లెజండ్‌ శరవణన్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఎవరో తెలుసా..? | Legend Saravanan And Payal Rajput New Movie Will Confirm | Sakshi
Sakshi News home page

లెజండ్‌ శరవణన్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

Published Mon, Sep 16 2024 11:35 AM | Last Updated on Mon, Sep 16 2024 11:57 AM

Legend Saravanan And Payal Rajput New Movie Will Confirm

తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 'లెజెండ్‌ శరవణన్‌' కథానాయకుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించి నిర్మించిన 'ది లెజెండ్‌' చిత్రం గత 2022లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అందులో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతాల కథానాయక నటించారు. కాగా లెజెండ్‌ శరవణన్‌ ఇప్పుడు హీరోగా, నిర్మాతగా మరో ప్రయత్నం చేస్తున్నారు. దీనికి దురైసెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. 

ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పటికే హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో నటించి పాపులర్‌ అయ్యారు. అదే విధంగా తమిళనాడులో ఇప్పటికే ఒక చిత్రంలో నటిస్తున్నారు. కాగా శరవణన్‌ సరసన నటించేది ఈమెకు రెండవ చిత్రం అవుతుంది. అదేవిధంగా ఇందులో ఆండ్రియా, శ్యామ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే చైన్నె పరిసర ప్రాంతాల్లో తొలిషెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం చిత్రం యూనిట్‌ ఆదివారం తూత్తుకుడి బయలుదేరారు. 

ఈ సందర్భంగా చైన్నె విమానాశ్రయంలో శరవణన్‌ మీడియాతో మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం మంచి విజయాన్ని సాధించిందని అదేవిధంగా మంచి యాక్షన్‌ ఎంటర్‌టెయినర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇటీవల విడుదలైన మహారాజా, గరుడన్‌ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని, అదేవిధంగా దర్శకుడు దురైసెంథిల్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement