, జీఎఫ్‌యూఎస్‌ఏ మీడియా డైరెక్టర్ రవి పోణంగి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోనీ థాలియాత్, ఛైర్మన్ సుభాష్ రజ్దాన్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోని గాంధీ ఫౌండేషన్‌ను 1997 అక్టోబర్ 26న స్థాపించారు.
Comments
Please login to add a commentAdd a comment