Maniratham
-
థగ్‌లైఫ్ షూటింగ్లో ప్రమాదం
సినీ నటులకు సుఖాలే కాదు, కష్టాలు ఎదురవుతుంటాయి. పలువురు నటీనటులు షూటింగ్లో ప్రమాదాలకు గురైన సంఘటలను ఉన్నాయి. కాగా తాజాగా కమల్‌హాసన్ చిత్రం థగ్‌లైఫ్ షూటింగ్లో ప్రమాదం జరిగింది. నటుడు కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం థగ్‌లైఫ్. నటుడు శింబు, త్రిష, మలయాళ నటుడు జోజూ జార్జ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుటికే రాజస్థాన్, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో జరుపుకుని, 60 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ నటుడు కమలహాసన్ ప్రతినాయకులతో పోరాడే సన్నివేశాలను దర్శకుడు మణిరత్నం చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా హెలికాప్టర్ నుంచి మలయాళ నటుడు జోజూ జార్జ్ కిందికి దూకుతుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన కాలి ఎముఖ విరిగిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. దీంతో ఆయన్ని కేరళ రాష్ట్రంలోని కొచ్చికి పంపించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా థగ్‌లైఫ్ చిత్రం తదుపరి షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఐరోపాకు బయలుదేరనున్నట్లు వెల్లడించాయి. -
విశ్వనటుడితో మాజీ ప్రపంచసుందరి.. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లోనే!
కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ గతేడాది కథానాయకుడిగా నటించి, నిర్మించిన విక్రమ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదేవిధంగా తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కల్కీ చిత్రంలో కమలహాసన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మరోసారి నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ కాంబోలో తెరకెక్కనున్న భారీ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనకి థగ్స్ లైఫ్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేయగా.. అందులో కమలహాసన్ తన శత్రువులతో తన పేరు రంగరాయ శక్తివేల్ నాయకన్. కాయల్ పట్టికారన్( కాయల్పట్టికి చెందిన వాడిని) అని చెప్పే డైలాగ్స్ థగ్స్ లైఫ్ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో త్రిష, కమలహాసన్‌కు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ భారీ క్రేజీ చిత్రంలో దర్శకుడు మణిరత్నం అభిమాన నటి, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కమలహాసన్, ఐశ్వర్యారాయ్ కలిసి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. త్రిష, జయంరవికి గానీ, దుల్కర్సల్మాన్కుగానీ జంటగా నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో దుల్కర్సల్మాన్, జయంరవి, త్రిష ముఖ్యపాత్రలు పోషించనున్నారు. -
కథ మళ్లీ కలిపింది
ఒక హీరో–ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమా ఇస్తే.. వారిది ‘హిట్ కాంబో’ అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్లో రెండో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తమ కాంబో రిపీట్ అవ్వాలని హీరో–డైరెక్టర్‌కి కూడా ఉంటుంది. కానీ కథ కుదరాలి. అలా కొందరు హీరో–దర్శకులను మళ్లీ కథ కలిపింది. రెండోసారి రిపీట్ అవుతున్న ఆ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. దశాబ్దాల తర్వాత హీరోగా కమల్‌హాసన్, దర్శకుడిగా మణి రత్నంలది ఇండస్ట్రీలో సుధీర్ఘ ప్రయాణం. కానీ కమల్‌హాసన్, మణిరత్నంల కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రం ఒక్కటే. అదే ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’–1987). అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్బాస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ కమల్, మణిరత్నంల కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ముప్పైఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమల్, మణిరత్నంల కాంబో రిపీట్ కానుంది. మరోవైపు దర్శకుడు శంకర్‌తో ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు కమల్‌హాసన్. శంకర్, కమల్ కాంబోలోనే 1996లో రిలీజైన బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్ ఇది. సో.. కమల్–శంకర్ కాంబో మళ్లీ సెట్ అవ్వడానికి పాతికేళ్లు పైనే పట్టింది అన్నమాట. దేవర ఎన్టీఆర్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్’ ఒకటి. క్లాస్ టచ్‌తో మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. విస్మరణకు గురైన భారతదేశ తీర ప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్‌లోని పవర్ఫుల్ మాస్ యాంగిల్‌ని ‘ఇస్మార్ట్ శంకర్’ (2019)లో వెండితెరపైకి తెచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్ కెరీర్లకు ఆ సమయంలో బాగా బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేయనున్నారు రామ్ అండ్ పూరి. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ ‘గీత గోవిందం’ (2018)తో రూ. వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. ఐదేళ్ల తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో సెకండ్ ఫిల్మ్‌గా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. కాగా ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. అడ్వంచరస్ డ్రామా రెండున్నరేళ్ల క్రితం కోవిడ్ సమయంలో విడుదలైన ‘భీష్మ’ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పుడు నితిన్–వెంకీ కుడుమల రెండోసారి మరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల మొదలయ్యాయి. అడ్వెంచరస్ ఎంటర్టైనర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాక్షస రాజు ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రంలో జోగేంద్ర పాత్రలో హీరో రానా కాస్త నెగటివ్ షేడ్స్‌లో మెప్పించారు. అలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తేజ. అయితే రానా, తేజ కాంబోలో మరో సినిమా కన్ఫార్మ్ కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. రానా, తేజ కాంబినేషన్లోని సెకండ్ ఫిల్మ్ ‘రాక్షస రాజు’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. భైరవ కోనలో... ‘టైగర్’ (2015) చిత్రం కోసం తొలిసారి చేతులు కలిపారు హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు, దర్శకులు తమ కాంబోలో రెండో సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. -
ఐశ్వర్య రాయ్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుందో చుడండి..
-
ఘనంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 యాంథెమ్ లాంఛ్
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష ఈ హిస్టారికల్ మూవీలో నటించారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష ఈ హిస్టారికల్ మూవీలో నటించారు. -
పీకల్లోతు కష్టాల్లో మణిరత్నం... పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ డౌటే!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది మణిరత్నంకి కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ సినిమా కొనేందుకు బయ్యర్లు కరువైయ్యారు. తమిళ రైటర్ కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కించాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలను మణిరత్నం ఒకేసారి చిత్రీకరించాడు. గతేడాది పాన్ ఇండియా మూవీగా విడుదలైన పొన్నియిన్ సెల్వన్ కోలీవుడ్ మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రేక్షకాదరణ పొందలేదు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ కోలీవుడ్‌లో మాత్రం 200 కోట్లు వసూలు చేసింది. హిస్టారికల్ మూవీ అయినా... ఈ సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించింది. దీంతో సినిమాకి కలెక్షన్స్ వచ్చినా... అదర్ స్టేట్స్లో మాత్రం ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోయింది. మణిరత్నం మూవీ కావటం.. ఇందులో ఐశ్వర్య నటించటంతో బాలీవుడ్లో హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్ పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ తర్వాత కంటిన్యూ కాలేదు. దీంతో ఈ సినిమాకి కోలీవుడ్‌లోనే మంచి ప్రేక్షకాదరణ లభించింది. అందుకే ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే రూ. 200 కోట్లు కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ టాక్ సంగతి పక్కన పెడితే పాన్ ఇండియా వైడ్‌గా దాదాపు 450 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఈ ఊపులో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఏప్రిల్ 28 విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. సెకండ్ పార్ట్‌పై మణిరత్నం టీం భారీ ఆశలే పెట్టుకుంది. పార్ట్ 1కి వచ్చిన కలెక్షన్స్ చూసి పాన్ ఇండియా రేంజ్ లో పి.ఎస్.2 బిజినెస్ జరుగుతుందని అంచనా వేశారు. ఈ సినిమా బిజినెస్ తమిళంలో తప్ప మిగిలిన మిగతా భాషల్లో సరిగ్గా జరగటం లేదట. ఇక రెండు తెలుగు రాష్రాల్లో పి.ఎస్.2 తెలుగు హక్కులు కొనేందుకు ఎవరు ముందుకి రాలేదట. టాలీవుడ్ లో లైకా ప్రొడక్షన్స్ ప్రయత్నాలు వర్కౌవుట్ కాకపోవటంతో...మణిరత్నం రంగంలోకి దిగినా ఉపయోగం కనిపించలేదనే మాట ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. బయర్స్ కొనేందుకు ముందుకి రాకపోవటంతో... మణిరత్నంతో పాటు.. ప్రొడ్యూసర్స్ పి.ఎస్.2కి హైప్ తీసుకువచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారట. కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష ఈ హిస్టారికల్ మూవీలో నటించారు. పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా వీళ్లందరితో ప్రమోషన్స్ చేయించి పి.ఎస్.2 కి హైప్ తీసుకురావాలని మణిరత్నం ఆలోచిస్తున్నాడట. మరి మణిరత్నం ప్లాన్ ఎంత వరకు వర్కౌవుట్ అవుతుందో చూడాలి మరి. -
కొత్త కోణం
ఇన్ని సంవత్సరాలుగా ఐశ్వర్యా రాయ్‌ను రకరకాల పాత్రల్లో చూశాం. అందం, అభినయం బ్యాలెన్స్ చేస్తూ గుర్తుండిపోయే రోల్స్ చేశారామె. అయినా నటిగా ఆమె దాహం తీరలేదు. లేటెస్ట్గా ఐష్ తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకురానున్నారని తెలిసింది. ఆమె నెగటివ్ రోల్లో కనిపించనున్నారట. తమిళ ఫేమస్ నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్, శింబు, జయం రవి, కార్తీ, నయనతార, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. ఇందులో ఐశ్వర్యా రాయ్ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అధికార దాహం కలిగిన రాణి పాత్రలో ఐష్ నటించనున్నారట. చోళుల సామ్రాజ్యం చుట్టూ ఈ కథ సాగనుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
లవ్ అంటే నేనేలే...
విరాజ్.జె అశ్విన్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధీ కుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. టి.ప్రతాప్ దర్శకత్వం వహించారు. కె. సతీష్ కుమార్ సమర్పణలో కె.ఎల్.యన్.రాజు నిర్మించిన ఈ సినిమాలోని ‘లవ్ అంటే నేనేలే..’ పాటను ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘లవ్ అంటే నేనేలే’ పాటకు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని అభినందనలు తెలిపారు. కె.ఎల్.యన్.రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని పాటను మణిరత్నంగారు విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది. ‘లవ్ అంటే నేనేలే..’ పాటను శ్రీమణి రచించగా, దేవన్ ఆలపించారు. ఈ సాంగ్‌ని మలేసియాలోని పలు సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కాశీ విశ్వనాథ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, కెమెరా: ఎదురొలు రాజు. -
మణి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా హీరో కూతురు
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, చిత్ర నిర్మాత ఆర్. పార్థిపాన్ కూతురు నటి కీర్తన ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కార్తీ సురేశ్, దుల్కర్ సల్మాన్ నటీనటులుగా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఈ ప్రాజెక్టులో సహాయ దర్శకురాలిగా పనిచేస్తూ ఆడిషన్లలో కీర్తన బిజీగా ఉన్నట్టు సినిమా యూనిట్ పేర్కొంది. మణిరత్నం దర్శకత్వంలో 2002లో వచ్చిన తమిళ సినిమా 'కన్నాథిల్ ముత్తాముట్టాల్' లో కీర్తన నటించింది. ఆ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రాజెక్టులో హీరోయిన్ కోసం చూస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. నటి కీర్తీ సురేశ్ కథానాయకగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది.