
మణిరత్నం నిర్మాణంలో ‘నవరస’ అనే వెబ్ యాంథాలజీ రూపొందనుందనే విషయం తెలిసిందే. అందులో క్రేజీ స్టార్స్ నటిస్తారని ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ యాంథాలజీలో తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది రసాల ఆధారంగా తొమ్మిది కథలను చూపించనున్నారు. దర్శకులు మణిరత్నం, జయేంద్ర ఈ యాంథాలజీను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి పని చేసే నటులు, సాంకేతిక నిపుణులు ఎవ్వరూ పారితోషికం తీసుకోవడం లేదు. ఈ యాంథాలజీ నుంచి వచ్చిన లాభాలన్నీ కూడా కోవిడ్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న సౌతిండియా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు అందించనున్నారు.
ఈ యాంథాలజీకు మణిరత్నం కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తున్నారు. ఈ ‘నవరస’ ద్వారా తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు సూర్య, రేవతి, సిద్ధార్థ్, విజయ్ సేతుపతి, పార్వతి... మరికొందరు. ఒక కథను తెరకెక్కిస్తూ, అరవింద్ స్వామి తొలిసారి దర్శకుడిగా మారారు. ఈ 9 కథలకు కెమెరామేన్లుగా సంతోష్ శివన్, బాలసుబ్రహ్మణ్యం, మనోజ్ పరమహంస, అభినందన్ రామానుజం, శ్రేయస్ కృష్ణ, హర్ష్‌వీర్ ఒబెరాయ్, సుజిత్ సారంగ్, వి. బాబు, విరాజ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్, ఇమ్మాన్, జిబ్రాన్, అరుళ్ దేవ్, కార్తీక్, రోన్ ఎథన్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్‌లు సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే పట్టుకోటై్ట ప్రభాకర్, సెల్వ, మదన్ కార్కీ, సోమీథరన్ రచయితలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
దర్శకులు
కేవీ ఆనంద్
గౌతమ్ మీనన్
బీజోయ్ నంబియార్
కార్తీక్ సుబ్బరాజ్
పొన్రామ్
హలీత షహీమ్
కార్తీక్ నరేన్
రతీంద్రన్ ఆర్. ప్రసాద్
అరవింద్ స్వామి
నటీనటులు
రేవతి
నిత్యామీనన్
పార్వతీ తిరువోత్తు
ఐశ్వర్యా రాజేష్
పూర్ణ
రిత్విక
అరవింద్ స్వామి
సూర్య
సిద్ధార్థ్
విజయ్ సేతుపతి
ప్రకాష్ రాజ్
శరవణన్
ప్రసన్న
గౌతమ్ కార్తీక్
Comments
Please login to add a commentAdd a comment