
హీరో బాలకృష్ణకు స్వల్ప గాయాలు
విశాఖ : ప్రముఖ నటుడు బాలకృష్ణ షూటింగ్లో స్వల్పంగా గాయపడ్డారు. సింహాచలంలో జరుగుతున్న 'లెజెండ్' చిత్ర షూటింగ్లో భాగంగా బుధవారం ఉదయం ఆయన మోచేతికి స్వల్పంగా గాయం అయినట్లు సమాచారం. దాంతో బాలకృష్ణను విశాఖలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన మళ్లీ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
కాగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న 'లెజెండ్' చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణని పవర్ ఫుల్ గా చూపించనున్నారు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.