Drug Addiction Cases
-
39 మందికి బైడెన్ క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో బైడెన్ క్షమాభిక్ష, శిక్షాకాలం తగ్గింపుల జోరు పెంచారు. అమెరికా చరిత్రలో ఎన్నడూలేనంతగా ఒకేసారి ఒకేరోజు 1,500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. మాదకద్రవ్యాల వినియోగం, స్వలింగ సంపర్కులు తదితర నేరాలుచేసిన వాళ్లు వీరిలో ఉన్నారు. హింసాత్మకంకాని నేరాల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న మరో 39 మంది ఖైదీలకు బైడెన్ ఏకంగా క్షమాభిక్ష ప్రసాదించారు. ఆధునిక అమెరికాలో ఒక అధ్యక్షుడు ఒకే రోజులో ఇంతమంది ఖైదీల పట్ల దయ చూపడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోవిడ్ సంక్షోభకాలంలో కారాగారాల్లో కరోనా విజృంభించి ఎక్కువ మంది ఖైదీలు వైరస్‌బారిన పడి మృతిచెందడం కంటే విడిగా దూరం దూరంగా ఉంటే మంచిదని భావించి ఆనాడు చాలా మందిని బైడెన్ సర్కార్ విడిచిపెట్టింది. అలా స్వస్థలాలకు వెళ్లిన ఖైదీలను కొని నెలలపాటు గృహనిర్బంధంలో ఉంచింది. గురువారం వీళ్లంతా శిక్షాకాలం తగ్గింపు ఉపశమనం పొందారు. -
మత్తులో.. చిత్తు కావొద్దు
ఖమ్మం: దేశాభివృద్ధిలో కీలకమైన యువత మాదకద్రవ్యాల బారిన పడుతోంది. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఎక్కడ పడితే అక్కడ లభిస్తుండడంతో పదిహేనేళ్ల లోపు పిల్లలు మొదలు యువత వరకు పలువురు మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని తెలుస్తోంది. మత్తు పదార్థాలు వివిధ రూపాల్లో లభిస్తుండడంతో ధూమపానం, మద్యపానం వంటివి క్రమంగా జీవితంలో భాగమై పలువురు విచక్షణ మరిచి నేరాలకు పాల్పడుతున్నారు.అంతేకాక ఈ అలవాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు మెట్రోపాలిటన్ నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పడు మారుమూల పల్లెలకు సైతం పాకింది. ఈనేపథ్యాన నేడు(బుధవారం) అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు.విద్యాసంస్థలే లక్ష్యంగా దందా..యువతే టార్గెట్‌గా ఉమ్మడి జిల్లాలో గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. కౌమారదశలో ఉన్న విద్యార్ధులు మంచి, చెడు గుర్తించలేక త్వరగా అలవాటయ్యే అవకాశముండడంతో సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న వ్యాపారుల కన్ను వారిపై పడింది. విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతించడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఇన్నాళ్లు పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో మాదకద్రవ్యాల అమ్మకం, వాడకం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజు గంజాయి పట్టుబడుతుండడం.. ప్రతీ పాన్‌షాపు, కిరాణ షాపుల్లోనూ లభిస్తున్నట్లు తెలుస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.సరదాగా మొదలు.. ఆపై వ్యసనంయుక్తవయస్సు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. సాహసాలు చేయాలని మనసు ఆరాటపడుతుంటుంది. దీంతో ఇలాంటి వారిని మత్తు పదార్థాలు ఆకర్షించే అవకాశముంది. ధూమపానం, మద్యపానం ఇతర మత్తుపదార్థాలు తొలినాళ్లలో సరదాగా అలవాటవుతున్నా ఆ తర్వాత వ్యసనంలా మారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. గంజాయిలో ఉండే టెట్రా హైడ్రోకెనబినాయిడ్(టీహెచ్‌సీ) రసాయనం వ్యక్తులను దానికి బానిసలుగా మారుస్తుంది.అది మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపి శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని దెబ్బతీయడమే కాక చురుకుదనాన్ని తగ్గిస్తుంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించిన తర్వాత వ్యక్తుల్లో భ్రమలు మొదలై నేరప్రవృత్తి పెరగడంతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు సైతం వస్తుంటాయి. దీంతో తమను తాము గాయపర్చుకోవడమే కాక దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదముంది.తల్లిదండ్రులు గమనించాలి..పిల్లలు, యువత మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా అడ్డుకోవడంలో తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం లేదంటే మౌనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందేనని చెబుతున్నారు. ఇలాంటి వారిని నిత్యం పర్యవేక్షిస్తూ వారి గదులు, బ్యాగులను తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. అంతేకాక ఎవరిరెవరితో తిరుగుతున్నారో పరిశీలిస్తే అవసరానికి మించి డబ్బు ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలని చెబుతున్నారు.మెదడుపై తీవ్ర ప్రభావం..మత్తుపదార్థాల వాడకం సరదాగా ప్రారంభమైనా వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తుపదార్థాలు తీసుకున్న వారి మెదడులో డోపమైన్, సెరటోనిన్ అనే ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. తద్వారా శరీరం ఉత్తేజంగా ఉన్నట్లు అనిపించి.. కాసేపటికి మళ్లీమళ్లీ తీసుకోవాలనిపిస్తుంది. క్రమంగా తీవ్రమైన మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. – డాక్టర్ అప్పారావు ఎండీ, డీఎం (న్యూరాలజీ)అందరూ భాగస్వాములు కావాలి : సీపీ సునీల్ దత్ఖమ్మంక్రైం: మాదకద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నివర్గాల ప్రజలు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరాలని కోరారు.ఈమేరకు వారం పాటు మాదకద్రవ్యాల వినియోగం, దుష్పలితాలపై విద్యాసంస్థల్లో అవగాహన కల్పించడమే కాక ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. అలాగే, ఐసీడీఎస్, పోలీస్ శాఖలోని యాంటీ నార్కోటిక్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యాన బుధవారం ఉదయం 7గంటలకు సర్ధార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు. -
జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కోసం ప్రత్యేక పరికరాలు న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్‌ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదీ చదవండి: Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్! -
డ్రగ్స్ అంటేనే వణుకు పుట్టాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ అంశంపై కొత్త ప్రభుత్వం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను ఉపయోగించాలంటే భయపడే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని.. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై సోమవారం సచివాలయంలో రేవంత్ సమీక్షించారు. ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సీవీ ఆనంద్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రేహౌండ్స్ మాదిరిగా నార్కోటిక్స్ బ్యూరో.. రాష్ట్రంలో ప్రస్తుతమున్న యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించాలని.. ఆ విభాగాన్ని బలోపేతం చేయాలని రేవంత్ ఆదేశించారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు, ఇతర సౌకర్యాలను సమకూర్చాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగాన్ని నిరోధించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ల మాదిరిగా టీఎస్ నాబ్‌ను తీర్చిదిద్దాలని సూచించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్, ఔషధ నియంత్రణ మండలి, పోలీస్ శాఖలకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సినీతారల డ్రగ్స్ కేసు ఏమైంది? గతంలో సంచలనం సృష్టించిన సినీ తారల డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. ఆ కేసు గురించిన కీలక అంశాలను అధికారుల నుంచి వివరంగా తెలుసుకున్నట్టు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ పలుమార్లు సినీ తారల డ్రగ్స్ కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై స్వయంగా కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో సోమవారం జరిగిన నార్కోటిక్స్ సమీక్షలో సీఎం హోదాలో డ్రగ్స్ కేసు వివరాలను ఆయన తెలుసుకున్నారు. సినీతారల కేసులో ఏం జరిగింది? ఇప్పుడా కేసు స్టేటస్ ఏమిటి? దర్యాప్తు ఎలా జరిగింది? నిందితుల నుంచి సేకరించిన ఎల్రక్టానిక్ డివైజ్‌లను, ఇతర కీలక వస్తువులను ఫోరెన్సిక్ పరిశీలనకు ఎందుకు పంపలేదంటూ ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రతి ఒక్కరి విచారణ సందర్భంగా చేసిన వీడియో రికార్డింగ్‌లు, వారి కాల్‌డేటా, ఎల్రక్టానిక్ డివైజ్‌లు, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించామని.. చార్జిషిట్ కూడా నమోదు చేశామని అధికారులు వివరించినట్టు తెలిసింది. -
రీల్స్ చేసేవారికి బంపర్ ఆఫర్.. రూ. 75 వేలు గెలుచుకునే ఛాన్స్
ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు పడిపోయారు. రోజులో కనీసం ఒకటి రెండు గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. ట్విట్టర్.. దేన్ని వదలడం లేదు. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన ‘రీల్స్ ఫీచర్’ పై జనాలు ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. చిన్నచిన్న వీడియోలు సైతం వైరల్‌గా మారుతున్నాయి. ఇది సామాన్యులను సైతం కంటెంట్ సృష్టికర్తలుగా మార్చేస్తోంది. రాత్రికి రాత్రే పెద్ద స్టార్‌డమ్‌ను తీసుకొస్తుంది. తాజాగా తెలంగాణ సర్కార్ రీల్స్ చేసే వారికి తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఎక్కువైతుండటంతో.. తామ కాన్సెప్ట్‌కు తగ్గట్టు ఆకట్టుకునే విధంగా రీల్స్ చేస్తే.. భారీ మొత్తం నగదు బహుమతి గెలుచుకోవచ్చని ప్రకటించింది. యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారి వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మాదక ద్రవ్యాల వినియోగం, దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26న షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ‘డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ’’ పేరుతో పోలీస్ శాఖ కాంటెస్ట్ నిర్వహించనుంది. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, దీనికి బానిసలైన వారి కుటుంబ సభ్యుల బాధలను తమ రీల్స్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ పోటీ ఉద్దేశం. 18 ఏళ్లు నిండిన వారందరూ ఈ పోటీలకు అర్హులని తెలిపింది. ఈ వీడియోను 3 నిమిషాల నిడివితో రూపొందించాల్సి ఉంది. కాగా జూన్ 20లోపు వీడియోలను పంపాల్సి ఉంటుంది.ఈ పోటీలో విజేతలకు బహుమతులు కూడా అందిజచున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విజేతకు రూ. 75,000 , రెండో స్థానంలో గెలిచిన వారికి రూ. 50,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 30,000 వేల నగదు బహుమతి ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం నిర్వాహకులను 96523 94751 నంబర్లో సంప్రదించవచ్చని పేర్కొంది. చదవండి: వరంగల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు.. 18 మంది అరెస్ట్ -
ఎన్నిసార్లు జైలు ఊచలు లెక్కపెట్టినా బుద్ధి మారలే.. డ్రగ్స్‌కు బానిసలై..
సాక్షి, సిటీబ్యూరో: ఒకటి కాదు.. రెండు కాదు.. పదులసార్లు పోలీసులకు చిక్కి, జైలు ఊచలు లెక్కపెట్టినా వీరి బుద్ధి మారలేదు. మాదకద్రవ్యాలకు బానిసలైన నలుగురు పాత నేరస్తులు మళ్లీ ఖాకీలకు చిక్కారు. ఎల్బీనగర్లో గంజాయి, ఎండీఎంఏ కొనుగోలు చేస్తుండగా ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.4,040 నగదుతో పాటు 15 గ్రాముల ఎండీఎంఏ, 2 కిలోల గంజాయి, కారు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌నగర్‌కు చెందిన జక్కా సునీల్, వనస్థలిపురానికి చెందిన షేక్ నోమాన్ ఇద్దరు స్నేహితులు. డ్రగ్స్‌కు బానిసలైన ఇరువురు సేవించడంతో పాటు విక్రయిస్తుంటారు కూడా. ఈ క్రమంలో నోమాన్ స్నేహితులైన సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ ఖాన్ అలియాస్ ఖాన్ సాబ్, పహాడీషరీఫ్‌కు చెందిన మహ్మద్ జాబీర్ ఖాద్రీ అలియాస్ షాజాడా, సంతోష్‌నగర్‌కు చెందిన మీర్జా ఇస్మాయిల్ అలీబేగ్లకు కూడా డ్రగ్స్ అలవాటైంది. వీరిపై ఏపీతో పాటు రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోని పలు ఠాణాల్లో పదుల సంఖ్యలో ఎన్డీపీఎస్, హత్య కేసులు ఉన్నాయి. ఈక్రమంలో మూడు రోజుల క్రితం అరకు ప్రాంతానికి వెళ్లిన సునీల్.. స్థానికంగా గంజాయి సరఫరా చేసే శత్రు అనే వ్యక్తి నుంచి 2 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, ఎల్బీనగర్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ స్నేహితుడు నోమాన్ను కలిశాడు. సునీల్ నుంచి రూ.4–5 వేలకు గంజాయి కొని వాటిని చిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కోటి సైజును బట్టి రూ.500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. ఈక్రమంలో కారులో సునీల్, నోమాన్‌లు శనివారం ఉదయం ఎల్బీనగర్ క్రాస్‌రోడ్‌కు అప్పటికే ఆరీఫ్ ఖాన్, జాబీర్ ఖాద్రీ, మీర్జాలు ఎదురుచూస్తున్నారు. కారు రాగానే వెనకాల ఎక్కిన ముగ్గురు నోమాన్, సునీల్ నుంచి గంజాయి, ఎండీఎంఏలను కొనుగోలు చేశారు. అకస్మాత్తుగా నోమాన్ కారు దిగి ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అప్పుడే ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఎల్బీనగర్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి కారులో ఉన్న నలుగురు నిందితులను పట్టుకున్నారు. నోమాన్, శత్రు పరారీలో ఉన్నారు. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
డ్రగ్స్ మత్తులో రోడ్డుపై కాలు కదపలేని స్థితిలో యువతి.. వీడియో వైరల్..
చండీగఢ్: డ్రగ్స్ కోరల్లో చిక్కితే జీవితం ఛిన్నాభిన్నం అవుతుంది. మత్తుపదార్థాలకు బానిసలై ఎంతోమంది యువత తమ కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో అక్రమంగా డ్రగ్స్ తీసుకుంటున్న బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోనే అందుకు నిదర్శనం. తూర్పు అమృత్సర్ నియోజకవర్గం మక్బూల్‌పూర్ ప్రాంతంలో ఓ యువతి డ్రగ్స్ మత్తులో విలవిల్లాడింది. రోడ్డుపై నిలబడిన ఆమె కనీసం అడుగు తీసి అడుగు వేయడానికే ఆపసోపాలు పడింది. కాలు కూడా కదల్చలేని స్థితిలో వణుకుతూ కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. A viral video from Amritsar, Punjab shows a woman on the streets allegedly under the influence of heavy, illegal drugs. She is seen struggling to take a step forward. Officials have started a probe into this issue. Watch the video to know more#Punjab #DrugAbuse #PunjabWoman pic.twitter.com/A6GPrRR6xE — Mirror Now (@MirrorNow) September 12, 2022 వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆదివారం స్థానికంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ముగ్గురు నిందితుల నుంచి నార్కోటిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఐదు వాహనాలను కూడా సీజ్ చేశారు. వీటిని దొంగిలించి ఉంటారని అనుమానిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన కేసులతో మక్బూల్‌పురా ప్రాంతం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ అధికారులు ఎన్నో డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇక్కడ ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బాధితులయ్యారు. చదవండి: కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం -
వరంగల్‌లో సత్ఫలితాలిస్తున్న ‘నయీ కిరణ్’.. సాయం పొందండిలా!
పుస్తకాల తోటలో విహరించాలని నూనూగు మీసాలు పట్నపుదారులు వెతుకుతున్నాయి. పుస్తకాలు చదివి అనుభవించాల్సిన ఆనందాన్ని పొగ పీలుస్తూ.. లెక్చరర్లు చెప్పింది విని రక్తంలోకెక్కించుకోవాల్సిన జ్ఞానాన్ని రసాయనాల రూపంలో మత్తు ఎక్కించుకుంటూ యువత తాత్కాలిక ఆనందాన్ని పొందుతోంది. మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని ఆ ఊబిలోనుంచి బయటపడేసి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై ఆ తర్వాత మార్పు పొందిన యువత, వారి తల్లిదండ్రుల మనోగతంపై ఆదివారం మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – వరంగల్ క్రైం ఉన్నత చదువుల కోసం నగరానికి వస్తున్న యువకుల్లో కొంతమంది గంజాయికి బానిసవుతున్నారు. ఆ ఊబినుంచి బయటపడేస్తూ.. గంజాయి రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దడానికి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సీపీ తరుణ్ జోషి, బన్ను ఆరోగ్య సంస్థ, ఎంజీఎం అధికారుల సహకా రంతో ఏర్పాటు చేసిన నయీ కిరణ్ కార్యక్రమం ద్వారా గంజాయికి బానిసైన వారికి కొత్త జీవితాన్ని స్తున్నారు. మొదటి దశలో 159 మంది డ్రగ్స్ బాధితుల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు. టాస్క్‌ఫోర్స్ అధికారులతో పాటు పోలీస్స్టేషన్ల అధికారులు గంజాయి తాగేవారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. సుమారు వందరోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్ బాధితులు సాధారణ జీవితం గడిపేలా చేశారు. కమిషనరేట్ అధికారులు నిర్వహించిన జాబ్‌మేళాలో వారి అర్హతకు అనుగుణంగా 38 మంది బాధితులు ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించారు. ఇప్పుడు ఎంతో మంది జీవితాల్లో నూతన వెలుగులు కనిపిస్తున్నాయి. జీవితాన్ని తీర్చిదిద్దారు.. నగరంలో కళాశాలలో డిగ్రీ చేస్తున్నప్పుడు స్నేహితులతో సిగరేట్లు తాగడం అలవాటైంది. కాజీపేటలోని ఓ గదిలో అద్దెకు ఉంటూ చదువుకున్నా. రోజూ సిగరెట్లు తాగుతున్నానని అనుకున్నా.. కానీ అందులో గంజాయి ఉందనే విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. 10 బీర్లు తాగితే ఎలా ఉంటుందో ఒక గంజాయి సిగరేట్ తాగితే అలా మత్తు ఉండేది. నయీకిరణ్ కార్యక్రమం ద్వారా ఎంజీఎంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులు నా జీవితాన్ని తీర్చిదిద్దారు. – పాల సాయికుమార్, కరీంనగర్ 1నా కొడుకు దక్కేవాడు కాదు.. నాది ప్రభుత్వ ఉద్యోగం. ఉదయం వెళ్తే.. రాత్రెప్పుడో వచ్చేవాణ్ణి. నా కొడుకు నేను పడుకున్నాక వచ్చి పడుకునేవాడు. రాత్రి లేటైంది కదాని.. ఉదయమే వాడిని లేపకపోయేవాణ్ని. నా కొడుకు గంజాయి తాగుతూ పట్టుబడినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. పోలీసుల సహకారంతో వాడి అలవాటు మానుకున్నాడు. నాకొడుకు నాకు దక్కాడు. ఇప్పుడు బాగా చదువుతున్నాడు. – చంద్రమోహన్, రాంనగర్, ప్రభుత్వ ఉద్యోగి (పేరు మార్చాం) బలవంతంగా అలవాటు చేశారు.. నా స్నేహితుల మాదిరి సరదాగా గడపాలనే కోరిక ఉండేది. వాళ్లతో కలిసి తిరిగాక నాకూ సిగరేట్ అలవాటు చేశారు. ఆ™ è ర్వాత మరింత ఎంజాయ్మెంట్ కోసమని సిగరెట్లో గంజాయి కలిపి తాగించారు. మత్తుగా ఉండడంతో ఒకటి రెండు సార్లు తాగాను. ఒకరోజు గంజాయి తాగుతూ పోలీసులకు దొరికాను. వారు ఇచ్చిన కౌన్సెలింగ్, మనోధైర్యం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. – విక్రమ్ డిప్లొమా విద్యార్థి, హనుమకొండ (పేరు మార్చాం) ఉద్యోగం పోయింది.. నేను హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్లో ఉద్యోగం చేసేవాణ్ణి. అక్కడికి వచ్చే కస్టమర్ల ద్వారా నాకూ గంజాయి అలవాటయ్యింది. మత్తులో సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఉద్యోగంలోంచి తీసేశారు. ఇంటికొచ్చి న తర్వాత అలవాటు మానలేకపోయా. నయీ కిరణ్ గురించి తెలుసుకొని పోలీసులను సంప్రదించా. వంద రోజుల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నా అలవాటును పూర్తిగా మరిచిపోయా. ప్రస్తుతం మళ్లీ ఉద్యోగ వేటలో ఉన్నా. – ప్రశాంత్, ధర్మసాగర్ (పేరు మార్చాం) గంజాయిపై ఉక్కుపాదం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా, అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్‌ను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు సీపీ డాక్టర్ తరుణ్ జోషి ప్రత్యేక దృష్టి పెట్టారు. అమ్మకందారులతోపాటు వినియోగదారులపై పెద్ద మొత్తంలో కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో రూ.4.10 కోట్ల విలువైన 3,918 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 44 కేసులు నమోదు చేసి 155 మందిని అరెస్టు చేశారు. సాయం పొందండిలా.. గంజాయి, ఇతర డ్రగ్స్‌కు అలవాటు పడి మానుకోవాలనుకునే వారు, వారి తల్లిదండ్రులు ‘నయీకిరణ్’ టోల్ ఫ్రీ 94918 60824 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు. పోలీస్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసి డ్రగ్స్ బాధితుల్లో మార్పులు తీసుకొస్తారు. ఏప్రాంతం వారైనా సాయం పొందవచ్చు. 159 మంది.. 100 రోజులు 159 మంది డ్రగ్స్ బాధితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాం. డ్రగ్స్‌కు పూర్తిగా బానిసైన వారికి డాక్టర్లతో తల్లిదండ్రుల సమక్షంలో చికిత్స అందించాం. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వారిలో మంచి మార్పులు తీసుకొచ్చాం. మొదటి రెండు వారాలు డీ టాక్సిఫికేషన్ కార్యక్రమం, ఆతర్వాత డీ ఎడిక్షన్లో ప్రముఖులతో మాట్లాడించాం. హనుమకొండ కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి, ప్రభుత్వ చీఫ్ విప్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, మేయర్, ఇలా చాలామందితో మాట్లాడించి డ్రగ్స్ బాధితుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. హైదరాబాద్ నుంచి నిపుణుల్ని తీసుకొచ్చి గ్రూప్ కౌన్సెలింగ్ ఇచ్చాం. పోలీస్ కమిషనర్ నుంచి హోంగార్డు వరకు గంజాయి నుంచి యువతకు విముక్తి కల్పించడానికి ప్రయత్నంచేస్తున్నాం. – పుష్పారెడ్డి, అడిషనల్ డీసీపీ -
డీజే కమ్స్ డ్రగ్ అడిక్ట్... డ్రగ్ డీలర్
సిటీలో డిస్క్ జాకీలుగా కదం తొక్కుతున్న కుర్రాళ్లు డ్రగ్స్ కీలల్లో మాడిమసైపోతున్నారు. టీనేజ్ యువతకు క్రేజీ ప్రొఫెషన్‌గా ఇట్టే ఆకట్టుకునే ఈ వృత్తి ఇప్పుడు కొందరి పాలిట యమపాశంగా మారుతోంది. వారు నచ్చి మెచ్చిన సంగీతమే వారి చుట్టూ మరణమృదంగం మోగిస్తోంది. చుట్టూ లగ్జరీ.. వ్యసనాలపై సవారీ... సిటీ పబ్స్‌లో, క్లబ్స్‌లో ఈవెంట్లలో డీజెలుగా పనిచేసే కుర్రాళ్లలో అత్యధికులు మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవారే. అరకొరగా ఉన్న డీజె స్కూల్స్‌లో లక్షలు వెచ్చించి కోర్సు చేసే ఈ కుర్రాళ్లకు ఆ తర్వాత జీతంగా లభించేది అంతంత మాత్రం. రూ.15 నుంచి 25 వేల లోపు జీతమే అయినప్పటికీ మ్యూజిక్ మీద ఉన్న క్రేజ్‌తో వీరు ఉద్యోగాలకు సై అంటారు. తదనంతరం వీరి చుట్టూ విలాసవంతమైన సమాజమే జతవుతుంది. మద్యపానం, ధూమపానం సర్వసాధారణ వ్యసనాలుగా మారతాయి. ఖర్చులకు ఏ మాత్రం సరిపోకపోవడంతో తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుంది. డిజె ముదిరి డ్రగ్ అడిక్ట్...డ్రగ్ డీలర్‌గా కూడా మారతాడు. మరోవైపు తాజా కరోనా, లాక్డౌన్ టైమ్‌లో పూర్తి ఆదాయం కోల్పోయిన డీజెలలో కొందరు మ్యూజిక్‌ని వదిలేసి ఇతర రంగాల్లోకి వెళ్లిపోతే..మరికొందరు ఇళ్లలో కూర్చుని ఆన్లైన్ ద్వారా ప్రొఫెషనల్ డ్రగ్స్ డీలర్లుగా మారిపోయారని సమాచారం. రేర్...రేవ్ బృందాలు... పబ్స్, క్లబ్స్‌కు వచ్చే కస్టమర్లకు బాగా సన్నిహితంగా మారేవాళ్లలో డీజేలే ముందుంటారు. కాబట్టి వెర్రెత్తించే సంగీతాన్ని ఇష్టపడేవారిని గుర్తించడం వీరికి సులభం. దీంతో ఈ రకమైన సంగీతాన్ని ఇష్టపడుతున్న వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడుతున్నారు. నగరంలో ప్రత్యేక పార్టీలను డీజేలు నిర్వహిస్తున్నారు. సదరు పార్టీల్లో రాజ్యమేలేదంతా అపరిమిత మత్తు...అందులో పడి చిత్తవ్వడమే. మెట్రోలతో మ్యూజిక్ అనుసంధానం.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటీలో డీజేలే నార్కొటిక్స్ కేసుల్లో బుక్ అవుతున్నారు. గోవాలో ఇది నిత్యకృత్యం అయింది కోట్ట రూపాయల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు వీక్లీ రైడ్స్‌లో వారి నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. చెన్నైకి చెందిన సౌండ్ ఇంజనీరింగ్ విద్యార్ధిని అరెస్ట్ చేసి రూ.8లక్షలు విలువైన సెకోట్రోపిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూర్లో పనిచేసే డీజే ధీరజ్ని అరెస్ట్ చేసినప్పుడు అతను హైదరాబాద్ సహా పలు నగరాల్లో క్లయింట్స్ ఉన్నట్టు చెప్పినట్టు సమాచారం. విదేశీ రాక...డ్రగ్స్‌కు కాక... డ్రగ్స్ హబ్ లాంటి గోవా చీప్ నార్కోటిక్స్‌కు కూడా పేరొందింది. దానితో గోవా డీజేలకు నగరం నుంచి డిమాండ్ పుంజుకుంది. అయితే అక్కడ వారానికోసారి డ్రగ్ రైడ్ నిర్వహిస్తున్నారు నార్కొటిక్ యాక్టివిటీస్‌లో జోక్యం పెరిగిందనే కారణంగా 2013లో గోవా íసీఎం విదేశీ డీజేలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దాంతో హైదరాబాద్ వైపు వీరు తమ చూపు మరల్చారని తెలుస్తోంది నగరానికి విదేశీ డీజేలను రప్పించడం కూడా డ్రగ్ కల్చర్‌కి ఊపు తెస్తోంది. (చదవండి: తలొగ్గేది ప్రేమకే.. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలిని: తమిళిసై) -
హైదరాబాద్ మాదకద్రవ్యాల కేసులో మలుపు
-
ఆర్యన్ బెయిల్ కోసం చట్టపరమైన బాధ్యత తీసుకున్న ప్రముఖ నటి
What Does It Mean for Juhi Chawla and Aryan Khan?: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో బాలీవుడ్ నటి జూహీ చావ్లా కీలక పాత్ర పోషించారు. ఆర్యన్‌కు బెయిల్ రావడానికి ఆమె పూచీకత్తు ఇచ్చారు. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆర్యన్ బెయిల్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్ పేపర్లపై సంతకం చేశారు. బాండ్‌పై సంతకం చేసిన అనంతరం బయటకు వచ్చిన జూహీ చావ్లా మీడియాతో మాట్లాడారు. చదవండి: బెయిల్ వచ్చినా జైలులోనే ఆర్యన్ ఖాన్.. ఈ మేరకు ఆమె మీడియాతో ‘ఇప్పడు ఆర్యన్ బయటకు రావడం ముఖ్యం. అదే పదివేలు’ అని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఆర్యన్ డబ్బు చెల్లించడంలో విఫలమైనా, అతడు కోర్టు ఆదేశాలను ధిక్కరించినా దీనికి జూహీ చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాగా షారుక్ ఖాన్, జూహ్లీ చావ్లా కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కలయికలో బి-టౌన్‌కు పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. అంతేగాక వీరిద్దరూ ఇప్పుడు ఐపీఎల్ టీం కోల్కత్తా నైట్ రైడర్స్(కేకేఆర్) టీం ఫ్రాంఛైజీ పార్ట్‌నర్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మృతి, షాక్‌లో భారత సినీ పరిశ్రమ ఈ కేసులో గురువారం ఆర్యన్ బెయిల్ పటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పత్రాలు ఆర్యన్ ఉన్న ఆర్థర్ రోడ్ జైలుకు పంపించాలంటే షూరిటీ సంతకాలు కీలకం. ఎందుకంటే ఆర్యన్ తరపున చట్టపరమైన బాధ్యత తీసుకుంటూ ప్రముఖులైన బయటి వ్యక్తులు ఇద్దరూ పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆర్యన్ విడుదల అవ్వడం కోసం జూహీ చావ్లా నిజంగా పెద్ద ధైర్యం చేశారని చెప్పాలి. -
బెయిల్ వచ్చినా జైలులోనే ఆర్యన్ ఖాన్..
Aryan Khan Still In Jail Even After Get Bail: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. గురువారం ఆర్యన్ బెయిల్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు అతడితో పాటు మరో ఇద్దరికి బెయిల్ మంజురూ చేసింది. దీంతో ఆర్యన్ ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతాడని అందరూ ఆశించారు. కానీ చూస్తుంటే ఆర్యన్ ఈరోజు, రేపు కూడా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఆర్యన్ విడుదల అవ్వాల్సి ఉంగా ఇప్పటీ వరకు అతడి బెయిల్ ఆర్డర్ జైలుకు చేరలేదు. చదవండి: ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు షరతులు ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు బెయిల్ పత్రాల ప్రక్రియకు డెడ్‌లైన్ కానీ అతడి అది పూర్తి కాలేదు. దీంతో ఆర్యన్ విడుదల విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు కూడా విధించింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్యన్ దేశం వదిలి వెళ్లకూడదని కూడా బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ -
ఆర్యన్ కేసులో బాలీవుడ్ నిశ్శబ్ధం అవమానకరం: డైరెక్టర్ అసహనం
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. ముంబై క్రూయిజ్ షిప్‌పై అక్టోబర్ 2 రాత్రి పోలీసులు దాడి చేయగా ఈ పార్టీలో ఆర్యన్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి షారుక్‌కు, ఆయన కుటుంబానికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే షారుక్‌కు సల్మాన్, హృతిక్ రోషన్, పూజ బేడీతో పాటు పలువురు మద్దతు తెలిపారు. చదవండి: హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస ఇదిలా ఉంటే అరెస్ట్ అయినప్పటీ నుంచి ఆర్యన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆర్యన్ మూడు సార్లు బెయిల్ కోసం పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆ పిటిషన్‌ను పదే పదే తిరస్కరిస్తోంది. దీంతో బెయిల్ దొరక్క ఆర్యన్‌కు జైలు కూడు తప్పడం లేదు. ఈ క్రమంతో తాజాగా మరో సెలబ్రిటీ షారుక్‌కు మద్దతుగా నిలిచారు. ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా ట్విటర్ ద్వారా షారుక్‌కు మద్దతు తెలిపారు. చదవండి: Aryan Khan Drug Case: ఆర్థర్ రోడ్డు జైల్లో ఆర్యన్‌ను కలుసుకున్న షారుక్ ఈ మేరకు సంజయ్ గుప్తా ట్వీట్ చేస్తూ.. ఆర్యన్ అరెస్టు విషయంలో నిశబ్ధంగా ఉన్న పలువురు బాలీవుడ్ పెద్దలను ఆయన ప్రశ్నించారు. ‘షారుక్‌ఖాన్ సినీ పరిశ్రమలో ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతీ విషయంలో షారుక్ ముందుంటారు. అలాంటి ఆయన సంక్షోభ పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి సమయంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటమంటే దానికంటే అవమానకరమైన విషయం మరొకటి లేదు’ అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. మరో ట్వీట్లో ‘ఈ రోజు షారుక్ కుమారుడు ఉన్నాడు, రేపు మా వాళ్లు లేదా మీ వాళ్లు ఉండోచ్చు. అప్పుడు కూడా ఇలాగే మౌనంగా ఉంటారా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. చదవండి: షారుఖ్ బీజేపీలో చేరితే డ్రగ్స్ కాస్తా షుగర్ అవుతుంది: ఛగన్ భుజ్‌భల్ Shahrukh Khan has and continues to give jobs and livelihoods to thousands in the film industry. He has always stood up for every cause for the film industry. And the astute silence of the same film industry in his moment of crisis is nothing short of SHAMEFUL. — Sanjay Gupta (@_SanjayGupta) October 25, 2021 Aaj uska beta hai, kal mera ya tumhaara hoga… Tab bhi issi buzdalli se chup rahoge??? — Sanjay Gupta (@_SanjayGupta) October 25, 2021 -
కుమారుడిని చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చిన షారుక్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన తనయుడు ఆర్యన్‌ను చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చారు. ముంబై ఆర్థర్ రోడ్డు జైలుకు బుధవారం ఆయన తనయుడిని కలిసి కాపేపు ముచ్చటించి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసుల అదుపులో ఉన్న ఆర్యన్‌ను షారుక్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. కాగా ఈ నెల అక్టోబర్ 2న రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన పోలీసులు షారుక్ కుమారుడితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: షారుక్‌కు షాక్, ఆర్యన్‌కు దొరకని బెయిల్ ఈ దాడిలో పోలీసులు నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆర్యన్‌కు ముంబై కోర్టు చుక్కలు చూపిస్తోంది. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆర్యన్ పలుమార్లు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం మరోసారి ఆర్యన్‌కు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌కు మళ్లీ బెయిల్ రద్దవ్వడంతో తనయుడిని చూసేందుకు షారుక్ ఆర్థర్ రోడ్డు జైలుకు వచ్చినట్లు సమాచారం. చదవండి: నా కొడుక్కి బెయిల్ వచ్చేవరకు స్వీట్లు వండొద్దు! : గౌరీ ఖాన్ కాగా గతవారం షారుక్‌తోపాటు అతని భార్య గౌరీ ఖాన్ జైలులో ఉన్న ఆర్యన్‌తో వీడియో కాల్ మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన నిబంధనలను సడలిచింది. దీంతో జైలులో ఉన్న వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునే వెసులుబాటును ఇచ్చారు. ఈ క్రమంలో షారుక్, ఆర్యన్‌ను కలుసుకునేందుకు వచ్చారు. ఈ కేసు కోర్టు విచారణలో ఆర్యన్‌కు షారుక్ మేనేజర్ పూజా దద్లానీ, ఆయన న్యాయవాదులు సాయం చేస్తున్నారు. ప్రత్యేక న్యాయస్థానం తన బెయిల్‌ను నిరాకరిస్తుండటంతో ఇక ఆర్యన్ ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నాడని సమాచారం. -
Drug Case: రానా, రకుల్, రవితేజలతో పాలు పలువురికి ఈడీ సమన్లు
-
బెంగళూరు డ్రగ్స్ కేసు: ఆ గుట్టంతా జుట్టులోనే..!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు డ్రగ్స్ కేసు ఇప్పుడు పలువురు ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ కేసులో భాగంగా కర్ణాటక పోలీసులు హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా జుట్టు కత్తిరించుకునే పనిలో ఉన్నారని తెలిసింది. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే.. వారి రక్తం, మూత్రం శాంపిళ్లతోపాటు తలవెంట్రుకలను పరీక్షించడం ద్వారా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. డ్రగ్స్ తీసుకున్న వారి వెంట్రుకల్లో దాదాపు 90 రోజుల (3 నెలల) పాటు వాటి అవశేషాలు ఉంటాయి. రక్తం, మూత్రంలలో కొన్నివారాలపాటు మాత్రమే డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న వారు జుట్టు కత్తిరించుకునే పనిలో పడ్డారని అంటున్నారు. సాంకేతిక ఆధారాలపై దృష్టి.. బెంగళూరు డ్రగ్స్ కేసులో పోలీసులు కొందరు ప్రముఖులను విచారించాల్సి ఉంది. ఇందుకోసం వారి సెల్‌ఫోన్ లొకేషన్ డేటా తెప్పించుకుంటున్నారని సమాచారం. డ్రగ్స్ పెడ్లర్లకు, వారికి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్, డ్రగ్స్ కోసం జరిగిన యూపీఐ, ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్, బెంగళూరు ఫామ్ హౌజ్ పార్టీలకు ఎవరెవరు వెళ్లారన్నది నిర్ధారించేందుకు గూగుల్ టైంలైన్ డేటాను విశ్లేషిస్తున్నారని తెలిసింది. డ్రగ్స్ సరఫరాను నిర్ధారించుకున్న అనంతరం.. ఎవరు వినియోగించారన్న విషయంపై పోలీసులు దృష్టి సారించనున్నారు. సినీతారల కేసులన్నీ అటకపైకే! మనదేశంలో డ్రగ్స్ కేసులో అనేక మంది సినీతారలు జైలుపాలయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్, శాండల్‌వుడ్ నటులు పలువురు జైలుకు వెళ్లారు. అయితే హైదరాబాద్‌లో ఓ సినీనటుడి కాల్పుల కేసు, ఆ తర్వాత పలుమార్లు వెలుగుచూసిన సినీతారల డ్రగ్స్ కేసులు మాత్రం ముందుకు సాగలేదు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు దేశాన్ని కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. చాలా మంది సినీ ప్రముఖులను విచారించడం ఒక దశలో జాతీయమీడియా దృష్టిని ఆకర్షించింది. కానీ ఆ తర్వాత అడుగుకూడా ముందుకు పడలేదు. -
డ్రగ్స్ కేసులో సినీ నటి ద్వివేదికి బెయిల్
బెంగళూరు: గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నటి రాగిణి ద్వివేదికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కారణంతో గత సెప్టెంబర్‌లో రాగిణి, సంజనాలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ద్వివేది, ఇతరులకు బెయిల్ ఇవ్వడానికి నవంబర్ 3న కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తనను ఈ కేసులో తనను ఇరికించారని పిటిషన్ లో పేర్కొంది. నేడు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార కేంద్ర జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంది.( చదవండి: మిషన్ ఫ్రంట్‌లైన్.. ఆర్మీలో రానా) -
ఇంతకి డ్రగ్స్ ఎందుకు వాడతారు..?
హాలీవుడ్ సంగతి సరే, మన దేశంలో చూసుకుంటే తొలుత డ్రగ్స్ కలకలం బాలీవుడ్లో మొదలైంది. క్రమంగా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్లకూ విస్తరించింది. ఏ ‘వుడ్’ అయితేనేం, ఇప్పుడన్నీ ‘నార్కోవుడ్’గానే మారుతున్నాయనే విమర్శలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు పట్టుబడిన సందర్భాల్లో మీడియాలో వార్తల హోరు జోరుగా ఉంటోంది గాని, సినీరంగంతో నిమిత్తంలేని వారిలో సైతం చాలామంది డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సంఘటన తర్వాత భారతీయ సినీరంగంలో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. డ్రగ్స్‌కు సంబంధించి సెలబ్రిటీల పేర్లు వార్తలకెక్కుతున్నాయి. అలాగని దేశంలో సినీ సెలబ్రిటీలు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారనుకుంటే పొరబాటే! హైస్కూలు కుర్రాళ్లు కూడా డ్రగ్స్ బారినపడుతున్న దాఖలాలు ఉన్నాయి. ఇంతకీ ఈ డ్రగ్స్ ఏమిటి, ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, వీటిని వాడితే వాటిల్లే నష్టాలేమిటి? డ్రగ్స్‌పై ఎందుకు ఇంతలా గగ్గోలు చెలరేగుతోంది? ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు డ్రగ్స్‌ను అరికట్టగలుగుతున్నాయా? ఇంతకీ ఈ డ్రగ్స్ సంగతేమిటి? వీటి గురించి తెలుసుకోవలసిన విషయాలేంటి? వీటిని వాడితే కలిగే నష్టాలేమిటి? వీటి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేంటి?... డ్రగ్స్ ఎందుకు వాడతారనేది చాలా సిల్లీ ప్రశ్న. మత్తు కోసం వీటిని వాడతారనేది అందరికీ తెలిసిన సంగతే. మత్తు కోసం రకరకాల పదార్థాలను వాడటం చరిత్రలో చాలాకాలం నుంచి ఉన్నదే. వేల ఏళ్ల కిందటి నుంచే మద్యం, గంజాయి, పొగాకు, నల్లమందు, మత్తునిచ్చే పుట్టగొడుగులు (మేజిక్ మష్రూమ్స్) వంటి పదార్థాలు వాడుకలో ఉన్నాయనేందుకు ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతిసిద్ధంగా దొరికే మత్తు పదార్థాలు. వీటిని తలదన్నే సింథటిక్ మత్తు పదార్థాలను తయారు చేయడం గత శతాబ్దిలో మొదలైంది. గడచిన ఆరేడు దశాబ్దాల్లో వీటి వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. వీటి తయారీ, సరఫరా, అమ్మకాల వెనుక మాఫియా ముఠాలు పనిచేస్తూ, సమాంతర ఆర్థిక వ్యవస్థలను నడిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలకెక్కుతున్నవి ఈ సింథటిక్ డ్రగ్స్‌కు సంబంధించిన కేసులే. వీటి మత్తు మొదట్లో గమ్మత్తుగా అనిపిస్తుంది. గమ్మత్తయిన మత్తు క్రమంగా అలవాటుగా మారుతుంది. చివరకు వదులుకోవాలనుకున్నా వదులుకోలేని వ్యసనంగా మారుతుంది. మత్తులో నిరంతరం మునిగితేలే పరిస్థితిలో చిక్కుకుంటే, చివరకు ఆరోగ్యం చిత్తవుతుంది. శరీరం శిథిలమవుతుంది. అర్ధంతరంగా మృత్యువు కబళించేస్తుంది. గంజాయి, నల్లమందు వంటి మత్తుపదార్థాలపై తొలినాళ్లలో పెద్దగా ఆంక్షలు ఉండేవి కావు. మతపరమైన వేడుకల్లో వీటి వాడకం ప్రాచుర్యంలో ఉండటంతో ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించేవి కావు. ప్రభుత్వాలు పట్టించుకోని కాలంలో జనాలు వీటిని బహిరంగంగానే ఉపయోగించేవారు. తొలిసారిగా 1925లో అమెరికాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఓపియమ్ కన్వెన్షన్’లో మార్ఫిన్, హెరాయిన్లపై నిషేధం అమలులోకి వచ్చింది. అంతకుముందు ఈ రెండు మాదకద్రవ్యాలనూ వైద్యులు తమ రోగులకు ఇష్టానుసారం సిఫారసు చేస్తూ వచ్చేవారు. పత్రికల్లో ‘హెరాయిన్’ ప్రకటనలు కూడా కనిపించేవి. మార్ఫిన్, హెరాయిన్‌లు తొలితరం సింథటిక్ డ్రగ్స్. వీటి వాడుకను కట్టడి చేసిన కొన్ని దశాబ్దాలకు– 1960, 70 దశకాల నాటికి మరికొన్ని సింథటిక్ డ్రగ్స్ వ్యాప్తిలోకి వచ్చాయి. డీఓఎం (డైమీథాక్సి4 మీథైలాంఫెటామిన్, ఎల్ఎస్డీ (లైసెర్జిక్ యాసిడ్ డైథాలమైడ్), ఏఎల్‌డీ–52 (1–ఎసెటైల్ ఎల్ఎస్డీ), పీసీపీ (ఫెన్సైక్లిడిన్) వంటి వాటి అక్రమ విక్రయాలు అమెరికా సహా పలు దేశాల్లో విచ్చలవిడిగా సాగేవి. వీటి తర్వాత 1980, 90 దశకాల్లో ఎండీఎంఏ (మీథైలెనడయాక్సిమీథాంఫెటామైన్) (దీనినే ‘ఎక్స్టసీ’గా పిలుచుకుంటారు), ఏఎంటీ (మీథైల్ట్రిప్టామైన్), బీజెడ్పీ (బెంజైల్పైపరాజిన్), టీఎఫ్ఎంపీపీ (ట్రైఫ్లోరోమీథైల్ఫెనైల్పైపరాజిన్), మీథాంఫెటామిన్, మెథ్కాథినోన్ వంటి సింథటిక్ డ్రగ్స్ విరివిగా వాడుకలోకి వచ్చాయి. వీటిపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ, ప్రభుత్వాలేవీ వీటిని అరికట్టలేకపోతున్నాయి. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలు మరింతగా ఊపందుకున్నాయి. ‘ఆన్లైన్’ లావాదేవీలతోనే ఇవి సునాయాసంగా దేశాంతరాలను, ఖండాంతరాలను దాటుతున్నాయి. కఠోర వాస్తవాలు మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి ‘యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ (యూఎన్ఓడీసీ) గత ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్ డ్రగ్ రిపోర్ట్–2019’ నివేదికలో కొన్ని కఠోర వాస్తవాలను బయటపెట్టింది. ఈ నివేదికను 2017 నాటి లెక్కలను క్రోడీకరించి రూపొందించారు. దీని ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ దుర్వినియోగం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు దాదాపు 3.50 కోట్ల మందికి పైగా ఉన్నారు. వీరిలో ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రమే ఈ సమస్యల నుంచి బయట పడేందుకు అవసరమైన వైద్య సహాయాన్ని పొందగలుగుతున్నారు. మిగిలిన వారు డ్రగ్స్ ఊబిలోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నివేదిక ప్రకారం... నల్లమందు నుంచి ఉత్పత్తి చేసే మాదకదవ్య్రాలను 5.30 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారు 1.10 కోట్లకు పైగానే ఉన్నారు. వీరిలో 14 లక్షల మంది హెచ్ఐవీ రోగులు కాగా, మరో 56 లక్షల మంది హెపటైటిస్–సి రోగులు. డ్రగ్స్ దుర్వినియోగం కారణంగా 2017లో 5.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నివేదిక ప్రకారం గడచిన ఏడాది వ్యవధిలో డ్రగ్స్ వాడిన వారి సంఖ్య 27.1 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో 5.5 శాతం. వీరంతా 15–64 ఏళ్ల వయసు వారు. ప్రపంచవ్యాప్తంగా కొకైన్ ఉత్పత్తి 2017లో రికార్డు స్థాయికి చేరుకుంది. ఆ ఏడాది 1976 టన్నుల కొకైన్ ఉత్పత్తి జరిగింది. అదే ఏడాది అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన కొకైన్ కూడా రికార్డు స్థాయిలోనే ఉంది. వివిధ దేశాల్లోని అధికారులు అక్రమంగా తరలిస్తున్న 1275 టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్ డ్రగ్స్ ఎన్ని మార్కెట్లోకి వస్తున్నా, డ్రగ్స్ వినియోగంలో ఇప్పటికీ గంజాయిదే అగ్రస్థానం. వరల్డ్ డ్రగ్ రిపోర్ట్–2019 ప్రకారం 2017లో గంజాయి వినియోగదారుల సంఖ్య 18.8 కోట్లు. గంజాయిపై నిషేధం ఉన్నా, మన దేశంలో కొన్నిచోట్ల దేవాలయాల్లో గంజాయిని ప్రసాదంగా పంచిపెట్టే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక గంజాయి అక్రమసాగు, రవాణా సంఘటనలు తరచుగా వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. మన దేశంలో పరిస్థితి మన దేశంలో గంజాయి, నల్లమందు వాడకం చిరకాలంగా ఉన్నదే. పాశ్చాత్య దేశాల్లో సింథటిక్ డ్రగ్స్ వాడకం 1930 దశకం నుంచే ప్రారంభమైనా, మన దేశంలోకి కొంత ఆలస్యంగా అడుగుపెట్టాయి. దేశంలో వీటి ప్రభావం మొదలైన తొలినాళ్లలోనే– అంటే 1970 దశకం నాటికి డ్రగ్స్ ఇతివృత్తంగా సినిమాలు రూపుదిద్దుకున్నాయి. బాంబే (ఇప్పటి ముంబై) కేంద్రంగా రాజ్యమేలుతున్న మాఫియా ముఠాలు ఆర్థికంగా బలపడటానికి ఇక్కడకు డ్రగ్స్ తీసుకురావడం, సంపన్నులైన యువతను వాటికి అలవాటు చేయడం ప్రారంభించాయి. మాఫియాతో రాసుకు పూసుకు తిరిగే బాలీవుడ్ సెలబ్రిటీల్లో సైతం కొందరు డ్రగ్స్ ఊబిలో చిక్కుకున్నారు. క్రమంగా సింథటిక్ డ్రగ్స్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, చివరకు ఒక మోస్తరు పట్టణాలకు సైతం పాకాయి. దేశంలో నానాటికీ డ్రగ్స్ బెడద పెరుగుతుండటంతో వీటిని అరికట్టడం రోజువారీ శాంతిభద్రతలను కాపాడే పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితిని చక్కదిద్దే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం 1986లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) ఏర్పాటు చేసింది. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంగా ఏర్పడిన ఎన్సీబీ వివిధ రాష్ట్రాల్లోని పోలీసు దళాలు, కేంద్రం అధీనంలోని కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, సీబీఐ, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ), ఇంటెలిజెన్స్ బ్యూరో సహా వివిధ పోలీసు, గూఢచర్య దళాల సహకారంతో పనిచేస్తోంది. డ్రగ్స్ బెడదను అరికట్టడానికి ప్రభుత్వం ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా, దేశంలో డ్రగ్స్ వినియోగం నానాటికీ పెరుగుతూనే ఉంది. దాదాపు ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నా, ఈ వ్యవహారాల్లో సెలబ్రిటీల ప్రమేయం ఉన్నప్పుడు మాత్రమే వార్తలు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఆర్థిక తాహతు, కుటుంబ మద్దతు ఉన్న కొందరు రీహాబిలిటేషన్ చికిత్స తీసుకుని, ఈ ఊబి నుంచి బయటపడుతున్నా, చాలామంది వెనక్కు రాలేక ఇందులోనే చిక్కుకుని అర్ధంతరంగా మరణిస్తున్నారు. సింథటిక్ డ్రగ్స్... కొన్ని నిజాలు సింథటిక్ డ్రగ్స్ ఎక్కువగా అక్రమ లాబొరేటరీల్లో తయారవుతుంటాయి. వీటిలో వాడే పదార్థాలు ఏమిటో, వాటి పరిమాణం ఎంత ఉందో, అవి కలిగించే ప్రభావం ఏమిటో తెలుసుకోవడం దుస్సాధ్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండువందలకు పైగా సింథటిక్ డ్రగ్స్ వాడుకలో ఉన్నాయి. వీటిలో దాదాపు 90 శాతం డ్రగ్స్ గంజాయి నుంచి వేరు చేసిన రసాయనాలతో చేసినవి కాగా, మిగిలినవి నల్లమందు, ఇతర పదార్థాల నుంచి వేరు చేసిన రసాయనాలతో తయారు చేస్తారు. వీటిలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న వాటిలో ఒకటైన ‘ఫెంటామైన్’ను కేన్సర్ రోగులకు నొప్పి నివారణ కోసం కట్టుదిట్టమైన వైద్య పర్యవేక్షణలో ఉపయోగిస్తారు. ఇది మార్ఫిన్ కంటే దాదాపు ఎనభై నుంచి వంద రెట్లు శక్తిమంతమైనది. అక్రమ మార్కెట్లో దీనిని హెరాయిన్‌కు జోడించి అమ్ముతున్నారు. గంజాయి నుంచి వేరుచేసిన రసాయనాలతో రూపొందించిన కృత్రిమ గంజాయి (సింథటిక్ మార్జువానా) వాడకం కూడా ఇటీవల బాగా పెరిగింది. ‘స్పైస్’, ‘కే2’ అనే పేర్లతో దీనిని రేవ్ పార్టీల్లో వాడుతున్నట్లు చాలా దేశాల్లో బయటపడింది. ఇదే కాకుండా, ‘స్మైల్’, ‘ఎన్–బాంబ్’ పేర్లతో పిలుచుకునే సింథటిక్ ఎల్ఎస్డీ, మీథాక్సమైన్ (ఎంఎక్స్ఎం), ఫెన్క్లిడిన్ (పీసీపీ) వంటివి కూడా రేవ్ పార్టీల్లో వాడుతున్నట్లుగా తెలుస్తోంది. నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ) గత ఏడాది విడుదల చేసిన నివేదికలోని వివరాలు మన దేశంలో డ్రగ్స్ వ్యాప్తి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం.. హెరాయిన్, మార్ఫిన్ సహా నల్లమందు ఆధారిత డ్రగ్స్‌కు (ఓపియాయిడ్స్) బానిసలైన వారి సంఖ్య 2.60 కోట్లు. వీరిలో దాదాపు 60 లక్షల మంది ఈ డ్రగ్స్ వాడకం వల్ల తలెత్తిన తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దేశంలో సగానికి పైగా పరిమాణంలోని ఓపియాయిడ్స్ వినియోగం జరుగుతున్నది తొమ్మిది రాష్ట్రాల్లోనే. అవి: ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. మన దేశంలో ముక్కుతో పీల్చే మాదకద్రవ్యాలు, నిద్రమాత్రలు వాడుతున్న వారి సంఖ్య 1.18 కోట్లకు పైగా ఉంది. ముక్కుతో పీల్చే మాదకద్రవ్యాలకు బానిసలైన వారిలో 4.6 లక్షల మంది పిల్లలు రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ తీసుకునేవారు మన దేశంలో కాస్త తక్కువగానే ఉన్నారు. వీరి సంఖ్య 8.5 లక్షలు. మన దేశంలో ఇంజెక్షన్ల రూపంలో తీసుకునే డ్రగ్స్‌లో ఎక్కువగా హెరాయిన్ (48 శాతం), బ్యూప్రెనార్ఫైన్ (46 శాతం) వినియోగంలో ఉన్నాయి. ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ వాడుక ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (1,00,000), పంజాబ్ (88,000), ఢిల్లీ (86,000) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో డ్రగ్స్‌ను ఇంజెక్షన్లుగా తీసుకునే వారిలో దాదాపు 27 శాతం మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఒకే సూదిని ఒక బృందం మొత్తం పంచుకోవడం వంటి ప్రమాదకరమైన అలవాటు కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. -
డ్రగ్స్ కేసు: విచారణకు హాజరైన రకుల్
ముంబై : బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను శుక్రవారంకు హాజరైంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఎన్సీబీ పిలుపుమేరకు గురువారమే గోవా నుంచి ముంబై చేరుకుని శుక్రవారం ఉదయం ఎన్సీబీ ముందు హాజరైంది. డ్రగ్స్ వాడకంపై రకుల్‌ను ఎన్సీబీ ప్రశ్నించనుంది. బుధవారం దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్‌లకు తదితరులకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. నేడు రకుల్ విచారణ అనంతరం శనివారం దీపికను ప్రశ్నించనున్నారు. అయితే శుక్రవారం విచారణలో భాగంగా దీపిక మేనేజర్ కూడా ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో విచారణ చేపట్టిన ఎన్సీబీ..బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు మరికొంతమందిని కస్టడీలో తీసుకుని విచారిస్తోంది. (రేపు దీపికా, సారా, శ్రద్ధా వంతు..) -
నేడు ఎన్సీబీ ఎదుటకు రకుల్
ముంబై: బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను శుక్రవారం ప్రశ్నించనున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వెల్లడించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో విచారణ చేపట్టిన ఎన్సీబీ..బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై దర్యాప్తుచేస్తుండటం తెల్సిందే. ఎన్సీబీ పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రశ్నిస్తోంది. వీరిలో బుధవారం దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్‌లకు తదితరులకు సమన్లు పంపింది. అయితే, ఆ సమన్లు హైదరాబాద్‌లోగానీ, ముంబైలోగానీ తనకు అందలేదంటూ గురువారం ఉదయం రకుల్ ప్రకటించారు. దీంతో, ఫోన్‌తోపాటు వివిధ మార్గాల్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సమన్లు అందుకున్నట్లు ఆమె ధ్రువీకరించారని అనంతరం ఎన్సీబీ అధికారి ఒకరు చెప్పారు. శుక్రవారం రకుల్ విచారణలో పాల్గొంటారని కూడా ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా, శనివారం జరిగే ఎన్సీబీ విచారణలో పాల్గొనేందుకు దీపిక గురువారం రాత్రి గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ఆమె ఇంటివద్ద ముందు జాగ్రత్తగా ముంబై పోలీసులు బందోబస్తు పెంచారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ శుక్రవారం విచారణలో పాల్గొననున్నారు. (ఎన్సీబీ నోటీసులు అందాయి: రకుల్) ఎన్సీబీ నోటీసులందుకున్న మరో నటి సారా అలీఖాన్ గురువారం సాయంత్రం గోవా నుంచి ముంబై జుహులోని తన సొంతింటికి చేరుకున్నారు. దీపిక, శ్రద్ధా కపూర్‌తోపాటు ఈమె కూడా శనివారం ఎన్సీబీ ఎదుట హాజరుకానున్నారు. సుశాంత్ సింగ్ స్నేహితురాలు రియా చక్రవర్తి విచారణలో వెల్లడించిన సమాచారంలో రకుల్, సారాల ప్రస్తావన కూడా ఉందని అంతకుముందు ఎన్సీబీ పేర్కొంది. గురువారం ఉదయం ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాతోపాటు సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీ ముంబైలోని ఎన్సీబీ గెస్ట్ హౌస్‌లో విచారణకు హాజరయ్యారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నట్లు ఎన్సీబీ వెల్లడించింది. (డ్రగ్ కేసు; రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్సీబీ సమన్లు) కంగన పిటిషన్‌పై సమాధానం ఇవ్వండి ముంబైలోని తన బంగ్లాలో కొంత భాగాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని శివసేన పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌ను బాంబే హైకోర్టు ఆదేశించింది. అలాగే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వార్డు అధికారి, కంగనాకు కూల్చివేత నోటీసు జారీ చేసిన భాగ్యవంత్కు ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. కంగనా పిటిషన్‌పై బాంబే హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కంగనాకు సంజయ్ రౌత్ చేసిన హెచ్చరికలకు సంబంధించిన సీడీని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు అందజేశారు. ఈ కేసులో సంజయ్ రౌత్, భాగ్యవంత్ను ప్రతివాదులుగా చేర్చాలన్న కంగనా విజ్ఞప్తి పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. డ్రగ్స్ కేసును సీబీఐకి బదిలీ చేయండి: రియా ముంబై: సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంతో సంబంధం ఉందని భావిస్తున్నమాదక ద్రవ్యాల కేసులో విచారణను ప్రారంభించే అధికారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కి లేదని ఇదే కేసులో నిందితులైన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ స్పష్టం చేశారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు గురువారం విచారణ జరిపింది. సుశాంత్‌సింగ్ మరణంపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని, మాదక ద్రవ్యాల కేసును సైతం అదే సంస్థకు అప్పగించాలని రియా చక్రవర్తి, షోవిక్ తరపు న్యాయమూర్తి సతీశ్ మనేషిండే బాంబే హైకోర్టునుకోరారు. -
సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు
బెంగళూరు : డ్రగ్స్ దందాలో దక్షిణ ఆఫ్రికా పౌరులే శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో సూత్రధారులని సీసీబీ అనుమానిస్తోంది. ముఖ్య నిందితుడు లూమ్ పెప్పర్ సాంబాను సీసీబీ పోలీసులు 15 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. పెప్పర్ వెల్లడించిన సమాచారం ప్రకారం బెనాల్డ్ ఉడేన్నా అనే ఆఫ్రికన్న అరెస్ట్ చేశారు. అతడు అన్ని వివరాలూ వెల్లడించాడు. కన్నడ సినిమారంగానికి చెందిన సెలబ్రిటీలకు తామే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఉడేన్నా ఆదిత్య ఆళ్వాకు చాలా సన్నిహితుడని, డ్రగ్స్ నిందితులు రవిశంకర్, వీరేన్ ఖన్నాలు ఉడేన్నాతో నిత్యం సంప్రదించేవాడని తెలిసింది. బెంగళూరుతో పాటు చుట్టు ప్రక్కల రిసార్ట్‌లో మధ్యరాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. (నా పరువు తీస్తున్నారు!) జైల్లో పుస్తక పఠనంలో నటీమణులు జ్యుడిషియల్ కస్టడీ కింద నటీమణులు రాగిణి, సంజనలను పరప్పన అగ్రహార జైలుకు తరలించి అక్కడ క్వారంటైన్లో ఉంచారు. జైలులో పెట్టిన టిఫిన్, భోజనాలను ఇద్దరూ ఆరగించారు. కొంతసేపు నిద్రపోతూ, మరికొంత సేపు పుస్తకాలను చదువుతూ పొద్దుపుచ్చుతున్నారు. రాగిణికి వెన్నునొప్పి సమస్య ఉండటంతో జైలు వైద్యులు ఔషధాలను అందించారు. రాగిణి, తల్లి, న్యాయవాదులను అధికారులు కలవనివ్వడం లేదు. ఫోన్లో మాట్లాడడానికి అవకాశమిచ్చారు. కింగ్పిన్లతో నటీమణులకు లింక్‌లు దీని ఆధారంగా ఆదిత్య ఆళ్వకు చెందిన రిసార్ట్‌పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. లూమా, ఉడేన్నాలు బెంగళూరులో మత్తు పదార్థాలను సరఫరా చేస్తుండగా వీరి వెనుక కూడా ఒక పెద్ద తలకాయ ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. వీరిద్దరిని అరెస్ట్ చేస్తుండగానే ముగ్గురు కింగ్పిన్లు పరారు కావడంతో కేసుపై సీసీబీ గోప్యత పాటిస్తోంది. ఈ ముగ్గురు దొరికితే మరెంతోమంది క్లయింట్ల పేర్లు బయట పడవచ్చు. ఈ కింగ్పిన్లు నటీమణులు రాగిణి, సంజనలతో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్లు సీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆదిత్య ఆళ్వ విదేశాలకు పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. సంజన ఇంట్లోని వస్తువులే ముఖ్య సాక్ష్యాలు? 14వ నిందితురాలు సంజన హై–ఫై పార్టీలలో పాల్గొనడంతో పాటు ప్రకాశ్ రాంకా, రాహుల్‌తో కలిసి బెంగళూరు, గోవా, కేరళ, శ్రీలంకలో పబ్, బార్, అపార్ట్మెంట్ పార్టీలకు డ్రగ్స్‌ను గుట్టుగా సరఫరా చేసేవారని సీసీబీ చెబుతోంది. సెలబ్రిటీలకు కూడా మత్తు పదార్థాలను పంపేవారమని రాంకా ఒప్పుకున్నాడు. సంజన ఇంటిలో 9 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా ఆమె డ్రగ్స్ మాఫియాలో పాల్గొన్నట్లు సీసీబీ అనుమానిస్తోంది. సిమ్‌కార్డ్, ఐఫోన్, ప్రోమాక్స్ కంప్యూటర్, సీసీ కెమెరాల డీవీఆర్‌లను స్వాధీనం చేసుకొని సమాచారం సేకరించగా ఆసక్తికర సాక్ష్యాలు బయట పడినట్లు తెలిసింది. నేడు సంజనా బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతుంది. కేసు విచారణలో ఉంది, నేనేం మాట్లాడను : ఐంద్రిత డ్రగ్స్ కేసుపై నేను ఏమీ మాట్లాడకూడదు, సీసీబీ అధికారులు విధించిన నియమాలను పాటించాలి అని నటి ఐంద్రితా రై అన్నారు. విచారణ జరుగుతున్నందున తను మీడియాతో మాట్లాడితే నియమోల్లంఘన కిందకు వస్తుందన్నారు. దిగంత్ సినిమా షూటింగ్‌లకు వెళ్లవచ్చని, కానీ బెంగళూరు విడిచి వెళ్లరాదని చెప్పారన్నారు. ఒకటి రెండురోజుల్లో ఐంద్రిత దంపతులకు మరోసారి నోటీసులు పంపవచ్చని సమాచారం. కాగా, రాధారమణ సీరియల్ నటి శ్వేతాప్రసాద్ తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. డ్రగ్స్ కేసులో జైలుకెళ్లిన ఒక నటితో కలిసిఉన్న పోటో వైరల్ అయ్యింది. ఆ ఫోటో మీద అసభ్యంగా పోస్టింగ్‌లు పెట్టవద్దన్నారు. -
నా పరువు తీస్తున్నారు!
న్యూఢిల్లీ: రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రకుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తమ వైఖరిని చెప్పాలని పిటిషన్ విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు, ప్రసారభారతికి, ప్రెస్ కౌన్సిల్‌కు, న్యూస్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేశారు. రకుల్ పిటిషన్‌ను ఫిర్యాదుగా స్వీకరించి ఈ నాలుగు సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేశారు. డ్రగ్స్ కేసులో విచారణ వేళ సంబంధిత ఆఫీసర్లకన్నా ముందే మీడియాకు కొన్ని అంశాలు లీకవుతున్నాయని, దీనిపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముందుగా ఫిర్యాదు చేయాల్సింది.. కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపించారు. రకుల్ కోరుకున్నట్లు ఇంజంక్షన్ లేదా బ్లాంకెట్ బ్యాన్ లాంటి ఆదేశాలివ్వద్దని కోరారు. కోర్టుకు వచ్చేముందు ఆమె ప్రభుత్వానికి కానీ సంబంధిత అథార్టీకి కానీ ఫిర్యాదు చేయలేదని, ఏదో ఒక్క మీడియా హౌస్ లేదా చానల్‌ను ప్రత్యేకంగా ఆమె పేర్కొనలేదని చెప్పారు. దీనిపై రకుల్ న్యాయవాది స్పందిస్తూ రకుల్ పేరు తాను చెప్పలేదని రియా చక్రవర్తి వివ రించినా మీడియా రిపోర్టులు రకుల్‌ను డ్రగ్స్ కేసుతో లింక్ చేసే రాస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతుండడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సమయం లేక నేరుగా కోర్టును ఆశ్రయించామని చెప్పారు. -
సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు
ముంబై: సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి తరచుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫామ్‌హౌస్ లోనావాలాకు వస్తుండేవారని, ఫామ్‌హౌస్ మేనేజర్ రీస్ ఒక న్యూస్ ఏజెన్సీ జరిపిన ఇన్వెస్టిగేషన్లో తెలిపారు. రియా చక్రవర్తి, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ వంటి బాలీవుడ్ మిత్రులు సుశాంత్‌తో కలిసి ఫామ్‌హౌస్‌లోనే పార్టీలు చేసుకునేవారని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు సుశాంత్ వద్ద పనిచేసే జగదీష్ అనే వ్యక్తి తెలిపారు. డ్రగ్-పెడ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న జైద్ విలాత్రా తదితరులు పార్టీ చేసుకున్న వారిలో ఉన్నారని వెల్లడించారు. సుశాంత్ పార్టీలలో గంజా, మద్యం సర్వసాధారణమని ఫామ్‌హౌస్ మేనేజర్ రీస్ వ్యాఖ్యానించారు. దీంతో లోనవాలా ఫామ్‌హౌస్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రధాన అంశంగా మారింది. ఎన్సీబీ ప్రస్తుతం దీనిపై దృష్టి సారించింది. సెప్టెంబర్ 2018 నుంచి సుశాంత్ ఫామ్‌హౌస్‌లో రీస్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సారా ఆలీఖాన్, రియా చక్రవర్తి తరచూ ఆ ఫామ్ హౌస్‌ను సందర్శిస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. పార్టీల కోసం వారు స్మోక్ పేపర్లను కూడా ఆర్డర్ చేసేవారని, అయితే వాటిని ఎందుకు ఉపయోగించేవారో తనకు తెలియదని రీస్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు వారానికి ఒకటి, రెండుసార్లు రాజ్‌పుత్ ఈ ఫామ్‌హౌస్‌కు వచ్చేవారని రీస్ తెలిపారు. అతనితో పాటు ఎవరు ఉంటారు అని రిపోర్టర్ ప్రశ్నించగా, మొదట్లో సారా అలీఖాన్ వచ్చేవారు. అప్పుడు రియా కూడా వారితో కలిసి వచ్చేది అని చెప్పారు. గత ఏడాది జూలైలో రియా తన పుట్టిన రోజు వేడుకలను తల్లిదండ్రులు, తన సోదరుడు షోవిక్‌తో కలిసి ఆ ఫామ్ హౌస్‌లో జరుపుకుంది అని రీస్ తెలిపారు. పార్టీలలో స్మోక్ పేపర్ వాడేవారని, ఖరీదైన వోడ్కాను అందించేవారని వెల్లడించారు. లాక్డౌన్లో ఫామ్‌హౌస్‌లో గడపాలని సుశాంత్ కోరుకున్నారని అయితే ఏవో కారణాల వల్ల ఆయన రాలేకపోయాని తెలిపారు. చదవండి: జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు -
డ్రగ్స్ కేసు: నటి సంజన అరెస్టు!
సాక్షి, బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో కన్నడ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో మరో నటి సంజన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఈరోజు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా నటి సంజన సన్నిహితుడు, రియల్ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే.(చదవండి: రంగుల తెరపై డ్రగ్స్ మరక!) అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. మొబైల్లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సంజన పేరు బయటకు రావడంతో రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. ‘బుజ్జిగాడు’ సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందారు.( చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!) టాలీవుడ్ డ్రగ్స్ కేసును తలపిస్తున్న కన్నడ చిత్ర సీమ వ్యవహారం రెండేళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అకున్ సబార్వాల్ నేతృత్వంలోని సిట్ అనేక మంది టాలీవుడ్ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను విచారించారు. పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరైన తారల లిస్టులో ఉన్నారు. ఇక ఇటీవల శాండల్‌వుడ్‌లోనూ ఇదే తరహా డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ క్రమంలో ఆగష్టులో ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అనిఖా అనే యువతి కూడా ఉంది. సోదాల్లో భాగంగా ఆమె.. డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లను గుర్తించారు. విచారణలో భాగంగాపలువురు హీరోలు, హీరోయిన్లు, సింగర్లకు అనిఖా డ్రగ్స్ సరఫరా చేసినట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకుని.. పలువురు సెలబ్రిటీలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు బీ-టౌన్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది. -
రంగుల తెరపై డ్రగ్స్ మరక!
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సీబీఐ అధికారులు బాలీవుడ్, శాండిల్‌వుడ్‌తో ముడిపడి ఉన్న డ్రగ్స్ రాకెట్ డొంకను కదిలించారు. టాలీవుడ్‌లోనూ పదేళ్లుగా ఈ ప్రకంపనలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే పోలీసు, ఎక్సైజ్ అధికారుల హడావుడి తప్ప చర్యలు మచ్చుకైనా కనిపించవు. చిత్ర పరిశ్రమకు, డ్రగ్స్ మార్కెట్‌కు మధ్య సన్నిహిత సంబంధం ఉందని పోలీసులు చెబుతుంటారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ప్రతీచోటా ఇండస్ట్రీలో డ్రగ్స్ హవా నడుస్తోందని చెప్తున్నారు. ఈ మాదకద్రవ్యాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. వృక్షాల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యే నార్కోటిక్ సబ్స్టాన్సస్. ప్రయోగశాలల్లో తయారు చేసే సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్. గాంజ (గంజాయి), ఓపియం (నల్లమందు), కొకైన్‌లతో పాటు గాంజ ద్వారా ఉత్పత్తి చేసే చెరస్, హషీష్ ఆయిల్, బంగ్, ఓపియం ద్వారా ఉత్పత్తి అయ్యే బ్రౌన్ షుగర్, హెరాయిన్ ... ఇవన్నీ నార్కోటిక్స్ కిందకి వస్తాయి. కెటామిన్, ఎపిడ్రిన్, పెథిడిన్ తదితరాలు సైకోట్రోపిక్స్ కోవకు చెందుతాయి. సినీరంగంలో నార్కోటిక్స్ వినియోగమే ఎక్కువ. వీటిలోనూ గాంజ, చెరస్, కొకైన్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారు. గాంజ ఉత్పత్తులు ప్రధానంగా హిమాచల్‌ప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నాయి. అక్కడ పండే గంజాయితో పాటు చెరస్, హషీష్ ఆయిల్‌కు సినీ రంగంలో మంచి డిమాండ్ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఓపియం సహా దాని ఉత్పత్తులైన బ్రౌన్ షుగర్, హెరాయిన్ల చలామణి తక్కువ. సాక్షి, హైదరాబాద్: ముంబై, బెంగళూరు, గోవా, ఢిల్లీ, చండీగడ్‌ల్లో డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వీరి నెట్‌వర్క్‌లో నైజీరియన్లదే కీలకపాత్ర. నైజీరియా, ఉగాండా తదితర సౌత్ ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారిని ఆకర్షించడం ద్వారా వివిధ వీసాలపై భారత్ రప్పిస్తున్నారు. వారి పాస్పోర్ట్స్ డిపాజిట్ చేయించుకుని వివిధ నగరాల్లో రిటైల్ వ్యాపారం వీరికి అప్పగిస్తున్నారు. బస్సులు, రైళ్లల్లో డ్రగ్‌ను అక్కడకు చేరుస్తున్నారు. విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని హోల్‌సేల్ నైజీరియన్లదే కీలకపాత్ర... పెడ్లర్స్‌కు పంపడం, వారిచ్చే కమీషన్ తీసుకోవడం వీరి పని. ఈ నైజీరియన్లు పట్టుబడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ గుర్తింపును హోల్‌సేలర్లు గోప్యంగా ఉంచుతున్నారు. సుశాంత్ సింగ్ కేసులు ‘అనుబంధంగా’వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఓ నైజీరియన్‌ను కూడా అరెస్టు చేయడం గమనార్హం. సినీరంగానికి చెందిన వారి నుంచి శని, ఆదివారాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 3 వరకు పెడ్లర్స్ మంచి బిజినెస్ చేస్తుంటారని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్ కాల్స్‌పై వచ్చే ఆర్డర్స్ ఆధారంగా పరిచయస్తులకు మాత్రమే విక్రయిస్తుంటారు. నగరంలోని పబ్స్‌తో పాటు శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్టుల్లో జరిగే రేవ్ హెరాయిన్ బ్లాక్ ట్రా, చివా, నెగ్రా, హార్స్ మారుపేర్లు. ఇంజెక్షన్ చేసుకోవడం, ముక్కుతో పీల్చడం, సిగరెట్లో నింపుకుని కాల్చడం ద్వారా దీన్ని సేవిస్తారు. హెరాయిన్ ను ఎక్కువగా వినియోగిస్తే శ్వాసకోస వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు కోమాలోకి వెళ్లి మరణించడం సైతం జరుగుతుంది. గాంజ, చెరస్ ఓ మాల్గా ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆకులను సిగరెట్లో నింపుకుని కాలుస్తారు. ఈ చెట్టు నుంచి కారే బంక నుంచి చెరస్ ఉత్పత్తి అవుతుంది. దీనిని నేరుగా తీసుకోవడం లేదా సిగరెట్ ద్వారా సేవిస్తారు. వీటి ప్రభావం ఊపిరితిత్తులు, మెదడు, నాడీ వ్యవస్థపై ఉంటుంది. కొకైన్ స్టఫ్, కోకి, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా మారుపేర్లు. ముక్కుతో పీల్చడం, సిగరెట్లో నింపుకుని కాల్చడం, వైన్‌లో కలుపుకుని తాగడం ద్వారా సేవిస్తారు. దీని వినియోగం పెరిగితే కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో పాటు అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. గండె సంబంధ వ్యాధులు త్వరగా వస్తాయి. వెండితెరతో లింకులెన్నో... ► బాలీవుడ్లో 1970ల్లోనే ఈ డ్రగ్స్ వాడకం వెలుగు చూసింది. అప్పటి నటీమణులు పర్వీన్ బాబీ, ప్రోతిమా బేడీ ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. ► సంజయ్‌దత్ సైతం ఈ వ్యవహారంలో వివాదాస్పదుడయ్యాడు. ఫర్దీన్ ఖాన్ కొకైన్‌ను కలిగి ఉండి 2001లో ముంబై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చిక్కాడు. ► అక్కడ పట్టుబడిన డ్రగ్ డీలర్ కరీమ్‌షేక్ అనేక మంది స్టార్ల పేర్లు బయటపెట్టాడు. నటుడు విజయ్‌రాజ్ డ్రగ్స్ తరలిస్తూ అబుధాబి పోలీసులకు చిక్కాడు. ► ఈ డ్రగ్స్ వినియోగ, విక్రయ జాడ్యం ఇప్పుడు టాలీవుడ్‌నూ పట్టిపీడిస్తోంది. పటుత్వం కోసం, ముఖవర్చస్సు పెంపొందించుకోవడానికి, స్ట్రెస్ రిలీఫ్ పేరుతో వీటి వాడకం ఎక్కువ చేశారు. ► హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన ఉగాండా జాతీయులు ప్రాట్రిక్, ఐబేర్‌లు... టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన నైజీరియా జాతీయుడు ఒకాచోలు కొకైన్ స్మగ్లింగ్‌లో ఆరితేరారు. వీరి కస్టమర్లలో 80 శాతం సినీ రంగానికి చెందిన వర్ధమాన తారలే. ► ప్రముఖ నటుడు రవితేజ సోదరులైన బి.రఘుబాబు, బి.భరత్‌రాజ్‌ను వెస్ట్‌జోన్ స్పెషల్ పార్టీ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో అనేక మంది సినీ తారల పేర్లు బయటకు వచ్చాయి. ► రెండేళ్ల క్రితం ఎక్సైజ్ అధికారులకు చిక్కిన ముఠా సైతం దాదాపు 60 మంది సినీ ప్రముఖులు తమ కస్టమర్లని బయటపెట్టారు. కొందరిని అధికారులు పిలిచి విచారించారు. అయితే ఈ రెండు కేసులూ చివరకు అటకెక్కాయి. -
శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కలకలం
సాక్షి బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో శాండల్‌వుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) శుక్రవారం ఒక అడుగు ముందుకు వేసింది. యలహంకలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసింది. రెండు రోజుల క్రితమే నటి రాగిణి సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. రవి శంకర్ ఇచ్చిన సమాచారంతో రాగిణిని గురువారం విచారణకు రావాలని నోటీసులిచ్చారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, సోమవారం విచారణకు వస్తానని లాయర్ ద్వారా రాగిణి సమాధానం పంపారు. ఈ నేపథ్యంలో కోర్టు ద్వారా సెర్చ్వారంట్తో పోలీసులు శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఆమె ఇంటిపై దాడి చేసి, సోదాలు జరిపారు. అనంతరం రాగిణిని విచారణ నిమిత్తం సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కాగా, శుక్రవారం సాయంత్రం రాగిణిని అరెస్టు చేసినట్లు సీసీబీ ప్రకటించింది. రాగిణి పెట్టుకున్న ముందస్తు బెయిల్‌పై విచారణను 7వ తేదీకి ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఇటీవల ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. వీరు వెల్లడించిన సమాచారంతో దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్‌ను సీసీబీ పోలీసులు విచారించగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో సుమారు 15 మంది సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. -
సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!
బెంగళూరు : గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లర్ల నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్న శాండల్‌వుడ్‌కు చెందిన నటులు, సంగీత కళాకారుల పేర్లను డ్రగ్స్ డీలర్ అనికా ఎన్సిబీ అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది. డ్రగ్స్‌కు కోడ్ పేర్లను పెట్టి తాను సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తన నుంచి ఏయే నటీ నటులు డ్రగ్స్‌ను కొనేదీ వివరించారు. సుమారు 30 మంది వరకు సినిమా రంగానికి చెందిన వ్యక్తుల పేర్లను ఎన్సీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించిన ఎన్సీబీ అధికారులు వారికి నోటీసులను అందించాలని నిర్ణయించారు. ఎవరీ అనికా? నిందితురాలు పేరు అనికా అయితే అనికా డి, బిమని అనే రెండు మూడు పేర్లను పెట్టుకొని బెంగళూరులో మత్తు దందాను నడపుతున్నట్లు విచారణలో బయట పడింది. సోషల్ మీడియాలో బిమని అనే పేరుతో చలామణి అయ్యేది. ఆమె తమిళనాడు సేలంకు చెందినవారు కాగా ఆమెకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నాడు. తమిళనాడులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సును మధ్యలో వదిలేసింది. ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చింది. ఉద్యోగం దొరక్క, డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లు విచారణలో వివరించింది. ముంబై డ్రగ్స్ డీలర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి పెద్దమొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినప్పుడు సినిమా రంగ ప్రముఖుల బండారం బయటపడింది. ( ఆ సినీ ప్రముఖుల పేర్లు బయటపెడతా...) లంకేశ్ విచారణ ద్వారా 15 మందికి తాఖీదులు? డ్రగ్స్ దందాపై సోమవారం దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఇచ్చిన సమాచారం మేరకు సినిమా రంగానికి చెందిన మరో 15 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. సినీ రంగంలో డ్రగ్స్ తీసుకొనేవారి పేర్లను లంకేశ్ సీసీబీ పోలీసులకు అందజేశారు. బెంగళూరులో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై డ్రగ్స్ విషయంపై చర్చించారు. ఈ 15 మంది సినీ ప్రముఖులు ఎవరనేది ఇప్పుడు శాండల్‌వుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. కరోనా వచ్చాక నేరాల వృద్ధి: కమిషనర్ డ్రగ్స్ వ్యవహారం అధికంగా నడుస్తున్న ఉప్పారపేట, బసవేశ్వరనగర, చంద్రాలేఔట్ ప్రాంతాల పోలీసుస్టేషన్లను నగరపోలీస్ కమిషనర్ కమల్‌పంథ్ మంగళవారం తనిఖీ చేశారు. డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. కరోనా వచ్చిన తరువాత బెంగళూరు నగరంలో నేరాల సంఖ్య పెరిగినట్లు ఆయన చెప్పారు. -
డ్రగ్స్ వల్ల తలెత్తే అనర్థాలు
డ్రగ్స్ ప్రధానంగా నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దారుణమైన దుష్ప్రభావాలు చూపుతాయి. చివరకు అకాల మరణాలకు కారణమవుతాయి. డ్రగ్స్ వల్ల శరీరానికి వాటిల్లే ప్రధానమైన అనర్థాలు ఇవి: రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది. లివర్‌పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. గుండె వేగంలో అవాంఛనీయమైన మార్పులు తలెత్తుతాయి. రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. గుండె పనితీరు దెబ్బతిని, అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుంది. జ్ఞాపకశక్తి క్షీణించడంతో పాటు ఏకాగ్రత లోపిస్తుంది. మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఎదురుగా ఏం జరుగుతోందో అర్థంచేసుకోలేని గందరగోళం ఏర్పడుతుంది. పరిస్థితులను గ్రహించి వాటికి అనుగుణంగా స్పందించే శక్తి నశిస్తుంది. డ్రగ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే..? డ్రగ్స్– ఇవి మాదకద్రవ్యాలు. మాదకద్రవ్యాల వాడకం వేలాది సంవత్సరాలుగా మనుషులకు తెలుసు. ఆదిమ మతాలకు చెందిన వారు మాదకతను కలిగించే గంజాయి వంటి ఆకులను, ఆకుల పసర్లను, కొన్ని రకాల మొక్కల నుంచి దొరికే గింజలను వాడేవాళ్లు. వీటిని వాడితే విచిత్రమైన తన్మయావస్థ, లేనిపోని భ్రాంతులు కలుగుతాయి. ఆదిమ మతాలకు చెందిన వారు ఇలాంటి అనుభూతినే దివ్యానుభూతిగా, ఇదంతా దైవానికి సన్నిహితం చేసే ప్రక్రియగా అపోహపడేవారు. పాతరాతి యుగంలోనే– అంటే, దాదాపు అరవైవేల ఏళ్ల కిందటే మనుషులు మత్తును మరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నాటికి ఈజిప్టు, భారత్ ప్రాంతాల్లో మత్తునిచ్చే సోమరసం, దాదాపు అలాంటిదే అయిన ‘హవోమా’వంటి మాదక పానీయాలను మతపరమైన వేడుకల్లో ‘దివ్యానుభూతి’ కోసం విరివిగా వాడేవారు. క్రీస్తుపూర్వం 2700 నాటికి మనుషులు గంజాయిని కనుగొన్నారు. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా దొరికేది. గంజాయి ఆకులను ఎండబెట్టి, మట్టితో తయారు చేసిన చిలుంలో వేసి, వాటిని కాల్చి, దాని పొగను పీల్చేవారు. ఈజిప్టు, పర్షియా, ఆఫ్రికా, భారత ఉపఖండం, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఆ కాలంలోనే గంజాయి వాడకం ఉండేది. భారత ఉపఖండంలోనైతే, గంజాయి పొగ పీల్చడంతో పాటు, పచ్చి గంజాయి ఆకులను నూరి తయారు చేసిన‘భంగు’ను పానీయాల్లో కలిపి సేవించే పద్ధతి కూడా ఉంది. గంజాయిని కనుగొన్న కాలంలోనే ఉమ్మెత్తమొక్కల వేర్లను, ‘రుబార్బ్’ మొక్కల వేర్లను కూడా మాదకద్రవ్యాలు వాడటం మొదలైంది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటికి నల్లమందు వాడకం మొదలైంది. క్రీస్తుశకం పదహారో శతాబ్దిలో కోకా ఆకులను మాదకద్రవ్యంగా కనుగొన్నారు. కోకా ఆకుల నుంచే ‘కొకైన్’ తయారు చేస్తారు. చాలావరకు ఆధునిక మాదకద్రవ్యాలకు ప్రాచీన కాలంలోనే కనుగొన్న గంజాయి, నల్లమందు, ఉమ్మెత్త వంటి మొక్కలే మూలం. డ్రగ్స్‌లో కొన్నింటిని ముక్కుతో పీలుస్తారు. కొన్నింటిని సిగరెట్ లేదా చిలుంలో చింపుకుని పొగ తాగుతారు. కొన్నింటిని శీతలపానీయాలు లేదా మద్యంలో చల్లుకుని, తాగుతారు. ఇవి కాకుండా మాత్రల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో దొరికే మాదకద్రవ్యాలూ ఉన్నాయి. వైద్యచికిత్స ప్రయోజనాల కోసం ఉపయోగించే కొన్ని మాత్రలు, ఇంజెక్షన్లను కొందరు మత్తులో మునిగితేలడం కోసం యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు. గంజాయి, నల్లమందుతో పాటు కొకైన్, మార్ఫిన్, హెరాయిన్, ఎల్ఎస్డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఈథాలమైడ్), బ్రౌన్‌సుగర్, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ–మెథాంఫెటామైన్) వంటి డ్రగ్స్ ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుకలో ఉన్నాయి. వీటిపై ఎన్ని ఆంక్షలు, నిషేధాలు ఉన్నా ఇవి అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నాయి. మనదేశంలోనూ ఇవి తరచుగా పోలీసు దాడుల్లో పట్టుబడుతూనే ఉన్నాయి. నొప్పినివారిణులుగా మాదకద్రవ్యాలు వైద్యశాస్త్రం ఆధునికతను సంతరించుకున్న తొలినాళ్లలో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను నొప్పినివారిణులుగా వాడేవారు. వీటిని వైద్యులే రోగులకు సూచించేవారు. అప్పటి పత్రికల్లో హెరాయిన్, కొకైన్ల ప్రకటనలు కూడా వచ్చేవి. శస్త్రచికిత్సలు జరిగిన రోగులకు, తీవ్రమైన గాయాలకు లోనై ఇన్ఫెక్షన్లు, నొప్పులతో బాధపడేవారికి మార్ఫిన్ ఇచ్చేవారు. మార్ఫిన్ ఎంతటి నొప్పినైనా మరిపిస్తుంది గాని, నొప్పులు తగ్గినా మార్ఫిన్ మాదకతకు రోగులు బానిసైపోతారు. మొదటి ప్రపంచయుద్ధకాలంలో గాయపడిన సైనికులకు మార్ఫిన్ ఇచ్చేవారు. హెరాయిన్, కొకైన్లూ దాదాపు ఇదే తీరులో పనిచేస్తాయి. కొన్నాళ్లు వీటిని వాడిన వారు వీటికి బానిసలు కావాల్సిందే. ఆ తర్వాత వాటి నుంచి బయటపడటం దుస్సాధ్యం. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో వైద్యులు చిన్నపాటి పంటి నొప్పుల మొదలుకొని నానా రకాల జబ్బులకు కొకైన్‌ను ఎడాపెడా సూచించేవారు. హెరాయిన్‌ను దగ్గుమందుగా వాడేవారు. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో సైతం ఆనాటి వైద్యులు విచక్షణారహితంగా వీటిని సూచిస్తూ పోవడంతో లక్షలాదిమంది వీటికి బానిసలుగా మారారు. దాదాపు శతాబ్దకాలం తర్వాత వైద్యులు వీటి దుష్ప్రభావాలను గుర్తించడంతో ప్రభుత్వాలు వీటిపై నిషేధం విధించాయి. నిషేధం తర్వాత పత్రికల్లో వీటి ప్రకటనలైతే నిలిచిపోయాయి గాని, వీటి ఉత్పత్తి మాత్రం నిలిచిపోలేదు. అక్రమమార్గాల్లో వీటి ఉత్పత్తి, రవాణా, సరఫరా జరుగుతూనే ఉన్నాయి. నిషేధాలూ పర్యవసానాలూ మాదకద్రవ్యాలపై నిషేధాజ్ఞలు జారీ చేసిన తొలి దేశం చైనా. అక్కడ నల్లమందు వాడకం విపరీతంగా ఉండేది. జనాలంతా నల్లమందుభాయీలుగా మారడంతో ఆందోళన చెందిన చైనా ప్రభుత్వం 1729లో తొలిసారిగా నల్లమందుపై నిషేధం విధించింది. అది పెద్దగా ఫలించలేదు. అయినా పట్టువదలని చైనా ప్రభుత్వం 1796, 1800 సంవత్సరాల్లో కూడా మరో రెండుసార్లు నల్లమందుపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినా, ఇవేవీ ఫలించలేదు. ప్రభుత్వం నిషేధం విధించినా, నల్లమందు మరిగిన చైనా జనాలు సొంతగానే దొంగచాటుగా గసగసాల సాగు చేస్తూ, సొంత వాడకానికి కావలసిన నల్లమందు తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. సొంత సాగుకు వీలు కుదరని వారు విదేశాల నుంచి దొంగచాటుగా నల్లమందును దిగుమతి చేసుకునేవారు. ఫలితంగా నిషేధాజ్ఞలకు ముందు 40 లక్షలుగా ఉన్న నల్లమందుభాయీల సంఖ్య 1836 నాటికి ఏకంగా 1.20 కోట్లకు చేరుకుంది. ఇది గమనించిన చైనా ప్రభుత్వం నల్లమందు దిగుమతిపై నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసే చర్యలు ప్రారంభించడంతో అవి వికటించి, బ్రిటన్‌తో మొదటి నల్లమందు యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1839లో ప్రారంభమై నాలుగేళ్లు కొనసాగింది. ఆ తర్వాత 1856లో రెండో నల్లమందు యుద్ధం జరిగింది. రెండో యుద్ధంలో బ్రిటిష్ సేనలతో ఫ్రెంచి సేనలు కూడా జతకలసి చైనాతో తలపడ్డాయి. రెండు యుద్ధాలూ చైనాకు ఆర్థిక నష్టాన్ని, సైనిక నష్టాన్ని మిగిల్చాయి. ఇరవయ్యో శతాబ్ది నాటికి ప్రపంచ దేశాన్నీ కాస్త తెలివి తెచ్చుకుని మాదక ద్రవ్యాలపై నిషేధాజ్ఞలు విధించాయి. నిషేధాజ్ఞల ఫలితంగా మాదక ద్రవ్యాల ఉత్పాదన విరివిగా జరిగే దేశాల్లో మాఫియా ముఠాలు తయారయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేయడమే కాకుండా, దారుణమైన నేరాలకు పాల్పడుతూ దేశ దేశాల్లో వేళ్లూనుకున్నాయి. ఈ మాఫియా ముఠాలు సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో, దానిపై వచ్చే లాభాలు ఏమేరకు ఉండవచ్చో కచ్చితమైన అంచనాలేవీ లేవు. అయితే, ఐక్యరాజ్య సమితి 1997లో విడుదల చేసిన ‘వరల్డ్ డ్రగ్ రిపోర్ట్’ నివేదిక మాదక ద్రవ్యాల ఆక్రమ వ్యాపార లాభాలు దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల (రూ.278 లక్షల కోట్లు) వరకు ఉండవచ్చని అంచనా వేసింది. ఈ అంచనా ఇరవైరెండేళ్ల కిందటిది. ఆ తర్వాత దీనిపై అధికారిక లెక్కలేవీ అందుబాటులో లేవు. ఇప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ఊహించుకోవాల్సిందే! మాదకద్రవ్యాల నిషేధానికి ఎన్ని దేశాలు ఎన్ని చట్టాలను తెచ్చినా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఎంత భారీ యంత్రంగాన్ని ఏర్పాటు చేసుకున్నా, మాఫియా ముఠాల ప్రాబల్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుతున్న దాఖలాల్లేవు. ఆంక్షలున్నా ఆగని అక్రమ రవాణా మాదకద్రవ్యాల ఉత్పత్తి అత్యధికంగా జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్‌తో పాటు అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్, టర్కీ, లావోస్, తదితర దేశాల్లో గసగసాల సాగు భారీ స్థాయిలో సాగుతోంది. దీని ద్వారా తయారయ్యే నల్లమందు, దాని నుంచి ఏటా ఉత్పత్తి చేసే మాదకద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27.5 కోట్ల మంది నిషిద్ధ మాదకద్రవ్యాలకు బానిసలుగా ఉన్నారని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో గంజాయి వాడేవారి సంఖ్య అత్యధికంగా 19.2 కోట్ల వరకు ఉంటుందని, ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ పుచ్చుకునేవారి సంఖ్య 1.10 కోట్ల వరకు ఉంటుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం కారణంగా సంభవించే మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం మరో ఆందోళనకరమైన పరిణామం. యునైటెడ్ నేషన్స్ ఆఫీన్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యూఎన్ఓడీసీ) వెల్లడించిన వివరాల ప్రకారం 2000 సంవత్సరంలో డ్రగ్స్ కారణంగా 1.05 లక్షల మంది మరణిస్తే, 2015 నాటికి ఈ సంఖ్య 1.68 లక్షలకు చేరుకుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు కొన్ని దేశాలు కీలక స్థావరాలుగా ఉంటున్నాయి. మెక్సికో, కొలంబియా, పెరు, బొలీవియా, వెనిజులా వంటి దేశాల నుంచి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు అమెరికా, కెనడా, యూరోప్ దేశాలకు చేరుతున్నాయి. ఇరాన్, అఫ్ఘానిస్తాన్, మయన్మార్ తదితర దేశాల నుంచి భారత్ సహా దక్షిణాసియా దేశాలకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దుల వద్ద ఎంతటి కట్టుదిట్టమైనా భద్రత ఏర్పాట్లు ఉన్నా, ఏటా వివిధ దేశాల సరిహద్దు భద్రతా దళాలకు టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు పట్టబడుతూనే ఉన్నా, మాఫియా ముఠాలు మాత్రం ఏదో ఒక రీతిలో భద్రతా బలగాల కళ్లుగప్పి వీటిని తాము చేరవేయదలచుకున్న ప్రాంతాలకు చేరవేస్తూనే ఉన్నారు. డ్రగ్స్‌ను విక్రయించే స్థానిక దళారులు యువతకు వీటి మత్తును మప్పి, వీటికి బానిసలుగా తయారు చేస్తున్నారు. మన దేశంలో పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం విస్తరిస్తోంది. పంజాబ్ ఉదంతాన్ని తీసుకుంటే, అక్కడి యువత మత్తులో మునిగి తేలే పరిస్థితులు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. అక్కడి పరిస్థితులపై రూపొందించిన ‘ఉడ్తా పంజాబ్’ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. – పన్యాల జగన్నాథదాసు -
ఆల్ప్రాజోలం దందా!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో ఆల్ప్రాజోలం అక్రమ దందా ఆగడం లేదు. రాష్ట్రంలో ఆల్ప్రాజోలం అక్రమ తయారీ ఆగిందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ భావిస్తున్న తరుణంలో ఈ నిషేధిత డ్రగ్ పెద్ద ఎత్తున పట్టుబడడం ఆ శాఖను ఒకింత ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్ (ఇండోర్), మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ రాష్ట్రంలోకి రవాణా అవుతున్నట్లు తేలింది. కేం ద్ర రెవెన్యూ ఇంటలిజెన్స్ ఉన్నతాధికారుల బృందం ఇటీవల రూ. 2.40 కోట్లు విలువ చేసే 40 కిలోల ఆల్ప్రాజోలంను నాగ్‌పూర్ – హైదరాబాద్ రహదారిపై కామారెడ్డి వద్ద పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకుగుజరాత్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేయగా ఈ నిషేధిత డ్రగ్ బయటపడింది. రూ. 2.40 కోట్లు విలువ చేసే డ్రగ్ అక్రమ రవాణా వెలుగుచూడడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది. దీన్ని మెదక్ జిల్లాకు తరలించేందుకు రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. ఒక్కో కిలో ఆల్ప్రాజోలం ప్రస్తుతం రూ. ఆరు లక్షల వరకు ఉంటుంది. ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలోనూ మూడు ఆల్ప్రాజోలం కేసులు నమోదయ్యాయి. సుమారు ఐదు కిలోల ఈ నిషేధిత డ్రగ్‌ను ఎక్సైజ్‌శాఖ స్వాధీనం చేసుకుంది. -
గ‘మ్మత్తు’గా..
కరీంనగర్‌క్రైం : బంగారు కలలతో కరీం‘నగరం’లో అడుగుపెడుతున్న యువత అడ్డదారులు తొక్కుతున్నారు. మత్తుపదార్థాలకు బానిసవుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో సరదాగా మొదలై వ్యసనపరులుగా మారుతున్నారు. జల్సాలకు అలవాటుపడి గంజాయిని నగరాలకు తరలిస్తున్నారు. పోలీసులకు చిక్కడంతో ఉన్నతమైన భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి.. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలనుంచి గంజాయిని పట్టణాలను తీసుకొస్తున్నారు. జగిత్యాల, మంథని, సిరిసిల్ల, గోదావరిఖని, మంచిర్యాల డివిజన్లలో గంజాయి జోరుగా సాగవుతున్నట్లు సమాచారం. దీనిని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజురా బాద్, గోదావరిఖని డివిజన్లలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడ వాటిని చిన్నచిన్న పొట్లాలుగా మార్చి అమ్ముతున్నారు. హుక్కాకు అలవాటు పడిన వారుసైతం గంజాయికి ఆకర్షితులవుతున్నారు. గంజాయితో సిగరేట్లు తయారు చేసి పలు దుకాణాల్లో కోడ్ పేర్లతో విక్రయిస్తున్నట్లు తెలిసింది. నగరంలో విస్తరిస్తున్న గంజాయి కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా విస్తరిస్తున్నట్లు సమాచారం. తిరుమలనగర్, శేషామహల్, కమాన్ ప్రాంతం, హౌసింగ్‌బోర్డు కాలనీ, అంబేద్కర్‌స్టేడియం, డ్యాం పరిసరాల్లో, బైపాస్ రోడ్డుల్లో కొందరు కొందరు ముఠాగా ఏర్పడి ప్యాకెట్లుగా మార్చి గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం. వీరికి విద్యార్థులు చిక్కుకుంటున్నారని తెలిసింది. ఈ మధ్య ఓ విద్యార్థి తరచు అనారోగ్యానికి గురి కావడంతో వైద్యపరీక్షలు చేయగా గంజాయికి అలవాటు పడినట్లు తెలిసింది. ఇతడి మిత్రులు సుమారు 20 మందికి గంజాయి అలవాటు ఉందని సదరు విద్యార్థి తెలపడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. గంజాయి అమ్మకం దారులు 100 గ్రాముల ప్యాకెట్‌ను రూ. 5000కు విక్రయిస్తున్నట్లు సమచారం. ఇలా నిత్యం రూ. 50వేల వరకు వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్ దాడులు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన నాటి నుంచి మత్తు పదార్థాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోంది. సుమారు 250 మంది విద్యార్ధులు గంజాయికి అలవాటు పడ్డారని గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తాజాగా వారంక్రితం 8, 9వ తరగతి విద్యార్ధులు కూడా గంజాయికి అలవాటు పడ్డారని గుర్తించారు. వీరికి వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మొదట గంజాయికి అలవాటు పడి అమ్మకందారుడిగా అవతామెత్తిన ఇంటర్ విద్యార్థిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక పక్క టాస్క్ఫొర్స్ దాడులు చేస్తుండడంతో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి గంజాయి సేవిస్తున్నారని సమాచారం. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. డ్రగ్స్ కూడా... జిల్లాలో డ్రగ్స్ మూలాలు బయటపడడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. నగరంలో 2012 ఆగస్టు 2న కొకైన్ సరఫరా చేస్తూ ముగ్గురు విద్యార్థులు దొరికిన సంఘటన తెలిసిందె. భాగ్యనగర్‌కు చెందిన పల్లె ప్రశాంత్(20), జ్యోతినగర్‌కు చెందిన న్యాలకొండ దీక్షిత్(19), పెద్ది నవీన్(17) అనే విద్యార్థులు 2 గ్రా. కొకైన్‌తో పట్టుబడ్డారు. రాష్ట్ర రాజధానిలో పోలీసుల నిఘా పెరగడంతో కరీంనగర్ కేంద్రంగా అమ్మకాలు చేసేందుకు డ్రగ్స్మాఫియా ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. ఈ మధ్యకాలంలో హైదారాబాద్‌లో డ్రగ్స్ ముఠాలను ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్న వారిలో కొందరు కరీంనగర్‌కు చెందిన వారు కూడా ఉన్నారని తెలిసింది. ప్రకటనకే పరిమితమైన అవగాహన గతంలో డ్రగ్స్ ఆనవాల్లు బయటపడినప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్న పలువురి వ్యాఖ్యలు ప్రకటనకే పరిమతమయ్యాయి. కాలేజీల్లో పెడదోవ పడుతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహిం చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొన్ని లక్షణాలు... వీటికి అలవాటు పడిన వారు నరాల బలహీనత, మెదడు మొద్దుబారడం, ఇతర వ్యవస్థలు నియంత్రణలో ఉండకపోవడం, శరీరం తేలికపడినట్లు అయి కొద్ది సమయం వరకూ తెలియని కొత్తశక్తి వచ్చినట్లు అవుతుంది. మొదట నాడి వ్యవస్థ, మెదడు, కండరాల వ్యవస్థలపై ప్రభావం చూపి తర్వాత మనిషి తన ఆధీనం కోల్పోయి వెలుగును చూడలేడు, అధిక శబ్ధాలను వినలేడు. తరచూ మత్తు పదార్థాలు తీసుకునేందు కు ప్రయత్నిస్తారు. ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు, ఎవరితో సరిగా మాట్లాడడు తనకు కావాల్సిన డ్రగ్స్, గంజాయి లభించకపోతే సైకోలాగా తయారువుతా రు. ఇంట్లోవారు లేదా మిత్రులు వీరిని గమనిస్తే చాలా తేడాలు కనిపిస్తాయి. వెంటనే వైద్యం సహాయం అందిస్తే త్వరగా బయటపడే అవకాశాలుంటాయి సీపీ కమలాసన్‌రెడ్డి గంజాయి అమ్మకాలు చేసే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. గతంలో పట్టుబడ్డ వారికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చాం. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రప్రభావం, నష్టాలపై అవగాహక సదస్సులు ఏర్పాటు చేస్తాం. -
రూ.1.5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత
జైపూర్: దేశీయ మార్కెట్లో సుమారు రూ.1.5 కోట్ల విలువ చేసే ఓపియం అనే మాదక ద్రవ్యాన్ని రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన మాదక ద్రవ్యాలు 71 కేజీల బరువు ఉందని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితుడు సునీల్ నగ్ధా మధ్యప్రదేశ్ రాష్ట్రం నీముచ్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. మాదక ద్రవ్యాలతో కారులో నీముచ్ నుంచి జోధ్‌పూర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రగ్స్ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన పలువురు సినీ ప్రముఖుల డ్రగ్స్ వినియోగం, విక్రయం కేసులో ఎక్సైజ్ సిట్ చార్జి షీట్ వేసేందుకు సిద్ధమైంది. కోర్టు నుంచి అందిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సిట్ అధికారులు చార్జిషీట్ రూపొందిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీన్ని కోర్టుకు సమర్పించనున్నారు. సిట్ విచారించిన వారిలో పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు తదితరులు ఉన్నారు. విచారణలో ముగ్గురు సినీ ప్రముఖుల నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారు. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక అందడంతో ఇద్దరు ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందనే ప్రచారం జరుగుతోంది. కానీ సిట్ అధికారికంగా దీన్ని ధ్రువీకరించలేదు. -
పాట పాడాడు.. జైలుశిక్ష తగ్గించారు!
న్యూయార్క్ : శిక్ష నుంచి తప్పించుకోవడానికి నేరస్తులు వివిధ మార్గాలు అనుసరిస్తారు. కొందరు అబద్ధాలు చెప్తారు. మరికొందరు సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అమెరికన్ ర్యాప్ సింగర్ తన పాటతో జడ్జిని మెస్మరైజ్ చేసి శిక్ష నుంచి తప్పించుకోవాలని చూశాడు. ర్యాపర్ డీఎమ్ఎక్స్ గా ప్రసిద్ధి చెందిన ఎర్ల్ సిమ్మన్స్ పన్ను ఎగవేత కేసులో కోర్టు ముందు హాజరయ్యాడు. 1.7 మిలియన్ డాలర్ల పన్ను ఎగ్గొట్టిన సిమ్మన్స్‌ను రక్షించేందుకు అతని లాయర్ ముర్రే రిచ్మన్ కూడా సిమ్మన్స్ మాదిరిగానే కోర్టులో విచిత్రంగా ప్రవర్తించాడు. సిమ్మన్స్ జీవితంలోని కష్టనష్టాలు, అతను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలిపే ‘స్లిప్పిన్’ అనే హిట్ సాంగ్‌ను ప్లే చేస్తూ జడ్జిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ‘సిమ్మన్స్ జీవితం గురించి నేను విన్నాను. అతను చాలా కష్టాలు అనుభవించాడు. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలదొక్కుకున్నాడు. సిమ్మన్స్ ఇప్పటికే సుమారు 30సార్లు అరెస్టయ్యాడు. కానీ గత ఐదు సంవత్సరాల నుంచి అతనిలో మార్పు వచ్చింది. పశ్చాత్తాపంతో అతను కుంగిపోయాడు. తన 15 మంది పిల్లలకు అతడి అవసరం ఉంది. కాబట్టి అతనికి ఒక అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ వాదించాడు. ప్రాసిక్యూటర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పన్ను ఎగవేత కేసులో సిమ్మన్స్ ఐదు సంవత్సరాల శిక్ష ఎదుర్కోక తప్పదు అని వాదించాడు. వాద ప్రతివాదనలు విన్న జడ్జి ఇచ్చిన తీర్పు అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘సిమ్మన్స్ చాలా మంచివాడు. తన పాటతో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చాడు. కానీ తనకు తానే పెద్ద శత్రువు’ అని పేర్కొంటూ.. ఏడాదిపాటు జైలు శిక్ష, 2.3 మిలియన్ డాలర్ల(రూ. 15 కోట్లు) జరిమానాతో సరిపెట్టాడు. -
డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్టు..
వేలూరు: తెలుగు సినీ నటులకు మాదకద్రవ్యాలు సరఫరా చేసిన కేసులో వేలూరుకు చెందిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఈ కేసు నగరంలో రోజుకో మలుపు తిరిగి హల్ చల్ చేసింది. తెలుగు నటులకు డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో ఇప్పటికే అరెస్టులు, విచారణలు జరిగిన విషయం తెలిసిందే. విచారణలో వెల్లడైన వివరాల మేరకు హైదరాబాద్ పోలీసులు సత్వచ్చారి ప్రాంతానికి చేరుకుని రత్నగిరికి చెందిన ఇద్దరిని గురువారం అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకోచ్చారు. ఈ మాదక ద్రవ్యాల కేసులో కాట్పాడికి చెందిన ఒకరిని రెండు నెలల క్రితమే పోలీసుల అరెస్టు చేసి తీసుకెళ్లారని తెలిసింది. అతను తమిళనాడులోని ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వివరాలు వెల్లడించలేదన్నారు. అతడు తెలిపిన సమాచారం మేరకు మరో ఇద్దరిని పట్టుకున్నారని సమాచారం. అయితే ఆ ఇద్దరి వ్యక్తులకు డ్రగ్స్ కేసులో సంబంధాలున్నాయా లేదా తెలియాల్సి ఉంది. డ్రగ్స్ కేసులో భాగంగా 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు గత నెల 19 నుంచి 27 వరకు సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. జూలైలో 12 మంది సినీ ప్రముఖులు, 17 మంది ఇతర రంగాలకు చెందిన వారిని ఏకంగా 13 నుంచి 14 గంటల పాటు సిట్ విచారించింది. -
గ్లామర్ పార్ట్ పూర్తయింది
-
గ్లామర్ పార్ట్ పూర్తయింది
- సెప్టెంబర్‌లో సెకండ్ పార్ట్ మొదలవచ్చు - డ్రగ్ కేసులో ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ సాక్షి, హైదరాబాద్: డ్రగ్ కేసులో మొదటి ఎపిసోడ్ గ్లామర్ పార్ట్ విచారణ పూర్తయిందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇక రెండో జాబితా ఉండబోదని పరోక్షంగా వెల్లడించారు. శుక్రవారం ఇఫ్లూలో డ్రగ్స్ నియంత్రణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా అకున్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు అరెస్టయిన వారి విచారణలో వెల్లడైన అంశాలను బట్టి సెప్టెంబర్‌లో రెండో జాబితా ఉంటుందని తెలిపారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ వ్యవహారంలో 11 కేసులు నమోదయ్యాయని, వాటిలో చార్జిషీట్ వేసేందుకు కసరత్తు పూర్తి చేశామన్నారు. పలువురి రక్తం, గోర్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించామని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చెప్పారు. ఆ రిపోర్టుల కోసం వేచిచూస్తున్నామని, అవి అందగానే చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. -
డ్రగ్స్ కేసులో ముగిసిన కీలక వ్యక్తుల విచారణ
-
‘దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాం’
► డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు స్పష్టీకరణ ► దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని వెల్లడి హైదరాబాద్: ‘‘డ్రగ్స్ కేసు దర్యాప్తు పార దర్శకంగా జరుగుతోంది. ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమపై ఎటువంటి కక్ష సాధించట్లేదు. ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం. దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాం’’ అని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావు స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 3 వేల యూనిట్ల ఎల్ఎస్డీ, 45 గ్రాముల కొకైన్, ఇతర నార్కోటిక్, సైకోట్రో పిక్ పదార్ధాలను రికవరీ చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పద్మారావు వివరించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు సినీ పరిశ్రమలోని 12 మందికి, 11 బార్లు, పబ్‌లకు నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే 26 స్కూళ్లు, 27 కాలేజీలు, 25 ఐటీ కంపెనీలకు చెందిన కొందరిని అరెస్టు చేసి పూర్తి సమాచారం రాబడుతున్నామన్నారు. హరితహారంపై సమీక్ష... హరితహారంలో భాగంగా ఇప్పటివరకు నాటిన ఈత, తాటి మొక్కల పరిరక్షణతో పాటు ఎక్సైజ్ ప్లాంటేషన్ డేను పురస్కరించు కొని చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం పై మంత్రి పద్మారావు గురువారం సచివాల యంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. గతేడాది ఈత మొక్కల కొరత వల్ల నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, ఈసారి ముందుగానే నర్సరీలలో ఆ మొక్కలను పెం చడం వల్ల కొరతను అధిగమించగలిగామని పద్మారావు పేర్కొన్నారు. ఎక్సైజ్ ప్లాంటేషన్ డేలో భాగంగా 25 లక్షల ఈత, ఖర్జూర మొక్క లను నాటుతున్నామన్నారు. సిరిసిల్ల నియో జకవర్గంలోని గంభీరావుపేటలో తాను మొక్కలు నాటుతానని, ఒక్కో అధికారి ఒక్కో జిల్లా పర్యవేక్షణకు వెళ్తారని మంత్రి వివరిం చారు. ఈత చెట్లు ఎక్కే యంత్రాలు, నీరా ఉత్పత్తులు, వాటి మార్కెటింగ్‌కు సంబం ధించిన విధివిధానాలను త్వరగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గీత కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం పైనా చర్యలు తీసుకుంటామన్నారు. సమా వేశంలో టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్ రావు, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవ దన్, అడిషనల్ కమిషనర్ రాజశేఖర్‌రావు, ఓఎస్డీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
'మా 'సినిమావాళ్ళవి' అద్దాలమేడ జీవితాలు'
డ్రగ్స్ కేసు విషయంలో సినిమా వాళ్లపై వస్తున్న విమర్శలు, మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, వారికి కుటుంబాలు ఉంటాయని అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వైవియస్ చౌదరి తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'మేము అడుక్కున్నా అతిశయమే, అడుక్కోకున్నా అతిశయమే, మేము కొంచెం చేసినా 'అతి'శయమే, కొంచెమే చేసినా 'అతి'శయమే, అస్సలు మేమేంచేసినా, చేయకున్నా ప్రతివాడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే/స్పందిస్తూనే ఉంటాం. ప్రతీ శుక్రవారం మా జీవనరేఖలు, జీవనసూత్రాలు, మా జీవితగమ్యాలు మారుతూనే ఉంటాయి. అలా ప్రతీ సంవత్సరంలో 52 సార్లు మార్పులకు, చేర్పులకు, కూర్పులకు అలవాటుపడ్డవాళ్ళం. ధైర్యసాహసాలను, కుట్రలూకుతంత్రాలను రచించగల/ప్రదర్శించగల కధానాయకులం, ప్రతినాయకులం. దానధర్మాలు, త్యాగాలు చేయగల మానవతావాదులం. మంచీ-చెడులు, గెలుపూ-ఓటమిలు, పొగడ్తలూ-ప్రశంసలు, నిందాపనిందలు మమ్మల్నెప్పుడూ వెంటాడే 'నీడ'లాంటి నేస్తాలు. మేము అందరికీ కావాల్సినవాళ్ళం, మా అవసరాలకి మాత్రం అందరికీ కానివాళ్ళం. ఏ మాధ్యమాలకైనా, ఏ విషయానికైనా మేమే అవసరం, మేమే ప్రథములం. మేము 'అల'లాంటి వాళ్ళం. 'అల'లాగా నిశ్చింతగా నిశ్చళంగా బతకడం చేతకానివాళ్ళం. కానీ, 'అల'లాగా పడినా లేవగల సత్తా ఉన్నవాళ్ళం. మేము దేనినైనా స్వీకరించగలం, దేనినైనా భరించగలం. దేనికైనా వెనకాడని దమ్ముగలవాళ్ళం. ఎంత మంది ఎన్ని అన్నా, అనకున్నా 'కళ' పట్ల, 'కళాకారుల' పట్ల వ్యామోహాన్ని ఆపలేరు, 'కళాకారులు' లోని తృష్ణని తగ్గించలేరు. ప్రపంచం ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతుకుతుంది తప్ప, గతాన్ని గుర్తుకు తెచ్చుకునే ఓపికా ఉండదు, భవిష్యత్తు గురించి బెంగపడే తీరికా ఉండదు. కాలప్రవాహంలో ఇప్పడు సంచరిస్తున్న వార్తలన్నీ రేపటికి సద్దికూడు. ఎల్లుండికి విసిరేసిన విస్తరాకు. క్లుప్తంగా.. ఈ వర్తమానమంతా రేపటికి ఇంగువ కలిపిన కమ్మని పులిహోర (Exaggerated News), ఎల్లుండికి అందరూ వదిలించుకుందామనే అశుద్ధం. PS: ఇప్పుడు తెలుగు 'వెండితెర'పై కమ్మిన కారుమబ్బుల గురించి, నా ఈ గోడు మీ అందరికీ అర్ధమయ్యుంటుందని ఆశిస్తూ.. మీ.. వై వి ఎస్ చౌదరి.' అంటూ ప్రకటనను విడుదల చేశారు. -
అర్థరాత్రి వరకే పబ్‌లు, క్లబ్‌లు
-
అర్థరాత్రి వరకే పబ్‌లు, క్లబ్‌లు
హైదరాబాద్: హైదరాబాద్ పోలీసలు పబ్ యజమానులకు షాక్ ఇచ్చారు. పబ్‌లలో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో పనిచేసే వేళలను కుదించారు. ఇకపై రాత్రి 12 గంటల వరకే అనుమతిస్తూ కొత్తగా ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితమే పబ్‌లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట సహా అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇక నుంచి అర్థరాత్రి 12 గంటలకు బంద్ చేయాల్సి ఉంటుంది. మొన్నటి వరకు రాత్రి 12 గంటల వరకు లిక్కర్ సరఫరాచేసి ఒంటి గంట వరకు ఫుడ్ సరఫరా చేసేవారు. ఇప్పుడు అన్నింటికి ఒకే లెక్క. రాత్రి 12 గంటలకు తమ పరిధిలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు, హోటళ్లు మూసివేసిన తర్వాతనే సెక్టార్ ఎస్ఐలు ఇంటికి వెళ్లాలని తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆదివారం రాత్రి నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. సరిగ్గా 12 గంటలకు పబ్‌లను మూసివేయించి ఇంటికి వెళ్తున్నారు. సోమవారం రాత్రి 12తర్వాత అన్ని పబ్‌లు, క్లబ్‌లు, హోటళ్ల వద్ద నిరంతర నిఘా ఉంచారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. కేసులు బనాయించాలని యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 12 గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా అనుమతించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక పబ్‌లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హుక్కా సెంటర్లు అధికంగా ఉన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాటిముందు రాత్రి 12 తర్వాత కార్లు ఆగినా, యువత అనుమానాస్పదంగా తిరిగినా వెంటనే ప్రశ్నించాలని తెల్లవారుజాముదాకా గస్తీకాయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు ఆయా పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లను బాధ్యులుగా చేశారు. -
టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిన డ్రగ్స్
-
క్వశ్చన్ అవర్
-
డ్రగ్స్: ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు
-
'డ్రగ్స్‌కు బానిసై చాలా దెబ్బతిన్నా'
-
అకున్ సబర్వాల్ అనూహ్య నిర్ణయం!
-
హీరోయిన్‌కు అరెస్ట్ వారెంట్
థానె: 2 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి మమతా కులకర్ణి పీకల్లోతు కష్టాల్లో పడింది. థానెలోని ప్రత్యేక కోర్టు మమతా కులకర్ణితో పాటు అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ వికీ గోస్వామికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు వెలుగు చూసిన తర్వాత మమత, గోస్వామి అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని సమాచారం. డ్రగ్ రాకెట్ కేసులో మమత, గోస్వామికి సంబంధమున్నట్టు బలమైన ఆధారాలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హీరే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వీరేనని, వీరిపై వారెంట్ జారీ చేయాలని కోరారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. భారత్, కెన్యాలో డ్రగ్ రాకెట్ నడుపుతున్నారని, కెన్యాలోని ఓ హోటల్లో మమత, గోస్వామి, ఇతర నిందితులు సమావేశమైనట్టు విచారణలో తేలిందని చెప్పారు. వాదనలు విన్న అనంతరం కోర్టు.. మమత, గోస్వామికి వారెంట్ జారీ చేసింది. 2014 ఏప్రిల్‌లో థానె క్రైమ్ బ్రాంచ్ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గోస్వామికి, కెన్యాకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు ప్రమేయమున్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత విచారణలో చాలామంది పేర్లు వెలుగు చూశాయి. మమత కెన్యాలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. -
వారిపై నిషేధం విధించండి:ఫెల్ప్స్
రియో డీ జనీరో; క్రీడల్లో డ్రగ్ చీటింగ్‌కు పాల్పడే వారిపై జీవిత కాల నిషేధం విధించాలంటూ అమెరికా మేటి స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ ధ్వజమెత్తాడు. అసలు ఒకసారి డోపింగ్ పాల్పడిన వారిలో తిరిగి అనుమతించడం అంటూ ఉండకూడదన్నాడు. ఇలా తరచు కొంతమంది అథ్లెట్లు డ్రగ్స్ తీసుకోవడం తన హృదయాన్ని తీవ్రంగా కలిచి వేస్తుందన్నాడు. 'ఇటీవల కాలంలో అథ్లెట్లు డ్రగ్స్ తీసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది. అది ఒక స్విమ్మింగ్ కే మాత్రమే పరిమితం కాదు.. ప్రతీ క్రీడలోనూ డ్రగ్స్ చీటింగ్ కొనసాగుతోంది. అలా ఒకసారి డోపింగ్ చేసిన వారికి కొంతకాలం వరకే నిషేధం విధిస్తున్నారు. డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా వారిని గేమ్స్ కు అనుమతించడం చాలాసార్లు జరిగింది. అలా చేయకుండా మొత్తం జీవితకాల నిషేధమే సరైనది' అని ఫెల్ప్స్ విమర్శించాడు. రియో ఒలింపిక్స్ లో చైనా స్విమ్మర్ సున్ యాంగ్ గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం ఆస్ట్రేలియా స్విమ్మర్ మాక్ హార్టన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. డోపింగ్ దొంగలు వచ్చారంటూ సున్ యాంగ్ పై మాక్ విమర్శలు సంధించాడు. ఈ నేపథ్యంలో ఫెల్ప్స్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. -
హీరోయిన్ 8 బ్యాంక్ ఖాతాల స్తంభన
ముంబై: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్లో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి బ్యాంక్ ఖాతాలను మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేశారు. గుజరాత్, ముంబై ఇతర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో మమతకు ఉన్న కనీసం 8 ఖాతాలను ఆపివేసినట్టు థానె పోలీసులు చెప్పారు. మమత ఎకౌంట్లలో 90 లక్షల రూపాయలకుపైగా నగదు ఉంది. మలాడ్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లోని మమత ఖాతాలో 67 లక్షలు ఉండగా, ఇతర బ్యాంకుల్లో మరో 26 లక్షల రూపాయల నగదు నిల్వ ఉన్నట్టు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మమతా అక్కతో పాటు ఇతరులను ప్రశ్నిస్తున్నారు. ఇక మమత ఆస్తులకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సంబంధిత అధికారులను సంప్రదించారు. మమతా కులకుర్ణితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న విక్కీ గోస్వామి కూడా డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితుడి. ముంబైలో వెలుగుచూసిన అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో మమత, విక్కీ గోస్వామితో పాటు మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు. 10 మందిని అరెస్ట్ చేయగా, మిగిలినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మమత ప్రస్తుతం నైరోబీలో ఉంటోంది. -
యువరాజు.. డ్రగ్స్ స్మగ్లింగ్!
బీరుట్: పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తూ సౌదీ యువరాజుతోపాటు మరో నలుగురు పట్టుబడ్డారు. దాదాపు రెండు టన్నుల క్యాప్టగాన్ మాత్రలు, కొకైన్‌ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ సౌదీ యువరాజు అబ్దెల్ మోసెన్ బిన్ వాలిద్ బిన్ అబ్దులజిజ్ లెబనాన్‌లోని బీరుట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టయ్యారు. ఆయనతోపాటు మరో నలుగురిని కూడా విమానాశ్రయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీరుట్ విమానాశ్రయ చరిత్రలోనే పట్టుబట్ట అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా ఇదేనని భద్రతా అధికారులు తెలిపారు. బీరుట్ విమానాశ్రయం నుంచి రహస్యంగా డ్రగ్స్ ను స్మగ్గింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా అధికారులు గుర్తించారు. కాప్టగాన్ మనో ఉద్దీపన కలిగించే మాత్ర. దీనిని తీసుకోవడం ప్రధానంగా మధ్యప్రాచ్యంలో నిషేధించారు. సిరియా ఫైటర్లు ఈ మాత్రలను పెద్దమొత్తంలో తీసుకుంటారని తెలుస్తున్నది. మాదక ద్రవ్యాలను పెట్టెల్లో అమర్చి.. ప్రైవేటు విమానంలో సౌదీ అరేబియా తరలిస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. -
'కుమారుడి నిర్వాకంతో సిగ్గుతో తలదించుకున్నా'
బీజీంగ్: తన కుమారుడు జాయ్ సీ చేసిన నిర్వాకం వల్ల సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హాలీవుడ్ నటుడు, చైనా కుంగుఫూ స్టార్ జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్ నివాసంలో ఆయన కుమారుడు డ్రగ్స్ తో ఆగస్టు 14 తేదిన పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. చైనాలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా జాకీ చాన్ గతంలో ప్రచారం నిర్వహించారు. మొదటిసారి ఈ వార్త వినగానే చెప్పలేనంత కోపం వచ్చింది. ఎంతో ప్రజాదరణ కలిగిఉన్న నేను సిగ్గుతో తలవంచుకున్నాను. విషాదంలో మునిగిపోయాను అంటూ ఓ వెబ్ సైట్ కు తెలిపారు. జాయ్ సీ తల్లి దుఖంలో మునిగిపోయారని జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్ చేసిన తప్పు తెలుసుకుని యువతరం మంచి మార్గంలో నడుస్తుందని ఆశిస్తున్నానని జాకీ చాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
క్షమాపణ చెప్పిన హీరో కొడుకు
బీజింగ్: మత్తు పదార్థాల కేసులో అరెస్టైన కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ క్షమాపణ ప్రజలకు చెప్పాడు. నిషేధిత డగ్స్ కేసులో పట్టుబడినందుకు తనను మన్నించాలని వేడుకున్నాడు. జాయ్ సీ చాన్ వ్యవహారాలు చూసే ఎమ్ స్టోన్స్ క్షమాపణ ప్రకటన విడుదల చేసింది. జాయ్ సీ చాన్ చేసిన పని సామాజికంగా చాలా ప్రభావం చూపుతుందని పేర్కొంది. అతడు త్వరలోనే మంచిదారిలోకి వస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న 31 ఏళ్ల జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచితుడైన ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి పోలీసులకు పట్టుబడ్డాడు. వీరు నిషేధిత మారిజూనా డ్రగ్ తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చాన్ ఇంటి నుంచి వంద గ్రాములు మారిజూనా డ్రగ్ తీసుకొచ్చినట్టు వారు విచారణలో అంగీకరించారు. -
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం