23న సినీ తారల క్రికెట్
కాకతీయ కప్ కోసం తమిళ్, తెలుగు నటుల పోరు
బంజారాహిల్స్: వెండితెరపై వెలుగులు విరజిమ్మే తారలు ఈసారి క్రికెట్ మైదానంలో తళుక్కుమననున్నారు. కాకతీయ కప్ కోసం తెలుగు, తమిళ నటుల మధ్య ఈ నెల 23న క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ట్రోఫీని తెలంగాణ క్రీడల మంత్రి పద్మారావు, రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు. తమిళ జట్టుకు జీవా, తెలుగు జట్టుకు ఆకాశ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.