Legend
-
నీరజ్ కోచ్‌గా జాన్ జెలెజ్నీ
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరు...ఇదే క్రీడాంశంలో సంచలన ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్స్ స్వర్ణం అందించిన ఆటగాడు మరొకరు...వీరిద్దరు ఇప్పుడు మరిన్ని రికార్డులను సృష్టించే లక్ష్యంతో జోడీగా మారారు. భారత్ స్టార్ జావెలిన్ త్రోయర్, 2 ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా తన కొత్త కోచ్‌గా చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెన్జీని కోచ్‌గా ఎంచుకున్నాడు.రాబోయే 2025 సీజన్‌కు ముందు జత కలిసిన నీరజ్, జెలెజ్నీ అద్భుతమైన ఫలితాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు. 58 ఏళ్ల జెలెజ్నీ 1988 సియోల్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం వరుసగా మూడు ఒలింపిక్స్ (1992, 1996, 2000)లలో స్వర్ణాలు గెలుచుకున్నాడు. మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతని పేరిటే జావెలిన్‌ను అతి ఎక్కువ దూరం విసిరిన వరల్డ్ రికార్డు (98.48 మీటర్లు) కూడా ఉంది.2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్‌కు ఇటీవలి వరకు జర్మనీకి చెందిన బయోమెకానిక్స్ ఎక్స్పర్ట్ క్లాస్ బార్టొనిట్జ్ కోచ్‌గా ఉన్నాడు. ‘చిన్నప్పటినుంచి నేను జెలెజ్నీకి వీరాభిమానిని. ఆయన టెక్నిక్ అంటే ఎంతో ఇష్టం. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆయన వీడియోలు చూస్తుండేవాడిని. ఇప్పుడు జెలెజీ్నతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం.మా ఇద్దరి త్రోయింగ్ శైలి ఒకటే. మున్ముందు నా కెరీర్లో మరిన్ని అత్యుత్తమ విజయాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. నీరజ్ ఆట గురించి తనకు బాగా తెలుసని.. ఎంతో మంది అథ్లెట్లు కోచింగ్ కోసం తనను సంప్రదించినా వారందరినీ కాదని భారత ఆటగాడిని ఎంచుకోవడం అతనిలో ప్రతిభను చూసేనని జెలెన్జీ వెల్లడించాడు. గతంలో ఈ దిగ్గజం శిక్షణలోనే జేకబ్ వాలెజ్, విటెస్లావ్ వెసెలి, బార్బరా స్పొటకోవా లాంటి ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకోవడం విశేషం. -
‘బంగారు తల్లి’ హారిక ద్రోణవల్లి.. అందమైన కుటుంబం (ఫొటోలు)
-
లెజండ్ శరవణన్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరో తెలుసా..?
తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 'లెజెండ్ శరవణన్' కథానాయకుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించి నిర్మించిన 'ది లెజెండ్' చిత్రం గత 2022లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతాల కథానాయక నటించారు. కాగా లెజెండ్ శరవణన్ ఇప్పుడు హీరోగా, నిర్మాతగా మరో ప్రయత్నం చేస్తున్నారు. దీనికి దురైసెంథిల్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ కథానాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పటికే హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో నటించి పాపులర్ అయ్యారు. అదే విధంగా తమిళనాడులో ఇప్పటికే ఒక చిత్రంలో నటిస్తున్నారు. కాగా శరవణన్ సరసన నటించేది ఈమెకు రెండవ చిత్రం అవుతుంది. అదేవిధంగా ఇందులో ఆండ్రియా, శ్యామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చైన్నె పరిసర ప్రాంతాల్లో తొలిషెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్రం యూనిట్ ఆదివారం తూత్తుకుడి బయలుదేరారు. ఈ సందర్భంగా చైన్నె విమానాశ్రయంలో శరవణన్ మీడియాతో మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం మంచి విజయాన్ని సాధించిందని అదేవిధంగా మంచి యాక్షన్ ఎంటర్టెయినర్గా రూపొందుతున్న ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇటీవల విడుదలైన మహారాజా, గరుడన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని, అదేవిధంగా దర్శకుడు దురైసెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
లెజెండ్ శరవణన్.. మళ్లీ వచ్చేస్తున్నాడు!
కోలీవుడ్ నటుడు లెజెండ్ శరవణన్ చాలా రోజుల తర్వాత మళ్లీ సందడి చేశారు. 2022లో 'లెజెండ్' మూవీ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య ఓసారి కొత్త ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా మరో సినిమాకు రెడీ అయిపోయాడు. తాజాగా షూటింగ్‌కు వెళ్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విటర్లో షేర్ చేశారు.గతంలో వచ్చిన లెజెండ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా నటించింది. ఇందులో కథానాయికగా నటించేందుకు ఊర్వశి రౌతేలాకు భారీగానే రెమ్యునరేషన్ చెల్లించారు. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది. తాజా చిత్రాన్ని హార్బర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లెజెండ్ శరవణన్ సరసన పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆండ్రియా, కిక్ శామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ సంగీతమందించనుండగా.. 2025 ఏప్రిల్‌లో ఈ చిత్రం పెద్ద ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇది చదవండి: 'జైలర్' పాటకు స్టెప్పులేసిన లెజెండ్.. డిఫరెంట్ గెటప్!)కాగా.. స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన శరవణన్‌కు తమిళనాడులో చాలా క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. అలానే తన బ్రాండ్‌కి తానే బ్రాండ్ అంబాసిడర్. గతంలో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్‌లో యాక్ట్ చేశాడు. దీంతో హీరో కావాలని 'లెజెండ్' పేరుతో ఓ సినిమా తీశాడు.எனது அடுத்த படத்தின் படப்பிடிப்புக்காக #தூத்துக்குடி செல்லும் முன் ஊடகம் மற்றும் பத்திரிகையாளர் நண்பர்களை சென்னை விமான நிலையத்தில் சந்தித்த போது#LegendsNext #LegendSaravanan pic.twitter.com/RUWeGRYPKG— Legend Saravanan (@yoursthelegend) September 15, 2024 -
ఆ కారణం వల్లే అమ్మ చనిపోయింది: సూర్యకాంతం కుమారుడు
గయ్యాళి అత్త అనగానే అందరికీ సూర్యకాంతమే గుర్తొస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటివరకు ఆమె పేరు చెక్కుచెదరలేదు. అయితే తెరపై గయ్యాళిగా కనిపించినా ఆమె మనసు వెన్న. సూర్యకాంతానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె కుమారుడు, వైద్యుడు అనంత పద్మనాభ మూర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.గయ్యాలి కాదుమా అమ్మ గయ్యాళి కాదు. అనురాగ దేవత. నా భార్యను సొంత కూతురిలా చూసుకునేది. పనిమనిషి ఉన్నప్పటికీ తనే వంట చేసి వడ్డించేది. అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. చదువుకునే సమయంలో చదువు, ఖాళీ సమయంలోనే ఆటలు అని చెప్పేది. నాన్న అడ్వకేట్. అమ్మకు ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. సావిత్రి అంటే అమ్మకు చాలా ఇష్టం. తనకు చాలా సహాయం చేసింది. అమ్మ చేతిలో దెబ్బలు తినని ఏకైక హీరోయిన్ జమునగారే! తనెప్పుడూ ఆమెకు కూతురిగానే నటించేది. గొప్ప నటీమణులందరూ ఆమె చేతిలో దెబ్బలు తిన్నవారే!కిడ్నీ ఫెయిల్అమ్మ చనిపోయిన ఏడాది పిచ్చిపట్టినట్లయింది. తను డయాబెటిక్. కిడ్నీ ఫెయిలవడం వల్లే చనిపోయింది. ఇంకా కొన్నాళ్లు బతికుండాల్సింది. అమ్మకు నెయ్యి ఇష్టం. అలాగే ఫ్రై చేసిన పదార్థాలు ఇష్టం. ఆహారం దగ్గర ఎటువంటి నియంత్రణ పాటించలేదు. డయాబెటిస్ రావడంతో డయాలసిస్ కూడా చేయించుకుంది. అప్పుడు గుండె సమస్య కూడా రావడంతో ఐసీయూలో చేర్చారు. దాదాపు పన్నెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది చివరకు పరమపదించింది.మర్చిపోలేకపోయా..తనను చివరిసారి చూసేందుకు వచ్చిన అప్పటి తమిళనాడు సీఎం జయలలిత.. అమ్మ పరిస్థితి నాకెందుకు చెప్పలేదు. ఇంకా మంచి వైద్యం ఇప్పించేదాన్ని కదా అంది. ఆ మాట చాలాకాలం మర్చిపోలేకపోయాను. అంత్యక్రియలకు ఎంతోమంది స్టార్స్ వచ్చారు. ఇప్పుడున్న మహిళలు ధైర్యంగా ఎలా మాట్లాడాలి? ఎలా పోరాడాలి? అన్న విషయాలను అమ్మ సినిమాల ద్వారా నేర్పించింది' అని పద్మనాభమూర్తి చెప్పుకొచ్చాడు.చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి -
అది ‘డంకీ’ విమానమేనా?.. ఆ పాతిక మంది పరిస్థితి ఏంటో?
ముంబై, సాక్షి: ఎట్టకేలకు.. ఉత్కంఠకు తెరపడింది. భారతీయులతో ఉన్న విమానం స్వదేశానికే తిరిగి చేరుకుంది. మానవ అక్రమ రవాణా అనుమానాల నేపథ్యంలో రొమేనియన్ ఎయిర్సర్వీస్కు చెందిన ఈ విమానాన్ని ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజులపాటు విచారణ తర్వాత క్లియరెన్స్ లభించడంతో.. మంగళవారం వేకువ ఝామున ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది ఆ విమానం. ఉదయం 4గం. సమయంలో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో.. 276 మంది స్వదేశానికి చేరారు. అయితే.. పాతిక మంది ఫ్రాన్స్‌లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దలు, ఐదుగురు మైనర్లు ఉన్నట్లు సమాచారం. వాళ్ల పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతోనే నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీళ్లను శరణార్థులుగా పరిగణిస్తామని.. ఫ్రాన్స్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాళ్లను వెనక్కి పంపడం కుదరని చెబుతున్నారు వాళ్లు. Maharashtra | Visuals of the passengers who arrived in Mumbai today, after the plane they were travelling in was grounded in France for four days over suspected human trafficking pic.twitter.com/IKOKiJUeYN — ANI (@ANI) December 26, 2023 అది డంకీ విమానమేనా? ఏదైనా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించే వారిని డంకీ అని పిలుస్తారు. ఈమధ్యే షారూఖ్ ఖాన్ డంకీ సినిమా అదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ప్రస్తుతం ఆ పదం ట్రెండింగ్‌లో ఉండడంతో.. ఆ విమానం డంకీ విమానమేనంటూ చర్చ నడుస్తోంది. వాళ్ల పరిస్థితి ఏంటి? ఫ్రాన్స్ మీడియా చానెల్స్ కథనం ప్రకారం.. మొత్తం 303 భారతీయ ప్రయాణికుల్లో 11 మంది మైనర్లు ఎవరి సాయం లేకుండానే ప్రయాణిస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారట. వీళ్లలో భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉన్నవాళ్లను మాత్రమే వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. వీళ్లను తరలిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితుల్ని సైతం అక్కడి దర్యాప్తు ఏజెన్సీలు విచారిస్తున్నాయి. ఈ ఘటనపై అటు ఫ్రాన్స్.. ఇటు భారత అధికార వర్గాలు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. #WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today (Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx — ANI (@ANI) December 26, 2023 ఏం జరిగిందంటే.. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ ఏ340 ఛార్టర్ విమానం 303 మంది ప్రయాణికులతో డిసెంబర్ 23వ తేదీన యూఏఈ(దుబాయ్) నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉండే వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో ఆగింది. అయితే అప్పటికే మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో.. ఫ్రాన్స్ పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంకోవైపు ఈ నాలుగు రోజులపాటు ప్రయాణికులందరికీ అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ఈ తరలింపు వెనుక.. మనుషుల్ని అక్రమంగా పలు దేశాలకు పంపించే కరడుగట్టిన ముఠా హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫ్రాన్స్ నేర పరిశోధన నిఘా సంస్థ జునాల్కో దర్యాప్తు చేస్తోంది. భారత్ నుంచి వీళ్ల ప్రయాణం అసలు ఎలా మొదలైంది? ఎలా దుబాయ్‌కి చేరారు? అనే విషయాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. నేరం గనుక రుజువు అయితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇన్నిరోజులు అదుపులోనా? ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. అక్కడి నేలపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల పాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. అక్కడి కోర్టులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు, అసాధారణ పరిస్థితుల్లో ఇంకో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టవచ్చు. అక్రమంగా వెళ్లే క్రమంలో? అక్రమంగా దేశాల్ని తరలించే ఉద్దేశంతోనే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణం ఈ కేసులో బలపడుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో భారతీయులు ఎంతమంది అనేదానిపై కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆందోళన కలిగించే అంశమే! ఇదసలు అక్రమంగా మనుషుల్ని తరలించడమేనా?. ఒకవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి అక్రమ చొరబాట్లు.. శరణార్థుల సంఖ్య పెరిగిపోతున్న వేళ ఈ విమానం మధ్య అమెరికా దేశం నికరాగువాకు వెళ్తుండడం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. అమెరికా కస్టమ్స్ & బార్డర్ ప్యాట్రోల్(CBP) గణాంకాల ప్రకారం.. అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 2023 సంవత్సరానికిగానూ ఆ సంఖ్య 96,917 మందిగా నమోదు అయ్యింది. గతేడాదితో పోలిస్తే ఇది 52 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
టీమిండియా స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీకి కుటుంబ సభ్యుల నివాళులు
-
బొజ్జ గణపయ్య నిమజ్జనంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ (ఫొటోలు)
-
లెజెండ్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కాస్తా లేటయింది అంతే!
లెజెండ్ శరవణన్ ఈ పేరు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఒకే ఒక్క సినిమాతో ఎంట్రీ అందరినీ ఆకట్టుకున్నారు. వ్యాపారవేత్త అయినప్పటికీ నటనపై మక్కువతో లెజెండ్ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కానీ శరవణన్‌కు మాత్రం ఓ రేంజ్ గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత కాస్తా సైలెంట్ అయిన ఆయన.. మళ్లీ వార్తల్లో నిలిచాడు. మరో చిత్రం చేసేందుకు రెడీ అయిపోయారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: సలార్‌తో సై అంటున్న వివేక్ అగ్నిహోత్రి.. బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా?) ఆగస్టు 15న 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లెజెండ్ శరవణన్ తమిళనాడులోని ఓ పాఠశాలలో ప్రత్యక్షమయ్యారు. పిల్లలతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్న శరవణన్.. వారందరికీ గిఫ్ట్స్ అందజేశారు. అంతేకాకుండా పిల్లలతో కలిసి జైలర్ చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. అంతేకాకుండా ఆయన ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. కాగా మీరు మళ్లీ ఎప్పుడు చిత్రంలో నటిస్తారు? అని పిల్లలు అడగడంతో.. త్వరలోనే కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కథ రెడీ కావడానికి కాస్తా టైం పట్టిందని లెజెండ్ శరవణన్ ప్రకటించారు. చిన్న పిల్లల మధ్య ఈ విషయాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ తాజా చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. (ఇది చదవండి: జవాన్ ప్రమోషన్లలో కనిపించని నయనతార.. అసలేమైంది?) அடுத்த படத்தின் அப்டேட்டை குழந்தைகளுடன் பகிர்ந்த தருணம்#Legend #Legendsaravanan @yoursthelegend pic.twitter.com/LocspXpDuX — Legend Saravanan (@yoursthelegend) August 15, 2023 -
వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు
న్యూఢిల్లీ: బాస్కెట్ బాల్ దిగ్గజం, మాజీ ఎన్బీఏ స్టార్ మైఖేల్ జోర్డాన్ తన ఆసక్తికి తగ్గట్టుగానే మరో ఫాస్టెస్ట్ కారును సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, కన్వర్టిబుల్ కార్ హెన్నెస్సీ వెనమ్ F5 రోడస్టర్ను కొనుగోలు చేశాడు దీని ఏకంగా రూ. 29 కోట్ల రూపాయలు. బాస్కెట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడైన జోర్డాన్ హైపర్, సూపర్, స్పోర్ట్స్ కార్ల కలెక్షన్‌కు పెట్టింది పేరు. అందులోనూ అల్ట్రా-ఫాస్ట్ కార్లంటే అంటే అతనికి పిచ్చి. గంటకు 400 కి.మీ దూసుకుపోయే బుగట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ కారు ఇప్పటికే గ్యారేజీలో ఉంది. ఇంకా పోర్స్చే 911 టర్బో S 993, ఫెరారీ 512 TR , చేవ్రొలెట్ కొర్వెట్టి లాంటి లెజెండ్రీ కార్లు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికన్ హెన్నెస్సీ వెనమ్ F5 రోడస్టర్ కారు కూడా చేరింది. ప్రపంచంలో కేవలం 30 మంది ఓనర్లలో మైఖేల్ జోర్డాన్ ఒకరు. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ ) హెన్నెస్సీ పెర్ఫార్మెన్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జోర్డాన్‌తో పోటోను కంపెనీ సీఈవో జాన్ హెన్నెస్సీ ట్వీట్ చేశారు. ప్రత్యేకమైన రోజు, స్పెషల్ ఫ్రెండ్ కోసం స్పెషల్ వెనమ్ ఎఫ్5ని అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేయడం విశేషం.(యాపిల్ స్పెషల్ ఫీచర్‌తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..!) View this post on Instagram A post shared by Hennessey Performance (@hennesseyperformance) అద్భుతమైన ఈ కారు 6.6-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్న్, 1,842 హార్స్పవర్, 1193 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. కేవలం 2.6 సెకన్లలో 0 - 100 kmph వేగంతో గరిష్ట వేగంతో గంటకు 498 కి.మీ.ని అధిగమిస్తుందని అంచనా. నివేదిక ప్రకారం కేవలం 30 కార్లు మాత్రమే తయారైనాయి. ధర 3 మిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన , అత్యంత శక్తివంతమైన కన్వర్టిబుల్ కారని కంపెనీ ప్రకటించింది.. -
ఎంట్రీతోనే బిగ్ డిజాస్టర్.. అయినా తగ్గట్లేదుగా హీరో!
ప్రముఖ బిజినెస్మెన్ అరుల్ శరవణన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'ది లెజెండ్'. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అప్పట్లో హీరోగా శరవణన్ ఎంట్రీ ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే తాజాగా కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు శరవణన్. ట్రోలర్స్‌కు చెక్ పెట్టేందుకే న్యూ లుక్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో గడ్డం, మీసాలతో శరవణన్ కాస్తా డిఫెరెంట్ లుక్‌లో కనిపించారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలంటే శరవణన్‌కు పిచ్చి బిజినెస్మెన్ అయిన శరవణన్‌కు సినిమాలంటే పిచ్చి. తెరపై కనిపించాలన్నదే ఆయన కోరిక. అందువల్లే శరవణ స్టోర్స్ యాడ్‌లో కూడా తానే నటించాడు. స్టార్ హీరోయిన్లతో కలిసి తన బిజినెస్ బ్రాండ్లకు పబ్లిసిటీ ఇస్తుంటారు. గతేడాది జులైలో విడుదలైన ది లెజెండ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా శరవణన్ ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. తాజా లుక్ చూస్తే మరోసారి స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించేందకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ది లెజెండ్ సినిమాలో ఆయన నటించడంపై నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేశారు. కాగా.. ది లెజెండ్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. New Transition… Details Soon…#Legend #TheLegend #LegendSaravanan #NewEraStarts pic.twitter.com/gws9HR7j8O — Legend Saravanan (@yoursthelegend) March 13, 2023 -
వ్యక్తిగతంగానూ, ఫోన్ చేసి మరి విమర్శించారు: ‘ది లెజెండ్’ హీరో శరవణన్
తమిళ సినిమా: లెజెండ్ శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ వ్యాపార వేత్త, శరవణా స్టోర్స్ సంస్థల అధినేత అయిన ఈయన, ఆర్ సంస్థల ప్రచార చిత్రాల ద్వారా బహుళ ప్రాచుర్యం పొందాయి. ఆ ప్రచార చిత్రాల్లో బాలీవుడ్, సౌత్ ఇండియన్ హీరోయిన్లతో డాన్స్ చేసి సాధారణ ప్రజలకు దగ్గరయ్యారు. తరువాత ఆయన సినిమాలపై గురిపెట్టారు. అలా ది లెజెండ్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవ్వడంతో పాటు నిర్మాతగానూ అడుగు పెట్టారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌథేలా ఇందులో హీరోయిన్గా నటించారు. భారీ బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. శుక్రవారం నుంచి డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా తనకు ప్రారంభ దశ నుంచి ప్రచార మీడియా పెద్ద సపోర్ట్‌గా నిలిచిందన్నారు. అదే విధంగా తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ది లెజెండ్ విడుదలై మిశ్రమ స్పందనతో ప్రదర్శిత మవుతోందన్నారు. ఆ చిత్రానికి విమర్శల ద్వారా మీ విశ్లేషణలను తమ మీడియా ద్వారా పొందుపరిచారన్నారు. కొందరు వ్యక్తిగతం గానూ, ఫోన్ చేసి చెప్పారన్నారు. విమర్శలే విజయానికి తొలిమెట్టుగా భావించి తాను ముందడుగు వేస్తున్నానన్నారు. కాగా తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తొలి ప్రయత్నంగా సామాజిక పరమైన అంశంతో కుటుంబ కథాచిత్రంలో నటించిన లెజెండ్ శరవనన్ ఈ సారి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసిన ది లెజెండ్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
తమిళ బడా వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. 53 ఏళ్ల శరవణన్ గతేడాది ‘ది లెజెండ్’ అనే పాన్ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో రిచ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. 50వ ఏటా హీరోగా మారిన శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆయనే స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమాకి స్టార్ టెక్నికల్ టీమ్‌ను నియమించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కి రెడీ అయ్యింది. విడుదలైన ఏడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత గతేడాది జూలైలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు(మార్చి 3న) ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ది లెజెండ్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. కాగా ఇందులో శరవణన్ సరసన లక్ష్మిరాయ్, బాలీవుడ్ బ్యూటీ, పాపులర్ మోడల్ ఊర్వశి రౌటేలా హీరోయిన్లుగా నటించారు. శరవణన్ స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమాని జేడీ-జెర్రీ దర్శకద్వయం తెరకెక్కించగా.. రఘువరన్ బిటెక్ ఫేమ్ ఆర్. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ, హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. చదవండి: కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ Streaming Blasting from 12:30PM⚡️ 💥💫✨#Legend streaming in @DisneyPlusHS from Today 12.30 PM#LegendinDisneyHotstar#Tamil #Telugu #Malayalam #Hindi @yoursthelegend #Legend #TheLegend #LegendSaravanan @DirJdjerry @Jharrisjayaraj @thinkmusicindia @onlynikil #NM pic.twitter.com/FmRgRncylT — Legend Saravanan (@yoursthelegend) March 3, 2023 -
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే అస్తమయం
న్యూఢిల్లీ: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. పీలే బ్రెజిల్‌కు మూడుసార్లు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లు అందించారు. కెరీర్లో 1,281 గోల్స్ చేశారు. చదవండి: (ప్రధాని మోదీకి మాతృ వియోగం) -
లవర్ బాయ్‌గా ‘ది లెజెండ్’ హీరో శరవణన్
శరవణా స్టోర్స్ అధి నేత శరవణన్ ‘ది లె జెండ్’ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. జేడీ, జెర్రీల ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సొంతంగా నిర్మించారు. తొలి చిత్రంతోనే కమర్షియల్ ఫార్ములా కథను ఎంపిక చేసుకుని మాస్ హీరోగా పరిచయమైన శరవణన్ ది లెజెండ్ చిత్రాన్ని భారీగా ఖర్చు చేసి నిర్మించారు. ఆయనకు సపోర్టుగా ప్రముఖ తారాగణాన్నే సెట్ చేసుకున్నారు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని నటించి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. అయినా ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో చిత్రం భారీ నష్టాన్ని మూటకట్టుకుందనే ప్రచారం జరిగింది. అయితే తొలి ప్రయత్నం విఫలమైనా చలించక శరవణన్ మరో ప్రయత్నానికి సిద్ధమయ్యారన్నది తాజా సమాచారం. యాక్షన్ హీరోగా నటించిన ఈయన ఈసారి లవర్‌బాయ్‌గా మారిపోతున్నారట. అందుకు తగ్గట్టుగా కథను సిద్ధం చేయాల్సిందిగా ఒక దర్శకుడికి చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిసింది. -
‘లెజెండ్’హీరో షాకింగ్ నిర్ణయం..ఈ సారి ఎన్ని కోట్లు పెడతాడో?
తమిళ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. 53 ఏళ్ల శరవణన్ ఇటీవల ‘లెజెండ్’అనే పాన్ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో రిచ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అంతే కాదు శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. హీరో కాదు కదా కనీసం సైడ్ క్యారెక్టర్ చేయడానికి కూడా శరవరణన్ పనికిరాడని నెటిజన్స్ విమర్శించారు. భారీ నష్టంతో పాటు విమర్శలు కూడా రావడంతో ఇక శరవణన్ సినిమాల జోలికి రాకుండా తన వ్యాపారాలను మాత్రమే చూసుకుంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తిప్పికొడుతూ తాజాగా శరవరణన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన మరో సినిమాకు సిద్దమవుతున్నాడు. (చదవండి: నయనతార ఆస్తుల విలువ ఎంతో తెలుసా?) కోలీవుడ్ సమాచారం ప్రకారం.. శరవణన్ నుంచి త్వరలోనే కొత్త సినిమా ప్రకటన రాబోతుందట. ఈ సారి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను పకరించబోతున్నాడట. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో చర్చలు జరిపి, కథను ఫైనల్ చేశారట. త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేయబోతున్నారు. అన్నట్లు.. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమేనట. మరి దీనికి లేటు వయసు హీరో ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో చూడాలి. -
ఝున్‌ఝున్‌వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నివాళులు అర్పించారు. లెజండ్ ఎప్పటికీ జీవించే ఉంటారంటూ వరుస ట్వీట్లలో ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గుండెపోటు కారణంగా ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) "ఈ రోజు నేను నా సోదరుడిని కోల్పోయాను.. చాలామందికి తెలియని బంధం మాది. అందరూ అతణ్ని బిలియనీర్ ఇన్వెస్టర్ అని, బీఎస్ఈ బాద్షా అని పిలుస్తారు. కానీ ఆయన ఇప్పటికీ.. ఎప్పటికీ ఒక డ్రీమర్’’ అని ఆమె ట్వీట్ చేశారు. అందం..పట్టుదల, సున్నితత్వం ఆయన సొంతం. మై జెంటిల్ జెయింట్ అని ఆమె పేర్కొన్నారు. మనం మనంగా జీవించాలి అని భయ్యా (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా) ఎపుడూ చెబుతూ ఉండేవారు. ది లెజెండ్, లెగసీ నిలిచే ఉంటుందంటూ స్మృతి వరుస ట్విట్లలో సానుభూతి ప్రకటించారు. ఇది చదవండి:Rakesh Jhunjhunwala: అల్విదా బిగ్బుల్ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం -
లెజెండ్ శరవణన్ హీరోగా ‘ది లెజెండ్’మూవీ, ట్రైలర్ విడుదల
ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై ది లెజెండ్ చిత్రాన్ని నిర్మిస్తునండమే కాక ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జేడి-జెయర్ ద్యయం దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి హారిశ్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. వేల్రాజ్ ఛాయగ్రణం అందిస్తున్నారు. నిరమ్ణ క్యాక్రమాలను పూర్తి చేసుకుని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్స్ తమన్నా, హన్సిక, పూజా హెగ్డే, శ్రద్ధాశ్రీనాథ్, రాయ్ లక్ష్మితో పాటు నటులు ప్రభు, నాజర్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందరంగా ఈ చిత్ర కథానాయకుడు, నిర్మాత లెజెండ్ శరవణన్ మాట్లాడుతూ.. సినీ రంగంలో రజనీకాంత్, విజయ్ తనకు రోల్ మోడల్ అన్నారు. తనపై విర్మశలు చేసే వారి గురించి బాధపడనన్నారు. కమర్షియల్ అంశాలన్నీ ఉన్న ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. -
స్పోర్ట్స్ లెజెండ్ సొంత రక్తంతో స్కేట్‌బోర్డ్: వీడియో వైరల్
సాక్షి,న్యూఢిల్లీ: స్పోర్ట్స్ లెజెండ్ ముఖ్యంగా స్కేట్బోర్డింగ్ లెజెండ్ టోనీ హాక్ (53) తన ఫ్యాన్స్‌కు ఒక అరుదైన అవకాశాన్నిస్తున్నారు. స్వయంగా తన రక్తంతో కలిపి పెయింట్ చేసిన స్కేటింగ్ బోర్డ్స్‌ను విక్రయిస్తున్నాడు. లిమిటెడ్-ఎడిషన్‌గా 100 స్కేట్‌బోర్డ్‌లను లాంచ్ చేశాడు. వీటి తయారీకోసం టోనీ బ్లడ్‌ను డోనేట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై టోనీ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. లిక్విడ్ డెత్ మౌంటైన్ వాటర్ తోపాటు, టోనీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన వీడియోను బుధవారం షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 1.7 మిలియన్ వ్యూస్ దాటేసింది. టోనీ హాక్ లిక్విడ్ డెత్‌కు అంబాసిడర్ అయ్యాడంటూ చమత్కరించింది. అంతేకాదు లెజెండరీ అథ్లెట్ రక్తంతో నిండిన స్కేట్ బోర్డ్‌ను సొంతం చేసుకోవడం అంత సులభం కాదు చౌక అంతకన్నా కాదు. వీటి ధర 500 డాలర్లు అంటూ ప్రకటించింది. వీటిని స్టెరిటైజ్ కూడా చేశాం.. త్వరపడండి సాధ్యమైనంత తొందరగా వీటిని సొంతం చేసుకోండి అంటూ ఫ్యాన్స్‌కు పిలుపినిచ్చింది. అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. చదవండి: Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి కాగా టోకీ స్కేట్‌బోర్డ్ గేమ్స్ ఇప్పటికీ చాలామంది ఆసక్తి చూపిస్తారు. లిక్విడ్ డెత్ వెబ్సైట్ ప్రకారం, స్కేట్ బోర్డ్ నుండి వచ్చే లాభాలలో 10శాతంటోనీకి చెందిన ‘ది స్కేట్ బోర్డ్ ప్రాజెక్ట్’కు వెళతాయి. వీటి ద్వారా పబ్లిక్ స్కేట్పార్క్ల అభివృద్ధి, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు పనిచేస్తున్న 5 గైర్స్ సంస్థలకు నిధులు సమకూర్చుతుంది. చదవండి: తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? View this post on Instagram A post shared by Tony Hawk (@tonyhawk) -
ఫుట్‌బాల్ లెజెండ్ కన్నుమూత
లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు, ఇంగ్లాండ్ 1966 ప్రపంచకప్ విజేత జాక్ చార్లటన్ (85) ఇకలేరు. మాజీ ఐర్లాండ్ మేనేజర్ జాక్ లింఫోమా కాన్సర్, డిమెన్షియాతో బాధపడు తున్నారు. జాక్ నిన్న శుక్రవారం) కన్నుమూశారని ఆయన కుటుంబం ప్రకటించింది. దీంతో ఫుట్‌బాల్ ప్రపంచం మూగబోయింది. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ ఫుట్ బాల్ క్లబ్‌లు, ఆటగాళ్లు ఆయన మృతికి నివాళులు అర్పించారు. జాక్ మనవరాలు, జర్నలిస్ట్ ఎమ్మా విల్కిన్ సన్, లీడ్స్ యునైటెడ్తోపాటు, ఫుట్‌బాల్ ప్రేమికులు, అభిమానులు జాక్‌కు ట్విటర్ ద్వారా నివాళులర్పించారు. అద్భుతమైన డిఫెండర్‌గా రాణించిన జాక్ లీడ్స్ యునైటెడ్‌కు 21 సంవత్సరాల పాటు 773 ఆటలను ఆడారు. అనంతరం రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మేనేజర్‌గా దశాబ్దం పాటు సేవలందించారు. ఇటలీలో జరిగిన 1990 ప్రపంచ కప్ లో జట్టును క్వార్టర్ ఫైనల్స్‌కు తీసుకెళ్లిన ఘనత జాక్ది. #LUFC are deeply saddened to learn club legend Jack Charlton passed away last night at the age of 85 — Leeds United (@LUFC) July 11, 2020 RIP Big Jack Charlton Another legend has left us Absolutely gutted!#lufc pic.twitter.com/MpFhOlRdaK — LEEDS UTD MEMORIES (@LUFCHistory) July 11, 2020 RIP Jack Charlton. A true legend of the game. pic.twitter.com/mLBWPKYwR4 — 90s Football (@90sfootball) July 11, 2020 -
హాలీవుడ్ లెజెండ్ కిర్క్ డగ్లస్ కన్నుమూత
కిర్క్ డగ్లస్.. ఈ పేరు తెలియని సినీ ప్రేమికులుండరంటే అతిశయోక్తి కాదు. తన అసమాన ప్రతిభతో హాలీవుడ్‌ను శాసించి సంచలనాలకు మారుపేరుగా నిలిచిన లెజండరీ యాక్టర్ కిర్క్ డగ్లస్ (103) బుధవారం కన్నుమూశారు. 103 సంవత్సరాల వయస్సులో మమ్మల్ని విడిచిపెట్టినట్లు నా సోదరులు, నేను ప్రకటించడం చాలా విచారంగా ఉందని ఆయన కుమారుడు మైఖేల్ డగ్లస్ ఈ విషాదవార్తను ప్రపంచానికి తెలియజేశారు. ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా, ఒక నటుడుగా, అంతకుమించిన మానవతావాదిగా నిండైన జీవితాన్ని జీవించారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీ కొడుకుగా చాలా గర్వపడుతున్నానంటూ తన తండ్రికి మైఖేల్ నివాళులర్పించారు. నటుడు దర్శకుడు రాబ్ రైనర్ స్పందిస్తూ హాలీవుడ్ పాంథియోన్లో ఆయనొక చిహ్నంగా నిలిచి వుంటాడని ట్వీట్ చేశారు. సహజ నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని హాలీవుడ్ పెద్దలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 1916లో అమ్‌స్టర్‌డామ్‌లోని డానిలోవిచ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించారు కిర్క్ డగ్లస్. అనేక ఒడిదుడకులను ఎదుర్కొన్న ఆయన జీవితాన్ని డైనా డిల్‌తో పెళ్లితో కీలక మలుపు తిప్పింది. పెళ్ళి తర్వాత థియేటర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ.. అంచలంచెలుగా ఎదిగారు. ఏడు దశాబ్దాలుగా సాగిన కెరీర్లో డగ్లస్ 90 కి పైగా సినిమాల్లో నటించారు. ఇన్నేండ్ల సినీ పయనంలో ఒక దశాబ్దం (1950-60) పాటు హాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఘనుడు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా తానేమిటో నిరూపించుకుని ప్రపంచ సినీ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న ఆల్‌రౌండర్ కిర్క్ డగ్లస్. 'స్పార్టకస్', 'ది వైకింగ్స్' వంటి చిత్రాలు 1950, 60 లలో బాక్సాఫీస్ భారీ విజయాలను సాధించాయి. ఇంకా ‘‘యాస్ ఇన్ ద హోల్', 'డిటెక్టివ్ స్టోరీ', 'లోన్లీ ఆర్ ద బ్రేవ్', 'సెవెన్ డేస్ ఇన్ మే', 'పాత్ ఆఫ్ గ్లోరీ', 'గన్‌ఫైట్ ఎట్ ద ఓ.కె. కోర్రల్', 'ద హీరోస్ ఆఫ్ టెల్‌మార్క్', 'సటర్న్ 3', 'స్నో రివర్', 'టఫ్ గైర్సు', 'ద విలన్', 'ద ఫ్యూరీ', 'గ్రీడీ', 'ఆస్కార్', 'డ్రా', 'ఏ సెంచరీ ఆఫ్ సినిమా', 'డైమండ్స్' వంటివి బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. View this post on Instagram It is with tremendous sadness that my brothers and I announce that Kirk Douglas left us today at the age of 103. To the world he was a legend, an actor from the golden age of movies who lived well into his golden years, a humanitarian whose commitment to justice and the causes he believed in set a standard for all of us to aspire to. But to me and my brothers Joel and Peter he was simply Dad, to Catherine, a wonderful father-in-law, to his grandchildren and great grandchild their loving grandfather, and to his wife Anne, a wonderful husband. Kirk's life was well lived, and he leaves a legacy in film that will endure for generations to come, and a history as a renowned philanthropist who worked to aid the public and bring peace to the planet. Let me end with the words I told him on his last birthday and which will always remain true. Dad- I love you so much and I am so proud to be your son. #KirkDouglas A post shared by Michael Douglas (@michaelkirkdouglas) on Feb 5, 2020 at 3:33pm PST KIrk Douglas will always be an icon in the pantheon of Hollywood. He put himself on the line to break the blacklist. My love goes out to my friend Michael and the whole family. — Rob Reiner (@robreiner) February 5, 2020 -
బాలయ్యతో బోయపాటి సినిమాకు ముహూర్తం ఫిక్స్
సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతోంది. ‘యన్.టి.ఆర్’ తరువాత బోయపాటి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా బాలయ్య ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభకానుందని తెలుస్తోంది. ఇటీవల వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి టాక్ పరంగా నిరాశపరిచినా.. భారీ వసూళ్లు సాధించి మాస్ ఆడియన్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదే జోరులో బాలయ్యతో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు బోయపాటి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ద లెజెండ్
-
‘లెజండ్’ నటి మృతి
శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ చిత్రం ‘ఇంగ్లీష్ వింగ్లీష్’తో తెలుగువారికి పరిచయమై, బాలకృష్ణ ‘లెజండ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బాలీవుడ్ నటి సుజాతా కుమార్ మృతి చెందారు. సుజాతా కుమార్ మరణం గురించి ఆమె సొదరి క్రిష్ణ కుమారి సోషల్‌మీడియా ద్వారా తెలియజేసారు. గత కొంతకాలంగా మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న సుజాతను చికిత్స నిమిత్తం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. కానీ అప్పటికే ఆమె పరిస్థితి చేయి దాటిపోయిందని తెల్చారు డాక్టర్లు. Our beloved Sujata Kumar has passed away and moved on to a better place leaving us with an umimaginable void. She left us an hour ago at 11.26 pm on the 19th of august 2018..Life can never be the same again ... — Suchitra Krishnamoorthi (@suchitrak) August 19, 2018 ఈ క్రమంలో ఆదివారం (నిన్న) రాత్రి 11 . 26 గంటల ప్రాతంలో ఆమె మరణించారు. ఈ విషయం గురించి సుజాతా సోదరి ‘మన ప్రియమైన సుజాతా కుమార్ ఇక లేరు. ఆమె మనందరిని వదిలి మరోక ఉన్నతమైన ప్రదేశానికి వెళ్లారు. ఆదివారం రాత్రి 11.26 గంటలకు కన్నుమూశారు. జీవితమెప్పుడూ ఒకేలా ఉండదు’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక ‘ఇంగ్లీష్ వింగ్లీష్’లో శ్రీదేవితో కలిసి ఉన్న ఫోటోను కూడా పోస్టు చేశారు. గౌరీ షిండే దర్శకత్వంలో శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంలో సుజాతా కుమార్ నటించారు. ఈ చిత్రంలో ఆమె అమెరికాలో సెటిల్ అయిన శ్రీదేవి సోదరి మను పాత్రలో మెప్పించారు. అంతేకాక ‘హోటల్ కింగ్డమ్’, ‘బాంబే టాకింగ్’, ‘24’ అనే ధారావాహికల్లోనూ సుజాత నటించారు. తెలుగులో బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రంలో సుజాత ఆయనకు బామ్మగా నటించారు. -
బోయపాటితో మరోసారి..!
నందమూరి బాలకృష్ణ కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌గా నిలిచిన సింహా, లెజెండ్ సినిమాలకు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇంతటి ఘనవిజయాలను అందించిన బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య కూడా బోయపాటితో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. బాలయ్య వందో సినిమా బోయపాటి దర్శకత్వంలోనే చేయాల్సి ఉండగా అప్పటికే కమిట్ అయిన సినిమాల కారణంగా మిస్ అయ్యింది. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా మొదలు కాబోతుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా సమాచారం ప్రకారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు. -
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మృతి
అక్లాండ్: న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1965లో క్రికెట్లో అరంగేట్రం చేసిన బెవాన్ తన 13 ఏళ్ల కెరీర్లో మొత్తం 61 టెస్టులు ఆడారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని ఇష్టపడే బెవాన్ 32.22 సగటుతో 3,448 పరుగులు చేశారు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. 17 టెస్టులకు సారథ్య బాధ్యతలు వహించిన బెవాన్ ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ ఆడిన తొలి అంతర్జాతీయ వన్డేకు బెవాన్ నాయకత్వం వహించారు.11 వన్డేల్లో 56.33 సగటుతో ఐదు అర్ధ సెంచరీలు, ఓ సెంచరీ నమోదు చేశారు. న్యూజిలాండ్ తరపున పది ఇన్నింగ్స్‌లలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ సగటు కావడం విశేషం. బెవాన్ మృతితో న్యూజిలాండ్ అభిమానులు, ఆటగాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు. -
లెజెండ్
-
ఇదీ వెయ్యి రోజులాడుతుంది!
– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘‘వెయ్యిరోజులాడిన తొలి దక్షిణ భారతీయభాషా చిత్రం ‘లెజెండ్’. మామూలు చిత్రమే వెయ్యి రోజులు ఆడితే ఓ చరిత్ర ఉన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వెయ్యి రోజులు... ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు ఆడుతుంది’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మించిన సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. చిరంతన్ భట్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను సోమవారం తిరుపతిలో విడుదల చేశారు. చంద్రబాబు ఆడియో సీడీలను ఆవిష్కరించి, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి అందజేశారు. చంద్రబాబు మాట్లాడుతూ – ‘‘తెలుగు వారి చరిత్ర మళ్లీ అమరావతితో ముందుకొచ్చింది. నేను లండన్‌లో మ్యూజియానికి వెళ్లినప్పుడు అక్కడ రెండే గ్యాలరీలున్నాయి. వాటిలో ఒకటి గ్రీసుది కాగా రెండోది అమరావతి గ్యాలరీ. మహిళలకు గౌరవం ఇవ్వాలని చరిత్రలో తొలిసారి తల్లిపేరును తన పేరు ముందు పెట్టుకున్న వ్యక్తి శాతకర్ణి. ఆయన చరిత్రని సిన్మాగా అందిస్తున్న క్రిష్‌కు అభినందనలు. అమరావతి నుంచి అఖండ భారతదేశాన్ని పరిపాలించిన శాతకర్ణి తెలుగు జాతికి గర్వకారణం. యేసు ప్రభువు పుట్టిన తర్వాత క్రీస్తు శకం ప్రారంభమైంది. క్రీస్తు శకం వచ్చిన డెబ్భై సంవత్సరాలకు శాలివాహన శకం ఆరంభమైంది. ఈ సినిమా కంటే మించిన రాజధాని కట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. దేశంలో నంబర్‌వన్‌గా అమరావతిని తీర్చిదిద్దుతాం’’ అన్నారు. సమయం లేదు... సంక్రాంతికే వస్తున్నాం! బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘వంద సినిమాలు చేయడానికి 43 ఏళ్లు పట్టింది. ఇన్నేళ్లూ నన్ను ముందుకు నడిపించింది ప్రేక్షకులూ, నా అభిమానులే. ఈనాడు ‘నటసింహం’గా, ఓ ఎమ్మెల్యేగా మీ (ప్రేక్షకులు)తో మన్ననలు అందుకోవడానికి నా తల్లితండ్రులు, మీ ఆశీస్సులే కారణం. శాతకర్ణి కథను వందో సినిమాగా చేయడం దైవసంకల్పం. ఎటువంటి భావోద్వేగాన్నయినా సమర్థంగా తెరకెక్కించగల క్రిష్, మంచి నటీనటులు, చిత్రబృందం కుదరడంతో సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. సినిమాలోని డైలాగ్ గుర్తుకొచ్చేలా, ‘‘ఇంక సమయం లేదు మిత్రమా... సంక్రాంతికి వస్తున్నాం’’ అని చిత్ర రిలీజ్ సమయాన్ని ప్రస్తావించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ – ‘‘సరదా కోసమో, వినోదం కోసమో సినిమాలు ఎక్కువ తీస్తుంటారు. విజ్ఞానం కోసం, సందేశం కోసం సినిమాలు తీయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ, ఒక సందేశంతో మన చరిత్రను మనకు గుర్తు చేసే విధంగా ఈ సినిమా తీయడం నా మనసుకు ఎంతో నచ్చింది. అందువల్ల ఈ వేడుకకి వచ్చా. కేంద్ర సమాచార మంత్రిగా నాపై ఓ బాధ్యత కూడా ఉంది’’ అన్నారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ – ‘‘అంజనాపుత్ర క్రిష్ అని నా పేరుకి ముందు మా అమ్మగారి పేరు వేశా. ‘అమ్మా! ఈ సినిమాతో నీ పేరు నిలబెడతా’. పెళ్లైన తర్వాత పట్టుమని పది రోజులు కూడా నా అర్ధాంగితో ఉండలేదు. ‘పద్మావతీపుత్రిక రమ్యా! నువ్వు నేనూ చాలా గర్వపడే సినిమా తీశా’ అని చెప్తున్నా. తెలుగుజాతి గర్వపడే సినిమా తీశా. శాతకర్ణి కథ చదువుతుంటే నా రక్తం మరిగింది. ఇలాంటి శాతకర్ణి ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి? చూపు తీక్షణంగా.. మాటలు రాజసంగా... నడుస్తుంటే కాగడా రగులుతున్నట్టుగా ఉండాలి. ఈ కథే కథానాయకుణ్ణి ఎన్నుకుంది. ‘అదిగో.. బాలకృష్ణ ఉన్నాడు. బసవరామతారకపుత్ర బాలకృష్ణ ఒక్కడు మాత్రమే నా ఖ్యాతిని దశదిశలా విస్తరించగలడు’ అని ఆ శాతకర్ణి నాకు శాసించినట్టు చెప్పాడు. కేవలం పది నిమిషాల్లో కథ విని, ఈ సినిమా చేస్తున్నామని 14 గంటల్లో బాలకృష్ణ ఓకే చెప్పారు. నేనే సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్నాను. రోజూ సెట్లోకి మొదట వచ్చేది, చివర వెళ్లేది బాలకృష్ణగారే. నాతో పాటు ఆయన కూడా ఈ సినిమాకి కెప్టెనే’’ అన్నారు. ‘‘చాలా ఏళ్ల క్రితం స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన ‘పాండవ వనవాసం’లో చిన్న నృత్యం చేశా. ఆ సినిమాతో నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ చేసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో హీరో అమ్మ పాత్రలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రముఖ హిందీ నటి హేమమాలిని. ‘‘బాలకృష్ణ 100వ చిత్రానికి సంగీతం అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ‘కంచె’ తర్వాత దర్శక, నిర్మాతలతో కలసి మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు చిరంతన్ భట్. ‘‘అమరావతి ఖ్యాతి ప్రతి తెలుగు మనిషికీ తెలియాలని బాలకృష్ణ ఈ సినిమా చేశారు. వంద సెంటర్లలో వంద రోజులు ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు బోయపాటి శ్రీను. ఈ వేదికపై ‘ఎన్బికె 100... నెవర్ బిఫోర్’ అనే పుస్తకాన్ని హేమమాలిని, ‘ఎన్బికె 100’ డైరీలు, క్యాలెండర్లను వెంకయ్యనాయుడు విడుదల చేశారు. నిర్మాతలు సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు నిర్మాతలు డి.సురేశ్‌బాబు, అంబికా కృష్ణ, అనిల్ సుంకర, దర్శకులు బి.గోపాల్, కోదండ రామిరెడ్డి, రచయిత సాయిమాధవ్ బుర్రా, హీరో నారా రోహిత్, టీ టీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎంపీ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హాలీవుడ్ లెజెండరీ తార కన్నుమూత
వాషింగ్టన్: హాలీవుడ్ లెజెండరీ నటి సాసా గాబర్ (99) కన్నుమూశారు. కాలిఫోర్నియాలో తీవ్రమైన గుండెపోటుతో ఆదివారం మరణించినట్టు ఆమె భర్త ఫ్రెడెరిక్ వోన్ అన్హాల్ట్ ఏఎఫ్పీకి అందించిన సమాచారంలో తెలిపారు. స్నేహితులు, కుటుంబం చుట్టూ ఉండగానే ఆమె తుదిశ్వాస విడిచారని కన్నీటి పర్యంతమయ్యారు. గాబర్ మరణం పట్లు పలువురు ప్రముఖులు, నటులు సంతాపం ప్రకటించారు. అద్భుతమైన నటి అంటూ ఆమెను గుర్తు చేసుకున్నారు. అద్భుతమైన అందం అంతకుమించిన నటనతో పాటూ ఆమె చేసుకున్న పెళ్లిళ్లు అప్పట్లో ప్రపంచ సినీ పరిశ్రమలో సంచలనంగా నిలిచింది. కాగా హంగేరిలో జన్మించిన ఆమె రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికాకు వలస వెళ్లారు. తొమ్మిది సార్లు వివాహం చేసుకున్న ఆమె మొదటి పెళ్లి 20 ఏళ్ల వయసులో జరిగింది. 1952 లో ఆమె హాలీవుడ్ ప్రవేశం చేశారు. స్టేజ్ నటిగా కరియర్ మొదలు పెట్టిన గాబర్ 1936 మిస్ హంగరీ గా ఎన్నికైంది.70 పైగాచిత్రాలలో నటించిన ఆమె సెలబ్రిటీగా ఒకవెలుగు వెలిగారు. ఫిబ్రవరి 6, 1917 లో బుడాపెస్ట్ లో పుట్టిన సారీ గాబర్ కుటుంబం సా సా అని ముద్దు పేరు పెట్టారు. అలా ఆమె సాసా గాబర్ గా ఫ్యామస్ అయ్యారు -
ఆర్ఎస్ఆర్.. ఈజే లెజెండ్..
-ఆస్తులమ్మి విద్యాదానం –ఎమ్మెల్సీ అయినా సాధారణ జీవితం అరవై ఆరు ఎకరాల ఆసామి. రాష్ట్రంలో పేరుగాంచిన ఒక విద్యా సంస్థకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన వ్యక్తి. ఆయన తలచుకుంటే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించొచ్చు. ఏడంతస్తుల మేడ, నౌకర్లు, చాకర్లు, కార్లు ఇలా ఏదైనా సమకూర్చుకోవచ్చు. కానీ ఆయన ఆవేమీ కోరుకోలేదు. ఓ సాధారణ మధ్య తరగతి వ్యక్తిలా జీవించాడు. అలాంటి కుటుంబ యజమాని రూపాయి ఖర్చుపెట్టకుండా మేధావుల సభకు ఎన్నికయ్యాడు.. అదికూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థను శాసించే వ్యక్తులు, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిపై పోటీ చేసి గెలిచాడు. ఆయనే ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్ఎస్ఆర్). ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన రాము పేరయ్య, రత్తాల ఏకైక కుమారుడు రాము సూర్యారావు(ఆర్ఎస్ఆర్). సొంతూరులోనే ప్రాథమిక విద్యను పూర్తిచేసిన ఆర్ఎస్ఆర్ డిగ్రీ విద్యను సీఆర్‌రెడ్డి కళాశాలలోనూ, డబుల్ ఎంఏను ఆంధ్ర విశ్వ విద్యాలయంలోనూ పూర్తిచేశారు. 1996 నుంచి 2005 వరకు సీఆర్ఆర్ కాలేజీలో పొలిటికల్ సైన్సు విభాగాధిపతిగా పనిచేశారు. 2005నుంచి 2007వరకు అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా సేవలు అందించి మే 31న పదవీవిరమణ చేశారు. తాను 3వ తరగతి చదువుతున్న నాటి నుంచే తోటి విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులకు సాయపడేవారు ఆర్ఎస్ఆర్. తనకు తండ్రి జేబు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బును వారికి ఇచ్చి ఆదుకునేవారు. వయస్సుతో పాటు ఆయనలోని దయాగుణమూ ఎదుగుతూ వచ్చింది. పేద విద్యార్థులను చదివించడానికి తాతల నుంచి సంక్రమించిన ఆస్తిలో 44 ఎకరాల భూమిని ఆయన అమ్మేశారు. ఉద్యోగంలో ఉండగా తనకు వచ్చిన జీతాన్ని ధారపోసేంతగా, పదవీ విరమణ అనంతరం తన పెన్షన్‌ను సైతం విద్యార్థులకే ఖర్చుపెట్టేంతగా ఆయన దయాగుణం ప్రమోట్ అయ్యింది. ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఆయన జీతం, పెన్షన్ అన్నీ విద్యకే వినియోగిస్తున్నారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ముందుకువెళుతుందని ఆర్ఎస్ఆర్ విశ్వసిస్తారు. అందుకే పదవీ విరమణ అనంతరం ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని.. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్య సేవలందే విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఆయన రోగులకు చేస్తోన్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయన్ని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమించింది. విద్యాభివృద్ధికి తన జీతాన్ని, జీవితాన్ని ధారపోసిన ఆర్ఎస్ఆర్ మాష్టారు ప్రభుత్వ విద్యా విధానంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. బాల కార్మికుల విద్యకు, వయోజన విద్యకు ప్రభుత్వం విడుదల చేస్తోన్న నిధులు వృథా అవుతున్నాయనే బాధ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇష్టంలేని వారికి బలవంతంగా విద్య చెప్పించే బదులు ఆసక్తిగా చదువుకునే వారి కోసం ఆ నిధులు వినియోగిస్తే మరింత ప్రయోజనముంటుందనేది ఆయన వాదన. ప్రభుత్వ పాఠశాలలను దాతలు, ప్రజా ప్రతినిధులు దత్తత తీసుకోవాలన్నది ఆయన ఆకాంక్ష. అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించేందుకు కృషి చేయాలంటారు. ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు దీనిని గుర్తించుకోవాలని ఆర్ఎస్ఆర్ అభిప్రాయం. కార్పొట్ విద్యా విధానం మారాలి ’కార్పొరేట్ విద్యా సంస్థలు అతి చేస్తున్నాయి. విద్యార్థుల్లో మానసిక పరిపక్వత, సామాజిక చైతన్యం లేకుండా కేవలం బండ చదువులు రుద్దడానికే పరిమితమయ్యాయి. ఆ విధానం మారాలి. అమెరికా, జపాన్ దేశాల్లో ప్రభుత్వ పాఠశాలలే అగ్రస్థానాల్లో నిలుస్తున్నాయి. అటువంటి విద్యా విధానంపై అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేయాల్సిన అవసరముంది.’ అని ఆర్ఎస్ఆర్ అంటారు. రాజకీయాలకు దూరంగా.. సేవకు దగ్గరగా.. ’నేను ఏ పార్టీకీ అనుకూలంకాదు, వ్యతిరేకం కాదు అన్ని వర్గాలనూ కలుపుకుపోతాను. ఏ మతం వారైనా తాము నమ్మిన దేవుణ్ణి పూజిస్తే పుణ్యం రాదు. రోగులకు సేవచేస్తే, విద్యార్థులను చదివిస్తే పుణ్యం వస్తుంది అని నమ్మితే సరిపోతుంది. ఓటు వేయడానికి మన కులపోడా, మనకు ఎంత డబ్బు ఇచ్చాడు అని కాకుండా సేవ చేసేవాడా కాదా, సమాజానికి ఉపయోగపడేవాడా కాదా అని ఆలోచించి ఓటు వేయాలి. కష్టాలు ఎదుర్కొన్నా నీతి, నిజాయితీలకు కట్టుబడి పనిచేస్తే వచ్చే సంతృప్తి అధికారంవల్లనో, డబ్బువల్లనో రాదని గ్రహించాలి’ అన్నది ఆర్ఎస్ఆర్ సందేశం. -
అక్కడ కూడా ఇరగదీస్తున్నాడు..!
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా వరుస సినిమాలు చేసి ప్రస్తుతం విలన్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతిబాబు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమాతో టాలీవుడ్లో విలన్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న జగపతి బాబు ప్రజెంట్ సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్‌గా ఉన్నాడు. ముఖ్యంగా భారీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలకు అదే స్ధాయి విలన్ కావాలంటే జగపతిబాబే బెస్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే తెలుగులో మంచి క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న జగపతి బాబు, ఇప్పుడు తమిళ నాట తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబందించి జగ్గుబాయ్ లుక్ రిలీజ్ అయ్యింది. ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తున్న జగపతి బాబుని చూస్తుంటే అక్కడ కూడా జెండా పాతేలాగే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. గతంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తాండవం సినిమాలో చిన్న పాత్ర చేసిన జగపతిబాబు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఆ తరువాత చేసిన లింగా కూడా నిరాశపరచటంతో కొద్ది రోజులు కోలీవుడ్‌కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి తమిళ నాట తన విలనిజాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు జగ్గుభాయ్. -
బాలయ్య రిస్క్ చేస్తున్నాడా..?
నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఓ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. తన వందో సినిమాలో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు దర్శకులుగా బోయపాటి శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, కృష్ణవంశీ లాంటి దర్శకుల పేర్లు వినిపించినా.., ఫైనల్‌గా క్రిష్ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు బాలకృష్ణ. శాతవాహన రాజు గౌతమీ పుత్రశాతకర్ణి పాత్రలో బాలయ్య నటించనున్నాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించడానికి రెడీ అవుతున్నారు. వారాహి చలనచిత్ర నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి క్రిష్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధం అవుతున్నాడు. 50 కోట్ల బడ్జెట్‌తో భారీగా ఈ సినిమాను రూపొందించడానికి రెడీ అవుతున్నారు. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు మొరాకోలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్లు అదే స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీగానే అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే బాలకృష్ణ మార్కెట్ పరంగా అంత బడ్డెట్ వర్క్ అవుట్ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు బాలకృష్ణ ఒకే ఒక్కసారి లెజెండ్ సినిమాతో 40 కోట్ల మార్క్‌ను రీచ్ అయ్యాడు. ఘనవిజయం సాధించిన సింహాతో రూ. 30 కోట్లు. రీసెంట్ సినిమా డిక్టేటర్తో 20 కోట్లకు పైగా వసూళ్లు చేసిన బాలకృష్ణ, 50 కోట్ల సినిమా చేస్తే ఆ మొత్తాన్ని కలెక్షన్ల రూపంలో వసూలు చేయటం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. డైరెక్టర్ క్రిష్ రికార్డ్ కూడా కలెక్షన్ల విషయంలో అంతా గొప్పగా లేదు. ఇప్పటి వరకు క్రిష్ కెరీర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కంచె. అది కూడా 20 కోట్ల సినిమానే. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు 50 కోట్లతో క్రిష్ సినిమా చేస్తే అది సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత వరకు ఉందన్న చర్చ మొదలైంది. 50 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తే దాదాపు 70 కోట్ల వరకు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. మరి బాలయ్య, క్రిష్ కాంబినేషన్‌కు అంతా స్టామినా ఉందా..? -
నాన్న ఒక లెజెండ్
నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తరువాతే మీతో నటించగలననే నమ్మకం కలుగుతుందని నాన్నతో చెప్పాను. ఆయన నా భావాన్ని అర్థం చేసుకున్నారు అని పేర్కొన్నారు విశ్వనటుడు కమలహాసన్ వారసురాలు, నేటి క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్. భారతీయ సినిమాలోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి శ్రుతిహాసన్. తమిళం, తెలుగు, హిందీ అంటూ బిజీగా నటిస్తున్న ఈ బ్యూటీ తన తండ్రితో కలిసి నటించాలన్న తన కలను త్వరలో నెరవేర్చుకోనున్నారు. ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఎస్-3, ప్రేమమ్ చిత్ర తెలుగు రీమేక్‌తో పాటు హిందీలో రాఖీ హ్యాండ్సం, యారా చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో రాఖీ హ్యాండ్సం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌తో చిన్న భేటీ. ప్ర: నటుడు సూర్యతో రెండో సారి నటించడం గురించి? జ: చాలా సంతోషంగా ఉంది. సూర్య చిత్రం ద్వారానే నేను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాను. నేనీ స్థాయిలో ఉండడానికి ఆ చిత్రం ఒక కారణం. ఇక ఎస్-3 చిత్రం వివరాలను ప్రస్తుతానికి చెప్పలేను. ఈ చిత్ర దర్శకుడు హరి దర్శకత్వంలో ఇంతకు ముందు పూజై చిత్రంలో నటించాను. మళ్లీ ఆయన దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది.ఆయన వర్కింగ్ స్టైల్ నచ్చుతుంది. ప్ర: మీలో మంచి సంగీత దర్శకురాలు ఉన్నారు.అయినా నటనకు,పాటలకు పరిమితం అయిపోయారే? జ: నేను మళ్లీ చెబుతున్నాను.సంగీతానికి దూరం కాను. అది ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఈ ఏడాదే నేనొక శపథం చేసుకున్నాను. సంగీతం పై అధిక దృష్టి సారించాలన్నదే అది. సంగీతంలో దిగితే దానికి అధిక సమయం కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు అంత సమయం లేదు. అయినా సంగీతంపై గమనం సారించాలని నిర్ణయించుకున్నాను. ప్ర: త్వరలో మీ తండ్రి కమలహాసన్‌తో నటించే కల నెరవేరబోతుండడం గురించి? జ: అవును. ఇంకా చెప్పాలంటే నా తొలి చిత్రం నుంచే నాన్నతో నటించడం గురించి చాలా ప్రచారం జరిగింది. అలాంటి ఆశ నాకూ ఉంది. అలాంటిది నాన్నతో ఒకే ఒక్క విషయం చెప్పాను.నాకంటూ పేరు సంపాదించుకున్న తరువాతే మీతో కలసి నటించగలననే నమ్మకం కలుగుతుంది అన్నాను. నా భావనను నాన్న అర్థం చేసుకున్నారు.అందుకు కావలసిన సమయాన్ని ఇచ్చారు.ఆ మధ్య నాన్నతో కలిసి నటించే అవకాశం వచ్చినా,అప్పుడు ఇద్దరం బిజీగా ఉన్నాం. మళ్లీ అలాంటి అవకాశం ఇప్పటికి వచ్చింది. మేమిద్దరం కలిసి నటించనున్న చిత్రం ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. నాన్న ఒక లెజెండ్. ఆయనతో నటిస్తున్నప్పుడు చాలా నేర్చుకోగలననే నమ్మకం నాకుంది.ఆ షూటింగ్ రోజుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ప్ర: మీ తండ్రి నటనలో కింగ్. మీరేమో కమర్షియల్ చిత్రాలపై మాత్రమే దృష్టి పెడుతున్నారు.దీనిపై మీ స్పందన? జ: కమర్షియల్ చిత్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటో తెలియదు గానీ, ఇలాంటి చిత్రాలకు మంచి నటన అవసరం అవుతుంది.నా వరకూ చిన్న పాత్ర అయినా దానికి పూర్తి న్యాయం చేయడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తాను. -
కేటీఆర్‌కు త్రిష థ్యాంక్స్
హైదరాబాద్: కమల్ హాసన్ నటించిన 'చీకటి రాజ్యం' చిత్రానికి తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్ మంచి కితాబు ఇచ్చారు. ఈ చిత్రంలో లెజెండ్ నటుడు కమల్ హాసన్, హీరోయిన్ త్రిష నటన చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు. నిన్న సాయంత్రం వరకు వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచార బాధ్యతలతో కాస్తంత సమయం లేకుండా గడిపిన ఆయన శుక్రవారం విడులైన కమల్ 'చీకటి రాజ్యం' చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర నటులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు హీరోయిన్ త్రిష వెంటనే స్పందించింది. తన నటనను అభిమానించినందుకు కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. After a hectic day, watched slick thriller 'Cheekati Rajyam' with the legend himself, Kamal Haasan. Fabulous job @prakashraaj @trishtrashers — K Taraka Rama Rao (@KTRTRS) November 19, 2015 Thank u KTR sir n Subirami reddy sir for such kind words https://t.co/7fJdLubhX0 — Trisha Krishnan (@trishtrashers) November 20, 2015 -
'గాడ్‌ఫాదర్'గా బాలయ్య..?
ఏ నటుడి జీవితంలో అయినా వందో సినిమాకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ తరం నటుల్లో వంద సినిమాలు పూర్తి చేయగలిగే హీరోలు అసలు కనిపించటం లేదు. అలాంటి అరుదైన మైలురాయికి అతి చేరువలో ఉన్న నటుడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం తన 99వ సినిమా చేస్తున్న బాలయ్య 100వ సినిమా గ్రాండ్‌గా ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్ సినిమాలో నటిస్తున్నాడు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య చేయబోయే 100వ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న బాలకృష్ణ వందో సినిమాను సక్సెస్ఫుల్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో మరోసారి అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు అభిమానులు. ఈ సినిమాకు గాడ్‌ఫాదర్ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు. -
గయ్యాళి అత్త.. మనసు మాత్రం వెన్న
దురుసు నోటి పలుకుబడికి పంతులమ్మ మీరు... బాక్సాఫీస్సూత్రాళికి పలుపు తాడు మీరే... మీరు లేని బయోస్కోపు ఉప్పులేని చారు.... మీరు వచ్చి నిలిస్తేను సీనిక వవ్వారే... ఇవి ఓ నటి గురించి బాపు రమణలు చెప్పిన మాటలు.. ఆమే వెండితెరను ఏలిన అసామాన్య నటి సూర్యకాంతం. నిజమే.. ఆమె వెండితెర మీద ప్రసరించిన సూర్యకాంతి. అందుకే ఇప్పటికీ ఆ వెలుగును గుర్తుచేసుకొని తెలుగు సినిమా పరవశిస్తోంది. ఆమె లేకుండా కొన్ని ఆణిముత్యాలను ఊహించుకోలేం. సంసారం, రక్తసంబంధం, కులగోత్రాలు, కలిసు ఉంటే కలదు సుఖం, గుండమ్మ కథ, దసరా బుల్లోడు, మంచి మనసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు. స్టార్ హీరోల ఇమేజ్ను దాటి ఇది సూర్యకాంతం సినిమా అనే స్థాయి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. నవ్వించగలదు, ఏడిపించగలదు, బెదిరించగలదు, భయపెట్టగలదు... అందుకే ఆమె మనల్ని వదిలి వెళ్లాక ఆ పాత్రలు సృష్టించడమే మానేశారు దర్శక నిర్మాతలు. 1949 నుంచి 1994 వరకు తెలుగు సినిమాను ఏలిన అద్భుతనటి సూర్యాకాంతం.. గయ్యాళి అత్త పాత్ర చేయాలి అంటే సూర్యకాంతమే చేయాలి అని కాదు... గయ్యాళి పాత్ర ఎవరు చేసినా సూర్యకాంతంలానే చేయాలి అనే స్థాయికి గుర్తింపు తెచ్చుకున్న మహానటి ఆమె. సూర్యకాంతం, ఎంతో పురాణ వైశిష్ట్యం కూడా ఉన్న పేరు. అయినా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఒక్క తెలుగు ఇంట్లో కూడా ఆ పేరు మళ్లీ పెట్టుకునే సాహసం ఎవరూ చేయలేదు. దీనంతటికి కారణం ఓ నటి... గయ్యాళి పాత్రలో ఆమె చూపించిన సహజత్వం ప్రేక్షకుల్లో ఆ స్థాయిలో చెరగని ముద్ర వేసింది. లెక్కకు మించి ఎన్నో చిత్రాల్లో ఒకే పాత్రలో నటించినా, ప్రేక్షకులకు విసుగు కలగలేదంటే అది కేవలం ఆమె నటనా పటిమే. ముఖ్యంగా ఈర్ష్య, ద్వేష కలగలసిన గయ్యాళి పాత్రలలో ఆమె నటన అసామాన్యం. సూర్యకాంతం గురించి మాట్లాడుకుంటూ గుండమ్మకథ సినిమా గురించి మాట్లాడుకోకపోతే అసంపూర్ణంగానే ఉంటుంది... తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ అతి కొద్ది సినిమాల్లో గుండమ్మకథ ఒకటి... ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి ఎంతో మంది హేమాహేమీలు ఈ సినిమలో నటించినా.. టైటిల్ మాత్రం సూర్యకాంతం పోషించిన పాత్ర పేరును పెట్టారంటేనే తెలుస్తుంది ఆమెకున్న ఇంపార్టెన్స్ ఏంటో... తెరమీద ఎక్కువగా గయ్యాళిపాత్రలు మాత్రమే చేసిన సూర్యకాంతం, సెట్లో మాత్రం ఎంతో కలివిడిగా ఉండేవారు. ముఖ్యంగా సూర్యకాంతం షూటింగ్ కు వస్తున్నారంటే ఆ రోజు సెట్ లో అందరూ వింధుభోజనం తినొచ్చని తెగ సంబరపడిపోయేవారట. షూటింగ్ సమయంలో ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించే ఆమె కెమెరా ముందు మాత్రం తెగ భయపెట్టేసేవారు. ఎన్నో అజరామర పాత్రలతో మనల్ని అలరించిన ఆమె స్ధాయి నటి, కనీసం ఆమె లేనిలోటు తీర్చగలిగే నటి కూడా తెలుగుతెర మీద ఇంతవరకు తారసపడలేదు. ఈ రోజు ఆ మహానటి జయంతి సందర్భంగా మరొక్కసారి ఆ గయ్యాళి గుండమ్మ సూర్యకాంతం గారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. -
లెజెండ్-రావు బాలసరస్వతీ దేవి
-
లెజెండ్-సి.నారాయణరెడ్డి
-
ఆయనతో హిమాలయాలకు..!
‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ తదితర చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టేకు తెలుగు నాట మంచి హోమ్లీ ఇమేజ్ ఉంది. కానీ, బాలీవుడ్లో ఆమెకు దీనికి పూర్తి భిన్నమైన ఇమేజ్ ఉంది. ‘బద్లాపూర్’ చిత్రంలో అర్ధనగ్నంగా నటించి, ‘రాధికా ఇలా కూడా నటిస్తుందా?’ అని చాలామంది అనుకునేలా చేశారామె. ఆ తర్వాత ఓ డాక్యుమెంటరీ మూవీలో నగ్నంగా నటించి, షాకిచ్చారు. ఈ అర్ధనగ్న, నగ్న దృశ్యాల ద్వారా రాధిక ఈ మధ్య వార్తల్లో నిలిచారు. ఎక్కడికెళ్లినా ఆమెను వీటి గురించే అడుగుతున్నారు. ఈ తతంగంతో రాధికా విసిగిపోయారట. దాంతో కొంచెం సేద తీరాలనుకున్నారో ఏమో... ఆయనగారితో హిమాలయాలకు చెక్కేశారు. ఆయనగారు ఎవరు? అని ఊహల్లోకి వెళ్లకండి. ఆయన స్వయంగా రాధికా భర్తే. మూడేళ్ల క్రితం బ్రిటిష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు రాధిక. అడపా దడపా ఆయన రాధిక నటించే చిత్రాల లొకేషన్స్‌లోనూ కనిపిస్తుంటారు. ఆ సంగతలా ఉంచితే.. ‘‘మంచు కొండలకు వెళ్లడం భలే ఆనందంగా ఉంది. కొండలంటే నాకు చాలా ఇష్టమండీ బాబూ’’ అంటున్నారు రాధికా ఆప్టే. -
ఆ గోల్డెన్ ఛాన్స్ బోయపాటికే..
నట సింహం బాలకృష్ణ కెరీర్లో ఎత్తులతో పాటు పల్లాలు కూడా ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్‌తో చెలరేగిపోయి.. అట్టర్ ప్లాప్స్‌లో పడిపోయిన సందర్భాలు అనేకం. సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవటానికి బాలకృష్ణకు చాలా సమయం పట్టింది. ఆ అల్టిమేట్ హిట్ ఇచ్చింది దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ సినిమా పేరు.. సింహా. బాలయ్య సింపుల్‌గా డైలాగ్ చెప్పినా డైనమేట్ లా పేలుతుందని బోయపాటి సింహాతో రుజువు చేశాడు. బాలయ్య కెరీర్లో సరికొత్త అధ్యాయం రాశాడు. సింహాలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టే బోటపాటికి బాలకృష్ణ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. రెండోసారి కూడా అదే రిపీటైంది. లెజెండ్ హిట్ అయింది. బాలయ్య ఇమేజ్ రేంజ్‌ని సరిగ్గా క్యాచ్ చేశాడు కాబట్టే బోయపాటి రెండు హిట్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. డెఫినెట్‌గా కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇచ్చిన రెండు అవకాశాల్నీ బోయపాటి సమర్థవంతంగా డీల్ చేశాడు. అందుకే బాలయ్య 100 సినిమా కూడా ఈ డైరెక్టర్ చేతికి చిక్కింది. ఆ గోల్డెన్ ఛాన్స్ బోయపాటికే దక్కింది. బాలయ్య వందో సినిమా గురించి ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టాడట బోయపాటి. అయితే నటసింహం 99వ సినిమాని శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కబోతుంది. ఇది పూర్తి కాగానే బాలయ్య సెంచరీ కొట్టేందుకు సిద్ధం అవున్నాడు. -
అరుదైన ఘనత
హీరో నందమూరి బాలకృష్ణ నటించగా గత ఏడాది విడుదలైన సూపర్‌హిట్ చిత్రం ‘లెజెండ్’ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంటోంది. తెలుగు చిత్రసీమలో విడుదలైన హాలు మారకుండా, నేరుగా 400 రోజులు (కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ‘మినీ శివ’ థియేటర్లో రోజూ నాలుగు ఆటలతో మే 1వ తేదీకి) జరుపుకొంటున్న తొలి చిత్రమనే ఖ్యాతిని సంపాదిస్తోంది. అలాగే పొద్దుటూరు ‘అర్చన’ థియేటర్లో సింగిల్ షిఫ్ట్‌తో 400 రోజులు పూర్తి చేసుకుంటోంది. అభిమానుల అండదండలతోనే సాధ్యమైన ఈ ఘనతకు గుర్తుగా వారి సమక్షంలోనే, రానున్న మే 2వ తేదీ సాయంత్రం ఎమ్మిగనూరులోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో చిత్ర యూనిట్ సభ్యులు బహిరంగ సభలో పాల్గొని, భారీ వేడుక చేసుకోనున్నారు బాలయ్య. తెలుగు చిత్ర పరిశ్రమలో డెరైక్ట్ తొలి వంద రోజుల చిత్రం (జెమినీ ‘బాలనాగమ్మ’ (1942) - మద్రాసులోని వెల్లింగ్టన్ థియేటర్), తొలి 200 రోజుల చిత్రం (‘పాతాళభైరవి’ (1951) - విజయవాడలోని దుర్గాకళామందిరం), తొలి 300 రోజుల చిత్రం (‘అడవి రాముడు’ (1977)- విశాఖపట్నంలోని అలంకార్) తర్వాత ఇన్నేళ్ళకు మరో రికార్డు రన్ సినిమా వచ్చిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న విజయోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా, హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర నిర్మా తలతో సహా ‘లెజెండ్’ చిత్ర యూనిట్ మొత్తం హాజరవుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. -
హాలీవుడ్ చిత్రంలో...
‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే ప్రస్తుతం ‘లయన్’లో నటిస్తున్నారు. మరోవైపు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్న రాధికా ఆప్టేని ఓ హాలీవుడ్ ఆఫర్ వరించింది. ఎంటీవీ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ పలు లఘు చిత్రాల సమాహారంతో సాగుతుంది. ఈ లఘు చిత్రాలకు అంతర్జాతీయంగా పేరు, ప్రఖ్యాతులు సాధించిన ఏడుగురు దర్శకులు దర్శకత్వం వహిస్తారు. వారిలో హిందీ రంగానికి చెందిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఉండటం విశేషం. -
గుర్తుకొస్తున్నాయి.. అంటున్న 'లెజెండ్' బాలయ్య!
-
ఆ రోజులు గుర్తొస్తున్నాయి : నందమూరి బాలకృష్ణ
‘‘హుద్ హుద్ బాధితుల విషయంలో నా అభిమానులు స్పందించిన తీరును జీవితంలో మరచిపోలేను. ఇలాంటి అభిమానులున్నందుకు గర్విస్తున్నాను. వారి సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలి. మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలి’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన కథానాయకునిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించిన చిత్రం ‘లెజెండ్’. ఈ చిత్రం వై.యస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో 275 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో ఘనంగా వేడుకను నిర్వహించారు. ‘లెజెండ్’ చిత్ర బృందం ఈ కార్యక్రమానికి హాజరవ్వడంతో జనంతో ప్రాంగణం కిక్కిరిసింది. బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ-‘‘నా ‘మంగమ్మగారి మనవడు’ నుంచి అప్పట్లో నా చాలా చిత్రాలు ఇలాంటి వేడుకలు జరుపుకున్నాయి. ఈ వేడుకతో మళ్లీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ‘సింహా’ లాంటి విజయం తర్వాత బోయపాటితో సినిమా అంటే అంచనాలు సహజం. కానీ భయపడకుండా చిత్తశుద్ధితో ఈ సినిమాకు పనిచేశాం. అందుకే ఈ ఫలితం. అన్నీ సమపాళ్లల్లో కుదిరిన సినిమా ఇది. ఇలాంటి విజయాన్ని అందించిన అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని చెప్పారు. బోయపాటి మాట్లాడుతూ ‘‘వంద రోజుల వేడుక అంటే పుష్కరానికి ఒకటి వస్తున్న నేటి రోజుల్లో ఏకంగా 275 రోజుల పాటు ‘లెజెండ్’ ప్రదర్శించడం సాధారణమైన విషయం కాదు. సహాయ దర్శకునిగా బాలకృష్ణగారితో చాలా సినిమాలు పనిచేశాను. ఆయన నడక, నడత, చూపు, కోపం వస్తే ఆయన కస్సున లేచే తీరు అన్నీ నాకు తెలుసు. ఆయన ‘సింహా’ చేయాల్సి వచ్చినప్పుడు ‘బాలయ్య రాయల్. ఆయనకు మామూలు కథ కరెక్ట్ కాదు’ అనుకొని ‘సింహా’ తయారు చేశాను. ‘సింహా’ తర్వాత అంతకంటే గొప్పగా ఎలా చూపిస్తావ్ అని అందరూ అన్నప్పుడు ఛాలెంజ్‌గా తీసుకొని ‘లెజెండ్’ చేశాను. ఇప్పటివరకూ నేను అయిదు సినిమాలకు దర్శకత్వం వహిస్తే రెండు బాలయ్యతోనే చేశా. మళ్లీ ఆయనతో సినిమా ఉంటుంది. అది ఇంతకంటే గొప్పగా ఉండటానికి ప్రయత్నిస్తా’’ అని చెప్పారు. అనంతరం చిత్రబృందం కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వచ్చి ప్రమాదానికి గురై మరణించిన ఇద్దరు అభిమానులకు బాలకృష్ణ సంతాపం తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబాలను ఆదుకుంటానని మాటిచ్చారు. -
మేకింగ్ ఆఫ్ 'లెజెండ్'
-
ఆ రికార్డ్ దక్కడం ఆనందంగా ఉంది!
‘‘ఈ మధ్యకాలంలో ఏ సినిమా అయినా వారాల లెక్కలో ఆడుతోంది కానీ, వంద రోజులు. నూటడెబ్బై అయిదు రోజులనేవి అరుదైపోయాయి. ఈ పరిస్థితిలో మా సినిమా 175 రోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. నందమూరి బాలకృష్ణ హీరోగా సాయి కొర్రపాటి అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ‘లెజెండ్’ చిత్రం నేటితో 175 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ -‘‘ఇటీవలకాలంలో ఒకే హీరో, ఒకే దర్శకుడి కాంబినేషన్లో రూపొందిన రెండు సినిమాలు 175 రోజులు ఆడిన దాఖలాలు లేవు. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలతో నాకూ, బాలయ్యబాబుకి ఆ రికార్డ్ దక్కడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. బాలకృష్ణ వందో సినిమాకి మీరే దర్శకుడటగా? అన్న ప్రశ్నకు - ‘‘మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్‌కి తగ్గ కథ కుదిరితే చేయొచ్చేమో. నాకెప్పుడు కథాంశం కుదిరితే అప్పుడు బాలయ్యను కలుస్తా’’ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తున్న చిత్రం గురించి మాట్లాడుతూ -‘‘శ్రీనివాస్ చేసిన తొలి సినిమా ‘అల్లుడు శీను’కి, దీనికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. కొంచె బాడీ బిల్డప్ చేయమన్నాను. జుత్తు పెంచమన్నాను. శారీరక భాష మార్చుకోమన్నాను’’ అని తెలిపారు. -
సెంచరీ కొట్టాడానికి లెజెండ్ వెయిటింగ్
-
లెజెండ్ 50 రోజుల సక్సస్ మీట్
-
నాకు సినిమాయే జీవితం
‘‘కొన్నేళ్ల క్రితం నా పుట్టినరోజు మా ఇంటికే పరిమిత మయ్యేది. మా ఊరు పెదకాకానిలో గల శివాలయానికివెళ్లి శివుణ్ణి దర్శించుకునేవాణ్ణి. ఈ రోజు కోట్లాది మంది ప్రేక్షకులకు దగ్గరయ్యే స్థాయిలో ఉన్నానంటే ఆ భగవంతుని ఆశీస్సులే కారణం’’ అని బోయపాటి శ్రీను చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు.ఇటీవల బాలకష్ణతో ‘లెజెండ్’తీసిన బోయపాటి, తదుపరి రామ్‌చరణ్‌తో సినిమాచేయడానికి కసరత్తులు చేస్తున్నారు. స్టార్స్‌తో సినిమా చేసేటప్పుడు తప్పనిసరిగా వారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే, మొదటి మూడు రోజులు వాళ్ల అభిమానులే ఎక్కువగా సినిమాని చూస్తారు. అందుకే, స్టార్ హీరో అంటే అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు, వాణిజ్య అంశాలను మేళవించి సినిమా తీయాల్సి ఉంటుంది. నాకు సినిమాయే జీవితం. అందుకే, షూటింగ్ ప్రారంభించే ముందు కథకు ఎక్కువ రోజులు కేటాయిస్తాను. లొకేషన్లో చాలా స్పష్టమైన ప్రణాళికతో షూటింగ్ చేయడం నాకలవాటు. ఇవాళ టాప్ ఫైవ్ దర్శకుల జాబితాలో నేనూ ఉన్నానని అంటున్నారు. నేనెప్పుడూ నా స్థానం ఏంటి? అని పట్టించుకోలేదు. నా నిర్మాత, సినిమా కొనుక్కున్న పంపిణీదారులను సంతృప్తిపరిచే సినిమాలు చేయాలన్నదే నా ఆశయం. ఇవాళ నేనే సినిమా చేసినా కొబ్బరికాయ కొట్టిన రోజే వ్యాపారం అయిపోతుంది. ఈ స్థానాన్ని ఇలానే కాపాడుకోవాలనుకుంటున్నాను. అందుకే, ఎలా పడితే అలా సినిమాలు చేయాలనుకోవడంలేదు. తమిళంలో ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయని, అగ్రదర్శకులు యువహీరోలతో సినిమాలు చేస్తున్నారని, తెలుగులో అలా చేయడంలేదని కొంతమంది అంటుంటారు. అది తప్పు. కృష్ణవంశీ, రాజమౌళిలాంటి వాళ్లు యువ హీరోలతో చేశారుగా! రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమా తన ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. కథ కూడా చెప్పాను. అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు కథానుసారం యాక్షన్ కూడా ఉంటుంది. బాలకృష్ణగారి కుమారుడు మోక్షజ్ఞ తొలి చిత్రానికి నేనే దర్శకుణ్ణి అనే వార్త ప్రచారంలో ఉంది. మోక్షజ్ఞ రంగప్రవేశానికి ఇంకా సమయం ఉంది. ఎవరు దర్శకుడనేది ఆ సమయంలో తెలుస్తుంది. -
బాలయ్య బరిలో ఉన్నాడు.. ‘లెజెండ్’ సినిమాను నిలిపేయండి!
భన్వర్‌లాల్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ విజ్ఞప్తి హైదరాబాద్: ప్రముఖ నటుడు బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ పడుతున్నందున ఆయన నటించిన చిత్రం లెజెండ్ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో సదరు చిత్రాన్ని నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది. లెజెండ్ చిత్రం టీడీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొన్న ఆపార్టీ నేతలు చిత్ర ప్రదర్శనను నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు శివకుమార్, చల్లా మధుసూదన్‌రెడ్డి శుక్రవారం ఉప ఎన్నికల అధికారి దేవసేనను కలిసి ఫిర్యాదు చేశారు. -
బాలకృష్ణ సినిమాలను నిషేధించరా?
ఎన్నికల బరిలో నిలిచిన హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్‌లో ప్రసారం చేయకుండా నిలిపివేస్తున్నట్లు లక్నోలో ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక్కడ మన టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాలు నిషేధించరా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. బాలీవుడ్ హీరోయిన్లు హేమమాలిని, జయప్రద, నగ్మ,స్మృతి ఇరానీ, హీరో రాజ్ బబ్బార్తోపాటు జావెద్ జాఫ్రీ నటించిన చిత్రాలపై నిషేధం విధించినట్లు లక్నోలో అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఆ హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు టీవీలో ప్రసారం చేస్తే ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు భావించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్ బబ్బార్, నగ్మా, రాష్ట్రీయ లోక్ దళ్ తరపున జయప్రద, బిజెపి తరపున హేమమాలిని, స్మృతి ఇరానీ, ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ తరపున జావేద్ జాఫ్రీ లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. అక్కడ ఓటర్లపై వారి సినిమాలు ఎలా ప్రభావం చూపుతాయో ఇక్కడ మన హీరోహీరోయిన్ల సినిమాలు కూడా అదేవిధమైన ప్రభావం చూపుతాయి కదా! మన టాలీవుడ్ నుంచి బాలకృష్ణతోపాటు కృష్ణంరాజు, మురళీమోహన్, జయసుధ, బాబూమోహన్, నరసింహరాజు పోటీ చేస్తున్నారు. తాను కూడా జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థినిగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు హేమ కూడా ప్రకటించారు. మరికొందరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇలా అయితే ఎంతమంది సినిమాలపై, ఎన్ని సినిమాలపై నిషేధం విధిస్తారన్న సందేహం రావచ్చు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అనంతపురం జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి, కోఆర్డినేటర్ ఆదినారాయణలు ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ సినిమా కథానాయకుడైన బాలకృష్ణను తెలుగుదేశం పార్టీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. లెజెండ్ సినిమా టీడీపీకి అనుకూలంగా ఉందని, అందులోని డైలాగులు, కథనం ఆ పార్టీకి ప్రచారం చేకూర్చేలా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలని వారు కోరారు. ఈ నేపధ్యంలో ఎన్నికల నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో ముఖ్యహీరోల చిత్రాలపై నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
లెజండ్ మూవీ సక్సస్ మీట్
-
'నా బాధ్యతను ఒకరు గుర్తు చేయాలా..?'
-
విజయాలు లేని సమయంలో ఒక వెలుగునిచ్చింది..!
‘‘లెజెండ్’ ఎవరనే విషయంలో కొంతమంది కొట్టుకుని ఆ పదాన్ని పాపులర్ చేశారు. అసలైన ‘లెజెండ్’ ఎవరో ఈ సినిమాలో చూపించాం. నా దృష్టిలో నిజమైన ‘లెజెండ్’ మా నాన్నగారు ఎన్టీ రామారావుగారే’’ అని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి నిర్మించిన ‘లెజెండ్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘విజయాలు లేని సమయంలో పరిశ్రమకు ఈ సినిమా ఒక వెలుగునిచ్చింది’’ అని చెప్పారు. పబ్లకూ క్లబ్‌లకూ తిరగను! దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ- ‘‘నా కెరీర్లో అతితక్కువ సమయంలో రీరికార్డింగ్ చేసిన సినిమా ఇది. 13 రోజులు రాత్రింబవళ్లూ కష్టపడ్డాను’’ అని చెప్పారు. ఆ తరువాత బోయపాటి మాట్లాడుతూ- ‘‘దేవి 13 రోజుల్లో రీరికార్డింగ్ పూర్తి చేసిన మాట నిజమే. అన్ని రోజులూ నేను అతన్ని వెంటాడి నిద్రపోనివ్వకుండా చేయించు కున్నాను. ఫైనల్ మిక్సింగ్ కూడా దగ్గరుండి తనతోనే చేయించుకున్నాను...’’ అని ఇంకేదో చెప్పబోతుండగా దేవిశ్రీప్రసాద్ మైక్ అందుకొని ఆ వ్యాఖ్యలకు పాజిటివ్‌గానే స్పందిస్తున్నానని చెబుతూనే ఘాటుగా మాట్లాడారు. ‘‘నా బాధ్యతను ఎవ్వరూ గుర్తుచేయనవసరం లేదు. నాకు తెలిసింది సంగీతమే. పిండుకోవడానికి నేనేమన్నా ఆవునా? గేదెనా? నేను పబ్లకూ క్లబ్‌లకూ తిరగను. సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఫైనల్ మిక్సింగ్‌కి నేను ఉండననడం కరెక్టుకాదు. ఆ 13 రోజుల్లో ఆయన వున్నది మూడు రోజులు మాత్రమే. ఆ మూడు రోజులు కూడా ల్యాప్‌ట్యాప్‌లో ఇంగ్లీషు సినిమాలు చూస్తూ గడిపారు. ఎవరి క్రెడిట్ వాళ్లకు దక్కాల్సిందే అని నమ్మే వ్యక్తిని నేను. అంతే తప్ప ఎవరిని విమర్శించడానికి ఇది చెప్పడం లేదు’’ అని దేవి స్పందించారు. ఆ తరువాత బోయపాటి మాట్లాడుతూ- ‘‘నేను కూడా అదే చెప్పాలనుకున్నా. ఈలోగా తను తొందరపడి మైక్ లాక్కున్నాడు. దేవి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు’’ అని చెప్పారు. -
ఎన్నికల్లో పోటీ చేయను: బాలకృష్ణ
కరీంనగర్: రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి సీమాంధ్ర, తెలంగాణలో ప్రచారం చేస్తాను అని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని ఆయన అన్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే పోటీ చేసే అంశంపై పునరాలోచిస్తానని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బాలకృష్ణ తెలిపారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల విడుదలైన లెజెండ్ సినిమా విజయం దిశగా పయనిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండ్ చిత్రం విడుదలైన తర్వాత రాష్ట్రంలోని నరసింహ స్వామి ఆలయాలను దర్శించుకుంటున్నారు. -
పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే...
-
బాలయ్య పాలిట్రిక్స్
అనంతపురం టౌన్/కల్చరల్/హిందూపురం అర్బన్: న్యూస్‌లైన్ : లెజెండ్ చిత్ర హీరో బాలకృష్ణ పర్యటన అభిమానుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. పేరుకు సినిమా విజయయాత్ర అని చెప్పినా పొలిటికల్ యాత్రగా సాగిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ చిత్రం విజయ యాత్రను యూనిట్ సభ్యులుచేపట్టారు. శుక్రవారం అనంతపురం, హిందూపురంలో పర్యటన సాగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు అనంతపురంలోని గంగా-గౌరి థియేటర్ వద్దకు బాలకృష్ణ వస్తాడని చెప్పడంతో మూడు గంటల ముందే అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత జాతీయ రహదారి మీదుగా వచ్చిన బాలయ్య తపోవనం నుంచి రోడ్ షోగా బయలుదేరారు. అప్పటి నుంచి ఇదిగో ఐదు నిమిషాల్లో వస్తాడు.. అదిగో పది నిమిషాల్లో వస్తాడు అని అభిమానులు ఎదురు చూసినా చివరకు రాలేదు. సమయం సరిపోదన్న సాకుతో థియేటర్ వద్దకు వెళ్లకుండానే హిందూపురం వెళ్లిపోయారు. ఈ విషయం తెలియగానే అప్పటి వరకు హుషారుగా ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా నిరుత్సాహ పడ్డారు. ‘బాలయ్య వచ్చింది సినిమా విజయోత్సవానికి కాదు.. అంతా ఎన్నికల కోసమే.. తెలుగుదేశం వాళ్లకు ప్రచారం చేయడం కోసం వచ్చి అంతా షో చేశాడు.. పొద్దున్నుంచీ పడిగాపు కాసినోళ్లంతా తిక్కోళ్లా’ అనుకుంటూ థియేటర్ నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ..‘ముందుగా ఖరారైన షెడ్యూల్లో భాగంగా థియేటర్లో విజయోత్సవ సభలో బాలకృష్ణ పాల్గొనాల్సి ఉంది. అర్ధంతరంగా పర్యటనను ముగించడంపై మాకు సమాచారం లేదు’ అని చెప్పారు. లెజెండ్ సినిమా విజయ యాత్రకు బాలకృష్ణ వస్తున్నారని మేం ఐదుగురం పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు వచ్చాం. ఇదిగో వస్తాడు.. అదిగో వస్తాడు అని ఊరించారు. చివరకు రాకుండానే వెళ్లిపోయారు. ముందే విషయం తెలుసుంటే కనీసం వేరే పనులకు వెళ్లేవాళ్లం. మరో రెండు చోట్ల మాకు పౌరోహిత్యం పనులు ఉన్నా వాటికి పోలేదు. అభిమానులను చూసి పలకరించి ఉంటే బాగుండేది. - రాఘవేంద్ర ప్రసాద్, పురోహితుడు, వేణుగోపాల్ నగర్, అనంతపురం -
'బాలకృష్ణకు హిందూపురం టికెట్ ఇవ్వొద్దు'
'బాలకృష్ణకు హిందూపురం టికెట్ ఇవ్వొద్దు' అనంతపురం : పొలిటికల్ ఎంట్రీకి తహతహలాడుతున్న సినీనటుడు బాలకృష్ణకు స్థానిక సెగ తగులుతోంది. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ నుంచి అయినా పోటీ చేస్తానన్న ఆయనకు హిందుపురంలో చుక్కెదురు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బాలకృష్ణకు కాకుండా బాలకృష్ణకు కాకుండా స్థానికులకే టీడీపీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. దాంతో మైనార్టీలకు టీడీపీ అన్యాయం చేస్తుందని హిందూపురంలో కరపత్రాల పంపిణీ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. బాలకృష్ణకు హిందూపురం అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని ఆ కరపత్రాల్లో వుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీకి టికెట్ ఇవ్వకుండా మైనార్టీలకు పార్టీ అన్యాయం చేస్తోందంటూ మరో వైపు సిటింగ్ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి టికెట్ ఇవ్వకుండా మైనార్టీలకు పార్టీ అన్యాయం చేస్తోందంటూ ఆ వర్గం నేతలు భారీ ఎత్తున కరపత్రాలు పంపిణీ చేశారు. అయితే అబ్దుల్ ఘనీనే ఈ కరపత్రాలను పంపిణీ చేయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా నేడు లెజెండ్ విజయోత్సవ యాత్రలో భాగంగా బాలకృష్ణ శుక్రవారం అనంతపురం, హిందూపురంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కరపత్రాల పంపిణీ స్రాధాన్యత సంతరించుకుంది. -
కడపలో బాలయ్య సందడి
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : ‘నాన్న ఎన్టీఆరే అసలైన లెజెండ్. అటు సినిమా రంగంలో అనేక సంచలనాలు.. ఇటు రాజకీయ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం ఆయన లెజండరీకి నిదర్శనం’ అని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తను నటించిని లెజెండ్ సినిమా విజయవంతమైన నేపథ్యంలో ఆ సినిమా ప్రదర్శిస్తున్న కడపలోని రవి థియేటర్‌కు దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలసి బాలయ్య గురువారం ఇక్కడికి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన నేరుగా థియేటర్ వద్దకు రాగానే అభిమానులు ఈలలు, కేకలు వస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. తమ కుటుంబం మొదటి నుంచి సేవాగుణం కలిగినదన్నారు. రాజకీయాల ద్వారా ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు ధరించి సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన స్ఫూర్తితో సినీ రంగంలో సందేశాత్మక పాత్రలతో రాణిస్తున్నామని, విభిన్నమైన పాత్రలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. తన నటించిన లెజెండ్ సినిమా ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రార్థనా మందిరాలను దర్శిస్తున్నామని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు సందేశాత్మక చిత్రాలను, అభిమానులందరినీ ఆనంద పరిచే సినిమాలను చేస్తానని ప్రకటించారు. బాలయ్య కోసం ప్రత్యేక కథను రూపొందించి సినిమాను విడుదల చేసినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బాలయ్య ప్రసంగిస్తున్నంత సేపు అభిమానుల ఈలలు, కేకలతో థియేటర్ ప్రతిధ్వనించింది. టీడీపీ నాయకులు గోవర్దన్‌రెడ్డి, నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు పీరయ్య, థియేటర్ ప్రతినిధులు అమానుల్లా, రవీంద్రనాథ్‌రెడ్డి, కొండారెడ్డి, హరిప్రసాద్, దామోదర్‌రెడ్డి తదితరులు అభిమానులతో కలసి బాలకృష్ణకు గజమాల అలంకరించారు. దర్గా గురువుల దర్శనం అనంతరం ఓపెన్ టాప్ జీపులో బాలకృష్ణ పెద్ద దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆశీస్సులు పొందారు. దర్శనం సమయం కాకపోవడంతో దర్గాలోని ప్రధాన గురువుల మజార్ వద్ద పూలచాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత దర్గాలోని ఇతర గరువుల మజార్లనూ దర్శించుకుని, ప్రార్థించారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అమీర్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాషా, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, నగర అధ్యక్షుడు బాలకృష్ణ యాదవ్, ఇనాయతుల్లా పాల్గొన్నారు. -
లెజెండ్.. ఎవరికి బ్యాండ్!?
‘నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్.. నాకు ఒకడు ఎదురొచ్చినా వాడికే రిస్క్.. తొక్కిపడేస్తా..’ ఇది లెజెండ్ సినిమాలో నందమూరి బాలకృష్ణ చెప్పిన పవర్ఫుల్ పంచ్ డైలాగ్. ఈ మాటలు వెండితెరపై చెబితే ఆయన అభిమానులకు ఆనందమే. తాజాగా బాలయ్య చేసిన రాజకీయ ప్రకటన మాత్రం జిల్లాలోని తెలుగు తమ్ముళ్లను కంగారుపెడుతోంది. బావ చంద్రబాబు ఎక్కడ్నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడ్నుంచి రెడీ అని బాలకృష్ణ ప్రకటించడంతో పార్టీలోని ఆశావహుల గుండెలు గుభేల్మంటున్నాయి. బాలయ్య గెలవడం మాటెలా ఉన్నా.. పోటీ పేరుతో వచ్చి ఎవరి సీటుకు ఎసరుపెడతారోనని భయపడిపోతున్నారు. *బాలకృష్ణ ప్రకటనతో జిల్లాలో రాజకీయ ప్రకంపనలు *గన్నవరం, పెనమలూరు, నూజివీడుల్లో లెక్కలు తారుమారు *ఎన్టీఆర్ వారసులను అంతగా ఆదరించని జిల్లావాసులు *టీడీపీలో మరో వర్గపోరుకు సూచికలు తెలుగుదేశం పార్టీలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నవారిని కాదని కొత్తవారిని తీసుకొచ్చి తమ నెత్తికెక్కిస్తున్నారంటూ టీడీపీ ఆశావహులు కారాలుమిరియాలు నూరుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పరిస్థితి ఇదే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పోటీకి సై అనడంతో రాజకీయ తెరపైకి మరో కృష్ణుడు వస్తున్నట్లే. ఈ పరిణామాన్ని సీట్లు ఆశిస్తున్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుడివాడ నియోజకవర్గంపై ధీమా కుదరక పోవడం బాలకృష్ణ అక్కడి నుంచి పోటీకి నిరాకరించినట్టు సమాచారం. ఆయనకు పదిలమైన నియోజకవర్గం కోసం సొంత వేగులు రంగంలోకి దిగారు. గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీచేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆయన సొంత మనుషులు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. ఆయన మూడింటిలో ఎక్కడి నుంచి పోటీకి సిద్ధమైనాఅక్కడ ఏళ్ల తరబడి ఆశలుపెట్టుకున్న వారి రాజకీయ భవిష్యత్తు మూడినట్టే. సర్దు‘బాట’లో గన్నవరం.. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ వర్గపోరుతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఒకే సామాజికవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, వల్లభనేని వంశీ మోహన్ నడుమ సీటు పోరు సాగుతోంది. ఇటీవల ఆ సీటు నాదంటే నాదంటూ ఇద్దరూ రచ్చకెక్కడంతో వారి సామాజికవర్గానికే చెందిన పెద్దలు సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. అయినా వారిద్దరు చాపకింద నీరులా మళ్లీ రాజకీయ పోరు సాగిస్తూనే ఉన్నారు. తనకు సీటు రాకుంటే ఎన్టీఆర్ వారసులను గన్నవరం బరినుంచి పోటీచేయిస్తానని దాసరి ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇద్దరి తగవు తీర్చేందుకు బాలకృష్ణను రంగంలోకి దింపే వ్యూహం చంద్రబాబు పన్నుతున్నారని భావిస్తున్నారు. వీరిద్దర్నీ కాదని బాలయ్యకు సీటిచ్చినా నెగ్గుకొచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. పెనమలూరులోనూ అదే తంతు.. పోనీ బాలకృష్ణను పెనమలూరు పంపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తే అక్కడా వర్గపోరు నడుస్తోంది. రెండువర్గాలు ఏకంగా చంద్రబాబు సమక్షంలో కొట్టుకునే వరకు దారితీసిన సంగతి గుర్తుండే ఉంటుంది. పెనమలూరు సీటుపై మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, బోడే ప్రసాద్ పట్టుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు చలసాని పండు సతీమణి చలసాని పద్మావతి, విజయవాడ నగర మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, దేవినేని చంద్రశేఖర్ కూడా ఈ సీటుపై ఆశలుపెట్టుకుని తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకదశలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం పదిలం కాకపోవడంతో పెనమలూరుకు తీసుకొస్తారన్న ప్రచారం కూడా సాగింది. వైవీబీ మాత్రం తనకు సీటు రాకుంటే చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ఇక్కడి నుంచి పోటీచేయించాలని కోరడం పార్టీలో పెనుదుమారం లేపింది. తాజాగా బాలకృష్ణ పేరు వినిపించడంతో ఆశావహులు బెంబేలెత్తుతున్నారు. ముద్దరబోయినకు ఝలకిస్తారా! గన్నవరం, పెనమలూరు కుదరకపోతే కనీసం నూజివీడు నుంచైనా బాలకృష్ణను పోటీకి దించితే ఎలా ఉంటుందనే దానిపై ఆయన అనుయాయులు లెక్కలు కడుతున్నట్టు సమాచారం. ఈ సీటుపై ఆశపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఝలక్ ఇస్తారా..అనే ఆసక్తికర చర్చసాగుతోంది. కేవలం టికెట్ ఇస్తారన్న ఆశతోనే పార్టీ మార్చి ఇప్పటికే నూజివీడులో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న ముద్దరబోయిన కస్సుబుస్సుమనే ప్రమాదం లేకపోలేదు. ఈ రకంగా జిల్లాలో ఏదో ఒక చోట నుంచి బాలయ్యను పోటీ చేయిస్తే ఆయన ఇమేజ్ మిగిలిన నియోజవకవర్గాల్లోనూ పనిచేస్తుందన్న చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టే ప్రమాదం ఉందని తెలుగుతమ్ముళ్లు మధనపడుతున్నారు. ఎన్టీఆర్ వారసులకు ఆదరణ ఏదీ.. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ జిల్లా నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో వారసుడి ప్రభావం ఎంతమేరకు ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌ను ఆదరించిన సొంత గడ్డ ఆయన వారసులను మాత్రం అంతగా పట్టించుకోలేదనే సంగతి గత ఎన్నికల ఫలితాలను చూస్తే అవగతమవుతుంది. ఎన్టీఆర్‌ను పార్టీ పెట్టిన తొలినాళ్లలో గుడివాడ బాగా ఆదరించింది. అదే గుడివాడ ఆ తర్వాత హరికృష్ణను నాల్గోస్థానానికి పరిమితం చేసింది. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు, అత్తవారి ఊరు కొమరవోలు గ్రామాలు గతంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేవి. 2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఎన్టీఆర్ సొంత గ్రామం, అత్తగారి ఊరు రెండూ పామర్రు నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. 1983 సార్వత్రిక ఎన్నికలు, 1985 మధ్యంతర ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీచేయగా ఆయన తనయుడు జయకృష్ణ ఇక్కడ ప్రచార బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ 26,538 ఓట్ల్ల మెజార్టీ తెచ్చుకోగా 1985లో కేవలం 7,597ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. కాగా ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య రంగంలోకి దిగినా అంతగా కలిసిరాదనే సంగతి గత ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. -
హింస ఎక్కువేమీ లేదు!
‘‘ ‘సింహా’ విజయం సాధించాక, బాలయ్యబాబుతో కలిసి దైవ దర్శనార్థం సింహాచలం వెళ్లాను. అక్కడ మమ్మల్ని చూడటానికి వేలాదిగా జనం వచ్చారు. ఆ జనసందోహం సాక్షిగా ‘నేను కోరిన సమయంలో... నాకో మంచి సినిమా చేసిపెట్టాలి’ అని బాలయ్య నన్నో కోరిక కోరారు. ‘కచ్చితంగా చేస్తాను సార్’ అని మాటిచ్చాను. అదే ‘లెజెండ్’’’ అని బోయ పాటి శ్రీను చెప్పారు. బాలకృష్ణ కథానాయకునిగా బోయపాటి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించిన ‘లెజెండ్’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా బోయపాటి విలేకరులతో ముచ్చటించారు. ‘‘122 రోజులు మేం పడిన కష్టానికి తగిన ఫలితం రావడం ఆనందంగా ఉంది. కొత్త బాలకృష్ణను చూపించానని అందరూ అంటున్నారు’’ అని బోయపాటి ఆనందం వెలిబుచ్చారు. సినిమాలో హింస ఎక్కువైందనడం సబబు కాదని, తన వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు కథానాయకుడు ఆ మాత్రం ఉద్వేగానికి లోనవడం సబబేననీ అన్నారు. ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీ మీద ఈ సినిమాలో విమర్శలు ఎక్కుపెట్టలేదనీ, సామాజికాంశాలను మాత్రమే స్పృశించామనీ బోయపాటి చెప్పారు. ‘‘దర్శకులు కె.రాఘవేంద్రరావు, రామ్‌గోపాల్‌వర్మ ఫోన్లు చేసి అభినందించారు. విదేశాల్లో సైతం ‘లెజెండ్’ విజయఢంకా మోగించడం ఆనందంగా ఉంది’’ అని సంతోషం వెలిబుచ్చారు బోయపాటి. తరువాతి సినిమా చరణ్‌తో... ‘‘ ‘లెజెండ్’ సింహ యాత్ర అనంతరం రామ్‌చరణ్ సినిమాపై దృష్టి సారిస్తా. ఇప్పటికే చిరంజీవిగారికి, చరణ్‌కి కథ చెప్పడం కూడా జరిగింది. వాళ్లకు కథ నచ్చింది. తుదిమెరుగులు దిద్దాలి. దానికి రెండు, మూడు నెలలు పడుతుంది. కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు’’ అని ఆయన వెల్లడించారు. -
సింహాచలంలో లెజెండ్ మూవీ టీమ్ సింహయాత్ర
-
లెజెండ్ మూవీ సక్సస్ మీట్
-
'అభిమానులు 'లెజెండ్' స్క్రీన్ చించేశారు'
అనంతపురం: అభిమానులు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో ఊహించడం కష్టం. అనంతపురంలో బాలకృష్ణ అభిమానులు వీరంగం సృష్టించారు. ఇటీవల విడుదలైన 'లెజెండ్' చిత్రం అనంతపురంలోని 'గుర్నాథ్ థియేటర్'లో ప్రదర్శిస్తున్నారు. థియేటర్ లోని సౌండ్ సిస్టమ్ లో సాంకేతికపరమైన తలెత్తడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే విజ్క్షప్తి చేసినా థియేటర్ యాజమాన్యం సౌండ్ సిస్టమ్ ను బాగు చేయకపోవడంతో అభిమానులు సీట్లు విరగకొట్టి, స్క్రీన్ చించి గందరగోళం సృష్టించారు.. అభిమానుల గందరగోళంపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'లెజెండ్' తొలిరోజు కలెక్షన్లు 7.4 కోట్లు
చెన్నై: నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం భారీ కలెక్షన్లను వసూలు చేస్తోంది. 28 తేది శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. 35 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈచిత్రం సెలవుల కారణంగా వారాంతంలో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి రోజున 7.4 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ త్రినాధ్ తెలిపారు. తొలిరోజు కంటే రెండవ రోజు (శనివారం) కలెక్షన్లు కొంత తగ్గాయని ఆయన తెలిపారు. వారాంతలోగా సుమారు 12 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. కమర్షియల్ హంగులతో పొలిటికల్ డ్రామాగా రూపొందిన 'లెజెండ్' చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ రూపొందించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే, కళ్యాణి తదితరులు నటించారు. -
'లెజెండ్' పై ట్విటర్ లో కామెంట్స్!
మార్చి 28 తేది శుక్రవారం విడుదలైన బాలకృష్ణ 'లెజెండ్' చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లెజెండ్ చిత్రంపై పలువురు ట్వీటర్ లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. Last 20mins pakana pedithe decent commercial entertainer #Legend ballaya 2nd half lo koni scenes lo kummesadu getup bhaga suit ayindhi — Aravind (@aravindcherry) March 29, 2014 Just landed in Hyderabad to celebrate the success of #Legend Thank u all for making it a huge success. Love :-* — SONAL CHAUHAN (@sonalchauhan7) March 30, 2014 congratulations to legend team ...my favourite hero Balakrishna gaaru awesome in this movie... — veerabhadramdirector (@veerabhadramdir) March 29, 2014 Pretty ordinary story & Balayya look in first half was very pale & looks old.. Balayya mannerisms are good & very routine first half . — . (@movieezz) March 26, 2014 Characterisation&acting are the heart and soul of the film. And for Balayya this is his BEST performance till date. THE LION IS TRULY BACK! — rajamouli ss (@ssrajamouli) March 28, 2014 Fight master evado kaani Ajantha Mendis banthi laga batsman aina manaki ardham kakunda fighter lani ashta vankarlu tippadu #Legend — KSD RAVITEJA (@ @) (@ksdraviteja) March 29, 2014 Like it or not mass films are out of sync now, they get you good opening but have limited long run. Eg : Yevadu and now legend — NR (@C_h_i_r_U) March 29, 2014 Thaaaank You all so much for makin LEGEND a BlockBuster !!!! Thnx 4 lovin my songs n BGM !!!! :)))) — DEVI SRI PRASAD (@ThisIsDSP) March 28, 2014 Liked #LEGEND a lot.. Very enjoyable to see Balayya in A Powerful Role... — Nikhil Siddhartha (@actor_Nikhil) March 28, 2014 #Legend ~ Good first half with superb sec half , Sec half lo balayya dialogues and emotions B,C centers lo dhummu lepudi cinema.Very very happy to see balayya in these type of characters. After long time really seen a lion in balaya — sankar (@sankar485) March 28, 2014 #Legend ~ Good first half with superb sec half , Sec half lo balayya dialogues and emotions 👍👍👍 , Jaggu bhai at his best 3.5/5 , #LionIsBack— raaviprakash (@RaaviNtr) March 28, 2014 just one word AUD fn lo entha comedy chesaado...cinemalo antha RACHA chesadu balayya with jaggu n DSP...KEVV cinema...dont miss #LEGEND— Tejdeep (@Itsme_Thej) March 28, 2014 Once I step in., history repeats., #legend just arrived .. Interval mundu pavu ganta saving grace ..— Hari Krishna Raju (@harikraju) March 28, 2014 Legend is one of the weakest films in the recent times that rides high on baseless conflicts. No legendary stuff, th…http://t.co/n6XkPj5qZV— Haricharan Pudipeddi (@pudiharicharan) March 28, 2014 Legend is Back... High Octane Second Half and dialogues dynamites la pelayi...— BARaju (@baraju_SuperHit) March 28, 2014 Congratulations to team 'legend '.. I heard that the .. pic.twitter.com/6Z90ijEOaM— Nani (@NameisNani) March 28, 2014 Watched Legend..fantabulous performance by balayya.."Roared like a lion" congrats to the entire team.— Sreenu Vaitla (@SreenuVaitla) March 28, 2014 Twitter gives me 140 characters, not enough to express my thoughts on #Legend. 'he's a legend... he's a legend...' still echoes in my ears.— sangeetha devi (@Sangeetha_Devi) March 28, 2014 Legend: Typical mass masala movie. Loaded with dialogues, dialogues, dialogues & more dialogues.. May work with NBK's fans, but for others..— Jalapathy Gudelli (@JalapathyG) March 28, 2014 Congratulations team Legend :-) block buster :))— Manchu Manoj (@HeroManoj1) March 28, 2014 'Legend' beats energy levels of 'simha'. Gr8 performance by Balayya. Rathnam gaari dialogues r crisp,sharp&pwrful. Cngrts to entire team !!— deva katta (@devakatta) March 28, 2014 Legend - A proper mass masala film with all commercial ingredients backed up by LION BALAYYA's high voltage action and powerful dialogues.— vennela kishore (@vennelakishore) March 28, 2014 Desert fight is good..over ga expect seyakandi #Legend— Srikanth (@srikanth_ntr1) March 27, 2014 Just watched Legend. Bala Mavvaya is back with a bang! He gives the performance of a lifetime here. Forgot I was watching a performance.— Lokesh Nara (@naralokesh) March 27, 2014 -
సినిమా రివ్యూ: లెజెండ్
సినిమా రివ్యూ: లెజెండ్ నటవర్గం: బాలకృష్ణ, జగపతి బాబు, రాధిక ఆంప్టే, సోనాల్ చౌహన్ దర్శకుడు: బోయపాటి శ్రీను నిర్మాత: అచంట గోపినాథ్, ఆచంట రాము, అనిల్ సుంకర సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ బ్యానర్: 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్లస్ పాయింట్స్: జగపతిబాబు, బాలకృష్ణ నటన డైలాగ్స్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మైనస్ పాయింట్స్: మితిమీరిన హింస క్లైమాక్స్ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా సూపర్ హిట్. ఆతర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు సరైన హిట్ లేదు. లెజెండ్ లో జగపతిబాబు రూట్ మార్చి విలన్ రూపంలో కనిపించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిక్కి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ రాజకీయంగాను, సినీ కెరీర్ లో ప్రభావం చూపేందుకు లెజెండ్ ఎంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటిలు సరైన హిట్ కోసం, జగపతిబాబు తనను తాను కొత్తగా అవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ చిత్రం కొంత ప్రాధాన్యత, ఆసక్తిని సొంతం చేసుకుంది. మార్చి 28 శుక్రవారం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఇంట్లో కారం, ఒంట్లో అహంకారం లేకుండా బతకలేననే జితేందర్ (జగపతిబాబు) ముఖ్యమంత్రిపై పదవిపై ఆశలు పెంచుకుంటాడు. అలాంటి జితేందర్ పెళ్లి చూపుల కెళ్లి ఓ వివాదంలో చిక్కుకుంటాడు. ఆ ఊరి పెద్ద (సుమన్) జితేందర్ ను నష్టపరిహారం, క్షమాపణ చెప్పాలని తీర్పు ఇస్తాడు. ఆ ఊరి పెద్ద నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా భార్య (సుహాసిని)ను కుమారుడు కృష్ణ (బాలకృష్ణ)ను కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ వ్యవహారంలో తల్లి చనిపోవడంతో కృష్ణ జితేందర్ తండ్రి, అతని అనుచరులను చంపుతాడు. చిన్నతనంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలదూర్చడం ఇష్టం లేని కారణంగా కృష్ణను పై చదువుల కోసం లండన్ పంపుతాడు. చదువు పూర్తయిన తర్వాత దుబాయ్ లో బిజినెస్ లో స్థిర పడుతాడు. పెళ్లి చేసుకుందామని వచ్చిన కృష్ణకు జితేందర్, అతని అనుచరుడి రూపంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జితేందర్ ను, అతని అనుచరులు ఎదుర్కొన్న కృష్ణను హతమార్చేందుకు ప్లాన్ వేసి.. ఓ ఘటనలో కృష్ణపై కాల్పులు జరుపుతారు. దాంతో కృష్ణ పరిస్థితి విషమంగా మారుతుంది. ఆ సంఘటన తర్వాతే సినిమాలో పెద్ద ట్విస్ట్ మొదలవుతుంది. ట్విస్ట్ ఎమిటి? చావు బతుకుల పరిస్థితుల మధ్య ఉన్న కృష్ణ పరిస్థితి ఏమైంది. జితేందర్ ముఖ్యమంత్రి అయ్యాడా; జితేందర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎవరు అడ్డంకిగా మారారు అనే సందేహాలకు సినిమా చూడాల్సిందే. కృష్ణ పాత్రలో బాలకృష్ణ మరోసారి విజృంభించాడు. కథకు తగినట్టుగా.. తనకు లభించిన క్యారెక్టర్ పండించడంలో బాలకృష్ణ సఫలమయ్యాడు. సింహా తర్వాత ఓ పవర్ ఫుల్ పాత్రతో బాలకృష్ణ అదరగొట్టాడనే చెప్పవచ్చు. ఇక జితేందర్ పాత్రలో జగపతిబాబు తన రూట్ ను మార్చుకుని ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రతో అద్బుతంగా రాణించాడు. జితేంద్ర పాత్ర లేకపోతే లెజెండ్ సినిమా లేదని ఓ అభిప్రాయాన్ని కలిగించే రేంజ్ లో జగపతిబాబు ప్రభావాన్ని చూపారు. తన ఇమేజ్ ను పక్కన పెట్టి ఓ కొత్త పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారడంలో సందేహం అక్కర్లేదు. కథలో భాగంగా రాధికా ఆంప్టే, సోనాల్ చౌహాన్ లు పాటలకే పరిమితం కాకుండా పెర్పార్మెన్స్ కూడా అవకాశం లభించింది. మిగితా పాత్రలు తమ పాత్రల పరిమితి మేరకు పర్వాలేదనిపించారు. రత్నం మాటలు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ ప్రసాద్ కెమెరా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ద్వితీయార్ధంలో రత్నం మాటలు తూటాల్ల పేలాయి. మ్యూజిక్ రివ్యూ: తొలిసారి బాలకృష్ణ చిత్రం కోసం మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు చేకూర్చారు. బాలకృష్ణను క్రేజ్ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసాడంటే వీడు' అనే టైటిల్ సాంగ్, మెలోడిగా రూపొందింన 'పట్టు చీర బాగుందే.. కట్టు బొట్టు బాగుందే' ఆడియోలో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటలకు వచ్చిన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా తెర రూపం కల్పించారు. ఇక ఈ చిత్రంలో కీలకమైన పలు సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో దేవి శ్రీ ప్రసాద్ జీవం పోశారు. ఈ చిత్ర ద్వితీయార్ధంలో దేవీ శ్రీ స్రసాద్ పనితీరు అద్బుతంగా ఉంది. దర్శకుడి పనితీరు: దమ్ము చిత్రంతో ఎదురెబ్బ తిన్న బోయపాటి శ్రీను లెజెండ్ చిత్రంలో చక్కటి స్క్రీన్ ప్లే, ఫర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో దూసుకుపోయాడు. తొలిభాగంలో కథ మామూలుగా నడిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఆతర్వాత ద్వితీయార్ధంలో సన్నివేశాలను పరిగెత్తించాడు. మంచి టేకింగ్ కు రత్నం మాటలు తోడవ్వడంతో ప్రేక్షకుడికి ఓ మంచి అనుభూతిని కలిగించారు. ఏది ఏమైనా కష్టకాలంలో బోయపాటి శ్రీను తొలి ఆటకే సానుకూలమైన టాక్ సంపాదించుకున్నారు. సింహా తర్వాత ఈ మధ్యకాలంలో సరియైన హిట్ సొంతం చేసుకోలేకపోయిన బాలకృష్ణకు ఊరట కలిగించే చిత్రాన్ని అందించడంలో బోయపాటి సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే చిత్రంలో మితి మీరిన హింస, ఊహలకు అందిన ఫైట్స్ మైనస్ పాయింట్ చెప్పవచ్చు. పక్కా కమర్షియల్ హంగులతో, సెంటిమెంట్ తోపాటు, బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన లెజెండ్ చిత్రం 'సింహా-2' అని చెప్పవచ్చు. -
'లెజెండ్' చిత్రంలోని హార్లే డెవిడ్సన్ బైక్ వేలం!
హైదరాబాద్: లెజెండ్ చిత్రంలో బాలకృష్ణ ఉపయోగించిన హార్లే డేవిడ్సన్ బైక్ ను వేలానికి పెట్టనున్నారు. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి వినియోగించనున్నారు. బైక్ వేలంలో వచ్చిన సొమ్ము పేదవారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేలాన్ని లెజెండ్ చిత్ర విడుదలకు ముందే నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో బాలకృష్ణ కోసం ఆరెంజ్ కలర్ హార్లే డేవిడ్సన్ బైక్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. జగపతిబాబు, రాధిక ఆంప్టే, సోనాల్ చౌహన్ లు నటించిన లెజెండ్ చిత్రం మార్చి 28 తేది శుక్రవారం విడుదలకు సిద్దమవుతోంది. బాలకృష్ణకు 'సింహ' లాంటి సూపర్ హిట్ అందించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. -
హాట్ బ్యూటి సోనాల్ చౌహన్
-
ఎన్నికలలో... ఎన్ని కలలో!
ువేసవి వచ్చేస్తోంది. ‘వేసవి’ అంటే సినిమా టైటిల్ కాదు. సినిమా వాళ్లకు అతి పెద్ద సీజన్ ఇది. స్టార్ హీరోలతో పాటు చిన్నా పెద్దా అంతా ఈ సీజన్లో తమ సినిమాలు విడుదల చేసి బాక్సాఫీస్‌ని కొల్లగొడదామని ప్రయత్నిస్తుంటారు. ఇది ప్రతి ఏటా జరిగేదే. అయితే... ఈ సమ్మర్ సీజన్ మాత్రం తెలుగు సినిమాకు చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే.. 2014 ఎంటరై ఇప్పటికి 71 రోజులైంది. బాక్సాఫీస్ దాహార్తిని తీర్చే సరైన బ్లాక్‌బస్టర్ రాలేదు. సంక్రాంతి సీజన్ కూడా మునుపటి స్థాయిలో పెద్ద ఊపు తేలేదు. అందుకే అందరూ ఆశలన్నీ సమ్మర్ సీజన్‌పైనే పెట్టుకున్నారు. ఈ సమ్మర్లో వచ్చే సినిమాల ఫలితాలు ఈ ఏడాది మొత్తం మీద ప్రభావం చూపిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఓ వైపు టెన్త్, ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మరో వైపు క్రికెట్ హంగామా. ఈ నెల 16 నుంచి టి-20 వరల్డ్ కప్ మొదలవుతోంది. ఈ హడావిడి సద్దుమణిగేలోపే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల రూపంలో ఏప్రిల్‌లో మరో హంగామా. ఇది నెల పై చిలుకే సాగుతుంది. అసలు ఈ రెండూ కాకుండా అసలైన పెద్ద ఉపద్రవం ఏంటంటే... ఎలక్షన్ హడావిడి. ఈ రెండు నెలలూ రాష్ట్రమంతటా ఎన్నికలే ఎన్నికలు. తొలుత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు. వీటి పుణ్యమా అని పల్లెటూళ్లు బిజీ బిజీ. ఆ వెంటనే... ‘మునిసిపల్ ఎలక్షన్స్’. ఇక మునిసిపాలిటీల కోలాహలం అలాఇలా ఉండదు. చివరాఖరుగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్. వీటి గురించి సరేసరి. ఇవన్నీ అయ్యాక... ఇక కౌంటింగ్. సినిమాలను మించిన ఉత్కంఠ. ఇక థియేటర్లకు జనాలు ఎప్పుడొచ్చేట్లు? ఈ ఉపద్రవాలన్నింటినీ తెలుగు సినిమా ఎలా తట్టుకునేట్లు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. బాలకృష్ణ, మోహన్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య వంటి స్టార్ హీరోలు ఈ సమ్మర్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సమ్మర్ హడావిడికి ‘లెజెండ్’తో శ్రీకారం చుట్టనున్నారు బాలకృష్ణ. ‘సింహా’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు అమితంగా ఉన్నాయి. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ‘లెజెండ్’తో పాటే రాబోతున్న మరో స్టార్ హీరో సినిమా ‘రౌడీ’. మోహన్‌బాబు, రామ్‌గోపాల్‌వర్మ తొలిసారి కలిసి పనిచేసిన సినిమా ఇది. ఇటీవల విడుదల చేసిన ‘రౌడీ’ ఫస్ట్ లుక్‌కి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు కూడా ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ కూడా ఈ సమ్మర్లోనే దుమ్మురేపనుంది. ఏప్రిల్ ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కె.వెంకటేశ్వరరావు సన్నాహాలు చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. విజయవాడ నేపథ్యంలో, నాగచైతన్య హీరోగా దేవ కట్టా తెరకెక్కించిన ‘ఆటోనగర్ సూర్య’ సమ్మర్లో విడుదల కావడం ఖాయం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ కూడా తెరపైకొచ్చేది సమ్మర్లోనే. స్వర్గీయ మహానటుడు అక్కినేని నటించిన చివరి సినిమా ఇదే కావడంతో... అన్ని వర్గాలవారూ, అన్నీ వయసులవారూ ఆ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ‘ఇష్క్’ఫేం విక్రమ్‌కుమార్ ఫీల్‌గుడ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. సమ్మర్లో రాబోతున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రభస’. ‘ఆది’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టు పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. ఇక స్ట్రయిట్ చిత్రాలకు సవాల్ విసురుతూ... సూపర్‌స్టార్ రజనీకాంత్ రూపం ‘విక్రమసింహ’గా ఈ సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ ‘అవతార్’ చిత్రాన్ని తెరకెక్కిన త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రంలో రజనీ వీరుడుగా కనిపించబోతున్నారు. ఆయనకు జోడీ దీపికా పదుకొనే. ఏఆర్ రెహమాన్ సంగీతం. రజనీ తనయ ఐశ్వర్య దర్శకురాలు. ఏప్రిల్‌లో సినిమా ఉంటుందని వినికిడి. ఈ సినిమాలు కాక, నాని ‘జెండాపై కపిరాజు’, శేఖర్‌కమ్ముల ‘అనామిక’, మారుతీ ‘కొత్తజంట’, అల్లరి నరేష్ ‘జంప్ జిలాని’, ప్రకాశ్‌రాజ్ ‘ఉలవచారు బిర్యాని’, సాయి ధరమ్‌తేజ్ తొలి సినిమా ‘రేయ్’, మలి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’, ఎమ్మెస్ రాజు ‘జపం’తో పాటు మరికొన్ని చిత్రాలు కూడా సమ్మర్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
హంసానందిని హీరోయిన్గా సక్సెస్ కాకపోయినా...
ఆరడుగుల అందం. పోతపోసిన విగ్రహం. చూపులోనూ, రూపులోనూ ప్రత్యేకత. కుర్రకారుని పిచ్చెక్కించే రూపం. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ... వెరసి హంసానందిని. ఆమె అసలు పేరు పూనమ్. వంశీ తన 'అనుమానాస్పదం' చిత్రంలో కథానాయకిగా పరిచయం చేసి ఆమె పేరును హంసానందినిగా మార్చారు. హీరోయిన్స్‌గా సక్సెస్ కాకపోతే తట్టాబుట్టా సర్ధుకొని ఇంటికి వెళ్లిపోవల్సిందే. గతంలో హీరోయిన్ల పరిస్థితి అలా ఉండేది. కానీ కాలం మారింది. హీరోయిన్స్‌గా సక్సెస్ కాకపోతే వారికి అవకాశాలు మరోరూపంలో తలుపు తడుతున్నాయి. ఆ విధంగా వారి కెరీర్ గ్రాఫ్ పెరిగిపోతోంది. హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయి, ఆ తరువాత అవకాశాలు రాకపోతే ఐటంసాంగ్స్ ఉండనే ఉన్నాయి. అదే ఫార్ములాని నమ్ముకుని టాప్ ఐటంగాళ్గా ఎదిగిపోతున్నారు కొందరు. హంసానందినిని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేంటో ఈ ఆరడుగుల సుందరి ప్రత్యేక డ్యాన్స్‌లు చేసిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అందుకే ఐటం సాంగ్ అంటే దర్శక నిర్మాతలకు హంసానందిని గుర్తుకు వస్తోంది. అనుమానాస్సదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నాపెళ్లంట, నా ఇష్టం, టీ-సమోసా-బిస్కెట్, ఈగ, మిర్చి, భాయ్,అత్తారింటికి దారేది వంటి చిత్రాలలో నటించి మంచి ఊపుమీదా ఉంది. వెండితెరపై కొద్దిసేపు కనిపించినా యువతరానికి పిచ్చెక్కిస్తోంది. ‘మిర్చి’లోని ‘మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చీ లాంటి కుర్రాడే’ పాటకు హంసా డాన్స్ చేసిన వైనం అందర్నీ ఆకట్టుకుంది. అదే జోరుతో ‘భాయ్’ చిత్రంలో నాగార్జున సరసన ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేక పాటకు కాలు కదిపింది. ఇప్పుడు హంసా ‘రుద్రమదేవి’లో ఓ ప్రత్యేక పాత్ర చేస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలన చిత్రం బ్యానర్స్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'లెజెండ్' చిత్రంలో బాలయ్య సరసన ఈ అందాల భామ ప్రత్యేక నృత్యం చేస్తోంది. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సింహ చిత్రంలో నమిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ చిత్రంలో నమితకు కొద్దిపాటి క్యారెక్టర్‌కు కూడా ఉంది. హంసానందిని గతంలో కనిపించిన చిత్రాలలో పాటలో మాత్రమే కాకుండా రెండు, మూడు సీన్స్‌లో కూడా కనిపించేది. సింహ సినిమాలో నమితకు బోయపాటి అటువంటి అవకాశమే ఇచ్చారు. ఇప్పుడు లెంజెండ్ చిత్రంలో కూడా హంసానందినికి అటువంటి అవకాశం ఇస్తారా? లేక ఒక్క ఐటమ్ సాంగ్‌కు మాత్రమే పరిమితి చేస్తారా? అనేది తెలియదు. ఈ సినిమాలో ఎటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ హంసానందిని టాలీవుడ్ యంగ్ హీరోలతోనే కాకుండా, బిగ్ స్టార్స్‌తో కూడా నటించే అవకాశం కొట్టేసింది. s.nagarjuna@sakshi.com -
లెజెండ్‌తో సిల్లీబ్రాండ్
-
లెజెండ్ ఆడియో హైలెట్స్
-
మా ఇద్దరి పాత్రలు నువ్వా-నేనా అనేలా ఉంటాయి - బాలకృష్ణ
‘‘అభిమానం డబ్బుతో కొంటే వచ్చేది కాదు. గుండెలోతుల్లోంచి పెల్లుబికి వచ్చేది. ఇంతమంది అభిమానాన్ని పొందగలగడం నా పూర్వజన్మ సుకృతం. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా.. అని మీతో పాటు నేనూ ఆత్రుతతో ఉన్నాను’’ అని అభిమానులను ఉద్దేశించి బాలకృష్ణ అన్నారు. ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లెజెండ్’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని శ్రీనువైట్ల ఆవిష్కరించి, బి.గోపాల్‌కి అందించారు. బాలకృష్ణ మాట్లాడుతూ -‘‘నా వరకూ నిజమైన లెజెండ్ అంటే స్వర్గీయ ఎన్టీఆర్‌గారే. పాత్ర పరంగా మాత్రమే నేను లెజెండ్‌ని. సామాన్యుడికి అన్నవస్త్రాలతో పాటు వినోదం కూడా ఎంతో అవసరం. అందుకే సకలకళల సమ్మేళనమైన సినిమాను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. దేవిశ్రీ ప్రసాద్ జనరంజకమైన సంగీతాన్ని అందించాడు. దేవిశ్రీ తండ్రిగారు సత్యమూర్తి, నేను చాలా సినిమాలకు పనిచేశాం. అప్పుడు దేవిశ్రీ చాలా చిన్నపిల్లాడు. ఇప్పుడు తన ఎదుగుదల చూస్తుంటే ఆనందంగా ఉంది. జగపతిబాబుది ఇందులో విలన్ పాత్ర అని నేను అనను. మా ఇద్దరి పాత్రలూ నువ్వా- నేనా అనేలా ఉంటాయి. పంచభక్ష్యపరమాన్నాలతో వడ్డించిన విస్తరిలా సినిమాను మలిచాడు బోయపాటి’’ అని చెప్పారు. ‘‘ ‘బాబులకే బాబు లాంటివాడు బాలయ్యబాబు. ఆయన ముందు నన్ను ‘బాబు’ అని పిలవొద్దు’ని సెట్లోకి రాగానే అందరికీ చెప్పాను. కానీ అందరూ నన్ను ‘బాబు’ అనే పిలుస్తున్నారు. ఎందుకు అనడిగితే... ‘బాలయ్యే మిమ్మల్ని బాబు అని పిలుస్తున్నారండీ. ఇక మేం పిలవకపోతే ఎలా’ అన్నారంతా. దటీజ్ బాలయ్య. నేను ఇప్పటివరకూ బాలయ్యను యాక్టర్ మాత్రమే అనుకున్నాను. కానీ ఆయన న్యూక్లియర్ రియాక్టర్ అని ఆయనతో పనిచేశాక తెలిసింది’’ అని జగపతిబాబు అన్నారు. బాలకృష్ణతో పనిచేయడం ఆనందంగా ఉందని, ఈ సినిమాతో అందరు హీరోలతో పనిచేసిన క్రెడిట్ తనకు దక్కిందని దేవిశ్రీప్రసాద్ ఆనందం వెలిబుచ్చారు. యూనిట్ సభ్యులతో పాటు రాజమౌళి, బాలకృష్ణ అల్లుళ్లు లోకేష్, శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు. -
లెజెండ్ ఆడియో కార్యక్రమంలో పొలీసుల అత్యుత్సాహం!
బాలకృష్ణ నటించిన లెజెండ్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అభిమానులపై పోలీసులు, సెక్యూరిటీ అత్యుత్సాహం చూపారు. అభిమానులపై పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. ఆడియో కార్యక్రమంలోకి ప్రవేశించేందుకు పాసులున్నా సెక్యూరిటీ లోనికి అనుమతించని పోలీసులపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ ఆడియో కార్యక్రమం హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ తదితరులు హాజరయ్యారు. -
లెజెండ్ సినిమా టీజర్
-
బాలయ్యతో పోటీపడుతున్న బన్నీ
-
ఆట హంసానందినితోనే!
బాలకృష్ణతో అండర్‌ప్లే చేయిస్తే.. దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో రుచి చూపించిన చిత్రం ‘సింహా’. కోడి రామకృష్ణ, బి.గోపాల్, వి.వి.వినాయక్ తర్వాత బాలకృష్ణను అంత జనరంజకంగా చూపించింది నిజంగా బోయపాటి శ్రీనే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే.. అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా? ‘లెజెండ్’ సినిమా ప్రారంభం నుంచీ బోయపాటి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమాను ఆయన చకచకా పూర్తి చేసిన వైనం... కథపై తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ ఒక్కపాటను ఈ నెల 5 నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్లో తెరకెక్కించనున్నారు. అయితే.. బాలీవుడ్ భామ బిపాసాబసు ఈ పాటలో నర్తిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కాదట. ఈ ప్రత్యేకగీతంలో బాలయ్యతో కాలు కదిపే తార హంసానందిని. ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్న ఈ పాటలో హంసానందినితో పాటు ఈ చిత్ర కథానాయికల్లో ఒకరైన సోనాలీ చౌహాన్, మరికొందరు తారాగణం కూడా పాల్గొంటారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 7న విడుదల చేసి, సినిమాను ఈ నెల 28న విడుదల చేయనున్నారు నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. రాధికా ఆప్టే ఓ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా కల్యాణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి కొర్రపాటి. -
సరికొత్త స్టెప్స్‌లో...
ఓ సూపర్‌హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఎలాంటి భారీ అంచనాలు ఉంటాయో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న ‘లెజెండ్’పై అలాంటి అంచనాలే ఉన్నాయి. బాలయ్య హీరోగా ‘సింహా’లాంటి సంచలన విజయాన్ని అందించిన బోయపాటి ప్రస్తుతం ‘లెజెండ్’లో ఆయన్ను సరికొత్త లుక్‌లో ఆవిష్కరించనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన బాలయ్య ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ లుక్ కోసం బాలయ్య బరువు కూడా తగ్గారు. ఇందులో జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర చేయడం విశేషం. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సొనాల్ చౌహాన్ కథానాయికలు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ పాటలు స్వరపరిచారు. బాలయ్య సినిమాకి దేవి పాటలివ్వడం ఇదే తొలిసారి. దేవి పాటలు ఎంత హుషారుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో.. బాలయ్య సరికొత్త స్టెప్స్ వేసి ఉంటారన్నది అభిమానుల అంచనా. ఈ పాటలను వచ్చే నెల 7న విడుదల చేయనున్నారు. శిల్పకళా వేదికలో అభిమానుల సమ క్షంలో ఈ వేడుక జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
బాక్సాఫీస్ వద్ద బాలయ్య స్టామినా ఎంత...?
-
ఐ యామ్ ఎ లెజెండ్!
నటన మాత్రమే కాదు గాత్రప్రతిభ కూడా తనలో ఉందని స్మిత్ నిరూపించింది. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఆల్బమ్ ‘విప్ మై హేర్’ స్మిత్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘బిల్బోర్డ్ హాట్ 100’ లీస్ట్‌లో టాప్ టెన్‌లో నిలిచింది. ‘ఐ యామ్ ఎ లెజెండ్’ అంటుంది స్మిత్. అపార్థం చేసుకోకండి...అది ఆ అమ్మాయి సినిమా పేరు. తల్లిదండ్రుల వారసత్వాన్ని అందరూ పుణికి పుచ్చుకుంటారని గ్యారెంటీ ఏమీ లేదు. ‘ ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనేది అన్ని సందర్భాలలోనూ నిజమవుతుందనే నమ్మకం కూడా లేదు. పదమూడు సంవత్సరాల అమెరికన్ అమ్మాయి విల్లో స్మిత్ అక్షరాల తల్లిదండ్రుల వారసత్వాన్ని అందుకుంది. స్మిత్ తండ్రి విల్ స్మిత్ సంగీతకారుడు, నటుడు. తల్లి జడా పింకెట్ స్మిత్ నటి. ‘ఐయామ్ ఎ లెజెండ్’ సినిమా ద్వారా హాలివుడ్‌లోకి అరంగేట్రం చేసింది స్మిత్. ఆతరువాత ‘యాన్ అమెరికన్ గర్ల్’ మొదలైన సినిమాల్లో నటించి ఎన్నో అవార్డ్లు అందుకుంది. నటన మాత్రే కాదు గాత్రప్రతిభ కూడా తనలో ఉందని స్మిత్ నిరూపించింది. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఆల్బమ్ ‘విప్ మై హేర్’ స్మిత్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘బిల్బోర్డ్ హాట్ 100’ లీస్ట్‌లో టాప్ టెన్‌లో నిలిచింది. అవార్డ్లు కూడా గెలుచుకుంది. ఇటీవల వచ్చిన ‘రాక్ నేషన్’ ‘ఫైర్‌బాల్’ ‘ఐయామ్ మీ’ ‘డ్రౌనింగ్’ ‘5’ ఆల్బమ్‌లు స్మిత్ ప్రతిభను ప్రపంచానికి చాటాయి. తాజాగా ‘వి’ మ్యాగజైన్ కోసం స్మిత్ చేసిన షూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో ఆ అమ్మాయి ‘ప్యాషన్స్ సెన్స్’ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. తనను తాను ప్రత్యేకంగా నిలపుకోవడానికి ‘ఫ్యాషన్’ ఉపకరిస్తుంది అంటుంది స్మిత్. ‘‘ఎవరూ ఊహించిన భిన్నత్వం నా ఫ్యాషన్‌లో కనబడాలి’’ అనేది స్మిత్ కోరిక. ‘వి’ మ్యాగజైన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది! -
హక్కుకు దిక్సూచి బొజ్జా తారకం
నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ రోజు ఉదయం నుంచే ఆ ఊరి జనం మాట్లాడ్డం మానేశారు. ఒకరితో ఒకరు కాదు.. తమలో తాము కూడా. వీధి అరుగులు నిర్మానుష్యం. ఊరి జనం చుట్టూ చీకటి ఆవరించింది. నిజానికి ఆ రోజు ఆ ఊరికి అది చీకటి రోజే. అయితే ఆ చీకటి దళితవాడది. దళితవాడలో అలుముకున్న ఆ దట్టమైన చీకటి గురించి దళితులు కానీ, దళితేతరులు కానీ నోరువిప్పి మాట్లాడలేని పరిస్థితి. ఆ రోజు ఆ పల్లెలో జరిగిన దారుణం గురించి మాట్లాడితే, ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని నిలదీస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అందుకే అంతా అసలేమీ జరగనట్లుగానే ఉండిపోయారు. అప్పటికి చాలారోజులుగా ఆ ఊరి భూస్వామి పొలంలో పనిచేస్తున్న వ్యక్తి ఆ రోజే శవమయ్యాడు. ఒంటిమీద ఉన్న గాయాలు చెబుతూనే ఉన్నాయి. అది హత్య అని. భూస్వామి కొట్టిన దెబ్బలకే అతడు చనిపోయాడని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలా ఒక దారుణం శాశ్వతంగా సమాధి అవుతున్న తరుణంలో ఆ ఊళ్లోకి ప్రవేశించాడు ఒక న్యాయవాది. ఆ హత్యోదంతాన్ని వెలుగులోకి తెచ్చాడు. న్యాయపోరాటంలో విజయం సాధించాడు. ఆయనే ప్రముఖ న్యాయవాది, దళిత హక్కుల ఉద్యమనేత, రచయిత బొజ్జా తారకం. దళిత విద్యార్థి నేతగా, హక్కుల ఉద్యమాలకు కేంద్రబిందువుగా, మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని మేళవించి ఉద్యమించిన అరుదైన నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆ పోరాటయోధుడి అంతరంగ ఆవిష్కరణే ఈ వారం ‘లెజెండ్’... ‘మా తాత బొజ్జా గోవిందదాసు. అంటరానిత నం ఒక మహమ్మారిలా సమాజాన్ని పట్టిపీడిస్తున్న తరుణంలో ఆయన కులాన్ని జయించారు. జీవితంలోని బాధలను, కష్టాలను, కడగళ్లను, వైరాగ్యాన్ని తత్వాల రూపంలో బోధిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఆయన తత్వాలు, పాటలు, బోధనలు అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆకట్టుకున్నాయి. మానవత్వాన్ని, మానవసంబంధాల్లోని గొప్పతనాన్ని తన బోధనల ద్వారా చాటుతూ కుల రహిత సమాజాన్ని కాంక్షించిన వ్యక్తి. మా నాన్న బొజ్జా అప్పలస్వామి. దళితుల భూమికోసం, విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం జీవితాంతం ఉద్యమించిన వ్యక్తి. వీరిద్దరి ప్రభావం నాపై చాలా ఉంది. అంబేద్కర్‌తో కలిసి నాన్న.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్ప మా ఊరు. మాది మాలపల్లె. దళితుల అజ్ఞానానికి, వెనుకబాటుతనానికి, వారిపై కొనసాగుతున్న అణిచివేత, అంటరానితనానికి కారణం చదువు లేకపోవడం, వాళ్ల చేతుల్లో భూమి లేకపోవడమేనని గ్రహించిన మా నాన్న ‘ఆదిఆంధ్ర’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దళితుల చదువుల కోసం పిఠాపురం మహారాజా వారి సహాయ సహకారాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా రఘుపతి వెంకటరత్నంనాయుడు నేతృత్వంలో పనిచేసిన బ్రహ్మసమాజం మా నాన్నకు స్ఫూర్తిప్రదాతలు. ఈ క్రమంలోనే ఆయన లంక భూములు దళితులకే దక్కాలనే లక్ష్యంతో కోనసీమలో భూపోరాటాలు చేపట్టారు. 1942లో కాకినాడ పర్యటనకు విచ్చేసిన అంబేద్కర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అంబేద్కర్‌తో కలిసి పనిచేశారు. ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1952లో ఫెడరేషన్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. దళితుల కోసం పోరాడే క్రమంలో సహజంగానే అగ్రవర్ణాలతో ఘర్షణలు, కొట్లాటలు తప్పలేదు. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే నేను పుట్టి పెరిగాను. నా చదువంతా కాకినాడలోనే సాగింది. మెక్లారిన్ హైస్కూల్లో, పీఆర్ కాలేజీలో చదువుకున్నాను. అంటరానితనానికి వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లో చుట్టుపక్కల ఊర్లలో నాటకాలు వేసేవాళ్లం, పాటలు పాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేసేవాళ్లం. ఆ విద్యార్థి ఉద్యమానికి నేను నాయకుడిని. ఎస్సీ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా. ఆ రోజుల్లోనే ఎస్సీ విద్యార్థుల సమస్యలపై 30 రోజుల పాటు పెద్దఎత్తున ఆందోళన చేసి సమస్యలను పరిష్కరించుకున్నాము. లాయర్ అవుతాననుకోలేదు బీఏ(మ్యాథ్స్) చదివిన నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (మ్యాథ్స్)లో చేరాలని హైదరాబాద్ వచ్చాను. అప్పటికి మా నాన్న ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటున్నారు. ఎంఏలో సీటు రాలేదు. దాంతో నగరం నుంచి తిరిగి వెళ్లడం ఇష్టం లేక ఎల్ఎల్బీలో చేరాను. చదువు పూర్తయిన తరువాత తిరిగి కాకినాడకు వెళ్లిపోయాను. అక్కడే లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించాను. కానీ ఎంతో కాలం కొనసాగలేదు. 1968లో విజయభారతి(బోయి భీమన్న కుమార్తె)తో వివాహమైంది. ఆమె నిజామాబాద్ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. అలా నిజామాబాద్ వచ్చేశాను. నిజామాబాద్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన మొట్టమొదటి ఎస్సీ లాయర్‌ను నేను. అలాంటి రోజుల్లో పాలెం అనే ఊర్లో ఆ ఊరి భూస్వామి తన దగ్గర పని చేసే వ్యక్తిని కొట్టి చంపాడు. దీనిపై ఎవ్వరూ నోరు మెదప లేదు. అందరూ భయపడ్డారు. ‘ఇలాంటి దారుణాలను ప్రశ్నించకపోతే, దోషులకు శిక్షపడకపోతే మరిన్ని సంఘటనలు జరుగుతాయి. అమాయకులైన దళితులు బలవుతారు.’ అనే ఆలోచన నాలో కలిగింది. వెంటనే నిజామాబాద్‌లోనే ఒకలారీ మాట్లాడుకొని, నాకు తెలిసిన 50 మంది విద్యార్థులను వెంటేసుకొని పాలెం బయలుదేరాను. ఆ ఊరి దళితులు చాలా భయపెట్టారు. వెనుదిరిగివెళ్లమన్నారు. ఆ భూస్వామి చంపేస్తాడని హెచ్చరించారు. నా వెంట వచ్చిన వాళ్లకు కూడా భయం మొదలైంది. ‘చావాల్సివస్తే మొట్టమొదట నేను చస్తాను. మీరేం భయపడొద్దు రండి’అన్నాను. ఊర్లో ర్యాలీ ప్రారంభించాము. ఆ హత్యను నిరసిస్తూ పెద్దఎత్తున నిరసన సభ నిర్వహించాము. అప్పటి వరకు భయంగా ఉన్న దళితులంతా కదిలి వచ్చారు. ఈ సంఘటన వారికి గొప్ప ఆత్మస్థైర్యాన్నిచ్చింది. ఆ భూస్వామిపై న్యాయపోరాటానికి దిగాము. ఒకవైపు ఈ పోరాటం కొనసాగుతుండగానే మరోవైపు ‘అంబేద్కర్ యువజన సంఘాన్ని’ స్థాపించి అగ్రవర్ణాల దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా, అంటరానితనం నిర్మూలనే లక్ష్యంగా పోరాటాలు చేశాం. జిల్లా అంతటా అంబేద్కర్ యువజన సంఘం కార్యకలాపాలు విస్తరించాం. వర్గ, కుల పోరాటాల్లో.. దోపిడీ, పీడన, అసమానతలు అంతరించిపోవాలంటే వర్గ, కుల పోరాటాలు రెండూ ముఖ్యమైనవని ఆర్మూర్ ‘పచ్చల్నడుకుడ’ భూపోరాటం నిరూపించింది. రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు, వెనుకబడిన వర్గాలకు పంపిణీ చేసేందుకు ఈ పోరాటం చేపట్టాం. భూమి ఆ ఊరి అగ్రకులాలకు చెందిన వ్యక్తుల చేతుల్లో ఉంది. దానిని మేం స్వాధీనం చేసుకుని సాగులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోరాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో అంబేద్కర్ యువజన సంఘంతో కలిసి పనిచేసేందుకు సీపీఐ(ఎంఎల్) అనుబంధ రైతు కూలిసంఘం ముందుకు వచ్చింది. పోరాటం నడిచే రోజుల్లో ఎస్సీలు ఒక చోట, బీసీలు ఒక చోట వేరు వేరుగా కూర్చొని మధ్యాహ్న భోజనాలు చేసేవారు. పోరాటం కొనసాగిన కొద్దీ వాళ్ల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఒకే చోట కలిసి కూర్చోవడంతో మొదలైంది. ఆ తరువాత ఒకరి కూరలు ఒకరు వడ్డించుకున్నారు. కలిసి అన్నం తిన్నారు. ఆ తరువాత అక్కడే వంటలు చేసుకొని భోజనాలు చేయడంతో ఎస్సీలు, బీసీలు ఒక్కటయ్యారు. ఇండియాలో విప్లవం విజయవంతం కావాలంటే మార్క్సిజం ఎంత కీలకమైందో అంబేద్కరిజం కూడా అంతే కీలకమైందన్న నా అవగాహన ఈ ఒక్క సంఘటనలోనే కాదు.. ఆ తరువాత అనేక సంఘటనల్లోనూ రుజువైంది. చీకటి రోజుల్లో ఆ భూపోరాటం తరువాత నిజామాబాద్‌లో జరిగిన అనేక పోరాటాల్లో అంబేద్కర్ యువజనసంఘం, రైతుకూలి సంఘం కలిసి పనిచేశాయి. స్వతహాగా రచయితనైన నేను విరసంలో చేరాను. చైనా-ఇండియా ఫ్రెండ్షిప్ అసోసియేషన్లోనూ, పౌరహక్కుల సంఘంలోనూ క్రియాశీలకమైన బాధ్యతలు చేపట్టాను. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ చీకటి రోజులు వచ్చాయి. నిజామాబాద్‌లో ఉండగానే నన్ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడాది పాటు జైలు జీవితం. ఆ రోజుల్లోనే ‘నది పుట్టిన గొంతుక’ కవిత్వం రాశాను. ‘పోలీసులు అరెస్టు చేస్తే’ అనే పుస్తకం కూడా రాశాను. ఒక విప్లవకారుడి జీవితాన్ని నవలగా అక్షరీకరించాను. కానీ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు దాన్ని తీసుకురావడం సాధ్యపడలేదు. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎంఎల్) మద్దతుతో పోటీ చేశాను. కానీ ఓడిపోయాను. అప్పుడే హైదరాబాద్‌కు వచ్చేశాను. ఎమర్జెన్సీకి ముందు, తరువాత జరిగిన అన్ని కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. పదిరికుప్పం, కారంచేడు నుంచి లక్షింపేట ఘటన వరకు అన్ని ఆందోళనల్లో నేను ఉన్నాను. దళితుల ఊచకోత జరిగినా.. ఎన్కౌంటర్ పేరిట పోలీసులు నక్సలైట్లను హతమార్చినా.. ఒక నిజనిర్ధారణ కమిటీని వేసి అది ఇచ్చే నివేదిక ఆధారంగా ఉద్యమ నిర్మాణం చేపట్టాము. ఒకసారి హయత్‌నగర్ సమీంపలోని ఊర్లో ఒక దళిత వర్గానికి చెందిన కుర్రాడ్ని చంపి పొలంలో పాతిపెట్టారు. అంబేద్కర్ యువజన సంఘం ఈ దారుణాన్ని నా దృష్టికి తెచ్చింది. నేను వెళ్లి శవాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేయించాను. అలా పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసిన సంఘటన రాష్ట్రంలో అదే మొదటిది. అప్పట్లో ఇదొక పెద్ద సంచలనం. నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపైన హత్యానేరం మోపుతూ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేయాలన్న నా వాదన ప్రకంపనలు సృష్టించింది. ఆ తరువాత ఐదుగురు సభ్యుల హైకోర్టుధర్మాసనం నా అభిప్రాయాన్ని బలపరిచిన సంగతి తెలిసిందే. ‘పోలీసులు అరెస్టు చేస్తే’.. ఎమర్జెన్సీలో రాసిన ‘పోలీసులు అరెస్ట్ చేస్తే..’ పుస్తకం 1980 తరువాత పబ్లిష్ అయింది. హక్కుల ఉద్యమానికి అది మార్గదర్శకంగా నిలిచింది. ప్రతి ఒక్కరికి ప్రశ్నించడం నేర్పించింది. ఆ పుస్తకం ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా పోలీసులు 40 వేల కాపీలను తగలబెట్టారు. ‘కమాండో’పబ్లిషర్స్ దగ్గర ఉన్న మరో 30 వేల కాపీలను కొనుగోలు చేశారు. ఎవరి దగ్గరైనా ఆ పుస్తకం కనిపిస్తే చాలు కేసులు పెట్టేవాళ్లు. దాంతో ఆ పుస్తకాన్ని చాలా రహస్యంగా చదవాల్సి వచ్చేది.’అని ముగిం చారు. వ్యక్తి‘గతం’ పేరు: బొజ్జా తారకం పుట్టిన తేదీ: 27 జూన్, 1939 తల్లిదండ్రులు: బొజ్జా మావూళ్లమ్మ, అప్పలస్వామి సొంతఊరు: అమలాపురం సమీపంలోని కందికుప్ప భార్య: విజయభారతి పిల్లలు: డాక్టర్ మహిత, రాహుల్ బొజ్జా (ఐఏఎస్) రచనలు: ‘పోలీసులు అరెస్టుచేసే’్త ‘ కులం-వర్గం’, ‘నేల-నాగలి-మూడెద్దులు’ ‘పంచతంత్రం’ (నవల) ‘నది పుట్టిన గొంతుక’ -
బాలయ్య ‘లెజెండ్’ స్టిల్
-
పవర్ఫుల్ లెజెండ్
‘రేయ్... నీకు కావాల్సింది నేను. నాతో పెట్టుకో. పదిమందితో రా. పదికి పది పెంచుకుంటూ రా. పదిసార్లు రా...’ ‘సింహా’ సినిమాలో... అండర్ ప్లే చేస్తూ, బేస్ వాయిస్‌తో బాలయ్య ఈ డైలాగ్ చెబుతుంటే... థియేటర్లు విజిల్స్‌తో మోతెక్కిపోయాయి. అభిమానులైతే ఉత్సవమే చేసుకున్నారు. ఓ విధంగా ఆ సినిమాతో నందమూరి అభిమానుల ఆకలిని తీర్చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను. దాదాపు ఆరేడేళ్ల విరామం తర్వాత బాలయ్యకు వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘సింహా’. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం బాలయ్యకు రాలేదు. ఇది అభిమానులకు బాధ కలిగిస్తున్న అంశం. అందుకే.. మళ్లీ వారి మనసుల్లో ఆనందాన్ని నింపే పనిలో ఉన్నారు బోయపాటి. ‘సింహా’ను తలదన్నే పవర్ఫుల్ విజయం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారాయన. ఆ శ్రమకు ప్రతిరూపంగా ‘లెజెండ్’ తయారవుతోంది. ఫార్చునర్ కారు పక్కన కోర మీసం తిప్పి సింహంలా నిలబడ్డ బాలయ్య స్టిల్‌ను అభిమానుల కోసం కొత్త సంవత్సరం కానుకగా... నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర విడుదల చేశారు. ఇప్పటికి 80 శాతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫారిన్లో పాటలను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఫిబ్రవరిలో విడుదల చేసి, మార్చి నెలాఖరున సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
లెజెండ్ ఫస్ట్ లుక్
-
నవరస నటనాసార్వభౌముడు
నటన ఆయనకు ప్రాణప్రదం. నవరసభరితమైన నటనకు ఆయన చిరునామా. అది గంభీరమైనా, వీరమైనా, రౌద్రవమైనా ఆయన హావభావాల్లో మాత్రమే అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా సరే ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. ఆ పాత్రలకే ప్రాణప్రతిష్ట చేస్తారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలను తెలుగు ప్రేక్షక లోకానికి ఎల్లకాలం గుర్తుండిపోయేలా చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కితే... ‘యమధర్మరాజు’కు జీవం పోసిన ఖ్యాతి మాత్రం ఈయనకే దక్కింది. ఆయనెవరో కాదు కైకాల సత్యనారాయణ. నిలువెత్తు విగ్రహం. చక్కటి దేహదారుఢ్యం. గంభీరమైన అభినయం. తలపై బంగారు కిరీటం. ఒక చేతిలో భారీగద. మరో చేత్తో మెలిపెట్టే కోరమీసం. నాటి యమగోల నుంచి నేటి యమలీల వరకు యముడంటే సత్యనారాయణే. యమధర్మరాజును ఎంతో ఉన్నతంగానూ, మరెంతో హాస్యభరితంగానూ ఆవిష్కరించిన వైవిధ్యభరితమైన నటన ఆయనకే సొంతం. తెలుగు సినిమాకు ఎస్వీ రంగారావు అంతటి ప్రతినాయకుడు కైకాల. మహానటుడు ఎన్టీఆర్ నటనలోని అనేక లక్షణాలను పుణికి పుచ్చుకొని ఎదిగిన వ్యక్తి. ‘ఏదీ దానంతట అదే రాదు. కష్టపడి సాధించాలి. ఏ రంగంలోనైనా రాణించాలంటే కృషి, పట్టుదలలే పెట్టుబడి’ అని నమ్మిన కైకాల తన కెరీర్లో మొక్కవోని దీక్షతో ఎదిగారు. మంచి క్యారెక్టర్ వస్తే నటించేందుకు తాను ఎప్పటికీ సిద్ధమేనని చెబుతున్న ఆయన అంతరంగ ఆవిష్కరణే ఈ వారం‘లెజెండ్’... ‘చిన్నప్పటి నుంచే నాటకాలు వేసేవాడ్ని. పెద్ద జులపాల జుత్తు ఉండేది నాకు. నేను నాటకాలు వేసే రోజుల్లోనే అందరూ ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయంటూ అభినందించేవారు. ఎప్పటికైనా సినిమాల్లో రాణిస్తారనే వాళ్లు. నాకు సినిమాల్లో నటించాలనే అభిప్రాయం అప్పటికైతే లేదు. కానీ బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలనుకున్నాను. పదోతరగతిలో, ఇంటర్లో ‘ప్రభాకర్ నాట్యమండలి’, ‘నటరాజ కళా సమితి’పేర్లతో రాష్ర్టమంతటా నాటకాలు ప్రదర్శించాం. పదోతరగతిలోనే ‘ప్రేమ లీలలు’ అనే నాటకంలో మొదటి సారి విలన్ పాత్రలో నటించాను. దానికి బంగారు పతకం లభించింది. ‘పల్లెపడుచు’, ‘కులం లేని పిల్ల’, ‘బంగారు సంకెళ్లు’, ఆడది, సుల్తాన్ వంటి నాటకాలు ప్రదర్శించాం. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ‘ఎవరుదొంగ’ అనే నాటకంలో హీరో పాత్రలో నటించాను. మంచి గుర్తింపు లభించింది. నా నటనలో ఎన్టీరామారావు పోలికలు ఉన్నాయంటూ ప్రముఖ రంగస్థల నటులు గరికపాటి రాజారావు ఎంతగానో ప్రశంసించారు. సినిమాల్లోకి ఆహ్వానించారు. కానీ సినిమా వైపు వెళ్లకుండా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగప్రయత్నాలు ప్రారంభించాను. ఇదంతా 1954-55 నాటి సంగతి. ఉద్యోగం రాలేదు. అప్పటికే మాకు ఉన్న కలప వ్యాపారం చూసుకొనేందుకు రాజమండ్రికి వెళ్లాను. అక్కడ 3 నెలలు మాత్రమే ఉన్నాను. అక్కడి నుంచి మద్రాస్ వెళ్లాను. నా చిన్నప్పటి స్నేహితుడు కెఎల్ ధర్ 1956లో ఒక ఉత్తరం రాశాడు. సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెంటనే రమ్మని. అలా అనుకోకుండా అతని ఆహ్వానం మేరకు మద్రాస్ వెళ్లవలసి వచ్చింది. ఎన్టీఆర్ నా అన్నయ్య.. మహానటుడు ఎన్టీరామారావు నన్ను సొంత తమ్ముడిలా ఆదరించారు. ఆయనతో కలిసి చాలా చిత్రాల్లో నటించడం వల్ల ఎంతో దగ్గరయ్యాము. నన్ను ఆయన ‘తమ్ముడూ’అనే పిలిచేవారు. ఎంతో ప్రేమగా చూసుకొనే వారు. తారకమ్మ గారు కూడా సొంత మరిదిలాగానే నన్ను ఆదరించారు. సినిమా పరిశ్రమలో నాకు డీఎల్ నారాయణ కన్నతండ్రి వంటి వారైతే విఠలాచార్య పెంచిన తండ్రి. కెరీర్లో పైకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీరామారావు. ఆయన పార్టీ స్థాపించిన సమయంలో నేను, నాదెండ్ల ఇద్దరమే ఉన్నాము. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పార్టీ గురించే ఎక్కువగా చర్చించేవారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది. అప్పుడే జన్మ సార్థకమవుతుందనే వారు. ఆ తరువాత ఆయన పార్టీ పెట్టి అపూర్వమైన విజయం సాధించారు. నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కానీ నాకు ఉన్న బాధ్యతల దృష్ట్యా వెళ్లలేదు. కానీ 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం తరఫున ఎంపీగా పోటీచేసి గెలిచాను. ఆ తరువాత ప్రభుత్వం పడిపోవడం, తిరిగి చంద్రబాబు హయాంలో మరోసారి పోటీ చేయడం తెలిసిందే. కానీ అప్పుడు ఓడిపోయాను. ఇక మరో మహానటుడు అక్కినేనితోనూ నాకు చిన్నప్పటి నుంచే మంచిసంబంధాలు ఉండేవి. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. మలుపుతిప్పిన ‘సిపాయి కూతురు’.. ప్రసాద్ ప్రొడక్షన్స్‌లో సహాయ కళాదర్శకుడుగా పని చేసేవాడు ధర్. ‘కొడుకులు-కోడళ్లు’ అనే సినిమాలో నటించేందుకు నన్ను రమ్మని పిలిచాడు. కానీ నేను వెళ్లిన తరువాత ప్రసాద్ ప్రొడక్షన్స్ వాళ్లు అసలు ఆ సినిమా తీయనేలేదు. నన్ను అన్ని విధాలుగా పరీక్షించారు ప్రసాద్. సినిమాలో అవకాశం మాత్రం రాలేదు. అప్పటికే ‘రాజు-పేద’ వంటి సినిమాలు తీసిన అగ్రశ్రేణి నిర్మాత బీవి సుబ్బారావును కలిశాను. అభినయం బాగుందన్నారు. అవకాశం ఉన్నప్పుడు పిలుస్తానన్నారు. ఆ తరువాత తెలుగు చలన చిత్ర పితామహులు కేవీ రెడ్డిని కలిశాను. అప్పటికే నేను మద్రాస్ వచ్చి ఏడాది అయింది. మరో నాలుగైదు రోజుల్లో సంక్రాంతి.. ఇక సినిమాల్లో అవకాశం రాదని నిర్ణయించుకున్నాను. నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. అలాంటి సమయంలో ఆయన నాలుగు రోజులు నన్ను టెస్ట్ చేశారు. సంతృప్తి చెందారు. అవకాశాలు తప్పకుండా వస్తాయని, ఓపిగ్గా ఎదురు చూడాలని చెప్పారు. ఇంటికి వెళ్లిపోవద్దని సలహా ఇచ్చారు. ‘దేవదాసు’ చిత్ర నిర్మాత డీఎల్ నారాయణ రూపంలో ఆ అవకాశం వచ్చింది. ఆయన తీసిన ‘సిపాయి కూతురు’ సినిమాలో హీరోయిన్ జమున సరసన హీరోగా నటించాను. ఆ తరువాత మరో మూడేళ్ల పాటు ఎలాంటి అవకాశాలు రాలేదు. అప్పుడే బి.విఠలాచార్య నన్ను విలన్ పాత్రల్లో నటించమని ప్రోత్సహించారు. రాజనాల తరువాత విలన్‌గా రాణించినవాళ్లు పెద్దగాలేరన్నారు. దాంతో 1960 జనవరిలో విడుదలైన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమాలో విలన్ పాత్రలో నటించాను. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘కనకదుర్గ పూజా మహిమ’, శ్రీకృష్ణ పాండవీయం’ ఎన్టీరామారావు ద్విపాత్రాభినయం చేసిన ‘అగ్గిపిడుగు’వంటి అనేక సినిమాల్లో ప్రతి నాయకుడిగా నటించాను. ‘ఉమ్మడి కుటుంబం’ సినిమా ఒక మరిచిపోలేని అనుభూతి. ఎన్టీరామారావుకు అన్నయ్యగా జాలిగొలిపే పాత్రలో నటించాను. మంచిపేరు వచ్చింది. ‘శారద’ సినిమా నా కెరీర్లో మరో మలుపు. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చింది. కేవలం విలన్ పాత్రలే కాదు. కామెడిలో కూడా బాగా నటించగలనని చాటుకున్నాను. ‘సీతాకల్యాణం’లో రావణాసురుడిగా, ‘దానవీరశూరకర్ణ’లో భీముడిగా, ‘కురుక్షేత్రం’లో దుర్యోధనుడిగా, ‘పాండవ వనవాసం’లో ఘటోత్కచుడిగా, ‘చాణక్య చంద్రగుప్త’లో రాక్షస మంత్రిగా ‘మొల్ల’ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా ‘యమగోల’, ‘యమలీల’చిత్రాల్లో యమధర్మరాజుగా నటించాను. అన్ని రకాల పాత్రలు వేశాను. మొత్తం 772 సినిమాల్లో నటించాను. ఈ మధ్య ‘దరువు’లో కూడా యముడి పాత్రలోనే నటించాను. వ్యక్తిగతం పేరు: కైకాల సత్యనారాయణ పుట్టిన తేదీ: 25 జూలై, 1935 తల్లిదండ్రులు: సీతారామమ్మ, లక్ష్మీనారాయణ భార్య: నాగేశ్వరమ్మ సంతానం: లక్ష్మీనారాయణ, కేవీ రామారావు, పద్మావతి, రమాదేవి సేవా కార్యక్రమాలు స్వస్థలం కౌతారం(కృష్ణాజిల్లా)లో తాత పేరు మీద ‘కమ్మంమెట్టు రామయ్య మొమోరియల్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి’ కట్టించారు. గుడివాడలో ‘కైకాల సత్యనారాయణ పురపాలక కళామండపం’ నిర్మించారు. పేద విద్యార్థుల చదువులు, పెళ్లిళ్లు, ఉపాధికి సహకారం అందిస్తున్నారు. అవార్డులు.. -తాత-మనవడు, సంసారం-సాగరం, కచదేవయాని చిత్రాల్లో అత్యుత్తమ నటనకు మూడు సార్లు నంది అవార్డులు. - ప్రతిష్టాత్మక రఘుపతి వెంక య్య అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సన్మానం.. ఇలాంటివెన్నో... -
సంక్రాంతికి లెజెండ్ తొలిచూపు
‘సింహా’ సినిమాలో కనిపించిన కొత్తదనం... బాలకృష్ణ అండర్ ప్లే. ప్రేక్షకులు బాలయ్యను ఎలా చూడాలనుకుంటున్నారో, ఆయన నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ కోరుకుంటున్నారో ‘సింహ’లో ఆయన అలా కనిపించారు, ఆ విధంగా నటించారు. దర్శకుడు బోయపాటి శ్రీను చేసిన చిన్న మ్యాజిక్ అది. మళ్లీ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తే, విజయం తధ్యమని వేరే చెప్పాలా? ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు బోయపాటి. ‘లెజెండ్’లో ప్రేక్షకులకు కొత్త బాలయ్యను చూపించబోతున్నారు. ఇందులో బాలయ్య పాత్ర చిత్రణ అత్యంత శక్తిమంతంగా ఉంటుందని తెలుస్తోంది. ఆయన పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని సమాచారం. ఈ సంక్రాంతికి ‘లెజెండ్’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నారు నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. ఈ నెల 12 నుంచి ఈ చిత్రం షూటింగ్ నిర్విరామంగా హైరదాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం మాంటేజ్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. జనవరి 25 వరకూ ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రం టాకీ దాదాపుగా పూర్తవుతుందని సమాచారం. ఫిబ్రవరిలో రెండు పాటల్ని, ఒక యాక్షన్ ఎపిసోడ్‌ని, కొన్ని కీలక సన్నివేశాలను ఫారిన్లో చిత్రీకరిస్తారు. మళ్లీ హైదరాబాద్‌లో జరిపే పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. రాధికా ఆప్టే, సోనాలీ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. -
లెజెండ్ వచ్చేది ఎప్పుడు?
ఈ 30 ఏళ్లల్లో ఏడాది పాటు బాలకృష్ణ సినిమా ప్రేక్షకులను పలకరించకపోవడం ఇదే ప్రథమం. ఇంత గ్యాప్ తీసుకొని మరీ బాలయ్య ఓ సినిమా చేస్తున్నారంటే... ఆ సినిమాపై ఆటోమేటిగ్గా అంచనాలుంటాయి. పైగా బాలయ్యతో ‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, ‘దూకుడు’ లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకేటట్లు చేశాయి. ఇందులో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం. బోయపాటి శ్రీను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘లెజెండ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకూ వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించి భారీ షెడ్యూల్ చేశారు. ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలు కానుంది. జనవరి 14 వరకూ జరిగే ఈ షెడ్యూల్లో ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇదిలావుంటే... ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే... ఫిబ్రవరిలో కూడా ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని యూనిట్ సభ్యుల సమాచారం. మరి విడుదల ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటించలేదు. బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే, సోనాలీ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ప్రతినాయకునిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన జోడీగా కల్యాణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: సాయి కొర్రపాటి. -
బాలయ్యతో సై అంటున్న సమీరా
తెలుగు అమ్మాయి సమీరా రెడ్డికి కూడా చాలాకాలంగా ఛాన్స్‌లు కరువయ్యాయి. దీంతో క్రిష్ డైరెక్షన్లో వచ్చిన కృష్ణం వందే జగద్గురం సినిమాలో దగ్గుబాటి రానా సరసన సమీరా అందాలు ఆరబోసి ఆకట్టుకుంది. ఇపుడు తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య హీరోగా వస్తున్న లేజండ్ సినిమాలో మరోసారి ఐటమ్ సాంగ్‌లో మెరవడానికి రెడీ అవుతుంది. అయితే హీరోయిన్....లేదంటే కనీసం ఐటమ్బాంబ్. ఇదీ నయాట్రెండ్. హీరోయిన్లుగా పరిచయమైన భామలు ఛాన్స్‌లు లేకపోతే స్పెషల్ సాంగ్స్ చేసుకుని టైమ్‌పాస్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయాలంటే పెద్ద గగనంగా ఉండేది. ఇపుడు ట్రెండ్ మారింది. ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. మాస్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు సినిమాలో మసాలా ఐటమ్ సాంగ్ తప్పనిసరి. ఇలాంటి ప్రత్యేక గీతం లేని సినిమా ప్రస్తుతం ఉండడం లేదు. ఫామ్‌లో ఉన్న హీరోయిన్ చేసి మాస్ మసాలాతో అందాల ఆరబోస్తే రిపీటెడ్ ప్రేక్షకులను రప్పించవచ్చేనేది సక్సెస్ మంత్రగా మారింది. అందుకే హీరోయిన్లు అడపాదడపా ఇలాంటి స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిపోతున్నారు. అప్పట్లో కొంతమంది డైరెక్టర్లు మాత్రమే ఈ స్పెషల్ సాంగ్స్‌ను వాడే వారు. హీరోయిన్లుగా పరిచయం అయ్యి రెండు మూడు సినిమాల తర్వాత ఛాన్స్‌లు తక్కువైతే ఐటమ్ సాంగ్‌లు చేయడానికి కూడా వెనుకాడడం లేదు ఈ భామలు. గతంలో కొమరం పులితో హీరోయిన్గా పరిచయమైన నికిషాపటేల్కు పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా కాలం గ్యాప్ వచ్చింది. దీంతో తమిళంలో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయింది. మరో హీరోయిన్ శృతీహాసన్ ఈ పాటకు గాత్రం అందించింది. శ్రియ కూడా ఐటం సాంగ్స్‌లో నర్తించిన విషయం తెలిసిందే. -
సాగర తీరంలో బాలయ్య సరాగాలు
సింహా, శ్రీరామరాజ్యం తర్వాత బాలకృష్ణ చేసిన సినిమాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవనే చెప్పాలి. బాలయ్య సినిమాకు అన్నీ కుదిరితే.. ఆ సక్సెస్ ప్రభావం బాక్సాఫీస్‌పై చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకు ఆయన గత విజయాలే నిదర్శనాలు. ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ‘లెజెండ్’ సినిమా కథ... బాలయ్య అభిమానులు పండగ చేసుకునే రీతిలో చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. మొన్నటివరకూ సాగరతీరంలో బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం బాలయ్య, కథానాయిక రాధికా ఆప్టేపై ఓ పాటను షూట్ చేస్తున్నారు. ఈ నెల 21 దాకా ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 3 వరకూ జరిగే చిత్రీకరణతో ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తవుతుంది. జనవరిలో బాలకృష్ణ, చిత్ర కథానాయికలతో పాటు ఓ గెస్ట్ కథానాయికపై చిత్రీకరించే పాట ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని యూనిట్ వర్గాల భోగట్టా. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. -
ఇంటర్నెట్ లో 'లెజెండ్' బైక్ మేకింగ్ హల్ చల్!
టాలీవుడ్ చరిత్రలో ఓ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ బైక్ ను డిజైన్ చేయించిన దాఖలాలేవి లేవు. తొలిసారిగా నందమూరి బాలకృష్ణ చిత్రం కోసం ఓ బైక్ ను డిజైన్ చేయించారు బోయపాటి శ్రీను. వర్దెంచి మోటార్ సైకిల్ ను సిల్లీ మాంక్స్ వారు తయారు చేశారు. ఈ బైక్ కు కెపాసిటీ 500 సీసీ, 41.3 ఎన్ఎమ్ టార్క్, 27.2 బీహెచ్ పీ సిట్టింగ్, 300 ఎంఎం వైడ్ రియర్ టైర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బైక్ కు సినిమా పేరు 'లెజెండ్'ను పెట్టారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటిలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత బైక్ ను వేలానికి పెట్టనున్నట్టు చిత్రానికి సంబంధించిన వారు తెలిపారు. వరాహి చలన చిత్రం బ్యానర్ పై 14 రిల్స్ సంస్థ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తొలిసారిగా సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రాధికా ఆంప్టే నటిస్తోంది. -
హీరో బాలకృష్ణకు స్వల్ప గాయాలు
విశాఖ : ప్రముఖ నటుడు బాలకృష్ణ షూటింగ్లో స్వల్పంగా గాయపడ్డారు. సింహాచలంలో జరుగుతున్న 'లెజెండ్' చిత్ర షూటింగ్లో భాగంగా బుధవారం ఉదయం ఆయన మోచేతికి స్వల్పంగా గాయం అయినట్లు సమాచారం. దాంతో బాలకృష్ణను విశాఖలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన మళ్లీ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'లెజెండ్' చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణని పవర్ ఫుల్ గా చూపించనున్నారు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. -
హర్లే డెవిడ్సన్ బైక్‌పై బాలయ్య
చెన్నై: హీరో నందమూరి బాలకృష్ణ హర్లే డెవిడ్సన్ మోటార్ బైక్‌పై దూసుకుపోనున్నాడు. 'లెజెండ్' సినిమాలో బాలయ్య ఈ ఫీట్ చేయనున్నాడు. ప్రత్యేకంగా తయారుచేసిన పసుపు రంగు హర్లే డెవిడ్సన్ బైక్‌పై ఆయన ఓ పాటలో కనిపించనున్నారు. దీన్ని తయారుచేయడానికి రూ.20 లక్షలు ఖర్చు చేశారు. 'లెజెండ్'లో ఓ పాట కోసం దీన్ని స్పెషల్‌గా తయారు చేయించారని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. 'లెజెండ్' సంక్రాంతికి సందడి చేయనున్నాడు. 'సింహా' తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. -
వేదాలలో ఏముంది?
సత్యస్వరూపమైన భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానానికే వేదం అని పేరు. పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాల మాదిరి ఇవి ఒకరు రాసినవి కావు. అందుకే వీటిని అపౌరుషేయాలు అన్నారు. అంటే మానవుడు చెప్పింది కాదు అని అర్థం. అలాగే వీటికి లిపి ఉండదు. అనాదిగా ఒకరి నుంచి మరొకరికి వాక్కు రూపంలో అందుతూ వస్తున్నాయి కాబట్టి శృతులని పేరు. అంటే ఋషులు తీవ్రమైన తపోనిష్ఠలో ఉన్నప్పుడు ఆకాశవాణి రూపంలో వీటిని విని, అక్షరబద్ధం చేశారు. అలా వేదం నిరంతర ప్రవాహంగా, అనంతంగా సాగిపోయింది. ఈ అనంతమైన వేద విజ్ఞానాన్ని వ్యాసుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు భాగాలుగా విభజించాడు. అందుకే ఆయనకు వేదవ్యాసుడని పేరు. ఈ వేదరాశులు అనాగరిక మానవుని కాలం నుంచి నిష్కల్మషంగా, నిర్మలంగా ప్రవహిస్తూ, మానవుని మలిన రహితునిగా చేసి, మేధోవంతునిగా, సంస్కారవంతునిగా తీర్చిదిద్దుతూ వస్తున్నాయి. వేదాలను అర్థం చేసుకోవడానికి మహర్షులు ఆరు వేదాంగాలను, నాలుగు ఉపవేదాలను అందులో భాగం చేశారు. శిక్ష, వ్యాకరణం, నిరుక్తం లేదా నిఘంటు. ఛందస్సు, జ్యోతిషం, కల్పం... ఈ ఆరూ వేదాంగాలు. గాంధర్వవేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థవేదం అనే నాలుగూ ఉపవేదాలు. వేదార్థాలను తెలుసుకోవడానికి వేదాలు మంత్రభాగం. అంటే వాటిలో మంత్రాలు మాత్రమే ఉంటాయి కాని, క ర్మ విధానం ఉండదు. ఋగ్వేదం వాక్కు ప్రధానంగా కలది. అది ప్రజలకు చేరడానికి సంధానకర్తగా పైలుడనే రుషి వ్యవహరించాడు. అతి ప్రాచీనమైనది ఋగ్వేదమే. ఋగ్వేదంలో ఉండే మంత్రాలకి ఋక్కులని పేరు. ఇవి ఛందోబద్ధంగా ఉంటాయి. రెండవది యజుర్వేదం. ఇంద్రియాలతో కర్మలు చేసే విధానం తెలిపేది. దీనిని మానవులకు అందించింది వైశంపాయన మహర్షి. యజ్ఞయాగాదుల గురించిన వివరణ ఇందులో ఉంటుంది. ఇందులో రెండు భాగాలున్నాయి. అవి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం మూడవది సామవేదం. సామం అంటే గానం అని అర్థం. అంటే సామవేదం సంగీతానికి సంబంధించింది. ఇది అన్ని వేదాలలోకీ చిన్నది. దీనిని జైమిని ముని వ్యాపింపచేశాడు. నాలుగవది అధర్వణ వేదం. దీనిలో యుద్ధవిద్యలు, పౌరధర్మాలు, ఆరోగ్యం, మూలిక చికిత్స, రాజ్యం, రాజ్యాంగం, రాజకీయవ్యవస్థల గురించిన వర్ణనలు, అనేకరకాలైన చికిత్స విధానాలు ఉంటాయి. దీని నిర్వహణ కోసం వేదవ్యాసుడు సుమంతుడనే ఋషిని నియమించాడు. అసలు వేదాలలో ఏమేం ఉంటాయో తెలిపేవే పురాణాలు. వేదాన్ని కథలు కథలుగా వివరిస్తూ, వర్ణనాత్మకంగా చెప్పేవే ఇతిహాసాలు. అనంతమైన విజ్ఞానాన్ని నిబిడీకృతం చేసుకున్న వేదాలు మానవుని ఐహిక, పారమార్థిక, ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ ప్రవచించాయి. సత్యధర్మాలతో గడిపే జీవనమార్గానికి అనేక మంత్రాలు, స్తోత్రాల రూపంలో మనకు అందించాయి. అవే యజ్ఞయాగాదులు, పూజలు, ప్రార్థనలు, వ్రతాలు, మొక్కులుగా మారాయి. వేదాల చివరి భాగాలనే వేదాంతాలని, వేదసూత్రాలని అంటారు. వీటికే ఉపనిషత్తులని కూడా పేరు. ఇవి... వేదాలు, ఉపాంగాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నాయి. - కూర్పు: డి.వి.ఆర్