Mani Ratnam
-
ఆయన నుంచి ఫోన్ వస్తే చాలు.. చేయి కోసుకోవడానికైనా రెడీ: హీరోయిన్
హీరోహీరోయిన్లుకు కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. పలానా పాత్ర చేయాలని.. అలాంటి సినిమాల్లో నటించాలని అనుకుంటారు. అంతేకాదు కొంతమంది దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చాలు.. చిన్న పాత్ర అయినా సరే చేసేందుకు రెడీ అవుతారు. అలా ఓ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అన్ని వదిలేసి ఆయన మూవీ కోసం ఎదురు చూస్తాను అంటోంది సీనియర్ నటి ప్రియమణి(Priyamani ). అంతేకాదు ఆయన సినిమాలో నటించేందుకు చేసు కూడా కోసుకుంటాను అని చెబుతోంది. ఇంతకీ ఆ గొప్ప దర్శకుడు ఎవరంటే..?ఫోన్ వస్తే చాలు.. దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే.. అందులో కచ్చితంగా మణిరత్నం(Mani Ratnam) పేరు ఉంటుంది. సౌత్ సినిమా దశాదిశను మార్చేసిన అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన తెరకెక్కించిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే మాస్టర్ క్లాసిక్ మూవీస్. ఆయనతో ఒక్క సినిమా చేసిన చాలు అనుకునే హీరోహీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు మణిరత్నం ఫేవరేట్ డైరెక్టర్. వారిని తెరపై అందంగా, డిఫరెంట్‌గా చూపించే డైరెక్టర్ ఆయన. అందుకే ఆయన సినిమాలో చాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకోదు. కమిట్ అయిన సినిమాలను వదిలేసి మరీ.. మణిరత్నం సినిమాల్లో నటిస్తారు. ప్రియమణికి కూడా మణిరత్నం అంటే చాలా ఇష్టం. తాజగా ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం గురించి మాట్లాడుతూ.. ‘మణి సార్ నుండి ఫోన్ రాగానే నేను ఆయన సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా అన్నట్టు సిద్ధంగా ఉంటాను. ఆయన సినిమాలో నటించడమే గొప్ప అదృష్టం. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాలో నటించాలనే కోరిక పుడుతుంది. అది ఎలాంటి పాత్ర అయినా సరే ’’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. గతంలో మణిరత్నం తెరకెక్కించిన రావన్ సినిమాలో ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే.బాలీవుడ్లో బిజీ బిజీఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియమణి.. పెళ్లి తర్వాత చిత్రపరిశ్రమకు కాస్త గ్యాప్ ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి..సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తోంది. సినిమాలతో పాటు పలు టీవీ షోలు, వెబ్ సిరీస్ చేస్తూ అటు వెండితెర, ఇటు బుల్లితెరను ఏలేస్తోంది. ఆ మధ్య బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది.ప్రస్తుతం హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ప్రియమణి. ఇప్పటికే ఈ సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తుండగా తన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. -
సఖి.. ఫస్ట్ ఆ హీరోహీరోయిన్లతో తీద్దామనుకున్నా: మణిరత్నం
సఖి సినిమా (Sakhi Movie) అప్పట్లో సెన్సేషనల్ హిట్. పేరుకే డబ్బింగ్ మూవీ కానీ తెలుగులోనూ ఈ సినిమాను తెగ ఆరాధించారు. ఇంతకీ ఈ చిత్రం ఒరిజినల్ వర్షన్ ఏదో తెలుసా..? అలై పాయుతే (Alai Payuthey Movie). అలై పాయుతే అనే తమిళ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాడు. ఆర్ మాధవన్, శాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. థియేటర్లలో వంద రోజులకు పైనే ఆడిన ఈ మూవీని తర్వాత హిందీలో సాతియా పేరిట రీమేక్ చేశారు. ఇంకేముంది అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ అయింది.మాధవన్‌కు బదులుగా..తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. సఖి సినిమా కోసం మొదట బాలీవుడ్ హీరోహీరోయిన్లను అనుకున్నట్లు తెలిపాడు. మణిరత్నం మాట్లాడుతూ.. నేను ఫస్ట్ షారూఖ్, కాజోల్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాను. షారూఖ్ దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. కానీ అప్పటికి క్లైమాక్స్ సరిగ్గా కుదర్లేదు. అందుకని దాన్ని పక్కనపెట్టేసి షారూఖ్‌తో దిల్సే సినిమా చేశాను. ఆ మూవీ అయిపోయేసమయానికి సఖి క్లైమాక్స్‌ను ఎలా తీర్చిదిద్దాలన్న ఆలోచన తట్టింది అని చెప్పుకొచ్చాడు. మణిరత్నం చివరగా పొన్నియన్ సెల్వన్ 2 తెరకెక్కించాడు.చదవండి: సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్! -
సినిమా... సాహిత్యం మధ్య సాన్నిహిత్యం పెరగాలి: దర్శకుడు మణిరత్నం
‘‘సినిమా... సాహిత్యం మధ్య ఎంత సాన్నిహిత్యం పెరిగితే అంతగా భారతీయ సినిమా మెరుగుపడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు దక్షిణాది దర్శక దిగ్గజం మణిరత్నం. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో భాగంగా ‘ట్రాన్స్ఫార్మింగ్ లిటరరీ మాస్టర్‌పీస్’ అనే అంశంపై ‘మాస్టర్ క్లాస్’లో ఆయన మాట్లాడారు. మరో దక్షిణాది ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా మణిరత్నంతో సంభాషించారు. ‘‘నేను ఇప్పటికీ ప్రేక్షకులలో ఒక్కడిగా కూర్చుని సినిమా చూసే వ్యక్తినే’’ అని మణిరత్నం అన్నారు. ఏళ్లుగా మాస్టర్ పీస్ లాంటి సినిమాలు అందిస్తున్నప్పటికీ తనను తాను అనుభవశూన్యుడిలా, ప్రారంభ దశలో ఉన్నట్లుగానే భావిస్తాను అన్నారాయన. సినిమా, సాహిత్యం మధ్య లోతైన అనుబంధం ఏర్పడేలా సినిమా నిర్మాతలు చూడాలని మణిరత్నం కోరారు.పుస్తకానికి దృశ్యరూపం ఇవ్వాలంటే...పుస్తకాలను చలన చిత్రాలలోకి మార్చడంలోని సూక్ష్మ నైపుణ్యాలను ఈ సందర్భంగా మణిరత్నం వివరించారు. ‘‘సినిమాలు దృశ్య మాధ్యమానికి చెందినవి. కానీ పుస్తకాలు ప్రధానంగా ఊహాజనితమైనవి. పుస్తకాలకు దృశ్యరూపం ఇచ్చేటప్పుడు ఫిల్మ్ మేకర్‌కు అదనపు సామర్థ్యం ఉండాలి. పాఠకుడి ఊహకు ప్రాణం పోయడంలో జాగ్రత్త వహించాలి’’ అని సూచించారు. ఇంకా పురాణాలు, ప్రాచీన భారతీయ చరిత్ర తన దృక్పథాన్ని ప్రభావితం చేశాయని మణిరత్నం అన్నారు. కల్కి కృష్ణమూర్తి 1955 నాటి ఐకానిక్ రచనల నుంచి స్వీకరించిన తన ‘΄పొన్నియిన్ సెల్వన్’ చిత్రం గురించి మాట్లాడుతూ... చోళుల కాలాన్ని చిత్రించేందుకు పడిన వ్యయ ప్రయాసలను వివరించారు. తంజావూరులో ఆ కాలపు అవశేషాలు కూడా లేకుండా యాయని, అయితే సెట్లను రూపొందించడానికి ఇష్టపడక భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో షూటింగ్ చేశామని, అక్కడి నిర్మాణాన్ని చోళుల వాస్తుశిల్పం ప్రకారం మార్చామనీ అన్నారు. సృజనాత్మక స్వేచ్ఛను తీసుకుంటున్నప్పుడు ఆలోచనాత్మకంగా, పుస్తకాన్ని దాని అసలు స్ఫూర్తిని కాపాడేలా చూడాలని యువ సినీ రూపకర్తల్ని మణిరత్నం కోరారు.వినోదమే ప్రధానం: శివ కార్తికేయన్‘‘సినిమా పరిశ్రమలోకి రావడానికి నేను ఏ లక్ష్యాలను పెట్టుకోలేదు. కేవలం ప్రేక్షకులకు వినోదం అందించాలని తప్ప’’ అన్నారు ప్రముఖ నటుడు శివ కార్తికేయన్. ‘ఇఫీ’లో భాగంగా కళా అకాడమీ ప్రాంగణంలోని ఇంట్రాక్టీవ్ సెషన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి ఖుష్బూ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ... తాను స్టార్ కావాలని రాలేదని, చేసే పాత్రల ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచాలనుకున్నానని, అందుకు అనుగుణంగానే తొలుత టీవీ కార్యక్రమాలు... ఆ తర్వాత అంతకన్నా పెద్దదైన వెండితెరపైనా అవకాశాలు అందుకున్నాననీ శివ కార్తికేయన్ పేర్కొన్నారు. 200 సినిమాలకు పైగా నటించినా ఇప్పటికీ తన లక్ష్యం ప్రేక్షకులకు వినోదం అందించడమే అన్నారాయన. – గోవా నుంచి సాక్షి ప్రతినిధిఇఫీలో ఎమ్ 4 ఎమ్మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’(మోటివ్ ఫర్ మర్డర్). జో శర్మ, సంబీత్ ఆచార్య లీడ్ రోల్స్‌లో నటించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ హిందీ ట్రైలర్‌ని ‘ఇఫీ’లో శనివారం విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం గురించి మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ–‘‘యూనివర్సల్ సబ్జెక్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’. ప్రేక్షకులు మా మూవీని చూసి థ్రిల్ అవుతారు’’ అన్నారు. -
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లకు చెక్..
-
మూడు దశాబ్దాల తర్వాత..?
హీరో రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన ‘దళపతి’ (1991) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే (మమ్ముట్టి, అరవింద్ స్వామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు). ఆ చిత్రం తర్వాత రజనీకాంత్–మణిరత్నం మరో సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌తో సినిమా చేయాలని మణిరత్నం ఓ కథ రెడీ చేశారని, మణిరత్నంతో సినిమా చేసేందుకు రజనీ కూడా ఆసక్తి చూపిస్తున్నారని టాక్. రజనీకాంత్ బర్త్ డే (డిసెంబరు 12) సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని కోలీవుడ్ భోగట్టా. మరి మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్ – మణిరత్నం కాంబినేషన్లో సినిమా సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే. -
ఆయనతో సినిమా చేయలేదని రెండు నెలలు ఏడ్చా: హీరో
మణిరత్నం సినిమాలో నటించే ఛాన్స్ చేజారడంతో రెండు నెలలు ఏడ్చానంటున్నాడు హీరో చియాన్ విక్రమ్. బొంబాయి సినిమాలో నటించే ఛాన్స్ ఫస్ట్ తనకే వచ్చిందని, కానీ మిస్సయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ.. నాకు బొంబాయి సినిమా ఆఫర్ వచ్చింది. ఆడిషన్‌కు కూడా వెళ్లాను. ప్రతి ఒక్కరి కలకాకపోతే అక్కడ ఒక వీడియో కెమెరాకు బదులు స్టిల్ కెమెరా ముందు పెట్టి నటించమన్నాడు. నీ ముందు ఒక అమ్మాయి పరిగెడుతుంది. తనను చూస్తూ ఉండిపోవాలన్నాడు. నాకేం అర్థం కాలేదు. అక్కడ వీడియో కెమెరానే లేనప్పుడు నేనెందుకు నటించాలన్నట్లు ఊరికనే నిలబడ్డాను. దీంతో ఆ మూవీలో నన్ను సెలక్ట్ చేయలేదు. మణిరత్నంతో సినిమా చేయాలన్నది ప్రతి ఒక్క నటుడి కల. ఇంకేం వద్దనుకున్నా..ఆయనతో ఒక్క సినిమా చేసి రిటైర్ అయిపోయినా చాలనుకున్నాను. అంతకంటే ఎక్కువ ఏదీ ఆశించలేదు. ఉదయం మనీషా కొయిరాలా ఫోటోషూట్, సాయంత్రం నాది. కానీ ఇంతలోనే అంతా బెడిసికొట్టింది. రెండునెలలపాటు ఏడుస్తూనే ఉన్నాను. అయ్యో, మణిరత్నం సినిమా చేజారిపోయిందేనని బాధపడుతూనే ఉన్నాను. ప్రతీకారం తీర్చుకున్నాతర్వాత బొంబాయి మూవీ పాన్ ఇండియా రేంజ్లో హిట్టయింది. అయితే తర్వాత మాత్రం ఆయనతో రెండు సినిమాలు తీసి ప్రతీకారం తీర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా విక్రమ్ తర్వాత మణిరత్నం డైరెక్షన్లో రావన్, పొన్నియన్ సెల్వన్ సినిమాలు చేశాడు.చదవండి: పదేళ్లుగా ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నా: సాయి పల్లవి -
ఇక ప్రచారం తర్వాతే..!
‘విక్రమ్’ (2022) మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత కమల్‌హాసన్ తదుపరి చిత్రం కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిజానికి శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్’ (భారతీయుడు)కి సీక్వెల్‌గా కమల్ చేసిన ‘ఇండియన్ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల షూటింగ్లో జాప్యం జరిగింది. ఈ ఏడాది ఈ చిత్రం థియేటర్‌కి వచ్చే అవకాశం ఉంది. దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన ‘ఇండియన్’కి సీక్వెల్ కావడంతో ‘ఇండియన్2’పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా కమల్‌హాసన్ అంగీకరించిన మరో చిత్రంపై కూడా అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అదే ‘థగ్ లైఫ్’. కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘నాయగన్’ (నాయకుడు) తర్వాత దాదాపు 35 ఏళ్లకు ఈ కాంబినేషన్ ‘థగ్ లైఫ్’తో రిపీట్ అవుతోంది. అయితే ఈ చిత్రం షూటింగ్‌కి కాస్త బ్రేక్ పడింది. ఈ విషయం గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్‌హాసన్ మాట్లాడుతూ – ‘‘ఇండియన్ 2, ఇండియన్ 3’ చిత్రాల షూటింగ్ పూర్తయింది. రెండో భాగం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత మూడో భాగం పనులు కూడా ఆరంభమవుతాయి. ‘కల్కి 2898ఏడీ’లో గెస్ట్ రోల్ చేశాను. ఇక ‘థగ్ లైఫ్’ షూటింగ్‌ని ఎన్నికల ప్రచారం తర్వాత మొదలుపెడతాం’’ అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటివరకూ ‘థగ్ లైఫ్’ షూటింగ్ కొంత భాగం జరిగింది. ఈ మార్చిలో సెర్బియాలో షెడ్యూల్ ప్లాన్ చేశారు దర్శకుడు మణిరత్నం. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆ షెడ్యూల్‌ను వాయిదా వేశారు. ఎన్నికల ప్రచారం తర్వాతే ఈ షూటింగ్లో కమల్‌హాసన్ పాల్గొంటారు. ఈ చిత్రంలో కమల్ మూడు పాత్రల్లో కనిపిస్తారని టాక్. ఇక ‘మక్కల్ నీది మయమ్’ పేరిట 2018లో కమల్‌హాసన్ పొలిటికల్ పార్టీ ఆరంభించిన సంగతి తెలిసిందే. -
స్టార్ హీరో పక్కన సినిమా ఛాన్స్.. నో చెప్పిన 'సూర్య' చెల్లెలు
మాధవన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'అమృత' సినిమా తెలుగులో వచ్చింది. తమిళ టైగర్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'అమృత' సినిమా ఒక మాస్టర్ పీస్‌లా నిలిచిపోయింది. తమిళ్లో మొదట 'కన్నతిల్ ముత్తమిట్టల్' అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు , మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ , ఏడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఆరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది . ఈ అవార్డ్స్ చాలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్‌ను బృందా శివకుమార్ మిస్ చేసుకుంది. కోలీవుడ్ టాప్ హీరోలు అయిన సూర్య, కార్తీలకు ఆమె ముద్దుల చెల్లెలు అనే విషయం తెలిసిందే. మాధవన్ సరసన సిమ్రాన్ అదిరిపోయే నటనతో మెప్పించిన సిమ్రాన్ స్థానంలో బృందా ఉండాల్సింది. డైరెక్టర్ మణిరత్నం కూడా బృందా అయితే సరిగ్గా కథకు సెట్ అవుతుందని అనుకున్నారట.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సూర్య, కార్తీ ఇద్దరూ కోలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తీ.. నేడు పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. మొదట్లో తనకు నటించడం తెలియదనే విమర్శలను ఎదుర్కొన్న సూర్య నేడు కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ ఒక్కగానొక్క సోదరి మాత్రం సినీరంగంలో గాయనిగా అరంగేట్రం చేసి పలు చిత్రాల్లో పాటలు కూడా పాడింది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదే విధంగా, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్లో అలియా భట్‌కి బృందా డబ్బింగ్ కూడా చెప్పింది. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉన్న బృందా శివకుమార్‌కి హీరోయిన్గా అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించింది. అందుకు తగ్గట్టుగానే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'కన్నతిల్ ముత్తమిదళ్' (అమృత) చిత్రంలో మాధవన్ సరసన నటించేందుకు బృందాని మొదట సంప్రదించారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుధా కొంగర ద్వారా బృందాతో సంప్రదింపులు జరిపారు. కానీ తనకు నటనపై ఆసక్తి లేదని బృందా రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్‌ను ఆ పాత్రలో తీసుకున్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'కన్నతిల్ ముత్తమిట్టల్' చిత్రంలో నటించే అవకాశాన్ని సూర్య చెల్లెలు తిరస్కరించిందనే వార్త అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. -
రోజా సూపర్ హిట్.. డైరెక్టర్‌కు ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి?: హీరోయిన్
ప్రతి నటీనటుడి జీవితంలో కొన్ని మర్చిపోలేని సినిమాలుంటాయి. వారి కెరీర్‌ను అందలమెక్కించిన చిత్రాలను అంత ఈజీగా మర్చిపోలేరు. అలా సీనియర్ హీరోయిన్ మధుబాల జీవితంలో 'రోజా' మూవీ ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 1992లో వచ్చిన ఈ సినిమాను మణిరత్నం అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందుకే అది అప్పటికీ, ఇప్పటికీ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది. ఆయనంటే నాకు గౌరవం.. కానీ.. అయితే ఈ మూవీ తర్వాత దర్శకుడితో స్నేహపూర్వకంగా మసులుకోలేదట మధుబాల. తన యాటిట్యూడ్‌తో అందరినీ దూరం పెట్టిందట. రోజా క్రెడిట్‌ను కూడా అతడికి ఇవ్వలేదట. అందుకు ఇప్పుడు బాధపడుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మణి సర్ అందరితోనూ బాగానే ఉండేవారు. అతడితో టచ్‌లో ఉండేందుకు చాలాసార్లు ప్రయత్నించాను.. మెసేజ్‌లు పంపాను. ఆయనంటే నాకు ఎంతో అభిమానం, గౌరవం. యాటిట్యూడ్ చూపించా.. కానీ రోజా మూవీ రిలీజైన సమయంలో ఇలా లేను. ఆయన నాకేం ఫేవర్ చేశాడని? తనకు రోజాలాంటి అమ్మాయి కావాలి.. నాలో రోజాను చూసుకున్నాడు కాబట్టి నన్ను తన సినిమాకు తీసుకున్నాడు. అంతేగా.. అందులో ప్రత్యేకత ఏముంది? ఇలా ఆటిట్యూడ్ చూపించేదాన్ని. నేను పడ్డ బాధలో నుంచే ఈ అహంకారం, కోపం పుట్టుకొచ్చాయి. ఎందుకంటే నా కెరీర్లో ఎవరూ నన్ను సపోర్ట్ చేయలేదు. మేకప్ దగ్గరి నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నేనే రెడీ చేసుకునేదాన్ని. ఒక్కదాన్నే అంతా చేసుకున్నాను. అందుకే ఎవరికైనా గుర్తింపు ఇవ్వడానికి మనసొప్పేది కాదు. స్నేహపూర్వకంగా మసులుకోలేదు.. అందుకే! కానీ మణిరత్నం సర్‌కు ఆ గుర్తింపు, ప్రశంసలు దక్కాల్సిందే! అప్పుడు చెప్పలేకపోయాను.. కానీ ఇప్పుడు చెప్తున్నాను. నాకు గుర్తింపును తీసుకువచ్చిందే ఆయన.. ఆయనకు క్రెడిట్ దక్కాల్సిందే! నేను తనతో స్నేహపూర్వకంగా మెదులుకోలేదు.. అనుబంధాన్ని కొనసాగించలేదు.. అందుకే ఆయన తర్వాతి సినిమాల్లో నన్ను తీసుకోలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా మధు చివరగా శాకుంతలం సినిమాలో నటించింది. అలాగే స్వీట్ కారం కాఫీ అనే తమిళ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. చదవండి: నటుడితో రెండో పెళ్లి.. నెట్టింట ఫోటోలు వైరల్ -
త్రిష థగ్ లైఫ్ ఆరంభం
‘థగ్ లైఫ్’ను ఆరంభించారు హీరోయిన్ త్రిష. ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’. ‘జయం’ రవి, త్రిష, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్, జోజూ జార్జ్, ఐశ్వర్యా లక్ష్మీ ముఖ్య తారలుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు త్రిష. సెట్స్‌లో ‘థగ్ లైఫ్’ స్క్రిప్ట్‌ను పట్టుకుని ఉన్నట్లుగా ఇన్‌స్టా స్టోరీలో త్రిష ఓ చిన్న వీడియోను షేర్ చేశారు. దీంతో ‘థగ్ లైఫ్’ సినిమా షూటింగ్లో త్రిష జాయిన్ అయ్యారని స్పష్టం అయింది. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ పూర్తవ్వగానే, నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం టీమ్ సెర్బియా వెళుతుందని కోలీవుడ్ సమాచారం. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, ఏ. శివ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్రిషకు క్షమాపణలు చెప్పిన ఏవీ రాజు: త్రిషను ఉద్దేశించి తమిళనాడు రాజకీయ నేత ఏవీ రాజు రెండు రోజుల క్రితం చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై లీగల్‌గా ముందుకు వెళ్తానని త్రిష పేర్కొన్నారు. అనంతరం మంగళవారం రాత్రి ఏవీ రాజు స్పందించారు. తాను ఏ యాక్టర్నీ టార్గెట్ చేయాలనుకోవడం లేదని, తన మాటలు తప్పుగా అర్థం చేసుకోబడ్డాయని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఓ వీడియోను రిలీజ్ చేశారు ఏవీ రాజు. -
మణిరత్నం థగ్ లైఫ్‌లో...
హీరో కమల్‌హాసన్–దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో ‘నాయగన్’–1987 (‘నాయకుడు’) తర్వాత 37 ఏళ్లకు రూపొందనున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష, ‘జయం’ రవి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ ఖరారయ్యారు. తాజాగా ఐశ్వర్యా లక్ష్మి ఈ జాబితాలో చేరారు. ఈ చిత్రంలో ఆమె నటించనున్నట్లు గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. మరో విషయం ఏంటంటే... ‘థగ్ లైఫ్’లోకి ఐశ్వర్యా రాయ్ ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో ‘ఇద్దరు, గురు, రావణ్, పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాల్లో ఐశ్వర్యా రాయ్ నటించారు. మరి... ‘థగ్ లైఫ్’లో ఆమె నటించనున్నది నిజమేనా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మణిరత్నం, కమల్‌హాసన్, మహేంద్రన్, శివ అనంత్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావచ్చాయని, ఈ నెలాఖరులో షూటింగ్ ఆరంభమయ్యే చాన్స్ ఉందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
Mani Ratnam: డైరెక్టర్ ‘మణిరత్నం’ అరుదైన చిత్రాలు
-
రంగరాయ శక్తివేల్ నాయకర్.. థగ్‌లైఫ్
‘నాయగన్ ’(1987) చిత్రం తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూ΄÷ందుతున్న తాజా చిత్రానికి ‘థగ్ లైఫ్’ టైటిల్‌ని ఖరారు చేసి, టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను సోమవారం రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ చిత్రంలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి కీలక ΄ాత్రలు ΄ోషించనున్నట్లు కూడా వెల్లడించారు. ‘రంగరాయ శక్తివేల్ నాయకర్.. నాది కాయల్ పట్టినమ్’, ‘రంగరాయ శక్తివేల్ నాయకర్ అంటే క్రిమినల్, గూండా, యాకుజా. యాకుజా అంటే జపనీస్‌లో గ్యాంగ్‌స్టర్ అని అర్థం’, ‘చావు నా కోసం ఎదురుచూడటం ఇదేం తొలిసారి కాదు. చివరిసారి కూడా కాదు’, ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్.. మర్చి΄ోవద్దు’ అని కమల్‌హాసన్ చెప్పే డైలాగ్స్ ‘థగ్స్ లైఫ్’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో ఉన్నాయి. కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నేడు కమల్ బర్త్ డే సందర్భంగా ‘థగ్ లైఫ్’కి సంబంధించిన విశేషాలను సోమవారం వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: రవి కె.చంద్రన్. -
పాత సినిమాకు సీక్వెల్ చేయబోతున్న కమల్
-
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్‌బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్‌హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్‌బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్‌హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్‌హాసన్ కెరీర్లో ఓ బ్లాక్‌బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్‌హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్‌కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్‌కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్‌ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్‌హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్‌తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
‘జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2023’ తారల సందడి (ఫొటోలు)
-
లోక నాయకుడి సరసన లేడీ సూపర్ స్టార్.. మణిరత్నం భారీ ప్రాజెక్ట్
విశ్వనటుడు కమలహాసన్ ఓ పక్క నటిస్తూ , మరోపక్క సొంత సంస్థలో చిత్ర నిర్మాణాలతో, ఇంకోపక్క బిగ్ బాస్ రియాల్టీ గేమ్స్ షోలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఇండియన్ – 2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా తదుపరి తన సొంత నిర్మాణ సంస్థ రాష్ట్ర కమిటీ నిర్మిస్తూ కథానాయకుడుగా నటిస్తున్న చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా నటుడు శివ కార్తికేయన్ కథానాయకుడిగా కమలహాసన్ నిర్మిస్తున్న ఛత్రపతి షూటింగ్ జరుగుతోంది, అదేవిధంగా శింబు హీరోగా మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించనున్న తన 234వ చిత్రం గురించి అప్డేట్ వెలువడింది. ఈ భారీ చిత్రంలో నటి త్రిష కథానాయకిగా నటించనున్నట్లు ఇంతకుముందు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. నయనతార ఇంతకుముందు కోలీవుడ్‌లో నటుడు రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, శివ కార్తికేయన్, విజయ సేతుపతి, శింబు , జయం రవి, ధనుష్, ఆర్య వంటి స్టార్ హీరోల సరసన నటించారు. అయితే ఒక్క కమలహాసన్‌కు జంటగా మాత్రం ఇప్పటివరకు నటించలేదు. 40 ఏళ్ల వయసులో ఇప్పుడు నయనతారకు ఆ చాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. ఇందులో నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్ ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు సమాచారం. ఈ ప్రెస్టేజియస్ చిత్రానికి సంబంధించిన ప్రొమోను కమలహాసన్ 69వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న అధికారికంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. -
కమల్ హాసన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘నాయకుడు’ మళ్లీ వచ్చేస్తున్నాడు
తమిళసినిమా: కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన నాయకన్(తెలుగులో ‘నాయకుడు’) చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. 36 ఏళ్ల క్రితం తమిళం, తెలుగు భాషల్లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రం ద్వారా నటి శరణ్య కథానాయకిగా పరిచయం అయ్యారు. జనకరాజ్, విజయం ఎంవీ వాసుదేవరావు, ఢిల్లీ గణేష్ తార నటించిన ఈ చిత్రంలో కమలహాసన్ వరదరాజన్ మొదలియార్ అనే ముంబైకి చెందిన అండర్ వరల్డ్ డాన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అందులో ఆయన బాల్య దశ నుంచి చివరి వరకు కమలహాసన్ అద్భుతంగా నటించి మెప్పించారు. నాయకన్ చిత్రం కమలహాసన్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ చిత్రంలోని నటనగాను ఆయన ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్నారు. అదే చిత్రానికి ఉత్తమ కళాదర్శకుడుగా తోటతరణి ఉత్తమ ఎడిటర్‌గా బి.లెనిన్ జాతీయ అవార్డులను అందుకున్నారు. అలాంటి నాయకన్ ఇప్పుడు మరోసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీన్ని ఏటీఎల్ ప్రొడక్షన్ అధినేత మధురాట్ డిజిటల్ టెక్నాలజీతో కమలహాసన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 3న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కమలహాసన్ వీరాభిమానిగా ఈతరం ప్రేక్షకులు కూడా నాయకన్ చిత్రాన్ని చూడాలని తలంపుతో డిజిటల్ ఫార్మెట్లో రూపొందించి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కమలహాసన్ నటించిన వేట్టైయాడు విళైయాడు చిత్రం ఇటీవల మళ్లీ విడుదలై ఆరు వారాలపాటు ప్రదర్శింపబడి మంచి వసూళ్లను రాబట్టిందని చెప్పారు. కాగా నాయకన్ చిత్రం అంతకంటే మంచి వసూళ్లను రాబడుతుందని నమ్మకం ఉందన్నారు. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను కమలహాసన్ చేతులమీదుగా ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నాయకన్ చిత్రాన్ని తమిళనాడులోని 120 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. -
విక్రమ్, జైలర్ సినిమాలను మించిపోయేలా పాన్ ఇండియా రేంజ్లో..
లోకనాయకుడు కమల్ హాసన్, ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కాంబో అంటే మామూలుగా ఉండదు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన నాయకన్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. కాగా చాలా గ్యాప్ తరువాత మరోసారి ఈ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు కూడా! కమల్ హాసన్ 234వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ, మణిరత్నం మద్రాస్ టాకీస్ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. జైలర్‌ను మించిపోయేలా.. త్వరలో సెట్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్న ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రం కమల్ హాసన్ నటించిన విక్రమ్, రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రాల తరహాలో.. అంతకు మించిన స్థాయిలో రూపొందించడానికి మణిరత్నం సిద్ధం అయినట్లు తెలిసింది. ఇందులో ప్రముఖ హీరోలు నటించనున్నట్లు టాక్. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించనున్నట్లు సమాచారం. కమల్ సినిమాలో ఆ స్టార్ హీరోలు మరో ముఖ్య పాత్రలో హీరో శింబును నటింపజేయాలని ప్రయత్నించినా, కొన్ని కారణాల వల్ల ఆయన సెట్ కాకపోవడంతో తనను పక్కన పెట్టేశారు. ఆ పాత్రలో హీరో సూర్యను ఎంపిక చేసే ప్రయత్నాలు జరిగాయనీ, అయితే ఆయన నటించే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు హీరో విక్రమ్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే కాంబో సెట్ అయితే చిత్రం స్థాయి మరింత పెరిగిపోతుందని చెప్పనక్కర్లేదు. చదవండి: ముద్దు కావాలంటూ గోల చేసిన తేజ.. మొత్తానికి సాధించాడు -
ఆ పాయింట్‌తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్‌గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్‌పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లు డైరెక్టర్స్‌కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్
నాలుగుపదుల వయస్సులోనూ త్రిషకు అవకాశాలు వెల్లవెత్తుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ముందు అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ చైన్నె సుందరికి మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో బిగ్ బ్రేక్ ఇచ్చారు. దీనిని రెండు భాగాలుగా త్రిష అందాలను మెరుగుపరచడమే కాకుండా అమెలోని అద్భుతమైన అభినయాన్ని బయటకు తీశారు. (ఇదీ చదవండి: 'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ థైస్ చూసేందుకు కారులో వెళ్లాం') ఆ చిత్రంలోని ఘటనకు ప్రశంసల వర్షం కురిపించుకున్న త్రిష ఆ తరువాత అవకాశాల జోరులో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం విజయ్ సరసన లియో చిత్రంలో నటించిన ఈ బ్యూటీ తదుపరి అజిత్ కథానాయకుడిగా నటించనున్న విడాముయిర్చి చిత్రంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సుదీర్ఘ విరామం తరువాత తెలుగులో చిరంజీవితో జతకట్టే అవకాశం వరించింది. మరికొన్ని నూతన అవకాశాలు ఈ అమ్మడి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో త్రిషకు దర్శకుడు మణిరత్నం నుంచి మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన మెద్రాస్ టాకీస్ పతాకంపై చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన నిర్మించే చిత్రంలో త్రిషను కథానాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మణిరత్నంతో మళ్లీ..
ముప్పై అయిదేళ్ల తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఇందులో భాగంగానే కథలోని ఓ కీలక పాత్ర కోసం మణిరత్నం నుంచి శింబుకు కబురు వెళ్లిందనీ టాక్. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘చెక్క చివంద వానం’ (2018) (తెలుగులో ‘నవాబ్’) సినిమాలో శింబు ఓ లీడ్ రోల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. కమల్–మణిరత్నం కాంబో సినిమాలో శింబు నటిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఇక కమల్, మణిరత్నం కాంబినేషన్లో 1987లో ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) వచ్చిన సంగతి తెలిసిందే. -
నాయకుడులాంటి సినిమా ఇస్తాం
మూడు దశాబ్దాల క్రితం వచ్చిన శక్తిమంతమైన చిత్రాల్లో ‘నాయగన్’ (నాయకుడు–1987 ) ఒకటి. మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 35 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇటీవల ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. మరో రెండు మూడు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ఈ చిత్రం గురించి కమల్‌హాసన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ – ‘‘మణిరత్నంతో ఈ సినిమా గురించి చర్చిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌కి భారీ అంచనాలు ఉంటాయి. ఆ విషయంలో కాస్త ఒత్తిడి ఉంది. అయితే కచ్చితంగా ‘నాయగన్’లా ఒక శక్తిమంతమైన చిత్రాన్ని ఇస్తాం’’ అని పేర్కొన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్-2'.. కానీ కండీషన్స్ వర్తిస్తాయి
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు.కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’నవల ఆధారంగా రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించగా, గత నెలలో రెండో భాగం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. కానీ రెంట్ విధానంలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ స్ట్రీమింగ్ అవుతుంది. అంటే ప్రైమ్ మెంబర్ షిప్‌తో సంబంధం లేకుండా రూ. 399 చెల్లించి సినిమాను చూడొచ్చు. అయితే డబ్బులు కట్టిన 48 గంటల్లోనే సినిమాను చూడటం పూర్తిచేయాలి. మిగిలిన కండీషన్స్ కూడా వర్తిస్తాయి. తమిళంతో పాటు తెలుగు సహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. జూన్ రెండో వారం నుంచి మాత్రం అమెజాన్ సబ్స్క్రైబర్లకు ఉచితంగా పొన్నియన్ సెల్వన్ -2 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించాారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
హీరో విక్రమ్‌తో మరోసారి జతకట్టనున్న ఐశ్వర్య రాయ్
క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడంలో దర్శకుడు మణిరత్నం దిట్ట. ఇంతకుముందు రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్ స్వామి కాంబినేషన్లో దళపతి చిత్రం చేసిన ఈయన ఆ తరువాత శింబు, అరవిందస్వొమి, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, జ్యోతిక, అదితి రావు తదితరులు కాంబోలో చెక్క చివంద వానం తాజాగా విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు వంటి ప్రముఖ తారాగణంతో పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్స్ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రంలో మాజీ ప్రేమికులైన విక్రమ్, ఐశ్వర్యరాయ్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా కమల్ హాసన్ కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, దీని తర్వాత మరో క్రేజీ కాంబినేషన్లో చిత్రం చేయబోతున్నట్లు తాజా సమాచారం. అదే పొన్నియిన్ సెల్వన్ క్రేజీ కాంబినేషన్. క్లియర్‌గా చెప్పాలంటే నటుడు విక్రమ్, ఐశ్వర్య రాయ్ హీరో హీరోయిన్లుగా చిత్రం చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ కాంబినేషన్లో ఇంతకుముందు మణిరత్నం రావణన్ అనే చిత్రం చేసిన విషయం తెలిసిందే. కమలహాసన్‌తో చేసే చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్, ఐశ్వర్య రాయ్‌ల కాంబోలో చిత్రం మొదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. -
PS 2లో జూనియర్ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?
మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’రెండో భాగం పీఎస్ 2 ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 చాలా బాగుందని అంటున్నారు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమే చిన్నప్పటి ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించిన సంగతి తెలిసిందే. (చదవండి: విజయ్ దేవరకొండ, అఖిల్ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’! ) పార్ట్2 లో ఆ పాత్రకు ప్లాష్‌బ్యాక్ ఉంటుంది. అందులో టీనేజ్ నందినిగా ఐశ్వర్య కంటే అందంగా, చక్కగా నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె ఎవరో కాదు.. సారా అర్జున్. ఈమె ఎవరంటారా? అదేనండి.. విక్రమ్, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘నాన్న’ సినిమాలో విక్రమ్‌కు కూతురిగా నటించిన క్యూటీయే ఈ సారా అర్జున్. మతి స్థిమితం లేని నాన్న ప్రేమను అర్థం చేసుకునే కూతురిగా సారా నటన అద్భుతమని చెప్పాలి. 2011లో విడుదలైన ఈ చిత్ర మంచి విజయం సాధించింది. అప్పుడు సారా వయసు కేలవలం ఐదేళ్లు మాత్రమే. (చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక) ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది సారా. ఇక పొన్నియన్ సెల్వన్‌లో చిన్నప్పటి విక్రమ్‌కు ప్రేయసిగా నటించి మెప్పించింది. సినిమాలో ఐశ్వర్యరాయ్, త్రిష,ఐశ్వర్య లక్ష్మీ, శోభిత లాంటి అందగత్తెలు ఉన్నా.. సారా అర్జున్ వారికి ఎక్కడా తగ్గకుండా తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన నటనతో మెప్పించింది. ఈ సినిమా చూసినవారికి చాలా రోజుల పాటు ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అంతేకాదు ఆమె అందం, అభినయం చూస్తే.. త్వరలోనే స్టార్ హీరోయిన్ అవుతుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjun.offical) -
బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం గతేడాదిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక నిన్న (ఏప్రిల్28) రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైంది. ఈ చిత్రానికి ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వినిపించింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. (చదవండి: పొన్నియన్ సెల్వన్ 2 మూవీ రివ్యూ) వీటిలో ఒక్క తమిళనాడులోనే రూ.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. కేరళలో రూ.2.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.80 కోట్లు, కర్ణాటకలో రూ.4.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.55 కోట్లు, ఓవర్సీస్లో రూ.24.70 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రం మొత్తంగా రూ.170 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.172 కోట్లు సాధించాలి. తొలి రోజే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో వీకెండ్‌లోగా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: నాటు నాటు నా టాప్ సాంగ్స్ లిస్టులోనే లేదు: కీరవాణి షాకింగ్ కామెంట్స్) మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. -
PS2 Movie Review: ‘పొన్నియన్ సెల్వన్-2’ మూవీ రివ్యూ
టైటిల్: పొన్నియన్ సెల్వన్-2 నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ దర్శకత్వం : మణిరత్నం సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ విడుదల తేది: ఏప్రిల్28, 2022 ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 పై ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుగు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?రివ్యూలో చూద్దాం. కథేంటంటే... చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్) చిన్న కుమారుడు అరుళ్‌మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) నౌకలో తన రాజ్యానికి తిరిగివెళ్తుండగా శత్రువుడు దాడి చేయడం.. పోరాటం చేస్తూ ఆయన సముద్రంలో పడిపోవడం.. ఒక ముసలావిడ సముద్రంలో దూకి అతన్ని కాపాడటం. ఆ ముసలావిడకు పళవూరు రాణి నందిని (ఐశ్వర్యరాయ్) పోలికలు ఉన్నట్లు చూపించి మొదటి భాగాన్ని ముగించాడు దర్శకుడు మణిరత్నం. (చదవండి: 'ఏజెంట్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?) అసలు ఆ ముసలావిడ ఎవరు? నందినికి ఆ ముసలావిడకి ఎలాంటి సంబంధం ఉంది? అరుళ్మోళికి ఆపద వచ్చినప్పుడల్లా ఆ ముసలావిడ ఎందుకు కాపాడుతుంది? చోళరాజ్యాన్ని నాశనం చేయాలని ప్రతీజ్ఞ పూనిన పాండ్యుల లక్ష్యం నెరవేరిందా? ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్)పై పగ పెంచుకున్న నందిని.. అతన్ని అంతం చేసేందుకు పన్నిన కుట్రలు ఫలించాయా? నందిని విషయంలో తప్పు చేశానని బాధపడుతున్న ఆదిత్య కరికాలుడు చివరకు ఏం చేశాడు? అసలు మందాకిని ఎవరు? ఆమెకు సుందర చోళుడుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు చోళ సామ్రాజ్యానికి రాజు ఎవరయ్యారు? అనేది తెలియాలంటే పొన్నియన్ సెల్వన్ 2 చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తొలి భాగంలో చోళ రాజ్య వ్యవస్థను.. సింహాసనం కోసం సొంతమనుషులే అంతర్గత కుట్రలు చేయడం.. చోళ రాజ్యాన్ని పతనం చేసేందుకు శత్రురాజ్యాలు వేచి చూడడం చూపించారు. ఇక రెండో భాగంలో ఆ కుట్రల వెనుక ఉన్న కారణాలు తెలుపుతూ.. కథను మరింత లోతుగా చూపించాడు. ఆదిత్య కరికాలుడు, నందినిల ప్రేమ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. నందినిని పెళ్లి చేసుకోకుండా ఎవరు అడ్డుపడ్డారనేది మొదట్లోనే చూపించారు. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర, ఎక్కడంటే?) ఆ తర్వాత అరుళ్‌మోళి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? అతను చనిపోయాడని భావించిన శుత్రువులు.. కరికాలుడిని, సుందర చోళుడిని చంపడానికి వేసిన కుట్రలు.. బౌద్దుల సమక్షంలో జరిగే నాటకీయ పరిణామాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెండాఫ్లో మందాకిని నేపథ్యం గురించి తెలిపే సన్నివేశాలు.. ఆదిత్య కరికాలుడు, నందిని మధ్య జరిగే సంఘర్షణలు ఆకట్టుకుంటాయి. నందిని పాత్రకి సంబంధించిన ట్విస్టులు బాగుంటాయి. రాజ్యాధికారం కోసం సొంతవాళ్లే చేసే కుట్రలు.. ప్రేమ, స్నేహం కోసం చేసే త్యాగాలు ఇందులో చూపించారు. అయితే ‘పొన్నియన్ సెల్వన్’ అనేది చోళ రాజులకు సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మణిరత్నం పీఎస్ 2ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో ఎక్కువ పాత్రలు ఉండడం.. అందులో ఒక్కో పాత్రకి రెండు,మూడు పేర్లు ఉండడం.. పైగా చరిత్రపై అందరికి పట్టుఉండకపోవడం ఈ సినిమాకు మైనస్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు చోళుల చరిత్రపై అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే పీఎస్1 టాలీవుడ్లో పెద్దగా ఆడలేదు. పీఎస్ 2 విషయంలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. పీఎస్ 1 చూసిన ప్రేక్షకులకు చోళ రాజ్య వ్యవస్థపై కాస్త అవగాహన వస్తుంది కాబట్టి.. రెండో భాగం నచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి భాగం చూసి వెళ్తేనే రెండో భాగం అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొదటి భాగంతో పోలిస్తే.. రెండో భాగంలో ఐశ్వర్యరాయ్ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. నందినిగా ఆమె నటన అందరిని ఆకట్టుకుంటుంది. విక్రమ్ పాత్రకు నిడివి తక్కువే అయినా.. అతను కనిపించే సన్నివేశాలన్నీ అందరికి గుర్తిండిపోతాయి. పొన్నియన్ సెల్వన్‌గా జయం రవి చక్కగా నటించాడు. కుందవైగా త్రిష తెరపై అందంగా కనిపించింది. కానీ ఆమె నిడివి కూడా చాలా తక్కువే. మొదటి భాగంలో కార్తి పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఇందులో అంత నిడివి ఉండదు కానీ..ఒకటి రెండు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్గా ఆర్.పార్తిబన్, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అంత బాగాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘పొన్నియన్ సెల్వన్ 2’ ట్విటర్ రివ్యూ
ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’నవల ఆధారంగా రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించింది. ఇక రెండో భాగం నేడు (ఏప్రిల్ 28)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 2 కథ ఏంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. (చదవండి: ఆ ముసలావిడ ఎవరు? నందినిని చంపేశాడా?.. ఎన్నో ప్రశ్నలకు సమాధానమే పొన్నియన్ సెల్వన్ 2) పొన్నియన్ సెల్వన్ 2 మొదటి భాగం కంటే చాలా బాగుందంటున్నారు.పార్ట్ 1లో కథనం స్లోగా సాగితే.. పార్ట్ 2లో మాత్రం వేగంగా ఉంటుందని చెబుతున్నారు. చిత్రంలోని ఆర్ట్ డిజైన్ మరియు పాటలతో పాటు డ్రామా చాలా వరకు డీసెంట్‌గా ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి అంతటా పాజిటివ్ టాక్ కనిపిస్తోంది. స్క్రీన్‌ప్లే కూడా పార్ట్ 1 కంటే బాగుందట. మణిరత్నం దర్శకత్వం, రవివర్మ సినిమాటోగ్రఫీపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. #PS2 #PonniyanSelvan2 in USA… Better than first! Everything department top notch 🥵 House full on a weekday show! Mani Ratnam GOAT for a reason!!!@rekhshc @suhansidh — Reev Mani (@reev_mani) April 28, 2023 Movie is so entertaining !! First half is 🔥.. Second half got some lag but at the end looks great.. Some Goosebumps scenes are there.. Great effort from the technicians and ARR did a great job in #PonniyanSelvan2.. Ratting 4/5#PonniyanSelvan2Review #PS2 — VENKATESH ENGLISH PROFESSOR (MOTIVATIONAL SPEAKER) (@venkyjohn67) April 28, 2023 Blockbuster #PonniyanSelvan2 🙏 Part-2 >>>> Next level opening across!! AR Rehman Music ✨🔥 — THE VILLAIN (@NBKzealot) April 28, 2023 Completed watching #PonniyanSelvan2 a well executed movie than its prequel @Karthi_Offl rocked and @actor_jayamravi blasted as #ponniyanselvan @trishtrashers lovely♥️ #Chiyaanvikram totally a blockbuster sequel after some years in kollywood 👍 pic.twitter.com/25DMAUyD0Z — Navaneetha Krishnan (@navaneethanjuno) April 28, 2023 The best feel for chiyaan Anna fans after anniyan I think. Though mahaan is there it’s different case. Today the applause he is deserving is 🔥🔥🔥😭😭😭. @chiyaan finally ur hardwork and success matched bro. #PS2 — Greeshmanth Pulikanti (@PulikantiGreesh) April 28, 2023 #PS2 satisfiable continuation which justifies the part 1. Important events were sequenced appropriately and every character was given its due. Mani Ratnam’s ability to romance stands out again, but we get to see only few in this part. Technically sound, neatly performed. — Abiram Pushparaj (@abirampushparaj) April 28, 2023 #PonniyinSelvan2 Review POSITIVES: 1. Casting 2. Performances (#ChiyaanVikram & #AishwaryaRai) 3. Screenplay 4. Direction 5. Visuals 6. Music & BGM NEGATIVES: 1. Can be slow for some Overall, #PS2 is a terrific sequel that has soul in it👏#PonniyinSelvan2Review #PS2Review pic.twitter.com/mpopG6jx5h — Kumar Swayam (@KumarSwayam3) April 28, 2023 #PonniyinSelvan2 ~ #PS2 is as good as PS1 with an Impressive 2nd half. The big highlight scene of Vikram - Aishwarya is emotionally good. A proper conclusion. (3.5☆/5) pic.twitter.com/olOK1UTLAW — Prince Prithvi (@PrincePrithvi) April 28, 2023 முதல் பகுதி அப்படியே போர் அடிக்காம மெதுவா போகுது இன்டர்வெல் Goosebump மொமண்ட் இரண்டாம் பகுதி தெறிக்க விடுது செம்மையா இருக்கு படத்தின் மேல வச்ச நம்பிக்கைய காப்பற்றி விட்டது 🔥🔥🔥 தமிழ் சினிமாவில் பெருமை #PonniyinSelvan #PonniyinSelvanFDFS — S.NIRMAL KUMAR (@Nirmal_twitt) September 30, 2022 -
Ponniyin Selvan 2: ఆ ముసలావిడ ఎవరు? కుందవై ఏం చేసింది?
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఈ మూవీ మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన భారీ విజయం సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అంతగా ఆదరించపోయినా.. తమిళంలో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం రెండో భాగం రేపు (ఏప్రిల్ 28)న విడుదల కాబోతుంది. మొదటి భాగంలో మిగిలిపోయిన అనేక సందేహాలకు ఈ చిత్రంలో సమధానాలు దొరకనున్నాయి. అసలు పార్ట్ 1లో చెప్పిన స్టోరీ ఏంటి? పార్ట్ 2లో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించబోతున్నాయి? నందిని ప్లాష్‌బ్యాక్ ఏంటి? ఆదిత్య కరికాలుడు(విక్రమ్) ప్రేమించిన యువతి నందిని(ఐశ్వర్యరాయ్)ని పెద్ద పళవేట్టురాయల్ పెళ్లి చేసుకున్నట్లు పార్ట్ 1లో చూపించారు. ఆమె అనాథ అయిన కారణంగా ఆదిత్య చెల్లి కుందవై(త్రిష) నందినిని తన సోదరుడుకి దక్కకుండా చేస్తుంది. ఒకవైపు యుద్దం చేస్తునే.. మరోవైపు నందిని కోసం వెతుకుతాడు కరికాలుడు. అప్పటికే పాండ్యరాజు నందినిని కూతురిలా పెంచుకుంటాడు. వీరిని కరికాలుడు చూస్తాడు. పాండ్యరాజును హత్య చేయ్యొద్దని వేడుకున్నా.. కరికాలుడు అతడిని చంపేస్తాడు. ఆ కోపంతో నందిని చోళ రాజ్య కోశాధికారి పళవేట్టు రాయర్ని పెళ్లి చేసుకొని తంజావురుకు వచ్చినట్లు పార్ట్ 1లో చూపించారు. అసలు నందిని నేపథ్యం ఏంటి? పాండ్య రాజుని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది? పెద్ద పళవేట్టురాయర్‌తో ఆమెకు ఎలా పరిచయం ఏర్పడింది? లంకలో ఉన్న అరుణ్మొళిని చంపాలని ఎందుకు కుట్ర చేస్తుంది? అనేది రెండో భాగంలో తెలియనుంది చోళరాజులపై పెద్ద పళవేట్టురాయర్‌కు ఎందుకు కోపం? కోశాధికారిగా ఉన్న పెద్ద పళవేట్టురాయర్(శరత్ కుమార్).. రాజ్య చక్రవర్తి సుందరచోళుడి(ప్రకాశ్ రాజ్) అన్న కొడుకు మధురాంతకుడి(రెహమాన్)కి ఎందుకు మద్దతుగా నిలుస్తున్నాడు. ఒకవైపు కోశాధికారిగా ఉంటూనే... లోలోపల సామంత రాజులను ఎందుకు రెచ్చగొడుతున్నాడు? వయసులో తనకంటే చాలా చిన్నదైన నందినిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సుందర చోళుడిపై ఎందుకు కోపం? మధురాంతకుడి కోరిక నెరవేరేనా? చోళ సామ్రాజ్యానికి ఎలాగైనా తానే అధిపతి కావాలని ఆశపడుతున్నాడు మధురాంతకుడు. తల్లి వద్దని చెప్పిన వారించినా.. వినకుండా కోశాధికారి పెద్ద పళవేట్టురాయర్‌తో చేతులు కలిపాడు. సామంత రాజులతో సమావేశమై పన్నాగాలు పన్నుతుంటాడు. మరి ఆయన ప్రయత్నాలు ఫలించాయా? చోళ రాజ్యానికి రాజు అయ్యాడా? లేదా బాబాయ్ కొడుకుల చేతిలో బలైపోయాడా? అనేది పార్ట్ 2లో తెలుస్తుంది. రాజ్యాన్ని కాపాడడానికి కుందవై ఏం చేసింది? చోళ రాజ్యానికి ఆపద ఉందని తెలుసుకున్న రాజకుమారి కుందవై(త్రిష).. తన రాజకీయ చతురతతో సామాంతుల రాజులను కలిసి .. వారి కుమార్తెలను తన సోదరులకి ఇచ్చి వివాహం చేస్తానని చెబుతుంది. దాంతో సామంత రాజుల మధ్య విభేదాలు వస్తాయి. మరి నిజంగానే వారి కుమార్తెలను తన సోదరులకు ఇచ్చి పెళ్లి చేసిందా? పెద్ద పళవేట్టురాయర్ కుట్రలను తన తెలివి తేటలతో ఎలా తిప్పికొట్టింది? ఆ ముసలావిడా ఎవరు? పొన్నియన్ సెల్వన్ క్లైమాక్స్.. అరుణ్మొళి సముద్రంలో పడిపోయినప్పుడు ఒక ముసలావిడ కాపాడానికి వస్తుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సముద్రంలో దూకేస్తుంది. అసలు ఆ ముసలావిడా ఎవరు? అరుణ్మొళిని కాపాడాల్సిన అవసరం ఆమెకేంటి? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రేమించిన నందినిని కరికాలుడు చంపేస్తాడా? తన సోదరుడు అరుణ్మొళి చావుకు నందినినే కారణమని తెలుసుకున్న ఆదిత్య కరికాలుడు.. కోపంతో ఆమెను చంపడానికి తంజావురు వస్తాడు. మరి నిజంగానే నందినిని కరికాలుడు చంపేశాడా? లేదా ఆమె చేతిలోనే బలైపోయాడా? అనేది రెండో భాగంలో తెలియనుంది. -
వెయ్యి కోట్లు నమోదు చేసే సినిమా ఏదీ?
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకునే వారు. బాహుబలి దెబ్బతో హిందీ ఇండస్ట్రీ వెనకపడి పోయింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ..చిన్న ఇండస్ట్రీ అయినా కన్నడ పరిశ్రమ నుండి కెజియఫ్ వచ్చింది. బాలీవుడ్లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. పఠాన్‌తో హిందీ పరిశ్రమ కూడా కోలుకునే ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. (చదవండి: మైసూర్ నవాబ్ మనవరాలిని సజీవసమాధి చేసిన భర్త.. 30 ఏళ్లుగా..) ఇలా అన్ని అన్ని వుడ్‌లలో భారీ హిట్లు నమోదు అవుతున్నాయి. మరి కోలీవుడ్ ఇండస్ట్రీ సంగతి ఎంటీ? వెయ్యి కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు? విక్రమ్ ,పొన్నియిన్ సెల్వన్ లాంటి మూవీస్ కోలీవుడ్‌లోనే భారీ వసూళ్లు రాబట్టాయి. తర్వాత ఇతర భాషల్లో విజయం సాధించిన కూడా అనుకున్నంత వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయాయి. మరి ఆ లోటు తీర్చే సినిమాలు కోలీవుడ్ నుండి ఎప్పుడు వస్తాయి? (చదవండి: మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్..కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు) పొన్నియిన్‌సెల్వన్ సినిమా ఐదు వందల కోట్లు కొల్లగొట్టింది. రెండో బాగం మీద అన్ని భాషల్లో బజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టే మూవీ టీం కూడా ప్రమోషన్లు చేస్తున్నారు. దాంతో ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ రాబడుతుందా లేదా అనే చర్చలు నడుస్తున్నాయి. ఏప్రిల్ 28 న మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక శివ దర్శకత్వంలో సూర్య హీరోగా కంగువ మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్లో ఈ పిరియాడిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా బహుబలి మాదిరిగా రెండు బాగాలుగా తీసుకురావాలి అనుకుంటున్నారట మేకర్స్. కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ మూవీ మీద బాగానే ఆశలు పెట్టుకుంది. మరి ఫ్యూచర్లో తమిళ్ పరిశ్రమనుంచి..రాబోతున్న భారీ హిట్ సినిమా ఏది? పాన్ ఇండియా విజయం సాధించి వెయ్యి కోట్లు కొల్లగొట్టే మూవీ ఏదో తెలుగుసుకోవాలి అంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. -
మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్.. కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు
దిగ్గజ దర్శకుడు మణితర్నం అంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఎంత గౌరవమో అందరికి తెలిసిందే. అతన్ని తన గురువులా భావిస్తుంది. ఐశ్వర్యను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది మణిరత్నమే. 1997లో ఇరువన్(తెలుగులో ఇద్దరు) చిత్రంతో ఐశ్వర్య ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మణిరత్నం, ఐష్ కాంబోలో గురు, రావణ్, పొన్నియన్ సెల్వన్ 1 లాంటి చిత్రాలు వచ్చాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2(పీఎస్ 2) విడుదలకు సిద్దం కాబోతుంది. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా ముంబైలో కూడా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అరుదైన సంఘటన జరిగింది. తన గురువులా భావించే మణిరత్నం కాళ్లకు నమస్కరించింది ఐశ్వర్య రాయ్. ప్రమోషన్ ఈవెంట్లో మణిరత్నం మాట్లాడుతూ... పొన్నియన్ సెల్వన్‌లో ‘నందిని’పాత్రకు ఐశ్వర్య అయితేనే న్యాయం చేస్తుందనిపించింది. ఆమెను అడిగిన వెంటనే ఓకే చెప్పింది’అని చెబుతుండగా.. ఐశ్వర్య ఎమోషనల్ అయింది. వెంటనే స్టేజ్‌పై నుంచి లేచి అందరి ముందు మణిరత్నం కాళ్లుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. -
త్రిష అందానికి కార్తీ ఫిదా..
-
రాజమౌళి ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు: మణిరత్నం
‘‘నేను ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. రాజమౌళికి థ్యాంక్స్. ఎందుకంటే ‘బాహుబలి’ రెండు భాగాలుగా రాకపోయిఉంటే ‘పొన్నియిన్ సెల్వన్’(పీఎస్)తెరకెక్కేది కాదు. ఈ విషయాన్ని రాజమౌళితో కూడా చెప్పాను.‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాలుగా తీసే దారిని తను చూపించాడు. చారిత్రాత్మక సినిమాలను తీసే ఆత్మవిశ్వాసాన్ని సినిమా ఇండస్ట్రీకి రాజమౌళి ఇచ్చా రు. భారదేశ చరిత్ర ఆధారంగా చాలామంది ఇప్పుడు సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ మణిరత్నం. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన ఈ చిత్రంలోని రెండో భాగం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ నెల 28న రిలీజ్ కానుంది. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడానికి కారణమైన సుభాస్కరన్, వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరంజీవి, తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తున్న ‘దిల్’రాజుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా గురువు మణిరత్నంతో మరో అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చినందుకు టీమ్‌కు శుభాకాంక్షలు’’ అన్నారు విక్రమ్. ‘‘ఒకేసారి రెండు విభాగాలు చిత్రీకరించి, తొలి భాగం రిలీజ్ చేసిన ఆరు నెలల తర్వాత రెండో భాగాన్ని రిలీజ్ చేస్తానన్న గుండె ధైర్యం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎవరూ రెండు విభాగాలను ఒకేసారి చిత్రీకరించలేదు. మణిరత్నంగారి ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అన్నారు ‘జయం’ రవి. ‘‘భారతదేశ చరిత్ర తెలియాలని మణిరత్నంగారు ఈ సినిమా తీశారు’’అన్నారు కార్తీ. ‘‘పొన్నియిన్ సెల్వన్’ మ్యాజికల్ వరల్డ్’’ అన్నారు ఐశ్వర్యారాయ్. ‘‘హైదరాబాద్ నాకు రెండో ఇల్లు’’ అన్నారు త్రిష. ‘‘పొన్నియిన్ సెల్వన్ పార్టు 2’లో అద్భుతం చూడబోతున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ కార్యక్రమంలో శోభిత, ఐశ్వర్యాలక్ష్మీ, ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ కుమరన్, లైకా డిప్యూటీ ౖచైర్మన్ ప్రేమ్ పాల్గొన్నారు. -
Nandini Krishnan: అనువాద వారధి
సొంతగా రచనలు చేయగలిగేవారు అనువాదాలు చేయరు. భాష బాగా వచ్చినంత మాత్రాన అనువాదం చేయలేరు. దానికి నైపుణ్యం, కొంత నిస్వార్థం కావాలి. తమిళ రచయిత్రి నందిని కృష్ణన్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఇంగ్లిష్ అనువాదం ఏప్రిల్ 24న మార్కెట్లోకి రానుంది. నవలలోని పాతకాలపు తమిళాన్ని నేటి యువతకు అందేలా అనువాదం చేయడం సులువు కాదు. తమిళంలోని ఉత్తమ నవలలను సవాలుగా తీసుకుని నందిని ఇంగ్లిష్‌లో అనువాదం చేస్తోంది. ఆమెకు వస్తున్న గుర్తింపు ఆ రంగంలో రాణించాలనుకునే స్త్రీలు గమనించదగ్గది. దాదాపు 2500 పేజీలు ఉండే ఐదు భాగాల భారీ ప్రఖ్యాత తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను ఇంగ్లిష్‌లో అనువాదం చేయబూనడం సాహసం. కాని ఈ క్లాసిక్‌ను అనువాదం చేయడానికి చాలా మంది ట్రై చేస్తూనే వచ్చారు. ముగ్గురు నలుగురు సఫలీకృతులయ్యారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్‌కు తగ్గట్టుగా అనువాదం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నందిని కృష్ణన్ వంతు. ఆమె చేసిన ఈ నవల అనువాదం మొదటి భాగం పూర్తయ్యింది. ఏప్రిల్ 24న విడుదల కానుంది. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ దీనిని ప్రచురిస్తుంటే ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాల సినిమాగా తీస్తున్న దర్శకుడు మణిరత్నం ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకుడిగా ఉన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్ నవల 75 ఏళ్ల క్రితం నాటిదని గుర్తు లేనంతగా అనునిత్యం తమిళ సాహిత్యంలో కలగలిసిపోయింది. కల్కి రాసిన ఈ నవలలోని భాషను, పై అర్థాన్ని, లోపలి అర్థాన్ని అర్థం చేసుకుని అనువాదం చేయడం చాలా జటిలం. అయినా చేశాను. పాఠకులు సులభంగా చదువుకోవడానికి, చేత బట్టుకోవడానికి వీలుగా ఇంగ్లిష్‌లో ఐదు కంటే ఎక్కువ భాగాలుగా విభజించి పుస్తకాలుగా తేనున్నాము’ అని తెలిపింది నందిని కృష్ణన్. ఎవరీ నందిని కృష్ణన్? నందిని కృష్ణన్ చెన్నైలో స్థిరపడిన నాటకకర్త, రచయిత్రి, స్టేజ్ యాక్టర్ కూడా. లండన్‌లో, ఢిల్లీలో జర్నలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత చెన్నై నుంచి వెబ్, ప్రింట్ మీడియాలలో పని చేయడం మొదలుపెట్టింది. హాస్యం రాస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వైవాహిక వ్యవస్థపై విమర్శను పెడుతూ వివాహమైన స్త్రీలను, పురుషులను ఇంటర్వ్యూ చేసి ‘హిచ్డ్: ది మోడర్న్ అండ్ అరేంజ్డ్ మేరేజ్’ పుస్తకం తెచ్చింది. ట్రాన్స్ మెన్ జీవితాల ఆధారంగా ‘ఇన్విజిబుల్ మెన్‘ పుస్తకం రాసింది. పెరుమాళ్ మురుగన్ నవలలను ఇంగ్లిష్‌లో అనువాదం చేయడం ద్వారా అనువాద రంగంలో ప్రవేశించింది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్‘ అనువాదం చేస్తోంది. నందిని కృష్ణన్ ఇంట్లో ఎప్పుడూ వీధి కుక్కలు ఉంటాయి. వాటిని సాకుతుంటుంది. పిల్లులను కూడా. ‘కుక్కలు, పిల్లలు, వేల కొద్ది పుస్తకాలు అంతే మా ఇల్లు’ అని చెబుతుంది. కత్తి మీద సాము ‘అనువాదం చేయడం కత్తి మీద సాము’ అంటుంది నందిని. ‘సొంత రచనైతే అలా ఒక సమాధి స్థితికి వెళ్లి రాసుకుంటూ పోతాము. అనువాదం అలా కాదు. అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు చదివితే అది కేవలం అనువాదం అనిపించకూడదు. అదే సమయంలో ఒరిజినల్ నవల తాలూకు పరిమళం దానిలో ఉండాలి. అనువాదం పూర్తి చేశాక ఎవరిదో కన్నబిడ్డను మనం సాకాం... ఇక దీనితో రుణం చెల్లిపోయింది అన్న బాధ తప్పదు’ అంటుంది నందిని. ‘అనువాదకులు స్వయంగా రచయితలు కాకపోవడం వల్ల కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వాళ్లు ప్రతి మాటా కచ్చితంగా అనువాదం చేస్తూ కృతకంగా మారుస్తారు. అనువాదకులు స్వయంగా రచయితలైనా కూడా కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వారు తమ సృజనశక్తిని కూడా కలుపుతారు. అది తప్పు. వేరొకరు గీసిన బొమ్మను నకలు చేసేటప్పుడు మనం పికాసో అంతటివాళ్లమైనా ఆ బొమ్మలో మన గొప్పదనం చూపకూడదు. అనువాదం అయినా అంతే’ అంటుంది నందిని కృష్ణన్. మంచి అనువాద రుసుము ‘అనువాదంలో రాణించాలంటే మంచి డబ్బు కూడా మనకు ఆఫర్ చేయాలి. తగిన డబ్బు లేకుండా అనువాదం చేయడం అనవసరం’ అంటుంది నందిని. ‘కొంతమంది కల్లబొల్లి మాటలు చెప్పి అనువాదం చేయించుకోవాలనుకుంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను రోజుకు ఆరేడు గంటలు అనువాదం చేస్తాను. ఒక పదానికి బదులు ఎన్ని పదాలు వాడొచ్చో అవసరమైతే లిస్ట్ రాసుకుంటాను. ఒరిజినల్ని చదువుతూ, అనువాదాన్ని చదువుకుంటూ పని ముగిస్తాను. పెరుమాళ్ మురుగన్ లాంటి రచయితలు పల్లెల్లో మరీ కొన్ని వర్గాలు మాత్రమే వాడే మాటల్ని ఉపయోగించి రాస్తారు. వాటికి ఇంగ్లిష్ మాటలు ఉండవు. డిక్షనరీలు కూడా ఉండవు. అందుకే అవసరమైతే ఒరిజినల్ రచయితనే సంప్రదిస్తూ డౌట్లు క్లియర్ చేసుకుంటూ అనువాదం ముగించాలి’ అంటుంది నందిని. నందిని లాంటి అనువాదకులు తెలుగులో కూడా ఉంటే మన క్లాసిక్స్ కూడా ప్రపంచ పాఠకులకు తప్పక చేరుతాయి. అనువాదకులకు గుర్తింపునూ తెచ్చిపెడతాయి. -
కమల్‌కు జోడీ?
విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కి జోడీగా దక్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో ఒకరైన నయనతార నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాతో బిజీగా ఉన్న కమల్‌హాసన్ ఆ తర్వాతి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో చేయనున్నారు. మణిరత్నం–కమల్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘నాయగన్’ 1987 అక్టోబర్ 21న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి ‘కేహెచ్ 234’ అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్గా తొలుత త్రిష పేరు వినిపించింది. ‘మన్మధన్ అంబు’, ‘తూంగావనం’ చిత్రాల తర్వాత కమల్–త్రిష ముచ్చటగా మూడోసారి ‘కేహెచ్ 234’ కోసం పని చేయనున్నారంటూ తమిళ చిత్ర సీమలో వార్తలొచ్చాయి. తాజాగా నయనతార పేరు తెరపైకి వచ్చింది. కథానాయిక పాత్ర కోసం ఆమెతో చర్చలు జరుపుతున్నారట మేకర్స్. చర్చలు సఫలమైతే కమల్‌తో నయనతార నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. మరి ‘కేహెచ్ 234’లో కమల్‌తో నటించే అవకాశం త్రిష, నయనతారలో ఎవర్ని వరిస్తుంది? వీరిద్దరూ కాకుండా వేరే కొత్త హీరోయిన్ తెరపైకి వస్తారా? అనే వివరాలు తెలియాలంటే వేచి చూడాలి. కాగా మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నెల 28న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. మరోవైపు కమల్‌హాసన్ కూడా ‘ఇండియన్ 2’ తో బిజీగా ఉన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా షెడ్యూల్‌ను పూర్తి చేసి, ఇండియాకి తిరిగొచ్చింది యూనిట్. -
‘పొన్నియన్ సెల్వన్ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్ చేశా’
దర్శకుడు మణిరత్నం 25 ఏళ్ల కల నిజం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇదే పేరుతో ల్కీ రాసిన నవలçను దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, నటి ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా ఫిలింస్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో భారీఎత్తున నిర్వహించారు. తమిళనాడు మంత్రి దురైమరుగన్, విశ్వనటుడు కమలహాసన్, నటి ఐశ్వర్యరాయ్, దర్శకుడు భారతీరాజా, సంచలన నటుడు శింబు, నటి కుష్బూ, సుహాసిని మణిరత్నం, శోభన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రి దరైమురుగన్ మాట్లాడుతూ ఒక ఛారిత్రక కథను చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు మణిరత్నానికి ఇంట్లోనే సెల్యూట్ చేశానన్నారు. వాద్ధియదేవన్ పాత్రలో నటుడు కార్తీ చాలా బాగా నటించారని, తన నియోజక వర్గం పరిధిలోనిదే వాద్ధియదేవన్ ఊర్ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. -
‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పొన్నియిన్ సెల్వన్ తీయాలంటే ధైర్యం కావాలి
‘‘పొన్నియిన్ సెల్వన్ ’ చిత్రాన్ని తీయాలంటే ధైర్యం కావాలి.. అది డైరెక్టర్ మణిరత్నం, నిర్మాత సుభాస్కరన్ గార్లకు ఉంది. అందుకే ఈ చిత్రం అద్భుతంగా తెరకెక్కింది’’ అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’. సుభాస్కరన్ , మణిరత్నం నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 28న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల వేడుకని చెన్నైలో నిర్వహించారు. ఈ మూవీ ఆడియోను కమల్ హాసన్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పొన్నియిన్ సెల్వన్ ’ నవల రాసిన కల్కీని చూసి ఇతర రచయితలు అసూయ పడుతున్నట్లుగా, మణిరత్నంగారిని చూసి రచయితలు, దర్శకులు అసూయ పడుతున్నారు.. వారిలో నేనూ ఒకణ్ణి. ఈ మూవీలో నటించే అవకాశం నాకు మిస్ అయ్యింది. తమిళ చిత్ర పరిశ్రమకు ఇది స్వర్ణయుగమే. దీన్ని కాపాడుకోవాలి. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ఈ వేడుకలో తమిళనాడు రాష్ట్ర మంత్రి దురైమరుగన్, దర్శకుడు భారతీరాజా, నటుడు శింబు, నటి ఐశ్వర్యారాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రవివర్మన్ కెమెరామేన్‌గా పనిచేశారు. -
ఆ డైరెక్టర్ స్పూర్థితోనే సినిమాల్లోకి వచ్చాను : గౌతమ్ మీనన్
పటాన్చెరు టౌన్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన నాయగన్ సినిమా తాను సినీ రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణ అని, ఆ సినిమాలో ఉన్న వాటిని తన సినిమాల్లో చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రసిద్ధ భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో రివైండ్ ద మిలీనియమ్ ఇతివృత్తంతో సోమవారం నిర్వహించిన టెడ్ఎక్స్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తాను అనుకున్నది, తన జీవితంలో ఎదురైన సంఘటలనే సినిమాగా తీస్తానన్నారు. కష్టపడకుండా ఏదీ సాధించలేమని, ఏదైనా ఒక కళలో నెపుణ్యం సాధించాలంటే పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి సవితా శాస్త్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండీ మ్యూజిక్ ఆర్టిస్ట్ నితీశ్ కొండపర్తి, సిస్సీ ఐస్ పాప్స్ వ్యవస్థాపకుడు రని కాబ్రా, విద్యార్థులు పాల్గొన్నారు. -
పీకల్లోతు కష్టాల్లో మణిరత్నం... పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ డౌటే!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది మణిరత్నంకి కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ సినిమా కొనేందుకు బయ్యర్లు కరువైయ్యారు. తమిళ రైటర్ కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కించాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలను మణిరత్నం ఒకేసారి చిత్రీకరించాడు. గతేడాది పాన్ ఇండియా మూవీగా విడుదలైన పొన్నియిన్ సెల్వన్ కోలీవుడ్ మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రేక్షకాదరణ పొందలేదు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ కోలీవుడ్‌లో మాత్రం 200 కోట్లు వసూలు చేసింది. హిస్టారికల్ మూవీ అయినా... ఈ సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించింది. దీంతో సినిమాకి కలెక్షన్స్ వచ్చినా... అదర్ స్టేట్స్లో మాత్రం ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోయింది. మణిరత్నం మూవీ కావటం.. ఇందులో ఐశ్వర్య నటించటంతో బాలీవుడ్లో హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్ పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ తర్వాత కంటిన్యూ కాలేదు. దీంతో ఈ సినిమాకి కోలీవుడ్‌లోనే మంచి ప్రేక్షకాదరణ లభించింది. అందుకే ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే రూ. 200 కోట్లు కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ టాక్ సంగతి పక్కన పెడితే పాన్ ఇండియా వైడ్‌గా దాదాపు 450 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఈ ఊపులో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఏప్రిల్ 28 విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. సెకండ్ పార్ట్‌పై మణిరత్నం టీం భారీ ఆశలే పెట్టుకుంది. పార్ట్ 1కి వచ్చిన కలెక్షన్స్ చూసి పాన్ ఇండియా రేంజ్ లో పి.ఎస్.2 బిజినెస్ జరుగుతుందని అంచనా వేశారు. ఈ సినిమా బిజినెస్ తమిళంలో తప్ప మిగిలిన మిగతా భాషల్లో సరిగ్గా జరగటం లేదట. ఇక రెండు తెలుగు రాష్రాల్లో పి.ఎస్.2 తెలుగు హక్కులు కొనేందుకు ఎవరు ముందుకి రాలేదట. టాలీవుడ్ లో లైకా ప్రొడక్షన్స్ ప్రయత్నాలు వర్కౌవుట్ కాకపోవటంతో...మణిరత్నం రంగంలోకి దిగినా ఉపయోగం కనిపించలేదనే మాట ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. బయర్స్ కొనేందుకు ముందుకి రాకపోవటంతో... మణిరత్నంతో పాటు.. ప్రొడ్యూసర్స్ పి.ఎస్.2కి హైప్ తీసుకువచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారట. కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష ఈ హిస్టారికల్ మూవీలో నటించారు. పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా వీళ్లందరితో ప్రమోషన్స్ చేయించి పి.ఎస్.2 కి హైప్ తీసుకురావాలని మణిరత్నం ఆలోచిస్తున్నాడట. మరి మణిరత్నం ప్లాన్ ఎంత వరకు వర్కౌవుట్ అవుతుందో చూడాలి మరి. -
పుస్తక రూపంలో 'పొన్నియిన్ సెల్వన్' రచయిత కల్కి బయోగ్రఫీ
పొన్నియిన్ సెల్వన్ చిత్ర కథా రచయిత, పత్రికా సంపాదకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన దివంగత కల్కి జీవిత చరిత్ర పుస్తకం రపంలో వెలువడనుంది. కల్కి మనవరాలు సీతా రవి, లక్ష్మి నటరాజన్ పుస్తకంగా తీసుకొస్తున్నారు. ప్రముఖ పాత్రికేయుడు ఎస్.చంద్రమౌళి కల్కీ పొన్నియిన్ సెల్వన్ సెల్వర్ పేరుతో కల్కీ జీవిత చరిత్రను రాశారు. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలతోపాటు పొన్నియిన్ సెల్వన్ నవలకు సంబంధింన విశేషాలు ఉన్నాయి. సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు తొలి ప్రతిని కల్కి మనవరాలు సీతా రవి, లక్ష్మి నటరాజన్‌కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ దివంగత గొప్ప రచయిత కల్కి రచనలు తరాలకతీతంగా ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. ఆయన రాసిన నవల ఆధారంగా రపొందింన పొన్నియిన్ సెల్వన్ చిత్రం గత ఏడాది చివర్లో విడుదలై మంచి విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. దానికి రెండో భాగం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా కల్కీ జీవిత చరిత్ర పుస్తకంగా రావడం సరైన తరుణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
డైరెక్టర్ మణిరత్నంకు థ్యాంక్స్ చెప్పిన యంగ్ హీరో
తమిళ సినిమా: గౌతమ్ కార్తీక్ ఇటీవలే నటి మంజిమా మోహన్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యారు. తాజాగా నటుడిగా మరో మైలురాయిని కూడా టచ్ చేశారు. సీనియర్ నటుడు కార్తీక్ వారసుడిగా 2012లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. అలా నటుడిగా 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ కార్తీక్ తాజాగా నటిస్తున్న క్రిమినల్ చిత్ర షూటింగ్లో యూనిట్ వర్గాలు కేక్ కట్ చేసి వేడుకలు చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ కార్తీక్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తనపై నమ్మకంతో మంచి అవకాశాన్ని కల్పించిన దర్శకుడు మణిరత్నంకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఈ సినీ ప్రయాణం ఉత్సాహంగానూ, ఉన్నతంగానూ, భయంగానూ, చాలెంజ్ గానూ, అద్భుతంగానూ, కొత్త విషయాలను నేర్చుకునే విధంగా ఉందన్నారు. నటుడిగా విజయాలు, అపజయాలు ఇచ్చిన అనుభవంతో ఇకపై మంచి చిత్రాలతో అలస్తారని గౌతమ్ కార్తీక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన 1947, పత్తుతల, క్రిమినల్ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. -
కమల్ హాసన్ చిత్రంలో ఏడుగురు స్టార్ హీరోలు!
కోలీవుడ్‌లో ప్రయోగాలకు ఆద్యుడు లోకనాయకుడు కమలహాసన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమావాస్య చంద్రుడు, పుష్పక విమానం, అపూర్వ సహోదర్ గళ్, దశావతారం ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ హాసన్ కెరీర్లో ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కమలహాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్– 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన తన గెటప్ కోసం అనేక గంటలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రం తర్వాత కమలహాసన్ మణిరత్నం దర్శకత్వంలో తన 234వ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. కాగా కమలహాసన్, మణిరత్నం కాంబినేషన్లో 1987లో నాయకన్ చిత్రం రూపొంది సంచలన విజయం సాధించింది. 35 ఏళ్ల తర్వాత వీరి కాంబో రిపీట్ కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఇంకా పేరు నిర్ణయం కాని ఈ చిత్రంలో కమలహాసన్‌తో పాటు ఏడు రాష్ట్రాలకు చెందిన స్టార్ హీరోలు నటించనున్నారు. ఆ ఏడుగురులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఒకరనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. మరో విశేషం ఏంటంటే కమలహాసన్, షారుక్ ఖాన్ ఇంతకుముందు హే రామ్ అనే చిత్రంలో కలిసి నటించారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
పొన్నియిన్ సెల్వన్ క్యాలెండర్ ఆవిష్కరణ
తమిళసినిమా: 2022లో అనూహ్య విజయం సాధింన చిత్రం పొన్నియిన్ సెల్వన్. దర్శకుడు మణిరత్నం అద్భుత సృష్టి ఇది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్ కుమార్, ప్రకాశ్‌రాజ్, విక్రమ్‌ప్రభు వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ నాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. కల్కి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్ర రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. దర్శకుడు మణిరత్నం సతీమణి, నటి సుహాసిని వ్యవస్థాపకురాలుగా నామ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. దీనికి దర్శకుడు కూడా గౌరవ ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది స్వచ్ఛంద సేవ ఫౌండేషన్. దీని ద్వారా పలుసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా నామ్– 2023 పేరుతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం దృశ్యాలతో క్యాలెండర్‌ను పొందుపరిచారు. బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. మణిరత్నం, సుహాసినితో పాటు నామ్ ఫౌండేషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జయంరవి, జయరాం, రఘు పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. -
మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన త్రిష? ఆ హీరోతో ముచ్చటగా మూడోసారి!
నాలుగు పదుల వయసులోనూ త్రిష క్రేజ్ కొనసాగుతోంది. తన కెరీర్ ముగిసిపోయిందంటూ ప్రచారం జరిగినప్పుడల్లా ఆమె ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారనే చెప్పవచ్చు. ఆ మధ్య త్రిష సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో ఇక ఆమెకు సినిమాలకు దూరమైందని అంతూ అనుకుంటున్న సమయంలో తమిళ చిత్రం 96 విజయంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో రీఎంట్రీ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీ విజయంతో త్రిష కెరీర్ మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందుకలో పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఉండటం విశేషం. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి మంగాత్తా, ఎన్నై అరిందాల్ వంటి హిట్ చిత్రాల తరువాత అజిత్‌తో జతకట్టడానికి సిద్ధం అవుతుందామె. అలాగే విజయ్ 67వ చిత్రంలోనూ నటించనుంది. ఈ నేపథ్యంలో త్రిష కోసం మరో క్రేజీ ఆఫర్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విలక్షణ నటుడు కమలహాసన్ తన తదుపరి చిత్రం మణిరత్నంతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 234వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈయన ఇటీవల తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ తొలి భాగం విజయం సాధించింది. కాగా దీని రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీ విడుదలకు ముస్తాబవుతుంది. చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన! ఆ తర్వాత విక్రమ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు మణరత్నం. వీరి కాంబోలో నాయకన్ వంటి సంచలన హిట్ చిత్రం రూపొందింది. కాగా సుమారు 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కానుంది. ఈ క్రేజీ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఇందులో కమలహాసన్‌కు జంటగా త్రిషను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా త్రిష ఇంతకుముందు కమలహాసన్‌కు జంటగా మన్మదన్ అన్బు, తూంగావనం చిత్రాల్లో నటించింది. అంత ఒకే అయితే ఇప్పుడు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయనతో నటించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. -
35 ఏళ్ల తర్వాత మరోసారి జతకడుతోన్న కమల్-మణిరత్నం
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తన బర్త్ డే (నవంబరు 7) సందర్భంగా ఫ్యాన్స్‌కు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు కమల్‌హాసన్. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఇదే కావడం విశేషం. 1987లో వారిద్దరి కాంబోలో ‘నాయకన్’(తెలుగులో ‘నాయకుడు’) అనే హిట్ సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్నారు కమల్-మణిరత్నం. చదవండి: ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్ ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ ఈ కొత్త సినిమా నిర్మించనున్నారు. కమల్ కెరీర్లో 234వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2024లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మణిరత్నంగారితో పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఈ ఉత్సాహానికి ఏఆర్ రెహమాన్, ఉదయనిధి స్టాలిన్ తోడవ్వడం హ్యాపీ’’ అన్నారు కమల్‌హాసన్. ‘‘కమల్‌సర్‌తో మళ్లీ వర్క్ చేయడం సంతోషంగా, గర్వంగా, గౌరవంగా ఉంది’’అన్నారు మణిరత్నం. Here we go again! #KH234 பயணத்தின் அடுத்த கட்டம்! #ManiRatnam @Udhaystalin @arrahman #Mahendran @bagapath @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM pic.twitter.com/ATAzzxAWCL — Kamal Haasan (@ikamalhaasan) November 6, 2022 -
కమల్ హాసన్‌తో మణిరత్నం భారీ ప్రాజెక్ట్.. 35 ఏళ్ల తర్వాత..!
పొన్నియిన్ సెల్వన్‌తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మణిరత్నం. కల్కి మ్యాగజైన్లో వచ్చిన నవల ఆధారంగా తెరకెక్కించారు. గతంలోనే ఈ చిత్రాన్ని తీసేందుకు ఆయన యత్నించారు. కానీ అనేక కారణాలతో అది వీలు కాలేదు. మొదట ఈ భారీ చిత్రాన్ని రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ కాంబినేషన్లో తీయాలనుకున్నారు. బడ్జెట్ సమస్యతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అయితే లైకా ప్రొడక్షన్స్ పొన్నియిన్ సెల్వన్ నిర్మించేందుకు ముందుకు రావడంతో ఆయన కల నెరవేరింది. అయితే తాజాగా మణిరత్నం మరో బిగ్ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత విలక్షణ నటుడు కమల్ హాసన్‌తో సినిమా తీస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనిపై రెడ్ జైంట్ మూవీస్ సంస్థ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో 1987లో వచ్చిన 'నాయకన్' తర్వాత మరోసారి వీరి కాంబినేషన్లో చిత్రం రానుండటంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (చదవండి: మణిరత్నం కల సాకారమవడానికి కారణం బాహుబలినే!) రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లలోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించనున్నారు. గతంలో ఇద్దరు దిగ్గజాలు కమల్ హాసన్, మణిరత్నం మ్యాజికల్ కాంబినేషన్లో వచ్చిన నాయగన్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుంది. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. “35 సంవత్సరాల క్రితం మణిరత్నంతో పని చేసినపుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు అంతే ఉత్సాహంగా ఉన్నా. ఒకేరకమైన మనస్తత్వం గల వారితో కలసి పని చేయడం గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. ఈ ఉత్సాహానికిి రెహమాన్ కూడా తోడయ్యారు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అని అన్నారు. దర్శకుడు, నిర్మాత మణిరత్నం మాట్లాడుతూ.. "కమల్ సర్‌తో మళ్లీ కలిసి పని చేయడం సంతోషంగా, ఉత్సాహంగా ఉంది." అని అన్నారు. నిర్మాత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. “ఉలగనాయగన్ కమల్ హాసన్ 234వ చిత్రాన్ని ప్రెజెంట్ చేయడం గొప్ప గౌరవం. ఒక అద్భుతమైన అవకాశం. కమల్ సార్, మణి సార్‌ని అమితంగా ఆరాధిస్తాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు.'' తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తారు. THE TWO LEGENDS ARE BACK AGAIN AFTER 35 YEARS! 🥁💥 PRESENTING #KH234 WRITTEN & DIRECTEd by #ManiRatnam @ikamalhaasan #ManiRatnam @Udhaystalin @arrahman #Mahendran @bagapath @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM pic.twitter.com/pJxldVGMqw — Red Giant Movies (@RedGiantMovies_) November 6, 2022 -
అఫీషియల్: ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్, కాకపోతే..
స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్: మొదటి భాగం. చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజై దాదాపు నెల రోజులు అవుతుండటంతో ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1 ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ సినిమా నవంబర్ 4 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. ఒకవేళ ఇప్పుడే చూడాలనుకుంటే మాత్రం దానికి డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే స్ట్రీమ్ కానున్నట్లు తెలపడంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే హిందీ వర్షన్ రిలీజ్ చేయరా? అని మండిపడుతున్నారు. presenting the much awaited, larger than life, historical action-drama #PS1onPrime, rent to watch now! Coming to Prime on Nov 4#ManiRatnam @arrahman @MadrasTalkies_ @LycaProductions@tipsofficial pic.twitter.com/Cq34q7zdD7 — prime video IN (@PrimeVideoIN) October 28, 2022 చదవండి: పెళ్లి వార్తలపై స్పందించిన యంగ్ హీరోయిన్ తొక్కలో పంచాయితీ.. ఎంత చెప్పినా గీతూ వినదే -
31 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘దళపతి’ చిత్రం కాంబినేషన్ రిపీట్ కాబోతుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఒకే ఒక్క చిత్రం దళపతి. ఇందులో మరో కథానాయకుడిగా మలయాళం సపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. నటుడు అరవిందస్వామి ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు. నటి శోభన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1991 నవంబర్ 5న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో ఇళయరాజా అందించిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. చదవండి: స్టాకింగ్ అంటూ ఊర్వశిపై రిషబ్ ఫ్యాన్స్ ఫైర్, ఘాటుగా స్పందించిన నటి ‘రాకవ్మ కయ్యి తట్టు’ అనే పాట ఇప్పటికీ సంగీత ప్రియుల చెవుల్లో మారుమోగుతూనే ఉంది. కాగా ఆ తరువాత మణిరత్నం, రజనీకాంత్ కాంబినేషన్లో ఇప్పటి వరకు చిత్రం రాలేదు. మణిరత్నం తాజాగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ తొలి భాగం విడుదలై విజయవంతమైంది. ఇందులో ఏదైనా పాత్రలో నటించాలని రజనీకాంత్ భావించారట. నటుడు శరత్‌కుమార్ పోషించిన పళయ పళువేట్టయార్ పాత్రలో నటిస్తానని మణిరత్నంను రజనీకాంత్ అడిగారట. అయితే అందుకు మణిరత్నం అంగీకరించలేదని స్వయంగా రజనీ ఈ చిత్రం ఆడియో వేడుకలో చెప్పారు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన బిగ్‌బాస్ దివి.. కాగా దాదాపు 31 ఏళ్ల తరువాత వీరి సంచలన కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం. మణిరత్నం చెప్పిన స్టోరీ లైన్ రజనీకాంత్‌కు నచ్చినట్లు తెలుస్తోంది. అయితే మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ పార్టు–2 చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక రజనీకాంత్ జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత డాన్ చిత్రం ఫేమ్ శిబిచక్రవర్తి దర్శకత్వంలో నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటిస్తారా? లేక ముందుగానే ఆయనతో చిత్రం చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే రజనీకాంత్, మణిరత్నం కాంబినేషన్ చిత్రం గురిం అధికారిక ప్రకటన మాత్రం ఇంకా విడుదల కాలేదు. -
మణిరత్నం కల సాకారమవడానికి కారణం బాహుబలినే!
దేశంలో ఎంతమంది దర్శకులున్నా వారిలో కొందరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి నుంచి సినిమా వస్తుందంటే చాలు అందరూ కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. అలాంటి దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించారు. వెయ్యి ఏళ్లు వెనక్కి వెళ్లి చోళ రాజుల చరిత్రను తెరపై చూపించాడు. అందుకే ఆ వైబ్రేషన్ వరల్డ్ వైడ్ గా కనిపిస్తోంది. మణిరత్నం మేకింగ్‌పై డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి మనమూ పొన్నియిన్ సెల్వన్ లోకాన్ని ఓసారి చుట్టి వద్దాం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ పాన్ ఇండియా ట్రెండ్‌కు ప్రాణం పోసింది. ఏ సినిమా తీసినా, ఎంత పెట్టి తీసినా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని బాహుబలి సిరీస్ నిరూపించింది. ఆ ధైర్యంతోనే మణిరత్నం తన కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ను పట్టాలెక్కించారు. మణిరత్నం 40 ఏళ్ల కల సాకారం అయిందంటే అందుకు కారణం మన బాహుబలి సినిమానే! ఒక సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసి కోట్లు కొల్లగొట్టవచ్చు అని ఈ సినిమాతో నిరూపితమైంది. అందుకే 5 భాగాలుగా ఉన్న పెద్ద నవల పొన్నియిన్ సెల్వన్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మణిరత్నం. మొదటి భాగం ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. రెండవ భాగం సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత విడుదల చేస్తారట. తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన నవల పొన్నియిన్ సెల్వన్. 1899 నుంచి ఈ నవల ప్రాచుర్యంలో ఉంది. కల్కి మ్యాగజీన్లో ఈ నవలను ప్రచురిస్తూ వచ్చారు. అంతకు ముందు వచ్చిన ది చోళాస్, హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్, పల్లవాస్ ఆఫ్ కంచి పుస్తకాలను ఆధారంగా చేసుకుని పొన్నియిన్ సెల్వన్ నవలను రాసుకొచ్చారు కల్కి కృష్ణమూర్తి. 1958 నుంచే పొన్నియిన్ సెల్వన్ నవలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1980లో, 2000 సంవత్సరంలో, ఆ తర్వాత 2010లో పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలనుకున్నాడు మణిరత్నం. మొదట ఈ భారీ చిత్రాన్ని రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ కాంబినేషన్లో ప్లాన్ చేశాడు, కానీ కుదరలేదు. ఆ తర్వాత విజయ్, మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కించాలనుకున్నాడు. బడ్జెట్ ఇష్యూస్‌తో ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది 2018లో మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ పొన్నియిన్ సెల్వన్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 240 ఏళ్లుగా కోలీవుడ్ ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు మణిరత్నం తెరకెక్కిస్తున్నారని తెలిసి తమిళనాట ఆనందం వెల్లివిరిసింది. ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ లో వీరుడిగా నటించాల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పుడు మిగతా హీరోలు లీడ్ రోల్స్ తీసుకోవడంతో కనీసం ఒక చిన్న పాత్రైనా ఇవ్వండి అని అడిగారట. సినిమాలో పెరియ పజువెట్టరాయర్ పాత్ర చేస్తానని అడిగితే రజనీకాంత్‌కు ఉన్న ఇమేజ్‌కు ఆ పాత్ర సరితూగదని వద్దన్నారట. సినిమాలో ఇదే పాత్రను శరత్ కుమార్ చేసారు. గతంలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించి ఉంటే కనుక, ప్రస్తుతం కార్తి చేసిన పాత్రను రజనీకాంత్ చేసి ఉండేవారట. అలాగే జయం రవి చేసిన పాత్రను కమల్ హాసన్, విక్రమ్ కనిపించిన పాత్రను విజయ్ కాంత్‌తో చేయించాలి అనుకున్నారు. ఐశ్వర్యారాయ్ పాత్రలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖను, త్రిష క్యారెక్టర్ లో శ్రీదేవిని, ముందుగా అనుకున్నారట. ఏది ఏమైనా పొన్నియన్ సెల్వన్ కోసం రజనీ, కమల్ చేతులు కలిపి ఉంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేకంగా నిలిచిపోయేది. ప్రతీ మేకర్‌కు ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ కావాలంటే అందుకు సరైన టైమ్ రావాలి. ఆ టైమ్ కోసం 40 ఏళ్లు ఎదురు చూశారు మణిరత్నం. సుహాసినితో పెళ్లికి ముందు నుంచే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ కు సంబంధించిన బుక్స్ బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నారంటే మీరు ఆశ్చర్యపోకమానరు. ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేసింది. ఆ విషయాన్ని మొదటి భాగం క్లైమాక్స్‌లో రివీల్ చేశాడు దర్శకుడు మణిరత్నం. ఒక పాత్ర నెగిటివ్ మరొకటి పాజిటివ్. రెండో భాగంలో ఐశ్వర్యారాయ్ పాజిటివ్ క్యారెక్టర్ కు సంబంధించిన స్టోరీని రివీల్ చేయబోతున్నారు. పొన్నియిన్ లో భాగం అయ్యేందుకు ఐశ్వర్య రూ.10 కోట్లు పారితోషికం తీసుకుందట. విక్రమ్ రూ.15 కోట్లు, జయం రవి రూ.8 కోట్లు, కార్తి రూ.5 కోట్లు, త్రిష రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్నారట. రియల్ లొకేషన్స్ షూటింగ్స్‌కు ప్రాధ్యానతనిచ్చారు మణిరత్నం. అందుకే ఇంత భారీ చిత్రాన్ని పక్కా ప్రణాళికతో కేవలం 150 రోజుల్లో రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగలిగారు. రెండు భాగాలకు కలసి 300 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం మణిరత్నం రెహమాన్‌ను బాలి తీసుకువెళ్లి అక్కడ ట్యూన్స్ కంపోజ్ చేయించారట. వెయ్యేళ్ల కాలం నాటి ట్యూన్స్ ఎలా ఉండేవో అలా కావాలన్నారట. చదవండి: గాడ్ ఫాదర్‌తో మరోసారి ఆ విషయం రుజువైంది చిరంజీవి ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? -
‘పొన్నియన్ సెల్వన్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో మొదటి భాగం శుక్రవారం(సెప్టెంబర్ 30న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. చియాన్ విక్రమ్, హీరో కార్తీ, ఐశ్వర్యరాయ్, ‘జయం’ రవి, త్రిష, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్ వంటి తదితర భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా.. తమిళనాట భారీ వసూళ్లు చేసినట్లు ట్రెడ్ వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో తొలి రోజు రికార్ట్ కలెక్షన్స్ చేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్, భార్యకు ప్రతి నెల రూ. 8 లక్షలు చెల్లించాలి పొన్నియన్ సెల్వన్ మొదటి రోజు కలెక్షన్స్.. ఈ ఏడాది కోలీవుడ్ బెస్ట్ ఓపెనింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. మొదటి రోజు రూ. 25.86 కోట్లు గ్రాస్ వసూల్ చేసి.. ఈ ఏడాది వలిమై రూ. 36.17 కోట్లు, బీస్ట్ రూ. 26.40 కోట్లు తర్వాత మూడో స్థానంలో పొన్నియన్ సెల్వన్ నిలిచింది. కేవలం తమిళంలోనే పొన్నియన్ సెల్వన్ రూ. 25.86 కోట్లు రాబడితే.. వరల్డ్ వైడ్ మంచి నెంబర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నాయి ట్రెడ్ వర్గాలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ సాయంత్రం, నైట్ షోలకు హౌజ్‌ఫుల్ కలెక్షన్స్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన తెలుగులో కూడా పొన్నియన్ సెల్వన్ బాగానే కలెక్షన్స్ చేసిందంటున్నారు. అలాగే బి-టౌన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు రూ. 1.75 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని సమాచారం. చదవండి: పుట్టినరోజుకి ముందు అవార్డు అందుకున్నాను: నటి ఆశా పారేఖ్ #PonniyinSelvan part 1 is off to a FANTASTIC start at the box office. The film has grossed ₹25.86 cr on Day 1 in the state. 3rd BIGGEST opener of the year.#PonniyinSelvan1 — Manobala Vijayabalan (@ManobalaV) October 1, 2022 Top TN openers of 2022#Valimai- ₹36.17cr#Beast- ₹26.40cr#PS1- ₹25.86cr#Vikram- ₹20.61cr#ET- ₹15.21cr#RRRMovie- ₹12.73cr#Thiruchitrambalam- ₹9.52cr#Don- ₹9.47cr#Cobra- ₹9.28cr#KGFChapter2- ₹8.24cr#NaaneVaruvean - ₹7.37cr#Viruman- ₹7.21cr#VTK- ₹6.85cr — Manobala Vijayabalan (@ManobalaV) October 1, 2022 -
మణిరత్నం కల నెరవేరిందా?
దర్శకుడు మణిరత్నం మూడు దశాబ్దాల కల పొన్నియిన్ సెల్వన్. దీనిని సాధ్యం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో రెండుసార్లు విఫలమయ్యారు. పరిస్థితులు అనుకూలించకపోవడమే ప్రధాన కారణం అయినప్పటికీ మణిరత్నం నిరుత్సాహ పడలేదు. తన ప్రయత్నాన్ని వదులుకోలే దు. ఈ చిత్రాన్ని దృశ్య కావ్యంగా మలచాలన్నదే జీవిత లక్ష్యంగా భావించారు. అందుకోసం కాస్త ఎ క్కువగానే శ్రమించారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రా న్ని మనసుపెట్టి ఆకుంఠిత దీక్షతో తెరపై ఆవిష్కరించారు. చిత్ర భారీతనానికి మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంపూర్ణంగా సహకరించాయి. చిత్రంలోని పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనూ మణిరత్నం ఎంపిక ఫర్ఫెక్ట్గా వ్య వహరించారు. ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్, వందియదేవన్‌గా కార్తీ, అరుణ్ మొళి వర్మన్‌గా జయం రవి, నందిని, ఊమైరాణి పాత్రలకు ఐశ్యర్యరాయ్, కుందవైగా త్రిష, పెరియవేలార్గా ప్రభు, పెరియ పళవేట్టయార్గా శరత్‌కుమార్, వానతీగా శోభితా ధూళిపాల, పూంగుళిగా ఐశ్వర్య లక్ష్మి పార్తీపన్ పల్లవన్‌గా విక్రమ్‌ప్రభు, సుందర్ చోళన్‌గా ప్రకాష్‌రాజ్, ఆళ్వార్ కదియన్గా జయరాం, సెంబియన్ మాధవి గా జయచిత్ర ఇలా చిత్రంలోని ప్రతి పాత్రకు సమర్థవంతమైన నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ఇక ఆ పాత్రలకు ఆయా నటీనటులు ఎలా న్యాయం చేశారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మణిరత్నం దర్శక ప్రతిభకు రవివర్మ చాయాగ్రహణం, ఏఆర్ రెహా్మన్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక కళా దర్శకుడు తోట తరణి పనితనం గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంతటి ప్రతిభావంతులతో దర్శకుడు మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రం కల నెరవేరిందా? అంటే కచ్చితంగా నెరవేరిందనే చెప్పాలి. ఆయన ఈ చిత్రాన్ని ఒక అద్భుత కళాఖండంగా చెక్కారని చెప్పక తప్పదు. ఆయన కెరీర్లోనే కాదు, తమిళ సినీ చరిత్రలోనే పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. చోళ సామ్రాజ్యపు చరిత్ర నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ ఆదిత్య కరికాలన్ యుద్ధంతో ప్రారంభమవుతుంది. ఆయన శత్రు సేనానిపై విరుచుకుపడి చీల్చి చెండాడడంలో ఆయన మిత్రుడు వందియదేవన్, పార్తీపన్ పల్లవన్ పాలు పంచుకుంటారు. అలా తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఉంటున్న తరుణంలో నందిని, పళయ పళ వేట్టయార్ల వైరి వర్గం దేశాన్ని కైవసం చేసుకోవడానికి కుట్ర పన్నుతున్న సమాచారం తెలిసిన ఆదిత్య కరికాలన్ తన మిత్రుడు వందియదేవన్‌ను అక్కడ జరుగుతున్న విషయాలను తెలుసుకురమ్మని చెబుతాడు. ఆ తరువాత జరిగే పరిణామాలే పొన్నియిన్ సెల్వన్. ఆదిత్య కరికాలన్, నందితల ప్రేమకు ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించరు. తత్ఫరిణామమే చోళ దేశపు యుద్ధానికి కుట్రలు, కుతంత్రాలకు కారణం. పొన్నియిన్ సెల్వన్ నవల చదివిన వారికి ఈ చిత్రంలో లోపాలు తెలుస్తాయేమోగాని, చదవని వాళ్లు ఆనందించే చిత్రం ఇది. -
పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. ‘చియాన్’ విక్రమ్, ఐశ్వర్య రాయ్, ‘జయం’ రవి, త్రిష, కార్తి వంటి అగ్ర నటులతో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 30న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం దర్శకత్వం, భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చదవండి: పొన్నియన్ సెల్వన్’పై ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ, మండిపడ్డ సుహాసిని భారీ అంచల మధ్య నేడు విడుదలైన మూవీ తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలోని ప్రధాన పాత్రల పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో దాదాపు అందరు అగ్ర నటీనటులే ఉన్నారు. దీంతో ఎవరి పారితోషికం ఎంతనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పలు తమిళ వెబ్సైట్లు పొన్నియన్ సెల్వన్ నటీనటుల పారితోషికాలకు సంబంధించిన కథనాలు వెలువరించింది. వాటి ప్రకారం ఈ సినిమా కోసం చియాన్ విక్రమ్ రూ. 12 కోట్లు తీసుకున్నాడట. చదవండి: వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్ అలాగే ఐశ్వర్య రాయ్ రూ. 10 కోట్లు, జయం రవి రూ. 8 కోట్లు, కార్తి రూ. 5 కోట్లు తీసుకోగా త్రిష రూ. 2.5 కోట్లు అందుకుందని సమాచారం. జయం రవి కంటే కార్తికి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ. ఈ సినిమాలో జయం రవికి దక్కిన పాత్ర కారణంగా ఆయనకి ఎక్కువ మొత్తం ఇచ్చారని అంటున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌పై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహామాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. -
‘పొన్నియన్ సెల్వన్’పై ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ, మండిపడ్డ సుహాసిని
దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఆయన డ్రిమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన ఈసినిమా రెండు భాగాలుగా రానుంది. పొన్నియన్ సెల్వన్ తొలి పార్ట్ భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే గురువారం దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడినంటూ చెప్పుకునే ఉమైర్ సంధూ తొలి రివ్యూని ఇచ్చాడు. అది చూసిన మణిరత్నం భార్య, నటి సుహాసిని అతడిపై ఫైర్ అయ్యింది. కాగా పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ రివ్యూ ఇదేనంటూ ఉమైర్ నిన్న ట్వీట్ చేశాడు. ‘అద్భుతమైన సినిమాట్రోగాఫి, అంతకుమించిన ప్రొడక్షన్ డిజైన్, విఎఫ్ఎక్స్! చియాన్ విక్రమ్, కార్తి తమ నటనతో వావ్ అనిపించారు. ఇక ఐశ్వర్యరాయ్ మంచి కంబ్యాక్ ఇచ్చారు. మొత్తానికి ఈ హిస్టారికల్ మూవీ ఎన్నో ట్విస్టులతో ప్రేక్షకుల చేత క్లాప్ కొట్టించడం ఖాయం’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ కాస్తా వైరల్ కావడంతో సుహాసిని కంట పడింది. అతడి రివ్యూపై స్పందిస్తూ.. ఇంతకి నువ్వు ఎవరు? అంటూ అసహనం వ్యక్తం చేసింది ఆమె. ‘అసలు మీరు ఎవరు?.. ఇంకా విడుదల కాని సినిమాను మీరు ఎలా చూశారు’ అంటూ సుహాసిని అతడిని ప్రశ్నించింది. ఇక ఉమైర్ సంధు రివ్యూపై సుహాసిని స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆమె కామెంట్స్ నెటిజ్లను స్పందిస్తూ అతడో ఫేక్ రివ్యూవర్ అని, దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకుంటూ ఫేక్ రివ్యూలు ఇస్తాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఉమైర్ సంధు తాను ఒవర్సిస్ సెన్సార్ సభ్యుడినంటూ తరచూ కొత్త సినిమాల రివ్యూను విడుదలకు ముందే ప్రకటిస్తుంటాడు. -
PS-1 Twitter Review: ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ ట్విటర్ రివ్యూ
‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ (PS–1’). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘PS–1’ నేడు(సెప్టెంబర్ 30) విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం నాలుగేళ్ల విరామం తర్వాత చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘పొన్నియన్ సెల్వన్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. Such grand and stunning visuals 🔥😲 Can't imagine how #ManiRatnam sir completed both parts in just 155 days ! May his lifelong dream & efforts get great result 👍🏻#PonniyinSelvan #PonniyanSelvan1#PS1 #PonniyinSelvanFDFS#PonniyinSelvanFDFS pic.twitter.com/6nGSZsmTUd — vamsi Krishna (@vamsi2131) September 30, 2022 విజువల్స్ ఎఫెక్ట్స్ , మ్యూజిక్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. ‘అద్భుతమైన విజువల్స్ ఉన్న ఇలాంటి సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో రెండు భాగాలను ఎలా తెరకెక్కించారో ఊహించుకోవడం కష్టమే. అతని డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది సాధ్యమై ఉండొచ్చు. మణిరత్నం కష్టానికి ఫలితం దక్కిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #PonniyinSelvan #PS1 1st Half Good 2nd Half Flat / Average 2.5-2.75/5 Top Highlights #Vikram #Karthi #Trisha BGM — RR (@rrking99) September 30, 2022 ఫస్టాఫ్ బాగుందని, సెకండాప్ యావరేజ్‌గా ఉందని చెబుతూ 2.5-2.75 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. విక్రమ్, కార్తి, త్రిషల యాక్టింగ్‌తో పాటు ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం బాగుందని చెబుతున్నారు. Better 2nd half Overall one time watch 2.25/5#PS1 #PonniyinSelvan — Albitthar Appanna (@ulfha_reddy) September 30, 2022 #PonniyinSelvanFDFS #PS1 #PonniyinSelvanReview Comparison Between Bahubali and Ponniyin Selvan Bahubali - Mass PS1 - Class That's the tweet. Mani rathnam take a bow. You have satisfied fully. Waiting for part 2. — Santhosh (@Santhos43177339) September 30, 2022 #PS1 1st Half : A Classic of Epic proportions is unfolding in front of your eyes.. Dir #Maniratnam magic.. What a story and screen play.. @Karthi_Offl is brilliant and fun and occupies most screen time.. @chiyaan lives his character.. His acting in pre-interval.. 🔥 — Ramesh Bala (@rameshlaus) September 30, 2022 #PS1 #PonniyinSelvan spectacular movie 5/5 #Maniratnam visualization amazing #ARR rocks #AdhityaKarikalan terror #Vanthiyathevan so sweat #ArunmozhiVarman Majestic #Nadhini no words #kundavai real chola queen — ilangovan chandran (@ilangovanchand2) September 30, 2022 PS is political drama with complex characterisation. This was been said from the start. There won't be any air bending fight sequences and commerical elements. It's pure story based & characters driven movie.#Ponniyinselvan #PS1 — Renu🌠 (@crazy4musics) September 30, 2022 #PS1 Overall A Period Action Film that had potential but ends up as an underwhelming watch! Interesting storyline with good music and visuals but is wasted by flat narration with absolutely no highs/emotional connect needed for this genre Rating: 2.25-2.5/5 #PonniyinSelvan — Venky Reviews (@venkyreviews) September 30, 2022 -
‘ఐశ్వర్య, త్రిషలపై చాలాసార్లు సీరియస్ అయ్యా, అలా వార్నింగ్ కూడా ఇచ్చా’
దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఆయన సెట్స్‌లో కొన్నిసార్లు స్టార్ హీరోయిన్స్ అయిన ఐశ్వర్యరాయ్, త్రిషలపై సీరియస్ అయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చదవండి: జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే.. షూటింగ్ సమయంలో త్రిష, ఐశ్యర్యరాయ్‌లతో కాస్తా ఇబ్బంది పడ్డానని, అందుకే వారిపై పలుమార్లు అరిచానన్నారు.‘ఈ చిత్రంలో త్రిష, ఐశ్వర్యల సన్నివేశాలు, డైలాగ్స్ సీరియస్‌గా కొనసాగుతాయి. షూటింగ్ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య ఆ సీరియస్‌నెస్ వచ్చేది కాదు. దానికి కారణం సెట్స్‌లో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం. అందువల్ల వారి సీన్స్ సరిగా వచ్చేవి కాదు. వారిద్దరి సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. అసలు అనుకున్నట్టు సీన్స్ వచ్చేవి కాదు. వాటికి చాలా టైం పట్టేది. దీంతో సినిమా అయిపోయేవరకు వారిని మాట్లాడుకోవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాను. చదవండి: అప్పుడే ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్, ఎక్కడంటే.. అయినా వారు వినకపోవడంతో కొన్నిసార్లు ఇద్దరిని ఇద్దరిపై కోప్పడాల్సి వచ్చింది’ అని ఆయన చెప్పుకొచ్చారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, జయం రవి, హీరో కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూలిపాళ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. -
ఎవరికి దక్కని అదృష్టం నా కూతురికి దక్కింది: ఐశ్వర్యరాయ్
అందాల తార ఐశ్వర్య రాయ్ నటించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ అందాల యువరాణి నందిని పాత్రలో కనిపించనుంది.రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అనంతరం విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని ఆ అంచనాలను ఇంకా పెంచేశాయి. ఈ సిరీస్‌లో మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఐశ్వర్య తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా కూతురు ఆరాధ్య ఓసారి సెట్స్‌కి వచ్చింది. ఒక పీరియాడికల్ డ్రామా మొదటి సారి చూడడంతో ఆమె చాలా ఎగ్జైట్ అయ్యింది. అదే సమయంలో మణిరత్నం సర్ పిలిచి మరీ ఆరాధ్యకి ఓ సీన్ కోసం కట్ చెప్పేందుకు అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు అలాంటి అవకాశం మాలో ఎవరికీ రాలేదు. కానీ అది ఆరాధ్యకి దక్కింది. అందుకే సెట్లో అందరం ఆశ్చర్యపోయాం. నాకూ, నా కూతురికి అదొక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిపోతుంది' అంటూ ఐష్ చెప్పుకొచ్చింది. The perfect choice 🔥 thanks #ManiRatnam 🙏♥️ Nandini Devi is coming on 30 sep 2022#AishwaryaRai#AishwaryaRaiBachchan #PonniyinSelvan #ps1 pic.twitter.com/BnnU7bTXtF — Nandini (@LiveLonly1) September 21, 2022 -
అందానికి అందం తోడైతే.. త్రిష-ఐష్ సెల్ఫీ వైరల్
తమిళ సినిమా: అందానికి అందం తోడైతే కనువిందే కదా. మాజీ మిస్ ఇండియా, మాజీ మిస్ చెన్నై కలిస్తే.. అందానికి ప్రతిరపమైన వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగితే.. ఆ దృశ్యం అభిమానులకు కనుల పండుగే అవుతుంది. ఇలాంటి పుత్తడి బొమ్మలు ఐశ్వర్యరాయ్, త్రిష కలిసి ఒకే చిత్రంలో నటించడం కచ్చితంగా విశేషమే అవుతుంది. అలాంటి చిత్రమే పొన్నియిన్ సెల్వన్. వీరితో పాటు విక్రమ్, జయం రవి, కార్తీ, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి పలువురు ప్రముఖ తారలు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి మణిరత్నం సృష్టికర్త, ఏఆర్ రెహమాన్ సంగీతం, రవివర్మ అదనపు బలం. రెండు భాగాలుగా రూపొందిన ఈ పాన్ ఇండియాత్రం తొలి భాగం ఈ నెల 30వ తేదీ తెరపైకి రానుంది. ఇందులో ఐశ్వర్య నందిని పాత్రలోనూ, త్రిష కుందవై పాత్రలోను నటించారు. వీరివి చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రలట. మరి త్రిష విక్రమ్‌కు చెల్లెలిగానూ, జయం రవికి అక్కగాను నటించగా, ఐశ్వర్యరాయ్ ప్రతినాయకిగా నటించడం విశేషం. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని దర్శకుడు మణిరత్నం తెలిపారు. కాగా చిత్రంలో శత్రువులుగా నటించినా నిజజీవితంలో ఐశ్వర్యరాయ్, తాను మంచి స్నేహితులమయ్యామని త్రిష పేర్కొన్నారు. అంతేకాకుండా వాళ్లిద్దరూ తీసుకున్న సెల్ఫీని తన ఇంస్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ లైక్‌ల మీద లైక్‌లు కొట్టిస్తున్నాయి. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
ఆ హీరోతో జోడీ కట్టి ఇప్పుడు చెల్లెలిగా నటించా: త్రిష
తమిళసినిమా: పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించిన నటీమణుల గురించి ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతోంది. చారిత్రక కథా చిత్రంలో నేటి తారలు ఎలా నటించారు, దర్శకుడు మణిరత్నం వారిని పాత్రలకు తగ్గట్టుగా ఎలా మలిచారు? అన్న ఆసక్తి సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే ఇందులో పాత్రధారులు అందరూ మణిరత్నం చెప్పినట్లు చేశామని భారం అంతా ఆయనపైనే మోపేస్తున్నారు. ఈ చిత్రంలో కుందవైగా ముఖ్యపాత్రలో నటించిన త్రిష ఇందుకు అతీతం కాదు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించిన అనుభవాలను ఈ బ్యూటీ తెలుపుతూ నటీనటులందరం షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టగానే పొన్నియిన్ సెల్వన్ చిత్ర కథలోని పాత్రలుగా మారిపోయే వాళ్లమన్నారు. అందువల్లే ఇంతకుముందు తాను నటుడు జయంరవి సరసన రెండు చిత్రాలలో కథానాయికగా నటించినా ఈ చిత్రంలో సహోదరిగా నటించగలిగానన్నారు. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన చారిత్రక కథా చిత్రం కావడంతో దుస్తులు, నడక, హావభావాలు అన్ని మార్చాల్సి వచ్చిందన్నారు. ఈ చిత్రంలోని కుందవై పాత్ర కోసం తాను ఆరు నెలలు ఇంట్లోనే రీహార్సిల్స్ చేశానని చెప్పారు. ఆ పాత్రకు సంబంధింన పలు విషయాలు తెలుసుకున్నానని, ఇక దుస్తులు, ఆభరణాలు, మేకప్ విషయానికి వస్తే టెస్ట్‌లు చేసి చివరికి కుందవైగా మారాయన్నారు. చిత్రంలో నటి ఐశ్వర్యారాయ్‌తో నటించే సన్నివేశాలు చాలానే ఉన్నాయన్నారు. ఆమెతో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఆ సన్నివేశాలు బాగా వచ్చాయని, సహ నటీనటులు చెప్పడంతో ఆనందం కలిగిందన్నారు. అయితే దర్శకుడు మణిరత్నం చెప్పినట్లే తాను నటించానని చెప్పారు. ముఖ్యంగా అచ్చ తమిళ భాషలో సంభాషణలు చెప్పాల్సి రావడంతో నోరుతిరగలేదన్నారు. దీంతో భావోద్రేకాలు ప్రదర్శించడం సాధ్యం కాలేదని చెప్పారు. దీంతో మణిరత్నం సరళమైన భాషలో సంభాషణలను మార్చారన్నారు. ఈ చిత్రంలో కుందవై పాత్రలో నటించి చాలా నేర్చుకున్నానన్నారు. కుందనై చాలా దైర్యవంతురాలని, ఇకపై తాను ఆమెను అనుసరిస్తానని నటి త్రిష పేర్కొన్నారు. -
‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 ఎప్పుడో చెప్పిన మణిరత్నం
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. చోళరాజులు ఇతివృత్తంతో రూపొందిన భారీ చారిత్రాత్మక కథతో దర్శకుడు మణిరత్నం దీన్ని రూపొందిస్తున్నారు. విక్రమ్, జయం రవి, కార్తీ, విక్రమ్ ప్రభు, పార్తీపన్, ప్రభు, శరత్‌కుమార్, రఘు, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహా్మన్ సంగీతాన్ని, రవివర్మ ఛాయాగ్రహణం అందించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే చిత్ర ఆడియో, ట్రైలర్లను విడుదల చేశారు. కాగా శనివారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ ఇంతకుముందు ఎంజీఆర్, శివాజీ గణేశన్ నటించిన చారిత్రక కథా చిత్రాలలో ఉపయోగించిన ఆభరణాలు గ్రీకు సాంప్రదాయానికి చెందినవన్నారు. అయితే తాను చాలా పరిశోధనలు చేసి ఈ చిత్రంలో ఆభరణాలను ఉపయోగించానని తెలిపారు. నిజానికి రాజులు యుద్ధానికి వెళ్లేటప్పుడు ఆభరణాలు కాకుండా తోలు దుస్తులు ధరించి వెళ్లేవారన్నారు. ఈ చిత్రంలో తాను అలానే చేశానని తెలిపారు. ఇందులో మొదట స్వచ్ఛమైన తమిళ సంభాషణలనే రచయిత జయమోహన్ రాశారన్నారు. అయితే వాటిని నటులు ఉచ్ఛరించడం కష్టంగా మారడం, భావోద్రేకాలు సరిగా రాకపోవడంతో సరళమైన భాషను వాడామని చెప్పారు. ఇకపోతే ఇందులో రజనీకాంత్ నటిస్తానని చెప్పగానే అంగీకరిస్తే ఆయన, రచయిత కల్కి, అభిమానుల మధ్య చిక్కుకునేవారన్నారు. తగిన నటీనటులనే ఈ చిత్రానికి ఎంపిక చేశామన్నారు. రెండవ భాగం కూడా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, మరో తొమ్మిది నెలల తరువాత పార్ట్–2 విడుదల చేస్తామని తెలిపారు. చదవండి: డైరెక్టర్‌తో మనస్పర్థలు? రజనీ ‘జైలర్’ నుంచి తప్పుకున్న హీరోయిన్! నటుడు కార్తీ మాట్లాడుతూ గుర్రాలను, ఏనుగులను చూడడానికి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షిస్తారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్రిష, ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించేటప్పుడు భయం, బాధ్యతగా ఉండాలన్నారు. నటి త్రిష మాట్లాడుతూ కుందవై పాత్ర కోసం 6 నెలల ముందు నుంచే కొన్ని రిఫరెన్స్‌తో సిద్ధమయ్యానన్నారు. ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. నటుడు జయం రవి మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించిన అనుభవం భవిష్యత్‌లో చాలా ఉపగయోగపడుతుందన్నారు. ఇందులో తన తండ్రి, తాను కలిసి నటించడం సంతోషకరమైన విషయం అని నటుడు విక్రమ్ ప్రభు పేర్కొన్నారు. -
పొన్నియన్ సెల్వన్.. ఆసక్తి పెంచుతున్న ఐశ్వర్యారాయ్ పాత్ర
తమిళ సినిమా: ప్రస్తుతం ప్రతి నోటా వినిపిస్తున్న మాట అంతా పొన్నియన్ సెల్వన్ మూవీ గురించే. కారణం అది తమిళనాట అత్యంత ప్రాచుర్యం పొందిన నవలకు వెండితెర రూపం కావడమే. 1950లో దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి చారిత్రిక నేపథ్యంలో రాసిన నవల ఇది. కల్కి అనే పత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన ఈ నవల సాహితీ ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందింది. దీన్ని సినిమాగా తీయడానికి దివంగత నటుడు ఎంజీఆర్ నుంచి కమల్‌హాసన్ వరకు పలువురు ప్రయత్నించారు. అయితే దర్శకుడు మణిరత్నం కూడా రెండుసార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఆయన మొక్కవోని పట్టుదలతో మూడోసారి ప్రయత్నంలో పొన్నియిన్ సెల్వన్ సినిమా రెండు భాగాలుగా కార్యరపం దాల్చుతోంది. అందులో తొలిభాగం ఈ నెల 30వ తేదీన పాన్ ఇండియా చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. నటుడు విక్రమ్, జయం రవి కార్తీ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, పార్తీబన్, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి మొదలగు ప్రముఖ తారాగణం ముఖ్య పాత్రల్లో నటింన చిత్రం ఇది. ఏఆర్ రెహమాన్ సంగీతం, రవివర్మ ఛాయాగ్రహణంను అందించారు. ప్రస్తుతం ఈ చిత్రంలో నటి ఐశ్వర్యారాయ్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది చోళ రాజుల కాలం నేపథ్యంలో సాగే కల్పిత అంశాలతో కూడిన చారిత్రక కథా చిత్రం. ఇందులో నందిని అనే రాజకుమారి పాత్రను పోషించారు. ఆమె పాండియన్ దేశానికి చెందిన యువతి. కళ్లు చెదిరే సౌందర్యవతి. అంతకు మించి ప్రతీకారంతో రగిలిపోయే యువతి. తన ప్రేమికుడైన వీర పాండియన్ అనే పాండ్య దేశరాజును తన కళ్ల ముందే శిరచ్ఛేదనం చేసిన చోళ దేశం రాజు ఆదిత్య కరికాలన్‌పై ప్రతీకారం తీర్చుకుని ఆ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రపన్నే రాణిగా నటిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించినప్పుడే మణిరత్నం నందిని పాత్రకు ఐశ్వర్యారాయ్‌ని ఫిక్స్ అయ్యారట. -
మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేసిన అమలాపాల్.. కారణమిదే
తమిళ సినిమా: నటి అమలాపాల్ మళ్లీ తన పబ్లిసిటీ ఆటను మొదలెట్టింది. ఇటీవల ఓ చిత్రం నిర్మాణంలో తల మునకలై ఉన్న ఈమె ప్రస్తుతం.. ఆ పనిని ఓ ఓటీపీ సంస్థకు అప్పగించి మళ్లీ అవకాశాల వేటలో పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ అమ్మడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఒక భేటీలో పేర్కొంటూ పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో తాను నటించాల్సి ఉందని, కొన్నేళ్ల క్రితం ఈ చిత్రంలో నటించే విషయమై దర్శకుడు మణిరత్నం పిలిచారని చెప్పింది. ఆయన అభిమానిని కావడంతో ఎంతో ఉత్సాహంగా ఆడిషన్లో పాల్గొన్నానని చెప్పింది. అయితే ఆ చిత్రం అప్పట్లో ప్రారంభంకాలేదని, దీంతో తాను చాలా చింతించానని పేర్కొంది. ఆ తరువాత 2021లో అదే చిత్రం కోసం మణిరత్నం మళ్లీ తనను పిలిచారని చెప్పింది. అప్పుడు తనకు ఆ చిత్రంలో నటించాలని అనిపించకపోవడంతో నిరాకరించినట్లు తెలిపింది. అందువల్ల తానేమీ బాధపడటం లేదని చెప్పింది. ఇక చాలామంది తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అడుగుతున్నారనీ, అక్కడ సినిమా కుటుంబాలు, అభిమానుల ఆధిక్యం పెరిగిపోయిందని పేర్కొంది. ఒక్కో చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారని, ప్రేమ, పాటల సన్నివేశాల్లో గ్లామరస్‌గా నటించడం వంటి కమర్షియల్ అంశాలే చోటు చేసుకుంటున్నాయని చెప్పింది. అందుకే తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లోనే నటింనట్లు అమలాపాల్ చెప్పుకొచ్చింది. -
‘పొన్నియన్ సెల్వన్’ ఓటీటీ, డిజిటల్ రైట్స్ అన్ని కోట్లా?!
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. పదో శతాబ్ధంలో చోళ రాజ్యంలోని స్వర్ణయుగాన్ని మణిరత్నం తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కితున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈమూవీ ఓటీటీ, డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. తాజా బజ్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైం వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? అలాగే డిజిటల్ రైట్స్ కూడా భారీ రేట్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. కాగా పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలను ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ రూ. 120 కోట్లకు దక్కించుకోగా.. డిజిటల్, శాటిలైట్‌ను రైట్స్‌ను అమెజాన్‌తో పాటు సన్‌టీవీ కూడా విక్రయించారట. అయితే ఎంతమొత్తానికి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిషలు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. -
ఐశ్వర్య రాయ్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం, ఏం చేసిందంటే..
మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. సెప్టెంబర్ 30న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భందగా నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్‌కు ‘తలైవా’ రజనీకాంత్, ‘లోకనాయకుడు’ కమల్ హాసన్‌లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, త్రిష, కార్తీ, ప్రభు తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్లో రజనీ పట్ల ఐశ్వర్య వ్యవహరించిన తీరుపై నెటిజన్లు, ‘తలైవా’ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: నాకు ఫోన్ కొనివ్వడానికి మా నాన్న అప్పు చేశారు: బిగ్‌బాస్ నేహా చౌదరి ఈ సందర్భంగా ఈవెంట్లో రజనీకాంత్‌ను చూసిన ఐశ్వర్య వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి పలకరించడమే కాదు ఆయన కాళ్లకు నమస్కరించింది అభిమానం చాటుకుంది. వెంటనే ఆమెను లేపిన రజనీ తనను ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆతర్వాత ఒకరికి ఒకరు చేతులు జోడించి నమస్కారం తెలుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు రజనీ పట్ల ఐశ్వర్య చూపించిన గౌరవానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ‘అందలోనే కాదు సంస్కారంలోనూ ఐశ్వర్యకు ఎవరు సాటిలేరు’, ‘ఐశ్వర్యే కాదు ఆమె మనసు కూడా చాలా అందమైనది’ అంటూ ఐశ్పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా శంకర్ ‘రోబో’ చిత్రంలో రజనీకి జోడిగా ఐశ్వర్య నటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఆస్పత్రి బెడ్‌పై షణ్ముఖ్ జశ్వంత్, ఫ్యాన్స్ ఆందోళన It happened guys. Aishwarya Rai touched Rajinikanth's feet 😍#AishwaryaRaiBachchan #Rajinikanth#PonniyinSelvanpic.twitter.com/FMjj9SIYFJ https://t.co/220rrV1wMj — Aishwarya as Nandini(PonniyinSelvan)'ll b Historic (@badass_aishfan) September 6, 2022 -
అందాల ఐశ్వర్యను అలాంటి పాత్రలో ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
తమిళసినిమా: అందం, అభినయానికి మారు పేరు నటి ఐశ్వర్యారాయ్. కథానాయికగా హిందీ, తెలుగు, తమిళం వంటి భాషా చిత్రాల్లో నటించి మేటి నటిగా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు మణిరత్నం కోలీవుడ్‌కు పరిచయం చేసిన నటి ఐశ్వర్యారాయ్ అన్న విషయం తెలిసిందే. ఆమె మణిరత్నంను గురువుగా భావిస్తారు. కాగా కథానాయకిగా పరిచయం చేసిన ఆయనే ఐశ్వర్యారాయ్‌ను ఇప్పుడు ప్రతినాయకిగా చూపిస్తూ ఆమెలోని నటిని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. మణిరత్నం ఏ చిత్రాన్ని చేసినా దాంట్లో ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. అలా తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్. ఇందులో విక్రమ్, కార్తీ, జయంరవి, జయరాం, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థ, లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, రవివర్మ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇందులో నటి ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు, అందులో ఒకటి ప్రతినాయిక పాత్ర అని తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పొన్నియన్ సెల్వన్ చిత్రంపై అంచనాలు, ఆసక్తి మరింత పెరుగుతున్నాయి. -
‘ఆర్ఆర్ఆర్’ఓ సర్కస్.. ఆ దర్శకుడి చిత్రాలేవి నచ్చవు: ఆర్జీవీ
ఆర్ఆర్ఆర్ మూవీపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్ చేశారు. ఆ చిత్రాన్ని సర్కస్‌తో పోల్చాడు. ముఖ్యంగా ఆ సినిమాలో బ్రిడ్జ్ దగ్గర పిల్లాడిని కాపాడే సీన్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ సర్కస్ చేస్తున్నట్లు అనిపించిందన్నారు. ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని.. సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో.. థియేటర్లో ఆర్ఆర్ఆర్ చూస్తే అలాంటి భావననే కలిగిందన్నారు. (చదవండి: మళ్లీ అడ్డంగా దొరికిపోయిన తమన్.. ట్రోలింగ్‌తో ఆడేసుకుంటున్నారు) ఇక మణిరత్నం గురించి అడగ్గా.. ఆయన చిత్రాలేవి తనకు నచ్చవని చెప్పారు.‘మణిరత్నానికి నా సినిమాలేవి నచ్చవు. నాకు కూడా ఆయన చిత్రాలు నచ్చవు. ఒక్కసారి ఇద్దరం కలిసి స్క్రిప్ట్ వర్క్‌లో కూర్చొన్నాం. నా మాట ఆయన వినలేదు.. ఆయన మాట నేను వినలేదు. చివరకు సినిమాలు మాత్రం విడుదలయ్యాయి. అవి ‘దొంగ దొంగా’, ‘గాయం’. ఈ రెండు సినిమాల్లో మా ఇద్దరి పేర్లు వేసుకున్నాం’అనీ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఇంకా మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో కమ్యూనిష్టు భావాజలాన్ని కలిగి ఉండేవాడిననని.. కానీ అయాన్ ర్యాండ్ పుస్తకాలు చదివినప్పటి నుంచి తనలో మార్పు వచ్చిందన్నారు. ఫెమినిజం అంటే స్త్రీలకోసం పోరాడటం కాదని.. స్త్రీలను ప్రేమించడం అని చెప్పాడు. తన కెరీర్లో ‘క్షణక్షణం’, ‘సర్కార్’చిత్రాలకే సరిగ్గా స్క్రిప్ట్ రాసి, సరైన నటీనటులను ఎంచుకున్నానని, మిగిలిన చిత్రాలన్ని ఫలానా హీరోతో చేయాలని అనుకోలేదని ఆర్జీవీ అన్నాడు. -
Ponniyin Selvan: రాజమౌళి వల్లే ధైర్యం వచ్చింది
‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడం గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగాన్ని ‘పీయస్–1’ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ చిత్రంలోని ‘చోళ చోళ..’ అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ, అది ఎందుకనేది చెప్పను. తర్వాత మీకే తెలుస్తుంది. రాజమౌళిగారి వల్లే ఇలాంటి (పొన్నియిన్ సెల్వన్) చిత్రాలు తీయగల మనే ధైర్యం వచ్చింది. రెండు భాగాలుగా ఇలాంటి సినిమాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. నా బిడ్డలాంటి ఈ చిత్రం తెలు గులో ఇక ‘దిల్’ రాజుగారిదే’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మణిరత్నంగారి ‘అమృత’ సినిమా వల్లే నిర్మాతగా మారి, 50 చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’ని రిలీజ్ చేసే చాన్స్ ఇచ్చిన మణిరత్నంగారికి థ్యాంక్స్’’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ– ‘‘మణి సార్‌తో గతంలో ‘రావణ్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’. మణిగారితో సినిమా అంటే కల నెరవేరడం వంటిది. మణిగారు, శంకర్‌గారితో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చని అనుకున్నాను.. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు’’ అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో దాదాపు 50 పాత్రలుంటాయి.. నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘అన్ని భాషల్లో నటించి, పాన్ ఇండియన్ నటుడు అవడం వేరు. కానీ దక్షిణాది నుంచి తన మేకింగ్ ఆఫ్ స్టైల్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ఏకైక వ్యక్తి మణిరత్నంగారు’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ‘‘కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను సినిమాగా తెరకెక్కించాలని ఎంజీఆర్, కమల్ వంటి వారెందరో ప్రయత్నించారు. కానీ మణిరత్నంగారి వల్లే సాధ్యం అయింది’’ అన్నారు నాజర్. సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘ఇది మీ డ్రీమ్ ప్రాజెక్టా? అంటే కాదు ఇష్టమైన చిత్రం అని మావారు (మణిరత్నం) అన్నారు. నేను ఆయన్ను ఇష్టపడ్డాను. ఆయన ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారు. అంటే మీరు (ప్రేక్షకులు) కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడాలి (నవ్వుతూ)’’ అన్నారు. -
డైరెక్టర్ మణిరత్నంకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయించుకున్న ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యానికి సంబంధించి విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే మరణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య, నటి సుహాసిని ప్రకటన ఇవ్వనున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. ప్రస్తుతం మరణిత్నం పొన్నియన్ సెల్వన్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: నటి కల్యాణితో విడాకులు.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్ ఈ మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జూలై 8న పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లుగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బలిటెన్ రావాల్సి ఉంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. -
వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30న ఈ మూవీ ఐదు(తెలుగు,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ) భాషల్లో విడుదల కానుంది. నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఫస్ట్‌లుక్, టీజర్లను వరుసగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక రీసెంట్గా విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చదవండి: Nayanthara: నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్.. ఒకేసారి అన్ని కోట్లా..? ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం వివాదంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మణిరత్నం, హీరో విక్రమ్‌కు కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రంలో చోళులను, చోళ రాజవంశం గురించి తప్పుగా చూపించారని సెల్వం అనే న్యాయవాది ఆరోపిస్తు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీజర్లో ఆదిత్య కరికాలన్(విక్రమ్ పోషించిన పాత్ర) నుదిటిపై తిలకం లేదని ఎత్తి చూపారు. కానీ, విక్రమ్‌కు సంబంధించిన పోస్టర్లో మాత్రం తిలకం ఉన్నట్లుగా చూపించారు. ఈ సినిమాలో చోళులను తప్పుగా చూపించారని ఆయన ఆరోపించారు. Welcome the Chola Crown Prince! The Fierce Warrior. The Wild Tiger. Aditya Karikalan! #PS1 🗡@madrastalkies_ #ManiRatnam pic.twitter.com/UGXEuT21D0 — Lyca Productions (@LycaProductions) July 4, 2022 చారిత్రక వాస్తవాలను చూపించడంలో దర్శక-నిర్మాతలు విఫలయ్యారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై స్పష్టత రావాలంటే సినిమాను విడుదలకు ముందే ప్రత్యేకంగా ప్రదర్శించాలని లాయన్ సెల్వం తన పటిషన్లో డిమాండ్ చేశారు. ఈ కోర్టు నోటీసులపై దర్శకుడు మరణిరత్నం కానీ, విక్రమ్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా పొన్నియన్ సెల్వెన్‌ను రూపొందింది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, ప్రభు, శోభితా ధూలిపాల, ఐశ్వర్య లక్ష్మిలు కీ రోల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
ఒక్క పాట కోసం 300 మంది డ్యాన్సర్లు.. 25 రోజులు చిత్రీకరణ
Ponniyin Selvan: 25 Days Shoot With 300 Dancers: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇదివరకు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర అప్డేట్ తెలిసింది. భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాటను సుమారు 300 మంది డ్యాన్సర్స్‌తో చిత్రీకరించారు. ఈ 300 మంది డ్యాన్సర్స్‌తో సుమారు 25 రోజులపాటు షూటింగ్ చేశారని సమాచారం. ఈ డ్యాన్సర్స్‌లో 100 మందిని ప్రత్యేకంగా ముంబై నుంచి రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో -
లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
దర్శకుడిగా మణిరత్నంకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగ చెప్పనక్కర్లదు. ఆయన సినిమాలో నటించే చాన్స్ కోసం స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమాల్లో చిన్న రోల్ చేసిన చాలు అని ఎంతోమంది నటీనటులు ఆరాటపడుతుంటారు. అలాంటి స్టార్ డైరెక్టర్ చాన్స్ ఇస్తే ఓ స్టార్ హీరోయిన్ వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ‘మహానటి’ కీర్తి సురేశ్. మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ మూవీ బృందం నుంచి కీర్తికి పిలుపు అందగా.. డేట్స్ లేవని ఆ లక్కీ చాన్స్ వదుకుందట కీర్తి. చదవండి: నయన్ బాటలో తమన్నా.. ఆ అనుభూతి ఉత్సాహాన్నిచ్చిందంటున్న మిల్కీ బ్యూటీ తాజాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక ఇది తెలిసి ఆమె ఫ్యాన్స్ అయ్యే అంటుండగా.. మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ‘‘మహానటి’ తర్వాత ఒక్క హిట్ కూడా లేని ఆమెకు మణిరత్నం వంటి స్డార్ డైరెక్టర్ చిత్రంలో అవకాశం వస్తే వదులుకుందా?, చాలా తెలివి తక్కువ వ్యవహరించింది’’అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా మహానటి చిత్రంతో తన నటనకు గానూ కీర్తి జాతీయ అవార్డు అందుకుంది. ఆ తరువాత ఆమె పలు చిత్రాలలో నటించిన సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో మణిరత్నం చారిత్రక చిత్రం పొన్ని యన్ సెల్వన్‌లో నటించే అవకాశం వచ్చింది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే! అయితే అదే సమయంలో రజనీకాంత్‌కు చెల్లెలిగా అన్నాత్తే చిత్రంలో నటిస్తుండటంతో పాటు మరోవైపు ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్లో పాల్గొంటుంది. ఇక రజనీకాంత్‌తో నటిస్తే మంచి క్రేజ్ వస్తుందని భావించిన కీర్తి తనకు డేట్స్ సర్దుబాటు కావడం లేదని చెప్పి మణిరత్నం మూవీకి నో చెప్పిందని సినీవర్గాల నుంచి సమాచారం. దీంతో కీర్తి పాత్రకు త్రిషని తీసుకుందట చిత్ర బృందం. ఇందులో త్రిష కుందనవై అనే రోల్ పోషించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో త్రిషతో పాటు ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, జయం రవి, హీరో కార్తీ వంటి స్టార్ హీరోహీరోయిన్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
40 ఏళ్లు అయినా గుండెలో నుంచి పోవట్లేదు: మణిరత్నం
తమిళ సినిమా దర్శకుడు మణిరత్నం ఏ తరహా కథా చిత్రాన్ని తెరకెక్కించినా అందులో తన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. పలువురు సినీ దిగ్గజాలు చేయడానికి ఆసక్తి కనబరచి చేయలేకపోయిన అసాధారణ చిత్రం పొన్నియన్ సెల్వన్‌ను ఒక మహా యజ్ఞంలా భావించి పూర్తి చేశారు. అత్యధిక పాఠకుల మనసులను దోచుకున్న చారిత్రక నవల ఇది. రాజరాజ చోళన్ నేపథ్యంతో విక్రమ్, కార్తీ, జయం రవి, శరత్‌కుమార్, ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్ ప్రభు వంటి భారీ తారాగణంతో మణిరత్నం చిత్రంగా చెక్కారు. లైకా ప్రొడక్షన్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్, రవివర్మ ఛాయాగ్రహణంను అందించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన చిత్రంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి చెన్నైలో నిర్వహించారు. ఇందులో కార్తీ మాట్లాడుతూ.. ఈ తరానికి చెందిన వారికి పుస్తకాలు చదవడానికి సమయం ఉండటం లేదన్నారు. 10 నిమిషాలు వీడియోలు చూడటంతో సరిపెట్టుకుంటున్నారని, అయితే అందరూ చరిత్ర నవలను చదవాలన్నారు. మణిరత్నం ఐదు భాగాలతో కూడిన నవలను చిత్రంగా మలిచారని పేర్కొన్నారు. పొన్నియన్ సెల్వన్ చిత్రం ఆయన మనకు అందిస్తున్న కానుకగా పేర్కొన్నారు. రాజరాజ చోళన్ తమిళ భాషను, దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఇప్పుడు మణిరత్నం ఈ చిత్రం ద్వారా పని చేస్తున్నారని త్రిష అన్నారు. మణిరత్నం గారు ఫోన్ చేసి పొన్నియన్ సెల్వన్ పాత్రను నువ్వే చేస్తున్నావని చెప్పారని, ఈ వేదిక కంటే అప్పుడు ఆయన చెప్పిన మాటే ఒళ్లు పులకరింపచేస్తోందని నటుడు జయం రవి పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా తన బాస్ మణిరత్నం అని, ప్రతి ఒక్కరిలోని ప్రతిభను ఎలా బయటకు తీసుకురావాలన్నది ఆయన నుంచే నేర్చుకున్నానని ఏఆర్ రెహ్మాన్ అన్నారు. ఈ చిత్ర సంగీతం కోసం పలు ప్రాంతాలు తిరిగి పరిశోధనలు నిర్వహించినట్లు చెప్పారు. తాను కళాశాల దశలోనే పొన్నియన్ సెల్వన్ నవల చదివానని, 40 ఏళ్లకు పైగా అయినా అది గుండెల్లోంచి తొలగిపోలేదని మణిరత్నం చెప్పారు. మక్కల్ తిలకం ఎంజీఆర్ నటించాల్సిన చిత్రం ఇదని, నాడోడి మన్నన్ చిత్రం తరువాత ఈ చిత్రం చేయాలని ప్రయత్నించారని, అది జరగలేదని గుర్తు చేశారు. అప్పుడు ఎందుకు కుదరలేదో ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. ఆయన తమ కోసం వదలి వెళ్లారన్నారు. ఆ తరువాత కూడా చాలా మంది ప్రయత్నించారని, తాను మూడు సార్లు ప్రయత్నించానన్నారు. 1980 నుంచి ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికి సాధ్యం అయ్యిందని మణిరత్నం తెలిపారు. చదవండి: పవిత్రా లోకేశ్ నా భార్యే: సుచేంద్రప్రసాద్ నా దృష్టిలో లక్ అంటే అదే : తమన్నా -
అంతా ఆమెను మర్చిపోడానికే అంటున్న విక్రమ్.. ఆసక్తిగా టీజర్
Ponniyin Selvan Part 1 Teaser Released: స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1' తెలుగు టీజర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేయగా, హిందీలో అమితాబ్ బచ్చన్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి రిలీజ్ చేశారు. టీజర్లో పోరాట ఘట్టాలు, నటీనటుల నటన ఆకట్టుకుంది. 'ఈ కల్లు, పాట, రక్తం, యుద్ధం అంతా దాన్ని మర్చిపోడానికే. ఆమెను మర్చిపోడానికి, నన్ను నేను మర్చిపోడానికి' అంటూ విక్రమ్ చెప్పే డైలాగ్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు. 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1' మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. From one of my favourite directors... #ManiRatnam sir! Thrilled to launch the Telugu teaser of #PonniyinSelvan1. Really looking forward to the film!https://t.co/Vepx93uY1z — Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2022 -
The Warrior: ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్
‘‘నేను ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు లింగుసామి ‘ది వారియర్’ సినిమా తీస్తున్నారు. అయితే ఆయన తర్వగా షూటింగ్ పూర్తి చేసేశారు. సినిమాను విడుదల కూడా చేసేస్తున్నారు. మేం మెల్లిగా చేస్తూ వస్తున్నాం. లింగూ.... (నవ్వుతూ) మీరు ముందు రోడ్ బాగా వేస్తే వెనకాలే మేం కూడా వచ్చేస్తాం (పొన్నియిన్ సెల్వన్ విడుదలను ఉద్దేశించి). ‘ది వారియర్’ సినిమా హిట్ కావాలి’’ అని ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం అన్నారు. రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ది వారియర్’ చాలా మంచి టైటిల్. జీవితంలో ఏదో సాధించటానికి అందరం ఫైట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్. లింగుసామి నాకు మంచి స్నేహితుడు. కరోనా సమయంలో అండగా నిలబడ్డారు. అంత మంచి వ్యక్తి చేసిన ‘ది వారియర్’ పెద్ద హిట్ అవ్వాలి. ఈ ట్రైలర్ చూస్తుంటే రామ్‌లో ఓ ఫైర్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో దర్శకులు ఎస్.జె.సూర్య, సెల్వమణి, కార్తీక్ సుబ్బరాజ్, హీరోలు విశాల్, ఆది పినిశెట్టి, ఆర్య, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'పొన్నియన్ సెల్వన్' రిలీజ్ డేట్ ప్రకటన.. సూపర్బ్‌గా ఐశ్వర్య రాయ్, త్రిష పోస్టర్స్
Mani Ratnam Ponniyin Selvan Movie Release Date Out With Posters: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్' చిత్రం. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. Wishing our Producer Allirajah Subaskaran a very happy birthday! The Golden Era comes to the big screens on Sept 30th! 🗡#PS1 #PS1FirstLooks @LycaProductions pic.twitter.com/60XRY8egM6 — Madras Talkies (@MadrasTalkies_) March 2, 2022 దీంతోపాటు ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తీ ఫస్ట్ లుక్‌లను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లలో ఐశ్వర్య రాయ్, త్రిష యువరాణుల్లాగా కనిపించగా విక్రమ్, జయం రవి యుద్ధ వీరుల్లాగా దర్శనమిచ్చారు. ఇక కార్తీ విభిన్నమైన లుక్‌లో అలరించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు ఆస్కార్ గ్రహిత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ ఏమేరకు సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. -
మణిరత్నంకు భారత్ అస్మిత రాష్ట్రీయ పురస్కారం
ప్రఖ్యాత సినీదర్శకుడు మణిరత్నంను భారత్ అస్మిత రాష్ట్రీయ పురస్కారం వరించింది. పుణేకు చెందిన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ గత 18 ఏళ్లుగా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను భారత్ అస్మిత రాష్ట్రీయ అవార్డులతో సత్కరిస్తోంది. కాగా ఈసారి సినీరంగం తరపున దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డును ప్రకటించారు. కాగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని భారత్ అస్మిత్ ఫౌండేషన్, ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్న్మెంట్ నిర్వాహకులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. గురువారం పుణెలో సోషల్ మీడియా ద్వారా నిర్వహించనున్న ఈ అవార్డుల వేడుకలో దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డు అందజేయనున్నారు. -
స్టార్ డైరెక్టర్ ఆఫర్.. హీరోగా సిద్ శ్రీరామ్ ఎంట్రీ!
Is Singer Sid Sriram Will Become A hero In The Movie: సింగర్ సిద్ శ్రీరామ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో యూత్‌లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సింగర్ ఆయన. సిద్ శ్రీరామ్ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు లేవనడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నా ఆయన పాట మాత్రం సూపర్ హిట్ అవుతోంది. కొన్నిసార్లు అయితే సిద్ శ్రీరామ్ పాడిన పాటలతోనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. యూత్‌లోనూ సిద్ శ్రీరామ్‌కు మాంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా సిద్ శ్రీరామ్ గురించి ఇప్పుడో వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో సిద్ శ్రీరామ్ వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో హీరోగా చేయడానికి సిద్ శ్రీరామ్ కూడా అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. -
'గీతాంజలి' హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Girija Shettar Life Story In Telugu: తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్కతెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా హీరో, హీరోయిన్లుగా ఇద్దరికీ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం గిరిజ తెలుగులో ఎక్కడా కనిపించలేదు. కళ్లతోనే హావభావాలు పలికించి తెలుగు ప్రేక్షకుల మదిలో గీతాంజలిగా చోటు సంపాదించుకున్న గిరిజ పూర్తి పేరు గిరిజా ఎమ్మా జేన్ షెత్తార్. తన పద్దెనిమిదవ ఏటనే భరతనాట్యం నేర్చుకున్న గిరిజ.. క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలితో కలిసి మణిరత్నం, సుహాసినిల పెళ్లికి గిరిజ కూడా అటెండ్ అయ్యింది. పెళ్లిలో గిరిజను చూసిన మణిరత్నం తన సినిమాలో హీరోయిన్గా నటించమని కోరడంతో వెంటనే ఓకే చెప్పిందట. తెలుగులో గిరిజ నటించిన ఒకే ఒక్క చిత్రం గీతాంజలి. కానీ ఒక్క సినిమాతోనే వంద సినిమాలంత స్టార్డంను సంపాదించుకుంది గిరిజ. ఆ సమయంలోనే మలయాళంలో కొన్ని చిత్రాలు కూడా పూర్తి చేసింది. అనంతరం సినిమాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పిన గిరిజ ప్రస్తుతం లండన్‌లో రచయితగా స్థిరపడింది. 2005 నుంచి ఆరోగ్యం సంబంధాలపై జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది. చదవండి : Trisha: ఆలయంలో చెప్పులు వేసుకున్న త్రిష..భగ్గుమన్న హిందూ సంఘాలు ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్ -
హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు
Trisha Wearing Shoes Near Sami Idols During The Shooting of Ponniyin Selvan: నటి త్రిష, దర్శకుడు మణిరత్నంను అరెస్టు చేయాలని కోరుతూ హిందూ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇండోర్‌లో జరుగుతోంది. కాగా శుక్రవారం త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే హిందువులు పవిత్రంగా భావించే దేవుళ్ల విగ్రళ్లు ఉన్న ప్రాంతానికి త్రిష పాదరక్షలు ధరించి రావడాన్ని హిందూ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. త్రిష, దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదు చేయాలని హరికేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి : డ్రగ్స్ కేసు : నటుడు అర్మాన్ కోహ్లీకి షాక్ ఇచ్చిన కోర్టు ‘‘అంత్యక్రియలకు కూడా అందంగా తయారవ్వాలా?’’