మణి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా హీరో కూతురు | Parthepan's daughter to assist Mani Ratnam | Sakshi
Sakshi News home page

మణి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా హీరో కూతురు

Published Thu, Jul 30 2015 12:26 PM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

Parthepan's daughter to assist Mani Ratnam

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, చిత్ర నిర్మాత ఆర్. పార్థిపాన్ కూతురు నటి కీర్తన ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.  కార్తీ సురేశ్, దుల్కర్ సల్మాన్ నటీనటులుగా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఈ ప్రాజెక్టులో సహాయ దర్శకురాలిగా పనిచేస్తూ ఆడిషన్లలో  కీర్తన బిజీగా ఉన్నట్టు సినిమా యూనిట్ పేర్కొంది.

మణిరత్నం దర్శకత్వంలో 2002లో వచ్చిన తమిళ సినిమా 'కన్నాథిల్ ముత్తాముట్టాల్' లో కీర్తన నటించింది. ఆ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రాజెక్టులో హీరోయిన్ కోసం చూస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. నటి కీర్తీ సురేశ్ కథానాయకగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్లో సెట్స్పైకి వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement