మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది మణిరత్నంకి కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది.
ఈ సినిమా కొనేందుకు బయ్యర్లు కరువైయ్యారు. తమిళ రైటర్ కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కించాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలను మణిరత్నం ఒకేసారి చిత్రీకరించాడు. గతేడాది పాన్ ఇండియా మూవీగా విడుదలైన పొన్నియిన్ సెల్వన్ కోలీవుడ్ మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రేక్షకాదరణ పొందలేదు.
భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ కోలీవుడ్‌లో మాత్రం 200 కోట్లు వసూలు చేసింది. హిస్టారికల్ మూవీ అయినా... ఈ సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించింది. దీంతో సినిమాకి కలెక్షన్స్ వచ్చినా... అదర్ స్టేట్స్‌లో మాత్రం ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోయింది. మణిరత్నం మూవీ కావటం.. ఇందులో ఐశ్వర్య నటించటంతో బాలీవుడ్‌లో హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్ పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ తర్వాత కంటిన్యూ కాలేదు.
దీంతో ఈ సినిమాకి కోలీవుడ్‌లోనే మంచి ప్రేక్షకాదరణ లభించింది. అందుకే ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే రూ. 200 కోట్లు కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ టాక్ సంగతి పక్కన పెడితే పాన్ ఇండియా వైడ్‌గా దాదాపు 450 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఈ ఊపులో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఏప్రిల్ 28 విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
సెకండ్ పార్ట్‌పై మణిరత్నం టీం భారీ ఆశలే పెట్టుకుంది. పార్ట్ 1కి వచ్చిన కలెక్షన్స్ చూసి పాన్ ఇండియా రేంజ్ లో పి.ఎస్.2 బిజినెస్ జరుగుతుందని అంచనా వేశారు. ఈ సినిమా బిజినెస్ తమిళంలో తప్ప మిగిలిన మిగతా భాషల్లో సరిగ్గా జరగటం లేదట. ఇక రెండు తెలుగు రాష్రాల్లో పి.ఎస్.2 తెలుగు హక్కులు కొనేందుకు ఎవరు ముందుకి రాలేదట. టాలీవుడ్ లో లైకా ప్రొడక్షన్స్ ప్రయత్నాలు వర్కౌవుట్ కాకపోవటంతో...మణిరత్నం రంగంలోకి దిగినా ఉపయోగం కనిపించలేదనే మాట ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.
బయర్స్ కొనేందుకు ముందుకి రాకపోవటంతో... మణిరత్నంతో పాటు.. ప్రొడ్యూసర్స్ పి.ఎస్.2కి హైప్ తీసుకువచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారట. కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష ఈ హిస్టారికల్ మూవీలో నటించారు. పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా వీళ్లందరితో ప్రమోషన్స్ చేయించి పి.ఎస్.2 కి హైప్ తీసుకురావాలని మణిరత్నం ఆలోచిస్తున్నాడట. మరి మణిరత్నం ప్లాన్ ఎంత వరకు వర్కౌవుట్ అవుతుందో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment