కోలీవుడ్ నటుడు లెజెండ్ శరవణన్ చాలా రోజుల తర్వాత మళ్లీ సందడి చేశారు. 2022లో 'లెజెండ్' మూవీ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య ఓసారి కొత్త ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా మరో సినిమాకు రెడీ అయిపోయాడు. తాజాగా షూటింగ్‌కు వెళ్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విటర్‌లో షేర్ చేశారు.
గతంలో వచ్చిన లెజెండ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా నటించింది. ఇందులో కథానాయికగా నటించేందుకు ఊర్వశి రౌతేలాకు భారీగానే రెమ్యునరేషన్ చెల్లించారు. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది.
తాజా చిత్రాన్ని హార్బర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లెజెండ్ శరవణన్ సరసన పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆండ్రియా, కిక్ శామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ సంగీతమందించనుండగా.. 2025 ఏప్రిల్‌లో ఈ చిత్రం పెద్ద ప్రేక్షకుల ముందుకు రానుంది.
(ఇది చదవండి: 'జైలర్' పాటకు స్టెప్పులేసిన లెజెండ్.. డిఫరెంట్ గెటప్!)
కాగా.. స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన శరవణన్‌కు తమిళనాడులో చాలా క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. అలానే తన బ్రాండ్‌కి తానే బ్రాండ్ అంబాసిడర్. గతంలో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్‌లో యాక్ట్ చేశాడు. దీంతో హీరో కావాలని 'లెజెండ్' పేరుతో ఓ సినిమా తీశాడు.
எனது அடுத்த படத்தின் படப்பிடிப்புக்காக #தூத்துக்குடி செல்லும் முன் ஊடகம் மற்றும் பத்திரிகையாளர் நண்பர்களை சென்னை விமான நிலையத்தில் சந்தித்த போது#LegendsNext #LegendSaravanan pic.twitter.com/RUWeGRYPKG
— Legend Saravanan (@yoursthelegend) September 15, 2024
Comments
Please login to add a commentAdd a comment