Minister Padma Rao
-
ఇద్దరి ప్రాణాలు మింగిన ఆట
హైదరాబాద్: ఇద్దరు చిన్నారులు ఆడుకోవడానికి భవనం పైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి అనంతలోకాలకు వెళ్లిపోయారు. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన బాధిత తల్లిదండ్రులతోపాటుగా స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులు కథనం మేరకు..రైల్వే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బీదర్‌కు చెందిన కృష్ణప్రసాద్, రేణుక దంపతులకు ఏడాదిన్నర పాప శ్రావ్య. రైల్వే ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బాబురావు, సుమిత్ర దంపతుల కుమార్తె పల్లవి (12). ఈ రెండు కుటుంబాలు చిలకలగూడలోని రైల్వే క్వార్టర్ నంబర్ 1010/ 9, 10 ఇళ్లలో నివసిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో చిన్నారి శ్రావ్యతోపాటు పల్లవి ఆడుకుంటూ మూడవ అంతస్తుపైకి వెళ్లారు. టెర్రాస్ పిట్టగోడ ఒకటిన్నర అడుగుల ఎత్తే ఉండటంతో ప్రమాదవశాత్తు శ్రావ్య కిందపడబోయింది. వెంటనే పల్లవి శ్రావ్య గౌను పట్టుకుని గట్టిగా కేకలు వేసింది. కింది అంతస్తులో ఉన్న రేణుక పైకి వచ్చేలోగా గాలిలో వేలాడుతున్న శ్రావ్య గౌను చిరగడంతో పల్లవి వదిలేసింది. దీంతో కింద పార్కింగ్ చేసిన కారుపై శ్రావ్య పడిపోయింది. పైకి వస్తున్న శ్రావ్య తల్లికి పెద్ద శబ్దం వినిపించ డంతో కిందికి పరుగులు తీసింది. అయితే టెర్రాస్‌పైనే ఉన్న పల్లవి బ్యాలెన్స్ కోల్పోయి తలకిందులుగా కిందపడి అక్కడిక్కడే మృతి చెందింది. కారుపై పడిన చిన్నారి శ్రావ్యకు తీవ్ర గాయాలు కావడంతో ద్విచక్ర వాహనంపై లాలాగూడ రైల్వే ఆస్పత్రికి అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రావ్య మృతి చెందింది. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. పరామర్శించిన మంత్రి పద్మారావు: సమాచారం అందుకున్న అబ్కారీమంత్రి తీగుళ్ల పద్మారావు బుధవారం ఉదయం గాంధీ మార్చురీ వద్దకు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో మృతుల తల్లిదండ్రులు బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తరలించేందుకు అవసరమైన రవాణా ఖర్చులను మంత్రి పద్మారావు చెల్లించారు. పట్టుకునేందుకు పరిగెత్తా అమ్మా అంటూ పల్లవి కేకలు వినిపించడంతో బయటకు వచ్చి చూశాను. ఎదురుగా ఉన్న క్వార్టర్స్ పై అంతస్తులో శ్రావ్య వేలాడుతూ, ఆమెను పట్టుకుని పల్లవి కనిపించారు. కిందపడితే పట్టుకుందామని పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆలోపే శ్రావ్య కారుపై పడిపోయింది. రెండు అడుగులు వేసేలోగా పల్లవి కూడా తన కాళ్ల వద్దే పడి మృతి చెందింది. బాధగా ఉంది. – హిమబిందు, ప్రత్యక్షసాక్షి ఆస్పత్రికి తరలించా డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాను. ఇంతలో క్షణాల వ్యవధిలో రెండు మార్లు పెద్ద శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూసేసరికి పల్లవి రక్తపుమడుగులో పల్లవి, కారుపై శ్రావ్యలు పడిఉన్నారు. వెంటనే బైక్‌పై వారిద్దరినీ రైల్వే ఆస్పత్రికి తీసుకువెళ్లాను. అప్పటికే పల్లవి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. –కిరణ్‌కుమార్, ప్రత్యక్షసాక్షి -
కాగితాలు ఏరుకునే చిన్నారిని లాలించిన పద్మారావు!
అది సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతం. అప్పుడు సమయం రాత్రి సుమారు ఏడెనిమిది గంటలు కావస్తోంది. వాహనాలు రొద చేస్తూ రోడ్డుపై వెళ్తున్నాయి. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇదే రహదారిలో ఓ చిన్నారి చిత్తు కాగితాలను ఏరుకుని వాటిని రిక్షాలో వేసుకుని తోసుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో పాత జైలు సమీపంలోని ఓ కళ్లద్దాల దుకాణంలో కూర్చుని ఉన్న మంత్రి పద్మారావు ఆ చిన్నారి కష్టాన్ని కళ్లారా చూశారు. ఆ దృశ్యం ఆయన మనసును కదిలించింది. వెంటనే తన భద్రతా సిబ్బందితో బాలికను పిలుచుకు రమ్మని ఆదేశించారు. వారు ఆమెను మంత్రి చెంతకు తీసుకువచ్చారు. పద్మారావు తన సొంత కూతురిలా ఒడిలో కూర్చోపెట్టుకుని మరీ ఆ చిన్నారిని లాలించారు. ఆమె కుటుంబానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పేరు విజయలక్ష్మి అని.. సికింద్రాబాద్ తుకారాంగేట్ వద్ద ఉంటున్నామని చెప్పింది. తల్లి సరోజ నిత్యం మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తోందని వివరించింది. తాను సికింద్రాబాద్ సుభాష్ రోడ్‌లోని నాగెల్లి దుర్గయ్య స్మారక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నానంది. చదువుకుంటూనే నిత్యం తల్లి ఏరితెచ్చే చిత్తు కాగితాలను దుకాణంలో విక్రయిస్తుంటానని చెప్పింది. మోండా మార్కెట్ వద్ద తల్లి పోగుచేసిన చిత్తు కాగితాల మూటలను ప్రతిరోజూ రాత్రి ఏడు గంటల సమయంలో మూడు చక్రాల బండిలో వేసుకుని రాంగోపాల్‌పేట్‌లోని ఓ దుకాణానికి తీసుకెళ్లి అమ్ముతానంది. పదకొండేళ్ల చిన్న వయసులోనే బతుకు బండిని లాగడంలో తల్లికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న విజయలక్ష్మిని మంత్రి పద్మారావు అభినందించారు. ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తానన్నారు. ఈ ఉదంతం శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మంత్రి చలించిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. – బన్సీలాల్‌పేట్ -
చీర సింగారం నవ 'లావణ్యం '
రాంగోపాల్‌పేట్: నటి లావణ్య త్రిపాఠి చీరకట్టులో మెరిసి పోయింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచిపురం కామాక్షి సిల్క్స్ షోరూమ్‌ను మంత్రి పద్మారావు దంపతులతో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. ఆమెను చూసేందుకుఅభిమానులు తరలొచ్చారు. కస్టమర్లఅభిరుచికి అనుగుణంగానాణ్యమైన సేవలందిస్తూదినదినాభివృద్ధిసాధించాలని లావణ్య, మంత్రి ఆకాంక్షించారు. రూ.295 నుంచిరూ.3 లక్షల వరకు చీరలు అందుబాటులో ఉన్నాయని సంస్థ యజమాని వీ.రాజేందర్‌కుమార్ తెలిపారు. -
అమ్మకాలు పెరిగాయి.. మేమేం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో గ్రోత్ (వృద్ధి) జరిగింది. దానికి మేమేం చేయగలం?’’అని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాల ద్వారా రూ.21 వేల కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న బీజేపీ సభ్యుల ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో గుడుంబా నిర్మూలన, పునరావాస చర్యలపై మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పద్మారావుగౌడ్ మాట్లాడారు. గుడుంబా కారణంగా తమవారు చనిపోతున్నారని గతంలో వరంగల్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో కొందరు మహిళలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని.. దాంతో చలించిపోయిన ముఖ్యమంత్రి గుడుంబాను నిర్మూలిస్తామని ప్రకటించారని చెప్పారు. ఈ మేరకు ఆబ్కారీ శాఖ 2015 సెప్టెంబర్‌లో గుడుంబాపై యుద్ధాన్ని ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో 98 శాతం ప్రాంతాల్లో గుడుంబాను నిర్మూలించామని.. 89 మందిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. గుడుంబా తయారీ, విక్రయంలో నిమగ్నమైన కుటుంబాలకు పునరావాసం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం 100 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల రుణాలు అందజేస్తున్నామన్నారు. చట్టంలో లోపంతో.. బడులు, ప్రార్థనా స్థలాలకు 100 మీటర్లలోపు దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయరాదనే నిబంధన ఉన్నా.. చట్టంలోని పలు లోపాలతో పలు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వకతప్పడం లేదని పద్మారావుగౌడ్ చెప్పారు. మద్యం షాపులకు గుడి/బడికి మధ్య రోడ్డు డివైడర్లు ఉంటే.. డివైడర్ల వల్ల పెరిగే దూరాన్ని సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఎక్సైజ్ చట్టంలో ఉందన్నారు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ఎక్సైజ్ చట్టానికి సవరణ చేయాల్సి ఉందన్నారు. ఇక హైదరాబాద్‌లో గుడుంబా తయారీ, అమ్మకాలకు కేంద్రమైన ధూల్‌పేట్ ప్రాంతవాసులకు పునరావాసం కల్పించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలోని ఐదెకరాల ఖాళీ స్థలంలో చేతివృత్తులు, లేదా ఏదైనా ఇతర పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రమాదకర స్థాయికి మద్యం అమ్మకాలు ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రమాదకర స్థాయికి చేరాయని శాసనసభలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గుడుంబా నిర్మూలన, పునరావాస కార్యక్రమంపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగట్టాయి. చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఏటా రూ.30– 40 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతు న్నాయని.. ఉత్తరప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడం లేదని బీజేపీఎల్పీనేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మద్యం అమ్మకాల ద్వారా రూ.21 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. ఇందుకోసం మద్యం విక్రయాల సమయాన్ని రాత్రి 11 గంటల వరకు పెంచిందని, మాల్స్‌లో సైతం విక్రయాలకు అనుమతిచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. జనం మద్యపానం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ధూల్‌పేట్‌లో ఖాళీగా ఉన్న ఐదెకరాల స్థలంలో పరిశ్రమను నెలకొల్పి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని బీజేపీ మరో సభ్యుడు రాజాసింగ్ లోధా డిమాండ్ చేశారు. ఇక గుడుంబా నిర్మూలన స్ఫూర్తితో రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి గుడుంబా అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ సభ్యురాలు గొంగిడి సునీత సూచించారు. గుడులు, ప్రార్థనా స్థలాల సమీపంలోని మద్యం షాపులను తొలగించాలని ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ డిమాండ్ చేశారు. -
కల్లుగీత విధానం రూపొందించాలి
మంత్రి పద్మారావుకు కల్లుగీత సంఘాల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్లుగీత విధానాన్ని రూపొందిం చాలని ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్‌కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ విన్నవించింది. మంగళవారం ఈ మేరకు సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, గౌడ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. తాటి, ఈత చెట్లపై విధించే పన్ను, అద్దెను ఎత్తివేయాలని, కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. శాశ్వత లైసెన్స్ విధానం తేవాలని, లైసెన్సులు ఆటోమెటిక్‌గా రెన్యూవల్ అయ్యేలా చూడాలన్నారు. టీసీఎస్ వ్యవస్థను ప్రోత్సహించాలని, కనీస సభ్యుల సంఖ్యను తగ్గిస్తూ నిబంధనలు సవరించాలన్నారు. ప్రతి సభ్యుడికి 30 చెట్లు ఉండాలనే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికుల భాగస్వాములకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. గౌడ భవన నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించి, రూ.10 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వృత్తిదారుల ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని, అదే విధంగా పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడంతో పాటు హైస్కూల్ స్థాయిలో పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్నారు. -
‘దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాం’
► డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు స్పష్టీకరణ ► దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని వెల్లడి హైదరాబాద్: ‘‘డ్రగ్స్ కేసు దర్యాప్తు పార దర్శకంగా జరుగుతోంది. ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమపై ఎటువంటి కక్ష సాధించట్లేదు. ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం. దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాం’’ అని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావు స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 3 వేల యూనిట్ల ఎల్ఎస్డీ, 45 గ్రాముల కొకైన్, ఇతర నార్కోటిక్, సైకోట్రో పిక్ పదార్ధాలను రికవరీ చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పద్మారావు వివరించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు సినీ పరిశ్రమలోని 12 మందికి, 11 బార్లు, పబ్‌లకు నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే 26 స్కూళ్లు, 27 కాలేజీలు, 25 ఐటీ కంపెనీలకు చెందిన కొందరిని అరెస్టు చేసి పూర్తి సమాచారం రాబడుతున్నామన్నారు. హరితహారంపై సమీక్ష... హరితహారంలో భాగంగా ఇప్పటివరకు నాటిన ఈత, తాటి మొక్కల పరిరక్షణతో పాటు ఎక్సైజ్ ప్లాంటేషన్ డేను పురస్కరించు కొని చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం పై మంత్రి పద్మారావు గురువారం సచివాల యంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. గతేడాది ఈత మొక్కల కొరత వల్ల నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, ఈసారి ముందుగానే నర్సరీలలో ఆ మొక్కలను పెం చడం వల్ల కొరతను అధిగమించగలిగామని పద్మారావు పేర్కొన్నారు. ఎక్సైజ్ ప్లాంటేషన్ డేలో భాగంగా 25 లక్షల ఈత, ఖర్జూర మొక్క లను నాటుతున్నామన్నారు. సిరిసిల్ల నియో జకవర్గంలోని గంభీరావుపేటలో తాను మొక్కలు నాటుతానని, ఒక్కో అధికారి ఒక్కో జిల్లా పర్యవేక్షణకు వెళ్తారని మంత్రి వివరిం చారు. ఈత చెట్లు ఎక్కే యంత్రాలు, నీరా ఉత్పత్తులు, వాటి మార్కెటింగ్‌కు సంబం ధించిన విధివిధానాలను త్వరగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గీత కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం పైనా చర్యలు తీసుకుంటామన్నారు. సమా వేశంలో టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్ రావు, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవ దన్, అడిషనల్ కమిషనర్ రాజశేఖర్‌రావు, ఓఎస్డీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
తాటిచెట్లు ఎక్కేందుకు యంత్రాలు
త్వరలో గీత కార్మికులకు అందజేస్తాం: మంత్రి పద్మారావు హైదరాబాద్: తాటిచెట్లు ఎక్కడానికి వీలుగా గీత కార్మికులకు యంత్రాలు అందజేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు వెల్లడించారు.సికిం ద్రాబాద్ బోయిగూడలోని కల్లు కాంపౌండ్‌లో శని వారం అధికారులతో కలసి తనిఖీ చేశారు. అనం తరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సమైక్య పాలకులు కల్లు కాంపౌండ్లను మూసివేసి గౌడ కులస్తుల పొట్టగొట్టారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ వాటిని తెరి పించి ఎంతో మందికి ఉపాధి కల్పించారని పేర్కొ న్నారు. కల్లు కాంపౌండ్లలో కల్తీ జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన కార్య క్రమాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో గీత కార్మికులకు త్వరలో గుర్తింపుకార్డులు అందజేస్తా మన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ ముఖ్య కార్య దర్శి సోమేశ్‌కుమార్, డైరెక్టర్ అకున్ సబర్వాల్, ప్రముఖ శాస్త్రవేత బిక్షపతి పాల్గొన్నారు. కల్లు విక్రయాలను పరిశీలించిన మంత్రి బోయిగూడ కల్లు కాంపౌండ్‌లో కల్లు నిల్వలు, విక్రయాలు వంటి వాటిపై మంత్రి పద్మారావు ఆరా తీశారు. రోజు వారీగా చెట్ల నుంచి కల్లు వస్తోందా.. వాటిని ఎలా నిల్వ చేస్తున్నారు.. కల్లు భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. రోజువారీగా మిగిలిన కల్లును ఏమీ చేస్తున్నారని కల్లుకంపౌండ్ నిర్వాహకులను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత భిక్షపతి తాటికల్లు తెప్పించుకొని రుచి చూసి బాగుందని కితాబిచ్చారు. -
పార్టీమారమని డబ్బులు ఎరవేశారు: మంత్రి పద్మరావు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న తనకు పార్టీ మారమని కొంతమంది సీమాంధ్ర సీఎంలు డబ్బులు ఎరగా వేసారని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మరావు తెలిపారు. అయితే నరనరాల్లో తెలంగాణ రక్తం ఉండడంతో వారి కుట్రలకు తలొగ్గలేదన్నారు. తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలగూడలో గురువారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సన్మానసభకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు..తెలంగాణ సాధన కోసం తాడోపేడో తేల్చుకునేందుకు తాను కేసీఆర్ వెన్నంటే ఉన్నానని గుర్తుచేశారు. టీ తాగేందుకు సికింద్రాబాద్ అల్ఫా హోటల్‌కు వస్తే పోలీసుల పహారా, ఇంటెలిజెంట్స్, స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు యక్ష ప్రశ్నలతో తనను వేధించేవారన్నారు. ఉద్యమం కోసం అప్పులు.. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆస్తులను అమ్ముకుని, అప్పులు చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. ఒక సమయంలో తన భార్య మంగళసూత్రంతోపాటు నగలను తాకట్టు పెట్టానని నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారని మరో పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు, కళ్యాణలక్ష్మీ, ఒంటరి మహిళ పింఛన్లు, షాదీముబారక్ వంటి 43 సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిందన్నారు. కమ్యూనిస్టుల రికార్డు బ్రేక్ చేస్తాం టీఆర్ఎస్ పాలనపై ప్రజలు పూర్తిస్థాయి నమ్మకంతో ఉన్నారని, వచ్చే పదేళ్లు అధికారాన్ని కట్టబెట్టేందుకు సిద్ధం అయ్యారన్నారు. ఆ తరువాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగి పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్ట్‌ల పాలన రికార్డును బ్రేక్ చేస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కళాబృందాలు, సాంస్కృతిక, పాత్రికేయ సంఘాలు కీలక పాత్ర పోషించాయన్నారు. పార్టీ క్యాడర్లో కొత్త, పాత తేడాలేదని, అందరు కలిసికట్టుగా సమన్వయంతో వ్యవహరించి టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కష్టపడి పనిచేసేవారికే పదవులు అనే సూత్రాన్ని తాను నమ్ముతానని అన్నారు. -
యూత్‌ఫెస్ట్..అదుర్స్
-
పేదరాలిపై మంత్రి ఔదార్యం!
సికింద్రాబాద్: అనారోగ్యం...ఆపై ఆకలితో నకనకలాడుతూ ఫుట్‌పాత్ పక్కన జీవచ్ఛవంలా పడి ఉన్న ఓ వృద్ధురాలిని చూసి ఎక్సైజ్ శాఖ మంత్రి తన ఔదార్యం చాటుకున్నారు. సదరు మహిళ కోసం 30 నిమిషాల సమయం కేటాయించి, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వివరాలు.... బుధవారం మధ్యాహ్నం 12.30కి రూ.5కు మధ్యాహాన్న భోజన పథకాన్ని ప్రారంభించేందుకు మంత్రి పద్మారావు చిలకలగూడకు వచ్చారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కే సమయంలో పక్కన్నే ఫుట్‌పాత్ పక్కన పడి ఉన్న ఓ వృద్ధురాలిని ఆయన గమనించారు. కారు ఎక్కకుండా ఆమె వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడే ఉన్న చిలకలగూడ ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాసులుకు చెప్పి అంబులెన్స్‌ను రప్పించారు. ఈలోపు ఆమెను నిద్రలేపి వివరాలు తెలుసుకున్నారు. తన పేరు అనిత అని, పేదరికం కారణంగా ఫుట్‌పాత్‌పైనే భర్తతో కలిసి జీవిస్తున్నామని ఆమె తెలిపింది. తమకు ఎవరూ లేరని చెప్పి కంటతడి పెట్టింది. ఇందుకు చలించిన మంత్రి అంబులెన్స్‌లో అనితను గాంధీ ఆసుపత్రికి పంపించి, ఖర్చుల నిమిత్తం ఆమె భర్తకు కొంతమే ఆర్థిక సహాయం అందించారు. -
గుడుంబా రహిత హైదరాబాద్
ఇందుకోసం అధికారులు చర్యలు తీసుకోవాలి: పద్మారావు హైదరాబాద్: గుడుంబా రహిత ప్రాంతంగా హైదరాబాద్‌ను మారుస్తామని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... రాష్ట్రంలో గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో దాన్ని నిర్మూలించామని వివరించారు. వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్‌ను కూడా గుడుంబా రహిత జిల్లాల సరసన చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గుడుంబా తయారీపై ఆధారపడి జీవించే వారికి పునరావాసం కల్పిస్తామని.. ఇందు కోసం జిల్లాకు రూ.10 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. రుగ్మతలను తొలగించాలంటే గుడుంబాను పూర్తిగా నిషేధించాలని, ఆ దిశగా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించడం కంటే ఆచరించడం ఎంతో కష్టమని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. గుడుంబా అంతానికి శక్తివంచన లేకుండా కష్టపడుతున్నట్లు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ భగవాన్‌రెడ్డి, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సి.వివేకానంద రెడ్డి, ఇన్చార్జి డెరైక్టర్ ఎన్.అజయ్ రావు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు రాజేశ్వర రావు, ఫారుఖీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ నుంచి రవీంద్రభారతి వరకు ఎకై ్సజ్ పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. -
గుడుంబా రహిత రాష్ట్రంగా తెలంగాణ
మంత్రి పద్మారావు కల్తీ కల్లు నియంత్రణ మిషన్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని త్వరలోనే గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి పద్మారావు తెలిపారు. కల్తీ కల్లు నియంత్రణ యంత్రాన్ని సచివాలయంలో సోమవారం ఆయన ప్రారంభించారు. కల్తీ కల్లు మరణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగానే కల్తీ కల్లు నియంత్రణ యంత్రాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ యంత్రంతో కల్తీ కల్లును నిమిషాల్లోనే గుర్తించగలమన్నారు. మద్యంలో నీళ్లు కలిపి సీల్ వేసి అమ్ముతున్న సంఘటనలను అరికట్టేందుకు హైడ్రోమీటర్‌ను ప్రారంభించారు. ఈ మీటర్‌ను మద్యంలో వేస్తే ఎంతమేరకు నీళ్లు కలిపారో వెంటనే తెలిసిపోతుందని నిపుణులు వివరించారు. రాష్ట్రంలో కల్తీ కల్లు అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెంటనే ఈ యంత్రాలను పంపి దాడులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో అవినీతికి చోటులేకుండా పనిచేస్తున్న అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ధూల్‌పేటలో గుడుంబా దాడుల కోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నట్లు పేర్కొన్నారు. గుడుంబా తయారీ నుంచి బయటపడ్డవారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ డెరైక్టర్ అకున్ సబర్వాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రసదన్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి గారి కారు మోజు
ఆయన ముందు వాహనం కనబడితే చాలు చటుక్కున ఎక్కేసి ఓ రౌండ్ నడిపి చూస్తారు. గన్మెన్లు, కాన్వాయ్ గురించి పట్టించుకోరు. ఆయనే మన ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు. ‘అన్నా బుల్లెట్ కొన్నాను. నీచేత పూజ చేయించుకుంటా..’ అని ఎవరైనా వస్తే చాలు. పూజ అయ్యాక జస్ట్ స్టార్ట్ చేసినట్టే చేసి రయ్‌న వెళ్లిపోతారు. ఆయనను అనుసరించడం కోసం గన్మెన్లు అందిన బండ్లను దొరకపుచ్చుకుని వెనకాలే ఉరుకులు పరుగులు పెడుతారు. ఇలా ద్విచక్రవాహనాలేకాదు కార్లు.. జీపులు ఏవైనా సరే ఓ రౌండ్ వేస్తారు మన మంత్రిగారు. ఇటీవల చెత్త తరలింపు కోసం వచ్చిన హైడ్రాలిక్ ట్రాలీ ఆటోలను కూడా ఆయన వదల్లేదు. కాలనీల్లో నడిపించి స్థానికులను అలరించారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథాలు వచ్చాయి. వాటిని పరిశీలించడానికని నివాసం ముందుకు వచ్చి మినిస్టర్స్ క్వార్టర్స్ అంతటా సదరు వాహనాలను నడిపి సరదా తీర్చుకున్నారు. -సికింద్రాబాద్ -
గుడుంబాపై ఉక్కుపాదం
మద్యం దుకాణాలను తనిఖీ చేసిన మంత్రి పద్మారావు ఏటూరునాగారం: తెలంగాణను గుడుంబా లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని.. ఇందులో భాగంగా గుడుంబాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిం దని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారంలోని భాగ్యలక్ష్మి, సాయి తిరుమల వైన్స్‌లను ఆయన సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అధికారులకు ఎలాం టి సమాచారం ఇవ్వకుండా.. తన సొంత వాహనంలో ఇక్కడికి వచ్చినట్లు ఈ సందర్భం గా మంత్రి తెలిపారు. ముందుగా ఆయన భాగ్యలక్ష్మి వైన్స్‌లో తన సిబ్బందితో ఫుల్‌బాటిల్ మద్యం కొనుగోలు చేయించారు. ఎమ్మా ర్పీ కంటే రూ.5 ఎక్కువ తీసుకోవడంతో మంత్రి అక్కడి వెళ్లి పరిశీలించారు. మద్యం, బాటిళ్లు కాటన్లను తెరిచి పరిశీలించారు. భాగ్యలక్ష్మి బ్రాందీషాపు యజమానికి పాన్‌కార్డు లేకపోవడంతో అదనంగా 20 శాతం పన్ను పడుతుందని.. పాన్‌కార్డు లేకపోవడంతో శాఖ పరంగా స్టాకు ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం లెసైన్స్‌లు ఇచ్చి 12 రోజులు అవుతున్నా.. ఇంకా ఆబ్కారీ నుంచి మద్యం కొనుగోలు చేయకుండా మండల కేంద్రంలోనే ఉన్నా.. సాయి తిరుమల మద్యం షాపు నుంచి మద్యం దిగుమతి చేసుకున్నట్లు తేలిందన్నారు. అక్కడ ఉన్న మద్యం కాటన్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న భాగ్యలక్ష్మి బ్రాందీ షాపును మూసివేయించా రు. దీనికి మద్యం సరఫరా చేసిన సాయి తిరుమల దుకాణంపై కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. అలాగే, స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో 12 మంది సిబ్బంది ఉండగా, ఒక్క హెడ్‌కానిస్టేబుల్ మాత్రమే ఉండడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు డుమ్మా కొట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ప్రపంచం గర్వించేలా ‘మెట్రో’ నిర్మాణం: తలసాని
హైదరాబాద్: ప్రపంచంలోని స్టేషన్లకు దీటుగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంవత్సర కాలంలో పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేశామన్నారు. శనివారం మెట్రో హరితహారంలో భాగంగా మంత్రి పద్మారావుతో కలసి ఉప్పల్ స్టేషన్లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో 72 కిలోమీటర్ల మేర 63 స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరలో మెట్రో రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్.రెడ్డి మాట్లాడుతూ మొత్తం 57 రైళ్లను తీసుకొస్తున్నామని అందులో 30 వరకు ఇప్పటికే వచ్చాయని తెలిపారు. మెట్రో స్టేషన్లతో పాటు పరిసర కాలనీల్లో కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు, ఇప్పటికే ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఉప్పల్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్, రైతు సంఘం నాయకులు దుబ్బ నర్సింహారెడ్డి, మేకల హన్మంత్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, ధర్మారెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గుడుంబా వద్దు,చీప్ లిక్కర్ ముద్దు!
-
23న సినీ తారల క్రికెట్
కాకతీయ కప్ కోసం తమిళ్, తెలుగు నటుల పోరు బంజారాహిల్స్: వెండితెరపై వెలుగులు విరజిమ్మే తారలు ఈసారి క్రికెట్ మైదానంలో తళుక్కుమననున్నారు. కాకతీయ కప్ కోసం తెలుగు, తమిళ నటుల మధ్య ఈ నెల 23న క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ట్రోఫీని తెలంగాణ క్రీడల మంత్రి పద్మారావు, రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు. తమిళ జట్టుకు జీవా, తెలుగు జట్టుకు ఆకాశ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. -
బాబుది దొంగబుద్ధి
గజ్వేల్‌రూరల్: ఏపీ సీఎం చంద్రబాబుది దొంగబుద్ధని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖమంత్రి పద్మారావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొంత మామకే వెన్నుపోటు పోడిచిన ఘనుడు అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవడం కోసం అడ్డదారిలో వెళ్లి అడ్డంగా బుక్కయ్యారన్నారు. తెలంగాణలో అస్థిరతను సృష్టించడానికి బాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆంధ్రాలో కూడా టీడీపీ ఉనికి కోల్పొయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ చంద్రబాబు తెలంగాణలో తన ఆధిపత్యం చెలాయించాలనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైన బాబు వైఖరి మార్చుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధిచెప్తారన్నారు. ఆయన వెంట నగరపంచాయతీ చైర్మన్భాస్కర్, కౌన్సిలర్ సుభాష్‌చంద్రబోస్, రాందాస్, నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు నంగునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గీతకార్మికుల ఎక్స్‌గ్రేషియా పెంపునకు కృషి
- అబ్కారీ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని అబ్కారీ, మద్యనిషేధ శాఖ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికుల కుటుంబాలకు సోమవారం రవీంద్రభారతిలో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గీత కార్మికులకు ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడి రూ. 2 లక్షలు నుంచి రూ. 5 లక్షలు పెంచేందుకు కృషిచేస్తానన్నారు. ఎక్స్‌గ్రేషియా 15 రోజుల నుంచి 30 రోజుల్లో బాధితుల చేతికి అందేలా చేస్తామన్నారు. కల్లు దుకాణాలు తెరవడంతో నగరంలో 50 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. కల్లు దుకాణాల్లో పనిచేసే వారికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. తాటి, ఈత చెట్లకు పన్ను విధానం రద్దు చేయాలని చెప్పారు. వీరికోసం ఓ సంక్షేమ బోర్డు అవసరమన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ తాటి చెట్టు డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం టీఆర్ఎస్ పార్టీకి దక్కేలా గీత కార్మికులందరూ అండగా నిలవాలన్నారు. త్వరలో ఈ కార్మికుల సమస్యలపై ప్రధానిని కలవనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులపై గతంలోలాగా తెలంగాణ పాలనలో దౌర్జన్యాలు ఉండవని తెలిపారు. ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గీతకార్మికుల కోసం ఒకేసారి రూ. 7.70 కోట్లు మంజూరు చేశారన్నారు. దీనివల్ల 3,236 మంది గీత కార్మికులకు ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి వచ్చిన బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాజలింగంగౌడ్, రెవెన్యూ విభాగం ప్రభుత్వ కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ టి.ప్రసాద్, అదనపు కమిషనర్ ఎంఎంఎ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు. -
'కోర్టు వివాదాల వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆలస్యం'
కోర్టు వివాదాల వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు తెలిపారు. జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఈనెల 24వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని పద్మారావు వెల్లడించారు. ఇందులో ప్రభుత్వానికి, పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారని కూడా ఆయన తెలిపారు. -
విద్యార్థుల ఫీజు పోరు
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మంత్రుల ఇళ్ల ముట్టడి నెట్వర్క్: విద్యార్థులు పోరుబాట పట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, ఫాస్ట్ పథకం విధివిధానాలను ప్రకటించాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల ఇళ్ల ఎదుట ఆందోళన చేపట్టారు. పలుచోట్ల మంత్రుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. హైదరాబాద్‌లో ఎక్సైజ్ మంత్రి పద్మారావు ఇంటి ఎదుట విద్యార్థులు బైఠాయించారు. అలాగే, నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటిని విద్యార్థులు ముట్టడించేందుకు యత్నించారు. మహబూబ్న గర్ జిల్లా జడ్చర్లలో విద్యుత్ మంత్రి లక్ష్మారెడ్డి ఇంటిని, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇంటిని, ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. నిజామాబాద్‌లోని ఎంపీ కవిత ఇంటి ఎదుట, కామారెడ్డిలోని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం మామిడిగూడలో జరిగిన సభలో ఉపముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతుండగా విద్యార్థులు నినాదాలు చేశారు. వరంగల్‌లో పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు. -
ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలిస్తాం: పద్మారావు
ఖమ్మం: తెలంగాణలోని ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..గతంలో ఎక్సైజ్ శాఖకు తుపాకులు ఉండేవని, మద్య నిషేధ సమయంలో వాటిని ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ తుపాకులను ఎక్సైజ్ శాఖకు ఇవ్వాల్సిన అవసరంపై ఆయా జిల్లాల అధికారులను నివేదికలు కోరామని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వీరికి తుపాకులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. -
కల్లు దుకాణాలపై నిర్ణయం తీసుకోలేదు
ఆబ్కారీ మంత్రి పద్మారావు సాక్షి, హైదరాబాద్: కల్లు దుకాణాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు స్పష్టంచేశారు. సోమవారం ఆయన సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ విధానాన్ని కొనసాగించాలా లేదా అన్న విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నెలాఖరు వరకు పాత పాలసీ అమలులో ఉంటుందని.. తర్వాత ఎటువంటి పాలసీ అనుసరించాలనేది పరిశీలిస్తామన్నారు.