Chess
-
గుకేశ్‌కు చివరి స్థానం
హాంబర్గ్ (జర్మనీ): ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టూర్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నిరాశ పరిచాడు. శనివారం ముగిసిన ఈ టోర్నీలో గుకేశ్ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్లే ఆఫ్ పోరులో గుకేశ్ 0.5–1.5 పాయింట్ల తేడాతో అలిరెజా ఫిరౌజా (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో ఓడిన గుకేశ్... ప్లే ఆఫ్ రౌండ్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి రౌండ్‌ను ‘డ్రా’చేసుకున్న గుకేశ్... రెండో రౌండ్లో తెల్ల పావులతో ఆడినా సత్తా చాటలేకపోయాడు. 30 ఎత్తుల్లో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్‌గా విన్సెంట్ కైమెర్ (జర్మనీ) అగ్రస్థానం దక్కించుకోగా... ఫాబియా కరువానా (అమెరికా), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 4వ స్థానం), హికారు నకమురా (అమెరికా; 5వ స్థానం), నొడ్రిబెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్; 6వ స్థానం), అలిరెజా ఫిరౌజా (7వ స్థానం) నిలిచారు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో గుకేశ్ ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఈ టోర్నీ మొత్తంలో గుకేశ్ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయాడు. -
చెస్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యువ ఆటగాళ్లు కెరీర్లో ఎదిగేందుకు ప్రోత్సాహకంగా ఇప్పటి వరకు అందిస్తున్న ఆర్దిక సహకారాన్ని ఆపి వేయాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అంతర్జాతీయ ఈవెంట్లలో విజయాలు సాధిస్తేనే నగదు పురస్కారాలు లభిస్తాయి. చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌గా (జీఎం) మారితే రూ. 4 లక్షలు, ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) సాధిస్తే రూ.1.5 లక్షలు ఇచ్చేవారు. అయితే వీటిని నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని అగ్రశ్రేణి ఆటగాడు అర్జున్ ఇరిగేశి అభిప్రాయపడ్డాడు. ‘చెస్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్ధమాన ఆటగాళ్లకు ఈ సమస్య అర్థం కాకపోవచ్చు. కానీ వారిని ప్రోత్సహించే తల్లిదండ్రులకు మాత్రం ఈ నిర్ణయం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. దీని వల్ల వారికి ఆర్దికపరమైన సమస్యలు వస్తాయి. డబ్బుల కోసం ప్రత్యామ్నాయాలు చూడాల్సి వస్తుంది. పిల్లలను ప్రోత్సహించాలనే ప్రేరణ తగ్గిపోతుంది. సరిగ్గా చెప్పాలంటే చెస్, చదువులో ఏదైనా ఎంచుకోవాల్సి వస్తే వారు ఆటను పక్కన పెట్టవచ్చు’ అని అర్జున్ వ్యాఖ్యానించాడు. -
ఫ్రీ స్టయిల్ చెస్ నాకౌట్‌కు గుకేశ్
హంబర్గ్ (జర్మనీ): భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టూర్లో నాకౌట్‌కు అర్హత సాధించాడు. శనివారం క్వాలిఫయర్స్ చివరి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ గుకేశ్ ముందంజ వేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్‌లు ఆడిన గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించని భారత గ్రాండ్‌మాస్టర్... ఏడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని... మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాడు. ఫలితంగా గుకేశ్ ఖాతాలో 3.5 పాయింట్లు చేరాయి. పది మంది ప్లేయర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిదో స్థానంలో నిలవడం ద్వారా గుకేశ్ నాకౌట్లో అడుగుపెట్టాడు. క్వాలిఫయింగ్ దశ ముగిసే సరికి ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలిరెజా ఫిరౌజా, ఉజ్బేకిస్తాన్‌కు చెందిన జవోకిర్ సిందరోవ్ చెరో 6.5 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరున (6 పాయింట్లు) మూడో స్థానం దక్కించుకోగా... మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), హికారు నకమురా (అమెరికా) చెరో 5.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. జర్మనీకి చెందిన విన్సెంట్ కైమెర్ 4 పాయింట్లతో ఆరో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. ఉజ్బేకిస్తాన్‌కు చెందిన నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్, గుకేశ్ చెరో 3.5 పాయింట్లతో వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. -
వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగు తేజం
భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. న్యూయార్క్‌లోని వాల్ స్ట్రీట్‌లో ఇవాళ (డిసెంబర్ 29) జరిగిన 11వ రౌండ్లో హంపి ఐరీన్ సుకందర్‌ను ఓడించింది. ఈ టోర్నీలో మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.👏 Congratulations to 🇮🇳 Humpy Koneru, the 2024 FIDE Women’s World Rapid Champion! 🏆#RapidBlitz #WomenInChess pic.twitter.com/CCg3nrtZAV— International Chess Federation (@FIDE_chess) December 28, 2024హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండో సారి. 2019లో హంపి తొలిసారి వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను నెగ్గింది. హంపికి ముందు చైనాకు చెందిన జు వెంజున్ మాత్రమే వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిళ్లను ఒకటి కంటే ఎక్కువ సార్లు నెగ్గింది.పురుషుల విభాగం విజేతగా..వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పురుషుల విభాగం విజేతగా రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ వోలోదర్ ముర్జిన్ నిలిచాడు. ముర్జిన్ 13 రౌండ్లలో 10 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గా అవతరించాడు. ఈ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే వరకు అగ్రస్థానంలో నిలిచిన అర్జున్.. చివరి రౌండ్లలో వెనుకపడిపోయాడు. -
గుకేశ్‌ను సన్మానించిన రజనీకాంత్, శివకార్తికేయన్ (ఫోటోలు)
-
చదరంగంలో కొత్త రారాజు.. వరల్డ్ ఛాంపియన్‌గా గుకేష్ (ఫోటోలు)
-
ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా భారతీయుడు
సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. 14వ గేమ్‌లో గుకేశ్ ప్రస్తుత ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు. గుకేశ్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.THE EMOTIONS...!!! 🥹❤️- 18 Year Old Gukesh Dommaraju creating history by becoming the youngest ever champion. 🇮🇳 pic.twitter.com/LVkA8JMKM1— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (2012) వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. గుకేశ్ అత్యంత చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగానూ గుకేశ్ రికార్డు నెలకొల్పాడు. గుకేశ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా. THE PRECIOUS MOMENT. 🥹- Gukesh hugging his father aftee creating history. ❤️pic.twitter.com/iLs5aNFIEW— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024 -
చదరంగంలో చిచ్చర పిడుగు
మాటలు రాకముందే ఆటల వైపు ఆకర్షితుడైన ఆ చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు... మెదడుకు పదును పెంచేందుకు పజిల్స్‌ను పరిచయం చేశారు. సులభమైన పజిల్స్‌ను పక్కన పెట్టిన ఆ బుడ్డోడు... సంక్లిష్టత పెరుగుతున్నకొద్దీ వాటిని ఆస్వాదించడం ప్రారంభించాడు. కుమారుడి ఉత్సాహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడికి చదరంగాన్ని పరిచయం చేయగా... అందులో అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు సాగాడు. ఆరేళ్ల వయసులోనే భారత గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్‌లాంటి మేటి స్టార్స్‌ను తన ప్రతిభతో కట్టిపడేసిన ఆ బుడతడు... ఎనిమిదేళ్ల వయసులోనే క్యాడెట్ విభాగంలో అండర్–8 ప్రపంచ ర్యాపిడ్, క్లాసికల్ ఫార్మాట్ చెస్ చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచి అబ్బురపరిచాడు. చదరంగంలో సంచలనాలు సృష్టిస్తున్న తెలంగాణ కుర్రాడు ఆదుళ్ల దివిత్ రెడ్డి ప్రస్థానంపై ప్రత్యేక కథనం. సాక్షి క్రీడావిభాగం ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆదుళ్ల దివిత్ రెడ్డి... చిన్నప్పటి నుంచే చదరంగంలో చిచ్చర పిడుగులా చెలరేగుతున్నాడు. ఎనిమిదేళ్ల వయసులోనే ప్రపంచ క్యాడెట్స్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–8 ఓపెన్ కేటగిరీలో విజేగా నిలిచిన దివిత్ రెడ్డి.. అంతకుముందు వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే 1784 ఎలో రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్న దివిత్ రెడ్డి... భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాడు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశితో తలపడి తన ఎత్తులతో ఆకట్టుకున్న దివిత్ వారి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం డింగ్ లిరెన్ (చైనా)తో పోటీ పడుతున్న గుకేశ్... ‘ఈ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు. ఇతడి ఎత్తులకు ఆశ్చర్యం కలుగుతోంది’ అని కితాబు ఇచ్చాడంటే దివిత్ ప్రతిభ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్రత్యర్థులను కూడా అలవోకగా ఓడిస్తున్న దివిత్... భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన తల్లిదండ్రులు పసిప్రాయం నుంచి దివిత్‌ను ప్రోత్సహించగా... వారి కృషికి తగ్గ ఫలితం దక్కినటైంది. ‘చిన్నప్పుడు దివిత్ పజిల్స్ నింపడాన్ని ఇష్టపడేవాడు. ఎంతో క్లిష్టమైన పజిల్స్ ఇచ్చినా సునాయాసంగా పూర్తి చేసేవాడు. దీంతో అతడిని స్థానికంగా ఒక పజిల్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాం. అక్కడ కూడా ప్రతిభ చాటుకున్నాడు. దీంతో ఆన్లైన్ చెస్ కోచింగ్ ప్రారంభించాం’ అని దివిత్ తండ్రి మహేశ్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంకు చెందిన చెస్ కోచ్ పోలవరపు రామకృష్ణ శిక్షణలో మరింత రాటుదేలిన దివిత్... జాతీయ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటాడు. ఆరేళ్ల ప్రాయంలోనే దివిత్ అండర్–8 జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ‘నేను అతడిలో ప్రపంచ చాంపియన్‌ను చూశాను. ప్రోత్సహిస్తే ఫలితం ఉంటుందని ఆలోచించి... చదువుతో పాటు శిక్షణకు తగిన సమయం కేటాయించేలా చేశా. దీని కోసం నా భార్య ఉద్యోగాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో దివిత్‌కు చేదోడుగా నిలిచింది. కోవిడ్–19 కారణంగా వచ్చిన లాక్డౌన్ ఒక విధంగా మాకు మేలు చేసింది. చిన్న వయసులోనే అతడి ఎత్తులు చాలా వ్యూహాత్మకంగా ఉండటం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే వాళ్లు. దాన్నే కొనసాగిస్తూ విజయాలు సాధిస్తున్నాడు. గ్యారీ కాస్పరోవ్ అంటే దివిత్‌కు చాలా ఇష్టం. కాస్పరోవ్ తరహాలోనే అటాకింగ్ ఆటను ఇష్టపడతాడు. దాదాపు ఓడిపోయే స్థితి నుంచి కూడా తిరిగి పుంజుకోవడం దివిత్‌కు బాగా అలవాటు’ అని మహేశ్ రెడ్డి వివరించారు. ఈ ఏడాది 10 అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్న దివిత్ రెడ్డి సమీప భవిష్యత్తులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దక్కించుకోవడం ఖాయమే అని మహేశ్ అన్నారు. అమెరికాకు చెందిన భారత సంతతి కుర్రాడు అభిమన్యు మిశ్రా 12 సంవత్సరాల 4 నెలల 25 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలవగా... ఇప్పుడు ఆ రికార్డును దివిత్ బద్దలు కొడతాడని మహేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
హరికృష్ణ, విదిత్ జట్టుకు టైటిల్
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ (యూసీసీసీ) టీమ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నోవీ బోర్ చెస్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. 68 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో నోవీ బోర్ క్లబ్ జట్టు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. 2013లో, 2022లోనూ ఈ జట్టుకు టైటిల్ లభించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మొత్తం 84 జట్లు పోటీపడ్డాయి. నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత నోవీ బోర్ క్లబ్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన నోవీ బోర్ జట్టు ఒక మ్యాచ్ ను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, చెక్ రిపబ్లిక్లో స్థిరపడ్డ పెంటేల హరికృష్ణ, భారత గ్రాండ్‌మాస్టర్, మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ సంతోష్ గుజరాతి నోవీ బోర్ జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించారు. హరికృష్ణ 6 గేమ్‌లు ఆడి 3.5 పాయింట్లు సాధించగా... విదిత్ కూడా 6 గేమ్‌లు ఆడి 4 పాయింట్లు సంపాదించాడు. విన్సెంట్ కెమెర్ (జర్మనీ), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), డేవిడ్ ఆంటోన్ గిజారో (స్పెయిన్), థాయ్ డాయ్ వాన్ ఎన్గుయెన్ (చెక్ రిపబ్లిక్), నీల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), మాటెజ్ బార్టెల్ (పోలాండ్) విజేత జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న అల్కాలాయిడ్ క్లబ్ (నార్త్ మెసెడోనియా) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. అర్జున్ 7 గేమ్‌లు ఆడి 5.5 పాయింట్లు స్కోరు చేశాడు. 11 పాయింట్లతో వాడోస్ చెస్ క్లబ్ (రొమేనియా) మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో ప్రపంచ జూనియర్ చాంపియన్, భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్ సభ్యురాలిగా ఉన్న గరుడ అజ్కా బీఎస్కే క్లబ్ జట్టు 11 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. -
‘బంగారు తల్లి’ హారిక ద్రోణవల్లి.. అందమైన కుటుంబం (ఫొటోలు)
-
భారతీయ చదరంగం గురించి పలు ఆసక్తికర విషయాలు
భారతీయ చదరంగం (చెస్) గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూద్దాం. చదరంగం క్రీడ 6వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యంలో భారతదేశంలో ఉద్భవించిందని నమ్ముతారు. చదరంగాన్ని "చతురంగ" అని పిలిచేవారు. చతురంగ అంటే సైనికదళంలో నాలుగు విభాగాలు. పదాతిదళం, అశ్వికదళం, ఏనుగులు మరియు రథం.విశ్వనాథన్ ఆనంద్: మెరుపు పిల్లాడిగా పిలువబడే విశ్వనాథన్ ఆనంద్ 1988లో భారతదేశపు మొదటి గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అతను ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు.చెస్ ఒలింపియాడ్ విజయం: ఇటీవలి కాలంలో చెస్ ఒలింపియాడ్స్‌లో విశేషంగా రాణిస్తున్న భారత్.. 2024 FIDE చెస్ ఒలింపియాడ్‌లో డబుల్ స్వర్ణం (ఓపెన్, మహిళలు) సాధించింది.రైజింగ్ స్టార్స్: రమేష్‌బాబు ప్రజ్ఞానంద, డి గుకేష్ వంటి యువ ప్రతిభావంతులు అంతర్జాతీయంగా అద్భుతాలు చేస్తున్నారు. గుకేష్ ఇటీవల FIDE క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు.జాతీయ ఛాంపియన్‌షిప్‌లు: ఇండియన్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ ప్రపంచంలోని పురాతన టోర్నమెంట్లలో ఒకటి. మొదటి ఎడిషన్ 1955లో జరిగింది.విద్యలో చదరంగం: పాఠ్యాంశాల్లో చెస్‌ను చేర్చడంలో విశ్వనాథన్ ఆనంద్ కీలకపాత్ర పోషించాడు. చెస్ విద్యార్థుల్లో వ్యూహాత్మక ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని ఆనంద్ నమ్మాడు.చారిత్రక మైలురాళ్ళు: మాన్యువల్ ఆరోన్ 1961లో అంతర్జాతీయ మాస్టర్‌గా మారిన మొదటి భారతీయుడు.చదరంగం వేరియంట్లు: సాంప్రదాయ భారతీయ చెస్ వేరియంట్లు "శత్రంజ్" మరియు "చతురంగ" పలు ప్రత్యేక నియమాలను కలిగి ఉంటాయి.పాప్ సంస్కృతిలో చదరంగం: భారతీయ పాప్ సంస్కృతిలో చదరంగం గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. సినిమా మరియు టీవీ కార్యక్రమాలు తరచుగా చెస్‌ను ప్రధాన ఇతివృత్తంగా ప్రదర్శిస్తాయి.గ్లోబల్ ఇన్ఫ్లూయెన్స్: చదరంగంలో భారత దేశం యొక్క సహకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. భారత్ రికార్డు స్థాయిలో గ్రాండ్‌మాస్టర్లు, అంతర్జాతీయ మాస్టర్లను ఉత్పత్తి చేస్తుంది.చదవండి: బంగారం... మన చదరంగం -
చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలంపియాడ్లో తొలిసారి స్వర్ణం
చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ తొలిసారి స్వర్ణ పతకం సాధించింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు ఈ ఘనత సాధించింది. ఇవాళ (సెప్టెంబర్ 22) జరిగిన చివరి రౌండ్లో భారత్.. స్లొవేనియాపై విజయం సాధించి, బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. 97 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్ స్వర్ణం కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. 2014, 2022 ఎడిషన్లలో భారత్ కాంస్య పతకాలు సాధించింది.And Team India checkmates history by bringing home GOLD for the first time in 97 years of the game!Heartiest congratulations to our unstoppable Grandmasters @DGukesh, @rpraggnachess, @ArjunErigaisi, @viditchess, and @HariChess on winning GOLD🥇at the 45th FIDE Chess Olympiad!… pic.twitter.com/FNOtQ9LCCs— Nitin Narang (@narangnitin) September 22, 2024స్లొవేనియాతో జరిగిన చివరి రౌండ్ పోటీల్లో అర్జున్ ఎరిగైసి భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత డి గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద వరుస విజయాలు సాధించి భారత్‌కు స్వర్ణ పతకం ఖరారు చేశారు. ఈ ఎడిషన్‌లో భారత్ ఒక్క రౌండ్లోనూ ఓడిపోకుండా అజేయ జట్టుగా నిలిచింది. ఆది నుంచి ఎనిమిది రౌండ్ల పాటు విజయాలు సాధించిన భారత్.. తొమ్మిదో రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఉజ్బెకిస్థాన్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అనంతరం టాప్ సీడ్ యూఎస్ఏ, స్లొవేనియాపై విజయాలు సాధించి తిరిగి గెలుపు బాట పట్టింది. చదవండి: శెభాష్ టీమిండియా.. చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో -
చరిత్రలో తొలిసారి..!
చరిత్రలో తొలిసారి ఇద్దరు భారత గ్రాండ్ మాస్టర్లు లైవ్ చెస్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో చోటు దక్కించుకున్నారు. చెస్ ఒలింపియాడ్‌లో తాజా ప్రదర్శనల అనంతరం అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్ లైవ్ ర్యాంకింగ్స్‌లో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అర్జున్ ఖాతాలో 2788.1 పాయింట్లు ఉండగా.. గుకేశ్ ఖాతాలో 2775.2 పాయింట్లు ఉన్నాయి. 2832.3 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లైవ్ ర్యాంకింగ్స్ అనేవి రియల్ టైమ్‌లో అప్డేట్ అయ్యే రేటింగ్స్. ఫిడే నెలాఖర్లో ప్రచురించే రేటింగ్స్‌కు వీటికి వ్యత్యాసం ఉంటుంది.కాగా, బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో పాల్గొంటున్న భారత చెస్ ప్లేయర్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ టోర్నీలో భారత పురుషులు, మహిళల జట్లు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేశాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-1తో ఆతిథ్య హంగేరిని ఓడించింది. ఈ టోర్నీలో అర్జున్ ఎరిగైసి వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేయగా.. రిచర్డ్‌తో జరిగిన గేమ్‌ను గుకేశ్ డ్రాగా ముగించాడు. మహిళల జట్టు 2.5-1.5 తేడాతో అర్మేనియాపై విజయం సాధించింది.చదవండి: కొరియాను చిత్తు చేసిన భారత్.. ఆరోసారి ఫైనల్లో -
‘మహిళల టోర్నీల సంఖ్య పెంచాలి’
న్యూఢిల్లీ: మహిళల చెస్‌కు మన దేశంలో మరింత ప్రోత్సాహం అందించాలని, లేదంటే రాబోయే రోజుల్లో మంచి ప్లేయర్లు రావడం తగ్గిపోతుందని భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారిణి, వరల్డ్ ర్యాపిడ్ మాజీ చాంపియన్ కోనేరు హంపి అభిప్రాయ పడింది. ఇందులో భాగంగా ఎక్కువ సంఖ్యలో టోర్నీలు నిర్వహించాలని ఆమె సూచించింది. ఇటీవలి కాలంలో గుకేశ్, ప్రజ్ఞానంద తదితరుల ఆటతో పురుషుల విభాగంలో చెస్‌కు ప్రాచుర్యం బాగా పెరిగింది. అయితే మహిళల విభాగంలో మాత్రం పరిస్థితి అలా లేదు. ఇప్పటికి 37 ఏళ్ల హంపి, 33 ఏళ్ల ద్రోణవల్లి హారికలే ప్రపంచ వేదికపై మన చెస్‌ను నడిపిస్తున్నారు. ‘మహిళా చెస్ ప్లేయర్ల శాతం చాలా తక్కువగా ఉంది. మనం మరిన్ని మహిళా టోర్నీలు నిర్వహించాలని నా అభిప్రాయం. ప్రతిభావంతులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చెస్ భవిష్యత్తు కోసం ఇది ఎంతో ముఖ్యం. లేదంటే ఇద్దరు, ముగ్గురికి మించి టాప్ ప్లేయర్లు ఉండరు. రాబోయే తరంపై దృష్టి పెట్టకపోతే చెస్ ఆటగాళ్లు వెలుగులోకి రావడం కష్టంగా మారి అంతరం చాలా పెరిగిపోతుంది. వచ్చే 10–15 ఏళ్లలో కూడా మీకు మంచి ఆటగాళ్లు కనిపించరు’ అని హంపి ఆందోళన వ్యక్తం చేసింది. చైనాను చూసి నేర్చుకోవాలి భవిష్యత్ ఆటగాళ్లను ఎలా తయారు చేసుకోవాలనే విషయంలో చైనాను చూసి భారత్ ఎంతో నేర్చుకోవాలని హంపి వ్యాఖ్యానించింది. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత చైనా చెస్‌లో పవర్‌హౌస్‌గా ఎదిగిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ‘ఈ విషయంలోనే భారత్, చైనాకు మధ్య చాలా తేడా ఉంది. చైనాలో ఒకరి తర్వాత మరొకరు కొత్త ప్లేయర్ వెంటవెంటనే వచ్చేస్తుంటారు. ఒక అగ్రశ్రేణి ప్లేయర్ కెరీర్ ముగుస్తున్న దశలో కొత్త తరం ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. మన దేశంలో మహిళల చెస్‌పై ఫెడరేషన్ మరింత దృష్టి పెట్టాలి’ అని హంపి పేర్కొంది. కోవిడ్ సమయంలో ఇతర క్రీడా పోటీలన్నీ దాదాపుగా రద్దు కాగా... ఆన్లైన్ టోర్నీల కారణంగా చెస్ మాత్రమే బాగా ప్రజాదరణ పొందిందని హంపి చెప్పింది. ‘కోవిడ్ సమయాన్ని సానుకూలంగా వాడుకున్న క్రీడ చెస్ మాత్రమే. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ఆన్లైన్ టోర్నీలు జరిగాయి. ఇతర పనులేవీ లేకపోవడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఆ సమయంలో మన దేశంలో చెస్ దూసుకుపోయింది కెప్టెన్. ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి లాంటివారు కూడా కోవిడ్ సమయంలో పెద్ద సంఖ్యలో టోర్నీలు ఆడారు. తర్వాతి రోజుల్లో ఇదే జోరును కొనసాగించి వారి రేటింగ్‌ను మెరుగుపర్చుకున్నారు’ అని హంపి విశ్లేíÙంచింది. సరైన ప్రాక్టీస్ లేకనే... తన కూతురి వయసు పెరుగుతుండటంతో చెస్‌కు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని హంపి వెల్లడించింది. ‘పాపకు ఇప్పుడు ఏడేళ్లు. ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడైతే ఇంట్లో అమ్మ దగ్గర వదిలి టోర్నీలకు వెళ్లిపోయేదాన్ని. ఇప్పుడు అలా సాధ్యం కావడం లేదు. స్కూల్ హోమ్‌వర్క్, ఆటలు... ఎక్కడైనా నేను తనతో ఉండాలని ఆమె కోరుకుంటోంది. దాంతో ప్రాక్టీస్‌కు సమయం లభించక టోర్నీలకు దూరమవుతున్నా. అయితే అమ్మగా మారిన తర్వాత నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు చిన్నపాటి అంతరాయం వచ్చినా నా ఏకాగ్రత చెదిరిపోయేది. ఇప్పుడు అలా కాదు. గతంలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతోనే ఆడేదాన్ని. ఇప్పుడు స్థితప్రజ్ఞత వచ్చింది’ అని ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వివరించింది. ప్రస్తుతం బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఒలింపియాడ్‌కు దూరంగా ఉన్న హంపి త్వరలో జరిగే గ్లోబల్ చెస్ లీగ్‌లో ముంబా మాస్టర్స్ తరఫున బరిలోకి దిగనుంది. ఆ తర్వాత కజకిస్తాన్‌లో జరిగే మహిళల గ్రాండ్‌ప్రి, టాటా స్టీల్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో ఆడుతుంది. -
గుకేశ్ ఖాతాలో ఏడో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశారు. టాప్ సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇయాన్ నిపోమ్‌నిషి (రష్యా)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) ఐదు పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో కరువానా రెండో స్థానంలో నిలిచాడు. 3.5 పాయింట్లతో గుకేశ్, మాక్సిమి లాచెర్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్), వెస్లీ సో (అమెరికా), ప్రజ్ఞానంద సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
జాతీయ ఓపెన్ చెస్ చాంపియన్ కార్తీక్ వెంకటరామన్
ఆద్యంతం అజేయంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌గా అవతరించాడు. హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ టోర్నీ మంగళవారం ముగిసింది. నిర్ణీత 11 రౌండ్లకుగాను కార్తీక్‌తోపాటు సూర్యశేఖర గంగూలీ (పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు), నీలేశ్ సాహా (రైల్వేస్) 9 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... కార్తీక్‌కు టైటిల్ వరించింది. కార్తీక్‌కు రూ. 6 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది. అంతేకాకుండా 2025 ప్రపంచకప్ టోర్నీకి భారత్ తరఫున కార్తీక్ అర్హత సాధించాడు. సూర్యశేఖర గంగూలీ రన్నరప్‌గా నిలువగా, నీలేశ్ సాహా మూడో స్థానం దక్కించుకున్నాడు. మిత్రబా గుహ (రైల్వేస్)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన కార్తీక్ 58 ఎత్తుల్లో గెలిచాడు. కార్తీక్కిది రెండో జాతీయ టైటిల్. 2022లో అతను తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించాడు. -
డింగ్ లిరెన్‌తో గుకేశ్ గేమ్ ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’తో ప్రారంభించాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను గుకేశ్ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. డింగ్ లిరెన్, గుకేశ్ మధ్య ఈ ఏడాది నవంబర్‌లో సింగపూర్ వేదికగా ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తలపడటం ఆసక్తిని కలిగించింది.భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద కూడా తన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మొత్తం పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), వెస్లీ సో (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), డింగ్ లిరెన్ (చైనా), ఇయాన్ నెపోమ్నిషి (రష్యా), మాక్సిమి వాచెర్ లెగ్రావ్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. -
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిడే రేటింగ్ లిస్ట్‌లో (ర్యాంకింగ్స్) తొలిసారి ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లు టాప్-10లో నిలిచారు.2024 జులై నెల ర్యాంకింగ్స్‌లో అర్జున్ ఎరిగైసి నాలుగో స్థానంలో, డి గుకేశ్ ఏడులో, ఆర్ ప్రజ్ఞానానంద ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారతీయ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో నిలిచాడు. అరవింద్ చితంబరం ఏకంగా 18.5 ఎలో రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని 44వ స్థానం నుంచి 29 స్థానానికి ఎగబాకాడు. జులై నెల పురుషుల రేటింగ్ లిస్ట్ టాప్ 100 జాబితాలో ఏకంగా పది మంది భారతీయులు (అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్, ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతీ, అరవింద్ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్ సరిన్, ఎస్ ఎల్ నారాయణన్, సద్వాని రౌనక్) ఉండటం గమనార్హం.మహిళల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. జులై నెల రేటింగ్ లిస్ట్ టాప్-14లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ద్రోణవల్లి హారిక రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలే బాలికల జూనియర్ వరల్డ్ టైటిల్‌ను గెలిచిన దివ్య దేశ్‌ముఖ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుండి 20వ స్థానానికి ఎగబాకింది. -
ప్రతిష్టాత్మక చెస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న అర్జున్ ఎరిగైసి
భారత టాప్ రేటెడ్ చెస్ గ్రాండ్‌మాస్టర్, వరల్డ్ నంబర్ 4 అర్జున్ ఎరిగైసి ప్రతిష్టాత్మక స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ 2024 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆర్మేనియాలోని జెర్ముక్లో జరిగిన ఈ టోర్నీని అర్జున్ మరో రౌండ్ మిగిలుండగానే గెలుచుకున్నాడు. ఎనిమిదో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన అర్జున్.. రష్యాకు చెందిన వోలోడర్ ముర్జిన్ను 63 ఎత్తులో చిత్తు చేశాడు. తద్వారా ఐదో స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మొత్తం 10 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నీలో అర్జున్ ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలువగా.. రెండో స్థానంలో నిలిచిన ముగ్గురు ప్లేయర్లు 4.5 పాయింట్లు సాధించారు. నామమాత్రపు చివరి రౌండ్లో అర్జున్ లోకల్ బాయ్ మాన్యుయల్ పెట్రోస్యాన్‌తో తలపడతాడు.ఈ టోర్నీలో అర్జున్ నాలుగు విజయాలు, నాలుగు డ్రాలతో తొమ్మిది ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి, ఓవరాల్‌గా తన రేటింగ్ పాయింట్ల సంఖ్యను 2779.9కు పెంచుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మాగ్నస్ కార్ల్సన్ (2831.8), హకారు నకమురా (2801.6), ఫాబియానో కరువానా (2795.6) టాప్-3లో ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఫాబియానోకు అర్జున్‌కు కేవలం 16 రేటింగ్ పాయింట్లే తేడా ఉన్నాయి. -
వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న దివ్య
గుజరాత్‌లోని గాంధీ నగర్లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ జూనియర్ (అండర్-20 అమ్మాయిల విభాగం) చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత నంబర్ 3 క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల దివ్య.. ఫైనల్ రౌండ్లో బల్గేరియాకు చెందిన బెలొస్లావా క్రస్టేవాపై విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 11 పాయింట్లకు గానూ 10 పాయింట్లు సాధించిన దివ్వ టాప్ ప్లేస్‌లో నిలిచింది.ఈ పోటీలో దివ్య తెల్ల పావులతో బరిలోకి దిగింది. గత నెలలో షార్జా ఛాలెంజర్స్ టైటిల్ గెలిచిన తర్వాత దివ్యకు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో దివ్య తర్వాతి స్థానంలో 20 ఏళ్ల ఆర్మేనియా క్రీడాకారిణి మరియమ్ నిలిచింది. మరియమ్ 11 పాయింట్లకు గాను 9.5 పాయింట్లు సాధించింది. మూడో స్థానంలో అజర్ బైజాన్‌కు చెందిన అయాన్ అల్లావెర్దియేవా నిలిచింది. ఈమె ఖాతాలో 8.5 పాయింట్లు ఉన్నాయి. భారత్‌కు చెందిన షుబి గుప్తా, రక్షిత రవి 8, 7.5 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన దివ్య రెండు డ్రాలు, తొమ్మిది విజయాలు సాధించి, తన ఎనిమిదో జూనియర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
ఐదేళ్ల వయసులోనే అబ్బురపరిచే ప్రతిభ.. అరుదైన ఘనత
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల వయసులోనే ఓ చిచ్చర పిడుగు అద్బుతం చేసింది. కేవలం 9.23 నిమిషాల్లో 104 చెక్‌మేట్-ఇన్-వన్-మూవ్ పజిల్స్‌ను పరిష్కరించి వహ్వా అనిపించింది. చెస్ ప్రాడిజీ ఇషాని చక్కిలం ఈ ఘనత సాధించింది. ఇషాని నమోదు చేసిన ఈ ఫీట్‌ను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ అధికారికంగా గుర్తించాల్సి ఉంది. కాగా ఇషాని.. రాయ్ చెస్ అకాడమీకి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థిని. అసాధారణమైన నైపుణ్యం, దృఢ సంకల్పంతో చిన్న వయసులోనే ఈ అద్బుతం చేసింది. ఆమెలో దాగున్న ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు శ్రీకాంత్- శ్రావ్య చక్కిలం విజయవంతంగా ముందుకు సాగేలా ప్రోత్సాహం అందిస్తున్నారు.రాయదుర్గంలో జరిగిన ఈ ఈవెంట్‌కు మంత్రి కొండా సురేఖతో పాటు బ్రిటిష్ డిప్యూటీ హై-కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కూడా హాజరయ్యారు. ఇషాని ప్రతిభకు ముగ్ధులై ఆమెను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చెస్ క్రీడాకారులు, కోచ్‌లు, ఇషాని బంధువులు, స్నేహితులు కూడా పాల్గొన్నారు. -
సక్సెస్‌కి ఏజ్‌తో సంబంధం లేదంటే ఇదేనేమో..! ఏకంగా ఫిడే చెస్..
చెస్ స్టార్ జియానా గార్గ్ అతి పిన్న వయస్కురాలైన చెస్ ఛాంపియన్. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ఫిడే(ప్రపంచ చెస్ సమాఖ్య) రేటింగ్ పొంది అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేగాదు అత్యంత చిన్న వయసులో ఈ రేటింగ్ పొందిన చిన్నారిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదేళ్ల వయసులో అత్యున్నత అంతర్జాతీయ ప్రపంచ చెస్ సమాఖ్య రేటింగ్‌ని పొందిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అమె చెస్ జర్నీ ఎలా సాగిందంటే..జియానా గార్గ్ సాధించిన ఫిడే చెస్ రెటింగ్ నిజంగా అసాధారణమైనది. అత్యధిక ఫీడే చెస్ రేటింగ్ సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు ఆమె. ఈ విజయాన్ని చూస్తే జియానాకు చదరంగం పట్ల ఉన్న ఇష్టం, అంకితభావం క్లియర్‌గా తెలుస్తోంది. ఆమె చెస్ నేర్చుకోవడం ప్రారంభించింది కేవలం నాలుగున్నరేళ్ల నుంచే..చాలా వేగంగా ఈ క్రీడలో అపార జ్ఞానాన్ని సంపాదించింది. ఈ విజయంలో జియాని గురువు నవీన్ బన్సాల్ పాత్ర ఎక్కువే ఉంది. చండీగఢ్ చెస్ అసోసీయేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన నవీన్ బన్సాల్ మొదట్లో ఇంత చిన్న వయసులో ఉన్న ఆ చిన్నారికి చెస్ నేర్పించడానికి చాలా సంకోచించాడు. ఎందుకంటే..?ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులకు చెస్ ఎట్టిపరిస్థితుల్లో నేర్పించరు. అందువల్ల ఆయన ముందుకు రాలేకపోయినా..జియానాలో ఉన్న ప్రతిభ ఆయన్ను ఆకర్షించింది. ఆమెకు చెస్ మెళుకువలు నేర్పించేలా చేసింది. అదీగాక జియానా అమ్మ కూడా తన కూతురు క్రమశిక్షణతో ఉంటుందని ఒప్పించేలా ఒక వీడియో కూడా తనకు పంపినట్లు తెలిపారు. ఐతే ఆమె కొన్ని నెలల శిక్షణలోనే చెస్అ డ్వాన్స్‌డ్ బ్యాచ్‌లో పదోన్నతి పొందింది. "తను నా ఉపన్యాసాలను వినేలా అత్యంత అధునాతన బ్యాచ్‌లో ఉంచి మరీ కోచింగ్ ఇప్పించాం. ఐతే ఆమె అనుహ్యంగా మంచి రేటింగ్ ఉన్న ఇతర పిల్లలతో సమానంగా పోటీ పడటం ప్రారంభించిదని గుర్తించి, ఆమెకు చక్కటి తర్ఫీదు ఇచ్చామని చెప్పారు". బన్సాలీ. ఆమె ఇంతలా చెస్‌పై అంకితభావంతో నేర్చుకునేలా దృష్టిసారించడంలో జియానా తల్లి పాత్ర అద్భుతమైనదని అన్నారు. తల్లిదండ్రులు సహకారం లేకుండా ఏ కోచ్ కూడా ఇంత చిన్న వయసులోనే చెస్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దలేరని అన్నారు.జియానా చెస్ విజయాలు..జియానా గార్గ్ మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ 2024, నేషనల్ అండర్-11 గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్-2023, మొదటి మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2023, మొదటి లేట్ శ్రీ ధీరాజ్ సింగ్ మెమోర్ ఓపెన్ రఘువానిడే, రేటింగ్ టోర్నమెంట్ 2023 వంటి అనేక టోర్నమెంట్లలో పాల్గొంది. ఆమె తను గురువుల మార్గదర్శకత్వంలో చేసిన అచంచలమైన కృషి, అంకితభావాలకి నిదర్శనమే ఈ విజయాల పరంపర. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చదరంగా ఔత్సాహికులకు స్పూర్తిగా నిలిచింది. పైగా ఈ పురాతన చెస్ క్రీడలో రాణించడానికి వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది.(చదవండి: 'రజనీకాంత్ స్టైల్ దోసలు': చూస్తూనే ఉండిపోతారు..!) -
చెస్ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు
చెస్ అనేది అనేక ప్రయోజనాలను అందించి, మేధో సంపత్తిని పెంపొందిచే మనోహరమైన క్రీడ. ఈ క్రీడను క్రమం తప్పకుండా ఆడటం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.దృక్కోణం పెరుగుతుంది: చెస్‌కు క్రమం తప్పకుండా ఆడటం వల్ల వ్యక్తుల యొక్క దృక్కోణం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎదుటివారి కదలికలను సులువుగా పసిగట్టవచ్చు. సామాజిక సంబంధాలు మెరుగుపర్చుకోవడంలో చెస్ క్రీడ కీలకపాత్ర పోషిస్తుంది.జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది: ప్రతి రోజు కొంత సమయం పాటు చెస్ ఆడటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చెస్ అనునిత్యం ఆడటం వల్ల దృశ్య నమూనాలను మరింత త్వరగా గుర్తిస్తారు.చురుకుదనం పెరుగుతుంది: చెస్ ఆడటంలో నైపుణ్యం కలిగిన వారు ఇతరులతో పోలిస్తే మానసిక చురకుదనం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి మానసిక స్థితి అథ్లెట్లు, కళాకారుల మాదిరిగా ఉంటుంది.ప్రణాళికా నైపుణ్యాలను పెంచుతుంది: చెస్ క్రమం తప్పకుండా ఆడటం వల్ల ప్రణాళికా నైపుణ్యం, దూరదృష్టి పెరుగుతాయి. ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది.స్వీయ-అవగాహన పెరుగుతుంది: చెస్ ఆడటం వల్ల స్వీయ అవగాహన పెరుగుతుంది. దీని వల్ల మనల్ని మనం విశ్లేషించుకోవచ్చు. మన తప్పులు మనం తెలుసుకోగలుగుతాం.వృద్దాప్యంలో తోడ్పడుతుంది: మానసిక ఉత్తేజాన్ని కలిగించే చెస్‌ను క్రమం తప్పకుండా ఆడటం వల్ల వృద్దాప్యంలో ఎదురయ్యే మేధస్సు క్షీణత వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.ఏకాగ్రత సాధించేందుకు దోహదపడుతుంది: చెస్ అనునిత్యం ఆడటం వల్ల ఏకాగ్రత లోపం సమస్య నుంచి బయటపడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.భయాందోళనలను తగ్గిస్తుంది: చెస్ ఆడే సమయంలో చూపే ఏకాగ్రత కారణంగా భయాందోళనలు తగ్గుతాయి.పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి: చిన్నతనం నుంచి చెస్ ఆడటం అలవాటు చేసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. -
ATA Convention 2024: అదరహో అన్నట్టుగా సాగుతున్న ‘ఆటా’ ఆటల పోటీలు
కన్వెన్షన్ అంటే సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తుల సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాల సమూహం. ఈ ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు మామూలు వాళ్ళు కాదండోయ్.. ఆటపాటలతో పాటు ఆరోగ్యమే మహా భాగ్యమన్న రీతిలో అమెరికాలోని పలు నగరాలలో మెగాఆటా కన్వెన్షన్(18వ) నిర్వహించనుంది.యూత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా అసాధారణమైన ప్రతిభ, క్రీడాస్ఫూర్తి, సమాజ స్ఫూర్తిని ప్రదర్శించే థ్రిల్లింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొన్న వారికి.. అదే విధంగా ప్రేక్షకులకు చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తోంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్స్, క్రికెట్, చెస్ వంటి పురుషులు / బాలురు మరియు మహిళలు / బాలికల కోసం చేస్తున్న వివిధ క్రీడలు వైవిధ్యభరితంగా, ఉత్సాహ పూరితంగా సాగడం ఆటా వారి బహుముఖ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కన్వెన్షన్ ఈవెంట్ జూన్ 7న మొదలుకానుంది. అందరూ ఆహ్వానితులే, మరిన్ని వివరాలకు, టికెట్లకు www.ataconference.org ని సందర్శించాలని ఆటా తెలిపింది.కాగా ఆటా స్పోర్ట్స్ టీమ్ నేతృత్వంలో సువానీలోని ఏబిసి సెంటర్లో జరిగిన ఆటా బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టోర్నమెంట్లో వివిధ విభాగాల్లో దాదాపు 160 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఓపెన్ సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో పోటీ తీవ్రంగా ఉండటం క్రీడాస్ఫూర్తిని మరింత పెంచింది.ఇక షేఖరాగ్ పార్క్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సరే సరి.. అధిక సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొనడం.. మునుపెన్నడూ లేనన్ని జట్లు ముందుకు రావడం వల్ల ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.అదే విధంగా... పలు రాష్ట్రాల నుండి దాదాపు 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొన్న చదరంగం టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది చెస్ట్రోనిక్స్ ద్వారా సులభతరం చేయబడింది. ఆటా కన్వెన్షన్‌లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఫౌలర్ పార్క్ రెక్ సెంటర్లో జరిగిన ఆటా మహిళల పికిల్ 8బాల్ టోర్నమెంట్ అన్ని ఈవెంట్లలోకి హైలైట్ అని చెప్పవచ్చు. నీతూ చౌహాన్ నేతృత్వంలో ఆటా మహిళా స్పోర్ట్స్ టీమ్ నిర్వహించిన ఈ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగాలు అన్ని స్కిల్ లెవెల్స్ ప్లేయర్లకు జరిగాయి.ఆటా మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విభిన్న నేపథ్యాలు మరియు నైపుణ్య స్థాయిల క్రీడాకారులను ఒకచోట చేర్చింది. ఈ ఈవెంట్ ప్రారంభ మరియు మధ్య స్థాయిలలో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలను కలిగి ఉంది, పాల్గొన్న వారికి వ్యక్తిగతంగా, జట్టులో భాగంగా పోటీ చేసే అవకాశాన్ని అందించింది.స్పోర్ట్స్ కమిటీ ఛైర్ అనంత్ చిలుకూరి, ఉమెన్స్ స్పోర్ట్స్ ఛైర్ నీతూ మాట్లాడుతూ.. ‘‘ ఇటీవలి స్పోర్ట్స్ ఈవెంట్ల విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాళ్ల ప్రతిభ, క్రీడాస్ఫూర్తి స్థాయి నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ ఈవెంట్లను అద్భుతంగా విజయవంతం చేసినందుకు క్రీడాకారులు, నిర్వాహకులు, వాలంటీర్లు, స్పాన్సర్లతో సహా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటివి మున్ముందు మరిన్ని జరగబోతున్నాయి’’ అని తెలిపారు.కాగా స్పోర్ట్స్ కమిటీలు, రీజనల్ కోఆర్డినేటర్లు అనంత్ చిలుకూరి, నీతూ చౌహాన్, శ్రీకాంత్ పాప, వెంకట్ రోహిత్, రంజిత్ చెన్నాడి, హరికృష్ణ సికాకొల్లి, సుభాష్ ఆర్ రెడ్డి, , శ్రీనివాస్ పసుపులేటి, సతీష్ రెడ్డి అవుతు, దివ్య నెట్టం, సరిత చెక్కిల, వాసవి చిత్తలూరి వంటి ఎంతో మంది అంకితభావం మరియు కృషి వల్లే సాధ్యమైంది. ఖచ్చితమైన ప్రణాళిక మరియు పకడ్బందీగా అమలు చేయడం వల్ల అందరికీ గొప్ప అనుభూతిని మిగులుస్తోంది.ఆటా కాన్ఫరెన్స్ బృందం భవిష్యత్తులో మరింత ఆకర్షణీయమైన మరియు పోటీతత్వ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించడం, సంఘంలో స్నేహపూర్వక మరియు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. బహుమతుల పంపిణీ కన్వెన్షన్ లో విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో, భారీ జనసందోహం ముందు జరగబోతున్నది. అలానే, ఆటా వారు అందరికీ స్నాక్స్, బెవరేజెస్ మరియు భోజనం అందించారు. అందరూ తప్పకుండా రండి, కలిసి మెలిసి మన ఆటా కన్వెన్షన్ ని ఆడుతూ, పాడుతూ జరుపుకుందామని ఆటా పిలుపునిస్తోంది. -
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో లెర్న్ చెస్ అకాడెమీ వార్షిక చెస్ టోర్నమెంట్
సింగపూర్‌లో ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ అయిన “లెర్న్ చెస్ అకాడమీ”(Learn Chess Academy) మే 1వ తేదీన వార్షిక చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా యువ చెస్ ప్రతిభను పెంపొందించే ప్రయత్నం చేసారు. ఈ టోర్నమెంట్లో 6 నుండి 15 సంవత్సరాల వయస్కులైన సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 6, 8, 10, 12 ,13 ఏళ్ల పైబడినవారు ఇలా ఐదు విభాగాలలో పోటీపడ్డారుఅపార అనుభవం కలిగిన ప్రొఫెషనల్ చెస్ కోచ్ మురళి కృష్ణ చిత్రాద స్థాపించిన ఈ “లెర్న్ చెస్ అకాడమీ”, 15 సంవత్సరాల నుండి నిరంతరంగా చిన్న పిల్లలకు మరియు యువకులకు చదరంగం ఆటలో శిక్షణ ఇస్తోంది. ఈ టోర్నమెంట్ కేవలం పోటీకి మాత్రమే కాకుండా, విద్యార్థులు తమ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా కూడా నిలిచింది.ఈ కార్యక్రమం బహుమతి పంపిణీ కార్యక్రమంలో, టాటా ఇంటర్నేషనల్ సింగపూర్ ఛైర్మన్ , ఏసియన్ ఫార్మర్ రెసిడెంట్ డైరెక్టర్, ది సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (SINDA) టర్మ్ ట్రస్టీ, సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (SIFAS) అధ్యక్షుడు, అయిన కె.వి.రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా అనుజ్ ఖన్నా సోహమ్, AFFLE గ్రూప్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు.విద్యార్థుల విభిన్న ప్రతిభాపాటవాల ప్రదర్శనతో పాటు, వివిధ వినోదాత్మక కార్యక్రమాలతో, ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు చెస్ థీమ్ స్కిట్, రూబిక్స్ క్యూబ్ సొల్యూషన్ లాంటి, టాలెంట్ షో, ప్రత్యేకమైన క్యాలెండర్ గేమ్ , క్విజ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యాలను, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలో చెస్ ప్రాముఖ్యతను మురళి కృష్ణ చిత్రాడ వివరించారు. "సౌందర్య కనగాల" యాంకరింగ్ ఆకట్టుకుంది.శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగేష్ మరియు గోపి చిరుమామిళ్ల తదితర ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేసారు. -
విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన చెస్ చిచ్చరపిడుగులు
భారత చెస్ చిచ్చరపిడుగులు విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించారు. తెలంగాణకు చెందిన దివిత్ రెడ్డి అడుల్లా బాలుర అండర్-8 ర్యాపిడ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని (10/11), బ్లిట్జ్‌లో కాంస్యాన్ని (8.5/11)సాధించగా.. తమిళనాడుకు చెందిన శర్వానికా ఏ ఎస్ బాలికల అండర్-10 ర్యాపిడ్‌లో బంగారు పతకాన్ని (9/11), బ్లిట్జ్‌లో రతజ పతకాన్ని (9/11) సాధించింది. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో ఈ ఇద్దరు చిన్నారులపై ప్రశంసల వర్షం కురుస్తుంది. వీరిద్దరిని భావి భారత గ్రాండ్మాస్టర్లని చెస్ అభిమానులు కొనియాడుతున్నారు. దివిత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ అండర్-7, అండర్-9 ఓపెన్ ఛాంపియన్‌గా ఉన్నాడు. శర్వానికా ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల (2023-24) అండర్-10 బాలిక విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. Victory for Bharat 🇮🇳 at the World Rapid & Blitz Cadet Chess 2024! Sharvaanica A S shines with Gold in U-10 Rapid & Silver in Blitz, while Divith Reddy Adulla seizes Gold in U-8 Rapid & Bronze in Blitz. Their moves are making history! Cheers to their success and the bright… pic.twitter.com/lTYp1QvuSr— Nitin Narang (@narangnitin) April 30, 2024 ర్యాపిడ్ అండర్-8 ఓపెన్‌లో ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుంచి మొత్తం 59 మంది క్రీడాకారులు, అండర్-10 బాలికల విభాగంలో 19 దేశాల నుంచి 43 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-8 ఓపెన్ బ్లిట్జ్‌లో 22 దేశాల నుంచి 51 మంది క్రీడాకారులు, అండర్-10 బాలికల బ్లిట్జ్ విభాగంలో 18 దేశాల నుంచి 41 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.2024 ఏప్రిల్ 26 నుండి 28 వరకు అల్బేనియాలోని గ్రాండ్ బ్లూ FAFA రిసార్ట్‌లో (డ్యూరెస్) ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఫిడే, అల్బేనియా చెస్ ఫెడరేషన్ నిర్వహించాయి. -
చెస్ గ్రాండ్‌మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
ఇటీవలికాలంలో భారత దేశం చెస్ గ్రాండ్‌మాస్టర్ల కర్మాగారంలా మారింది. ప్రతి ఏటా దేశం నుంచి పెద్ద సంఖ్యలో గ్రాండ్‌మాస్టర్లు పుట్టుకొస్తున్నాడు. 1987వ సంవత్సరంలో భారత్ నుంచి కేవలం విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే గ్రాండ్‌మాస్టర్‌గా ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 84కు చేరింది.కొద్ది రోజుల కిందట జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఐదుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు పాల్గొనగా.. గుకేశ్ ఆ టోర్నీ టైటిల్ కైవసం చేసుకుని రికార్డుల్లోకెక్కాడు. 17 ఏళ్ల గుకేశ్ క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ నెగ్గిన రెండో భారత ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.24 ఏళ్లలో 81 మంది గ్రాండ్‌మాస్టర్లు..1999 వరకు భారత్ తరఫున ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు మాత్రమే ఉండేవారు. గడిచిన 24 ఏళ్లలో భారత్ నుంచి ఏకంగా 81 మంది గ్రాండ్‌మాస్టర్లు తయారయ్యారు. గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఫిడే ర్యాంకింగ్స్ టాప్-20లో ప్రస్తుతం నలుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు.జూనియర్ల విభాగంలో టాప్-5 ర్యాంకింగ్స్ ఆటగాళ్లలో ఏకంగా ముగ్గురు (ప్రజ్ఞానంద, గుకేశ్, నిహల్ సరిన్) భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల విభాగంలో టాప్-20 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు (ఆర్ వైశాలీ, ప్రజ్ఞానంద సోదరి) భారత ప్లేయర్లు ఉన్నారు.భారత గ్రాండ్‌మాస్టర్లు..విశ్వనాథన్ ఆనంద్ (తమిళనాడు)దిబ్యేందు బారువా (పశ్చిమ బెంగాల్)ప్రవీణ్ తిప్సే (మహారాష్ట)అభిజిత్ కుంటే (మహారాష్ట్ర)కృష్ణన్ శశికిరణ్ (తమిళనాడు)పెంటల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్) కోనేరు హంపీ (ఆంధ్రప్రదేశ్)సూర్య శేఖర్ గంగూలీ (పశ్చిమ బెంగాల్)సందీపన్ చందా (పశ్చిమ బెంగాల్) రామచంద్రన్ రమేష్ (తమిళనాడు) తేజస్ బక్రే (గుజరాత్ )మగేష్ చంద్రన్ పంచనాథన్ (తమిళనాడు)దీపన్ చక్రవర్తి (తమిళనాడు)నీలోత్పాల్ దాస్ (పశ్చిమ బెంగాల్)పరిమార్జన్ నేగి (ఢిల్లీ)గీతా నారాయణన్ గోపాల్ (కేరళ)అభిజీత్ గుప్తా (ఢిల్లీ)సుబ్రమణియన్ అరుణ్ ప్రసాద్ (తమిళనాడు)సుందరరాజన్ కిదాంబి (తమిళనాడు)ఆర్.ఆర్ లక్ష్మణ్ (తమిళనాడు)శ్రీరామ్ ఝా (ఢిల్లీ)దీప్ సేన్‌గుప్తా (పశ్చిమ బెంగాల్)బాస్కరన్ అధిబన్ (తమిళనాడు)ఎస్.పీ సేతురామన్ (తమిళనాడు)హారిక ద్రోణవల్లి (ఆంధ్రప్రదేశ్)లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్)వైభవ్ సూరి (ఢిల్లీ)ఎంఆర్. వెంకటేష్ (తమిళనాడు)సహజ్ గ్రోవర్ (ఢిల్లీ) విదిత్ గుజరాతీ (మహారాష్ట్ర)శ్యామ్ సుందర్ (తమిళనాడు)అక్షయ్‌రాజ్ కోర్ (మహారాష్ట్ర)విష్ణు ప్రసన్న (తమిళనాడు)దేబాషిస్ దాస్ (ఒడిషా 27)సప్తర్షి రాయ్ చౌదరి (పశ్చిమ బెంగాల్)అంకిత్ రాజ్‌పారా (గుజరాత్)చితంబరం అరవింద్ (తమిళనాడు)కార్తికేయ మురళి (తమిళనాడు)అశ్విన్ జయరామ్ (తమిళనాడు)స్వప్నిల్ ధోపడే (మహారాష్ట్ర)నారాయణన్ (కేరళ)శార్దూల్ గగారే (మహారాష్ట్ర)దీప్తయన్ ఘోష్ (పశ్చిమ బెంగాల్)ప్రియదర్శన్ కన్నప్పన్ (తమిళనాడు)ఆర్యన్ చోప్రా (ఢిల్లీ)శ్రీనాథ్ నారాయణన్ (తమిళనాడు)హిమాన్షు శర్మ (హర్యానా)అనురాగ్ మ్హమల్ (గోవా)అభిమన్యు పురాణిక్ (మహారాష్ట్ర)తేజ్‌కుమార్ (కర్ణాటక)సప్తర్షి రాయ్ (పశ్చిమ బెంగాల్)రమేష్‌బాబు ప్రజ్ఞానంద (తమిళనాడు)నిహాల్ సరిన్ (కేరళ)అర్జున్ ఎరిగైసి (తెలంగాణ)కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్)హర్ష భరతకోటి (తెలంగాణ)పి.కార్తికేయన్ (తమిళనాడు)స్టానీ (కర్ణాటక)విశాఖ (తమిళనాడు)డి గుకేష్ (తమిళనాడు)పి.ఇనియన్ (తమిళనాడు)స్వయంస్ మిశ్రా (ఒడిషా)గిరీష్ ఎ. కౌశిక్ (కర్ణాటక)పృథు గుప్తా (ఢిల్లీ)రౌనక్ సాధ్వని (మహారాష్ట్ర)జి. ఆకాష్ (తమిళనాడు)లియోన్ ల్యూక్ మెండోంకా (గోవా)అర్జున్ కళ్యాణ్ (తమిళనాడు)హర్షిత్ రాజా (మహారాష్ట్ర)రాజా రిథ్విక్ ఆర్ (తెలంగాణ)మిత్రభా గుహ (పశ్చిమ బెంగాల్)సంకల్ప్ గుప్తా (మహారాష్ట్ర)భరత్ సుబ్రమణ్యం (తమిళనాడు)రాహుల్ శ్రీవాత్సవ్ (తెలంగాణ)ప్రణవ్ (తమిళనాడు)ప్రణవ్ ఆనంద్ (కర్ణాటక)ఆదిత్య మిట్టల్ (మహారాష్ట్ర)కౌస్తవ్ ఛటర్జీ (పశ్చిమ బెంగాల్)ప్రాణేష్ (తమిళనాడు)విఘ్నేష్ (తమిళనాడు)సయంతన్ దాస్ (పశ్చిమ బెంగాల్)ప్రణీత్ వుప్పల (తెలంగాణ)ఆదిత్య సమంత్ (మహారాష్ట్ర)ఆర్ వైశాలి (తమిళనాడు)2022-2024 మధ్యలో వివిధ దేశాల్లో తయారైన గ్రాండ్‌మాస్టర్లు..2022🇮🇳 భారతదేశం: 8🇺🇸 USA: 5🇷🇺 రష్యా: 4🇩🇪 జర్మనీ: 3🇫🇷 ఫ్రాన్స్: 3🇺🇦 ఉక్రెయిన్: 3🇦🇿 అజర్బైజాన్: 2🇪🇸 స్పెయిన్: 2🇧🇾 బెలారస్: 2🇧🇬 బల్గేరియా: 2🇹🇲 తుర్క్మెనిస్తాన్: 1🇦🇹 ఆస్ట్రియా: 1🇨🇴 కొలంబియా: 1🇲🇪 మాంటెనెగ్రో: 1🇸🇰 స్లోవేకియా: 1 🁢 🁥🇳🇴 నార్వే: 1🇵🇱 పోలాండ్: 1🇱🇹 లిథువేనియా: 1🇻🇳 వియత్నాం: 1🇭🇷 క్రొయేషియా: 1🇮🇷 ఇరాన్: 1🇧🇷 బ్రెజిల్: 1🇲🇩 మోల్డోవా: 1🇦🇷 అర్జెంటీనా: 1🇸🇬 సింగపూర్: 1🇵🇾 పరాగ్వే: 1🇳🇱 నెదర్లాండ్స్: 1🇹🇷 టర్కీ: 12023🇮🇳 భారతదేశం: 7🇨🇳 చైనా: 3🇳🇱 నెదర్లాండ్స్: 2🇦🇲 అర్మేనియా: 2🇬🇷 గ్రీస్: 2🇭🇺 హంగేరి: 2🇺🇿 ఉజ్బెకిస్తాన్: 1🇯🇴 జోర్డాన్: 1🇦🇿 అజర్బైజాన్: 1🇹🇲 తుర్క్మెనిస్తాన్: 1🇨🇴 కొలంబియా: 1🇨🇺 క్యూబా: 1🇮🇷 ఇరాన్: 1🇷🇴 రొమేనియా: 1🇹🇷 టర్కీ: 1🇮🇱 ఇజ్రాయెల్: 1🇺🇸 USA: 1🇬🇪 జార్జియా: 1🇷🇺 రష్యా: 1🇫🇷 ఫ్రాన్స్: 1🇩🇪 జర్మనీ: 1🇩🇰 డెన్మార్క్: 1🇺🇦 ఉక్రెయిన్: 1🇹🇼 తైవాన్: 1🇮🇸 ఐస్లాండ్: 1🇸🇮 స్లోవేనియా: 1🇰🇿 కజకిస్తాన్: 1🇵🇱 పోలాండ్: 12024🇦🇹 ఆస్ట్రియా: 1🇵🇰 పాకిస్థాన్: 1🇪🇪 ఎస్టోనియా: 1 -
భారత నంబర్‌వన్‌గా అర్జున్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా అర్జున్ అవతరించాడు. ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్‌లో 20 ఏళ్ల అర్జున్ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి భారత టాప్ ర్యాంకర్‌గా వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో ప్రపంచ 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. గత ఏడాది సెపె్టంబర్ 1న తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలిసారి అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత కొత్త నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆనంద్ మళ్లీ టాప్ ర్యాంక్‌కు చేరుకోగా... ఏడు నెలల తర్వాత అర్జున్ ప్రదర్శనకు ఆనంద్ మరోసారి భారత నంబర్‌వన్ స్థానాన్ని చేజార్చుకున్నాడు. ఆనంద్, పెంటేల హరికృష్ణ, గుకేశ్ తర్వాత ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. తాజా రేటింగ్స్‌లో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 2830 పాయింట్లు), ఫాబియానో కరువానా (అమెరికా; 2803 పాయింట్లు), నకముర (అమెరికా; 2789 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంక్‌ల్లో నిలిచారు. భారత్ నుంచి టాప్–100లో 10 మంది గ్రాండ్ మాస్టర్లు (అర్జున్–9, ఆనంద్–11, ప్రజ్ఞానంద –14, గుకేశ్–16, విదిత్–25, హరికృష్ణ–37, నిహాల్ సరీన్–39, నారాయణన్–41, అరవింద్ చిదంబరం–72, రౌనక్ సాధ్వాని–81) ఉన్నారు. -
ప్రజ్ఞానందకు రెండో విజయం
ప్రాగ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రెండో విజయం నమోదు చేశాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 52 ఎత్తుల్లో గెలిచాడు. డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్‌లో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, గుకేశ్ 2.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో ర్యాంక్‌లో ఉన్నారు. -
ప్రజ్ఞానంద శుభారంభం... వైశాలి ఓటమి
భారత చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై తన జోరు కొనసాగిస్తున్నాడు. చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో అతను విజయంతో మొదలు పెట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో ప్రజ్ఞానంద 41 ఎత్తులో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌ను ఓడించాడు. ఇటాలియన్ ఓపెనింగ్‌తో మొదలు పెట్టిన భారత జీఎం అటాకింగ్ గేమ్ మొదలు కీమర్ డిఫెన్స్ పని చేయలేదు. ఈ మ్యాచ్ గెలిచే క్రమంలో ప్రజ్ఞానంద ‘లైవ్ రేటింగ్’లో విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత్ తరఫున అత్యధిక రేటింగ్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లలో రిచర్డ్ ర్యాపో (రొమానియా)తో జరిగిన గేమ్‌ను డి. గుకేశ్...డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్‌ను విదిత్ గుజరాతీ ‘డ్రా’ చేసుకున్నారు. చాలెంజర్ విభాగంలో అన్టోన్ కొరొ»ొవ్ (ఉక్రెయిన్)తో జరిగిన పోరులో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఓటమిపాలైంది. -
గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన పిన్న వయస్కుడిగా...
క్లాసికల్ చెస్ ఫార్మాట్లో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి సింగపూర్ కుర్రాడు అశ్వథ్ కౌశిక్ (8 ఏళ్ల 6 నెలల 11 రోజులు) రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్‌లో జరిగిన బర్గ్డార్ఫర్ స్టాడస్ ఓపెన్ టోర్నీ నాలుగో రౌండ్లో అశ్వథ్ 45 ఎత్తుల్లో పోలాండ్‌కు చెందిన 37 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ జేసెక్ స్టోపాపై గెలిచాడు. ఈ క్రమంలో లియోనిడ్ (సెర్బియా; 8 ఏళ్ల 11 నెలల 7 రోజులు) పేరిట ఉన్న రికార్డును అశ్వథ్ బద్దలు కొట్టాడు. -
13 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్‌గా.. ది మాగ్నస్ ఎఫెక్ట్
‘అబ్బబ్బా! ఇలా ఇన్నేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా ఉండటం బోర్ కొట్టేస్తోందమ్మా! నా వల్ల కాదు. అవే విజయాలు, అవే టైటిల్స్. ఎప్పుడూ నేనే అంటే ఎలా? ఎవరైనా కొత్తవాళ్లు విజేతగా వస్తే బాగుంటుంది. అయినా ఎవరూ నన్ను ఓడించడం లేదు. ఇలా అయితే నేనే ఆడకుండా తప్పుకుంటా’.. సరిగ్గా ఇలాగే కాకపోయినా ఇదే అర్థంలో దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ దాదాపు ఏడాదిన్నర క్రితం చేసిన ఈ వ్యాఖ్య చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి ప్రపంచ చాంపియన్‌గా కొనసాగుతూ 32 ఏళ్ల వయసులోనే ఇంతటి వైరాగ్యం వచ్చేసిందా అన్నట్లుగా అతని మాటలు వినిపించాయి. అయితే ఈ ఆల్‌టైమ్ చెస్ గ్రేట్ అనుకోకుండా చేసిన వ్యాఖ్య కాదు ఇది. ఎందుకంటే అసలు పోటీ అనేదే లేకుండా తిరుగులేకుండా సాగుతున్న చెస్ సామ్రాజ్యంలో అతను రారాజుగా ఉన్నాడు. పేరుకు నంబర్‌వన్ మాత్రమే కాదు, ఒకటి నుంచి పది వరకు అన్ని స్థానాలూ అతడివే! ఆ తర్వాతే మిగతావారి లెక్క మొదలవుతుంది. నిజంగానే అతని సమకాలికులు కావచ్చు, లేదా కొత్తగా వస్తున్న తరం కుర్రాళ్లు కావచ్చు కార్ల్‌సన్‌ను ఓడించలేక చేతులెత్తేస్తున్నారు. ప్రపంచ చాంపియన్‌షిప్ మాత్రమే కాకుండా ఇతర మెగా టోర్నీల్లో కూడా అగ్రస్థానానికి గురి పెట్టకుండా రెండోస్థానం లక్ష్యంగానే అంతా బరిలోకి దిగుతున్నారు. ఇలాంటి సమయంలో తాను రాజుగా కంటే సామాన్యుడిగా ఉండటమే సరైనదని అతను భావించాడు. అందుకే క్లాసికల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా తప్పుకుంటున్నానని ప్రకటించడం అతనికే చెల్లింది. చదరంగంలో లెక్కలేనన్ని రికార్డులు, ఘనతలు తన పేరిట నమోదు చేసుకున్న నార్వేజియన్ కార్ల్సన్ ప్రస్థానం అసాధారణం. 2013, చెన్నై. స్థానిక హీరో, దేశంలో చెస్‌కు మార్గదర్శి అయిన విశ్వనాథన్ ఆనంద్ తన వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఎదురుగా చాలెంజర్ రూపంలో 23 ఏళ్ల మాగ్నస్ కార్ల్సన్ ఉన్నాడు. ఆనంద్‌తో పోలిస్తే అతని ఘనతలు చాలా తక్కువ. పైగా అనుభవం కూడా లేదు. కాబట్టి అనూహ్యం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుతాన్ని ఎవరూ ఆపలేకపోయారు. సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కార్ల్సన్ అలవోకగా ఆనంద్‌ను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచాడు. మొత్తం 12 రౌండ్ల పోరు కాగా 10వ రౌండ్‌కే చాంపియన్ ఖరారు కావడంతో తర్వాతి రెండు రౌండ్లు నిర్వహించాల్సిన అవసరం లేకపోయింది. ఇందులో 3 విజయాలు సాధించి 7 గేమ్‌లు డ్రా చేసుకున్న మాగ్నస్.. ప్రత్యర్థి ఆనంద్‌కు ఒక్క గేమ్‌లోనూ గెలిచే అవకాశం ఇవ్వలేదు. అలా మొదలైన విజయప్రస్థానం ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. ఆ తర్వాత ఈ టైటిల్‌ను అతను మరోసారి నాలుగు సార్లు నిలబెట్టుకున్నాడు. వాస్తవం ఏమిటంటే స్వచ్ఛందంగా తాను వరల్డ్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్నా, ఆటపై ఇష్టంతో ఇతర టోర్నీల్లో పాల్గొంటున్న మాగ్నస్‌ను ఓడించేందుకు అతని దరిదాపుల్లోకి కూడా కనీసం ఎవరూ రాలేకపోతున్నారు. చైల్డ్ ప్రాడజీగా మొదలై... చదరంగంలో శిఖరానికి చేరిన కార్ల్సన్లోని ప్రతిభ చిన్నతనంలోనే అందరికీ కనిపించింది. పుట్టుకతోనే వీడు మేధావిరా అనిపించేలా అతని చురుకుదనం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. రెండేళ్ల వయసులోనే 500 ముక్కల జిగ్సా పజిల్‌ను అతను సరిగ్గా పేర్చడం చూసి కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ఇక చాలామంది పిల్లలు ఇష్టపడే ‘లెగోస్’లోనైతే అతని సామర్థ్యం అసాధారణం అనిపించింది. 10–14 ఏళ్ల పిల్లల కోసం ఉద్దేశించిన పజిల్స్‌ను కూడా అతను నాలుగేళ్ల వయసులోనే సాల్వ్ చేసి పడేసేవాడు. అద్భుతమైన జ్ఞాపకశక్తి కూడా కార్ల్సన్ సొంతం. ఐదేళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, రాజధానులు, పటాలు, జనాభావంటి సమాచారాన్ని అలవోకగా గుర్తు పెట్టుకొని చెప్పేవాడు. దీనిని సరైన సమయంలో గుర్తించడం అతని తల్లిదండ్రుల తొలి విజయం. తమవాడికి చెస్ సరిగ్గా సరిపోతుందని భావించిన వారు ఆ దిశగా కార్ల్‌సన్‌ను ప్రోత్సహించడంతో చదరంగ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని చూడగలిగింది. ఆరంభంలో తన లోకంలో తాను ఉంటూ చెస్‌పై అంత ఆసక్తి ప్రదర్శించకపోయినా ఇంట్లో తన అక్కపై గెలిచేందుకు కనబరచిన పట్టుదల ఆపై చెస్‌పై అతడికి ప్రేమను పెంచింది. చెస్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత దానిపై ఆసక్తి మరింత పెరిగింది. ఆపై 8 ఏళ్ల వయసులోనే నార్వే జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని సత్తా చాటడంతో అందరికీ అతని గురించి తెలిసింది. ఆపై చదరంగమే అతనికి లోకంగా మారింది. ఆ తర్వాత యూరోప్‌లోని వేర్వేరు వయో విభాగాల టోర్నీల్లో చెలరేగి వరుస విజయాలతో మాగ్నస్ దూసుకుపోయాడు. గ్రాండ్‌మాస్టర్‌గా మారి... 13 ఏళ్ల వయసు వచ్చేసరికి కార్ల్సన్ దూకుడైన ఆట గురించి అందరికీ తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో అతను మరెన్నో సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా అంచనా వేశారు. అది ఎంత తొందరగా జరగనుందని వేచిచూడటమే మిగిలింది. నిజంగానే కేవలం ఏడు నెలల వ్యవధిలోనే మాగ్నస్ మూడు ఇంటర్నేషనల్ మాస్టర్స్ నార్మ్‌లు సాధించడంలో సఫలమయ్యాడు. అతని ప్రతిభ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ కార్ల్‌సన్‌కు స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ నార్వే కుర్రాడు ఎప్పుడూ వమ్ము చేయలేదు. 14 ఏళ్లు కూడా పూర్తికాకముందే గ్రాండ్‌మాస్టర్‌గా మారి కెరీర్లో మరో మెట్టు ఎక్కాడు. అదే ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ పాల్గొని ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఫలితం సానుకూలంగా రాకపోయినా రాబోయే సంవత్సరాల్లో మాగ్నస్ సృష్టించబోయే సునామీకి ఇది సూచికగా కనిపించింది. శిఖరానికి చేరుతూ... సాధారణంగా చెస్‌లో గొప్ప ఆటగాళ్లందరూ భిన్నమైన ఓపెనింగ్స్‌ను ఇష్టపడతారు. ఓపెనింగ్ గేమ్‌తోనే చాలా వరకు ఆటపై పట్టు బిగించేస్తారు. కానీ మాగ్నస్ దీనిని పెద్దగా పట్టించుకోడు. మిడిల్ గేమ్‌లో మాత్రం అతనో అద్భుతం. దూకుడైన ఎత్తులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ కోలుకోలేకుండా చేయడంలో అతను నేర్పరి. ప్రాక్టీస్ కోసం కంçప్యూటర్లలో ఉండే ప్రోగ్రామింగ్ కంటే సొంత మెదడుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. అపరిమిత సంఖ్యలో తనతో తానే మ్యాచ్‌లు ఆడుతూ సుదీర్ఘ సాధనతో నేర్చుకోవడం అతనికి మాత్రమే సాధ్యమైన కళ. ఈ ప్రతిభ అతడిని వేగంగా పైకి ఎదిగేలా చేసింది. తనకెదురైన ప్రతి ఆటగాడినీ ఓడిస్తూ వచ్చిన మాగ్నస్ 19 ఏళ్ల వయసులో తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని శిఖరానికి చేరాడు. అదే ఏడాది అతని కెరీర్లో మరో కీలక క్షణం మరో దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను వ్యక్తిగత కోచ్‌గా నియమించుకోవడం. ప్రపంచ చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు మరో యువ సంచలనానికి శిక్షణ ఇస్తే ఎలా ఉంటుందనేదానికి ఈ బంధం బలమైన ఉదాహరణ. కాస్పరోవ్‌తో కలసి ఎత్తుకు పైఎత్తులతో దూసుకుపోయిన ఈ యువ ఆటగాడు నాలుగేళ్ళలో తిరుగులేని ప్రదర్శనతో శిఖరానికి చేరుకున్నాడు. తర్వాతి రోజుల్లో కాస్పరోవ్ పేరిట ఉన్న ఘనతలన్నీ అతను చెరిపేయగలగడం విశేషం. అన్నీ అద్భుతాలే... 2013లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కార్ల్సన్ 2014లో దానిని నిలబెట్టుకున్నాడు. ఈసారి కూడా విశ్వనాథన్ ఆనంద్పైనే అతను అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఇక్కడ కూడా చివరి గేమ్ అవసరం లేకపోయింది. 2016 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మాత్రం సెర్జీ కర్యాకిన్ (రష్యా)తో అతనికి కాస్త పోటీ ఎదురైంది. 12 గేమ్‌ల తర్వాత ఇద్దరూ 6–6 పాయింట్లతో సమంగా నిలవగా, టైబ్రేక్‌లో విజయం అతని సొంతమైంది. నాలుగోసారి 2018లో ఫాబియానో కరువానా (అమెరికా)పై కూడా ఇదే తరహాలో 6–6తో స్కోరు సమం కాగా, టైబ్రేక్‌లో 3–0తో గెలిచి వరల్డ్ చాంపియన్‌గా కొనసాగాడు. 2021లోనైతే మాగ్నస్ ఆధిపత్యం మరింత స్పష్టంగా కనిపించింది. ఇయాన్ నెపొమాచి (రష్యా)తో జరిగిన సమరం పూర్తి ఏకపక్షంగా సాగింది. 14 రౌండ్ల పోరు కాగా 11 రౌండ్లు ముగిసేసరికి 7.5 పాయింట్లు సాధించి తన జగజ్జేత హోదాను మళ్లీ నిలబెట్టుకున్నాడు. బహుశా ఇదే ఫలితం తర్వాతి వరల్డ్ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండేందుకు కారణమై ఉండవచ్చు. క్రికెట్లో మూడు ఫార్మాట్లలాగే చెస్లోనూ క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లు ఉన్నాయి. కార్ల్సన్ మూడింటిలో సాగించిన ఆధిపత్యం చూస్తే అతను ఏ స్థాయి ఆటగాడో అర్థమవుతుంది. క్లాసిక్‌లో 5 సార్లు విశ్వ విజేతగా నిలిచిన అతను 5 సార్లు ర్యాపిడ్‌లో, 7 సార్లు బ్లిట్జ్‌లో వరల్డ్ చాంపియన్‌గా (మొత్తం 17 టైటిల్స్) నిలవడం విశేషం. చెస్ చరిత్రలో గ్యారీ కాస్పరోవ్ (2851)ను అధిగమించి అతి ఎక్కువ యెల్లో రేటింగ్ (2882) సాధించిన ఆటగాడిగా కార్ల్‌సన్‌ను నిలిచాడు. వరుసగా పదేళ్ల పాటు విశ్వవిజేతగా నిలిచిన అతను వరుసగా 125 గేమ్‌లలో ఓటమి ఎరుగని ఆటగాడిగా తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. అతనిపై పెద్ద సంఖ్యలో వచ్చిన పుస్తకాలు, వీడియో డాక్యుమెంటరీలు కార్ల్సన్ ఆటలోని అద్భుతాన్ని మనకు చూపిస్తాయి. అధికారికంగా ప్రపంచ చాంపియన్ కాకపోయినా, అతను ఇంకా వరల్డ్ చెస్‌ను శాసిస్తూనే ఉన్నాడు. గత రెండేళ్లలో అతను సాధించిన విజయాలు, టైటిల్స్‌కు మరెవరూ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఇదే జోరు కొనసాగిస్తూ మున్ముందూ చెస్‌లో మాగ్నస్ లెక్కలేనన్ని ఘనతలు సాధించడం ఖాయం. -
తొమ్మిదేళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న చెస్ చిచ్చరపిడుగు
బెంగళూరుకు చెందిన చార్వి అనిల్ కుమార్ తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు చేస్తుంది. ఆడుతూపాడుతూ తిరగాల్సిన వయసులో ఈ అమ్మాయి మేధావుల ఆటలో సంచలనాలు సృష్టిస్తుంది. అసాధారణ నైపుణ్యాలు కలిగిన ఈ అమ్మాయి ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ (11 ఏళ్లలోపు) ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 2022లో అండర్-8 ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం ద్వారా తొలిసారి వార్తల్లోకెక్కిన చార్వి.. ఆ పోటీల్లో అగ్రస్థానంలో నిలువడం ద్వారా 1900 ఎలో రేటింగ్ పాయింట్ల మార్కును అధిగమించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అనంతరం జరిగిన పలు అంతర్జాతీయ ఈవెంట్లలోనూ చార్వి తన విజయపరంపరను కొనసాగించింది. Meet 9-year-old Charvi Anilkumar, @Charvi_A2014 the highest-rated female #chess prodigy (under 11) in the world. The #Bengaluru girl made headlines in 2022 after she became the World Champion in the Under-8 category.https://t.co/Y0SvlIUH8X — South First (@TheSouthfirst) January 10, 2024 ఈ చెస్ చిచ్చరపిడుగు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో (అండర్ 8) ఏకంగా ఐదు బంగారు పతకాలు , ఓ రజత పతకం సాధించి, చెస్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేసింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా చార్వికి ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) బిరుదు దక్కింది. చార్వి.. 2022 అక్టోబర్‌లో తన మూడో మేజర్ టైటిల్‌ను సాధించి, చెస్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చార్వి ఛాంపియన్‌గా నిలిచి హేమాహేమీల ప్రశంసలను అందుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో 1915 రేటింగ్ పాయింట్లు కలిగి, ఫిడే ర్యాంకింగ్స్‌లో (జూనియర్ బాలికల విభాగం) అగ్రస్థానంలో నిలిచిన చార్వి.. ఈ ఏడాది చివరికల్లా 2200 లేదా 2300 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపింది. చార్వి ప్రస్తుతం బెంగళూరులోని క్యాపిటల్ పబ్లిక్ స్కూల్లో నాలుగో గ్రేడ్ చదువుతుంది. చార్వి.. ఆర్బి రమేశ్ వద్ద చెస్ ఓనమాలు నేర్చుకుంది. చార్వి తండ్రి అనిల్ కుమార్ బెంగళూరులోనే ఓ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తుండగా.. తల్లి అఖిల ఉద్యోగం మానేసి చార్వికి ఫుల్‌టైమ్ సపోర్ట్‌గా ఉంది. -
నైనా ఖాతాలో ఐదో విజయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా గొర్లి వరుసగా ఐదో విజయం నమోదు చేసి అజేయంగా నిలిచింది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్లో వైజాగ్‌కు చెందిన నైనా 60 ఎత్తుల్లో మీరా సింగ్ (ఢిల్లీ)పై, ఐదో రౌండ్లో 80 ఎత్తుల్లో ఆముక్త (ఆంధ్రప్రదేశ్)పై గెలిచింది. ఐదో రౌండ్ తర్వాత నైనా ఐదు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణకు చెందిన సంహిత పుంగవనం, బి.కీర్తిక 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు చల్లా సహర్ష ఐదో రౌండ్ తర్వాత 4.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. -
‘గ్రాండ్‌మాస్టర్’ వైశాలి
చెన్నై: భారత చెస్ క్రీడాకారిణి వైశాలి రమేశ్‌బాబు తన కెరీర్లో కీలక మైలురాయిని అందుకుంది. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల వైశాలి శుక్రవారం ‘గ్రాండ్‌మాస్టర్’ హోదాను అందుకుంది. స్పెయిన్‌లో జరుగుతున్న ఎలోబ్రిగాట్ ఓపెన్ సందర్భంగా జీఎం గుర్తింపును దక్కించుకుంది. టోర్నీ తొలి రెండు రౌండ్లలో విజయం సాధించిన వైశాలి ఈ క్రమంలో 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతో గ్రాండ్‌మాస్టర్ ఖాయమైంది. భారత్ తరఫున ఈ ఘనతను సాధించిన 84వ ప్లేయర్‌గా వైశాలి గుర్తింపు పొందగా...భారత్‌నుంచి జీఎంగా మారిన మూడో మహిళా ప్లేయర్ మాత్రమే కావడం విశేషం. ఇప్పటికే చెస్ ప్రపంచంలో సంచలన విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీఎం ప్రజ్ఞానందకు వైశాలి స్వయంగా అక్క కావడం విశేషం. వైశాలికంటే నాలుగేళ్లు చిన్నవాడైన ప్రజ్ఞానంద 2018లోనే గ్రాండ్‌మాస్టర్ హోదా అందుకోగా... ఐదేళ్ల తర్వాతి వైశాలి ఈ జాబితాలో చేరింది. తద్వారా ప్రపంచ చెస్‌లో గ్రాండ్మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వీరిద్దరు నిలవడం చెప్పుకోదగ్గ మరో విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో... చదరంగంపై ఆసక్తితోనే చిన్న వయసులోనే ఎత్తుకు పైఎత్తులు వేయడం ప్రారంభించిన వైశాలిని తల్లిదండ్రులు రమేశ్‌బాబు, నాగలక్ష్మి ప్రోత్సహించి ప్రొఫెషనల్ చెస్ వైపు మళ్లించారు. ఆ తర్వాత వరుస విజయాలతో ఆమె దూసుకుపోయింది. వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో వైశాలి అండర్–12, అండర్–14 విభాగాల్లో విజేతగా నిలిచింది. 2020 చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి స్వర్ణపతకం గెలిచిన భారత జట్టులో వైశాలి సభ్యురాలిగా ఉంది. 2018లో ఆమె ఉమన్ గ్రాండ్‌మాస్టర్ హోదాను అందుకుంది. ఆ తర్వాత 2019 ఎక్స్‌ట్రాకాన్ ఓపెన్‌లో తొలి జీఎం నార్మ్, 2022లో ఫిషర్ మెమోరియల్ టోరీ్నలో రెండో జీఎం నార్మ్ సాధించిన వైశాలి ఈ ఏడాది ఖతర్ మాస్టర్స్‌లో మూడో జీఎం నార్మ్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు క్వాలిఫయింగ్‌గా పరిగణించే క్యాండిడేట్స్ టోర్నీకి వైశాలి అర్హత సాధించింది. పురుషుల విభాగంలో ఇదే టోర్నీకి ప్రజ్ఞానంద కూడా క్వాలిఫై అయ్యాడు. దాంతో ‘క్యాండిడేట్స్’ బరిలో నిలిచిన తొలి సోదర, సోదరి జోడీగా కూడా వీరు గుర్తింపు దక్కించుకున్నారు. భారత్‌నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా అందుకున్న తొలి మహిళగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి (2002లో) గుర్తింపు పొందగా...2011లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ద్రోణవల్లి హారిక కూడా ఈ హోదాను సాధించింది. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ సందర్భంగా వైశాలికి అభినందనలు తెలియజేశాడు. -
డబుల్ ధమాకా...
ఐల్ ఆఫ్ మ్యాన్ (యూకే): అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు ఆర్. వైశాలి, విదిత్ సంతోష్ గుజరాతి సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోరీ్నలో ఓపెన్ విభాగంలో విదిత్ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్‌గా అవతరించారు. ఈ టోరీ్నలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో... వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. విదిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. వైశాలి ఆరు గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చాంపియన్స్‌గా నిలిచిన విదిత్‌కు ట్రోఫీలతో పాటు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షల 57 వేలు), వైశాలికి ట్రోఫీలతో పాటు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టైటిల్స్‌తో ఓపెన్ విభాగంలో విదిత్... మహిళల విభాగంలో వైశాలి క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. ఓపెన్, మహిళల విభాగాల్లో వేర్వేరుగా ఎనిమిది మంది ప్లేయర్ల మధ్య క్యాండిడేట్స్ టోర్నీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 2 నుంచి 25 వరకు కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్ టోరీ్నలో విజేతగా నిలిచిన వారు ఓపెన్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగంలో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్ కోసం తలపడతారు. -
FIDE Grand Swiss: అర్జున్‌కు మూడో గెలుపు
గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో విజయం నమోదు చేశాడు. యూకేలోని ఐల్ ఆఫ్ మ్యాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 68 ఎత్తుల్లో రినాత్ జుమాబయేవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. ఐదో రౌండ్ తర్వాత అర్జున్ నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. -
భారత చెస్ జట్ల గెలుపు.. హంపి, హారిక, వంతిక, వైశాలి అద్భుతంగా ఆడి..
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్‌ను ఓడించింది. మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1 గోల్‌తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్‌లో, కొరియా రెండో ర్యాంక్‌లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను హాంకాంగ్‌తో మంగళవారం ఆడుతుంది. -
కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విజేతల అద్భుత విజయాలను డాక్యుమెంటరీలలో చూసిన తరువాత తాను కూడా ఏదైనా సాధించాలనుకుంది మలేసియాకు చెందిన పది సంవత్సరాల పునీత మలర్ రాజశేఖర్. ఈ చిన్నారికి చెస్ అంటే ఇష్టం. తాజాగా... కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 45.72 సెకన్లలో చెస్‌బోర్డ్‌పై అత్యంత వేగంగా 32 పావులను సెట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తండ్రి సహకారంతో నాలుగు నెలల పాటు కష్టపడి ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. -
చెస్‌లో త్రుటిలో చేజారిన పతకం
ఆసియా క్రీడల చెస్ ఈవెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత్ ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో, కోనేరు హంపి 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఎనిమిదో రౌండ్లో హంపితో జరిగిన గేమ్‌ను హారిక 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో హారిక 30 ఎత్తుల్లో జినెర్ జు (చైనా)పై గెలిచింది. ని ర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత జినెర్ జు ఏడు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఉమిదా ఒమనోవా (ఉజ్బెకిస్తాన్), హు ఇఫాన్ (చైనా) 6.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఇరిగేశి అర్జున్ 5.5 పాయింట్లతో వరుసగా ఐదు, ఆరు స్థానాలతో సరిపెట్టుకున్నారు. వె యి (చైనా; 7.5 పాయింట్లు) స్వర్ణం, నొదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్; 7 పాయింట్లు) రజతం, సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 7 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. -
Asian Games 2023 chess: శుభారంభం చేసిన కోనేరు హంపి, హారిక
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్లు శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి తొలి రెండు రౌండ్లలో విజయం సాధించింది. మొదటి రౌండ్లో ఇరాన్‌కు చెందిన అలీనాసబలమాద్రి మొబినాను ఓడించిన హంపి.. సెకెండ్ రౌండ్లో వియత్నాం గ్రాండ్ మాస్టర్ ఫామ్ లే థావో న్గుయెన్‌ను చిత్తు చేసింది. దీంతో మూడో రౌండ్‌కు హంపి అర్హత సాధించింది. అదేవిధంగా మరో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి కూడా తొలి రౌండల్లో గెలుపొందింది. తొలి రౌండ్లో యూఏఈకు చెందిన అలాలీ రౌడాపై విజయం సాధించిన హారిక.. రెండో రౌండ్లో సింగపూర్ గ్రాండ్‌మాస్టర్ కియాన్యున్ గాంగ్‌ను ఓడించింది. అయితే పురుషల చెస్ విభాగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొదటి రౌండ్లో విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్.. రెండో రౌండ్లో మాత్రం ఘోర ఓటమి చవిచూశాడు. రెండో రౌండ్లో కజికిస్తాన్‌కు చెందిన నోగర్బెక్ కాజీబెక్ ఎత్తులు ముందు విదిత్ చిత్తయ్యాడు. మరో గ్రాండ్ మాస్టర్ అర్జున్ కుమార్ ఎరిగైసి రెండో రౌండ్‌ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. తొలిరౌండ్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన పాలో బెర్సమినాను ఓడించిన అర్జున్.. రెండవ రౌండ్ గేమ్‌ను వియత్నాంకు చెందిన లే తువాన్ మిన్తో డ్రా చేసుకున్నాడు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) మధ్యాహ్నం పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగానికి సంబంధించిన మూడు, నాలుగు రౌండ్ల చెస్ పోటోలు జరగనున్నాయి. భారత ఖాతాలో తొలి గోల్డ్‌మెడల్ ఇక ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటివరకు మొత్తం 7 పతకాలను ఏషియన్ గేమ్స్‌లో భారత్ కైవసం చేసుకుంది. చదవండి: Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్.. -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ ఓపెన్ బ్లిట్జ్ టైటిల్‌ను అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) గెలుచుకున్నాడు. కోల్‌కతాలో శనివారం ముగిసిన ఈ టోర్నీలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండు సార్లు వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ అయిన గ్రిషుక్ ఈ టోర్నీ లోనూ సత్తా చాటాడు. మొత్తం టోర్నీ లో అతను ఒకే ఒక రౌండ్లో ఓడాడు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అబ్దుస్సతరోవ్ రెండో స్థానం (11 పాయింట్లు) సాధించగా...భారత టీనేజ్ సంచలనం ఆర్.ప్రజ్ఞానంద (11)కు మూడో స్థానం దక్కింది. ఇతర భారత ఆటగాళ్లలో అర్జున్ ఇరిగేశి (4వ), పెంటేల హరికృష్ణ (6వ), విదిత్ గుజరాతీ (7వ), డి.గుకేశ్ (8వ) టాప్–10లో ముగించారు. నాలుగు రౌండ్లలో వరుసగా ఓటమి లేకుండా నిలిచినా...ఆ తర్వాత అబ్దుస్సతరోవ్, గ్రిషుక్, విదిత్ చేతుల్లో పరాజయం పాలు కావడంతో ప్రజ్ఞానంద వెనుకబడిపోయాడు. భారత నంబర్‌వన్ గుకేశ్ చివరి రోజు 9 రౌండ్లలో ఆరింటిలో ఓటమిపాలయ్యాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఇటీవల జరిగిన ప్రపంచ కప్ చెస్ టోర్నీ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ ర్యాపిడ్ ఓపెన్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా), విదిత్ సంతోష్ గుజరాతి (భారత్) ఐదు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. ప్రజ్ఞానందకు మూడో ర్యాంక్, గ్రిషుక్‌కు నాలుగో ర్యాంక్, విదిత్‌కు ఐదో ర్యాంక్ లభించాయి. గురువారం జరిగిన చివరి మూడు రౌండ్లలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద సహచరులు విదిత్, ఇరిగేశి అర్జున్లపై గెలిచి భారత నంబర్‌వన్ దొమ్మరాజు గుకేశ్ చేతిలో ఓడిపోయాడు. 4.5 పాయింట్లతో గుకేశ్ ఆరో స్థానంలో నిలిచాడు. 3 పాయింట్లతో అర్జున్ తొమ్మిదో స్థానంలో, పెంటేల హరికృష్ణ 2.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో నిలిచారు. 7 పాయింట్లతో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమి వచీర్ లాగ్రెవ్ చాంపియన్‌గా అవతరించగా... 5.5 పాయింట్లతో తైమూర్ రజబోవ్ (అజర్బైజాన్) రన్నరప్‌గా నిలిచాడు. నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
టాటా స్టీల్ ఇండియా చెస్ చాంప్ దివ్య
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ మహిళల ర్యాపిడ్ టోర్నమెంట్లో ఫేవరెట్స్‌ను బోల్తా కొట్టిస్తూ భారత యువతార దివ్య దేశ్‌ముఖ్ చాంపియన్‌గా అవతరించింది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల దివ్య నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మూడు గేముల్లో దివ్యకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఏడో గేమ్‌ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన ఎనిమిదో గేమ్‌లో దివ్య 41 ఎత్తుల్లో ఓడిపోయింది. చివరిదైన తొమ్మిదో గేమ్‌లో దివ్య 51 ఎత్తుల్లో భారత స్టార్ కోనేరు హంపిపై సంచలన విజయం సాధించి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. జు వెన్జున్ (చైనా; 6.5 పాయింట్లు) రన్నరప్‌గా, షువలోవా 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, వంతిక అగర్వాల్ ఐదో స్థానంలో, కోనేరు హంపి ఆరో స్థానంలో, సవితాశ్రీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇదే వేదికపై నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
ఆనంద్ మహీంద్ర గిప్ట్‌కు: ప్రజ్ఞానంద రియాక్షన్ ఇదీ!
RPraggnanandhaa Reacts Parents Long Term Dream పారిశ్రామికవేత్త, బిలియనీర్ తన తల్లి దండ్రులకు ప్రకటించిన బహుమతిపై భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ఫైడ్ చెస్ ప్రపంచ కప్ రన్నర్ అప్ ఆర్ ప్రజ్ఞానంద స్పందించారు. ఒక ఎలక్ట్రిక్ కారుకోసం కల గన్న తన అమ్మా నాన్నల చిరకాల వాంఛను ("లాంగ్ టర్మ్ డ్రీమ్") తీర్చినందుకు ధన్యవాదాలు సార్ అంటూ ప్రజ్ఞానంద ట్వీట్ చేశారు. తన కృతజ్ఞతను తెలియజేయడానికి పదాలు లేవు...చాలా ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజ్ఞానంద సాధించిన ఘనతకు గౌరవంగా అతని తల్లిదండ్రులకు ఆల్-ఎలక్ట్రిక్ SUVని బహుమతిగా ఇవ్వాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించిన సంగతి తెలిసిందే. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్) కాగా పిల్లవాడి ఆసక్తిని గమనించి, ప్రోత్సహించిన ప్రజ్ఞానంద పేరెంట్స్ నాగలక్ష్మి రమేష్‌బాబులను ఆనంద్ మహీంద్ర అభినందించారు. ఇందులో భాగంగానే వారికి ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు దేశంలో తల్లిదండ్రులు దీన్ని ప్రేరణగా తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మహీంద్ర ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ప్రత్యేక ఎడిషస్ను ఆ దంపతులకు ఇవ్వనున్నామని మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో బదులిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. No words to express my Gratitude 🙏 Thankyou very much @anandmahindra sir and @rajesh664 sir It is a long term dream of my parents to own an EV car thanks for making it a reality! https://t.co/YWCK1D99ik — Praggnanandhaa (@rpragchess) August 29, 2023 Sky is the limit! @rpragchess and @GM_JKDuda showed us that the mind of a genius knows no bounds! #chess #mind pic.twitter.com/TWzvPefBNV — WR_Chess_Masters (@wr_chess) August 29, 2023 -
Chess World Cup 2023: రాజూ బంటూ అమ్మే
చదరంగంలో పావులు కదపాలంటే బుద్ధికి బృహస్పతిలా ఉండాలి. కాని ఆ బృహస్పతిని కని, పెంచడానికి అమ్మ అమ్మలా ఉంటే చాలు. అమ్మకు ఎత్తుకు పై ఎత్తు తెలియదు ప్రేమ తప్ప. తన బిడ్డను రాజు చేయాలనే తపన తప్ప. అందుకు తాను బంటుగా మారేందుకు సిద్ధం కావడం తప్ప. చెస్ వరల్డ్ కప్ 2023లో సంచలనంగా నిలిచిన ఆర్. ప్రజ్ఞానందకు రాజుగా, బంటుగా ఉంటూ తీర్చిదిద్దిన తల్లి నాగలక్ష్మి కథ ఇది. అజర్బైజాన్లో జరిగిన ‘చెస్ వరల్డ్ కప్ 2023’ ఫైనల్స్‌లో ఒక అడుగు దూరంలో టైటిల్ కోల్పోయాడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద. అతడు ఓడినా గెలిచినట్టే. ప్రపంచ దేశాల నుంచి 206 మంది గ్రాండ్ మాస్టర్లు పాల్గొన్న ఈ భారీ వరల్డ్ కప్‌లో ఇంత చిన్న వయసులో రన్నరప్‌గా నిలవడం సామాన్యం కాదు. కాకలు తీరిన యోధులను ఓడించి మరీ ఈ స్థానాన్ని దక్కించుకోవడమే కాదు దాదాపు 66 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. భారతదేశం గర్వించేలా చెస్‌లో వెలుగులీనుతున్న ఈ కుర్రవాడి విజయం వెనుక అతని తల్లి నాగలక్ష్మి ఉంది. అందుకే చెస్ అభిమానులే కాదు దేశదేశాల గ్రాండ్ మాస్టర్లు కూడా ప్రజ్ఞానందకు వెన్నంటి వుంటూ తోడ్పాటునందిస్తున్న నాగలక్ష్మిని ప్రశంసిస్తున్నారు. ఆమెను చూసి ముచ్చట పడుతున్నారు. టీవీ అలవాటు మాన్పించడానికి చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం రమేశ్ బాబు, నాగలక్ష్మిలకు కుమార్తె వైశాలి పుట్టాక ప్రజ్ఞానంద పుట్టాడు. ప్రజ్ఞానందకు నాలుగున్నర ఏళ్లు ఉన్నప్పుడు వైశాలి ఎక్కువగా టీవీ చూస్తున్నదని కూతురి ధ్యాస మళ్లించడానికి చెస్ బోర్డు తెచ్చి పెట్టింది నాగలక్ష్మి. వైశాలి చెస్ ఆడుతుంటే చిన్నారి ప్రజ్ఞా కూడా ఆడటం మొదలెట్టాడు. అతడు చెస్ నేర్చుకున్న పద్ధతి, అంత చిన్న వయసులో గెలుస్తున్న తీరు చూస్తే అతడు బాల మేధావి అని తల్లికి అర్థమైంది. మరోవైపు వైశాలి కూడా చెస్‌లో రాణించసాగింది. ఇక నాగలక్ష్మి తన జీవితాన్ని తన ఇద్దరు పిల్లల ఆట కోసం అంకితం చేయాలని నిశ్చయించుకుంది. అనుక్షణం వెన్నంటే ప్రజ్ఞానంద ఏడేళ్ల వయసుకే అండర్ సెవెన్లో జాతీయ టైటిల్ గెలిచాడు. పదేళ్ల వయసుకు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడు. 12 ఏళ్లకు గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఉదయం నుంచి రాత్రి వరకూ చెన్నైలో వేరే దేశంలో అతని వెన్నంటే ఉంటుంది నాగలక్ష్మి. ‘ప్రజ్ఞా ఏ పోటీకి వచ్చినా తోడుండే నాగలక్ష్మి ఒక మూల కూచుని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూచోవడం మా అందరికీ అలవాటైన దృశ్యం’ అంటాడు త్యాగరాజన్ అనే కోచ్. ఇతను చెస్‌లో ప్రజ్ఞాకు మొదటి పాఠాలు నేర్పాడు. ‘ఉదయం పది నుంచి సాయంత్రం 7 వరకూ చెస్ పాఠాలు నడిచేవి. ఆ తర్వాత రెండు మూడు గంటల హోమ్‌వర్క్ ఇచ్చేవాణ్ణి. ప్రజ్ఞానంద ఇల్లు చేరాక ఆ హోమ్‌వర్క్ అయ్యేవరకు నాగలక్ష్మి తోడు ఉండేదట. రాత్రి పదికి ఇంటి పనులు మొదలెట్టుకుని మళ్లీ ఉదయం ఆరు గంటలకు కొడుకు కోసం నిద్ర లేచేదట’ అని తెలిపాడు అతడు. చెస్ తెలియని అమ్మ కొడుకు చెస్‌లో ప్రపంచ విజేత స్థాయి ఆటగాడైనా నాగలక్ష్మికి ఇప్పటి వరకూ చెస్ ఆడటం తెలియదు. ‘మా అబ్బాయిని చూసుకోవడమే నాకు సరిపోతుంది. ఆట ఎక్కడ నేర్చుకోను’ అంటుందామె నవ్వుతూ. ప్రజ్ఞానంద శాకాహారి. బయటి ఆహారం తినడు. అందుకని ఏ ఊరికి ఆట కోసం బయలుదేరినా, విదేశాలకు ప్రయాణం కట్టినా నాగలక్ష్మి చేసే మొదటిపని లగేజ్‌లో ఒక ఇండక్షన్ స్టవ్వు, కుక్కరు, బియ్యం, మసాలాలు పెట్టుకోవడం. ‘ఎక్కడకు వెళ్లినా వాడికి వేడివేడి అన్నం, రసం చేసి పెడతాను. మైండ్ హాయిగా ఉండి బాగా ఆడాలంటే నచ్చిన ఆహారం తీసుకోవాలి’ అంటుంది నాగలక్ష్మి. చెస్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో అమెరికా దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్స్‌కు చేరినప్పుడు నాగలక్ష్మి కళ్లల్లో కనిపించి మెరుపును ఎవరో ఫొటో తీస్తే ఆ ఫొటో వైరల్ అయ్యింది. ‘మావాడు ఆట ఆడేంతసేపు వాడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడను. ఎందుకంటే వాడి కళ్లు చూస్తే వాడి ఆట ఎలా సాగుతున్నదో నాకు తెలిసిపోతుంది. నాకు తెలిసిపోయినట్టుగా వాడికి తెలియడం నాకు ఇష్టం ఉండదు’ అంటుంది నాగలక్ష్మి. కార్ పార్కింగ్‌లో బంధువులు కూతురు, కొడుకు ఇంట్లో చెస్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా ఉంచుతుంది నాగలక్ష్మి. వాళ్లింట్లో టీవీ పెట్టే ఎంతో కాలమైపోతూ వుంది. ‘మా ఇంటికి బంధువులొచ్చినా, స్నేహితులొచ్చినా కింద కార్ పార్కింగ్ దగ్గరే పలకరించి పంపేస్తాను... పిల్లలు డిస్ట్రబ్ కాకూడదని’ అంటుందామె. అందుకే సెమీ ఫైనల్స్ గెలిచిన ప్రజ్ఞాను అభినందిస్తూ రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ ‘నీకు మీ అమ్మ ఇచ్చే మద్దతు ప్రత్యేకమైనది’ అని ట్వీట్ చేశాడు. నాగలక్ష్మి లాంటి తల్లి ప్రేమకు పిల్లలు ఎప్పుడూ బంట్లే. వారి మనసులో ఆ తల్లి ఎప్పుడూ రాజే. -
ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా మరో ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదరంగంలో (చెస్) అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్న 'ప్రజ్ఞానంద' (Praggnanandhaa) ఫైనల్ స్టేజిలో రన్నర్‌గా నిలిచాడు. ఈ గేమ్‌లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి విన్నర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఎవరీ 'మాయా టాటా'? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? దీనిపైన ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ నువ్వు 'రన్నరప్' కాదు @rpragchess. ఇది మీ గొప్పతనానికి 'రన్-అప్' మాత్రమే. మరో సారి పోరాడటానికి అనేక యుద్దాలు నేర్చుకోవడం అవసరం అంటూ.. నువ్వు నేర్చుకున్నావు, మళ్ళీ పోరాడతావు మనమందరం మళ్ళీ అక్కడ ఉంటామని ట్వీట్ చేసాడు. దీనికి ఇప్పటికీ వేల సంఖ్యలో లైకులు వచ్చాయి, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. You aren’t the ‘runner-up’ @rpragchess This is simply your ‘run-up’ to Gold and to greatness. Many battles require you to learn & live to fight another day. You’ve learned & you will fight again; and we will all be there again…cheering you on loudly. 🇮🇳👏🏽👏🏽👏🏽 #praggnanandha https://t.co/2L0U1cZD4E — anand mahindra (@anandmahindra) August 24, 2023 -
పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. జగజ్జేతగా కార్ల్సన్
బకూ (అజర్బైజాన్): ఫైవ్ టైమ్ వరల్డ్ చెస్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తన తొలి వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన ఫైనల్ టైబ్రేక్స్‌లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి జగజ్జేతగా అవతరించారు. 🏆 Magnus Carlsen is the winner of the 2023 FIDE World Cup! 🏆 Magnus prevails against Praggnanandhaa in a thrilling tiebreak and adds one more prestigious trophy to his collection! Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/sUjBdgAb7a — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోగా.. రెండో గేమ్‌ను ఇరువురు డ్రాకు అంగీకరించడంతో కార్ల్సన్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టోర్నీ ఆధ్యాంతం దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద ఫైనల్లో కార్ల్సన్ ఎత్తుల ముందు చిత్తయ్యాడు. అంతకుముందు ఫైనల్లో భాగంగా జరిగిన రెండు గేమ్‌ల్లో కార్ల్సన్, ప్రజ్ఞానంద తలో గేమ్ గెలవడంతో టైబ్రేక్స్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! 🥈 Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! 👏 On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3 Fabiano Caruana! By winning the silver… pic.twitter.com/zJh9wQv5pS — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 Fabiano Caruana clinches third place in the 2023 FIDE World Cup and secures a ticket to the #FIDECandidates tournament next year, after prevailing against Nijat Abasov in the tiebreaks. Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/Z35mDJJMwz — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 -
36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్ ఆవిర్భావం
భారత చెస్‌లో కొత్త ఆధిపత్యం మొదలైంది. ఇన్నాళ్లు చెస్ పేరు చెబితే ముక్తకంఠంగా వినిపించే పేరు విశ్వనాథన్ ఆనంద్. దాదాపు 36 ఏళ్ల పాటు ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనందే. కానీ అతని ఆధిపత్యానికి 17 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ డీ గుకేష్ చెక్ పెట్టాడు. తన గురువును మించిపోయిన గుకేష్ ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి భారత చెస్ చరిత్రలో 'నయా కింగ్'గా అవతరించాడు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో తొలిసారి ఒక ఇండియన్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్‌ను మించి రేటింగ్ సాధించాడు.వరల్డ్ కప్ లో భాగంగా తన రెండో రౌండ్ మ్యాచ్ లో అజర్బైజాన్ కు చెందిన మిస్రట్దిన్ ఇస్కాందరోవ్ పై విజయం సాధించాడు. 44 ఎత్తుల్లో గుకేష్ గెలవడంతో అతనికి 2.5 రేటింగ్ పాయింట్లు వచ్చాయి. దీంతో గుకేష్ లైవ్ రేటింగ్ 2755.9కి చేరింది. మరోవైపు ఆనంద్ 2754.0 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. వరల్డ్ లైవ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం గుకేస్ 9వ స్థానంలో ఉండగా.. ఆనంద్ 10వ స్థానానికి పడిపోయాడు. అధికారిక ఫిడే రేటింగ్ లిస్టు ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నా.. గుకేష్ తన ఆధిపత్యం కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఫిడే ట్వీట్ చేసింది. "గుకేష్ ఇవాళ మళ్లీ గెలిచాడు. దీంతో లైవ్ రేటింగ్ లో విశ్వనాథన్ ఆనంద్ ను మించిపోయాడు. తర్వాతి ఫిడే రేటింగ్ లిస్ట్ అధికారికంగా ప్రకటించడానికి (సెప్టెంబర్ 1న) సుమారు నెల రోజుల సమయం ఉన్నా.. గుకేష్ టాప్ 10లో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలుస్తాడు" అని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ట్వీట్ చేసింది. Gukesh D won again today and has overcome Viswanathan Anand in live rating! There is still almost a month till next official FIDE rating list on September 1, but it's highly likely that 17-year-old will be making it to top 10 in the world as the highest-rated Indian player!… pic.twitter.com/n3I2JPLOJQ — International Chess Federation (@FIDE_chess) August 3, 2023 ఇక విశ్వనాథన్ ఆనంద్ 1991లో తొలిసారి టాప్ 10లోకి వచ్చినా.. 1987 నుంచి ఇండియాలో అత్యధిక రేటింగ్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఆనంద్ కన్నా ముందు 1986 జులైలో ప్రవీణ్ తిప్సే అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా ఉన్నాడు. ఇప్పుడు గుకేష్ తన లీడ్ ఇలాగే సెప్టెంబర్ 1 వరకూ కొనసాగిస్తే ఆనంద్‌ను మించిన తొలి ప్లేయర్‌గా నిలుస్తాడు. చదవండి: 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్ ఆవిర్భావం Yuzvendra Chahal: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు -
పవర్‌గ్రిడ్ చెస్ టోర్నీ విజేత కార్పొరేట్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో మహిళల టీమ్ విభాగంలో కమలేశ్ భూరాణి, హిమాన్షిలతో కూడిన కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు విజేతగా నిలిచింది. కార్పొరేట్ సెంటర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. పవర్‌గ్రిడ్ సదరన్ రీజియన్–1 ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. మహిళల టీమ్ విభాగంలో ఈస్టర్న్ రీజియన్–1కు రెండో స్థానం, నార్తర్న్ రీజియన్–2కు మూడో స్థానం లభించాయి. పురుషుల టీమ్ విభాగంలో బిశ్వజ్యోతి దాస్, అరుణ్ తివారీ, హృషికేశ్ సింగ్, బిజిత్ శర్మలతో కూడిన నార్త్ ఈస్టర్న్ రీజియన్ చాంపియన్‌గా నిలిచింది. నార్తర్న్ రీజియన్–1కు రెండో స్థానం, కార్పొరేట్ సెంటర్‌కు మూడో స్థానం దక్కాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో అంజన్ సేన్ (కార్పొరేట్ సెంటర్), బిశ్వజ్యోతి దాస్, గౌరవ్ కుమార్ (నార్తర్న్ రీజియన్–1) వరుసగా తొలి మూడు స్థానాల్లో... మహిళల వ్యక్తిగత విభాగంలో మీనాక్షి మలిక్ (నార్నర్త్ రీజియన్–1), హిమాన్షి, కమలేశ్ భూరాణి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పవర్‌గ్రిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్ శర్మ (సీజీఎం–అసెట్ మేనేజ్మెంట్), సంజయ్ కుమార్ గుప్తా (సీజీఎం–ప్రాజెక్ట్స్), హరినారాయణన్ (సీజీఎం–హ్యూమన్ రిసోర్సెస్) తదితరులు పాల్గొన్నారు. -
భారత 83వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య
మహారాష్ట్రకు చెందిన ఆదిత్య సామంత్ భారత చెస్‌లో 83వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న బీల్ చెస్ ఫెస్టివల్లో ఆదిత్య జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించడంతోపాటు చివరిదైన మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. 20 ఏళ్ల ఆదిత్య అబుదాబి మాస్టర్స్‌లో తొలి జీఎం నార్మ్, ఎల్ లోలోబ్రెగట్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్ సాధించాడు. -
సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి
భారత చెస్ దిగ్గజం.. ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు షాక్ తగిలింది. భారత 17 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ దిగ్గజంతో తలపడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం విశేషం. విషయంలోకి వెళితే.. క్రోయేషియా రాజధాని జగ్రెబ్‌లో జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ బ్లిట్జ్ క్రొయేషియా 2023 పోటీల్లో గుకేశ్, ఆనంద్ పోటీ పడ్డారు. ‘ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బాగా ఆడతానని తెలుసు. అయితే. ఆనంద్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. నేను ఎంతగానో ఆరాధించే ఆటగాడిపై విజయం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది’ అని గుకేశ్ అన్నాడు. అయితే.. 10 పాయింట్లు సాధించిన ఈ ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు. చెన్నైకి చెందిన గుకేశ్‌కి విశ్వనాథన్ ఆనంద్ అంటే చాలా ఇష్టం. అతడిని చూస్తూ పెరిగిన గుకేశ్ పెద్దయ్యాక చెస్ ప్లేయర్ కావాలనుకన్నాడు. అండర్ -13 చాంపియన్‌గా నిలిచాడు. అయితే.. ప్రపంచంలో అతి చిన్నవయసులోనే గ్రాండ్ మాస్టర్‌గా రికార్డు చేజార్చుకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది జూన్ నెలలో వరల్డ్ నంబర్-1 మాగ్నస్ కార్లోసన్(Magnus Carlsen)ను ఓడించి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈరోజు ఆనంద్‌పై పైచేయి సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం -
ఆనంద్ VS ఆనంద్: ఆనంద్ మహీంద్ర ట్వీట్, ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ 2023 1వ ఎడిషన్ షురూ అయింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా అరుదైన ఫోటోలను ట్వీపుల్తో షేర్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ 2023 జూన్ 22న దుబాయ్లోగురువారం ప్రారంభమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ క్రీడాకారులందరూ ఇక్కడికి చేరారు.లీగ్ తొలి మ్యాచ్‌లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ , అప్‌గ్రేడ్ ముంబా మాస్టర్స్ తలపడతాయి. ఆనంద్ VS ఆనంద్ గేమ్‌లో ఎవరు గెలుస్తారో గెస్ చేయండి.. కానీ గిఫ్ట్ ఏమీ ఉండదు. అయితే ఈ సందర్భం ఏంటో, తన క్లాసికల్ ఓపెనింగ్ ఏంటో చెప్పిన తొలి వ్యక్తిని మాత్రం కచ్చితంగా అభినందిస్తా అంటూ విజేత ఎవరో చెప్పకనే చెబుతూ చమత్కరించారు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో చెస్ గేమ్ ఆడాటం విశేషంగా నిలిచింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ. చెస్ బేస్ ఇండియా ఈ లీగ్‌కు ఆరంభానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఆనంద్ వెర్సస్ ఆనంద్ అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రపంచ చదరంగంలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. రికార్డు విజయాలతో ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు. పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించి 14వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 2000లో తొలి సారిగా ఇండియాకు చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి పెట్టిన రికార్డును క్రీడా ప్రేమికులెవరూ మర్చిపోరు. చదరంగంలో చేసిన సేవలకు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులతో ఘనంతా సత్కరించింది. The 1500 year old game, is ready to make #TheBigMove. The stage is set in Dubai, the modern marvel city of the world. @anandmahindra @tech_mahindra @FIDE_chess @DubaiSC @C_P_Gurnani @jagdishmitra @balanalaskank @gulf_titans @GangesGMs @SGAlpineWarrior @trivenickings @umumba… pic.twitter.com/8EkMTlIOJo — Tech Mahindra Global Chess League (@GCLlive) June 21, 2023 There will be NO prize for anyone who guesses who won the match…😊 (But I will applaud the first person who guesses which classical opening I used…) https://t.co/ghDTlbGxh5 — anand mahindra (@anandmahindra) June 22, 2023 -
షార్జా మాస్టర్స్ విజేత అర్జున్
ఆరంభ రౌండ్లలో తడబడ్డా... చివర్లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అర్జున్ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరి రౌండ్లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 27 ఎత్తుల్లో నోదిర్బెక్ యాకుబోయెవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత మరో ఏడుగురితో కలిసి అర్జున్ సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నాడు. అయితే తొమ్మిదో రౌండ్లో అర్జున్ గెలుపొందగా... మిగతా ఆరుగురు ప్లేయర్లు తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో అర్జున్‌కు టైటిల్ ఖరారైంది. భారత్‌కే చెందిన దొమ్మరాజు గుకేశ్ ఆరు పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా గుకేశ్‌కు రెండో ర్యాంక్ లభించింది. విజేతగా నిలిచిన అర్జున్‌కు 10 వేల డాలర్లు (రూ. 8 లక్షల 27 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఆలగడప బాలుడు.. భారత గ్రాండ్‌మాస్టర్
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన ఉప్పల ప్రణీత్ చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ సాధించాడు. భారతదేశం నుంచి ఈ గణత సాధించిన 82వ ఆటగాడిగా ప్రణీత్ నిలిచాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం నుంచి 5వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు. చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా రావాలంటే మూడు జీఎం నార్మ్‌లు సాధించడంతో పాటు ఎలో రేటింగ్ పాయింట్లు 2500 దాటాలి. అయితే అజర్బైజాన్లో జరిగిన బకూ ఓపెన్‌లో టోర్నీలో ప్రణీత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గ్రాండ్‌మాస్టర్ హోదాకు కావాల్సిన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించిన ప్రణీత్ 15 ఏళ్ల వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఉమ్మడి జిల్లా నుంచి తొలిసారి గ్రాండ్‌మాస్టర్ ఘనత సాధించిన ప్రణీత్‌కు పలు క్రీడా సంఘాలు, క్రీడాకారులు, ఆలగడప గ్రామస్తులు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన ఉప్పల శ్రీనివాసచారి, ధఽనలక్ష్మి దంపతుల కుమారుడు ప్రణీత్. శ్రీనివాసచారి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (సీటీఓ)గా, ధనలక్ష్మి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కొనేళ్లు క్రితం వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆలగడపలో వీరికి సొంత ఇల్లు, భూ ములు ఉన్నాయి. ప్రతి పండుగకు, శుభకార్యాలకు, సెలవుల్లో స్వగ్రామానికి వస్తుంటారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రణీత్ చెస్‌లో రాణిస్తున్నాడు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు వచ్చినా.. కుమారుడి కెరీర్ ఆగిపోవద్దనే ఉద్దేశంతో వారు ఫ్లాట్‌ను సైతం విక్రయించి ప్రణీత్ చెస్‌లో రాణించేందుకు అండగా నిలిచారు. విదేశాల్లో టోర్నీల శిక్షణ కోసం ఎంతో ఖర్చు పెడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు ఓటమి ఎదురై ప్రణీత్‌కు నిరాశ కలిగినా.. పట్టుదలతో విజయాల వైపు సాగిపోయాడు. 2021 వరకు రామరాజు వద్ద శిక్షణ పొందిన ప్రణీత్, ప్రస్తుతం ఇజ్రాయిల్‌కు చెందిన కోచ్ విక్టర్ మెకలెవిస్కి వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రణీత్ సాధించిన విజయాలు ► అండర్–7లో రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచాడు. ► 2015లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ జీఎం టోర్నీలో 220 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి ఒకే ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పాయింట్లు గెలిచిన ఆటగాడిగా జాతీయ రికార్డు సృష్టించాడు. ► అదే ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. ► 2018లో అండర్–11లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచాడు. ► 2021లో అండర్–14 జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. ► ఆసియా దేశాల ఆన్లైన్ చెస్ టోర్నీలో స్వర్ణం సాధించాడు. ఎంతో సంతోషంగా ఉంది చెస్‌ను ఆన్లైన్లో ఆడడం కంటే, నేరుగా బోర్డుపై ఆడడానికే ప్రాధాన్యమిస్తా. బిల్జ్, ర్యాపిడ్ కంటే క్లాసికల్ విభాగం అంటేనే నాకిష్టం. బలమైన ప్రత్యర్థిపై గెలుపుతో పాటు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా దక్కింది. గ్రాండ్ మాస్టర్ హోదా సాధించినందుకు సంతోషంగా ఉంది. ఐదున్నరేళ్ల వయస్సులోనే చెస్ ఆడటం మొదలెట్టా. చిన్నప్పుడు టెన్నీస్ ఆడేవాడిని. ఈతలోను ప్రవేశం ఉంది కానీ ఓ రోజు నాన్న చెస్ ఆడతుండగా చూసి ఆసక్తి కలిగింది. నా ఇష్టాన్ని గమనించి అమ్మానాన్న నన్ను ప్రోత్సహించారు. కార్ల్‌సన్‌ను ఆరాధిస్తా. ఇక నా రేటింగ్‌ను 2800కు పెంచుకునేందుకు కృషి చేస్తున్నా. ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఒలింపిక్‌లో దేశానికి పతకం అందించడమే నా లక్ష్యం. – ఉప్పల ప్రణీత్, గ్రాండ్ మాస్టర్ -
Tepe Sigeman And Co 2023 R4: అర్జున్‌కు మూడో పరాజయం
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో పరాజయం చవిచూశాడు. స్వీడన్లో సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో అర్జున్ 51 ఎత్తుల్లో జోర్డాన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్‌మాస్టర్ అభిమన్యు మిశ్రా, భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ మధ్య జరిగిన గేమ్ 42 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఐదో రౌండ్ తర్వాత గుకేశ్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో, అర్జున్ రెండు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తా చాటుతున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రెండో విజయం సాధించాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌తో ఆదివారం స్వీడన్లో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో అర్జున్ 38 ఎత్తుల్లో గెలుపొందాడు. నాలుగు రౌండ్ల తర్వాత అర్జున్ రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, గుకేశ్ 2.5 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నారు. -
International Chess Tourney: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: బుకారెస్ట్ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ కాంస్య పతకం సాధించాడు. రొమేనియాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 10 రౌండ్ల తర్వాత మాక్సిమ్ చిగయెవ్ (రష్యా), డేనియల్ బొగ్డాన్ (రొమేనియా), హరికృష్ణ 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. చిగయెవ్కు టాప్ ర్యాంక్ దక్కగా... బొగ్డాన్కు రెండో ర్యాంక్, హరికృష్ణకు మూడో ర్యాంక్ లభించాయి. హరికృష్ణ మొత్తం ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ రౌనక్‌తో జరిగిన గేమ్‌లో ఓడిపోయాడు. -
రన్నరప్‌గా ఏపీ గ్రాండ్ మాస్టర్ కార్తీక్ వెంకటరామన్
సన్వే ఫార్మెన్‌టెరా అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ రన్నరప్‌గా నిలిచాడు. స్పెయిన్‌లో ముగిసిన ఈ టోర్నీ లో నిర్ణీత 10 రౌండ్ల తర్వాత ఫెదోసీవ్ వ్లాదిమిర్ (రష్యా), కార్తీక్ వెంకటరామన్ (భారత్), ప్రణవ్ (భారత్), లియోన్ ల్యూక్ మెండోకా (భారత్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు ఈ నలుగురి మధ్య ప్లే ఆఫ్ గేమ్‌లను నిర్వహించారు. వ్లాదిమిర్, కార్తీక్ ఫైనల్ చేరగా.. ఫైనల్లో కార్తీక్‌పై నెగ్గి వ్లాదిమిర్ విజేతగా నిలిచాడు. -
భారతదేశ భవిష్యత్తుని మార్చేది ఇలాంటివారే: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల తన ట్విట్టర్ వేదికగా ఒక బాలుడి గురించి చెప్పుకొచ్చారు, ఇలాంటి వారే భారతదేశం భవిష్యత్తుని నిర్ణయిస్తారని వెల్లడించాడు, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల తమిళనాడులోని హోసూర్‌లో జరిగిన స్కూల్ చెస్ పోటీకి సుమారు 1600 మంది పిల్లలు హాజరయ్యారు, ఇందులో ఒక బాలుడు తాను ఈ పోటీల్లో పాల్గొనటానికి రాత్రి మొత్తం రెండు బస్సులలో ప్రయాణించి పోటీ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మ్యాచ్ జరగటానికి ముందు ఒక చిన్న కునుకు తీసాడు. జరగబోయే పోటీలో విజయం పొందటమే అతని లక్ష్యం. ఆనంద్ మహీంద్రా ఈ పోస్టుని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనికి మండే మోటివేషన్ అంటూ క్యాప్సన్ కూడా ఇచ్చారు. ఇది ఎంతో మందిని ఆకర్షించింది. నిజానికి ఇలాంటివి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి. కొంత మంది ఈ పోస్ట్ చూసి కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఇందులో పిల్లల నుంచి మనం చాలా విషయాలను నేర్చుకోవాలని, వారు అందరికి స్ఫూర్తిదాయకమని, ఆల్ ది బెస్ట్, ఛాంప్ అంటూ.. భారతదేశానికి కీర్తి తెచ్చే అంకితభావం కలిగి మేధావులు ఉంటారని మరికొందరు అన్నారు. A recent school chess competition in Hosur had 1600 kids from all over. This boy traveled all night by bus (changing buses twice) then walked from the depot. Took a nap before the match. Wants to be the next Magnus. Kids like him shape India’s future. He’s my #MondayMotivation pic.twitter.com/1WhlapiLCn — anand mahindra (@anandmahindra) February 27, 2023 -
ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్‌సన్‌పై విదిత్ విజయం
చెన్నై: ప్రొ చెస్ లీగ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరా తి గొప్ప ఫలితం సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)పై విదిత్ గెలుపొందాడు. ఆన్లైన్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియన్ యోగిస్ జట్టు తరఫున పోటీపడుతున్న విదిత్ బ్లిట్జ్ గేమ్‌లో 58 ఎత్తుల్లో కెనడా చెస్బ్రాస్ జట్టు తరఫున ఆడుతున్న కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. 16 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీని లక్షా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కార్ల్‌సన్‌ను ఓడించిన నాలుగో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ కావడం విశేషం. ప్రజ్ఞానంద, గుకేశ్, ఇరిగేశి అర్జున్ కూడా ఈ నార్వే దిగ్గజంపై వివిధ టోరీ్నలలో గెలుపొందారు. -
చదరంగంలో మిస్టర్ మేధావి.. తొలి గురువు ఎవరంటే?
ప్రతి ఆటకూ ఒకరు టార్చ్‌బేరర్ ఉంటారు... అతను నడిచిన బాట కొత్త తరానికి మార్గనిర్దేశనం చేస్తుంది.. అతను వేసిన దారి కొత్తవారి విజయాన్ని సులువు చేస్తుంది..ఆ ఆటగాడు ఇచ్చిన స్ఫూర్తి అందరికీ నమ్మకాన్ని కలిగిస్తుంది.. మేమూ సాధించగలమనే ధైర్యాన్ని ఇస్తుంది.. భారత్ చదరంగానికి సంబంధించి ఆ ఘనాపాటి విశ్వనాథన్ ఆనంద్.. మిగతా క్రీడల్లో మరో పేరు స్ఫురణకు రావచ్చేమో కానీ ఆనంద్ లేకుండా భారత చెస్ లేదు..ఇప్పుడు భారత్‌లో 79 మంది గ్రాండ్‌మాస్టర్లు.. మొదటివాడు మాత్రం మన ‘విషీ’.. ‘ఆనంద్‌లాంటి వ్యక్తులు చాలా అరుదు. రోజుకు 14 గంటలు కష్టపడితే చెస్‌లో నైపుణ్యం సంపాదించవచ్చు. కొన్ని విజయాలూ అందుకోవచ్చు. కానీ అత్యుత్తమ ఆటగాడిగా ఎదగాలంటే అసాధారణ, సహజ ప్రజ్ఞ ఉండాలి. అది ఆనంద్‌లో ఉంది. అందుకే ఆయన ఆ స్థాయికి చేరారు. మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు’.. ఆనంద్ తర్వాత భారత రెండో గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు బారువా చేసిన వ్యాఖ్య ఇది. దశాబ్దాలుగా చదరంగంలో సాగుతున్న రష్యా ఆధిపత్యాన్ని ఆనంద్ బద్దలు కొట్టగలిగాడు. గ్యారీ కాస్పరోవ్, అనతొలి కార్పొవ్, వ్లదిమిర్ క్రామ్నిక్.. మొదలైన వారికి సవాల్ విసురుతూ ఆనంద్ శిఖరానికి చేరగలిగాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. చెస్ ఆటకు మన దేశం నుంచి అసలైన రాయబారిగా నిలిచాడు. ఆమె అండగా.. అమ్మ సుశీల ఆనంద్‌కు చెస్‌లో ఆది గురువు. 80ల్లో తల్లిదండ్రులకు ఏదైనా క్రీడలో ఆసక్తి ఉండి వారు అందులో ప్రోత్సహిస్తే అదే ఆటను ఎంచుకోవడం తప్ప సొంతంగా తమ ఇష్టాయిష్టాలను ప్రదర్శించే అవకాశం తక్కువ. అందులోనూ చెస్ అంటే ‘ఏం భవిష్యత్ ఉంటుంది?’ అన్నట్లుగానే ఉండేది. ఆనంద్ తల్లికి చదరంగం అంటే ఇష్టం ఉన్నా.. కొడుకును బలవంతపెట్టలేదు. కానీ ‘చైల్డ్ ప్రాడజీ’లాంటి తన కొడుకులో చురుకుదనాన్ని ఆమె గుర్తించింది. దానిని సరైన రీతిలో ఉపయోగించుకోవాలనే ఆనంద్‌ను చెస్‌లోకి తీసుకొచ్చింది. తానే గురువుగా మారి అన్నీ నేర్పించింది. తండ్రి కృష్ణమూర్తి కూడా ఎంతో ప్రోత్సహించాడు. ఉద్యోగరీత్యా తాను ఫిలిప్పీన్స్‌లో ఉండాల్సి వస్తే అక్కడకు వెళ్లాక సరైన రీతిలో శిక్షణ ఇప్పించాడు. ఆ కుర్రాడు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఊహించినదానికంటే వేగంగా ఎదుగుతూ దూసుకుపోయాడు. మద్రాసులో ఆరేళ్ల వయసులో చెస్‌లో ఓనమాలు దిద్దుకున్న ఆనంద్ ఐదు పదులు దాటినా విశ్వవ్యాప్తంగా ఇప్పటికీ తనదైన ముద్రను చూపించగలుగుతున్నాడంటే అతని ఘనత ఎలాంటిదో అర్థమవుతోంది. వర్ధమాన ఆటగాడిగా ఎదుగుతున్న సమయంలో ‘లైట్నింగ్ కిడ్’ అంటూ చెస్ ప్రముఖులతో పిలిపించుకున్న విషీ.. ఆ తర్వాత చదరంగంలో తన విజయాలతో వెలుగులు విరజిమ్మాడు. వరుస విజయాలతో.. 14 ఏళ్ల వయసులో జాతీయ సబ్ జూనియర్ చాంపియ¯Œ గెలవడం మొదలు ఆనంద్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆశ్చర్యకర రీతిలో అసలు అపజయాలు లేకుండా అతను పైపైకి దూసుకుపోయాడు. తర్వాతి ఏడాదే ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్, 15 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ సాధించిన ఆటగాడిగా గుర్తింపు, 16 ఏళ్లకే జాతీయ సీనియర్ చాంపియన్, 18 ఏళ్ల వయసులో వరల్డ్ జూనియర్ చాంపియన్ .. ఈ జాబితా అలా సాగుతూ పోయింది. ఆనంద్ ఉన్నాడంటే చాలు ప్రత్యర్థులు రెండో స్థానానికి పోటీ పడేందుకు సిద్ధమైనట్లే అన్నట్లుగా పరిస్థితి ఉండేది! తన విజయాలు గాలివాటం కాదని, ఈ అసాధారణ ప్రతిభతో మున్ముందు తానేంటో చూపించగలననే నమ్మకం ఎట్టకేలకు 19వ ఏట వచ్చింది. 1988లో సొంత రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో జరిగిన శక్తి ఇంటర్నేషనల్ టోర్నీని గెలవడంతో ఒక కొత్త చరిత్ర నమోదైంది. భారతదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్‌గా విశ్వనాథన్ ఆనంద్ అవతరించాడు. అక్కడ మొదలైన ఆ అగ్రస్థాయి ప్రస్థానం ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిపింది. అందరికీ ఇష్టుడు.. ‘వై దిస్ నైస్ గై ఆల్వేస్ విన్ ’.. విశ్వనాథన్ ఆనంద్ గురించి చెస్ ప్రపంచంలో తరచుగా వినిపించే, అతనికి మాత్రమే వర్తించే వ్యాఖ్య! సాధారణంగానే చెస్ ఆటగాళ్లు బోర్డుపై మినహా బయట ఎక్కువగా దూకుడు ప్రదర్శించరు. కానీ ఆనంద్ వారందరికంటే మరో మెట్టు పైనుంటాడు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో హోరాహోరీ మ్యాచ్‌లలో ఆడినా ఏరోజూ అతను సంయమనం కోల్పోలేదు. విమర్శలు, ప్రతివిమర్శలు చేయలేదు. ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేయలేదు. అతని ఆటలాగే మాట, వ్యవహారశైలి కూడా ప్రశాంతంగా ఉంటుంది. తాను జూనియర్‌గా ఉన్న సమయంలో ఏర్పాట్లు బాగా లేవంటూ ఆటగాళ్లంతా మూకుమ్మడిగా టోర్నీని బహిష్కరిస్తే తాను మాత్రం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమని ఆనంద్ స్పష్టంగా చెప్పేశాడు. అదే నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత కూడా విమానాలు అనూహ్యంగా రద్దయితే రెండు రోజుల పాటు 2 వేల కిలోమీటర్లు రోడ్డు ద్వారా ప్రయాణించి మరీ ఇచ్చిన మాటకు కట్టుబడి అక్కడికి చేరుకున్న వెంటనే మ్యాచ్ ఆడాడు. నిర్వాహకులు కూడా అమితాశ్చర్యంతో ‘మ్యాచ్‌ను వాయిదా వేసేవాళ్లం కదా’ అన్నా వారికీ చిరునవ్వే సమాధానమైంది. రష్యా రాజకీయాల్లో కాలు పెట్టి తీవ్ర వివాదాస్పదుడిగా ముద్ర వేసుకున్న కాస్పరోవ్లా ఆనంద్ ఎప్పుడూ తన పరిధి దాటలేదు. ఇలాంటి వ్యక్తిత్వమే ఆనంద్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తెచ్చి పెట్టింది. సాధించిన ఘనతలెన్నో.. 2000, 2007, 2008, 2010, 2012లలో విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. 2007లో తొలిసారి ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా మారిన అతను సుదీర్ఘకాలం ప్రపంచ చెస్‌ను శాసించాడు. తన సమకాలికులు ఎందరికో సాధ్యం కాని రీతిలో 48 ఏళ్ల వయసులో అత్యంత వేగంగా సాగే ‘ర్యాపిడ్’ ఈవెంట్లో సత్తా చాటాడు. తన తరంలో అత్యుత్తమ ర్యాపిడ్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను 2003, 2017లలో ఈ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు. ర్యాపిడ్ కంటే కూడా వేగంగా క్షణాల వ్యవధిలో సాగే బ్లిట్జ్‌లో తన ముద్ర వేయడం ఆనంద్‌కే చెల్లింది. 2000లో వరల్డ్ బ్లిట్జ్ కప్ విజేతగా నిలవడం అతని సామర్థ్యాన్ని చూపించింది. టోర్నమెంట్ ఫార్మాట్, మ్యాచ్ ఫార్మాట్, నాకౌట్ ఫార్మాట్, ర్యాపిడ్ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక ఆటగాడు కావడం.. ఆనంద్ గొప్పతనాన్ని చెబుతుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లు మాత్రమే కాదు కోరస్ ఇంటర్నేషనల్, టాటా స్టీల్, తాల్ మెమోరియల్, లినారెస్ చెస్‌లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ విజయాలు అతని ఖాతాలో ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి తొలి ‘ఖేల్‌రత్న’ పురస్కారంతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు అతనికి కంఠాభరణంగా మారాయి. ‘మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్’ అంటూ తన అనుభవాలతో భారత్ చెస్‌కు కొత్త పాఠాలు నేర్పించిన ఆనంద్ కెరీర్ ఆద్యంతం స్ఫూర్తిదాయకం. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
తెలుగు చతురంగ బలం
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం. ప్రధానితో ముచ్చటగా మాటామంతీ.ఇలాంటి ఓ రోజును కలలోనైనా కలగనలేదు.బాలపురస్కార్ గ్రహీత అంతరంగం ఇది. నాలుగేళ్ళ చిరుప్రాయంలో చదరంగ ΄పావులు కదపడం నేర్చిన ఆ చిన్నారి... పదకొండవ ఏటనే ఉమెన్ ఫిడే మాస్టర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా గణతంత్రదినోత్సవ వేడుకల్లో భాగంగా బాలపురస్కార్ అవార్డును అందుకుంది. ఆ చిన్నారే ఆంధ్రప్రదేశ్ విశాఖకు చెందిన కొలగట్ల అలన మీనాక్షి. అమ్మ ఆడుకునేందుకు సరదాగా ఇచ్చిన చతురంగ బోర్డే ఆనతికాలంలో ఎత్తులకు పైఎత్తులు వేసి ఫిడే మాస్టర్ టైటిల్ సాధించే స్థాయికి ఎదిగిన క్రమాన్ని ఆమె ‘సాక్షి’తో పంచుకుంది. ప్రశ్న: చదరంగం ఆడటం ఎలా ప్రారంభమైంది? జవాబు: నాలుగేళ్లప్పుడు ఆమ్మ (అపర్ణ) సరదాగా ఆడుకోవడానికి బోర్డ్గేమ్స్తో ΄పాటు చదరంగం బోర్డ్ ఇచి్చంది. అది మాగ్నటిక్ బోర్డ్. చాలా సరదాగా వుండేది. ఆ తర్వాత గడుల్లో పావులు పెట్టి ఆనందపడేదాన్ని. అది గమనించిన అమ్మ శిక్షణకు తీసుకువెళ్ళింది. అలా వేసవి శిబిరంలో శిక్షణ΄÷ంది తొలిసారి స్థానిక టోరీ్నలో ΄ాల్గొంటే యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాను. అప్పటినుంచి మరో ఏడాది ఆటపై దృష్టిపెట్టి ఐదున్నరేళ్లకే జిల్లా చాంపియన్‌గా నిలిచాను. ∙ఫిడే మాస్టర్‌గా ఎలా ఎదిగారు? బాలికల అండర్ 7 లో ఐదున్నరేళ్ళకే టోరీ్నల్లో ΄ాల్గొనడంతో ఫిడే రేటింగ్ మొదలైంది. క్రమంగా 2021లో ఎలో రేటింగ్ 1829కి చేరడంతో ఉమెన్ కాండిడేట్ మాస్టర్ టైటిల్ సాధించాను. ఇక అక్కడి నుంచి సీరియస్‌గానే టోరీ్నల్లో ΄ాల్గొనడం, రేటింగ్ పెంచుకోవడంతో గత డిసెంబర్లో ఉమెన్ ఫిడే మాస్టర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాను. స్పెయిన్‌లో ప్రపంచ చదరంగం క్యాంప్‌లో ఉండగా ఉమెన్ ఫిడే మాస్టర్ టైటిల్‌కు అర్హమైన ఎలోరేటింగ్ 2100 ΄ాయింట్లు సాధించాను. బాల పురస్కార్ అవార్డు వస్తుందని ఊహించారా? జనవరి 20వ తేదీ సాయంకాలం నాన్న(మధు)కి ఓ కాల్ వచి్చంది. ఆ కాల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ నుంచి. అర్జంట్‌గా వివరాలను పం΄ాలని అన్నారు. బాల పురస్కార్ అవార్డుకి ఎంపికయ్యానన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఐదారు నిమిషాలు పట్టింది. అంతే! గంటలో టికెట్స్ రావడం... మరుసటి రోజే ఢిల్లీకి పయనమవడం అంతా జరిగి΄ోయింది. అయితే రాష్ట్ర సంప్రదాయ దుస్తుల్లో రావాలన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎలా ఉంది? అంత పెద్ద అవార్డు అందుకోవడం.. అదీ దేశ ప్రథమ΄పౌరురాలి చేతుల మీదుగా చిరు్ర΄ాయంలోనే తీసుకోవడం చాలా గర్వకారణం. రాష్ట్రానికి ప్రతినిధి కావడం ఒక మధురానుభూతి. ప్రధానమంత్రితో మాట్లాడారా? మోదీ గారు బాల పురస్కార గ్రహీతలందర్నీ కూర్చోబెట్టుకుని ముచ్చటించారు. నాతో ఆయన తెలుగులో మాట్లాడారు. ‘నేను చెప్పడం కాదు మీరు చెప్పండి’ అన్నారు. మాస్టర్ టైటిల్స్ సాధించడం వరకు నా అనుభవాన్ని చె΄్పాను. నాకు కొందరికి శిక్షణ ఇవ్వాలని ఉంది అంటే... ‘నీకు ఇంకా చాలా కెరీర్ ఉంది. మరిన్ని విజయాలను సొంతం చేసుకుని దేశానికి ఖ్యాతి తేవాలి’ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నారు? ‘ఇంత చిన్నవయస్సులోనే ఇన్ని టైటిల్స్ సొంతం చేసుకున్నావా’ అని ఆశ్చర్యపోయారు. ‘రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచా’వని జగన్ సర్ అభినందించారు. మీ తదుపరి లక్ష్యం ఏమిటి? ప్రస్తుతం నేను ఆరోతరగతి చదువుతున్నాను. మార్చిలో పరీక్షలున్నాయి. పాఠశాలలోనూ చక్కటి ప్రోత్సాహం లభిస్తోంది. పరీక్షలనంతరం జూన్‌లో యూరప్ వెళదామని అనుకుంటున్నాను. రేటింగ్‌ను మెరుగుపరుచుకుని ఐఎం నార్మ్ సాధించడానికి ఎక్కువ టోర్నీలు ఆడవలసి ఉంటుంది. కొంతకాలం అక్కడుంటేనే అది సాధ్యం. నా తదుపరి లక్ష్యం ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్లు్య ఐఎం)... అంటూ నవ్వుతూ ఇంటర్వ్యూ ముగించింది అలన మీనాక్షి. ఈ చిన్నారికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా. – డాక్టర్ సూర్యప్రకాష్ మాడిమి, సాక్షి, విశాఖపట్నం ఎత్తులకు పై ఎత్తులు ► 2021 డిసెంబర్ 1న ఫిడే అండర్ 10 బాలికల చదరంగంలో ఉమెన్ కాండిడెట్ మాస్టర్ (డబ్లు్యసిఎం)గా ప్రకటించారు. ►అండర్10 బాలికల కేటగిరీలో 1829 ఎలో రేటింగ్‌తో ప్రపంచం రెండో రాంక్‌కు చేరింది. అదే ఏడాది సెర్బియాలో జరిగిన ఉమెన్ లీగ్ చెస్ చాంపియన్‌షిప్‌లోనూ జట్టు నాలుగోస్థానంలో నిలవడంలో చక్కటి ప్రతిభ. ► 2021లో నేషనల్ అండర్ 10 బాలికల చదరంగం చాంపియన్íÙప్. ►ఏషియన్ స్కూల్స్ అండర్ 7 క్లాసిక్‌లో స్వర్ణాన్ని సాధించగా... ర్యాపిడ్‌లో స్వర్ణాన్ని టైగా నిలిచింది. ► కామన్వెల్త్ అండర్ 8 బాలికల్లో ఆరోస్థానం. ► ప్రపంచ పాఠశాలల అండర్7 బాలికల క్లాసిక్ పోటీల్లో 13వ స్థానం. ► ఏషియన్ యూత్ – 8 బాలికల రాపిడ్ చెస్‌లో స్వర్ణాన్ని సాధించింది. వెస్ట్రన్ అసియన్ –8 బాలకల రాపిడ్, బ్లిజ్లలో స్వర్ణాలు. -
రిల్టన్ కప్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న తమిళ కుర్రాడు
స్టాక్‌హోమ్: తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ఎం.ప్రణేశ్ భారత 79వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. స్టాక్‌హోమ్‌లో జరిగిన రిల్టన్ కప్‌లో విజేతగా నిలిచిన ప్రణేశ్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు గ్రాండ్‌మాస్టర్ హోదా కూడా సాధించాడు. ఈ టోర్నీకి ముందే అతను మూడు జీఎం నార్మ్‌లు పొందగా, ఇప్పుడు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు (లైవ్) కూడా దాటాడు. ‘ఫిడే’ సర్క్యూట్లో తొలి టోర్నీ అయిన రిల్టన్ కప్‌లో ప్రణేశ్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 136 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఆడిన 9 గేమ్‌లలో అతను 8 గెలిచి ఒకటి ఓడాడు. తెలంగాణకు చెందిన రాజా రిత్విక్ 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ప్రముఖ చెస్ కోచ్ ఆర్బీ రమేశ్ వద్ద ప్రణేశ్ శిక్షణ పొందుతున్నాడు. ‘అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్రణేశ్‌కు నా అభినందనలు. మంచి స్కోరుతో అతను విజేతగా నిలిచాడు. మన దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది’ అని దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పందించారు. -
కార్ల్‌సన్‌కు ‘చెక్’
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ను కంగు తినిపించినప్పటికీ ప్రజ్ఞానంద ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు 4–2తో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. ఒక మ్యాచ్ నాలుగు గేములుగా జరిగే ఈ టోర్నీలో ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో 2–2తో సమమైంది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు బ్లిట్జ్‌లో రెండు టైబ్రేక్స్ను నిర్వహించగా రెండు గేముల్లోనూ ప్రజ్ఞానందే గెలిచాడు. అయితే ఓవరాల్‌గా నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ 16 మ్యాచ్ పాయింట్లతో టోర్నీ విజేతగా నిలువగా, భారత టీనేజ్ సంచలనం 15 పాయింట్లతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మేటి ర్యాంకింగ్ ఆటగాళ్లను కంగుతినిపించిన భారత ఆటగాడికి 5, 6వ రౌండ్ గేమ్‌ల్లో ఎదురైన ఓటములు ప్రతికూలమయ్యాయి. -
ప్రజ్ఞానంద మరో సంచలన విజయం.. ఈసారి ఎనిమిదో ర్యాంకర్‌పై..!
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)ను ఓడించిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద... రెండో రౌండ్లో ఎనిమిదో ర్యాంకర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)పై గెలిచాడు. నేపాల్ సంతతికి చెందిన అనీశ్ గిరితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 89వ ర్యాంకర్ ప్రజ్ఞానంద 2.5–1.5తో నెగ్గాడు. తొలి మూడు గేమ్‌లు ‘డ్రా’ కాగా నాలుగో గేమ్‌లో ప్రజ్ఞానంద 81 ఎత్తుల్లో గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్లు (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. రెండో రౌండ్ తర్వాత ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే), ప్రజ్ఞానంద ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. -
ప్రజ్ఞానంద సంచలనం
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనంతో శుభారంభం చేశాడు. అమెరికా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2.5–1.5తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లెవాన్ అరోనియన్ (అమెరికా), జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్), లియెమ్ లీ (వియత్నాం), హాన్స్ నీమెన్ (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్) కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. -
9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం
చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టులో ద్రోణవల్లి హారిక కూడా సభ్యురాలు. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక...ఒక దశలో టోర్నీలో ఆడటం సందేహంగా మారింది. అయితే ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులో భాగం కావడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉంది. ‘18 ఏళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో భారత మహిళల చెస్ టీమ్ తరఫున తొలి సారి ఆడాను. ఇవి నాకు 9వ ఒలింపియాడ్. దేశం తరఫున పతకం సాధించి పోడియంపై నిలవాలని ఎన్నో సార్లు కలలు కన్నాను. ఇప్పుడు ఇది సాధ్యమైంది. ప్రస్తుతం నేను 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఇది దక్కడం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. భారత్‌లో ఒలింపియాడ్ జరుగుతుందని తెలిసిన తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే ఆరోగ్యంగా ఉంటే ఆడవచ్చని సూచించారు. అప్పటినుంచి చెస్ చుట్టే నా ప్రపంచం తిరిగింది. ప్రతీ అడుగులో ఆటపైనే దృష్టి పెట్టాను. పార్టీలు, వేడుకలు, బేబీ షవర్స్లాంటివేమీ లేవు. ఏదైనా పతకం గెలిచిన తర్వాతే అనుకున్నా. బాగా ఆడేందుకు ప్రతీ రోజు కష్టపడ్డా. గత కొన్నేళ్లుగా ఇలాంటి గెలుపు క్షణం కోసమే ఎదురు చూశా. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. భారత మహిళల జట్టుకు తొలి ఒలింపియాడ్ పతకం లభించింది’ అని హారిక తన సంతోషాన్ని భావోద్వేగంతో వెల్లడించింది. -
చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు కీలక పదవి
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అధ్యక్షుడు అర్కడి వొర్కోవిచ్ రెండోసారి అధ్యక్షుడయ్యారు. విఖ్యాత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆనంద్ ‘ఫిడే’ కార్యవర్గంలోకి రావడం పట్ల వొర్కోవిచ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆనంద్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ వుంది. ఇకపై ‘ఫిడే’ భవిష్యత్తుకు అతని సేవలు కీలకమవుతాయి’ అని అన్నారు. -
వైరల్: చదరంగ స్థలం
చదరంగం చదరపు బల్ల రంగస్థలం అయితే... రాజు, రాణి, సిపాయిలకు ప్రాణం వస్తే... ‘అహో!’ అనిపించే దృశ్యం కనువిందు చేస్తే... ‘అద్భుతం’ అనిపిస్తుంది. ‘చతురంగం’ వీడియో ద్వారా ఆ అద్భుతాన్ని ప్రపంచానికి చేరువ చేశారు కలెక్టర్ కవితారాము... ప్రపంచంలోని చదరంగ ప్రేమికుల దృష్టి ఇప్పుడు చెన్నైపై ఉంది. అక్కడ జరుగుతున్న ఆటల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సాంస్కృతిక కళారూపాలు మరో ఎత్తు. ‘చెస్ ఒలింపియాడ్–2022’ ప్రమోషన్లో భాగంగా వచ్చిన ‘చతురంగం’ అనే వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘దృష్టి మరల్చనివ్వని అద్భుతదృశ్యాలు’ అని వేనోళ్లా పొగుడుతున్నారు నెటిజనులు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వీడియో గురించి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. పుదుకొటై్ట కలెక్టర్ కవితారాము ఈ ‘చతురంగం’ నృత్యరూప కాన్సెప్ట్‌ను డిజైన్ చేయడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. కవితారాము స్వయంగా శాస్త్రీయ నృత్యకారిణి. ఎన్నో నృత్యప్రదర్శనలు ఇచ్చారు. ‘నృత్యంతో పాతికసంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. చెస్ ఒలింపియాడ్‌ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియో రూపొందించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి, దృశ్యపరంగా అద్భుతం అనిపించాలి అనుకున్నాను. అందులో భాగంగానే ఆటకు, నృత్యాన్ని జత చేసి చతురంగంకు రూపకల్పన చేశాము’ అంటుంది కలెక్టర్ కవితారాము. ఈ వీడియోలో క్లాసిక్, ఫోక్, మార్షల్ ఆర్ట్స్ ఫామ్స్‌ను ఉపయోగించారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సందర్భాన్ని బట్టి పసుపు, నీలిరంగు లైటింగ్‌ను వాడుకోవడం బాగుంది. పుదుకొటై్ట సంగీత కళాశాలకు చెందిన ప్రియదర్శిని నలుపువర్ణ రాణి, చెన్నై అడయార్ మ్యూజిక్ కాలేజికి చెందిన సహన శ్వేతవర్ణ రాణి వేషాలలో వెలిగిపోయారు. ‘మహిళాదినోత్సవం సందర్భంగా ప్రియదర్శిని నృత్యాన్ని చూశాను. చతురంగం వీడియో గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె గుర్తుకువచ్చింది. ఇక సహన నృత్యం గురించి నాకు తెలుసు. ఎప్పటి నుంచో ఆమెతో పరిచయం ఉంది. ఇద్దరూ తమదైన నృత్యప్రతిభతో చతురంగంకు వన్నె తెచ్చారు’ అంటోంది కవితారాము. చదరంగంపై పావుల సహజ కదలికలను దృష్టిలో పెట్టుకొని మొదట్లో నృత్యాన్ని రూపొందించాలనుకున్నారు. అయితే దీని గురించి చర్చ జరిగింది. క్రియేటివ్ లిబర్టీ తీసుకుంటూనే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఎక్కువమంది కళాకారులు. దీంతో నృత్యరీతులకు సృజనాత్మకతను జోడించారు. నలుపువర్ణ రాణి, శ్వేతవర్ణ రాజును ఓడించడంతో వీడియో ముగుస్తుంది. ఇది యాదృచ్ఛిక దృశ్యమా? ప్రతీకాత్మక దృశ్యమా? అనే సందేహానికి కలెక్టర్ కవితారాము జవాబు... ‘కావాలనే అలా డిజైన్ చేశాం. అంతర్లీనంగా ఈ దృశ్యంలో ఒక సందేశం వినిపిస్తుంది. తెలుపు మాత్రమే ఆకర్షణీయం, అందం అనే భావనను ఖండించడానికి ఉపకరించే ప్రతీకాత్మక దృశ్యం ఇది. దీనిలో జెండర్ కోణం కూడా దాగి ఉంది.’ -
చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల హవా
Chess Olympiad 2022: చెన్నై వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల హవా కొనసాగుతుంది. స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు పరాజయం అన్నది లేకుండా దూసుకెళ్తున్నారు. ఓపెన్, మహిళల విభాగాల్లో భారత జట్లు వరుసగా మూడో విజయాలు సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాయి. ఆదివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో (ఓపెన్ విభాగంలో) తెలుగు యువ కెరటాలు హరికృష్ణ, అర్జున్ ఇరిగైసి సత్తచాటడంతో భారత్ ‘ఎ’ 3–1తో గ్రీస్‌పై విజయం సాధించింది. దిమిత్రోస్‌పై హరికృష్ణ విజయం సాధించగా, అర్జున్.. మాస్తోవసిల్స్‌ను చిత్తు చేశాడు. భారత ‘బి’.. స్విట్జర్లాండ్‌పై (4–0) ఏకపక్ష విజయం నమోదు చేయగా.. భారత్ ‘సి’ 3–1తో ఐస్లాండ్పై నెగ్గింది. మహిళల విషయానికొస్తే.. భారత్ ‘ఎ’ 3–1తో ఇంగ్లండ్‌పై.. భారత్ ‘బి’ 3–1తో ఇండోనేసియాపై.. భారత్ ‘సి’ 2.5–1.5తో ఆస్ట్రియాపై గెలుపొందాయి. -
పాలస్తీనా చిన్నది... టోర్నీలోనే పిన్నది
చెన్నైకొచ్చిన 8 ఏళ్ల పాలస్తీనా పాప రాండా సెడార్. అసలు ‘ఎత్తు’ వేయకుండానే ఈ ‘చెస్ ఒలింపియాడ్’ పుస్తకాల్లోకెక్కింది. చెన్నై మెగా ఈవెంట్లో ఆడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత పొందింది. ఐదేళ్ల పసిప్రాయంలో తండ్రి దగ్గర ఏదో ఆటవిడుపుగా నేర్చుకున్న చదరంగంలో అసాధారణ ప్రావీణ్యం సంపాదించింది. మూడేళ్లు తిరిగేసరికే పాలస్తీనా మహిళల చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచి... ఈ ఒలింపియాడ్‌లో ఆడే జాతీయ జట్టుకు ఎంపికైంది. మయన్మార్ అమరవట్టి... మన కుట్టి! భారత సంతతికి చెందిన 11 ఏళ్ల మయన్మార్ అమ్మాయి కూడా చెన్నైలో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా మయన్మార్ అబ్బాయిలే ‘పావులు’ కదుపుతున్న చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారి అమ్మాయిల జట్టు ఆడుతోంది. అరంగేట్రం చేస్తున్న అమ్మాయిల బృందంలో ఉన్న మిన్ అమరవట్టి తన మూలాలున్న చోట ఘనాపాఠిగా నిలిచేందుకు తహతహలాడుతోంది. చదవండి: Chess Olympiad 2022: భారత్‌పై విషం చిమ్మిన పాకిస్తాన్.. -
విశాఖకు చెస్ ఒలింపియాడ్ టార్చ్ (ఫొటోలు)
-
చెస్ బోర్డు మాదిరి బ్రిడ్జ్... ఎక్కడుందో తెలుసా!: వీడియో వైరల్
చెన్నై: 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్ బ్రిడ్జ్‌కి చెస్ బోర్డులా పేయింట్ వేశారు. ఈ బ్రిడ్జ్ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది ఈ ఒలింపియాడ్ ఈవెంట్‌కి సుమారు 2 వేల మంది దాక క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ బ్రిడ్జ్ తాలుకా వీడియోని పోస్ట్ చేస్తూ...భారతదేశానికి చెందిన చెస్ రాజధాని చెన్నై గగ్రాండ్ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఐకానిక్ నేపియర్ బ్రిడ్జ్‌గా చెస్ బోర్డులా అలంకరిచండబడిందని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు వావ్ వాటే స్పీరిట్ నమ్మా చెన్నై అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Chennai the Chess Capital of India is all set to host the grand, Chess Olympiad 2022.The iconic Napier Bridge is decked up like a Chess Board.Check it out 😊 #ChessOlympiad2022 #ChessOlympiad #Chennai pic.twitter.com/wEsUfGHMlU — Supriya Sahu IAS (@supriyasahuias) July 16, 2022 (చదవండి: కరోనాతో ఆస్పత్రిలో చేరిన పన్నీర్‌సెల్వం) -
అర్జున్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి.. వీళ్లిద్దరూ మామూళ్లోలు కాదండోయ్!
సాక్షి,దుండిగల్: వారు పిల్లలు కాదు.. చిచ్చర పిడుగులు.. ఒక్కసారి ఆటలోకి దిగితే వార్ వన్ సైడ్ కావాల్సిందే. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేయడంలో ఈ అన్నదమ్ములు దిట్ట. చెస్ ఆటలో ఎదుటివారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ చిత్తు చేయడంలో వీరు దిట్ట. ఈ సోదరుల ఆట తీరును చూసిన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇప్పటికే ఎన్నో సంచలన విజయాలు తమ ఖాతాలో వేసుకుని పతకాలు సాధించిన పన్నేండేళ్ల అర్జున్‌రెడ్డి, పదహారేళ్ల తరుణ్‌రెడ్డి అన్నతమ్ముళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కుటుంబ నేపథ్యం.. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంకు చెందిన ఆదిరెడ్డి సత్యత్రినాథ్ కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా ఇక్కడి వచ్చి మేడ్చల్ జిల్లా నిజాంపేటలో స్థిరపడ్డాడు. ఇతడికి తరుణ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు కొల్లూరులోని గార్డియం స్కూల్లో 10, 7 తరగతి చదువుతున్నారు. అయితే పుట్టిన రోజున సందర్భంగా బంధువుల్లో ఒకరు తరుణ్‌రెడ్డికి చెస్ బోర్డును కానుకగా ఇచ్చారు. ► అప్పటి నుంచి చెస్ ఆడటం వ్యాపకంగా పెట్టుకున్న తరుణ్‌రెడ్డి ఆటలో ఆరి తేరాడు. అతడికి తమ్ముడు అర్జున్ తోడయ్యాడు. వీరి పట్టుదలని గమనించిన తండ్రి త్రినాథ్ కోచింగ్ ఇప్పించడంతో ఈ ఇద్దరు అన్నతమ్ముళ్లు నేడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. తరుణ్‌రెడ్డి సాధించిన ఘనత.. ► థాయ్‌ల్యాండ్‌లో అంతర్జాతీయ ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్–2018లో అండర్–12 ఒపెన్ బ్లిడ్జ్‌లో టీమ్ బంగారు పతకం. ► శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఏషియన్ యూత్ చెస్ చాంపియన్‌షిప్–2019 అండర్–14 ఒపెన్ క్లాసిక్‌లో టీమ్ బంగారు, ఒపెన్ బ్లిడ్జ్‌లో టీమ్ రజతం, ఒపెన్ బ్లిడ్జ్‌లో వ్యక్తిగతంగా 10వ స్థానం. రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు టోర్నమెంట్లో పతకాలు సాధించాడు. అర్జున్‌రెడ్డి సాధించిన విజయాలు.. ► జాతీయ స్థాయిలో మహారాష్ట్ర నాగ్‌పూర్ నేషనల్ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్– 2017 అండర్–7 ఒపెన్‌లో బంగారు పతకం. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్‌షిప్–2017 అండర్–7 విభాగం ఒపెన్‌లో 5వ స్థానం. ► హర్యానా నేషనల్ చెస్ చాంపియన్‌షిప్– 2017 అండర్–9 ఒపెన్‌లో 4వ స్థానం. ► అంతర్జాతీయ స్థాయిలో థాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్–2018 అండర్–8 విభాగంలో ఒపెన్ ర్యా పిడ్లో వ్యక్తిగత బంగారు, ఒపెన్ సాండర్డ్లో వ్యక్తిగత కాంస్యం, ఒపెన్ బ్లిడ్జ్‌లో నాల్గవ స్థా నం, ఒపెన్ ర్యాపిడ్‌లో టీమ్ బంగారు, ఒపె న్ స్టాండర్జ్లో టీమ్ రజతం, ఒపెన్ బ్లిడ్జ్‌లో టీమ్ బంగారు పతాలు సాధించాడు. ► న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్–2018 అండర్–8 విభాగం ఒపెన్‌లో కాంస్యం. ► గుజరాత్లో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్‌షిప్–2019 అండర్–9 ఒపెన్‌లో రజతం. ► ఢిల్లీలో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్‌షిప్–2019 అండర్–11 ఒపెన్‌లో 6వ స్థానం. ► శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఏషియన్ యూత్ చెస్ చాంపియన్‌షిప్–2019 అండర్–10 విభాగం ఒపెన్ బ్లిడ్జ్‌లో వ్యక్తిగత కాంస్యం, ఒపెన్ బ్లిడ్జ్‌లో టీమ్ బంగారు, ఒపెన్ క్లాసిక్‌లో 6వ స్థానంలో నిలిచాడు. ► శ్రీలంకలో జరిగిన ఏషియన్ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్–2021 అండర్–11లో ఒపెన్ ఆన్లైన్లో 9వ స్థానం. ► ముంబాయిలో జరిగిన ఇంటర్నేషనల్ జూనియర్ చెస్ టోర్నమెంట్–2021 అండర్–13 లో 7వ స్థానం, ఒపెన్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ► కర్నాటకలో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్ షిప్–2022 అండర్–12 ఒపెన్‌లో రజతంతో పాటు రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు పోటీ ల్లో విజేతగా నిలిచాడు. ఇండియన్ చెస్ ఫెడ రేషన్‌లో అర్జున్‌రెడ్డి మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. చదవండి: ప్రియునితో భార్య రాసలీలలు.. అత్త ఛాలెంజ్.. ఆ అల్లుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని -
ఢిల్లీ ఓపెన్ చెస్ చాంప్ అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన భారత యువతార, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ మరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. న్యూఢిల్లీలో మంగళవారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ చాంపియన్‌గా అవతరించాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి మూడో స్థానాన్ని దక్కించుకోగా... తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్ రన్నరప్‌గా నిలిచాడు. ఇటీవల అర్జున్ జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. నిర్ణీత 10 రౌండ్ల తర్వాత అర్జున్, గుకేశ్, హర్ష భరతకోటి 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. అర్జున్‌కు ‘టాప్’ ర్యాంక్ ఖాయమవ్వగా... గుకేశ్‌కు రెండో స్థానం, హర్షకు మూడో స్థానం లభించాయి. ఈ టోర్నీలో అర్జున్ అజేయంగా నిలిచాడు. మొత్తం 10 గేముల్లో అతను ఏడింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు రూ. 4 లక్షలు ... రన్నరప్ గుకేశ్‌కు రూ. 3 లక్షల 50 వేలు.. మూడో స్థానం పొందిన హర్షకు రూ. 3 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మంగళవారం జరిగిన చివరిదైన పదో రౌండ్ గేముల్లో అర్జున్ 58 ఎత్తుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్‌ను ఓడించగా... గుకేశ్ 58 ఎత్తుల్లో అభిజిత్ గుప్తా (భారత్)పై, హర్ష 71 ఎత్తుల్లో సేతురామన్ (భారత్)పై నెగ్గారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు 7.5 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. -
చదరంగపు బాలరాజు
టీవీ కార్టూన్ షోలు తెగ చూస్తున్న పాపను దాని నుంచి దూరం చేయడానికి తల్లితండ్రులు అనుకోకుండా చేసిన ఓ అలవాటు ఆ పాపతో పాటు మూడేళ్ళ వయసు ఆమె తమ్ముడి జీవితాన్నీ మార్చేసింది. కాలగతిలో చదరంగపు క్రీడలో అక్క గ్రాండ్ మాస్టర్ అయితే, తమ్ముడు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగాడు. ఏకంగా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌నే ఓడించి, అబ్బురపరిచాడు. సరైన సమయంలో సరైన మార్గదర్శనం చేస్తే పిల్లలు ఏ స్థాయికి ఎదగగలరో, ఇంటిల్లపాదినే కాదు... ఇండియాను ఎంత గర్వించేలా చేస్తారో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం – తమిళనాడుకు చెందిన టీనేజ్ అక్కాతమ్ముళ్ళు వైశాలి, ప్రజ్ఞానంద. ఇంటా, బయటా తెలిసినవాళ్ళంతా ప్రగ్గూ అని పిలుచుకొనే పదహారేళ్ళ ఆర్. ప్రజ్ఞానంద చదరంగంలో తన ఆరాధ్యదైవమైన వరల్డ్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్‌సన్‌ను సోమవారం తెల్లవారుజామున ఓడించి సంచలనం రేపాడు. క్లాసికల్, ర్యాపిడ్, ఎగ్జిబిషన్ – ఇలా ఏ ఫార్మట్ గేమ్‌లలోనైనా కలిపి మన విశ్వనాథన్ ఆనంద్, తెలుగు తేజం పెంటేల హరికృష్ణ తరువాత కార్ల్‌సన్‌ను ఓడించిన మూడో భారత క్రీడాకారుడిగా ప్రగ్గూ చరిత్ర సృష్టించాడు. నార్వేకు చెందిన కార్ల్సన్ అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్. కొంతకాలంగా ప్రపంచ చదరంగానికి మకుటం లేని మహారాజు. అలాంటి వ్యక్తిని ఓడించడం ఆషామాషీ కాదు. అరవై నాలుగు గడులు... మొత్తంగా చకచకా 39 ఎత్తులు... అంతే.... కార్ల్‌సన్‌కు చెక్ పెట్టి, ప్రగ్గూ నమ్మలేని విజయాన్ని నమోదు చేశాడు. వరుసగా మూడు విజయాలు సాధించిన ప్రపంచ విజేతకు బ్రేకులు వేశాడు. ఆన్లైన్లో సాగే ర్యాపిడ్ చెస్ పోటీ ‘ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్’ ప్రారంభ విడతలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. 31 ఏళ్ళ కార్ల్‌సన్‌పై గతంలో విశ్వనాథన్ ఆనంద్ 19 సార్లు, హరికృష్ణ 2 సార్లు గెలిచారు. వారి కన్నా అతి పిన్న వయసులోనే, కార్ల్సన్ వయసులో సగమున్న బుడతడైన ప్రగ్గూ ఈ ఘనత సాధించడం గమనార్హం. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి, చదరంగంలో అగ్రశ్రేణి వరుసను అటుదిటు చేసిన ఈ బాలమేధావి అమాయకంగా అన్నమాట మరింత కాక రేపింది. ప్రపంచ ఛాంపియన్‌పై జరిగే మ్యాచ్ కోసం ప్రత్యేకించి వ్యూహమేమీ అనుకోలేదనీ, ఆస్వాదిస్తూ ఆడానే తప్ప మరేమీ చేయలేదనీ ఈ టీనేజర్ అనడం విశేషం. ఆట మొదలుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తెల్లపావులతో ఆడేవారికి ఓ రకంగా సానుకూలత ఉంటుందని భావించే చెస్‌లో నల్ల పావులతో ఆరంభించి, ఈ కీలక మ్యాచ్‌లో నెగ్గాడీ బాలరాజు. మొత్తం 16 మంది ఆటగాళ్ళ మధ్య 15 రౌండ్ల పాటు జరిగే టోర్నీ ఇది. ఇందులో ఈ మ్యాచ్‌కు ముందు ప్రగ్గూ ప్రపంచ అగ్రశ్రేణి చెస్ ఆటగాళ్ళు పదిమందిలో నలుగురితో తలపడి, రెండు విజయాలు, ఒక డ్రా, ఒక పరాజయంతో తన ప్రతిభను క్రీడాలోకం ఆగి, చూసేలా చేశాడు. ఆత్మీయుల మొదలు విశ్వనాథన్ ఆనంద్, దిగ్గజ క్రికెటర్ సచిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దాకా విభిన్న రంగాల ప్రముఖుల ప్రశంసలు పొందాడు. కరోనా కాలంలో చెస్ పోటీల క్యాలెండర్ తారుమారై, నిరాశలో పడి, కాస్తంత వెనకపట్టు పట్టిన ఈ చిచ్చరపిడుగుకు ఇది సరైన సమయంలో దక్కిన భారీ విజయం. కోచ్ ఆర్బీ రమేశ్ చెప్పినట్టు ప్రతిభావంతుడైన ప్రగ్గూలో ఆత్మవిశ్వాసం పెంచి, సుదీర్ఘ ప్రస్థానానికి మార్గం సుగమం చేసే విజయం. శ్రీనాథ కవిసార్వభౌముడు అన్నట్టే ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడె...’ ప్రగ్గూ తన సత్తా చూపడం మొదలుపెట్టాడు. ముచ్చటగా మూడేళ్ళకే అక్కను చూసి ఆడడం మొదలుపెట్టిన ఈ బుడతడు 2013లో వరల్డ్ అండర్–8 కిరీటధారి అయ్యాడు. పదేళ్ళ, పదినెలల, 19 రోజుల వయసుకే 2016లో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టరయ్యాడు. అప్పటికి ఆ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. మొత్తం మీద ఇప్పుడు చరిత్రలో పిన్న వయసు గ్రాండ్ మాస్టర్లలో అయిదోవాడిగా నిలిచాడు. భారత కాలమానంలో బాగా పొద్దుపోయి, రాత్రి 10 దాటాకెప్పుడో మొదలయ్యే తాజా టోర్నీ కోసం నిద్ర వేళల్ని మార్చుకోవడం సహా పలురకాల సన్నాహాలు చేసుకున్నాడు ప్రగ్గూ. చెన్నై శివార్లలోని పాడి ప్రాంతంలో మధ్యతరగతి నుంచి వచ్చిన ఈ బాల మేధావికి చెస్, బ్యాంకు ఉద్యోగం చేసే పోలియో బాధిత తండ్రి, ప్రతి టోర్నీకీ సాయంగా వచ్చే తల్లి, చెస్‌లో ప్రవేశానికి కారణమైన 19 ఏళ్ళ అక్క, కోచ్ రమేశ్... ఇదే ప్రపంచం. గత ఏడాది ‘న్యూ ఇన్ చెస్ క్లాసిక్’ పోటీలో సైతం వరల్డ్ ఛాంపియన్ కార్ల్‌సన్‌పై పోటీని డ్రా చేసిన ఘనుడీ బాలుడు. భారత ఆటగాళ్ళలో 16వ ర్యాంకులో, ప్రపంచంలో 193వ ర్యాంకులో ఉన్న ఇతను చెస్‌లో భారత ఆశాకిరణం. ఒకప్పుడు తానూ ఇలాగే చిన్న వయసులోనే, ఇలాంటి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడే కావడంతో విశ్వనాథన్ ఆనంద్ ఈ బాల మేధావిని అక్కున చేర్చుకొన్నారు. వరల్డ్ ఛాంపియన్‌పై గెలుపు లాంటివి భారత ఆటగాళ్ళకు అప్పుడప్పుడు కాకుండా, తరచూ సాధ్యం కావాలంటే ప్రగ్గూ లాంటి వారికి ఇలాంటి సీనియర్ల చేయూత అవసరం. 1988లో ఆనంద్ తొలి ఇండియన్ గ్రాండ్ మాస్టరయ్యారు. అప్పటి నుంచి చెస్ పట్ల పెరిగిన ఆసక్తితో, 73 మంది మన దేశంలో గ్రాండ్ మాస్టర్లు ఎదిగొచ్చారు. మూడు దశాబ్దాల పైగా దేశంలో చదరంగానికి ప్రతీకగా మారిన 51 ఏళ్ళ ఆనంద్ పరంపర ప్రగ్గూ మీదుగా అవిచ్ఛిన్నంగా సాగాలంటే... ప్రభుత్వాలు, క్రీడా సమాఖ్యలు, దాతల అండదండలు అతి కీలకం. ఇలాంటి మాణిక్యాలను ఏరి, సానబడితే, ప్రపంచ వేదికపై రెపరెపలాడేది మన భారత కీర్తి పతాకమే. -
హంపి ఖాతాలో నాలుగో విజయం
పోలాండ్‌లో జరుగుతున్న ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నాలుగో విజయం నమోదు చేసింది. సోమవారం జరిగిన ఐదో గేమ్‌లో హంపి 24 ఎత్తుల్లో జూలియా (చెక్ రిప బ్లిక్)పై, ఆరో గేమ్‌లో 29 ఎత్తుల్లో మార్టా మిచ్నా (జర్మనీ)పై, ఏడో గేమ్‌లో 45 ఎత్తుల్లో పావ్లీడు (గ్రీస్)పై నెగ్గింది. ఏడో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్ల తో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. -
చెస్‌లో ఫిడే మాస్టర్... వేదాంత్ పనేసర్..
ముంబైకు చెందిన వేదాంత్ పనేసర్ చదరంగంలో ప్రతిష్టాత్మకమైన ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) టైటిల్‌ను గెలుచుకున్నాడు. ముంబయిలోని విలేపార్లేలోని ఎన్ఎం కాలేజీ విద్యార్ధి అయిన వేదాంత్, ఇప్పటికే 17 జాతీయ చెస్ చాంఫియన్‌షిప్‌లతో పాటుగా కామన్వెల్త్ కాంస్య పతకమూ గెలుచుకున్నాడు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెక్స్ (ఫిడే) ఈ ప్రతిష్టాత్మకమైన ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) టైటిల్‌ను ప్రకటించింది. గ్రాండ్ మాస్టర్ (జీఎం) మరియు ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) టైటిల్స్ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఇది. ఈ గుర్తింపు పొందడానికి స్థిరమైన ఆటతీరు ప్రదర్శిస్తూ, అంతర్జాతీయ పోటీలలో 2300 లేదా అంతకు మించిన ఫిడే రేటింగ్ పొందాల్సి ఉంటుంది. చెస్ చాంఫియన్‌గా వేదాంత్ 2380 ఫిడే రేటింగ్ పొందాడు. ఈ రేటింగ్ పొందడానికి ఎన్ఎం కాలేజీ కార్యాచరణ ఎంతగానో తోడ్పడింది. వేదాంత్ లాంటి ప్రతిభావంతులను గుర్తించి, తగిన శిక్షణ అందించడంలో ఎన్ఎం కాలేజీ అత్యంత కీలక పాత్రపోషించింది. చిన్నప్పటి నుంచీ చెస్ అంటే ఇష్టంతో కలిగిన వేదాంత్ తాను గెలవడంతో పాటు ఇతరులకు సైతం ఈ గేమ్ నైపుణ్యాలను అందించేందుకు ముందుంటాడు. లాక్డౌన్ సమయంలో తను స్వయంగా ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడంతో పాటుగా ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహమూ అందించాడు అలా వచ్చిన ఆదాయాన్ని సైతం పిఎం కేర్ ఫండ్స్‌కు అందించాడు. ఫిడే మాస్టర్ టైటిల్ పొందిన వేదాంత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మాస్టర్(ఐఎం) టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. చదవండి: SA Vs IND: కోహ్లి.. ఎలా ఆడాలో రాహుల్‌ని చూసి నేర్చుకో: భారత మాజీ క్రికెటర్ -
వచ్చే ఏడాది భారత చెస్ లీగ్
న్యూఢిల్లీ: భారత్ వేదికగా చదరంగ క్రీడలో కూడా ఫ్రాంచైజీ తరహా లీగ్ టోర్నీని నిర్వహించాలని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) నిర్ణయించింది. వచ్చే ఏడాది జూన్‌లో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. చెస్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. ఒక్కో జట్టులో ఇద్దరు సూపర్ జీఎంలు, ఇద్దరు భారత జీఎంలు, ఇద్దరు మహిళా జీఎంలతో పాటు ఇద్దరు జూనియర్లు (బాలుర, బాలికల విభాగం నుంచి ఒక్కొక్కరు చొప్పున) ఉంటారు. రెండు వారాల పాటు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో దేశంలోని రెండు నగరాల్లో టోర్నీని నిర్వహిస్తారు. టాప్–2 జట్లు ఫైనల్లో తలపడతాయి. టోర్నీ నిర్వహణ, ప్రచారం, మార్కెటింగ్ కోసం ‘గేమ్ ప్లాన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు హక్కులు ఇచ్చామని ప్రకటించిన ఏఐసీఎఫ్ అధ్యక్షుడు సంజయ్ కపూర్... ఫ్రాంచైజీల ఎంపిక, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఇతర పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.