jail sentence
-
ఖైదీలపై ఇంత వివక్షా!
జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు శిక్షనుంచి మినహాయింపు (రెమిషన్) ఇవ్వడానికి సంబంధించిన విధానం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతనీ, ఖైదీలు అడగటం లేదు గనుక ఆ మినహాయింపుపై ఆలోచించాల్సిన అవసరం లేదని భావించటం సరికాదనీ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పు కీలకమైనది. ఒక చట్టం రూపొందటం వెనక ఎంతో కృషి ఉంటుంది. దాని అవసరాన్ని గుర్తించటం తొలి మెట్టయితే ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. తొలుత చట్టం పూర్వరూపమైన బిల్లు ముసాయిదా రూపురేఖలపైనా, ఆ తర్వాత దాన్లో ఉండాల్సిన నిబంధనలపైనా, పరిహరించవలసినవాటిపైనా లోతైన చర్చలుంటాయి. చట్ట సభలోనూ, పౌర సమాజంలోనూ దాని మంచిచెడ్డలపై నిశిత పరిశీలన ఉంటుంది. తీరా చట్టం అయ్యాక ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కృషి మొత్తం వృథా అవుతుంది. కొన్ని ప్రభుత్వాల ధోరణి మరీ అన్యాయం. ఖైదీల శిక్ష మినహాయింపుపై వాటికంటూ విధానమే ఉండదు. ఆ బాపతు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది. ఇంతవరకూ శిక్ష మినహాయింపుపై విధానం లేని రాష్ట్రాలు రెండు నెలల్లో ఆ పని చేయాలనీ, అది వాటి బాధ్యతనీ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఖైదీలు అడగలేదన్న సాకు చెల్లదన్నది తీర్పు సారాంశం.నిన్న మొన్నటివరకూ నూటయాభైయ్యేళ్ల నాటి నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) ఉండేది. దానిస్థానంలో నిరుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అమల్లోకొచ్చింది. సీఆర్పీసీ లోని చాలా నిబంధనలు బీఎన్ఎస్ఎస్లోకి కూడా వచ్చాయి. కాకపోతే ఆ సెక్షన్ల క్రమసంఖ్యలు మారాయి. ఖైదీలకు శిక్షాకాలం నుంచి మినహాయింపునిచ్చేందుకు, ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచేందుకూ ప్రభుత్వానికి సీఆర్పీసీలోని సెక్షన్ 432 అధికారం ఇవ్వగా... బీఎన్ఎస్ఎస్లోని 473వ సెక్షన్ ఆ పని చేస్తోంది. చట్టం ఇంత స్పష్టంగావున్నా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ సెక్షన్లకు అనుగుణంగా విధాన రూపకల్పన చేసిన ప్రభుత్వాలూ, అసలు దాని జోలికేపోని ప్రభుత్వాలూ కూడా శిక్ష మినహాయింపు ఇవ్వొచ్చన్న సంగతే తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి.జైళ్లంటే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. అక్కడ నిర్బంధంలో ఉన్నవారంతా ఏదో తప్పు చేసేవుంటారన్న భావనలోనే చాలామంది ఉంటారు. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్నవారిలో కూడా చాలామందికి జరిగిన నేరంతో నిజంగా ప్రమేయం లేకపోవచ్చు. సకాలంలో తగిన న్యాయసహాయం అందకపోవటం వల్ల కావొచ్చు... ఆర్థిక స్థోమత లేకపోవటంవల్ల కావొచ్చు వారు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉండొచ్చు. పలుకుబడి ఉన్నవారు తమ నేరాన్ని వేరేవారిపైకి నెట్టి వారు జైలుకు పోయేలా చేసిన సందర్భాలూ అప్పుడప్పుడు బయట పడు తుంటాయి. ఒకవేళ నిజంగా నేరంతో ప్రమేయం ఉన్న వ్యక్తికి సైతం అతడి హక్కులన్నీ హరించుకు పోవు. శిక్ష కారణంగా కొన్ని హక్కులు తాత్కాలికంగా నిలిచిపోతాయి. శిక్ష మినహాయింపు అర్హత పొందిన ఖైదీలకు ఆ వెసులుబాటును కల్పించకపోవటం అంటే ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించటమే, ఏకపక్షంగా వ్యవహరించటమే అవుతుంది. చట్టం ముందు పౌరులందరూ సమానులేనని, ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించరాదని ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించే రాజ్యాంగంలోని 14వ అధికరణ స్పష్టం చేస్తోంది. శిక్షలో మినహాయింపునకు అర్హత పొందినవారికి దాన్ని నిరాకరించటం అంటే ఈ అధికరణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. శిక్షకాలంలో మినహాయింపునివ్వటం కూడా విచక్షణా రహితంగా ఉండకూడదు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నేర స్వభావంలో మార్పు వచ్చిందో లేదో గమ నించటం, సమాజంలో సాధారణ మనిషిగా జీవించ గలుగుతాడా అని చూడటం జైలు అధికారుల బాధ్యత.వారినుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన నిర్ణయానికి రావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికుంటుంది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశాన్ని గుర్తుచేసింది. శిక్ష మినహాయింపునకు రూపొందించే నిబంధనలు ఖైదీలు వినియోగించుకోవటం అసాధ్యమైన రీతిలో కఠినంగా ఉండరాదని... అవి అస్పష్టంగా కూడా ఉండకూడదని సూచించింది. ఒకవేళ మినహా యింపునకు అర్హత లేనట్టయితే అందుకు గల కారణాలేమిటో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జైలు అధికారులు వివరించాల్సి వుంటుంది. అదే సమయంలో తన అనర్హతకు చూపిన కారణాలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఖైదీకి చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. ఒకవేళ బయటి కెళ్లాక ఖైదీ ప్రవర్తన సమాజానికి హాని కలిగే రీతిలో ఉన్నదని భావిస్తే శిక్ష మినహాయింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుంటుంది. అందుకుగల కారణాలను ఆ ఖైదీకి వివరించాలి.చట్టాలు చేయగానే సరికాదు. వాటిని వినియోగించటానికి అవసరమైన విధానాలను కూడా రూపొందించాలి. చిత్తశుద్ధితో వాటిని అనుసరించాలి. ఆచరణకు అనువైన విధానం లేనట్టయితే చట్టాల ఉద్దేశమే నీరుగారుతుంది. 2022 నాటి నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని 1,300కు పైగా జైళ్లలో 5,73,200 మంది ఖైదీలున్నారు. ఈ జైళ్లలో వాస్తవానికి 4,36,266 మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. జైళ్లు ఇలా కిక్కిరిసి ఉండటంవల్ల అవి సకల రుగ్మతలకూ నిలయాలవుతున్నాయి. నిస్సహాయుల పాలిట నరకాలవుతున్నాయి. చాలీచాలని సిబ్బందితో పర్యవేక్షణ అసాధ్యమై నిజంగా నేరం చేసినవారిని సంస్కరించటం మాట అటుంచి, అకారణంగా జైలుపాలైనవారు సైతం నేరగాళ్లుగా మారే ప్రమాదం పొంచివుంటోంది. తాజా తీర్పు ప్రభుత్వాల మొద్దునిద్ర వదిలించాలి. -
పెద్దల మాదిరిగానే పదేళ్ల పిల్లలకూ జైలు శిక్షలు
క్వీన్స్‌ల్యాండ్: హత్య, తీవ్ర దాడి, దోపిడీల వంటి 13 నేరాలకు పాల్పడినట్లు రుజువైతే 10 ఏళ్ల బాలలకు సైతం పెద్దలకు మాదిరిగానే శిక్షలు వేసేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రం చట్టం చేసింది. హత్య నేరానికైతే కనీసం 20 ఏళ్లు ఎటువంటి పెరోల్ లేకుండా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముంది. గతంలో ఇది గరిష్టంగా పదేళ్లే ఉండేది. క్వీన్స్‌ల్యాండ్‌లో గత 14 ఏళ్లలో పిల్లల నేరాలు సగానికి సగం తగ్గినట్లు గణాంకాలు చెబుతు న్నాయి. 2022 నుంచి నేరాల రేటు స్థిరంగా కొనసా గుతోంది. అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్వీన్స్‌ల్యాండ్ జైళ్లలోనే ఎక్కువ మంది పిల్లలుండటం గమనార్హం. పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతుండటంపై ప్రజాగ్రహం వ్యక్తమవు తున్నందు వల్లే చట్టాలను కఠినతరం చేశామని, దీనివల్ల నేరాలు తగ్గుతాయని ఆశిస్తు న్నామని ప్రభుత్వం అంటోంది. అయితే, నేరాలు తగ్గడం అంటుంచి పెరిగే ప్రమాదముందని నిపుణు లు ఆందోళన చెందుతున్నారు. ఇది చిన్నారుల మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలకు భంగకరమని ఐరాస పేర్కొంది. -
39 మందికి బైడెన్ క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో బైడెన్ క్షమాభిక్ష, శిక్షాకాలం తగ్గింపుల జోరు పెంచారు. అమెరికా చరిత్రలో ఎన్నడూలేనంతగా ఒకేసారి ఒకేరోజు 1,500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. మాదకద్రవ్యాల వినియోగం, స్వలింగ సంపర్కులు తదితర నేరాలుచేసిన వాళ్లు వీరిలో ఉన్నారు. హింసాత్మకంకాని నేరాల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న మరో 39 మంది ఖైదీలకు బైడెన్ ఏకంగా క్షమాభిక్ష ప్రసాదించారు. ఆధునిక అమెరికాలో ఒక అధ్యక్షుడు ఒకే రోజులో ఇంతమంది ఖైదీల పట్ల దయ చూపడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోవిడ్ సంక్షోభకాలంలో కారాగారాల్లో కరోనా విజృంభించి ఎక్కువ మంది ఖైదీలు వైరస్‌బారిన పడి మృతిచెందడం కంటే విడిగా దూరం దూరంగా ఉంటే మంచిదని భావించి ఆనాడు చాలా మందిని బైడెన్ సర్కార్ విడిచిపెట్టింది. అలా స్వస్థలాలకు వెళ్లిన ఖైదీలను కొని నెలలపాటు గృహనిర్బంధంలో ఉంచింది. గురువారం వీళ్లంతా శిక్షాకాలం తగ్గింపు ఉపశమనం పొందారు. -
హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌కు కేసుల నుంచి భారీ ఉపశమనం లభిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు శిక్షను న్యాయస్థానం నిరవధికంగా వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు నవంబర్ నెలలోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో కేసుల విషయంలో విచారణ ఎదుర్కోకుండా ఆయనకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే హష్ మనీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షపై స్టే కోసం దరఖాస్తు చేయాలని న్యాయస్థానం సూచించింది. ట్రంప్‌కు ఇది భారీ విజయమని ఆయన తరఫు ప్రతినిధులు చెప్పారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఏకాంతంగా గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరువిప్పకుండా చేయడానికి రిపబ్లికన్ పార్టికి విరాళంగా అందిన సొమ్ము నుంచి డబ్బులు చెల్లించారని బయటపడింది. ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు రుజువైంది. అంతేకాదు స్టార్మీ డేనియల్స్కి చెల్లించిన డబ్బుల వివరాలను ట్రంప్ లెక్కల్లో చూపలేదు. -
హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు
హాంకాంగ్: పార్లమెంట్లో తమకు అనుకూలంగా వ్యవహరించే నేతల ఎంపిక కోసం అనధికారికంగా ప్రైమరీ ఎలక్షన్స్ చేపట్టి సమాంతర పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహణకు తెగించారంటూ 45 మంది ప్రజాస్వామ్య ఉద్యమకారులు, మాజీ చట్టసభసభ్యులకు హాంకాంగ్ హైకోర్టు కఠిన శిక్షలు విధించింది. వీరికి నాలుగేళ్ల నుంచి పదేళ్ల శిక్షలుపడ్డాయి. పార్లమెంట్లో మెజారిటీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని నిర్విర్యంచేయాలని కుట్ర పన్నారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే విపక్షసభ్యులుగా ఉంటూ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లను తిరస్కరిస్తూ వీటో చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని కోర్టు తీర్పులో ప్రస్తావించింది. 2020 జూలై 10, 11వ తేదీల్లో జరిగిన ఈ అనధికార ప్రైమరీ ఎన్నికల్లో 6,10,000 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆనాడు అధికార ఎన్నికలను ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా వేయడం తెల్సిందే. అయితే హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద జాతీయ భద్రతా కేసుగా పరిగణించబడిన ఈ కేసులో ఉద్యమకారులపై అన్యాయంగా శిక్షలు మోపారని ప్రపంచ దేశాలు ఖండించాయి. పరోక్షంగా చైనా ఏలుబడిలో ఉన్న హాంకాంగ్‌లో సమాంతర పాలనకు ప్రయత్నించారంటూ 2021 ఏడాదిలో 47 మంది ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. కఠిన జాతీయ భద్రతా చట్టం–2020 కింద కేసులు నమోదుచేసింది. ఈ చట్టం కింద దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశముంది. 47 మందిలో గత ఏడాది ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ ఉదంతంలో సూత్రధారిగా కోర్టు పేర్కొన్న బెన్నీ థాయ్‌కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షపడింది. మాజీ విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్, మాజీ చట్టసభ సభ్యులకూ వేర్వేరు శిక్షలు పడ్డాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయంపై తమకు కనీస అవగాహన కూడా లేదని కొందరు నిందితులు కోర్టులో చెప్పడంతో వారికి తక్కువ శిక్షలుపడ్డాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, మీడియాపై కఠిన ఆంక్షలు, ఎన్నికల్లో సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించడం వంటి పరిణామాల తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఆనాడు ఇలా అనధికార ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. బ్రిటిష్ వలసప్రాంతంగా అభివృద్ధిచెందిన హాంకాంగ్‌పై పాలనాపగ్గాలు 1997లో చైనాకు దఖలుపడ్డాక హాంకాంగ్‌లో నిరంకుశ చట్టాలను డ్రాగన్‌దేశం అమలుచేస్తోందని ప్రపంచదేశాలు తప్పుపట్టడం విదితమే. ‘‘హాంకాంగ్ ప్రాథమిక చట్టం ప్రకారం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై కక్షగట్టి ప్రభుత్వం కేసులు బనాయించి ఆగమేఘాల మీద తీర్పు వెలువరించి శిక్షించింది’’అని హాంకాంగ్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ్రస్టేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవహక్కుల పరిరక్షణా సంస్థలు తీర్పును తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే తీర్పును చైనా స్వాగతించింది. -
యూఎస్‌లో తెలంగాణ విద్యార్థి హత్య.. నిందితుడికి 60 ఏళ్ల జైలు శిక్ష
న్యూయార్క్: తెలంగాణ విద్యార్థి హత్య కేసులో అమెరికాలోని ఇండియానా కోర్టు కీలక తీర్చు వెల్లడించింది. అమెరికా దేశస్థుడైన 25 ఏళ్ల నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్‌కు 60 సంవత్సరాల శిక్ష విధించింది. 2023 అక్టోబర్‌లో తెలంగాణకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి వరుణ్ రాజ్ పుచ్చా జిమ్‌లో హత్యకు గురయ్యాడు. కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. తాజాగా కోర్టు తీర్పుతో ఇండియానా డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్లో నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్ శిక్షను అనుభవించనున్నాడు. అయితే ఈ హత్య కేసులో నిందితుడికి సాంప్రదాయ జైలు శిక్షవిధిస్తారా లేదా మానసిక ఆరోగ్య సదుపాయంతో కూడిన శిక్షను విధిస్తారా అనేదానిపై స్పష్టత లేదు.ఈ తెలంగాన విద్యార్థి హత్య సంఘటన గత ఏడాది అక్టోబర్ 29న వాల్పరైసోలోని ప్లానెట్ ఫిట్నెస్ జిమ్‌లో జరిగింది. హత్యకు గురైన వరుణ్ రాజ్ పుచ్చా.. మసాజ్ చైర్లో కూర్చున్నప్పుడు ఆండ్రేడ్ కత్తితో దాడి చేశాడు.తీవ్రంగా గాయడిని వరుణ్.. ఫోర్ట్ వేన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వరుణ్ వాల్పరైసో యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని చదువుతున్నాడు. రెండు నెలల్లో డిగ్రీ పూర్తి పూర్తీ చేసుకోనున్న సమయంలో హత్యకు గురయ్యాడు. వరుణ్‌ది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. ఆయన తండ్రి పి.రామ్ మూర్తి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.Telangana Student Stabbed to Death in Indiana: 60-Year Sentence for AccusedJordan Andrade, a 25-year-old from Porter Township, was sentenced to 60 years in the Indiana Department of Correction for the brutal stabbing of Varun Raj Pucha, a graduate student from Telangana, India.… pic.twitter.com/N4nIE3l7Nw— Sudhakar Udumula (@sudhakarudumula) October 13, 2024 -
జైలుకు ఈశ్వరన్
సింగపూర్: అవినీతి కేసులో దోషిగా రుజువైన సింగపూర్ మాజీ మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబు ‘అమరావతి పార్ట్నర్’ ఎస్.ఈశ్వరన్ (62) సోమవారం జైలుకు వెళ్లారు. మంత్రిగా ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్ల కాలంలో ఆయన 3.12 లక్షల డాలర్ల విలువైన అక్రమ కానుకలు స్వీకరించడం నిజమేనని కోర్టు తేల్చడం, ఏడాది జైలు శిక్ష విధిస్తూ గత గురువారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ఇప్పటికే నేరాన్ని అంగీకరించిన ఈశ్వరన్ కోర్టు తీర్పుపై అపీలుకు వెళ్లకుండా శిక్ష అనుభవించేందుకే మొగ్గు చూపారు. ‘‘నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. సింగపూర్వాసులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా’’ అంటూ సోమవారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అనంతరం శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లారు. ఏపీలో రాజధాని అమరావతి పేరిట 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన భూ దోపిడీలో ఈశ్వరన్ కూడా కీలక పాత్రధారి అన్నది తెలిసిందే. -
అమరావతి పార్టనర్.. ఈశ్వరన్‌కు జైలు శిక్ష
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట జరిగిన భూ దోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్వదేశంలో అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు తెగబడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం ‘కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (సీపీఐబీ) విచారణలో నిగ్గు తేలింది. ఈశ్వరన్ అవినీతికి పాల్పడినట్టు న్యాయ విచారణలో కూడా నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. జూనియర్ అధికారి నుంచి మంత్రిగా.. 2008లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీసర్‌గా ఉన్న ఈశ్వరన్ అనతి కాలంలో ఉన్నత స్థానానికి ఎగబాకారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్ నుంచి ఈశ్వరన్ భారీగా ముడుపులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేల్చింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ – సింగపూర్ పర్యాటక విభాగాల మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీ పోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గత ఏడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పదవికి రాజీనామా చేసిన ఈశ్వరన్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్ïÙట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించినట్లు ఒక అభియోగం నమోదైంది. బాబు భూ దోపిడీలో పార్టనర్ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం రాజధాని పేరిట యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఈశ్వరన్ ప్రధాన భూమిక పోషించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు, ఈశ్వరన్ ద్వయం కుట్రపూరితంగా తెరపైకి తెచ్చింది. ఒప్పందం సమయంలో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియంను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవీ పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2న కట్టబెట్టేశారు. దీనికి నాటి చంద్రబాబు కేబినెట్ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా హడావిడి చేసింది. స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులోనూ చంద్రబాబు గోల్మాల్ చేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటా కల్పించారు. రూ.306.4 కోట్లు మాత్రమే వెచ్చించే అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి ఏకంగా 58 శాతం వాటా కట్టబెట్టేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదట విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం వాటా దక్కనుండగా అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి మాత్రం 91.3 శాతం వాటా దక్కుతుందన్నది స్పష్టమైంది. ఆ కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్ సహకరించారు. తద్వారా స్టార్టప్ ఏరియాలో రూ.లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్ ఏరియాను ఆనుకుని ఉన్న 1,400 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బృందం బినామీ పేర్లతో కొల్లగొట్టింది. ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది. సింగపూర్‌లో చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్ హోటళ్లు, ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ ఈశ్వరన్ కీలక పాత్ర పోషించినట్లు అధికారిక, పారిశ్రామిక వర్గాలు చెబుతుండటం గమనార్హం. -
లైంగిక దాడి కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
విశాఖ లీగల్: చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది బుధవారం తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు రూ.40,000 జరిమానా చెల్లించాలని, ఆ మొత్తాన్ని బాలికకు ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిహారం కింద రూ.3.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ కృష్ణ అందించిన వివరాలు.. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి తోటగురువు దగ్గర బీఎన్ఆర్ నగర్లో నివాసముంటున్న గుండెల సాయికుమార్.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఆరిలోవ సెక్టార్–2 శివాజీనగర్‌లో తన ఇద్దరు మైనర్ కుమార్తెలతో తండ్రి నివాసముంటున్నాడు. గతేడాది ఏప్రిల్ 9న తన కుమార్తెలను టిఫిన్ తీసుకురమ్మని హోటల్‌కు తండ్రి పంపాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న సాయికుమార్.. ఓ బాలికను ఎత్తుకుని తన బండిపై నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి.సోమశేఖర్.. సాయికుమార్‌పై కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. -
మేధా పాట్కర్‌కు 5 నెలల జైలు
న్యూఢిల్లీ: సామాజిక వేత్త, నర్మదా బచావో ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం ఐదు నెలల సాధారణ కారాగార శిక్ష విధించింది. గుజరాత్‌లోని ఒక ఎన్జీవోకు సారథి, ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 23 ఏళ్ల క్రితం పాట్కర్‌పై వేసిన కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ గత నెల ఏడో తేదీన ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ తీర్పు చెప్పారు. అయితే శిక్ష ఖరారును రిజర్వ్‌చేసి సోమవారం తీర్పును వెలువరించారు. పరువునష్టం కింద సక్సేనాకు రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని పాట్కర్‌ను కోర్టు ఆదేశించింది. తీర్పును పాట్కర్ పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు అవకాశం కలి్పస్తూ నెలరోజులపాటు శిక్ష అమలును నిలిపివేస్తూ న్యాయమూర్తి రాఘవ్ శర్మ ఉత్తర్వులిచ్చారు. అయితే శిక్ష ప్రస్తుతానికి నిలుపుదల చేసిన నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని పాట్కర్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆనాడు సక్సేనాను పిరికిపంద అంటూ పాట్కర్ దూషించిన అంశం కోర్టులో రుజువుకావడంతో ఆమెను దోషిగా తేల్చారు. హవాలా లావాదేవీల్లో సక్సేనా హస్తముందంటూ పాట్కర్ చేసిన ఆరోపణల్లో నిజంలేదని, పాట్కర్ కారణంగా ఆయన పరువుకు నష్టం కలిగిందని కోర్టు అభిప్రాయపడిన విషయం విదితమే. 2000 సంవత్సరంలో అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ‘కౌన్సిల్ ఫర్ సివిల్ లిబరీ్టస్’ అనే స్వచ్ఛంద సంస్థకు వీకే సక్సేనా అధ్యక్షునిగా ఉండేవారు. తనకు, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమానికి వ్యతిరేకంగా సక్సేనా ప్రకటనలు ఇచ్చారని ఆయనపై పాట్కర్ తొలిసారిగా ఫిర్యాదుచేశారు. -
మరణశయ్యపై ఖలీదా జియా!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు సరైన వైద్య అందించకుండా ఆమెపై ప్రధాని షేక్ హసీనా పగ తీర్చుకుంటున్నారని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆరోపించింది. ఖలీదా ‘మరణశయ్య’పై ఉన్నారని, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ఆ పార్టీ సెక్రటరీ జేనరల్ ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ ఆదివారం తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న 78 ఏళ్ల ఖలీదా జియా శనివారం రాత్రి తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, వెంటనే అంబులెన్స్‌లో ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన ఖలీదా ఓ అవినీతి కేసులో జైలు పాలయ్యారు. అయితే జియా ఓల్డ్ ఢాకా సెంట్రల్ జైల్లోనే అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు సరైన వైద్యం అందలేదని అలంగీర్ ఆరోపించారు. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉండటానికి అనుమతించినప్పటికీ పూర్తి నిర్బంధంలో జైలులాంటి జీవితాన్నే అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖలీదాకు విదేశాల్లో చికిత్స అవసరమని మెడికల్ బోర్డు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందకుండా చంపేసి, రాజకీయంగా అడ్డు తొలగంచుకోవాలని ప్రధాని షేక్ హసీనా చూస్తున్నారని అలంగీర్ ఆరోపించారు. -
Hush money case: డొనాల్డ్ ట్రంప్ దోషి
న్యూయార్క్/వాషింగ్టన్: ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(77) అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనను దోషిగా తేలి్చంది. ట్రంప్‌పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని వెల్లడించింది. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ న్యాయమూర్తి అవినీతికి పాల్పడి తప్పుడు తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఇక్కడేం జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. అసలైన తీర్పును నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. తాను నిజాయతీపరుడినని, ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొన్నారు. అమెరికా కోసం, అమెరికా రాజ్యాంగం కోసం పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ పోరాటంలో అంతిమ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హష్ మనీ కేసులో దోషిగా తేలిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిబ్బరంగానే కనిపించారు. కోర్టులో నిశ్శబ్దంగా ఉండిపోయారు. తుది తీర్పు వచ్చేదాకా బెయిల్‌పై బయటే ఉంటారు. జూలై 11న శిక్ష ఖరారు కానుంది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. జూలై 15న మిల్వాకీలో రిపబ్లికన్ జాతీయ సదస్సులో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(81)తో డొనాల్డ్ ట్రంప్ తలపడతారు. కోర్టు తీర్పుపై బైడెన్–కమలా హారిస్ ప్రచార విభాగం ప్రతినిధి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ హర్షం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని న్యూయార్క్ కోర్టు తేల్చిచెప్పిందని అన్నారు ఏమిటీ కేసు? శృంగార తార స్టార్మీ డేనియల్‌తో ట్రంప్ సన్నిహితంగా గడిపినట్లు వార్తలొచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పితే తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్ అడ్డదారి ఎంచుకున్నారు. ఆమె నోరు మూయించేందుకు 1.30 లక్షల డాలర్లు తన లాయర్ ద్వారా చెల్లించారు. ఎన్నికల ప్రచారం కోసం పారీ్టకి అందిన విరాళాల నుంచే ఈ సొమ్మును స్టార్మీ డేనియల్‌కు చేరవేశారు. అక్రమ చెల్లింపులను కప్పిపుచ్చడానికి బిజినెస్ రికార్డులను తారుమారు చేశారు. ఈ వ్యవహారమంతా బహిర్గతం కావడంతో అమెరికాలో గగ్గోలు మొదలైంది. ట్రంప్‌పై విచారణ అధికారులు 34 అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో న్యూయార్క్ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. 22 మంది సాక్షులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల చట్టాన్ని ట్రంప్ ఉల్లంఘించారని, పోర్న్ స్టార్‌కు చెల్లించిన సొమ్మును కోర్టు ఖర్చుల కింద చూపించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపిన మాట నిజమేనని స్టార్మీ డేనియల్ కోర్టుకు ఇచి్చన వాంగ్మూలంలో అంగీకరించారు. గురువారం 12 మంది న్యాయమూర్తుల ప్యానెల్ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయొచ్చా? న్యూయార్క్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్ భవితవ్యంపై పడింది. కోర్టు ఆయనకు జైలు శిక్ష గానీ, జరిమానా గానీ విధిస్తే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? చట్టపరంగా అది సాధ్యమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకొనే నిబంధన ఏదీ లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ ఎల్.హసెన్ చెప్పారు. చట్టపరంగా ఇప్పుడు ట్రంప్ అభ్యరి్థత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అన్నారు.కారాగారమా? గృహ నిర్బంధమా? ⇒ ట్రంప్‌పై 34 అభియోగాలు రుజువయ్యాయి. ఒక్కో అభియోగానికి గరిష్టంగా నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష, 5 వేల డాలర్ల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ⇒ జైలు శిక్ష కాకుండా జరిమానా, ప్రొబేషన్/సామాజిక సేవను శిక్షగా విధించవచ్చు. ప్రొబేషన్ శిక్ష విధిస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట ట్రంప్ తరచుగా హాజరు కావాల్సి ఉంటుంది. కండీషనల్ డిశ్చార్జి అనే శిక్ష వేస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ⇒ గృహ నిర్బంధం విధించే అవకాశం సైతం లేకపోలేదు. అప్పుడు ట్రంప్ తన ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆయన చుట్టూ ఎల్రక్టానిక్ నిఘా పెడతారు. హౌజ్ అరెస్టు అయితే ట్రంప్ నాలుగు గోడల మధ్య నుంచే ఎన్నికల ప్రచారం చేయాలి. ⇒ ట్రంప్ జైలుకెళ్తారా? అంటే కచ్చితంగా చెప్పలేమని న్యాయ నిపుణులు అంటున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఆయనకు జైలుశిక్ష విధించకుండా కేవలం జరిమానాతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఇది హష్మనీ వ్యవహారం కాదు. ఇది బహిర్గతం చేయకూడదనే ఒక ఒప్పందం మాత్రమే. పూర్తిగా చట్టబద్ధంగానే జరిగింది. ఇలాంటివి అమెరికాలో సర్వసాధారణమే. ప్రత్యర్థులు నన్ను ఇలా ఇరికించారంటే వారు ఇక ఎవరినైనా ఇరికించగలరు. నాపై తప్పుడు కేసు పెట్టి, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగవు – డొనాల్డ్ ట్రంప్ -
కొడుక్కు తుపాకీ అందుబాటులో ఉంచారని... తల్లిదండ్రులకు 15 ఏళ్ల జైలు
వాషింగ్టన్: కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులకు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. స్కూల్లో తుపాకీతో కాల్పులు జరిపిన నలుగురు పిల్లలను బలి తీసుకోవడంతో పాటు ఏడుగురిని గాయపర్చిన బాలుడి తల్లిదండ్రులకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంట్లో బాలుడికి తుపాకీ అందుబాటులో ఉండేలా పెట్టడమే వారి నేరమని నిర్ధారించింది. 2021 నవంబర్ 30న మిషిగన్ రాష్ట్రంలోని ఆక్స్ఫర్డ్ హైసూ్కల్లో ఎథాన్ క్రంబ్లీ అనే పిల్లాడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తేలింది. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తుపాకీ అందుబాటులో ఉంచడం తల్లిదండ్రులు జేమ్స్, జెన్నిఫర్ తప్పేనని కోర్టు తేల్చింది. -
యువకుడికి 60 ఏళ్ల జైలు శిక్ష
జగిత్యాలరూరల్: చిన్నారులకు మాయ మాటలు చెప్పి.. అశ్లీల చిత్రాలు చూపించి వంచించిన ఓ యువకుడికి మూడు కేసుల్లో ఒక్కో కేసుకు 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా సెషన్స్ జడ్జి నీలిమ శనివారం సంచలన తీర్పునిచ్చారు. అలాగే బాధిత బాలికలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూరు గ్రామానికి చెందిన కొడిమ్యాల హరికృష్ణ అలియాస్ హరీశ్ (27) గ్రామంలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఆయన షాపునకు వచ్చే ముగ్గురు బాలికలకు సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకోమని ఇచ్చి వారి పక్కన కూర్చుని బూతు వీడియోలు, ఫొటోలు చూపిస్తూ వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు హరీశ్‌పై గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మూడు పోక్సో కేసులు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ ప్రకాశ్, సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి ఆధారాలు సేకరించి.. కోర్టుకు సమర్పించారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి ఒక్కో కేసులో 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అలాగే ఒక్కో బాలికకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. మూడు కేసుల్లో శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు మరో షాక్.. అవినీతి కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలనితీవ్రంగా ప్రయతిస్తున్న ఇమ్రాన్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హస్నత్ మంగళవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇమ్రాన్‌కు మరోషాక్ తగిలింది. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు బుధవారం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయన భార్య బుస్రా బీబీకి కూడా 14 ఏళ్ల శిక్షను విధించింది. అంతేగాక ఇద్దరూ పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు కూడా వేసింది. సుమారు రూ.1.5 బిలియన్లు జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖైదీగా ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులో ఈ కేసు విచారణ జరిగింది. కాగా గత ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులోనే ఉన్నారు. ఆయనపై వివిధ నేరాల కింద దాదాపు 100కుపైగా కేసులు నమోదైనట్లు సమాచారం. చదవండి: Imran Khan Jailed: ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు -
హిందూ కార్యకర్త పూజారికి బెయిల్
హుబ్బళ్లి: మూడు దశాబ్దాల క్రితం నాటి రామాలయ ఉద్యమ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారి శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్న క్రమంలో 2023 డిసెంబర్లో పూజారి కేసు బయటకు వచి్చంది. 1992లో రామాలయం ఉద్యమంలో పాలుపంచుకున్న అతడిపై అక్రమ మద్యం విక్రయం తదితర 16 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. రెండు పోలీస్ స్టేషన్లలో అతడిపై రౌడీషీట్ కూడా ఉంది. పోలీసులు తనను మార్కెట్‌కు వెళదామంటూ తీసుకొచి్చ, కటకటాల వెనుక పడేసినట్లు పూజారి ఆరోపించాడు. తనపై ఎటువంటి కేసులు లేవన్నాడు. బెయిల్‌పై తన విడుదలకు సహకరించిన హిందూ సంస్థలకు రుణపడి ఉంటానని అన్నాడు. రామాలయం కోసం పోరాడిన తను తిరిగి అయోధ్యకే వెళతానని చెప్పాడు. -
బాలికపై అత్యాచారం కేసు..
సోన్‌భద్ర: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులార్ గోండ్‌కు ప్రత్యేక న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, మరో రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో, శాసనసభ సభ్యత్వానికి ఆయన అర్హత కోల్పోనున్నారు. తొమ్మిదేళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఈ నెల 12న కోర్టు విచారణ ముగిసింది. సోన్‌భద్ర అడిషనల్ జడ్జి, ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సెషన్ జడ్జి అహ్సానుల్లా ఖాన్ తాజాగా తీర్పు వెలువరించారు. జరిమానా మొత్తాన్ని బాధితురాలి కుటుంబ సంక్షేమం కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2014లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆ సమయంలో రామ్‌దులార్ గోండ్ భార్య గ్రామ సర్పంచిగా ఉన్నారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు మియోర్పూర్ పోలీస్ స్టేషన్లో గోండ్‌పై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. మొదట్లో పోక్సో ప్రత్యేక కోర్టులో కేసు విచారణ సాగింది. బీజేపీ తరఫున గోండ్ దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యాక ఈ కేసు ఎంపీ/ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయ్యింది. -
కడప పూర్వ మునిసిపల్ కమిషనర్ లవన్నకు జైలు శిక్ష, జరిమానా
సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్ : కోర్టు ధిక్కార కేసులో వైఎస్సార్ కడప జిల్లా పూర్వ మునిసిపల్ కమిషనర్, ప్రస్తుత శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్.లవన్నకు హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు తీర్పు అమలును మూడు వారాల పాటు నిలుపుదల చేస్తున్నట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. మునిసిపల్ అధికారులు తన షాపులను, ఇంటిలోని పైభాగాన్ని కూల్చేస్తున్నారంటూ కడప జిల్లా, హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పి.పద్మావతిబాయి హైకోర్టులో 2020లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే అధికారులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారంటూ పద్మావతి హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అప్పటి మునిసిపల్ కమిషనర్ లవన్నను ప్రతివాదిగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి శుక్రవారం తీర్పు వెలువరిస్తూ లవన్న కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని తేల్చారు. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకున్నా.. రాజ్యాంగ హక్కు అని తెలిపారు. కౌంటర్లో లవన్న తాను చేసిన పనికి క్షమాపణ కోరలేదని న్యాయమూర్తి ఆక్షేపించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ద్వారా సమాజంలో కోర్టు ప్రతిష్టను దిగజార్చారంటూ పైవిధంగా తీర్పు చెప్పారు. -
బాబుపై ఉన్నవి తీవ్ర ఆరోపణలు.. పదేళ్ల జైలు ఖాయం!
ప్రజాధనాన్ని కాజేసి పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఖాయమని, ఈ కేసు నుంచి ఆయన బయటపడడం అసాధ్యమని ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు బీఎస్ రాంబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడినందుకు చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికిసంబంధించి ఐటీ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సాంకేతికంగా మాత్రమే నేరం రుజువు కావాల్సి ఉందని వివరించారు. ‘ఈ కేసును రాజకీయ కక్ష సాధింపు కోణంలో చూడలేం. ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎంతో తీవ్రమైన ఆరోపణలు. అందుకు వారి వద్ద ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి. ఇందులో భారీ అవినీతి దాగి ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఏదైనా పదవిని పొందేందుకు సైతం చంద్రబాబు అనర్హుడు అవుతారు. ఈ కేసులో వెయ్యి శాతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేపట్టడం తప్పదు’ అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రచర్చ జరుగు తున్న చంద్రబాబు అవినీతి వ్యవహారాలు, ఐటీ నోటీసుల్లో ప్రధానాంశాలు, సాంకేతిక విషయాలపై మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన విశ్లేషించారు. మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో కీలక అంశాలేమిటి? ఇది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం. చంద్రబాబు నాయుడు రూ.118 కోట్ల ఆదాయాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టారన్న ఆరోపణ ఉంది. ఈ నేరానికి చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఆయన ఎలాంటి పదవులు పొందకుండా అనర్హుడు అవుతారని చట్టం చెబుతుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల స్టేట్మెంట్లు ఉన్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పక్కాగా ఉంది. సాంకేతికంగా మాత్రమే నేరం నిరూపణ కావాల్సి ఉంది. ఇప్పటికే ఐటీ శాఖ దగ్గర ఉన్న ఆధారాలను చూస్తే ఈ కేసులో ఆయనకు శిక్ష తప్పదని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన ఉల్లంఘనలు ఏమిటి? ఐటీ అధికారులు నోటీసుల్లో ఏ అంశాలు పేర్కొన్నారు? ఈ కేసును మూడు రకాల ఉల్లంఘనలుగా చూడవచ్చు. ఈ మూడు కూడా తీవ్రమైన నేరాలే. ఆదాయాన్ని దాచిపెట్టి ఇన్‌కమ్‌ట్యాక్స్ చట్టాన్ని మొదట ఉల్లంఘించారు. రెండోది.. ఈ డబ్బును విదేశాలకు పంపడం. అక్కడి నుంచి ఆ సొమ్ము విరాళాల రూపంలో మళ్లీ చంద్రబాబు ఖాతాలో, టీడీపీ ఖాతాలోకో వచ్చింది. అంటే మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అయింది. ఇక ప్రజా ప్రతినిధిగా ఉంటూ తన ప్రతిజ్ఞకు భిన్నంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి యాంటీ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు శిక్షార్హుడు అవుతారు. దీన్ని క్విడ్ ప్రోకోగా చూడవచ్చు. ఈ కేసులో ఇప్పటివరకు ఐటీ అధికారులు రూ.118 కోట్ల అక్రమాలను నిగ్గు తేల్చారు. దర్యాప్తులో ఇంకా కొత్త కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా..? ఇది రూ.118 కోట్లతో ఆగేది కాదు. తవ్వి తీస్తే ఇంకా చాలా కుంభకోణాలు బయటికి వస్తాయి. ఇందులో ఐటీ చట్టాలతోపాటు మనీ లాండరింగ్ జరిగింది. ప్రభుత్వ అధికారిక హోదాలో ఉంటూ అవినీతికి పాల్పడిన అంశం ఉంది. ఇలా భిన్న కోణాల్లో దర్యాప్తు జరగాల్సి ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రావచ్చు. ఈ కేసులో నారా లోకేశ్ పాత్ర కూడా ఉన్నట్లు ఐటీ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. లోకేశ్‌ను విచారించే అవకాశం ఉందా? ఐటీ అధికారులు తమ నోటీసులలో వెల్లడించిన ప్రకారం చూస్తే నారా లోకేశ్‌కు ఇందులో కీలకపాత్ర ఉన్నట్లు అన్ని ఆధారాలున్నాయి. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌కు సైతం లోకేశ్ అనేక విషయాల్లో ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోకేశ్ సైతం భవిష్యత్తులో ఈ కేసులో విచారణ ఎదుర్కోక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార దుర్వినియోగం స్పష్టంగా ఉంది. ఆ కోణంలో దర్యాప్తునకు అవకాశం ఉందా? చంద్రబాబునాయుడు సీఎంగా ఉంటూ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితపైన నమోదైన కేసులను చూస్తే.. అధికారంలో ఉండగా వారు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టిన కేసులే అవి. అదే మాదిరిగా చంద్రబాబు సైతం అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బులు సంపాదించారని ఐటీ అధికారుల నోటీసులలో స్పష్టంగా ఉంది. బోగస్ ఇన్వాయిస్లను సీఎం హోదాలో చంద్ర బాబు అంగీకరించి ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిపారు. ఆ డబ్బులు రూపం మార్చుకుని తిరిగి చంద్రబాబు పార్టీ ఖాతాలోకే వచ్చాయి. అంటే ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్లకే తిరిగి లబ్ధి చేకూరింది. కాబట్టి అవినీతి నిరోధక చట్టాల కింద కూడా దర్యాప్తునకు అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో చంద్రబాబుఅరెస్టుకు అవకాశం ఉందా..? ఐటీ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా ట్రిబ్యునల్‌లో చార్జిషీట్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత చంద్రబాబును రిమాండ్‌కు అడగడం తప్పదు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించకుండా నిజాలు బయటికి రావు కాబట్టి ఇప్పుడు షోకాజ్ నోటీసులు మాత్రమే ఇచ్చారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత ట్రిబ్యునల్ ఆదేశం మేరకు అరెస్టుకు అవకాశం ఉంది. మనీలాండరింగ్,ఇతర అంశాలున్నందున ఈడీ అరెస్టు చేస్తుందా? లేదంటే సీబీఐ అరెస్టు చేస్తుందా? అన్నది పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు ఖాయంగానే కనిపిస్తోంది. ఐటీ అధికారులు సైతం ఈ వ్యవహారంపై ఈడీకి సమాచారం ఇవ్వొచ్చు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో తన పేరు లేదని చంద్రబాబు వాదిస్తున్నారు కదా? గతంలో ఇచ్చిన సమాధానాల్లో ఇదే ప్రధానంగా ప్రస్తావించారు..ఈ వ్యవహారంలో తన పేరు లేదని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఏ నేరంలోనైనా ఒక వ్యక్తి పేరు లేనంత మాత్రాన అతడు నేరం చేయనట్టు కాదు. ఈ మొత్తం కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలున్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఈ సర్కమ్స్టాన్సియల్ ఎవిడెన్స్ (ప్రాసంగిక సాక్ష్యాలు) సైతం నిందితుడి పాత్రను నిరూపిస్తాయి కాబట్టి నా పేరు లేదు కదా.. అనే దానికి మినహాయింపులు ఉండవు. తన పేరు లేదని చంద్రబాబు స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన కుదరదు. చట్ట ప్రకారం సర్కమ్స్టాన్సియల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ప్రత్యక్ష సాక్షులు చెప్పే సాక్ష్యాల ఆధారంగా ఎన్నో కేసులు నిరూపితమయ్యాయి. ఇవన్నీ ఐటీ అధికారుల దగ్గర పక్కాగా ఉన్నట్టు నోటీసుల ఆధారంగా తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబునాయుడు తన పేరు లేదంటూ తప్పించుకోలేరు. ఐటీ సెక్షన్ 153 సీ, సెక్షన్ 142(1), 143(2) ప్రకారం మీకు జ్యూరిస్డిక్షన్ లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే తమకు ఆ అధికారం ఉందని ఐటీ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. గతంలో తనపై దాఖలైన కేసుల్లోస్టేలు తెచ్చుకున్నట్లుగా చంద్రబాబు ఈ కేసులోనూ స్టే తెచ్చుకునే అవకాశం ఉందా..? గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు ఐటీ కేసులో స్టే తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఐటీ కేసులకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది హైకోర్టు, సుప్రీంకోర్టుల పరిధిలోకి ఇమీడియెట్‌గా రాదు. అక్కడ జ్యుడీషియల్ పవర్స్ ఉండే జ్యుడీషియల్ అధికారి ఉంటారు. ఆయన ట్రిబ్యునల్‌లో విచారిస్తారు. కాబట్టి మొదట ప్రొసీడింగ్స్ పూర్తి చేయాల్సిందే. జ్యుడీషియల్ పవర్స్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఉన్నాయి. ఈ కేసులో ఎంతో సీరియస్ అభియోగాలున్నాయి. నకిలీ ఇన్వాయిస్లతో ప్రజాధనాన్ని కొట్టేశారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లు ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అందువల్ల స్టేలు ఇచ్చే ఆస్కారం ఏమాత్రం లేదు. గతంలో జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌లపైనా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఐటీ అధికారుల దర్యాప్తులో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. విదేశాల్లోనూ చెల్లింపులు జరిగినట్లుఆధారాలున్నాయి. ఐటీతోపాటు ఈడీ, సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశం ఉందా..? ఈ కేసులో కీలక నిందితుడు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించాడు. ‘ఏం చేయాలో నా పీఎస్‌కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా.. నా పీఎస్‌ను కలవండి..’ అని చంద్రబాబు స్వయంగా తనకు చెప్పినట్లు పార్థసాని ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. అంటే అది ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. చంద్రబాబు ఆయన పీఎస్ శ్రీనివాస్ ద్వారా తమను వేధించడంతోనే డబ్బులు చెల్లించినట్లు పార్థసానితో పాటు ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు వారి వాంగ్మూలాల్లో అంగీకరించారు. ఇవన్నీ కీలక విషయాలే అవుతాయి. డబ్బులు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులకు చేరడం.. తిరిగి అవి ఏ రూపంలో ఎవరెవరికి చెల్లించారు? చంద్రబాబుకు దుబాయ్‌లో పేమెంట్ చేయడం గురించి కూడా వారు చెప్పారు. అంటే ఇండియన్ కరెన్సీని బయటి దేశాలకు తరలించారు.. తిరిగి దాన్ని విరాళాల రూపంలో టీడీపీ ఖాతాల్లోకి చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉంది కాబట్టి ఈ కేసులో వెయ్యి శాతం ఈడీ అధికారులు దర్యాప్తు చేపడతారు. సీబీఐ సైతం వంద శాతం దర్యాప్తు చేపడుతుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు సుమోటోగా కేసును తీసుకోకపోయినా కేసు దర్యాప్తు సవ్యంగా జరిగేందుకు ఈడీ, సీబీఐని ఆదేశించాలని ఎవరైనా కోర్టులను కోరే అవకాశం ఉంది. -ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు బీఎస్ రాంబాబు -
CBN IT Notices: ప్రజాధన కుంభకోణం.. అరెస్టు.. పదేళ్ల జైలు!
సాక్షి, హైదరాబాద్ : ప్రజాధనాన్ని కాజేసి పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఖాయమని, ఈ కేసు నుంచి ఆయన బయటపడడం అసాధ్యమని ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు బీఎస్ రాంబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడినందుకు చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికిసంబంధించి ఐటీ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సాంకేతికంగా మాత్రమే నేరం రుజువు కావాల్సి ఉందని వివరించారు. ‘ఈ కేసును రాజకీయ కక్ష సాధింపు కోణంలో చూడలేం. ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎంతో తీవ్రమైన ఆరోపణలు. అందుకు వారి వద్ద ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి. ఇందులో భారీ అవినీతి దాగి ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఏదైనా పదవిని పొందేందుకు సైతం చంద్రబాబు అనర్హుడు అవుతారు. ఈ కేసులో వెయ్యి శాతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేపట్టడం తప్పదు’ అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రచర్చ జరుగు తున్న చంద్రబాబు అవినీతి వ్యవహారాలు, ఐటీ నోటీసుల్లో ప్రధానాంశాలు, సాంకేతిక విషయాలపై మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన విశ్లేషించారు. మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో కీలక అంశాలేమిటి? ఇది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం. చంద్రబాబు నాయుడు రూ.118 కోట్ల ఆదాయాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టారన్న ఆరోపణ ఉంది. ఈ నేరానికి చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఆయన ఎలాంటి పదవులు పొందకుండా అనర్హుడు అవుతారని చట్టం చెబుతుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల స్టేట్మెంట్లు ఉన్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పక్కాగా ఉంది. సాంకేతికంగా మాత్రమే నేరం నిరూపణ కావాల్సి ఉంది. ఇప్పటికే ఐటీ శాఖ దగ్గర ఉన్న ఆధారాలను చూస్తే ఈ కేసులో ఆయనకు శిక్ష తప్పదని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన ఉల్లంఘనలు ఏమిటి? ఐటీ అధికారులు నోటీసుల్లో ఏ అంశాలు పేర్కొన్నారు? ఈ కేసును మూడు రకాల ఉల్లంఘనలుగా చూడవచ్చు. ఈ మూడు కూడా తీవ్రమైన నేరాలే. ఆదాయాన్ని దాచిపెట్టి ఇన్‌కమ్‌ట్యాక్స్ చట్టాన్ని మొదట ఉల్లంఘించారు. రెండోది.. ఈ డబ్బును విదేశాలకు పంపడం. అక్కడి నుంచి ఆ సొమ్ము విరాళాల రూపంలో మళ్లీ చంద్రబాబు ఖాతాలో, టీడీపీ ఖాతాలోకో వచ్చింది. అంటే మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అయింది. ఇక ప్రజా ప్రతినిధిగా ఉంటూ తన ప్రతిజ్ఞకు భిన్నంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి యాంటీ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు శిక్షార్హుడు అవుతారు. దీన్ని క్విడ్ ప్రోకోగా చూడవచ్చు. ఈ కేసులో ఇప్పటివరకు ఐటీ అధికారులు రూ.118 కోట్ల అక్రమాలను నిగ్గు తేల్చారు. దర్యాప్తులో ఇంకా కొత్త కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా..? ఇది రూ.118 కోట్లతో ఆగేది కాదు. తవ్వి తీస్తే ఇంకా చాలా కుంభకోణాలు బయటికి వస్తాయి. ఇందులో ఐటీ చట్టాలతోపాటు మనీ లాండరింగ్ జరిగింది. ప్రభుత్వ అధికారిక హోదాలో ఉంటూ అవినీతికి పాల్పడిన అంశం ఉంది. ఇలా భిన్న కోణాల్లో దర్యాప్తు జరగాల్సి ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రావచ్చు. ఈ కేసులో నారా లోకేశ్ పాత్ర కూడా ఉన్నట్లు ఐటీ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. లోకేశ్‌ను విచారించే అవకాశం ఉందా? ఐటీ అధికారులు తమ నోటీసులలో వెల్లడించిన ప్రకారం చూస్తే నారా లోకేశ్‌కు ఇందులో కీలకపాత్ర ఉన్నట్లు అన్ని ఆధారాలున్నాయి. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌కు సైతం లోకేశ్ అనేక విషయాల్లో ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోకేశ్ సైతం భవిష్యత్తులో ఈ కేసులో విచారణ ఎదుర్కోక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార దుర్వినియోగం స్పష్టంగా ఉంది. ఆ కోణంలో దర్యాప్తునకు అవకాశం ఉందా? చంద్రబాబునాయుడు సీఎంగా ఉంటూ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితపైన నమోదైన కేసులను చూస్తే.. అధికారంలో ఉండగా వారు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టిన కేసులే అవి. అదే మాదిరిగా చంద్రబాబు సైతం అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బులు సంపాదించారని ఐటీ అధికారుల నోటీసులలో స్పష్టంగా ఉంది. బోగస్ ఇన్వాయిస్లను సీఎం హోదాలో చంద్ర బాబు అంగీకరించి ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిపారు. ఆ డబ్బులు రూపం మార్చుకుని తిరిగి చంద్రబాబు పార్టీ ఖాతాలోకే వచ్చాయి. అంటే ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్లకే తిరిగి లబ్ధి చేకూరింది. కాబట్టి అవినీతి నిరోధక చట్టాల కింద కూడా దర్యాప్తునకు అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో చంద్రబాబుఅరెస్టుకు అవకాశం ఉందా..? ఐటీ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా ట్రిబ్యునల్‌లో చార్జిషీట్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత చంద్రబాబును రిమాండ్‌కు అడగడం తప్పదు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించకుండా నిజాలు బయటికి రావు కాబట్టి ఇప్పుడు షోకాజ్ నోటీసులు మాత్రమే ఇచ్చారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత ట్రిబ్యునల్ ఆదేశం మేరకు అరెస్టుకు అవకాశం ఉంది. మనీలాండరింగ్,ఇతర అంశాలున్నందున ఈడీ అరెస్టు చేస్తుందా? లేదంటే సీబీఐ అరెస్టు చేస్తుందా? అన్నది పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు ఖాయంగానే కనిపిస్తోంది. ఐటీ అధికారులు సైతం ఈ వ్యవహారంపై ఈడీకి సమాచారం ఇవ్వొచ్చు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో తన పేరు లేదని చంద్రబాబు వాదిస్తున్నారు కదా? గతంలో ఇచ్చిన సమాధానాల్లో ఇదే ప్రధానంగా ప్రస్తావించారు.. ఈ వ్యవహారంలో తన పేరు లేదని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఏ నేరంలోనైనా ఒక వ్యక్తి పేరు లేనంత మాత్రాన అతడు నేరం చేయనట్టు కాదు. ఈ మొత్తం కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలున్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఈ సర్కమ్స్టాన్సియల్ ఎవిడెన్స్ (ప్రాసంగిక సాక్ష్యాలు) సైతం నిందితుడి పాత్రను నిరూపిస్తాయి కాబట్టి నా పేరు లేదు కదా.. అనే దానికి మినహాయింపులు ఉండవు. తన పేరు లేదని చంద్రబాబు స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన కుదరదు. చట్ట ప్రకారం సర్కమ్స్టాన్సియల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ప్రత్యక్ష సాక్షులు చెప్పే సాక్ష్యాల ఆధారంగా ఎన్నో కేసులు నిరూపితమయ్యాయి. ఇవన్నీ ఐటీ అధికారుల దగ్గర పక్కాగా ఉన్నట్టు నోటీసుల ఆధారంగా తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబునాయుడు తన పేరు లేదంటూ తప్పించుకోలేరు. ఐటీ సెక్షన్ 153 సీ, సెక్షన్ 142(1), 143(2) ప్రకారం మీకు జ్యూరిస్డిక్షన్ లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే తమకు ఆ అధికారం ఉందని ఐటీ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. గతంలో తనపై దాఖలైన కేసుల్లోస్టేలు తెచ్చుకున్నట్లుగా చంద్రబాబు ఈ కేసులోనూ స్టే తెచ్చుకునే అవకాశం ఉందా..? గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు ఐటీ కేసులో స్టే తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఐటీ కేసులకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది హైకోర్టు, సుప్రీంకోర్టుల పరిధిలోకి ఇమీడియెట్‌గా రాదు. అక్కడ జ్యుడీషియల్ పవర్స్ ఉండే జ్యుడీషియల్ అధికారి ఉంటారు. ఆయన ట్రిబ్యునల్‌లో విచారిస్తారు. కాబట్టి మొదట ప్రొసీడింగ్స్ పూర్తి చేయాల్సిందే. జ్యుడీషియల్ పవర్స్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఉన్నాయి. ఈ కేసులో ఎంతో సీరియస్ అభియోగాలున్నాయి. నకిలీ ఇన్వాయిస్లతో ప్రజాధనాన్ని కొట్టేశారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లు ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అందువల్ల స్టేలు ఇచ్చే ఆస్కారం ఏమాత్రం లేదు. గతంలో జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌లపైనా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఐటీ అధికారుల దర్యాప్తులో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. విదేశాల్లోనూ చెల్లింపులు జరిగినట్లుఆధారాలున్నాయి. ఐటీతోపాటు ఈడీ, సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశం ఉందా..? ఈ కేసులో కీలక నిందితుడు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించాడు. ‘ఏం చేయాలో నా పీఎస్‌కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా.. నా పీఎస్‌ను కలవండి..’ అని చంద్రబాబు స్వయంగా తనకు చెప్పినట్లు పార్థసాని ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. అంటే అది ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. చంద్రబాబు ఆయన పీఎస్ శ్రీనివాస్ ద్వారా తమను వేధించడంతోనే డబ్బులు చెల్లించినట్లు పార్థసానితో పాటు ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు వారి వాంగ్మూలాల్లో అంగీకరించారు. ఇవన్నీ కీలక విషయాలే అవుతాయి. డబ్బులు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులకు చేరడం.. తిరిగి అవి ఏ రూపంలో ఎవరెవరికి చెల్లించారు? చంద్రబాబుకు దుబాయ్‌లో పేమెంట్ చేయడం గురించి కూడా వారు చెప్పారు. అంటే ఇండియన్ కరెన్సీని బయటి దేశాలకు తరలించారు.. తిరిగి దాన్ని విరాళాల రూపంలో టీడీపీ ఖాతాల్లోకి చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉంది కాబట్టి ఈ కేసులో వెయ్యి శాతం ఈడీ అధికారులు దర్యాప్తు చేపడతారు. సీబీఐ సైతం వంద శాతం దర్యాప్తు చేపడుతుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు సుమోటోగా కేసును తీసుకోకపోయినా కేసు దర్యాప్తు సవ్యంగా జరిగేందుకు ఈడీ, సీబీఐని ఆదేశించాలని ఎవరైనా కోర్టులను కోరే అవకాశం ఉంది. :::ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు బీఎస్ రాంబాబు -
క్షమాభిక్షపై చిగురిస్తున్న ఆశలు
సాక్షి, హైదరాబాద్/ సిరిసిల్ల: దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైలకు క్షమాభిక్ష కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల అంశాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దుబాయ్ అధికారులతో పాటు ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ కేసుని వాదిస్తున్న అరబ్ లాయర్, దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులతో మాట్లాడారు. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ క్షమాభిక్ష ప్రసాదించేలా ప్రయత్నం చేయాలని వారికి సూచించారు. 17 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల వాసులు 2006లో దుబాయ్‌లోని జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థ ఆవరణలో నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్ రాయ్ అనే సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. దొంగతనాన్ని అడ్డుకునేందుకు సెక్యూరిటీ గార్డు ప్రయత్నించగా పది మంది కలిసి హత్య చేశారనేది ఆరోపణ. కాగా ఈ కేసు నిందితుల్లో నలుగురు పాకిస్తానీయులు కాగా మిగిలిన ఆరుగురు తెలంగాణకు చెందినవారు. ఈ పది మందిని అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారించి పాకిస్తానీయులకు తొమ్మిదేళ్ల చొప్పున, తెలంగాణ వారికి పదేళ్ల చొప్పున శిక్ష విధించింది. అయితే శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయులు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీంలు విడుదలయ్యారు. కానీ తెలంగాణకు చెందిన మిగతా ఐదుగురు..రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లే‹Ù, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు మాత్రం 17 ఏళ్లుగా జైలులోనే మగ్గుతున్నారు. అప్పీలుకు వెళ్తే.. పెరిగిన శిక్ష ఈ ఐదుగురు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లడం శాపంగా మారింది. ఈ కేసులు విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం (అరబ్బీ భాషలో ‘నజ్ల ఖజా యా) ఈ హత్యను క్రూరమైనది (జినయా)గా పరిగణించింది. కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ కారణంగానే వీరు మరో ఎనిమిదేళ్ల వరకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీర్ఘకాలంగా కేటీఆర్ ప్రయత్నాలు ఐదుగురు ఖైదీల విడుదల కోసం మంత్రి కేటీఆర్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. నేపాల్‌లోని బాధిత కుటుంబం దగ్గరికి స్వయంగా వెళ్లి దియ్య సొమ్ము పరిహారం (బ్లడ్ మనీ) అందించారు. ఆ కుటుంబం ఇచ్చిన క్షమాభిక్ష అంగీకార పత్రాన్ని దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించి క్షమాభిక్ష కోరారు. అయితే నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దుబాయ్ ప్రభుత్వం ఇప్పటివరకు క్షమాభిక్షను ప్రసాదించలేదు. ఆరు నెలల కిందట మరోసారి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దుబాయ్ లాయర్‌కు అవసరమైన ఫీజులు చెల్లించి, తన కార్యాలయ అధికారులను దుబాయ్ పంపించి మరీ ఈ వ్యవహారం తాలూకు పురోగతిని సమీక్షించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మంత్రి మరోసారి తనప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు శిక్ష అనుభవించి జైలు అధికారుల ద్వారా మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలుగా నివేదిక కూడా కలిగి ఉన్న తెలంగాణ ఎన్నారైలకు వెంటనే క్షమాభిక్ష లభించేలా చూడాలని అక్కడి అధికారులను కోరారు. అంతకుముందు జరిగిన బిజినెస్ భేటీల సందర్భంగా దుబాయ్ రాజ కుటుంబానికి సన్నిహితంగా వ్యవహరించే పలువురు వ్యాపారవేత్తల వద్ద కూడా మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించి మానవతా దృక్పథంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న తాజా ప్రయత్నాలు, స్థానిక వ్యాపారవేత్తల నుంచి లభించిన సానుకూల హామీ నేపథ్యంలో తెలంగాణ ఖైదీల విడుదలపై కుటుంబసభ్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
షినవత్రకు థాయ్‌లాండ్ రాజు క్షమాభిక్ష
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్ర(74)కు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అవినీతి ఆరోపణలపై ఆయనకు కోర్టు విధించిన ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఒక్క ఏడాదికి తగ్గించారు. ఇందుకు సంబంధించి రాజు మహా వజ్రాలొంగ్కర్న్ నిర్ణయాన్ని రాయల్ గజెట్ శుక్రవారం ప్రచురించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అంతిమ అధికారం రాజుదే. 2001, 2005ల్లో జరిగిన ఎన్నికల్లో షినవత్ర ప్రధాని అయ్యారు. 2006లో జరిగిన సైనిక కుట్రలో ప్రధాని పదవి నుంచి షినవత్రను గద్దె దించారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2008లో ఆయన దేశం విడిచి వెళ్లిపోయి, అజ్ఞాతంలో గడిపారు. వారం క్రితం దేశంలోకి ప్రవేశించిన వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున క్షమాభిక్ష కోరుతూ రాజుకు విజ్ఞాపన పంపారు. షినవత్ర రాకతో దేశంలో మూడు నెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత సమసిపోయే పరిణామాలు సంభవించాయి. షినవత్ర స్థాపించిన ఫ్యూథాయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంట్లో మద్దతు పెరగడం విశేషం. -
వచ్చే 13 వరకు జైల్లోనే ఇమ్రాన్
ఇస్లామాబాద్: అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు సెప్టెంబర్ 13వ తేదీ వరకు ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. తోషఖానా కేసులో ఇమ్రాన్‌కు దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను కొట్టివేస్తూ మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, రహస్య పత్రాల లీకేజీ కేసు విచారణలో ఉన్నందున ఆయనకు ఒక రోజు రిమాండ్ విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు. భద్రతా కారణాల రీత్యా ఇమ్రాన్ విచారణను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటోక్ జైలులోనే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జడ్జి అబువల్ హస్నత్ జుల్కర్నయిన్ బుధవారం జైలుకు చేరుకున్నారు. జైలు లోపలే కేసును విచారించి, ఇమ్రాన్ రిమాండ్‌ను వచ్చే 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారని జియో న్యూస్ తెలిపింది. దీంతో, ఆగస్ట్ 5 నుంచి ఉంటున్న అటోక్ జైలు నుంచి వెంటనే విడుదల కావాలన్న ఇమ్రాన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయిందని జియో న్యూస్ పేర్కొంది. విచారణ సమయంలో ఇమ్రాన్ తరఫు లాయర్ల బృందంలోని ముగ్గురికి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారని తెలిపింది. గత ఏడాది మార్చిలో పార్లమెంట్లో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొద్ది రోజులు ముందు జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్.. తనను గద్దె దించేందుకు విదేశీ శక్తి కుట్ర పన్నిందనేందుకు ఇదే సాక్ష్యమంటూ ఓ డాక్యుమెంట్‌ను తీసి బహిరంగంగా చూపించారు. అమెరికా విదేశాంగశాఖ అధికారులు అక్కడి పాక్ రాయబారితో భేటీ అయ్యారని, దానికి సంబంధించిన వివరాలున్న డాక్యుమెంట్లను చట్ట విరుద్ధంగా పొందిన ఇమ్రాన్ వాటిని బహిరంగ పరిచారని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయనపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. -
తోషఖానా కేసులో దిగువ కోర్టు తీర్పు తప్పు
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు ఇస్లామాబాద్ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’కు అందిన ఖరీదైన బహుమతుల విక్రయంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ అవినీతికి పాల్పడ్డారంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) వేసిన కేసుపై విచారణ జరిపిన ఇస్లామాబాద్ కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 5న తీర్పు వెలువరించింది. దీంతో, మరో అయిదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అర్హత కోల్పోయారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆమెర్ ఫరూఖ్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, విచారణకు ఈసీపీ తరఫు లాయర్ అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. విచారణను వాయిదా వేయాలని ఆయన సహాయక లాయర్లు ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం వినతిని తోసిపుచ్చింది. ‘ట్రయల్ కోర్టు తప్పు చేసింది. ఆ తప్పుల్ని మేం చేయదలుచుకోలేదు. పిటిషన్‌పై విచారణ కీలక దశలో ఉంది. అందుకే విచారణను సోమవారానికి మాత్రమే వాయిదాగలం. సోమవారం ఎవరూ రాకున్నా మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని స్పష్టం చేసింది. పాక్ సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్‌కు జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు బుధవారం వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్నందున వేచి చూస్తామని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ఇరవై రోజులుగా అటోక్ జైలులో ఉన్నారు. -
శిక్షపడిన మరునాడే విడుదల!
సాక్షి, హైదరాబాద్: నిషిద్ధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి, దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో అరెస్టు అయిన పాతబస్తీ వాసి ఒబేదుర్ రెహ్మాన్‌కు ఢిల్లీ కోర్టు గత బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షా కాలం రిమాండ్ పీరియడ్‌లోనే పూర్తి కావడంతో ఆ మర్నాడే ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడిపై బెంగళూరు సీసీబీ పోలీసులు నమోదు చేసిన మరో కేసులోనూ ఇప్పటికే శిక్షపడటం, రిమాండ్‌లోనే అదీ పూర్తవడం జరిగాయి. ఒబేదుర్ రెహ్మాన్ గత శుక్రవారం సిటీకి చేరుకున్నాడు. తొలి కేసు బెంగళూరులో నమోదు... పాతబస్తీలోని చంద్రాయణగుట్ట గుల్షన్ ఇక్బాల్ కాలనీకి చెందిన ఒబేదుర్ రెహ్మాన్ డిగ్రీ చదువుతుండగానే ఉగ్రవాద బాటపట్టాడు. ఉగ్రవాద సంస్థ హుజీలో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరులో ఉన్న బీజేపీ నాయకులను, ప్రముఖులను హతమార్చడానికి ఈ మాడ్యుల్‌కు చెందిన ఉగ్రవాదులు 2012లో రంగంలోకి దిగారు. ఈ విషయం గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్‌లో ఒబేద్‌తో పాటు నాందేడ్, బెంగళూరు, హుబ్లీలకు చెందిన 11 మందినీ అరెస్టు చేశారు. వీళ్లు జైల్లో ఉండగానే ఐఎం నేతృత్వంలో సాగిన మరో కుట్ర వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, ఢిల్లీల్లో పేలుళ్ళకు కుట్ర పన్నడంతో అదే ఏడాది ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ మరో కేసు నమోదు చేసింది. ఒబేద్ సహా మరికొందరికి బెంగళూరు జైలు నుంచి 2013లో తీహార్ జైలుకు తరలించింది. జైల్లో ఉండగానే రెండు ‘శిక్షలు’ పూర్తి... ఈ రెండు కేసులకు సంబంధించి ఒబేద్ సహా మరికొందరు ఉగ్రవాదులు 2012 నుంచి జైల్లో రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. బెంగళూరు కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు న్యాయస్థానంలో నేరం అంగీకరించారు. దీంతో కోర్టు వీరిని దోషులుగా తేలుస్తూ ఆరేళ్ళ శిక్ష విధించింది. అప్పటికే వీళ్ళు అంతకంటే ఎక్కువే జైలులో ఉండటంతో ఆ కాలాన్ని కోర్టు శిక్షగా పరిగణించింది. ఢిల్లీలో నమోదైన కేసు విచారణ పూర్తి కావడంతో ఈ నెల 7న ఒబేద్ సహా నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు బుధవారం పదేళ్ళ జైలు విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈ ఉగ్రవాదులు అంతకంటే ఎక్కువ రోజులే జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండటంతో శిక్షాకాలం పూర్తయింది. దీంతో ఒబేద్ తదితరులు పదేళ్ల శిక్షపడిన మరుసటి రోజైన గురువారమే తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇదే కేసులో భత్కల్ తదితరులు... ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ నమోదు చేసిన ఈ కేసులో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీపార్క్ ట్విన్ బ్లాస్ట్, దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ళకు బాధ్యులైన వాళ్ళూ నిందితులుగా ఉన్నారు. ఐఎం ఉగ్రవాదులైన రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ హడ్డీపై విచారణ జరగాల్సి ఉంది. వీరిలో రియాజ్ మినహా మిగిలిన వాళ్ళు అరెస్టు కావడం, నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళ కేసుల్లో శిక్షలు పడటం కూడా జరిగింది. ఐఎం కో–ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఆదేశాల మేరకు మిగిలిన ఉగ్రవాదులు ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో మానవబాంబులతో మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నారని ఎన్ఐఏ గుర్తించింది. -
బుద్ధి మారలేదు.. జైలు తప్పలేదు..
సిడ్నీ: ఆస్ట్రేలియాలో నివాసముంటున్న భారత వృద్హ జంట తమ వద్ద మరో భారతీయ వృద్ధురాలిని బానిసగా చేసుకుని చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలో ఆస్ట్రేలియా న్యాయస్థానం వృద్ధ దంపతుల శిక్షా కాలాన్ని మరో రెండున్నరేళ్లకు పెంచుతూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. భారత్‌లోని తమిళనాడుకు చెందిన కుముదిని కణ్ణన్, కందసామి కణ్ణన్ జంట తమ వద్ద పని చేయడానికి ఒక భారతీయ మహిళను నియమించుకున్నారు. ఆమెకు ఇంటిపని వంటపని తోపాటు పిల్లలను చూసుకునే పని కూడా అప్పజెప్పి రోజుకు 23 గంటల పాటు పని చేయమని హింసించారు. ఒక పనిమనిషిలా కాకుండా మానవత్వం లేకుండా బానిసలా చూసినట్టు చూసి ఆమె అనారోగ్యానికి కారణమయ్యారు. పాపం ఆ మహిళ పోషకాహార లోపం, డయాబెటిస్, గాంగ్రీన్ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యింది. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసు శాఖ ఈ జంటపై బానిసల వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని 2021లో జైలుకు తరలించారు. ఈ కేసులో వాదోపవాదనలు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియా న్యాయస్థానం వృద్ధ జంటకు మరో రెండున్నరేళ్ళపాటు శిక్షను పొడిగించింది. 2016లో నమోదైన ఈ కేసులో సాక్షిని భయపెట్టేందుకు ప్రయత్నించిన కుముదిని కణ్ణన్ కు మొత్తం 8 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించగా అందులో నాలుగేళ్ల పాటు బెయిల్ నిరాకరిస్తున్నట్లు, అలాగే కందస్వామి కణ్ణన్ కు ఆరేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించి అందులో మూడేళ్లు బెయిల్ మంజూరు చేయడం కుదరదని తీర్పునిచ్చింది. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ దంపతుల్లో కొంచెమైనా పశ్చాత్తాపం కనిపించడంలేదని.. వారిలో వీసమెత్తు మానవత్వం కూడా లేదని సాటి మనిషిని మనిషిగా కూడా చూడలేని కఠిన హృదయులని తెలిపారు. తప్పు చేసిన భావనే వారిలో కొరవడిందని చెబుతూ కఠిన శిక్షను అమలు చేయాల్సిందిగా కోరారు. ఇది కూడా చదవండి: కుటుంబంపై హత్యాయత్నం చేసిన డాక్టర్.. కారులో తీసుకెళ్లి.. -
Defamation Case: రాహుల్‌పై అనర్హత వేటు
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం! పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది! ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొంది. తీర్పు వెలువడ్డ ఈ నెల 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొనడం తెలిసిందే. అయినా లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు! శుక్రవారం ఉదయం మామూలుగానే లోక్‌సభ సమావేశానికి హాజరైన ఆయన, లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. రాహుల్‌పై అనర్హత వేటును కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. దీనిపై ‘జనాందోళన్’ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీజేపీ మాత్రం వేటు చట్టప్రకారమే జరిగిందని పేర్కొంది. రాహుల్‌కు చట్టం వర్తించదా అని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన, అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ‘నేరాలకు పాల్పడడం రాహుల్‌కు అలవాటే. పార్లమెంట్‌కు, ప్రభుత్వానికి, దేశానికి అతీతుడినని ఆయన భావిస్తున్నారు. తమకు ప్రత్యేక భారత శిక్షాస్మృతి ఉండాలని, తమను ఎవరూ నేరస్తులుగా నిర్ధారించవద్దని, శిక్షలు విధించవద్దని కాంగ్రెస్, ప్రధానంగా నెహ్రూ–గాంధీ కుటుంబం కోరుకుంటోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కానీ దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు’’ అన్నారు. వయనాడ్ ఖాళీ లోక్‌సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు లోక్‌సభ వెబ్సైట్ పేర్కొంది. ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతితో జలంధర్ (పంజాబ్) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్‌తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం వేటును నిరసిస్తూ విపక్షాల ర్యాలీ అదానీ అంశంపై జేపీసీతో దర్యాప్తు చేయించాలని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ నిరసన ర్యాలీ చేపట్టిన 40 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు నిర్బంధించారు. పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్‌కు ర్యాలీగా వెళ్లిన ప్రముఖుల్లో కేసీ వేణుగోపాల్, ఆధిర్ రంజన్ చౌధురి, కె.సురేశ్, మాణిక్కం ఠాగోర్æ తదితరులు ఉన్నారు. వీరంతా నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని పోలీసులు చెప్పారు. సెక్షన్ 144ను ఉల్లంఘించి ర్యాలీ చేపట్టిన 40 మంది ఎంపీలను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. అంతకుముందు విజయ్‌చౌక్ వద్ద కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితర నేతలు మాట్లాడారు. ర్యాలీలో కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, శివసేన ఉద్ధవ్ వర్గం, జేడీయూ, ఆప్ నేతలు పాల్గొని ‘వుయ్ డిమాండ్ జేపీసీ’, ‘సేవ్ ఎల్ఐసీ’, ‘డెమోక్రసీ ఇన్ డేంజర్’ అన్న ప్లకార్డులను ప్రదర్శించారు. రాహుల్ నోరు నొక్కేందుకే: కాంగ్రెస్ సోనియా సహా అగ్ర నేతల అత్యవసర భేటీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దీనిపై దేశవ్యాప్తంగా ‘జనాందోళన్’కు పిలుపునిచ్చింది. రాహుల్ సభ్యత్వంపై వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ వెలువడగానే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా శక్రవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. రాహుల్ నోరు నొక్కేందుకే అధికార బీజేపీ ఇలా వాయు వేగంతో చర్యలకు దిగిందని తీర్మానించారు. వేటుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని, మోదీ సర్కారు నిరంకుశ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, మండల విభాగాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నాయి. రాహుల్‌కు విపక్షాల సంఘీభావాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ స్వాగతించింది. ‘‘దీనిపై ఐక్యంగా పోరాడదాం. ఆందోళనల్లో మీరు కూడా కలిసి రండి’’ అంటూ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చింది. భేటీలో ప్రియాంక, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, చిదంబరం తదితరులు పాల్గొన్నారు. స్పందనలు ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజు ‘ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. నిజాలు మాట్లాడుతున్నందుకు, ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నందుకే రాహుల్‌పై అధికార బీజేపీ కక్షగట్టింది. ఆయన గొంతు నొక్కడమే ఉద్దేశం. నిజాలను రాహుల్ బహిర్గతం చేయడం బీజేపీకి ఇష్టం లేదు, రాహుల్‌పై వేటు పడినా అదానీ అక్రమాలపై జేపీసీ విచారణ డిమాండ్‌పై తగ్గేది లేదు. మమ్మల్ని జైలుకు పంపించినా పోరాడుతూనే ఉంటాం’’ – మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు ‘‘మోదీ భారత్‌లో విపక్ష నాయకులే లక్ష్యంగా మారారు. నేర చరితులైన బీజేపీ వారికి మంత్రి పదవులు. విపక్ష నేతలపై అనర్హత వేటు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత హీనమైన పరిస్థితి!’’ మమత బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘రాహుల్‌పై అనర్హత వేటు దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశంలో ఒకే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని అనుకుంటున్నారు. బ్రిటీష్ పరిపాలన కంటే ప్రమాదకరంగా ప్రధాని మోదీ పాలన మారింది. ఇది కేవలం ఒక్క కాంగ్రెస్ చేసే పోరాటం కాదు. దేశాన్ని రక్షించుకోవడానికి 130 కోట్ల మంది భారతీయులు ఏకం కావాలి’’ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మోదీ స్నేహితుడైన పారిశ్రామికవేత్త (అదానీ) అంశాల నుంచి దృష్టి మరల్చే బీజేపీ ఎత్తుగడ ఇది. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుట్రలు పన్ని, తప్పుడు కేసులు పెట్టి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజమ్‌ఖాన్ సహా ఎందరిపైనో అనర్హత వేటు వేసింది’’ అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ‘‘రాహుల్‌గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంతాలకే వ్యతిరేకం. ప్రజాస్వామ్య విలువలన్నీ మంటగలుపుతున్నారు. ఇలాంటి చర్యల్ని పూర్తిగా ఖండించాలి’’ శరద్ పవార్, ఎన్సీపీ అధినేత ‘‘రాహుల్‌పై అనర్హత ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులపై జరిగిన దాడి. ఇదొక ఫాసిస్టు చర్య. ఒక జాతీయ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడుకి కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రజాస్వామ్య హక్కు లేదని ఇలాంటి చర్యల ద్వారా భయపెడుతున్నారు’’ ఎంకె స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేయడానికి పరువు నష్టం మార్గాన్ని బీజేపీ ఎంచుకోవడాన్ని ఖండించాలి. వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి నిరంకుశ దాడుల్ని ప్రతిఘటించాలి, ఓడించాలి’’ సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ‘‘అబద్ధాలు, వ్యక్తిగత నిందలు, ప్రతికూల రాజకీయాలు రాహుల్‌లో ఒక అంతర్భాగంగా మారాయి. ఒబిసి సామాజిక వర్గాన్ని దొంగలతో పోల్చి రాహుల్ తనకున్న కుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకి ప్రజలు ఇంతకంటే పెద్ద శిక్ష విధిస్తారు.’’ జె.పి. నడ్డా, బీజేపీ అధ్యక్షుడు తలవంచం.. ఏం చేసుకుంటారో చేసుకోండి ‘‘దేశ ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తం ధారపోసింది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రాణత్యాగం చేసిన ప్రధాని కుమారుడైన రాహుల్ గాంధీని ‘మీర్ జాఫర్’ అంటూ మోదీ మనుషులు కించపర్చారు. మా కుటుంబాన్ని దూషించారు. రాహుల్ తండ్రెవరని బీజేపీ ముఖ్యమంత్రి ఒకరు ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని పాటిస్తూ తలపాగా ధరిస్తే దాన్నీ తప్పుపట్టారు. తద్వారా పండిట్ల సామాజిక వర్గాన్ని అవమానించారు. నెహ్రూ ఇంటి పేరు ఎందుకు పెట్టుకోలేదని పార్లమెంట్లో మీరు (మోదీ) మమ్మల్ని ప్రశ్నించారు. మమ్మల్ని దారుణంగా అవమానించినా ఏ జడ్జి కూడా మీకు రెండేళ్ల జైలు శిక్ష విధించలేదు. పార్లమెంట్ నుంచి అనర్హత వేటు వేయలేదు. రాహుల్ నిజమైన దేశ భక్తుడు. అందుకే అదానీ గ్రూప్ సాగించిన లూటీపై ప్రశ్నించాడు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ బాగోతాలపై నిలదీశాడు. మీ మిత్రుడు గౌతమ్ అదానీ పార్లమెంట్ కంటే గొప్పవాడా? అధికార దాహమున్న వ్యక్తుల ముందు మేం తలవంచే ప్రసక్తే లేదు. ఏం చేసుంటారో చేసుకోండి!’’ – ప్రియాంకాగాంధీ వాద్రా, కాంగ్రెస్ నాయకురాలు భారత్ గొంతుక కోసమే నా పోరాటం ‘‘భారతదేశ గొంతుక కోసం పోరాటం సాగిస్తున్నా. ఈ విషయంలో ఎలాంటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నా’’ – రాహుల్ గాంధీ ట్వీట్ -
‘దొంగల ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై... రాహుల్‌కు రెండేళ్ల జైలు
సూరత్/ఢిల్లీ: ‘దొంగలందరి ఇంటిపేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద రాహుల్‌ను దోషిగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్.హెచ్.వర్మ నిర్ధారించారు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన అనంతరం బెయిల్ మంజూరు చేశారు. పై కోర్టులో అప్పీలుకు వీలుగా జైలు శిక్షను 30 రోజులపాటు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్ కోర్టులోనే ఉన్నారు. ‘‘ఈ కేసులో దోషి పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఏం మాట్లాడినా అది దేశ ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కేసు తీవ్రత పెరిగింది. దోషికి తక్కువ శిక్ష విధిస్తే ప్రజలకు తప్పుడు సంకేతం పంపించినట్లు అవుతుంది. ఎవరైనా ఇతరులను ఇష్టారాజ్యంగా దూషించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో రాహుల్ గతంలో క్షమాపణ చెప్పారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు’’ అని న్యాయస్థానంలో తన తీర్పులో పేర్కొంది. కించపర్చే ఉద్దేశం లేదు విచారణ సందర్భంగా రాహుల్ తన వాదన వినిపించారు. తనకు ఎవరిపైనా ఎలాంటి వివక్ష లేదని, దేశ ప్రజలందరినీ అభిమానిస్తానని చెప్పారు. ఎవరినీ కించపర్చే ఉద్దేశం లేదన్నారు. ‘‘ప్రజాప్రయోజనాల కోణంలోనే ఎన్నికల ప్రచారంలో ప్రసంగించా. అది నా విధి’’ అని తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, నిందితుడు గతంలో ఏ కేసులోనూ దోషిగా తేలలేదని, ఎవరి నుంచీ క్షమాభిక్ష కోరలేదని, ఆయనకు తక్కువ శిక్ష విధించాలని రాహుల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనను ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది ఖండించారు. రాహుల్‌ను గతంలో సుప్రీంకోర్టు మందలించిందని గుర్తుచేశారు. ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. చట్టప్రకారం పోరాడతాం: కాంగ్రెస్ సూరత్ కోర్టు తీర్టుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అప్పీల్ దాఖలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘పిరికిపంద, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై, ప్రతిపక్షాలపై కక్షగట్టింది. ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తున్నందుకు, అదానీపై అంశంపై జేపీసీ నియమించాలని డిమాండ్ చేస్తున్నందుకు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటోంది. రాజకీయ ప్రసంగాలపై కేసులు పెట్టడం చాలా దారుణం. ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే నాలుగు వేళ్లు తమవైపే చూపిస్తాయని బీజేపీ నేతలు తెలుసుకోవాలి. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించాం. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. చట్ట ప్రకారమే పోరాడుతాం’’ అని ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్ భయపడే ప్రసక్తే లేదు: ప్రియాంక తన సోదరుడు రాహుల్ గొంతును నొక్కేయడానికి మోదీ ప్రభుత్వం సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తోందని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వాద్రా మండిపడ్డారు. రాహుల్ గతంలో ఏనాడూ భయపడలేదని, భవిష్యత్తులోనూ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సత్యమే మాట్లాడుతాడని ట్వీట్ చేశారు. దేశ ప్రజల కోసం గొంతెత్తుతూనే ఉంటారని పేర్కొన్నారు. రాహుల్‌కు కేజ్రీవాల్ మద్దతు రాహుల్‌ను పరువు నష్టం కేసులో ఇరికించడం దారుణమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీయేతర నాయకులు, పార్టీలపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ట్వీట్ చేశారు. వారిని కేసుల్లో ఇరికించడం ద్వారా నిర్మూలించడమే ఉద్దేశమన్నారు. సత్యమే నా మార్గం: రాహుల్ సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ స్పందిం చారు. ‘‘సత్యం, అహింసపైనే నా మతం ఆధారపడి ఉంటుంది. సత్యమే నా దైవం. ఆ దైవాన్ని చేరుకొనే మార్గమే అహింస’’ అంటూ మహాత్మాగాంధీ చెప్పిన సూక్తిని ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర యోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు. సత్యం, ధైర్యసాహసాలే ఆలంబనగా మాతృదేశం కోసం నిర్భయంగా పోరాడడాన్ని ఆ మహనీయుల నుంచి నేర్చుకున్నామన్నారు. క్షమాపణ చెప్పాలి: బీజేపీ రాహుల్ గాంధీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేïపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇతరులను దూషిస్తే శిక్ష తప్పదని చెప్పారు. రాహుల్‌కు జైలుశిక్ష విధించడంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఎవరినైనా దూషించడానికి రాహుల్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందా? అని ప్రశ్నించారు. ఇతరుల పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. అమిత్ షాకు సమన్లు ఇవ్వండి సీబీఐ డైరెక్టర్‌కు జైరాం రమేశ్ లేఖ న్యూఢిల్లీ: ‘‘మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా సర్కారు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సమన్లు జారీ చేయండి. అవినీతికి సబంధించిన వివరాలు ఆయన నుంచి సేకరించండి’’ అని సీబీఐని కాంగ్రెస్ పార్టీ కోరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ సుబోధ్ జైస్వాల్‌కు లేఖ రాశారు. ‘‘సంగ్మా ప్రభుత్వ అవినీతి గురించి తెలిసే షా ఆరోపణలు చేశారు. దానిపై చర్యల నిమిత్తం వివరాలు సేకరించండి’’ అని కోరారు. ఏమిటీ కేసు? 2019 ఏప్రిల్ 13న కర్నాటకలోని కోలార్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించారు. ‘దొంగలందరి ఇంటి పేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అని అన్నారు. మోదీ సామాజికవర్గం పరువుకు రాహుల్ నష్టం కలిగించారంటూ గుజరాత్‌లోని సూరత్ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ విజ్ఞప్తి మేరకు విచారణ సూరత్‌లో జరగకుండా విధించిన స్టేను గుజరాత్ హైకోర్టు గత ఫిబ్రవరిలో తొలగించింది. అనర్హత వేటు పడుతుందా? ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన రాజకీయ నాయకుడిపై శిక్ష ఖరారైన తేదీ నుంచి మిగిలిన పదవీ కాలమంతా అనర్హత వేటు పడుతుంది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడు. అయితే, అనర్హత వేటు వెంటనే పడదని సుప్రీంకోర్టు లాయర్ మహేష్ జెఠ్మలానీ చెప్పారు. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం మూడు నెలల గడువు ఇవ్వొచ్చని తెలిపారు. ఈ సమయంలో నేరారోపణ లేదా శిక్షపై అప్పిలేట్ కోర్టు స్టే ఇస్తే అప్పీల్‌పై విచారణ ముగిసే దాకా అనర్హత వేటు కూడా ఆగిపోతుందని వివరించారు. మూడు నెలల్లోగా నేరారోపణ లేదా శిక్ష రద్దు కాకపోతే దోషిపై అనర్హత వేటు వేయొచ్చని పేర్కొన్నారు. శిక్షను రద్దు చేసే అధికారం శిక్ష విధించిన కోర్టుకు కాకుండా అప్పిలేట్ కోర్టుకే ఉంటుందన్నారు. రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షను అప్పిలేట్ కోర్టు రద్దు చేయొచ్చని, అదే జరిగితే అప్పీల్‌పై విచారణ ముగిసేదాకా ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసే అవకాశం లేదని మహేష్ జెఠ్మలానీ వెల్లడించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే శిక్షను అప్పిలేట్ కోర్టు రద్దు చేయడమో లేదంటే నేరారోపణపై స్టే విధించడమో జరగాలని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది చెప్పారు. రాహుల్ గాంధీకి అప్పిలేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. 2013 నాటి లిలీ థామస్, 2018 నాటి లోక్ ప్రహరి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఆయన గుర్తుచేశారు. ప్రజాప్రతినిధుల శిక్ష రద్దయితే అనర్హత వేటు కూడా రద్దవుతుందని అప్పట్లో న్యాయస్థానం తేల్చిచెప్పిందని వివరించారు. -
తల్లీ కూతురు హత్య.. వ్యక్తికి జీవితాంత ఖైదు
చిత్తూరు అర్బన్: తల్లీ, కూతురిని హతమార్చి.. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తికి మరణించేంత వరకు జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలంలోని గంగిరెడ్డి కాలనీకి చెందిన సయ్యద్ మౌలాలి(47) అనే వ్యక్తి వృత్తిరీత్యా చెరువులను లీజుకు తీసుకుని చేపలు పట్టి విక్రయించే వ్యాపారం చేసేవాడు. మండలంలోని గిరిజన తాండాకు చెందిన సరళమ్మ(37)కు భర్త మరణించాడు. ఆమెతో మౌలాలి కొన్నాళ్లపాటు సహజీవనం చేశాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, తల్లి ఉన్నారు. సరళమ్మ వేరే మగాళ్లతో ఫోన్లో మాట్లాడుతోందనే అనుమానంతో ఆమెతో రాత్రి పొలం వద్ద గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి ఆమెను కర్రతో తలపై కొట్టాడు. ఆమె చనిపోవడంతో పెద్దేరు ప్రాజెక్టులో వేసేశాడు. శవం పైకి తేలకుండా చీరకు రాళ్లు కట్టిపడేశాడు. మరుసటి రోజు ఆమె తల్లి గంగులమ్మ తన కుమార్తె ఎక్కడని మౌలాలిని నిలదీసింది. నీ కుమార్తె ఉదయానికల్లా వస్తుందని నమ్మబలికాడు. ఆమెకు మద్యం అలవాటు ఉండడంతో మద్యం తెచ్చి ఇచ్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో చీరకొంగుతో గొంతుకు బిగించి చంపేశాడు. శవాన్ని ఓ చెరువులోకి తీసుకెళ్లాడు. శవం పైకి లేవకుండా ఆమె చీరను నీటిలోని ఓ చెట్టు మొదలుకు కట్టివేశాడు. ఆ మరుసటిరోజు సరళమ్మ కుమార్తెలు తమ అమ్మ, అవ్వ ఎక్కడని మౌలాలీని నిలదీశారు. వారికి కరోనా రావడంతో మదనపల్లె ఆస్పత్రిలో చేర్పించానని వారిని నమ్మించాడు. వారితో కలసి అక్కడే పడుకునే వాడు. వారిలో పెద్ద అమ్మాయిపై లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితో చంపేస్తానని బెదిరించాడు. ఇలా నెల రోజులు గడిచాక ఆ పిల్లలు ముగ్గురిని కర్ణాటక గౌనిపల్లెలోని ఓ ఇంట్లో ఉంచాడు. బంధువుల ఫిర్యాదు సరళమ్మ, ఆమె తల్లి గంగులమ్మ, కుమార్తె కనపడకపోవడంతో వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సయ్యద్ మౌలాలిని అరెస్టు చేసి.. బాలికలను అతడి నుంచి విడిపించారు. నిందితుడు చెప్పిన వివరాలతో చెరువులో పడున్న తల్లీ, కుమార్తె మృతదేహాలను బయటకు తీశారు. అతనిపై పలు హత్యలు, అత్యాచారం, అట్రాసిటీ, అపహరణ కేసులు నమోదు చేశారు. నిందితుడిపై మోపిన అభియోగాలు న్యాయస్థానంలో రుజువుకావడంతో.. అతను మరణించేంత వరకు జైల్లో ఉండాలని, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి సోమవారం తీర్పునిచ్చారు. బాలికకు రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచిస్తూ తీర్పులో పేర్కొన్నారు. -
ముగ్గురు లైంగికదాడి నిందితులకు 20 ఏళ్ల జైలు
విశాఖ లీగల్: ముక్కు పచ్చలారని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరూ రూ.10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని విశాఖపట్నంలోని మహిళ కోర్టు కమ్ 6వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి మోకా సువర్ణరాజు గురువారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మామిదురి శైలజ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిందితులు మహమ్మద్ అమీర్ ఆలమ్, పోటేలు రంజీ, మహమ్మద్ అషరఫ్ న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదగంట్యాడ సమీప భానోజీతోట బాపూజీ కాలనీ నివాసులు. బాధిత చిన్నారి (10) కూడా కుటుంబ సభ్యులతో కలిసి అదే ప్రాంతంలో నివసించేది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదివేది. 2011వ సంవత్సరం నవంబర్ 28న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో బాలిక తన సోదరికి జ్వరంగా ఉండడంతో రొట్టె కొనడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇదే అదునుగా భావించిన మహమ్మద్ అమీర్ ఆలమ్, పోటేలు రంజీ, మహమ్మద్ అషరఫ్ బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా ముగ్గురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. చిన్నారి ఇంట్లో కనిపించకపోవడంతో బాలిక సోదరుడు ఆలమ్ గిర్ చుట్టుపక్కల వెతకగా సమీపంలోని పొదల వద్ద అత్యంత దయనీయ స్థితిలో కన్పించింది. వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి దక్షిణ ఏసీపీ పి.త్రినాథ్ కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ 26 మంది సాక్షులను విచారించింది. 11 ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి గురువారం తీర్పు వెల్లడించారు. -
ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లకు ఆరు నెలల జైలు
న్యూఢిల్లీ: జపాన్ సంస్థ దైచీ సాంక్యోకు ర్యాన్‌బాక్సీ విక్రయ వ్యవహారంలో పలు అంశాలను దాచిపెట్టడం, ఈ కేసు విచారణలో ఉండగా.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ తమ ఫోర్టిస్ షేర్లను మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు విక్రయించిన కేసులో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టు గురువారం 6 నెలల జైలు శిక్ష విధించింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 26 శాతం వాటా కోసం ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్‌పై విధించిన స్టే ఎత్తివేసేందుకూ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. 2018 ఫోర్టిస్–ఐఐహెచ్ ఒప్పందంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేసును తిరిగి ఢిల్లీ హైకోర్టుకు విచారణ నిమిత్తం రిమాండ్ చేసింది. దైచి– ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ల మధ్య చట్టపరమైన పోరాటం కారణంగా ఐహెచ్‌హెచ్–ఫోర్టిస్ ఒప్పందం నిలిచిపోయింది. ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ షేర్ డీల్‌ను దైచీ సాంక్యో సవాలు చేసింది. జపనీస్ డ్రగ్ మేకర్ దైచీ 2008లో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ యజమానులైన సింగ్ సోదరుల నుండి ర్యాన్‌బాక్సీ కొనుగోలు చేసింది. అయితే పలు అంశాలు దాచిపెట్టి ఈ ఒప్పందం చేసుకున్నారని దైచీ ఆరోపిస్తూ, సింగ్ సోదరులపై న్యాయపోరాటాన్ని జరిపింది. సింగ్ సోదరులకు వ్యతిరేకంగా సింగపూర్ ట్రిబ్యునల్‌లో రూ.3,600 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు అమలుకు దైచీ న్యాయపోరాటం చేస్తోంది. షేర్ భారీ పతనం..: కాగా, ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు షేర్ అమ్మకాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్న సుప్రీం ఆదేశాల అనంతరం ఫోర్టిస్ ఒక ప్రకటన చేస్తూ, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఫోర్టీస్ హెల్త్‌కేర్ షేర్ 15% పడిపోయి రూ.265.55 వద్ద ముగిసింది. -
బాలికపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు
విజయవాడ లీగల్: బాలికను గర్భవతిని చేసిన కేసులో యువకుడి నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి, అదనపు జిల్లా జడ్జి డాక్టర్ ఎస్.రజని మంగళవారం తీర్పు చెప్పారు. విజయవాడ మారుతీనగర్‌కు చెందిన పట్నాల మహేష్ (20) మాయమాటలు చెప్పి తన ఇంటి పక్కన నివసించే బాలికను లోబర్చుకున్నాడు. ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. బాలిక ఆరోగ్యం మీద అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. బాలిక తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు విచారణలో నిందితుడి నేరం రుజువుకావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాలికకు రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను జడ్జి ఆదేశించారు. -
జైల్లో డిన్నర్ చేయని సిద్ధూ
పటియాలా: కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూని పటియాలా జైల్లో బారక్ నంబర్–10లో ఉంచారు. హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మరో నలుగురితో కలిసి రాత్రంతా ఆయన గడిపారు. శుక్రవారం రాత్రి జైల్లో సిద్ధూ అసహనంగానే గడిపినట్టు జైలు వర్గాలు వెల్లడించాయి. రాత్రి భోజనం కింద చపాతీ, పప్పు ఇచ్చినా తినలేదు. తినేసి వచ్చానని చెప్పి, కొన్ని మందులు వేసుకున్నారు. జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 137683 ఇచ్చారు. సిద్ధూకి కాలేయానికి సంబంధించిన సమస్యలున్నాయి. గోధుమలతో తయారైన ఆహారం సిద్ధూకి పడదు. ప్రత్యేకంగా భోజనం కోసం సిద్ధూ జైలు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు ఆయన ప్రతినిధి వెల్లడించారు. జైలు వైద్యులు సిద్ధూ అనారోగ్యాన్ని గుర్తించి అంగీకరిస్తే ఆయన భోజనం జైలు క్యాంటిన్ నుంచి తెప్పించుకోవచ్చునని లేదంటే స్వయంగా వంట చేసుకునే అవకాశం కూడా ఉందని జైలు అధికారులు వెల్లడించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్‌సర్‌లో సిద్ధూతో పాటు పోటీపడిన శిరోమణి అకాలీ దళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితా డ్రగ్స్ కేసులో ఈ జైల్లోనే ఉండడం విశేషం. సిద్ధూకి రెండు సెట్లు తెల్ల రంగు పైజామాలు, ఒక చైర్, టేబుల్, ఒక కప్బోర్డు, రెండు తలపాగాలు, కప్పుకోవడానికి దుప్పటి, మంచం, బెడ్షీట్లు, లోదుస్తులు, టవళ్లు, దోమలు కుట్టకుండా నెట్ వంటి సదుపాయాలు కల్పించారు. 1988 నాటి రోడ్డు ఘర్షణల కేసులో ఒక వ్యక్తి మృతికి కారకుడైన సిద్ధూకి సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 8 నెలల్లోపే బయటకు వచ్చే చాన్స్ సిద్ధూ ఏడాది శిక్షా కాలం 8 నెలల్లోపే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగితే జైలు సూపరింటెండెంట్‌కి శిక్షా కాలాన్ని నెల రోజులు తగ్గించేందుకు అధికారం ఉంటుంది. రాష్ట్ర డీజీపీ (జైళ్లు)కి మరో రెండు నెలలు తగ్గించవచ్చు. పంజాబ్ సీఎం భగవంత్ మన్ ప్రతిపక్ష నేతల్లో సిద్ధూతో మాత్రమే ఇటీవల భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఏడాది శిక్షా కాలం పూర్తవకుండానే సిద్ధూ బయటకు వస్తారని అంచనాలున్నాయి. -
లైంగిక దాడికి యత్నించిన యువకునికి 3 ఏళ్ల జైలు
విశాఖ లీగల్: బాలికపై లైంగిక దాడికి యత్నించిన యువకునికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమాన విధిస్తూ విశాఖలోని పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి..తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడుకి చెందిన నిందితుడు ఏడిద క్రాంతి (33) విశాఖలోని బుచ్చిరాజుపాలెంలోని బంధువుల ఇంట్లో ఉంటూ ఓ సమోసా తయారీ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. బాధితురాలు (10) ఎన్ఏడీ దగ్గర గాంధీనగర్ పోలీస్ కాలనీ నివాసి. నిందితుడు పనిచేసే ప్రాంతంలో బాలిక స్నేహితులతో సైకిల్ తొక్కేది. బాలిక కదలికలను కనిపెట్టిన నిందితుడు 2020 అక్టోబర్ 26న ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని రైల్వేట్రాక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. సైకిల్‌పై వెళుతున్న బాలికను తాకుతూ లైంగిక దాడికి యత్నించగా భయకంపితురాలైన ఆమె కేకలు వేసింది. పక్కనే ఉన్న ఓ యువకుడు వచ్చి బాలికను రక్షించాడు. నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పై విధంగా నిందితుడికి శిక్ష విధించారు. -
గాజువాక తహసీల్దార్‌కు 6 నెలలు జైలు శిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావుకు హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. లోకేశ్వరరావు ఈ నెల 18న హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు హాజరు కావాలని, అనంతరం ఆయన్ని ‘సివిల్ ప్రిజన్’కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు. గాజువాక మండలం, తూంగ్లాం గ్రామం సర్వే నంబర్ 29/1లో ఉన్న తమ భూమి నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారంటూ పి.అజయ్‌కుమార్, మరొకరు హైకోర్టులో 2014లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్లను వారి భూమి నుంచి ఖాళీ చేయించవద్దని ఆదేశించింది. అయినా, అధికారులు ఆ భూమిలో నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. పిటిషనర్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని తహసీల్దార్ తన కౌంటర్లో వివరించారు. ఇతర అధికారుల కౌంటర్లను కూడా పరిశీలించిన న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. పిటిషనర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చట్ట ప్రకారం ఖాళీ చేయించాల్సిందన్నారు. తహసీల్దార్ ఆ పని చేయకుండా నిర్మాణాలను కూల్చివేశారని, అది కూడా కోర్టు ఉత్తర్వులు ఉండగా చేశారని ఆక్షేపించారు. కోర్టు ఉత్తర్వులు చట్ట విరుద్ధమైతే అప్పిలేట్ కోర్టులో సవాలు చేయాలే తప్ప, వాటికి విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పారు. తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తేల్చారు. అందువల్ల కోర్టు ధిక్కార చట్టం కింద తహసీల్దార్‌కు 6 నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు
కాకినాడ లీగల్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలిక (16)పై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3,500 జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కాతేరు గ్రామం, శౠంతినగర్కు చెందిన బాలిక నగరంలోని ఒక వస్త్ర దుకాణంలో పని చేసేది. షాపులో పని పూర్తయ్యాక తిరిగి రాత్రి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. నగరంలోని ఆర్యాపురానికి చెందిన ఆటో డ్రైవర్ తానేటి రామచంద్ర వరప్రసాద్ ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో మరో ఆటో డ్రైవర్ తానేటి సుధాకర్‌బాబును కూడా ఆటోలో ఎక్కించుకున్నాడు. వారిద్దరూ కలిసి ఆ బాలికను నేరుగా కాతేరు వెళ్లే రోడ్డులో కాకుండా పేపర్ మిల్లు వెనుక ఉన్న గోదావరి గట్టు వైపు తీసుకెళ్లారు. ఆ ఇద్దరు దుర్మార్గులు తనను బ్లేడు, కత్తితో బెదిరించి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ బాలిక 2016 జూన్ 6న రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు రామచంద్ర వరప్రసాద్, సుధాకర్‌బాబుపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అప్పటి సెంట్రల్ జోన్ డీఎస్పీ కులశేఖర్ దర్యాప్తు చేపట్టారు. కోర్టు విచారణలో తానేటి సుధాకర్‌బాబుపై నేరం రుజువు కావడంతో ఐపీసీ 376 (2)ఎన్ ప్రకారం పదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా, ఐపీసీ 376డి ప్రకారం 20 ఏళ్ల జైలు, రూ.1,000 జరిమానా, ఐపీసీ 377 ప్రకారం ఐదేళ్ల జైలు, రూ.1000 జరిమానా, ఐపీసీ 506 ప్రకారం ఏడాది జైలు, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నాలుగు సెక్షన్లకు ఏకకాలంలో జైలుశిక్ష అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. సరైన ఆధారాలు లేకపోవడంలో తానేటి రామచంద్ర వరప్రసాద్‌పై కేసు కొట్టి వేశారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండీ అక్బర్ అజాం ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
అక్రమ మద్యం కేసులో మహిళకు 6 నెలల జైలు
విశాఖ లీగల్: అనుమతి లేకుండా ప్రభుత్వ మద్యాన్ని అక్రమంగా విక్రయించిన మహిళకు ఆరు నెలల జైలు, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ నగరంలోని ఎక్సైజ్ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీకాంత్ గురువారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో రెండు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నూతన ఎక్సైజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తే కనీసం 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోనే తొలి తీర్పు కావడం విశేషం. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవతారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాక పెదగంట్యాడ పితానివానిపాలెంకి చెందిన పితాని సన్యాసమ్మ (50) 2020 ఆగస్టు 18న పెదగంట్యాడ సమీపంలోని ఆటోనగర్‌లో 12 మద్యం సీసాలు విక్రయిస్తూ ఉండగా న్యూపోర్టు పోలీసులు పట్టుకున్నారు. ఆమె నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. -
ఆఫీస్ టాయ్‌లెట్స్‌కు సున్నం వేయకున్నా జైలే..
న్యూఢిల్లీ: దేశ ద్రోహం కింద పరిగణించే నేరాలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. అయితే, వ్యాపార సంస్థలు మరుగుదొడ్లకు (లెట్రిన్లు, యూరినల్స్) నాలుగు నెలలకోసారి సున్నాలు వేయకపోయినా కూడా అదే స్థాయిలో ఏడాది నుంచి మూడేళ్ల వరకూ శిక్షలు వేయొచ్చని చట్టాలు చెబుతున్నాయి. ఇలా జైలు శిక్షకు ఆస్కారం ఉన్న అనేకానేక నిబంధనలను తూచా తప్పకుండా పాటించలేక దేశీయంగా వ్యాపారాలు నానా తంటాలు పడుతున్నాయని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) ఒక అధ్యయనంలో వెల్లడించింది. ’వ్యాపారం చేస్తే జైలుశిక్ష: భారత వ్యాపార చట్టాల్లో 26,134 జైలు శిక్ష క్లాజులు’ పేరిట టీమ్‌లీజ్ సంస్థతో కలిసి ఓఆర్ఎఫ్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం భారత్‌లో వ్యాపార సంస్థల నియంత్రణకు నిర్దేశించిన నిబంధనలు 69,233 పైచిలుకు ఉన్నాయి. వీటిని పాటించకపోతే జరిమానాగా జైలు శిక్ష విధించేలా 26,134 క్లాజులు ఉన్నాయి. ‘ప్రతి అయిదు నిబంధనలకు కనీసం రెండు క్లాజులు .. వ్యాపారవేత్తలను జైలుకు పంపే విధంగా (నిబంధనలను పాటించనందుకుగాను) ఉంటున్నాయి‘ అని ఓఆర్ఎఫ్ పేర్కొంది. పారిశ్రామిక రంగంలో ముందున్న అయిదు రాష్ట్రాల (గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు) వ్యాపార చట్టాల్లో కనీసం 1,000కి పైగా జైలు శిక్ష క్లాజులు ఉన్నాయని వివరించింది. ఏటా రూ. 18 లక్షల భారం.. అధ్యయనం ప్రకారం.. 150 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్న సగటు చిన్న తరహా తయారీ సంస్థ (ఎంఎస్ఎంఈ) ఏటా 500–900 పైచిలుకు నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఈ భారం ఏటా రూ. 12–18 లక్షల స్థాయిలో ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ చేసిన అనేకానేక వ్యాపార చట్టాల్లో జైలు శిక్ష నిబంధనల వల్ల భారత్‌లో వ్యాపారాలు చేయడం సవాళ్లతో కూడుకున్నదిగా మారిందని ఓఆర్ఎఫ్ తెలిపింది. అతి నియంత్రణ వల్ల లాభాల కోసం పని చేసే సంస్థలతో పాటు లాభాపేక్ష లేని సంస్థలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. టాయ్లెట్లను శుభ్రం చేయకపోవడాన్ని కూడా దేశద్రోహ నేరానికి సమానంగా పరిగణించి శిక్ష వేసేలా నిబంధనలు ఉండటం ఇందుకు ఉదాహరణగా ఓఆర్ఎఫ్ వివరించింది. అసంఖ్యాక నిబంధనలను పాటించేలా వ్యాపారవేత్తలను క్రిమినల్ శిక్షలతో అతిగా భయపెట్టడం వల్ల అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అనవసర నిబంధనలను తొలగించే విషయంలో ప్రభుత్వం శుభారంభం చేసిందని.. దాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో 26,134 జైలు క్లాజులకు కూడా విస్తరించాలని టీమ్‌లీజ్ వైస్ చైర్మన్ మనీష్ సబర్వాల్ తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించి గత ఏడేళ్లుగా సేకరించిన వివరాల ఆధారంగా డేటాను లేబర్, ఫైనాన్స్, ఆరోగ్యం తదితర ఏడు విభాగాల కింద ఓఆర్ఎఫ్ వర్గీకరించింది. దీని ప్రకారం అయిదు రాష్ట్రాల వ్యాపార చట్టాల్లో 1,000కి పైగా జైలు శిక్ష క్లాజులు ఉన్నాయి. గుజరాత్ (1,469), పంజాబ్ (1,273), మహారాష్ట్ర (1,210), కర్ణాటక (1,175), తమిళనాడు (1,043) ఈ జాబితాలో ఉన్నాయి. క్రమబద్ధీకరించేందుకు పది సూత్రాలు.. మితిమీరిన నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా వ్యాపార చట్టాలు, నియంత్రణలను క్రమబద్ధీకరించేందుకు నివేదికలో పది సూత్రాలను ప్రతిపాదించారు. క్రిమినల్ పెనాల్టీలను విధించడంలో సంయమనం పాటించడం, నియంత్రణల ప్రభావాలను మదింపు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం, జైలు శిక్ష విధించే క్లాజులను క్రమబద్ధీకరించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఉద్దేశ్యపూర్వకమైన ఉల్లంఘనలకు (పన్నుల ఎగవేత, పర్యావరణ విధ్వంసం మొదలైనవి) జైలు శిక్ష నిబంధనను కొనసాగిస్తూనే.. ప్రక్రియపరమైన లోపాలు, ఉద్దేశ్యపూర్వకం కాని తప్పిదాలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించవచ్చని నివేదిక సూచించింది. పౌరులు, రాజకీయవేత్తలు, అధికారులు కూడా ఈ సంస్కరణల విషయంలో తగు చొరవ చూపాలని పేర్కొంది. -
పెంపుడు కుక్కకు బర్త్‌డే పార్టీ... లాకప్‌లో యజమానులు
అహ్మదాబాద్: ముచ్చట పడి పెంచుకున్న కుక్కకు ఘనంగా పుట్టినరోజు చేయాలనుకున్నారు. బంధుమిత్రులను పిలిచి కేక్ కట్ చేసి హంగామా చేశారు. అదే వారిని చిక్కుల్లో పడేసింది. అహ్మదాబాద్‌కు చెందిన చిరాగ్ పటేల్, ఉర్విష్ పటేల్‌లు సోదరులు. క్రిష్ణానగర్ ప్రాంత వాసులు. శుక్రవారం రాత్రి తమ ఫ్లాట్‌లో అబ్బీ (కుక్క పేరు... ఇండియన్ స్పిట్జ్ జాతికి చెందినది)కి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. జానపద గాయకుడితో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. పెద్దసంఖ్యలో అతిథులు హాజరుకావడంతో కోవిడ్–19 ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన వీరిపై పోలీసులు కన్నెర్ర చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి చిరాగ్, ఉర్విష్లపై కేసు కట్టి అరెస్టు చేశారు. దగ్గరుండి పార్టీ ఏర్పాట్లు చూసిన వీరి మిత్రుడు దివ్వేశ్ మెహారియాను జైల్లో వేశారు. -
చిన్న అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష
అంకారా: మన వల్ల ఎలాంటి తప్పు జరగకపోయినా సరే శిక్ష అనుభవించాల్సి వస్తే చాలా బాధగా ఉంటుంది. అలాంటిది వేరేవారి నిర్లక్ష్యం కారణంగా.. చిన్న అక్షర దోషం ఫలితంగా కోర్టు ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తే.. అది కూడా ఓ రాజకీయ నాయకుడి భార్యకు ఈ పరిస్థితి తలెత్తితే.. పీకల దాకా కోపం వస్తుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు టర్కీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య. ఆమె తప్పు ఏం లేకపోయినా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమెకు ఏకంగా రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఆ వివరాలు.. (చదవండి: సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?) టర్కీకి చెందిన టీచర్, రాజకీయ నాయకుడి భార్య బసక్ డెమిర్టాస్ అనే మహిళ 2015లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. అనారోగ్యం ఫలితంగా డెమిర్టాస్‌కు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఐదు రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే డెమిర్టాస్ ఆస్పత్రిలో చేరింది 2015, డిసెంబర్ 11న కాగా.. ఆస్పత్రి సిబ్బంది డిసెంబర్ 14 అని రిపోర్టులో తప్పుగా టైప్ చేశారు. ఇది గమనించని డెమిర్టాస్.. వైద్యులు సూచించిన మేరకు ఐదు రోజులు సెలవు తీసుకుంది. ఇక పెయిడ్ లీవ్ అప్లై చేస్తూ.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును అందులో సబ్మిట్ చేసింది. అయితే దానిలో డెమిర్టాస్ డిసెంబర్ 14న ఆస్పత్రిలో చేర్చినట్లు ఉంది. ఈ క్రమంలో ఆమె తప్పుడు రిపోర్టులు సబ్మిట్ చేసి.. మోసం చేసిందనే ఆరోపణలపై డెమిర్టాస్ మీద పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోర్టు 2018లో డెమిర్టాస్‌కు, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్‌కి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను) ఈ సందర్భంగా డెమిర్టాస్ న్యాయవాదులు మాట్లాడుతూ.. ‘‘ఆసుపత్రి రికార్డు పుస్తకంలో డెమిర్టాస్ డిసెంబర్ 11న ఆస్పత్రిలో చేరినట్లు ఉంది. అక్షర దోషం వల్లే ఈ తప్పు జరిగిందని కోర్టుకు తెలిపాము. ఈ క్రమంలో కోర్టు ఆస్పత్రి రికార్డు బుక్‌ను సాక్ష్యంగా చూడకుండానే శిక్ష విధించింది. ఇది కేవలం రాజకీయ కుట్రే’’ అని పేర్కొన్నారు. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ‘‘ఒక సైంటిఫిక్ ఫైల్‌కు సంబంధించి చిన్న క్లరికల్ తప్పిదం వల్ల కోర్టు డెమిర్టాస్, డాక్టర్‌కి కలిపి ఐదు సంవత్సరాల శిక్ష విధించింది. ఇది చిన్న తప్పిదం కాదు. భయంకరమైన రాజకీయ కుట్ర’’ అని టర్కీపార్లమెంట్ రిపోర్టర్ నాచో సాంచెజ్ అమోర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: మహిళను తోసేసిన ఎమ్మెల్యే.. గర్భస్రావం -
25 ఏళ్ల తర్వాత.. ‘ఉపహార్ కేసు’లో ఇద్దరికి ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: 1997నాటి ‘ఉపహార్’అగ్ని ప్రమాద ఘటన కేసులో రియల్ ఎస్టేట్ యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్‌లకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. కోర్టు మాజీ ఉద్యోగి దినేశ్ చంద్‌కు మరో ఇద్దరు పీపీ బాత్రా, అనూప్ సింగ్‌లకు ఏడేళ్ల చొప్పున జైలు శిక్షతోపాటు, రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పంకజ్ శర్మ సోమవారం తీర్పు వెలువరించారు. దోషులకు విధించిన జరిమానాలను బాధితులకు పరిహారంగా చెల్లించనున్నట్లు జడ్జి చెప్పారు. ఉపహార్ సినిమా హాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు సుశీల్, గోపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరికీ ఇప్పటికే సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీలో ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ. 30 కోట్ల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించడంతో అనంతరం విడుదల చేసింది. -
బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడికి 20 ఏళ్లు జైలు
పెదకాకాని(పొన్నూరు): బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి సోమవారం కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. పెదకాకాని పోలీసుల కథనం ప్రకారం.. పెదకాకాని ప్రాంతానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళుతున్న ఆ బాలికకు ఆటో డ్రైవర్ సాగర్‌బాబు మాయ మాటలు చెప్పి 2015 డిసెంబర్ 15న ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు సాగర్‌బాబుతో పాటు అతడికి సహకరించిన వేల్పుల కిషోర్‌బాబు, కొండేటి శ్రీనివాసరావు, రాణిలపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాలికపై ఆటోడ్రైవర్ లైంగిక దాడి చేసినట్టు నిర్ధారణ కావడంతో నిందితుడు సాగర్‌బాబుకు గుంటూరులోని పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి ఆర్.శ్రీలత.. 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్టు పోలీసులు చెప్పారు. మిగిలిన ముగ్గురిపై నేరం రుజువు కానందున వారిపై కేసు కొట్టేసినట్టు తెలిపారు. కేసులో పీపీగా శ్యామల వాదనలు వినిపించారు. -
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
అయోధ్య: కాలేజీలో అడ్మిషన్ కోసం నకిలీ మార్క్ షీట్‌ను సమర్పించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని గోసాయ్‌గంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ తివారీకి(బీజేపీ) ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఆయనకు రూ.8 వేల జరిమానా విధించింది. తివారీని పోలీసులు జైలుకు తరలించారు. ఆయనపై 1992లో అయోధ్యలో సాకేత్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. గ్రాడ్యుయేషన్ సెకండియర్‌లో ఫెయిలైన తివారీ 1990లో నకిలీ మార్క్ షీట్ సమర్పించి, పై తరగతిలో చేరినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. -
చేసిన తప్పుకు సమాజ సేవ చేయండి
సాక్షి, అమరావతి: సాధారణంగా కోర్టు ధిక్కార కేసుల్లో జైలు శిక్ష లేదంటే జరిమానా విధిస్తుంటారు. ఈసారి హైకోర్టు ఇందుకు భిన్నంగా వినూత్న తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఇద్దరు ఉద్దేశపూర్వక జాప్యం చేశారని, ఇది ధిక్కారం కిందకే వస్తుందని న్యాయస్థానం తేల్చింది. ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతి ఆదివారం విజయవాడ కానూరులోని సీనియర్ సిటిజన్స్ ఫోరం వృద్ధాశ్రమంలో.. మంగళగిరి, నవులూరు వద్దనున్న షారోన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే అనాథాశ్రమంలోని వారికి సంతుష్ట భోజనం అందించాలని స్పష్టం చేసింది. అలాగే వారితో కొంత సమయం గడపాలని సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకున్న విషయాన్ని వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఇన్‌చార్జ్‌లు ధ్రువీకరించాలని పేర్కొంది. దానిపై సెప్టెంబర్ 19 కల్లా కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేయాలని.. దీన్ని పాటించకపోతే ఆ విషయాన్ని రిజిస్ట్రార్(జ్యుడీషియల్) కోర్టు దృష్టికి తీసుకురావాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ బుధవారం తీర్పు వెలువరించారు. ‘కమీషన్ ఏజెంట్ల లైసెన్సు రెన్యువల్’ ఉల్లంఘన.. గుంటూరు మార్కెట్ యార్డ్‌లో మిర్చి అమ్మకాలు చేసే కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ రెన్యువల్‌కు హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల అమలులో ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నారంటూ మార్కెట్ యార్డ్ అప్పటి చైర్మన్, టీడీపీ నేత మన్నవ సుబ్బారావు, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులపై 25 కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపారు. ప్రతివాదులుగా ఉన్న సుబ్బారావు, శ్రీనివాసరావు బుధవారం హైకోర్టు ముందు హాజరయ్యారు. తమ వయసును పరిగణనలోకి తీసుకోవాలని, కోర్టు ఆదేశాల అమలులో జాగ్రత్తగా వ్యవహరిస్తామని తెలిపారు. బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామన్నారు. సమాజ సేవ చేస్తామంటే.. క్షమాపణలను ఆమోదించడానికి కోర్టు సిద్ధమని న్యాయమూర్తి తెలిపారు. ఇందుకు అంగీకరించడంతో.. వారిని వృద్ధాశ్రమం, అనాధాశ్రమంలో సేవకు ఆదేశాలిస్తూ తీర్పు వెలువరించారు. -
భారతీయ అమెరికన్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష
హూస్టన్: హెల్త్ కేర్ స్కామ్‌కు పాల్పడిన భారతీయ అమెరికన్, నర్సింగ్ ప్రాక్టిషనర్ త్రివిక్రమ్ రెడ్డికి అమెరికా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, 5.2 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 376 కోట్లు) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. హెల్త్‌కేర్ ఫ్రాడ్ స్కీమ్‌లో తన పాత్రను త్రివిక్రమ్ రెడ్డి (39) కోర్టు ముందు అంగీకరించారని టెక్సాస్ నార్తర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రేరక్ షా వెల్లడించారు. మెడికేర్, ప్రైవేట్ బీమా సంస్థలను మోసం చేసే పథకానికి రెడ్డి రూపకల్పన చేశారని నిర్ధారణ అయిందన్నారు. పేషెంట్ల చికిత్సకు సంబంధించిన తప్పుడు బిల్లులను రూపొందించి బీమా సంస్థలను భారీ మొత్తాలకు మోసం చేశారన్నారు. అందుకు, ఆరుగురు డాక్టర్ల వివరాలను వాడుకున్నాడని తెలిపారు. ఈ ఆరుగురి డాక్టర్ల ఐడీ నెంబర్లు, ఇతర వివరాలను దొంగిలించి... త్రివిక్రమ్ వీరు తన క్లినిక్‌లలో పేషెంట్లకు చికిత్స చేసినట్లు బిల్లులు సృష్టించి... బీమా సంస్థల నుంచి తప్పుడు క్లెయిమ్‌లు పొందాడు. త్రివిక్రమ్ రెడ్డి మోసం గురించి మొదట 2019 జూన్‌లో వెల్లడయింది. 2020 అక్టోబర్‌లో ఆయన తన నేరాన్ని అంగీకరించారు. ఈనెల 25న కోర్టు ఆయనకు శిక్షను ఖరారు చేసింది. వాక్సహాచీ మెడికల్, టెక్సాస్ కేర్ క్లినిక్స్, వీ– కేర్ హెల్త్ సర్వీసెస్ల పేరిట త్రివిక్రమ్ మూడు క్లినిక్‌లను నిర్వహించేవారు. చదవండి: మాజీ భార్యపై జానీ డెప్ తప్పుడు ప్రచారం! -
లాలూ ఆడియో క్లిప్ కలకలం
పట్నా: ఎన్డీఏకు చెందిన ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ యత్నిస్తున్నారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన ఆరోపణలు బిహార్‌లో సంచలనం సృష్టించాయి. నితీశ్ కుమార్ నూతన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా లాలూ ఎంఎల్ఏలను ప్రలోభపరుస్తున్నారని చెబుతూ సుశీల్ ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ ఆడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ పిర్పైంటి ఎంఎల్ఏ లలన్ కుమార్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ‘‘నిన్ను బాగా చూసుకుంటాం. స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోయేందుకు సాయం చెయ్యి’’ అని లాలూ అంటున్నట్లు ఆడియోలో ఉంది. ఇందుకు ఎంఎల్ఏ బదులిస్తూ ఇందుకు చాలా ఇబ్బందులుంటాయని చెప్పగా, భయపడవద్దని, ఆర్జేడీ స్పీకర్ వస్తారని, ఇందుకుగాను తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి పదవి ఇస్తామని లాలూ చెబుతున్నట్లుంది. సుశీల్‌తో తాను ఉన్నప్పుడే లాలూ కాల్ చేశారని సదరు ఎంఎల్ఏ చెప్పారు. ప్రస్తుతం లాలూ పశుగ్రాసం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని బిహార్ డిప్యుటీ సీఎం తార్ కిశోర్ ప్రసాద్ చెప్పారు. ఈ ఆడియోక్లిప్‌పై ఆర్జేడీ ఏమీ వ్యాఖ్యానించలేదు. కానీ ఆ పార్టీ ఎంఎల్ఏ ముకేశ్ రోషన్ మాత్రం మార్చికల్లా నితీశ్ ప్రభుత్వం పడిపోయి, తేజస్వీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. మరోవైపు బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీఏకి చెందిన విజయ్ సిన్హా ఎన్నికయ్యారు. -
గాంధీజీ విగ్రహాన్నీ వదల్లేదు
వాషింగ్టన్: నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానంతరం హింసాకాండకు పాల్పడిన నిరసనకారులను ‘బందిపోటు ముఠా’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. చివరకు వారు, వాషింగ్టన్ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్నీ విడిచిపెట్టలేదన్నారు. శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ మే 25న జార్జ్ ఫ్లాయిడ్ మెడపైన మోకాలితో తొక్కిపట్టగా, ఊపిరాడక ఫ్లాయిడ్ మరణించారు. ఈ విషయం వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమెరికాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కొందరు ఆందోళనకారులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిన్నెసోటాలో ట్రంప్ మాట్లాడారు. ఆందోళనకారులను ఉద్దేశించి ‘వారు అబ్రహం లింకన్ విగ్రహాన్ని కూల్చివేశారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియలేదు. మన గత చరిత్రని వారు ధ్వంసం చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నంత కాలం అమెరికా చరిత్రను వారేమీ చేయలేరు’ అని వ్యాఖ్యానించారు. అందుకే విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారికి పదేళ్ళు జైలు శిక్ష విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. దీంతో విగ్రహాల విధ్వంసం ఆగిపోయిందని ట్రంప్ అన్నారు. కూల్చి వేసిన గాంధీ విగ్రహాన్ని భారత ఎంబసీ సాయంతో పునర్నిర్మించినట్టు తెలిపారు. -
ఖషోగి హత్య కేసులో 8 మందికి శిక్ష
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వ్యాసకర్త, సౌదీ అరేబియా విమర్శకుడు జమాల్ ఖషోగి హత్య కేసులో రియాద్ క్రిమినల్ కోర్టు 8 మందికి శిక్షలు ఖరారు చేసింది. సౌదీ రాకుమారుడు, దేశ పాలనలో ముఖ్యభూమిక పోషిస్తున్న మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై తీవ్ర విమర్శలతో వాషింగ్టన్ పోస్ట్‌లో పలు వ్యాసాలు రాసిన ఖషోగి హత్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఖషోగి 2018లో టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో హత్యకు గురయ్యారు. సౌదీ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. రాకుమారుడు సల్మాన్ కార్యాలయంలో పనిచేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఇంటలిజెన్స్, భద్రతా సిబ్బంది నిందితులుగా విచారణను ఎదుర్కొన్నారు. ఖషోగి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించడంతో నిందితుల్లో ఐదుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. వీరికి 20 ఏళ్ల చొప్పున శిక్ష పడింది. మిగిలిన నిందితుల్లో ఒకరికి పదేళ్లు, మరో ఇద్దరికి ఏడేళ్లు శిక్ష పడింది. -
పాక్ చెరలో 19మంది భారతీయులు
లాహోర్: అక్రమంగా సరిహద్దును దాటారన్న ఆరోపణలపై రెండు నెలల క్రితం 19మంది భారతీయులను, ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టేదాకా వీరు జైల్లోనే ఉంటారని తెలిపారు. అక్రమ ప్రవేశం, గూఢచర్యం నేరాలపై 19మంది భారతీయులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచామని చెప్పారు. ఇటీవలే వీరిని ఫెడరల్ రివ్యూబోర్డు ముందు ప్రవేశపెట్టామని, నవంబర్ 9వరకు వీరిని రిమాండ్‌లో ఉంచాలని బోర్డులోని న్యాయమూర్తులు ఆదేశించారని వివరించారు. ఈలోపు జరిపే విచారణ ఆధారంగా నవంబర్ 9న బోర్డు వీరిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. వీరితో పాటు ఒక శ్రీలంక దేశస్తుడిని కూడా అరెస్టు చేశారు. సరైన ఆధారాల్లేవంటూ బోర్డు ఆదేశాల మేరకు విడుదల చేశారు. -
ఆరేళ్ల బాలుడిని, వంద అడుగుల పైనుంచి..
లండన్: ఆరేళ్ల పిల్లవాడిని అన్యాయంగా వంద అడుగుల పై నుంచి కింద పడేసి, పగలబడి నవ్విన 18 ఏళ్ల యువకుడికి లండన్ కోర్టు శుక్రవారం 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ‘అదేంటి మా పిల్లవాడిని అలా పడేస్తున్నావు నీకేమైనా పిచ్చా?’ అంటూ ఆ ఆరేళ్ల పిల్లవాడు అడ్డు పడబోతుంటే ‘అవును నాకు పిచ్చే. టీవీలో నేను కనబడాలని పిచ్చి’ అంటూ 18 ఏళ్ల జాంటీ బ్రేవరి, సినిమాలో విలన్లా పగలబడి నవ్వాడట. 2019, ఆగస్ట్ 4వ తేదీన జరిగిన ఈ సంఘటనపై లండన్‌లోని ఓల్డ్ బెయిలీ జడ్జి జస్టిస్ మాక్గోవన్ నేడు తీర్పు చెప్పారు. పర్యాటక ప్రాంతమైన లండన్‌లోని ‘టేట్ మోడ్రన్ వ్యూయింగ్ గాంట్రీ’లో నిలబడిన ఫ్రాన్స్‌కు చెందిన ఆరేళ్ల బాలుడి వద్దకు జాంటి బ్రేవరి వెళ్లి అతన్ని అమాంతంగా పైకెత్తి రేలింగ్ పై నుంచి వంద అడుగుల కిందకు పడేశాడు. అదృష్టవశాత్తు ఆ బాలుడు బతికాడుగానీ, శరీరంలో పలు ఎముకలు విరగడంతోపాటు మెదడుకు గాయమైంది. ప్రస్తుతం ఆ పిల్లవాడు వీల్ చేర్‌కు పరిమితం అయ్యాడు. అతడు కోలుకొని నడవడానికి మరో రెండేళ్లు పడుతుందని వైద్యులు తెలిపారు. పిల్లవాడు పడుతున్న బాధను, ఆ పిల్లవాడికి జరిగిన దారుణానికి తల్లడిల్లుతున్న వారి తల్లిదండ్రుల ఆందోళనను అర్థం చేసుకోని దోషికి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి తెలిపారు. (‘అండర్వేర్ వేసుకోను.. మాస్క్ ధరించను’) పిల్లవాడిని కిందకు పడేస్తోన్న సీసీటీవీ ఫుటేజ్‌లను కోర్టులో చూపించాల్సిన అవసరం లేదని, అలాగే టీవీలలో చూపించరాదని జడ్జి అధికారులను ఆదేశించారు. టీవీలో తాను కనిపించడం కోసమే తాను అలా చేశానన్న నేరస్థుడి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని జడ్జి ఈ ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు. (మా పేరు ‘కరోనా’ కాదు.. మేం భారతీయులమే) -
అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే..
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకుందామంటే ఇకపై కుదరదు. విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించనున్నట్లు ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఇలాంటి వాటిపై కేసుల వారీగా విచారణ చేపట్టాల్సిందిగా దర్యాప్తు సంస్థలకు పంపిస్తామని పేర్కొంది. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో భాగంగా అఫిడవిట్లలో తప్పుడు సమాచారంపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అఫిడవిట్ల బాగోతంపై ప్రజలు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 125ఏ కింద న్యాయస్థానాలకు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇకపై నేరుగా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయొచ్చు. తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిరూపణ అయితే సదరు అభ్యర్థులకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా.. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ విధించవచ్చని ఈసీ రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ శిక్ష సరిపోదని ఈసీ చెబుతోంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కనీసం రెండేళ్లు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణ చేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ప్రతిపాదన న్యాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. -
మనీలాండరింగ్: ఇద్దరు ఎన్నారైలకు శిక్ష
లండన్: 2.4 మిలియన్ పౌండ్ల(భారత కరెన్సీలో రూ. 22,38,67,680.00) భారీ హవాలా నేరానికి పాల్పడినందుకు గాను శుక్రవారం యూకే కోర్టు భారత సంతతి వ్యక్తులు ఇద్దరికి కలిపి 12 సంవత్సరాల 9 నెలల జైలు శిక్ష విధించింది. స్కాట్లాండ్ యార్డ్ ఎకనామిక్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు ఆధారంగా కోర్టు విజయ కుమార్ కృష్ణసామి (32), చంద్రశేఖర్ నలయన్ (44)కు శిక్ష విధించింది. నేరపూరిత ఆస్తులను దాచడం, బదిలీ చేయడం వంటి నేరాల కింద కోర్టు విజయ కుమార్ కృష్ణసామికి ఐదేళ్ళ తొమ్మిది నెలలు, చంద్రశేఖర్ నలయన్‌కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వీరిద్దరు ఇప్పటికే 2.4 మిలియన్ పౌండ్ల మనీలాండరింగ్‌కు పాల్పడటమే కాక మరో 1.6 మిలియన్ పౌండ్ల(భారత కరెన్సీలో రూ.14,92,45,120.00) మనీలాండరింగ్ ప్రయత్నంలో ఉన్నారని ఎకనామిక్ క్రైమ్ యూనిట్ పోలీసులు తెలిపారు. ఈ సందర్బంగా డిటెక్టివ్ కానిస్టేబుల్ మిలేనా బింగ్లీ, మాట్లాడుతూ.. ‘ఇది సంక్లిష్టమైన కేసు. బ్యాంకింగ్ రంగంలోని మా భాగస్వాములు, సైబర్ డిఫెన్స్ అలయన్స్(సీడీఏ) వారి సహకారంతో వీరిని పట్టుకోగలిగాము. అయితే ఇది 2018 నాటి కేసు. దక్షిణ లండన్‌లోని క్రోయిడాన్ క్రౌన్ కోర్టు బార్క్లేస్ బ్యాంక్ అధికారులు మొదటి సారి వీరి మీద ఫిర్యాదు చేశారు’ అని బింగ్లీ తెలిపారు. వేరువేరు ఐపీ అడ్రస్‌ల ద్వారా తమ బ్యాంక్‌లోని పలు బిజినెస్ అకౌంట్లను నిందితులిద్దరు యాక్సెస్ చేసి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారని బింగ్లీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎకనామిక్ క్రైమ్ యూనిట్.. సీడీఏతో కలిసి ‘ఆపరేషన్ పాల్కాల్లా’ను ప్రారంభించింది అన్నారు. ఈ క్రమంలో అనుమానిత ఐపీ అడ్రెస్‌లను ట్రేస్ చేసి దర్యాప్తు ప్రారంభించి.. చివరకు నిందితులను పట్టుకున్నామని బింగ్లీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 24 కంపెనీలు వీరి చేతిలో మోసపోయాయి అన్నారు. నిందితులిద్దరు ఈ హవాలా సొమ్మును యూకే దాటించారని.. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేము అన్నారు బింగ్లీ.. -
ఏడేళ్ల జైలు.. 5 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. కోవిడ్‌పై ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఆశ కార్యకర్తలు, ఇతర పారామెడికల్ సిబ్బందిపై దాడులు చేస్తే తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదన్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని, ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని జవదేకర్ వివరించారు. ఆస్తి నష్టం జరిగితే, ఆ ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు వసూలు చేస్తామన్నారు. కోవిడ్–19కు చికిత్స అందించే లేదా కరోనా వ్యాప్తిని నిర్ధారించే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది తమతో పాటు కరోనా వైరస్‌ను తీసుకువస్తున్నారనే అనుమానంతో వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమానులు, స్థానికులు ఆయా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా ఈ చట్టం కింద కఠిన చర్యలుంటాయన్నారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎపిడమిక్ డిసీజెస్ చట్టం, 1897కు సవరణలు చేస్తామన్నారు. కరోనా విపత్తు ముగిసిన అనంతరం కూడా ఈ చట్టంలోని నిబంధనలను కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు పూర్తి వివరణ ఇవ్వకుండా.. ‘ఎపిడమిక్ చట్టానికి సవరణ చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ ఇది, అయితే, ఇది మంచి ప్రారంభం’అని మాత్రం వ్యాఖ్యానించారు. కోవిడ్–19పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రూ. 50 లక్షల బీమా కల్పిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని జవదేకర్ గుర్తు చేశారు. కరోనా పేషెంట్ల కోసం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.86 లక్షల బెడ్స్, 24 వేల ఐసీయూ బెడ్స్‌తో 723 కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేశామన్నారు. రూ. 15 వేల కోట్ల ప్యాకేజీ కరోనాపై పోరుకు అవసరమైన అత్యవసర నిధి కోసం రూ. 15 వేల కోట్లతో ‘ఇండియా కోవిడ్–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక చికిత్స కేంద్రాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఈ మొత్తంలో రూ. 7,774 కోట్లను ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ కింద వినియోగించాలని, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి నాలుగేళ్లలో ఇతర అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. కోవిడ్‌చికిత్సకు వాడే వైద్య పరికరాలు, ఔషధాలను సమకూర్చుకోవడంతో ఇతర అత్యవసరాల కోసం, ప్రత్యేక లాబొరేటరీలు, పరిశోధనశాలల ఏర్పాటుకూ నిధులు వాడతారు. ప్యాకేజీ కింద అదనంగా, రూ. 3 వేల కోట్లను ప్రస్తుతమున్న వైద్య సదుపాయాలను కోవిడ్ వైద్య కేంద్రాలుగా ఆధునీకరించడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే అందజేశారు. ‘ల్యాబొరేటరీ నెట్‌వర్క్‌ను విస్తరించాం. రోజువారీ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. 13 లక్షల టెస్టింగ్ కిట్స్ కోసం ఆర్డర్ పెట్టాం’ అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భద్రతలో రాజీలేదు: మోదీ కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందికి భద్రత కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తాజాగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్పష్టం చేస్తుందన్నారు. ప్రతీ ఆరోగ్య కార్యకర్తకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ట్వీట్ చేశారు. -
ఇక్కడైతే బతికిపోయేవాడు
హాలీవుడ్ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌కి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యారు హార్వీ. పలువురు నటీమణులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. ఆ తర్వాతే ‘మీటూ ఉద్యమం’ ఊపందుకుంది. ఇటీవల జరిగిన కేసు విచారణలో హార్వీకు 23 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. కోర్టు నిర్ణయంపై పలువురు హాలీవుడ్ హీరోయిన్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హార్వీ వయసు 67 ఏళ్లు. ఇదిలా ఉంటే... ఇండియన్ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం బాగా ఊపందుకోవడానికి కారణం బాలీవుడ్లో నటి తనుశ్రీ దత్తా, సౌత్‌లో సింగర్ చిన్మయి. ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేశారు చిన్మయి. ఇప్పుడు హార్వీకి శిక్ష పడిన విషయాన్ని ఉద్దేశించి ‘‘ఇండియాలో పుట్టి ఉండాల్సింది అని హార్వీ అనుకునే వాడేమో. ముఖ్యంగా తమిళ నాడులో. ఇక్కడ ఉండి ఉంటే పార్టీలు చేసుకునేవాడు. తనకి పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేసుండేవి’’ అని ఇక్కడైతే హార్వీ బతికిపోయేవాడనే అర్థం వచ్చేట్లు చిన్మయి ట్వీట్ చేశారు. -
జైలుకి హార్వీ వెయిన్‌స్టీన్
తమపై లెంగిక వేధింపులు జరిపాడు అంటూ హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై ఆరోపణలు చేశారు పలువురు హాలీవుడ్ నటీమణులు. దాంతో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకుంది. తాజాగా హార్వీ వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమే అంటూ జ్యూరీ తేల్చింది. పన్నెండు మంది (ఏడుగురు మగవాళ్లు, ఐదుగురు ఆడవాళ్లు) సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ జ్యూరీ ఐదురోజులపాటు సమీక్షించి వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలోని నిజానిజాలు తేల్చారు. ఈ కేసులో వెయిన్‌స్టీన్‌కి ఐదేళ్ల నుంచి 25 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందట. మార్చి 11న వెయిన్‌స్టీన్ జైల్‌కి వెళ్లనున్నారు. అయితే ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ‘‘వెయిన్‌స్టీన్ గురించి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్లకి, ఇన్ని రోజులు ఆ బాధను అనుభవించిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మీ ధైర్యం ప్రపంచంలో ఎందరో మహిళలకు పబ్లిక్ సర్వీస్లాంటిది. మరోసారి అందరికీ థ్యాంక్స్’’ అన్నారు నటి ఆఫ్లే జూడ్. వెయిన్‌స్టీన్ గురించి తొలిసారి బాహాటంగా ఆరోపణ చేశారామె. ఆ తర్వాత మిగతావాళ్లు బయటికొచ్చారు. -
సయీద్‌కు 11 ఏళ్ల జైలు
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో జైలు శిక్ష పడింది. ఉగ్రవాదానికి నిధులు అందించారన్న కేసులో విచారణ జరిపిన పాకిస్తాన్‌లోని ఉగ్రవ్యతిరేక (ఏటీసీ) పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. సయీద్‌తోపాటు అతడి సన్నిహిత సహచరుడు జఫర్ ఇక్బాల్‌కూ 11 ఏళ్ల శిక్ష విధిస్తూ ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ భుట్టా ఆదేశాలు జారీ చేశారు. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గతంలోనే ప్రకటించింది. అతడి తలకు అమెరికా గతంలో కోటి డాలర్ల వెలకట్టింది. గత ఏడాది జూలై 17న అరెస్ట్ అయిన సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైల్లో ఉన్నారు. లాహోర్, గుజ్రన్‌వాలాల్లో దాఖలైన రెండు కేసుల్లో సయీద్‌కు శిక్ష విధించారని, ఒక్కో కేసులో ఐదున్నర ఏళ్లు జైలు శిక్ష, మొత్తం 15 వేలరూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని, రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఏటీసీ కోర్టు గత ఏడాది డిసెంబర్ 11న సయీద్, అతడి సన్నిహిత సహచరులను దోషులుగా ప్రకటించగా..శిక్ష ఖరారును ఫిబ్రవరి 11వ తేదీ వరకూ వాయిదా వేయడం తెల్సిందే. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్ హామీని నెరవేర్చాలని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఒకటి ఇచ్చిన పిలుపుతో పాక్ ప్రభుత్వం సయీద్, అతడి అనుచరులపై విచారణ ప్రారంభించింది. -
చిన్నారిపై అత్యాచారం.. దోషులకు 20 ఏళ్ల జైలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గాంధీనగర్‌లో 2013లో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఇటీవల దోషులుగా తేల్చిన కోర్టు.. గురువారం వారికి శిక్ష ఖరారు చేసింది. దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాధిత బాలికకు నష్ట పరిహారంగా రూ.11 లక్షలు చెల్లించాలని అదనపు సెషన్స్ జడ్జి నరేశ్ కుమార్ మల్హోత్రా ఆదేశించారు. గాంధీనగర్‌లో ఐదేళ్ల చిన్నారిని 2013 ఏప్రిల్ 15న మనోజ్ షా, ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని అత్యంత క్రూరంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఘటన జరిగిన 40 గంటల తర్వాత బాలికను గుర్తించిన పోలీసులు.. ఆమెకు ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలిక ప్రాణాలతో బయటపడింది. దోషులకు జీవిత ఖైదు విధించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితురాలి తరఫు లాయర్ చెప్పారు. -
టీచర్‌కు అయిదేళ్ల జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థితో మలమూత్రాలు ఎత్తించిన నేరంపై ఓ మున్సిపల్ టీచర్‌కు తమిళనాడు కోయంబత్తూరు కోర్టు శుక్రవారం అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. నామక్కల్ జిల్లా రామాపురంపుదూర్ మున్సిపల్ పాఠశాలలో 2,3వ తరగతులకు ఒకే గదిలో క్లాసులు నిర్వహించేవారు. స్కూలుకు సమీపంలో నివసిస్తున్న వీరాస్వామి కొడుకు శచీంద్రన్ 2015లో 2వ తరగతి విద్యార్థిగా ఉన్నకాలంలో, తనకు తెలియకుండానే మలమూత్రాలను విసర్జించాడు. క్లాస్ టీచర్ విజయలక్ష్మి (35) శచీంద్రన్ చేత మలమూత్రాలు ఎత్తించివేసినట్లు అదే ఏడాది నవంబరు 12న వీరాస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద టీచర్ విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై నామక్కల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్లుగా విచారణ జరిపి టీచర్ విజయలక్ష్మికి అయిదేళ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఆమెను కోయంబత్తూరు జైలుకు తరలించారు. -
జైపూర్ పేలుళ్ల కేసులో నలుగురికి ఉరి
జైపూర్: 2008 నాటి జైపూర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ శర్మ శుక్రవారం తుదితీర్పు వెలువరించారు. దోషులకు రూ.50 వేల జరిమానా విధించారు. ‘వేర్వేరు ప్రాంతాల్లో బాంబులు ఏర్పాటు చేసినందుకు ఐపీసీ 302 సెక్షన్ కింద నలుగురు దోషులకు మరణశిక్ష విధించారు’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీచంద్ తెలిపారు. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళతామని దోషుల తరఫు లాయర్ చెప్పారు. రెండు రోజుల క్రితం మహమ్మద్ సైఫ్, మహమ్మద్ సర్వార్ అజ్మీ, మహమ్మద్ సల్మాన్, సైఫురీష్మన్ అనే నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునివ్వగా మరో నిందితుడు షాబాజ్ హుస్సేన్‌ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా విడుదల చేసింది. నిందితులుగా ఉన్న మరో ఇద్దరు అదే ఏడాది ఢిల్లీల్దో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. -
ముషారఫ్ ఎప్పటికీ ద్రోహి కాదన్న పాక్ ఆర్మీ
-
ముషారఫ్‌కు పాక్ ప్రభుత్వం మద్దతు
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో ఉరిశిక్ష పడ్డ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మద్దతివ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కోర్ కమిటీతో అత్యవసర సమావేశం అయ్యారు. ఆశ్చర్యమేంటంటే ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షంలో ఉండగా ముషారఫ్ రాజద్రోహం కేసుకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలపగా, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ముషారఫ్‌కు మద్దతుగా ఆర్మీ కూడా నిలుస్తోంది. మాజీ సైనికాధ్యక్షుడైన ముషారఫ్.. ఎప్పటికీ ద్రోహి కాదని, కోర్టు తీర్పును ఖండిస్తున్నట్లు ప్రకటించింది. -
‘నిర్భయ’ దోషుల కేసును మరో జడ్జికి అప్పగించండి
న్యూఢిల్లీ: మరో న్యాయమూర్తికి తమ కేసును బదిలీ చేయాలంటూ అత్యాచార బాధితురాలైన నిర్భయ తల్లిదండ్రులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అలాగే, అత్యాచారానికి పాల్పడిన దోషుల ఉరిశిక్షను త్వరగా అమలు చేసేలా తీహార్ జైలు అధికారులను ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై 25న విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. నిర్భయ కేసును విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ కావడంతో, ఈ కేసు పదేపదే వాయిదా పడుతోందని నిర్భయ తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లైంగిక వేధింపుల కేసులను త్వరితగతిన విచారించేందుకు పటియాలా హౌజ్‌కోర్టులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కోర్టు న్యాయమూర్తి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. -
హాట్‌డాగ్ తినలేదని కొట్టి చంపేసింది
కాన్సాస్: సాండ్ విచ్ తినలేదన్న కోపంతో కన్నకొడుకుని కొట్టి చంపిన నేరానికి ఆ తల్లికి అమెరికాలో కోర్టు 19ఏళ్లకు పైగా శిక్ష విధించింది. అదే నేరంలో పాల్గొన్న ఆమె ప్రియుడికి 49 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాన్సాస్‌లో విచితకు చెందిన ఎలిజబెత్ వూల్హీటర్ గత ఏడాది రెండేళ్ల వయసున్న తన కుమారుడు ఆంటోనీకి ‘హాట్‌డాగ్’ సాండ్విచ్ తినమని ఇచ్చింది. ఆ బాలుడు నిరాకరించడంతో బాగా కొట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో న్యాయస్థానం తల్లికి 19 ఏళ్ల 5 నెలలు ఖైదు, నేరంలో పాలుపంచుకున్న ఆమె ప్రియుడికి 49 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
‘గృహ’ కుంభకోణంలో 48 మందికి శిక్షలు
సాక్షి, ముంబై: జల్గావ్ గృహనిర్మాణ పథకం కుంభకోణంలో ధులే జిల్లా కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రము ఖులైన మాజీ మంత్రి, శివసేన నేత సురేష్ జైన్, ఎన్సీపీ నేత గులాబ్రావ్ దేవకర్‌లతోపా టు మొత్తం 48 మందిని జల్గావ్ జిల్లా కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరిలో సురేష్ జైన్‌కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. గులాబ్‌రావు దేవకర్‌కు అయిదేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా, బిల్డర్ జగన్నాథ్ వాణీ, రాజేంద్ర మయూర్‌లకు ఏడేళ్ల జైలు, రూ.40 కోట్ల జరిమానా, ప్రదీప్ రాయసోనికి అయిదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 1999లో జల్గావ్ మున్సిపాలిటీ ప్రారంభించిన గృహనిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయి. -
‘ట్రిపుల్ తలాక్’ చట్టాన్ని పరిశీలిస్తాం!
న్యూఢిల్లీ: ముస్లింలలో తక్షణ ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించి, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కేంద్రం తెచ్చిన చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్ల మేరకు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం–2019’ని ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించటం తెలిసిందే. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను పరిశీలించాలంటూ వచ్చిన నాలుగు పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగీల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదిస్తూ, ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా మార్చడం, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడం పట్ల తాము ఆందోళనతో ఉన్నామన్నారు. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పినందున ఇప్పుడు శిక్షార్హమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. బాధిత మహిళ వాదన విన్నాకనే బెయిలు మంజూరు చేయాలన్న షరతు కూడా సరికాదని ఖుర్షీద్ తెలిపారు. ‘ట్రిపుల్ తలాక్ చెల్లదని కోర్టు గతంలోనే చెప్పినందున ఇప్పుడు ఆ పద్ధతే లేదు. మరి వారు దేనిని నేరంగా పరిగణిస్తారు’ అని ఆయన ప్రశ్నించారు. దీనికి కోర్టు స్పందిస్తూ మరి ఎవరైనా ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ పద్ధతిలో విడాకులిస్తే ఏం చేయాలనీ, దీనికి పరిష్కారం ఏంటని ప్రశ్నించింది. ఖుర్షీద్ సమాధానమిస్తూ ట్రిపుల్ తలాక్‌ను కోర్టు ఎప్పుడో రద్దు చేసిందని మళ్లీ చెబుతూ, చట్టంలోని వివిధ ఇతర అంశాలను పరిశీలించాలని కోరారు. -
జాధవ్‌ను కలుసుకోవచ్చు!
న్యూఢిల్లీ: పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు ఎట్టకేలకు న్యాయసహాయం పొందే అవకాశం దక్కింది. భారత దౌత్యాధికారులు జాధవ్‌ను శుక్రవారం కలుసుకోవచ్చని భారత విదేశాంగశాఖకు పాక్ గురువారం సమాచారమిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం భారత్ దౌత్యాధికారులు జాధవ్‌ను కలుసుకోవచ్చునని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ చెప్పారు. గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై పాక్ సైనిక కోర్టు జాధవ్‌కు వేసిన మరణశిక్షను పునః పరిశీలించాలని ఇటీవల అంతర్జాతీయ కోర్టు చెప్పింది. న్యాయ సహాయం అంటే.. 1963 వియన్నా ఒప్పందం ప్రకారం రెండు స్వతంత్ర దేశాల మధ్య న్యాయ సహాయ సంబంధాలు ముఖ్యం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ప్రకారం ఏదైనా దేశం విదేశీ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటే వారి హక్కుల్ని కాపాడడానికి ఆలస్యం చేయకుండా అరెస్ట్‌కు సంబంధించిన విషయాన్ని ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారం అందించాలి. అరెస్ట్‌కి కారణాలు వివరించాలి. తనకు లాయర్ కావాలని నిర్బంధంలోని వ్యక్తి కోరితే ఆ ఏర్పాటు చేయాల్సిందే. భారత్‌కు ఎలా ప్రయోజనం ? ఇన్నాళ్లూ ఏకపక్షంగా విచారణ జరిపి జాధవ్ గూఢచారి అని పాక్ ముద్రవేసింది. లాయర్ని నియమిస్తే జాధవ్ వైపు వాదన ప్రపంచానికి తెలుస్తుంది. అతని అరెస్ట్ వెనుక నిజానిజాలు వెలుగు చూస్తాయి. పాకిస్తాన్ కుటిలబుద్ధిని బయటపెట్టే అవకాశం భారత్‌కు లభిస్తుంది. -
‘ట్రిపుల్ తలాక్’కు లోక్‌సభ ఓకే
న్యూఢిల్లీ: ముస్లిం మతస్తులు పాటిస్తున్న ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని శిక్షార్హం చేస్తూ రూపొందించిన బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రం ముస్లిం మహిళల(వివాహ హక్కుల రక్షణ) బిల్లు–2019ను తీసుకొచ్చింది. కాగా, ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లును పరిశీలించేందుకు వీలుగా స్థాయీ సంఘానికి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, కేంద్రం అంగీకరించలేదు. ఈ సందర్భంగా ఇటు బీజేపీ, అటు విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టరాదన్న ప్రతిపక్షాల డివిజన్‌ను 302–82 తేడాతో లోక్‌సభ తిరస్కరించింది. అలాగే ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లిం పురుషులకు మూడేళ్లవరకూ జైలుశిక్ష విధించే సవరణకు లోక్‌సభ 302–78 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీచేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై స్పందించేందుకు మహిళా ఎంపీలైన పూనమ్ మహాజన్, అపరజితా సేన్, మీనాక్షి లేఖీలను మోహరించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. 16వ లోక్‌సభ ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందకపోవడం, ఆర్డినెన్స్ గడువు ముగిసిపోవడంతో కేంద్రం మరోసారి బిల్లును ప్రవేశపెట్టింది. మొహమ్మద్ ప్రవక్తే వ్యతిరేకించారు.. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘2017, జనవరి నుంచి ఇప్పటివరకూ 574 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదుకాగా, ఆర్డినెన్స్ జారీచేశాక 101 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల నిరోధక చట్టం లేదా గృహహింస చట్టం కింద హిందువులు, ముస్లింలు జైలుకు వెళితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ట్రిపుల్ తలాక్ విషయంలోనే అభ్యంతరాలు ఎందుకు? ట్రిపుల్ తలాక్‌ను నియంత్రించేందుకే ఇందులో మూడేళ్ల జైలుశిక్షను చేర్చాం. ఈ ఆచారాన్ని మొహమ్మద్ ప్రవక్త కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును ఆపేయాలన్న దురుద్దేశంతోనే స్థాయీ సంఘానికి పంపాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. ట్రిపుల్ తలాక్‌పై 20 ఇస్లామిక్ దేశాల్లో నియంత్రణ ఉంది. భారత్‌లాంటి లౌకికవాద దేశంలో ఎందుకుండకూడదు?’ అని ప్రశ్నించారు. ఈ బిల్లును మహిళల ఆత్మగౌరవం, లింగ సమానత్వం కోసమే తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ముస్లిం పురుషులే లక్ష్యం: కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్‌కు జైలుశిక్ష పడేలా చట్టాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు చెప్పలేదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తెలిపారు. ముస్లిం మహిళలతో పాటు భర్తలు వదిలేసిన హిందూ, పార్సీ మహిళలకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింలతో పోల్చుకుంటే హిందువుల్లో విడాకుల కేసులు ఎక్కువని మరో కాంగ్రెస్ నేత మొహమ్మద్ జాఫ్రి చెప్పారు. ముస్లిం పురుషులను జైలుకు పంపించడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అన్నది అనాగరికమేననీ, అయితే కేంద్రం తెచ్చిన బిల్లుపై తాము సుముఖంగా లేమని సీపీఎం నేత ఏ.ఎం.షరీఫ్ అన్నారు. డిప్యూటీ స్పీకర్‌పై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు వివాదాలకు కేరాఫ్‌గా మారిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత ఆజంఖాన్ గురువారం నోరు జారారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఆజంఖాన్ మాట్లాడుతుండగా, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. సహనం కోల్పోయిన ఆజంఖాన్ నఖ్వీవైపు చూస్తూ..‘మీరు అటూఇటూ కాని మాటలు మాట్లాడవద్దు’ అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రమాదేవి స్పందిస్తూ..‘మీరు కూడా అటూఇటూ చూడకుండా స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి మాట్లాడండి’ అని కోరారు. వెంటనే ఆజంఖాన్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేయగా, ఆజంఖాన్ తిరస్కరించారు. రమాదేవి తనకు సోదరిలాంటివారనీ, తప్పుగా మాట్లాడుంటే రాజీనామా చేసేందుకైనా సిద్ధమన్నారు. ఆయన వ్యాఖ్యలను డెప్యూటీ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. మరోవైపు ఆజంఖాన్‌కు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ మద్దతుగా నిలిచారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది. వివాహవ్యవస్థ నాశనమవుతుంది: ఒవైసీ కేంద్రం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఇస్లామ్‌లో 9 రకాల తలాక్ పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ ఈ చట్టం ప్రకారం ముస్లిం భర్త జైలుకు వెళితే ఆయన భార్య పోషణను ఎవరు చూసుకోవాలి? మీరు(కేంద్ర ప్రభుత్వం) వివాహ వ్యవస్థనే నాశనం చేయాలనుకుంటున్నారు. ముస్లిం మహిళలను రోడ్డుపై పడేయాలనుకుంటున్నారు. ముస్లిం మహిళల హక్కులపై అంత ప్రేమున్న బీజేపీ ప్రభుత్వం 2013 ముజఫర్‌పూర్ అల్లర్లలో అత్యాచారాలకు గురైన ముస్లిం మహిళలకు ఎందుకు న్యాయం చేయట్లేదు. ఈ అకృత్యాలకు సంబంధించి ఇప్పటివరకూ దోషులకు శిక్షపడలేదు. జల్లికట్టును నిషేధిస్తూ చట్టాన్ని తెచ్చిన మీరు ముస్లింల మూకహత్యలను నిరోధిస్తూ చట్టం తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారు. మహిళల హక్కులపై నిజంగా బీజేపీకి అంత ప్రేముంటే ప్రత్యేక విమానంలో తమ మహిళా ఎంపీలను శబరిమలకు తీసుకెళ్లాలి’ అని ఒవైసీ చురకలు అంటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్థానం ► 2016, ఫిబ్రవరి 5: ట్రిపుల్ తలాక్, నిఖా హలా ల, బహుభార్యత్వాల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లలో కక్షిదారులకు సహకరించాల్సిందిగా సుప్రీం కోర్టు అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గిని కోరింది. ► మార్చి 28: మహిళలకు సంబంధించి పెళ్లి, విడాకులు తదితర అంశాలపై అతున్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ► అక్టోబర్ 7: ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. లైంగిక సమానత్వం, లౌకికవాదం ఆధారం గా ఈ ట్రిపుల్ తలాక్‌పై పరిశీలన జరపాలని కోరింది. ► 2017, ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాల పిటిషన్లపై విచారణ జరపడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ► మార్చి 27: ట్రిపుల్ తలాక్ విషయం న్యాయస్థానం పరిధిలోకి రాదని, ఆ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది. ► మే 18: ట్రిపుల్ తలాక్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది. ► ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు దీన్ని చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై చట్టం చేయాలని ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ► డిసెంబర్: ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన ‘ముస్లిం మహిళల బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ► 2018, ఆగస్టు 9: కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు చేసింది. నిందితులకు బెయిలు పొందే అవకాశం కల్పిస్తూ ఈ సవరణలు చేశారు. ► ఆగస్టు 10: ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.అయితే, బిల్లు సభ ఆమోదం పొందలేదు. ► సెప్టెంబర్ 19: ట్రిపుల్ తలాక్‌పై రూపొందిం చిన ఆర్డినెన్సును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ఈ ఆర్డినెన్సును రూపొందించారు. ► డిసెంబర్ 31: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును మళ్లీ ప్రతిపక్షం అడ్డుకుంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండు చేసింది. -
‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శరవణ భవన్ హోటళ్ల గ్రూప్ అధినేత పి.రాజగోపాల్ (73), కోర్టు విధించిన యావజ్జీవ జైలు శిక్షను అనుభవించడానికి ముందే గురువారం కన్నుమూశారు. 2001లో ఓ ఉద్యోగిని హత్య చేసిన కేసులో రాజగోపాల్ యావజ్జీవ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పది రోజుల క్రితమే కోర్టులో లొంగిపోయారు కూడా. ఆ వెంటనే అనారోగ్యం కారణంగా రాజగోపాల్ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 10 గంటలకు మరణించారు. ఆయన అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్యులు వెల్లడించలేదు. జ్యోతిష్యుడు చెప్పాడంటూ తన దగ్గర పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూతురిని రాజగోపాల్ మూడో పెళ్లిచేసుకోవాలనుకోగా, అందుకు ఆమె ఒప్పుకోకుండా శరవణ భవన్‌లోనే పనిచేస్తున్న శాంతకుమార్ అనే ఉద్యోగిని వివాహం చేసుకుంది. దీంతో ఎలాగైనా ఆమెను పెళ్లిచేసుకునేందుకు శాంతకుమార్‌ను రాజగోపాల్ హత్య చేయించాడు. ఈ కేసులో రాజగోపాల్‌తోపాటు మరో ఎనిమిది మందికి జైలు శిక్ష పడింది. ఆ శిక్షను అనుభవించకుండానే రాజగోపాల్ గురువారం కన్ను మూశాడు. కాగా, రాజగోపాల్ స్థాపించిన శరవణ భవన్ హోటళ్లు ఇండియాలోని పలు నగరాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ సహా 20 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. -
‘మైనర్ మృగాడి’కి జీవిత ఖైదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ హాకా భవన్‌లోని చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు గురువారం దేశంలోనే అత్యంత అరుదైన, సంచలనాత్మకమైన తీర్పు నిచ్చింది. చిన్నారులపై లైంగిక దాడులు నిరోధించడానికి అమలులోకి వచ్చిన పోక్సో యాక్ట్ కింద ఓ చిన్నారిపై అత్యాచారం జరిగిన కేసులో, నేరం చేసిన మరో బాలుడికి జీవితఖైదు విధించింది. ఈ తరహా కేసులో ఇలాంటి తీర్పు రావడం దేశంలోనే ఇది తొలిసారి అని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారికి రూ.20 వేల రివార్డు ప్రకటించారు. సంచలనం సృష్టించిన కేసు పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పరిధిలో పదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, అసహజ లైంగిక దాడికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన కేసులో నేరం చేసిన బాలుడిని దోషిగా నిర్ధారించిన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు గురువారం అతడికి కఠిన శిక్ష విధించింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఐదు సెక్షన్ల కింద రెండు జీవిత ఖైదులు, రెండు పదేళ్ల కఠిన కారాగార శిక్షలు, మరో ఏడేళ్ల శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి కుంచాల సునీత సంచలనాత్మక తీర్పు వెలువరించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో (కాంకరెంట్లీ) అమలవుతాయని పేర్కొన్నారు. 2017 జూలైలో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రెండేళ్లలోపే తీర్పు వెలువరించడం విశేషం. బార్కాస్ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ కుమారుడు (10) అదే ప్రాంతంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదివేవాడు. 2017 జూన్ 26న బార్కాస్ బజార్ ప్రాంతంలో మేళా వద్ద ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అతడి కోసం గాలించిన కుటుంబసభ్యులు బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో మరుసటి రోజు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. బడీ మసీదు వద్ద ఆడుకుంటున్న చిన్నారికి బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపిన మరో బాలుడు అతడిని బార్కాస్ ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు. సాయంత్రం పాఠశాల గ్రిల్స్ తొలగించి భవనంపైకి తీసుకెళ్లి చిన్నారిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన బాలుడు తనకు నొప్పిగా ఉందని, ఈ విషయం తన తండ్రికి చెప్తాననడంతో ఆ బాలుడు భయపడ్డాడు. ఘటన వెలుగులోకి రాకుండా ఉండేందుకు చిన్నారిని హత్య చేయాలని నిర్ణయించుకుని, అక్కడే ఉన్న రాడ్లు, కర్రలతో దాడి చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసే ఉద్దేశంతో అక్కడి నుంచి తరలించేందుకు కాళ్లు, చేతులు కట్టేశాడు. అందుకు వీలు పడకపోవడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇలా మృతదేహాన్ని మరో చోటికి మార్చేందుకు రెండుసార్లు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో మిన్నకుండిపోయాడు. ఈ ఉదంతం జరిగింది మూడో అంతస్తుపైన కావడం, పాడుబడిన ఆ ప్రాంతానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్లకపోవడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. బాలుడి మిస్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టిన చాంద్రాయణగుట్ట పోలీసులు బార్కాస్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి అదృశ్యమైన రోజు మధ్యాహ్నం 1.28 గంటలకు ఓ యువకుడు చిన్నారిని తీసుకెళుతున్నట్లు కనిపించింది. దీన్ని చూసిన బాలుడి తండ్రి ఆ మైనర్ తన ఇంటి పక్కనే ఉండే బాలుడిగా గుర్తించాడు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... తొలుత తనకేమీ తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ చూపించడంతో నేరం అంగీకరించాడు. ఈ కేసులో చాంద్రాయణగుట్ట పోలీసులు హాకా భవన్‌లోని చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. న్యాయస్థానం పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 6 కింద నేరం చేసిన బాలుడికి జీవితఖైదు, హత్యా నేరం కింద మరో జీవితఖైదు, కిడ్నాప్ నేరం కింద, అసహజ లైంగికదాడి కింద పదేళ్ళ చొప్పున, ఆధారాలు నాశనం చేయడానికి ప్రయత్నించడంతో ఏడేళ్ళ శిక్ష విధించింది. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని స్పష్టం చేసింది. ప్రవీణ్, శ్రీనివాసరెడ్డిలకు ఇంతకంటే కఠినశిక్షలు బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో మైనర్లపై అత్యాచారం జరిపి, హత్య చేసి తన బావిలోనే పూడ్చిన సైకో శ్రీనివాసరెడ్డి, ఇటీవల వరంగల్‌లోని కుమార్‌పల్లిలో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి చేసి పాశవికంగా హత్య చేసిన ప్రవీణ్‌లకు ఇంతకుమించిన శిక్షలు పడతాయని పలువురు పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. -
‘తను పదే పదే జ్ఞాపకం వస్తోంది’
కశ్మీర్ : ఏడాదిన్నర క్రితం కథువాలో జరిగిన దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. కోర్టు తీర్పు తమకు సంతృప్తినివ్వలేదని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా భావించిన వ్యక్తినే నిర్దోషిగా విడుదల చేయడం పట్ల వారు నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘నా కూతుర్ని గుర్తు చేసుకోకుండా ఒక్క రోజు కూడా గడవడంలేదు. తను నాకు పదే పదే గుర్తుకొస్తుంటుంది. నా కళ్ల ముందే ఉన్నట్లు అన్పిస్తుంది. సోమవారం తీర్పు వస్తుందని నాకు చెప్పారు. కానీ కోర్టుకు వెళ్లి కూర్చోవాలనిపించలేదు. పదే పదే జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకోవాలంటే నాకు ధైర్యం సరిపోవడం లేదు. అందుకే కోర్టుకు వెళ్లలేదు. అయితే తీర్పు గురించి విన్నప్పుడు నాకు సంతోషం కలగలేదు. ఏడగురు నిందితులకు మరణ శిక్ష పడాలని భావించాను. కానీ తీర్పు అందుకు భిన్నంగా వచ్చింది. సంపూర్ణ న్యాయం జరిగినట్లు అనిపించడం లేద’న్నారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘రెండు నెలల క్రితం నా చిట్టితల్లి సమాధి దగ్గరికి వెళ్లాను. దుఃఖం ఆగలేదు. నేటికి కూడా తనను తల్చుకోని ఏడుస్తూనే ఉన్నాను. నా శోకం ఇప్పట్లో తీరదు. కనీసం తీర్పు అయినా మేం కోరుకున్న విధంగా వస్తే సంతోషించే వాళ్లం. కానీ అలా జరగలేదు. నిందితులందరిని ఉరి తీస్తేనే నా చిట్టితల్లి ఆత్మకు శాంతి చేకూరుతుంది. న్యాయం జరుగుతుంద’న్నారు. నిరుడు జనవరిలో జమ్మూలోని కథువాలో అసిఫా అనే ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు సాంజీ రాం, మరో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించడంతోపాటు సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మరో ముగ్గురికి అయిదేళ్ల జైలు శిక్ష, రూ. 50,000 చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సాంజీరాం కుమారుడు విశాల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించగా, ఆయనకు సమీప బంధువైన మైనర్ బాలుడు జువెనైల్ కోర్టులో విచారణనెదుర్కొంటున్నాడు. ఆ దురంతం సాధారణమైనది కాదు. అసిఫాను దారుణంగా హింసించి మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగు రోజులపాటు అత్యాచారం జరిపారు. చివరికామెను రాళ్లతో కొట్టి చంపారు. -
మరణించేవరకు జైలు జీవితమే..
పఠాన్‌కోట్: ఏడాదిన్నర క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన కఠువా సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సంజీరామ్ కొడుకు అయిన విశాల్‌ను కోర్టు సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేసిందని బాధితురాలి కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఫరూఖీ ఖాన్ చెప్పారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసును సంవత్సరంపాటు విచారించిన అనంతరం న్యాయమూర్తి తేజ్వీందర్ సింగ్ సోమవారం తీర్పు చెప్పారు. ఈ కేసును జమ్మూ కశ్మీర్లో కాకుండా బయటి కోర్టు విచారించాలని గతేడాది మే 7న సుప్రీంకోర్టు ఆదేశించడంతో పఠాన్‌కోట్ కోర్టు ఈ కేసును విచారించింది. రణ్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) కింద కోర్టు వారిని దోషులుగా తేలుస్తూ, బయట మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో వేచి ఉండగా తీర్పు వెల్లడించింది. కోర్టులోకి విలేకరులను అనుమతించలేదు. జమ్మూ కశ్మీర్‌లోని కఠువాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఆలయంలో సామూహిక అత్యాచారం, హత్య జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. బాలికను అపహరించి, ఆలయంలో బంధించి, నాలుగురోజుల పాటు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన అనంతరం బండరాళ్లతో మోదీ హత్య చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కోర్టు ఈ కేసులో మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చగా, వారిలో నలుగురు పోలీసులే కావడం గమనార్హం. మరణించేవరకు జైలు జీవితమే.. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆలయ సంరక్షకుడు సంజీరామ్, ప్రత్యేక పోలీస్ అధికారి (ఎస్పీవో) దీపక్ ఖజూరియాతోపాటు మరో వ్యక్తి ప్రవేశ్కుమార్లను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురూ అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వచ్చిన ఆరోపణలు రుజువైనట్లు కోర్టు తెలిపింది. వీరిని దోషులుగా ప్రకటిస్తూ జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదు అంటే మరణించేంత వరకు జైలులో ఉండాల్సిందేనని కోర్టు స్పష్టంగా వివరించింది. అలాగే మరో ఎస్పీవో సురేంద్ర వర్మ, ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోతే మరో ఆరునెలలు ఎక్కువగా జైలు జీవితం గడపాలని ఆదేశించింది. ఆనంద్ దత్తా, తిలక్ రాజ్‌లు కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు సంజీరామ్ నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. బాలిక సంచార జాతికి చెందిన అమ్మాయి కాగా, వారి మైనారిటీ జాతిని పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా పకడ్బందీగా కుట్ర పన్ని ఈ నేరానికి ఒడిగట్టారని చార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. తీర్పుపై మెహబూబా హర్షం.. కోర్టు తీర్పు పట్ల జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు హర్షం వ్యక్తం చేశారు. ‘నేరస్తులను చట్టానికి లోబడి వీలైనంత కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నేరస్తులకు మద్దతు తెలిపిన రాజకీయ నేతలను ఏదైనా అనడానికి అసలు పదాలు లేవు’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. బీజేపీ నాయకులు గతంలో నిందితులకు మద్దతుగా నిలవడం తెలిసిందే. దోషులకు అత్యంత కఠిన శిక్ష పడేలా చేయాలని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. దోషులందరికీ మరణశిక్ష వేయాలంటూ హైకోర్టులో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్మన్ రేఖా శర్మ కోరారు. మరణశిక్ష పడుతుందనుకున్నాం.. ‘నేరస్తులకు మరణశిక్ష పడుతుందని మేం ఆశించాం. నిర్దోషిగా బయటపడిన వ్యక్తీ.. ప్రధాన నిందితుడేనని మేం వింటున్నాం. అలాంటప్పుడు అతణ్ని ఎందుకు విడుదల చేశారు’అని బాలిక తండ్రి అన్నారు. బాధిత కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఓ ప్రకటన విడుదల చేస్తూ, తాము కోర్టు తీర్పును పరిశీలించిన అనంతరం పై కోర్టుకు వెళ్తామనీ, నిర్దోషిగా విడుదలైన విశాల్‌ను దోషిగా తేల్చాలని అప్పీల్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఓ బాలనేరస్థుడితో సహా మొత్తం ఎనిమిది మందిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయగా, ఏడుగురిపై విచారణను ఈ కోర్టు చూసుకుంది. ఎప్పుడేం జరిగిందంటే.. ► 2018 జనవరి 10: కఠువా జిల్లాలోని రసనా గ్రామంలో బకర్వాల్ సంచార జాతికి చెందిన 8 ఏళ్ల బాలిక గుర్రాలను మేపుతుండగా ఆమె ఆచూకీ గల్లంతు. ► జనవరి 12: బాలిక తండ్రి ఫిర్యాదుతో హీరానగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. ► జనవరి 17: బాలిక మృతదేహం లభ్యం. గ్యాంగ్‌రేప్ తర్వాత చంపేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి. ► జనవరి 22: దేశవ్యాప్త నిరసనలతో జమ్మూ కశ్మీర్ క్రైం బ్రాంచ్‌కు కేసు బదిలీ. ► ఫిబ్రవరి 16: నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన హిందూ ఏక్తా మంచ్. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. ► మార్చి 1: ప్రధాన నిందితుడు, ఆలయ సంరక్షకుడు సంజీరామ్ను బంధువైన బాల నేరస్తుడి అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ ఏక్తా మంచ్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు. ► ఏప్రిల్ 9: మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా తేల్చి, వారిలో ఏడుగురిపై అభియోగపత్రాన్ని కఠువా కోర్టులో దాఖలు చేసిన పోలీసులు ► ఏప్రిల్ 10: బాల నేరస్తుడినని చెప్పుకున్న ఎనిమిదో వ్యక్తి పైనా అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు. ► ఏప్రిల్ 14: మంత్రివర్గం నుంచి తప్పుకున్న చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. బాధితులకు న్యాయం చేయాలన్న ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్. ► ఏప్రిల్ 16: కఠువాలో ప్రధాన సెసన్స్ కోర్టు జడ్జి ముందు విచారణ ప్రారంభం. ► మే 7: కఠువా నుంచి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు విచారణను మార్చిన సుప్రీంకోర్టు. విచారణను రహస్యంగా, వేగవంతంగా, మీడియాకు దూరంగా చేపట్టాలని ఆదేశించిన సుప్రీం కోర్టు. ► 2019 జూన్ 3: విచారణను ముగించిన పఠాన్ కోట్ సెషన్స్ కోర్టు. ► జూన్ 10: దోషులుగా తేల్చుతూ తీర్పు వెల్లyì ంచిన కోర్టు. సాంజీ రామ్ కఠువా దోషులు దీపక్ ఖజురియా ఎస్సై ఆనంద్ దత్తా, సురేందర్ వర్మ, తిలక్ రాజ్ -
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనే ఆరోపణల కేసులో ఐఏఎస్ అధికారి (ఇప్పుడు గద్వాల–జోగులాంబ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు) గతంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చేసిన కె.శశాంక్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. జరిమానా సొమ్మును శశాంక్ వ్యక్తిగతంగా చెల్లించాలని, ఒకవేళ జరిమానా చెల్లించకపోతే 2 వారాలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పీల్ నిమిత్తం తీర్పు అమలును 6 వారాలపాటు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. కరీంనగర్‌లోని సిఖ్వాడి వీధిలోని తన ఇంటి స్థలం విషయంలో హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరించారని పేర్కొంటూ పూనం కౌర్ అలియాస్ పున్న భాయ్ దాఖలు చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది. సిఖ్వాడి వీధిలోని రెండు షాపులతో కూడిన ఇంటిని 2014లో కూల్చివేయడంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించే షాపుల సముదాయంలో ఆమెకు షాపు కేటాయించాలని, లేనిపక్షంలో భూసేకరణ చట్ట ప్రకారం ఆమెకు పరిహారం చెల్లించాలని అప్పట్లో హైకోర్టు కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న శశాంక్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీటిని అమలు చేయకపోవడంతో ఆమె కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. -
కొకైన్ అక్రమ రవాణా కేసులో యువతికి పదేళ్ల జైలు
హైదరాబాద్: కొకైన్ మాదక ద్రవ్యాన్ని అక్రమ రవాణా చేసిన కేసులో ఢిల్లీకి చెందిన జ్యోతిఝూ అనే యువతికి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్‌కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.లక్ష జరిమానాను విధిస్తూ సెషన్స్‌కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. మూడేళ్ల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ యువతి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తోందన్న సమాచారం అందుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి రంగనాథన్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెట్టారు. హైదరాబాద్‌కు చేరుకోగానే జ్యోతిఝాను అదుపులోకి తీసుకుని సోదాలు చేయగా ఐదు పుస్తకాల్లో రూ.పదికోట్ల విలువ చేసే కొకైన్ బయటపడింది. హైదరాబాద్‌లో ఉంటున్న ఓ నైజీరియన్ మిత్రుడికి ఈ పుస్తకాలను అందజేయాలనుకున్నట్లు నాటి విచారణలో తెలిపింది. యువతిని అదుపులోని తీసుకుని రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగ పత్రం నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బావమరిది హత్య కేసులో... బావమరిదిని హత్య చేసిన ఓ వ్యక్తికి జీవిత ఖైదుతోపాటు రూ.వేయి జరిమానా విధిస్తూ 8వ అదనపు జిల్లా అండ్ సెషన్స్ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. నాగోలు బ్లైండ్ కాలనీలో నివాసముండే బాబామీయా సలీమాబేగం దంపతులకు ముగ్గురు సంతానం. మద్యానికి అలవాటుపడి ప్రతిరోజూ భార్య సలీమాబేగంను హింసించేవాడు. ఆ క్రమంలో 2014 సెప్టెంబర్ 9న వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సలీమా బేగం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె సోదరుడు మహ్మద్ ఖలీం ఆ మరుసటిరోజే బాబామీయాపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. ఈ కేసు విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం ఎనిమిదవ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెలువరించారు. -
ఆ మాటలు ఇమామ్‌కు నచ్చాయి
పూర్వం ఖుర్ ఆన్ వాక్యాలు ప్రజలకు వివరించిన నేరానికి ఇమామ్ హంబల్ పై కొరడా దెబ్బల శిక్ష అమలయ్యింది. ఒక్కో కొరడా దెబ్బ ఒంటిమీద పడ్డప్పుడల్లా ‘‘ఇబ్నుల్ హైసమ్ను అల్లాహ్ మన్నించు గాక’’ అని గట్టిగా అరిచేవారు. ఇబ్నుల్ హైసమ్ కరుడుగట్టిన దొంగ. దోపిడీదారుడు. ఇమామ్ గారిపై కొరడా దెబ్బ పడగానే దొంగను మన్నించమని అల్లాహ్‌ను వేడుకోవడమేమిటా అని చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపోతూ అడిగారు. ‘‘అందరూ అనుకున్నట్లుగానే అతను చెడ్డవాడే; కానీ అతను చెప్పిన మాట నాకెంతగానో నచ్చింది’’ అని ఇమామ్ గారు వివరించడం మొదలెట్టారు... ‘‘నేను క్రితంసారి జైలుకెళ్లినప్పుడు అతను పరిచయమయ్యాడు. శిక్షాకాలం ముగిశాక విడుదలయ్యేటప్పుడు జైలు ఆవరణలో నన్ను చూసి అతను ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ‘‘మేమంటే దొంగపనులు చేశాము కాబట్టి జైలు కొచ్చాను. దొంగతనాలు, లూటీలు చేయడం, జైలుకు రావడం, విడుదలవడం, మళ్లీ దొంగతనాలు చేయడం ఇదంతా మాకు మామూలే; కానీ మీరు ఇంత ధార్మిక పరులై జైలు ఊచలు లెక్కించడమేమిటి?’ అని ఆశ్చర్యపోయాడు.‘‘ఖుర్ఆన్ గ్రంథాన్ని అందరూ చదివి, అర్థంచేసుకుని ఆచరించాలని చెప్పిన పాపానికి నేను ఖైదు చేయబడ్డాను’’ అని సంజాయిషీ ఇచ్చుకున్నాను. ‘‘నేనిప్పటివరకూ లెక్కలేనన్ని సార్లు ఈ జైలుకు వచ్చాను. వందల కొరడా దెబ్బలు నన్ను ముద్దాడాయి. ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా నా దొంగ బుద్ధిని మాత్రం మార్చుకోవడానికి సిద్ధంగా లేను. నేను చేస్తున్నది షైతాన్ పని, షైతాన్ను ఎప్పుడూ ఓడిపోనివ్వను. షైతాన్ ప్రతినిధిగా నేనే ఇలా ఉంటే; అల్లాహ్ ప్రతినిధిగా ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ అనే మీరు అల్లాహ్ సందేశాన్ని వివరించడంలో ఇంకెంత దృఢంగా ఉండాలో. మీరెప్పటికీ ఓడిపోకూడదు’’ అని అతను చెప్పిన మాటలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే అతని క్షమాభిక్షకోసం వేడుకుంటున్నాను’ అని వివరించారు. – ముహమ్మద్ ముజాహిద్ -
తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష
-
మద్యం తాగి బస్సు నడిపాడని..
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల గత మూడేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేక హెచ్చరికలు చేసినా ప్రమాదాలు మాత్రం జరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష పడింది. ఈ ఘటన కృష్ణాజిల్లా నందిగామలో విధులు నిర్వర్తిస్తున్న బస్సు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న మేక బుజ్జికి జైలు శిక్షతో పాటు అతడి డ్రైవర్ లైసెన్స్ సైతం రద్దు చేయాలని నందిగామ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆకుల సత్యనారాయణ అదేశాలు జారీ చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష -
అసాంజేకు 50 వారాల జైలు
లండన్: వికీలీక్స్ సహవ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే(47)కు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన నేరానికిగాను ఆయనకు 50 వారాల జైలు శిక్ష పడింది. స్వీడన్ మహిళ లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ కోర్టు నుంచి బెయిల్ పొందిన అసాంజే 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు. అసాంజేకు ఇచ్చిన దౌత్యపరమైన వెసులుబాటును ఈక్వెడార్ ప్రభుత్వం ఉపసంహరించుకోడంతో గత నెలలో బ్రిటన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై బుధవారం సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న జడ్జి డెబొరా టేలర్ అసాంజేకు 50 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు!
న్యూయార్క్: కళాశాలకు చెందిన కంప్యూటర్లకు భారీగా నష్టం కల్గించినందుకు తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) స్టూడెంట్ వీసాపై 2015లో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలో సెయింట్ రోజ్ కాలేజీలో 2017లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో ‘యూఎస్బీ కిల్లర్’ అనే పెన్‌డ్రైవ్ సాయంతో కాలేజీలోని 66 కంప్యూటర్లను పాడుచేశాడు. ఈ పనిని మొబైల్లో షూట్‌చేశాడు. అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నార్త్ కరోలినా పోలీసులు విశ్వనాథ్‌ను అరెస్ట్‌చేశారు. కావాలనే ఈ పనికి పూనుకున్నట్లు ఒప్పుకున్న అతడు జరిగిన నష్టం రూ.40 లక్షలు చెల్లించేందుకు కూడా అంగీకరించాడు. ఆగస్టులో కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. -
అమెరికాలో హెచ్1బీ స్కామ్
వాషింగ్టన్/న్యూయార్క్: హెచ్–1బీ వీసా కుంభకోణంలో భారత సంతతికి చెందిన ముగ్గురు కన్సల్టెంట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వచ్చే నెలలో వీరి కేసు విచారణకు రానుంది. సాంటాక్లారాకు చెందిన దత్తపురం కిశోర్(49), టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నివాసి కుమార్ అశ్వపతి(49), సాన్‌జోస్‌కు చెందిన సంతోష్ గిరి(42) కలిసి సాంటాక్లారాలో నానోసెమాంటిక్స్ అనే కన్సల్టింగ్ సంస్థను నడిపేవారు. వీరు కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉండే సాఫ్ట్వేర్, టెక్నాలజీ సంస్థలకు అవసరమైన విదేశీ వృత్తి నిపుణులను ఎంపిక చేసేవారు. కానీ, వీరు హెచ్–1బీ వీసాకు కీలకమైన ఐ–129 దరఖాస్తు సమర్పించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. పలు ప్రముఖ కంపెనీలతోపాటు తమ నానోసెమాంటిక్స్‌కు ఫలానా ఉద్యోగం కోసం విదేశీ నిపుణుల అవసరం ఉందంటూ నకిలీ పత్రాలతో ‘ఐ–129’దరఖాస్తు చేసేవారు. అలా వచ్చిన వారికి ఆ తర్వాత స్థానిక కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేవారు. ఇందుకుగాను వారి నుంచి కొంతమొత్తంలో వసూలు చేసేవారు. వాస్తవానికి ఆయా సంస్థల్లో ఎలాంటి ఖాళీలు ఉండవు. అభియోగాలు రుజువైతే గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1.50 కోట్ల జరిమానాతోపాటు ఒక్కో నేరానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బీమా మోసం.. భారతసంతతి వ్యక్తికి 12 ఏళ్ల జైలు ఆరోగ్య బీమాకు సంబంధించి భారీ మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తికి అమెరికా కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మిషిగాన్‌కు చెందిన బాబూభాయ్ భూరాభాయ్ రాథోడ్ వైద్యులకు లంచాలిచ్చి తన ఆరోగ్య బీమా కంపెలకు పేషెంట్లను రెఫర్ చేయించుకునేవాడు. ఈ నేరం రుజువు కావడంతో గతంలో ఓ కోర్టు జైలు శిక్ష విధించింది. జైలునుంచి బయటికొచ్చాకా అవే మోసాలుచేశాడు. దీంతో మరో కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరోవైపు, మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన ముగ్గురు భారతీయులను అక్కడి అధికారులు నిర్బంధించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన నేరంపై న్యూయార్క్ నార్తర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ వీరిని విచారించనున్నారు. ‘కాల్ సెంటర్’లో భారతీయుడికి జైలు అమెరికాలో వెలుగుచూసిన భారీ కాల్‌సెంటర్ కుంభకోణంలో భారతీయుడికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. అధికారులమంటూ చెప్పుకుని అమెరికా వాసులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన నేరానికి నిషిత్‌కుమార్ పటేల్ అనే వ్యక్తికి కోర్టు 8 ఏళ్ల 9 నెలల జైలు, రూ.1.30 కోట్ల జరిమానా విధించింది. భారత్‌లో నడిచే కాల్ సెంటర్ల నుంచి కొందరు వ్యక్తులు అమెరికా వాసులకు ఫోన్లు చేసేవారు. తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారులమని చెప్పి, రెవెన్యూ శాఖ బకాయిలను చెల్లించకుంటే జైలుఖాయమని బెదిరించేవారు. దీంతో వారు చెప్పినంత సొమ్మును చెల్లించేందుకు సిద్ధపడేవారు. వేర్వేరు మార్గాల్లో ఆ డబ్బును రాబట్టేందుకు అమెరికాలో కూడా ఒక ముఠా ఉండేది. వీరంతా కలిసి 2014–16 సంవత్సరాల్లో ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు ఈ దందా గుట్టురట్టు చేశారు. ఇందుకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 25వ తేదీన అలెజాండ్రో జువారెజ్ అనే వ్యక్తికి 15 నెలల జైలు శిక్ష పడింది. నిషిత్‌కుమార్‌పై చేసిన ఆరోపణలను పోలీసులు జనవరి 9వ తేదీన న్యాయస్థానంలో రుజువు చేయడంతో సోమవారం శిక్ష ఖరారైంది. -
సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే జైలుశిక్షా?
సాక్షి, హైదరాబాద్: సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపిన ఓ యువకుడికి 4 రోజుల జైలుశిక్ష విధిస్తూ సైబరాబాద్ నాలుగో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులు ‘కఠిన’మైనవిగా హైకోర్టు అభివర్ణించింది. ఇటువంటి చిన్న నేరాలకు జైలుశిక్ష విధించడం సబబుకాదని అభిప్రాయపడింది. వివరాలు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపారని పోలీసులు భరద్వాజ్ అనే యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ నాలుగో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అతడికి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ భరద్వాజ్ మేనమామ, కొండాపూర్‌కు చెందిన పంతంగి రమాకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.శశికిరణ్ వాదనలు వినిపించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం నేరమే అయినప్పటికీ, ముందు జరిమానా విధించి ఓ హెచ్చరిక జారీ చేసి ఉంటే బాగుండేదని ధర్మాసనం అభిప్రాయపడింది. చిన్న తప్పుకు జైలుశిక్ష అనుభవిస్తే, సమాజం ఆ యువకుడిని దోషిగా చూస్తుందని, దీని వల్ల అతని కుటుంబం వేదన అనుభవించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. న్యాయాధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని, 4 రోజులు జైలులో ఉండొస్తే, ఆ కళంకం ఎలా ఉంటుందో వారికి అర్థమవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. జైలుశిక్షను రద్దు చేసి అతనికి రూ.500 జరిమానా విధించింది. అతన్ని తక్షణమే విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.