
ఆకాశ్ జగన్నాథ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తల్వార్’. కాశీ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, షిన్ టామ్ చాకో, అనసూయ భరద్వాజ్, అజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వార్నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై భాస్కర్ ఈ.ఎల్.వీ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ‘తల్వార్’ నుంచి పవర్‌ఫుల్ ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.
‘యుద్ధం జరిగే తీరు మారినా... చివరకు రక్తపాతంతో ముగుస్తోంది’, ‘అధర్మంతో అయినా ధర్మాన్ని గెలిపించేందుకు సిద్ధం’ వంటి డైలాగ్స్ గ్లింప్స్‌లో ఉన్నాయి. ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘తల్వార్’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జానీ బాషా, కెమేరా: త్రిలోక్ సిద్ధు, సంగీతం: కేశవ కిరణ్.