anand
-
జహాపన
‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ లాంటి చిత్రాల్లో బాలనటుడుగా చేసిన ఆనంద్ వర్ధన్(Anand Vardhan) హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిదురించు జహాపన’(Nidurinchu Jahapana). నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్ గా నటించారు. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్పై సామ్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.ఈ మూవీ టీజర్‌ను రిలీజ్(Teaser released) చేశారు. ‘మనిషి నిద్రపోయే వరకు సైన్స్ అయితే.. నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయ, సింపుల్‌గా చెప్పాలంటే నీ లైఫ్‌లో పదిహేడేళ్ల జీవితాన్ని మిస్ అయిపోయావు’ వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఫ్యాషన్.. ప్రయాణం.. ఒరు పెన్!
అభిరుచినే వృత్తిగా చేసుకునే అవకాశం కొందరికే దొరుకుతుంది. ఆ కొందరిలో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ ప్రజన్య ఆనంద్‌ను చేర్చవచ్చు! అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలకు రూపం ఇస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తన సిగ్నేచర్‌ను క్రియేట్ చేసుకున్న ఆమె గురించి..చెన్నైకి చెందిన ఒరు పెన్ (ఒక వనిత) ప్రజన్య. ఆమెకు ఫ్యాషన్ అన్నా, ప్రయాణాలు అన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు తన తోబుట్టువులకు, ఫ్రెండ్స్‌కి రకరకాల జడలువేసేది. మేకప్ చేసి వాళ్లను మురిపించి, తాను మురిసిపోయేది. ఊహ తెలిశాక ప్రయాణాల్లోని మజాను ఆస్వాదించసాగింది. కాలేజ్ డేస్ నుంచి సోలో ట్రావెల్‌ను స్టార్ట్ చేసింది. అలా ప్రయాణాల్లో తనకు పరిచయమైన కళలు, తెలుసుకున్న సంస్కృతి, కనిపించిన ఒరవడి అన్నిటితో స్ఫూర్తి పొంది సరికొత్త డిజైన్స్‌కు రూపమిచ్చేది. అప్పుడనుకుంది తన కాలింగ్ ఫ్యాషనే అని! సెకండ్ థాట్ లేకుండా పర్ల్ అకాడమీలో చేరింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర ఇంటర్న్‌గా జాయిన్ అయి పనిలో మెలకువలను నేర్చుకుంది. తర్వాత అవకాశాల వేట మొదలుపెట్టింది. నాలుగేళ్లు ఫ్యాషన్ ఇండస్ట్రీ కారిడార్లోనే గడిపింది. అవకాశాలను అందుకోవడం అంత సులువుకాదని గ్రహించింది. దాంతో దాన్నో సవాలుగా తీసుకుంది. ప్రతి అడ్డంకిని లక్ష్యానికి మెట్టుగా మార్చుకుంది. ఆ పట్టుదలకు చాన్స్‌లు చలించి.. ప్రజన్య చెంత చేరాయి. తన డిజైన్స్కున్న ప్రత్యేకతను చూపింది. కాస్ట్యూమ్స్‌లోనే కాదు జ్యూల్రీ, మేకప్, హెయిర్ స్టయిల్.. ఇలా స్టయిలింగ్కి సంబంధించిన ప్రతి రంగంలోనూ తనకున్న పట్టును ప్రదర్శించింది. నాలుగేళ్ల నిరీక్షణ విలువేంటో చాటింది. ‘ప్రజన్య’ పేరుతో లేబుల్నూ లాంచ్ చేసి, బాలీవుడ్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తన అద్భుతమైన డిజైన్స్‌తో ఐశ్వర్యా రాయ్, నయనతార, హృతిక్ రోషన్ల మెప్పు పొందింది. ఇంకెందరికో అభిమాన స్టయిలిస్ట్ అయింది. ‘డిజైన్డ్ స్టూడియో’ పేరుతో ఫ్యాషన్ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వటమూ ప్రారంభించింది. ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్స్‌ను కూడా నిర్వహిస్తోంది ప్రజన్య. -
ఆనంద్ గ్రూప్ ఫౌండర్ కన్నుమూత
ఆనంద్ గ్రూప్ వ్యవస్థాపకుడు దీప్ సి ఆనంద్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. అక్టోబరు 27న హౌజ్ ఖాస్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో అంతిమ ప్రార్థనలు నిర్వహించనున్నారు.ఆనంద్ సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో చదువుకున్నారు. యూకేలోని చిపెన్హామ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. ముంబైలోని మహీంద్రా అండ్ మహీంద్రాలో ప్లాంట్ మేనేజర్‌గా 1954లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆనంద్ 27 ఏళ్ళ వయసులో తన మొదటి వ్యాపార వెంచర్, గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ గాబ్రియేల్ ఇండియాను ప్రారంభించారు. షాక్ అబ్జార్బర్లను తయారు చేసే ఈ కంపెనీని అమెరికాకు చెందిన మేర్‌మాంట్ కార్పొరేషన్‌తో కలిసి ఆయన స్థాపించారు.తరువాతి దశాబ్దాలలో వివిధ దేశాలకు చెందిన అగ్ర ఆటోమోటివ్ సంస్థలు ఎన్నింటితోనో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆనంద్ గ్రూప్ భారతదేశంలోని అనేక సంస్థలకు విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను సరఫరా చేస్తుంది. అలాగే తమ ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. 2017లో ఆనంద్ గ్రూప్ టర్నోవర్ రూ. 9,000 కోట్లు. -
హైడ్రా బాస్‌తో భేటీ.. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లోని చెరువుల పునరుద్ధరణ, పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దీనికోసం నిపుణుల సాయాన్ని తీసుకోనుంది. ఇందులో భాగంగా లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మల్లిగవాడ్‌తో శుక్రవారం కమిషనర్ ఏవీ రంగనాథ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైడ్రా కార్యాలయం నుంచి బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరును పరిశీలించారు. సమావేశంలో భాగంగా ఆనంద్.. మురుగుతో నిండిన, నీళ్లు లేకున్న చెరువులను ఏ విధంగా తీర్చిదిద్దారో వివరించారు. బెంగళూరు నగరంలోని మొత్తం 35 చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని ఆయన రంగనాథ్‌కు వివరించారు. అతి తక్కువ ఖర్చుతో చెరువులకు పునరుజ్జీవనం కల్పించడానికి ఉన్న అవకాశాలను హైడ్రా అధికారులు పరిశీలించారు.చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, స్వచ్ఛమైన నీరు చేరేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని పరిశీలించారు. మురుగు నీటి శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించి.. చెరువులోకి చేరే ముందే మూడు నాలుగు దశల్లో ఫిల్టర్ చేసే తీరును హైడ్రా యోచిస్తోంది. మురుగు నీటి కాలువలకు రెండు వైపులా మొక్కలు నాటడం ద్వారా చెరువుకు చేరేలోపే ఆ నీరు కొంతమేర శుద్ధి అయ్యేలా బెంగళూరులో ఏర్పాటు చేసిన విధానంపై హైడ్రా అధ్యయనం చేస్తోంది. త్వరలోనే బెంగళూరు వెళ్లి అక్కడ చెరువులను పునరుద్ధరించిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని హైడ్రా అధికారులు యోచిస్తున్నారు. అలాగే ఆనంద్ మల్లిగవాడ్‌ను హైదరాబాద్‌కు పిలిపించి ఇక్కడ చెరువుల పునరుద్ధరణపై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. కూల్చివేతల వ్యర్థాలను తొలగించి తొలిదశలో సున్నం చెరువు, అప్పా చెరువు, ప్రగతినగర్ వద్ద ఉన్న ఎర్రకుంట, కూకట్పల్లి చెరువులకు పునరుజ్జీవనం కల్పించాలని హైడ్రా నిర్ణయించింది. అయితే మల్లిగవాడ్‌తో కేవలం చెరువుల పునరుద్ధరణపై సలహాలు, సూచనలు మాత్రమే తీసుకుంటారా? లేదా ఆయనకు హైడ్రాలో ఏమైనా కీలక పదవిని అప్పగిస్తారా? అనే చర్చ అధికారుల్లో జరుగుతోంది. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్హైడ్రా కమిషనర్‌తో శుక్రవారం ఆనంద్ మల్లిగవాడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఆనంద్ మల్లిగవాడ్ గురించి చర్చ మొదలైంది. సోషల్‌మీడియాలో సైతం ఆయన ఎవరనీ సెర్చ్ చేస్తున్నారు. ఆనంద్ మల్లిగవాడడ్ను ‘లేక్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. ఆయన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు నీటి సంరక్షణ, పర్యావరణవేత్తగా కృషి చేస్తున్నారు. బెంగళూరులో క్షీణించిపోతున్న దశలో ఉన్న సమారు 23 చెరువులను పునరుద్ధరించటంలోకి కీలక పాత్ర పోషించారు. 1981లో కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జన్మించిన ఆనంద్.. 2017లో అనేకల్ సమీపంలోని క్యాలసనహళ్లి సరస్సు పునరుద్ధరించేందుకు బి.ముత్తురామన్ ‘సన్సెరా’ ఫౌండేషన్‌తో కలిసి పని చేశారు. ఇక.. అప్పటి నుంచి బెంగళూరులో చెరువుల పరిరక్షణకు సంబంధించి పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు. 2019లో తన ఇంజనీరంగ్ ప్రొఫెషన్‌ను వదిలేసి.. బెంగళూరులో చెరువుల పుణరుద్ధరణ, నీటి సంరక్షణే లక్ష్యంగా ఆయనే స్వయంగా ‘మల్లిగవాడ్’ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆయన సేవలు గుర్తించిన రోటరీ ఫౌండేషన్ ఆయనకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రధానం చేసింది. ఇక.. ఏప్రిల్ 2024లో ఆయన, ఆయన ఫౌండేషన్‌పై కర్ణాటక లేక్ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్-2014లోని సెక్షన్ 430 కింద కేసు నమోదైంది.‘ నీటిపారుదల పనులు ఇబ్బందులు కలిగించటం. నీటిని తప్పుగా మళ్లించడం’ వంటి ఆరోపణలు రావటంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం గమనార్హం. బెంగుళూరు అర్బన్ జిల్లాలోని హీలలిగే అనే గ్రామంలోని రైతు సంఘం ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసింది. హీలలిగే వద్ద నీటి వనరులను పునరుద్ధరించడానికి మల్లిగవాడ్ చేపట్టిన పునరుజ్జీవన ప్రక్రియ అశాస్త్రీయ ఉందని ఆరోపించారు. -
రాష్ట్రంలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం
సాక్షి, హైదరాబాద్/ గాంధీ ఆస్పత్రి: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని.. మాతాశిశు మరణాలు, విషజ్వరాలు పెరిగిపోతు న్నాయని బీఆర్ఎస్ ‘ప్రజారోగ్య కమిటీ’ మండిప డింది. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, ఎమర్జెన్సీ పాలన అని ఆరోపించింది. గాంధీ ఆస్ప త్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తే పోలీ సులు అడ్డుకోవడం దారుణమని మండిపడింది.గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. నేతల అరెస్టులు..ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ టి.రాజయ్య నేతృత్వంలో.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌లతో కమిటీని వేసింది. సోమవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని.. మాతాశిశు మరణాలపై నిజనిర్ధారణ చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. అయితే కమి టీకి నేతృత్వం వహిస్తున్న టి.రాజయ్యను పోలీ సులు ఉదయమే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గృహ నిర్బంధం చేశారు. మిగతా ఇద్దరు సభ్యులు డాక్టర్ సంజయ్, డాక్టర్ మెతుకు ఆనంద్ పోలీసుల కళ్లు గప్పి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మరికొందరు పార్టీ నేతలతో కలసి గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులు వారిని ఆస్పత్రి ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత లు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరగ డంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు మాగంటి గోపీనాథ్, సంజయ్, మెతుకు ఆనంద్ లను అరెస్టు చేసి నారాయణగూడ ఠాణాకు.. ఇతర నేతలు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించి బొల్లారం ఠాణాకు తరలించారు. మధ్యాహ్నం తర్వాత నేతలు, కార్యకర్తలను వదిలేశారు.రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలిగాంధీ ఆస్పత్రి ఘటన తర్వాత తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రజారోగ్య కమిటీ సభ్యులు రాజయ్య, సంజయ్, మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లా డారు. సీఎం, మంత్రుల సమీక్ష లేకపోవడంతో.. రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు తగ్గిపోయాయని రాజయ్య ఆరోపించారు. నిజనిర్ధారణ కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం నిద్రపోతోందని డాక్టర్ సంజ య్ విమర్శించారు. ఆస్పత్రుల్లో డొల్లతనం బయట పడుతుందనే తమకు అడ్డుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. నిపుణులైన వైద్యులు లేకే, ఆస్పత్రుల్లో మరణాలు సంభవి స్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.మాతాశిశు మరణాలపై దాపరికం ఎందుకు?ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న మాతాశిశు మరణాలపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాపరికంగా వ్యవహరి స్తోందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. గాంధీ ఆస్పత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడారు. తాము నిర్మాణాత్మక అంశాలపైనే పోరాడుతు న్నామని, ప్రతిపక్షంగా ఇది తమ బాధ్యత అని చెప్పారు. సీఎం కార్యాలయం నుంచి వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సరైన సహ కారం లేదని ఆరోపించారు. -
గణేష్ నిమజ్జనాలపై సీవీ ఆనంద్ కీలక ప్రెస్ మీట్
-
లక్ష్య సాధకులు.. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన అన్నదమ్ములు!
వరంగల్: ఆ అన్నదమ్ములు.. ఉన్నత ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నారు. దీనికి ఓ లక్ష్యం విధించుకున్నారు. ఈ మార్గంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా తట్టుకుని ప్రణాళిక ప్రకారం చదివి గమ్యం చేరుకున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా యూపీఎస్సీ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఈ గిరిపుత్రులు. వారే నర్సంపేట పట్టణానికి చెందిన ఆంగోత్ భద్రయ్య–అరుణ దంపతుల కుమారులు సంతోశ్, ఆనంద్. ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాల్లో సంతోశ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో మైనింగ్ ఇంజనీర్, ఆనంద్ కేంద్ర కార్మిక శాఖలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం సాధించారు. ఒక ఉద్యోగం సాధించడమే కష్టంగా మారిన ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేసూ్తనే మరో ఉద్యోగానికి అదీ జాతీయ స్థాయి ఉద్యోగాలకు సన్నద్ధమై సాధించడం గొప్ప విశేషం.విద్యాభ్యాసం..సంతోశ్, ఆనంద్ ఇద్దరూ ప్రాథమిక విద్యను నర్సంపేటలో పూర్తి చేశారు. సంతోశ్ పదో తరగతి హనుమకొండ, ఇంటర్ హైదరాబాద్, కర్ణాటక ఎన్ఐటీలో ఇంజనీరింగ్, జైపూర్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం అల్ట్రాటెక్ సిమెట్స్ (ఆదిత్య బిర్లా)లో ఇంజనీర్‌గా, కొంత కాలం పేటీఎం సంస్థలో, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థలో రెండు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. సివిల్స్ లక్ష్యంగా ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు. ఒక పక్క ఉద్యోగం చేసూ్తనే.. మరోపక్క ఖాళీ సమయంలో పోటీ పరీక్షకు సన్నద్ధమై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో ఇంజనీర్ కొలువు సాధించారు. ఆనంద్ పదో తరగతి బిట్స్ స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్ హైదరాబాద్, వరంగల్ ఎన్ఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. టీసీఎస్‌లో స్టాఫ్‌వేర్, ఆ తర్వాత చెన్నై పెట్రోలియం సంస్థలో హెచ్ఆర్ అధికారిగా పని చేసూ్తనే యూపీఎస్సీ ద్వారా కార్మిక శాఖలో ఉద్యోగం సాధించాడు.తల్లిదండ్రులు భద్రయ్య–అరుణతో ఆనంద్, సంతోశ్ (ఫైల్)ప్రణాళిక ప్రకారం చదివి.. లక్ష్యం చేరుకుని..ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడిన తమ బాబాయ్‌లు, తల్లిదండ్రులను సంతోశ్, ఆనంద్ ఆదర్శంగా తీసుకున్నారు. యూపీఎస్సీలో ఉన్నత ఉద్యోగం సాధించాలని లక్ష్యం విధించుకున్నారు. ఈ నేపథ్యంలో సంతోశ్ రెండు దఫాలు( గ్రూప్–ఏ) ప్రిలిమ్స్, మెయిన్స్ వరకు వెళ్లారు. అయితే ఆ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మూడో ప్రయత్నంలో (గ్రూప్–బీ) గమ్యం చేరుకున్నాడు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో మైనింగ్ ఇంజనీర్ కొలువు సాధించాడు. ఇక ఆనంద్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. కేంద్ర కార్మిక శాఖలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం సాధించారు. ఈ అన్నదమ్ములు సుమారు సంవత్సరం కాలం పుస్తకాలతో దోస్తీ పట్టారు. ఎప్పుడూ చదువు ధ్యాసే. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యం చేరుకున్నారు. ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచారు.కుటుంబ నేపథ్యం..సంతోశ్, ఆనంద్ తల్లిదండ్రులు ఆంగోత్ భద్రయ్య–అరుణ దంపతులది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం భోజెర్వు గ్రామం జగ్గుతండా. భద్రయ్య తల్లిదండ్రులు ఆంగోత్ చీమా–మల్కమ్మ. ఈ దంపతులకు నలుగురు కుమారులు భద్రయ్య, తారాసింగ్, మోహన్, విజేందర్ ఉన్నారు. భద్రయ్య టీచర్‌గా, తారాసింగ్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా, మోహన్ పిల్లల వైద్య నిపుణుడిగా, విజేందర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తమ తండ్రి తప్ప అందరూ డాక్టరేట్‌లుగా ఉన్న తమ బాబాయ్‌లను స్ఫూర్తిగా తీసుకున్న సంతోశ్, ఆనంద్.. చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం నర్సంపేటలో స్థిరపడింది. సంతోశ్, ఆనంద్ తల్లి అరుణ వైద్య ఆరోగ్యశాఖలో ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్–1 అధికారి, తండ్రి భద్రయ్య చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. -
ముకేశ్ అంబానీ ఫ్రెండ్.. 'ఆనంద్ జైన్' గురించి తెలుసా?
అంబానీ రిలయన్స్ కంపెనీ ఎదగటానికి కారకులైన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి 'మనోజ్ మోడీ'. ఈయన మాత్రమే కాకుండా సంస్థ ఎదుగుదలకు పాటుపడిన వ్యక్తి, ముకేశ్ అంబానీ స్నేహితుడు ఒకరు ఉన్నారు. ఆయనే 'ఆనంద్ జైన్'. ధీరూభాయ్ అంబానీ మూడవ కొడుకుగా పిలువబడే ఆనంద్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.1975లో జన్మించిన ఆనంద్ జైన్.. జై కార్ప్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఈయనను అందరూ ముద్దుగా ఏజే అని పిలుచుకుంటారు. ఆనంద్ జైన్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో విడదీయరాని అనుబంధం ఉంది. వీరిరువురు చిన్నపాటి ఫ్రెండ్స్ కావడం గమనార్హం. ముంబైలోని హిల్ గ్రాంజ్ హైస్కూల్లో వీరు కలిసి చదువుకున్నారు.నిజానికి ఆనంద్ జైన్ ఒకప్పటి బిలినీయర్. 2007లో ఈయన 4 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో 11వ సంపన్న భారతీయుడిగా ఉన్నారు. 2023 మార్చి నాటికి జైన్ ఆదాయం రూ. 600.7 కోట్లు. ఈయన కంపెనీ సుమారు 13 ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆర్జిస్తోంది.ఇదీ చదవండి: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?జైన్ ముఖేష్ అంబానీకి వ్యూహాత్మక సలహాదారుగా.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో, ప్రధాన క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అతను ముంబై పోర్ట్ ట్రస్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టీల బోర్డులో కూడా పనిచేశారు.ఆనంద్ జైన్ ముంబై యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ఈయన భార్య సుష్మ. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 కో-ఫౌండర్ 'హర్ష్ జైన్'. ఆనంద్ జైన్ మంచి స్నేహితుడిగా, వ్యాపారవేత్తగా అన్ని రంగాల్లోనూ రాణించారు. -
టీడీపీ నేతల బెదిరింపులకు ‘ఉపాధి’ ఉద్యోగి బలి
చిలకలూరిపేట: టీడీపీ నాయకుల బెదిరింపులు భరించలేక ఉపాధి హామీ పథకం ఉద్యోగి ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గోపాలంవారిపాలెం గ్రామంలో గురువారం జరిగింది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... గోపాలంవారిపాలెం గ్రామానికి చెందిన జడ ఆనంద్(38) గత 18 సంవత్సరాలుగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్)లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు వచ్చి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆనంద్‌ను ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని హెచ్చరించారు. ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ గురువారం మధ్యాహ్నం తన ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకురాగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. ఆనంద్‌కు భార్య రత్నకుమారి, కుమార్తెలు దివ్య(10వ తరగతి), అర్షిత(8వ తరగతి), మహి(7వ తరగతి) ఉన్నారు. తన భర్త మృతికి గోపాళంవారిపాలెం గ్రామానికి చెందిన చిన్నం రవిబాబు, గోపాళం సాగర్‌బాబు, గోరంట్ల బుజ్జి, గోపాళం శ్రీధర్, మిన్నకంటి వీరబాబు, మానుకొండ బాలయ్య తదితరుల వేధింపులే కారణమని రత్నకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకాష్‌పై అలక వీడిన మాయావతి
మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌పై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి అలక వీడాడు. ఆమె తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన ఆమె మేనల్లుడు ఆకాష్ అత్త మాయావతి పాదాలను తాకి, ఆశీర్వదించాలని కోరారు. దీంతో ఆమె ఆనందంతో పొంగిపోతూ ఆకాష్ తలపై చేయివుంచి, నిండుగా ఆశీర్వదించారు.అలాగే మాయావతి ఆకాష్ వీపు తడుతూ ఇకపై జాగ్రత్తగా ఉండు అనేలా సంకేతమందించారు. దీనికితోడు అతనిని రాబోయే ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేశారు. ఆకాష్ ఆనంద్ బీఎస్పీ మాజీ జాతీయ సమన్వయకర్త.గతంలో మాయావతి ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా ప్రకటిస్తూ యూపీ, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించారు. అయితే ఆకాష్ ఎన్నికల సమయంలో సీతాపూర్‌లో వివాదాస్పద ప్రసంగం చేయడంతో అతనిని జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. అయితే ఇది జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఆకాష్‌పై అలకవీడి స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపికచేసి, పార్టీలో తగిన స్థానం కల్పించారు. #WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati holds a meeting with party workers in Lucknow. pic.twitter.com/b5bBrDlesv— ANI (@ANI) June 23, 2024 -
బే విండోకు.. డిజైన్ ఎక్స్‌లెన్స్!
నగరంతో పాటు పలుచోట్ల అందుబాటులోని ఫ్యాషన్ ప్రీమియర్ మిడ్–లగ్జరీ బ్రాండ్ బే విండోకు ప్రతిష్టాత్మక డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. ఈ విషయాన్ని సంస్థకు చెందిన డిజైన్ లీడ్ సిద్ధాంత్ ఆనంద్ తెలిపారు.బ్రాండ్‌ను ప్రారంభించిన సంవత్సరంలోనే ఈ ప్రశంసలు లభించడం తమ డిజైన్ల వైవిధ్యానికి నిదర్శనమని, భారతీయతను ప్రతిబింబించే దాదాపు 1000కిపైగా అత్యాధునిక డిజైన్ల రూపకల్పన ద్వారా ఈ అవార్డుకు అర్హత పొందామని సంతోషం వ్యక్తం చేశారు.ఇవి చదవండి: ‘తాన్సేన్’ మొఘల్ వైభవం.. -
ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు
సాక్షి, ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు పడింది. బీఎస్పీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్‌కుమార్.. విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోవడంతో రాజ్‌కుమార్ అసెంబ్లీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారం తెలిపారు. జూన్ 11న విచారణకు హాజరుకావాలని నోటీస్ ఇచ్చినా కానీ ఆయన హాజరుకాలేదని గోయెల్ పేర్కొన్నారు. మరోసారి జూన్ 14న హాజరుకావాలని ఆదేశించినా స్పందించలేదన్నారు. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ తెలిపారు.'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను రాజ్‌కుమార్ ఆనంద్ నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దళితులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. గత ఏప్రిల్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా వీడారు. ఆప్‌లోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, కౌన్సిలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గత మేలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరఫున ఎంపీ ఎన్నికల్లో రాజ్‌కుమార్ పోటీ చేశారు. -
ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ముఖ్యం: రష్మికా మందన్న
‘‘ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ముఖ్యం. సినిమాల్లోకి వచ్చాక నేను ఈ విషయం తెలుసుకున్నాను. ఆనంద్ నాకు బ్రదర్‌లాంటి వాడు. అతని మీద నేను చాలా ఆధారపడుతుంటాననే విషయం ఆనంద్‌కే తెలియదు. ‘గం..గం..గణేశా’ సక్సెస్ సాధిస్తే ఆనంద్ ముఖంలో నవ్వు ఉంటుంది. ఆ విజయం తాలూకు నవ్వుని నేను చూడాలనుకుంటున్నాను’’ అన్నారు.హీరోయిన్ రష్మికా మందన్న. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి రష్మికా మందన్న ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘గం..గం..గణేశా’ సాంగ్స్‌కు నేను డ్యాన్సులు చేశాను. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ ఉదయ్‌కి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. వంశీ, కేదార్, అనురాగ్‌లకు ఈ మూవీ మంచి లాభాలు తీసుకురావాలి’’ అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి వినోదాత్మకంగా తీసిన చిత్రం ‘గం..గం..గణేశా’. నేను ఈ సినిమాలో కనిపించినంత ఎనర్జిటిక్‌గా ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించలేదు’’ అన్నారు. ‘‘గం..గం..గణేశా’లో ఒక అతిథి పాత్ర ఉంది. ఆ పాత్రను థియేటర్లో చూసి షాక్ అయ్యేందుకు రెడీగా ఉండండి’’ అన్నారు ఉదయ్ శెట్టి. దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్మాత బన్నీ వాసు, సహనిర్మాత అనురాగ్ పర్వతనేని తదితరులు పాల్గొన్నారు. -
ఆనంద్‌కు మూడో స్థానం!
కాసాబ్లాంకా చెస్ వేరియంట్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విజేతగా నిలిచాడు. నలుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య మొరాకోలో ఆరు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్ల్సన్ 4.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందాడు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. హికారు నకముర (అమెరికా) 3.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయి, మరో గేమ్‌లో నెగ్గి, మిగతా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం.. -
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
లక్నో: తన మేల్లుడైన ఆకాశ్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తొలగించారు. ఈ తొలగింపుపై తాజాగా గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆకాష్ ఆనంద్ స్పందించారు. ‘బీఎస్పీ చీఫ్ మాయావతి.. బహుజన సమాజానికి రోల్ మోడల్. బహుజనలు అంటే.. దళితులు, ఎస్టీలు, ఓబీసీలు. మీ పోటం వల్లనే నేడు బహుజన సమాజానికి ఇంత రాజకీయం బలం చేకూరింది. బహుజన సమాజం గౌరవంగా బ్రతకటం నేర్చుకుంది. మీరే మా అధినేత్రి. నా కడ శ్వాస వరకు భీమ్ మిషన్, బహుజన సమాజం కోసం పోరాడతాను’’ అని ఆకాష్ ఆనంద్ ‘ఎక్స్’లో తెలిపారు.ఇక.. ఇటీవల ఆకాశ్ ఆనంద్ బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకాశ్ రాజకీయంగా పరిణతి సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్ మాట్లాడుతూ యూపీలోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్‌గా అభివర్ణించారు.आदरणीय बहन @mayawati जी, आप पूरे बहुजन समाज के लिए एक आदर्श हैं, करोड़ों देशवासी आपको पूजते हैं। आपके संघर्षों की वजह से ही आज हमारे समाज को एक ऐसी राजनैतिक ताक़त मिली है जिसके बूते बहुजन समाज आज सम्मान से जीना सीख पाया है। आप हमारी सर्वमान्य नेता हैं। आपका आदेश सिर माथे पे।…— Akash Anand (@AnandAkash_BSP) May 9, 2024 రాష్ట్రంలోని యువతను ఆకలితో ఉంచుతూ, పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ అధికారులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆకాశ్‌కు సంబంధించిన అన్ని ర్యాలీలను బీఎస్పీ రద్దు చేసింది.2023 డిసెంబరులో మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్ లండన్‌లో ఎంబీఏ చదివారు. ఇక.. 2017లో బీఎస్పీలో చేరారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
ప్రముఖ నిర్మాత ఆనంద్ పండిట్ కూతురి పెళ్లి.. మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
-
ఏపీలో సచివాలయ వ్యవస్థ అద్భుతం
చంద్రగిరి(తిరుపతి జిల్లా): ‘దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక అద్భుతం. ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా తమ గ్రామ పరిధిలోనే... అది కూడా ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలు అందిస్తున్న సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. మా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తాం..’ అని వివిధ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. ‘హెల్తీ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలితాల అధికారులు, ప్రజాప్రతినిధులు 3 బృందాలుగా ఏర్పడి శనివారం చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించారు. చంద్రగిరి మండలంలోని తొండవాడ పంచాయతీలో ఛండీగఢ్, జమ్ము–కశ్మీర్, పంజాబ్, హరియాణ, రాజస్థాన్, కేరళకు చెందిన 49 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. వారికి స్థానిక సర్పంచ్ మల్లం దీపిక, సింగల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి స్వాగతం పలికారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లిలో అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధులు 47మంది, చెర్లోపల్లి గ్రామంలో ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ , తెలంగాణకు చెందిన 48మంది ప్రతిని«దులు పర్యటించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్, వెల్నెస్ సెంటర్ ఎస్‌డబ్ల్యూపీసీ, ప్రభుత్వ పాఠశాలలు వంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని, మౌలిక సదుపాయాలతోపాటు డిజిటల్ క్లాసులు, ట్యాబుల ద్వారా విద్యాబోధన ఒక అద్భుతమని చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో ప్రతి ఏడాది నగదు జమ చేసి విద్యను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీలు, పాఠశాలలు ఆరోగ్య కేంద్రాల పనితీరు చాలా గొప్పగా ఉందని చెప్పారు. తొలుత నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆనంద్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తొండవాడ పంచాయతీలో పర్యటించిన బృందం వెంట ఎంపీపీ హేమేంద్రకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు. -
మారుమూల గ్రామ రైతు కొడుకు 'శాస్త్రవేత్తగా'..
భద్రాద్రి: ఓ రైతు కొడుకు పారిశ్రామిక మంత్రిత్వ శాఖకు అనుసంధానంగా ఉండే బెంగళూరులోని సెంట్రల్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్(సీఎంటీఐ)లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన లావుడ్యా ఆనంద్ ఈ ఘనత సాధించాడు. ఆనంద్ తల్లిద్రండులు లావుడ్యా ఈర్య, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉండగా పెద్ద కుమారుడు ఆనంద్ శాస్త్రవేత్తగా ఎంపికై పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు శాస్త్రవేత్తగా ఎంపికైన నేపథ్యంలో గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా విద్యాభ్యాసం.. గ్రామానికి చెందిన ఈర్యా, మంగ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు ఆనంద్ ఒకటి నుంచి 5 వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, 6 నుంచి 10 వరకు సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. చైన్నెలో బీఈ (ఈఈఈ) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాది పాటు హైదరాబాద్‌లో గేట్ కోచింగ్ తీసుకొని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్ (కంట్రోల్ సిస్టమ్స్ విభాగం)లో సీటు సంపాధించాడు. ఎంటెక్ పూర్తయిన అనంతరం 2019 నుంచి 2021 వరకు కరోనా ప్రభావంతో విద్యాభ్యాసానికి కొంచెం బ్రేక్ పడింది. రాజీ లేకుండా శ్రమించి.. కరోనా సమయంలో దొరికిన విరామాన్ని ఆనంద్ వృథాగా వదిలేయకుండా శ్రమించాడు. వివిధ కొలువుల రాత పరీక్షల మూలంగా తొలిసారిగా బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ (బీఈఎల్)లో ట్రెయినీ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. నెల పాటు ఇక్కడ ట్రెయినీ ఇంజనీర్‌గా పనిచేసిన అనంతరం హైదరాబాద్‌లోని డీఆర్డీఓ – రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో ‘రీసెర్చ్ ఫెలో’గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సీఎంటీఐలో శాస్త్రవేత్త కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని అతను రాత పరీక్ష, మౌఖిక పరీక్షకు హాజరయ్యాడు. సీఎంటీఐలో శాస్త్రవేత్తగా ఎంపికై నట్లు అపాయిమెంట్ లెటర్ రావడంతో తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఇవి చదవండి: తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ -
బీఆర్ఎస్కు బిగ్ షాక్
వికారాబాద్ అర్బన్: కొంత కాలంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు మంజుల రమేష్ ఆదివారం బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వారి రాజీనామాతో పట్టణంలో పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పవచ్చు. మున్సిపల్ పరిధిలోని అన్ని వర్గాల్లో రమేష్ కుమార్‌కు మంచి పట్టు ఉంది. మాస్ నాయకుడిగా గుర్తింపు పొందారు. అనేక సార్లు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. నాలుగు సార్లు ఇండిపెండింట్‌గా పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేష్‌కుమార్ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఏడుగురు కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. దీంతో ఆయనకు పట్టణంలో మరింత పట్టు పెరిగింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్‌కు మద్దతు ఇచ్చారు. చంద్రశేఖర్ సాధించిన 20వేల ఓట్లలో సుమారు మూడు వేల ఓట్లు పట్టణంలో పోలయ్యాయి. ఇందులో రమేష్ కుమార్ ప్రధాన భూమిక పోషించారనే ప్రచారం ఉంది. 2020లో బీఆర్ఎస్లోకి.. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ చైర్మన్ పదవి ఆశించి బీఆర్ఎస్కు దగ్గరయ్యారు. అయితే చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు రావడంతో అనూహ్యంగా తన సతీమణి మంజులను బీఆర్ఎస్ తరఫున 24వ వార్డు కౌన్సిరల్గా పోటీ చేయించారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో చైర్పర్సన్ పదవి దక్కింది. ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చైర్పర్సన్ దంపతులకు, ఎమ్మెల్యే ఆనంద్‌కు తీవ్రంగా గ్యాప్ పెంచింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆనంద్ అధికార పార్టీ కౌన్సిలర్లతో అనేక సార్లు కౌన్సిల్ సమావేశాల్లో చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయించారని చైర్పర్సన్ దంపతులే నేరుగా ఆరోపించారు. అధికార పార్టీ కౌన్సిలర్లు ఎవరూ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా చేశారని మీడియా ముందు వాపోయారు. అంతటితో ఆగకుండా సొంత పార్టీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టించిన ఘనత ఎమ్మెల్యేకు దక్కుతుందని కూడా ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో తోటి మహిళా కౌన్సిలర్ చేతిలో నుంచి మైక్ తీసుకున్నందుకు తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో కేసు వాపసు తీసుకున్నారని చైర్పర్సన్ అప్పట్లో ఆరోపించారు. అనేక అభివృద్ధి పనులకు ఆమోదం తెలపకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని బహిరంగంగానే విమర్శించారు. ఎంత అవమానించినా భరిస్తూ పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. తమకు సముచిత స్థానం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మంజుల రమేష్‌కుమార్ దంపతుల బాటలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జే అరుణ్ కుమార్, విశ్రాంత ఇంజనీర్, జే ప్రదీప్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ యువ నాయకుడు సాయికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంజుల రమేష్‌కుమార్ దంపతులు బీఆర్ఎస్ను వీడడం గట్టి దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
హత‘విధీ’.. ఆనందాన్ని చిదిమేసింది
కారంపూడి: ప్రసవ వేదన పడుతున్న భార్యను ఆస్పత్రిలో చేర్చి.. ఆస్పత్రి ఖర్చులకోసం డబ్బు తీసుకుని బైక్‌పై వెళ్తున్న భర్త ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. భార్యను తరలించిన అంబులెన్స్‌లోనే అతడిని కూడా అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలు విడిచాడు. అప్పటికే భార్య ప్రసవించగా.. పుట్టిన పాపను కూడా చూసుకోకుండా ఆ తండ్రి కన్ను మూయడంతో అక్కడి వారి హృదయాలు బరువెక్కాయి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా కారంపూడి ఇందిరా నగర్ కాలనీ గనిగుంతలుకు చెందిన బత్తిన ఆనంద్ (33) భార్య రామాంజనికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో శుక్రవారం 108లో గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట వాళ్ల అమ్మ, చిన్నమ్మ, ఆశా వర్కర్ ఏసమ్మ వెళ్లారు. భర్తను కూడా అంబులెన్స్ ఎక్కమంటే ఆస్పత్రి ఖర్చులకు డబ్బు తీసుకు వస్తానని ఆగిపోయాడు. శనివారం వేకువజామున డబ్బు తీసుకుని బైక్‌పై నర్సరావుపేట బయలుదేరాడు. మార్గమధ్యంలో జూలకల్లు అడ్డరోడ్డు వద్ద రోడ్డు పక్కన కంకర చిప్స్ ఉండటంతో బైక్ అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కాగా.. కొంతసేపటి వరకు ఎవరూ చూడకపోవడంతో చాలా రక్తం పోయింది. ఆ తరువాత ఓ వ్యక్తి గమనించి 108కు ఫోన్ చేయడంతో భార్యను ఆస్పత్రి తీసుకెళ్లిన అంబులెన్సే వచ్చి అతన్ని కూడా నర్సరావుపేటలో భార్య ఉన్న ఆస్పత్రికే తీసుకెళ్లింది. అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే ఆనంద్ మృతి చెందాడు. అదే ఆస్పత్రిలో ఉన్న భార్యకు సకాలంలో సరైన వైద్యం అందడంతో ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను కూడా చూసుకునే భాగ్యానికి నోచుకోని ఆనంద్ మృతి ఘటన బంధుమిత్రులను కలచి వేస్తోంది. ఇదిలా ఉంటే రామాంజనికి ఇది నాలుగో కాన్పు. ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు. -
మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్!
అభినయ .. ఈ పేరు తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో నేనింతే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజుగారి గది-2, సీతారామం చిత్రాల్లో నటించింది. ఇటీవలే రిలీజైన విశాల్ మూవీ మార్క్ ఆంటోనీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. అయితే పుట్టుకతోనే మూగ, చెవిటి అభినయ సినిమాల్లో తన టాలెంట్‌ను నిరూపించుకుంది. తన నటనతో ఎన్నో అవార్డులను సాధించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు తన తండ్రితో కలిసి హాజరైంది. ఆమె తండ్రి అభినయ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభినయకు వినపడదు.. అంతే కాదు మాట్లాడలేదు కూడా.. కేవలం సైగల ద్వారానే తన భావాలను వ్యక్తం చేయగలదు. (ఇది చదవండి: సడన్‌గా ఓటీటీ మారిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అభినయ తండ్రి ఆనంద్ మాట్లాడుతూ.. 'నా కూతురిని మొదట మోడలింగ్ రంగంలో తనను వాళ్ల అమ్మనే చాలా బాగా చూసుకుంది. నేను చాలా కంపెనీల వద్దకు వెళ్తే నాపై కొప్పడ్డారు. ఒక మూగ అమ్మాయిని తీసుకొచ్చి సినిమాల్లో ట్రై చేస్తున్నారు. అతనేమైనా పిచ్చోడా అన్నారు. కానీ నేను దేవుడిపై భారం వేశాను. మాకు గాడ్ ఎవరంటే సముద్రఖని. ఆయన లేకుంటే అభినయ ఈరోజు ఇక్కడ ఉండేది కాదు. మా అమ్మాయి ఇంత అందంగా పుట్టినా.. దేవుడు ఈ ప్రాబ్లమ్ ఇచ్చాడే అనుకున్నాం. మూడేళ్ల వరకు తాను నడవలేదు. చివరికీ హ్యాండీక్యాప్ అనుకున్నాం. ఈ రోజు ఏ స్థాయిలో ఉన్న తను అందరితో కలిసిపోతుంది. ' అని అన్నారు. అభినయ మాట్లాడుతూ..'తన తల్లిదండ్రులు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. అన్నింటిలోనూ నన్ను నడిపించేది అమ్మ, నాన్నే. నాకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటారు. నా కుటుంబ సభ్యుల సహకారం జీవితంలో మరిచిపోలేను. మా నాన్నే నా జీవితం. మా ఇద్దరి మధ్య చాలా ఫన్నీ సంభాషణలు జరుగుతాయి. నాకు, నాన్నకు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఎప్పడు ఉంటుంది. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాతో ఎంతో సరదాగా ఉండేది. అప్పుడప్పుడు నువ్వే నా భర్త అనేదాన్ని. తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా' అని అన్నారు. విశాల్‌తో అభినయ పెళ్లి? ఈ వార్త విని షాకింగ్ గురైనట్లు అభినయ వెల్లడించింది. నేను ఆయనను చూసి నవ్వడం వల్లే ఇలాంటి వార్తలొచ్చాయి. ఒక ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ దీని గురించి అడిగింది. ఏదో యూట్యూబ్‌లో చూసి ఆమె అలా మాట్లాడింది. కానీ నాకు ఇప్పుడైతే పెళ్లి గురించి ఆలోచన లేదు. నా తల్లిదండ్రులే నాకు అన్నీ కూడా. నేను పెళ్లి చేసుకునే వ్యక్తి ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని షేర్ చేయాలి. రిలేషన్లో విలువలు ఉండాలి. అలాంటి అబ్బాయి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానని అభినయం అంటోంది. (ఇది చదవండి: టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు) -
హైలెస్సో హైలెస్సా...
‘‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా చేసిన ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్లు. సామ్ .జి, వంశీకృష్ణ వర్మ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘హైలెస్సో హైలెస్సా...’ అంటూ సాగే పాటని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విడుదల చేశారు. డి. ప్రసన్న కుమార్ సాహిత్యం అందించిన ఈ పాటను ధనుంజయ్ సీపాన, ఎ. ప్రవస్తి పాడారు. ‘‘అందమైన ప్రేమకథని తెలియజేసే లవ్లీ మెలోడీగా ఈ పాటని స్వరపరిచారు అనూప్’’ అన్నారు మేకర్స్. -
పైళ్లెన ఐదు నెలలకే.. పని చేసుకోమన్నందుకు.. ఇలా చేశాడు!
సంగారెడ్డి: పైళ్లెన ఐదు నెలలకే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని హబ్సిపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గుర్రం ఆనంద్(29)కు ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. అతని కుడి చేయి కొద్దిగా అంగవైకల్యం ఉంది. ఖాళీగా తిరగకుండా ఏదైనా పని చేసుకోమని తల్లిదండ్రులు చెబుతుండటంతో వారితో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదమం 10 గంటల సమయంలో పొలం దగ్గరకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడు. మధ్యాహ్నం తన భార్య భారతికి ఫోన్ చేసి పైలంగా ఉండు అని చెప్పి కట్ చేశాడు. అనుమానం వచ్చి భార్య, బంధువులు పొలం దగ్గర వెతికారు. పక్కనే ఉన్న మంగళి భిక్షపతి బావి దగ్గర చెప్పులు, ఫోన్ కనిపించాయి. బావిలో చూడగా ఆనంద్ మృతదేహం కనిపించింది. మానసిక, శారీరక పరిస్థితి సరిగాలేక జీవితంపై విరక్తిచెంది మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
SKY:ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే?
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’. ‘అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే" అన్నది ట్యాగ్ లైన్. పృథ్వి పేరిచర్ల దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్"పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ "స్కై" చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు. -
2 నెలల్లో రూ.26 కోట్ల డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: నిషా ముక్త్ తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అద్భుత ఫలితాలు సాధిస్తోందని న్యాబ్ డైరెక్టర్, నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వెల్లడించారు. జూన్–జూలై నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చేసిన దాడుల్లో టీఎస్ న్యాబ్ అధికారులు 196 కేసులు నమోదు చేసినట్లు గురువా రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా 196 కేసుల్లో 175 గంజాయి దందాకు సంబంధించినవే. ఈ కేసుల్లో అధికారులు 353 మందిని అరెస్టు చేశారు. మరోపక్క 21 డ్రగ్స్ సంబంధిత కేసుల్లో 46 మందిని కటకటాల్లోకి పంపారు. వీరి వద్ద నుంచి స్వాదీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ.26,01,34,650గా నిర్థారించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు జూన్‌లో మూడు రోజుల పాటు మిషన్ పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. డ్రగ్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ఇతర రాష్ట్రాల, కేంద్ర ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కీలక సమావేశం గత నెల 5న నిర్వహించారు. డ్రగ్స్ దందాకు చెక్ చెప్పడానికి డార్క్‌వెబ్ సహా ఆన్లైన్లో జరిగే అక్రమ లావాదేవీలు నిరోధించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని నిర్ణయించారు. -
వికారాబాద్ (SC) నియోజకవర్గం నాయకుడు ఎవరు?
వికారాబాద్ (ఎస్సి) నియోజకవర్గం వికారాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ది డాక్టర్ మెతుకు ఆనంద్ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ నేత, మాజీ మంత్రి ప్రసాదకుమార్‌పై 3122 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సిటింగ్ ఎమ్మెల్యే బి.సంజీవరావుకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన బదులు ఆనంద్‌కు ఇచ్చారు. ఆయనకు 51744 ఓట్లు రాగా, ప్రసాదకుమార్‌కు 48622 ఓట్లు వచ్చాయి. మరో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పార్వర్డ్ బ్లాక్ టిక్కెట్ పై పోటీచేసి 23 వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. 2014లో ప్రసాదకుమార్ కాంగ్రెస్ ఐ తరుపున పోటీచేసి టిఆర్ఎస్ అభ్యర్ధి బి.సంజీవరావు చేతిలో ఓడిపోయారు. 10072 ఓట్ల ఆదిక్యతతో సంజీవరావు విజయం సాధించారు. 2018లో సంజీవరావుకు టిక్కెట్ ఇవ్వలేదు. వికారాబాద్ ఎస్.సి.లకు రిజర్వు అయిన నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ పదహారు సార్లు ఎస్.సి నేతలు గెలుపొందారు.అంతకుముందు రెండుసార్లు రెడ్లు గెలుపొందారు. ఇక్కడ సీనియర్ నేత చంద్రశేఖర్ 1985 నుంచి వరుసగా నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్ఎస్ తరుఫునగెలుపొందారు. 2004లో టిఆర్ఎస్ పక్షాన గెలిచిన ఈయన 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రసాద్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2009లో కూడా ప్రసాద్ ఈయనను ఓడిరచడం విశేషం. చంద్రశేఖర్ కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్లో ఉండగా, మరికొంతకాలం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. వికారాబాద్‌లో రెండుసార్లు గెలిచిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొత్తం ఆరుసార్లు గెలిచి మంత్రి, ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. ప్రముఖ దళితనేత ఆరిగే రామస్వామి వికారాబాద్‌లో నాలుగుసార్లు ఎన్నికయ్యారు. మంత్రి పదవికూడా చేపట్టారు. కాగా కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్లో ప్రసాద్‌కుమార్ మంత్రి అయ్యారు. వికారాబాద్‌కు 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు గెలిస్తే, టిడిపి నాలుగుసార్లు, మూడుసార్లు టిఆర్ఎస్ గెలుపొందాయి. మరోసారి ఇండిపెండెంటు గెలిచారు. 1952, 57లలో వికారాబాద్ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1962లో అరిగే రామస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వికారాబాద్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కీమోథెరపీ ఇక సేఫ్
సాక్షి, హైదరాబాద్: కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడం..వ్యాధికణాలకు మాత్రమే మందు అందించేలా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ చేసిన ప్రయత్నం సఫలమైంది. కేన్సర్ సోకిందంటే మరణం తప్పదనేది ఒకప్పటిమాట. కానీ ఇప్పుడు జీవితాన్ని మరింతగా పొడిగించేందుకు ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో కీమోథెరపీ కూడా ఒకటి. అయితే ప్రత్యేక రసాయనాలతో అందించే ఈ చికిత్సలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కేన్సర్ కణాలతోపాటు ఆరోగ్యంగా ఉన్న ఇతర కణాలు కూడా నాశనమయ్యేవి. రోగనిరోధక శక్తి తగ్గి వెంట్రుకలు రాలిపోవడం, ఒళ్లంతా దద్దుర్లు, నోట్లో పుండ్లు లాంటి దుష్ప్రభావాలు అనేకం ఉండేవి. ఒకవేళ వీటన్నింటిని తట్టుకున్నా, కీమో రసాయనాల నుంచి తప్పించుకున్న కొన్ని కణాలతో మళ్లీ కేన్సర్ తిరగబెట్టే ప్రమాదమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడంతోపాటు, ఇచ్చే మందు నేరుగా కేన్సర్ కణాలకు మాత్రమే చేరేలా చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. నానో కణాలు తయారు చేసి..పేటెంట్ పొంది.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగపు అధ్యాపకుడు కొండపి ఆనంద్ తన పరిశోధనల ద్వారా నానో కణాలను తయారు చేశారు. అంతేకాకుండా తయారీ పద్ధతిని కూడా ఆవిష్కరించారు. పేటెంట్ హక్కులు కూడా పొందారు. ప్రస్తుతం ఇలా... కేన్సర్ చికిత్సలో భాగంగా కీమో రసాయనా లతో పాటు కణాలకు అవసరమైన డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి సేంద్రియ పదార్థాలను కలిపి అందిస్తున్నారు. కానీ దీంతో ఫలితాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ సేంద్రియ పదార్థాలకు ఏది కేన్సర్ కణమో, ఏది సాధారణమైందో తెలియదు. అందువల్ల ప్రభావం తక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించేందుకు మాత్రమే ఈ సేంద్రియ పదార్థాలు ఉపయోగపడతాయి. రెండూ కేన్సర్ కణాలకు మోసుకెళ్లగలిగితే... కీమో రసాయనాలు, సేంద్రియ పదార్థాలు రెండింటినీ కలిపి కేన్సర్ కణాలకు మోసుకెళ్లగలిగితే చాలా లాభాలుంటాయని ప్రొఫెసర్ కొండపి ఆనంద్ గుర్తించారు. ఈ పని సాధించే టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. కేన్సర్ కణాలకు చక్కెరలన్నా, ఇనుము అన్నా చాలా ఇష్టమని చాలాకాలంగా తెలుసు. ఈ కారణంగానే ఏమో కేన్సర్ కణాల్లో ఈ రెండు పదార్థాలను ఒడిసిపట్టుకోగల రిసెప్టర్లు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ విషయాలను అనుకూలంగా మార్చుకొని కేన్సర్‌పై పట్టు సాధించేందుకు కొండపి ఆనంద్ నేతృత్వంలో డాక్టర్ సొనాలి ఖన్రా, డాక్టర్ ఎస్ఎల్.బాలకృష్ణ, డాక్టర్ జగదీశ్ సేనాపతి, డాక్టర్ చుఖూ ముజ్, డాక్టర్ నేహాతోమర్, అంతం సోనీలతో కూడిన శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది. పాలలోఉండే లాక్టోఫెర్రిన్, రక్తంలోని ప్రొటీన్లతో వీరి పరిశోధనలు సాగాయి. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి సేంద్రియ పదార్థాలను, కీమో రసాయనాన్ని నానోస్థాయి అపోట్రాన్స్‌ఫెరిన్ ప్రొటీన్‌లోకి చేర్చడంలో విజయం సాధించారు. నోటితోనూ వేసుకోవచ్చు... కీమోథెరపీకి నరాల్లోకి ఎక్కించే పద్ధతి ఒక్కటే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. సహజసిద్ధమైన లాక్టోఫెర్రిన్, అపోట్రాన్స్ఫెరిన్లతో తయారైన నానోస్థాయి కణాలను మాత్రం నేరుగా నోటిద్వారా కూడా అందించవచ్చని ప్రొఫెసర్ కొండపి ఆనంద్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ పద్ధతిలో వాడిన ప్రొటీన్లన్నీ సహజసిద్ధమైనవి కాబట్టి ఆరోగ్యకరమైన కణాలకు హాని జరగదని చెప్పారు. ఈ నానోస్థాయి కణాలు కేన్సర్ కణాల్లోని రిసెప్టర్లకు అతుక్కుపోవడం వల్ల అపోట్రాన్స్‌ఫెరిన్ విడిపోయి అందులోని కీమో రసాయనం బయటపడుతుందని, కేన్సర్ కణాన్ని నాశనం చేస్తుందని వివరించారు. సాధారణ కణాల్లో అపోట్రాన్స్‌ఫెరిన్, లాక్టోఫెర్రిన్లు ఉంటాయి కాబట్టి ప్రమాదమేమీ ఉండదన్నారు. ఈ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి 2017లో తాము భారతీయ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఈ నెల 20వ తేదీన లభించిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు చొరవ తీసుకుని ముందుకొస్తే అతితక్కువ దుష్ప్రభావాలు ఉండే కీమోథెరపీకి నాంది పలకవచ్చని చెప్పారు. అంతేకాకుండా, భవిష్యత్‌లో ఈ టెక్నాలజీ జన్యుచికిత్సలకూ ఉపయోగపడుతుందన్నారు. -
మొన్న నేను.. ఈరోజు గీత్!
‘‘కష్ట్టపడితే సక్సెస్ సాధిస్తాం. ఇందుకు ఉదాహరణ మేమే. మొన్న నేను ఇండస్ట్రీకి వచ్చాను.. ఈ రోజు గీత్ ఆనంద్ వచ్చాడు.. రేపు ఎవరో ఒకరు వస్తారు. ‘గేమ్ ఆన్’ని ప్రేక్షకులు హిట్ చేయాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. గీత్ ఆనంద్ హీరోగా, నేహా సోలంకి, వాసంతి హీరోయిన్లుగా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’. వెంకటేశ్వరరావు కస్తూరి, సాక్షి రవి సమర్పణలో రవి కస్తూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమా నిరుత్సాహపరచదు’’ అన్నారు దయానంద్. ‘‘2023లో సౌత్ నుంచి వచ్చిన మంచి సినిమాల్లో ‘గేమ్ ఆన్’ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు గీత్ ఆనంద్. ‘‘మా సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది’’ అన్నారు రవి కస్తూరి. -
ఆనంద్ మూవీ చైల్డ్ అర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకం చెప్పన్కర్లేదు. సినిమాలను తెరకెక్కించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన సినిమాలంటే ఎలాంటి యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. రియలస్టిక్కు దగ్గర ఉండే ఫీల్ గుడ్ లవ్‌స్టోరీస్ తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. పాత్రలతో ప్రయోగాలు చేస్తారు. సెన్సిబుల్ పాయింట్‌తో ధైర్యం చేస్తారు. అలా ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాల్లో ఆనంద్ ఒకటి. మంచి కాఫీ లాంటి సినిమా అనేది ఉప శీర్షిక. ఈ మూవీ వచ్చి 18 ఏళ్లు గుడుస్తున్న ఇందులోని పాత్రలు, పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. చదవండి: బాలయ్య ఫ్యాన్స్ చంపేస్తారేమోనని భయపడ్డా!: వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు వెండితెరపై రియల్ లైఫ్ పాత్రలను చూస్తున్నంత అనుభూతిని ఇచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కుటుంబ నేపథ్యంలో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత నిజంగానే ఓ మంచి కాఫీ లాంటి సినిమా అనిపించుకుంది. ఇక ఇందులో ప్రతి పాత్రకు ఆయా నటులు జీవం పోశారని చెప్పవచ్చు. అందులో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఆనంద్ ఆనంద్ అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ హీరో రాజా చూట్టు తిరిగే చిన్నారి రోల్ కూడా ఒకటి. హీరో లిటిల్ ఫ్రెండ్‌గా సమత రోల్ పోషించింది ఆ చిన్నారి. చెప్పాలంటే ఇందులో ప్రధాన పాత్రల్లో ఆ చిన్నారి రోల్ కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆనంద్ తర్వాత ఆ చిన్నారి తెరపై ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ చిన్నారి 18 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఆమె అసలు పేరు భకిత. ఇప్పుడు ఆమె వయసు 26 ఏళ్లు. ఒక్క సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న భకిత మిగతా చైల్డ్ ఆర్టిస్టుల మాదిరిగా తిరిగి సినిమాల్లోకి రాలేదు. తన రూటే సపరేటు అంటూ భవిష్యత్తును కాస్తా భిన్నంగా ప్లాన్ చేసుకుంది. చదువుకుంటూనే సమాజ సేవలో పాల్గొంటుంది. చదవండి: విజయ్ దూకుడు.. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ‘రౌడీ’ హీరో తన 17 ఏళ్ల వయసు నుంచి మహిళల హక్కుల కోసం, ఆడవాళ్ల హక్కులు గురించి పోరాడుతుంది. అంతేకాదు పిల్లలపై జరుగుతున్న దాడులు, అత్యచారాలు, అఘాత్యాయిలను ఖండిస్తూ వాటికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ ఉద్యమం చేస్తుందట. మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని భకిత పోరాటం చేస్తోంది. 18 ఏళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్‌గా ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న భకిత ఇప్పుడు సమాజ క్షేమం కోసం ఆమె ఉద్యమాలు చేస్తూ ఎంతో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. -
‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!
కుల వ్యవస్థ దుర్మార్గపు అణచివేత, వివక్ష, అంటరాని తనం నుండి విముక్తి పొందడానికి మహార్ పీడిత కులానికి చెందిన ఐదు వందలమంది సైనికులు 1818 జనవరి ఒకటవ తేదీ నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున రెండవ బాజీరావు పీష్వా సైన్యంతో భీమానది ఒడ్డున వీరోచితంగా పోరాడి విజయం సాధించారు. ఈ విజయానికి సూచనగా అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కోరేగావ్ వద్ద మహార్ అమరవీరుల స్థూపాన్ని నిర్మించి, ఆ స్థూపంపై యుద్ధంలో చనిపోయిన 22 మంది మహార్ వీరుల పేర్లను చెక్కించారు. భీమా నది ఒడ్డున నిర్మించిన మహార్ వీరుల స్మారక విజయ స్తంభాన్ని 1927లో డాక్టర్ అంబేడ్కర్ సందర్శించే వరకు భీమా కోరేగావ్ చరిత్ర... స్వతంత్ర పోరాటం పేరుతో వక్రీకరణకు గురైంది. అక్కడ జరిగిన యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దురాక్రమణకు వ్యతిరేకంగా మరా ఠాలు చేసిన స్వాతంత్య్ర పోరాటంగా కుహనా చరిత్రకారులు చిత్రించారు. నిజానికి చరిత్ర లోతుల్లోకి తొంగిచూస్తే... మహార్ వీరులు ఆ యుద్ధంలో తమ పట్ల పీష్వాలు అనుసరిస్తున్న అంటరానితనం, అణచివేతలకు వ్యతిరేకంగా... తమ విముక్తి కొరకే పాల్గొన్నా రనేది వాస్తవం. అంబేడ్కర్ భీమాకోరేగావ్ వద్ద విజయాన్ని మరాఠా పీష్వాల రాజ్యంలో ‘బ్రాహ్మణీయ అణచివేతపై దళిత ఆత్మగౌరవ ప్రతీకగా’ ప్రకటించడంతో అసలు చరిత్ర వెలుగు లోకి వచ్చింది. మరాఠా సామ్రాజ్యంలో నిజానికి పీష్వాలు దళితులపై చేస్తున్న కుల అణచివేత, ఆగడాలు అంతా ఇంతా కాదు. నడుముకు చీపురు, మూతికి ముంత కట్టించారు. దళితులకు భూమి, ఆత్మగౌరవం, ఆయుధాలు నిరాకరించి పశువుల కన్నా హీనంగా చూస్తున్న పీష్వాల పాలనలో పోరాటం తప్పితే మరేమీ మిగల్లేదు. యుద్ధానికి ముందు మహార్ల నాయకుడైన సిఖ్ నాయక్... పీష్వా సైన్యాధికారిని యుద్ధం జరగకుండా ఉండాలంటే... తమను మనుషులుగా గుర్తించి, అంటరానితనం పాటించడం నిలిపివేసి కనీస హక్కులు ఇవ్వాలని అడిగాడు. ‘మీరు యుద్ధం చేసి గెలిచినా కూడా అస్పృశ్యులే, మీ అంటరానితనం పోదు. మీరు ఎప్పుడూ మా కాళ్ళకింద ఉండేవారే’ అని కండకావరంతో సైని కాధికారి మాట్లాడటంతో యుద్ధం అనివార్యమైంది. అత్యంత బలస్థులూ, పోరాట యోధులైన మహర్ యువకులు ఆ మాటలతో ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారు. రెండు రోజులు కాలినడకన ప్రయాణం చేశారు. వెంట తెచ్చుకున్న రొట్టెలు అయిపోయాయి. అయినా ఆకలితో ఉండి కూడా భీమా నది ఒడ్డున 1818 జనవరి ఒకటవ తేదీనాడు 20 వేల అశ్వికదళం, 8 వేల పదాతిదళం కలిగినన పీష్వాల సైన్యంతో పోరాడి విజయం సాధించారు. ఇది ముమ్మాటికీ కుల పీడనపై ‘ప్రతిఘటన’గానే మనం చూడాలి. నేడు కుల వ్యవస్థ ఆధునిక రూపాలు సంతరించుకొని గ్రామాల నుండి పట్టణాల వరకూ, పాఠశాలల నుండి యూని వర్సిటీల వరకూ, చిన్న పని ప్రదేశాల నుండి కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల వరకూ రాజ్యమేలుతోంది. రోజురోజుకు బలోపేతం అవుతున్న హిందూత్వ ఫాసిజం మనుస్మృతిని అధికారికంగా నెలకొల్పే దిశగా పయనిస్తున్నది. దళిత బహుజనుల నీడ, గాలి సోకకుండా వారి మానవ హక్కు లన్నింటినీ నిషేధించిన పీష్వాల అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతి రేకంగా సాగిన భీమా కోరేగావ్ పోరాటాన్ని ఎత్తి పడుతూ అంబేడ్కర్ ఆ పోరాటాన్ని ఆత్మగౌరవ ప్రతీక అని ప్రకటించి, దానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు. అనంతరం ఈ దేశ రాజ్యంగంలో దళితులకు హక్కులను పొందుపర్చడంతో పాటు కుల వర్గ పీడన అంతం కావాలని ఆశించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన మహిళలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలతో కూడిన బహుజన సమాజపు విముక్తికై వినూత్న మార్గంలో పోరాడారు. అయినా కొత్త పీష్వాలు అధికారాన్ని చలాయిస్తున్న సందర్భంలో మళ్లీ మనువాదం పూర్తి స్థాయిలో జడలు విప్పుకునే అవకాశం ఉంది. అందుకే బహుజన సమాజం అప్రమత్తతతో ఉండాలి. – కోట ఆనంద్, కుల నిర్మూలన వేదిక రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ‘ 96523 57076 (నేడు భీమా కోరెగావ్ పోరాటం జరిగిన రోజు) -
SKY Movie: ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది?
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కై’. పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో ‘వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్’పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం తుంటరిగా పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని దర్శకుడు పృథ్వి తెలిపారు. చివరి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయనున్నామని నిర్మాతలు నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు తెలిపారు. -
Grandmaster status: భారత 76వ గ్రాండ్‌మాస్టర్‌గా ప్రణవ్ ఆనంద్
ఈ ఏడాది భారత్ నుంచి మరో కుర్రాడు చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించాడు. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల ప్రణవ్ ఆనంద్ భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న 76వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. రొమేనియాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–16 విభాగంలో టైటిల్ సాధించిన ప్రణవ్ 2500 ఎలో రేటింగ్ మైలురాయిని కూడా దాటాడు. దాంతో అతనికి జీఎం హోదా ఖరారైంది. నిబంధనల ప్రకారం జీఎం హోదా లభించాలంటే మూడు జీఎం నార్మ్‌లు సంపాదించడంతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు ఉండాలి. గత జూలైలో స్విట్జర్లాండ్‌లో జరిగిన బీల్ చెస్ ఫెస్టివల్లో ప్రణవ్ మూడో జీఎం నార్మ్ సాధించాడు. ఈ సంవత్సరం భరత్ సుబ్రమణియమ్ (తమిళనాడు), రాహుల్ శ్రీవత్సవ్ (తెలంగాణ), ప్రణవ్ వెంకటేశ్ (తమిళనాడు) జీఎం హోదా సాధించారు. -
ఎన్టీపీసీ ఆర్‌ఈడీగా నరేశ్ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నరేశ్ ఆనంద్ సోమవారం కవాడిగూడలోని సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లతో పాటు దక్షిణ భాతర దేశంలోని సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా 1984లో చేరిన ఆయన.. 37 ఏళ్ల సర్వీసు కాలంలో పలు హోదాల్లో పనిచేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సభ్యుడిగా కూడా వ్యవహరించారు. -
Friendship Day 2021: ముఖేశ్ మనసులో ఆనంద్‌ది చెరిగిపోని స్థానం
Happy Friendship Day 2021... స్నేహమనేది ఓ మధురమైన అనుభూతి. దానికి వర్ణ, వర్గ, లింగ, జాతి, వయసు, స్థాయి, కులాలతో నిమిత్తంలేదు. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా ప్రతి మనిషి జీవితంలో స్నేహం అందమైన లతలా అల్లుకుపోతుంది. మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా, ఎంత బిజీగా ఉన్నా ఆత్మీయ స్నేహితులతో కనీసం వారంలో ఒకటి, రెండు సార్లు కలవటం, మాట్లాడంగాని చేయకపోతే ఏదో కోల్పొయిన భావన కలుగుతుంది. అదే మరీ స్నేహానికి ఉన్న అద్భుతమైన శక్తి. ప్రతీ రోజు తమ కంపనీ షేర్ల విలువ, సంస్థల విస్తరణ, వ్యాపార లాభ నష్టాలు వంటి విషయాల్లో తలమునకలయ్యే దిగ్గజ వ్యాపారాలు కూడా తమ స్నేహితులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆ సమయంలో స్థాయి, భేదాలు మరచి స్నేహబంధ జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. అలాంటి వారిలో ముందువరసలో ఉంటారు.. ముఖేశ్ అంబానీ, ఆనంద్ జైన్..ముఖేశ్ అంబానీ.. పరిచయం అక్కర్లేని వ్యాపార దిగ్గజం. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. ఆనంద్ జైన్ అయనకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఇద్దరూ ముంబైలోని హిల్‌గ్రాంజ్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ముఖేశ్ కొంచెం బిడియంగా ఉంటాడు. అంతర్ముఖుడు. ఆనంద్ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలడు. ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్‌గా ముఖేశ్ మనసులో ఆనంద్‌ది చెరిగిపోని స్థానం. మొదట్లో కలిసి పనిచేసినా, ఇప్పుడు ఎవరి వ్యాపారాల్లో వారు తలమునకలవుతున్నా వారంలో రెండు, మూడుసార్లయినా కలవటం, సరదాగా గడపడం వారిద్దరికీ అలవాటు. కిరణ్ మజుందార్ షా... నీలిమా రౌషెన్ బయోకాన్ కంపెనీ అధినేత కిరణ్ మజుందార్ షా.. నీలిమా రౌషెన్.. ఇద్దరిదీ దాదాపుగా ఒకే నేపథ్యం... వారు పనిచేసే రంగాల్లో ఇద్దరిదీ ఒంటరి పోరాటం. ఒకరికొకరు పరిచయమయ్యారు. సొంత అక్కా చెల్లెళ్లలా కలసిపోయారు. అంతా బాగుందనుకున్న తరుణంలో క్యాన్సర్ బారిన పడ్డారు నీలిమ. ఆమెకు అన్ని విధాలా ఆసరాగా నిలిచారు కిరణ్... అయితే అనుకోకుండా కొన్ని రోజులకు కిరణ్ భర్తకు కూడా క్యాన్సర్ అని తేలింది. అయితే కిరణ్ భర్త వ్యాధినుంచి కోలుకున్నారు. ఇంకా కోలుకోని స్నేహితురాలు నీలిమను విదేశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించింది. అయినా స్నేహితురాలు దక్కలేదు. ఆ వేదనతోనే కిరణ్ కాన్సర్ పై పోరాటానికి వందల కోట్లు విరాళంగా ఇచ్చారు. రతన్ టాటా– శంతను నాయుడు రతన్‌టాటా.. మనసున్న వ్యాపారవేత్త. ఎనభయ్యో పడిలోనూ ఉరకలేసే ఉత్సాహం, సంస్థతో పాటు సమాజానికీ ఏదో చెయ్యాలన్న ఆరాటం. ఆ స్వభావమే తన కన్నా వయసులో ఎంతో చిన్నవాడైనప్పటికీ శంతను నాయుడితో స్నేహం చేసేందుకు పురిగొల్పింది. వయసులో తేడా ఉన్నా శంతనుదీ తనలాంటి స్వభావమే కావడంతో ఆ స్నేహబంధం మరింత బలపడింది. పుణెకు చెందిన శంతను నాయుడు– టాటా సంస్థలో ఉద్యోగిగా పనిచేసేవాడు. అతనికి శునకాలంటే వల్లమాలిన ప్రేమ. వాటి కోసం ఏకంగా ఒక స్వచ్ఛంద సంస్థనే పెట్టాడు. ఈ విషయం రతన్‌టాటా దృష్టికి వచ్చింది. ఆయనకూ జాగిలాలంటే ఇష్టం. శంతనుని ముంబైకి పిలిపించుకుని స్వయంగా కలిసి అభినందించారు. శంతను చేసే సంక్షేమ కార్యకలాపాల గురించి ఇద్దరిమధ్యా ఈ–మెయిల్స్ నడిచేవి. వారిద్దరి స్వభావాలూ, సేవాభావనలు ఒకేలా ఉండడంతో క్రమంగా ఇద్దరూ స్నేహితులయ్యారు. -
స్నేహబంధాన్ని పెళ్లితో ముడివేసుకున్నాం: హీరోయిన్
ముంబై: తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలిసారిగా అభిమానులతో పంచుకున్నారు బాలీవుడ్ నటి అంగీరా ధర్. దర్శకుడు ఆనంద్ తివారితో రెండేళ్లపాటు ప్రణయ బంధంలో మునిగితేలిన ఆమె.. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఆయనను వివాహమాడారు. లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకు జరుగగా.. తాజాగా ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారామె. ‘‘30-04-2021.. ఆనంద్.. నేను.. కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఆ దేవుడి సమక్షంలో మా స్నేహబంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నాం. జీవితంలో నెమ్మనెమ్మదిగా మార్పులు వస్తున్నాయి. సంతోషకర క్షణాలను మీతో పంచుకుంటున్నా’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో నూతన జంటకు బుల్లితెర, వెండితెర సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన అంగీరా ధర్.. 2013లో ‘ఏక్ బురా ఆద్మీ’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. అనంతరం పలు వెబ్‌సిరీస్‌లలో నటించిన ఆమె.. ఆనంద్ తివారీ తెరకెక్కించిన లవ్ పర్ స్వ్కేర్ ఫీట్ సినిమాతో హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విక్కీ కౌశల్ కథానాయకుడిగా కనిపించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యింది. ఇక మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ అంగీరా- ఆనంద్ ఇటీవలే పెళ్లితో ఒక్కటై వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. చదవండి: నా ఆటోబయోగ్రఫీ ఇచ్చాను.. ఆయన భయపడ్డారు: సీనియర్ నటి -
Anand: ఒక వేణువు వినిపించిన విషాద గీతిక
సాక్షి ప్రతినిధి, చెన్నై : ఆయన పేరులోనే కాదు.. వ్యక్తిత్వం కూడా ఆనందకరం, అనుసరణీయమని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు. ప్రముఖ సినీ గాయకులు, సంగీత దర్శకులు దివంగత జీ ఆనంద్‌కు పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. కరోనా వైరస్ సోకి ఇటీవల హైదరాబాద్‌లో అశువులు బాసిన జీ ఆనంద్‌ను గుర్తు చేసుకుంటూ నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) వారు శనివారం రాత్రి “ఒక వేణువు వినిపించిన విషాద గీతిక’ పేరున స్వర నివాళులర్పించారు. అంతర్జాలమే వేదికగా ఏర్పాటు చేసుకుని నిర్వహించిన ఈ కారక్రమంలో దేశ, విదేశాల నుంచి పలువురు పాల్గొని జీ ఆనంద్‌తో తమకున్న పరిచయాన్ని, అనుభవాలను, ఆనందపు క్షణాలను గుర్తు చేసుకున్నారు. ముందుగా, నవసాహితీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్వీ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుగా రాజకీయ వార్తలు రాసేవాడినని, అయినా సంగీతం, సాహిత్యాభిలాషతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆనంద్‌కు ఆప్తుడయ్యానని చెప్పారు. ఎస్పీ బాలుకు, ఆనంద్‌కు సినీ పరిశ్రమ ఘన నివాళులర్పించకపోవడం బాధాకరమన్నారు. తనకు 20 ఏళ్లుగా ఆనంద్‌తో పరిచయం అని, అతడో నిత్యసంతోషి, ఆనంద్, సుజాత ఆదర్శ దంపతులుగా మెలిగారని అని ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి గుర్తు చేశారు. సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ తనకు 50 ఏళ్ల అనుబంధం అని, జీ ఆనంద్ సార్థక నామథేయుడు తెలిపారు. చదవండి: ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక -
మూగబోయిన ‘ఆనంద’ గానం
చెన్నై : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి.ఆనంద్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా చెన్నైలోని సంగీత కళాకారులు, సంగీత అభిమానులు జీర్ణించుకోలేని బాధాకరమైన సంఘటన. జి.ఆనంద్ గానం అమృతం. మనసు సున్నితం. సౌమ్యం, నిడారంబరమే ఆయనకు ఆభరణాలు. ఆయన మృతిపై చెన్నైలోని తెలుగు ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆనంద్ మరణవార్త చాలా బాధాకరం. కొన్ని సభల్లో అతిథులుగా పాల్గొన్న పరిచయం. స్వర మాధురి పేరుతో సంస్థని స్థాపించి 7,500 సంగీత కార్యక్రమాలు నిర్వహించిన రికార్డు సృష్టించిన గాయకుడు ఆయన. 20 సార్లు అమెరికాలోని తానా సభల్లో పాల్గొన్నారు. కచేరీల్లో ఘంటసాల గారి పాటలు పాడుతూ ఉన్నత స్థితికి చేరుకున్నానని గర్వంగా చెప్పుకున్న మంచి మనిషి జి.ఆనంద్. విశాల హృదయం గల మహా మనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. –గుడిమెట్ల చెన్నయ్య, జనని కార్యదర్శి, చెన్నై ఎందరో యువ కళాకారులను ప్రోత్సహించారు గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరమాధురి వ్యవస్థాపకుడు జి.ఆనంద్ ఆకస్మిక మృతికి అఖిల భారత తెలుగు సమాఖ్య ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. 2014లో నెహ్రూ స్టేడియంలో జరిగిన ముప్పెరుం మహాసభలో జి.ఆనంద్ మాకు మంచి సంగీతాన్ని సమకూర్చారు. మితభాషి, స్నేహశీలి, ఎందరో కళాకారులను ప్రోత్సహించిన జి.ఆనంద్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం. –సీఎంకే రెడ్డి, అఖిల భారత తెలుగు సమాఖ్య ఉదారస్వభావుడు మనందరికీ ఆయన దూరం కావడం చాలా బాధాకరం. ఆంధ్ర కల్చరల్ అండ్ సోషల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలకు ఆనంద్, నాట్యానికి నేను చాలా ఏళ్లుగా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాం. ఆ సమయంలో ఆయన ఉదార స్వభావం, సౌశీల్యం, గాత్రాన్ని చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను, ఆనంద్ శారీరకంగా మన మధ్య లేకున్నా ఆయన గాత్రం ఎల్లప్పుడూ మన మధ్యే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. –ఏవీ శివకుమార్, చెన్నై -
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
మనకు జన్మతః తల్లితండ్రులు, బంధువులు ఉంటారు. పెరిగే కొద్ది స్నేహితులూ ఉంటారు. కాని మనింట్లో ఒక రేడియో సెట్ ఉంటే ఆ రేడియో ద్వారా కొంతమంది మన ఇంటి మనుషులు అవుతారు. వారు పదే పదే నట్టింట్లో మోగుతూ మనకు ఆత్మీయులైపోతారు. వారిని మరిచిపోవడం కష్టం. ఇదిగో ఏదో ఒక ‘జనరంజని’లో ఒక వేణునాదంతో మొదలయ్యే ఈ తియ్యటి పాటనూ, గొంతునూ పుస్తకంలో దాచుకున్న నెమలీక లాంటి స్పర్శను ఎలా మర్చిపోవడం? ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక ఒక రాధిక అందించెను నవరాగ మాలిక జి.ఆనంద్ తెలుగులో కొన్ని మంచి పాటలకు వాటాదారు అయ్యారు. అలా అవడం కష్టం. సినీ ప్లేబ్యాక్‌లో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఏకచ్ఛత్రాధిపత్యం సాగిస్తున్న సమయంలో... పి. రామకృష్ణ కూడా వెనుకంజ వేస్తున్న సమయంలో... తెలుగులో ఇద్దరు గాయకులు కొన్ని పాటలు పొందగలిగారు. వారు మాధవపెద్ది రమేశ్, జి. ఆనంద్. మాధవపెద్ది రమేశ్‌కు సినిమా రంగపు వెన్నుదన్నన్నా ఉంది. శ్రీకాకుళం నుంచి మద్రాసు చేరుకున్న జి. ఆనంద్‌కు అది కూడా లేదు. ఆయన ప్రధానంగా స్టేజ్ సింగర్. సినిమాల్లోకి రాకముందు ఆర్కెస్ట్రా సింగర్‌గా కళింగాంధ్రలో జి.ఆనంద్ పేరు మార్మోగేది. నంద్యాలలో జరిగిన ఒక పాటల పోటీలో ప్రైజ్ కొట్టి జడ్జ్‌గా వచ్చిన కె.వి. మహదేవన్ దృష్టిలో పడి మద్రాసు చేరుకున్నాడాయన. తొలి పాటను ‘పండంటి కాపురం’లో రాజబాబుకు పాడినా పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘అమెరికా అమ్మాయి’ సినిమా. సంగీత దర్శకుడు జి.కె. వెంకటేశ్ ఆనంద్‌కు ‘ఒక వేణువు’ పాట ఇచ్చారు. ఆ పాట పెద్ద హిట్ అవడమే కాదు మరణించే క్షణాల వరకూ ఆనంద్‌కు ఒక అస్తిత్వంలా, వ్యక్తిత్వంలా నిలిచింది. ఈ పాట తర్వాత ఆనంద్ దాసరి దర్శకత్వంలోని ‘మా బంగారక్క’లో ‘దూరాన దూరాన తారాదీపం’ పాడారు. ఆ పాట గుర్తింపు పొందింది. సంగీత దర్శకుడు చక్రవర్తి బాలూ కెరీర్‌ను నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నా కొన్ని సందర్భాలలో కొత్త గాయకులకు అవకాశాలు ఇచ్చేవారు. ‘కల్పన’లో ఆనంద్‌కు మంచి డ్యూయెట్ పడింది. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మా ఆ తర్వాత ‘ఆమె కథ’లో ‘పువ్వులనడుగు నవ్వులనడుగు’ డ్యూయెట్ కూడా చక్రవర్తి సంగీతంలో హిట్ అయ్యింది. చక్రవర్తే ‘జూదగాడు’లో సుశీలతో చాలా మంచి డ్యూయెట్ ఇచ్చారు ఆనంద్‌కు. ఆ పాట కూడా జనరంజని హిట్టే. మల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మథలీల జానపదాలకు నెలవైన ఉత్తరాంధ్ర నుంచి రావడం వల్ల ఆనంద్ అటువంటి పాటలు దొరికితే ఊపుగా న్యాయం చేసేవారు. చిరంజీవి తొలి డ్యూయెట్ ‘ప్రాణం ఖరీదు’లో ‘ఎన్నియెల్లో ఎన్నియెల్లో ఎందాక’ ఆనంద్ పాడిందే. ఇక ‘మనవూరి పాండవులు’ సినిమాలో మహదేవన్ పాడించిన ఈ పాట వినని రేడియో శ్రోత ఉండడు. నల్లా నల్లా మబ్బుల్లోన లగ్గోపిల్లా తెల్లాతెల్లని సందామామ లగ్గోపిల్లా చాలామందికి గుర్తుండదు కాని ‘ఒక వేణువు’ స్థాయిలోనే ఆనంద్ పాడిన ఒక సోలో ఉంది. అది ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలోనిది. ‘పయనించే చిరుగాలి... నా చెలి చెంతకు చేరి’.... చాలా బాగుంటుంది. ఆనంద్‌కు తన పరిమితులు తెలుసు. శక్తులూ తెలుసు. అందుకే ఆయన గాయకుడిగా తనకు వచ్చిన గుర్తింపుతో ‘స్వరమాధురి’ ఆర్కెస్ట్రాను స్థాపించి దేశ విదేశాలలో ఎక్కడ తెలుగువారుంటే అక్కడ కచ్చేరీలు ఇవ్వడం ప్రారంభించారు. నిజానికి ప్లేబ్యాక్ సింగింగ్ కంటే కూడా ఈ కచ్చేరీల వల్లే ఆర్థికంగా ఆయన ఎక్కువ లబ్ధి పొందారు. అమెరికాలో 19 సార్లు టూర్లు నిర్వహించిన ఘనులు ఆనంద్. మధ్యలో ‘గాంధీనగర్ రెండవ వీధి’ లాంటి కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. ‘గాంధీనగర్’లో ‘కలకానిది విలువైనది ఒక కథ ఉన్నది వినిపించనా’ పాట పెద్ద హిట్. ‘అమెరికా అమ్మాయి’ సినిమాతో గుర్తింపు పొందిన ఆనంద్ ‘అమెరికా’తో తనకేదో బంధం ఉందని చెప్పుకునేవారు. ఆ అమెరికా అమ్మాయి హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన గాయని సుజాత పరిచయమై భార్యగా మారారు. ఆనంద్ ఇద్దరు అబ్బాయిలు. అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే ఒక మనవరాలు పుట్టింది కనుక ఆ పాప అమెరికా అమ్మాయి అని చెప్పుకునేవారు. అమెరికాలో చాలాకాలం ఉండి హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆనంద్ కరోనాకు తన అంతిమ పాటను వినిపించారు. ఆయనకు నివాళి. కరోనాకు బలి అయిన కమ్మని కంఠం సీనియర్ సినీ గాయకుడు జి. ఆనంద్ (77) కరోనా బారిన పడి, గురువారం రాత్రి హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందారు. కరోనా చికిత్సలో భాగంగా సకాలంలో వెంటిలేటర్ లభించకపోవడంతో ఆనంద్ మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని తులగామ్ గ్రామంలో 1944 ఫిబ్రవరి 16న ఆనంద్ జన్మించారు. ఆయన తండ్రి రంగస్థలంపై అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆనంద్ కూడా తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకోవడంతో పాటు పలు పౌరాణిక నాటకాల్లో నటించారు. తండ్రి రాముడి పాత్ర పోషించినప్పుడు, ఆనంద్, ఆయన సోదరుడు లవ–కుశ పాత్రలు పోషించారు. తొలినాళ్లలో తమ ఇరుగు పొరుగు గ్రామాలలో పండగలు, ఇతర కార్యక్రమాల్లో, సంగీత విభావరుల్లో పాటలు పాడి, పలు బహుమతులు గెలుచుకున్నారు ఆనంద్. మదరాసు (ఇప్పుడు) చెన్నైలో రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ‘నీ గొంతు బావుంది’ అంటూ కె.వి.మహదేవన్‌కు ఆనంద్ గురించి సిఫార్సు లేఖ రాశారట కృష్ణశాస్త్రి. ఆ సమయంలోనే ‘అమెరికా అమ్మాయి’ లో ‘ఒక వేణువు వినిపించెను..’ పాట పాడే అవకాశం ఆనంద్కి వచ్చింది. అప్పటినుంచి పలు చిత్రాల్లో, ప్రైవేట్ ఆల్బమ్స్‌లో 2500 పైచిలుకు పాటలు పాడిన ఆనంద్ 150 ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. టీవీ సీరియల్స్‌కూ, హిందీ నుంచి తెలుగు సహా అనేక అనువాద చిత్రాలకూ స్వరసారథ్యం వహించారు. ‘స్వర మాధురి’ బృందం ద్వారా ప్రపంచమంతటా సంగీత విభావరులు నిర్వహించారు. ఏకంగా 6500 పైగా ప్రదర్శనలిచ్చారు. ‘స్వరమాధురి’ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది యువ గాయనీ గాయకులను సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు. సుదీర్ఘకాలం చెన్నైలో ఉన్న ఆనంద్ ఆ మధ్య హైదరాబాద్‌కు షిఫ్టయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్ర మాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వచ్చారు. వీనులవిందైన పాటలు ఎన్నో పాడిన ఆనంద్ ఆ పాటల ద్వారానే గుర్తుండిపోతారు. ఆయన మృతిపట్ల హీరో చిరంజీవి సహా పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం వనస్థలిపురం శ్మశానవాటికలో ఆనంద్ అంత్యక్రియలు జరిగాయి. – సాక్షి ఫ్యామిలీ -
ఉపాధ్యాయులకు కరోనా, ఆందోళనలో ఎమ్మెల్యే..
సాక్షి, వికారాబాద్: మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ సోకింది. ఈమేరకు వైద్యాధికారులు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని శివారెడ్డి సమీపంలో ఉన్న పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తం 40 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ సోకింది. విద్యార్థుల్లోనూ కొందరికి వైరస్ లక్షణాలు ఉన్నాయని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 100 మందికి పైగా 8, 9, 10తోపాటు ఇంటర్ చదువుతున్నారు. వైద్యాధికారులు వారినుంచి నమూనాలు సేకరించి గురువారం ల్యాబ్‌కు తరలించారు. విద్యార్థుల్లో కొందరు జ్వరం తదితర లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఫలితాల అనంతరమే నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు. పాఠశాలలో మహమ్మారి వ్యాప్తి చెందడానికి కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. పాఠశాలలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో బడిలో కోవిడ్ నిబంధనలు పాటి స్తున్నారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పిల్లలకు వైరస్ సోకితే ఎవరు బాధ్య త వహిస్తారని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయంతో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శివరెడ్డిపేట్ సమీపంలో ఉన్న గురుకుల మైనారిటీ స్కూల్లో తన అనుచరులతో ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి వాణీదేవికి ఓటేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఎమ్మెల్యే సుమారు గంటసేపు పాఠశాలలో సమవేశమయ్యారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు పాజిటివ్ రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు సైతం కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
ఆనంద్.. మంచి కాఫీలాంటి శాటిలైట్
తన 50 ఏళ్ల చరిత్రలో ‘ఇస్రో’ తొలిసారిగా మన ప్రైవేట్ సంస్థల శాటిలైట్లను నింగిలోకి పంపనుంది. ఈ నెల 28న పీఎస్ఎల్వీ–సి51 ద్వారా పంపే ఈ శాటిలైట్లలో బెంగళూరు స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ‘పిక్సెల్’ రూపొందించిన ‘ఆనంద్’ ఒకటి. పాతికేళ్లు కూడా నిండని ఎవ్యాస్ అహ్మద్, క్షితిజ్ ఖండేల్వాల్లు ఈ కంపెనీ రథసారథులు. ‘పిక్సెల్’ విజయప్రస్థానం... చిన్నప్పుడు ఆకాశం అంటే అంతులేని ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు. చిక్కమగళూరు(కర్నాటక) అబ్బాయి ఎవ్యాస్ అహ్మద్ కూడా అంతే. ఆ ఆసక్తి తాను చదువుకున్న బిట్స్ పిలాని(రాజస్థాన్) వరకు కొనసాగింది. బిట్స్ పిలానిలో ‘హైపర్‌లూప్ ఇండియా’ ప్రాజెక్ట్ వ్యవస్థాపక సభ్యులో అహ్మద్ కూడా ఒకరు. ‘హైపర్‌లూప్ ఇండియా’తో తన కలలకు శాస్త్రీయ పునాది ఏర్పడింది. వేరు వేరు క్యాంపస్‌లలో నుంచి వచ్చిన విద్యార్థులతో పరిచయం, పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నాలు జరిగాయి. టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ స్పాన్సర్ చేసే ‘హైపర్‌లూప్ పోడ్ కాంపిటీషన్’లో ప్రపంచం నలుమూలల నుంచి స్టూడెంట్స్, నాన్ స్టూడెంట్స్ టీమ్‌లు పాల్గొంటాయి. ఈ పోటీలో పాల్గొనడాన్ని ప్రతిష్ఠాత్మక విషయంగా భావిస్తాయి. హైపర్‌లూప్ కాన్సెప్ట్ ప్రకారం సబ్‌స్కేల్ ప్రోటోటైప్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ నిర్మించడం, డిజైన్ చేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం. ‘హైపర్‌లూప్ ఛాలెంజ్’లో బిట్స్ పిలాని టీమ్‌కు పాల్గొనే అవకాశం వచ్చింది. కాలిఫోర్నియాలోని ‘స్పేస్ఎక్స్’ ప్రధానకార్యాలయంలో తమదైన హైపర్‌లూప్ టెక్నాలజీ(అత్యంగా వేగంగా ఒక మైలు దూరం వ్యాక్యూమ్ ట్యూబ్‌లో ప్రయాణం చేసే సాంకేతిక జ్ఞానం) డెమో ఇచ్చారు. ఫైనల్ వరకు వెళ్లారు. ఈ పోటీ పుణ్యమా అని టెక్స్టార్ ఎలాన్ మాస్క్‌ను కలుసుకునే అవకాశం వచ్చింది. ‘మాస్క్‌తో మాట్లాడడం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. నా కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటాడు ఆరోజుని గుర్తు చేసుకుంటూ 22 సంవత్సరాల అహ్మద్. హైపర్‌లూప్ కాంపిటీషన్లో పాల్గోవడం వల్ల తన పరిమిత అవగాహనలోని ఖాళీలకు జవాబులు దొరికాయి. ఆ తరువాత ‘ఏఐ ఎక్స్‌ప్రైజ్ కాంపిటీషన్’లో పాల్గొన్నాడు. సాంకేతిక అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీలు నిర్వహించే ఈ సంస్థను 1994లో కాలిఫోర్నియాలో స్థాపించారు. జెమ్స్ కామెరూన్, లారీపేజ్లాంటి ప్రముఖులు ఈ సంస్థకు ట్రస్టీలుగా ఉన్నారు. ‘ఎక్స్‌ప్రైజ్’లో పాల్గొన్న సందర్భంలోనే అహ్మద్‌కు ‘శాటిలైట్ ఇమేజరీ’ గురించి ఆలోచన వచ్చింది. రిమోట్ లొకేషన్లలో, పైప్‌ల నుంచి గ్యాస్ లీకేజిలను గుర్తించడానికి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా గనులలో అక్రమ తవ్వకాలను గుర్తించడానికి, వ్యవసాయానికి సంబంధించిన ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి, విత్తడానికి సరిౖయెన సమయాన్ని ఎంచుకోవడానికి...ఒకటి రెండు అని ఏమిటి! చాలా రకాలుగా శాటిలైట్ ఇమేజరీలను వాడుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ పిక్సెల్. బిట్స్‌పిలానిలో తనతో పాటు చదువుకున్న క్షితిజ్ ఖండెల్వాల్తో కలిసి 2019లో బెంగళూరులో ‘పిక్సెల్’ స్టార్టప్ ప్రారంభించాడు అహ్మద్. అయితే నిధుల సమస్య పెద్ద సవాలుగా మారింది. వీరు ఎంత సీరియస్‌గా తమ ప్రాజెక్ట్ గురించి వివరించినా అందరూ తేలిగ్గా తీసుకునేవారు. దీనికి కారణం వారి వయసు. నిధుల సమస్యను అధిగమించడానికి రాజస్థాన్ గవర్నమెంట్, ఇతరుల కోసం కొన్ని ప్రాజెక్ట్‌లు చేశారు. కొద్ది కాలం తరువాత ‘పిక్సెల్’ ప్రాజెక్ట్ గురించి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. తొలిరోజుల్లో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించని ‘పిక్సెల్’ టీమ్ ఇండస్ తరువాత ఇండియన్ స్పేస్ స్టార్టప్‌లలో హైయెస్ట్ ఫండింగ్‌లో ఉంది. తాము అత్యున్నత ప్రమాణాలతో జెనరేట్ చేసే ఇమేజరీ డాటా యూఎస్ నుంచి యూరప్ వరకు వినియోగదారులకు అనేకరకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ‘పిక్సెల్’ సీయివో,సీటీవో అహ్మద్, క్షితిజ్లు. మూడు రోజుల తరువాత పిక్సెల్ వారి ‘ఆనంద్’ ఆకాశంలోకి దూసుకెళ్లబోతుంది. వెళుతూ వెళుతూ ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చివెళుతుంది. పట్టుదల ఉంటే కన్న కలలు సాకారమవుతాయి. జీవితాన్ని ఆనందంతో నింపుతాయి. -
కోళ్లు ఎందుకు చనిపోతున్నాయ్..?
సాక్షి, వికారాబాద్: ధారూరుమండల పరిధిలోని దోర్నాల్ గ్రామంలో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పర్యటించారు. వరుసగా గ్రామంలో కోళ్లు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. కోళ్ల ఎందుకు చనిపోతున్నాయని ఇన్చార్జి వెటర్నరీ డాక్టర్ హతీరాంను ప్రశ్నించారు. మూడు రకాల నట్టలు కోళ్లకు వ్యాపించడంతో మృతిచెందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని డాక్టర్ వివరించారు. దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఏదని ఎమ్మెల్యే అడుగగా.. ఇంకా అందలేని, సాయంత్రం వరకు రావచ్చని వెటర్నరీ డాక్టర్ తెలియజేశారు. రిపోర్టు రావడానికి నాలుగు రోజుల సమయం సరిపోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. (చదవండి : వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం) మృతిచెందిన కోళ్లను పాతిపెట్టకుండా, బహిరంగ ప్రదేశాల్లో పడేయడంతో కాకులు, కోళ్లు తినడంతో మిగతావి చనిపోతున్నాయని హతీరాం తెలిపారు. వ్యాక్సిన్, పౌడర్ సరఫరా చేయడంతో వ్యాధి అదుపులోకి వచ్చిందన్నారు. గ్రామంలో ఎవరెవరి ఇళ్లలో ఎన్ని కోళ్లు చనిపోయాయో.. వాటి వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైతే పరిహారం కోసం ప్రయత్నం చేద్దామని డాక్టర్ ఆనంద్.. ఇన్చార్జి వెటర్నరీ డాక్టర్ హతీరాంకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ విజయకుమార్, జెడ్పీటీసీ సుజాత, సర్పంచ్ పట్లోళ్ల సుజా త, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ రాజునాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, చంద్రారెడ్డి ఫౌండేషన్‌చైర్మన్ హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
పరిహారం అడిగితే.. పోలీసులకు పట్టించిన ఎమ్మెల్యే
సాక్షి, వికారాబాద్ : గతంలో ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయమని అడిగిన పాపానికి ఎమ్మెల్యే ఆనంద్ తనను పోలీసులకు పట్టించాడని ఓ రైతు వాపోయాడు. బాధితుడి వివరాలు ఇలా ఉన్నాయి.. ‘మాది బంట్వారం మండలం బీరోల్. గ్రామ రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ పొలాల నుంచి గత ఏడాది ఫార్మేషన్ రోడ్డు నిర్మించారు. ఇందులో నాతో పాటు పలువురు రైతులకు చెందిన వ్యవసాయ భూములు పోయాయి. మిగితావారితో పోలిస్తే నా పొలం.. అర ఎకరం మేర అదనంగా కోల్పోయా. ఈ విషయాన్ని అప్పట్లో ఎమ్మెల్యే ఆనంద్ దృష్టికి తీసుకెళ్లా. నాకు న్యాయం చేయాలని అభ్యరి్థంచా. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన పరిహారం అందేలా చూస్తానని అప్పట్లో మాటిచ్చారు. కానీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత వెళ్లి అడిగితే పట్టించుకోలేదు. చదవండి: ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ రోడ్డులో తన భూమి పోయిందని పత్రాలు చూపిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి దీంతో శుక్రవారం నేను వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లా. ఇచ్చిన మాట ప్రకారం తనకు పరిహారం అందేలా చూడమని అడిగా. అయితే తనను నేను సతాయిస్తున్నానని ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నన్ను జీప్‌లో ఎక్కించుకుని పీఎస్‌కు తీసుకెళ్లారు. నియోజకవర్గ పౌరుడిగా ఎమ్మెల్యే వద్దకు వచ్చి న్యాయం చేయమని అడగటం నేరమా..? ఇలా పోలీసులకు పట్టించడం, బెదిరించడం దారుణం. నన్ను పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు ఆతర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ముందుగా ఇచి్చన మాట ప్రకారం నాకు న్యాయం చేయాలి’. అని బాధితుడు మీడియా ఎదుట వాపోయాడు. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎమ్మెల్యేకు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. -
అయ్యో.. ఆనంద్, శోకసంద్రంలో కుటుంబం
సాక్షి, పటాన్చెరు: అమీన్పూర్ ఇసుకబావి వాగులో కొట్టుకుపోయిన కారు, ఆ కారును నడుపుతున్న ఆనంద్ మృతదేహం ఆదివారం లభించింది. బీరంగూడ సృజనలక్ష్మీ కాలనీకి చెందిన ఆనంద్ అలియాస్ మల్లికార్జున్ ఈ నెల 13న తన ఇంటికి కారులో తిరిగి వస్తూ ఇసుకబావి బ్రిడ్జి వద్ద వరద ఉధృతికి కారుతో సహా కొట్టుకుపోయాడు. ఆ రాత్రి నుంచి అధికారుల గాలింపు చర్యలు ప్రారంభించారు. గజఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్ సహాయంతో వెతికారు. అయినా ఏమాత్రం ఫలితం రాలేదు. వరద ఉధృతిలో కొట్టుకపోయిన తమ కుమారుడిని వెతికి పెట్టడంలో అధికారులు విఫలం చెందారని ఆనంద్ కుటుంబీకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. కలెక్టర్, మంత్రులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కారుతో సహా నీటిలో కొట్టుకుపోవడానికి లోలెవల్ కాజ్వేనే కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జిల్లా యంత్రాంగం ఎంతో శ్రమించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. చివరికి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కొత్తపాలెం, బలుసు తిప్పపాలెం ప్రాంతాలకు చెందిన గజ ఈతగాళ్లు ఇసుకబావి వాగులో దిగి కారును గుర్తించారు. కారును తెరిచి చూస్తే అందులోనే ఆనంద్ విగత జీవిగా శరీరం కుళ్లిపోయి కనిపించింది. వాగు పరిసరాల్లోనే పోస్టుమార్టం.. కారులోని ఆ భౌతికకాయానికి వాగు పరిసరాల్లోనే అధికారులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆనంద్‌కు భార్య, ఆరేళ్ల చిన్నారి ఉంది. వారితో పాటు కుటుంబ సభ్యులు, ఆనంద్ తండ్రి ఆదివారం శోకసంద్రంలో మునిగిపోయారు. గత కొన్ని రోజులుగా ఆనంద్ కోసం ఎదురుచూసిన ఆ కుటుంబీకులు ఆయన విగతజీవిగా ఉండటం చూసి విలపించారు. ఆనంద్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలు సహాయ సహాకారలు అందజేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆనంద్ కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాలని వైసీపీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రిడ్జి సరిగా లేకపోవడం కారణంగానే ఆయన ప్రమాదానికి లోనయ్యారని ఆయన వివరించారు. -
మర్రిచెట్టు కింద పాట
సురేశ్, ఆనంద్, రాశి, శ్రద్ధాదాస్, అమిత్, తేజ ప్రధాన పాత్రల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లేవాడు). వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీ కార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట లిరికల్ వీడియోను ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ మణికొండలోని మర్రిచెట్టు కింద విడుదల చేశారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలోని ‘ఓడ్కా మీద ఒట్టు...’ అంటూ సాగే మొదటి పాట విడుదలైన రెండు వారాల్లోనే యూట్యూబ్‌లో 20లక్షల వ్యూస్ సాధించింది. రెండో పాటను రామ్‌గోపాల్‌వర్మకి అంకితం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అని వెంకట శ్రీనివాస్ బొగ్గరం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్ మల్లాది, సంగీతం: వీణాపాణి. -
ఆనంద్‌కు ఆరో ఓటమి
చెన్నై: లెజెండ్స్ ఆఫ్ చెస్ ఆన్లైన్ టోర్నీలో ప్రపంచ మాజీ చాంపియన్, భారత నంబర్‌వన్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఆరో పరాజయం చవిచూశాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్ నెపోమ్నియాచితో ఆదివారం జరిగిన ఆరో రౌండ్లో ఆనంద్ 2–3తో ఓడిపోయాడు. ఇప్పటికే ఆనంద్ వరుసగా స్విద్లెర్ , కార్ల్సన్, క్రామ్నిక్ , అనీశ్ గిరి , పీటర్ లెకో చేతిలో ఓటమి పొందాడు. -
‘లడ్డూలు తినాలన్న కోరికే ఇలా మార్చింది’
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ఐదు దశాబ్దాల కాలంలో 36 దేశాల్లో 37 వేలకుపైగా ఇంద్రజాల ప్రదర్శనలు. 4 ప్రపంచ రికార్డులు. వేలాది సన్మానాలు. ఇంద్రజాలంతో వయోబేధం లేకుండా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అసమాన∙ప్రతిభ కలిగిన వ్యక్తి అతను. ఆయనే జాదూగర్ ఆనంద్‌గా ప్రసిద్ధికెక్కిన ప్రముఖ ఇంద్రజాలికుడు ఆవíస్తి ఆనంద్. ఇంద్రజాల ప్రదర్శనలో భాగంగా మదనపల్లెకు వచ్చిన ఆయనతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. సాక్షి : మీ పేరు...కుటుంబ నేపథ్యం? ఆనంద్ : నా పేరు ఆవస్తి ఆనంద్. మాది మధ్యప్రదేశ్ రాష్ట్రం, జబల్పూర్ నగరం. 1952లో జనవరి 3న జన్మించాను. మాది ఉన్నత విద్యావంతుల కుటుంబం. నాన్న ఏ.పి.అవస్తి, వృత్తిరీత్యా వైద్యుడు. అమ్మ మహేశ్వరిదేవి ఫ్రొఫెసర్. జబల్పూర్లో పాఠశాల విద్య,ఇండోర్‌లో మెట్రిక్యులేషన్, డిగ్రీ, పీజీ పూర్తి చేశాను. మా అమ్మానాన్నలకు నలుగురు సంతానం. ముగ్గురు అక్కయ్యలు. నేను చివరి వాడిని. సాక్షి : మీకు ‘జాదూగరి’వైపు దృష్టి ఎప్పుడు మళ్లింది? ఆనంద్ : నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్లేదారిలో కొందరు గారడీ చేసేవారు. రోజూ అక్కడికి వెళ్లి గారడీ చూసేవాడిని. వారు గాల్లో నుంచి నాకు లడ్డూలు తీసి ఇచ్చేవారు. రోజూ లడ్డూలు ఉచితంగా తినేవాడిని. కొన్ని రోజులయ్యాక గారడీవారు మకాం మార్చేస్తే, లడ్డూలు తినడానికి అలవాటుపడిన నాకు లడ్డూల మీద ఉన్న కోరికతో వారిని వెతుక్కుంటూ వెళ్లేవాడిని. ఆ సమయంలో స్వతహాగా నేను కూడా గారడీ చేసి లడ్డూలు తయారు చేయాలని అనుకున్నా. ప్రయత్నించి విఫలమయ్యాను. కానీ ప్రయత్నం వదలలేదు. ఎక్కడ గారడీ, మ్యాజిక్ షోలు జరిగినా వెళ్లి చూసేవాడిని. అలా ..అలా చిన్నపాటి మేజిక్‌లు నేర్చుకుని, మా స్కూల్లో ప్రదర్శించి, అందరి మన్ననలు పొందేవాడిని. గణేష్, దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలలో నా ప్రదర్శనలు ఇచ్చేవా డిని. వారు ఇచ్చే డబ్బులు అమ్మా,నాన్న పాకెట్ మనీతో ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకాలను కొనేవాడిని. అలా మొదలైన నా ప్రస్థా నం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి ‘జాదూగర్’గా మార్చింది. ∙నాకు గురువులు ఎవరూలేరు. స్వయంకృషితో ఈ స్థాయికి చేరా. సాక్షి : మీకు తల్లిదండ్రుల సహకారం ? ఆనంద్ : లేదు. మా అమ్మానాన్నలు నన్ను కూడా డాక్టర్ చేయాలనుకున్నారు. నేను మెజీషి యన్ అవడం ఏమాత్రం వారికి ఇష్టం లేదు. సాక్షి : మేజిక్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఆనంద్ : 18 ఏళ్ల వయసులో ‘ఇంద్రజాలం’ చేయడం ప్రారంభించా. అంతే కాదు ఒళ్లు గగు ర్పొడిచే నదిలో ‘అండర్ వాటర్ ఎస్కేప్ విన్యా సాన్ని 40 సెకండ్లలో ప్రదర్శించి బయటకు వచ్చేశా. ఇది కూడా స్వతహాగానే నేర్చుకున్నా. సాక్షి : ఎన్ని రికార్డులు సాధించారు? ఆనంద్ : ఇప్పటి వరకు నేను 4 ప్రపంచ రికార్డులు సా«ధించా. 18 ఏళ్ల వయస్సులో అండర్ వాటర్ ఎస్కేప్‌గా మొదటి రికార్డు. 19 ఏళ్లప్రాయంలో బ్లైండ్ ఫోల్డ్‌ఫో నిర్వహించి రెండో ప్రపంచ రికార్డు సాధించా. ఇండోర్ నుంచి భూపాల్ వరకు 210 కిలోమీటర్లు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ మీద ప్రయాణం చేయడం. 36 దేశాలలో 37 వేలకుపైగా ప్రదర్శనలు నిర్వహించి మూడో ప్రపంచ రికార్డు సాధించా. అత్యంత వేగవంత మెజీషియన్‌గా 4వ ప్రపంచ రికార్డు సాధించా. సాక్షి : ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు? ఆనంద్ : ఇంద్రజాలాన్ని ప్రభుత్వాలు ఓ కళగా గుర్తించాలి. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో మ్యాజిక్ అకాడమీలు ఏర్పాటు చేసి ఇంద్రజాలాన్ని ప్రోత్సహించాలి. -
ఒక లడ్డూ నన్ను జాదూగర్‌గా మార్చింది
ఐదు దశాబ్దాలుగా 36 దేశాల్లో 37 వేలకుపైగా ఇంద్రజాల ప్రదర్శనలు. నాలుగు ప్రపంచ రికార్డులు. వేలాది సన్మానాలు. మ్యాజిక్ షోలతో పిల్లలు, పెద్దలను అమితాశ్చర్యంలో ముంచెత్తే ఫీట్స్. జాదూగర్ ఆనంద్‌గా ప్రసిద్దికెక్కిన ప్రముఖ ఇంద్రజాలికుడు అవస్తి ఆనంద్ సాధించిన ఘనత ఇది. ఇంద్రజాల ప్రదర్శనలో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చిన జాదూగర్ ఆనంద్ ‘సాక్షి’తో ముచ్చటించారు. మీరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వాటిలో అమితంగా ఆకట్టుకున్నవి..? పద్ధెనిమిదేళ్ళ వయస్సులో ‘అండర్ వాటర్ ఎస్కేప్’గా మొదటి రికార్డు, ఆ తర్వాత ఏడు ‘బ్లైండ్ ఫోల్డ్ ఫో’తో రెండో ప్రపంచ రికార్డు సాధించాను. ఇండోర్ నుంచి భూపాల్ వరకు 210 కిలో మీటర్లు కళ్లకు గంతలు కట్టుకుని స్కూటర్ మీద ప్రయాణం చేయడం మర్చిపోలేని సంఘనలు. ఇప్పటి వరకు నాలుగు ప్రపంచ రికార్డులు, 36 దేశాలలో 37 వేలకు పైగా ప్రదర్శనలు నిర్వహించి మూడో ప్రపంచ రికార్డు, అత్యంత వేగవంత మెజీషియన్‌గా నాల్గవ ప్రపంచ రికార్డు సాధించినందుకు ఆనందంగా అనిపిస్తోంది. షో జరిగే సమయంలో అకస్మాత్తుగా ప్రేక్షకుల్లో ఒక అమ్మాయిని స్టేజీ మీదకు పిలిపించి, ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో పైకి లేపడం, మరొకరిని క్షణాల్లో మాయం చేయడం, తిరిగి వారిని ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమయ్యేలా చేయడం... ఒకటి కావు అన్నీ ఆకట్టుకునేవే. స్టేజీ మీద ప్రదర్శించబడుతున్న సినిమా తెరలోకి వెళ్లి అక్కడి నటుల్ని స్టేజీ మీదకు తీసుకురావడం, అండర్ వాటర్ ఎస్కేప్ ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఏదైనా ప్రేక్షకుల అభినందనలు అందుకున్న ప్రతీసారి వారు ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చానన్న సంతృప్తి అన్ని రికార్డులకన్నా మించినదిగా భావిస్తాను. మీ పేరు అవస్తి ఆనంద్. జాదూగర్ ఆనంద్‌గా ఎలా మారారు? నేను పుట్టిపెరిగింది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ లో. మా కుటుంబంలో అందరూ బాగా చదువుకున్నవారే. ఆ రోజుల్లోనే నాన్న ఏ.పి.అవస్తి డాక్టర్, అమ్మ మహేశ్వరిదేవి ఫ్రొఫెసర్. మా ముగ్గురు అక్కయ్యలూ బాగా చదువుకున్నవారు. ఆఖరివాడినైన నేనూ పీజీ చేశాను. ఇప్పుడు నా వయసు అరవైఏడేళ్లు. ఆరేళ్ల వయసులో మా స్కూల్‌కి వెళ్లేదారిలో కొందరు గారడీవిద్య ప్రదర్శించేవారు. రోజూ అక్కడికి వెళ్లి ఆ గారడీ చూసేవాడిని. వాళ్లు గాల్లో నుంచి నాకు లడ్డూలు తీసి ఇచ్చేవారు. రోజూ లడ్డూలు తినేవాడిని. అప్పుడే అనిపించింది ‘నేనే సొంతంగా గారడీ చేసి లడ్డూలు తెచ్చేసుకుంటే..’ అని. ప్రయత్నించా.. లడ్డూ రాలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఒక్క లడ్డూ కూడా రాలేదు. కానీ నిరాశపడలేదు, ప్రయత్నాన్నీ వదలలేదు. ఎక్కడ ఏ చిన్న గారడీ, మ్యాజిక్ షోలు జరిగినా ఎంత దూరమైనా వెళ్లి చూసేవాడిని. అలా అలా చిన్న చిన్న మేజిక్‌లు నేర్చేసుకున్నా. వాటిని మా స్కూల్లో ప్రదర్శించేవాడిని. చుట్టూ ఫ్రెండ్స్ బాగా ప్రోత్సహించేవారు. ఆ తర్వాత టీచర్లూ మెచ్చుకున్నారు. అక్కణ్ణుంచి గణేష్, దుర్గాదేవి నవరాత్రులలో జరిగే ఉత్సవాలలో ప్రదర్శనలు ఇచ్చేవాడిని. అక్కడ వారు ఇచ్చే డబ్బులు, అమ్మా–నాన్న ఇచ్చే పాకెట్ మనీతో ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకాలు కొనేవాడిని. చదివేవాడిని. ప్రాక్టీస్ చేసేవాడిని. అలా మొదలైన నా ప్రస్థానం.. అంతర్జాతీయ స్థాయి ‘జాదూగర్’గా మార్చింది. నాకెవ్వరూ గురువులు లేరు. స్వయంకృషి, స్వంతప్రయత్నంతోనే ఈ విద్యను సాధించాను. మీకు గురువెవ్వరూ లేరు అంటున్నారు.. మీ తల్లిదండ్రుల సహకారం లభించలేదా? లేదు. మా కుటుంబంలో ఏకైక మగ పిల్లవాడైనందున మా అమ్మానాన్నలు నాపై అనేక ఆశలు పెట్టుకుని, నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. నేను మెజీషియన్‌గా మారడం వారికి ఇష్టం వుండేది కాదు. అదేమైనా తిండి పెడుతుందా, దేనికి ఉపయోగపడుతుంది..? అనేవారు. అయితే వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఇంద్రజాల విద్యలోనే రాణించాను. నీళ్లలోనూ విన్యాసాలు చేశారు.. స్కూల్లోనూ, కాలేజీలోనూ చిన్న చిన్న మేజిక్ షోలు చేసిన నేను పద్దెనిమిదేళ్ల వయసులో సొంతంగా వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. ‘అండర్‌వాటర్ ఎస్కేప్’లో భాగంగా తలకు ముసుగు వేసి, కాళ్లను, చేతులను సంకెళ్లతో బంధించి, ఒక పెట్టెలో పెట్టి తాళం వేస్తారు. ఆ పెట్టెను నదిలో పడేస్తారు. ఆ పెట్టెలో నుంచి తప్పించుకుని బయటకు రావాలి. సంకెళ్లను విడదీసేదెలా? పెట్టె తాళం పగలగొట్టేదెలా? బయటకు ఎలా వస్తాను అని పైన అంతా ఉత్కంఠ. కానీ, నేను కేవలం నలభైసెకన్లలో ఈ విన్యాసాన్ని ప్రదర్శించి నది నుంచి బయటకు వచ్చేశాను. ఇది కూడా స్వతహాగానే నేర్చుకున్నాను. ప్రపంచ ప్రసిద్ధి పొందిన మీరు ఇక ముందు ఏం చేయబోతున్నారు? ఇంద్రజాలాన్ని ప్రభుత్వాలు ఓ కళగా గుర్తించాలి. అప్పుడే ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగమైన ఇంద్రజాలాన్ని పరిరక్షించుకోగలుగుతాం. సర్కస్ అంటే రష్యాది అని... ఇంద్రజాలం అంటే ఇండియాది అని ప్రపంచం అంతటా పేరుంది. దేశానికి పేరు తెచ్చిన ఇంద్రజాల విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదుంది. అన్ని రాష్ట్ర్రాల రాజధానుల్లో మ్యాజిక్ అకాడమీలు ఏర్పాటు చేసి ఇంద్రజాలాన్ని ప్రోత్సహించాలి. ఆ దిశగా నా కార్యాచరణను కొనసాగిస్తున్నాను. – మాడా చంద్రమోహన్, సాక్షి, మదనపల్లె, చిత్తూరు -
ఆనంద గీతం
-
స్వార్థం కోసం వైఎస్సార్సీపీలో చేరలేదు
-
వైఎస్ఆర్సీపీలోకి అడారి అనంద్, రమాకుమారి
-
దివ్యాంగులు, అనాథ పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
సందేశాత్మక లఘు చిత్రాలు, మ్యూజిక్ వీడియోస్‌తో ఆకట్టుకున్న దర్శకుడు డాక్టర్ ఆనంద్ చిన్నారులు, దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. జనయిత్రి ఫౌండేషన్ మరియు బంజారా మహిళా యన్.జీ వొ సంయుక్తంగా డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బోడుప్పల్ ,పీర్జాది గూడా ప్రాంతంలో వున్న దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘డాక్టర్ కావ్య (గైనకాలజిస్ట్), డాక్టర్ మధు( ఫిజీషియన్), డాక్టర్ అర్జున్ (డెంటిస్ట్) కలిసి, దాదాపు 200 మంది చిన్న పిల్లలకు వైద్య పరీక్షలతో పాటు, రక్త పరీక్షలను కూడా నిర్వహించినట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఆటిజం, బాధిర్యం, మానసిక ఎదుగుదల లోపం, అంధత్వం, మస్తిష్క పక్షవాతం లాంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు, వారి తల్లి తండ్రులకు సహాయ సహకారాలను అందిచామ’ని తెలిపారు. ఇలాంటి కార్య క్రమాల ద్వారా ఎంతో మంది చిన్నారులకు లబ్ది చేకూరుతుందని, మరెన్నో కార్యక్రమాలను దేశ మంతటా నిర్విస్తున్నట్లు డాక్టర్ ఆనంద్ తెలియ చేసారు. బీహార్ చిన్న పిల్లల కోసం, ఒడిషా ఫాని తుఫాను బాధితుల కోసం పలు వైద్య శిబిరాలను నిర్వహించిన ఆనంద్‌ను ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. -
ప్రేమకథ ముగిసింది
ఓ అందమైన ప్రేమకథ ముగిసిపోయింది. మరి.. ఎప్పుడు చూడొచ్చు అంటే త్వరలో విడుదల అంటున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కేవీఆర్. మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దొరసాని’. రాజశేఖర్, జీవితల చిన్నకుమార్తె శివాత్మిక ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా.. ముఖ్యంగా తెలంగాణ భాష సంస్కృతులను ప్రతిబింబించేలా సినిమాను తెరకెక్కించారట మహేంద్ర. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. -
ఆరు భాషలలో అమీగ మ్యూజిక్ వీడియో
డాక్టర్ ఆనంద్ రచన, దర్శకత్వంలో స్కూల్స్, కాలేజ్‌లలో జరిగే ర్యాగింగ్ కథాంశంతో రూపొందిన డాన్స్ మ్యూజికల్ వీడియో అమీగ. ఈ వీడియోతో అమెరికాలో డాన్స్ ప్రదర్షణలు చేసి ఎన్నో అవార్డ్ లు సొంతం చేసుకున్న త్రిశూల్ కలాపురం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. బిగ్ బాస్ ఫేం తారిక, మహర్షి, రాజా ది గ్రేట్ ఫేం హాసిని ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ వీడియోను యన్‌యస్ నాయక్ సమర్పణలో పద్మా కలాపురం నిర్మించారు. ఆరు భాషల్లో రూపొందించిన ఈ వీడియోను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లో ఈ మ్యూజిక్ వీడియోకు మంచి రెస్సాన్స్ వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న బాల నటి హాసిని ఈ వీడియోలో కీలక పాత్రలో కనిపించారు. అమీగ పాటను ప్రముఖ వర్ధమాన రచయిత శ్రీనివాస మౌళి రచించగా,తెలుగులో ఇండియన్ ఐడల్ రేవంత్, ఇంగ్లీష్ లో స్వీకర్ అగస్తి పాడడం విశేషం. డాక్టర్ ఆనంద్ దర్శకత్వ రూపొందిన ఈ వీడియోకు కిరణ్ మాస్టర్ కొరియోగ్రఫి అందించారు. ఈ వీడియో ప్రముఖ మ్యూజిక్ సంస్థ లహరి మ్యూజిక్ ద్వారా విడుదలయింది. వీడియో రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. త్రిశూల్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడని, అందమైన తారిక, హాసినిలు అదనపు ఆకర్షణగా ఈ పాటను గోవా, ఓక్రిడ్జ్ మరియు ఆంబిటస్ స్కూల్స్‌లో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి అమీగ టీం అందరిని ఆశీర్వదించాలని కోరారు. -
లైంగిక వేధింపుల ఆరోపణలతో వీఆర్ఏపై సస్పెన్షన్ వేటు
-
హారిక 14... హంపి 19
సెయింట్ పీటర్స్బర్గ్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు నిరాశ పరిచారు. ఓపెన్ విభాగంలో భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విష్ణు ప్రసన్న, నిహాల్ సరీన్... మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి బరిలోకి దిగారు. ఓపెన్ విభాగంలో 15 రౌండ్లు జరిగాయి. 9.5 పాయింట్లు సాధించిన ఆనంద్ 23వ ర్యాంక్‌తో సరిపెట్టుకోగా... 7.5 పాయింట్లతో హరికృష్ణ 93వ ర్యాంక్‌లో, విష్ణు ప్రసన్న 111వ ర్యాంక్‌లో, 7 పాయింట్లతో నిహాల్ సరీన్ 130వ ర్యాంక్‌లో నిలిచారు. 11.5 పాయింట్లు సాధించిన రష్యా గ్రాండ్‌మాస్టర్ డానిల్ దుబోవ్ విజేతగా అవతరించాడు. 10.5 పాయింట్లు సంపాదించిన షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), హికారు నకముర (అమెరికా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ హారిక 8 పాయింట్లతో 14వ స్థానంతో... హంపి 7.5 పాయింట్లతో 19వ స్థానంతో సంతృప్తి పడ్డారు. 10 పాయింట్లతో జు వెన్జున్ (చైనా) టైటిల్‌ను సొంతం చేసుకుంది. హారిక ఆరు గేముల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. హంపి ఐదు గేముల్లో నెగ్గి, మరో ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మిగతా రెండు గేముల్లో ఓటమి పాలైంది. శనివారం మొదలైన బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో తొమ్మిది రౌండ్లు ముగిశాక హారిక 6.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో... 6 పాయింట్లతో హంపి 16వ స్థానంలో కొనసాగుతున్నారు. నేడు మిగతా ఎనిమిది రౌండ్లు జరుగుతాయి. -
రన్నరప్ హరికృష్ణ
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్ర ప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఆదివారం ముగిసిన ఈ ర్యాపిడ్ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హరికృష్ణ 5.5 పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ముఖాముఖి పోరులో అరోనియన్‌పై హరికృష్ణ గెలిచినందుకు హరికృష్ణకు రెండో స్థానం ఖాయమైంది. అరోనియన్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఆదివారం జరిగిన మూడు గేముల్లో హరికృష్ణ రెండింటిలో గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయాడు. సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో జరిగిన ఏడో గేమ్‌లో హరికృష్ణ 53 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో హరికృష్ణ 95 ఎత్తుల్లో అరోనియన్‌పై... చివరిదైన తొమ్మిదో గేమ్‌లో అతను 37 ఎత్తుల్లో విదిత్ (భారత్)పై గెలిచాడు. 6 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) చాంపియన్‌గా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లు విశ్వనాథన్ ఆనంద్, విదిత్, నిహాల్ సరీన్, సూర్యశేఖర గంగూలీ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. విజేత నకమురకు 10 వేల డాలర్లు (రూ. 7 లక్షల 26 వేలు), రన్నరప్ హరికృష్ణకు 5 వేల డాలర్లు (రూ. 3 లక్షల 63 వేలు), అరోనియన్‌కు 4 వేల డాలర్లు (రూ. 2 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విశ్రాంతి దినం తర్వాత మంగళ, బుధ వారాల్లో 18 రౌండ్ల బ్లిట్జ్ టోర్నీ జరుగుతుంది. -
డిసెంబర్లో అంబానీ కుమార్తె పెళ్లి
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఈషా, పిరమాల్ గ్రూప్ సంస్థల అధిపతి అజయ్ పిరమాల్ కొడుకు ఆనంద్‌ల వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ముకేశ్, నీతా అంబానీల ఇంట్లో ఈ వేడుకను జరిపించనున్నారు. పెళ్లికి ముందటి వారాంతంలో అంబానీ, పిరమాల్ కుటుంబాలు తమ అతిథులకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విందు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాయి. -
మాయా ఉంగరం
పురవీధుల్లో ప్రజలు జయజయ ధ్వానాలు చేస్తుండగా జంట పంచకళ్యాణి గుర్రాలను పూన్చిన స్వర్ణరథంపై విజయోల్లాసంతో ఊరేగుతూ యుద్ధరంగం నుంచి తన రాజ్యంలోకి ప్రవేశించాడు ఆనందవర్మ. ప్రజల జేజేలు అందుకుంటూ కోటలోకి చేరాడు. మహారాణి మంజులతాదేవి ఆయనకు హారతిపట్టి ఆహ్వానించింది. సుగంధ తైలాలు కలిపిన నీటితో జలకాలాడిన ఆయన యుద్ధ బడలికతో విశ్రమించాడు. మంత్రి కుశలపాలుడు ఆస్థానవైద్యుడిని పిలిపించగా ఆయన రాజుగారి గాయానికి మూలికలతో వైద్యం చేయటం ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడు వేటకువెళ్ళిన యువరాజు ప్రద్యుమ్నుడు రాజమందిరంలోకి ప్రవేశించాడు.‘నాన్నగారూ..విజయాన్ని చేపట్టి వచ్చిన మీకు మా ప్రణామాలు. మన మహోజ్వల రాజ్యానికివే నా జేజేలు‘ అన్నాడు తండ్రి చెంతకు వచ్చి.‘నాయనా..ధన్యవాదాలు. తండ్రిగారిమీది గౌరవం, సామ్రాజ్యముపైన భక్తి హర్షదాయకం. కానీ, వేటనుంచి వచ్చిన నీ ముఖంలో ఉల్లాసానికి బదులు నిరుత్సాహం ప్రతిఫలిస్తోంది. ఏమైంది?’ అంటూ లాలనగా అడిగాడు ఆనందవర్మ.‘మరేమీ లేదు నాన్నగారూ! మీరు క్షేమంగా రావాలని ఆత్రుతగా ఎదురుచూడటం వల్ల మీకలా కనిపిస్తున్నానేమో. మీరు విశ్రమించండి. మనం తరువాత మాట్లాడుకుందాం‘ అని చెప్పి తన మందిరానికి వెళ్ళిపోయాడు ప్రద్యుమ్నుడు. అప్పుడు ప్రద్యుమ్నునితో కలిసి వేటకు వెళ్ళివచ్చిన అతడి మిత్రుడు(మంత్రి కుమారుడు) జయపాలుడు కూడా రాజుగారికీ తన తండ్రికీ అభివాదములు చేసి ఇలా అన్నాడు.‘క్షమించండి ప్రభూ..! మన ప్రద్యుమ్నుడు మహా బలశాలి. సింహాన్ని సైతం తన భుజబలంతో చంపివేసిన సింహబలుడు. తెలివిలో ఎన్నో ధర్మసూక్ష్మాలు, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము మున్నగు విద్యలలో ఆరితేరినవాడు. కానీ, పుట్టుకతోనే బొటనవేలు లేని కారణంగా యుద్ధవిద్యలు నేర్వలేని బలహీనుడయ్యాననే బాధ ఆయనలో అనుక్షణం తొలుచుచున్నది. అందుకే అలా నిర్లిప్తంగా వున్నట్టున్నారని నేను భావిస్తున్నాను‘ అంటూ అసలు విషయం తెలిపాడు. ఆ మాటలు విని మహారాణి మంజులతాదేవి చాలా బాధపడింది.‘చింతించకండి మహారాణి. యువరాజు బుద్ధి బలం మీద మాకు అపారమైన నమ్మకం వుంది. ఇక ఉపేక్షింపక వచ్చే విజయదశమి రోజున పట్టాభిషేకం జరిపించండి. అంతా మంచే జరుగుతుంది‘ అన్నాడు రాజగురువు అనంతాచార్యుడు. ‘నాన్నగారూ.. నేను పట్టాభిషిక్తుడ్ని కావడానికి ఆరునెలల ముందు దేశాటనకు వెళ్ళి రావాలని భావిస్తున్నాను. అందుకోసం రాత్రి నా స్వప్నంలో మాత అనుగ్రహం కూడా లభించింది. కాబట్టి నేను దక్షిణ దిశగా వెళ్ళిరావాలని భావిస్తున్నాను‘ అన్నాడు ప్రద్యుమ్నుడు ఒకరోజు.‘దేవి అనుగ్రహమైతే మరి తిరుగేముంది? వెళ్ళిరా నాయనా’ అంటూ ఆశీర్వదించారు తల్లిదండ్రులు.ప్రద్యుమ్నుని మిత్రుడు జయపాలుడు కూడా అతడి వెంటే బయలుదేరాడు. ఐదునెలల పాటు వారి పర్యటన నిర్విఘ్నంగా సాగింది. ఎంతో జ్ఞానం సముపార్జించి తిరుగుప్రయాణంలో ఓ కారడవిలోనే దారి తెలియక తిరిగి తిరిగి అడవి దాటలేక వారం రోజులపాటు చిక్కుకుపోయారు. ఆకలిదప్పులతో అరణ్యం నడుమ కనిపించిన ఓ శిథిలాలయంలో పడుకుని నిద్రించారు. ప్రద్యుమ్నునికి స్వప్నంలో జగన్మాత కనిపించింది.‘ప్రద్యుమ్నా.. ఈ గుడి కోనేటి జలంతో ఉదయాన్నే స్నానమాచరించి, ప్రక్కనున్న మర్రివృక్షం మొదలులో విషనాగుల సంరక్షణలో ఉన్న మాయా ఉంగరాన్ని వశం చేసుకో. నీకు శుభం కలుగుతుంది’ అనిచెప్పి మాయమైంది. చప్పున మేల్కొన్న ప్రద్యుమ్నుడు ఆనందించి మిత్రున్ని నిద్రలేపి స్వప్నవృత్తాంతం వివరించాడు. ఇద్దరూ ఉదయాత్పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని కొలనులో శుభ్రంగా స్నానం చేసి గుడిలోని జగన్మాతను పూజించి భక్తిగా నమస్కరించారు. పక్కనున్న మర్రివృక్షానికి ఆనుకున్న పుట్ట పైభాగంలో మాత చెప్పినట్లే ప్రకాశిస్తున్న ఓ ఉంగరం కనిపించింది. అయితే దానిచుట్టూ కొన్ని వందల నాగులు సంచరిస్తున్నాయి. దాంతో ప్రద్యుమ్నుడు కొద్దిగా ఎండుగడ్డిని సేకరించి పెద్ద చాపలా పేని, చెకుముకిరాళ్ళతో వెలిగించి ‘జై జగన్మాతా’ అని అరుస్తూ పుట్టపై విసిరాడు. నాగులన్నీ మంటల్లో కాలి బూడిదకావడంతో ఉంగరాన్ని అందుకున్నాడు. అంతలో నాగరాజు కోపోద్రిక్తుడై ప్రత్యక్షమై ‘ఓరీ..పాపి! అమాయకులైన నా నాగులను పొట్టనబెట్టుకుంటావా? ఈ ఉంగరం తీర్చిన ప్రతికోరికకూ నీవద్దనున్న దానినది సంగ్రహిస్తుంది గాకా’ అంటూ శపించి మాయమయ్యాడు. ఆ శాపానికి చింతిస్తున్న ప్రద్యుమ్నునికి అశరీరవాణి ఇలా వినిపించింది ‘ప్రద్యుమ్నా.. అంతా నీ మంచికే అనుకో. నీ తెలివితేటలతో శాపాన్నే వరంగా ఉపయోగించుకో’. తీవ్రంగా ఆలోచించిన ప్రద్యు ఓ నిర్ణయానికొచ్చి.. ‘ఓ మహిమాన్వితమైన అంగుళీకమా..! వెంటనే మా ఇద్దరినీ మా కోటలో మా తల్లిదండ్రుల ఎదుట నిలుపు’ అని ఆదేశించాడు. వెంటనే ఇద్దరూ కోటలో నిలిచారు. ఆ వెంటనే ప్రద్యుమ్నునికే వినిపించేలా ‘ప్రద్యుమ్నా! నీ కోరిక నెరవేర్చా. మరి నీ వద్ద వున్న దేనిని నాకర్పిస్తావు?’ అని అడిగింది అంగుళీకం.‘నా కోరిక నెరవేర్చిన నీకు సదా కృతజ్ఞుడను. నాలోని ఈర్షా్యద్వేషాలను నీకు అర్పిస్తున్నాను దయచేసి తీసుకో’ అన్నాడు. అంగుళీకం అతని నుంచి ఈర్షా్యసూయల్ని తీసివేసుకుంది. మహారాణి మంజులతాదేవి అప్పటికే పలురాజ్యాల రాజకుమార్తెల తైలవర్ణ పటాలను తెప్పించి ప్రద్యుమ్నుని ముందుంచింది. మయూర రాజ్య కన్యకామణి అయిన మందాకినిని ప్రద్యుమ్నుడు మెచ్చగానే, వారికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి, విజయదశమి రోజున పట్టాభిషిక్తుడ్ని చేశాడు మహారాజు ఆనందవర్మ.ప్రద్యుమ్నుడు మాయా ఉంగరాన్ని రాత్రి సమయంలో పూజగదిలోని జగదాంబ పాదాల దగ్గర ఉంచి నిద్రకుపక్రమించేవాడు. అలాగే, ప్రతి ఉదయం పూజతరువాత కళ్ళకద్దుకుని ఉంగరాన్ని ధరించేవాడు.అలా కొంతకాలం గడిచేసరికి ఒకసారి శత్రుదేశమైన శృంఖల దేశరాజు విరూపుడు తన అసంఖ్యాక సేనలతో దండెత్తివచ్చి తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని సన్నాహాలు మొదలుపెట్టాడనే వార్త వేగులద్వారా అందింది. అప్పుడు ప్రద్యుమ్నుడు పూజ తరువాత ధరించే ముందు ‘ఓ మాయా ఉంగరమా..! నా కింతవరకు ఎటువంటి కోరికలు కలుగలేదు. కానీ, ఇప్పుడు రాజ్యసంక్షేమం కోరి నిన్ను కోరుతున్నాను. నాకు బొటనవ్రేలిని ప్రసాదించు. దయచేసి ఈ సహాయంచేసి మా ప్రజలను కాపాడగలిగే అవకాశం నాకు కలిగించు’ అని అన్నాడు. వెంటనే అతనికి బొటనవేలు వచ్చేసింది. చిన్ననాటినుంచీ బాధపడినా ఉంగరాన్ని తన ఆనందంకోసం కోరుకోని బొటనవ్రేలిని పదే పదే చూసుకుని మురిసిపోయాడు ప్రద్యుమ్నుడు. రాజు, రాణి, మందాకినితో పాటూ జయపాలుడు కూడా సంతోషించాడు.‘దీనికి ప్రతిగా నాలో వున్న బలహీనతలన్నిటినీ నీ సొంతం చేస్తున్నాను స్వీకరించు‘ అన్నాడు చిరునవ్వుతో.ఏకసంథాగ్రాహి అయిన ప్రద్యుమ్నుడు మంచి గురువుల శిక్షణలో యుద్ధవిద్యలను అనతికాలంలోనే అవలీలగా నేర్చి యుద్ధంలో విరూపుడి సైన్యాన్ని సమర్థ వంతంగా తిప్పికొట్టాడు. ప్రజలంతా జయజయధ్వానాలతో పండుగ జరుపుకున్నారు. తమ రాజుగారికి లోపం తొలిగి బొటనవేలు వచ్చేసిందని ఆనందించారు.ఆ తరువాత తన వంశ వారసులు కూడా ఉంగరపు మహిమను కేవలం రాజ్య ప్రయోజనం కోసం తప్ప మరే దురుద్దేశంతోనూ ఉపయోగించరాదని శిలాశాసనాన్ని చెక్కించి దేవీ విగ్రహం పక్కనే ప్రతిష్ఠింపజేశాడు. - డేగల అనితాసూరి -
భారత జట్ల విజయం
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్ ఐదో రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు విజయం సాధించాయి. భారత పురుషుల జట్టు 3.5–0.5తో పరాగ్వేపై... మహిళల జట్టు 3.5–0.5తో అర్జెంటీనాపై గెలుపొందాయి. విశ్వనాథన్ ఆనంద్ 26 ఎత్తుల్లో రమిరెజ్ డెల్గాడోపై... ఆధిబన్ 35 ఎత్తుల్లో అల్మిరాన్‌పై... శశికిరణ్ 35 ఎత్తుల్లో వెర్జివ్‌కర్‌పై నెగ్గగా; గిలెర్మోతో జరిగిన గేమ్‌ను పెంటేల హరికృష్ణ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 52 ఎత్తుల్లో కరోలినా లుజాన్‌పై... తానియా సచ్దేవ్ 36 ఎత్తుల్లో ఫ్లోరెన్సియాపై... ఇషా కరవాడే 35 ఎత్తుల్లో ఐలెన్‌పై విజయం సాధించగా... క్లాడియా అమూరాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
జూనియర్ దేవరకొండ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ..!
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల సక్సెస్ తో విజయ్ దేవరకొండ ఇమేజ్ తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తన తమ్ముడిని కూడా హీరోగా పరిచయం చేస్తున్నాడు. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా సినిమా ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సీనియర్ హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రారంభం కానుంది. షార్ట్ ఫిలింస్‌తో సత్తా చాటిన కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సురేష్ బాబు సమర్పణలో యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
రేపొద్దున్న నీ కొడుకు డాక్టరైతే...
‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ అని చెప్పిన ఈ సినిమాలో పదునైన డైలాగులు ఉన్నాయి. కంటతడి పెట్టించే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సిల్వర్‌జూబ్లీ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... చెప్పాపెట్టకుండా పట్నం నుంచి ఊడిపడ్డ కొడుకు ఆనంద్‌ను చూసి...‘‘అదేంట్రా ఇలావచ్చావు? ఉత్తరం ముక్కయినా రాయలేదు’’ అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ.‘‘అది కాదమ్మా’’ అని ఆనంద్ ఏదో చెప్పబోతుండగానే రంగయ్య ఇలా విసురు విరిశాడు...‘‘ఆ... ఏముంది. రాసి ఉంచుకున్న ఉత్తరాలన్నీ అయిపోయి ఉంటాయి. అందుకనే సరాసరి వాడే వచ్చేశాడు’’‘‘మీరు ఊరుకుందురూ... ఎప్పుడు బయలుదేరాడో ఏమో పదబాబూ స్నానం చేసిరా... భోజనం చేద్దువుగానీ’’ అని కొడుకు వైపు మురిపెంగా చూసింది సీతమ్మ.అందరూ భోజనాలకు కూర్చున్నారు.సీతమ్మ కొడుక్కి కొసరి కొసరి వడ్డిస్తోంది.‘‘వద్దమ్మా చాలు’’ అంటున్నాడు ఆనంద్.‘‘వద్దంటే ఎలారా? బావకు ఇష్టమని ఎంతో రుచిగా చేసింది సుగుణ’’ అన్నది సీతమ్మ.సుగుణ బావ ఆనంద్‌ను ఆశ్చర్యంగా చూస్తూ...‘‘అత్తయ్యా చూశావా! బావ ఇదివరలా ములక్కాడలు శుభ్రంగా నమిలి తినడం లేదు. ఇప్పుడు చూడు అసలు తినడమే మరిచిపోయాడు’’ అంటూ బావ వైపు జాలిగా చూసింది సుగుణ.‘‘అది మరిచిపోవడం కాదమ్మా... ఫ్యాషను ఫ్యాషను. ఇదేం చూశావు. పట్నంలో చూడాలి సోకు. ముష్ఠోడికి కాణీ ధర్మం చేయడానికి మనసొప్పదుగానీ హోటళ్లో సగం ఇడ్లీ తిని సగం పారేస్తారు. ఫ్యాషను ఫ్యాషను’’ అని పట్నపు పోకడలను వెక్కిరించాడు రంగయ్య. ‘‘హోటలు కూడు నీకు కూడా వంటబట్టినట్లుందే’’ కొడుకు వైపు చిలిపిగా చూస్తూ అన్నది సీతమ్మ.‘‘రేపొద్దున్న నీ కొడుకు డాక్టరైతే మనమంతా హోటల్ కూడు తినాల్సిందే’’ అన్నాడు రంగయ్య పళ్లెంలో చారు పోసుకుంటూ.‘‘ఏ... ఎందుకు?!’’ అని ఆశ్చర్యపోయింది సీతమ్మ.‘‘మీరంతా వంట చేసి కందిపోతారేమోనని’’ అన్నాడు రంగయ్య. ఆయన భారీ మీసాల మీద వ్యంగ్యం సన్నగా మెరిసింది.ఆ తరువాత అసలు విషయంలోకి వచ్చి...‘‘ఆ... తమరు ఎందుకొచ్చినట్లో?’’ కొడుకు వైపు చూస్తూ అడిగాడు రంగయ్య.‘‘కన్నకొడుకుని పట్టుకొని ఏమిటండీ ప్రశ్న?’’ మూతి మూడిచింది సీతమ్మ.‘‘పిచ్చిముఖమా! వాడు ఉత్తినే రాలేదే...ఏదో పెద్ద మొత్తం పట్టడానికి వచ్చి ఉంటాడు’’ కొడుకు రాకలోని మర్మం గురించి చెప్పకనే చెప్పాడు రంగయ్య.‘పెద్ద మొత్తం’ అనేమాట వినబడగానే...‘‘ఆ... వాడు తినడానికా!’’ అన్నది సీతమ్మ.‘‘ఆ మాట నేనన్నానా’’ అని బదులిచ్చాడు రంగమ్మ.‘చిన్నమొత్తమైనా... పెద్ద మొత్తమైనా అది చదువు కోసమే కదా... జల్సాలకు కాదు కదా’ అనేది ఆ పిచ్చితల్లి ఉద్దేశం.‘‘అసలు నేను కాలేజీ మానాలనుకుంటున్నాను’’ బాంబు పేల్చాడు ఆనంద్.‘ ఏ ఎందుకని?’’ కన్నెర్ర చేశాడు రంగయ్య.‘‘మిమ్మల్ని ఈరకంగా బాధ పెట్టడం ఇష్టం లేక’’ ముఖం అదోరకంగా పెట్టి అన్నాడు ఆనంద్.‘‘మరి ఇన్నాళ్లు చదివిన చదువు ఏంకావాలి?’’ అమాయకంగా అడిగింది సీతమ్మ. ‘‘వాడి కోసం చదువుతున్నాడా! నాకు డబ్బు ఎక్కువై చదివిస్తున్నాను’’ అని ఆనంద్‌కు వేడి వేడి చురక అంటించి భార్యను చూస్తూ బాధగా అన్నాడు...‘‘మన సాధకబాధకాలు వాడికి తెలిస్తేగా’’ భర్త కోపం కట్టలు తెంచుకుంటుంది అని గ్రహించిన సీతమ్మ...‘‘అబ్బా! మీరుండండీ’’ అంది.‘‘లేకపోతే ఏంటే వాడు మాట్లాడేది? ఉత్తరం రాయడం పాపం డబ్బులు పంపిస్తూనే ఉన్నాంగా. ఇబ్బంది పెట్టింది ఎప్పుడని!’’ కోపంతో ఊగిపోయాడు రంగయ్య.‘‘మీరు పంపేది కాలేజీ ఫీజులకీ, పుస్తకాలకే సరిపోతుంది. ఇంకా ఏం అక్కర్లేదా ఏంటి?’’ అంటూ మూతిముడిచాడు ఆనంద్.‘‘ ఏం కావాలో చెప్పరాదు?’’ అనే ప్రశ్న తండ్రి నోటి నుంచి రాగానే....‘‘తోటివాళ్లంతా స్కూటర్లు, కార్ల మీదే వస్తారు. ఎప్పుడూ సూట్ల మీదే ఉంటారు’’ అడగకుండానే ఆశించేదాని గురించి అడగానే అడిగాడు ఆనంద్.‘‘వాళ్లంతా లక్షాధికారులురా’’ అనే ఒక్క మాటతోనే కొడుకు నోరు కట్టేసే ప్రయత్నం చేశాడు రంగయ్య. ఆనంద్ ఊరుకుంటేగా!‘‘కనీసం సూటు కుట్టించుకునే స్థోమత కూడా లేనప్పుడు చదవడం దేనికి?’’ అన్నాడు.చదువు అనేది సూట్లు కుట్టించుకోవడం కోసమే అన్నట్లు!ఇదే మాట రంగయ్య అన్నాడు...‘‘ఏరోయ్ పెద్దోళ్లతో తిరుగుతున్నావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు! మన స్థితి ఏంటో తెలుసుకో. సూట్లు బూట్లు వేసుకుంటేనే కాదురా చదువు... బుర్ర ఉండాలిరా బుర్ర’’ తింటున్న అన్నాన్ని మధ్యలోనే వదిలేసి కోపంగా లేచాడు రంగయ్య. తండ్రి లాగే తాను కూడా భోజనం మధ్యలోనే లేవబోయాడు ఆనంద్.‘‘ఒరేయ్ ఏంట్రా ఇది? అన్నం తినకుండా లేస్తావా? నీ ముందు అలా అంటారేగానీ నీ గురించి ఎంత మురిసిపోతారో తెలుసా! తిను నాయనా తిను’’ అంటూ కొడుకు అలక మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది సీతమ్మ. ఒకవైపు రంగయ్య కోపంతో గుర్రుమంటున్నాడు. మరోవైపు దిగులు ముఖంతో మంచంపై కూర్చున్నాడు ఆనంద్.ఈ పరిస్థితి చూసి...‘‘డబ్బు ఏమైనా సర్దుబాటు అవుతుందేమో... అలా తులసమ్మ ఇంటి వరకు వెళ్లొస్తా’’ అని ఉన్నపళంగా బయటికి నడిచింది సీతమ్మ. -
గుంటూరులో జాదూగర్ ఆనంద్ మ్యాజిక్ షో
-
ఇద్దరి కల
తమిళంలో క్లాసిక్ అన్న పేరున్న ఒక డబ్బింగ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. విడుదల సమయంలో ఫ్లాప్ అయిన ఈ సినిమా, ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ అనిపించుకుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... సమర సూర్యం, ఆనంద్.. వాళ్లిద్దరూ ఒకరికొకరు పరిచయం కావడానికి చాలా ముందు నుంచే ఇద్దరికీ కొన్ని కలలున్నాయి. సమర సూర్యం పెద్ద రచయిత. సినిమాల్లోనూ అప్పుడప్పుడే బిజీ అవుతున్నాడు. కానీ రాజకీయాలను, సమాజాన్ని మొత్తం మార్చేయాలన్నది అతడి కల. గాంధీజీ స్ఫూర్తితో మొదలైన ఒక కొత్త పార్టీలో చేరి పనిచేస్తున్నాడు. ఆనంద్‌కు నటుడవ్వాలన్నది కల. కనిపించిన స్టూడియోలన్నీ తిరుగుతున్నాడు. ‘ఒక్క అవకాశం ఇప్పించండి’ అని బతిమిలాడుకుంటున్నాడు. ఆనంద్‌కు సూర్యం పరిచయమయ్యాడు. ఆనంద్ మాటకు, సూర్యం రాత తోడైంది. ఇద్దరూ కలిసి అవకాశాల కోసం తిరిగారు.ఆనంద్ పడుతున్నాడు, లేస్తున్నాడు. చివరికి గట్టిగా నిలబడ్డాడు. కథానాయకుడి పాత్ర. సూర్యం వరుస సమావేశాలతో పార్టీలో ఓ కీలక వ్యక్తిగా ఎదుగుతున్నాడు. ఇద్దరి జీవితాలూ అప్పుడే ఒక మలుపు తీసుకుంటున్నాయి. ఆనంద్ సినీ పరిశ్రమలో కథా నాయకుడిగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. సూర్యం తన కల కోసం పార్టీని జనాల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళుతున్నాడు. ప్రజలకు సేవ చేయడానికి తానూ పార్టీలో చేరతానన్నాడు ఆనంద్. సూర్యం తమ నాయకుడికి ఆనంద్‌ను పరిచయం చేశాడు. ‘‘ఆకాశంలో ఎగిరే తార ఒడిలో వచ్చి వాలతానంటే అందరికీ సంతోషమేగా!’’ అన్నాడు వాళ్ల నాయకుడు. ఆనంద్ కొత్త ఆశలతో పార్టీలో చేరాడు. ‘‘నేను పార్టీలో చేరడం సమరసూర్యానికి నచ్చలేదా?’’ సూర్యాన్ని కౌగిలించుకుంటూ అడిగాడు ఆనంద్. గట్టిగా నవ్వాడు సూర్యం, తను సమాధానం చెప్పే రోజు ఇంకా రాలేదన్నట్టు.అలాంటిరోజు వచ్చింది. ఆనంద్‌ను భోజనానికి ఇంటికి పిలిచాడు సూర్యం. అతడు తింటూండగానే, మధ్యలోనే చెయ్యి కడగమని బలవంతం చేసి, మేడ మీదకి తీసుకెళ్లాడు. ఆ ఇంటి మేడ మీదినుంచి కిందకు చూస్తే చుట్టుపక్కల ఎంత దూరం ఖాళీ స్థలం ఉంటే అంత దూరం జనంతో నిండిపోయింది. ‘‘ఇదే ప్రజాశక్తి. లెనిన్, స్టాలిన్ ఎంతో కష్టపడి సాధించిన ప్రజాశక్తి. ప్రజల మనస్సులోకి వెళ్లగల శక్తి.’’ ఉద్వేగంతో చెబుతున్నాడు సూర్యం.‘‘కానీ నేను ఒట్టి నటుడ్ని కదా!’’ అన్నాడు ఆనంద్. ‘‘వాళ్లలా అనుకోవడం లేదు. అలా చూడు! వాళ్ల మనస్సులో నీ రూపాన్ని చెరగని ముద్ర వేసుకున్నారు. నీకోసం ప్రాణాలిస్తారు. ఈ శక్తిని నువ్వేం చేస్తావ్?’’ అంతే ఉద్వేగంతో అడిగాడు సూర్యం. ‘‘ఏం చేయాలంటావ్?’’ ‘‘ఇంతటితో వదలకూడదు. దాన్ని కొన్ని వేల రెట్లు పెంచాలి. పార్టీ కోసం ఉపయోగించాలి. అంతా నీ మొహంలోనూ, ఆ వెండితెరలోనే ఉంది.’’ ఆనంద్‌ను గట్టిగా కౌగిలించుకొని చెప్పాడు సూర్యం. ఆనంద్ రెండు చేతులూ పైకెత్తి కిందనున్న వాళ్లకు అభివాదం చేశాడు. ఇద్దరి వేర్వేరు కలలు ఆరోజు ఒక్క కలగా మారాయి. పార్టీ కోసం కలిసి పనిచేశారు. ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపారు. పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు. ఆనంద్ కథానాయకుడి పాత్రలు చేస్తూ సూపర్‌స్టార్ స్థాయికి వెళ్లాడు. ఆయన ఎక్కడ కనబడితే అక్కడ జనం కుప్పల్లా పోగై కనిపిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ నాయకుడు సూర్యాన్నే ముఖ్యమంత్రి పదవి స్వీకరించమని కోరాడు. సూర్యం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. రోజులు గడుస్తున్నాయి. సూర్యం ముఖ్యమంత్రిగా తాను చేయాలనుకున్న పనులు ఒక్కొక్కటిగా చేస్తూ వెళుతున్నాడు. ఆనంద్ వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నాడు.ఒకరోజు సూర్యం ముందు కూర్చుని, ‘‘మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారని విన్నాను. సూర్యం! నాకు ఆరోగ్య శాఖ ఇవ్వాలి. పెద్దాయన నాతో అన్నారు, మంత్రి పదవి స్వీకరించాలని.’’ అన్నాడు ఆనంద్ చాలా ప్రశాంతంగా. సూర్యం ఆలోచిస్తున్నాడు.‘‘ఏం సూర్యం? మంత్రిపదవి స్వీకరించే అర్హత నాకు లేదంటావా?’’ అడిగాడు ఆనంద్. ‘‘ఈ పార్టీకి మిగతా వాళ్ల కంటే నువ్వు చేసిన సాయం ఎక్కువ. అందుకే మొదటి మంత్రివర్గంలోనే నీ పేరు సూచించా. కానీ వర్కింగ్ కమిటీ నువ్వు నటనకు స్వస్తి చెప్తేనే పదవి అన్నారు. వాదించాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు.’’‘‘సూర్యం నాకు మంత్రి పదవి ఇవ్వడన్నమాట!’’‘‘ఆనందూ! నువ్వు సినిమాలు వదిలేస్తే...’’ అని ఆగాడు సూర్యం. ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకొచ్చేశాడు ఆనంద్. సూర్యం ఈర్ష్యతోనే ఇదంతా చేశాడని ఆనంద్‌కు ఎంతమంది చెప్పినా అతను స్నేహాన్నే నమ్మాడు. ఆనంద్, సూర్యం మధ్యన దూరం పెరిగింది. పార్టీ నాయకుడు పెద్దాయన అనారోగ్యంతో చనిపోయాడు.పెద్దాయన సంతాప సభలో ఆనంద్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెద్ద ప్రసంగం ఇచ్చాడు. అవినీతి పెరిగిందని, ప్రజల్లో పార్టీపై నమ్మకం పోకుండా ఉండటానికి, పెద్దాయన ఆశయ సాధన కోసం నాయకులంతా తమ తమ ఆస్తులను బయటకు లెక్క చూపాలని అరిచి చెప్పాడు. పార్టీలో చీలిక మొదలైంది. ఆనంద్‌ను పార్టీ బహిష్కరించింది. ‘‘ఇది నిజంగానే నాకు మంచి రోజు.’’ అని సమాధానమిచ్చాడు ఆనంద్, తనను పార్టీ బహిష్కరించడం గురించి చెప్తూ. ఆనంద్ కొత్త పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టడంతోనే ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇద్దరు మిత్రులు అధికారం, ప్రతిపక్షంలో కూర్చున్నారిప్పుడు. ఆ తర్వాత ఆనంద్, సూర్యం స్నేహితుల్లా మాట్లాడుకున్నది లేదు. ముఖ్యమంత్రిగా జనాల గుండెల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ఆనంద్ గుండెపోటుతో చనిపోయాడు. అప్పుడు మాత్రం స్నేహితుడ్ని తల్చుకొని బాగా ఏడ్చాడు సూర్యం. -
ఆనంద్‌కు తొలి ఓటమి
ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి ఓటమి ఎదురైంది.నార్వేలోని స్టావెంజర్ నగరం వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 50 ఎత్తుల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. తర్వాతి గేమ్‌లో కర్జాకిన్ సెర్గీ (రష్యా)తో ఆనంద్ తలపడతాడు. ఈ ఓటమి అనంతరం మొత్తం 3.5 పాయింట్లతో పాయింట్లతో ఆనంద్ ర్యాంకు ఐదోస్థానానికి పడిపోయింది. ఆనంద్ తన చివరి రౌండ్లో డింగ్ లిరెన్ (చైనా)తో తలపడతాడు. -
ఆనంద్‌కు తొలి విజయం
ఆల్టిబాక్స్ నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో వరుసగా ఆరు ‘డ్రా’లు నమోదు చేసిన తర్వాత... భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో తొలి విజయం చేరింది. నార్వేలోని స్టావెంజర్ నగరంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన ఏడో రౌండ్లో ఆనంద్ 40 ఎత్తుల్లో మాక్సిమి వాచియెర్ లాగ్రేవ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. బుధవారం జరిగే ఎనిమిదో రౌండ్లో ఫాబియానో కరువానా (అమెరికా)తో ఆనంద్ తలపడతాడు. -
కార్ల్సన్తో ఆనంద్ గేమ్ ‘డ్రా’
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆనంద్ వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసుకోవడం విశేషం. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో శనివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ ఖాతాలో 2.5 పాయింట్లున్నాయి. ఆదివారం జరిగే ఆరో రౌండ్లో మమెదైరోవ్ (అజర్బైజాన్)తో ఆనంద్ తలపడతాడు. -
ఆనంద్‌కు మరో ‘డ్రా’
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. సో వెస్లీ (అమెరికా)తో శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత ఆనంద్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. శనివారం జరిగే ఐదో రౌండ్లో ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే)తో ఆనంద్ ఆడతాడు. ఈ టోర్నీలో గురువారం విశ్రాంతి రోజు కావ డంతో మొత్తం పది మంది ఆటగాళ్లను ఐదు గ్రూప్‌లుగా విభజించి సరదాగా వంటల పోటీ నిర్వహించారు. ఇందులో ఆనంద్–లిరెన్ డింగ్ (చైనా) జంట చేసిన వంటకానికి ప్రథమ బహుమతి లభించింది. -
కలతో ‘అనుసంధానం’
సాక్షి, చిత్తూరు: సినిమా..కోట్లమందికి వినోదాన్ని అందించే మాధ్యమం. కానీ సినిమాలో నటిం చాలంటే? సినిమా తీయాలంటే? అబ్బో అది చాలా కష్టం..సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండాలి..లేదా డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి..ఏదో ఒక ప్లాట్ ఫాం ఉండి తీరాలి..అన్నది ఒకప్పటి మాట. కానీ నేడు ఔత్సాహిక ఫిలిం మేకర్స్‌కు ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాట్‌ఫాంగా యూట్యూబ్ అవతరించింది. మన జిల్లాలోని ఓ ఔత్సాహిక దర్శకుడు తీసిన ఓ లఘుచిత్రం నేడు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. 25 రోజుల్లోనే లక్ష వ్యూస్‌ని దాటిపోయిన ఆ లఘు చిత్రమే అనుసంధానం. ఇదీ అనుసంధానం కథ నిద్రపోతూ కనేది కల..ప్రతి మనిషి కలల రా వడం కామన్. ప్రతి కల ఒకొక్క రంగులో వస్తుం ది. మనకు జరిగిన సంఘటనలను కలలో రూపంలో వస్తాయి. వాటిలో కొన్ని తిరిగి డ్రీమ్ ప్రొసెస్ ద్వారా చూడవచ్చు. అందులో మొదటిది లూసీ డ్రీమ్, రెండోవది మ్యూచ్‌వల్ డ్రీమ్ ఇలా నాలు గోదశలో నేరుగా దేవుడితో మాట్లాడవచ్చు అనే నేపథ్యంతో ఈ షార్ట్‌ఫిల్మ్ తీశారు. కాస్త ఉత్కంఠ, ప్రేమ, లాజిక్, సస్పెన్స్ జోడించి తీసిని ఈ ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో పది రోజుల్లో 50 వేల పైచిలుకు మంది చూశారు. నేపథ్యం జిల్లాలోని కలకడ ప్రాంతం వ్యవసాయ కుటుం బానికి చెందిన చంద్ర, నిర్మలల ఏకైక కుమారుడు ఆనంద్. 2013వ సంవత్సరంలో రాజంపేట అన్నమచార్యులు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుకొనే సమయంలో సినీ హీరో నాగార్జున షార్ట్‌ఫిల్మ్ పోటీలు మాటీవీలో నిర్వహించారు. అప్పుడు మక్కువతో కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ పై క్రేజీబాయ్స్ అనే షార్ట్‌ఫిల్మ్ తీసి పోటీలకు పంపిం చాడు. అందులో ఎంపిక కాకపోయిన కళాశాలలో నిర్వహించిన పోటీల్లో ఆ షార్ట్‌ఫిల్మ్‌కు ఉత్తమ బహుమతి లభించింది. ఆ ప్రోత్సాహంతో విద్యార్థుల మధ్య ఉండే ఇగోల నేపథ్యంలో అ+ఈ+ ఫార్ట్ఫిల్మ్ తీశారు. దానికి మరింత ఆదరణ లభించడంతో మూడో ఫిల్మ్ తీయాలని సంకల్పం తో ఇంటికి బైక్‌లో వస్తుండగా చంద్రగిరి వద్ద ప్రమాదానికి గురయ్యాడు. దీంతో రెండేళ్ల పాటు విశ్రాంతిలో ఉండాల్సి వచ్చింది. సినీ రచయిత నుంచి ప్రశంస ‘అనుసంధానం’ను చూసిన ప్రముఖ సినీ రచయిత వెలిగొండ శ్రీనివాస్(అఖిల్ సినిమా కథ రచయిత) ఆనంద్‌కు కాల్ చేసి ప్రశంసించారు. నయనతారతో లేడిఓరియెంటెడ్ సినిమా తీయాలని చూస్తున్నాం. అందుకు తగిన కథ అవసరమని అడిగారని ఆనంద్ తెలిపాడు. అందుకు తగ్గట్టుగా తను కూడా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. సో ఆల్ ది బెస్ట్ టు ఆనంద్. సినిమా తీయాలి సరాదాగా ప్రారంభమైన షార్ట్‌ఫిల్మ్ ఆసక్తి నా లక్ష్యంగా మారింది. ఆ ఫిల్మ్ తీస్తున్న దశలో ప్రమాదం జరగడంతో రెండు సంవత్సరాలు రెస్ట్‌లో ఉన్నాను. ఇప్పుడు ఉద్యోగం చేసున్నాను. కాస్త ఆర్థికంగా నిలబడ్డాక ఫిల్మ్ ఇండ్రస్టీకు వెళతాను. ‘అనుసంధానం’కు ఉహించిన దానికంటే ఎక్కువ ఆదరణ వచ్చింది. ప్రముఖ కథ, మాటల రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఫోన్ చేయడం ఆనందంగా ఉంది. – ఆనంద్, షార్ట్‌ఫిల్మ్ దర్శకుడు, రచయిత -
వావ్!
అదిగో... అతని పేరు ఆనంద్.అతడి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది.నిజానికి స్మార్ట్‌ఫోన్ చేతిలోనే అతడు ఉన్నాడు.మొదట్లో ఎవరికైనా ఫోన్ చేయడం, లేదా ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తడం... ఇంత వరకే ఉండేది. అలాంటి ఆనంద్ కాస్తా మారిపోయాడు.స్మార్ట్‌ఫోన్ అనే సముద్రంలో సౌండ్ లేకుండా దూకేశాడు. ఇక అప్పటి నుంచి అతని జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఆనంద్‌లో ఆనందం ఆవిరైపోయింది. గాభరా మాత్రమేమిగిలిపోయింది. ఒక్కసారి వెనక్కి వెళదాం.... అప్పుడే నిద్రలో నుంచి లేచాడు ఆనంద్.లేవడం లేవడంతోనే స్మార్ట్‌ఫోన్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. ‘ఠింగ్’ అంటూ సౌండ్ వినిపించింది.‘పీక్స్టార్ బండబాబు... ఇక లేరు’ అనే హెడ్డింగ్ కనిపించింది.అయ్యో! ఎంత పనైంది. విధి ఎంత క్రూరమైనది. యాభై సంవత్సరాలు కూడా దాటుండవు. ఎంత గొప్ప నటుడు. బండబాబు లేని లోటు తీర్చలేనిది.’ అనుకుంటూ ఆ వార్తలోకి వెళ్లాడు.‘బండబాబు ఇక లేరు’ అనే హెడ్డింగ్ కింది ఇలా రాసి ఉంది.‘పీక్స్టార్ బండబాబు ఇకలేరు... ఆయన్ని చూడడం అభిమానులకు అసాధ్యం... ఎందుకంటే ఆయన హైదరాబాద్‌లో లేరు. ‘తొక్కితే లేస్తా’ సినిమా షూటింగ్ పాటల కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు’. ఆనంద్‌కు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఆ వార్త పోస్ట్ చేసి పావుగంట కూడా కాలేదు. ‘వ్యూ’లు కోటి దాటి పోయాయి! త్వరగా తయారై ఆఫీస్‌కు వెళ్లాడు ఆనంద్. సీట్లో కూలబడ్డాడో లేదో...‘ఠింగ్’ అంటూ సౌండ్ అయింది.ఆసక్తిగా ఫోన్లోకి చూశాడు.‘కన్నకొడుకును పట్టుకొని... వీడసలు నా కొడుకే కాదు’ అని ప్రకటించి సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త డబ్బారేకుల సుబ్బారాయుడు’. ఈ హెడ్డింగ్ చూసి షాక్ తిన్నాడు ఆనంద్.అయితే ఆ అబ్బిరాజు సుబ్బారాయుడి కొడుకు కాదన్నమాట. గోల్డెన్స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టాడు... కోటాను కోట్లకు వారసుడు అని అబ్బిరాజు గురించి అందరూ అనుకునేవారు. అలాంటి అబ్బిరాజు సుబ్బారాయుడి కొడుకు కాదనేది చేదు నిజం. అనాథైన అబ్బిరాజును సుబ్బారాయుడు పెంచుకొని ఉంటాడు. కానీ ఆయన చెప్పే వరకు ఆ విషయం ఎవరికీ తెలియదు. కన్న కొడుకు కంటే గొప్పగా అబ్బిరాజును పెంచడం అనేది చాలా గొప్ప విషయం. ఇన్ని రోజులు దాచిన రహస్యాన్ని సుబ్బారాయుడు ఇప్పుడు ఎందుకు బయట పెట్టి ఉంటాడు?’ ఇలా ఏవేవో ఊహించుకుంటూ ఆ తరువాత నెమ్మదిగా హెడ్డింగ్ కింది వార్తను చదివాడు. అందులో ఇలా ఉంది...తన కుమారుడు అబ్బిరాజుకు జరిగిన సన్మాన సభలో పారిశ్రామికవేత్త సుబ్బారాయుడు మాట్లాడుతూ...వీడు నా కొడుకే కాదు. ఒక ఫ్రెండ్. ఒక గైడ్ కూడా!’ అన్నారు.ఆనంద్‌కు దిమ్మతిరిగిపోయింది! సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరే ముందు ‘ఠింగ్’ అని సౌండ్ అయింది.ఫోన్లోకి చూశాడు.ఇక చస్తే నటించను... అని ప్రకటించిన సౌత్‌స్టార్ సాల్మాన్‌రాజు’ అనే హెడ్డింగ్ కనిపించింది.‘ఛా! ఇదేం నిర్ణయం. స్మాలాన్రాజు చేయాల్సిన మంచి పాత్రలు ఎన్నో ఉన్నాయి. సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటి?’ అనుకుంటూ హెడ్డింగ్ కింది వార్తను చదవడం మొదలుపెట్టాడు. అందులో ఇలా ఉంది...‘నటన–ఒక పరిశీలన పేరుతో జరిగిన అంతర్జాతీయ సెమినార్లో సౌత్‌స్టార్ సాల్మాన్‌రాజు మాట్లాడుతూ... తెలిసో తెలియకో నేను నటించి ఉండొచ్చు. కానీ నటుడు అనేవాడు నటించవద్దు. ఆ పాత్రలో జీవించాలి. అందుకే ఇక ముందు నేను నటించను... జీవిస్తాను’ అన్నారు.ఈసారి ఆనంద్‌కు దిమ్మతిరగడమే కాదు బోనస్‌గా మైండ్ బ్లాకైంది.ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఆనంద్ కాఫీ తాగుతున్నాడు.‘ఠింగ్’ అంటూ సౌండ్ అయింది. ఫోన్లోకి చూశాడు.‘ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ప్రఖ్యాత శాస్త్రవేత్త బంకా వెంకయ్య’ఈ హెడ్డింగ్ చూసి ‘అయ్యో!’ అని బాధగా నిట్టూర్చాడు ఆనంద్. ఆనంద్‌కు అత్యంత ఇష్టమైన శాస్త్రవేత్త బంకా వెంకయ్య.శోకతప్త హృదయంతో హెడ్డింగ్ కింది మ్యాటర్‌ను చదవడం మొదలుపెట్టాడు ఆనంద్. ఆ వార్త ఇలా ఉంది...‘చంద్రుడిపై అడుగుపెట్టాలనేది శాస్త్రవేత్త వెంకయ్య చిరకాల కోరిక. ఇప్పుడది నిజమైంది. అమెరికాకు చెందిన స్పేస్ ట్రావెల్ కంపెనీ ‘మూన్ జడ్’ చంద్రడిపైకి తీసుకువెళ్లిన పదిమంది ప్రైవేట్ టూరిస్ట్‌లలో మన వెంకయ్య ఒకరు. వెంకయ్య ఈ లోకంలో లేకపోయినా తనకు ఇష్టమైన చంద్రలోకానికి వెళ్లడం హర్షనీయం అంటున్నారు ఆయన అభిమానులు’. ఆనంద్‌కు ఈసారి మైండ్ బ్లాక్ అయింది. ఆ తరువాత అయోమయంతో వైట్ అయింది. ఆ తరువాత కోపంతో రెడ్ అయింది. అంతే!తన చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ను కోపంగా విసిరికొట్టాడు. అది సరాసరి వెళ్లి ఆయన భార్య శాంతజ్వాల తాగుతున్న కాఫీ కప్పులో పడింది. ఆ తరువాత ఏమైందో... మీకు తెలియనిదేముంది!! – యాకుబ్ పాషా -
గౌర్వరం
జీవితం ప్లస్ అవ్వాలి..అంతకంటే మంచి విషయం జీవితంలో ప్లస్లుండాలి!!భూకంపాలొస్తాయి.. సునామీలొస్తాయి.. ద్రోహాలు జరుగుతాయి.. అన్యాయం ఉంటుంది!జీవితంలో వేసుకునే లెక్కల్లో ఇవన్నీ మైనస్‌లే!!మరి ఇన్ని మైనస్‌లను తలదన్నే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ దొరుకుతుంది?ఎవరిస్తారు?నిన్ను నువ్వు గౌరవించుకున్న క్షణం.. ఆ ప్లస్లన్నీ నీలోనే కనపడతాయి!! సునాలీ ఆనంద్ గౌర్ మనందరికీ అద్దం పట్టిచూపించిన గౌరవం అదే!! తెల్లవారి పేపర్ తెరిస్తే హత్యలు, రేప్‌లు, మోసాలు, లూటీలు. టీవీ ఆన్ చేసినా అవే ఘోరాలు. పక్కవాళ్లను పలకరిస్తే కష్టాల ఏకరువు పెడతారు. స్నేహితులతో మాట్లాడితే ఇంక్రిమెంట్ లేదు వర్క్‌లోడ్‌తో స్ట్రెస్ అంటూ సమస్యల పురాణం విప్పుతారు. చుట్టాలను చుట్టొస్తే ఇంటికో రామాయణం.బాబోయ్... ఇంత నెగటివ్ వాతావరణమా? ఎక్కడా సంతోషం లేదా? ఎవరూ ఆనందంగా లేరా? ప్రాబ్లమ్స్‌తో పరేషాన్ అవడం తప్ప పాజిటివ్ ఆలోచనలతో ఒక్కరూ ఉండరా?తన చుట్టూ కనిపించిన వాతావరణం చూసి షాక్ అయింది సునాలీ ఆనంద్ గౌర్. పాజిటివ్ ఎనర్జీ నింపేందుకు సిద్ధమైంది.మనం బతకొచ్చు.బతుకు మీద ఆశ ఉన్నవాళ్లు మన చుట్టూ ఉన్నారు అని పదే పదే ఆమె చెప్పదల్చుకుంది.ఆమె చేస్తున్న ప్రయత్నానికి మంచి ఆదరణ కూడా లభిస్తోంది.ఎవరీ గౌర్?ఆనంద్ గౌర్ పుట్టింది, పెరిగింది, చదువుకుందీ ఢిల్లీలోనే. ఢిల్లీ యూనివర్శిటీలో లా చేసింది. లాయర్‌గా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. రెండేళ్లు గడిచేసరికి చిరాకేసింది. కోర్టులో అడుగు పెడితే చాలు కలహాలు, కొట్లాటలు వినడంతోనే పొద్దుపొడిచేది. విసుగొచ్చింది.ఆ నెగటివ్ వాతావరణాన్ని భరించలేక నల్లకోటుకి రాంరాం చెప్పేసింది. ఆ తర్వాత? ఢిల్లీలోని గోలే మార్కెట్లో తల్లి నడిపిస్తున్న సెయింట్ పాట్రిక్స్ ప్లే స్కూల్లో టీచర్‌గా చేరింది. పిల్లలతో గడుపుతూంటే తనలో కలుగుతున్న ఒక కొత్త ఉత్తేజాన్ని గమనించింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లినా అదే ఉత్సాహం.. ఉల్లాసంతో ఉండేది. లాయర్‌గా ఉన్నప్పుడు గూడు కట్టుకున్న దిగులంతా ఇప్పుడు తుడిచేసినట్టయిపోయింది. అంటే పిల్లల్లో నెగటివ్ ఎనర్జీ లేదు. వాళ్ల కేరింతలు.. అల్లరి.. ఆనందం.. అంతా పాజిటివే! అప్పటి నుంచి తన చుట్టూ ఉన్న మనుషుల్లో కేవలం పాజిటివిటీనే చూడాలని నిర్ణయించుకుంది. పెదవుల మీద చిరునవ్వు ఆ శక్తినిస్తుందనీ గ్రహించింది. పాజిటివ్ జర్నీ... టీచర్‌గా ఉండగానే గౌర్‌కు పెళ్లయింది. అత్తగారి ప్రాంతమైన గురుగ్రామ్‌కు షిఫ్ట్ అయింది సునాలీ. అయినా టీచర్ ఉద్యోగం వదల్లేదు. రోజూ గురుగ్రామ్ నుంచి ఢిల్లీకి బస్సులో వచ్చేది. వచ్చేటప్పుడు, స్కూల్ అయ్యాక తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు తన చుట్టూ ఉన్న మనుషులను గమనించడం మొదలుపెట్టింది. బస్‌స్టాప్‌లోకి ఆదరాబాదరగా పరిగెత్తుకొచ్చే వాళ్లను చూసి పలకరింపుగా నవ్వేది. అప్పటిదాకా కంగారు పడ్డవాళ్లు ఆమె నవ్వుకు బదులుగా నవ్వేవారు. కొంచెం కుదుటపడ్డట్టుగా అనిపించేవారు. హడావిడిగా బస్ ఎక్కేవాళ్లనూ ‘హాయ్’ అంటూ నవ్వుతూ విష్ చేసేది. సీట్ దొరక్క రాడ్ పట్టుకుని వేళ్లాడుతున్న వాళ్లు సైతం ఆమె చెప్పిన హాయ్‌ను మనాసారా ఆస్వాదించేవాళ్లు. ఆ రోజుకి అది చాలు అనుకుని తాను కోరుకున్న ఎనర్జీతో ఇంటికెళ్లేది సునాలి. ఒకసారి.. బడికి బయలుదేరుతుంటే బస్‌స్టాప్‌కి వెళ్లే దారిలో ఉన్న ఓ ఇంట్లోంచి ఓ ముసలావిడ అయిదారు బాటిళ్లలో చల్లటి నీళ్లను నింపి తీసుకొస్తూ కనిపించింది. వాటిని ఆమె ఏం చేస్తుందా? అనే కుతూహలం సునాలీలో. బస్‌స్టాప్‌కి రాగానే మంచి నీళ్లను అక్కడ ఫుట్‌పాత్ మీదున్న వాళ్లకు ఇచ్చింది ఆ ముసలావిడ. ఆ పెద్దావిడ పాజిటివ్ ఎనర్జీని తనకు అందించినట్టు ఫీలయింది సునాలీ. బడి నుంచి ఇంటికి వెళ్లాక ఫేస్బుక్లో ఓ పేజ్ క్రియేట్ చేసింది ‘సోల్ స్టరింగ్’ పేరుతో. తాను ఉదయం చూసినదాన్ని ఓ కథలా రాసింది. వందల లైక్‌లు.. పదుల్లో కామెంట్స్. ఇక ఆ ప్రయత్నం ఆపలేదు. తెలీకుండానే... యాక్సిడెంటల్‌గా జర్నలిస్ట్ అవతారమెత్తింది. ఇప్పుడు.. ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. తనకు వీలు చిక్కినప్పుడల్లా వీ«ధుల్లోకి వెళ్తుంది. అలాంటి పాజిటివ్ మనుషులు ఎవరు కనిపించినా వాళ్ల గురించి సోల్ స్టరింగ్లో రాస్తుంది. భర్త, కూతురితో బయటకు వెళ్లినా కెమెరా, పేపర్, పెన్నూ వెంట తీసుకెళ్తుంది. మనుషుల్లోని పాజిటివ్‌నెస్‌ను వెదుకుతుంది. ఫేస్బుక్లో పెడ్తుంది. అలా ఒకసారి ఆమె ఢిల్లీలోని ఓ మాల్‌కు వెళ్లింది. మాల్ బయట సిమెంట్ బెంచ్ మీద ఓ వృద్ధుడు కూర్చొని కనిపించాడు. ఒంటరిగా వచ్చిపోయే జనాలనే చూస్తున్నాడు. ఆమె దృష్టి అతని మీద పడింది. వెళ్లి ఆయనను పలకరించింది. నవ్వుతూ బదులిచ్చాడు అతను. ఆ మాటా ఈమాటా మాట్లాడి వివరాలు అడిగింది. అప్పుడు తెలిసింది సునాలికి అతను ఓ క్యాన్సర్ పేషంట్ అని. కీమో థెరపీలో ఉన్నాడని. ‘ప్రతిరోజూ సాయంకాలం అలా రద్దీ ఉన్న చోటికి వచ్చి జనాలను చూస్తూ ఉత్సాహాన్ని నింపుకుంటున్నాను. క్యాన్సర్‌తో పోరాడ్డానికి అదెంతో శక్తినిస్తోంది. జీవితం పట్ల ఆశను పెంచుతోంది’ అని అతడు చెప్పాడు. మరణం ఖాయమని తెలిసిన మనిషిలోనూ కనిపించిన ఆ పాజిటివిటీ ఆమెను కదిలించింది. అతని గురించి ఫేస్బుక్లో రాసింది. లైక్‌లు, కామెంట్లు, షేర్లతో ఆ వార్త మారుమోగింది. అది చూసిన మెయిన్‌స్ట్రీమ్ పత్రికలూ సునాలీ ద్వారా అతని చిరునామా పట్టుకొని అతని గురించి రాశాయి. క్యాన్సర్ చికిత్స కోసం అతనికి ఊహించని విధంగా ఆర్థిక సహాయం అందింది. దాంతో సునాలీ ఫేమస్ అయింది. ఆమె ‘సోల్ స్టరింగ్’ కథనాలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఢిల్లీలోని ప్రధాన స్రవంతి పత్రికలన్నీ సునాలీ ఇంటర్వ్యూను ప్రచురించాయి. ఆమె పాజిటివ్ ప్రయాణంలో చాలామంది అడుగులు కలిపారు. ఢిల్లీలో ఇప్పుడది ఓ ఉద్యమంలా సాగుతోంది. మనిషిలోని మంచినే చూసే ఉద్యమం. ‘పాజిటివ్ థింకింగ్.. ఎన్ని ప్రతికూల పరిస్థితులనైనా జయించేలా చేస్తుంది. ఇప్పుడు మనలో లేనిది అదే. దాన్ని తిరిగి పోందాలనే నా తపన. అందుకే నా చుట్టూ ఉన్న మనుషుల్లోని పాజిటివ్‌నెస్‌ను సోల్ స్టరింగ్లో పెడ్తున్నా. దాంతో మిగిలిన వాళ్లూ ఇన్స్పైర్ అవుతారని’ అంటుంది సునాలీ ఆనంద్ గౌర్. ఈ పెద్దాయన ఒక క్యాన్సర్ పేషెంట్. రోజూ సాయంత్రాలు ఫుట్‌పాత్ మీద కూర్చుని జనాన్ని చూస్తూ వాళ్లలోని ఉత్సాహాన్ని గమనించడం ద్వారా క్యాన్సర్‌ని ఎదుర్కునే శక్తి పొందుతుంటాడు. మనిషికి మనిషికి మించిన మందు లేదు. ఈ విషయాన్ని గమనించి గౌర్ ఆయన మీద రాసిన ఫేస్బుక్ కథనానికి విశేషమైన స్పందన వచ్చింది. – శరాది -
వీరులను స్మరించుకుందాం
ఉచిత వైద్య పరీక్షలు:మాజీ సైనికుల సమ్మేళనానికి హాజరైన వారికి పలు రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మెడికల్, సర్జికల్, ఈఎన్టీ నిపుణులు పాల్గొన్నారు. ఈసీజీ, ఎకో పరీక్షలు చేసి తగు సూచనలు ఇచ్చారు. తరగని సంపదను ఆర్జించిన వారైనా తుదకు వట్టి చేతులతో మట్టిలో కలవాల్సిందే. కీర్తిని ఆర్జించిన వారు ఆచంద్రతారార్కం గుండెల్లో గుడి కట్టుకుంటారు. భారతజాతి స్వేచ్ఛా వాయువుల కోసం నిరంతరం పరితపించి వీర మరణం పొందిన జవాన్లు అలాంటి వారే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మాజీ సైనికుల సమ్మేళనంలో అమరవీరుల ఆత్మీయుల కళ్లు కన్నీటి సుడులయ్యాయి. ఈ సందర్భంగా అందజేసిన బహుమతుల్లో తమ వారిని బలిగొన్న తూటాల శబ్దాలు వినిపించాయో ఏమో బావురుమని విలపించారు. లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని దక్షిణ భారత లెఫ్టినెంట్ జనరల్ ఆర్కే ఆనంద్ పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సాయుధ దళాల వీరుల గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ, వారి బంధువుల సమస్యలు తెలుసుకునేందుకు మహాసమ్మేళనం నిర్వహించారు. హైదరాబాద్‌లోని అర్కెలరీ సెంటర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, యుద్ధ వితంతువులు, అమర జవానుల కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆర్మీ బ్యాండ్ దేశభక్తిని పెంపొందించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రా, తెలంగాణ సబ్ ఏరియా మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. సైనిక్ వెల్ఫేర్ ఏపీ డైరెక్టర్, ఎంవీఎస్ కుమార్, విజయవాడ అదనపు పోలీస్ కమిషనర్ బీవీ రమణకుమార్ అతిథులుగా పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి వీరుల బంధువులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్ సమస్యలు, రుణాలు ఇతర అంశాలను పరిష్కరించేందుకు బ్యాంకు స్టాల్స్ ఏర్పాటుచేశారు. లెఫ్టినెంట్ జనరల్ ఆర్కే ఆనంద్ మాట్లాడుతూ మాజీ సైనికులు, యుద్ధ వితంతువులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలోని మాజీ సైనికులు, యుద్ధ వితంతువులను కలిసి సమస్యలు తెలుసుకుంటామన్నారు. -
చెన్నైలో గోగో టెక్నాలజీ కేంద్రం
ముంబై: విమానాల్లోపల ఇంటర్నెట్, వినోద సర్వీసులు అందించే అంతర్జాతీయ సంస్థ గోగో తాజాగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. చెన్నైలో టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకల్లా ఇది అందుబాటులోకి రాగలదని గోగో ఈవీపీ ఆనంద్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. 30 మంది ఇంజనీర్స్, డెవలపర్స్‌తో ప్రారం భించి.. 2018 ఆఖరు నాటికి సిబ్బంది సంఖ్య ను సుమారు 100కి పెంచుకోనున్నట్లు వెల్లడించారు. భారత్‌లో టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయడం.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని కస్టమర్లకు సేవలు మెరుగుపర్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని చారి వివరించారు. దేశీ, విదేశీ రూట్లలోని విమానాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలని టెలికం విభాగం యోచిస్తున్న నేపథ్యంలో దేశీ మార్కెట్లోకి గోగో ఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. -
ఆనంద్ గెలుపు
విక్ అన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడో విజయాన్ని సాధించాడు. జోన్స్ గవాయిన్ (ఇంగ్లండ్)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 40 ఎత్తుల్లో విజయం సాధించాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో పదో రౌండ్ తర్వాత ఆనంద్ 6 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉన్నాడు. -
కార్ల్సన్తో ఆనంద్ గేమ్ ‘డ్రా’
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఆరో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో నెదర్లాండ్స్‌లో మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో తొమ్మిదో రౌండ్ తర్వాత ఆనంద్ ఐదు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్ పరాజయం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఏడో రౌండ్లో ఓటమి ఎదురైంది. రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్‌తో శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో ఆనంద్ పరాజయం చవిచూశాడు. క్రామ్నిక్ 36 ఎత్తుల్లో ఆనంద్ ఆటకట్టించాడు. ఈ రౌండ్ ముగిసేసరికి భారత వెటరన్ గ్రాండ్‌మాస్టర్ 4 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. క్రామ్నిక్ 4.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. -
టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో ఆనంద్ శుభారంభం
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ పట్టణంలో శనివారం మొదలైన ఈ టోర్నీ తొలి రౌండ్లో ఆనంద్ 53 ఎత్తుల్లో మాక్సిమ్ మత్లాకోవ్ (రష్యా)ను ఓడించాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన మరో గేమ్‌లో భారత్‌కే చెందిన ఆదిబన్ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇదే టోర్నీ చాలెంజర్స్ విభాగంలో పోటీపడుతున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. అమీన్ బాసిమ్ (ఈజిప్ట్)తో జరిగిన గేమ్‌ను హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
రిమాండ్‌కు ప్రేమోన్మాది
హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన బోను జానకి కేసులో నిందితుడిని గురువారం కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా గుయ్యనవలసకు చెందిన బోను జానకి కేబీహెచ్‌బీలోని డీమార్టులో సేల్స్ గర్ల్. అదే సంస్థలో పనిచేస్తున్న నిందితుడు వికారాబాద్ జిల్లా నేర్లపల్లి అనంతప్ప అలియాస్ ఆనంద్‌తో 8 నెలల క్రితం పరిచయం ఏర్పడటంతో తనను ప్రేమించాలంటూ జానకిని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె డీమార్టు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వారు అతన్ని మందలించారు. జానకిని మరో బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అయినా అతడి వేధింపులు ఆగలేదు. తన బావతో సెల్ఫోన్లో మాట్లాడుతూ తనకు దూరమవుతోందని భావించిన అనంతప్ప జానకిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ఈ నెల 9న జానకి రూమ్‌కు వెళ్లి తనను పెళ్లి చేసు కోవాలని కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అనంతప్ప కత్తితో జానకిని మూడు చోట్ల పొడిచి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణంతీసిన ప్రేమోన్మాదం
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాదం మరో యువతి ప్రాణాలు బలి తీసుకుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లేందుకు సెలవు పెట్టిన ఆమె.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.. ఊరెళ్లేందుకు టికెట్లు తీసుకుని.. షాపింగ్ కూడా పూర్తి చేసింది.. ఎన్నో ఆశలతో ఇంటికి చేరుకున్న ఆమెను ఓ ప్రేమోన్మాది అత్యంత పాశవికంగా హత్య చేశాడు. మంగళవారం రాత్రి మూసాపేట హబీబ్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లావాసి బోను జానకి(24)గా, నిందితుడిని వికారాబాద్ జిల్లావాసి ఆనంద్ అలియాస్ అనంతప్ప(27)గా పోలీసులు గుర్తించారు. మృతురాలు, నిందితుడు ఇద్దరూ డీమార్ట్ సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రేమించాలంటూ వేధింపులు.. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి(24) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చింది. సనత్‌నగర్‌లోని డీమార్ట్‌లో ఉద్యోగంలో చేరింది. అక్కడే పనిచేస్తున్న రూపావతితో కలసి మూసాపేట హబీబ్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన ఆనంద్ అలియాస్ అనంతప్ప(27) కూడా అదే సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రగతినగర్‌లో నివాసముంటున్న ఆనంద్.. జానకితో పరిచయం పెంచుకున్నాడు. అదే చనువుగా తీసుకుని ప్రేమించాలంటూ ఒత్తిడి తీసుకురాగా.. ఆమె సున్నితంగా తిరస్కరించింది. అతడి వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో 15 రోజుల క్రితం డీమార్ట్ యాజమాన్యానికి, ఆనంద్ స్వగ్రామంలోని పెద్దలకు చెప్పటంతో అతడిని పిలిచి మందలించారు. ఇక నుంచి జానకితో మాట్లాడనని, మరిచిపోతానని ఆనంద్ చెప్పాడు. ఇద్దరూ ఒకేచోట పనిచేయటం ఇబ్బందిగా ఉంటుందని జానకిని కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేజ్‌లోని డీమార్ట్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అయినా జానకికి వేధింపులు తప్పలేదు. ఆనంద్ సనత్‌నగర్‌లో విధులు ముగించుకుని.. కేపీహెచ్‌బీ డీమార్ట్ వద్దకు వచ్చి తనను ప్రేమించాలంటూ మళ్లీ వేధింపులు మొదలెట్టాడు. సొంతూరు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. సంక్రాంతి పండుగ కోసం బుధవారం సొంతూరు వెళ్లాలనుకున్న జానకి.. మంగళవారం నుంచి సెలవు తీసుకుని షాపింగ్ పూర్తి చేసి రూమ్‌కి చేరుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె గది దగ్గరకు వచ్చిన ఆనంద్.. గడియ తీసి ఉండటంతో లోపలికి వెళ్లాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కసితో జానకి గొంతు నులిమి.. రూమ్‌లోని కూరగాయలు కోసే కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. గది బయట గడియ వేసి పరారయ్యాడు. రూపావతి విధులు ముగించుకుని రూమ్‌కు రాగా.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ జానకి కనిపించడంతో కేకలు వేసింది. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. రూపావతి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జానకి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
వరల్డ్ ‘కింగ్’ ఆనంద్
చదరంగపు రారాజు మళ్లీ యుద్ధభూమిలో కదం తొక్కాడు...48 ఏళ్ల వయసులో కొత్త ఎత్తులతో కుర్రాళ్లను చిత్తు చేస్తూ జగజ్జేతగా నిలిచాడు. ‘వేగం’లో తనను అందుకోవడం కష్టం అంటూ ప్రత్యర్థులను మట్టి కరిపించాడు. అరవై నాలుగు గళ్లలో అతని ఆట ముగిసినట్లే అని భావించినవారికి పదునైన రీతిలో సమాధానమిస్తూ భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మరోసారి విశ్వ వేదికపై తన సత్తా చాటాడు. వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకొని శిఖరాన నిలిచాడు. 15 రౌండ్లలో ఒక్కటి కూడా ఓడకుండా అజేయంగా నిలిచి ఆనంద్ అగ్రస్థానాన్ని అందుకోవడం విశేషం. రియాద్: మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన పాత ఆట తీరును ప్రదర్శిస్తూ విశ్వ వేదికపై అగ్రస్థానాన నిలిచాడు. గురువారం ఇక్కడ ముగిసిన వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆనంద్ సొంతం చేసుకున్నాడు. టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆనంద్ నిర్ణీత 15 రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో వ్లాదిమర్ ఫెడసీవ్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే కచ్చితమైన ఫలితం కోసం ఇరువురి మధ్య నిర్వహించిన రెండు టైబ్రేక్ మ్యాచ్‌ల్లో విజయం ఆనంద్‌నే వరించింది. తెల్లపావులతో ఆడిన తొలి టైబ్రేక్‌ను 29 ఎత్తుల్లో సొంతం చేసుకున్న విషీ... నల్లపావులతో ఆడిన రెండో టైబ్రేక్‌ను 38 ఎత్తుల్లో దక్కించుకొని జగజ్జేతగా అవతరించాడు. గురువారం జరిగిన చివరి ఐదు రౌండ్లలో నాలుగు గేమ్‌లను విషీ డ్రా చేసుకున్నాడు. రష్యాకు చెందిన గ్రిష్చుక్తో జరిగిన 14వ రౌండ్ గేమ్‌ను 57 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో ఆనంద్ ఓవరాల్‌గా 6 గేముల్లో గెలిచి 9 గేముల్ని డ్రా చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన మాగ్నస్ కార్ల్సన్ చివరిదైన 15వ రౌండ్లో రష్యాకు చెందిన గ్రిష్చుక్ చేతిలో 60 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. దీంతో 10 పాయింట్లతో టోర్నీలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 9.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 15 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో 22వ స్థానాన్ని సంపాదించింది. ►ఆనంద్ 2003లో వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. అయితే 2012 నుంచి ‘ఫిడే’ కొన్ని మార్పులతో వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ పేరుతో అధికారికంగా దీనిని నిర్వహిస్తోంది. గతంలో ఇదే టోర్నీలో ఆనంద్ 2014లో మూడో స్థానంలో నిలిచాడు. -
కార్ల్‌సన్‌కు ఆనంద్ షాక్
రియాద్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన మ్యాజిక్ చూపించాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు షాకిచ్చాడు. బుధవారం ఓపెన్ విభాగంలో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 34 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను చిత్తు చేశాడు. తర్వాత వాంగ్ హావో (చైనా)తో జరిగిన పదో రౌండ్ గేమ్‌ను 23 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. 10 రౌండ్లు ముగిసే సరికి ఆనంద్ 7.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అంతకుముందు పొంక్రటోవ్ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్, మెక్షానే (ఇంగ్లండ్)తో జరిగిన ఏడోరౌండ్ గేమ్, ఫెడసీవ్ (రష్యా)తో జరిగిన ఎనిమిదోరౌండ్ గేమ్‌లను ఆనంద్ డ్రా చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ బుధవారం జరిగిన ఐదు గేముల్లో ఒక మ్యాచ్‌లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకున్నాడు. మమెదేవ్ (అజర్బైజాన్)తో జరిగిన పదోరౌండ్ గేమ్‌ను 51 ఎత్తుల్లో కోల్పోయి 6 పాయింట్లతో 37వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 7 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఆమె రెండు గేముల్లో గెలిచి మరో రెండింటినీ డ్రా చేసుకుంది. ఎనిమిదో రౌండ్లో రష్యన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైంది. -
ఆనంద్, హారిక శుభారంభం
ఐసల్ ఆఫ్ మ్యాన్ (యూకే): ఐసల్ ఆఫ్ మ్యాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు విశ్వనాథన్ ఆనంద్, ద్రోణవల్లి హారిక శుభారంభం చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన తొలిరౌండ్ గేమ్‌లో తెలుగమ్మాయి ప్రపంచ నెం. 10 ర్యాంకర్ హారిక... ఇంగ్లండ్‌కు చెందిన ఒయామా అకిటోను ఓడించింది. మరోవైపు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన తొలి గేమ్‌ను 46 ఎత్తుల్లో మార్క్ ఎస్సర్మెన్ (అమెరికా)పై గెలుపొం దాడు. ఇద్దరూ కూడా తెల్లపావులతో ఆడి ప్రత్యర్థులపై గెలిచారు. రెండో గేములో ఆనంద్ జర్మనీకి చెందిన లాంపర్ట్ జొనాస్‌తో, హారిక జర్మన్ ఫిడే మాస్టర్ బాబర్ మైకేల్‌తో ఆడుతుంది. -
ఆనంద్, హరికృష్ణలపైనే దృష్టి
నేటి నుంచి ప్రపంచకప్ చెస్ టోర్నీ తిబిలిసి (జార్జియా): వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత పొందడమే లక్ష్యంగా ఆదివారం మొదలయ్యే పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ బరిలోకి దిగనున్నారు. 128 మంది మేటి క్రీడాకారులు పాల్గొంటున్న ఈ నాకౌట్ టోర్నమెంట్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధిస్తారు. తొలి రౌండ్లో తియాన్ లి యో (మలేసియా)తో విశ్వనాథన్ ఆనంద్; యూరీ గొంజాలెజ్ విడాల్ (క్యూబా)తో హరికృష్ణ తలపడతారు. ప్రతి రౌండ్లో రెండు గేమ్‌లు జరుగుతాయి. ఎక్కువ పాయింట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ స్కోరు సమమైతే టైబ్రేక్ గేమ్‌ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఆనంద్, హరికృష్ణలతోపాటు భారత్ నుంచి విదిత్ సంతోష్ గుజరాతి, ఆదిబన్, దీప్ సేన్‌గుప్తా, సేతురామన్, కార్తికేయన్ మురళీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. క్యాండిడేట్స్ టోర్నీ ద్వారా ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తలపడే ప్రత్యర్థిని నిర్ణయిస్తారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రుస్లాన్ పొనోమరియోవ్ (ఉక్రెయిన్)తో సేతురామన్; వలేజో పోన్స్ (స్పెయిన్)తో కార్తికేయన్ మురళి; ఎన్గుయెన్ త్రుయోంగ్ సన్ (వియత్నాం)తో ఆదిబన్; వాంగ్ హావో (చైనా)తో దీప్ సేన్ గుప్తా; డెల్గాడో (పరాగ్వే)తో విదిత్ తలపడతారు. ఎనిమిది సార్లు ప్రపంచకప్ జరగ్గా... భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్ రెండుసార్లు (2000లో, 2002లో) విజేతగా నిలిచాడు. 15 ఏళ్ల తర్వాత ఆనంద్ మరోసారి ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతుండటం విశేషం. -
స్నేహం విలువ...
ఆనంద్, కావ్యశ్రీ, అంజలి, ‘జబర్దస్త్’ ఆది, ‘షేకింగ్’ శేషు ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘నేటి ఆకలిరాజ్యం’. శ్రీభాగ్య దర్శకత్వంలో మంజులా భాగ్యలక్ష్మి, ఎమ్.శ్యామల సంయుక్తంగా నిర్మించనున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కృషి, పట్టుదల, ఏకాగ్రతలతో తాము అనుకున్న లక్ష్యాన్ని యువత ఎలా సాధించగలరు? స్నేహ సంబంధాలు మరచిపోయి కేవలం డబ్బే ప్రధానం అనుకుని జీవించే యువతకి నిజమైన స్నేహం విలువ ఏంటి? అనే అంశాలను మా సినిమాలో చూపించనున్నాం. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తాం. ఈ నెలాఖరున చిత్రీకరణ మొదలవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ పినిశెట్టి, మాటలు: మోహన్. -
ఆనంద్ ఖాతాలో రెండో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్విఫీల్డ్ కప్ అంతర్జాతీయ గ్రాండ్ చెస్ టూర్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన రెండో గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో...రెండో రౌండ్ తర్వాత ఆనంద్ ఒక పాయింట్‌తో మరో ఆరుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. -
గిరిజనుల అభివృద్ధికి కృషి
మంత్రి నక్కా ఆనందబాబు చాపరాయి బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ రంపచోడవరం : గిరిజనుల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో బుధవారం చాపరాయి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మారుమూల గ్రామాలకు ఎనిమిది కిలోమీటర్లు మేర అనుసంధాన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. దశల వారీగా నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. చాపరాయి లాంటి సంఘటన పునరావృతం కాకుండా ఇదోక గుణపాఠంగా తీసుకుని అన్ని మారుమూల ఆవాసాలకు అనుసంధాన రోడ్లు నిర్మించేందుకు 8వేల కిలోమీటర్ల మేర గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఒక్కో బాధితుని కుటుంబానికి రూ.5 లక్షలు చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు ఒక్కో సంఘానికి రూ. 2లక్షలు చొప్పున స్త్రీనిధి, బ్యాంకులింకేజీ ద్వారా అందించారు. చాపరాయిలో మంజూరు చేసిన సామాజిక భద్రతా పింఛన్లు వచ్చే నెల నుంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ టీ రత్నబాయి, ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్, ఎంపీపీ కర్రా వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు పల్లాల రవణమ్మ, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాబు రమేష్, ఆర్డీఓ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ నటి కన్నుమూత
అలనాటి బాలీవుడ్ కథానాయిక, సీనియర్ నటి సుమితా సన్యాల్ కన్నుమూశారు. ఆమె వయస్సు 71 సంవత్సరాలు. కోల్‌కతాలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబసభ్యులకు ట్విట్టర్లో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎక్కువగా బెంగాల్ సినిమాల్లో నటించిన సుమిత రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ హీరోలుగా తెరకెక్కిన 'ఆనంద్' సినిమాలో కథానాయికగా నటించి మెప్పించారు. డార్జిలింగ్‌లో జన్మించిన ఆమె అసలు పేరు మంజుల సన్యాల్. ఆమె 50కిపైగా బెంగాల్ సినిమాల్లో నటించారు. హిందీలో గుడీ, మిలీ, ఆశ్విరాద్, మేరే ఆప్నే తదితర సినిమాలు చేశారు. ఎడిటర్ సుబోధ్ రాయ్‌ను పెళ్లాడిన ఆమెకు ఓ కొడుకు ఉన్నారు. -
వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా...
శేఖర్ కమ్ముల, ఆనంద్ సినిమాలో ‘వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా... పాట సందర్భం గురించి వివరించారు. ఈ సినిమాలో కథానాయిక జీవితం విషాదంగా ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. ఒకరోజు బయటి నుంచి ఇంటికి వచ్చేసరికి వాన వస్తుంది. తన కష్టాలన్నీ మర్చిపోయి, చిన్నపిల్లలందరితో కలిసి తాను కూడా పసిపిల్లలా వాళ్లతో వానలో చిందులు వేస్తుంది. అప్పటికి ఇంకా ఆమె ప్రేమలో పడదు. ఆమె ఆడుతూ పాడుతూ ఉండటాన్ని హీరో తదేకంగా పరిశీలిస్తుంటాడు. వానలు పడుతుంటే చదువుకు సెలవు చెప్పి, పిల్లలంతా కాగితపు పడవలు తయారుచేసి, నీళ్లల్లో వదులుతారు. ఎవరి పడవ ఎంత దూరం వెళ్లిందా అని చూస్తుంటారు. ఎవరిదైనా మునిగిపోతే, మిగతా పిల్లలు సంబరపడతారు. ఇది పిల్లల సంబరం. గాలివాన కబడ్డీ ఆడుతుంటే అనే ఎక్స్ప్రెషన్ వేటూరిగారు అద్భుతంగా చేశారు. ఆకాశంలో నుంచి వాన కురుస్తుంటే, ఇంద్రుడు ధనుస్సు సంధించి సప్తవర్ణాలు చిత్రించడం, వాన హోరు జలతరంగంలా ధ్వనించడం...ఇలా ప్రతివారిలోనూ రకరకాల భావోద్వేగాలు బయలుదేరతాయి.జోరున కురుస్తున్న వానతో ఆకాశానికి వాన పందిరి వేసినట్లుగా ఉంటుంది. ఉరుములు ఉరిమి, పిడుగులు పడుతుంటే పసిపాపలు ఉలిక్కిపడుతుంటారు. ప్రకృతి పులకరిస్తుంది. చెట్లన్నీ చిగురుస్తాయి. పచ్చదనాన్ని సంతరించుకుని కనువిందు చేస్తాయి. హిందు స్థానీ రాగ మేళవింపుతో ఈ పాట చేశాను. ఈ పాటలో కథానాయిక జీవితం, అమ్మాయి మనసుని బాగా చూపారు. వానతో వచ్చే మార్పులను, కథానాయిక తన భావోద్వేగాలను అన్వయించుకున్నట్లుగా రాశారు. జీవితంలో చీకటివెలుగులు సహజం. నల్లటి మబ్బులు ప్రయాణిస్తాయి... ఆ తరవాత వెలుగురేకలు వస్తాయి. చల్లటి వర్షపు జల్లులు కురిసి, అందరికీ హాయిని కలిగిస్తాయి. ఇదంతా ప్రకృతిలో అతి సహజంగా జరుగుతుంది. కథానాయిక పక్షిలా స్వేచ్ఛాజీవిలా ఎగురుతున్నట్లు చూపారు ఈ పాటలో. జోరున వాన కురుస్తుంటే ఈ పాటను పాడుకోకుండా ఉండలేరు. – సంభాషణ: డా. వైజయంతి -
ఆనంద్‌కు మరో డ్రా
నార్వేలో జరుగుతున్న ఆల్టీబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్లో ప్రపంచ మాజీ చాంపియన్, భారత ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మరో డ్రా ఎదురైంది. శుక్రవారం లెవోన్ ఆరోనియన్ (ఆర్మేనియా)తో జరిగిన ఏడు రౌండ్ మ్యాచ్‌ను ఆనంద్ డ్రాగా ముగించాడు. ప్రస్తుతం మూడున్నర పాయింట్లతో ఆనంద్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరిదైన ఎనిమిదో రౌండ్లో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో ఆనంద్ తలపడనున్నాడు. -
ఎమ్మెల్యే ఇంటి వద్ద పంచాయితీ.. కత్తిపోట్లు
మహబూబ్‌నగర్: ఇరు వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నిర్వహించిన పంచాయితీ వికటించింది. ఇరువర్గాలు పరస్పరం కత్తులతో పొడుచుకోవడంతో ఇద్దిరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. గత కొంతకాలంగా మున్సీపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ల మధ్య మహబూబ్‌నగర్‌లో వర్గపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజీ కుదిర్చే పనిలో ఇరువర్గాలను శ్రీనివాస్‌గౌడ్ తన ఇంటి వద్ద చర్చకు పిలిచాడు. చర్చకు మున్సిపల్ చైర్పర్సన్ భర్త అమర్, కౌన్సిలర్ ఆనంద్ హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో చర్చలు జరుగుతుండగానే ఇంటి బయట ఇరువర్గాలు కత్తులతో పొడుచుకున్నాయి. ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. -
ఎమ్మెల్యే ఇంటి ముందు కత్తిపోట్ల కలకలం
-
హారికకు ఐదో స్థానం
దోహా: ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ హారిక 10.5 పాయింట్లతో ఐదో స్థానంలో... హంపి 9.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచారు. 17 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అనా ముజిచుక్ (ఉక్రెయిన్–13 పాయింట్లు) విజేతగా నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో సెర్గీ కర్జాకిన్ (రష్యా–16.5 పాయింట్లు) చాంపియన్‌గా అవతరించగా... ఆనంద్ 13 పాయింట్లతో పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
సరుకులు పక్కదారి పట్టకుండా జీపీఎస్ అమలు: ఆనంద్
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల సరుకులు పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల శాఖ కట్టుదిట్టమైన చర్యలకు కసరత్తు చేస్తోంది. రవాణా కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేసింది. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లు, అక్కడ్నుంచి రేషన్ షాపులకు సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం సరుకు రవాణా కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. రోజూ ఎక్కడో ఒకచోట రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, వాటిని అరికట్టడానికి ఇకపై సరుకు రవాణా సక్రమంగా జరిగేలా జీపీఎస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే రైస్‌మిల్లర్లు, రేషన్, కిరోసిన్ డీలర్లు, అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించామని, రవాణా చేసే వారి ప్రమేయం లేకుండా బియ్యం పక్కదారి పట్టే అవకాశం లేదని తేలిందని స్పష్టం చేశారు. సరుకు రవాణా పూర్తరుునప్పటికీ వాహనాలను అధికారుల అనుమతి లేకుండా జిల్లా పరిధి దాటకూడదని సూచించారు. జీపీఎస్‌తో కాంట్రాక్టర్ల తప్పులన్నీ రికార్డు అవుతున్నాయని, ప్రతి వాహనానికి శాశ్వతంగా ఒకే సెల్‌ఫోన్ నంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని, తమ వాహనాలు ఎక్కడ ఉన్నాయో కాంట్రాక్టర్లు తెలుసుకునేలా ప్రత్యేక ఐడీ, పాస్వర్డ్ ఇవ్వనున్నామని కమిషనర్ తెలిపారు. ఇకపై కాంట్రాక్టర్ల లావాదేవీలన్నింటినీ ఆన్లైన్లోనే చేస్తామని స్పష్టం చేశారు. తమ కాంట్రాక్ట్ గడువును గతంలో మాదిరిగా రెండేళ్లకు పెంచాలని కాంట్రాక్టర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తానని కమిషనర్ అన్నారు. -
అప్పటి నుంచి నా సినిమాలు చూడడం మానేశా!
‘‘వైవిధ్యమైన, మంచి చిత్రాల్లో నటిస్తాననే గుర్తింపు వచ్చింది. ప్రేక్షకుల్లో నాకున్న మంచి పేరు నిలబెట్టే చిత్రాలు చేయాలనుకుంటున్నా. సాధారణ కమర్షియల్ చిత్రాల్లో నటించాలంటే భయం, రిస్క్ కూడా. యంగ్ హీరోలు ప్రేక్షకులను ఆకర్షించాలంటే కథలో కొత్తదనం ఉండాల్సిందేనని నా అభిప్రాయం’’ అన్నారు నిఖిల్. ఆయన హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో పి. వెంకటేశ్వరరావు నిర్మించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రేపు రిలీజవుతోంది. నిఖిల్ చెప్పిన విశేషాలు... ఓ సీసాతో మొదలైన కథ, ఆ సీసాతోనే ముగుస్తుంది. అందులో ఏముందనేది సస్పెన్స్. మరణించిన మనిషి 21 గ్రాములు బరువు తగ్గుతాడని సైన్స్ చెబుతోంది. ఆ 21 గ్రాములు ఏమైనట్టు? ఆత్మలు ఉన్నాయా? లేవా?.. ఇలా అంతు చిక్కని అంశాలు బోలెడున్నాయి. హారర్ కామెడీతో కూడిన ఫ్యాంటసీ ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రంలో ‘బాహుబలి’ చిత్రం గ్రాఫిక్ డిజైనర్‌గా కనిపిస్తా. రాజమౌళిగారితో ఫోనులో మాట్లాడే సీన్లు కామెడీగా ఉంటాయి. ఓ కథ అంగీకరించాక దర్శక- నిర్మాతల పనుల్లో జోక్యం చేసుకోను. అవసరమైతే నా ఖర్చుల్లో కోత విధిస్తా. నిర్మాతకు లాభాలొస్తేనే నేను విజయం సాధించి నట్టు. ప్రచార కార్యక్రమాల్లో మాత్రం రాజీపడను. ‘స్వామి రారా’ నుంచి సెంటిమెంట్‌గా నా చిత్రాల్ని చూడడం మానేశా. ఈ చిత్రాన్ని చూడలేదు. చూసినోళ్లంతా బాగుందన్నారు. ఫెయిల్యూర్స్ సహజమే. అయితే, ఎవరి ఒత్తిడి వల్లో సినిమా లు చేయకూడదనేది ‘శంకరాభరణం’తో అర్థమైంది. ప్రస్తుతం ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నా. చందూ మొండేటి ‘కార్తికేయ-2’ స్క్రిప్ట్ రెడీ చేశాడు. -
నటి సబర్న మృతి కేసులో పురోగతి
చెన్నై: ప్రముఖ తమిళ టీవీ, సినీనటి సబర్న, అలియాస్ సుగుణ మృతి కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. పరారీలో ఉన్న ఆమె భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై మదురవాయిల్‌లోని ఒక అపార్టుమెంట్లో ఇటీవల సబర్న అనుమానాస్పద స్థితిలో మతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలా ఉండగా ఆమె ఉత్తరాది సినీ రంగానికి చెందిన వ్యక్తిని ప్రేమించినట్టు తెలిసింది. ఏడాది క్రితం వీరు రహస్య వివాహం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కారణంగానే ఆమె తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటుందని, గత రెండు నెలలుగా సపర్నను చూసేందుకు భర్త రాలేదని పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా సపర్న ఇబ్బందులు పడ్డారని, భర్తతో సెల్ఫోన్లో మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. ఇలాఉండగా ఆమె మృతికి ముందురోజు భర్త సవర్నను చూసేందుకు వచ్చినట్టు తెలిసింది. అతను తిరిగి వెళుతున్న సమయంలో తనతోనే ఉండాలని ఆమె బెదిరించిందని, అంతేగాకుండా కత్తి తీసుకుని చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో పోలీసులకు అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. ఆమె భర్త సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో సవర్నను హత్య చేసి ఆధారాలను నాశనం చేసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సపర్ణ మృతి తర్వాత ఇంతవరకు భర్త వచ్చి చూడకపోవడం గమనార్హం. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా ఉడుంబలై పట్టైకు చెందిన సబర్న తల్లి పుష్పలత, తండ్రి ఆనంద్ కుమార్, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటుండంగా ఆమె ఒంటిరిగా ఉంటోంది. ఒక మ్యూజిక్ ఛానల్ లో టీవీ వ్యాఖ్యాత, యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన సబర్న ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో నటించారు. పూజై, కుదిరసు, కలై లాంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. -
ప్రముఖ టీవీ నటి అనుమానాస్పద మృతి
చెన్నై: ప్రముఖ తమిళ టీవీ, సినీనటి సబర్న, అలియాస్ సుగుణ (29)అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మరణించారు. ప్రాథమికంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నప్పటికీ మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. విలక్షణ పాత్రలతో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సబర్న ఆకస్మిక మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాజధాని చెన్నై, సీమతమాన్ నగర్ లో నివాసంలో మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపులు మూసివేసి వుండడం, దుర్వాసన వస్తుండడడంలో పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. అన్నాసాగర్ డిప్యూటీ పోలిస్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తలపై తీవ్రమైన గాయం, మృతదేహం కుళ్లిపోయివుండడంపై పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె మూడు రోజుల క్రితమే చనిపోయి వుంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఉడుంబలై పట్టైకు చెందిన సబర్న తల్లి పుష్పలత, తండ్రి ఆనంద్ కుమార్, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటుండంగా ఆమె ఒంటిరిగా ఉంటోంది. ఒక మ్యూజిక్ ఛానల్ లో టీవీ వ్యాఖ్యాత, యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన సబర్న ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో నటించారు. పూజై, కుదిరసు, కలై లాంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. -
ఈ గ్యాంగ్ మాస్ గురూ...
నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్స్‌గా పలు విజయవంతమైన చిత్రాలు అందించినవేలాయుధం అండ్ బ్రదర్స్‌లో ఒకరి వారసుడు అయిన బాలాజీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. యాషిక పిక్చర్స్ ద్వారా ఇండియాలో సినిమాలు విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇంగ్లీష్ మూవీ ‘బ్లాక్ అండ్ వైట్ ది డాన్ ఆఫ్ అస్సాల్ట్’ను ‘మాస్ గ్యాంగ్’ పేరుతో తెలుగులో ఈ నెలలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను, పోస్టర్స్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ- ‘‘యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం నచ్చేలా ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. యాషిక పిక్చర్స్ భాగస్వాములు ఆనంద్, నటరాజన్ పాల్గొన్నారు. -
నిజాం కళాశాలలో విద్యార్థుల ఘర్షణ
నిజాం కళాశాలలో గురువారం మధ్యాహ్నం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహ్మాన్ చాంబర్ వద్ద ఇరు వర్గాల విద్యార్థులు ఘర్షణకు దిగారు. గిరిజన విద్యార్ధులపై దాడులకు పాల్పడిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పలు విద్యార్ధి సంఘాల నాయకులు ప్రిన్సిపల్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగాఏబీవీపీ నిజాం కళాశాల యూనిట్ అధ్యక్షులు బంగ్ల చైతన్య, పీడీఎస్‌యూ నేత ఆనంద్ తదితరులు మాట్లాడారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కనక లింగేశ్వర్ అగ్రవర్ణ అహంకారంతో దళితులపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. కళాశాలకు సంబంధం లేని బయటి వ్యక్తులు ప్రిన్సిపల్ ఎదుటే సహచర విద్యార్ధులపై దాడులకు పాల్పడుతుండడం కళాశాలలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమైతోందని అన్నారు. కాగా, పలు విద్యార్ధి సంఘాల నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కనక లింగేశ్వర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
భావవ్యక్తీకరణ లేకే ఉద్యోగ సాధనలో విఫలం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : భావవ్యక్తీకరణ లేనందువల్లే చాలామంది ఉద్యోగాలు సాధించలేక నిరుద్యోగులుగా ఉండిపోతున్నారని శ్రీ సాయిగురు రాఘవేంద్ర బ్యాకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ పి.దస్తగిరి అన్నారు. ‘బ్యాంకు ఉద్యోగాలు సాధించడమెలా’ అనే అంశంపై స్థానిక ఆనంద్ రీజెన్సీలో మంగళవారం నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఆంగ్లభాషపై పట్టుసాధించాలన్నారు. భావవ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరు బ్యాంకర్ కావాలనే లక్ష్యంతో ప్రతి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు హాజరైన నిరుద్యోగులకు ఆఫ్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తూ పోటీ పరీక్షలకు కావాల్సిన ఉచిత మెటీరియల్, డీవీడీలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ తమద్వారా దేశవ్యాప్తంగా 21 వేల మంది ఉద్యోగాలు సాధించారన్నారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ కో డైరెక్టర్ పి.పేక్షావలిరెడ్డి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
స్నే‘కింగ్’ ఆనంద్
పేరు : ఆనంద్ ఉంటున్నందిః సింధియాలోని న్యూకాలనీ వత్తిః చిరు వ్యాపారి ( తోపుడు బండిపై ఇడ్లీ అమ్ముతాడు) ప్రవత్తి పాములు పట్టడం సెల్ నంబర్ 98490 23527 పాములను చూస్తే అందరూ భయపడతారు. ఎక్కడ కాటు వేస్తుందోనని పరుగులు తీస్తారు. ఆనంద్ మాత్రం వాటితో ఆడుకుంటాడు. చాకచక్యంగా పట్టుకుంటాడు. పట్నాల ఆనంద్ సింధియా,న్యూకాలనీలో ఉంటున్నాడు. అందరిలాగే ఆనంద్‌కు సర్పాలంటే చిన్నతనంలో భయమే.అయితే 15 సంవత్సారల క్రితం న్యూకాలనీలో బుజ్జి అనే పదేళ్ల బాలుడ్ని కొండచిలువ చుట్టేసి కలవరం సష్టించింది. అక్కడ వారంతా భయంతో దూరంగా జరిగారే తప్పా బాలుడ్ని రక్షించే సాహసం చేయలేదు. ఆ సమయంలో ఆనంద్ ధైర్యం చేసి ఆ కొండచిలువను బలంగా లాగి దూరంగా విసిరేసి ఆ బాలుని రక్షించాడు. అదేlమాదిరిగా స్నేహితులతో యారాడ వెళ్లినప్పుడు ఓ విషసర్పం వీరిపై దూసుకు వస్తుంటే ఆనంద్ ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ సర్పాన్ని బంధించి కొండపై విడిచిపెట్టాడు. అప్పట్నించీ ఆనంద్ పాముల ఆనంద్‌గా మారిపోయాడు. ఇంతవరకూ రెండు వేల వరకూ వివిధ రకాల పాములను పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. ఆనంద్ ధైర్యాన్ని చూసి ఇండియన్ నేవి,షిప్‌యార్డ్ తదితర పరిశ్రమల వారు ఆయా ప్రాంతాల్లో సర్పాలు సంచరిస్తే ఫోన్ చేస్తారు. నెలకు కొంతమొత్తాన్ని ఇస్తారు. చిన్న టిఫిన్దుకాణం నడుపుకుంటూ బతుకుతున్నాడు. ఎవరైనా ఫోన్ చేస్తే తక్షణం స్పందించి పాములు పడతాడు. –మల్కాపురం -
ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఉబర్ డ్రైవర్!
బెంగళూరు: నగరానికి చెందిన శ్రీకాంత్ సింగ్ ఓ ఐటీ కంపెనీలో మేనేజర్. ఈ నెల 2వ తేదీన ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల అర్ధరాత్రి ఇంటికి వెళ్లాల్సివచ్చింది. దాంతో ఉబర్ క్యాబ్ ను బుక్ చేశాడు. కొద్దిసేపటికి ఆఫీసు బయటకు వచ్చిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఆనంద్.. శ్రీకాంత్ తో జరిపిన సంభాషణ ఆయనలో స్పూర్తి నింపినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సంభాషణ ఆనంద్ : 'హాయ్ సార్! హో ఆర్ యూ?' అంటూ సూపర్బ్ ఫ్లూయంట్ ఇంగ్లీష్ తో పలకరించాడు. శ్రీకాంత్ : కొంచెం ఆశ్చర్యపోయిన శ్రీకాంత్, ఐయామ్ గుడ్ థాంక్యూ సార్. కారులోకి ఎక్కిన శ్రీకాంత్ కు ఆఫీసు నుంచి కొన్ని కాల్స్ రావడంతో కొంతసేపు మాట్లాడారు. ఆ తర్వాత సీటు కుదురకుని కూర్చున్నారు. ఆనంద్ : ఇంకెతకాలం ఈ-కామర్స్ రంగం హవా నడుస్తుందని అడిగారు. శ్రీకాంత్ : ఇంకొంచెం ఆశ్చర్యపోయి, తెలీదు సార్. దానికంటే ముఖ్యమైన విషయాలు తనకు చాలా ఉన్నాయి అన్నారు. సార్.. మిమ్మల్ని చూస్తోంటే మామూలు ఉబర్ డ్రైవర్ లా కనిపించడం లేదు అని అడిగారు. ఆనంద్ : అందుకు స్పందిస్తూ.. తాను ఐఐటీ-కే నుంచి 1986లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, గత ముఫ్పై ఏళ్లుగా అమెరికా, భారత్ లలో పనిచేశానని చెప్పారు. ప్రస్తుతం కొత్తగా ఏదైనా సంస్థను ప్రారంభించాలనే ఉద్దేశంతో యాభై కార్లను ఉబర్ కింద నగరంలో నడుపుతున్నట్లు వివరించారు. శ్రీకాంత్ : ఆ మాటలు విని అయితే, మీరు ఇప్పుడు కారు ఎందుకు నడుపుతున్నారని అడిగారు. ఆనంద్ : కొన్ని రోజుల క్రితం తాను నడుపుతున్న కారుకు యాక్సిడెంట్ అయిందని, ఆ ప్రమాదంలో కారు డ్రైవర్ మరణించినట్లు చెప్పారు. డ్రైవర్ కుటుంబ తన నుంచి డబ్బు తీసుకోకపోవడానికి ఇష్టం చూపకపోవడంతో, తానే కారును నడపి ఆ డబ్బును వారికి పంపుతున్నట్లు వివరించారు. ఈ సంభాషణ తన జీవితంలో ఎన్నటికీ మరచిపోలేనిదనీ.. అందుకే దానిని మిత్రులతో పంచుకున్నట్లు శ్రీకాంత్ చేసిన పోస్టులో పేర్కొన్నారు. కాగా, దాదాపు 75,000 మంది ఈ పోస్టును ఇష్టపడగా, 10,000 మందికి పైగా షేర్ చేశారు. -
బస్సు ఢీకొని యువకుడి మృతి
శంషాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి-గొల్లపల్లి రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు చనిపోయాడు. గొల్లపల్లి గ్రామానికి చెందిన డి.ఆనంద్(22) తన బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై నుంచి ఎగిరి కిందపడిన ఆనంద్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. -
ఆ నలుగురి మధ్య..
ముగ్గురు యువకులు, ఓ యువతి మధ్య ప్రేమకథ -‘నిన్నే కోరుకుంటా’. సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక ముఖ్య తారలు. గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణవ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా నిర్మాతలు మల్కాపురం శివకుమార్, రామ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ముందుచూపుంటే మేలు!
ఆత్మబంధువు మిత్ర, మైత్రి ఆనంద్‌తో కలిసి టీవీ చూస్తున్నారు. ‘‘మీ నాన్నకు మీరు తోడు చేరారా? వెళ్లి చదువుకోండి’’ అని అరిచింది రేఖ.‘‘పర్లేదులేవోయ్, కాసేపు చూడనియ్’’ అన్నాడు ఆనంద్.‘‘మీకంటే పనీపాటా లేదు. వాళ్లను కూడా చెడకొడతారెందుకు?’’ అంది చిరుకోపంగా.‘‘ఔనోయ్, నాకేం పనీపాటా లేదు. నా పిల్లలకు ఇప్పుడేం పరీక్షలు లేవు. అందుకే చూస్తున్నాం. తప్పేంటి?’’ ‘‘కదా నాన్నా’’ అంటూ పిల్లలిద్దరూ వంత పాడారు. ‘‘కావాలంటే మీరు చూడండి. వాళ్లను చెడగొట్టమాకండి’’ అని గద్దించింది రేఖ. ‘‘ప్లీజ్ మమ్మీ... కార్టూన్ చానలేగా. పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా లేవు’’ అంటూ బతిమలాడారు పిల్లలు. ‘‘టీవీలో ఏ రోజు ఎపిసోడ్ ఆ రోజు చూసినట్లే, క్లాసులో చెప్పిన పాఠాలు ఏ రోజువి ఆ రోజే చదువుకుంటే బావుం టుంది.. లేవండి’’ అంటూ ఇద్దరినీ టీవీ ముందు నుంచి లేపేసింది. వాళ్లతో కాసేపు మాట్లాడి చక్కగా చదువుకునేలా చేసింది.ఊర్నుంచి రేఖ అమ్మానాన్న వచ్చారు. వాళ్లని అల్లుకుపోయారు మిత్ర, మైత్రి. ‘‘ఎలా ఉన్నార్రా?’’ అంటూ ముద్దు చేశారిద్దరూ. ఇంతలో ఆనంద్ వచ్చాడు. అత్తా మామల యోగక్షేమాలు కనుక్కున్నాడు. ‘‘రాక రాక వచ్చారు. నాల్రోజులుండి సిటీ అంతా చూసి వెళ్లండి’’ అని చెప్పాడు. ‘‘హాయ్ హాయ్.. అయితే అమ్మమ్మా, తాతయ్యలతో మేమూ వెళ్తాం. దగ్గరుండి అన్నీ చూపిస్తాం’’ అన్నారు పిల్లలిద్దరూ. ‘‘మరి మీ స్కూల్?’’ అడిగాడు ఆనంద్. ‘పర్లేదులే బాబూ.. రెండ్రోజులేగా. వాళ్లూ సంతోషిస్తారు’’ అన్నాడు రేఖ తండ్రి ఈశ్వర్. తర్వాత రెండు మూడు రోజులూ పిల్లలు అమ్మమ్మ, తాతయ్యలతో హైదరాబాద్ సిటీ అంతా తిరిగారు. ఆ తర్వాత మరో రెండ్రోజులు బంధువుల ఇళ్లకు. వారం రోజులు మనుమడూ, మనమరాలితో సరదాగా గడిపాక ఆనందంగా ఊరెళ్లారు. ‘‘రేఖా.. రేఖా...’’ బాధగా పిలిచింది రత్నమాంబ. ఆవిడ గొంతులో తేడాను గమనించి పరుగున వచ్చింది రేఖ. రత్నమాంబ గుండె పట్టుకుని పడిపోయింది. రేఖ గాభరా పడి పోయింది. ఆంబులెన్స్‌కు, ఆనంద్‌కు ఫోన్‌చేసింది. 108 వచ్చి రత్నమాంబను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆనంద్ కూడా వచ్చేశాడు. రత్నమాంబకు గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ చేశారు. రేఖ, ఆనంద్‌లకు హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరి పోయింది. పిల్లల గురించి పట్టించు కోవడం సాధ్యం కాలేదు. రోజూ ఉదయం వాళ్లకు ఏదో క్యారేజీ పెట్టి పంపించామా, రాత్రి వండి పెట్టామా అన్నట్లుగా తయా రైంది వాతావరణం. నాన్నమ్మ అనా రోగ్యం, అమ్మానాన్నల ఆందోళన పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. నెల రోజులకు రత్నమాంబ ఆరోగ్యం కుదుటపడింది. ఇంటికి తీసు కొచ్చారు. అయినా ఆమెను శ్రద్ధగా చూసుకోవాలి. మరో నెలరోజులు అలా గడిచిపోయాయి. ఇంతలో పిల్లలకు పరీక్షలు వచ్చేశాయి. అయినా వాళ్ల దగ్గర కూర్చుని చదివించేంత తీరిక లేకపోయింది రేఖకు. వాళ్లే చదువుకుని పరీక్షలు రాసి వచ్చారు. వారం రోజులకు రిజల్ట్స్ వచ్చాయి. ఆశ్చర్యం... ఇద్దరూ క్లాస్ ఫస్ట్ వచ్చారు. అదెలా సాధ్యమైందో అర్థం కాలేదు ఆనంద్‌కు. ‘‘రేఖా.. నువ్వు చదివించకపోయినా నా పిల్లలు ఫస్ట్ వచ్చారు చూశావా?’’ అన్నాడు. ‘నేను చదివించకుండానే వచ్చారు మరి’’ అంది రేఖ.‘నువ్వెప్పుడు చదివించావోయ్?’’‘‘వాళ్లనే అడగండి.’’పిల్లల్ని అడిగాడు ఆనంద్. ‘‘అమ్మమ్మ తాతయ్య రాకముందే అన్నీ చదిశాం నాన్నా. ఇప్పుడు జస్ట్ రివైజ్ చేసుకున్నా మంతే’’ అని చెప్పారు మిత్ర, మైత్రి.‘‘నీకు చాలా ముందు చూపుం దోయ్!’’ అంటూ రేఖను ప్రశంసించాడు.‘‘ముందు చూపని కాదు సార్. ఏ రోజెలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. తప్పకుండా చేయాల్సిన పనులు కాస్తంత ముందుగా చేసుకుంటే ఆ తర్వాత కుదరకపోయినా ప్రాబ్లమ్ ఉండదనీ.’’‘‘నేను చెప్పేదీ అదేనోయ్!’’ అన్నాడు ఆనంద్ నవ్వుతూ. - డా విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
సర్పాలతో చెలిమి
మల్కాపురం : సాధారణంగా ఎవరైనా సర్పాన్ని చూస్తే భయంతో గజగజలాడతారు. కానీ ఓ తండ్రి, కొడుకు మాత్రం వాటితో స్నేహంగా మెలుగుతూ, వాటిని మెడలో పెట్టుకొని ఆడిస్తుంటారు. తండ్రి ఆనంద్ అయితే...కొడుకు దేవానంద్.. పాములను పట్టడంలో ఇద్దరూ ఇద్దరే. పాములతో వారి చెలిమి ఎలా మొదలైందంటే... 15 ఎళ్ల క్రితం కాలనీలో పది అడుగుల కొండచిలువ ఆరేళ్ల కుర్రాడిని చుట్టేసి బంధించడంతో ఆ కుర్రాడు ప్రాణరక్షణ కోసం విలవిలాడుతూ కేకలు వేశాడు. అప్పుడా దృశ్యాన్ని చూసిన స్థానికులు అతన్ని రక్షించే సాహసం చేయలేదు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఆనంద్ అనే వ్యక్తి ధైర్యం చేసి కొండచిలువ పట్టు నుంచి బాలుడిని విడిపించాడు. తరువాత కొంతకాలానికి ఇదే కాలనీలో ఓ ఇంటిలోకి విషసర్పం చొరబడింది. ఆ ఇంటి వారిని భయబ్రాంతులకు గురిచేసింది. అప్పుడు కూడా ఆనంద్ ధైర్యం చేసి విష సర్పాన్ని బంధించి ఆ ఇంటి వారిని రక్షించాడు. దీంతో ఆనంద్ పేరు స్థానికుల్లో మార్మోగిపోయింది. నాటినుంచి పట్నాల ఆనంద్ కాస్తా పాముల ఆనంద్‌గా మారాడు. అప్పటి నుంచి పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడ విషసర్పాల అలజడి కనిపించినా సాయం కోరుతూ ఆనంద్‌కు సమాచారం వెళుతుంది. ఇలా ఇప్పటి వరకూ దాదాపు మూడు వేల వివిధ రకాల సర్పాలను బంధించి బాధితులకు అండగా నిలిచాడు. సింధియా, న్యూకాలనీ ప్రాంతంలో పట్నాల ఆనంద్ ఉంటున్నాడు. అతనికి ఓ కొడుకున్నాడు పేరు దేవానంద్. వయసు పదేళ్లు. ఏడాది క్రితం ఓ ఇంట్లో ఆరడుగుల పాము చొరబడి అక్కడి వారిని కలవర పరిచింది. ఆ సమయంలో ఆనంద్ ఇంట్లో లేడు. కానీ దేవానంద్ ఉన్నాడు. నేనున్నానంటూ ఆ ఇంట్లోకి వెళ్లి పామును పట్టేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. తండ్రిని మించిన ఘనుడంటూ కితాబులిచ్చారు. -
ప్రసవ ఆవేదన
తొమ్మిదినెలలు మోసి పేగు తెగగానే బంధం తెగితుందా? జీవితం నడవడానికి కొంచెం డబ్బు రావచ్చుకానీ... పుట్టిన బిడ్డ నడవకముందే వదులుకోవడం ఎంత వేదన?మహిళకున్న కష్టాల గురించిపుటలు పుటలు రాస్తున్నా కొత్త కష్టాలుపుట్టుకొస్తూనే ఉన్నాయ్!ఇదంతా డబ్బుకోసమే చేస్తున్నా స్త్రీ తనకోసం చేసుకోవడం లేదుతన కుటుంబం కోసమో..బంధువుల కోసమోకడుపును అద్దెకిచ్చిపేగు బంధాన్నే త్యజించిఒక ఫ్యాక్టరీగా మారిందిప్రసవ వేదన గురించి విన్నాం..ప్రసవం తర్వాత ఉండే వేదన గురించీ విన్నాం..కానీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మూత పడ్తుందేమోనన్న ఆవేదన గురించి వింటున్నాం! ఆనంద్... మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా! గుజరాత్ నుంచి పొంగే పాలధార. క్షీర విప్లవం వల్ల కళకళలాడిన ఊరు. అయితే అది ఇంకొకందుకు కూడా ఖ్యాతి గాంచింది. సరోగసీకి. అవును... అక్కడ నిత్యం పసిపిల్లల కేర్‌కేర్‌మనే ఏడుపులు వినిపిస్తాయి. వారిని ఒడిలోకి తీసుకున్న తల్లిదండ్రుల ఆనందబాష్పాలు కనిపిస్తాయి. ఆ ఆనందబాష్పాలకు వెల నిర్ణయించి స్థిరపడిన జీవితాలు కూడా కనిపిస్తాయి. అద్దె గర్భాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆనంద్ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ దేశంలోని అమ్మలు తమ గర్భాన్ని విదేశీ జంటలకు అద్దెకివ్వడానికి వీల్లేదు అనే ఆ తీర్పు మీద చర్చ జరుగుతున్న దరిమిలా ఆనంద్ అమ్మల ఆలోచనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బేబీ ఫ్యాక్టరీస్ అహ్మాదాబాద్ నుంచి వదోదరా వెళుతుంటే మార్గమధ్యంలో కనిపించే ఆనంద్ గత పదేళ్ల నుంచి సంతానలేమితో బాధపడ్తున్న భార్యభర్తలకు బిడ్డల్నిచ్చే కర్మాగారాల నెలవుగా మారింది. ఇక్కడి మెటర్నీటీ నర్సింగ్‌హోమ్స్ అన్నీ సరోగసీ సెంటర్సే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆనంద్‌ను సిటీ ఆఫ్ బేబీ ఫ్యాక్టరీస్ అని కూడా అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద సరోగసీ కేంద్రం ఇది. ఈ ఊళ్లోని ఒక్క ఆకాంక్ష ఇన్ఫెర్టిలిటీ క్లినిక్కే ఇప్పటి వరకు వెయ్యిమంది సరోగసీ బిడ్డలకు పురుడు పోసిందంటే అదేం చిన్న సంఖ్య కాదు. ఈ క్లినిక్‌లో వారానికి ఇద్దరు సరోగసీ బిడ్డలు కేర్మంటున్నారంటే సరోగసికి ఉన్న డిమాండ్ అర్థం అవుతుంది. ఇక్కడ యేడాదికి 13 వందల కోట్ల పై చిలుకు వ్యాపారం జరుగుతోంది కనుకనే దీనిని ‘సరోగసీ ఇండస్ట్రీ’ అని సగౌరవంగా పిలుస్తున్నారు. భారతదేశం నుంచే కాదు నైజీరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్ పొరుగునే ఉన్న పాకిస్తాన్ జంటలు కూడా ఆనంద్‌కు చేరుకుంటుంటాయి. వేలమందికి ఉపాధి ఆనంద్‌లో వెయ్యిమంది సరోగసీ మదర్స్ ఉన్నారని అంచనా. ఆరోగ్యాన్ని బట్టి, రూపాన్ని బట్టి, ఎదుటి వారి అవసరాన్ని బట్టి ఒక్కో అమ్మ తన గర్భాన్ని అద్దెకివ్వడానికి నాలుగు నుంచి పదకొండు లక్షలు చార్జ్ చేస్తోంది. హ్యుమన్‌రైట్స్ కమిషన్ ఫ్యాక్ట్ ఫైండింగ్‌లో ఇలాంటి విశేషాలు అనేకం తెలిశాయి. బీనా అనే 34 ఏళ్ల సరోగసీ మదర్ తన గర్భాన్ని అద్దెకు ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో మంచి ఇల్లు కట్టుకుందట. కొడుకుని ఇంజనీరింగ్ చదివించిందట. భర్తకు రద్దీ చోట మంచి హోటల్ పెట్టించిందట. అంతే కాదు సరోగసీ వల్ల తనకు కలిగిన లాభాన్ని మరో ఇద్దరు పేద మహిళలకు వివరించి వారికి కూడా సరోగసీ ద్వారా ఉపాధి చూపించిందట. రాంజుది కూడా అలాంటి పరిస్థితే. ఆమె వయసు 32 ఏళ్లు. ఒక అగ్ని ప్రమాదంలో రాంజు భర్త గాయపడ్డాడు. ఆపరేషన్ కోసం పెద్దమొత్తంలోనే డబ్బులు కావాల్సి వచ్చింది. కూలీనాలీ చేసుకునే జీవితాలకు అంత డబ్బు అప్పుగా దొరకడం కల్లే కనుక ఎవరో చెప్తే విని సరోగసీ మదర్‌గా ఉండడానికి తన పేరును రిజిస్టర్ చేయించుకుంది. ఒక కెనడియన్ జంటకు బిడ్డను కనిచ్చింది. అప్పటికే ఒక బిడ్డ తల్లి అయిన రాంజుకి ఈ ఒప్పందం ద్వారా ఎనిమిది లక్షలు వచ్చాయి. భర్తకు ఆపరేషన్ చేయించడమే కాక మిగిలిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంది. తర్వాత రెండో విడతలో జర్మనీ జంటకు బిడ్డకు కనిచ్చింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో భర్తకు ఆటో కొనిపెట్టి తానూ ఓ బడ్డీ కొట్టు పెట్టుకుంది. కొడుకును పె చదువులకు ముంబై పంపించింది. సరోగసీ ద్వారా ఆర్థికంగా బలపడ్డ కుటుంబాలెన్నో కనిపిస్తాయ్ ఆనంద్‌లో. ఇతర వ్యాపారాలు పిల్లల కోసం యేడాదికి రెండువందల విదేశీ జంటలు ఆనంద్‌కు చేరుకుంటాయి. కనీసం ఆర్నెల్ల దాకా బస చేసే ఈ జంటల వల్ల అక్కడి ఆసుపత్రులు, సరోగసీ సెంటర్సే కాదు... ఎయిర్పోర్ట్ నుంచి ఆనంద్‌కు తీసుకొచ్చే ట్రావెల్ ఏజెన్సీలకు, వాళ్లకు వసతి కల్పించే హోటళ్లకు, ఆయా దేశ వాసులకు వాళ్ల ఆహారాన్ని వండిపెట్టే రెస్టారెంట్లకు, గుజరాతీ థాలీ రుచులను చూపించే గుజరాతీ కిచెన్లకు, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్‌ను అందించే స్టోర్స్‌కు, డైపర్స్ నుంచి మల్టీవిటమిన్ డ్రాప్స్ దాకా ఫారిన్ కంపెనీల మందులను అమ్మే మెడికల్ షాప్స్‌కు, ఇంగ్లిష్ మాట్లాడే స్థానికులకు ఉపాధి దొరుకుతోంది. గుజరాత్ టూరిజం డిపార్ట్మెంట్ ఖజానా నిండుతోంది. నిజానికి ఆనంద్ శాకాహార రెస్టారెంట్లకు పేరు. కాని సరోగసీ సంతానం కోసం వస్తున్న విదేశీయుల కోసం నాన్‌వెజ్ రెస్టారెంట్ల డిమాండ్ ఏర్పడింది. అవి తెరవక తప్పలేదు. అన్నిటికీ మించి విదేశీ జంటలకు, సరోగసీ మదర్స్‌కు మధ్య లీగల్ అగ్రీమెంట్స్ కుదర్చడం లాయర్లకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. సుప్రీంకోర్టు ప్రస్తుత తీర్పుతో వీరందరి ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉందని అంటున్నారు మార్కెట్ అనలిస్ట్‌లు. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా సరోగసీ మదర్స్ మాత్రం ‘సరోగసీకి మేం ఇష్టపడే ఒప్పుకున్నాం. తొమ్మిది నెలల్లో మంది సంపాదననిచ్చే మార్గం ఇది. కోర్టు తీర్పు వల్ల విదేశీయులు రాకపోవచ్చట. వాళ్లు ఇచ్చినంత డబ్బులు మన వాళ్లు ఇవ్వరు. మాకైతే సంపాదన పోయినట్టే. మళ్లీ కూలీనాలీ అంటే కష్టమే’ అని వాపోతున్నారు.. - సాక్షి ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల ఆనంద్ దేశంలో సరోగసీకి గుజరాత్ తర్వాత తెలుగు రాష్ట్రాలే ప్రధాన కేంద్రాలు. ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్ ఈ విషయంలో ముందంజలో ఉంది. విదేశీ జంటల దృష్టి ఇంకా పడకపోయినా ప్రవాస భారతీయ జంటల సంతాన సాఫల్య కేంద్రంగా ఇది ప్రచారం పొందుతోంది. గత అయిదేళ్లలో 100 మందికి పైగా సరోగసీ బిడ్డలకు ఈ నగరం జన్మనిచ్చింది. ఇక్కడి సరోగసి మదర్ కూడా 5 నుంచి 10 లక్షల వరకు డబ్బులను డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. సరోగసీ వల్ల ఆనంద్ లాంటి మౌలిక సదుపాయాలు, వ్యాపారం ఇక్కడ పెరగకపోయినా, సరోగసీ మదర్స్‌ను కంటికి రెప్పలా కాపాడే అత్యంతాధునిక వైద్యసదుపాయాలున్న ఆసుపత్రులు, సకల సౌకర్యాలున్న హాస్టల్స్, లైబ్రరీలు, వీడియో లైబ్రరీలు వెలుస్తున్నాయి. ప్రవాస జంటలు తమ బిడ్డ ఉన్న సరోగసీ మదర్‌కు ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనే విషయంలో శ్రద్ధ చూపుతుండటం వల్ల డైటీషీయన్లకూ డిమాండ్ పెరుగుతోంది. ప్రవాస భారతీయ జంటలకు గర్భం అద్దెకివ్వచ్చు అన్న వెసులుబాటు సుప్రీం కోర్టు ఇచ్చింది కాబట్టి ఆనంద్‌కు ఉన్న గిరాకీ ఇక మీద కరీంనగర్‌కు మారవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్‌లోని సంతాన సాఫల్యకేంద్రాల్లోని గైనకాలజిస్ట్లు. -
దెయ్యం.. అబ్బాయిని ప్రేమిస్తే!
వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నిఖిల్ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమాకు రెడీ అయిపోతున్నాడు. ప్రస్తుతం శంకరాభరణం షూటింగ్లో బిజీగా ఉన్న నిఖిల్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయనున్నాడు. ఇటీవల పవర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఈ సినిమా సక్సెస్ మీద కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్న నిఖిల్ తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఓ దెయ్యం ...అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కబోయే సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడట. దసరా సందర్భంగా సినిమా షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 'అమల' అనే టైటిల్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ శిష్యుడు ఆనంద్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవల సందీప్ కిషన్ హీరోగా టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ రెండో ప్రయత్నంగా నిఖిల్ తో అమల సినిమాను రూపొందిస్తున్నాడు. -
అమ్మ మనసు
జ్ఞాపకం పదవ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, తిరుపతి శ్రీ వేంకటేశ్వరా జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేరాను. ఒకరోజు అమ్మతో, ‘‘అమ్మా! ప్రతిరోజూ మనవూరి నుండి పదిమైళ్ల దూరం నడచి తిరుపతికి పోయి చదువుకొని రావాలంటే చాలా కష్టంగా ఉంది. నాతో చదివే పిల్లలంతా అక్కడే హాస్టల్లో చేరి చదువుకొంటు న్నారు. నన్ను కూడా హాస్టల్లో చేర్పించం డమ్మా! మనకు బియ్యం కార్డు కూడా ఉంది కాబట్టి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉచితంగా సీటు ఇస్తారు’ అని చెప్పాను. అమ్మ, నాన్న ఎలాగో కష్టపడి నాకు హాస్టల్లో సీటు సంపాదించారు. నేను హాస్టల్లో ఉంటూ వారానికి ఒకసారి మా వూరికి వెళ్లి వస్తూండేవాణ్ని. మా పల్లెలో ఓ టూరింగు టాకీస్ ఉండేది. ఆదివారం ఊరెళ్లగానే స్నేహితులతో కలసి సినిమాకి వెళ్లేవాడిని. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిపోయేవాణ్ని. నాన్నకది నచ్చేది కాదు. ‘‘వారానికి ఒక్కసారి వస్తావు. ఓ నిముషం కూడా ఇంట్లో ఉండకుండా, స్నేహితులతో సినిమాలకెళ్తావు. ఇక్కడే ఇలా ఉంటే, తిరుపతిలో ఎలా ఉంటున్నావో’’ అన్నాడు ఓరోజు. దాంతో నేను అలిగి ‘‘ఇక నేను వారం వారం రాను, నెలకో సారి వస్తాను’’ అని చెప్పి వెళ్లిపోయాను. మరుసటి ఆదివారం నేను ఇంటికి రాకపోయేసరికి సోమవారం ఉదయాన్నే అమ్మ నన్ను కలవడానికి తిరుపతికి బయలుదేరింది. ఎలాగో కాలేజీ కను క్కుని, కాలేజీ గేటు దగ్గరకు చేరి వచ్చే పోయే పిల్లలందర్నీ నా గురించి అడు గుతూ ప్రాధేయపడుతోంది. మీ పిల్లోడు ఏం చదువుతున్నాడని అడిగితే చెప్పలే కుంది. ‘నా బిడ్డను చూడాలయ్యా’ అని ఏడుస్తోంది. ఉదయం పది గంటల్నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే అన్నం, నీళ్లు లేకుండా ఆక్రోశిస్తూ ఉంది. ఇంతలో మావూరి విద్యార్థి, నా మిత్రుడైన చంద్ర అమ్మను గుర్తుపట్టాడు. తనని తీసుకుని హాస్టల్కొచ్చాడు. నన్ను చూడగానే అమ్మ కళ్లు జలపాతాల య్యాయి. ‘‘నిను చూడకుండా ఈ అమ్మ ఎలా బతకాలిరా, నువ్వు నాతో రాకుంటే నేను వెళ్లను’’ అని భీష్మించి కూర్చుంది. నా తోటి విద్యార్థులంతా అమ్మ పడే వేదన చూసి చలించిపోయారు. నాకైతే కన్నీళ్లు ఆగలేదు. ఇక జన్మలో అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను! - ఆనంద్, మదనపల్లి -
మహిళపై అత్యాచార యత్నం ఆటోడ్రైవరు అరెస్ట్
బెంగళూరు(బనశంకరి): మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన ఆటోడ్రైవర్‌ను బ్యాటరాయణపుర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని బ్యాటరాయణపుర పోలీస్ స్టేషన్లో హెల్పర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు ఆనంద్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే... ఈ నెల 24న సాయంత్రం బనశంకరి అపార్ట్‌మెంట్‌కు వెళ్లేందుకు ఓ మహిళ తిలక్ నగర వద్ద ఆనంద్ ఆటో ఎక్కారు. కూళగేరిలోని నిర్జన ప్రదేశంలోకి ఆటోను తీసుకెళుతుండగా గుర్తించిన మహిళ వెంటనే ఆటోను ఆపాలని డ్రైవర్‌కు సూచించారు. ఆ సమయంలో ఆనంద్ ఆమె మెడలో ఉన్న బంగారు నగలు లాక్కొని, బెదిరించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో అదే మార్గంలో వెళుతున్న వాహన డ్రైవర్లు అక్కడకు చేరుకున్నారు. వారిని గమనించి ఆటోతో సహా ఆనంద్ పారిపోయాడు. ఘటనపై బాధితురాలు బ్యాటరాయణపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తాను ఎక్కిన ఆటో నంబర్‌ను కూడా పేర్కొనడంతో పోలీసులు వెంటనే నిందితుడి కోసం గాలించి బుధవారం అరెస్ట్ చేశారు. -
ఎగరనీ... సీతాకోకచిలుకనీ!
ఆత్మబంధువు ‘‘మమ్మీ... మమ్మీ... నా డ్రెస్ ఎక్కడ?’’ అరిచింది రిషిత. ‘‘నీ కప్‌బోర్డ్‌లోనే ఉంది. వెతికితే కనిపిస్తుంది’’ వంటింట్లోంచి రేఖ. ‘‘పాప కనిపించడంలేదంటోంది కదోయ్. కొంచెం వెతికివ్వొచ్చుగా’’ పేపర్ చదువుతూ తాపీగా చెప్పాడు ఆనంద్. ‘‘దాన్నే వెతుక్కోనివ్వండి’’ అంది. ‘‘తను చిన్నపిల్లోయ్...’’ అని ‘‘రా తల్లీ నేను వెతికిస్తా’’ అంటూ కప్‌బోర్డ్‌లో స్కూల్‌డ్రెస్ వెతికిచ్చాడు ఆనంద్. ఇంతలో రేఖ బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌బాక్స్ రెడీ చేసింది. రిషితకు బ్రేక్‌ఫాస్ట్ తినిపించి, షూస్ వేసి, వాటర్బాటిల్లో నీళ్లుపట్టిచ్చాడు ఆనంద్. ‘‘మీరెందుకు తినిపిస్తున్నారు? షూస్ మీరు వెయ్యడమేంటీ?’’ అడిగింది రేఖ. ‘‘తను చిన్నపిల్లోయ్..’’ ‘‘పన్నెండేళ్లొచ్చినా చిన్నపిల్లేనా!’’ ‘‘పన్నెండేళ్లే కదోయ్’’ అంటూ రిషితను బస్సెక్కించి వచ్చాడు. ‘‘డాడీ.. డాడీ’’ పిలిచింది రిషిత. ‘‘ఏంటి తల్లీ?’’ ‘‘నాకూ స్కూల్లో ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు. కానీ నేనేమో చదువుకోవాలి’’ ‘‘నేను చేసిస్తాలేరా. నువ్వెళ్లి చదువుకో.’’ ‘‘మా మంచి డాడీ’’ అంటూ ఓ ముద్దిచ్చి వెళ్లింది రిషిత. ఆనంద్ ప్రాజెక్టు వర్క్ ముందేసుకుని కూర్చున్నాడు. ఇంతలో రేఖవచ్చి ‘‘ఇదేంటీ... దాని వర్క్ మీరు చేస్తున్నారు?’’ అని అడిగింది. ‘‘నా చిట్టితల్లి చదువుకోవాలటోయ్. అందుకే హెల్ప్ చేస్తున్నా’’ ‘‘చదువుకున్నాక చేసుకోమనండి లేదంటే ప్రాజెక్ట్ పూర్తిచేసి చదువు కోమనండి.’’ ‘‘సర్లే. అయినా నా చిట్టితల్లికి నేను హెల్ప్ చేస్తే నీకేంటి ప్రాబ్లమ్?’’ ‘‘ప్రాబ్లెమ్ కాదు, మీ గారాబంతో దాన్ని చెడగొడుతున్నారనే నా బాధ.’’ ‘‘నేనేం చేశానోయ్. నా కూతురికి నేను హెల్ప్ చేయడంకూడా తప్పేనా?’’ ఇక చెప్పినా లాభంలేదనుకుని రేఖ మౌనంగా ఉండిపోయింది. కానీ తన భర్త గారాబంతో కూతురు బద్ధకస్తురాలిగా, లోకజ్ఞానం లేనిదానిలా తయారవుతుం దనే బాధ. ఏం చేయాలో తెలియట్లేలేదు. కానీ ఏదోకటి చేయాలి ఆయనకు అర్థమయ్యేలా అనుకుంది. ‘‘ఏమండీ’’ పిలిచింది రేఖ. ‘‘ఏంటండీ?’’ నవ్వుతూ అడిగాడు ఆనంద్. ‘‘పార్క్‌కు వెళ్దామా?’’ ‘‘ఏంటో... ఇవ్వాళ మేడమ్ మనసు పార్క్‌కు మళ్లింది.’’ ‘‘ఏదో మళ్లిందిలెండి. వస్తారా?’’ ‘‘నువ్వు రమ్మంటే ఏనాడైనా రానన్నానా?’’ అని పాడుతూ బయలుదేరాడు ఆనంద్. ‘‘ఏమండీ... ఆ సీతాకోకచిలుకలు చాలా అందంగా ఉన్నాయి కదా!’’ అంది రేఖ. ‘‘సీతాకోకచిలుకలు ఎప్పుడూ అందంగానే ఉంటాయ్... నీలా’’ చిలిపిగా అన్నాడు ఆనంద్. ‘‘సరసం చాలు గానీ, అవెలా వస్తాయ్? ఎక్కడ్నుంచొస్తాయ్?’’ ‘‘లార్వా, కేటర్పిల్లర్, ప్యూపా అండ్ బటర్‌ఫ్లై.’’ ‘‘ఈ ప్యూపాలోంచి సీతాకోకచిలుక ఎలా వస్తుంది?’’ అంటూ ఓ మొక్కకు ఉన్న పట్టుగూడును చూపించింది రేఖ. ‘‘ఇదిగో... ఇలా’’ అంటూ ఆ పట్టుగూడును చీల్చాడు ఆనంద్. అందులోంచి కిందపడ్డ సీతాకోకచిలుక ఎగరడానికి ప్రయత్నించి ఎగరలేక అక్కడే పడి పోయింది. చివరకు చనిపోయింది. ‘‘ఆ సీతాకోకచిలుకను మీరెలా చంపేశారో అర్థం చేసుకున్నారా?’’ అడిగింది రేఖ. ‘‘నేను చంపడమేంటి? ఐ హెల్ప్డ్ టూ కమ్ అవుటాఫ్ ది కకూన్.’’ కొంచెం కోపంగా అడిగాడు ఆనంద్. ‘‘కోప్పడకుండా చెప్పేది వినండి. నల్లగా అందవికారంగా ఉండే గొంగళి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారేందుకు ఈ గూడును కట్టుకుంటుంది. అది సీతాకోక చిలుకగా రూపాంతరం చెందాక బయటకు వచ్చేందుకు బలంగా ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో దానికి రెక్కలు వస్తాయి. ఆ రెక్కలకు శక్తి వస్తుంది. ఆ శక్తిని ప్రయోగించి పట్టు గూడును చీల్చుకుని రివ్వున ఎగురు తుంది... అందంగా ఆనందంగా.’’ ‘‘అవును. ఇదంతా నాకెందుకు చెప్తున్నావ్?’’ ‘‘కకూన్ లోపలున్న సీతాకోకచిలుక కష్టపడకూడదని మీరు సాయం చేశారు. దాంతో గూడును చీల్చాల్సిన అవసరం దాని రెక్కలకు లేకపోయింది. అందువల్ల అవి బలపడలేదు. అందుకే అది ఎగరలేక చనిపోయింది. తనపని తాను చేసుకోనివ్వ కుండా సాయం చేస్తే ఇలాగే ఉంటుంది.’’ ‘‘యూ మీన్..’’ అంటూ ఏదో అర్థమై ఆగాడు ఆనంద్. ‘‘అవునండీ.. పిల్లలు తమపని తాము చేసుకుంటేనే పని విలువ, కష్టం, దాని ఫలితం తెలిసొస్తాయి. అన్నీ మనమే చేసిపెడితే రేపు ఏదైనా కష్టం ఎదురైనప్పుడు తట్టుకోలేరు. వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటేనే అన్నీ నేర్చుకుంటారు. మానసికంగా దృఢంగా తయారవుతారు.’’ భార్య చెప్పాలనుకున్నది అర్థమైంది ఆనంద్కి. ‘‘నిజమే. సారీ అండ్ థాంక్స్’’ అంటూ రేఖ చేయి పట్టుకుని ఇంటివైపు అడుగులు వేశాడు. -
ఆగస్ట్‌లో సెవిలి
సెవిలి చిత్రం ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తునట్లు ఆ చిత్ర దర్శకుడు ఆర్ఏ.ఆనంద్ తెలిపారు. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, దెయ్యాలు, పిశాచులు,యాక్షన్,కామెడీ తరహా చిత్రాలు వస్తున్న ఈ రోజుల్లో ఇక చక్కని ప్రేమానుబంధాల ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం సెవిలి అని దర్శకుడు తెలిపారు. తల్లి ప్రేమ కోసం తపించే కొడుకు, కొడుకును చూడడానికి ఇష్టపడని తల్లి మధ్యలో పెంచిన తల్లి మమకారం ఇలా హృదయాలను టచ్ చేసే సన్నివేశాలతో ప్రేమ, హాస్యం అంటూ అన్ని వర్గాల వారిని అలరించే అంశాలతో తెరకెక్కించిన చిత్రం ఈ చిత్రమని ఆయన తెలిపారు. ఎంకేఎం ఫిలింస్ పతాకంపై వలసై కే.ఫిర్ మహ్మద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.సయ్యదుహుసేన్, పి.ఖాదర్‌హుసేన్, పి.మహ్మదుహుసేన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని దర్శకుడు తెలిపారు. నవ నటుడు జీఆర్ అర్పిన్ రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తిశెట్టి హీరోయిన్గా నటించారు. ఇతర పాత్రల్లో మైనా పవిత్ర, నెల్లైశివ, షకీలా,ి సటిజన్ మణి, వలసై ఫిర్ మహ్మద్, కోవై శారద, కోవై ఉమ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు ఈ సందర్భంగా వెల్లడించారు. -
వన్ మినిట్
అప్పట్లో... ఓ ప్రైవేట్ కంపెనీలో... బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెండితెరపై తొలిసారి కనిపించిన చిత్రం ‘సాత్ హిందుస్తానీ’. 1969లో ఈ చిత్రం విడుదలైంది. అప్పటికి అమితాబ్ కోల్‌కతాలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి అవకాశం రావడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. తొలిచిత్రం తర్వాత రెండేళ్లకు ‘ఆనంద్’లో నటించారు అమితాబ్. ఆ హిట్ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది -
అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి
గుమ్మలక్ష్మిపురం: మండలంలోని దుడ్డుకల్లు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇమరిక ఆనంద్(14) అనే విద్యార్థి అనారోగ్యానికి గురై దుడ్డుకల్లు పీహెచ్సీలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆనంద్ మరణించాడని అతని కుటుంబ సభ్యులు, కొత్తూరు గ్రామస్తులు ఆరోపించారు. ఆస్పత్రి వద్ద పాఠశాల సిబ్బందిని గట్టిగా నిలదీశారు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలం పెదమరిక పంచాయతీ పరిధి కొత్తూరుకు చెందిన ఆనంద్ ఆరవ తరగతి నుంచి ఈ ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఆనంద్‌కు జ్వరం రావటంతో వార్డెన్ తాకేటి బాలయ్య స్థానిక పీహెచ్సీలో వైద్యం చేయించారు. శనివారం ఉదయం ఆనంద్‌కు ఫిట్స్ రావడంతో దుడ్డుకల్లు పీహెచ్‌సికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో అక్కడ వైద్యాధికారి రమేష్ లేరు. స్టాఫ్‌నర్స్ వైద్యాధికారికి ఫోన్ చేసి ఆయన సలహా మేరకు బీపీ చూసి సెలైన్ ఎక్కించారు. కానీ ప్రయోజనం దక్కలేదు. ఆనంద్ మృతిచెందిన సంగతి తెలుసుకున్న తల్లి కమల, తమ్ముడు మన్మధరావు, ఇతర కుటుంబ సభ్యులు, కొత్తూరు గ్రామస్తులు దుడ్డుకల్లు పీహెచ్‌సికి చేరుకుని బోరున విలపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్లను గట్టిగా నిలదీశారు. సమయానికి వైద్యాధికారి రమేష్ ఆస్పత్రిలో లేకపోవటం వల్లే ఘోరం జరిగిందని వాపోయారు. ఐటీడీఏ పీవో, ఆర్డీవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, ఇతర ఉన్నతాధికారులు వచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేదిలేదని భీష్మించారు. విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆదేశాల మేరకు పార్వతీపురం ఆర్డీవో ఆర్ గోవిందరావు పీహెచ్సీకీ చేరుకుని ఆనంద్ మృతదేహాన్ని పరిశీలించారు. అందించిన చికిత్స గురించి వైద్యసిబ్బందిని, ఆనంద్ ఆరోగ్యం గూర్చి తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మృతుని బంధువులతో మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆనంద్ కుటుంబానికి జీవనోపాధి కల్పించడంతోపాటు ప్రభుత్వ పరంగా ఎక్స్‌గ్రేషియా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీడీఏ డీడీ ప్రభాకరరావు, డిప్యూటీ ఈవో రమణనాయుడు తదితరులు పీహెచ్‌సీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఆనంద్ తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నారని కొత్తూరు గ్రామస్తులు చెప్పారు. ఇంతలోనే ఘోరం జరగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
పిల్లల్ని బావిలో తోసేసిన తల్లి
కుందుర్పి (అనంతపురం): తన కుమార్తెను కాన్వెంట్లో చదివించడం లేదన్న ఆవేదనతో ఓ తల్లి హృదయం కఠినంగా మారింది. ఇద్దరు కుమార్తెలను బావిలో తోసేసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హృదయాన్ని కదలించే ఈ ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలం పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కరిగానిపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె గౌతమి (5) ని సమీపంలోని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారు. ప్రమీల భర్త ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. కుటుంబ పోషణ ఆనంద్ సోదరుడే చూసుకుంటున్నాడు. అయితే, ఆనంద్ సోదరుడు తన పిల్లలను కాన్వెంట్లో చదివిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమార్తె గౌతమిని కూడా కాన్వెంట్లో చదివించాలని ప్రమీల కోరింది. అందుకు వారు తిరస్కరించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రమీల తనకు పిల్లలే అక్కర్లేదని భావించింది. ఎనుములదొడ్డిలోని పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకుని బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చింది. కరిగానిపల్లి, ఎనుముల దొడ్డి మధ్యలో ఓ గుట్టపైనున్న బావిలో ఇద్దరు పిల్లల్ని తోసేసింది. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసే చర్యలు చేపట్టారు. -
జీవిత ఖైదీ ఆత్మహత్య
విశాఖపట్నం: మరదలి కిడ్నాప్ కేసులో జీవిత కాలపు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ఆనంద్ కిడ్నాప్ కేసులో 2012 లో విశాఖ జైలుకు వెళ్లాడు. రెండుసార్లు కేసు నమోదు కావడంతో ఆనంద్ జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని జైలు అధికారులు తెలిపారు. -
ఇక పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలు
తాండూరు: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగనున్నాయి. జీఓ 30 ప్రకారం రాష్ట్రంలోని పది జిల్లాల్లో మొదటగా నిజామాబాద్ జిల్లాలో ఒప్పందం చేసుకున్న టీఎస్ఎండీసీ రెండో ఒప్పందం రంగారెడ్డి జిల్లాలో చేసుకుంది. శుక్రవారం టీఎస్ఎండీసీ అడిషనల్ జనరల్ మేనేజర్ ఏ.ఆనంద్ (హెచ్ఆర్) తాండూరు గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. మైన్ ఏడీ జయరాజ్‌తో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై ఒప్పందం చేసుకున్నారు. అనంతరం అడిషనల్ జనరల్ మేనేజర్ ఆనంద్ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో ఐదు పట్టా భూముల్లో యజమానులతో ఒప్పందాలు జరిగాయన్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు డివిజన్లోని యాలాల మండలంలో రాజశేఖరరెడ్డి (ఎకరం 30 గుంటలు), విజయ్‌కుమార్‌రెడ్డి (ఎకరం) పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు అగ్రిమెంట్ కుదిరిందన్నారు. రాజశేఖరరెడ్డి భూమిలో 21,300 క్యూబిక్ మీటర్లు, విజయ్‌కుమార్‌రెడ్డి భూమిలో 12,240 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు ఒప్పందం జరిగిందని వివరించారు. ఒక క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.600కు విక్రయించనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఇసుక కావాలన్న విక్రయిస్తామన్నారు. ఆన్లైన్లో రూ.600 చెల్లించి ఇసుకను బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకోవడానికి ఠీఠీఠీ.్టటఝఛీఛి.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని చెప్పారు. తెలంగాణలోని మిగితా జిల్లాల్లో కూడా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల ఒప్పందాల ప్రక్రియ తుది దశలో ఉన్నాయన్నారు. త్వరలోనే ఆయా జిల్లాల్లో కూడా ఇసుక తవ్వకాలు చేపట్టనున్నట్టు చెప్పారు. తవ్వకాలు పూర్తయ్యే వరకు లేదా ఆరు నెలలపాటు పట్టా భూముల యజమానులతో ఒప్పందం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. యాలాల మండలంలో వచ్చే సోమవారం నుంచి తవ్వకాలు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.600ల్లో పట్టాదారునికి రూ.200 చెల్లిస్తామని, రూ.50 తవ్వకాల ఖర్చులతోపాటు గనుల శాఖకు సీనరేజ్ చెల్లించడం జరుగుతుందన్నారు. మిగితా డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆనంద్ వివరించారు. -
మళ్లీ తెరపై... కమలిని
‘ఆనంద్’తర్వాత తెలుగు తెరపై దూసుకెళ్లిన కమలినీ ముఖర్జీ జోరు ఈ మధ్య తగ్గింది. ఇప్పటివరకూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి కమలిని దాదాపు పాతిక సినిమాల పైనే చేశారు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు రాకపోవడం వల్లే కమలిని ఎక్కువగా సినిమాలు చేయడం లేదని ఊహించవచ్చు. ఈ నేపథ్యంలో ఆరేడేళ్ల విరామం తర్వాత తమిళంలో ఓ సినిమా అంగీకరించారామె. ‘పిజ్జా’తో మోస్ట్ వాంటెడ్ డెరైక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రూపొందనుంది. ఇందులో ఎస్.జె. సూర్య సరసన కమలిని జతకట్టనున్నారు. విజయ్ సేతుపతి, అంజలి తదితరులు నటించనున్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, కమలినివి కీలక పాత్రలట! దీనికి ‘ఇరవై’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. -
నకిలీ తల్లిదండ్రులతో వైద్యుల వివాహయత్నం
-
నకిలీ తల్లిదండ్రులతో వైద్యుల వివాహయత్నం
చిత్తూరు: తిరుమల కొండ మీద శుక్రవారం ఉదయం మరికాసేపట్లో జరగాల్సిన పెళ్లి పీటల మీద ఆగిపోయింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌కు చెందిన అనిల్(34), కవిత(28) వైద్యులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడుకొండల స్వామి సాక్షిగా వీరిద్దరు ఏడడుగులు నడవాలనుకున్నారు. శుక్రవారం మంచి ముహుర్తం ఉండటంతో టీటీడీ పౌరోహిత సంఘంలో వివాహం కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో వివాహం చేసుకోవాలంటే తల్లిదండ్రుల అంగీకార పత్రాలు తప్పనిసరి. కాగా.. వధువు కవిత తరపున పెద్దలు ఈ పెళ్లికి నిరాకరించడంతో నకిలీ పత్రాలు సృష్టించి దొంగ తల్లిదండ్రులతో పెళ్లి తతంగాన్ని ముగించాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ విషయం బయటకు పోక్కడంతో కవిత తల్లిదండ్రులతో పాటు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దాంతో పెళ్లి పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. కాగా.. గతంలో కవితకు వేరే వ్యక్తితో వివాహం అయినట్లు తెలుస్తోంది. . -
కోఠిలో హోర్డింగ్ ఎక్కిన ఇద్దరు విద్యార్థులు
-
హోర్డింగ్ ఎక్కి విద్యార్థి జేఏసీ నేతల హల్చల్
హైదరాబాద్ : నగరంలోని ఓ హోర్డింగ్ పైకి ఎక్కి ఇద్దరు విద్యార్థి జేఏసీ నాయకులు హల్ చల్ చేశారు. చింతల విజయ్ రాజు, ఆనంద్ అనే ఇద్దరు జేఏసీ నేతలు శుక్రవారం ఉదయం కోఠి ఉమెన్స్ కాలేజ్ చౌరస్తా లోని హోర్టింగ్ పైకి ఎక్కారు. 'గత ప్రభుత్వం ఏపీఐఐసీ పేరిట సంస్థను ఏర్పాటు చేసి పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించింది. పెట్టుబడి దారీ వ్యవస్థను అడ్డంపెట్టుకుని తెలంగాణ భూములను దోచుకున్నారు. పరిశ్రమల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి' అని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వారిని హోర్టింగ్ నుంచి కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు. -
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించారు. రెండు ఘటనల్లో తీవ్రంగా గాయపడని ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మహంకాళీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆప్యాయంగా గడిపారు.. అందరినీ విడిచి వెళ్లారు!
పెళ్లికి వెళ్లి వస్తూ {పమాదానికి గురయ్యారు ముగ్గురి దుర్మరణం పది నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో కబళించిన మృత్యువు పీలేరు: వారంతా రాత్రి బంధువుల వివాహానికి వెళ్లి అందరితో ఆప్యాయంగా గడిపారు. మరో పది నిమిషాల్లో ఇల్లు చేరుకునే లోపే రోడ్డు ప్రమాదంలో అందనంత దూరం వెళ్లిపోయారు. మరో పది నిమిషాలు దాటి ఉంటే వారంతా క్షేమంగా ఇంటికి చేరుకునేవారు. పీలేరు మండలంలో వేపులబైలు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు దర్మరణం పాలైన సంఘటన తెలిసిందే. పీలేరు పట్టణం ఆర్టీసీ బస్టేషన్ సమీపంలో కాపురముంటున్న ఆనంద్(47) మండలంలోని తలపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పీలేరు ఎస్వీ డీలక్స్ మార్గంలో శ్రీసాయి ఇండియన్ ఇండస్ట్రీస్ అధినేత కోలా శ్రీనివాసులు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో కాపురముంటున్నారు. బుధవారం సాయంత్రం ఆనంద్, అతని భార్య సరళాదేవి, కూతుర్లు మనోగ్న, షణ్మిత, కోలా శ్రీనివాసులు, అతని భార్య ఉమ శ్రీనివాసులు కారులో మదనపల్లెలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. పెళ్లిలో కొంతసేపు బంధువులతో ఆనందంగా గడిపారు. అందరితో కలసి భోజనం చేశారు. రాత్రి మదనపల్లె పీలేరుకు తిరుగుప్రయాణమయ్యారు. పీలేరు పట్టణానికి మరో పది నిమిషాల్లో చేరుకునే సమయంలో మార్గంమద్యలోని వేపులబైలు పంచాయతీ పరిధిలోని అంకాలమ్మ ఆలయం సమీపంలోకి వచ్చేసరికి తిరుపతి నుంచి మదనపల్లెకు వెళుతున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆనంద్(47), అతని చిన్న కుమార్తె షణ్మిత(4) కారు నడుపుతున్న కోలా శ్రీనివాసులు(50) అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు. ఆనంద్ భార్య సరళాదేవి, రెండవ కుమార్తె మనోగ్న, కోలా శ్రీనివాసులు భార్య ఉమ తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి ప్రమాద విషయం తెలుసుకున్న పీలేరు సీఐ టీ.నరసింహులు, ఎస్ఐ సిద్దతేజమూర్తి సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన సరళాదేవి, ఉమ, మనోగ్నలను అతి కష్టంపై వాహనం నుంచి వెలుపలికి తీసి చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రమాద విషయం తెలియడంతో మృతుల బంధువులు, స్నేహితులు, పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పది నిమిషాలు ఆగి ఉంటే ఇంటికి వచ్చేసే వారు గదా.. అంటూ వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు పీలేరు సీఐ తెలిపారు. -
శోకసంద్రంలో వరుడి కుటుంబం
గుంటూరు : పచ్చనితోరణాలతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. తమ ఇంటికి కోడలుగా వస్తున్న యువతిని మృత్యువు మింగేసిందని తెలుసుకున్న వరుడి కుటుంబీకులు దుఃఖసాగరం లో మునిగిపోయారు. గుంటూ రు నెహ్రూనగర్ ఆరోలైన్‌కు చెందిన మునగా శివప్రసాద్, ధనలక్ష్మి దంపతుల రెండో కుమారుడు మునగా ఆనంద్ సౌత్ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి చల్లపల్లికి చెందిన అల్లంశెట్టి సాంబయ్య కుమార్తె అల్లంశెట్టి బాలాకుమారి అలియాస్ అమ్ములుతో వివాహం నిశ్చయమైంది. గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. నెహ్రూనగర్ 4వ లైనులోని కృష్ణ ప్లాజా ఫంక్షన్ హాలులో వివాహ ఏర్పాట్లుచేశారు. ఫంక్షన్ ప్లాజాను విద్యుత్ దీపాలు, పచ్చని తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. వధువు బాలా కుమారిని తీసుకువస్తున్న కారు తోట్లవల్లూరు వద్ద అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోవడంతో ఆమె సహా నలుగురు మృతి చెందగా, మరో మహిళకు సీరియస్‌గా ఉంది. దీంతో పెళ్లి కుమారుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంటనే మండపంలో విద్యుత్ దీపాల అలంకరణ తొలగించారు. పచ్చని తోరణాలను తీసి పక్కన వేశారు. వారి కుటుంబంతోపాటు బంధుమిత్రులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులు, మిత్రులు వెళ్లిపోవడంతో కల్యాణమండపం వెలవెలబోయింది. -
వేడెక్కిన ‘ఉప’ పోరు
శ్రీరంగం ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఎస్.వలర్మతి పేరు ఖరారైంది. ఆమె పేరును పార్టీ అధినేత్రి జయలలిత శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే డీఎంకే అభ్యర్థిని ప్రకటించింది. మరోవైపు బీజేపీ సైతం ఉప ఎన్నిక పోరుకు సమాయత్తమవుతోంది. మిగిలిన పార్టీలు ఎన్నికలో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. మొత్తం మీద ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వ హించిన జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష కారణంగా సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి హోదాలో జయలలిత ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో శ్రీరంగం నియోజకవర్గానికి ప్రత్యేకత లభించింది. దీంతో ఉప ఎన్నికలో విజయం కోసం అన్ని పార్టీలూ ఆరాటపడుతున్నాయి. డీఎంకే అభ్యర్థిగా ఆనంద్ పేరు ఇప్పటికే ఖరారైంది. తాజాగా అన్నాడీఎంకే సైతం ఎస్.వలర్మతి పేరు ఖరారు చేసింది. మరోవైపు పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ నెల 18న చెన్నైకి రానున్నారు. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా శ్రీరంగం స్థానాన్ని చేజిక్కించుకోవాలని అమిత్‌షా ఆశిస్తున్నారు. డీఎంకే నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సినీనటుడు నెపోలియన్ పేరు వినపడుతోంది. ఇదే ఖరారైతే కాంగ్రెస్ అభ్యర్థిగా నటి కుష్బును రంగంలోకి దించాలని తిరుచ్చిలోని ఆ పార్టీ నేతలు పట్టుపడుతున్నారు. ఒంటరిగా పోటీ చేయడమా, ఏదైనా పార్టీకి మద్దతు తెలపడమా అనే మీమాంశ నుంచి కాంగ్రె స్ బయటపడలేదు. బీజేపీ కూటమిలో ఉన్న డీఎండీకే సైతం ఊగిసలాట ధోరణినే అవలంబిస్తోంది. శ్రీరంగంలో ఎన్ని పార్టీలు బరిలోకి దిగినా అన్నాడీఎంకే, డీఎంకే మధ్యనే ప్రధానపోటీ ఉంటుంది. ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఉప ఎన్నిక పోరు వేడెక్కనుంది. ఓటర్ల జాబితాలో గోల్మాల్: కరుణ అక్రమ మార్గంలోనైనా అధికారం చేపట్టేలా అన్నాడీఎంకే దిగజారిపోయిందని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి శుక్రవారం వ్యాఖ్యానిం చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓటర్ల జాబి తాలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిం చారు. బదిలీపై వెళ్లినవారు, ఇల్లు మారిన వా రు, మరణించిన వారు, కొత్తగా వచ్చిన చేరిన వారి కోసం మూడేళ్లకు ఒకసారి ఓటర్ల జాబితా ను సవరించడం పరిపాటి అని ఆయన అన్నా రు. అయితే అధికార అన్నాడీఎంకే అనేక సార్లు ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని ఆరోపించారు. సేలం జిల్లా లో ప్రధానంగా అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 2009లో 4,16,20,460 మంది ఓట ర్లు ఉన్నారన్నారు. తాజాగా 2014 ఆఖరులో ప్రవేశపెట్టిన జాబితా ప్రకారం 5,37,32,682 మంది ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 21 శాతం ఓటర్లు పెరిగినట్లు చూపారని అన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుని ఇక్కడి జాబి తాను పునఃపరిశీలిస్తే అధికార పార్టీ అక్రమాలు వెలుగు చూస్తాయని కరుణ పేర్కొన్నారు. -
భార్య, పిల్లలకు విషమిచ్చాడు, ఇద్దరు మృతి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఊరెల్లిలో విషాదం నెలకొంది. కట్టుకున్న భార్య, రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను విషమిచ్చి...హతమార్చేందుకు ప్రయత్నించాడో ప్రబుద్దుడు. ఈ దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఆనంద్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. శిరీష (౩), అనూష (2)లను మృతి చెందగా, భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ బోల్తా..ముగ్గురికి తీవ్ర గాయాలు
గిద్దలూరు: లారీ బోల్తాపడి కర్ణాటక రాష్ట్రం సింధనూరుకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నగర పంచాయతీ పరిధిలోని ఏసీ గోడౌన్ సమీపంలో నంద్యాల-ఒంగోలు రహదారిపై గురువారం జరిగింది. క్షతగాత్రులు తెలిపిన వివరాల మేరకు కాకినాడలో వరి కోతలు పూర్తి చేసుకుని వరికోత యంత్రాన్ని లారీలో ఎక్కించుకుని నంద్యాలకు వెళ్తుండగా..రంగారెడ్డిపల్లె దాటాక లారీ డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో లారీ అదుపు తప్పి కుడివైపున్న చెట్లను ఢీకొనబోయింది. డ్రైవర్ పక్కనే కూర్చుని ఉన్న యంత్రం ఓనరు హనుమంతు లారీ స్టీరింగ్‌ను ఎడమవైపునకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈఘటనలో హనుమంతుతో పాటు డ్రైవర్ గోవిందా అధికారి, వరికోత యంత్రం ఆపరేటర్ ఆనంద్ మండల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఏరియా వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. -
ఆ ఎత్తు వేయకపోయుంటే...
మన ఆనంద్ మరోసారి ఓడిపోవడం బాధగా ఉంది. ఈ గేమ్ కోసం అతను చాలా చక్కగా సన్నద్ధమై వచ్చినట్లు ఆరంభంలో కనిపించింది. 26వ ఎత్తు వరకు కూడా మొగ్గు విషీ వైపే ఉంది. అయితే రూక్ని బి4లోకి పంపడం ద్వారా అతను చాలా పెద్ద తప్పు చేశాడు. ఈ ఎత్తు వేయడంతో అతను తొందర పడ్డాడు. దాని టైమింగ్ తప్పు అనేది నా అభిప్రాయం. కాస్త ఆగి ఉండాల్సింది. బహుశా పాన్‌ను ముందుకు తీసుకెళ్లి క్వీన్‌ను చేద్దామనే ఆలోచన కావచ్చు! కానీ బలి అవుతుందని తెలిసినప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి. ఈ ఎత్తు వేసేటప్పుడు ఆనంద్ అతి ధైర్యవంతుడిగా, అతి ఆశావాదిగా కనిపించాడు. బహుశా ఈ సమయంలో తాను అనుకున్న వ్యూహం మర్చిపోయి ఉంటాడు లేదా విజయంపైనే దృష్టి నిలపడం వల్ల ‘డ్రా'కు ఉన్న అవకాశాల గురించి కూడా ఆలోచించలేదేమో. ఇలాంటి అవకాశం ఇస్తే కార్ల్సన్లాంటి ఆటగాడు వదిలేస్తాడా. అందుకే ఎక్కడా పట్టు విడవకుండా, మరో చాన్స్ లేకుండా దూసుకుపోయాడు. చెన్నైతో పోలిస్తే ఈ టోర్నీలో ఆనంద్ ప్రదర్శన చాలా బాగుంది. ఎన్నో సార్లు విజయానికి చేరువలో కూడా వచ్చాడు. కానీ సఫలం కాలేకపోయాడు. ఓటమి విషీని బాధ పెట్టడం సహజమే కానీ అతని గొప్పతనం తగ్గదు. భవిష్యత్ టోర్నీలపై కూడా దీని ప్రభావం ఉండదని నేను భావిస్తున్నా. - పెంటేల హరికృష్ణ, చెస్ గ్రాండ్ మాస్టర్ -
20 ఎత్తుల్లో... గంటలోనే...
* ఆనంద్, కార్ల్సన్ తొమ్మిదో గేమ్ డ్రా * ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో మరో డ్రా. అయితే ఈసారి కేవలం 20 ఎత్తుల్లోనే, అది కూడా గంటలోనే ఆనంద్, కార్ల్‌సన్‌ల మధ్య తొమ్మిదో గేమ్ డ్రాగా ముగిసింది. తెల్లపావులతో ఆడిన కార్ల్సన్ బెర్లిన్ డిఫెన్స్‌తోనే గేమ్ ప్రారంభించాడు. 12 మూవ్‌ల వరకూ ఇద్దరూ గతంలో ఆడిన ఎత్తులనే ఆడారు. ఆ తర్వాత నాలుగు మూవ్స్ మాత్రమే కొత్తగా వేశారు. దీంతో 16వ ఎత్తు వద్దే ఈ గేమ్ డ్రా కావడం ఖాయంగా కనిపించింది. ఆ తర్వాత మూడు ఎత్తులు కూడా పునరావృతం కావడంతో ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. ఈ గేమ్‌లో ఆనంద్ పెద్దగా ఆలోచించలేదు కూడా. కేవలం 12 నిమిషాల్లోనే తన 19 ఎత్తులు వేశాడు. తను ఈ గేమ్ కోసం బాగా సన్నద్ధమయ్యాడనడానికి ఇది ఉదాహరణ. చాంపియన్‌షిప్‌లో ఇది వరుసగా మూడో డ్రా కావడం విశేషం. తొమ్మిదో గేమ్ తర్వాత కార్ల్సన్ 5-4 పాయింట్లతో ఆనంద్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. శుక్రవారం జరిగే పదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. నిరాశ కలిగించిన రోజు పెంటేల హరికృష్ణ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లాంటి పెద్ద మ్యాచ్‌లో ఓ గేమ్ కేవలం 20 ఎత్తుల్లోనే డ్రా కావడం అభిమానులకు కచ్చితంగా నిరాశ కలిగిస్తుంది. కార్ల్సన్ ఆరంభంలో కొత్త వేరియేషన్‌తో ఆడాడు. కానీ ఆనంద్ ఈ గేమ్ కోసం బాగా సన్నద్ధమై వచ్చాడు. దీంతో ఎవరికీ పెద్దగా అవకాశాలు రాలేదు. 16 ఎత్తుల తర్వాత ఇక ఎంతసేపు ఆడినా ఎత్తులు పునరావృతం కావడం మినహా మరో దారి లేదు. ఎవరైనా విజయం కోసం ప్రయత్నిస్తే వాళ్లు కచ్చితంగా ఇబ్బందుల్లోకి వెళతారు. అందుకే రిస్క్ తీసుకోకుండా ఇద్దరూ డ్రాకే మొగ్గు చూపారు. ఇది ఆనంద్‌కు మంచి ఫలితం అనుకోవాలి. నాలుగో గేమ్‌లో మినహా ఆనంద్ ప్రతిసారీ బ్లాక్స్‌తో ఆడేటప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఈసారి మాత్రం సులభంగా డ్రా చేసుకున్నాడు. దీనికి కారణం బాగా సన్నద్ధమవడమే. పదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడే అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ గేమ్ కచ్చితంగా గెలవాలని కాదుగానీ... పదో గేమ్‌లో గెలిచి స్కోరు సమం చేస్తే... చివరి రెండు గేమ్‌లు మరింత ఆసక్తిక రంగా సాగుతాయి. బ్లాక్స్‌తో గంటలోనే డ్రా చేసుకుంటే ఏ ఆటగాడికైనా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఆనంద్ తర్వాతి గేమ్ బాగా ఆడతాడని అనుకుంటున్నా. చెస్ గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణను harichess@twitter లో ఫాలో కావచ్చు -
మళ్లీ ‘డ్రా'నే..
ఆనంద్‌ను నిలువరించిన కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): ఆనంద్‌లాంటి అనుభవజ్ఞులను తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భావించిన డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ఎనిమిదో గేమ్‌కు పక్కాగా సిద్ధమయ్యాడు. మంగళవారం జరిగిన ఈ గేమ్‌ను నార్వే గ్రాండ్‌మాస్టర్ 41 ఎత్తుల్లో ‘డ్రా'గా ముగించాడు. తెల్లపావులతో క్వీన్స్ గాంబిట్ పద్ధతిలో ఈ గేమ్‌ను ప్రారంభించిన ఆనంద్‌కు ఏ దశలోనూ గెలిచే అవకాశం రాలేదు. 21 ఎత్తులు ముగిశాక ఈ గేమ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితం రాదని తేలిపోయింది. ఏడో గేమ్‌లో 80 ఎత్తుల తర్వాత ‘డ్రా' ఖాయమని తేలినా కార్ల్సన్ మొండిగా ఆడుతూ 122 ఎత్తుల వరకు కొనసాగించాడు. ఆనంద్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే కార్ల్సన్ ఈ వ్యూహాన్ని అమలు చేశాడు. ఎనిమిదో గేమ్‌లో ఆనంద్‌కూ ఇలాంటి అవకాశం ఉన్నా ఫలితం రాదనే ఉద్దేశంతో ‘డ్రా'కే మొగ్గు చూపాడు. ప్రస్తుతం కార్ల్సన్ 4.5-3.5తో ఆధిక్యంలో ఉన్నాడు. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే తొమ్మిదో రౌండ్లో కార్ల్సన్ తెల్లపావులతో, ఆనంద్ నల్లపావులతో ఆడతారు. ఈ గేమ్ కోసం కార్ల్సన్ బృందం బాగా సన్నద్ధమై వచ్చింది. 9వ ఎత్తులో కార్ల్సన్ రూక్ ఈ8 ఆడాడు. ఇది చాలా కొత్త మూవ్. దీనిని ఆనంద్ ఊహించలేదు. అక్కడి నుంచి తను బాగా ఆలోచనలో పడ్డాడు. దీనికి తోడు ఆనంద్ ఆడిన ప్రతి మూవ్కీ కార్ల్సన్ ముందుగానే సన్నద్ధమై వచ్చాడు. ఆనంద్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ‘డ్రా’ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. ఇక ఆనంద్ మిగిలిన నాలుగు గేమ్స్‌లో రెండు బ్లాక్స్‌తో ఆడాలి. ఈ రెండు గేమ్స్‌లోనూ కార్ల్సన్ కచ్చితంగా వైట్స్‌తో విజయం కోసం ప్రయత్నిస్తాడు. మిగిలిన రెండు వైట్స్‌తో ఆడే గేమ్స్‌లో ఆనంద్ పుంజుకోకపోతే కష్టం. - హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్ గేమ్ సాగిందిలా... 1. d4Nf6 2. c4e6 3. Nf3d5 4. Nc3Be7 5. Bf4O-O 6. e3c5 7. dxc5Bxc5 8. a3Nc6 9. Qc2Re8 10. Bg5Be7 11. Rd1Qa5 12. Bd3h6 13. Bh4dx-c4 14. Bxc4a6 15. O-Ob5 16. Ba2Bb7 17. Bb1Rad8 18. Bxf6Bxf6 19. Ne4Be7 20. Nc5Bxc5 21. Qxc5b4 22. Rc1bxa3 23. bxa3Qx-c5 24. Rxc5Ne7 25. Rfc1Rc8 26. Bd3Red8 27. Rxc8Rxc8 28. Rxc8+Nxc8 29. Nd2Nb6 30. Nb3Nd7 31. Na5Bc8 32. Kf1Kf8 33. Ke1Ke7 34. Kd2Kd6 35. Kc3Ne5 36. Be2Kc5 37. f4Nc6 38. Nxc6Kxc6 39. Kd4f6 40. e4Kd6 41. e5+ 1/2,1/2. -
హిందూ, ముస్లిమ్ ప్రేమకథ
రఫీ కథానాయకునిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ రాహుల్... పక్కా ప్రొఫెషనల్’. నూతన నటి అంజలి నాయిక. ఓ గల్లీ కుర్రాడు ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడన్నది ప్రధానాంశమైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రఫీ స్వరాలందించిన ఈ చిత్ర పాటల సీడీని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లు ఆవిష్కరించి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావుకి అందించారు. ‘‘హిందూ ముస్లిమ్‌ల మధ్య జరిగే ప్రేమకథ ఇది’’ అని రఫీ చెప్పారు. సీనియర్ పాత్రికే యుడు పాశం యాదగిరి, వాణిజ్యపన్నుల అధికారి వివేక్ ఈ వేడుకలో పాల్గొన్నారు. -
లక్ష్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే
విద్యార్థులు.. నిత్యం పుస్తకాలతో కుస్తీ.. మార్కులపైనే దృష్టి. కానీ.. గురువుల ప్రోద్బలం.. ప్రోత్సాహంతో వయసుకంటే కంటే పెద్ద సాహసం చేశారు.. ఏకంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.. అందరి మన్ననలు పొందారు విద్యార్థులు పూర్ణ, ఆనంద్. ఈ ఘనత సాధించిన వారిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల పూర్వ విద్యార్థుల సంఘం(స్వారోస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు. కేయూక్యాంపస్ : లక్ష్యంతో ముందుకెళ్తే దేనినైనా సాధించవచ్చని, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లే అందుకు సాక్ష్యమని అర్బన్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల పూర్వవిద్యార్థుల సంఘం(స్వారోస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ,అనంద్లను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ.. జీవితంలో అనేక సవాళ్లు ఎదరవుతాయని, సానుకూల దృక్పథంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. చిన్నవయసులోనే పూర్ణ, ఆనంద్‌లు ఎవరెస్టు శిఖరం అధిరోహించడం గర్వకారణమన్నారు. కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు మాట్లాడుతూ విద్యార్థులు అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. గురుకుల విద్యార్థుల కోసం ప్రవీణ్‌కుమార్ చేస్తున్న వివిధ కార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయన్నారు. క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే ప్రణాళిక బద్ధంగా లక్ష్యంతో చదువుకుంటే అనుకున్న స్థానానికి చేరుకోవచ్చన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ పుల్లయ్య మాట్లాడుతూ ప్రవీణ్‌కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది గురుకులాల్లో డిగ్రీ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సభకు స్వారోస్ జిల్లా అధ్యక్షుడు పట్టాభి అధ్యక్షత వహించారు. స్వారోస్ రాష్ర్ట కోకన్వీనర్ చలపతి, రాష్ట, జిల్లా స్వారోస్ బాధ్యులు పుల్లాకిషన్, రవి, కరుణాకర్, ఒంటేరు చక్రి, సదానందం, పరుశరామ్, కుంటా శ్రీనివాస్, మహేష్ , శోభన్‌బాబు, మానస, పీఈటీ శ్రీలత పాల్గొన్నారు. కలెక్టర్ అభినందన జిల్లాలోని స్వారోస్ కమిటీ సన్మాన కార్యక్రమానికి వచ్చిన పూర్ణ, ఆనంద్‌లకు సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హన్మకొండలోని కీర్తిస్తూపం నుంచి ర్యాలీ ప్రారంభించారు. తొలుత కలెక్టర్ కిషన్‌ను కలిసిన పూర్ణ, అనంద్లను ఆయన అభినందించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకున్నారు. -
ఇది ఆనంద్‌లో ఆత్మవిశ్వాసం పెంచుతుంది
(పెంటేల హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్) కార్ల్సన్ ఈసారి ఓపెనింగ్‌కు సిసిలియన్ డిఫెన్స్‌ను, ఎప్పటిలాగే సైడ్లైన్ను ఎంచుకున్నాడు. పెద్దగా అటాకింగ్‌కు ఆస్కారం ఇవ్వకుండా సులువైన ఎత్తులతోనే ముందుకు సాగాడు. ఆనంద్‌పై పెద్దగా ఒత్తిడి కూడా పెంచలేకపోయాడు. బహుశా గత గేమ్ ప్రభావం నుంచి ఇంకా అతను బయట పడలేదేమో అనిపించింది. సరిగ్గా చెప్పాలంటే మ్యాచ్ ఆసాంతం ఇద్దరూ సమఉజ్జీలుగానే కనిపించారు. కార్ల్‌సన్‌కు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. అలాగే ఆనంద్ డిఫెన్స్ ఈ గేమ్‌లో బలంగా కనిపించింది. దాంతో ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కోగలిగాడు. ఇదే తరహాలో విషీ ఆడితే ఖచ్చితంగా చాంపియన్ ఒత్తిడిలో పడిపోతాడు. ఈ గేమ్‌లో 40వ ఎత్తు తర్వాత కార్ల్‌సన్‌కు అరుదైన అవకాశం దక్కిందేమో అనిపించింది. అయితే తర్వాతి ఎత్తులో ఆనంద్ క్వీన్‌ను డి2లోకి కదిలించడంతో సమస్య లేకుండా పోయింది. దాంతో మరో ఆరు ఎత్తులకే ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. నల్ల పావులతో ఆడి ఈ గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడం ఆనంద్‌కు ఎంతో మంచిది. అతనిలో ఆత్మవిశ్వాసం పెరగటంతో పాటు మానసికంగా కూడా ప్రత్యర్థిపై పైచేయి అవుతుంది. విరామం తర్వాతి గేమ్‌లో ఆనంద్ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇదే జోరులో తర్వాతి గేమ్ గెలిస్తే ఇక విషీకి తిరుగుండదు. -
ఆనంద్ పుంజుకుంటాడు
పెంటేల హరికృష్ణ తొలి గేమ్‌లో ఆనంద్కి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఎండ్ గేమ్‌లో అది ‘డ్రా'గా వెళ్లింది. కొంచెం దూకుడుగా ఆడి ఉంటే తొలి గేమ్‌లో ఆనంద్ గెలిచేవాడు. రెండో గేమ్‌లో ఆనంద్ బెర్లిన్ డిఫెన్స్‌తో ఆట ప్రారంభించాడు. చెన్నైలో జరిగిన గత చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ నల్ల పావులతో తొలుత ఇదే ఎత్తుతో ఆడాడు. కార్ల్సన్ థియరీలోకి వెళ్లకుండా సైడ్ లైన్ ఎంచుకున్నాడు. దీని ద్వారా ఆనంద్‌ని తన ప్రిపరేషన్స్‌లో నుంచి బయటకు తీసుకెళ్లాలనేది కార్ల్సన్ ఆలోచన. నిజానికి చాలావరకు ఈ గేమ్ సమానంగా సాగింది. ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారుడు ఎవరైనా ‘డ్రా’కు అంగీకరించే స్థితిలో గేమ్ ఉన్నప్పుడు... కార్ల్సన్ అద్భుతం చేశాడు. రూక్ని ఎ3కి తీసుకెళ్లి కొత్త ప్రయోగం చేశాడు. ఇది అత్యద్భుతమైన ఆలోచన. దీనిని ఆనంద్ ఏమాత్రం ఊహించలేదు. దీంతో అక్కడి నుంచి నెమ్మదిగా పట్టు కోల్పోయాడు. కార్ల్సన్ వేసిన ఈ ఒక్క ఎత్తు వల్ల అతనికి గేమ్‌లో అనేక ప్రత్యామ్నాయాలు కనిపించాయి. గతంలో గెల్ఫాండ్‌తో చాంపియన్‌షిప్‌లో ఆనంద్ తొలి గేమ్ ఓడిపోయాడు. కానీ పుంజుకుని టైటిల్ గెలిచాడు. కాబట్టి రెండో గేమ్ ఓటమి ప్రభావం ఆనంద్‌పై ఉండకపోవచ్చు. అయితే ఓడిపోయినప్పుడు సహజంగానే మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయిలో పాత ఫలితాన్ని చూసుకుంటే ముందుకు సాగడం కష్టం. ఇది ఆనంద్కి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మూడో రౌండ్లో ఆనంద్ మళ్లీ నల్లపావులతోనే ఆడతాడు. -
ట్రైనీ ఐపీఎస్ అధికారికి గాయాలు
-
ట్రైనీ ఐపీఎస్ అధికారికి గాయాలు
హైదరాబాద్: ఐపీఎస్ అధికారుల శిక్షణలో గురువారం అపశృతి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అధికారి తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో ట్రైనీ ఐపీఎస్ ఆనంద్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రాజకుమారి సంఘటన స్థలాని పరిశీలించారు. -
ప్రశాంతంగా నిమజ్జనం
సాక్షి, సిటీబ్యూరో: జంట కమిషనరేట్లలోని 23 చెరువులలో గణేశ్ నిమజ్జనం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగింది. గతేడాది పోలీసుల హడావుడి చేయడంతో నిర్వాహకులు నిమజ్జన ప్రక్రియను త్వరగా పూర్తి చేయగా..ఈ సారి పోలీసులు సహకరించడంతో నిదానంగా నిమజ్జనం చేశారు. అక్కడక్కడా ట్రాఫిక్‌కు కొంత అంతరాయం కలిగినా మొత్తం మీద చెప్పుకోదగ్గ సమస్యలు తలెత్తకపోవడంతో పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ ఊపిరిపీల్చుకున్నారు. గతనెల 29న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలకు నాలుగు రోజుల ముందు నుంచి సోమవారం జరిగిన నిమజ్జనం వరకు అనుసరించిన బందోబస్తు వ్యూహం ఫలించింది. ఉదయం 11.15కి నిమజ్జనానికి బయల్దేరిన బాలాపూర్ గణేశుడితో ప్రధాన శోభాయాత్ర మొదలైంది. ఈ యాత్రకు సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నగర పోలీసు కమిషరేట్ పరిధిలోకి వచ్చే కేశవగిరికి బాలాపూర్ గణేశుడు చేరుకున్నాడు. అక్కడి నుంచి నగర పోలీసులు ప్రధాన ఊరేగింపునకు బందోబస్తు వహించారు. చార్మినార్ వద్దకు ప్రధాన ఊరేగింపు చేరేలోపు ప్రార్థనల నేపథ్యంలో అక్కడి స్వాగత వేదికపై మూడు, నాలుగుసార్లు నేతల ప్రసంగాను పోలీసులు నిలిపివేయించారు. అలాగే ఊరేగింపును కూడా కొద్దిసేపు ఆపేశారు. ఆ తర్వాత ఊరేగింపు ముందుకు సాగింది. ఇదే సమయంలో పాతబస్తీలో డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు సీపీలు అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించారు. రెండు గంటల పాటు అక్కడే అన్నారు. ఆ తర్వాత బషీర్‌బాగ్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న మహేందర్‌రెడ్డి అక్కడి నుంచే కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీటీవీల ప్రసారాలను తిలకిస్తూ అక్కడి నుంచే అధికారులు, సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 6.30కి బాలాపూర్ గణేశుడు చార్మినార్ దాటాడు. గతంలో బాలాపూర్ గణేశుడు వెనకాల ఎలాంటి విగ్రహాలు వచ్చేవికావు. ఈసారి అలా కాకుండా ముందుగా బాలాపూర్ గణేశుడిని దాటించడం.. ఆ తర్వాత పాతబస్తీలోని విగ్రహాలు బయలు దేరడం జరిగింది. రాత్రి 9 గంటల వరకు కూడా పాతబస్తీలో ఊరేగింపులు కొనసాగుతునే ఉన్నాయి. ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ మీదుగా వచ్చిన గణనాథులు లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలిశాయి. ట్యాంక్‌బండ్, మిరాలంట్యాంక్, రాజన్నబావి,ఐడీపీఎల్ చెరువు, ప్రగతినగర్ చెరువు, హస్మత్‌పుర చెరువు, సఫిల్‌గూడ చెరువు, సరూర్‌నగర చెరువు, అల్వాల్ కొత్త చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్, షామీర్పేట, సూరారం, ఐడీఎల్ , వెన్నెలగడ్డ, లింగం, కాప్రా, కీసర, పూడురు చెరువులు, అలాగే, ఎల్లమ్మపేట, దుర్గం, హిమాయత్‌నగర్, మేకంపూర్ , బోయిన్, సున్నం చెరువు (మూసాపేట), మల్కన్, గంగారామ్చెరువులో నిమజ్జనం కొనసాగింది. నగరంలో 30 వేల మంది, సైబరాబాద్‌లో 9400 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమం ఇంకా పూర్తికాకపోవడంతో మంగళవారం కూడా బందోబస్తు యథావిధిగా కొనసాగుతుంది. -
స్నేక్ గ్యాంగ్ కేసులో సీఐ, ఎస్ఐల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ రేప్ కేసు ఉదంతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ వీరప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ సైబారాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్నేక్ గ్యాంగ్ రేప్ దృశ్యాలను వాట్సప్‌లో పంపించిన వారందరినీ సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో వాట్సప్‌లో ఆ దృశ్యాలు దర్శనమివ్వడానికి అసలు సూత్రధారి ఎవరనేది తేలుతుందని సైబర్‌క్రైమ్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఉదంతంలో సుమారు ఎనిమిది మందిని విచారించామని వారు తెలిపారు. -
పూర్ణ, ఆనంద్ కు సన్మానం
బెంగళూరు : ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లకు బెంగళూరులో ఆదివారం అపూర్వ సత్కారం లభించింది. ఈ సందర్భంగా జరిగిన సవూవేశంలో కర్ణాటక రాష్ర్ట రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ దేశాల ముందు భారతీయులు తల ఎత్తుకునే రోజు ఇదని అన్నారు. ఇలాంటి సాహసవంతులను అన్ని ప్రభుత్వాలు ఆదరించాలన్నారు. జేసీ రోడ్డులోని రవీంద్ర కళాక్షేత్రంలో బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సిద్ధం నారయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాలవత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌ను కర్ణాటక సంప్రదాయ రీతిలో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. -
ఇక జైలుకే...
మణికొండ: గండిపేట్‌లో ఆదివారం బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన పాతబస్తీకి చెందిన 80 మంది యువకులు, వారి తల్లిదండ్రులకు నార్సింగ్‌లోని కేవీఎంఆర్ ఫంక్షన్హాల్లో కమిషనర్ ఆనంద్ ఆధ్వర్యంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మరోసారి రేసింగ్‌కు పాల్పడి పోలీసులకు దొరికితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అతివేగంగా వాహనాలను నడపటం, రేసింగ్‌లకు పాల్పడటం వల్ల ప్రమాదాలు జరిగి మీ ప్రాణం పోగొట్టుకోవడమే కాకుండా కుటుంబసభ్యులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తారన్నారు. నగరం, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేయటం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని, తొమ్మిదిసార్లు తప్పించుకున్నా.. పదోసారి పోలీసులకు చిక్కక తప్పదన్నారు. అప్పుడు పడే బాధ గతంలో తప్పించుకున్నప్పటి సరదాకన్నా తీవ్రంగా ఉంటుందన్నారు. నగరశివార్లలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉండటంతో పాటు పోలీసుల నిఘా తక్కువగా ఉం టుందని శివార్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని, ఇకముం దు అలాంటి వాటిపై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేస్తామని కమిషనర్ అన్నారు. ఇకపై పోలీసులకు చిక్కిన వారికి మో టారు వాహన చట్టం, బెట్టింగ్‌లకు పాల్పడుతున్నందున గ్యా బ్లింగ్ చట్టం, అతివేగంగా వాహనాలు నడిపి ఇతరులకు ఇ బ్బంది కలిగిస్తున్నందున ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేసి జైలుకు పంపిస్తామని ెహ చ్చరించారు. మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. రేసర్లను పట్టుకున్నందుకు నార్సింగ్ సీఐ ఆనంద్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గతేడాది 1100 మంది మృతి: అవినాష్ మహంతి,ట్రాఫిక్ డీసీపీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 1100 మంది చనిపోయారని కౌన్సెలింగ్‌లో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ అవినాష్‌మహంతి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 1.50 లక్షల మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టడం సాధ్యమన్నారు. ఎవరైనా రేసింగ్లలో పాల్గొని జైలుకెళ్తే వారి జీవితం వృథా అవుతుందన్నారు. కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ రమేశ్‌నాయుడు, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, నార్సింగి సీఐ ఆనంద్రెడ్డిలతో పాటు నార్సింగ్ పోలీసులు పాల్గొన్నారు. జాగ్రత్త పడతాం: తల్లిదండ్రులు మాపిల్లలు బయట ఏం చేస్తున్నారనే విషయం ఇప్పటి వరకు తమకు తెలియదని, రాబోయే రోజుల్లో ఇలాంటి రేసింగ్‌లు, సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా చూసుకుంటామని యువకుల తల్లిదండ్రులు తెలిపారు. మొదటిసారి తప్పు చేశారు...రంజాన్ పండగ ఉన్నందున వారందరినీ వదలివేయాలని వేడుకున్నారు. యువకులు సైతం ఇకముందు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనమని హామీ ఇచ్చారు. దీంతో మరోసారి తప్పు చేయమని వారితో ప్రమాణం చేయించి వాహనాలతో పాటు వారిని పోలీసులు వదిలేశారు. వాట్స్ఆప్తో వర్తమానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్న రేసర్లు రాజేంద్రనగర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని బైక్రేసర్లు గత రెండు నెలలుగా తమ కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించారు. ఎట్టకేలకు నార్సింగ్ పోలీసులకు చిక్కిన ఈ రేసర్లు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. వాట్స్ఆప్, ఫేస్బుక్, యూట్యూబ్‌ల ద్వారా రేసింగ్‌లకు పాల్పడటంతో పాటు బెట్టింగ్స్ కూడా నిర్వహిస్తూ ఆశ్చర్యానికి గురి చేశారు. 12 ఏళ్ల బాలుడు సైతం ఈ రేసింగ్స్‌లో పాల్గొని తన సత్తా చాటడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. సైకిల్‌ను సైతం లేపలేని వయస్సులో బైక్‌ను సునాయాసంగా గాల్లోకి లేపుతూ విన్యాసాలు చేయడం ఔరా అనిపించింది. పోలీసులకు పట్టుబడ్డ 80 మందిలో 15 ఏళ్ల వయస్సులోపు వారే పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా రేసర్లను ‘న్యూస్‌లైన్’ ఆరా తీయగా వారు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్స్ఆప్లలో... బైక్రేసర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లలో చాటింగ్‌లు, యూట్యూబ్‌లలో తాము చేసిన విన్యాసాలను అప్లోడ్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఆదివారం ఎక్కడ? ఎన్ని గంటలకు కలవాలి తదితర విషయాలను ఒక్క రోజు ముందు వాట్స్ఆప్లో షేర్ చేసుకుంటున్నారు. ఈ విధంగా రేసింగ్ విషయం తమ వారికి తప్ప మరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. మొదట ఇద్దరు యువకులు.... ప్రతి ఆదివారం యువకులంతా బైక్రేసింగ్కు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఇద్దరు యువకులు ముందుగా ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి వెంటనే వాట్స్ఆప్ ద్వారా తమ గ్రూపు సభ్యులకు వచ్చేయమని మెసేజ్ పంపుతారు. నిమిషాల వ్యవధిలో గ్రూప్ సభ్యులంతా చేరుకొని బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. -
రోడ్డుపైనే తాళి కట్టిన ప్రియుడు
చెన్నై : ప్రియురాలిని ఆమె కుటుంబ సభ్యులు తన నుంచి ఎక్కడ దూరం చేస్తారనే భయంతో ఓ ప్రియుడు రోడ్డుపైనే తాళి కట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే ఊటీకి చెందిన దివ్య, ఆనంద్ అదే ప్రాంతంలోని ప్రయివేటు కళాశాలలో ఒకే తరగతిలో చదువుతున్నారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారం దివ్య తల్లిదండ్రులకు తెలియటంతో వారు ఆమెను మందలించారు. అయినా దివ్య తల్లిదండ్రుల మాట వినకపోవటంతో ఆమెను తంజావూరులోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి అక్కడ నిర్బంధించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆనంద్ కూడా తంజావూరు వచ్చాడు. దివ్య ఉంటున్న ఇంటికి వెళ్లిన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్యను తీసుకుని బస్టాండు చేరుకున్నాడు. అయితే దివ్య ఇంట్లో లేకపోవటంతో ఆమె బంధువులు వెతుక్కుంటూ బస్టాండ్ చేరుకున్నారు. దీంతో ఆనంద్ దిక్కుతోచని స్థితిలో హఠాత్తుగా రోడ్డుపైనే తను ప్రేయసి మెడలో తాళి కట్టాడు. ఊహించని ఈ సంఘటనతో బస్టాండులోని ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా ఆ సమయంలో అక్కడే ఉన్న తంజావూరు వైద్య కళాశాల పోలీసు ఇన్స్పెక్టర్ బాలమురుగన్ ఆ ప్రేమజంటను తన జీపులో ఎక్కించుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రేమజంటను విచారించిన పోలీసులు....వారిద్దరూ మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగారు!
-
నయా.. నేరగాళ్లు..!
* ‘ఈజీ మనీ’ కోసం నేరబాట పడుతున్న యువత * 2013లో చిక్కిన వారిలో అత్యధికులు కొత్తవారే.. * 2.8 లక్షల మందిలో 2.4 లక్షల మంది మొదటిసారి అరెస్టు * బాలబాలికల్లోనూ కనిపిస్తున్న నేరప్రవృత్తి సాక్షి, హైదరాబాద్: ఆనంద్, కిరణ్.. సాధారణ యువకులు.. డబ్బు కోసం పక్కదారి పట్టారు. పక్కా స్కెచ్ వేసి హైదరాబాద్‌లోని తనిష్క్ షోరూంలో రూ. 5.97 కోట్ల బంగారం చోరీ చేసి, జనవరిలో అరెస్టు అయ్యారు. పది చోరీలు చేసి మార్చిలో వనస్థలిపురం పోలీసులకు పట్టుబడిన ఇద్దరు దొంగల వయస్సు 17 ఏళ్లలోపే. చిన్న వయస్సులోనే వారు దొంగలుగా మారి, పలు చోట్ల లూటీ చేశారు. టాలీవుడ్లో ఆయనో అసిస్టెంట్ డెరైక్టర్.. కానీ, జల్సాల కోసం దొంగగా మారాడు. ఏప్రిల్‌లో మాదాపూర్ పోలీసులు అతన్ని పట్టుకోవడంతో గుట్టు రట్టయ్యింది. వీరంతా.. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరబాట పట్టినవారే. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో వివిధ నేరాల కింద 2,81,437 మందిని పోలీసులు అరెస్టు చేయగా, అందులో 87.4 శాతం.. అంటే 2,45,916 మందికి ఎలాంటి నేరచరిత్ర లేదు. కొత్తగా దొంగతనాలు చేస్తూ వీరంతా పట్టుపడ్డారు. ఇటీవల విడుదలైన నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొత్త నేరగాళ్ల సంఖ్యలో ఉమ్మడి రాష్ర్టం దేశంలోనే ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. ఈ నయా నేరగాళ్లు పాల్పడుతున్న నేరాల్లో స్నాచింగ్‌లు, వాహన దొంగతనాలు, చోరీలతో పాటు సైబర్ నేరాలూ అధికంగానే ఉంటున్నాయని పోలీసులు చెప్తున్నారు. మారిన జీవన విధానం, సాంకేతిక విప్లవం కారణంగా గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందిన వారు కూడా నేరాలను వృత్తిగా ఎంచుకుంటున్నారు. సొత్తు సంబంధ నేరాలకు పాల్పడి ఏటా పోలీసులకు చిక్కుతున్న వారిలో 70 శాతానికి పైగా కొత్త వారు ఉండటం దీనికి నిదర్శనం. దారితప్పుతున్న బాల్యం... 2013 సంవత్సరంలో ఉమ్మడి రాష్ర్టంలో మొత్తం 3,133 మంది మైనర్లు వివిధ నేరాల్లో పోలీసులకు చిక్కారు. వీరిలో నిరక్షరాస్యులు, ప్రాథమిక విద్య దశలోని వారే ఎక్కువగా ఉన్నారు. పూర్తిస్థాయిలో బాలల కన్నా, యవ్వనంలో అడుగుపెడుతున్న వారే ఎక్కువగా నేరబాట పడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అనాథలు, సంరక్షకుల వద్ద ఉన్న వారి కంటే తల్లిదండ్రులతో కలసి ఉంటూ నేరాలు చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం. సరైన అజమాయిషీ లేకపోవడం, ప్రేమానురాగాలు చూపకపోవడమే దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు. -
ఆనంద్‌తో సాక్షి ఫేస్ టూ ఫేస్
-
మట్టిలో మాణిక్యం పూర్ణ
గ్రామీణ గిరిజన కుటుంబంలో పుట్టి.. గురుకుల పాఠశాలలో చదివి.. ఎవరికీ అందనంత ఎత్తున్న ఎవరెస్టును ఎక్కింది. జిల్లా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. అసాధ్యాన్ని సైతం.. నిండైన ఆత్మవిశ్వాసంతో సుసాధ్యం చేసింది మన ఇందూరు బిడ్డ మాలావత్ పూర్ణ. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి వచ్చిన పూర్ణకు జిల్లా ఘనస్వాగతం పలికింది. పాకాల(సిరికొండ): ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ మట్టిలో మాణిక్యమని తెలంగాణ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ రిక్క లింబాద్రి అన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అనంతరం పూర్ణ తొలిసారిగా స్వగ్రామమైన పాకాలకు ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో లింబాద్రి మాట్లాడారు. ఒక సాధారణ గిరిజన బాలిక ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆణిముత్యం గా నిలిచిందన్నారు. పూర్ణ, ఆనంద్‌లను ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపిక చేసి పంపిస్తున్నప్పు డు ఎంతోమంది ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఏవేవో అన్నారని, వారికేమైనా జరిగితే పంజాగుట్ట చౌరస్తాలో నన్ను ఉరి తీస్తారని మాట్లాడారని ప్రవీణ్‌కుమార్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు. అనంతరం సన్మాన గ్రహీత పూర్ణ మాట్లాడుతూ ఎవరెస్ట్ అధిరోహణ కోసం ప్రయాణం ప్రారంభించిన రోజు మా శిక్ష కులు ఎవరెస్ట్ అధిరోహణ ఎంత కఠినతరమైందో మా తల్లిదండ్రులకు వివరించారన్నారు. అప్పుడు మా నాన్న కష్టపడితేనే కదా సార్ ఫలితం వచ్చేది అని చెప్పగానే నాకెంతో ఆనందం వేసిందని పూర్ణ గుర్తు చేశారు. డెత్ జోన్లో రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఎక్కుతున్నప్పుడు ఆకాశంలో కనిపించే నక్షత్రాల వెలుగును ఎంతో ఆస్వాదించానన్నారు. మా గ్రామం పాకాల పేరును ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని పూర్ణ తెలిపారు. ఐపీఎస్ ఆర్.ప్రవీణ్‌కుమార్, శిక్షకులు శేఖర్‌బాబు, పరమేష్‌కుమార్, వేణుగోపాలచారికి ఈసందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, పూర్ణ తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సన్మానం పూర్ణను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా స న్మానించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎ. సాయిలు పూర్ణకు శాలువా కప్పి పూలమాలలు వేశారు. అనంతరం పూర్ణతోపాటు ఆమె తల్లిదండ్రులకు సన్మానం చేసి నూతన వస్త్రాలను బహుకరించారు. కార్యక్రమంలో యూని యన్ నాయకులు గంగాదాసు, పాకాల నర్సిం లు, జిల్లా బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షుడు శశాంక్ తదితరులు ఉన్నారు. అధికారికంగా పూర్ణకు సత్కారం నిజామాబాద్ ఎంపీ కె. కవిత కలెక్టరేట్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దేశ ఖ్యాతిని మరింత పెంచిన మాలావత్ పూర్ణను త్వరలో అధికారికంగా సన్మానించనున్నట్లు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె తన స్వగృహంలో మాట్లాడారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అతిచిన్న వయస్సులో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా అధిరోహించిన పూర్ణను అభినందిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. పూర్ణను త్వరలో జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున సన్మానిస్తామని వివరించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సిరికొండ మండలం పాకాల గ్రామంలో భార త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూర్ణ ఆవిష్కరించారు. జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నారాయణ విగ్రహాన్ని వితరణగా అందించారు. గ్రామాని కి చెందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు గద్దె నిర్మించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలయ్య, సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సోసైటీ చైర్మన్ నర్సయ్య, పాల్గొన్నారు. భీమ్‌గల్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలోకెక్కిన జిల్లా వాసి మాలావత్ పూర్ణను ఆదివారం భీమ్‌గల్ జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ శర్మన్ ఆధ్వర్యంలో సన్మానించారు. పూర్ణ స్వగ్రామమైన పాకాలకు వచ్చిన పూర్ణకు శాలువా పూల మాలలు వేసి మెమెంటోతో సన్మానించారు. ఆమె వెంట టీఆర్ఎస్ నాయకులు శర్మన్ నాయక్, రాజేశ్వర్, లింబాద్రి తదితరులున్నారు. -
ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలకు నజరానా!
-
ఆనంద్, పూర్ణలకు కేసీఆర్ భారీ నజరానా
హైదరాబాద్: చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన తెలుగుతేజాలు ఆనంద్, పూర్ణలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు.. ఆనంద్, పూర్ణలకు చెరో 25 లక్షల రూపాయిల నగదు బహుమతిని ప్రకటించారు. తెలుగు తేజం మాలావత్ పూర్ణ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా సాధనపల్లి ఆనంద్‌కుమార్ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి.. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతున్నాడు. పూర్ణ, ఆనంద్‌లు దేశ వ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల లోక్‌సభ వీరిద్దరినీ అభినందించింది. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పూర్ణ, ఆనంద్‌లను అభినందించి ఘనంగా సన్మానించారు. ఢిల్లీలో పూర్ణ, ఆనంద్ వారిని కలిశారు. -
అవకాశం వస్తే..మరిన్ని శిఖరాలు ఎక్కేందుకు రెడీ
సూర్యాపేట : భవిష్యత్తులో అవకాశాలు వస్తే మరిన్ని శిఖరాలు ఎక్కేందుకు రెడీగా ఉన్నానని ఎవరెస్ట్ శిఖర అధిరోహికుడు సాధపల్లి ఆనంద్‌కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆనంద్‌కుమార్ మార్గమధ్యలోని సూర్యాపేట పట్టణంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా గాయత్రి టవర్స్‌లో భారతీ సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆనంద్‌కుమార్, ఆయన తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ ఎవరెస్ట్ చివరి క్యాంపు చేరాలంటే రాత్రి పూట లోయల మధ్య నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు. ఆ సమయంలో చాలా భయం వేసిందని ఆ సృ్మతులను గుర్తు చేసుకున్నారు. కొద్దిగా అదుపు తప్పినా కనీసం శవం కూడా దొరకని పరిస్థితి అన్నారు. ఓ సమయంలో కిందపడ్డామని, అయినా ధైర్యం తెచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లానని తెలిపారు. ఎవరెస్ట్ చేరాక జాతీయ జెండా, తెలంగాణ జెండాలు ఎగరవేశానని పేర్కొన్నారు. ఎవరెస్ట్‌పై తెలంగాణజెండాను ఎగరవేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎవరెస్ట్ అధిరోహించడం గర్వంగా ఉందన్నారు. ఆత్మవిశ్వాసం, ధృడసంకల్పం ఉంటే పేదవారు దేనికీ తక్కువ కారని నిరూపించవచ్చునని తెలిపారు. తిరిగి వస్తున్న సమయంలో రెండుమార్లు కిందపడ్డామని, తల్లిదండ్రులు, గురువులు, దేవుడి ఆశీర్వాదాలతో క్షేమంగా చేరుకున్నానని పేర్కొన్నారు. తాను భవిష్యత్తులో ఐపీఏఎస్ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ ఆటోట్రాఫ్ కోసం విద్యార్థులు ఎగబడ్డారు. కార్యక్రమంలో మొరిశెట్టి శ్రీనివాస్, మిర్యాల రాంమూర్తి, దేవరశెట్టి ఉమారాణి, మొరిశెట్టి యోగి, సోమ రవి, అక్కెనపల్లి శ్రీనివాసాచారి, పుట్ట వెంకన్నగౌడ్, పోరెండ్ల సత్యం, జి.శంకరాచారి, వెంపటి రాధాకృష్ణ, అజయ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పూర్ణ, ఆనంద్‌లకు నేపాల్‌లో సత్కారం
కఠ్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు మాలావత్ పూర్ణ(13), ఎస్. ఆనంద్ కుమార్(16)లకు ఆదివారం నేపాల్‌లో ఘన సత్కారం లభించింది. నేపాల్‌లో దళితుల హక్కుల కోసం పోరాడే జాగరణ్ మీడియా సెంటర్‌వారు కఠ్మాండులో ఈ ఇద్దరు టీనేజర్లనూ ఘనంగా సన్మానించారు. కాగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్‌లు చైనా వైపు నుంచి ఇటీవల ఎవరెస్టును అధిరోహించారు. వీరిలో పూర్ణ.. ఎవరెస్టును ఎక్కిన అతిపిన్న మహిళగా కూడా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. -
బేస్ క్యాంపునకు చేరుకున్న పూర్ణ, ఆనంద్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఎస్. ఆనంద్‌కుమార్‌లు తిరుగుప్రయాణంలో భాగంగా మంగళవారం సాయంత్రం బేస్‌క్యాంప్‌నకు చేరుకున్నారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్) నేతృత్వంలో వీరు ఎవరెస్ట్‌ను అధిరోహించగా, తిరుగుప్రయాణంలో భాగంగా అడ్వాన్డ్స్ బేస్ క్యాంప్(ఏబీసీ) నుంచి ఆదివారమే తిరుగుపయనమయ్యారు. అయితే, సోమవారం అక్కడి వాతావరణం ప్రతికూలంగా మారడంతో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ కిందికి దిగుతున్నారు. ఎవరెస్ట్ శిఖరం ఆఖరి పాయింట్‌గా పరిగణించే 8,848 మీటర్లు (సముద్రమట్టానికి 29,029 అడుగులు) నుంచి ఈ సాహసికులు దిగుతున్నారు. అక్కడ నుంచి కిందికి వస్తూ సముద్ర మట్టానికి 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్న డెత్ జోన్ (లీథల్ పాయింట్), 8,230 మీటర్లు ఎత్తులో ఉన్న క్యాంప్-6 (ఎల్లో బ్యాండ్), 7,775 మీటర్ల ఎత్తున ఉన్న క్యాంప్-5, 7,100 మీటర్ల ఎత్తున ఉన్న క్యాంప్-4 (నార్త్ కోల్) మీదుగా 6,500 మీటర్ల వద్ద ఉన్న అడ్వాన్డ్స్ బేస్ క్యాంప్ (ఏబీసీ)కు చేరుకున్నారు. -
ఈ బాలలను అబినందించాలి