న్యూయార్క్: తెలంగాణ విద్యార్థి హత్య కేసులో అమెరికాలోని ఇండియానా కోర్టు కీలక తీర్చు వెల్లడించింది. అమెరికా దేశస్థుడైన 25 ఏళ్ల నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్‌కు 60 సంవత్సరాల శిక్ష విధించింది. 2023 అక్టోబర్‌లో తెలంగాణకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి వరుణ్ రాజ్ పుచ్చా జిమ్‌లో హత్యకు గురయ్యాడు. కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు.
తాజాగా కోర్టు తీర్పుతో ఇండియానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్‌లో నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్ శిక్షను అనుభవించనున్నాడు. అయితే ఈ హత్య కేసులో నిందితుడికి సాంప్రదాయ జైలు శిక్షవిధిస్తారా లేదా మానసిక ఆరోగ్య సదుపాయంతో కూడిన శిక్షను విధిస్తారా అనేదానిపై స్పష్టత లేదు.
ఈ తెలంగాన విద్యార్థి హత్య సంఘటన గత ఏడాది అక్టోబర్ 29న వాల్పరైసోలోని ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో జరిగింది. హత్యకు గురైన వరుణ్ రాజ్ పుచ్చా.. మసాజ్ చైర్‌లో కూర్చున్నప్పుడు ఆండ్రేడ్ కత్తితో దాడి చేశాడు.తీవ్రంగా గాయడిని వరుణ్.. ఫోర్ట్ వేన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
వరుణ్ వాల్పరైసో యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని చదువుతున్నాడు. రెండు నెలల్లో డిగ్రీ పూర్తి పూర్తీ చేసుకోనున్న సమయంలో హత్యకు గురయ్యాడు. వరుణ్‌ది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. ఆయన తండ్రి పి.రామ్ మూర్తి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.
Telangana Student Stabbed to Death in Indiana: 60-Year Sentence for Accused
Jordan Andrade, a 25-year-old from Porter Township, was sentenced to 60 years in the Indiana Department of Correction for the brutal stabbing of Varun Raj Pucha, a graduate student from Telangana, India.… pic.twitter.com/N4nIE3l7Nw— Sudhakar Udumula (@sudhakarudumula) October 13, 2024
Comments
Please login to add a commentAdd a comment