1,500 మందికి శిక్ష తగ్గింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో బైడెన్ క్షమాభిక్ష, శిక్షాకాలం తగ్గింపుల జోరు పెంచారు. అమెరికా చరిత్రలో ఎన్నడూలేనంతగా ఒకేసారి ఒకేరోజు 1,500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. మాదకద్రవ్యాల వినియోగం, స్వలింగ సంపర్కులు తదితర నేరాలుచేసిన వాళ్లు వీరిలో ఉన్నారు. హింసాత్మకంకాని నేరాల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న మరో 39 మంది ఖైదీలకు బైడెన్ ఏకంగా క్షమాభిక్ష ప్రసాదించారు.
ఆధునిక అమెరికాలో ఒక అధ్యక్షుడు ఒకే రోజులో ఇంతమంది ఖైదీల పట్ల దయ చూపడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోవిడ్ సంక్షోభకాలంలో కారాగారాల్లో కరోనా విజృంభించి ఎక్కువ మంది ఖైదీలు వైరస్‌బారిన పడి మృతిచెందడం కంటే విడిగా దూరం దూరంగా ఉంటే మంచిదని భావించి ఆనాడు చాలా మందిని బైడెన్ సర్కార్ విడిచిపెట్టింది. అలా స్వస్థలాలకు వెళ్లిన ఖైదీలను కొని నెలలపాటు గృహనిర్బంధంలో ఉంచింది. గురువారం వీళ్లంతా శిక్షాకాలం తగ్గింపు ఉపశమనం పొందారు.
Comments
Please login to add a commentAdd a comment