Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్‌ ఆనంద్‌ | bsp Akash Anands first reaction over Mayawati Sacks | Sakshi
Sakshi News home page

మేనత్త మాయవతి ‘వేటు’ నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్‌ ఆనంద్‌

Published Thu, May 9 2024 10:51 AM | Last Updated on Thu, May 9 2024 11:06 AM

bsp Akash Anands first reaction over Mayawati Sacks

లక్నో: తన మేల్లుడైన ఆకాశ్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్‌ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తొలగించారు. ఈ తొలగింపుపై తాజాగా గురువారం ‘ఎక్స్‌’ వేదికగా ఆకాష్‌ ఆనంద్‌ స్పందించారు. 

‘బీఎ‍స్పీ చీఫ్‌ మాయావతి.. బహుజన సమాజానికి రోల్‌ మోడల్‌. బహుజనలు అంటే.. దళితులు, ఎస్టీలు, ఓబీసీలు. మీ పోటం వల్లనే నేడు బహుజన సమాజానికి ఇంత రాజకీయం బలం చేకూరింది. బహుజన సమాజం గౌరవంగా బ్రతకటం నేర్చుకుంది. మీరే మా అధినేత్రి. నా కడ శ్వాస వరకు భీమ్‌ మిషన్‌, బహుజన సమాజం కోసం పోరాడతాను’’ అని ఆకాష్‌ ఆనంద్‌ ‘ఎక్స్‌’లో తెలిపారు.

ఇక.. ఇటీవల ఆకాశ్ ఆనంద్‌  బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకాశ్‌ రాజకీయంగా పరిణతి సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్‌ మాట్లాడుతూ యూపీలోని బీజేపీపై  తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్‌ గవర్నమెంట్‌గా అభివర్ణించారు.

 

రాష్ట్రంలోని యువతను ఆకలితో ఉంచుతూ, పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ అధికారులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆకాశ్‌కు సంబంధించిన అన్ని ర్యాలీలను బీఎస్పీ రద్దు చేసింది.

2023 డిసెంబరులో మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్‌ లండన్‌లో ఎంబీఏ చదివారు. ఇక.. 2017లో బీఎస్పీలో చేరారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement