‘దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాం’
► డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు స్పష్టీకరణ
► దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని వెల్లడి
హైదరాబాద్: ‘‘డ్రగ్స్ కేసు దర్యాప్తు పార దర్శకంగా జరుగుతోంది. ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమపై ఎటువంటి కక్ష సాధించట్లేదు. ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం. దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాం’’ అని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావు స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 3 వేల యూనిట్ల ఎల్‌ఎస్‌డీ, 45 గ్రాముల కొకైన్, ఇతర నార్కోటిక్, సైకోట్రో పిక్ పదార్ధాలను రికవరీ చేశామన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పద్మారావు వివరించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు సినీ పరిశ్రమలోని 12 మందికి, 11 బార్లు, పబ్‌లకు నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే 26 స్కూళ్లు, 27 కాలేజీలు, 25 ఐటీ కంపెనీలకు చెందిన కొందరిని అరెస్టు చేసి పూర్తి సమాచారం రాబడుతున్నామన్నారు.
హరితహారంపై సమీక్ష...
హరితహారంలో భాగంగా ఇప్పటివరకు నాటిన ఈత, తాటి మొక్కల పరిరక్షణతో పాటు ఎక్సైజ్ ప్లాంటేషన్ డేను పురస్కరించు కొని చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం పై మంత్రి పద్మారావు గురువారం సచివాల యంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. గతేడాది ఈత మొక్కల కొరత వల్ల నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, ఈసారి ముందుగానే నర్సరీలలో ఆ మొక్కలను పెం చడం వల్ల కొరతను అధిగమించగలిగామని పద్మారావు పేర్కొన్నారు.
ఎక్సైజ్ ప్లాంటేషన్ డేలో భాగంగా 25 లక్షల ఈత, ఖర్జూర మొక్క లను నాటుతున్నామన్నారు. సిరిసిల్ల నియో జకవర్గంలోని గంభీరావుపేటలో తాను మొక్కలు నాటుతానని, ఒక్కో అధికారి ఒక్కో జిల్లా పర్యవేక్షణకు వెళ్తారని మంత్రి వివరిం చారు. ఈత చెట్లు ఎక్కే యంత్రాలు, నీరా ఉత్పత్తులు, వాటి మార్కెటింగ్‌కు సంబం ధించిన విధివిధానాలను త్వరగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గీత కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం పైనా చర్యలు తీసుకుంటామన్నారు. సమా వేశంలో టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్ రావు, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవ దన్, అడిషనల్ కమిషనర్ రాజశేఖర్‌రావు, ఓఎస్‌డీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.