
చదరంగంలో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగిన తెలుగు తేజం ద్రోణవల్లి హారిక

చెస్ ఒలింపియాడ్-2024లో మహిళా జట్టుకు స్వర్ణ పతకం దక్కడంలో హారికది కీలక పాత్ర

హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ఇటీవల జరిగిన ఈ మెగా టోర్నీలో వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్ (ఢిల్లీ)లతో కలిసి పసిడి గెలిచిన హారిక

హారిక స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా

అయితే, ఆమె అత్తగారిల్లు మాత్రం ఖమ్మం

2018లో ఖమ్మంకు చెందిన చంద్ర వెంకటేశ్వర్లు కుమారుడు చంద్ర కార్తీక్‌తో హారిక వివాహం జరిగింది.

హారిక- కార్తీక్ దంపతులకు కుమార్తె హన్విక సంతానం

గర్భవతిగా ఉన్న సమయంలోనూ చెస్ టోర్నీల్లో పాల్గొన్న హారిక

భర్త, పాపతో కలిసి అంతర్జాతీయ టోర్నీలకూ హాజరువుతున్న వైనం

హారిక వాళ్ల అక్కకు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబి)తో వివాహం జరిగింది

అక్కా- బావలతో కలిసి హారిక, ఆమె భర్త కార్తిక్ టూర్లకు వెళుతూ ఉంటారు.

తమ కుటుంబానికి సంబంధించిన ఫొటోలను హారిక సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తారు












