Tamil cinema
-
ఆస్కార్ రేస్‌లో 6 తమిళ చిత్రాలు
తమిళసినిమా: ఈసారి ఆస్కార్ అవార్డుల రేస్‌లో 6 తమిళ చిత్రాలు చోటు చేసుకోవడం విశేషం. ఆస్కార్ అవార్డు అనేది తమిళ చిత్రాలను ఊరిస్తూనే ఉంది. సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నా, అవి ఆంగ్ల చిత్రానికి కావడం గమనార్హం. కాగా 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినట్లు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించారు. అందులో 6 తమిళ చిత్రాలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ మంచి కథా బలం ఉన్న చిత్రాలే. ఈ సారి అయినా వీటిలో ఏదైనా అస్కార్ అవార్డును గెలుచుకుంటుందేమో చూడాలి. -
ఫిర్యాదు చేయకపోతే ప్రయోజనం ఉండదు!
మలయాళ సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న ఘటనలను మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) సమావేశంలో నటి రోహిణి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం మంచిది. తమను వేధించినవారిపై ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు’’ అని పేర్కొన్నారు. -
నడిగర్ సంఘం హెచ్చరిక.. అలాంటి వారిపై ఐదేళ్ల నిషేధం!
హేమ కమిటీ నివేదిక సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టాలీవుడ్‌లోనూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా కోలీవుడ్‌కు చెందిన నడిగర్ సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సినీ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని విశాల్ నేతృత్వంలోని కమిటీ తీర్మానించింది. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి నడిగర్ సంఘం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార సెల్ కోసం ప్రత్యేక మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేధింపులకు గురైన వారు నేరుగా తమ ఫిర్యాదులను ముందుగా నడిగర్ సంఘానికి సమర్పించాలని కోరారు. మీడియాకు వెల్లడించవద్దని హెచ్చరిక కూడా ఉంది. చెన్నైలో నడిగర్ సంఘం నిర్వహించిన సమావేశంలో నాసర్, విశాల్, కార్తీ పాల్గొన్నారు. -
సై, సై అంటున్న కోలీవుడ్
-
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ!
ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ సాక్షి అగర్వాల్. తమిళం, మలయాళం, కన్నడతో వంటి పలు భాషా చిత్రాలు ఉన్నాయి. బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ద్వారా పాపులర్ అయిన సాక్షి అగర్వాల్ హీరోయిన్, గ్లామర్, యాక్షన్, విలనిజం, గ్రామీణ యువతిలాగా అన్ని రక రకాల పాత్రలో నటిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళంలో రజిత్ కన్నా దర్శకత్వం వహిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం సారా లో నటిస్తున్నారు. అదేవిధంగా 8 బుల్లెట్స్ చిత్రం ఫేమ్ వెట్రికి జంటగా నటించిన చిత్రంను పూర్తి చేశారు. ఇది కాకుండా సాక్షి అగర్వాల్ చేతిలో 'అతిథి 2'తో పాటు చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మేనల్లుడు హీరోగా నటిస్తున్న చిత్రంలో సాక్షి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా కనిపించనున్నారు. అదేవిధంగా ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు బి అజనీష్ లోకనాథ్ నిర్మిస్తున్న చిత్రంలోనూ ఈమె చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇలా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న సాక్షి అగర్వాల్‌కు తాజాగా బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయట. సాక్షి అగర్వాల్ త్వరలో ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించనుంది. మొత్తం మీద ఈ దీపావళి ఈ బ్యూటీకి కొత్త ఆనందాన్నే తీసుకొచ్చినట్లుంది. View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!
లెన్స్, మస్కిటో ఫిలాసఫీ, తలైకూత్తల్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ తెరకెక్కించిన చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై. ఈ చిత్రాన్ని ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్ర దర్శకుడు జియో బేబీ సమర్పణలో మెన్ కైండ్ సినిమాస్, నితీష్ ప్రొడక్షన్స్, సిమెట్రీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి రోహిణి కీలకపాత్రలో నటించారు. ఆమెతో పాటు లిజోమోల్, వినీత్, కలేశ్ రామనాథ్, అనుష్క, దీప ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా కాదల్ ఎంబదు పొదువుడమై మూవీ 54వ ఇండియన్ పనోరమ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైనట్లు మేకర్స్ తెలిపారు. తమిళ చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై ఎంపిక కావడం విశేషం. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరగనున్నాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఈ ఆధునికకాలంలో మనుషుల భావాలు, దురాలోచనలు, సామాజిక పరిస్థితి, విజ్ఞానం వంటి అంశాలతో కూడిన ఆధునిక ప్రేమను ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కాగా 2023 ఏడాదిగానూ ఇండియన్ పనోరమ చిత్రోత్సవాలకు 408 చిత్రాలు నామినేట్ కాగా.. అందులో 25 చిత్రాలు మాత్రమే ఎంపికై నట్లు చెప్పారు. ఆ 25 చిత్రాల్లో తమ కాదల్ ఎంబదు పొదువుడమై చిత్రం చోటుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ఈ సినిమాకు కన్నన్ నారాయణన్ సంగీతమందించగా.. శరవణన్ సినిమాటోగ్రఫీ అందించారు. -
మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!
అరవింద స్వామి పేరు వినగానే గుర్తొచ్చేది దళపతి, బాంబే, రోజా చిత్రాలే. మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్, మమ్ముట్టి వంటి దిగ్గజాలతో నటించిన దళపతి చిత్రంలో యువ కథానాయకుడిగా పరిచయమైన నటుడు అరవిందస్వామి. కొన్ని చిత్రాల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నటనకు దూరంగా ఉన్నారు. అయితే టాలీవుడ్‌లోనూ రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో విలన్‌గా మెప్పించారు. (ఇది చదవండి: Bigg Boss 7: మళ్లీ దొరికిపోయిన శివాజీ.. అమర్ ఆ పాయింట్ చెప్పేసరికి!) అయితే ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ అయ్యి తనీ ఒరువన్ వంటి పలు చిత్రాల్లో ప్రతి నాయకుడు గానూ నటించి మెప్పించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నా ఈయన త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలిసింది. ఈయన ఇప్పటికే కథ కథనాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కాగా తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఆల్ ఇండియా స్టార్ ఫాహద్ ఫాజిల్‌ను ప్రధాన పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో అరవిందస్వామి కూడా ఓ కీలకపాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం 2024 ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన మామన్నన్ చిత్రంలో విలన్‌గా తన విశ్వరూపం చూపించిన నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆయనకు ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. కాగా అరవిందస్వామి దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!) -
రికార్డు బ్రేక్ చేసిన డైరెక్టర్, 23 గంటల్లో సినిమా పూర్తి
ఈ తరం దర్శకులు సినిమాను ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. ప్రయోగాలతో గిన్నిస్ రికార్డులను సాధిస్తున్నారు. ఆ కోవలో తెరకెక్కిన చిత్రం కలైంజర్‌నగర్. దీనికి సుగన్కుమార్ కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈయన ఇంతకుముందు పోదాం అనే చిత్రాన్ని 23 గంటల 23 నిమిషాల్లో తెరకెక్కించారు. తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ 23 గంటల 7 నిమిషాలకు ముందే తాజా సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడం విశేషం. ఎస్ఆర్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై శివరాజ్ నిర్మించిన ఈ చిత్రానికి గాయత్రి సుగన్ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇందులో నటుడు ప్రాజన్, నటి ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటించగా, నటుడు లివింగ్ స్టన్, పుగళ్ ముఖ్యపాత్రలు పోషించారు. నరేశ్ సంగీతాన్ని, ఇళయరాజా ఛాయాగ్రహణంను అందించారు. ఈ చిత్ర మీడియా సమావేశాన్ని శనివారం సాయంత్రం చైన్నెలో ని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. కార్యక్రమంలో బుల్లితెర నటీనటుల సంఘం అధ్యక్షుడు దళపతి పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ముందుగా చిత్ర దర్శకుడు సుగన్కుమార్ మాట్లాడుతూ పెద్ద పెద్ద దర్శకులు భారీ చిత్రాలను తెరకెక్కిస్తానని, తాను ఈ చిన్న చిత్రాన్ని భారీగా రూపొందించినట్లు చెప్పారు. ఇది పూర్తిగా స్టేజీ నృత్య కళాకారుల ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని తెలిపారు. ఇందులో మూడు పాటలు, రెండు ఫైట్స్ ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్‌ను 23 గంటల్లో పూర్తి చేసిన ఘనత తనది మాత్రమే కాదని దీనికి పనిచేసిన అందరికీ చెందుతుందని పేర్కొన్నారు. చదవండి: నేను ఇంజనీర్‌ను.. హీరోయిన్ అవుతాననుకోలేదు -
స్టాలిన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి
చెన్నై: తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా అక్కడి ప్రజలు బాగా యాక్టివ్‌గా ఉండే ట్విటర్లోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎడాపెడా సాగుతోంది. అందునా తమిళ చిత్రాల ఫన్నీ వీడియోలతో రూపొందుతున్న మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా.. అణచివేతకు దిగుతోందంటూ ప్రభుత్వంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు బడ్జెట్‌కు సంబంధించిన ఓ మీమ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. బడ్జెట్ 2023-24లోభాగంగా మహిళలకు(ప్రత్యేకించి గృహిణులకు) నెలవారీ సహాయ పథకం ఏడువేల కోట్ల రూపాయలను కేటాయించింది స్టాలిన్ ప్రభుత్వం. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నెలవారీగా ఒక్కో మహిళకు వెయ్యి రూపాయలు అందించనుంది ప్రభుత్వం. అయితే ఈ కేటాయింపులపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో.. 2.2 కోట్ల రేషన్ కార్డు హోల్డర్లకు సాయం అందిస్తామన్న హామీని డీఎంకే ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చకుండా తాజా పథకంతో చిల్లర విసురుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. సోషల్ మీడియాలో మీమ్స్‌ను వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వాయిస్ ఆఫ్ సవుక్కు అనే ట్విటర్ పేజీ అడ్మిన్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పథకాన్ని వెటకారం చేస్తూ.. హాస్యద్వయం గౌండమణి, సెంథిల్లు ఉన్న ఓ వీడియోను ఎడిట్ చేశాడు ఆ పేజీ అడ్మిన్ ప్రదీప్. అందులో ఒకరిని స్టాలిన్‌గా మరొకరిని ఆర్థిక మంత్రిగా చూపించాడు. దీంతో.. ఈ వీడియోను నేరంగా పరిగణించిన పోలీసులు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేశారు. Sources : Pradheep one of the admins of @voiceofsavukku has been arrested in Cr No 52/2023 under sections 153, 505 (1) (b) and 509 IT Act for this video meme. pic.twitter.com/dT7LcsLorF — Savukku Shankar (@Veera284) March 22, 2023 తమిళనాడులో రాజకీయ వేడిని పుట్టించిన ఈ మీమ్-అరెస్ట్ పరిణామంపై అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకేలు అరెస్ట్‌ను ఖండిస్తున్నాయి. పార్టీల నేతలేకాదు.. ఉద్యమకారులు, హక్కుల సాధన సమితిలు, నెటిజన్లు.. #ArrestMeToo_Stalin పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. అయితే.. ఈ ఒక్క ఘటనే కాదు. ఆమధ్య స్టాలిన్ తనయుడు ఉదయ్‌నిధి స్టాలిన్‌కు క్రీడామంత్రిత్వ శాఖను అప్పగించడంపైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. తాజాగా.. తమిళనాడు పోలీసులు, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు గుజరాత్ దాకా వెళ్లిన పరిణామంపైనా స్టాలిన్‌ను, ఆయన తండ్రి దివంగత కరుణానిధిని కలిపి మరీ ట్రోల్ చేశారు నెటిజన్లు. -
నటుడు సంతానంతో మేఘా ఆకాష్ రొమాన్స్!
తమిళసినిమా: సంతానంతో రొమాన్స్ చేయడానికి నటి మేఘా ఆకాష్ సిద్ధమయ్యారు. సంతానం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వడకుపట్టి రామసామి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఇంతకుముందు సంతానం హీరోగా డిక్కీలూన అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదే సంస్థపై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం వడకుపట్టి రామసామి. కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. నటుడు జాన్ విజయ్ ఎంఎస్ భాస్కర్, రవి మరియ, మొటై రాజేంద్రన్, నిళల్గల్ రవి, శేషు, ప్రశాంత్, జాక్విలిన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాన్ రోల్డెన్ సంగీతాన్ని, దీపక్ చాయాగ్రహణంను అందిస్తున్నారు. తాజాగా కథానాయకిగా మేఘా ఆకాష్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా మేఘా ఆకాష్‌ను కోలీవుడ్‌లో చూసి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న యాదూమ్ ఊరే యావరుమ్ కేళీర్, మానై పిడిక్కాద మనిదన్, సింగిల్ శంకరుమ్ స్మార్ట్ పోన్ సిమ్రానుమ్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా వడకు పట్టి రామసామి చిత్రంలో ఈమె డాక్టర్‌గా నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోందని చెప్పారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
వారీసు Vs తునివు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
సౌత్‌లో సంక్రాంతి హడావుడి పీక్స్‌లో ఉంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలు క్లాష్ అవుతుండటంతో ఎవరు విన్నర్‌గా నిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సంక్రాంతి పందేలుగా బరిలో దిగగా తమిళనాట అజిత్ తునివు, విజయ్ వారీసు(వారసుడు) బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. ఈ రెండు సినిమాలు జనవరి 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే! ఈ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్లు కలిపితే రూ.50 కోట్ల గ్రాస్ కన్నా తక్కువే ఉన్నాయట. తమిళనాడులో తునివు మొదటిరోజు పాతిక కోట్ల మేర కలెక్షన్స్ కురిపించగా వారీసు దాదాపుగా రూ.20 కోట్లదాకా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తమిళనాడు కాకుండా ఇతర ప్రాంతాలు, విదేశీ వసూళ్లు కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రెండు సినిమాలు బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచేందుకు తెగ పోటీపడుతున్నాయి. కాగా తొమ్మిదేళ్ల తర్వాత అజిత్, విజయ్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. దీంతో ఫస్ట్‌డే ఫస్ట్ షో చూడాలన్న ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. Pongal 2023 TN Box Office Day 1#Thunivu - ₹ 24.59 cr#Varisu - ₹ 19.43 cr — Manobala Vijayabalan (@ManobalaV) January 12, 2023 చదవండి: తండ్రి మరణించిన రెండు రోజులకే సెట్‌కు వచ్చేశాడు: చిరంజీవి థియేటర్లో పూజారి మాస్ డ్యాన్స్ -
హీరోగా పరిచయం కాబోతున్న నిర్మాత
తమిళసినిమా: గతంలో అమ్మువాగియన్ నాన్, మాత్తియోసి వంటి సక్సెస్ఫుల్ త్రాలను నిర్మింన పీఎస్ఎస్ఆర్ ఫిలిమ్స్ అధినేత శేఖర్ సీతారామన్ తాజాగా కథానాయకుడిగా అవతారం ఎత్తారు. ఈయన హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఏ4. రవికుమార్ టీఎస్ కథ, కథనం, మాటలు సమకూర్చుతున్నారు. నటుడు ఇనిగో ప్రభాకర్, నటి ఐశ్వర్య దత్తలతోపాటు పలువురు ప్రముఖ నటినటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను రవికుమార్ తెలుపుతూ.. నిర్మాత శేఖర్ సీతారామన్‌ను కలిసి కథ వినిపించినప్పుడు ఆయనకు బాగా న్చిందన్నారు. హీరోగా ఎవరిని ఎంపిక చేద్దామని అడిగారన్నారు. ఎలాంటి సంకోచం లేకుండా మీరే నటిస్తే బాగుంటుందని చెప్పానన్నారు.. ముందు ఆయన సంకోంచినా తన ఒత్తిడి మేరకు హీరోగా నటించారని తెలిపారు. ఏ 4 చిత్రం టైటిల్ మాదిరిగానే కథా, కథనాలు వైవిధ్యంగా ఉంటాయన్నారు. అందరికీ అర్థమయ్యే విధంగా చిత్రంలో సంభాషణలు ఉంటాయన్నారు. చిత్ర షటింగ్ చెన్నై, ఊటీ, కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నట్లు చెప్పారు. శేఖర్ ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నటిస్తున్నారని ప్రశంసించారు. దీనికి కేఏ రోయిన్ చాయగ్రహణను, సెంతమిళ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
హీరోగా చంద్రబాబు మనవడు
దివంగత హాస్య నటుడు చంద్రబాబును తమిళ సినిమా ఎప్పటికీ మర్చిపోదు. కాగా ఆయన వారసత్వాన్ని ఆయన మనవడు సారత్ తన భుజాలపైన వేసుకున్నారు. తెర్కత్తివీరన్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత, కథానాయకుడు అన్నీ తానే కావడం విశేషం. ఈయన ఇంతకు ముందు ఏ దర్శకుడి వద్ద పని చేయలేదు. చంద్రబాబు ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కథానాయకుడికి స్నేహితులుగా మురుగా అశోక్, నాడోడిగళ్ భరణి, మారి వినోద్ నటించగా హీరో తండ్రిగా వేల రామ్మూర్తి నటించారు. అదే విధంగా మధుసూదనన్, కబీర్ తుహాన్ సింగ్, పవన్, ఆర్ఎన్ఆర్ మనోహర్, నమో నారాయణ, రాజసింహన్, ఆర్యన్, రేణుక, ఉమా పద్మనాభన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా సంగీతాన్ని, ఎన్. షణ్ముఖ సుందరం చాయాగ్రహణను అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2వ తేదీ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటుడు సారత్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది తూత్తుకుడి నేపథ్యంలో యథార్థ సంఘటనలతో రూపొందించిన చిత్రం అని చెప్పారు. హీరో నలుగురు మిత్రులు ఐదుగురు పిల్లల మధ్య పగ, ప్రతీకారం ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. ఐదు పాటలు ఎనిమిది ఫైట్లు అంటూ పక్కా కమర్షియల్ ఫార్మెట్లో తెరకెక్కించిన చిత్రం తెర్కత్తి వీరన్ తెలిపారు. చిత్రంలో కడవలమ్మ అనే ఇంట్రో సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవా పాడారని చెప్పారు. ఈ పాటలో శ్రీకాంత్ దేవా తనతో కలిసి నటించడం మరో విశేషం అని పేర్కొన్నారు. చదవండి: (రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?) -
సెట్స్‌పైకి రజనీ ‘జైలర్’.. కొత్త పోస్టర్ రిలీజ్
‘అన్నాత్తే’ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్న చిత్రం ‘జైలర్’. బీస్ట్ మూవీఫేం నెల్సన్ దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ వదిలిన చిత్ర బృందం తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు సోమవారం(ఆగస్ట్ 22న) జైలర్ షూటింగ్ ప్రారంభమైందని చెబుతూ తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందించారు మేకర్స్. చదవండి: ‘మెగాస్టార్’ అంటే ఓ బ్రాండ్.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఈ సందర్భంగా రజనీకి లుక్కు సంబంధించిన పోస్టర్‌ను వదిలారు. ఇందులో రజనీ ఫార్మల్ డ్రెస్‌లో సీరియస్ లుక్‌తో కనిపించారు. దీంతో ఈ సినిమాలో రజనీ లైటిల్ రోల్ పోషించనున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన లుక్కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించన్నాడు. #Jailer begins his action Today!@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/6eTq1YKPPA — Sun Pictures (@sunpictures) August 22, 2022 -
Trisha-Vijay: విజయ్ ఎప్పుడూ ప్రత్యేకమే!
కోలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా విజయ్, త్రిష పేరు గడించారు. ఈ జంట ఇప్పటి వరకు నాలుగు చిత్రాలలో కలిసి నటించారు. వాటిలో గిల్లీ చిత్రం ఘన విజయం సాధించింది. తాజాగా మరోసారి కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. విజయ్ ప్రస్తుతం వారీసు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చాలా భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఆయన తన 67వ చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి మహానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని టాక్. ఇందులో ఆరుగురు విలన్లు ఉంటారనే ప్రచారం వైరల్ అవుతోంది. చదవండి: (స్లోగా వెళుతున్నాను తప్ప... డౌన్ కాలేదు) ఇకపోతే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో నటి త్రిష విజయ్‌తో రొమాన్స్ చేసే పాత్రలో నటించనున్నట్లు, సమంత ఆరుగురు విలన్లలో ఒకరిగా తనదైన విలనిజాన్ని ప్రదర్శించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా విజయ్‌తో మరోసారి జత కట్టనుండడం గురించి ఒక భేటీలో స్పందిస్తూ విజయ్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని త్రిష పేర్కొన్నారు. ఆయన ప్రొఫెషలిజం, అంకిత భావం తనకు నచ్చుతాయన్నారు. సెట్లో చాలా సైలెంట్‌గా ఉంటారని, గిల్లీ చిత్రం తమ మధ్య ఫ్రెండ్షిప్ను పెంచిందని చెప్పారు. తాను మంచి కథా చిత్రాలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక విజయ్‌తో 14 ఏళ్ల తరువాత నటించనున్న తాజా చిత్రం నవంబర్ 3వ వారంలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. -
అన్నకు నమ్మకం.. తమ్ముడికి ధైర్యం
తమిళసినిమా: కోలీవుడ్‌లో అన్నదమ్ములు కథానాయకులుగా రాణించడం అరుదైన విషయం. అలాంటి అరుదైన అపూర్వ సోదరులు సూర్య, కార్తీ. నటనలో ఎవరికి వారు ప్రత్యేక బాణీని అలవరచుకుని సక్సెస్ఫుల్ కథానాయకులుగా రాణిస్తున్నారు. నటుడు శివకుమార్ వారసులుగా ఒక నిబద్ధత కలిగిన వీళ్లు ఏ విషయంలోనూ ఒకరిని ఒకరు వదులుకోరు. తన తమ్ముడు కార్తీ తన కంటే తెలివైన వాడని, మంచి నటుడు అని సూర్య చాలాసార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. ఇక సూర్య రాముడైతే తాను లక్ష్మణుడిని అని, ఆయన వెనుక కూర్చోవడమే అందం అని, తన ముందు అన్నయ్య ఉన్నాడనే ధైర్యం తనకు, తన వెనుక తమ్ముడు ఉన్నాడే నమ్మకం అన్నయ్యకు కలుగుతుందని కార్తీ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. కార్తీ కథానాయకుడిగా ఇంతకుముందు సూర్య కడైకొట్టి సింగం అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందింది. తాజాగా మరోసారి కార్తీ హీరోగా విరుమాన్ అనే చిత్రాన్ని తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించారు. చదవండి: (స్టయిలిష్ రేణుక) ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల మదురైలో నిర్వహించారు. ఆ వేదికపై సూర్య మాట్లాడుతూ.. గ్రామీణ కథా చిత్రాలు తెరకెక్కించడంలో భారతీరాజా సిద్ధహస్తులన్నారు. ఈ విషయంలో తాము పోటీ పడుతామని అన్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు తనను అప్డేట్ చేసుకుంటూ చిత్రాలు చేసే దర్శకుడు శంకర్ అన్నారు. ఆయనతోనూ తాము పోటీ పడుతామన్నారు. అలా లక్ష్యాన్ని పెట్టుకుంటే వారి స్థాయికి కాకపోయినా సగం చేసినా సంతోషం అన్నారు. కాగా నటుడు కార్తీ విరుమాన్ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఒక భేటీలో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. చిత్రం సంతృప్తిగా వచ్చిందన్నారు. తాను మణిరత్నం వద్ద ఆయుధ ఎళత్తు చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసినప్పుడు అన్నయ్య కోసం ఒక బయోపిక్ కథను రాశానని చెప్పారు. కాగా కార్తీ తన అన్నయ్య సూర్యను డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారన్నమాట. -
మూవీ సక్సెస్.. దర్శకుడికి మాయోన్ మూవీ నిర్మాత సర్ప్రైజ్ గిఫ్ట్
సాక్షి, చెన్నై: మాయోన్ చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ మొళి మాణిక్యం కథణం, నిర్మాణ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో శిబిరాజ్, తాన్యా రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. నవ దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహించారు. శిలల స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఫాంటిసీ సన్నివేశాలతో రూపొందిన చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలై విమర్శకుల ప్రశంసలతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. గురువారం చిత్ర యూనిట్ చెన్నైలో కేక్ కట్ చేసి వేడుకగా సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత.. దర్శకుడు కిషోర్‌కు బంగారు గొలుసును కానుకగా అందించారు. కాగా ఈ చిత్రం 7వ తేదీన తెలుగులోనూ విడుదల కానుందని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. అదే విధంగా మాయోన్కు సీక్వెల్‌ను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. -
లెజెండ్ శరవణన్ హీరోగా ‘ది లెజెండ్’మూవీ, ట్రైలర్ విడుదల
ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై ది లెజెండ్ చిత్రాన్ని నిర్మిస్తునండమే కాక ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జేడి-జెయర్ ద్యయం దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి హారిశ్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. వేల్రాజ్ ఛాయగ్రణం అందిస్తున్నారు. నిరమ్ణ క్యాక్రమాలను పూర్తి చేసుకుని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్స్ తమన్నా, హన్సిక, పూజా హెగ్డే, శ్రద్ధాశ్రీనాథ్, రాయ్ లక్ష్మితో పాటు నటులు ప్రభు, నాజర్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందరంగా ఈ చిత్ర కథానాయకుడు, నిర్మాత లెజెండ్ శరవణన్ మాట్లాడుతూ.. సినీ రంగంలో రజనీకాంత్, విజయ్ తనకు రోల్ మోడల్ అన్నారు. తనపై విర్మశలు చేసే వారి గురించి బాధపడనన్నారు. కమర్షియల్ అంశాలన్నీ ఉన్న ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. -
హీరో కార్తీ, అతిథి శంకర్ విరుమన్ రిలీజ్ డేట్ ఫిక్స్
సాక్షి, చెన్నై: ‘విరుమన్’ చిత్రం వినాయక చవితికి విడుదలకు ముస్తాబవుతోంది. కార్తీ కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ముత్తయ్య దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నటుడు రాజ్‌కిరణ్, ప్రకాష్‌రాజ్, సూరి, ఆర్కే సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కాగా చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ஆகஸ்ட் 31 விநாயகர் சதுர்த்திக்கு வர்றோம் #விருமன் #VirumanFromAug31@Karthi_Offl @Suriya_offl @2D_ENTPVTLTD @dir_muthaiya @thisisysr @AditiShankarofl @rajsekarpandian @prakashraaj #Rajkiran @sooriofficial @sakthivelan_b pic.twitter.com/qnr2X1NKKT — Actor Karthi (@Karthi_Offl) May 18, 2022 -
విలేకరిగా మారిన హీరో విమల్
సాక్షి, చెన్నై: నటుడు విమల్ విలేకరి అవతారమెత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుడిక్కుమ్ కరంగళ్’. ముంబై బ్యూటీ మనీషా నాయికగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈమె ఇంతకుముందు తెలుగులో రెండుచిత్రాలు, కన్నడంలో ఒక చిత్రం చేశారు. ఒడియన్ టాకీస్ పతాకంపై కె.అన్నాదురై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేలుదాస్ దర్శకత్వంతో పాటు సహ నిర్మాత బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ వద్ద 23 ఏళ్లు పని చేసిన ఆయన సోదరుడి కొడుకు రాఘవ ప్రసాద్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్మీ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నటుడు విమల్ యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తూ విలేకరిగా బాధ్యతలను నిర్వహిస్తారన్నారు. ఈ షూటింగ్‌ను చెన్నైలో 45 రోజుల్లో పూర్తి చేశామన్నారు. -
అలా అయితేనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తా: హీరో శివకార్తికేయన్
Sivakarthikeyan About Pan India Movies: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా నటించిన డాన్ చిత్రం ఈ రోజు ప్రపపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శిబిచక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల నేపథ్యంలో గురువారం మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా చిత్రాలపై స్పందించాడు. ఐడియా కొత్తగా ఉంటేనే పాన్ ఇండియా చిత్రాలలో నటించడానికి తాను సిద్ధమని అన్నాడు. అనంతరం డాన్ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని, దర్శకుడు కథ చెప్పగానే కాలేజీ రోజులు గుర్తుకు రావడంతో వెంటనే నటించడానికి ఒకే చెప్పానన్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ఐలాన్ చిత్రాన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి తన ఎస్.కె.ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం -
కమల్ హాసన్ ‘విక్రమ్’లో హీరో సూర్య!
కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్స్ కూడా నటించారు. ముగ్గురు హీరోలు నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. కాగా ఈ సినిమాలో హీరో సూర్య కూడా కనిపించనున్నారని కోలీవుడ్ లేటెస్ట్ టాక్. ముఖ్యమైన అతిథి పాత్రలో సూర్యని చూపించనున్నారట లోకేష్. ఇటీవల ‘విక్రమ్’ షూటింగ్ లొకేషన్‌కి సూర్య వెళ్లినప్పుడు కమల్ ఆత్మీయంగా హత్తుకుని ఆహ్వానించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. దాంతో సూర్య అతిథి పాత్ర చేశారని స్పష్టం అవుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. -
పలు వాయిదాల అనంతరం రిలీజ్‌కు రెడీ అయిన రంగా మూవీ
సాక్షి, చెన్నై: నటుడు సిబిరాజ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం రంగా. నిఖిలా విమల్ నాయికగా, డీఎల్ వినోద్‌ను దర్శకుడిగా బాస్ మూవీ పతాకంపై విజయ్ కె.చెల్లయ్య నిర్మించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 13వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సిబిరాజ్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నటించడానికి సిద్ధమయ్యానన్నారు. చదవండి: బాలీవుడ్ నన్ను భరించలేదు, అక్కడ సినిమాలు తీసి టైం వేస్ట్ చేసుకోను షూటింగ్ అధికభాగం కశ్మీర్లో నిర్వహించనున్నట్లు చెప్పారన్నారు. కథ బావుంది గానీ.. కొత్త దర్శకుడు ఎలా తెరకెస్తారన్న సంశయం కలిగిందన్నారు. దీంతో కొన్ని రోజులు చెన్నైలో షూటింగ్ చేసి దర్శకుడి ప్రజెంటేషన్ చూసిన తర్వాత కశ్మీర్‌కి వెళ్దామని నిర్మాతకు చెప్పానన్నారు. కానీ కథకు తగిన వాతావరణం ఇప్పుడు కశ్మీర్లో ఉంటుందని అక్కడే షూటింగ్ చేద్దామని ఆయన చెప్పారన్నారు. -
ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ‘కన్ని దీవు’
సాక్షి, చెన్నై: ‘కన్ని దీవు’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. నటి వరలక్ష్మీ శరత్ కుమార్, సుభిక్ష, ఐశ్వర్య దత్త, ఆస్నా దేవేరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇది. సుందర్ బాలు దర్శకత్వంలో కృతిక ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ ప్రతాప్ సంగీతాన్ని అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఉత్తర చెన్నై ప్రాంతంలోలోని ఓ హౌసింగ్ బోర్డులో నివశించే నలుగురు యువతుల ఇతివృత్తంతో రూపొందించిన యాక్షన్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రంలోని ‘పోరాడి వా’ అనే సింగిల్ సాంగ్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు. -
మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శిపై కేసులు
మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి అక్రమాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సంఘం 66వ సర్వసభ్య సమావేశం ఆదివారం చెన్నైలో నిర్వహించారు. ఈ సంఘం ఎన్నికలు 2019లో జరిగినా.. అక్రమాలు జరిగాయంటూ ఐసరి గణేష్‌కు చెందిన స్వామి శంకరదాస్ జట్టు చెన్నై హైకోర్టు గుమ్మం తొక్కింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పలు దఫాలు విచారణ జరిపినా న్యాయస్థానం ఇటీవల సంఘం ఎన్నికలు సక్రమమే అంటూ ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో నాజర్ అధ్యక్షతన పోటీ చేసిన పాండవర్ జట్టు విజయం సాధించింది. దీంతో ఆదివారం స్థానిక శాంథోమ్ రోడ్‌లోని శాంథోమ్ హైయ్యర్ సెకండరీ పాఠశాలలో నడిగర్ సంఘం కార్యవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షులు కరుణాస్, పూచి మురుగన్‌లతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెడుతూ సభ్యుల అనుమతి కోరారు. ముఖ్యంగా నడిగర్ సంఘం నూతన భవనాన్ని పూర్తి చేయడం, అందుకు కావాల్సిన నిధుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందడం వంటి అంశాలపై చర్చించారు. చదవండి: ఏంటో.. అందరికి నా బర్త్‌డే సెంటిమెంట్ అయిపోయింది క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది..