రియాద్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన మ్యాజిక్ చూపించాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)కు షాకిచ్చాడు. బుధవారం ఓపెన్ విభాగంలో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 34 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను చిత్తు చేశాడు. తర్వాత వాంగ్ హావో (చైనా)తో జరిగిన పదో రౌండ్ గేమ్‌ను 23 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. 10 రౌండ్లు ముగిసే సరికి ఆనంద్ 7.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అంతకుముందు పొంక్రటోవ్ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్, మెక్‌షానే (ఇంగ్లండ్)తో జరిగిన ఏడోరౌండ్ గేమ్, ఫెడసీవ్ (రష్యా)తో జరిగిన ఎనిమిదోరౌండ్ గేమ్‌లను ఆనంద్ డ్రా చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ బుధవారం జరిగిన ఐదు గేముల్లో ఒక మ్యాచ్‌లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకున్నాడు. మమెదేవ్ (అజర్‌బైజాన్)తో జరిగిన పదోరౌండ్ గేమ్‌ను 51 ఎత్తుల్లో కోల్పోయి 6 పాయింట్లతో 37వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 7 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఆమె రెండు గేముల్లో గెలిచి మరో రెండింటినీ డ్రా చేసుకుంది. ఎనిమిదో రౌండ్‌లో రష్యన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైంది.
కార్ల్‌సన్‌కు ఆనంద్ షాక్
Published Thu, Dec 28 2017 12:39 AM | Last Updated on Thu, Dec 28 2017 12:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment