akash
-
గెలిపించేందుకు సిద్ధం
ఆకాశ్ జగన్నాథ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తల్వార్’. కాశీ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, షిన్ టామ్ చాకో, అనసూయ భరద్వాజ్, అజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వార్నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై భాస్కర్ ఈ.ఎల్.వీ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ‘తల్వార్’ నుంచి పవర్ఫుల్ ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘యుద్ధం జరిగే తీరు మారినా... చివరకు రక్తపాతంతో ముగుస్తోంది’, ‘అధర్మంతో అయినా ధర్మాన్ని గెలిపించేందుకు సిద్ధం’ వంటి డైలాగ్స్ గ్లింప్స్‌లో ఉన్నాయి. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘తల్వార్’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జానీ బాషా, కెమేరా: త్రిలోక్ సిద్ధు, సంగీతం: కేశవ కిరణ్. -
గుట్టలు, నదులు, అడవి దాటి అమెరికాలోకి.. ట్రంప్ దెబ్బకు ఆకాశ్ ఆవేదన
అమెరికాలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపారు. అక్రమంగా నివసిస్తున్న ఎవరినీ ఉపేక్షించేది లేదని ట్రంప్ చెప్పిన విధంగానే పలువురిని తిరిగి తమ స్వదేశాలకు పంపుతున్నారు. దీంతో, భారతీయులు సైతం తిరిగి స్వదేశం బాట పట్టాల్సి వచ్చింది. ప్రత్యేక విమానంలో 104 మంది వరకూ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో హర్యానాకు చెందిన ఆకాశ్ దీన గాథ చూసి అందరూ ఆవేదన చెందుతున్నారు. అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు అతను ఎన్ని కష్టాలు అనుభవించాడో తన కుటుంబ సభ్యులు వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తాము ఎంతో కోల్పోయినట్టు కన్నీటి పర్యంతమయ్యారు.షేర్ చేసిన వీడియో ప్రకారం.. అమెరికా వెళ్లాలనే పిచ్చితో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆకాశ్(20) తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకు ఉన్న 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో అమెరికా చేరుకున్నాడు. ఈ క్రమంలో ఏజెంట్లకు మరో రూ.7లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో కొండలు, గుట్టలు, నదులు, వాగులు, అడవిలో చిత్తడి మట్టిలో నడుచుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. అతను 10 నెలల క్రితం భారత్ నుండి బయలుదేరి జనవరి 26న మెక్సికో సరిహద్దు గోడను దాటి అమెరికాలోకి ప్రవేశించాడు.అనంతరం, అతను అమెరికాలోని చెక్ పాయింట్ వద్ద పోలీసులకు చిక్కాడు. కొంతకాలం నిర్బంధం తర్వాత ఆకాష్‌ను బాండ్‌పై విడుదల చేశారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బలవంతంగా బహిష్కరణ పత్రాలపై సంతకం చేయించారు. బహిష్కరణ పత్రాలపై సంతకం చేయకపోతే ఆకాశ్‌కు అమెరికాలో జైలు శిక్ష పడుతుందని చెప్పారని అతని కుటుంబం పేర్కొంది. అక్రమ వలసదారులను ఇంటికి పంపించి వేయడంతో ఆకాశ్.. ఫిబ్రవరి ఐదో తేదీన హర్యానాలోకి తన ఇంటికి చేరుకున్నాడు.Indian deportee’s video from Panama jungle shows ‘Donkey Route’ to enter the U.S.A video shared by his family shows 20-year-old Akash from Karnal camping with other illegal immigrants in Panama’s dense forests. Akash allegedly paid ₹72 lakh for the journey but was forced to… pic.twitter.com/UWgTFDlkZQ— Gagandeep Singh (@Gagan4344) February 7, 2025దక్షిణ సరిహద్దు నుండి అమెరికాలోకి ప్రవేశించేందుకు రెండు ప్రధాన అక్రమ ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఒకటి నేరుగా మెక్సికో ద్వారా, మరొకటి డంకీ మార్గం అని పిలుస్తారు. ఇందులో భాగంగా పలు దేశాలను దాటడం జరుగుతుంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, సముద్రాలు సహా ప్రమాదకరమైన భూభాగాలను నావిగేట్ చేయడం జరుగుతుంది. ఈ మార్గంలో వలసదారులు అమెరికాకు చేరుకునే ముందు విమానాలు, టాక్సీలు, కంటైనర్ ట్రక్కులు, బస్సులు, పడవల ద్వారా వెళ్తారు.ఎక్కడుందీ డంకీ రూట్?కొలంబియా-పనామాల మధ్య ఉన్న దట్టమైన అడవి ప్రాంతమే ఇది. 60 మైళ్లు (97కి.మీ) ఉండే ఈ అభయారణ్యంలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత సర్పాలు, క్రూరమృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణం, చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనే మాటే ఉండదు. అందుకే ఈ ప్రాంతంలో మకాం వేసిన నేర ముఠాలు.. మాదకద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణాతోపాటు వలసదారుల దోపిడీకి కేంద్రాలుగా మార్చుకున్నాయి.15 రోజుల సాహసం..అమెరికాలోకి అక్రమంగా తరలించే మానవ అక్రమ రవాణా ముఠాలు డేరియన్ గ్యాప్‌ను ప్రధాన మార్గంగా (Donkey Route) ఎంచుకుంటాయి. దీన్ని దాటేందుకు ఏడు నుంచి 15రోజుల సమయం పడుతుంది. వీసా తేలికగా వచ్చే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల వంటి మధ్య అమెరికా దేశాలకు తొలుత తీసుకెళ్తాయి. మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో అక్కడి నుంచి మెక్సికో, అటునుంచి అమెరికాలోకి పంపించే ప్రయత్నం చేస్తాయి. అనారోగ్యం, దాడులు కారణంగా మార్గమధ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతుంటారు. మహిళలపై డ్రగ్స్ ముఠాల అఘాయిత్యాలు అనేకం. ఎదిరిస్తే ప్రాణాలు పోయినట్లే.ఏడాదిలో 5.2లక్షల మంది..కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేల సంఖ్యలో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం ఏటా లక్షలాది మంది డేరియన్ గ్యాప్‌ను దాటుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2023లోనే దాదాపు 5.2లక్షల మంది దీన్ని దాటినట్లు అంచనా. గతేడాది మాత్రం కఠిన నిఘా కారణంగా ఈ సంఖ్య 3లక్షలకు తగ్గినట్లు తెలుస్తోంది. వెనెజువెలా, హైతీ, ఈక్వెడార్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తోపాటు భారత్ నుంచి అక్రమంగా వలసవెళ్లే వారు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.అంతా పోగొట్టుకున్నాం..ఇదిలా ఉండగా.. కొన్నేళ్ల క్రితమే ఆకాశ్ తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోందని ఆకాశ్ సోదరుడు శుభమ్ పేర్కొన్నారు. అయితే, ఆకాశ్ తాను అమెరికా వెళ్లాలని పట్టుబట్టడంతో శుభమ్ తన సోదరుడిని యూఎస్ పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ఆకాష్‌కు మంచి భవిష్యత్తును అందించాలనే ఆశతో శుభమ్.. తమకు ఉన్న 2.5 ఎకరాల భూమిని అమ్మేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ.. సినిమాను తలపించే కథ -
‘ప్రేమిస్తావా’ మూవీ రివ్యూ
ఆకాష్ మురళి, అదితి శంకర్(డైరెక్టర్ శంకర్ కూతురు) జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు.మరి సినిమా ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..దియా(అదితి శంకర్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు అర్జున్(ఆకాష్ మురళీ). ఆమె చదువుతున్న కాలేజీలోనే చేరి.. ప్రేమ విషయాన్ని చెబుతాడు. మొదట్లో ఆమె ఒప్పుకోకపోయినా..కొన్నాళ్లకు అర్జున్‌ని ఇష్టపడుతుది. ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేస్తారు. అయితే జాబ్ విషయంలో తన కంపెనీ నుంచి పోర్చుగల్‌కి వెళ్లే అవకాశం వస్తుంది దియాకి. అర్జున్ కూడా వస్తానంటే.. నో చెబుతుంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకుంటారు. కట్ చేస్తే.. పోర్చుగల్‌కి వెళ్లిన దియా.. ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతుంది. ఈ విషయం తెలిసి.. అర్జున్ పోర్చుగల్ వెళ్తాడు. ఎలాగైన ఈ కేసు నుంచి తన ప్రియురాలిని బయటపడేయాలనుకుంటాడు. అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? దియా ఆ వ్యక్తిని ఎందుకు హత్య చేసింది? దియా కోసం పోర్చుగల్ వెళ్లిన అర్జున్‌కి తెలిసిన అసలు విషయం ఏంటి? హత్యకు గురైన వ్యక్తికి శరత్ కుమార్, ఖుష్బూలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు దియా, అర్జున్ ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ప్రేమ కథలకు టాలీవుడ్లో ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఇతర భాషలోని లవ్‌స్టోరీ మూవీస్ కూడా ఇక్కడ డబ్బింగ్ అతుంటాయి. ఇలా తమిళ్లో హిట్టయిన ప్రేమ కథే ‘ ప్రేమిస్తావా’. నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో ఈ ప్రేమ కథను తీర్చి దిద్దారు. కథ ప్రజెంట్ నుంచి పాస్ట్‌లోకి వెళ్తుంది. ప్రైవేట్ కంపేనీలో ఉద్యోగం చేసే అర్జున్.. రియా అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే పోర్చుగల్ వెళ్లడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే గతంలో వీరిద్దరు ఎలా కలిశారు? ప్రేమలో ఎలా పడ్డారు? ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనేని రొమాంటిక్ వేలో యూత్‌ని ఆకట్టుకునేలా చూపించారు. ఫస్టాఫ్ అంతా వీరిద్దరి లవ్‌స్టోరీని చూపించి..సెకండాఫ్‌లో వారి మధ్య జరిగే ఘర్షణ, విడిపోవడానికి దారి తీసిన పరిస్థితలు చూపించారు. ద్వితియార్థం మొత్తం పోర్చుగల్‌లోనే సాగుతుంది. దియా కోసం అర్జున్ పడే బాధ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. అంత వరకు కథనం రొటీన్‌గా సాగినా.. క్లైమాక్స్ ట్విస్ట్ కొత్తదనాన్ని అందిస్తుంది. ఎమోషన్స్ విషయంలో ఇకాంస్త దృష్టిపెట్టి.. కథను మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైన తెగించే యువకుడు అర్జున్ పాత్రలో ఆకాశ్ మురళి ఒదిగిపోయాడు. హీరోగా తొలి చిత్రమే అయినా.. కెమెరా ముందు ఆ విషయం తెలియకుండా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక దియా పాత్రలో అదితి శంకర్ ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. శరత్ కుమార్, ఖుష్బులు మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. దగ్గుబాటి రాజా, కల్కి కొచ్లిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. చిన్న సినిమానే అయినా..తెరపై చాలా రిచ్‌గా కనిపించేలా చేశారు. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనకడుగు వేయలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
యాక్షన్... థ్రిల్
ఆకాశ్ మురళి(Akash Murali), అదితీ శంకర్ జంటగా ‘పంజా’ ఫేం విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ‘నేసిప్పాయా’ పేరుతో తమిళంలో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో ‘ప్రేమిస్తావా’(Premistava) పేరుతో ఈ నెల 30న విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మేకింగ్, ఆర్ఆర్ చాలా బాగున్నాయి’’ అని చెప్పారు.‘‘ప్రస్తుతం సమాజంలో బంధాలు ఎలా ఉన్నాయి? అనేది మా చిత్రం చూపిస్తుంది’’ అన్నారు విష్ణువర్ధన్. ‘‘ప్రేమిస్తావా’ని అందరూ సపోర్ట్ చేయాలి’’ అని సహ నిర్మాత స్నేహ బ్రిట్టో కోరారు. ‘‘నా తొలి సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నా అదృష్టం’’ అని చెప్పారు ఆకాశ్ మురళి. ‘‘ఈ చిత్రంలో ప్రేమ, యాక్షన్, రొమాన్స్ ఉన్నాయి’’ అని తెలిపారు అదితీ శంకర్. -
ఇది కథ కాదు.. వచ్చినట్టే వచ్చి.. శాశ్వతంగా దూరం
బి.కొత్తకోట: మూడేళ్ల వయసులో అదృశ్యమైన బిడ్డ.. 14 ఏళ్ల తర్వాత తల్లిండ్రుల వద్దకు చేరాడు. బిడ్డను చూసుకుని మురిసిపోతున్న ఆ తల్లిదండ్రుల నుంచి రెండేళ్ల తరువాత శాశ్వతంగా దూరమయ్యాడు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన శంకర, రెడ్డెమ్మ దంపతులకు ఆకాశ్, అభిలాష్ ఇద్దరు కుమారులు. 2008లో పెద్దకొడుకు ఆకాశ్ మూడేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆచూకీ లభించలేదు. కాగా.. ఆకాశ్‌ను బెంగళూరులో ఉంటున్న రత్నమ్మ అనే మహిళ పెంచుకుంది. మూడేళ్లు పెంచుకున్నాక ఆమె మదనపల్లె మండలం కొత్తపల్లెలో ఉంటున్న ఆటో డ్రైవర్ నాగరాజు, లలితమ్మ దంపతుల వద్దకు ఆకాశ్‌ను పంపించింది. వాళ్లే ఆకాశ్‌ను పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత నాగరాజు కుటుంబం నాయనబావికి మకాం మార్చింది. ఆ బిడ్డ.. మీ బిడ్డే.. ఆకాశ్ తల్లి రెడ్డెమ్మ చెల్లెలు మంజు బెంగళూరులో ఉంటూ కూలి పనులకు వెళ్తోంది. ఓ రోజు ఆకాశ్‌ను మూడేళ్ల పాటు పెంచిన రత్నమ్మ, మంజు కూలీ పనుల్లో కలుసుకున్నారు. మూడేళ్ల వయసులో అదృశ్యమైన పిల్లాడు దొరికాడా అని మంజును ఆరా తీసింది. లేదని మంజు చెప్పడంతో రత్నమ్మ అసలు విషయం చెప్పింది. నాగరాజు దంపతులు ఆ బిడ్డను తెచ్చి తనకు ఇచ్చారని, మళ్లీ వారికే ఇచ్చినట్టు తెలిపింది. ఈ విషయాన్ని మంజు తన అక్క రెడ్డమ్మకు ఫోన్ చేసి చెప్పింది. బిడ్డను తెచ్చుకునేందుకు తల్లి రెడ్డెమ్మ ఆటోడ్రైవర్ నాగరాజు వద్దకు వెళ్లగా.. ఆకాశ్ నీ బిడ్డ అనేందుకు ఆధారమేంటని గ్రామ పెద్దలు ప్రశ్నించారు. వాడి నాలుకపై పుట్టు మచ్చ ఉంటుందని రెడ్డెమ్మ చెప్పింది.తల్లి చెప్పినట్టే ఆకాశ్ నాలుకపై పుట్టుమచ్చ ఉంది. తల్లి వద్దకు వెళ్లేందుకు మొదట్లో ససేమిరా అన్న ఆకాశ్.. రెండేళ్ల క్రితం తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాడు. ఇప్పుడు ఆకాశ్ వయసు 19. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వినాయక ఉత్సవాల్లో నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృత్యుఒడికి చేరాడు. -
తల్వార్ ప్రారంభం
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ హీరోగా ‘తల్వార్’ సినిమా ప్రారంభమైంది. కాశీ పరశురామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వార్నిక్ స్టూడియోస్‌పై భాస్కర్ ఈఎల్వీ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లాప్ కొట్టారు.తొలి సీన్‌కి దర్శకుడు బుచ్చిబాబు సాన గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: కేశవ కిరణ్, కెమెరా: త్రిలోక్ సిద్ధు. -
'ఐదు జంటల లవ్ స్టోరీ'.. ట్రైలర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ తనయుడు!
ఎంఎన్వీ సాగర్, శృతి శంకర్ జంటగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం' కాలం రాసిన కథలు'. ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. యస్ యమ్ 4 ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ జగన్నాధ్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా మంచి విజయం సాధించాలని చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఎంఎన్వీ సాగర్ మాట్లాడుతూ..' నా గురువుగా భావించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈనెల ఆగస్టు 29న థియేటర్లలో రాబోతున్నాం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసుకొస్తున్నాం. 30 ఏళ్ల క్రితం మొదలైన పరువు హత్యల మధ్యే ఈ కథ సాగుతుంది. ఈ చిత్రం ద్వారా కొంతమంది కొత్తవారు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు ఉన్నాయి' అని అన్నారు. ఈ చిత్రంలో వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్, రవితేజ బోనాల ,పల్లవి రాథోడ్ , రేష్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కుకింగ్ ఈజ్ థెరపిటిక్
ఆకాష్ మురళీధరన్‌కు చిన్న వయసులోనే వంటలపై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయి ప్రపంచ వంటకాల గురించి కూడా తెలుసుకునేలా చేసింది. ప్రపంచ వంటకాల గురించి కాచి వడబోసిన చెన్నైకి చెందిన ఆకాష్ దక్షిణ భారతీయ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి నడుం కట్టాడు. ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నాడు. ‘కుకింగ్ ఈజ్ థెరపిటిక్’ అంటున్న ఆకాష్‌కు వంటలు చేయడం పాషన్ మాత్రమే కాదు. ప్రాణవాయువు కూడా...వంటగదిలో బామ్మ స్వీట్ తయారు చేస్తుంటే చిన్నప్పుడెప్పుడో చూశాడు ఆకాష్. ‘ఇక్కడ నీకు ఏం పని?’ అని గద్దించలేదు బామ్మ. ‘ఈ స్వీటును ఇలా తయారు చేయాలి నాయనా’ అంటూ వివరించింది. ఇక అప్పటి నుంచి రకరకాల వంటలు. స్వీట్ల తయారీపై ఆకాష్‌కు ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి, నేర్చుకున్న విద్య ఊరకే పోలేదు. బెంగళూరులో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో బాగా ఉపయోగపడింది. తనకు ఇష్టమైన వంటలు చేసి ఆ రుచులను ఆస్వాదించడంతో పాటు వంటల్లో రకరకాల ప్రయోగాలు చేసేవాడు.రుచుల ఆస్వాదనలో ఆనందమే కాదు వంట చేస్తున్న సమయంలో ఏకాగ్రత పెరగడం, మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉండడం గమనించాడు ఆకాష్. ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేసిన ఆకాష్ ఒక ఆర్కిటెక్చర్ ఫర్మ్‌లో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. యానిమేషన్లో డిప్లామా కూడా చేసిన ఆకాష్ ఆ తరువాత వంటలపై తన పాషన్ను సీరియస్‌గా తీసుకున్నాడు. కొత్త కొత్త వంటకాల గురించి మరింత ఆసక్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు.ఇటలీలోని మిలాన్‌లో ఫుడ్ డిజైన్‌లో మాస్టర్స్ చేశాడు. పాత వంటకాలకు కొత్త ఫ్లేవర్ జోడించడాన్ని తన ప్రత్యేకతగా చేసుకున్నాడు. యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఎన్నో వంటకాల గురించి తెలుసుకునే అవకా«శం వచ్చింది. ఇది తన భవిష్యత్ బాటకు బాగా ఉపయోగపడింది. ‘ఇండియాకు ఆవల ఫుడ్‌ను ఎలా చూస్తారు?’ అనే విషయాన్ని లోతుగా తెలుసుకోవడానికి కూడా తన ప్రయాణాలు ఉపయోగపడ్డాయి.నెదర్లాండ్స్‌లో ఒక ఫుడ్ డిజైనర్‌తో కలిసి పనిచేశాడు. ‘ప్రపంచంలోని ఎన్నో వంటకాల గురించి తెలుసుకున్న నాకు దక్షిణ భారత వంటకాల రుచులను ప్రపంచానికి పరిచయం చేయాలని గట్టిగా అనిపించింది’ అంటాడు ఆకాష్. మనం ఆస్వాదించే వంటకాలకు సంబంధించిన ఆసక్తికరమైన కథలను ఆధునిక పద్ధతులలో చెప్పడానికి ‘విజా మెడై’ పేరుతో మల్టీడిసిప్లినరి స్టూడియోను మొదలు పెట్టాడు. ఈవెంట్ డిజైన్, డెకర్, మెనూ క్యురేషన్, ఔట్ఫిట్ డిజైన్, స్టైలింగ్, క్రియేటివ్ డైరక్షన్లు ఈ స్టూడియో ప్రత్యేకత.తన ‘100–డే కుకింగ్ ప్రాజెక్ట్’లో భాగంగా మనం మరచిపోయిన ఎన్నో కూరగాయలను వెలుగులోకి తెచ్చాడు. సౌత్ ఇండియన్ ఫుడ్ రుచుల గురించి వివరంగా చెప్పడానికి ‘మాస్టర్‌చెఫ్ ఇండియా–తమిళ్’ షోలో పాల్గొన్నాడు. ఆకాష్ వంటనైపుణ్యానికి ఫిదా అయిన జడ్జీలు స్టాండింగ్ వొవేషన్ ఇచ్చారు. ‘మాస్టర్‌చెఫ్ ఇండియా–తమిళ్’ టైటిల్ గెలుచుకున్నాడు ఆకాష్. చిన్నప్పుడు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్‌డీ)తో బాధ పడిన ఆకాష్‌కు వంట చేయడం అనేది చికిత్సలా ఉపయోగపపడింది. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. -
ఆకాష్‌పై అలక వీడిన మాయావతి
మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌పై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి అలక వీడాడు. ఆమె తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన ఆమె మేనల్లుడు ఆకాష్ అత్త మాయావతి పాదాలను తాకి, ఆశీర్వదించాలని కోరారు. దీంతో ఆమె ఆనందంతో పొంగిపోతూ ఆకాష్ తలపై చేయివుంచి, నిండుగా ఆశీర్వదించారు.అలాగే మాయావతి ఆకాష్ వీపు తడుతూ ఇకపై జాగ్రత్తగా ఉండు అనేలా సంకేతమందించారు. దీనికితోడు అతనిని రాబోయే ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేశారు. ఆకాష్ ఆనంద్ బీఎస్పీ మాజీ జాతీయ సమన్వయకర్త.గతంలో మాయావతి ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా ప్రకటిస్తూ యూపీ, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించారు. అయితే ఆకాష్ ఎన్నికల సమయంలో సీతాపూర్‌లో వివాదాస్పద ప్రసంగం చేయడంతో అతనిని జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. అయితే ఇది జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఆకాష్‌పై అలకవీడి స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపికచేసి, పార్టీలో తగిన స్థానం కల్పించారు. #WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati holds a meeting with party workers in Lucknow. pic.twitter.com/b5bBrDlesv— ANI (@ANI) June 23, 2024 -
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
లక్నో: తన మేల్లుడైన ఆకాశ్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తొలగించారు. ఈ తొలగింపుపై తాజాగా గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆకాష్ ఆనంద్ స్పందించారు. ‘బీఎస్పీ చీఫ్ మాయావతి.. బహుజన సమాజానికి రోల్ మోడల్. బహుజనలు అంటే.. దళితులు, ఎస్టీలు, ఓబీసీలు. మీ పోటం వల్లనే నేడు బహుజన సమాజానికి ఇంత రాజకీయం బలం చేకూరింది. బహుజన సమాజం గౌరవంగా బ్రతకటం నేర్చుకుంది. మీరే మా అధినేత్రి. నా కడ శ్వాస వరకు భీమ్ మిషన్, బహుజన సమాజం కోసం పోరాడతాను’’ అని ఆకాష్ ఆనంద్ ‘ఎక్స్’లో తెలిపారు.ఇక.. ఇటీవల ఆకాశ్ ఆనంద్ బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకాశ్ రాజకీయంగా పరిణతి సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్ మాట్లాడుతూ యూపీలోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్‌గా అభివర్ణించారు.आदरणीय बहन @mayawati जी, आप पूरे बहुजन समाज के लिए एक आदर्श हैं, करोड़ों देशवासी आपको पूजते हैं। आपके संघर्षों की वजह से ही आज हमारे समाज को एक ऐसी राजनैतिक ताक़त मिली है जिसके बूते बहुजन समाज आज सम्मान से जीना सीख पाया है। आप हमारी सर्वमान्य नेता हैं। आपका आदेश सिर माथे पे।…— Akash Anand (@AnandAkash_BSP) May 9, 2024 రాష్ట్రంలోని యువతను ఆకలితో ఉంచుతూ, పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ అధికారులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆకాశ్‌కు సంబంధించిన అన్ని ర్యాలీలను బీఎస్పీ రద్దు చేసింది.2023 డిసెంబరులో మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్ లండన్‌లో ఎంబీఏ చదివారు. ఇక.. 2017లో బీఎస్పీలో చేరారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
Akash Anand: మేనల్లుడికి షాకిచ్చిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత వివాదం బహిర్గతమయ్యింది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను రెండు కీలక పదవుల నుంచి తొలగించారు. గతంలో ఆమె ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా, జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆకాష్ విషయంలో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆకాష్ ఆనంద్ బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయి. ఇటీవల సీతాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆకాష్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయని, అయితే ఇది బుల్డోజర్ల ప్రభుత్వం కాదని, ఉగ్రవాదుల ప్రభుత్వమంటూ ఆకాష్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం దేశ ప్రజలను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని టెర్రరిస్టుగా అభివర్ణించినందుకు సీతాపూర్‌లో ఆకాష్ ఆనంద్‌పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితోపాటు ఇటీవల ఆకాష్ ఆనంద్ ఒక సభలో బహుజన సమాజ్ నుండి ఓట్లు కోరుతున్న వారిని బూట్లతో కొట్టి తరమాలని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో రామ మందిరాన్ని సందర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకున్నదంటూ ప్రకటించారు. ఆకాష్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసింది.బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలని ఆకాష్ ఆనంద్‌ను మాయావతి గత నెలలోనే హెచ్చరించారు. అయితే ఆయన దీనిని పట్టించుకోలేదు. ఈ దరిమిలా ఆకాష్ ఆనంద్ ప్రసంగాలపై మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ‘పార్టీలో శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా, నేషనల్ కోఆర్డినేటర్‌గా ప్రకటించాం. అయితే ఆయన పార్టీ చేపట్టిన ఉద్యమంలో పరిపక్వత సాధించే వరకు, అతనిని ఈ రెండు బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటు ఉద్యమం కోసం బీఎస్పీ నాయకత్వం ఎటువంటి త్యాగానికైనా వెనకాడబోదని పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉదమ్యమని మాయావతి పేర్కొన్నారు. -
Voting urgent than marriage: ఓటుకు సుముహూర్తం!
మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు. కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వదార్పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్‌ను పోలింగ్ స్టేషన్ ముందు ఏఎన్ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్‌ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువుఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ల్యాబ్‌కు ఆకాశ్ రక్త నమూనాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో శాస్త్రీయ ఆధారాల సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కారు నడిపిన ఆమె పీఏ ఆకాశ్‌కు ఇప్పటికే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించి ఆయన మద్యం సేవించలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు... తాజాగా ఆకాశ్ రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌తోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపినట్లు తెలిసింది. అలాగే ఆకాశ్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆకాశ్ స్టేట్మెంట్ను మేజి్రస్టేట్ సమక్షంలో రికార్డు చేసినట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు కళ్లు బైర్లు కమ్ముకున్నాయని.. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రమాదం జరిగిందని ఆకాశ్ చెప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదానికి ముందు రాత్రి ఆయనకు సరిగ్గా నిద్ర లేకపోవడంతోనే కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర మత్తు ఆవహించిందా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? అనే దానిపై ల్యాబ్ రిపోర్టులు వస్తేనే సైంటిఫిక్ ఎవిడెన్స్ లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. వాహన తయారీ లోపాలేమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే ప్రయాణించిన వాహనంలో తయారీ లోపాలేమైనా ఉన్నాయా? అని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైనప్పుడు వాహనం గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు.. ప్రమాద తీవ్రతకు కారు విడిభాగాలు సుమారు 100 మీటర్ల దూరం వరకు పడిపోవడాన్ని బట్టి చూస్తే అంతకంటే ఎక్కువ వేగంతో వాహనం ప్రయాణిస్తోందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పటాన్చెరు పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిన చోట ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అని పరిశీలించారు. -
ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్ కేసు: ఏం జరిగిందో చెప్పిన ఆకాష్
హైదరాబాద్, సాక్షి: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో.. ఆమె పీఏ-డ్రైవర్ ఆకాష్‌పై కేసు నమోదైందన్న విషయం తెలిసిందే. ఆకాష్ నిర్లక్ష్యపూరితంగా వాహనం నడపడం వల్లే లాస్య చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆకాష్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు పటాన్చెరు పోలీసులు. మేజిస్ట్రేట్ సమక్షంలో స్పృహలో ఉన్న ఆకాష్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లో.. ‘‘దర్గా నుండి హైదరాబాద్ చేరుకుని.. లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని మరో కారులోకి ఎక్కించాం. లాస్య తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లాం. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో నా మైండ్ బ్లాంక్ అయ్యింది’’ అని ఆకాష్ పేర్కొన్నారు. ఇక ప్రమాదం జరిగిన తీరును స్థానిక డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టిన తర్వాత ఎమ్మెల్యే కారు కంట్రోల్ కాక ఓఆర్ఆర్పై లెఫ్ట్ సైడ్ రెయిలింగ్‌కు ఢీ కొట్టింది. ప్రమాదం కంటే ముందే కారు ముందు భాగం పగిలి కింద పడిపోయి ఉన్నాయి. నిర్లక్షం గా అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగింది’’ అని వివరించారు. లాస్య సోదరి నివేదిత ఫిర్యాదుతో ఆకాష్ మీద ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద పటాన్చెరు పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. శుక్రవారం వేకువఝామున ఉదయం 5గంటల 15 గంటలకు ఆకాష్ తమకు ఫోన్ చేశాడని, ప్రమాదం జరిగి.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడని నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నారు. తీరా స్పాట్‌కు తాము వెళ్లి చూస్తే.. నుజ్జునుజ్జు అయి కారు మాత్రమే ఉందని ఆమె తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సదాశివపేటలోని ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చి.. కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాతే టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వెళ్లారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంలో లాస్య చనిపోగా.. ఆకాష్ కాళ్లు విరిగాయి. షామీర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి లాస్య కారు ఎంట్రీ అయినట్టు పోలీసులు గుర్తించారు. నిద్ర మత్తులోకి జారిపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు ఆకాష్ చెప్తున్నప్పటికీ.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
కుమారుడి సినిమా చూసి ఏడ్చేసిన సింగర్ సునీత
టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ ఈ మధ్యే సర్కారు నౌకరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రొటీన్ సినిమాల మాదిరిగా కాకుండా వైవిధ్యభరితమైన కథ ఎంచుకున్నాడు. తన సినిమా ప్రేక్షకులకు ఓ సందేశాన్ని కూడా ఇవ్వాలనుకున్నాడు. అలా అతడు ప్రధాన పాత్రలో నటించిన సర్కారు నౌకరి జనవరి 1న విడుదలైంది. భావన హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు. తెలియకుండానే కన్నీళ్లు.. తాజాగా ఈ సినిమా చూసిన సింగర్ సునీత భావోద్వేగానికి లోనైంది. థియేటర్లలో సినిమా చూసిన అనంతరం గాయని మీడియాతో మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే విడుదలకు ముందే సర్కారు నౌకరిని ఎడిట్ చేసేటప్పుడే ఈ సినిమా చూసేశాను. ఇప్పుడు మళ్లీ చూశాక చాలా గర్వంగా అనిపిస్తోంది. హీరోగా కథ నడిపించడమనేది పెద్ద బాధ్యత. ఆకాశ్ చాలా బాగా నటించాడు. ఎప్పుడూ సినిమాల్లో యాక్ట్ చేస్తానమ్మా అని చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ ఇంత బాగా చేస్తాడనుకోలేదు. నేను సినిమా ఎమోషనల్‌గా ఉందని కన్నీళ్లు పెట్టుకోవడం లేదు. నా పిల్లలు కన్న కలలు నిజమవుతుంటే తల్లిగా తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. గుండె బరువెక్కేలా.. కళ్లతో ఎక్స్ప్రెషన్ పలికించే నటులంటే చాలా ఇష్టం. నాకు సినిమాలో ఆకాశ్ కనిపించలేదు. గోపాల్ అనే పాత్ర మాత్రమే కనిపించింది. అందరూ చాలా సహజంగా, అద్భుతంగా నటించారు. హృదయానికి హత్తుకునే సినిమాలను థియేటర్‌కు వచ్చే చూడాలి. కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, కొన్ని ఆహ్లాదాన్నిస్తాయి.. మరికొన్ని గుండె బరువెక్కేలా ఉంటాయి. ఈ చిత్రంలో అన్నీ ఉన్నాయి. ఆకాశ్ ఈ సినిమా చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని ఆనందభాష్పాలు రాల్చింది సునీత. చదవండి: అమ్మ నన్ను తెలుగులో తిట్టేది: జాన్వీ -
నాన్న ఇప్పటికీ కలుస్తాడు.. అమ్మ రెండో పెళ్లి అనగానే..
స్టార్ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన చిత్రం సర్కారు నౌకరి. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎయిడ్స్ మహమ్మారి గురించి అవగాహన కల్పించే క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు? తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేది సినిమా కథ. ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభించగా తాజాగా హీరో ఆకాశ్ ఇంటర్వ్యూలతో బిజీ అయ్యాడు. కాళ్లు విరగ్గొడతానంది ఓ ఇంటర్వ్యూలో అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. 'చిన్నప్పుడు క్రీడలంటే ఎక్కువ ఆసక్తి ఉండేది. పదో తరగతి చదువుతున్న సమయంలో చిరంజీవి సినిమాలు చూసి డ్యాన్స్ నేర్చుకున్నాను. అలా నెమ్మదిగా సినిమాలంటే పిచ్చి ఏర్పడింది. నాకు సంగీతం అంటే ఇష్టం.. కానీ సింగర్ అవ్వాలనుకోలేదు. నేను ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచి అమ్మ సింగిల్ పేరెంట్‌గా మమ్మల్ని పోషించడం మొదలుపెట్టింది. చదువుకునేటప్పుడు నటుడిని అవుతానని చెప్తే అమ్మ కాళ్లు విరగ్గొడతానంది. డిగ్రీ తర్వాత సినిమాల వైపు అడుగులు వేశాను. ఇద్దరూ ఫ్రెండ్లీగానే ఉంటారు నాకు మెచ్యురిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే.. ఈ సినీ ఇండస్ట్రీలో చాలా పోటీ ఉంటుంది. ఆడవారికి చాలా ఒత్తిడి ఉంటుంది. అమ్మ ఓ పక్క వాటిని మేనేజ్ చేస్తూనే మరోవైపు నన్ను, చెల్లిని అమ్మమ్మ-తాతయ్యలను కూడా చూసుకుంది. మేమందరం కలిసే ఉంటాం. నాన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. నాన్న, రామకృష్ణగారు(సునీత రెండో భర్త) ఫ్రెండ్లీగానే ఉంటారు. ఈ కోపాలు, పగలు మనసులో పెట్టుకోకుండా అన్నీ వదిలేసి ముందుకు సాగుతున్నాం. నిజానికి మా అమ్మ రెండో పెళ్లి గురించి చాలా భయపడింది. అమ్మ జీవితంలో చాలా మిస్సయింది మేము ఎలా అర్థం చేసుకుంటామని టెన్షన్ పడింది. నాకు, చెల్లికి.. తను ఆనందంగా ఉంటే అంతే చాలు.. రామకృష్ణగారి మీద నమ్మకం ఉందా? అని అడిగాను. చాలా నమ్మకం ఉందని చెప్పింది. నేనూ అతడిని కలిశాను.. నాకూ నచ్చాడు. అమ్మ తన జీవితంలో ఎమోషనల్ సపోర్ట్ చాలా మిస్సయింది. ఎన్నో ఏళ్లు అది లేదు.. మొత్తానికి అమ్మకు ఒక తోడు దొరికింది. తన సంతోషమే మాకు కావాల్సింది అని చెప్పుకొచ్చాడు ఆకాశ్. కాగా సునీతకు చిన్న వయసులోనే పెళ్లయింది. 19 ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ గోపరాజును పెళ్లాడగా వీరికి ఆకాశ్, శ్రేయ సంతానం. పలు కారణాల రీత్యా కొంతకాలానికే సునీత్-కిరణ్ విడాకులు తీసుకున్నారు. అనంతరం చాలా గ్యాప్ తీసుకున్న సింగర్ 2021లో వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనిని పెళ్లాడింది. చదవండి: ఈసారి పెళ్లి పక్కా అంటున్న నటుడు.. నిజమేనా మాస్టారు? -
Sarkaaru Noukari Review: ‘సర్కారు నౌకరి’ మూవీ రివ్యూ
టైటిల్: సర్కారు నౌకరి నటీనటులు: ఆకాశ్, భావన, తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు నిర్మాత: కె రాఘవేంద్ర రావు దర్శకత్వం: గంగనమోని శేఖర్ సంగీతం: శాండిల్య నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: గంగనమోని శేఖర్ ఎడిటర్: రాఘవేంద్ర వర్మ విడుదల తేది: జనవరి 1, 2023 ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన తొలి సినిమా సర్కారు నౌకరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించడంతో చిన్న సినిమా అయినా సరే సర్కారు నౌకరిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచేశాయి. కొత్త సంవత్సరం సందర్భంగా నేడు(జనవరి 1, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. సర్కారు నౌకరి కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1996లో సాగుతుంది. గోపాల్(ఆకాష్ గోపరాజు) ఓ అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కష్టపడి చదివి సర్కారు కొలువు(ప్రభుత్వ ఉద్యోగం) సాధిస్తాడు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి హెల్త్ ప్రమోటర్‌గా వెళ్తాడు. పెద్దరోగం (ఎయిడ్స్)పై అవగాహన కల్పిస్తూ, కండోమ్స్ పంచడం అతని డ్యూటీ. సర్కారు నౌకరోడని సత్య(భావన)అతన్ని పెళ్లి చేసుకుంటుంది. గోపాల్ని కొల్లాపూర్ గ్రామస్తులు మొదట్లో చాలా బాగా గౌరవిస్తారు. మండల ఆఫీస్‌లో పనిచేసే సార్ భార్య అంటూ సత్యకు కూడా ఊరి ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ గోపాల్ చేసే పని కండోమ్‌లు పంచడం అని తెలిశాక.. ఊరంతా అతని ఫ్యామిలీని అంటరాని వాళ్లుగా పరిగణిస్తారు. బుగ్గలోడు అంటూ గోపాల్ని హేళన చేస్తారు. దీంతో అతని భార్య ఉద్యోగం మానేసి.. వేరే ఊరికి వెళ్దామని కోరుతుంది. గోపాల్ మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోనని చెబుతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి సత్య పుట్టింటికి వెళ్తుంది. మరోవైపు ఊర్లో ఎయిడ్స్ వ్యాధి మరింత వ్యాపించడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవైపు వరుస అవమానాలు..మరోవైపు భార్య గొడవ..అయినా గోపాల్ తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేయలేదు? పెద్దరోగంపై అవగాహన కల్పించేందుకు గోపాల్ ఎం చేశాడు? ఊరి సర్పంచ్(తనికెళ్ల భరణి)ని ఎలా వాడుకున్నాడు? ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్యోగాన్నే గోపాల్ ఎందుకు ఎంచుకున్నాడు? గోపాల్ గతమేంటి? కొల్లాపూర్‌తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సర్కారు నౌకరి చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 1996లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్. అప్పట్లో ఎయిడ్స్ వ్యాధి ప్రభావం చాలా ఉండేది. సరైన అవగాహన లేక ప్రజలు ఎయిడ్స్ బారిన పడేవారు. కండోమ్‌ల వాడకం కూడా తెలిసేది కాదు. వ్యాధి ఎలా వస్తుందో కూడా చాలా మందికి తెలిసేదికాదు. అంటూవ్యాధి అంటూ ఎయిడ్స్ బారిన పడిన వారిని ఊరి నుంచి వెలేసేవారు. అలాంటి సంఘటనలు కొల్లాపూర్ గ్రామంలో కూడా జరిగాయట. వాటినే కథగా మలుచుకొని సర్కారు నౌకరి చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఓ మంచి సందేశాన్ని కామెడీ, భావోద్వేగాలు రెండింటిని జొప్పించి కమర్శియల్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ కథను తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సహజంగా కథనం సాగుతుంది. అయితే ఇప్పుడున్న ప్రేక్షకుల మూడ్‌కి పూర్తి విరుద్ధమైన కథ ఇది. ప్రస్తుతం ప్రేక్షకులంతా యానిమల్, సలార్ లాంటి యాక్షన్ చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. సర్కారు నౌకరిలో అలాంటి సన్నివేశాలేవి ఉండవు. కానీ గ్రామీణ నేటివిటీ, మన చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు తెరపై కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. ఫస్టాఫ్ అంతా చాలా కామెడీగా సాగుతుంది. హీరో హీరోయిన్ల పెళ్లి, రొమాన్స్.. అప్పట్లో పూర్లో ఉండే పరిస్థితులు, జనాల ప్రవర్తన ఇవన్నీ కాస్త నవ్వులు పంచుతాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. గంగ(మధులత)-శివ(మహదేవ్)ల మధ్య వచ్చే సన్నివేశాలు..పాట ఆకట్టుకుంటుంది. అలాగే శివ పాత్ర ముగింపు, హీరో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా గుండెల్ని పిండేస్తుంది. అయితే కథనం చాలా సహజంగా, చాలా ఎమోషనల్‌గా సాగినా..ప్రేక్షకులను ఫీల్ అయ్యేలా చేయడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఎయిడ్స్‌పై అవగాహన కల్సించడం కోసం హీరో చేసే ప్రయత్నాల్ని తెరపై బలంగా చూపించలేకపోయాడు.కొన్ని చోట్ల కథనం స్లోగా సాగుతూ ఆర్ట్ ఫిల్మ్స్‌ని గుర్తు చేస్తుంది. అయితే దర్శకుడు మాత్రం చాలా నిజాయితీగా సినిమాను తెరకెక్కించాడు. గ్రామీణ నేపథ్య చిత్రాలను ఇష్టపడేవారికి, నైంటీస్ జనరేషన్ వాళ్లకి సర్కారు నౌకరి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సింగర్ సునీత కొడుకు ఆకాశ్ తొలి సినిమా ఇది. అయినా చాలా చక్కగా నటించాడు.తన పాత్రకు తగ్గట్టుగా హవభావాలను పలికించాడు. ఎమోషనల్ సన్నివేశాలల్లో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో అనుభవలేమి కనిపించినా..మున్ముందు మంచి నటుడిగా రాణించే అవకాశం ఉంది. గోపాల్ భార్య సత్యగా భావన తనదైన నటనతో ఆకట్టుకుంది. గోపాల్ స్నేహితుడు శివగా మహదేవ్, అతని మరదలు గంగగా మధు లత తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక కొల్లాపూర్ సర్పంచ్‌గా తనికెళ్ల భరణి తన మార్క్ హాస్యంతో కొన్ని చోట్ల నవ్వించాడు. బలగం సుధాకర్ రెడ్డి, సాహితి దాసరి, సమ్మెట గాంధీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగుంది. శాండిల్య పాటలు ఆకట్టుకుంటాయి.శేకర్ గంగనమోని కెమెరా వర్క్ బాగుంది. అప్పటి పల్లెటూరి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
వాస్తవ ఘటనలతో సర్కారు నౌకరి
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భావన హీరోయిన్గా నటించారు. ఆర్కే టెలీ షో బ్యానర్‌పై డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో గంగనమోని శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ‘సర్కారు నౌకరి’ రూపొందింది. ఇందులోని సందేశం, వినోదం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘సర్కారు నౌకరి’లో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ఆకాష్. ‘‘ఈ మూవీతో తెలుగులో పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు భావన. -
‘సర్కారు నౌకరి’అందరికి నచ్చుతుంది: మూవీ టీమ్
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా "సర్కారు నౌకరి". ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటించింది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన "సర్కారు నౌకరి" సినిమా న్యూఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక షో వేశారు మేకర్స్. ప్రదర్శన అనంతరం మూవీ టీమ్ మీడియాతో మాట్లాడారు. దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" కంటెంట్ ఓరియెంటెడ్ గా సాగే సినిమా. యదార్థ ఘటనల స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించాను. సందేశం, వినోదం రెండు కలిసి సినిమా "సర్కారు నౌకరి". అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అప్పటి గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరంగా కథా కథనాలు ఉంటాయి. రియలిస్టిక్ అప్రోచ్ తో మూవీ ఆకట్టుకుంటుంది. అన్నారు హీరోయిన్ భావన మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" లాంటి మంచి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం కావడం హ్యాపీగా ఉంది. పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా నా క్యారెక్టర్ ఉంటుంది. "సర్కారు నౌకరి" సినిమా ప్రతి ఆడియెన్ కు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. మనసును తాకే ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ కథలో ఉన్నాయి. ఇలాంటి మంచి మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అని చెప్పింది. హీరో ఆకాష్ మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" మూవీ మా కెరీర్ కు ఫస్ట్ స్టెప్. కొత్త ఏడాదిలో మొదటి రోజు మీ ముందుకు వస్తోంది. ఈ మొదటి అడుగులోనే ప్రేక్షకులు విజయాన్ని అందించి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం. "సర్కారు నౌకరి"లో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో మీకు కనిపిస్తాను. సొసైటీకి మంచి చేయాలనే తాపత్రయం ఒకవైపు, కుటుంబం, స్నేహితుల నుంచి ఎదుర్కొనే సంఘర్షణ మరోవైపు నా క్యారెక్టర్ కు అన్ని ఎమోషన్స్ తీసుకొస్తాయి. "సర్కారు నౌకరి" సినిమాకు మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం.అన్నారు. -
న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే!
లక్డీకాపూల్: వేలాది మంది అభ్యర్ధులకు అన్యాయం జరిగి, వారిలో కొందరి చావుకి కారణమైన పోలీస్ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో మూకుమ్మడి ఆత్మహత్యలే తమకు శరణ్యమని పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లోని ‘ప్రజావాణి’లో నష్టపోయిన ఎస్.ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా పోరాట సమితి ప్రతినిధి ఆకాష్ మాట్లాడుతూ.. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలను ఇవ్వాలని, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు. యాసం ప్రదీప్ మాట్లాడుతూ పోలీస్ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేసి.. ప్రిలిమ్స్ నుంచి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అదనంగా 2 సంవత్సరాల వయోపరిమితిని పెంచి ఇప్పటివరకు మిగిలి ఉన్న పోస్టులన్నీ కలిపి ఒక మెగా రిక్రూట్మెంట్ని విడుదల చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగిపాలిటెక్నిక్ కాలేజీలకే బదిలీ చేయాలి రేషనలైజేషన్ చేసి దూర ప్రాంతాలకు బదలీ చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను య«థావిధిగా పాత పాలిటెక్నికల్ కళాశాలలకే బదిలి చేయాలని తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నికల్ అండ్ కమిషనరేట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మారెపల్లి సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెం.317తో స్ధానికతను కోల్పోయి నష్టపోయిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని స్ధానికత సాధన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. శ్రీనివాసరావు, కె. శ్రీశైలం డిమాండ్ చేశారు. మల్లారెడ్డి నుంచి మా భూములు మాకిప్పించండి.. సూరారంలోని రూ.190 కోట్ల విలువైన సర్వే నెం.95, 96, 97, 98లకు చెందిన 9.1 గుంట పట్టా భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని.. అదేమంటే తమపై పోలీసు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కుద్బుల్లాపూర్‌కి చెందిన నర్సిమ్మ తనయుడు కృష్ణ ఆవేదన చెందారు. సర్వే నెం.107లోని ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసి తమ బినామీలు మహేంద్రరెడ్డి, సుధీర్‌రెడ్డి, ప్రవీణ్ కుమార్, చెన్నారెడ్డిల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంతన్న న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పేద సినీ కళాకారులను పట్టించుకోవాలి తెలంగాణ సినీ కార్మికుల కష్టాలను ఆలకించి.. పేద కళాకారులను పట్టించుకోవాలని నటుడు నాని వెంకట్ జైరాజ్ కోరారు. ధరణి తప్పిదాల వల్ల తమ ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నానని రంగారెడ్డి జిల్లాకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. ముౖఫై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ పట్టా భూమికి అధికారులు సర్వే సర్టిఫైడ్ కాపీ ఇవ్వడం లేదని ములుగు జిల్లా నల్లగుంటకు చెందిన పబ్బ వెంకటరమణయ్య వాపోయారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నోడల్ అధికారి హరిచందన తెలిపారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుని, దరఖాస్తులు స్వీకరించారు. 12 కౌంటర్ల ద్వారా 24 మంది అధికారులు అర్జీదారుల నుండి 2,445 దరఖాస్తులు స్వీకరించారు. -
నటుడిగా అలరించి హీరో అవుతాను
‘‘నేను హీరో కావాలనుకుంటే కాలేను. ఓ మంచి నటుడిగా ప్రేక్షకులను అలరిస్తే, వారి నమ్మకాన్ని గెల్చుకుంటే అప్పుడు హీరో అవుతాను. మా అమ్మగారు (సునీత) స్టార్ సింగర్. ఆమె స్థాయిని ఇండస్ట్రీలో కొనసాగించాలనే విషయాన్ని నేను ఒత్తిడిగా ఫీల్ కావడం లేదు. నన్ను నిరూపించుకునేందుకు ఓ అవకాశంగా, ఓ బాధ్యతగా అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో నా గురించి స్టార్ కిడ్ అనే మాట వినిపించినప్పటికీ నా నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుని, సక్సెస్ కావాల్సిన బాధ్యత నాపైనే ఉంటుంది’’ అని ఆకాశ్ అన్నారు. ఆకాశ్, భావన జంటగా గంగనమోని శేఖర్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ ఫిల్మ్ ‘సర్కారు నౌకరి’. దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆకాశ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా 1990 నేపథ్యంలో సాగుతుంది. ఆ సమయంలో దేశంలో ఎయిడ్స్ అనే ఓ మహమ్మారి వచ్చింది. ముఖ్యంగా గ్రామాలు చాలా ప్రభావితం అయ్యాయి. ఈ వ్యాధి నివారణ, చికిత్సల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ప్రభుత్వోద్యోగులు. అలా ఓ గ్రామంలో వారు చేసిన ప్రయత్నాలను ఓ వ్యక్తి చేసినట్లుగా, వన్ మ్యాన్ షోలా ఈ సినిమాను తీశాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఓ ప్రభుత్వోద్యోగి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు? తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేది ‘సర్కారు నౌకరి’ సినిమా కథాంశం. వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. వినోదంతో పాటు ఓ చిన్నపాటి సందేశం కూడా ఉంది. నేను గిటారిస్ట్‌ని కూడా. భవిష్యత్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొని, సినిమా పాటలను ఎలా కం΄ోజ్ చేస్తారనే విషయాలపై అవగాహన తెచ్చుకోవాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు. -
కొత్త ప్రపంచాన్ని సృష్టించారు
‘‘సర్కారు నౌకరి’ సినిమా ట్రైలర్ బాగుంది. ఈ మూవీ ద్వారా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. గాయని సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భావన హీరోయి¯Œ . ఆర్కే టెలీషోపై కె.రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలకానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్‌లను హీరోలుగా పరిచయం చేశాను.. వారంతా ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. ‘సర్కారు నౌకరి’ తో పరిచయమవుతున్న ఆకాష్ కూడా వారిలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఆకాష్ ΄ాడగలిగినా నటనపై ఎక్కువ ఆసక్తి ఉండటంతో హీరోగా పరిచయవుతున్నాడు’’ అన్నారు సునీత. ‘‘నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం’’ అన్నారు గంగనమోని శేఖర్. ‘‘నాకు తొలి అవకాశాన్ని ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు’’ అన్నారు ఆకాష్. -
సర్కారు నౌకరికి డేట్ ఫిక్స్
ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. ఈ చిత్రంలో భావన హీరోయిన్. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆర్కే టెలీ షో పై దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘‘సర్కారు నౌకరి’ని కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఘనంగా విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, సహనిర్మాత: పరుచూరి గోపాలకృష్ణా రావు. -
మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్ ఆనంద్
లక్నో: బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి తన రాజకీయ వారుసుడిని ప్రకటించారు. ఆదివారం లక్నోలో బీఎస్పీ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ మినహా మిగతా దేశంలో తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ రాజకీయ వారసుడిగా కొనసాగుతారని ప్రకటించారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్, ఫలితాలపై చర్చించారు. అదే విధంగా 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆకాశ్ ఆనంద్.. మాయావతి పాత్ర పోషించనున్నారు. గత ఏడాడి నుంచి ఆకాశ్ ఆనంద్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాయావతి చిన్న తమ్ముడి కుమారుడు. 2016లో పార్టీలో జాయన్ అయిన ఆనంద్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీలో స్టార్ క్యాంపేయినర్‌గా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 2022లో ఆయన రాజస్థాన్‌లోని అల్వార్‌లో 13 కిలో మీటర్ల ‘స్వాభిమాన్ సంకల్ప్ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేశారు. 2018 రాజస్థాన్‌లో బీఎస్పీ గెలుచుకున్న 6 సీట్ల విజయం వెనకాల ఆనంద్.. కీలకమని పోల్ క్యాంపేయినింగ్ వ్యూహాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో వెనుకబడిన రమణ్ సింగ్! -
ముకేశ్ అంబానీ బాటలోనే..
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్ అందుకోను న్నారు.ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు) నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్‌ను ఆర్ఐఎల్ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్ అందుకున్నట్లు ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్ ఆర్ఐఎల్ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్ఐఎల్ పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు) -
ఆకాశమంత ఆశ
ఆశావాది కంటే బలవంతుడు ఎవరూ లేరు.ఆశ అనే విత్తనమే చెట్టు అనే విజయానికి మూలం.పర్యావరణ స్పృహకు సంబంధించిన విషయాలను ప్రచారం చేస్తున్న డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ ఆకాష్ రానిసన్కు సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండోర్‌కు చెందిన 28 సంవత్సరాల ఆకాష్ ‘గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్’ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాడు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ అనే పుస్తకం రాశాడు... ఎనిమిది సంవత్సరాల క్రితం... వాతావరణ మార్పులకు సంబంధించిన ఆర్టికల్స్ చదివిన ఆకాష్ అక్కడితో ఆగిపోలేదు. ఈ టాపిక్కు సంబంధించి ఎన్నో యూనివర్శిటీలలో ఎన్నో కోర్సులు చేశాడు. ఫలితంగా వాతావరణ మార్పుల గురించి లోతుగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది.తాను తెలుసుకున్న విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని గట్టిగా అనుకున్నాడు.ఆకాష్లో ఉన్న బలం... ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా, ఆకట్టుకునేలా చెప్పడం. ఆ ప్రతిభ ఇప్పుడు ఉపయోగపడింది. ‘క్లైమెట్ చేంజ్’కు సంబంధించిన విషయాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడానికి ఆర్ట్ ఇన్స్టాలేషన్లు, డాక్యుమెంటరీలు, సోషల్ మీడియా కంటెంట్... ఇలా ఎన్నో దారుల్లో పయనించాడు. తాజాగా ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ పుస్తకం రాశాడు.‘గత పదిసంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. రుచికరమైన తిండి కోసమో, అద్భుత నిర్మాణాలను చూడడానికో నేను వెళ్లలేదు. ప్రకృతిని చూసి పరవశించడం కోసం తిరిగాను. ప్రకృతి పట్ల మన ఆరాధన ప్రకృతిని రక్షించుకోవాలనే బలమైన ఆకాంక్షకు కారణం అవుతుంది. పర్యావరణ సంరక్షణ కోసం నా వంతుగా ఏంచేయగలను? అందుకు నాలో ఉన్న నైపుణ్యాలు ఏమిటి? అనే దాని గురించి ఆలోచించాను. నా వంతుగా చేయడానికి ఎన్నో దారులు కనిపించాయి. అది సోషల్ మీడియాలో పర్యావరణ సంరక్షణ ప్రచారం కావచ్చు, పుస్తకం రాయడం కావచ్చు’ అంటాడు ఆకాష్.పుస్తకం రాయడానికి ముందు ఆకాష్‌కు అర్థమైన విషయం ఏమంటే, పర్యావరణ సంరక్షణకు సంబంధించిన సమాచారం చాలా ఎక్కువగా ΄ాశ్చాత్యదేశాలకు సంబంధించే ఉంది. మన దేశంలోని వాతావరణ పరిస్థితులకు అది ఉపయోగపడదు. దీంతో దేశీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని రాశాడు. కర్బన ఉద్గారాల నుంచి క్లైమెట్ ఎమర్జెన్సీ వరకు ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో చర్చించాడు. ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ కోసం పర్యావరణవేత్తలు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లతో సంభాషించాడు.గతంలో ఎన్నో మంచి విషయాలు, పద్ధతులు ఉండేవి, అయితే అవి కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిని మళ్లీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది అంటాడు ఆకాష్.‘ఇప్పుడు అన్నం మిగిలింది అంటే చెత్తబుట్టలో వేయడమే అన్నట్లుగా ఉంది. ఒకప్పుడు అలా కాదు రకరకాల దినుసులు కలిపి, వేడి చేసి మిగిలిన అన్నాన్ని వృథా కాకుండా చేసేవాళ్లు. చపాతీల విషయంలోనూ ఇంతే. ఈ ఆన్లైన్ ఫుడ్కాలంలో చిటికెలో ఏదైనా తినగలుగుతున్నాం. అయితే వృథా అవుతున్న ఆహారంపై మాత్రం బొత్తిగా దృష్టి పెట్టడం లేదు. ఒకవైపు తిండి దొరకక ఆకలితో అల్లాడే మనుషులు, మరోవైపు ఆహార వృథా గురించి పట్టించుకోని మనుషులు. ఇదొక వైరుధ్యం’ అంటాడు ఆకాష్.ఒక్క ఆహార రంగం మాత్రమే కాదు టెక్ట్స్‌టైల్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో ఇండస్ట్రీలలో జరిగే వృథాను, పర్యావరణ చేటును కళ్లకు కడతాడు ఆకాష్.‘ఇక అంతా అయిపోయినట్లేనా...రానున్నది విలయ విధ్వంస కాలమేనా!’ అనే నిరాశవాదంలోకి ఎప్పుడూ వెళ్లడు. ఎందుకంటే మినిమలిస్ట్ లైఫ్ స్టైల్‌ను గడుపుతున్న ఆకాష్ తనను తాను ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ అని పరిచయం చేసుకుంటాడు. ‘మంచి పనుల ద్వారా మంచి కాలం వస్తుంది’ అని నమ్ముతాడు. -
కొత్త వాళ్లకి అవకాశాలు ఇవ్వండి
‘‘ఈ వేదికపై ఉన్న చాలా మంది నిర్మాతలు నా సినిమాలతో స్ఫూర్తి పొందామని చెబుతుండటం సంతోషం. మీరు పెద్ద సినిమాలు చేస్తున్నారు.. అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసి కొత్తవాళ్లకి చాన్స్ ఇస్తే ఇన్నేళ్లుగా నేను చేసిన ప్రయత్నానికి కొనసాగింపుగా ఉంటుంది’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు అన్నారు. ఆకాష్ , భావనా వళపండల్ జంటగా గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్కారు నౌకరి’. కె.రాఘవేంద్ర రావు నిర్మిస్తున్నారు. ఆర్కే టెలీఫిలింస్ స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘సర్కారు నౌకరి’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సురేశ్ బాబు, నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, గాయని సునీత తదితరులు పాల్గొన్నారు. -
ఆకాశ్‌కు బైజూస్ నోటీసులు
న్యూఢిల్లీ: ఒప్పందంలో భాగమైన షేర్ల మారి్పడి ప్రక్రియను వ్యతిరేకిస్తుండటంపై ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్విసెస్ (ఏఈఎస్ఎల్)కు ఎడ్టెక్ కంపెనీ బైజూస్ మాతృసంస్థ థింగ్ అండ్ లెర్న్ (టీఎల్‌పీఎల్) నోటీసులు పంపింది. వివరాల్లోకి వెడితే .. 2021లో ఏఈఎస్ఎల్ను బైజూస్ 940 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నగదు, షేర్ల మారి్పడి రూపంలోని ఈ డీల్ ప్రకారం ఏఈఎస్‌ఎల్‌లో టీఎల్పీఎల్కు 43 శాతం, దాని వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు 27 శాతం, ఏఈఎస్ఎల్ వ్యవస్థాపకుడు చౌదరి కుటుంబానికి 18 శాతం, బ్లాక్‌స్టోన్‌కు 12 శాతం వాటాలు దక్కాయి. ఒప్పందాన్ని బట్టి ఏఈఎస్ఎల్ను టీఎల్పీఎల్లో విలీనం చేయాలి. అయితే, విలీన ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో షేర్ల మార్పిడిని అమలు చేయాలని కోరుతూ చౌదరి కుటుంబానికి టీఎల్‌పీఎల్ నోటీసులు ఇచి్చంది. కానీ మైనారిటీ షేర్హోల్డర్లు ఇందుకు నిరాకరించినట్లు సమాచారం. షేర్ల మారి్పడి ప్రక్రియలో పన్నులపరమైన అంశాలు ఉన్నందున.. దానికి బదులుగా పూర్తిగా నగదే తీసుకోవాలని చౌదరి కుటుంబం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆకాశ్ ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ. 3,000 కోట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. -
ఐఏఎస్ ఆకాశ్‌పై భార్య వందన ఫిర్యాదు
కర్ణాటక: భర్త, అతని కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఓ మహిళ బెంగళూరు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త ఆషామాషా వ్యక్తి కాదు, ఓ ఐఏఎస్ అధికారి. అప్పట్లో సివిల్స్‌లో దేశంలో వంద లోపు ర్యాంకు తెచ్చుకుని మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ ఏం లాభం.. భార్యను వేధించి అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. కొడగు జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న ఆకాశ్ శంకర్‌పై ఆయన భార్య డాక్టర్ వందన ఈ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘనంగా పెళ్లి చేసినా.. రిటైర్డు ఐపీఎస్ టీఆర్ సురేశ్ కుమార్తె డాక్టర్ వందనకు గత ఏడాది జూన్‌లో ఆకాశ్ శంకర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో బాగా కట్న కానుకలు సమర్పించారు. కానీ మళ్లీ డబ్బు బంగారం , విలువైన కానుకలు తేవాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నట్లు వందన గత మార్చిలో ఆరోపించారు. అప్పటినుంచి దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. హేళనగా ప్రచారం ఇటీవల ఆకాశ్ శంకర్ సోదరుడు వికాస్ శంకర్, ఆతని భార్య చేతన, ఐసిరి శివకుమార్ అనేవారు వందన గురించి హేళనగా మాట్లాడి ఆ వీడియోలను ఆమె స్నేహితులకు పంపారు. ట్రాఫికింగ్ ఆఫ్ ఖాకీస్ డాటర్, ట్రాఫికర్ డాక్టర్ వందన అని తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. వందన కుంటుబం గురించి ఇంటర్నెట్లో అగౌరవంగా రాతలు రాసినట్లు ఆమె వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
హీరోగా సింగర్ సునీత తనయుడు
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా భావనా వళపండల్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఆర్కే టెలీ షో బ్యానర్‌పై దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుని పటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా, కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. మ్యాంగో మీడియా అధినేత, సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన సీన్‌కి గాయని సునీత కెమెరా స్విచ్చాన్ చేయగా, రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వడంతో ΄ాటు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, నిర్మాణం: ఆర్కే టెలీషో ప్రైవేట్ లిమిటెడ్, కెమెరా, రచన, దర్శకత్వం: గంగనమోని శేఖర్. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత కొడుకు.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందంలోనూ హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌కి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. ఇదిలా ఉండగా త్వరలోనే ఆమె కొడుకు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగానే సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే.. తమ పిల్లలను హీరో, హీరోయిన్స్‌గా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ఇప్పటికే కూతురు శ్రియాను సింగర్‌గా పరిచయం చేసిన సునీత కొడుకును మాత్రం హీరోగా వెండితెరపై చూడాలని కలలు కంటుందట. ఇదే విషయాన్ని సునీత కూడా కన్ఫర్మ్ చేసేసింది. ఆకాష్ బర్త్‌డే సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపిన సునీత.. నిన్ను మంచి నటుడిగా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో ఆకాష్‌కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మరి ఆకాష్ ఏ సినిమాలో నటిస్తున్నారు? డైరెక్టర్ ఎవరన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
నవంబర్‌లో ఆకాష్ టాలెంట్ హంట్– 2022
లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది నిరుపేదలు, బాలికలకు ఉచితంగా జేఈఈ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు నవంబర్‌లో ఆకాష్ బైజూస్ జాతీయ టాలెంట్ హంట్ పరీక్ష–2022 (అంతే 2022) నిర్వహించనున్నట్లు ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గుదే సంజయ్‌గాంధీ తెలిపారు. ఆ పరీక్షకు సంబంధించి పోస్టర్‌ను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్‌గాంధీ మాట్లాడుతూ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా అందించే స్కాలర్‌షిప్‌లకు అదనంగా ఇవి అందించనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణకు అర్హులను ఎంపిక చేసేందుకు నవంబర్ 5 నుంచి 13 వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో ఎంపిక చేసిన తేదీల్లో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు ఏదైనా సమయంలో ఒక గంట పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆఫ్‌లైన్ పరీక్షను ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలో 90 మార్కులు ఉంటాయని, 35 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయన్నారు. దేశ వ్యాప్తంగా 285 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా బిజినెస్ హెడ్ రవికిరణ్ ఏర్పుల, బ్రాంచి మేనేజర్ జి.గోపీనాథ్‌లు పాల్గొన్నారు. (క్లిక్: పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం.. అధికారులతో సీఎం జగన్) -
ప్రియాంక ఫొటోను ఏకంగా వీపుపై టాటూ వేసుకున్న సింగర్
సినీ సెలబ్రెటీలకు వీపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తమకు ఇష్టమైన నటీనటులపై ఫ్యాన్స్ వివిధ రకాలుగా అభిమానం చూపిస్తుంటారు. వారి పేర్లను పెట్టుకోవడం, వారి ఫొటోలను ఇంట్లో పెట్టుకుని మురిసిపోతుంటారు. మరికొందరైతే ఏకంగా వారి పేర్లను టాటూ వేసుకుంటారు. సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్ల పేర్లను పచ్చబొట్టు వేయించుకున్న సందర్భాలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ వారికి సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీల్లో సైతం ఫ్యాన్స్ ఉంటారు. చదవండి: ఛీ, భర్త చనిపోయినా ఎంజాయ్ చేస్తోంది.. నీతూ కపూర్‌పై ట్రోలింగ్ గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు సాధారణ ప్రజల్లోనే కాదు సెలబ్రిటీల్లో సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమెరికాకు చెందిన ఓ సింగర్ ప్రియాంకకు వీరాభిమాని. తాజాగా అతడు ప్రియాంకపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. సింగర్, ర్యాపర్ ఆకాశ్ ఆహుజా ఆమె ముఖ చిత్రాన్ని టాటూగా వేసుకున్నాడు. ఇప్పటికే ప్రియాంక పేరును తన వీపుపై పచ్చబొట్టు వేసుకున్న ఆకాశ్ అక్కడితో ఆగకుండా ఇటీవల తన ఫోటోను సైతం వేయించుకోవడం విశేషం. చదవండి: ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ను ఓటీటీలో చూడాలంటే డబ్బు చెల్లించాలా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆకాశ్ తన వీపు పూర్తి భాగంలో ప్రియాంక ముఖచిత్రాన్ని టాటూ వేసుకుంటున్నాడు. దానికి పైన ప్రియాంక అనే పేరు కూడా రాసి ఉంది. ఇదిలా ఉంటే ‘ప్రియాంక..’ అంటూ ఆకాశ్ ఇటీవల పాడిన పాటను తన ఫేవరెట్ హీరోయిన్‌కే అంకితమిచ్చాడు. ఇప్పుడు అదే పాట ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పిచ్చి ముదిరిందని కొందరు ఆకాశ్‌పై విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అతడికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Akash Ahuja (@akashlife) -
Kidambi Srikanth: సెమీఫైనల్లో శ్రీకాంత్
Kidambi Srikanth: హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–11, 12–21, 21–19తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడతాడు. ఆకాశ్‌కు కాంస్యం బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. 54 కేజీల విభాగం సెమీఫైనల్లో 21 ఏళ్ల ఆకాశ్ 0–5తో మక్మూద్ సబీర్‌ఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన ఆకాశ్‌కు 25 వేల డాలర్ల (రూ. 18 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హరియాణాలోని భివాని జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన ఏడో భారత బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధూరి (2017), మనీశ్ కౌశిక్ (2019) కాంస్యాలు నెగ్గగా... అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించాడు. -
భారత చెస్ 66వ గ్రాండ్‌మాస్టర్ ఆకాశ్
చెన్నై: భారత చెస్‌లో మరో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అవతరించాడు. తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల జి.ఆకాశ్ భారత్ తరఫున 66వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) కౌన్సిల్ సమావేశంలో ఆకాశ్‌కు అధికారికంగా జీఎం హోదా ఖరారు చేశారు. 2012లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన ఆకాశ్ 2014లో ఇంజినీరింగ్ విద్య కోసం చెస్ నుంచి నాలుగేళ్లపాటు విరామం తీసుకున్నాడు. 2018లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెస్‌లో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం 2495 ఎలో రేటింగ్ కలిగిన ఆకాశ్ నాలుగు జీఎం నార్మ్‌లను సంపాదించి గ్రాండ్‌మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు. ‘భారత్ నుంచి జీఎం జాబితాలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇదెంతో ప్రత్యేకం. మున్ముందు మరింత కష్టపడి నా ఎలో రేటింగ్‌ను 2600కు పెంచుకుంటాను’ అని ఆకాశ్ అన్నాడు. -
ఇస్మార్ట్... కాన్సెప్ట్ నాదే!
‘‘ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్చే కాన్సెప్ట్‌తో తెలుగు–తమిళ భాషల్లో లేడీ డైరెక్టర్ రాధ నాతో సినిమా తీశారు. ‘నాన్ యార్’ పేరుతో తమిళ చిత్రం విడుదల కాగా, ‘కొత్తగా ఉన్నాడు’ పేరుతో త్వరలో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈలోపు ఇలాంటి మూలకథతో ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ కావడం మాకు షాక్ తగిలినట్లయింది’’ అని ‘ఆనందం’ ఫేమ్ ఆకాష్ అన్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం పాత్రికేయులతో ఆకాష్ మాట్లాడుతూ – ‘‘పూరి జగన్నాథ్‌ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. అందుకే తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసి, ఇక్కడ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కాకపోతే చట్టాన్ని ఆశ్రయించాలనుకుంటున్నాను’’ అన్నారు. -
కంచిలో విషాదం
సాక్షి, చెన్నై: కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి ఆలయం వద్ద మహిళా పోలీస్ దాడి చేయడంతో రాజమండ్రికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలవగా.. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి దర్శన మహోత్సవం కనులపండువగా సాగుతోంది. స్వామి దర్శనం కోసం రాజమండ్రికి చెందిన శక్తి ఆకాశ్ అనే యువకుడు తల్లి నాగేశ్వరితో కలిసి సోమవారం కాంచీపురం వెళ్లాడు. బుధవారం వరదరాజ స్వామిని దర్శంచుకున్న తర్వాత శక్తి ఆకాశ్ ఆలయంలో ఉన్న మూలవిరాట్ విగ్రహాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన మహిళా పోలీస్ అడ్డుకుని లాఠీతో అతడి తలపై బలంగా కొట్టింది. దీంతో ఆకాశ్ స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసుల తీరుతో ఆటోడ్రైవర్ ఆత్మాహుతి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో కాంచీపురంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కాంచీపురం కరుసపేటకు చెందిన కుమార్ అనే ఆటో డ్రైవర్ పాస్ తీసుకుని భక్తులను ఆలయానికి తరలిస్తున్నాడు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆటోను ఆలయం వద్దకు అనుమతించలేదు. దీంతో పోలీసులకు, ఆటోడ్రైవర్ కుమార్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కుమార్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందాడు. అతడు మంటల్లో కాలిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. -
ఎవరినీ ఉపేక్షించం
న్యూఢిల్లీ: బీజేపీ నేతలెవరైనా సరే అహంకారపూరితంగా, అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ కొడుకు, ఎమ్మెల్యే ఆకాశ్ వర్గీయ ఇటీవల ఓ ప్రభుత్వ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రధాని ఈ హెచ్చరికలు చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘అతడు ఎవరి కొడుకైనా సరే అటువంటి వారి అహంకారపూరిత, దుష్ప్రవర్తనను సహించేది లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే ఊరుకోబోం. కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఆకాశ్ జైలు నుంచి విడుదలైనపుడు హడావుడి చేసిన నేతలపై బీజేపీ గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో ఆకాశ్ తండ్రి కైలాశ్ సమావేశంలోనే ఉండటం గమనార్హం. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో లోక్‌సభలో పార్టీ సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండటంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ప్రజలకు గుర్తుండేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బీజేపీ సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారణాసి నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలో కనీసం ఐదు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ‘పంచవటి’గా పేర్కొన్నారు. శ్రీ సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో 14 ఏళ్లపాటు పర్ణశాలలో నివసించిన విషయం తెలిసిందే. ఎంపీలతో ప్రధాని వరుస సమావేశాలు బీజేపీ ఎంపీలతో మోదీ తన నివాసంలో ఈ వారం వరుస సమావేశాలు జరపనున్నారు. ఎంపీలను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, యువత తదితర గ్రూపులుగా విభజించి వేర్వేరుగా మాట్లాడతారు. పార్లమెంట్‌తో వివిధ అంశాలపై ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడమే ఈ భేటీల ఉద్దేశం. -
బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌పై ప్రధాని మోదీ మండిపాటు
-
ఎవరి కొడుకైతే ఏంటి?.. అతన్ని పీకేయండి!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్వార్గియా ప్రభుత్వ అధికారిని బ్యాటుతో చితకబాదిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారం మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన ఈ దాడి ఆయన ఖండించారు. న్యూఢిల్లీలో మంగళవారం ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయిన మోదీ ఈ దాడిపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అతను ఎవరి కొడుకైతే ఏంటి...? అలా ప్రవర్తించడం మాత్రం సబబు కాదు’ అంటూ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ అధికారిపై పట్టపగలు దాడి చేసి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆకాశ్.. బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియా కొడుకు కావడం గమనార్హం. క్రమశిక్షణారాహిత్యంతో ప్రవర్తించడం ఎంత తప్పో, దాన్ని ప్రోత్సహించడం కూడా అంతే తప్పని.. అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మోదీ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఆకాశ్ విజయ్వార్గియాతోపాటు అతనికి అండగా నిలిచిన వారిని సైతం పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. అంతేకాకుండా ఆకాశ్ బెయిల్‌పై విడుదలైన సందర్భంగా అతనికి స్వాగతం చెప్పేందుకు వెళ్లిన వారిని, ఈ సందర్భంగా గాలిలో కాల్పులు జరిపిన వారిని కూడా పార్టీకి దూరంగా ఉంచాలని, అలాంటివారిని పార్టీ సహించబోదని పేర్కొన్నారు. ఇండోర్ మున్సిపల్ అధికారి దీరేంద్ర సింగ్ భాయ్ విధి నిర్వహణలో ఉన్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్వార్గియా క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. తన దుందుడుకు చర్యతో విమర్శలపాలైన ఆకాశ్ ఇండోర్-3 అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
యూపీలో చర్చనీయాంశంగా మారిన ఆకాశ్ అనంద్
-
గోల్‌కీపర్ ఆకాశ్ చిక్టేపై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న భారత క్రీడాకారులపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సస్పెన్షన్ వేటు వేసింది. భారత హాకీ గోల్ కీపర్ ఆకాశ్ చిక్టేపై రెండేళ్లు, రెజ్లర్ అమిత్, కబడ్డీ ప్లేయర్ ప్రదీప్ కుమార్, వెయిట్‌లిఫ్టర్ నారాయణ్ సింగ్, అథ్లెట్స్ సౌరభ్ సింగ్, బల్జీత్ కౌర్, సిమర్జిత్ కౌర్‌లపై నాలుగేళ్ల నిషేధం విధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో నిర్వహించిన శిక్షణ శిబిరం సందర్భంగా చిక్టే రక్త,మూత్ర నమూనాల్ని పరీక్షించారు. ఇందులో నిషిద్ధ ఉత్ప్రేరకాలైన అనబాలిక్ స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలింది. అయితే అతను కావాలని దీన్ని తీసుకోలేదని కాలికి దెబ్బతగలడంతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో మెడిసిన్ ద్వారా తీసుకున్నట్లు చెప్పారు. దీంతో అతనికి కేవలం రెండేళ్ల నిషేధంతోనే సరిపెట్టగా... మిగతా ఆరుగురు మాత్రం ఎప్పుడు, ఎందుకు తీసుకున్నారో వెల్లడించకపోవడంతో నాలుగేళ్లు నిషేధించారు. అయితే దీనిపై అప్పీలు చేసుకునేందుకు ఆటగాళ్లకు అవకాశముంది. 2016 ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టుకు ఆకాశ్ గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. -
ఆకాశ్‌కు రజతం
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంచనాలకు మించి రాణించిన భారత క్రీడాకారులు యూత్ ఒలింపిక్స్‌లో తమ పోరాటాన్ని రజత పతకంతో ముగించారు. పోటీల చివరిరోజు భారత్‌కు పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ఆకాశ్ మలిక్ రజతాన్ని అందించాడు. హరియాణాకు చెందిన 15 ఏళ్ల ఆకాశ్ ఫైనల్లో 0–6తో ట్రెన్టన్ కౌలెస్ (అమెరికా) చేతిల ఓడిపోయాడు. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి 13 పతకాలు సాధించి 17వ స్థానంలో నిలిచింది. 2010 క్రీడల్లో భారత్ 8 పతకాలతో 58వ స్థానంలో... 2014 క్రీడల్లో రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. 2022 యూత్ ఒలింపిక్స్ సెనెగల్‌లో జరుగుతాయి. -
‘సాక్షి’ ఈ సీక్రెట్లన్నీ బ్రేక్ చేసింది!!
రెహమాన్.. రెహమాన్ సిస్టర్ కేటీఆర్.. కేటీఆర్ సిస్టర్ వరుణ్ తేజ్.. వరుణ్ తేజ్ సిస్టర్ ఆకాశ్.. ఆకాశ్ సిస్టర్ నలుగురు సిస్టర్స్ కట్టిన నాలుగు రాఖీలివి! నలుగురు బ్రదర్స్ ‘అనురాగ బంధన్’ లివి! అల్లరికి అనుపల్లవి.. చెల్లెలు. చెల్లెలి హరివిల్లు.. అన్నయ్య. ఎక్కడైనా ఇంతే కదా. కొత్త ఉందా ఇక్కడేమైనా?! ఎస్.. ఉంది. రెహమాన్ అంటే మ్యూజిక్కే కదా? ప్రేమను పంచే మ్యాజిక్ కూడా ఉందట! కేటీఆర్ అంటే... ఐటీ స్టార్ కదా? పిల్లల మధ్య ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ అట! వరుణ్ తేజ్ అంటే.. ఆరడుగులు కదా? ఆటపట్టిస్తే ఇప్పటికీ చిన్నపిల్లాడేనట! ఆకాశ్ అంటే.. పోరడు కదా? చెల్లి విషయంలో పెద్దోడు అట! చెల్లెళ్లనడిగి.. ‘సాక్షి’ ఈ సీక్రెట్లన్నీ బ్రేక్ చేసింది. ‘రాఖి’ంగ్ ఇంటర్వ్యూలు చేసుకొచ్చింది. తమ్ముడు కాదు నాన్న రాఖీ దక్షిణాది సంప్రదాయం కాకపోయినా మెల్లిగా మనం అడాప్ట్ చేసుకున్నాం. కుల, మతాలకు అతీతంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అక్కాతమ్ముళ్ల (రైహానా, ఏఆర్ రెహమాన్) అనుబంధం గురించి తెలుసుకోవాలని ఉంది... రైహానా: మేం ఎప్పుడూ రాఖీ పండగ చేసుకోలేదు. తమ్ముడికి రాఖీ కట్టింది లేదు. అయితే ‘నీకు ఎప్పుడూ తోడుగా నేను ఉన్నా’ అని చెప్పే పండగ కాబట్టి మాకు తోడుగా ఉన్న మా తమ్ముడి గురించి ఇష్టంగా మాట్లాడాలని ఉంది. తమ్ముడు అనేకంటే రెహమాన్‌ని ‘మా నాన్న’ అంటే బాగుంటుందేమో. తమ్ముడు ఎంతో బాధ్యతగా ఉంటేనే ‘నాన్న’ అనాలనిపిస్తుంది. మీ తోడబుట్టినవాళ్లు ఎంతమంది? నేను పెద్దదాన్ని. నాకు, రెహమాన్‌కి ఒక ఏడాది తేడా. ఆ తర్వాత ఇద్దరు చెల్లెళ్లు. ఒక చెల్లెలు నాకన్నా తొమ్మిదేళ్లు, మరో చెల్లెలు ఐదేళ్లు చిన్న. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆయన పోయాక మాకు ‘బ్రెడ్ అండ్ బటర్’ ఇచ్చింది మా తమ్ముడే. అందుకే ‘నాన్న’ అన్నాను. తోడబుట్టినవాడు ఇలా ఉంటే ఆ అక్కాచెల్లెళ్లు ఎంత ‘ప్రొటెక్టివ్’గా ఫీలవుతారో మాటల్లో చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు రెహమాన్‌గారికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనివ్వడానికి మీ అమ్మగారు నగలు అమ్మేవారట. అది నిజమే. రెహమాన్‌కి మార్కెట్లో ఏ కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా కొనుక్కోవాలని ఉండేది. అది కావాల్సిందే అని మొండి పట్టు పట్టేవాడు. రెండు మూడు రోజులు అన్నం కూడా మానేసేవాడు. చివరికి అమ్మ నగలు అమ్మి కొనిచ్చేది. రెహమాన్ కూడా చాలా బాధ్యతగా ఉండేవాడు. దాని మీద బాగా ప్రాక్టీస్ చేసేవాడు. టీనేజ్లోనే మీ తమ్ముడు సంపాదించడం మొదలుపెట్టారు. అప్పుడు తనకోసం ఏమైనా దాచుకునేవారా? 14, 15 ఏళ్ల వయసుప్పుడే సంపాదన మొదలైపోయింది. దాదాపు ఖాళీగా ఉండేవాడు కాదు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసేవాడు. రోజుకి వెయ్యి రూపాయలు దాకా వచ్చేవి. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అమ్మకిచ్చేసేవాడు. ఆ తర్వాత లెక్కలు కూడా అడిగేవాడు కాదు. ఓ రెండు మూడేళ్ల క్రితం వరకూ అంతే. ఇప్పుడు మా మరదలు (రెహమాన్ భార్య) చూసుకుంటోంది. ఇప్పుడు రెహమాన్‌గారు గంభీరంగా కనిపిస్తారు. చిన్నప్పుడు తన సిస్టర్స్‌తో ఎలా ఉండేవారు? నాకు, తనకీ వయసు వ్యత్యాసం ఏడాదే కాబట్టి మేం ఇద్దరం ఎక్కువగా ఆడుకునేవాళ్లం. క్యారమ్స్ బాగా ఆడేవాళ్లం. పిల్లలందరిలానే గొడవలు పడేవాళ్లం. అయితే జీవితం తెలిసే కొద్దీ ఆ అల్లరంతా పోయింది. అయితే చిన్నప్పటి నుంచి కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండేవాడు. మెల్లిగా రెహమాన్ బ్యూటిఫుల్ పర్సన్‌గా మారడం చూశాను. రాను రాను డివైన్ పర్సన్‌ని చూస్తున్నాను. ప్రతిరోజు తన లైఫ్‌ని చూసి ఏదోటి నేర్చుకోవచ్చు. తన ఫోకస్ అమేజింగ్. మీ తమ్ముడు సంగీతదర్శకుడిగా ఈ స్థాయిలో పేరు తెచ్చుకుంటారని ఊహించారా? ఒకవేళ ఊహిస్తే దానికి కారణం ఏంటి? తమిళనాడులో మంచి పేరు తెచ్చుకుంటాడనుకున్నాను. ఒక్కోసారి ఇండియాలో బాగా పాపులర్ అవుతాడనుకునేదాన్ని. కానీ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటాడని మాత్రం ఊహించలేదు. రెహమాన్ బాగా పైకొస్తాడని నేను ఎందుకు నమ్మానంటే.. అప్పట్లో తను క్రియేట్ చేసిన మ్యూజిక్ నేనెక్కడా వినలేదు. ఆ ట్యూన్స్ నాకు కొత్తగా అనిపించేవి. వినసొంపుగా ఉండేవి. నేరుగా హృదయాన్ని తాకినట్లుగా అనిపించేది. హిందూ మతం నుంచి ముస్లిమ్ మతానికి మారాలని రెహమాన్‌గారు అనుకున్నాక మీ అందరూ కూడా మారడం మీ యూనిటీని తెలియజేస్తోంది... యాక్చువల్‌గా మా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మగారిని ‘సూఫిజమ్’ చాలా ప్రభావితం చేసింది. రెహమాన్ కూడా ప్రభావితుడయ్యాడు. ఆ భగవంతుడి నుంచి వాళ్లకు ఓ పిలుపు అందింది. దాంతో మారారు. అయితే నేను మాత్రం ఆ తర్వాత ఎప్పటికో దేవుడి నుంచి కబురు వచ్చిందనే భావన కలిగినప్పుడు మాత్రమే మారాను. ‘నేను మారాను. నువ్వు మారాలి’ అని రెహమాన్ ఎప్పుడూ అనలేదు. నా జర్నీలో నాకెదురైన అనుభవాలే మార్పుకి కారణం అయ్యాయి. మీరు గాయనిగా, సంగీతదర్శకురాలిగా ఉన్నారు. ఈ జర్నీకి రెహమాన్‌గారి సాయం ఎంతవరకూ ఉంది? తన హెల్ప్ ఉంది. ముందు కోరస్ పాడించేవాడు. ఆ తర్వాత గాయనిగా అవకాశం ఇచ్చాడు. అలాగే తను చేసే మ్యూజికల్ షోస్‌కి తీసుకెళుతుంటాడు. అయితే యూస్, ఇతర విదేశాల్లో జరిగినప్పుడు వెళ్లను. నా అంతట నేను విదేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తుంటాను. తమ్ముడు ఉన్నాడు కదా.. చూసుకుంటాడులే అనుకోకుండా నేను కీబోర్డ్ , గిటార్, డ్రమ్స్.. ఇలా అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ‘ఏండా తలైల ఎన్న వెక్కలే’ అనే సినిమా కూడా నిర్మించాను. మీ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్స్‌లో మీరు మరచిపోలేనిది? డబుల్ క్యాసెట్ టేప్ రికార్డర్. అది కొనిచ్చినప్పుడు రెహమాన్ వయసు 21. చెన్నైలో బర్మా బజార్ ఫేమస్. అక్కడికివెళ్లి కొనుక్కొచ్చాడు. ఆ టేప్ రికార్డర్లో బోలెడన్ని పాటలు విన్నాను. నేను పాడుతూ రికార్డ్ చేసేదాన్ని. మిగతా ఇద్దరి చెల్లెళ్లకు ఓ దారి చూపించారా? వాస్తవానికి క్యాసెట్స్ అమ్మకం జోరుగా ఉన్నప్పుడు నాకు క్యాసెట్ బిజినెస్ అప్పజెప్పాడు. క్యాసెట్స్ పోయి సీడీలు వచ్చాక మానేశాం. ఆ తర్వాత నేను నా వర్క్‌తో బిజీ అయ్యాను. నా రెండో చెల్లెలు రెహమాన్ మ్యూజిక్ కాలేజీ చూసుకుంటోంది. ఇంకో చెల్లెలు ప్లేబ్యాక్ సింగర్. రెహమాన్ ట్యూన్స్‌కి, బయటవాళ్లకు పాడుతుంటుంది. మీ అబ్బాయి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతదర్శకుడిగా సక్సెస్ అవ్వడంతో పాటు హీరోగానూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. మేనమామ హెల్ప్ ఉందా? చిన్నప్పుడు పక్కనే కూర్చోబెట్టుకొని కీ బోర్డ్ ప్రాక్టీస్ చేయించేవాడు. అలా రెహమాన్ తనని గైడ్ చేసేవాడు. ఐదారేళ్ల వయసప్పుడే రెహమాన్ ట్యూన్‌కి జీవీ పాడాడు. ‘జెంటిల్‌మేన్’ సినిమాలో ‘చికు బుకు చికు రైలే’ చిన్నపిల్లాడి గొంతు జీవీదే. అలాగే ‘బొంబాయి’లో ‘కుచ్చి కుచ్చి కూనమ్మా’ పాడాడు. పెద్దయ్యాక కూడా పాడాడు. ఆ తర్వాత వేరే మ్యూజిక్ డైరెక్టర్స్‌కి కూడా పాడటం మొదలుపెట్టాడు. ఫైనల్లీ తన మేనమామలా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అంతవరకూ సక్సెస్ అవుతాడనుకున్నాను. హీరోగా మాత్రం నేనూహించలేదు. అయితే జీవీకి అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంది. హీరోగానూ సక్సెస్‌ఫుల్‌గా వెళుతున్నాడు. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లను రెహమాన్‌గారు గ్రాండ్‌గా చేశారా? బావగార్లతో ఎలా ఉంటారు? మా పెళ్లిళ్లకు హాజరైన ప్రతి ఒక్కరూ ‘చాలా ఘనంగా చేశారు’ అన్నారు. నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటా. బావగార్లతో రెహమాన్ రాసుకుని పూసుకుని ఉండడు. మాట్లాడే నాలుగు మాటలు బాగా మాట్లాడతాడు. ఎక్కువగా దైవత్వం గురించి మాట్లాడతాడు. అసలు మీ అందరికీ టైమ్ కేటాయించేంత తీరిక మీ తమ్ముడికి ఉంటుందా? అమ్మని బాగా చూసుకునే మంచి కొడుకు అనిపిస్తోంది.. ఎప్పుడూ బిజీ. రోజూ ఫోన్ చేసుకోవడం లాంటివి ఉండవు. ‘తిన్నారా? ఏం చేస్తున్నారు’ అనేవి అడక్కపోయినా ఓవరాల్‌గా మా అందరికీ ఏం కావాలో అవన్నీ చూసుసుంటూ ఉంటాడు. అంతకు మించి ఏం కావాలి? ఇక అమ్మ విషయానికొస్తే.. బిజీగా ఉంటాడు కాబట్టి రోజూ కలవలేడు. అమ్మ నాతోనే ఉంటుంది. తమ్ముడు ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకుంటాడు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేదంటే మంచి మంచి డాక్టర్స్‌తో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే మా అందరి విషయంలో ‘హీ ఈజ్ వెరీ కేరింగ్’. అంతా బాగానే ఉంది.. గూగుల్‌లో ఎంత వెతికినా పెద్దయ్యాక మీరంతా దిగిన ఒక్క ఫ్యామిలీ ఫొటో కూడా లేదేంటి? దానికి కారణం ఉంది. ఒకసారి మేమంతా కలసి ఓ గ్రూప్ ఫొటో దిగాం. ఆ తర్వాత ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటినుంచి దిగడం మానేశాం. ఇది మా తమ్ముడి సెంటిమెంట్. అందుకే చిన్నప్పుడు మేం దిగిన ఫొటోలు ఉంటాయోమో కానీ పెద్దయ్యాక మా ఫొటోలు ఉండవు. ఫైనల్లీ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు ఏదైనా సలహా ఇస్తారా? ‘నాకిది చేయలేదు. నాతో ఇలా ఉండలేదు’ అని కంప్లైంట్ చేయకూడని బంధం ఇది. ఒకరి మంచిని మరొకరు కోరుకోవాలి. ఒకరి నుంచి ఒకరు ఏమీ ఆశించకూడదు. నేను మాత్రమే కాదు.. నా తోడబుట్టినవాళ్లు బాగుండాలని కోరుకోవాల్సిన బంధం ఇది. అక్కాచెల్లెళ్లకు అన్నతమ్ముళ్లు భరోసాగా నిలవాల్సిన బంధం ఇది. మా జీవితంలో ఈ బంధం చాలా పటిష్టంగా ఉంది. అక్కాచెల్లెళ్లందరికీ అది దక్కాలని కోరుకుంటున్నాను. రెహమాన్‌గారి విజయానికి కారణాలేంటి? ఫ్యూర్లీ తన టాలెంట్. వర్క్ మీద తనకున్న ఫోకస్. మ్యూజిక్ మినహా వేరే దేని మీదా దృష్టి ఉండదు. ఎప్పుడూ వినయంగా ఉంటాడు. నా తమ్ముడి సక్సెస్‌కి ప్రతిభ, పని మీద ఏకాగ్రత, వినయం.. వీటికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయి. ఫాదర్ ఫిగర్ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని తెలిపే రాఖిలాంటి పండగ బహుశా మనకే సొంతమేమో! నాకు తెలిసీ ప్రపంచంలో ఇలాంటి కల్చర్ ఇంకా ఎక్కడా లేదనుకుంటా. మన దేశంలో ఈ రాఖి అంటే తెలియని వాళ్లుండరేమో. మేమూ ఈ కాన్సెప్ట్‌లోనే పెరిగాం. బ్రదర్ అంటే మన దగ్గర అమ్మాయిలకు ఫాదర్ ఫిగరే. ఎస్పెషల్లీ ఎల్డర్ బ్రదర్. నాక్కూడా అంతే. రామన్న (కేటీఆర్) ఫాదర్ ఫిగరే. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్ లైక్ మై ఫాదర్. పైగా మా నాన్న ఎప్పుడూ బిజీయే కాబట్టి, రామన్ననే ఆయన ప్లేస్ తీసుకున్నాడు. ప్రతీదీ ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి. ఇష్టాఇష్టాల నుంచి చదువు, కెరీర్ వరకు.. అన్నీ! ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి.. ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లడం వరకు అన్నీ రామన్నతో డిస్కస్ చేశాను. అయితే డెసిషన్ విషయంలో నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. ఉంటుంది కూడా. ఏది మంచి ఏది చెడు జడ్జ్ చేస్తాడు కాని నిర్ణయం నన్నే తీసుకోమంటాడు. బోరింగ్ బ్రదర్ అండ్ బోరింగ్ సిస్టర్ రామన్న నాకన్నా మూడేళ్లు పెద్ద. మోర్ లైక్ ఫ్రెండ్స్‌లాగే ఉంటాం. నిజం చెప్పాలంటే మేమిద్దరం బోరింగ్ బ్రదర్ అండ్ సిస్టర్. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ గొడవపడలేదు. ఒక వస్తువునే ఇద్దరం కావాలని పట్టుపడలేదు. దేని కోసం డిమాండ్ కూడా లేదు. అలాగే క్వశ్చనింగ్ కూడా లేదు. రామన్న ఏది చెబితే అది చేయడమే. అయితే పెళ్లయి వెళ్లిపోతుంటే ‘‘హమ్మయ్య ఈ గయ్యాళి వెళ్లిపోతుంది’’ అని మాత్రం అనుకుని ఉంటాడు (నవ్వుతూ). ‘‘మీ ఆయన్ని సతాయించకు’’అని చెప్పాడు. తన కూతురు అలేఖ్య అచ్చం నా పోలికే అని చెప్తుంటాడు. ‘‘నీలాగే గయ్యాళి’’ అంటుంటాడు (నవ్వుతూ). రామన్న ఉన్నాడు అనే ధీమానే రాఖీ కడితే గిఫ్ట్స్ లాంటి సీనేం ఉండదు పెద్దగా. చిన్నప్పుడు అమ్మో, నాన్నో.. రామన్న జేబులో డబ్బులు పెడితే.. నేను రాఖీ కట్టగానే అవి నాకు ఇచ్చేవాడు. ఇప్పుడు అయితే రాఖీ కన్నా నా ప్రతి బర్త్‌డేకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటాడు. పిల్లల బర్త్‌డేలకు కూడా. రామన్న నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంటే.. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా.. రామన్న ఉన్నాడు అన్న ధీమానే. నా లైఫ్‌లో నేను మరిచిపోలేనిది అంటే.. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు.. రామన్న నా దగ్గర ఉండడం. అప్పుడు మేం యూఎస్‌లో ఉన్నాం. వాడు పుట్టగానే వాడిని చేతుల్లోకి తీసుకున్నాడు. రామన్నకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలతో చాలా సరదాగా ఉంటాడు. వాళ్లతో బాగా ఆడ్తాడు. మా బర్త్‌డేలకు, పిల్లల బర్త్‌డేలకు తప్పకుండా కలుసుకుంటాం. నేను రామన్నకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ లాస్ట్ ఇయర్ ఆయన బర్త్‌డే రోజు మొదలుపెట్టిన గిఫ్ట్ ఎ హెల్మెట్ చాలెంజ్. ఎవ్రీ ఇయర్ రామన్న బర్త్‌డేకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటా. బట్ లాస్ట్ ఇయర్ ఆయనకే తెలియకుండా సర్ప్రైజింగ్ ఆయన బర్త్ డే రోజు వెళ్లి హెల్మెట్ ప్రెజెంట్ చేశాను. ఆ చాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ రోజు కూడా హెల్మెట్ ఇస్తాను. నేను స్టార్ట్ చేసిన ఈ చాలెంజ్ రెస్పాన్స్ చాలా బాగుంది. హెల్మెట్ పెట్టుకోవడం మీద అవేర్నెస్ వచ్చేంత వరకు ప్రతియేడు రామన్న బర్త్‌డే నుంచి రాఖీ వరకు ఈ క్యాంపెయిన్ చేస్తూనే ఉంటాను. చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు.. ఇద్దరం అన్ని విషయాలు చాలా ఓపెన్‌గానే మాట్లాడుకుంటాం. విల్ డిస్కస్ ఎవ్రీ థింగ్. కాని ఏ విషయం మాట్లాడినా ఎండ్ అయ్యేది మాత్రం పాలిటిక్స్ దగ్గరే. ఏది చెప్పినా వింటాడు. నిరుత్సాహ పర్చడు. చేసేద్దాం అంటాడు. చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు. ఏదైనా పని మొదలుపెడితే పట్టుదలగా పూర్తి చేస్తాడు. నాకూ పట్టుదల ఎక్కువే. ఇద్దరం ఒకరి నుంచి ఒకరం అడ్వయిజెస్ తీసుకుంటాం. నేను చేసే వంటలంటే రామన్నకు చాలా ఇష్టం. ఇది చేయకు.. అది చేయకు ఒక్క రామన్ననే కాదు.. మా ఇంట్లో ఏ విషయంలోనూ ఎవరూ వెనక్కి లాగలేదు. లాగరు కూడా. ఇంజనీరింగ్ చేస్తానన్నా.. అమెరికా వెళ్తానన్నా.. చివరకు పాలిటిక్స్‌లోకి రావడాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేదు. అడ్డు చెప్పలేదు. ఎంకరేజింగ్‌గానే ఉంటారు. అందరూ ఇండువిడ్యువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు.. రెస్పెక్ట్ చేస్తారు. రిస్ట్రిక్షన్స్ ఎప్పుడూ లేవు. రాఖీ.. బ్రదర్స్ అందరికీ నా రిక్వెస్ట్... అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్లది రక్తసంబంధం. ఎవరి లైఫ్‌లో వాళ్లు ఎంత బిజీగా ఉన్నా అక్క, చెల్లెళ్ల కోసం టైమ్ కేటాయించండి. ఎందుకంటే ఆడపిల్ల తను లైఫ్‌లో ఎంతబాగా సెటిల్ అయినా ప్రతి అన్నా, తమ్ముడు తన పట్ల కేర్ తీసుకోవాలని, కన్సర్న్ చూపించాలని కోరుకుంటారు. సో.. దయచేసి వాళ్లతో టైమ్ స్పెండ్ చేయండి. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫైట్ చేసే స్పిరిట్‌నే పెంపొందించారు తప్ప పిరిగా అన్న వెనకాలో.. నాన్న వెనకాలో దాక్కునే తత్వాన్ని నూరిపొయ్యలేదు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలనే చెప్పారు. ఆ ధైర్యాన్నే ఇచ్చారు. నిజానికి మా ఇంట్లో నాకు గాని, రామన్నకు గాని మా అమ్మే ఇన్సిపిరేషన్. అమ్మ ఓపిగ్గా లేకపోతే నాన్న జర్నీ ఇంత సాఫీగా సాగేది కాదు. సో.. షి ఈజ్ అవర్ స్ట్రెన్త్. అన్నాచెల్లెళ్లం ఎలా ఉండాలో కూడా అమ్మను చూసే నేర్చుకున్నాం. నా పిల్లలకూ అదే చెప్తా.. మా అమ్మ నన్నెప్పుడూ అణగిమణిగి ఉండాలని ఆర్డర్ చేయలేదు. అలాగే రామన్నకు మగపిల్లాడు అని ప్రివిలేజెస్ ఇవ్వలేదు. అంటే నన్ను తక్కువా చేయలేదు.. రామన్నను ఎక్కువా చేయలేదు. ఇద్దరినీ ఈక్వల్‌గానే చూసింది. సర్దుకుపోవడం, ఒకరంటే ఒకరు గౌరవంగా ఉండడం ఇద్దరికీ నేర్పింది. నేనూ నా పిల్లలకు అదే చెప్తా. నాకు ఇద్దరు అబ్బాయిలే. అందరూ సమానమనే చెప్తా. ‘‘నువ్వు చెప్పింది అందరూ వినాలి అని అనుకోవద్దు. ఎవరి అభిప్రాయాలు, ఇష్టాఇష్టాలు వాళ్లకు ఉంటాయి. గౌరవించాలి. పర్సనల్స్పేస్ ఇవ్వాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా సున్నితంగా ఆలోచించాలి. బాలెన్సింగ్‌గా ఉండాలి’’ అనే చెప్తుంటా. కళ్యాణలక్ష్మిని సరిగ్గా అర్థం చేసుకోవాలి... మా నాన్న చేసిన దాంట్లో నాకు బాగా నచ్చిన విషయం.. ప్రతి గర్భిణీ స్త్రీకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం. నెలలు నిండే వరకు కూడా పనిచెయ్యక తప్పని పరిస్థితులన్న మహిళలకు ఇదెంతో మేలు చేస్తుంది. గర్భవతి అని నిర్థారణ అయి, బిడ్డ పుట్టిన మూడు నెలల వరకు ప్రతి నెలా వాళ్లకు వెయ్యి రూపాయలు వచ్చేలా చేసే స్కీమ్ ఇది. అలాగే అంగన్ వాడీలో ప్రతి రోజూ ఒక పూట పోషక విలువలతో కూడి భోజనం ఇవ్వడం. ఈ పథకానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తగ్గించినా కూడా నాన్న ఈ స్కీమ్ రన్ అయ్యేలా చేస్తున్నారు. ఇవి చాలా మంచి స్కీమ్స్. కళ్యాణ లక్ష్మిని చాలా మంచి తప్పుగా అర్థం చేసుకున్నారు కాని.. సీఎమ్గారు చాలా విజన్‌తో దాన్ని స్టార్ట్ చేశారు. పేదరికం వల్ల తెలంగాణలో అమ్మాయిలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అందుకే పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లికి సహాయపడే ఈ కళ్యాణ లక్ష్మి పథకం వల్ల అమ్మాయిలు కనీసం పద్దెనిమిదేళ్లు వచ్చే వరకన్నా చదువుకునే వీలు కలుగుతోంది. బాల్య వివాహాలూ కాస్త అయినా ఆగుతాయని ఆశ. అమ్మాయి భవిష్యత్‌ను బాగు చేసే పథకమే ఇది. ఆయన ఏ పని చేసినా నెక్స్›్ట ఎలక్షన్స్ వరకే కాదు.. నెక్స్›్ట జనరేషన్ వరకు ఉంటుంది. లిక్కర్విషయంలో కూడా ఆయన అదే చేస్తున్నారు. దాన్ని తగ్గించేందుకు ఆయన స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకుంటున్నారనుకుంటున్నాను. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ రాఖీ పండగని ఎలా చేసుకుంటారు? నిహారిక: దసరా, దీపావళిలా ఫుల్‌గా చేయకపోయినా బాగానే చేసుకుంటాం. బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి, కాళ్లు మొక్కి డబ్బులు గుంజడం (నవ్వుతూ ). చిన్నప్పటి నుంచి రాఖీ ఎప్పుడూ మిస్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే వరుణ్ అన్న ‘ఫిదా’ షూటింగ్ కోసం నిజామాబాద్‌లో ఉన్నాడు. నేను వరుణ్ అన్నకు రాఖీ కట్టాకే మిగతా అన్నలకు కడతాను. నైట్ అంతా జర్నీ చేసి నిజామాబాద్ వెళ్లి అన్నకు రాఖీ కట్టి మళ్లీ రిటర్న్ వచ్చి చరణ్ (రామ్‌చరణ్) అన్నకు కట్టాను. ఒకవేళ వేరే కంట్రీలో ఉంటే ఏం చేయలేం. నెక్ట్స్ స్క్రిప్ట్స్ వినేప్పుడు కూడా రాఖీ అప్పుడు షెడ్యూల్స్ లేకుండా చూడాలి. ఎందుకంటే నాకు లాస్ కదా. పైసల్ ఇవ్వకుండా తప్పించుకుంటాడు (నవ్వుతూ). వరుణ్: మా జనరేషన్స్‌లో కజిన్స్ ఎక్కువ. చరణ్ అన్న వాళ్ల ఇంటికి నిహా వెళ్లడం, సుష్మితా వాళ్లు మా ఇంటికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మెమరబుల్గానే సెలబ్రేట్ చేసుకుంటాం. అందరం కలిసి బయటకు వెళ్తాం. సినిమాల్లోకి వచ్చాక బయటకి వెళ్లడం తగ్గిపోయింది. ఆ రోజు షూటింగ్స్ లేకపోతే కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. ఎక్కువ సేపు జరుపుకునే ఫెస్టివల్ కాదు కూడా. రాఖీ కట్టించుకున్న తర్వాత టైమ్ స్పెండ్ చేస్తుంటాం. మిస్ అవ్వకుండా పాటిస్తాం. రాఖీ కట్టేప్పుడు అన్నయ్య ఇలా ఉండాలి అని ఏదైనా కోరుకుంటారా? నిహారిక: రాఖీ రోజే ప్రొటెక్ట్ చేయాలని కోరుకోం. అన్న నన్నెప్పుడూ ప్రొటెక్ట్ చేస్తుంటాడు. చెల్లి పుట్టగానే బ్రదర్స్‌కి ఒక బాధ్యత వచ్చేస్తుంది. సెకండ్ ఫాదర్ లాగా మారిపోతారు. నాన్నకు అన్నీ చెప్పలేం కదా. అన్నయ్యకు చెబుతాం. అలా అని అన్నయ్యకు కూడా మొత్తం చెప్పం అనుకోండి (నవ్వుతూ). వరుణ్: నేను ఒక్కరోజు పండగల్ని పెద్దగా నమ్మను. తను నీకు ఆ ఒక్క రోజు చెల్లెలు కాదు కదా. జీవితాంతం చెల్లెలే. లైఫ్‌లాంగ్ తనను ప్రొటెక్ట్ చేస్తుండాలి. రాఖీ అనేది ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ సెలబ్రెట్ చేసుకోవడానికి ఓ రోజు అన్నట్టు నేను ఫీల్ అవుతాను. చిన్నప్పటి నుంచి అల్లరిగా ఉంటారు. కానీ కొంత వయసు వచ్చేప్పటికి కొంచెం ప్రొటెక్టెడ్‌గా అయిపోతారు. మీ అన్న అలా మారారని ఎప్పుడు అర్థం అవ్వసాగింది? నిహారిక: అది మెల్లిగా అర్థం అవుతుంది. చిన్నప్పుడు పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నాం. అమ్మా నాన్న దగ్గర ఊరికే కంప్లైంట్ చేసుకోవడం నుంచి మెల్లిగా మెచ్యూర్డ్ అవ్వడం గమనించాను. నేను కాలేజ్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో ఉండేదాన్ని. అన్నయ్య అప్పుడు వైజాగ్‌లో యాక్టింగ్ కోర్స్‌లో ఉన్నాడు. 5–6 నెలలు చూడలేదు. అప్పుడు మిస్ అయ్యాను. ఆ తర్వాత నుంచి అన్నయ్యలో కొంచెం ప్రొటెక్టీవ్నెస్ కనిపించేది. అది కూదా గుడ్ వేలోనే. మరీ ఓవర్‌గా, రెస్ట్రిక్షన్లా కూడా కాదు. ఇంకో ప్లస్ ఏంటంటే.. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తున్నాను అంటే త్వరగా ఇంటికి వచ్చేయ్ అంటారు. అదే అన్నతో అయితే ఈజీగా బయటకు వెళ్లోచ్చు. అన్నయ్యతో ఉన్నావా? అని ఇంకే అడగరు. వరుణ్: ఆ ట్రాన్స్ఫర్మేషన్ అందరికీ జరుగుతుంది అనుకుంటున్నాను. నేను, మా చెల్లెలు ఊరికే కొట్టుకోవడం, గొడవపడటం తప్ప కూర్చొని స్వీట్‌గా మాట్లాడటం ఎప్పుడూ లేదు. నా విషయంలో తను ఎంత ప్రొటెక్టివ్‌గా ఉందో నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాతే తెలుసుకున్నా. చరణ్ అన్న, నేను కూడా ఎక్కువ గొడవలు పడేవాళ్లం. ఎక్కువ తిట్టేవాడు.. కొట్టేవాడు. సడెన్‌గా చరణ్ అన్న యాక్టర్ అయ్యాక నన్ను ఫాదర్‌లా చూసుకోవడం స్టార్ట్ చేశాడు. నేను యాక్టర్‌ని అయ్యాక అది అర్థం అయింది. నిహారిక: నాకు తెలిసిన ఫ్రెండ్స్‌లో కొందరు ‘మా అన్నయ్య అన్నింటికీ అడ్డంకులు పెడతాడు. వాడికి వాళ్ల ఫ్రెండ్స్ ఎక్కువ’ అనేవాళ్లు. నా అన్న మాత్రం అలా కాదు. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ‘ఎక్కడికి వెళ్తున్నావు’ అని అన్నయ్య అడిగేవాడు. అప్పుడు చిరాకుగా అనిపించేది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది.. ఒకవేళ అది కూడా అడగకపోతే ఇంకా అల్లరి పిల్లలా తయారయ్యేదాన్ని అని. మీ ఇంట్లో ఎవరికి వాళ్లు మీ కెరీర్‌తో బిజీ. ఈ బిజీ వల్ల వచ్చే గ్యాప్‌ని ఎలా ఫిల్ చేస్తారు? నిహారిక: ఇప్పుడు అన్న కొంచెం ఖాళీ దొరికినా నా ఆఫీస్‌కి రా. సెట్స్‌కి రా అంటాడు. వాళ్ల ఫ్రెండ్స్‌తో నన్ను కలుపుకుంటాడు. అందుకే అంత గ్యాప్ రాదు. ఒక వారం వరకూ ఓకే. వారం దాటి కలవకపోతే మాత్రం ఇద్దరికీ ‘మిస్సింగ్’ అనే అలారం మోగిపోతుంది. వెంటనే కలుస్తాం. బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఎక్కువ శాతం టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. మరి మీ ఇంట్లో టామ్ ఎవరు జెర్రీ ఎవరు? నిహారిక: నేను జెర్రీ.. అన్నయ్య టామ్. ఆ ప్రోగ్రామ్‌కి ఇన్స్పైర్ అయ్యి, అన్న చేతులు గీరేసేదాన్ని. అప్పుడు వాడు హీరో అవు తాడు అని తెలియదు కదా. ఇప్ప టికీ ఆ గీతలు వాడి చేతుల మీద ఉంటాయి. అన్న కోసం నాకు చాక్లెట్స్ లంచం ఇచ్చేవాళ్లు - నిహారిక రాఖీ అనగానే బ్రదర్ సిస్టర్ని ప్రొటెక్ట్ చేయాలి. భరోసా ఇవ్వాలి అంటాం. మరి సిస్టర్స్ బ్రదర్స్‌కి ఏం చేయాలి. నిహారిక : మేం కూడా ఏమైనా చేయాలా? (పెద్దగా నవ్వుతూ). చిన్నప్పటి నుంచి చాకిరీ చేస్తూనే ఉంటాం కదా. సోఫాలో కూర్చొని చిటికేస్తే మేమే కదా వాటర్ బాటిల్ అయినా ఏదైనా అందించేది. పరిగెత్తిస్తారు కదా. ఇలా సంవత్సరం అంతా చేస్తూ రాఖీ రోజు గుర్తు చేస్తుంటాం హాలో.. నువ్వు కూడా బాధ్యతగా ఉండూ అని. రాఖీ రోజు వరుణ్ మీకు గిఫ్ట్స్ ఇస్తుంటారా? నిహారిక: ఏది పడితే అది తీసుకుంటాను. అప్పటి మైండ్‌సెట్‌కి తగ్గట్టుగా అడుగుతా. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇలాంటి పండగలప్పుడు అడగాలనిపించదు. కానీ మాములు టైమ్‌లో చంపుతుటాను. మీ అన్నయ్యకు మీరిచ్చిన వాటిలో బెస్ట్ గిఫ్ట్స్ ఏదైనా? వస్తువు కొని ఇస్తే ప్రేముంటుందని నేను అనుకోను. నేను నా టైమ్ తీసుకొని నా సొంతంగా చేసినవి ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాంటి గిఫ్ట్స్ ఇవ్వడంవల్ల మనం ఎంత స్పెషలో తెలియజేస్తాం. అలా ఇవ్వడం వల్ల నాకు ఎక్కువ సంతృప్తి ఉంటుంది. గిఫ్ట్స్ కంటే అన్నయ్యతో స్పెండ్ చేసే స్పెషల్ మూమెంట్స్‌ని చాలా ఇష్టపడతాను. బయట మీ అందరికీ కనిపించే వరుణ్ వేరు.. మా ఇంట్లో ఉండే వరుణ్ వేరు. చాలా ఏడిపిస్తాడు. చాలా ఫన్నీ. ఈ విషయం మీ అందరికీ తెలుసో.. లేదో. అన్న బెస్ట్ కంపెనీ. అలాంటి ఇంకెన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను. గిఫ్ట్స్ అన్నీ ఏదో పాయింట్లో ఇరిగిపోతాయి.. అరిగిపోతాయి. స్పెండ్ చేసిన టైమే బెస్ట్ అని నా ఫీలింగ్. నిహారిక మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్? వరుణ్: తను గిఫ్ట్స్ ఎక్కువ ఇవ్వదు కానీ బాగా చూసుకుంటుంది నన్ను. ఒకసారి తను సొంతంగా నా బర్త్‌డేకి నా ఫోట్స్ అన్నీ కలిపి ఓ పెద్ద గిఫ్ట్ తయారు చేసి ఇచ్చింది. అది ఇప్పటికీ నా రూమ్‌లోనే ఉంది. మీరు షేర్ చేసుకున్న బెస్ట్ మూమెంట్స్ వరుణ్: మా ఫ్యామిలీలో ఒక స్పెషల్ మూమెంట్ అని ఉండదు. అన్నీ కలిపి ఉంటాయి. నాకు నిహారిక ఒక్కతే కాదు.. చరణ్ అన్న వాళ్ల సిస్టర్స్ కూడా క్లోజ్. మా కజిన్స్ అందరం ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి అందరం రెగ్యులర్‌గా కలుస్తాం. మీట్ అవుతుంటాం. సంక్రాంతికి బయటకు వెళ్తుంటాం. బెంగళూర్‌లో ఫామ్ హౌస్ ఉంది. నిహారిక తన షూటింగ్స్‌కి రమ్మంటుంది కానీ నా బిజీ వల్ల కుదరడం లేదు. సాధారణంగా ఏ అమ్మాయి అన్నయ్యని అయినా అబ్బాయిలు విలన్‌గా ఫీలవుతారు. మీ అన్నయ్య ఎంతమందికి విలన్ అయ్యారు? నిహారిక: మా అన్న ఒక లైన్ చెప్పాడు. అది తనెక్కడో చదివాడట. అదేంటంటే.. ఏ చెల్లైనా అన్నయ్యకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అర్థం చేసుకుంటుందట. అదే అన్నయ్యకు ఆ చెల్లి వచ్చి నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటే అస్సలు అర్థం చేసుకోడట. దానికి కారణం చెప్పాడు. చెల్లెలికి ప్రేమంటే ఏంటో తెలుసు. కానీ అన్నయ్యలకు అబ్బాయిలంటే ఏంటో తెలుసు అన్నాడు. నిజమే కదా అనిపించింది. హిస్టరీ చూస్తే ఇదే నిజం అని అర్థమవుతుంది. సినిమాల్లో కూడా చెల్లెలు వదినా అని వెంటనే ఒప్పుకుంటుంది. అన్నయ్య మాత్రం సింపుల్ రిజెక్షన్. అది కూడా ప్రొటెక్షనేలే. నాకు తెలిసి మా అన్న ఎవరికీ విలన్ అవ్వలేదనే అనుకుంటున్నాను. ఎప్పుడూ హీరోనే. ఇద్దరూ సినిమా ఫీల్డ్‌లోనే ఉన్నారు. ఒకరి వర్క్‌ని ఇంకొకరు ఎలా కాంప్లిమెంట్ లేదా క్రిటిసైజ్ చేసుకుంటారు? నిహారిక: 5 ఏళ్ల క్రితం అయితే చెత్తగా చేశావు.. బాగా చేశావులే అని అనుకునేవాళ్లం అనుకుంటున్నాను. బావున్నా బాలేకున్నా డీటైల్డ్‌గా చెప్తాను నేను. ప్రతి సినిమాకు యాక్టర్‌గా గ్రో అవుతుంటారనే అనుకుంటాను. డ్రెస్సింగ్, మేకప్ విషయంలో కామెంట్ చేస్తుంటాను. వరుణ్: చెల్లి సినిమాలను బాగానే క్రిటిసైజ్ చేస్తుంటాను. నిహా మాత్రం అంతగా చెప్పదు. చరణ్ అన్న దగ్గరకు వచ్చినప్పుడు అన్న చెప్పేది వింటాను. ఎందుకంటే మా అందరిలో సీనియర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. చరణ్ అన్న, నేను సినిమాల గురించి కూడా బాగా మాట్లాడుకుంటాం. ఐడియాస్ పంచుకుంటాం. నిహా, నేను సేమ్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి హ్యాపీ. తను డాక్టరో లేక ఇంజనీరో అయ్యింటే తన వర్క్ నాకు అర్థం అవ్వదు. ఆ టాపిక్ కూడా నేను మాట్లాడలేను. సినిమాల్లోకి వెళ్తున్నాను అనగానే అన్నయ్య రియాక్షన్ ఏంటి? నిహారిక: వాట్!! నిజంగానా అన్నాడు. మీరు ముందు హింట్స్ ఇవ్వలేదా? నిహారిక: నేను సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాక ఇంట్లో గంతులేస్తున్న టైమ్‌లో అన్నయ్య ఇంట్లో లేడు. యాక్టింగ్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. సో 6–7 నెలలు లేకపోయే సరికి వాడికి కొత్తగా అనిపించింది. మా ఫ్యామిలీలో ఎవరూ వద్దని చెప్పలేదు. నేను సీరియస్‌గా ఉన్నానా? లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చే నెగటివ్, పాజిటివ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? లేదా అని చూశారు. అందరికంటే చిన్నదాన్ని, చిన్నపిల్ల అని భయపడ్డారు. హ్యాండిల్ చేయగలుగుతుందా? అని కొంచెం ఆలోచించారు. నా కాన్ఫిడెన్స్ చూసి అన్నయ్యకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది మైండ్‌లో ఫిక్స్ అయిందన్న మాట అనుకున్నాడు. ఇలానే ఉండాలని నిబంధనలేమైనా? నిహారిక: లేదు. కానీ నీకేదైనా పని చేయాలనిపించినప్పుడు నీ వెనక 8–9 మంది ఉన్నారు. సో ఏది చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు. నిన్ను ఎవరూ ఏమీ అనరు. చిరంజీవిగారు. నాగబాబు, పవన్‌కళ్యాణ్, చరణ్.. ఇలా అన్ని పేర్లు వస్తాయి అన్నారు. నాకూ ఆ విషయంలో క్లారిటీ ఉంది. వరుణ్: కొన్నిసార్లు ఓవర్ ప్రొటెక్షన్ పొసెసివ్‌నెస్ అయిపోతుంది. అది చాలా సన్నటి గీత. బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మా నాన్న కూడా చాలా ఫ్రీడమ్ ఇస్తూనే కొన్ని నిబంధనలు పెట్టారు. నేను కూడా ఆ లైన్లోనే ఉన్నాను అనుకుంటున్నాను. మా చెల్లి సైడ్ నుంచైతే ఏం కంప్లైంట్స్ లేవు. తను హ్యాండిల్ చేయగలదు అని నమ్మకం వచ్చిన తర్వాత ఫ్రీ హ్యాండెడ్‌గా ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళు వద్దన్నా నేనే మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తాను. (నవ్వుతూ) మీ అన్నయ్య రిలేషన్షిప్స్ నాన్నగారికి తెలియ కుండా దాచిపెట్టడం. నిహారిక: నేను, అన్నయ్య ఒకే కాలేజ్‌లో చదువుకోలేదు. కానీ 5 వరకూ ఒకే స్కూల్. అన్నయ్యను లైక్ చేసే అమ్మాయిలు తెలుసు కానీ అన్నయ్య లైక్ చేసిన అమ్మాయిలు తెలియదు. చాలా మంది చాక్లెట్స్ తెచ్చి ఇచ్చేవారు. బ్రేక్ టైమ్‌లో అన్న క్లాస్‌కి వెళ్తే ‘హే వరుణ్ చెల్లి’ అని చాక్లెట్స్ ఇచ్చేవాళ్లు. చాక్లెట్స్ వస్తున్నాయి కదా అనుకున్నే దాన్ని. అది లంచం అని తర్వాత తెలిసింది. వరుణ్: నేను అసలు అమ్మాయిలతో మాట్లాడేవాడ్ని కాదు. అమ్మాయిలంటే శత్రువులు అని అనుకునేవాడ్ని. అలా ఎందుకు అనుకున్నానో కూడా సరిగ్గా తెలియదు. మా క్లాస్‌లో అమ్మాయిలందరూ కూడా చెల్లితో క్లోజ్‌గా ఉండేవాళ్ళు. వాళ్లు ఇచ్చిన చాక్లెట్స్ తీసుకునేది కానీ నాతో చెప్పమన్నది మాత్రం చెప్పలేదు. మీ చరణ్ అన్న ఇచ్చిన గిఫ్ట్స్ ఏమైనా? నిహారిక: ఒకసారి అనుకోకుండా నాక్కావల్సింది ఇచ్చాడు. నేను ట్రిప్‌కి వెళ్తున్నాను. కొత్త కళ్లజోడు కొనుక్కుందాం అనుకున్నాను. దార్లో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వెళ్తుంటే చరణ్ అన్న కార్ కనిపించింది. హాయ్ చెప్పేదాం అని వెళ్లాను. అన్న క్యారవ్యాన్ బాగా ఫేమస్. నువ్వేంటి సడెన్‌గా ఇలా? అన్నాడు. ఏం లేదు.. కళ్లజోడు కొనుక్కుందాం అని అన్నాను. నేనుండగా నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోవడమా అని చెప్పి పర్స్‌లో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ ‘నీ హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి డబ్బులు బయటకు రావడానికి పెద్దగా ఇష్టపడవనుకుంటా’ అని ఆటపట్టించారు. ఊహించకుండా వచ్చిన గిఫ్ట్ కాబట్టి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎప్పుడైనా స్కూల్ అవుటింగ్స్లో హెల్ప్ చేశారా? వరుణ్: మా నాన్నగారి మితిమీరిన ప్రేమ వల్ల చిన్నప్పుడు స్కూల్ అవుటింగ్స్ ఒకటి కూడా వెళ్లలేదు నేను. మహా అంటే ఒక్కసారి అనుకుంటాను. అందరికీ ఉంటుంది కదా బయటకు వెళ్లాలని. నిహారిక టైమ్ వచ్చేసరికి ఆయన కొంచెం ఫ్రీగా ఉండేవారు. తనే చాలా సార్లు వెళ్లింది. నేను గొడవపడేవాణ్ని నన్ను ఆపేశారు... తనను పంపుతున్నారని (నవ్వుతూ). ఇద్దరికీ సీరియస్ గొడవలేమైనా అయ్యాయా? వరుణ్: నాకు గొడవలను ఎక్కువగా లాగడం ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి కోప్పడుంటాను కానీ పెద్దగా మాట్లాడుకోలేనంత గొడవలు ఎప్పుడూ జరగలేదనుకుంటాను. మీరిచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ ఏంటి? వరుణ్: అవతలి వాళ్లకు ఏది నచ్చుతుంది అని ఆలోచించి గిఫ్ట్ తీసుకోవడంలో చాలా వీక్. కానీ నాకు గుర్తున్నదైతే యాక్టర్ అయ్యాక నా సంపాదనతో తనకో వాచ్ కొనిచ్చాను. డబ్బులిస్తాను కావాల్సింది కొనుక్కో అంటాను. నాన్నకి తెలియకుండా మీ ఇద్దరూ చేసిన పనులు... వరుణ్: కొన్ని సార్లు లేట్ నైట్స్ బయట ఉండాల్సి వస్తుంటుంది. ఆ విషయం నాన్నకు చెప్పాలంటే భయం. అప్పుడు చెల్లి కవర్ చేస్తుంటుంది. అలా నాన్నకు అబద్ధాలు చెప్పి బయట తిరిగేవాళ్లం. మీ పాకెట్ మనీని మీ అన్న కొట్టేసేవారా? నిహారిక: అబ్బే. కిడ్డీ బ్యాంక్ ఉండేది కానీ పొరపాటున రూపాయి వేసేదాన్ని కాదు. వరుణ్ అన్నకు కాయిన్స్ కలెక్షన్ ఉండేది. అన్నీ మంచిగా సెట్ చేసుకునేవాడు నేను చిందరవందర చేసేదాన్ని. తర్వాత నాకు తెలిసిన విషయమేంటంటే నాకు కాయిన్స్ అంటే ఎలర్జీ అని. దాంతో వాటి జోలికి వెళ్లడం మానేశాను. రాఖీ విలువ తెలిసింది రాఖీ అనగానే మీకు గుర్తొచ్చే సంఘటన ఏంటి? పవిత్ర: చిన్నప్పటి నుండి అన్నయ్యకు రాఖీ కడుతూనే ఉన్నా. అయితే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. రాఖీ కట్టి వాడిచ్చే డబ్బులో, గిఫ్టో తీసుకునేదాన్ని. నా ఐదవ తరగతి తర్వాత అమ్మ నాకు రాఖీ పండగ గురించి, దాని విశిష్టత గురించి చెప్పింది. గుర్తున్న సంఘటన అంటూ ఏమీ లేదు. అయితే చిన్నప్పుడు అన్నయ్య రాఖీ కట్టించుకోను అని అల్లరి చేసేవాడు. ఆకాశ్: (నవ్వుతూ). నేను ఎందుకు కట్టించుకోను అనేవాణ్ణి అంటే రాఖీ స్టైల్‌గా ఉండేది కాదు. అందుకే పారిపోయేవాణ్ణి. అంతే కానీ చెల్లి మీద ప్రేమ లేక కాదు. కానీ కొంచెం పెద్దయ్యాక రాఖీ విలువ గురించి అమ్మ చెప్పింది. అందుకే అడిగి మరీ కట్టించుకుంటున్నాను. పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ అంటే ఇష్టం? ఆకాశ్: నేను ఏం ఇచ్చినా తీసుకుంటుంది. గిఫ్ట్స్ తీసుకోవటం అంటే తనకి చాలా ఇష్టం (నవ్వుతూ). పవిత్ర: లాస్ట్ ఇయర్ కృష్ణుడి బొమ్మ ఇచ్చాడు. అమ్మకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అందుకే అన్నయ్య ఇవ్వగానే దేవుని మందిరంలో పెట్టి అమ్మకు చూపించాను. అమ్మ చాలా సంతోషించింది. నేను నైన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు బెంగళూర్ నుండి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆకాశ్: పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలనే విషయం గురించి నాకు చిన్నప్పటి నుండి ప్లాన్ ఉంది. మెల్లిగా ఒక్కోటి ఇస్తూ వస్తున్నాను. ఇక బ్యాగ్ విషయానికి వస్తే.. నేను బెంగళూర్‌లో కోచింగ్‌లో ఉన్నాను. ఆ టైమ్‌లో రాఖీ పండగ వచ్చింది. నెక్ట్స్ ఇయర్ కాలేజీకి వెళ్తుంది కదా. మంచి స్టైలిష్ బ్యాగ్ కొందామనిపించి, కొన్నాను. ఏమిచ్చినా తీసుకుంటుంది కాబట్టి మంచి చెల్లెలు అనుకోవాలి. ఈ రోజు కూడా మంచి గిఫ్ట్ ఉంది. కానీ సర్ప్రైజ్. పవిత్ర: నేను ఎవర్నీ ఏమీ అడగను. ఎవరన్నా ఇస్తే వద్దనను. నచ్చితే వాడుకుంటాను. నచ్చకపోతే పక్కన పెడతాను కానీ ఎవరినీ నొప్పించను. కానీ ఈ రోజు ఏమిస్తాడో చూడాలి. (అన్న వైపు చూస్తూ). ఆకాష్‌కి మాత్రమే రాఖీ కడతారా? బయట ‘రాఖీ బ్రదర్స్’ ఎవరైనా ఉన్నారా? పవిత్ర: రాఖీ పండగ రోజు అన్నయ్యకు రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవటం కంపల్సరీ. సాయంత్రం టేబుల్ మీద బోలెడన్ని స్వీట్స్, రాఖీలు ఉంటాయి. అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ దాదాపు ఐదారుగురు వచ్చి రాఖీలు కట్టించుకుంటారు. కట్టిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. మీ ఇద్దరూ పర్సల్ విషయాలు షేర్ చేసుకుంటారా? పవిత్ర: మాకసలు వ్యక్తిగత విషయాలంటూ ఉండవు. ఎందుకంటే నేను ఏం ఉన్నా మా అమ్మా నాన్నలిద్దరికీ చెప్పేస్తాను. ఆకాశ్ విషయానికి వస్తే మా అమ్మను చాటుగా గదిలోకి తీసుకెళ్లి, నేను చాలా పర్సనల్ విషయం మాట్లాడుతున్నాను నువ్వు రావద్దు అంటాడు. కానీ పది నిమిషాల తర్వాత అమ్మ అసలు విషయం చెప్పేస్తుంది. అలాంటప్పుడు ఇక పర్సనల్స్ ఏముంటాయి? మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలుంటాయి. ఆ టైమ్‌లో ఆకాశ్‌కి ఎలాంటి ధైర్యం ఇచ్చారు. ఆ సినిమా రిజల్ట్ మీకు తెలిసిందే. ఆ టైమ్‌లో మీరిచ్చిన సపోర్ట్? పవిత్ర: సినిమా షూటింVŠ టైమ్‌లో తనే చాలా ధైర్యం చెప్పేవాడు. షూటింగ్ ఇక్కడ జరగలేదు. చాలా దూరంలో ఉన్నాడు.. ఎలా ఉన్నాడో ఏమో అని మేం కంగారు పడేవాళ్లం. రోజూ ఏదో ఒక టైమ్‌లో ఫోన్ చేసి షూటింగ్ చాలా బాగా జరుగుతుంది, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పేవాడు. తనకు చిన్నప్పటి నుండి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా చేశాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తను 100 పర్సెంట్ న్యాయం చేశాడు. రివ్యూస్ ఎలా వచ్చినా తను డల్ అవ్వటం ఉండదు. ఆకాశ్: నేను డల్‌గా ఉన్నాను అనిపిస్తే అమ్మా, చెల్లి ఆ టాపిక్ గురించి మాట్లాడరు. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్దాం అని స్టార్ట్ చేస్తారు ఇద్దరూ. ఎందుకు డల్‌గా ఉన్నావ్ అని అడగరు. తర్వాత నిదానంగా నేనే ఎందుకు అలా ఉన్నాను అనే విషయం చెప్తాను. అన్నయ్యా అంటారు రాఖీ కట్టరు – పవిత్ర మీ చెల్లెలు ఇప్పుడు స్కూల్ నుండి కాలేజ్‌కి వెళుతుంది. చిన్న భయం లాంటిది ఏమైనా? ఆకాశ్: అస్సలు లేదండి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నా స్కూల్‌కి వచ్చేది. అమ్మను చూడగానే టీచర్ అది చేయలేదు.. ఇది చేయలేదు అని నన్ను తిట్టేది. తర్వాత అమ్మ పవిత్ర క్లాస్‌కి వెళ్లేది. టీచర్ వెంటనే పాప బాగా చదువుతుంది.. ఎంత మంచి అమ్మాయో అని చెప్పేవారు. తను చిన్నప్పటి నుండి అంతే. అందుకని తను కాలేజీకి వెళ్లినా నాకు దిగులు అనిపించింది. పైగా పవిత్రకు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. అందుకని చాలా రిలాక్స్‌గా ఉంటాను. మా ఇద్దరికీ మంచి లక్షణాలు ఉన్నాయంటే అవి మొత్తం అమ్మ నేర్పినవే. పవిత్ర ఎలాంటి కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటోంది? ఆకాశ్: తనిప్పుడు బీబీఏ చదువుతోంది. చదువు అయిపోగానే ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకోవాలి అని చెప్పాను. టెన్త్ అయిపోగానే ప్రొడక్షన్లోకి వచ్చేస్తానని నాన్నకు చెప్పేసింది. అప్పటినుండి ఆయన బిజినెస్‌కి సంబందించిన బుక్స్ తెచ్చిస్తుంటారు. ప్రొడక్షన్లోకి రావాలనుకుంటున్నారు. మీ నాన్నగారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మీ ఇద్దరికీ తెలుసు. ఎలాంటి ఇన్పుట్స్ తీసుకుంటారు? పవిత్ర: మేం చిన్నప్పటినుండి డాడీని చూస్తూ పెరిగాం. నాకు అన్నీ తెలుసు. ఏదైనా మూవీలో లాస్ వచ్చినా ఆ నష్టం దేనివల్ల వచ్చిందో తెలుసు. కానీ నేను ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. నా వయసు సరిపోదు. కాలేజీలో మీరు డైరెక్టర్ పూరీ డాటర్ అని అందరికీ తెలుసా? పవిత్ర: యాక్చువల్లీ నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. అయితే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. కానీ నా గురించి చాలా తక్కువమందికి తెలుసని చెప్పాలి. నా గ్యాంగ్‌లో కూడా ఓ పది, పన్నెండుమందికి తెలుసు నేను ఏంటి అని. నా ఎమోషన్స్‌ని నేను సాధ్యమైనంతవరకూ బయట పెట్టను. నా మనసుకు ఎంతో దగ్గరయిన అతి కొద్ది మందితో మాత్రమే నేను ఓపెన్ అవుతాను. డ్రగ్స్ ఇష్యూ అప్పుడు చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అయినట్లు అనిపించింది.. పవిత్ర: ఎందుకంటే మా నాన్న ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన సిగరెట్ కాలుస్తారు. దాని గురించి రాయమనండి. లేని దానికి ఇలా రిచ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాడు, వేరే ఏదో హౌస్ ఉంది అని మా అమ్మను ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా అనేయడమేనా? పాపులార్టీ కోసం ఏదైనా రాసేయడమేనా? ఎవరేం అన్నా.. అందులో నిజం ఉందా లేదా అనేది జనం చూడాలి. (కళ్లలో వస్తున్న నీళ్లను ఆపుకుంటూ) నేను సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టిన తర్వాత ‘మీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలియదు. నువ్వు మీ నాన్నని చాలా వెనకేసుకు వస్తున్నావు. ఆయనకు చాలా అలవాట్లు ఉన్నాయి, డ్రగ్స్ తీసుకుంటాడు’ అని చాలా మెసేజ్‌లు వచ్చాయి. నేను ప్రతి దానికి సమాధానం చెప్తూనే ఉన్నాను నా ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు వచ్చిన ప్రతి మెసేజ్‌కి రిప్లై చేస్తూ ఫైట్ చేశాను. ఆకాశ్: పవిత్ర నాకు అప్పటిదాకా ఒకలా తెలుసు. ఆ తర్వాతే నేను పవిత్ర ఏంటో రియలైజ్ అయ్యాను. తన కెపాసిటీ ఏంటో నాకు ఆ రోజు తెలిసింది. పవిత్రను అప్రిషియేట్ చేస్తూ, నాకు చాలా కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను డాడీతోనే ఉన్నాను. ఆ టైమ్‌లో పవిత్ర డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. పవిత్రకు చాలా మంది అన్నలున్నట్లే ఆకాశ్‌కి చాలామంది చెల్లెళ్లున్నారా? ఆకాశ్: నాకు ముగ్గురు చెల్లెళ్లున్నారు. మా సాయిరామ్ బాబాయి కూతుళ్లు అనన్య, రెహన్యా ఉన్నారు. వాళ్లతో పాటు చాలా మంది నన్ను అన్నయ్య అంటారు. పవిత్ర: అన్నయ్య అంటారు కానీ రాఖీ కట్టరు.. కట్టించుకోడు (నవ్వుతూ). అన్నా, చెల్లెళ్ల మీద ఓ భారీ ఎమోషనల్ సినిమా వచ్చిందనుకుందాం. ఏం చేస్తారు? ఆకాశ్: ఏమో స్క్రిప్ట్ నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం. పవిత్ర: అన్నయ్య ఏ పాత్ర ఇచ్చినా బాగా చేస్తాడు. అందులో డౌటే లేదు. పవిత్ర ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఆకాశ్: కాంప్లిమెంట్ అంటూ ఏం లేదు. అమ్మకి , చెల్లెలికి స్పెషల్‌గా ‘మెహబూబా’ షో వేశాం. సినిమా అయిపోగానే అమ్మ నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. చెల్లి తన ఫ్రెండ్స్ అందరితో ఫుల్ పార్టీ చేసుకుంది. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే నీ డ్రీమ్ రోల్? ఆకాశ్: ఒక్కటనేం లేదు. చాలా ఉన్నాయి. జేమ్స్‌బాండ్, కౌబాయ్ ఇలా చాలెంజింగ్ పాత్రలు ఏవైనా సరే చేయాలని ఉంది. అన్ని జోనర్స్ టచ్ చేయాలనేది నా డ్రీమ్. నాన్న పెద్ద డైరెక్టర్, అన్నయ్య యాక్టర్. చూడటానికి అందంగా ఉంటానుగా ఎందుకు యాక్టింగ్ చేయకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా? పవిత్ర: ఫస్ట్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం. ప్రొడక్షన్లో సక్సెస్ అయ్యాక అప్పటికి ఎవరైనా ఆఫర్ ఇస్తే చేస్తా. ఎందుకు చేస్తాను అంటున్నానంటే ‘మెహబూబా’ రిలీజ్ తర్వాత నాకు రెండు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అమ్మను దాదాపు రెండు వారాలు బతిమాలారు.. ఆ సినిమా టీమ్ వాళ్లు. అన్నయ్య గురించి బాగా ఎమోషనల్‌గా ఫీలయిన సందర్భం ఏదైనా? పవిత్ర: అన్నయ్య మొదటి సినిమా ఓపెనింగ్ కులు మనాలీలో జరిగింది. ఆ ఓపెనింగ్‌కి వెళ్లాలనుకున్నాను. కానీ నాకు కాలేజ్ ఉంది. అయినా సరే వెళ్లాలనుకుని అమ్మను అడిగాను. అక్కడ వెదర్ బాగా లేదని నాన్న వద్దన్నారు. అలా సినిమా మొదటి రోజున అన్నయ్యను మిస్సయినందకు బాధ అనిపించింది. ‘మెహబూబా’ మూవీ చేద్దామని నాన్న చెప్పగానే ఆకాశ్ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. ఆ సినిమా స్టార్టవ్వటానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే తను బ్యాంకాక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, ఇంట్లోనే డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్ దగ్గర వీటి గురించి డిస్కస్ చే సేవాడు. అందుకే ఫస్ట్ డే షూటింగ్లో తన ఎగై్జట్‌మెంట్ చూడాలనుకున్నాను. అది జరగనందుకు కొంచెం ఎమోషన్ అయ్యాను. ఫైనల్లీ.. మా సమక్షంలో మీ అన్నయ్యకు రాఖీ కట్టండి.. ఆకాశ్: మరి కాళ్ల మీద కూడా పడాలి. అలా ఎందుకు అడిగానంటే రాఖీ కడుతుంది కానీ కాళ్ల మీద పడదు. పవిత్ర: ఈసారి నీ ఆశ నెరవేరుతుంది అంటూ అన్నకు రాఖీ కట్టి, కాళ్ల మీద పడిన పవిత్రను తనదైన స్టైల్లో ఆకాశ్ సరదాగా ఆశీర్వదించాడు. -
డామిట్ ‘కారు’ అడ్డం తిరిగింది
ఇదో వింత ‘క్రైమ్’ కథ. ఎవరైనా కోట్ల లాభాలు ఆర్జించాలని బిజినెస్ ప్రారంభిస్తారు. కానీ.. ఆకాష్ నష్టాల కోసమే వ్యాపారంలోకి దిగాడు. ఎందుకంటే.. లాస్ మేకింగ్ సంస్థను ‘నల్లధన అక్రమార్కుల’కు అధిక మొత్తానికి అమ్మేయాలని స్కెచ్ వేశాడు. ఇందుకు ఖరీదైన కార్ల వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను 70శాతం ధరలకే కస్టమర్లకు విక్రయించి, 30శాతం తానే భరించేవాడు. ‘డిస్కౌంట్ స్కామ్’కు తెరతీయడంతో కస్టమర్లు పెరిగిపోయి, విపరీతంగా డబ్బు వచ్చి పడింది. ఒక్కసారిగా నోట్లకట్టలను చూసిన ఆకాష్ జల్సాలకు అలవాటు పడ్డాడు. పబ్బులు, క్లబ్బులు, టూర్లంటూ తెగ ఎంజాయ్ చేశాడు. కానీ.. డామిట్ ‘కారు’ అడ్డం తిరిగింది! ఆకాష్ కటకటాల పాలయ్యాడు. సాక్షి,సిటీబ్యూరో : సాధారణంగా ఎవరైనా లాభాలు ఆర్జించడానికే వ్యాపారం చేస్తారు. డిస్కౌంట్లో ఖరీదైన కార్లు ఇస్తానంటూ భారీ స్కామ్‌కు పాల్పడిన ఆత్మకూరు ఆకాష్ మాత్రం నష్టాల కోసమే దందా ప్రారంభించాడు. తన సంస్థను లాస్ మేకింగ్ సంస్థగా మార్చేసి ‘అమ్మేయాలనే’ ఉద్దేశంతోనే కార్ల వ్యాపారం ప్రారంభించాడు. అసలే నష్టానికి కార్లు విక్రయించే ఇతడి చేతికి డబ్బు రాగానే జల్సాలకు అలవాటుపడ్డాడు. సీన్ కట్ చేస్తే కేవలం ఏడాదిలో దాదాపు 100 మందికి రూ.18 కోట్ల వరకు బకాయి పడ్డాడు. శుక్రవారం ఆకాష్‌ను అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెద్దలతో ముడిపడి ఉన్న వ్యవహారం కావడంతో సొత్తు రికవరీ సవాల్‌గా మారింది. తండ్రి సంస్థను చేపట్టి... జహీరాబాద్‌కు చెందిన ఆకాష్ తండ్రి ఆర్కిటెక్ట్. వృత్తిలో భాగంగా సిటీకి వలసవచ్చిన ఆయన స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ విద్యను మధ్యలో ఆపేసిన ఆకాష్ జూబ్లీహిల్స్‌లోని ఈ సంస్థను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఓ దశలో లాస్ మేకింగ్ కంపెనీలను నల్లధనం ఉన్న వారు భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తారంటూ ఇతడికి తెలిసింది. దీంతో తన సంస్థను విక్రయించాలనే ఉద్దేశంతో నష్టాలబాటలో నడిపించాలని కంకణం కట్టుకున్నాడు. ఇందుకు మార్గాలు అన్వేషిస్తున్న అతడి దృష్టి ఖరీదైన కార్లపై పడింది. తక్కువ ధరకు వాహనాలు అమ్ముతానంటూ ప్రచారం చేసుకుని రంగంలోకి దిగితే నష్టాలతో పాటు పెద్ద సర్కిల్ ఏర్పడుతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా పబ్స్, క్లబ్స్‌లో ప్రచారం చేసుకుంటూ పెద్దలు, రాజకీయ, సినీ ప్రముఖుల కుమారులు/సంబంధీకులకు గాలం వేశాడు. అసలు విషయం తెలిసి.. ఫార్చునర్, బీఎండబ్ల్యూ, జాగ్వార్, ఆడి, ఫోర్చే... తదితర హైఎండ్ కార్లను 30 శాతం తక్కువ ధరకు విక్రయించడం మొదలెట్టాడు. 70 శాతం కస్టమర్ల నుంచి తీసుకుని మిగిలిన మొత్తం తానే వేసుకుని కార్లు ఇచ్చేవాడు. మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో ఆకాష్‌కు డిమాండ్ పెరిగింది. కొన్నాళ్లకు అతడు అందుబాటులో లేకపోయినా ఫోన్లో సంప్రదింపులు జరిగిన బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయడం మొదలెట్టారు. ఓ దశలో ఇతగాడికి షాకింగ్ నిజం తెలిసింది. లాస్ మేకింగ్ కంపెనీలకు ఖరీదు చేయడం అరుదుగా జరుగుతుందని, అలా చేయాలన్నా సదరు కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అయి ఉండాలని తెలుసుకున్నాడు. అయితే అప్పటికే భారీ మొత్తం అడ్వాన్సులు తీసుకోవడం, తన వద్ద ఉన్న డబ్బు అయిపోగా... ఒకరు ఇచ్చిన అడ్వాన్సులతో మరొకరికి కార్లు అందించడం జరిగిపోయింది. రుణమైనా తీసుకుందామని... దీంతో కంగుతిన్న ఆకాష్ కొన్నాళ్ల పాటు చేష్టలుడిగిపోయాడు. అయితే అప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో పాటు ‘బిజినెస్’ ఆపే పరిస్థితి లేకపోవడంతో మరో గత్యంతరం లేక ముందుకు వెళ్లాడు. కనీసం తన సంస్థను సమకాలీన అవసరాలకు తగ్గట్టు విస్తరించాలని, మరింత అభివృద్ధి చేయాలని భావించాడు. దీనికోసం బ్యాంకు నుంచి భారీ మొత్తం రుణం తీసుకోవాలని యోచించాడు. ఈ సంస్థ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఎంత ఎక్కువ మొత్తం టర్నోవర్ చూపిస్తే అంత ఎక్కువ లోన్ వస్తుందంటూ కొందరు ఇచ్చిన సలహా మేరకు టర్నోవర్ కోసం కార్ల దందాను కొనసాగించాడు. కార్లు ఖరీదు చేస్తామని చెప్పిన వారి నుంచి డబ్బును తన సంస్థ తన ఖాతాలో జమ చేయించుకునే ఆకాష్ దాని నుంచే షోరూమ్స్‌కు బదిలీ చేసేవాడు. కారు నంబర్ కోసం రూ.15 లక్షలు ఒక్కసారిగా రూ.కోట్ల టర్నోవర్ చూసేసరికి ఆకాష్ దృష్టి జల్సాలపై పడింది. రూ.3.5 కోట్ల ఖరీదైన కారును కొన్న ఆకాష్ రూ.15 లక్షలు వెచ్చించి ‘6666’ నెంబర్ దక్కించుకున్నాడు. తన వద్దకు కస్టర్లను తీసుకువచ్చిన దళారులకు రూ.1.9 కోట్లు కమీషన్లుగా చెల్లించాడు. కుటుంబంతో సహా వారం రోజుల పాటు బాలీకి వెకేషన్స్ కోసం వెళ్లి రూ.40 లక్షలు ఖర్చు చేశాడు. తరచూ స్నేహితులతో కలిసి బెంగళూరు వెళ్లి జల్సాలు చేసే ఇతడు ఒక్కో సందర్భంలో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లు చెల్లించేవాడు. ఇలా మొత్తమ్మీద రూ.4.5 కోట్లు సొంత అవసరాలకు, రూ.13.5 కోట్లు ‘30 శాతం’ కింద ఇతరులకు కార్లు సరఫరా చేయడానికి ఖర్చుచేశాడు. చివరకు విషయం పోలీసులకు వద్దకు చేరడంతో శుక్రవారం కటకటాల్లోకి వెళ్లాడు. మరోపక్క ఈ కేసులో రివకరీలకు చేయాలా? వద్దా? అనేది పోలీసులకు అంతు చిక్కట్లేదు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని భావిస్తున్నారు. దాదాపు ఏడాది కాలంలో ఆకాష్ 155 కార్లను డిస్కౌంట్లో విక్రయించాడు. వీటిని ఖరీదు చేసిన వారిలో విద్యాధికులు, బడా బాబులు, రాజకీయ, సినీ నేపథ్యం ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. వీరంతా డిస్కౌంట్ మొత్తం పోగా మిగిలింది చెల్లించిన వారే. దీంతో వీరి నుంచి కార్లు రికవరీ చేయాల్సిన అవసరం ఉండదని పోలీసులు భావిస్తున్నారు. డిస్కౌంట్‌గా తీసుకున్న 30 శాతం రికవరీ చేసి నష్టపోయిన వారికి ఇప్పించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వ్యవహారాల పరిష్కారానికి న్యాయసలహాలు తీసుకుంటున్నారు. -
మెహబూబా రెగ్యులర్ పూరి సినిమాలా లేదు
-
మెహబూబా కొత్తగా ఉంది : ప్రభాస్
కొద్ది రోజులుగా సరైన హిట్స్లేక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ శుక్రవారం మెహబూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో తన తనయుడు ఆకాష్‌ను రీ లాంచ్ చేస్తున్నాడు పూరి. భారత్ పాక్‌ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథను పూరి స్వయంగా నిర్మించారు. ప్రమోషన్ విషయంలో కూడా పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెహబూబా టీంకు తన అభినందనలు తెలియజేశారు. ‘మెహబూబా రెగ్యులర్ పూరి సినిమాలా లేదు. పూరి సినిమాలు ఎక్కువగా హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూనే తిరుగుతాయి. మెహబూబా కొత్తగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఆకాష్ లుక్స్, వాయిస్ బాగున్నాయి. ఆకాష్ పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నా’ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. -
ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరిపై అందరి దృష్టి!
సాక్షి, బెంగళూరు: దేశంలో అత్యంత సంపన్న లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలంపాట ఇటీవల అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. టాప్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లే కాదు.. వేలంపాటలో పాల్గొన్న సంపన్నుల పిల్లలు కూడా పలువురి దృష్టిని ఆకర్షించారు. ఈ వేలంపాటలో ముంబై ఇండియన్స్ టేబుల్ వద్ద ఆ జట్టు యాజమాని ముఖేశ్ అంబానీ సతీమణి నీతతోపాటు వారి తనయుడు ఆకాశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆటగాళ్ల బిడ్డింగ్‌లో కీలక పాత్ర పోషిస్తూ.. పెడెల్ను రైజ్ చేయడంలో ఆకాశ్ ముందంజలో కనిపించాడు. ఇక, 17 ఏళ్ల ఝాన్వీ కూడా ఆటగాళ్ల వేలంపాటలో అందరి దృష్టి ఆకర్షించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు సహ యాజమానులైన నటి జుహీ చావ్లా, నిర్మాత జయ్ మెహతాల కూతురు ఝాన్వీ. కేకేఆర్ ఫ్రాంచైజీ వ్యూహరచనలోనూ పాలుపంచుకుంటున్న ఝాన్వీ ఆటగాళ్ల బిడ్డింగ్‌లోనూ చురుగ్గా పాల్గొని.. స్పెషల్ ఆట్రాక్షన్‌గా నిలిచింది. సహజంగా రిటైర్డ్ క్రికెట్ దిగ్గజాలు పాల్గొనే ఈ వేలంపాటలో ఈ యంగ్‌స్టర్స్ పాల్గొనడం ఆసక్తి రేకెత్తించింది. -
పూరి ‘హగ్’పై వర్మ ఏమన్నాడంటే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ మొదటిసారి ‘హగ్’ అనే ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కంచడం విశేషం. ఇటీవల పూరి ‘నా తొలి షార్ట్ ఫిల్మ్ ‘హగ్’ ఆ నెల 31న ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నాం. రెడీగా ఉండండి అని’ ‘హగ్’ పోస్టర్ కూడా పోస్టు చేసిన విసయం తెలిసిందే. ఈ షార్ట్ ఫిల్మ్‌పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఆయన తన ఫెస్‌బుక్‌లో ‘ నేను పూరి జగన్ ‘హగ్’ షార్ట్ ఫిల్మ్‌ను చూశాను. వారి పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ఈ ‘హగ్’ సానుభూతి, గిల్ట్, ప్రేరణ వంటి రకరరాల భావోద్వేగాలను కలిగిస్తుంది’ అని వర్మ పోస్టు చేశాడు. బాలకృష్ణతో ‘పైసా వసూల్’ సినిమా తర్వాత పూరి కొడుకు ఆకాశ్‌తో ‘మెహబూబా’ సినిమా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. -
పూరి హగ్...
చిన్న చిత్రాల ద్వారా తమ ప్రతిభ నిరూపించుకుని ఫీచర్ ఫిల్మ్స్ డైరెక్టర్ అయిన వారు టాలీవుడ్లో ఉన్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ తొలిసారి ‘హగ్’ అంటూ ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించడం విశేషం. ఇప్పటివరకూ డైరెక్టర్‌గా తనలోని ఒక కోణం మాత్రమే చూపించిన ఆయన ఈ నెల 31న మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. బాలకృష్ణతో ‘పైసా వసూల్’ సినిమా తర్వాత తనయుడు ఆకాశ్‌తో ‘మెహబూబా’ సినిమా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు పూరి. ‘ఈరోజు (శనివారం) సాయంత్రం 5 గంటలకు పూరి ఓ వార్త చెప్పబోతున్నారు’ అంటూ చార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనయుడితో తీస్తున్న ‘మెహబూబా’ సినిమా గురించి చెబుతారా? లేక మరో విషయం ఏదైనా ఉంటుందా? అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. ‘‘నా తొలి షార్ట్ ఫిల్మ్ ‘హగ్’. ఈ నెల 31న ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నాం. రెడీగా ఉండండి’ అంటూ ‘హగ్’ పోస్టర్ కూడా పోస్ట్ చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు పూరి. -
ఇండియా అబ్బాయి.. పాకిస్తాన్ అమ్మాయి..!
ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో పడ్డ దర్శకుడు పూరి జగన్నాథ్, పైసా వసూల్ సినిమాతో పరవాలేదనిపించాడు. మరోసారి రోటీన్ కథతో నిరాశపరిచినా నందమూరి బాలకృష్ణను సరికొత్తగా చూపించి అభిమానులను మెప్పించాడు. పైసా వసూల్ తరువాత ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయని పూరి, త్వరలోనే తన కొడుకు ఆకాష్ హీరోగా ఓ సినిమాను స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడట. అయితే మాస్ యాక్షన్ సినిమాలతో బోర్ కొట్టించిన పూరి కొడుకు రీలాంచ్ కోసం రూట్ మారుస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం, ఇడియట్, శివమణి లాంటి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీలతో అలరించిన పూరి మరోసారి అదే తరహా సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇండియా అబ్బాయి, పాకిస్తాన్ అమ్మాయిల మధ్య ప్రేమ కథతో తన ఆకాష్ ను రీలాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
ప్రాణం పోయినా సరే... పని జరగాలి!
‘ఎక్కడ ఉన్నా సరే మసూద్ భాయ్ మనకు కావాలి.మన ప్రాణాలు పోయినా సరే’ లివాటు వ్యవహారం, పెంకితనం, మూర్ఖత్వం కలగలిసిన ‘ఆకాశ్’గా ‘ఛత్రపతి’లో నటించినా, ప్రాణాలు పోయినా సరే అనుకున్నది సాధించాలనే కరడుగట్టిన ఉగ్రవాది అజార్గా ‘ఖడ్గం’ సినిమాలో కనిపించినా... దుర్మార్గంలోని రకరకాల ఫ్లేవర్స్‌ను నేర్పుగా ప్రకటించగలిగే నటుడు షఫీ. ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చదువుకున్న ఈ చంద్రగిరి కుర్రాడు పెద్ద పెద్ద వాళ్ల దగ్గర నటనలో మెళకువలు నేర్చుకున్నాడు. ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయేంత నైపుణ్యాన్ని సాధించాడు. ‘ఖడ్గం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన షఫీ, ‘ఛత్రపతి’ సినిమాలో విలన్‌తో చేతులు కలిపిన కథానాయకుడి తమ్ముడు ‘ఆకాశ్’గా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు.‘‘నేను రైటర్, డైరెక్టర్, యాక్టర్‌ని’’ అని చెప్పుకునే షఫీలో ‘నేను ఇలా అనుకుంటున్నాను. ఇలా మాత్రమే నటిస్తాను’ అనే పట్టింపులేమీ లేవు. ఆయన దృష్టిలో రచయితకు, దర్శకుడికి మంచి ప్రాధాన్యత ఉంది. రచయిత ఊహలకు డైరెక్టర్ ఒక రూపం కల్పిస్తే నటుడు దానికి ప్రాణం పోస్తాడు అని నమ్ముతాడు షఫీ. ‘నా నుంచి డైరెక్టర్ తీసుకున్నట్లే... డైరెక్టర్ నుంచి కూడా నేను తీసుకుంటాను’ అంటాడు. అంత మాత్రాన భారం మొత్తం ఆ ఇద్దరి మీదే వేయడు. తాను చేస్తున్న పాత్రలో జీవం తీసుకురావడానికి రకరకాలుగా కసరత్తులు చేస్తుంటాడు.‘శ్యామ్‌గోపాల్‌వర్మ’ సినిమా కోసం ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో మంది వ్యక్తులను ఇంటర్వూ్య తీసుకొని నోట్స్ రాసుకున్నా, ‘కమ్లీ’ సినిమాలో రేడ్యా పాత్ర కోసం మహబూబ్‌నగర్ కూలీలను కలిసి వారి వేషభాషలు అధ్యయనం చేసినా, ‘ఖడ్గం’ సినిమా కోసం చార్మినార్ ప్రాంతంలో అద్దెకు ఉన్నా.... ఒక పాత్ర పండించడం కోసం చేయాల్సినంత హోంవర్క్ చేయడంలో ముందుంటాడు షఫీ. ‘డబ్బులు ముఖ్యం కాదు...సంతృప్తి ముఖ్యం’ అంటున్న షఫీ ఆచితూచి పాత్రలను ఎంచుకుంటాడు. ఒక్కసారి ఓకే అన్నాక...దానికి వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ‘ఖడ్గం’లో అజార్ నుంచి ‘శివమ్’లో ముస్తాఫా వరకు, ‘రెడీ’లో నాగప్ప నుంచి ‘ఖలేజా’లో సిద్దప్ప వరకు రకరకాల పాత్రలను విజయవంతంగా పండించాడు షఫీ.‘నటుడు తెల్లటి కాన్వాస్లాంటి వాడు’ అంటున్న షఫీ ఆ కాన్వాస్‌పై ‘విలన్’ అనే పెయింటింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. -
తైక్వాండో చాంప్స్ ఆకాశ్, అక్షిత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఆకాశ్ (యూటీఏ), అక్షిత (యూటీఏ)లు విజయం సాధించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీ క్యాడెట్ బాలుర అండర్- 49 కేజీ విభాగంలో ఆకాశ్ (యూటీఏ) 3-2తో గౌతమ్ సింగ్ (సీటీసీ)పై గెలుపొందగా... బాలికల అండర్- 47 విభాగంలో ఎం. అక్షిత (యూటీఏ) 7-3తో నిధి (ఎస్టీసీ)ని ఓడించింది. ఇతర పోటీల్లో అండర్- 44 కేజీ కేటగిరీలో మనీశ్ (యూటీఏ) 5-3తో అనిత (జీటీఏ)పై, కృతి మలిక్ (మ్యాక్స్) 5-4తో తనుశ్రీ (ఐటీసీ)పై గెలుపొందారు. బాలుర విభాగంలో అండర్-33 కేజీ కేటగిరీలో రోహన్ (యూటీఏ) 5-4తో సౌరిశ్ (ఏఎంఆర్ఈఆర్)పై, అండర్-41 కేజీ కేటగిరీలో స్వరూప్ కిరణ్ (యూటీఏ) 7-3తో స్వపన్ (మ్యాక్స్)పై విజయం సాధించారు. సబ్ జూనియర్ బాలుర ఫలితాలు: అండర్-18 కేజీలు: 1. కర్మన్ సింగ్ (సీటీసీ), 2. కార్తీక్ (ఏఎంఈఈఆర్). అండర్-21 కేజీలు: 1. మానవ్ సింగ్ (సీటీసీ), 2. జశ్వంత్ (ఏఎంఈఈఆర్). అండర్- 23 కేజీ: 1. శివ్ కిరణ్ (సీటీసీ), 2. సంజయ్ నారాయణ (ఐటీసీ). అండర్-32 కేజీలు: 1. శివాన్ష అగర్వాల్ (మ్యాక్స్), 2. ఆకాశ్ అండర్-35 కేజీలు: 1. జి. రవిచంద్ర (ఐటీసీ), 2. నంద (ఏఎంఈఈఆర్). -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆకాశ్(20) బైక్ పై కళాశాలకు వస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు వైఎస్సార్ కడప జిల్లా రాయచోటికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. -
అగ్రస్థానంలో ఆకాశ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ ఆకాశ్ అగ్రస్థానంలో ఉన్నాడు. నాగోల్‌లోని అనంతుల ధర్మారెడ్డి గార్డెన్సలో జరుగుతోన్న ఈ టోర్నీలో తొమ్మిదిరౌండ్లు ముగిసే సరికి 8 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. హేమంత్‌రామ్ (తమిళనాడు), దాస్ (పశ్చిమ బెంగాల్) 7.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. తెలంగాణ క్రీడాకారుడు ఎ. అర్జున్ 6.5 పాయింట్లు సాధించాడు. శనివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో అర్జున్ (6.5)... జీల్ షా (6)పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో విక్రమ్‌జీత్ (7)... వెంకట కృష్ణ కార్తీక్ (6)పై, ప్రణవనంద (7)... శివ పవన్ తేజ (6)పై, లోకేశ్ (7)... రిత్విక్ (6)పై, పి. శ్యామ్ నిఖిల్ (7)... నిఖిల్ (6)పై, శరవణ కృష్ణన్ (7)... వినోత్ కుమార్ (6.5)పై, ఆకాశ్ (8)... చంద్రప్రసాద్ (7)పై విజయం సాధించారు. హేమంత్ రామ్ (7.5)... దాస్ (7.5), ఆకాశ్(6.5)... కుషాగ్ర మోహన్ (6.5), చక్రవర్తి (6.5)... రామకృష్ణ (6.5)ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. మరోవైపు 1500లోపు ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఐదు రౌండ్లు ముగిసే సరికి ఐదు పాయింట్లతో శుభమ్ కుమార్, అష్ఫక్, అభిషేక్ పాటిల్, శ్రీకాంత్, దిలీప్, ప్రవీణ్, రవి, రూపేశ్ సంయుక్తంగా మొదటిస్థానంలో నిలిచారు. -
బాబాయ్ అబ్బాయ్ ఓ పూరి జగన్నాథ్
బాబాయ్ - అబ్బాయ్ - ఒక ఫేమస్ డెరైక్టర్! నిజానికి ఈ టైటిలే అయితే ఇంకా బాగుండేదేమో.. కానీ పూరి జగన్నాథ్ లేకపోతే బాబాయ్ - అబ్బాయ్ ఉండేవారంటారా? అందుకే ఈ టైటిలే బెటర్! సాయిరామ్ శంకర్‌లో పరిణతి లేదని కాదు... ఆకాశ్‌లో సూర్యతేజం లేదనీ కాదు! నిజానికి కొండంత డెరైక్టర్ నీడలో... వీరిద్దరి ప్రతిభ మసకబారిందేమో అనిపిస్తోంది. కుర్రాళ్లిద్దరూ మంచివాళ్లే..! ‘చాలు చాలు... సినిమావాళ్లు మంచోళ్లా!?’ ఇంటర్వ్యూ చదవండి... మీకే అర్థమవుతుంది! ఒక్క సినిమా స్టోరీ చెప్పలేదు... అన్నీ మనసులోంచి వచ్చిన మాటలే..! ఎంజాయ్ సండే... బాబాయ్-అబ్బాయ్.. సౌండింగ్ బాగుంది. మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో? ఇద్దరూ: సూపర్ అండి. బాబాయ్-అబ్బాయ్‌లా కాకుండా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్‌లానే ఉంటాం. మమ్మీ-డాడీ దగ్గర చెప్పుకోలేనివి బాబాయ్‌తో..? సాయి: పిల్లలు ఏదైనా చెప్పుకునే ఫ్రీడమ్ మా అన్న-వదిన ఇస్తారు. కాకపోతే బాబాయ్ అంటే ఫ్రెండ్‌లా కాబట్టి... సరదా సరదా విషయాలు చెబుతుంటాడు. ఆకాశ్: డాడీ బిజీగా ఉంటారు కాబట్టి... ఏ విషయం అయినా అమ్మ దగ్గరే చెబుతాం. బాబాయ్‌తో మాట్లాడేటప్పుడు ఏది పడితే అది హ్యాపీగా మాట్లాడేస్తాం. మీ ఫ్రెండ్లీ బాబాయ్ కెరీర్‌వైజ్‌గా సక్సెస్ కావడం లేదు కదా. మీకేమైనా బాధగా ఉంటుందా? ఆకాశ్: ‘143’, ‘డేంజర్’, ‘బంపర్ ఆఫర్’... ఇలా మా బాబాయ్వి కొన్ని సక్సెస్‌లే చూశాను. సినిమాలు ఫ్లాప్ అయ్యుండొచ్చేమో కానీ, ఆర్టిస్ట్‌గా ఆయన ఎప్పుడూ ఫెయిల్ కాలేదండి. అబ్బో.. బాగానే వెనకేసుకొస్తున్నాడు.. సాయి: వాడి వెనక నేనుంటే కనిపించను. ఎంత హైట్‌గా ఉన్నాడో చూశారుగా. ఈ రెండేళ్లల్లో బాగా పెరిగాడు. ఇంత హైట్ అవుతాడనుకోలేదు. నాకూ, పూరీ అన్నయ్యకు మధ్యలో ఉన్న మా గణేశ్ అన్నయ్య మంచి హైట్. బహుశా అది వచ్చి ఉంటుందేమో. ఇంకా బాబాయ్ ఏమీ సాధించలేదు. ఈలోపు అబ్బాయి హీరోగా రెడీ అయిపోతున్నాడు... పోటీ? సాయి: అస్సలు లేదు. కళ్ల ముందు పెరిగినవాళ్లు మనకన్నా మించి ఉండాలని కోరుకుంటాం కదా. అయినా నేను మావాణ్ణి బ్రదర్‌లా అనుకుంటా. ఎందుకంటే మా వదిన మమ్మల్ని సొంత కొడుకులా చూసినట్లే చూస్తుంది. అన్నను తమ్ముడు మించాలండి. ఆకాశ్: నేను హీరో కావడానికి ఇంకో మూడేళ్లు ఉందండి. ఈ మూడేళ్లల్లో మా బాబాయ్ కెరీర్ పీక్స్‌కి వెళుతుందనుకుంటున్నా. చూస్తూ ఉండండి.. మా బాబాయ్ గట్టి హిట్ సాధిస్తాడు. సాయి గారూ... మీ లుక్స్ బాగుంటాయి. బాగా యాక్ట్ చేస్తారు. అయినా రేంజ్ పెరగకపోవడానికి కారణం? సాయి: లుక్స్, యాక్టింగ్ కన్నా ముందు మంచి కథ ముఖ్యం. ‘143’, ‘డేంజర్’, ‘బంపర్ ఆఫర్’ మంచి రిజల్ట్‌నే ఇచ్చాయి. కొన్ని కథలను సరిగ్గా సెలక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇలా మిగిలిపోయా (నవ్వుతూ). కెరీర్‌వైజ్‌గా వెనకబడి... ఇలా హాయిగా నవ్వడం బహుశా మీకే సాధ్యం అవుతుందేమో? సాయి: కీడెంచి మేలెంచమంటారు. నేనా టైపే. ఫెయిల్యూర్‌కి ప్రిపేర్ అవుతా. రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చిందనుకోండి... హ్యాపీ. లేకపోతే పెద్దగా బాధ అనిపించదు. కాసేపు బాధ పడి రొటీన్లో పడిపోతా. మరి... ఆకాశ్! మీరూ మీ బాబాయ్ టైపేనా? మీ ‘ఆంధ్రా పోరి’ హిట్ కాలేదు కదా? ఆకాశ్: నేను కూడా కొంచెం బాబాయ్ టైపే. కాసేపు బాధపడ్డా. ‘నువ్వు బాగా యాక్ట్ చేశావ్’ అని నాన్న మెచ్చుకున్నారు. ఫస్ట్ సినిమా అయినా బాగా చేశావని అందరూ అన్నారు. నా వరకూ నేను బాగానే చేశానండి. ‘ఆంధ్రా పోరి’ చూసి, మీకేమనిపించింది సాయి? సాయి: మావాడి స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. తనలో మహీరో మెటీరియల్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. పూరీ బ్రదర్ అంటే అవకాశాలు బాగానే వస్తాయి. సినిమా సినిమాకీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారేంటి? సాయి: ‘బంపర్ ఆఫర్’ హిట్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఓ పెద్ద నిర్మాత నాతో సినిమా చేస్తాననడంతో వాటిని వదిలేసుకున్నా. అక్కినేని నాగేశ్వరరావుగారు-శ్రీహరిగారు-నా కాంబినేషన్లో ఆ సినిమా ప్లాన్ చేశారు. నాలుగైదేళ్ల క్రితం ఏయన్నార్‌గారు మీసాలు పెంచారు. అది ఈ సినిమా కోసమే. ‘ఇదే చివరి సినిమా.. ఇక చేయను’ అని ఆయన అన్నారు. గ్రేట్ కాంబినేషన్ కాబట్టి, ఈ ఒక్క సినిమా మీదే దృష్టి పెట్టాలనుకున్నా. ఒకటీ రెండూ.. మూడు... అలా తొమ్మిది నెలలు గడిచిపోయాయ్. హఠాత్తుగా సినిమా చేయడం లేదని ఆ నిర్మాత చేతులెత్తేశాడు. అప్పుడర్థమైంది.. జీవితంలో ఎప్పుడూ ఒకే సినిమా మీద ఆధారపడకూడదని. ముఖ్యంగా హిట్ సినిమా చేశాక గ్యాప్ తీసుకోకూడదని. మీ అన్నయ్య ఏమీ అనలేదా? సాయి: వర్కవుట్ కాదు. అతను సినిమా తీయడని ముందే చెప్పాడు. మీ అన్నయ్య మీతో డెరైక్టర్‌గా-ప్రొడ్యూసర్‌గా సినిమాలు చేశారు. డబ్బులు పోగొట్టుకున్నారు. మీకేమైనా గిల్టీగా..? సాయి: గిల్ట్ ఉంటుందండి. కొడుకు మీద ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది తండ్రులు వెనకాడతారు. తమ్ముడి కోసం ఓ తండ్రి కన్నా ఎక్కువే చేశాడు. డబ్బులు నష్టపోయాడు. బాబాయ్ కోసం మీ నాన్న డబ్బులు పోగొట్టుకున్నందుకు మీకేమైనా కోపం? ఆకాశ్: అస్సలు లేదండి. ఒకవేళ నాన్న వేరే హీరో మీద పెట్టినా డబ్బులు పోయేవి. సొంత తమ్ముడి కోసమే కదా పెట్టారు. ఒకవేళ ఆ సినిమాలు డబ్బులు తెచ్చి ఉంటే, అప్పుడు మేమంతా ఎంజాయ్ చేసేవాళ్లం కదా... పూరీగారు తక్కువ టైమ్‌లో కోట్లు సంపాదించి.. దాదాపు అన్నీ పోగొట్టేసుకున్నారు. చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేస్తున్నారని మీరు గ్రహించలేకపోయారా? సాయి: బేసిక్‌గా అన్నయ్య అందర్నీ నమ్ముతాడు. కోట్లు కొట్టేస్తారని ఎవరైనా ఊహిస్తారా? మేం కూడా గ్రహించలేదు. తెలుసుకునే సరికి అంతా అయిపోయింది. ఆ కష్టాలన్నీ మీ డాడీ మీకు చెప్పారా? ఆకాశ్: ఇబ్బందులేవీ మాకు తెలియకూడదని నన్నూ, పవిత్ర (ఆకాశ్ చెల్లెలు)నూ హాస్టల్లో చేర్చారు. మూడేళ్లు హాస్టల్లో ఉన్నాం. వచ్చిన తర్వాత తెలిసి, బాధ అనిపించింది. మీరిందాక చుట్టూ ఉన్నవాళ్లు అన్నారు కదా.. ఒక్కోసారి వాళ్లు మా డాడీని కలవడానికి కూడా ఒప్పుకునేవాళ్లు కాదు. బిజీగా ఉన్నారనేవాళ్లు. మేం వాళ్లను బయటివాళ్లలా అనుకోలేదు. మా సొంత బాబాయ్లానో, మావయ్యలానో అనుకునేవాళ్లం. సాయి: (మధ్యలోనే అందుకుంటూ...) నేను మా అన్నయ్యను కలవాలన్నా వాళ్ల పర్మిషనే తీసుకోవాల్సి వచ్చేది. పోగొట్టుకున్న డబ్బుని పూరీగారు తక్కువ సమయంలోనే సంపాదించారు. ఇలా అందరికీ సాధ్యం కాదు... సాయి: అన్నయ్య మంచితనమే ఆయనకు మంచి చేస్తోంది. నాకు తెలిసి గడచిన పన్నెండేళ్లల్లో లక్షా, 2 లక్షలు, ఐదు లక్షలు... ఇలా హెల్ప్ పేరుతో ఈజీగా ఐదారు కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు. అలా చేశాడు కాబట్టే, మళ్లీ ‘బౌన్స్ బ్యాక్’ కాగలిగాడు. ఆకాశ్: యస్.. మా డాడీ నైస్ హ్యూమన్ బీయింగ్. అన్నదమ్ముల అనుబంధం ఎంత బాగున్నా.. ఇంట్లో ఆడవాళ్ల కారణంగా ప్రాబ్లమ్ రావడం కామన్. మీకు డబ్బులు పెట్టినప్పుడు మీ వదిన ఏమైనా..? సాయి: మీరన్నది నిజమే. కానీ, మా ఇంట్లో వేరు. మా వదిన ఒక్క మాట కూడా అనలేదు. మా ఆవిడ, వదిన బాగుంటారు. వాళ్లకు వేవ్ లెంగ్త్ కుదరడం మాకు హ్యాపీ. ఆకాశ్... మళ్లీ బాబాయ్‌తో డాడీ ఓ సినిమా చేస్తే బాగుంటుందని అనిపిస్తోందా? ఆకాశ్: ఇద్దరి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. సాయి: అన్నయ్య నా కోసం చేయాల్సిందంతా చేశాడు. దర్శక-నిర్మాతగా ‘143’, నిర్మాతగా ‘హలో.. ప్రేమిస్తారా..’, కథ-మాటలు రాయడంతో పాటు ఆయనే ‘బంపర్ ఆఫర్’ను నిర్మించారు. ఇంకా ప్రెజర్ ఇవ్వకూడదనే నేను బయట సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. ఈ డిసెంబర్లో గట్టు ఎక్కేస్తానని అనుకుంటున్నాను. ఆకాశ్: యస్... అది నిజమవుతుంది. హీరోగా రవితేజ స్ట్రాంగ్ అవడానికి మీ అన్నయ్యే కారణం కదా! సాయి: ఒకరికొకరు తోడయ్యారు. అన్నయ్యకు ఓ హీరో కావాలి. రవితేజగారికి ఓ దర్శకుడు కావాలి. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’తో ఇద్దరి జర్నీ స్టార్టయింది. అన్నయ్య కథలకు సరిపడే హీరో రవితేజగారు, అలాంటి ఎనర్జిటిక్ హీరోకి సరిపడా కథలు రాసిన దర్శకుడు మా అన్నయ్య. అన్నయ్య దగ్గర ఏడేళ్లు సహాయ దర్శకుడిగా చేశారు. మీ కోసం ఓ కథ రాసుకోవాలనిపించలేదా? సాయి: ప్రేక్షకులందరి దయతో రెండు మూడు సినిమాలు ఆడితే... అప్పుడు ఆలోచిస్తా. ఆకాశ్: బాబాయ్ నా కోసం ఓ కథ రాయాలి. సాక్షి: అప్పుడే అబ్బాయి కర్చీఫ్ వేసేశాడు! (నవ్వులు) మీ డాడీ పనిచేసిన హీరోల్లో మీకు ఎవరు క్లోజ్? ఆకాశ్: అందరూ క్లోజ్‌గా ఉంటారు. చిన్నప్పుడు నాది రింగు రింగుల జుట్టు. పెద్దయ్యాక ‘కెమెరామ్యాన్ గంగతో రాంబాబు’ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారిని కలసినప్పుడు.. ‘నీ జుట్టు బాగుండేది. ఇప్పుడేమైంది’ అనడిగారు. అందరూ బాగుంటారు. సాయి: ఆకాశ్ పుట్టు వెంట్రుకలు తీయించడం లేటయింది. మొదటి సంవత్సరంలోపు తీయకపోతే మూడేళ్ల వరకూ తీయకూడదు కదా. దాంతో జుత్తు బాగా పెరిగిపోయింది. ‘బద్రి’ టైమ్‌లో మనోడు జాకీర్ హుస్సేన్ (తబలా ప్లేయర్)లా ఉండేవాడు. అప్పుడు షూటింగ్‌కి తీసుకువెళ్లాం. పవన్‌గారు ఆకాశ్ జుట్టుతో ఆడుకునేవారు. ఆకాశ్! మీరు పాకెట్ మనీ ఎంత తీసుకుంటారు? సాయి: ఆ... అన్నీ చెప్పేస్తారు మీకు (నవ్వులు). ఆకాశ్: ఎప్పుడు సినిమాకి వెళ్లినా అమ్మ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంటా. పాకెట్ మనీ అని ప్రత్యేకంగా తీసుకోను. మమ్మీ చాలా స్ట్రిక్ట్. బాబాయ్‌తో ప్రేమ కబుర్లు కూడా చెబుతారా? ఆకాశ్: నేనింకా ప్రేమించలేదు కానీ... బాబాయ్ దగ్గర పిచ్చ ఫ్రీడమ్. అన్నీ చెప్తాను. సాయీ! మీది ప్రేమ వివాహమే కదా? సాయి: అవునండి. అమ్మానాన్న, అన్నయ్య-వదిన దగ్గరుండి మరీ పెళ్లి చేశారు. మీ ఫ్యూచర్ కోసం ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. ఇద్దరూ: థ్యాంక్యూ అండి... అందరికీ హ్యాపీ సండే. - డి.జి. భవాని -
కడుపులోని బిడ్డకు తండ్రివి కాదన్నందుకు..
వెల్లింగ్టన్: ప్రెగ్నెన్సీతో ఉన్న గాళ్‌ఫ్రెండ్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో భారతీయ విద్యార్థికి 17 ఏళ్ల కనీస శిక్షతో జీవిత కారాగార శిక్ష పడింది. మంగళవారం ఆక్లాండ్ హైకోర్టు జడ్జి మాథ్యూ పాల్మెర్ ఈ మేరకు తీర్పు చెప్పారు. ఆకాశ్ (24) అనే విద్యార్థి న్యూజిలాండ్‌లో చదువుకుంటున్నాడు. అతనికి గురుప్రీత్ కౌర్ (22) అనే గాళ్‌ఫ్రెండ్ ఉంది. వీరిద్దరూ ఏడాది పాటు రహస్యంగా డేటింగ్ చేశారు. కాగా గత ఏప్రిల్ 7న ఆకాశ్, కౌర్ ఘర్షణ పడ్డారు. తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రివి నీవు కావని, బంధాన్ని ఇంతటితో తెంచుకుందామని కౌర్.. ఆకాశ్‌కు చెప్పడంతో గొడవ మొదలైంది. తీవ్ర ఆగ్రహం చెందిన ఆకాశ్ కత్తి తీసుకుని 29 సార్లు కౌర్‌ను విచక్షణరహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి ఆక్లాండ్ దక్షిణ ప్రాంతంలో పొదల్లో పడేశాడు. కౌర్‌ను తాను హత్య చేయలేదని తొలుత బుకాయించిన ఆకాశ్ పోలీసులు విచారణలో నేరం అంగీకరించాడు. కోర్టు ఆకాశ్‌ను దోషిగా నిర్ధారించి శిక్షను ఖరారు చేసింది. -
రెండేళ్ల తర్వాత ఆకాష్‌తో సినిమా: పూరీ
కోటవురట్ల: తన కుమారుడు ఆకాష్ పూరీ పూర్తిస్థాయి హీరోగా రెండేళ్ల తర్వాత సినిమా తీయనున్నట్టు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఆయన శుక్రవారం రాత్రి మండలంలోని బి.కె.పల్లికి వచ్చారు. శనివారం తిరిగి హైదరాబాద్‌కు వెళుతూ విలేకరులతో మాట్లాడారు. కుమారుడు ఆకాష్ బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు. నటనపై ఆసక్తి ఉండడంతో పూర్తిస్థారుు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నటనకు సంబంధించి అన్ని విభాగాల్లో విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నాడని తెలిపారు. శిక్షణ పూర్తరుున తర్వాత తన దర్శకత్వంలోనే మంచి సినిమా చేస్తాడని చెప్పారు. తాను ఇప్పటి వరకు 33 సినిమాలు తీశానని, తాను చేసిన సినిమాలన్నీ సంతృప్తిని ఇచ్చినవే అన్నారు. పోకిరి, టెంపర్ చిత్రాలు ఆనందాన్ని ఇచ్చాయన్నారు.ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌తో చేసిన ఇజం సినిమా ఈ నెలాఖరుకు విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రాన్ని కుటుంభ సభ్యులతో కలిసి నర్సీపట్నంలో వీక్షించనున్నట్టు చెప్పారు. తదుపరి మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లతో చిత్రాలు చేయనున్నట్టు తెలిపారు. -
మా పిల్లల సృష్టే జియో
ముంబై : రిలయన్స్ జియో ప్లాన్... యువత కోసం యువత తయారుచేసిన డేటా ప్యాక్. రిలయన్స్ జియోలో రెండేళ్ల క్రితం డైరెక్టర్లుగా చేరిన తన కుమారుడు ఆకాష్, కుమార్తె ఈషా మనసులో వచ్చిన ఆలోచనే జియో డేటా టారిఫ్‌ల రూపకల్పనకు పునాదని చైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించారు. డేటా వాడకం దిశగా భారతీయ యువత ఎంత మొత్తంలో డబ్బు వెచ్చిస్తోంది. నెలకు ఎంత డేటా సరాసరి అవసరమవుతుందో పరిగణలోకి తీసుకుని ఈ ప్లాన్‌ను తయారుచేసినట్టు వెల్లడించారు. భారత్‌లో స్మార్ట్ ఫోన్ యూజర్ల సరాసరి వయసుకు దగ్గరగా ఉన్న 24 ఏళ్ల ఆకాష్, ఈషాలు యువతరానికి ప్రతినిధులుగా తాను నమ్ముతున్నట్టు ముఖేష్ ప్రకటించారు. ఈ ప్రకటనను షేర్ హోల్డర్లు హర్షధ్వానాల మధ్య స్వాగతించారు. ఇండియాలో ఇకపై 'గాంధీగిరి' స్థానంలో 'డేటా గిరి' వస్తుందని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డేటా చార్జీలతో పోలిస్తే 10 శాతం చార్జీతోనే తాము డేటాను అందిస్తామని తెలిపారు. జియోను వాడేవారిలో అత్యధికులు 30 శాతం కన్నా తక్కువ వయసున్నవారే ఉంటారని అన్నారు. తమ కంపెనీలో పనిచేసే వారి సగటు వయసు కూడా 30 ఏళ్లేనని ప్రకటించారు. యువకుల కోసం యువకులు తీసుకొచ్చిన ఈ జియో టారిఫ్ ప్లాన్ యూజర్లకు ఎంతో కీలకంగా మారనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గురువారం జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ తో పాటు జియో డైరెక్టర్లుగా ఉన్న ఆకాష్, ఈషా, చిన్న కుమారుడు అనంత్, భార్య నీతా అంబానీ, గ్రాండ్ మదర్ కోకిలా బెన్ పాల్గొన్నారు. జియో డేటా ప్లాన్ రూపకల్పనకు బాధ్యత వహించిన ఈషా, ఆకాష్‌లు కవలలు. బ్రౌన్ యూనివర్సిటీలో ఆకాష్ ఎకనామిక్స్ ప్రధానాంశంగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఈషా యెల్ యూనివర్సిటీలో చదువుకుంది. సైకాలజీ, సౌత్ ఆసియన్ స్టడీస్‌లో డబుల్ మేజర్స్‌గా ఈషా గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. మెక్ ఇన్సేలో ఈషా బిజినెస్ విశ్లేషకురాలిగా పనిచేసింది. రెండేళ్ల క్రితమే వీరు రిలయన్స్ రీటైల్ వెంచర్స్‌కు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. -
‘మదర్’ను నడిపించాడు.. రికార్డు సృష్టించాడు..
టీనేజీ కుర్రాడి కృషికి ‘గిన్నిస్’ గుర్తింపు లక్షల మందితో ‘రక్తనిధి’ ఏర్పాటు టీనేజర్ అంటే కొండంత ఆవేశం, కాసింత ఆలోచన, పిసరంత ఆచరణ.. అన్నట్టు మారిపోయిన సమకాలీన పరిస్థితుల్లో.. కొండంత ఆశయాన్ని తోడు చేసుకుని సాగిపోతున్నాడు ఓ కుర్రాడు. తోటి కుర్రాళ్లతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసే వయసులో సమాజానికి తనవంతు సాయం చేసేందుకు యజ్ఞం చేస్తున్నాడు. ఇందులో గిన్నిస్ రికార్డును సైతం అందుకున్నాడు. ఆ కుర్రాడి పేరు సాయి ఆకాశ్. చేస్తున్న యజ్ఞం అత్యవసర పరిస్థితిలో రక్తం దొరక్క అల్లాడుతున్న వారికోసం రక్త నిధిని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫిట్జీ స్కూల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్నవిజయవాడకు చెందిన ఆకాశ్ (17) గిన్నిస్ రికార్డ్ గుర్తింపు వెనుక అలుపెరగని కృషి ఉంది. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి కలాం ఫ్లాగ్ ఆఫ్ నుంచి గిన్నిస్ రికార్డ్ దాకా.. మృత్యుముఖంలో ఉన్న స్నేహితుడిని బతికించుకునేందుకు రక్తం కోసం పడిన కష్టం మరో యువకుడిలో అయితే వ్యవస్థ మీద ద్వేషాన్ని పెంచేదేమో. కానీ ఆకాశ్‌ని వ్యవస్థకు ఉపకరించే పటిష్టమైన రక్తనిధిని ఏర్పాటు చేసేందుకు పురికొల్పింది. ‘స్నేహితుడు శశాంక్ ప్రమాదానికి గురై చావు బతుకుల్లో ఉన్నప్పుడు రక్తం విలువ తెలిసింది. కొద్దో గొప్పో స్థాయి ఉన్నవాళ్లకి సైతం అదెంత ప్రియంగా మారిందో అర్థమైంది. అప్పుడే నా ఆచరణకు బీజం పడింది’ అంటూ గుర్తు చేసుకుంటాడు ఆకాశ్. ‘నా ఆలోచన చెప్పగానే నాన్న (ఎం.కె.గుప్తా) శభాష్ అంటూ ప్రోత్సహించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వయంగా వచ్చి నా ‘మదర్ బ్లడ్ బ్యాంక్’ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు’ అంటూ వివరించాడు ఆకాశ్. వెబ్సైట్ ప్రారంభించే నాటికి ఈ కుర్రాడి వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అంతేకాదు హైస్కూల్ రోజుల్లోనే ‘ఆసమ్ కంప్యూటెక్’ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించిన ఘనతను కూడా దక్కించుకున్నాడు. రెండు లక్షల మంది రక్తదాతలు.. ప్రస్తుతం ఆకాశ్ ప్రారంభించిన వెబ్సైట్ ఠీఠీఠీ.ఝ్టౌజ్ఛిటఛౌౌఛీఛ్చజు.ఛిౌఝలో దాదాపు 2 లక్షల మంది రక్తదాతల వివరాలు నమోదయ్యాయి. ‘రక్తదానంపై యువతకు అవగాహన పెంచేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాం. తద్వారా పెద్ద సంఖ్యలో సభ్యుల్ని చేర్పించగలిగాం’ అని చెప్పాడు ఆకాశ్. గత ఏప్రిల్ 21 నుంచి విజయవాడ మొదలు ఢిల్లీ, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, కోయంబత్తూరు వంటి నగరాల్లో నెల రోజలు పాటు నిర్విరామంగా ఈ కుర్రాడు 102 అవగాహన శిబిరాలను నిర్వహించాడు. వీటి ద్వారా 1,02,015 మందిని రక్తనిధిలో భాగస్వాములను చేసి గిన్నిస్ రికార్డ్ సాధించి అంతకు ముందు 61,902 మందితో ఉన్న రికార్డును చెరిపేశాడు. ‘మా టెక్నికల్ టీమ్, ఫ్రెండ్స్, బంధువులు, ఇంకా ఎందరో ఈ మార్గంలో నాకు చేయూత నిచ్చారు. ఇదంతా రికార్డుల కోసం చేసింది కాదు. రియల్ నీడ్‌ని అటెంప్ట్ చేశాం. దేశంలో రక్త నిధి కొరత తీరే వరకూ మా కృషి కొనసాగుతుంది’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడీ కుర్రాడు. ‘మా అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు మాత్రమే నేను హెల్ప్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నన్ను ఆర్థికంగా ఎటువంటి హెల్ప్ తను అడగలేదు.. నేను ఇవ్వలేదు’ అంటూ విద్యావేత్తగా పేరున్న ఆకాశ్ తండ్రి గుప్తా గర్వంగా చెబుతున్నారు. ‘ఒక కంపెనీ సీఈఓగా ఆకాశ్‌ను చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో.. అంతకు మించిన ఆనందం ఈ మదర్ బ్లడ్ బ్యాంక్ క్రియేటర్‌గా తనని గుర్తించినపుడు కలిగింది’ అంటారు ఆకాశ్ తల్లి లక్ష్మి. రక్తం అవసరమైన ఎవరైనా సరే ఈ ఆన్లైన్ బ్లడ్ బ్యాంక్‌లోకి లాగిన్ అయి వారికి సమీపంలోని రక్తదాతల వివరాలు పొందవచ్చునని ఆకాశ్ చెప్పాడు. మోడీ యోగా యాప్.. ఒక గొప్ప ఆలోచనకు అంతకు మించిన గొప్ప ఆచరణను జతచేసి చిన్న వయసులోనే స్ఫూర్తిదాయక విజయాన్ని సొంతం చేసుకున్న ఆకాశ్.. ఇటీవలే ‘మోడీ యోగా’ పేరుతో ఒక యాప్‌ను కూడా రూపొందించాడు. ఇంట్లో సాధన చేసేందుకు అవకాశం ఉన్న 12 రకాల ఆసనాలను, అవి వేసే విధానాన్ని వివరించే ఈ యాప్‌ను గత అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు విడుదల చేశాడు. -
23న సినీ తారల క్రికెట్
కాకతీయ కప్ కోసం తమిళ్, తెలుగు నటుల పోరు బంజారాహిల్స్: వెండితెరపై వెలుగులు విరజిమ్మే తారలు ఈసారి క్రికెట్ మైదానంలో తళుక్కుమననున్నారు. కాకతీయ కప్ కోసం తెలుగు, తమిళ నటుల మధ్య ఈ నెల 23న క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ట్రోఫీని తెలంగాణ క్రీడల మంత్రి పద్మారావు, రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు. తమిళ జట్టుకు జీవా, తెలుగు జట్టుకు ఆకాశ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. -
'ఆంధ్రాపోరి' టైటిల్‌కు తొలగిన చిక్కులు
హైదరాబాద్: 'ఆంధ్రాపోరి' సినిమా టైటిల్ మార్చాలన్న పిటిషన్‌ని గురువారం హైకోర్టు తిరస్కరించింది. దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన 'ఆంధ్రాపోరి' సినిమా టైటిల్ పై ఆంధ్రా సెటిలర్స్ ఫోరం హైకోర్టుకెక్కింది. 'ఆంధ్రాపోరి' సినిమా పేరు తమ ప్రాంతం వారి మనోభావాలను కించపరిచేలా ఉందని పిటిషన్ లో పేర్కొంది. మహిళలను అభ్యంతకరంగా చూపించే విధంగా సినిమా టైటిల్ ఉందని తెలిపింది. తెలంగాణ ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ అయిన ఈ సినిమా టైటిల్ మార్చాలని కోరిన విషయం తెలిసిందే. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.రమేశ్‌ప్రసాద్ నిర్మిస్తున్న 'ఆంధ్రాపోరి'లో ఆకాశ్ పూరి సరసన ఉల్కా గుప్తా హీరోయిన్ గా నటించింది. రాజ్ మాదిరాజు దర్శకుడు. జోశ్యభట్ల సంగీతం అందించారు. -
భారత అమ్ముల పొదికి ఆకాశ్
న్యూఢిల్లీ: దాదాపు 32 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతోంది. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న భారత సైనికుల కల నెరవేరబోతుంది. భారతఅమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమై క్షిఫణి ఆకాశ్ మంగళవారం అధికారికంగా చేరనుంది. ఇందుకోసం ఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆకాశ్‌ను భారత సైన్యానికి అప్పగించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఆకాశ్ క్షిపణి దేశానికే గర్వకారణం. శత్రుసైన్యం విమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయశాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ లేబోరేటరీ (డీఆర్డీఎల్)లో పనిచేస్తున్న ఆకాశ్‌క్షిపణి ప్రాజెక్టు డెరైక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు. ఆకాశ్ క్షిపణి ప్రత్యేకతలు ఆకాశంలో ఎగిరే శత్రు విమానాలు, పెలైట్ రహిత విమానాలను ఛేదించేందుకు ఆకాశ్ క్షిపణి వ్యవస్థ పనిచేస్తుంది. ఒకేసారి నాలుగు విమానాలను, నాలుగు సూపర్సోనిక్ క్షిపణులతో ఛేదించడం దీని ప్రత్యేకత. ఈ వ్యవస్థను పూర్తిఆటోమేటిక్గా గానీ, సెమీ ఆటోమేటిక్‌గా గానీ ప్రయోగించవచ్చు. ప్రపంచంలో ఇటువంటి సామర్థ్యం అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉంది. మన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని దేశాలన్నింటికంటే ముందుంది. మన క్షిపణికున్న ప్రత్యేక ఫీచర్స్ ఇతర దేశాలకు లేవు. ప్రపంచంలోనే అతితక్కువ ఖర్చుతో ఒక విమానాన్ని ఛేదించగల సామర్థ్యం. దీనినే లో కాస్ట్పర్ కిల్ అంటారు. విన్యాసాలు చేస్తూ వేగంగా కదిలే విమానాలను సైతం ఆకాశ్ ఛేదిస్తుంది. దీనికి సంబంధించిన అతిముఖ్యమైన రాడార్లను బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎల్ఆర్డీఈ)ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. సూక్ష్మంగా ఉండే లక్ష్యాలను గుర్తించడం, అతివేగంగా పయనించే 64 లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయడం, ఒకేసారి ఎనిమిది క్షిపణులను గైడ్ చేయడం, శత్రు, మిత్ర విమానాలను గుర్తించడం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ కౌంటర్ మెస్యూరింగ్ (ఈసీసీఎం) ఫీచర్స్‌తో ఈ రాడార్‌ను రూపొందించారు. -
రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం : రమ్యశ్రీ
నటి రమ్యశ్రీ దర్శకురాలిగా మారి తీసిన తొలి చిత్రం ‘ఓ మల్లి’. టైటిల్ రోల్ ఆమే పోషించారు. ఆర్.ఎ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆకాశ్, రఘుబాబు, శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నవీన్‌యాదవ్ ఆవిష్కరించి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జ్యోతిరెడ్డిలకు అందించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కోసం అరకులో దాదాపు రెండు నెలల పాటు చలిలో కష్టపడ్డాం. దీనికి చాలా మంచి పాటలు కుదిరాయి’’ అని తెలిపారు. ఈ సినిమా చేయడానికి మంచి కథే కారణమని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సునీల్‌కశ్యప్, కృష్ణమూర్తి స్వరాలందించారు. -
లఘు చిత్రాలకు ఇదొక అందమైన వేదిక : బ్రహ్మానందం
‘‘సంప్రదాయ చిత్రాలకు దీటుగా లఘు చిత్రాలు చరిత్ర సృష్టిస్తున్నాయి. అలాంటి చిట్టి చిత్రాలకు వెన్నుదన్నుగా నిలవాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ వెబ్సైట్ సృజనకు అందమైన వేదికగా నిలవాలి’’ అని ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం ఆకాంక్షించారు. డి. రాజ్వికాస్, ఎసీఎస్ శ్రీరామ్, ఎస్. ఆకాశ్ ఏర్పాటు చేసిన noreels.comను హైదరాబాద్‌లో బ్రహ్మానందం ఆవిష్కరించారు. లఘుచిత్రాలు తీసే దర్శక నిర్మాతలకు చేయూతనందించడంతో పాటు, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా చేస్తామని ప్రమోటర్లు తెలిపారు. -
వారసులొచ్చారు..
* రిలయన్స్‌లో ముకేశ్ అంబానీ సంతానం అరంగేట్రం * రిలయన్స్ జియోలో డెరైక్టరుగా ఇషా, * రిటైల్ వెంచర్స్‌లో డెరైక్టరుగా ఆకాశ్ న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ వారసులు వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. ఆయన సంతానం ఇషా, ఆకాశ్.. రిలయన్స్‌లో భాగమైన టెలికం, రిటైల్ వెంచర్ల బోర్డుల్లో డెరైక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఇషా, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు ఆకాశ్ డెరైక్టర్లుగా నియమితులైనట్లు కంపెనీ తెలిపింది. శనివారం ఆయా సంస్థల బోర్డు సమావేశాల్లో ఈ మేరకు ఆమోదముద్ర పడినట్లు వివరించింది. అలాగే, ఆర్ఐఎల్లో ప్రస్తుతం స్వతంత్ర డెరైక్టరుగా ఉన్న అదిల్ జైనుల్‌బాయ్ తాజాగా రిలయన్స్ రిటైల్ బోర్డులో నియమితులైనట్లు పేర్కొంది. ముకేశ్ అంబానీకి మొత్తం ముగ్గురు సంతానం. ఇషా, ఆకాశ్ (23) కవలలు. ఆఖరువాడైన అనంత్ ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 1981లో రిలయన్స్‌లో చేరే నాటికి ముకేశ్ అంబానీ వయస్సు 24 సంవత్సరాలు. ప్రస్తుతం ఇషా, ఆకాశ్ కూడా దాదాపు అంతే వయస్సులో కంపెనీలో చేరడం విశేషం. సైకాలజీలో ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి 2013లో గ్రాడ్యుయేషన్ చేశారు. కొంత కాలం పాటు అమెరికాలో అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో కూడా పనిచేశారు. మరోవైపు ఆర్థిక శాస్త్రంలో బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఆకాశ్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఆర్ఐఎల్ టెలికం వెంచర్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశాల్లో అంబానీ కుటుంబం మొత్తం సాధారణంగానే కనిపించినా.. కీలకమైన బిజినెస్ డీల్‌లో ఆకాశ్ తొలిసారిగా 2011లో పాలుపంచుకున్నారు. అప్పట్లో కేజీ-డీ6 బ్లాక్‌లో వాటాలను బీపీకి రిలయన్స్ విక్రయించినప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా ఆయన ప్రముఖంగా కనిపించారు. ఇక, ఇషా 16 సంవత్సరాల వయసులో వెలుగులోకి వచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల వారసుల్లో పిన్న వయస్కులకు సంబంధించి ఫోర్బ్స్ జాబితాలో ఆమె రెండో స్థానంలో నిల్చారు. షేల్ గ్యాస్ వెంచర్లో వాటాలు విక్రయిస్తున్న రిలయన్స్ న్యూయార్క్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్.. అమెరికాలోని ఈగిల్ ఫోర్డ్ షేల్ ఆయిల్, గ్యాస్ వెంచర్లో తమకున్న 45% వాటాలను విక్రయించాలని యోచిస్తోంది. కొనుగోలుదారులను అన్వేషించే బాధ్యతను సిటీగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్లకు అప్పజెప్పినట్లు సమాచారం. అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు రిలయన్స్ (ఆర్ఐఎల్) వర్గాలు నిరాకరించాయి. మెకిన్సే లింకు.. ఇటీవల కుటుంబ వ్యాపారాల్లో చేరిన వారసుల్లో చాలా మంది ఏదో ఒక సందర్భంలో మెకిన్సే లేదా మరో కన్సల్టెన్సీలో పని చేసి ఉండటం గమనార్హం. స్వాతి, అజయ్ పిరమాల్ కుమార్తె నందిని పిరమాల్.. సొంత కంపెనీలో చేరడానికి ముందు మెకిన్సేలో బిజినెస్ అనలిస్టుగా చేశారు. తాజాగా ఇషా కూడా మెకిన్సేలో పనిచేశారు. అటు విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ.. కొంతకాలం లండన్‌లోని బెయిన్ అండ్ కో కన్సల్టెన్సీలో చేశారు. రిలయన్స్ సామ్రాజ్యం.. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగ కంపెనీ అయిన ఆర్ఐఎల్ టర్నోవరు రూ. 4,46,339 కోట్లు కాగా 2013-14లో సంస్థ నికర లాభం రూ. 22,493 కోట్లు. టెలికం సర్వీసుల కోసం ఆర్ఐఎల్ ప్రత్యేకంగా రిలయన్స్ జియోను నెలకొల్పింది. దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ స్పెక్ట్రం దక్కించుకున్న ఏకైక ప్రైవేట్ సంస్థ ఇదే. త్వరలోనే 4జీ సర్వీసులు ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 148 నగరాల్లో 1,723 స్టోర్స్ ఉన్నాయి. -
హీరో.. డీఆర్డీవో మనకే!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : సత్యవేడు మండలం మాదనపాళెంలో హీరో మోటార్స్ వాహనాల తయారీ పరి శ్రమ, ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండలో డీఆర్డీవో పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థల యాజమాన్యంతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సంస్థ యాజమాన్యాలు ఎంవోయూపై సంతకాలు చేశాయి. ఆ రెండు పరిశ్రమలు ఏర్పాటైతే నాలుగువేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..దేశ రక్షణ వ్యవస్థ అమ్ములపొదిలో తిరుగులేని ఆకాశ్, త్రిశూల్, అగ్ని వంటి అస్త్రాలను రూపొందిం చిన డీఆర్డీవో(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) పరిశ్రమను జిల్లాలో ఏర్పాటుచేయడానికి 2008లో ఆ సంస్థ ప్రతిపాదించింది. డీఆర్డీవో ప్రతిపాదన మేరకు ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండ, చిన్నతయ్యూరు గ్రామాల పరిధిలోని 1102.30 ఎకరాల భూ మిని అప్పటి కలెక్టర్ శేషాద్రి గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు. ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొం డలో సర్వే నెంబర్ 285/1లో 502.30 ఎకరాలు, చిన్నతయ్యూర్‌లో సర్వే నెంబర్ 285/2లో ఆరు వందల ఎకరాలు మొత్తం 1102.30 ఎకరాలను డీఆర్డీవోకు కేటాయిస్తూ ఆగస్టు 13న రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. ఎకరానికి రూ.1.25 లక్షల చొప్పున డీఆర్డీవోకు ఆ భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో రూ.600 కోట్లతో క్షిపణుల తయారీ పరిశ్రమ, రక్షణ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి డీఆర్డీవో యాజమాన్యంతో మంగళవారం ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సత్యవేడు మండలం మాదనపాళెంలో మో టారు వాహనాల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి హీరో మోటార్స్ సంస్థ ముందుకొచ్చిన విషయం విదితమే. ఆ సంస్థకు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.1600 కోట్ల వ్యయంతో ఏడాదికి ఎనిమిది మిలియన్ల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఎస్ఆర్పురంలో ఏర్పాటుచేసే డీఆర్డీవో పరిశ్రమ ద్వారా వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పదేళ్లపాటు వ్యాట్(విలువ ఆధారిత) పన్ను, సీఎస్టీ(సెంట్రల్ సేల్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపు, విద్యుత్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, భూమి ధరల్లో రాయితీ ఇస్తేనే మోటారు వాహనాల సంస్థను ఏర్పాటుచేస్తామని హీరో మోటార్స్ మెలిక పెట్టింది. కేంద్రం ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీపై ఆశలు పెంచుకున్న ప్రభుత్వం ఆ మేరకు హీరో మెటార్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు పేర్కొనడం గమనార్హం. -
శని మహిమలు చూడండి
శనీశ్వరుని మహిమల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శనిదేవుడు’. ‘చూడండి మహిమలు’ అనేది ఉపశీర్షిక. శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమన్, ఆకాశ్, శివ జొన్నలగడ్డ ఇందులో ప్రధాన పాత్రధారులు. నండూరి అనిల్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ పాటలకు మంచి స్పందన లభిస్తోందని శివ జొన్నలగడ్డ ఆనందం వెలిబుచ్చారు. ‘‘భారతదేశంలో శనిదేవునిపై వస్తున్న తొలి సినిమా ఇది. శనీశ్వరుణ్ణి పూజిస్తే ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయో తెలిపే సినిమా ఇది. విజయదశమి కానుకగా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, సమర్పణ: గుద్దేటి బసవప్ప మేరు. -
ఆకాశమంత..
నా ధైర్యం నా చెల్లెలే అంటున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్. కంటికి రెప్పలా కాపాడుకునే అన్నంటే నాకు ప్రాణం అంటోంది పూరీ తనయ పవిత్ర. ఆకాశ్ ఇంటర్, పవిత్ర టెన్త్ చదువుతున్నారు. తండ్రికి జిరాక్స్ కాపీలా ఉండే చెల్లికి కాస్త మేకప్ చేసి.. నాన్నలా ముస్తాబు చేయడం ఆ అన్నకు సరదా. అన్నయ్యకు సర్ప్రైజ్ లు ఇవ్వడం చెల్లికి మహా సరదా. లాస్ట్ ఇయర్ ఆకాశ్ బర్త్‌డేకి రేర్ ఫొటోగ్రాఫ్స్‌తో ఏవీ ప్రిపేర్ చేసి కానుకగా ఇచ్చింది. ఇద్దరిలో చెల్లెలిదే డామినేషన్. ‘అన్నయ్యకు కోపం వస్తే బొమ్మలు గాల్లో తేలుతాయి. అప్పుడు ఎవరేం చెప్పినా వినడు. అన్నయ్యను ఎవరేం అన్నా నేను ఊరుకోను’ అంటోంది పవిత్ర. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఓనమాలు దిద్దుతున్న చెల్లిని ప్రోత్సహించడం ఒక్కటే ఆ అన్నయ్యకు తెలుసు. ‘నేను డిజైన్ చేసిన షర్ట్స్‌ను మెచ్చుకోవడమే కానీ.. బాగోలేదని ఎప్పుడూ చెప్పడు. సలహాలు ఇస్తుంటాడు’ అని పవిత్ర కాస్త గర్వంగా చెబుతుంటుంది. ‘రాఖీ రోజు అన్నయ్య నాకిష్టమైన బహుమతి ఇస్తాడు. రాఖీకి అన్నయ్య ప్రజెంట్ చేసిన డైమండ్ ఇయర్ రింగ్స్ అమ్మను కూడా ముట్టుకోనివ్వన’ని చె ప్పుకొచ్చింది. ఈ రాఖీ పండుగకు.. చెల్లికి పర్షియన్ క్యాట్ ఇవ్వబోతున్నానని ఆకాశ్ రహస్యంగా చెప్పాడు. తను హీరో అవ్వాలని కోరుకుంటున్న ఆకాశ్.. చెల్లెలు డెరైక్టర్‌గా రాణించగలద ని నమ్మకంగా చెబుతున్నాడు. -
ప్రేమలో కొత్త కోణం
ప్రేమ అనే రెండక్షరాలకు ఆకర్షణ శక్తి అధి కం. దానికి చాలా కోణాలున్నాయి. ఎన్ని విధాలుగా చూపించినా వెగటు అనిపించనిది ప్రేమ ఒక్కటే. అందుకే సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్నా అందులో ప్రేమ సజీవంగా, నిత్య నూతనంగా ప్రకాశిస్తూనే ఉంది. సినిమా అనే మూడక్షరాల పదం వినిపిస్తున్నంత వరకు ప్రేమ అనే రెండక్షరాల పదం ప్రకాశి స్తూనే ఉంటుంది. ప్రేమను కొందరు గుడ్డిదంటారు. మరి కొందరు పిచ్చిదంటారు. ఎవరెలా అన్నా ప్రేమ ఎవర్ గ్రీనే. అలాంటి ప్రేమ కథను వినూత్నంగా కాదల్ పైత్తియం పేరుతో తెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకుడు మాచంద్రు. ఇంతకు ముందు కన్నడంలో బంగారి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిస్తున్న తొలి చిత్రం కాదల్ పైత్తియం. అమ్మా ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై సి.దశరథ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉత్తరాది నటుడు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈయన హిందీలో ఎ దిల్ రాంతా జోగి అనే చిత్రంలో హీరోగా నటించారు. ఇక హీరోయిన్గా కన్నడ బ్యూటీ జీవిక పరిచయం అవుతున్నారు. ఈమె కన్నడంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే చిత్రంలో కథానాయికగా నటించారు. ఆడుగళం నరేన్, వైజీ మహేంద్రన్, ప్రియ, తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ హీరో హీరోయిన్ల మధ్య ఏర్పడిన ప్రేమకు ఎలాంటి ఆటంకాలూ ఉండవన్నారు. ఇరు కుటుంబాల వారు పచ్చ జెండా ఊపుతారని చెప్పారు. అయినా వారి ప్రేమకు కాస్త గ్యాప్ వస్తుం దన్నారు. అందుకు కారణాలేమిటి? చివరికి ప్రేమికులు ఒకటయ్యారా? అన్న పలు ఆసక్తి కరమైన అంశాల సమాహారంగా కాదల్ పైత్తియంను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్‌ను చెన్నైలో ప్రారంభించి ఊటీ, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతా ల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్.పి.వర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి బీఆర్ విజయన్ ఛాయాగ్రహణం నెరపుతున్నారు. -
శనిదేవుని మహిమలు
‘శనిదేవుడు మంచివాడు.. చెడ్డవాడుకాదు’ అనే నినాదంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘శనిదేవుడు’. ‘మహిమలు చూడండి’ అనేది ఉపశీర్షిక. శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఉగాదికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శివ మాట్లాడుతూ- ‘‘మనిషి ఆయుష్షు 120 ఏళ్లు అనుకుంటే... అందులో 19ఏళ్లు శనిదశ నడుస్తుంది. ఆ 19 ఏళ్లు.. కష్టాల విలువ, జీవితం గొప్పదనం, బాధ్యతలు, బంధాల విలువల్ని కూడా తెలియజేస్తాయి. శనిదశ ముగింపుకి చేరుకున్నప్పుడు ఆయన మంచి చేసే తప్పుకుంటాడు. సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణునిగా కొలిచే మనం ఆయన కుమారుడు శనిని ఎందుకు నిందిస్తాం? ఈ విషయంపై పరిశోధన జరిపి, పలువురు పండితుల అభిప్రాయాలను తీసుకొని శని గొప్ప దేవుడు అని చెప్పడమే పరమావధిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అని తెలిపారు. అహంకారమే ఆభరణంగా చేసుకున్న మహారాజు పాత్రను చేస్తున్నానని సుమన్ చెప్పారు. ఇందులో ఓ ముఖ్యమైన పాట చేశానని ఆకాష్ తెలిపారు. -
సెమీఫైనల్లో ఆకాశ్
జింఖానా, న్యూస్‌లైన్: ఏస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలుర విభాగంలో ఆకాశ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తారిఖ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఆకాశ్ 6-2తో హంజా పాషాపై గెలిచాడు. అదే విధంగా మరో మ్యాచ్‌లో సుహిత్ రెడ్డి 6-3తో రాహుల్‌పై నెగ్గగా, శశిప్రీతమ్ 6-5తో సలీల్ దాండ్రియాల్పై గెలుపొందాడు. తనిష్క్ 6-3తో రిషిల్ గుప్తాను ఓడించాడు. ఇతర ఫలితాలు అండర్-10 బాలికల క్వార్టర్స్: సంజన 6-2తో తనుషితపై, చాహన జయ్ 6-3తో అభయపై, అదితి 6-3తో అపూర్వపై, వేద వర్షిత 6-2తో స్టీష బుద్దాలపై నెగ్గారు. బాలుర క్వార్టర్స్: యశ్వంత్ 6-3తో అమోఘ్ రెడ్డిపై, వర్షిత్ కుమార్ రెడ్డి 6-0తో యశ్వంత్ చౌదరిపై, రుషికేశ్ 6-5తో అయుష్ పవన్‌పై, ముకుంద్ 6-4తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలిచారు. అండర్-12 బాలికల క్వార్టర్స్: శ్రీహ ర్షిత 6-3తో సంజన సిరిమల్లపై, రాయర్ల సంజన 6-1తో అంకితా దేవ్‌పై, ప్రాచి 6-0తో ఖుషి అగర్వాల్‌పై, సంస్కృతి 6-2తో వేదపై గెలుపొందారు. బాలుర క్వార్టర్స్: ఆకాశ్ 6-4తో యశ్ అగర్వాల్‌పై, సాయి అనికేత్ 6-2తో సాయి కార్తీక్‌పై, తన్మయ్ 6-2తో ముకుంద్ రెడ్డిపై, శశిధర్ 6-0తో యశ్వంత్‌పై విజయం సాధించారు. అండర్-14 బాలికల క్వార్టర్స్: రాయల సృజన 6-0తో ఇషికని, శ్రీజా రెడ్డి 6-0తో నేహశ్రీ రెడ్డిని, సంజన 6-2తో అంజనా రెడ్డిని, శ్రీహ ర్షిత 6-1తో యుక్త బోడిపూరిని ఓడించారు. -
ఆనందం మళ్లీ మొదలైంది
-
పాతబస్తీలో కిడ్నాపైన రెండేళ్ళ ఆకాష్ క్షేమం
-
పాతబస్తీలో కిడ్నాపైన రెండేళ్ళ ఆకాష్ క్షేమం
హైదరాబాద్ : ఎట్టకేలకు హైదరాబాద్ పాతబస్తీలో వారం క్రితం కిడ్నాపైన రెండేళ్ళ బాలుడు ఆకాష్ ఆచూకీ లభ్యమైంది. పశ్చిమ బెంగాల్లో కిడ్నాపర్ బారి నుంచి బాలుడిని క్షేమంగా పోలీసులు కాపాడారు. కిడ్నాపర్ రాంప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆకాష్ తండ్రి గోపాల్ వద్ద కిడ్నాపర్ రాంప్రసాద్ పని చేసేవాడు. బాలుడిని క్షేమంగా వదిలి పెట్టాలంటే మూడు కేజీల బంగారం కావాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆకాశ్ తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు ఓ ప్రత్యేక బృందం కోల్‌కతా వెళ్లింది. ఫోన్ కాల్ ఆధారంగా కిడ్నాపర్‌ను పట్టుకున్నారు. ఆకాష్ క్షేమ సమాచారాలు తెలుసుకున్న తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.