Saravanan
-
లెజండ్ శరవణన్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరో తెలుసా..?
తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 'లెజెండ్ శరవణన్' కథానాయకుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించి నిర్మించిన 'ది లెజెండ్' చిత్రం గత 2022లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతాల కథానాయక నటించారు. కాగా లెజెండ్ శరవణన్ ఇప్పుడు హీరోగా, నిర్మాతగా మరో ప్రయత్నం చేస్తున్నారు. దీనికి దురైసెంథిల్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ కథానాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పటికే హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో నటించి పాపులర్ అయ్యారు. అదే విధంగా తమిళనాడులో ఇప్పటికే ఒక చిత్రంలో నటిస్తున్నారు. కాగా శరవణన్ సరసన నటించేది ఈమెకు రెండవ చిత్రం అవుతుంది. అదేవిధంగా ఇందులో ఆండ్రియా, శ్యామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చైన్నె పరిసర ప్రాంతాల్లో తొలిషెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్రం యూనిట్ ఆదివారం తూత్తుకుడి బయలుదేరారు. ఈ సందర్భంగా చైన్నె విమానాశ్రయంలో శరవణన్ మీడియాతో మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం మంచి విజయాన్ని సాధించిందని అదేవిధంగా మంచి యాక్షన్ ఎంటర్టెయినర్గా రూపొందుతున్న ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇటీవల విడుదలైన మహారాజా, గరుడన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని, అదేవిధంగా దర్శకుడు దురైసెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
లెజెండ్ శరవణన్.. మళ్లీ వచ్చేస్తున్నాడు!
కోలీవుడ్ నటుడు లెజెండ్ శరవణన్ చాలా రోజుల తర్వాత మళ్లీ సందడి చేశారు. 2022లో 'లెజెండ్' మూవీ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య ఓసారి కొత్త ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా మరో సినిమాకు రెడీ అయిపోయాడు. తాజాగా షూటింగ్‌కు వెళ్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విటర్లో షేర్ చేశారు.గతంలో వచ్చిన లెజెండ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా నటించింది. ఇందులో కథానాయికగా నటించేందుకు ఊర్వశి రౌతేలాకు భారీగానే రెమ్యునరేషన్ చెల్లించారు. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది. తాజా చిత్రాన్ని హార్బర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లెజెండ్ శరవణన్ సరసన పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆండ్రియా, కిక్ శామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ సంగీతమందించనుండగా.. 2025 ఏప్రిల్‌లో ఈ చిత్రం పెద్ద ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇది చదవండి: 'జైలర్' పాటకు స్టెప్పులేసిన లెజెండ్.. డిఫరెంట్ గెటప్!)కాగా.. స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన శరవణన్‌కు తమిళనాడులో చాలా క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. అలానే తన బ్రాండ్‌కి తానే బ్రాండ్ అంబాసిడర్. గతంలో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్‌లో యాక్ట్ చేశాడు. దీంతో హీరో కావాలని 'లెజెండ్' పేరుతో ఓ సినిమా తీశాడు.எனது அடுத்த படத்தின் படப்பிடிப்புக்காக #தூத்துக்குடி செல்லும் முன் ஊடகம் மற்றும் பத்திரிகையாளர் நண்பர்களை சென்னை விமான நிலையத்தில் சந்தித்த போது#LegendsNext #LegendSaravanan pic.twitter.com/RUWeGRYPKG— Legend Saravanan (@yoursthelegend) September 15, 2024 -
లెజెండ్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కాస్తా లేటయింది అంతే!
లెజెండ్ శరవణన్ ఈ పేరు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఒకే ఒక్క సినిమాతో ఎంట్రీ అందరినీ ఆకట్టుకున్నారు. వ్యాపారవేత్త అయినప్పటికీ నటనపై మక్కువతో లెజెండ్ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కానీ శరవణన్‌కు మాత్రం ఓ రేంజ్ గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత కాస్తా సైలెంట్ అయిన ఆయన.. మళ్లీ వార్తల్లో నిలిచాడు. మరో చిత్రం చేసేందుకు రెడీ అయిపోయారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: సలార్‌తో సై అంటున్న వివేక్ అగ్నిహోత్రి.. బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా?) ఆగస్టు 15న 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లెజెండ్ శరవణన్ తమిళనాడులోని ఓ పాఠశాలలో ప్రత్యక్షమయ్యారు. పిల్లలతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్న శరవణన్.. వారందరికీ గిఫ్ట్స్ అందజేశారు. అంతేకాకుండా పిల్లలతో కలిసి జైలర్ చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. అంతేకాకుండా ఆయన ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. కాగా మీరు మళ్లీ ఎప్పుడు చిత్రంలో నటిస్తారు? అని పిల్లలు అడగడంతో.. త్వరలోనే కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కథ రెడీ కావడానికి కాస్తా టైం పట్టిందని లెజెండ్ శరవణన్ ప్రకటించారు. చిన్న పిల్లల మధ్య ఈ విషయాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ తాజా చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. (ఇది చదవండి: జవాన్ ప్రమోషన్లలో కనిపించని నయనతార.. అసలేమైంది?) அடுத்த படத்தின் அப்டேட்டை குழந்தைகளுடன் பகிர்ந்த தருணம்#Legend #Legendsaravanan @yoursthelegend pic.twitter.com/LocspXpDuX — Legend Saravanan (@yoursthelegend) August 15, 2023 -
'జైలర్' పాటకు స్టెప్పులేసిన లెజెండ్.. డిఫరెంట్ గెటప్!
లెజెండ్ శరవణన్.. చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించాడు. గతేడాది 'లెజెండ్' మూవీతో ఎంటర్టైన్ చేసిన ఇతడు.. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య ఓసారి కొత్త ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా రజనీ 'జైలర్' పాటకు స్టెప్పులేస్తూ కనిపించాడు. అయితే డిఫరెంట్ గెటప్‌తో ఉండేసరికి నెటిజన్స్ తొలుత గుర్తుపట్టలేదు. కానీ ఆ తర్వాత మాత్రం వీడియోని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన శరవణన్‌కు తమిళనాడులో చాలా క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. అలానే తన బ్రాండ్‌కి తానే బ్రాండ్ అంబాసిడర్. గతంలో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్‌లో యాక్ట్ చేశాడు. దీంతో హీరో కావాలని 'లెజెండ్' పేరుతో ఓ సినిమా తీశాడు. గతేడాది విడుదలైన ఈ మూవీ టాక్ ఏంటనేది పక్కనబెడితే ట్రోల్స్ మాత్రం విపరీతంగా వచ్చాయి. 'లెజెండ్' తర్వాత బయటపెద్దగా కనిపించని శరవణన్.. మళ్లీ ఇన్నాళ్లకు అది కూడా డిఫరెంట్ గెటప్‌లో ప్రత్యక్షమయ్యాడు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు చిన్నారులకు గిఫ్ట్స్ ఇచ్చిన ఇతడు.. ఆ తర్వాత 'జైలర్'లోని హుకుమ్ పాటకు స్టెప్పులేసి అలరించాడు. అందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ లోనే పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అయింది. పలువురు నెటిజన్స్ ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. அடுத்த படத்தின் அப்டேட்டை குழந்தைகளுடன் பகிர்ந்த தருணம்#Legend #Legendsaravanan @yoursthelegend pic.twitter.com/LocspXpDuX — Legend Saravanan (@yoursthelegend) August 15, 2023 (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!) -
ఎంట్రీతోనే బిగ్ డిజాస్టర్.. అయినా తగ్గట్లేదుగా హీరో!
ప్రముఖ బిజినెస్మెన్ అరుల్ శరవణన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'ది లెజెండ్'. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అప్పట్లో హీరోగా శరవణన్ ఎంట్రీ ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే తాజాగా కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు శరవణన్. ట్రోలర్స్‌కు చెక్ పెట్టేందుకే న్యూ లుక్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో గడ్డం, మీసాలతో శరవణన్ కాస్తా డిఫెరెంట్ లుక్‌లో కనిపించారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలంటే శరవణన్‌కు పిచ్చి బిజినెస్మెన్ అయిన శరవణన్‌కు సినిమాలంటే పిచ్చి. తెరపై కనిపించాలన్నదే ఆయన కోరిక. అందువల్లే శరవణ స్టోర్స్ యాడ్‌లో కూడా తానే నటించాడు. స్టార్ హీరోయిన్లతో కలిసి తన బిజినెస్ బ్రాండ్లకు పబ్లిసిటీ ఇస్తుంటారు. గతేడాది జులైలో విడుదలైన ది లెజెండ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా శరవణన్ ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. తాజా లుక్ చూస్తే మరోసారి స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించేందకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ది లెజెండ్ సినిమాలో ఆయన నటించడంపై నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేశారు. కాగా.. ది లెజెండ్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. New Transition… Details Soon…#Legend #TheLegend #LegendSaravanan #NewEraStarts pic.twitter.com/gws9HR7j8O — Legend Saravanan (@yoursthelegend) March 13, 2023 -
వ్యక్తిగతంగానూ, ఫోన్ చేసి మరి విమర్శించారు: ‘ది లెజెండ్’ హీరో శరవణన్
తమిళ సినిమా: లెజెండ్ శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ వ్యాపార వేత్త, శరవణా స్టోర్స్ సంస్థల అధినేత అయిన ఈయన, ఆర్ సంస్థల ప్రచార చిత్రాల ద్వారా బహుళ ప్రాచుర్యం పొందాయి. ఆ ప్రచార చిత్రాల్లో బాలీవుడ్, సౌత్ ఇండియన్ హీరోయిన్లతో డాన్స్ చేసి సాధారణ ప్రజలకు దగ్గరయ్యారు. తరువాత ఆయన సినిమాలపై గురిపెట్టారు. అలా ది లెజెండ్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవ్వడంతో పాటు నిర్మాతగానూ అడుగు పెట్టారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌథేలా ఇందులో హీరోయిన్గా నటించారు. భారీ బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. శుక్రవారం నుంచి డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా తనకు ప్రారంభ దశ నుంచి ప్రచార మీడియా పెద్ద సపోర్ట్‌గా నిలిచిందన్నారు. అదే విధంగా తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ది లెజెండ్ విడుదలై మిశ్రమ స్పందనతో ప్రదర్శిత మవుతోందన్నారు. ఆ చిత్రానికి విమర్శల ద్వారా మీ విశ్లేషణలను తమ మీడియా ద్వారా పొందుపరిచారన్నారు. కొందరు వ్యక్తిగతం గానూ, ఫోన్ చేసి చెప్పారన్నారు. విమర్శలే విజయానికి తొలిమెట్టుగా భావించి తాను ముందడుగు వేస్తున్నానన్నారు. కాగా తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తొలి ప్రయత్నంగా సామాజిక పరమైన అంశంతో కుటుంబ కథాచిత్రంలో నటించిన లెజెండ్ శరవనన్ ఈ సారి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసిన ది లెజెండ్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
తమిళ బడా వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. 53 ఏళ్ల శరవణన్ గతేడాది ‘ది లెజెండ్’ అనే పాన్ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో రిచ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. 50వ ఏటా హీరోగా మారిన శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆయనే స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమాకి స్టార్ టెక్నికల్ టీమ్‌ను నియమించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కి రెడీ అయ్యింది. విడుదలైన ఏడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత గతేడాది జూలైలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు(మార్చి 3న) ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ది లెజెండ్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. కాగా ఇందులో శరవణన్ సరసన లక్ష్మిరాయ్, బాలీవుడ్ బ్యూటీ, పాపులర్ మోడల్ ఊర్వశి రౌటేలా హీరోయిన్లుగా నటించారు. శరవణన్ స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమాని జేడీ-జెర్రీ దర్శకద్వయం తెరకెక్కించగా.. రఘువరన్ బిటెక్ ఫేమ్ ఆర్. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ, హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. చదవండి: కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ Streaming Blasting from 12:30PM⚡️ 💥💫✨#Legend streaming in @DisneyPlusHS from Today 12.30 PM#LegendinDisneyHotstar#Tamil #Telugu #Malayalam #Hindi @yoursthelegend #Legend #TheLegend #LegendSaravanan @DirJdjerry @Jharrisjayaraj @thinkmusicindia @onlynikil #NM pic.twitter.com/FmRgRncylT — Legend Saravanan (@yoursthelegend) March 3, 2023 -
లవర్ బాయ్‌గా ‘ది లెజెండ్’ హీరో శరవణన్
శరవణా స్టోర్స్ అధి నేత శరవణన్ ‘ది లె జెండ్’ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. జేడీ, జెర్రీల ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సొంతంగా నిర్మించారు. తొలి చిత్రంతోనే కమర్షియల్ ఫార్ములా కథను ఎంపిక చేసుకుని మాస్ హీరోగా పరిచయమైన శరవణన్ ది లెజెండ్ చిత్రాన్ని భారీగా ఖర్చు చేసి నిర్మించారు. ఆయనకు సపోర్టుగా ప్రముఖ తారాగణాన్నే సెట్ చేసుకున్నారు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని నటించి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. అయినా ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో చిత్రం భారీ నష్టాన్ని మూటకట్టుకుందనే ప్రచారం జరిగింది. అయితే తొలి ప్రయత్నం విఫలమైనా చలించక శరవణన్ మరో ప్రయత్నానికి సిద్ధమయ్యారన్నది తాజా సమాచారం. యాక్షన్ హీరోగా నటించిన ఈయన ఈసారి లవర్‌బాయ్‌గా మారిపోతున్నారట. అందుకు తగ్గట్టుగా కథను సిద్ధం చేయాల్సిందిగా ఒక దర్శకుడికి చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిసింది. -
‘లెజెండ్’హీరో షాకింగ్ నిర్ణయం..ఈ సారి ఎన్ని కోట్లు పెడతాడో?
తమిళ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. 53 ఏళ్ల శరవణన్ ఇటీవల ‘లెజెండ్’అనే పాన్ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో రిచ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అంతే కాదు శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. హీరో కాదు కదా కనీసం సైడ్ క్యారెక్టర్ చేయడానికి కూడా శరవరణన్ పనికిరాడని నెటిజన్స్ విమర్శించారు. భారీ నష్టంతో పాటు విమర్శలు కూడా రావడంతో ఇక శరవణన్ సినిమాల జోలికి రాకుండా తన వ్యాపారాలను మాత్రమే చూసుకుంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తిప్పికొడుతూ తాజాగా శరవరణన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన మరో సినిమాకు సిద్దమవుతున్నాడు. (చదవండి: నయనతార ఆస్తుల విలువ ఎంతో తెలుసా?) కోలీవుడ్ సమాచారం ప్రకారం.. శరవణన్ నుంచి త్వరలోనే కొత్త సినిమా ప్రకటన రాబోతుందట. ఈ సారి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను పకరించబోతున్నాడట. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో చర్చలు జరిపి, కథను ఫైనల్ చేశారట. త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేయబోతున్నారు. అన్నట్లు.. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమేనట. మరి దీనికి లేటు వయసు హీరో ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో చూడాలి. -
ఒక్క సినిమాకు రూ. 20 కోట్లు తీసుకున్న హీరోయిన్!
Urvashi Rautela Charged Rs 20 Crores For The Legend Movie: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకంటే హీరోలు అధిక పారితోషికం తీసుకోవడం సాధారణమే. హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకునే ముద్దుగుమ్మలు మాత్రం చాలా అరుదు. అయితే స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా రెమ్యునరేషన్‌ను ఓ హీరోయిన్ తీసుకుందన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ 2015 మిస్ యూనివర్స్ దివా కిరీటాన్ని సొంతం చేసుకుంది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకుంది. ఊర్వశీ రౌటేలా తాజాగా 'ది లెజెండ్' సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుళ్ 51 ఏళ్ల వయసులో హీరోగా నటించాడు. న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి జేడి-జెయర్ ద్వయం దర్శకత్వం వహించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హరీశ్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా జులై 28న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించినందుకు ఊర్వశీ రౌటేలా రూ. 20 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకుందని ఇటు కోలీవుడ్‌లో, అటు బాలీవుడ్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటివరకు ఏ తమిళ హీరోయిన్‌కు అందని పారితోషికం ఊర్వశీకి తీసుకుందన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ వార్తలను ఊర్వశీ రౌటేలా టీమ్ సన్నిహితం వర్గం ఖండించింది. ఈ వార్తలు అవాస్తవమని, ఊర్వశీ రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపింది. ఒకవేళ ఇదే నిజమైతే తమిళ ఇండస్ట్రీలో అత్యంత భారీ పారితోషికాన్ని అందుకున్న హీరోయిన్గా ఊర్వశీ రికార్డుకెక్కేది. కాగా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార తన రాబోయే చిత్రాలకు రూ. 10 కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం. -
హీరోగా మారిన సక్సెస్ఫుల్ బిజినెస్ మేన్..
‘‘చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్‌పై ఆసక్తి ఉంది. కానీ మా లైఫ్‌స్టైల్, బిజినెస్ వేరు. బిజినెస్‌లో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు అవకాశం రావడంతో ఈ సినిమా చేశాను. నటనకు వయసు అనేది అడ్డంకి కాదని భావిస్తున్నాను’’ అని శరవణన్ అన్నారు. శరవణన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ది లెజెండ్’. జేడీ–జెర్రీ ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌటేలా హీరోయిన్గా నటించారు. ఈ నెల 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శరవణన్ మాట్లాడుతూ.. ‘‘ఓ కామన్‌మేన్ ఎలా లెజెండ్‌గా ఎదిగాడు ? జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు ? అన్నదే లెజెండ్ కథ’’ అని తెలిపారు. ‘‘శరవణన్‌గారు సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్. అయితే ఒక నటుడిగా ఆయన కమిట్మెంట్ ఎంత బాగుందనేది స్క్రీన్‌పై చూస్తారు’’ అన్నారు దర్శకద్వయం జెడీ, జెర్రీ. ‘‘తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్‌ను ఎప్పుడూ ఆదరిస్తారు. ‘ది లెజెండ్’ కథ కొత్తది. ఒక సక్సెస్ఫుల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అని ఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ గుర్తుపట్టడంతో భయపడి పరిగెత్తిన స్టార్ హీరో.. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
కోర్టు మెట్లు ఎక్కిన సాయిపల్లవి.. రియల్ లైఫ్‌లో కాదులెండి!
హీరోయిన్ సాయిపల్లవి కోర్టు మెట్లు ఎక్కారు. అయితే రియల్ లైఫ్‌లో కాదులెండి. రీల్ లైఫ్‌లో. ఇంతకీ ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? ఏ విషయంలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు? అనే విషయాలు తెలియాలంటే ‘గార్గి’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. కాలి వెంకట్, శరవణన్ కీలక పాత్రధారులు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక సమర్పిస్తున్నారు. రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జి, గౌతమ్ రామచంద్రన్ నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 15న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘కోర్టు డ్రామాగా రూపొందిన చిత్రం ‘గార్గి’. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 15న విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
లెజెండ్ శరవణన్ హీరోగా ‘ది లెజెండ్’మూవీ, ట్రైలర్ విడుదల
ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై ది లెజెండ్ చిత్రాన్ని నిర్మిస్తునండమే కాక ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జేడి-జెయర్ ద్యయం దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి హారిశ్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. వేల్రాజ్ ఛాయగ్రణం అందిస్తున్నారు. నిరమ్ణ క్యాక్రమాలను పూర్తి చేసుకుని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్స్ తమన్నా, హన్సిక, పూజా హెగ్డే, శ్రద్ధాశ్రీనాథ్, రాయ్ లక్ష్మితో పాటు నటులు ప్రభు, నాజర్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందరంగా ఈ చిత్ర కథానాయకుడు, నిర్మాత లెజెండ్ శరవణన్ మాట్లాడుతూ.. సినీ రంగంలో రజనీకాంత్, విజయ్ తనకు రోల్ మోడల్ అన్నారు. తనపై విర్మశలు చేసే వారి గురించి బాధపడనన్నారు. కమర్షియల్ అంశాలన్నీ ఉన్న ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. -
మేయరైన ఆటోవాలా
చెన్నై: తమిళనాడులోని కుంభకోణం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కే. శరవణన్ ఎన్నికయ్యారు. వృత్తిరీత్యా ఆయన ఆటో డ్రైవర్. మేయర్‌గా ఎన్నికవడం తనకు సంతోషమేనని, అయితే ప్రజలకు సేవ చేస్తూ ఆటో నడపడంలో మరింత ఆనందం ఉందని ఆయన చెప్పారు. మేయర్‌గా పదవీ స్వీకారం చేసిన తర్వాత నగరంలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడంపై దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన 17వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది. (చదవండి: ఆ ఊరిలో మగవాళ్లకు ఇల్లే లేదు! ప్రతి ఇల్లు మహిళలదే) -
నోరు జారారు.. బయటకు పంపారు
చెన్నై ,పెరంబూరు: ఎవరన్నారండీ స్త్రీని అబల అని. ఆమె అబల కాదు. పవర్. టచ్ చేసి చూడు.మటాషే. ఏంటీ ఇంకా స్త్రీ అబల కాదంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఎప్పుడో ఏ అమ్మాయిలనో టచ్ చేసిన ప్రముఖ సినీ నటుడికి అప్పుడు ఎలాంటి అపరాధం కానీ, అవమానం కానీ జరగలేదు. అయితే అది వెంటాడుతుందన్న విషయం తనకే తెలియలేదు. అయితే తన నోట దురుసు కారణంగానే అప్పటి తప్పునకు ఇప్పుడు ఫలితాన్ని అనుభవించాడు. అలా నోరుజారాడు తమిళ నటుడు శరవణన్. దీని మూలాలలోకి వెళితే కారణం నటుడు కమలహాసనే అవుతారు. ఆయన వ్యాఖ్యాతగా ఒక ప్రైవేట్ చానల్లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 3లో పాల్గొన్న వారిలో నటుడు శరవణన్ ఒకరు. బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో ప్రతి శని, ఆదివారాల్లో వ్యాఖ్యాత అయిన కమలహాసన్ ముచ్చటిస్తుంటారు. అలా ఇటీవల బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న దర్శకుడు చేరన్ ఒక టాస్క్‌లో అసభ్యంగా ప్రవర్తించాడంటూ మరో సభ్యురాలు నటి మీరా మిథున్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఈ సంఘటన గురించి చర్చ వచ్చినప్పుడు కమలహాసన్.. చేరన్‌కు మద్దతుగా నిలవడమే కాకుండా, నటి మీరామిథున్‌ను తప్పు పట్టారు. నటుడు శరవణన్ అంతటితో ఆగలేదు. అలాంటి సంఘటనలకు నిజ జీవితంలో ఎవరైనా పాల్పడ్డారా? అని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ప్రశ్నించారు. దీంతో నటుడు శరవణన్ లేచి తాను కళాశాలలో చదువుతున్నప్పుడు బస్సులో అమ్మాయిలను టచ్ చేసేవాడినని చెప్పాడు. ఆయన మాటలకు కమలహాసన్‌తో పాటు ఇంటి సభ్యులు నవ్వుకున్నా, బాహ్య ప్రపంచంలో శరవణన్ మాటలు తీవ్ర ప్రభావాన్నే చూపాయి. శరవణన్ మాటలకు మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక ఇలాంటి విషయాలపై వెంటనే స్పందించే సంచలన గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి తీవ్రంగా ఖండించారు. స్త్రీలను బలవంతం చేయడానికే నేను బస్సులో ప్రయాణం చేసేవాడిని అని శరవణన్ చెప్పారని, ఇది ప్రేక్షకులకూ, మహిళలకు హాస్యంగా అనిపించిందని, నిజానికి ఆయన మాటలు చాలా హీనంగా ఉన్నాయని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో నటుడు సరవణన్ క్షమాపణ చెప్పక తప్పలేదు. అయితే జరగాల్సిందేదో అప్పటికే జరిగిపోయ్యింది. దీనికి తోడు నటుడు శరవణన్, మరో సభ్యుడు దర్శకుడు చేరన్ కించపరచే విధంగా మాట్లాడాడు. దీన్ని కమలహాసన్ తప్పు పట్టారు. ఏతా వాతా శరవణన్ నోరు జారడంతో ప్రేక్షకులు బిగ్‌బాస్ హౌస్ నుంచి అర్ధంతరంగా బయటకు పంపించేశారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే నటుడు శరవణన్‌ను బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు పంపడంతో ఇతర సభ్యులందరూ, ఆయనకు ఏం జరిగిందో, తన కుటుంబానికి ఏమైనా జరిగిందా? అంటూ తెగ ఏడ్చేశారు. అసలు నిజం తెలిస్తే వారు అంతగా ఇదైపోయి ఉండేవారు కాదేమో. ఏదేమైనా మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కౌంట్ అవుతుందని అది ఇప్పుడు కాకపోయినా, ఎప్పుడైనా తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తుందనీ ఈ సంఘటనలో దాగున్న నీతి. -
‘బిగ్ బాస్ షోలో ఆయన చేసింది బాగోలేదు!’
సాక్షి, చెన్నై : తమిళ బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ శరవణన్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే. పైగా ఆ వ్యాఖ్యలను కమల్ హాసన్ ప్రోత్సహించినట్లుగా ఉండటం మరింత అగ్గి రాజేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ కాగా.. ఈ వ్యవహారంపై ప్రముఖ గాయని చిన్మయి కూడా స్పందించింది. తాజాగా బీజేపీ ప్రతినిధి నారాయణ తిరుపతి కూడా కమల్ తీరుపై మండిపడ్డారు. ‘ఒక బాధ్యతయుతమైన రాజకీయ నాయకుడిగా ఉన్న కమల్ హాసన్.. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పమని అడగాల్సింది పోగా వాటిని ప్రోత్సహించినట్లుగా ఉందని’ అన్నారు. బిగ్ బాస్ షోలో ఆయన చేసింది అమోదయోగ్యంగా లేదని, శరవణన్ చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా సమర్థించడం సరికాదని ఆయన అన్నారు. అసలు ఇంతకు ఏం జరిగిందంటే.. శనివారం నాటి బిగ్ బాస్ కార్యక్రమంలో కమల్ హాసన్.. సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను గురించి చెప్పాడు. ఈ నేపథ్యంలో తాను కాలేజీకి వెళ్లే రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మహిళలను తాకుతూ ఆనందపడే వాడినని శరవణన్ తెలిపాడు. ఆ తర్వాత కమల్ దానిని ఒక సరదా సన్నివేశంగా మార్చి ఇప్పడు శరవణన్ అలాంటివాడు కాదు, పూర్తిగా మారిపోయి ఉంటాడంటూ ఆ సన్నివేశాన్ని దాటేశాడు. చదవండి: బస్‌లో మహిళలను వేధించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
బస్‌లో మహిళలను వేధించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
చెన్నై: బిగ్ బాస్ 3 తమిళ్ రియాలిటీ షోలో కంటెస్టెంటు, నటుడు శరవణన్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను కాలేజీ రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేటపుడు మహిళలను తాకకూడని చోట తాకుతూ ఆనందపడే వాడినని అని తెలిపారు. అతని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. శనివారం రాత్రి ప్రసారమైన తమిళ బిగ్ బాస్ షోలో భాగంగా ఓ సందర్భంలో కమల్ హాసన్ సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను వెల్లడించారు. 'సిటీ బస్సుల్లో ప్రయాణించడం చాలా కష్టం. సమయానికి ఆఫీసుకు చేరడానికి చాలా కష్టపడుతుంటారు. ఇదే అదునుగా కొందరు మహిళలను అసభ్యంగా తాకకూడని చోట తాకుతారు' అని వ్యాఖ్యానించారు. వెంటనే శరవణన్ కల్పించుకొని.. ‘నేను కూడా కాలేజీ రోజుల్లో ఇలాంటివి చేశాను’ అంటూ సమాధానం ఇచ్చారు. అప్పట్లో కేవలం మహిళలను ఆట పట్టించడానికి, వారిని టచ్ చేయడానికే బస్సు ఎక్కేవాడినని, స్నేహితులతో కలిసి ఇలాంటి పనులు చేసినట్టు వెల్లడించారు. నెటిజన్ల ఆగ్రహం శరవణన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్యను ఒక జోక్‌లా బిగ్ బాస్ షోలో చూపించడం దానికి ఆడియన్స్ చప్పట్లు కొట్టడం విడ్డూరంగా ఉందంటూ మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి స్ట్రాంగ్ రిప్లై వీడియో క్లిప్‌ని షేర్ చేసిన ఓ అభిమాని.. దీనిపై స్పందించమని సింగర్ చిన్మయిని కోరారు. ఆమె దీనికి సమాధానంగా.. ‘మహిళలను వేధించడానికే నేను బస్సు ఎక్కేవాడినంటూ ఒక వ్యక్తి గర్వంగా చెప్పుకోవడాన్ని కూడా ఛానల్స్ ప్రసారం చేయడం, ఇలాంటి సీరియస్ విషయాన్ని జోక్‌లా చూపెట్టడం, ఆడియన్స్ చప్పట్లు కొట్టడం బాధాకరమైన విషయమంటూ వ్యాఖ్యానించారు. బిగ్‌బాస్ షోలో ఇప్పటి దాకా ఇంటి సభ్యుల మధ్య వివాదాల్లో మాత్రమే గొడవలు జరిగేవి. ప్రస్తుతం ఇలాంటి విషయాన్ని తేలికగా చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భారీ అయినా సారీ!
రెండు మూడు సినిమాలకు తీసుకునే పారితోషికం ఒకే సినిమాకి వస్తే? లాటరీ తగిలినట్లే. అలాంటి అవకాశాన్ని దాదాపు ఎవరూ వదులుకోరు. కానీ నయనతారలాంటి కొందరు మాత్రం ‘నో’ అనేస్తారు. ఇంతకీ నయనతార వదులుకున్న ఆ ఆఫర్ ఎంతో తెలుసా? పది కోట్ల రూపాయలు. ఇంత భారీ ఆఫర్‌కి సింపుల్‌గా సారీ చెప్పేశారా? అని ఆశ్చర్యం కలగక మానదు. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఈ మధ్య ఆచితూచి అడుగులేస్తున్న నయనతార బాగా ఆలోచించుకుని ఈ ఆఫర్‌ని కాదన్నారట. తమిళంలో శరవణన్ అనే నూతన హీరోతో ఓ సినిమాకి ప్లాన్ జరుగుతోంది. ఇందులో శరవణన్‌కు జోడీగా నయనతారను నటింపజేయాలనుకున్నారట. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌తో దూసుకెళుతున్న నయనతార కొత్త హీరోతో సినిమా అంటే ఓకే చెబుతారా? చెప్పరు కదా. అందుకే పది కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామంటూ ఆఫర్ అందించారు. అయినప్పటికీ ఆమె అంగీకరించలేదు. శరవణన్ కొత్త నటుడు కావడంతోనే అంగీకరించలేదని కొందరు అంటే పాత్ర çనచ్చక తిరస్కరించారని మరికొందరు అంటున్నారు. అసలు కారణం ఏంటో నయనతారకే తెలియాలి. -
పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘తింటే గారెలే తినాలి..వింటే భారతం వినాలి’ అనే ప్రాచీన నానుడిలో కొద్దిగా మార్పు చేస్తే ‘తింటే హోటల్ శరవణ భవన్‌లోనే తినాలి...’అన్నంతగా తీర్చిదిద్దాడు ఆ హోటల్ అధినేత రాజగోపాల్. అయితే అన్నంపెట్టే ఆ చేయి కాలక్రమంలో హత్య కూడా చేసింది. జోస్యుడు చెప్పిన విషయాన్ని ఆచరణలో పెట్టే క్రమంలో జీవితాన్ని తలకిందులు చేసుకున్నాడు. పరువు ప్రతిష్టలను, చివరకు యావజ్జీవ శిక్షా ఖైదీగా ప్రాణాలను సైతంపోగొట్టుకున్నాడు. సినిమా ఫక్కీలో చోటుచేసుకున్న ఉదంతాలతో రాజగోపాల్ జీవిత చరమాకం విషాదకరంగా ముగిసింది. క్లీనర్ టూ ఓనర్: తూత్తుకూడి జిల్లా పున్నైనగర్ అనే చిన్నపాటి గ్రామంలో జన్మించిన రాజగోపాల్ తన 12 ఏళ్ల వయస్సు నుంచి కాయకష్టం పనులకు దిగాడు. పొట్టకూటి కోసం చెన్నైకి చేరుకుని చిన్నపాటి హోటల్లో క్లీనర్‌గా పనికి చేరాడు. ఆ తరువాత టీ మాస్టర్ బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత చెన్నై కేకే నగర్లో ఫలసరుకుల దుకాణాన్ని తెరిచాడు. 1981లో ఒక వినియోగదారుడు వచ్చి ‘అర్జంటుగా సరుకులు ఇవ్వండి, వండుకుని తినాలి, ఈ ప్రాంతంలో ఒక్క హోటల్ కూడా లేదు’ అని చెప్పిన మాటలు రాజగోపాల్ చేత హోటల్ పెట్టించాయి. వేరే వ్యక్తి నడుపుతున్న కామాక్షి భవన్ అనే హోటల్‌ను కొనుగోలుచేసి నడుపుతూ కొన్నేళ్ల తరువాత దానినే హోటల్ శరవణభవన్గా పేరు మార్చాడు. ఆ హోటల్ అంచలంచెలుగా, శాఖోపశాఖలుగా ఎదుగుతూ విదేశీ శాఖల స్థాయికి విస్తరించింది. చెన్నైలోని 25 శాఖలను కలుపుకుని దేశ విదేశాల్లో మొత్తం 46 శాఖలున్నాయి. శాఖాహారం అంటేనే శరవణ భవన్ అనే పేరు తెచ్చుకుంది. పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం: ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న రాజగోపాల్ జీవితాన్ని ఓ వ్యక్తి చెప్పిన జోస్యం అథఃపాతాళానికి నెట్టివేసింది. రెండు పెళ్లిళ్లతో సంతృప్తి చెందక మూడోపెళ్లి కోసం వెంపర్లాట హంతకుడిగా మార్చివేసింది. నాగపట్నం జిల్లా వేదారణ్యంకు చెందిన వ్యక్తి హోటల్ శరవణ భవన్ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఈరకంగా మేనేజర్ కుమార్తె జీవజ్యోతితో రాజగోపాల్‌కు పరిచయం ఏర్పడగా, అప్పటికే ఇద్దరు భార్యలు కలిగి ఉన్న ఆయన జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలని తలంచి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే జీవజ్యోతి ప్రిన్స్ శాంతకుమార్ అనే వ్యక్తిని పెళ్లాడింది. దీంతో కక్ష పెంచుకున్న రాజగోపాల్ ఎలాగైనా జీవజ్యోతిని సొంతం చేసుకోవాలని కుట్రపన్నాడు. జీవజ్యోతిని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా ప్రిన్స్ శాంతకుమార్‌ను బెదిరించాడు. అయితే ఇందుకు అతను ససేమిరా అన్నాడు. ఇదిలా ఉండగా 2001 అక్టోబరు 26వ తేదీన శాంతకుమార్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో భార్య జీవజ్యోతి చెన్నై వేలాచ్చేరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల తరువాత శాంతకుమార్ శవం కొడైక్కెనాల్ కొండగుట్టలో లభ్యమైంది. హతుడి భార్య జీవజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించిన చెన్నై పూందమల్లి కోర్టు... ప్రధాన నిందితుడు రాజగోపాల్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.55 లక్షల జరిమానా విధిస్తూ 2004లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాజగోపాల్ తదితరులు మద్రాసు హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేయగా, కింది కోర్టు ఇచ్చిన 10 ఏళ్ల జైలు శిక్ష తీర్పును యావజ్జీవ శిక్షగా పెంచుతూ 2009లో తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై రాజగోపాల్ సహా నిందితులంతా సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, ఈ అప్పీలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ఖరారుచేసింది. అంతేగాక జూలై 7వ తేదీన కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు 9 మంది నిందితులు 7వ తేదీన చెన్నై 4వ అదనపు కోర్టులో లొంగిపోగా వారందరినీ వెంటనే జైల్లో పెట్టారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజగోపాల్ మాత్రం అనారోగ్యకారణాలను చూపుతూ ఈనెల 7వ తేదీన సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసి లొంగిపోయేందుకు మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ గడువు పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. జైలుశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాలు మూసుకుపోవడంతో రాజగోపాల్ ఈనెల 9వ తేదీన చెన్నైలోని సిటీ సివిల్ కోర్టుకు స్ట్రెచర్‌పై పడుకుని వచ్చి లొంగిపోయాడు. అయితే తీవ్ర అస్వస్థతకు గురైన రాజగోపాల్‌ను మాత్రం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స సరిలేదు, ప్రయివేటు అసుపత్రికి తరలించేందుకు అనుమతివ్వాల్సిందిగా ఆయన కుమారుడు ఈనెల 15 తేదీన పిటిషన్ వేయగా 16న కోర్టు అనుమతించింది. అయితే ఇక్కడి నుంచి తరలిస్తే ప్రాణాలకు ముప్పువస్తుందని ఆసుపత్రి డీన్ హెచ్చరించినా అందుకు తానే బాధ్యత వహిస్తానని కుమారుడు హామీ ఇచ్చి చెన్నైలోని మరో ప్రయివేటు ఆసుపత్రిలో బుధవారం చేర్పించాడు.అయితే 24 గంటలు ముగిసేలోపే గురువారం ఉదయం రాజగోపాల్ ప్రాణాలువిడిచాడు. ఒక్కరోజుకూడా జైల్లో ఉండలేదు: జీవజ్యోతి నా భర్తను దారుణంగా హత్యచేసిన కేసులో ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లకుండా రాజగోపాల్ మరణించడాన్ని తాను సహించలేక పోతున్నానని హతుడు ప్రిన్స్ శాంతకుమార్ భార్య జీవజ్యోతి ఈ సందర్బంగా గురువారం మీడియా ముందు వ్యాఖ్యానించారు. ‘శాంతకుమార్‌ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే న న్ను మూడో పెళ్లి చేసుకునేందుకు రాజగోపాల్ అనేకరకాల వత్తిడిచేశారు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని సంసార జీవితాన్ని నెట్టుకొచ్చాను. అయితే దీన్ని సహించలేని రాజగోపాల్ తన మనుషులతో భర్తను కిడ్నాప్ చేయించి కిరాతకంగా హత్యచేశాడు. చిన్న వయసులో నా చుట్టూ ఏర్పడిన సమస్యలతో జీవితాన్ని దారుణంగా నష్టపోయాను. అయితే వాటన్నింటినీ తట్టుకుని న్యాయపోరాటం చేసి రాజగోపాల్‌ను దోషిగా నిలబెట్టగలిగాను. అయితే తన అనారోగ్యాన్ని కారణంగా చూపిన రాజగోపాల్ ఒక్కరోజు కూడా జైలు శిక్ష అనుభవించకుండా మరణించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. అంతేగాక రాజగోపాల్ మరణం వల్ల నా భర్త ఆత్మశాంతించదు, నాకు హృదయానికి మానని గాయంగా మిగిలిపోగలదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
దర్శకుడు శరవణన్‌కు ఓకేనా!
చెన్నై చిన్నది త్రిష కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపిందన్నది లేటెస్ట్ న్యూస్. ఈ సంచలన నటిని అపజయాల బాట నుంచి తప్పించిన చిత్రం 96. ఆ తరువాత రజనీకాంత్‌తో నటించాలన్న తన చిరకాల ఆకాంక్షను పేట చిత్రం తీర్చింది. ఈ చిత్ర విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు వరుస కడుతున్నాయి. అలాంటి వాటిలో శరవణన్ దర్శకత్వం వహించనున్న చిత్రం ఒకటని తెలిసింది. దర్శకుడు శరవణన్ గురించి చెప్పాలంటే ఈయన ఏఆర్.మురుగదాస్ శిష్యుడు. ఇంతకు ముందు ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి విజయవంతమైన చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై ఆ తరువాత ఇవన్ వేరమాదిరి, వలియవన్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఈ రెండు చిత్రాలు ఆశించిన సక్సెస్‌ను అందుకోలేదు. దీంతో శాండిల్‌వుడ్‌కు వెళ్లారు. అక్కడ ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రాన్ని పునీత్ రాజ్‌కమార్ హీరోగా చక్రవ్యూహ పేరుతో రీమేక్ చేశారు. అది యావరేజ్ చిత్రమే అయ్యింది. అనంతరం శరవణన్ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవలే పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరిన శరవణన్ ఆస్పత్రిలో ఉండగా ఒక కథను తయారు చేసుకున్నారట. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో కూడిన ఈ కథను త్రిషకు వినిపించగా ఆమె అందులో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం త్రిష నటించిన గర్జన,చతురంగవేట్టై–2 చిత్రాలు విడుదల కావాల్సిఉండగా, 1818, పరమపదం విళైయాట్టు చిత్రాల్లో నటిస్తోంది. -
27న తెరపైకి ‘పక్కా’
తమిళసినిమా: ఈ నెల 27న తెరపైకి రావడానికి ‘పక్కా’చిత్రం రెడీ అవుతోంది. నటుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటించిన చిత్రం పక్కా. ఆయనతో నటి నిక్కీగల్రాణి, బిందుమాధవి నాయికలుగా నటించారు. చిత్రంలో సూరి, సతీష్, ఆనంద్‌రాజ్, నిళల్‌గళ్‌రవి, సింగముత్తు, సింగంపులి, రవిమరియ, వైయాపురి, ఇమాన్‌అన్నాచ్చి, జయమణి, కృష్ణమూర్తి, ముత్తుకాళై, సిజర్‌మనోహర్, సుజాత, నాట్టామైరాణి, సాయిదీనా ముఖ్య పాత్రలను పోషించారు. పెణ్ కన్‌స్టోరిటియం పతాకంపై టి.శివకుమార్ ముఖ్య పాత్రలో నటించి, నిర్మించిన ఈ చిత్రానికి బి.శరవణన్ సహనిర్మాతగా వ్యవహరించారు. ఎస్ఎస్.సూర్య కథ, కథనం, మాటలు, దర్శకత్వం వహించారు. ఎస్.శరవణన్ ఛాయాగ్రహణం, సి.సత్య సంగీతం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా వినోద ప్రధానంగా తెరకెక్కించిన చిత్రమన్నారు. నటుడు విక్రమ్‌ప్రభును కొత్తగా చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఆయన కేరీర్‌లోనే ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. హీరోయిన్లు నిక్కీగల్రాణి, బిందుమాధవి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పలువురు హాస్యనటులు చిత్రంలో నటించడం విశేషమన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
నటనకు అనుమతించారు కానీ..!
తమిళసినిమా: తాను హీరోయిన్ అవుతానని అన్నప్పుడు కుటుంబసభ్యులు సమ్మతించడంతో పాటు, మద్దతుగా నిలిచారని, అయితే చిత్రాన్ని నిర్మిస్తానన్నప్పుడు మాత్రం తన కుటుంబసభ్యులతో పాటు చాలా మంది వద్దని నిరుత్సాహపరిచారని నటి విజయలక్ష్మీ పేర్కొన్నారు. చెన్నై–28 చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈమె తాజాగా నిర్మాత అవతారమెత్తి తన భర్త ఫెరోజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పండగై అనే చిత్రం నిర్మిస్తున్నారు. కృష్ణ, ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సరవణన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిత్ర నిర్మాణం దాదాపు పూర్తయిన క్రమంలో పండిగై చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత నటి విజయలక్ష్మీ మాట్లాడుతూ ఈ చిత్ర కథానాయకుడు కృష్ణ తనకు మంచి మిత్రుడని తెలిపారు. చిత్రం కోసం ఎంతగానో శ్రమించారని, కేరవన్కు కూడా వెళ్లకుండా చాలా కష్టపడి నటించారని పేర్కొన్నారు. అదే విధంగా చిత్ర సాంకేతిక వర్గం పోటీ పడి మరీ చిత్రం బాగా రావాలని అహర్నిశలు పని చేశారని చెప్పారు. ఇప్పుడు ఈ చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేసిన ఆరా సినిమా అధినేత మహేశ్ ఇప్పుడు తమకంటే ఎక్కువగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చిత్ర విడుదల తరువాత మరో నాలుగు చిత్రాలను నిర్మించాలన్న కోరిక కలుగుతోందని విజయలక్ష్మీ తెలిపారు. ఎవరూ ముందుకు రాలేదు ఈ చిత్ర కథను చాలా మందికి చెప్పానని, అందరూ బాగుందని అన్నా నిర్మించడానికి ముందుకు రాకపోవడంతో తామే నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చిత్ర దర్శకుడు ఫెరోజ్ తెలిపారు. ఇందులో కృష్ణ, ఆనంది, సవరణన్లను నటింపజేయాలనుకున్నామని, అది సాధ్యం అయ్యినందుకు సంతోషం కలిగిందన్నారు. ఇది వీధి పోరాట ఇతివృత్తంతో కూడిన చిత్రం కావడంతో ఫైట్స్‌కు ప్రాముఖ్యత ఉంటుందని, స్టంట్‌మాస్టర్ అన్భరివు అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారని తెలిపారు. చిత్రం చూడకుండానే నమ్మకంతో చాలా పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టిన ఆరా సినిమాస్ అధినేత మహేశ్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ కుటుంబానికి గాయాలు
అలబామా: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎన్ఆర్ఐ కుటుంబం తీవ్రంగా గాయపడింది. సోమవారం సాయంత్రం అలబామాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన దంపతులు శరవణన్, వెనిలాతో పాటు వారి కూతురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన శరవణన్‌తో పాటు కూతురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. కాగా.. ఎన్ఆర్ఐ కుటుంబం ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే అమెరికా తెలుగు అసొసియేషన్(ఆటా) సభ్యులు వేగంగా స్పందించారు. తొలుత బాధితులకు గాడ్స్‌డెన్ మెడికల్ సెంటర్లో చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన శరవణన్, ఆయన కూతుర్ని యూఏబీ ట్రామా సెంటర్‌కు తరలించి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. ఆటా సేవా సభ్యులు సుధీర్, బోదిరెడ్డి అనిల్, దొంతి సతీష్, శివ రామడుగు, శంకర్ తదితరులు రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచి వారి కుటుంబ సభ్యుల్లో మనోస్థైర్యం నింపారు. -
అతనితో నయన సై అంటుందా?
నేటి హీరోయిన్లు కథకు ప్రాముఖ్యత, పాత్రల్లో నటనకు అవకాశం ఉండాలి అని పైకి చెప్పినా పారితోషికానికి ప్రాధాన్యంఇస్తారన్నది చాలా సార్లు రుజువైంది. అవును డబ్బే ముఖ్యం అని కొందరు బహిరంగంగానే అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. వర్ధమాన నటి కీర్తీసురేశ్ అతి కొద్ది కాలంలోనే మూడు కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తోందన్న వార్తలు వింటున్నాం. ఇందంతా ఎందుకు చెప్పాల్సొస్తోందంటే, ప్రస్తుతం లేడీసూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నటి నయనతారతోనే కథానాయకుడిగా తన తొలి చిత్రం ఉంటుందని ఒక యువ వ్యాపారవేత్త వెల్లడించారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార టాప్ హీరోలతో పాటు, యువ స్టార్ హీరోలతోనూ, వర్ధమాన హీరోలతోనూ నటించడానికి సై అంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ యువ వ్యాపారవేత్త కలను నిజం చేస్తారా? ఇంతకీ ఈ వ్యాపారవేత్త ఎవరన్నది చెప్పలేదు కదూ‘ప్రముఖ వాణిజ్య సంస్థ శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ ఆ మధ్య తన సంస్థ ప్రమోషన్ కోసం రూపొందించిన వాణిజ్య ప్రకటనలో ప్రముఖ నటీమణులు తమన్నా, హన్సికలతో కలిసి నటించారు. ఆయనకిప్పుడు సినిమా ఆశపుట్టిందట. తను కథానాయకుడిగా నటించే తొలి చిత్రంలో నయనతారనే నాయకి అవుతుందని ఆయనే స్వయంగా వెల్లడించారు. మరి ఈ విషయం నయనతార చెవిన పడిందా?ఆయనతో నటించడానికి ఈ బ్యూటీ సై అంటుందా? ఎస్ అంటే ఎంత పారితోషకం డిమాండ్ చేస్తారు? ఈ వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇప్పటికే ఈ అమ్మడు నాలుగు కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు సినీ వర్గాల టాక్. -
నడిగర్‌సంఘం నిర్వాహకులకు బెదిరింపులు
తమిళసినిమా: నడిగర్‌సంఘం నిర్వాహకులకు బెదిరింపులు వస్తున్నట్లు ఆ సంఘ అధ్యక్షుడు నాజర్, మనోబాలా, పొన్వన్నన్, శరవణన్ తదితరులు సోమవారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ టీకే.రాజేందర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. వారాహి అనే న డిగర్ సంఘం సభ్యుడు గత 27వ తేదీన సంఘ నిర్వాహకులు అవినీతికి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన 50 మంది సహాయ నటీనటులతో కలిసి సంఘం ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలాన్నే సృష్టించింది. అయితే వారాహి ఆరోపణలకు స్పంధించిన సంఘం కార్యద ర్శి విశాల్, కోశాధికారి కార్తీ ఉద్దేశపూర్వకంగానే వారాహి సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం సంఘం అధ్యక్షుడు నాజర్, మనోబాలా, పొన్వన్నన్, శరవణన్ తదితరులు నగర పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అనంతరం విలేకులతో నాజర్ మాట్లాడుతూ సంఘానికి సంబంధించిన విషయాలను ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా వివరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వారాహి అనే వ్యక్తి దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే సంఘంపై ఎలాంటి మరక పడకుండా చేయడానికి ప్రాణాలైనా ఒడ్డుతామన్నారు. తాము ప్రస్తుతం సంఘం సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అందుకు సభ్యులతో పాటు, ఇతరులను కలుపుకుని పోతున్నామని తెలిపారు. సంఘ భవన నిర్మాణాన్ని 6 వేల చదరపు అడుగులలో కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అందుకు ఇంకా అనుమతి పొందాల్సి ఉందని అన్నారు. 27వ తారీకున సంఘం ఆవరణలో ఆందోళనకు దిగిన వారు సంఘం ఉద్యోగి ఫోన్ లాక్కుని విసిరేశారనీ తెలిపారు. హత్యా బెదిరింపులు చేశారనీ అన్నారు. బెదిరింపులకు పాల్పడిన చెంగయ్య, రాజు, ఉషా, కోవైలక్ష్మి, అఖిల, రాణి, దేవి తదితరులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. సంఘ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని అందులో పేర్కొన్నట్లు నాజర్ తెలిపారు. వారాహి కూడా పోలీస్ కార్యాలయంలో నడిగర్ సంఘం సభ్యులకు వ్యతిరేకంగా ఫిర్యాదు లేఖను అందించారన్నది గమనార్హం.