Legend Saravanan Debut The Legend Movie Audio, Trailer Launch Deets Inside - Sakshi
Sakshi News home page

Saravanan: వ్యాపారవేత్త శరవణన్‌ హీరోగా లెజెండ్‌ మూవీ, ట్రైలర్‌ విడుదల

Published Wed, Jun 1 2022 3:13 PM | Last Updated on Wed, Jun 1 2022 3:30 PM

Legend Saravanan Debut The Legend Movie Audio, Trailer Launch - Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్‌ శరవణన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. న్యూ శరవణన్‌ స్టూడియోస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ది లెజెండ్‌ చిత్రాన్ని నిర్మిస్తునండమే కాక ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జేడి-జెయర్‌ ద్యయం దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి హారిశ్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. వేల్‌రాజ్‌ ఛాయగ్రణం అందిస్తున్నారు. నిరమ్ణ క్యాక్రమాలను పూర్తి చేసుకుని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం హిందీ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్స్‌ తమన్నా, హన్సిక, పూజా హెగ్డే, శ్రద్ధాశ్రీనాథ్‌, రాయ్‌ లక్ష్మితో పాటు నటులు ప్రభు, నాజర్‌ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందరంగా ఈ చిత్ర కథానాయకుడు, నిర్మాత లెజెండ్‌ శరవణన్‌ మాట్లాడుతూ.. సినీ రంగంలో రజనీకాంత్‌, విజయ్‌ తనకు రోల్‌ మోడల్‌ అన్నారు. తనపై విర్మశలు చేసే వారి గురించి బాధపడనన్నారు. కమర్షియల్‌ అంశాలన్నీ ఉన్న ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement